మా ఆయనతో నాకు ఇంట్లో ప్రతీరోజూ జాతరే అన్న హారిక

బుల్లితెర మీద రకరకాల షోస్ ఆడియన్స్ ని అస్సలు ఖాళీ లేకుండా ఎంటర్టైన్ చేసేస్తున్నాయి. అసలే పండగల సీజన్. పండగలను, స్పెషల్ డేస్ ని టార్గెట్ చేస్తూ వాటి నేపథ్యంలో చాలా కామెడీ షోస్ ని రూపొందిస్తున్నారు యాజమాన్యాలు. ఐతే ఇప్పుడు జీ తెలుగులో బోనాల జాతర స్పెషల్ ఈవెంట్ ఫుల్ మస్తీ చేసింది. ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేసేసింది.  ఇక ఈ షోకి జీ తెలుగు, స్టార్ మా సీరియల్ యాక్టర్స్ ఎంటర్టైన్ చేయడానికి  విచ్చేసారు. అలా ఈ షోకి గెస్టులుగా వచ్చిన అందరినీ జాతర అంటే ఏమిటి అంటూ అడుగుతుంది శ్రీముఖి. యాక్టర్ హరితని ఇదే ప్రశ్న వేస్తుంది శ్రీముఖి. జీ తెలుగుకు వచ్చినప్పుడల్లా జాతరలానే ఉంటుందని తెలివిగా సమాధానం ఇస్తుంది హరిత. తర్వాత చెల్లెలి కాపురం యాక్టర్ పౌర్ణమి అలియాస్ హారిక వచ్చేసరికి సేమ్ క్వశ్చన్ వేస్తుంది శ్రీముఖి. హారిక తన భర్తతో కలిసి ఈ షోకి వచ్చింది. అసలు జాతర అంటే ఏమిటి ? నీకు ఏం గుర్తుకొస్తుంది అని శ్రీముఖి అడుగుతుంది. దీంతో హారిక "నాకు ఇంట్లో ప్రతీ రోజూ జాతరే" అంటూ సిగ్గుపడుతూ చెప్పేసరికి శ్రీముఖి ముఖం కూడా ఒక్కసారిగా మారిపోతుంది. హారిక ఇచ్చిన ఆన్సర్ కి శృతి, శివజ్యోతి, హరిత,మధుప్రియ అందరూ పగలబడి నవ్వేస్తారు. తర్వాత శృతిని కూడా జాతర అంటే ఏమిటి మీ వెనక ఎంత మంది పడేవారు అప్పట్లో అని అడిగేసరికి ..లెక్కుంటే చెప్పొచ్చు కానీ అన్ లిమిటెడ్, మైండ్ బ్లోయింగ్ అని ఆన్సర్ ఇచ్చేసరికి శ్రీముఖి నోరెళ్లబెడుతుంది. హారిక 17 ఏళ్లకే బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చి పసుపు కుంకుమ, మేఘమాల, వరూధిని పరిచయం, శ్రావణ సమీరాలు, రుతుగీతం, నేను శైలజ వంటి సీరియల్స్ లో నటించింది.

'నువ్వంటే పిచ్చి.. పిచ్చి నా కొడకా'.. సాకేత్‌తో 'నేనింతే' హీరోయిన్‌!

'జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్' ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ వారం ఎపిసోడ్ అంతా పోటాపోటీగా సాగింది. కంటెస్టెంట్ అఖిల్ వచ్చి "ప్రియా ప్రియా చంపొద్దే" అనే సాంగ్ ఫుల్ జోష్ తో పాడేశాడు. అదే టైంలో 'నేనింతే' మూవీలో రవితేజకి జోడీగా నటించిన అదితి (సియా గౌత‌మ్‌) ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అఖిల్ పాడిన ఈ సాంగ్ కి ఫుల్ ఫిదా ఐపోయింది అదితి. ఇంకా ఈ సాంగ్ లో ఒక చరణాన్ని మళ్ళీ లాస్ట్ లో పాడించుకుని స్టేజి మీదకు వెళ్లి అఖిల్ తో కలిసి స్టెప్పేసింది. అంతలో శ్రీముఖి వచ్చి 'నేనింతే' మూవీలో రవితేజని తిట్టే డైలాగ్ చెప్పమని అడిగింది. వెంటనే "రవితేజగా ఎవరు వస్తారు"... అని చూస్తూ "సాకేత్ నీ చూపులు అందరినీ గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి నువ్వే రవితేజ క్యారెక్టర్ లో రావాలి" అనేసరికి సాకేత్ షాకైపోయాడు.  ఇక రవితేజగా స్టేజి  మీదకు వచ్చేసి అదితితో డైలాగ్ చెప్తాడు "నీ పిచ్చేంటే.." అని అదితిని అడిగేసరికి "పిచ్చి ఏంటే పిచ్చి అని అడగొద్దురా.. నువ్వే రా నా పిచ్చి, పిచ్చి నా కొడకా" అంటూ సాకేత్‌ని తిట్టేసింది అదితి గౌతమ్. "డైలాగ్ స్టార్టింగ్ నుంచి బ్రోకెన్ తెలుగులో మాట్లాడి లాస్ట్ లైన్ డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్ తెలుగులో మాట్లాడారు" అన్నాడు సాకేత్.  తర్వాత చరణ్ ని చూపించి 'హ్యాండ్సమ్ కదా అందుకే  మా ఇద్దరి మధ్య లవ్ ఉంద'ని చెప్తుంది శ్రీముఖి. "హే డ్యూడ్ ఆర్ యు ఆల్సో మారీడ్" అని చరణ్ ని అదితి అడిగింది. 'లేదు' అన్నట్టుగా చేతులెత్తేసి దణ్ణం పెట్టాడు చరణ్. "అందరినీ పెళ్లయిందా లేదా అని అడగాల్సి వస్తోంది" అని అదితి అనేసరికి "ఛ ఇంకా లేదు, అతను లేత పండు" అంది శ్రీముఖి. తర్వాత ఆమె, చరణ్ గత ఎపిసోడ్స్ నుంచి ట్రోల్ అవుతున్న లవ్ ఫొటోస్ చూపించింది.

ధూమపానం, మద్యపానం, కళ్యాణం జీవితానికి హానికరం అంటున్న చంటి !

జబర్దస్త్ ఈ వారం ఫుల్ మస్తీ చేసేసింది. అద్దిరిపోయే కామెడీతో కమెడియన్స్ కడుపుబ్బా నవ్వించేసారు. ఇక చలాకి చంటి తన స్కిట్ లో ఎన్నో కొత్త విషయాలు కూడా చెప్పేసాడు . ఫోటోగ్రాఫర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్ చేసాడు చంటి. ఇందులో చంటి ఫోటోగ్రాఫర్ అన్నమాట. తన పెళ్లి రోజున కూడా ఫొటోస్ తీస్తూనే ఉంటాడు. ఐతే తన టీంలో ఉన్నవాళ్లు "పెళ్ళైన మగాడికి, పెళ్లికాని మగాడికి తేడా ఏమిటి" అని అడుగుతారు. పెళ్లికాని మగాడు జబర్దస్త్ లాంటోడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. పెళ్ళైన మగాడు ఎక్స్ట్రా జబర్దస్త్ లాంటోడు.  మొదట్లో నవ్వులుంటాయి ఫైనల్ గా ఏడుపులుంటాయి అంటాడు. మరి అమ్మాయిలకు తేడా ఏమిటి అని అడిగేసరికి అమ్మాయిలకు ఏదైనా సాధించాలని ఉంటుంది. పెళ్లి కాక ముందు నాన్నను, పెళ్లయ్యాక మొగుడిని సాధిస్తారంటాడు. అనసూయ ఫుల్ సీరియస్ ఐపోతుంది ఈ డైలాగ్ కి. ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే  ధూమపానం, మద్యపానం, కళ్యాణం జీవితానికి హానికరం అంటాడు. ధూమపానం, మద్యపానం హానికరం అని తెలిసినా వదిలేస్తున్నామా ? లేదు కదా కళ్యాణం కూడా కానిచ్చేయడమే అంటాడు. పెళ్లికూతురిగా సునామి సుధాకర్ వచ్చేసరికి చూపించింది ఒక ఫోటో పెళ్లికూతురిగా తీసుకొచ్చింది ఇంకెవరినో అంటూ మండిపడతాడు. ఇలా ఒక ఫోటోగ్రాఫర్ కష్టాలను తన స్కిట్ లో చూపించాడు చంటి.  

పల్లకీలో వచ్చింది రష్మీనా ..ఇంకెవరన్నానా ..?

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తొమ్మిదేళ్ల నుంచి ఈ కార్యక్రమం ప్రతి తెలుగింటినీ పలకరిస్తూ అలరిస్తూనే ఉంది. చాలా నార్మల్ గా స్టార్ట్ ఐన ఈ షో ఊహించని రీతిలో చరిత్ర సృష్టించింది కూడా. మొదలైన కొన్నాళ్లకే టాప్ షోగా మంచి రేటింగ్స్ ని సంపాదించుకుంది. ఈ షోలో ఉన్న ఎంతో మంది కమెడియన్స్ కూడా ఇప్పుడు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. కానీ ఇటీవల జబర్దస్త్ లో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనలు చూస్తుంటే ఈ షో ఉంటుందా లేదా అనే డౌట్ ని చాల మంది ఎక్స్ప్రెస్ చేసేసరికి ఫైనల్ గా వెళ్ళిపోయిన వారందరినీ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కి తీసుకొస్తామని మల్లెమాల యాజమాన్యం చెప్పింది. అన్నట్టుగా గెటప్ శీను ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మిగతా వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఐతే ఇప్పుడు ఈ షో హోస్ట్ గా చేస్తున్న అనసూయ కూడా తనకు వస్తున్న ఆఫర్స్ తో టైం సెట్ అవక జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది. ఐతే ఇప్పుడు కొత్త యాంకర్ ఎవరు అనే ప్రశ్న ఎదురయ్యింది. వచ్చే వారం కొత్త యాంకర్ గా ఎవరు ? జబర్దస్త్ స్టేజి మీదకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ? అనే విషయం పై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. అనసూయ వెళ్ళిపోతోంది అన్న న్యూస్ వైరల్ ఐన దగ్గర నుంచి చూస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మినే వస్తుంది అని.. కాదు కాదు మంజూష వస్తుందని, మరో కొత్త యాంకర్ వస్తుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఇప్పుడు జబర్దస్త్ న్యూ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమోలో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా చేతులకు గాజులు వేసుకుని షో కోసం రెడీ అవుతున్నట్టు, పల్లకీలోంచి కాళ్ళు కింద పెట్టి దిగుతున్నట్టు చూపించారు. జబర్దస్త్ కమెడియన్స్ అంతా పోటీ పడి మేమంటే మేము చూస్తాం కొత్త యాంకర్ ని అంటూ చాటు నుంచి ఎగబడి చూస్తూ ఉన్నట్టుగా ఒక ప్రోమో కట్ చేసి వెనక బీజీఎమ్ గా గీత గోవిందం సాంగ్ పెట్టేసారు. ఐతే నెటిజన్స్ మాత్రం సైడ్ యాంగిల్ నుంచి రష్మీ లానే ఉంది అంటున్నారు. రష్మీ మాత్రమే హెవీ జ్యువెలరీ వేసుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమ్మ బొమ్మాళి అంటూ శృతిక వెంటపడిన అనంత శ్రీరామ్

జీ తెలుగు ఛానెల్ లో సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్  షో ఫుల్ ఫేమస్. ఇక ఈ వారం ఈ షో సెమి ఫినాలే రౌండ్ ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఫస్ట్ కంటెస్టెంట్ గా శృతిక ఎంట్రీ ఇచ్చేసింది. అరుంధతి మూవీలోంచి "భూ భూ భుజంగం" అనే పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పాటను పడడానికి ఎవరూ సాహసించరు. ధైర్యం, స్తైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లే ఈ పాటను ఎంచుకుంటారు అంటూ అనంత శ్రీరామ్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక ఈ పాటను కోటి గారు స్వరపరిచారు. ఈ పాట వినేసరికి కోటి గారు లేచి వచ్చి శృతికను ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని ఆశీర్వాదం అందించారు. శైలజ గారు, స్మిత ఇద్దరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. స్టేజి మీదకు శృతిక పేరెంట్స్ వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు.  శృతిక పుట్టినప్పుడు మళ్ళీ ఆడపిల్లేనా అన్నవాళ్లకు ఇదే రిజల్ట్ అంటూ శృతికను చూపించారు వాళ్ళ అమ్మ. అబ్బాయి పుడితే ఇంత హ్యాపీగా ఉండేదాన్నో లేదో కానీ నా కూతుళ్లిద్దరూ నన్ను ఎప్పుడూ తలెత్తుకునేలా చేస్తూనే ఉంటారు అంటూ వాళ్ళ బ్లెస్సింగ్స్ ని శృతికకు అందిస్తారు. తర్వాత కోటి గాను గోల్డెన్ టికెట్ ఇచ్చేసి గోల్డెన్ సోఫాలో కూర్చోబెడతారు. ఐతే శ్రీముఖి అదే టైంలో ఒక సూపర్ టాస్క్ ఇస్తుంది. సోనూసూద్ గా అనంత శ్రీరామ్ వచ్చి శృతిక అనుష్కగా చేయాలనేసరికి శృతిక అనుష్కల డాన్స్ వేస్తుంది. సోనూసూద్ లా అనంత శ్రీరామ్ అమ్మ బొమ్మాళి అంటూ గట్టిగా అరిచి మరీ స్కిట్ పెర్ఫామ్ చేస్తారు.

క్యాష్‌: స్టేజ్ పైనే క‌మెడియ‌న్ చేత తాళి కట్టించిన సుమ‌!

యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కామెడీ షో `క్యాష్ దొరికి నంత దోచుకో`. వివిధ టీవీ షోలు, సీరియ‌ల్ స్టార్స్ తో పాటు సినిమా స్టార్స్ ని ఈ షోకు ఆహ్వానిస్తూ సుమ చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షో గ‌త కొంత కాలంగా మంచి రేటింగ్ తో ఆద్యంతం సుమ పంచ్ ల‌తో అల‌రిస్తూ సాగుతోంది. స్టార్స్ ని ఆహ్వానిస్తూ వారిపై సెటైర్లు వేస్తూ నవ్వులు పూయిస్తున్న ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ షోలోకి ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ మెంబ‌ర్స్ కెవ్వు కార్తీక్ - భాను, నూక‌రాజు - అసియా, ప‌ర‌దేశి - ష‌బీనా, ప్ర‌వీణ్ -ఫైమా జోడీగా ఈ షొలో పాల్గొన్నారు.   `ప‌టాస్‌` టైమ్ లో నూక‌రాజు - అసియా ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ సీరియ‌స్ గా సాగుతోంది. ఇది `క్యాష్ ` షోలోనూ క‌నిపించింది. షోలోకి ఎంట్రీ ఇస్తూనే నూక‌రాజు - అసియా జోడీ షాకిచ్చారు. అసియాని చేతుల్లో ఎత్తుకున్న నూక‌రాజు గిరి గిరా న‌డుముచుట్టూ తిప్పేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఏం జ‌రుగుతోందో అర్థం కాక సుమ షాక్ తో చూస్తూ వుండిపోయింది. ఆ త‌రువాత ఏంటీ ఆ అమ్మాయిని మేక‌పిల్ల‌ని తిప్పిన‌ట్టు అలా తిప్పావ్ అంది సుమ‌. వెంట‌నే `నా పెళ్ల‌మే క‌దా` అనేశాడు నూక‌రాజు. క‌ట్ చేస్తే .. పీది పిజ‌మైన ప్రేమ అయితే వెలిగించుకో అంటూ హార‌తి క‌ర్పూరం, అగ్గిపెట్టె నూక‌రాజు చేతితో పెట్టింది సుమ‌. వెంట‌నే నూక‌రాజు హార‌తి క‌ర్పూరాన్ని వెలిగించుకున్నాడు. వ‌ద్దంటూ అసియా ఎమోష‌న‌ల్ అయింది. ఆ త‌రువాత నూక‌రాజు చేత అసియా మెడ‌లో తాళిక‌ట్టించింది సుమ‌. మా అంద‌రికి సాక్షిగా అసియా మెడ‌లో తాళిక‌ట్టు అని అత‌ని చేతికి తాళి ఇవ్వ‌డంతో అసియా మెడ‌లో క‌ట్ట‌డానికి వెళ్లాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఆగస్టు 6 శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `క్యాష్‌` షో చూడాల్సిందే. 

శ్రీముఖి ఇంటి పనులు నేర్చుకో ముందు అప్పుడే చరణ్ తో పెళ్లి చేస్తాం

సరిగమప సెమి ఫినాలే పోటీ మంచి రసవత్తరంగా సాగింది. అద్దిరిపోయే గాత్రంతో ఇంకా దుమ్ము రేపే పాటలతో షోని ఆద్యంతం నవ్విస్తూ, కవ్విస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు సింగర్స్ . సాయి చరణ్ ఈ షో కంటెస్టెంట్ గా వచ్చి "ఆ నీలి గగనాల" సాంగ్ లీనమైపోయి అత్యద్భుతంగా పాడి వినిపిస్తాడు. ఫైనల్ గా శ్రీముఖి కూడా వచ్చేసి మరో చరణం పాడేసి అందరితో శభాష్ అనిపించుకుంటుంది. ఇక వాళ్ళ లవ్ ట్రాక్ కి కోటి గారు కౌంటర్ వేస్తారు. "ఇంకెందుకు ఆలస్యం త్వరగా  పూలదండలు తీసుకురండమ్మా, పెళ్ళిచేసేద్దాం" అన్నట్టుగా అనేసరికి వెంటనే శ్రీముఖి కేరింతలు కొడుతోంది. ఇక చరణ్ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు పిలుస్తుంది. ఐతే చరణ్ వాళ్ళ అమ్మ తనని మూడు ప్రశ్నలు అడగమన్నారని వాటికి సరైన జవాబులు చెప్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందని చెప్తారు. వెంటనే ప్రశ్నలు అడిగేయండి చెప్తాను అంటూ ఫుల్ ఖుషితో అడుగుతుంది శ్రీముఖి. " ముగ్గు వేయడం వచ్చా" అని అడుగుతారు "ముగ్గులోకి దింపడం వచ్చు  మావయ్య" అంటుంది. "వంటొచ్చా" అని అడిగేసరికి " తినడం వచ్చు మావయ్య" అంటుంది. ఆ ఆన్సర్ కి ఒక్కసారి షాక్ ఐపోతారు చరణ్ వాళ్ళ నాన్న.  లేదు లేదు అప్పుడప్పుడు వంటలు కూడా ట్రై చేస్తుంటాను అని చెప్పేసరికి "గుత్తివంకాయ కూర చేయడం వచ్చా" అని అడుగుతాడు. "గుత్తి వంకాయ కూరను ఆన్లైన్ లో ఆర్డర్ చేయగలను"అంటుంది. నీకసలు గుత్తి వంకాయ కూర చేయడం రాదు కదా అని సీరియస్ గా అనేసరికి "నీకెప్పుడూ గుత్తి వంకాయ కూర ఇష్టమని ఎప్పుడూ చెప్పలేదు" అని చరణ్ వైపు చూసి అడిగేసరికి "యాక్టువల్ గా నాకు ఇప్పటివరకు అది ఇష్టమన్న విషయం తెలియదు" అంటాడు . మూడు ప్రశ్నల్లో రెండు అవుట్ . సరే ఫైనల్ గా "ఇస్త్రీ చేయడం వచ్చా" అని అడుగుతారు. "ఇస్త్రీ చేయడం వచ్చు రైట్ నుంచి లెఫ్ట్ కి లెఫ్ట్ నుంచి రైట్ కి ఇస్త్రీపెట్టెను తిప్పుతూ మొన్న చరణ్ జాకెట్ ఇస్త్రీ చేశా" అంటుంది. అలా ఎలా చేసావ్  "ముందు స్విచ్ వేయాలి కదా" అని చరణ్ వాళ్ళ నాన్న అనేసరికి స్టేజి మొత్తం నవ్వులు పువ్వులౌతాయి. నువ్ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఇవ్వలేదు ఇంకా నేనేం చేయలేను నీ ఇష్టం మా వాడి ఇష్టం అనేసరికి శ్రీముఖి బాధపడుతూ ఈ గ్రాండ్ ఫినాలే లోపు మీరు చెప్పిన పనులన్నీ నేర్చుకుంటాను అప్పుడు ఒప్పుకుంటారా అంటుంది. సరే అని తల ఊపుతాడు చరణ్ వాళ్ళ నాన్న. అలా శ్రీముఖి, చరణ్ లవ్ ట్రాక్ కి బ్రేక్ పడింది.

'నీ బాణం నీకే తిరిగి గుచ్చుకోకుండా చూసుకో'.. అభికి య‌ష్ వార్నింగ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, సులోచ‌న‌, వ‌ర‌ద‌రాజులు త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. కైలాష్ ని క‌లిసిన కాంచ‌న త‌న త‌ల్లికి విష‌యం చెప్ప‌డంతో మాలిని కైలాష్ ని విడిపించ‌మ‌ని, కేసు వాప‌స్ తీసుకోమ‌ని య‌ష్ తో అంటుంది. అత‌ని భవిష్య‌త్తుని దేవుడు రాస్తాడ‌ని య‌ష్ ఆఫీస్ కి వెళ్లిపోతాడు. ఇదిలా వుంటే వేద ఇంట్లో జ‌రిగిన విష‌యాన్ని చెప్పడానికి మాళ‌విక ఫ్రెండ్ తార ఇంటికి వ‌స్తుంది. "వేద మీద నువ్వు గెల‌వ‌బోతున్నావ్ కంగ్రాట్స్" అంటూ విష్ చేస్తుంది. య‌ష్ మీద పైచేయి సాదించ‌బోతున్నావ‌ని అభిమ‌న్యుతో చెబుతుంది. "య‌ష్ ఇంట్లో సునామీ పుట్టించిందిది, వాళ్ల‌ని అల్లాడించింది, దిక్కుతోచ‌ని ప‌రిస్థితులు క‌ల్పించింది. ఆ సునామి పేరు కైలాష్‌." అని చెబుతుంది. దీంతో హ్యాపీగా ఫీలైన మాళ‌విక‌, అభిమ‌న్యు ఇదే అద‌నుగా కైలాష్ ని అడ్డుపెట్టుకుని య‌ష్‌ను దెబ్బ‌కొట్టాల‌నుకుంటారు. క‌ట్ చేస్తే.. య‌ష్ ఎదురుప‌డ‌టంతో "నువ్వు ప్ర‌తీ విష‌యంలో కామాలు పెడుతూ వెళుతున్నావు.. నేను ఏకంగా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్ట‌బోతున్నాను" అంటాడు అభిమ‌న్యు. "నా మీద గెలుద్దామనే!.. ఉక్రోషం వుంటే స‌రిపోదు.. వ్యూహం వుండాలి" అంటూ వెట‌కారం చేస్తాడు య‌ష్‌. "ఆ వ్యూహాలే ర‌చించ‌డానికి వెళ్తున్నాను. నీ మీద సంధించ‌డానికి వెళుతున్నాను" అంటాడు అభిమ‌న్యు. "అయితే ఆ బాణం నీకే తిరిగి గుచ్చుకోకుండా చూసుకో" అని హెచ్చ‌రిస్తాడు య‌ష్‌. ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

'కప్పలా డాన్స్ చేస్తున్నావ్ కప్పదాన'.. శ్రీముఖిని తిట్టిన అవినాష్!

జీ తెలుగుతో పోటాపోటీగా స్టార్ మా కూడా మంచి షోస్ ని ప్లాన్ చేస్తోంది. అసలే వర్షాకాలం మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. అందుకే ఆడియన్స్ ఎవరూ ఇంట్లోంచి బయటకి కదలకుండా ఉండడం కోసం ఈ వారం "ఈ వర్షం సాక్షిగా" అనే ప్రోగ్రాంని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇందులో శ్రీముఖి, అవినాష్ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' అనే ట్రావెల్స్ నడుపుతూ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఐతే శ్రీముఖి బిజినెస్ విషయాలు చూడకుండా చిరంజీవి సాంగ్ కి వర్షంలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి అవినాష్ వచ్చి, "ఆపు.. చేసిన డాన్స్ చాలు.. నువ్ డాన్స్ చేస్తుంటే వచ్చే వర్షం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది" అంటాడు. అంతే శ్రీముఖి ముఖం మాడిపోతుంది. "బిజినెస్ గురించి నువ్వస్సలు ఆలోచించట్లేదు శ్రీ" అంటాడు అవినాష్. "అవును కదా.. మనకు బిజినెస్ ఉంది కదా" అంటుంది శ్రీముఖి. "హా.. నువ్వేమో కపుల్స్ గురించి ఆలోచించకుండా కప్పలా డాన్స్ చేస్తున్నావ్" అంటాడు. ఆ మాటకు శ్రీముఖి ఫీల్ ఐపోతుంది. వెంటనే అవినాష్ దణ్ణం పెడతాడు.. సారీ అన్నట్టుగా. అలా వీళ్ళ హనీమూన్ ట్రావెల్ బిజినెస్ ని ఈ షోలో స్టార్ట్ చేశారు.  తర్వాత కొంతమంది కపుల్స్‌ని పిలిపించారు. అంబటి అర్జున్, సుహాసిని, నిరుపమ్, మంజుల, మహేశ్వరీ, శివ, నిఖిల్, కావ్య, రవికృష్ణ, నవ్యస్వామి, మానస్, కీర్తి.. వీళ్లందరితో డాన్స‌లు చేయించింది శ్రీ‌ముఖి. "ఏదేమైనా ఈ స్టేట్ లో ఫాలోయింగ్ ఉండేది ఇద్దరే ఇద్దరికి. ఒకటి ఆ మహేష్ బాబుకి, రెండు ఈ డాక్టర్ బాబుకి" అంటూ నిరుపమ్ మీద పంచ్ డైలాగ్ వేసింది. "ప్రతీ అమ్మాయి మనసులో ఉండేది ఇద్దరే ఇద్దరు.. ఒకటి ఆ శ్రీకృష్ణుడు ఐతే, ఇంకొకరు ఈ రవిక్రిష్ణుడు" అంటూ రవిక్రిష్ణకు మంచి కంప్లిమెంట్ ఇచ్చేసింది శ్రీముఖి. ఇలా ఈ జంటలకు ఎన్నో టాస్కులు ఇచ్చి ఆడిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది శ్రీ‌ముఖి. 'డీపెస్ట్ మాన్సూన్ రొమాంటిక్ కపుల్'గా రవికృష్ణ, నవ్య స్వామిని ఎంపిక చేసింది శ్రీముఖి. ఇలా ఈ వారం వర్షం ఎపిసోడ్ ఫుల్ మస్తీ చేసేసింది.

పొట్టి గౌను వేసుకున్న పెద్ద పాప

హరితేజ బుల్లితెర మీద యంగ్ అండ్ డైనమిక్ యాంకర్. వెరీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ తల్లైన హరితేజ బాడీలో చాలా చేంజెస్ వచ్చి ఎంతో మారిపోయింది. పెరిగిన వెయిట్ ని ఎక్సర్సైజ్లు చేస్తూ వర్కౌట్స్ చేస్తూ మళ్ళీ పాత హరితేజలా మారడానికి ట్రై చేస్తోంది. ఎప్పుడూ పద్దతిగా కనిపించే హరితేజ ఈమధ్య కొన్ని ఫోటో షూట్స్ లో కురచ బట్టల్లో కనిపిస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురౌతోంది. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకుందో ఏమో తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తోంది. ఇక ఇప్పుడు కూడా లేటెస్ట్ గా మాల్దీవ్స్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసేసింది. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన హరితేజ అక్కడ నానా రచ్చ చేసింది.  ఫారెన్ లో ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి చిట్టి, పొట్టి డ్రెస్ వేసేసుకుని థైస్ కనిపించేలా వీధుల్లో చిందులేసేసింది. ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసేసరికి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఐతే నెటిజన్స్ మాత్రం ఇలాంటి డ్రెస్సులు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హరితేజ కూచిపూడి డాన్సర్ కెరీర్ ని ప్రారంభించింది. తర్వాత బుల్లి తెర మీదకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో "మనసు మమత" సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత "ముత్యమంతా పసుపు, "రక్త సంబంధం", "అభిషేకం", "తాళికట్టు శుభవేళ" , "శివరంజని", "కన్యాదానం" వంటి సీరియల్స్ చేసింది. ఈ సీరియల్స్ ద్వారా హరితేజ బాగా పాపులర్ అయ్యింది.

చరణ్ కి స్టేజి మీద ప్రొపోజ్ చేసిన శ్రీముఖి

"సరిగమప" ది సింగింగ్ సూపర్ స్టార్ట్ సెమీ ఫైనల్ కు వచ్చేసింది. ఇటీవల రిలీజ్ ఐన ఈ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి సాయి శ్రీచరణ్ కి ఇండైరెక్ట్ గా ప్రొపోజ్ చేసేసింది. "ఆ నీలి గగనాల  ఓ దివ్య తార" అంటూ పాట పాడి అందరిని మైమరిపించాడు తన గాత్రంతో. ప్యూర్ లవ్ తో చరణ్ ఈ పాట పాడాడు అని కోటి గారు కామెంట్ చేసేసరికి చరణ్ కూడా భలే సిగ్గుపడిపోతాడు. "నాకు నీ పెర్ఫార్మెన్స్ చాలా హ్యాపీగా అనిపించింది" అని స్మిత బెస్ట్ కంప్లిమెంట్ ఇస్తుంది. ఇక పాట మధ్యలో " ఈ పరిచయం ఒక వరమా , నా మనసు పడిన విరహ వేదన తొలి ప్రేమలోని మధుర భావన " అనే చరణాలని చరణ్ తో జత కట్టి పడేసరికి జడ్జెస్ అంతా విజిల్స్ వేస్తారు.  ఇక తర్వాత  "మోవయ్యా" అంటూ చరణ్ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. "మా ఆవిడ రావాల్సింది రాలేకపోయింది" అని ఆయన అనేసరికి "అత్తమ్మా" అంటుంది శ్రీముఖి. చరణ్ వాళ్ళ నాన్నకు కోపం వచ్చి "అత్తమ్మో, గిత్తమ్మో ఎవరో ఒకరు కానీ ..ఆవిడ నిన్ను మూడు ప్రశ్నలు అడగమంది. వాటికి నువ్వు సరిగ్గా ఆన్సర్స్ చెప్తే తనకేం ఇబ్బంది లేదు కంటిన్యూ అవ్వొచ్చు అని చెప్పింది " అంటారు. సరే అడగండి మావయ్య అంటుంది శ్రీముఖి. నీకు "ముగ్గు వేయడం వచ్చా శ్రీముఖి" అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు.. "ముగ్గులోకి దింపడం వచ్చు మావయ్య" అంటుంది. ఆ ఆన్సర్ కి అందరూ కెవ్వుమని నవ్వుతారు. ఇలా ఈ వారం ఎపిసోడ్ శ్రీముఖి, చరణ్ మధ్య చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్స్ తో అందంగా ఎంటర్టైన్ చేయబోతోంది. మరి మిగతా రెండు ప్రశ్నలు మోవయ్యా ఏం అడిగారు, శ్రీముఖి ఏం  జవాబులు ఇచ్చింది..ఫైనల్ గా చరణ్ కి, శ్రీముఖికి లైన్ క్లియర్ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూసెయ్యాల్సిందే.

తిలోత్త‌మను దిష్టిబొమ్మ‌ను చేస‌న న‌య‌ని!

అషికా గోపాల్, చందూ గౌడ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ ట్విస్ట్‌లు, ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. పవిత్రా లోకేష్‌, నిహారిక హ‌ర్షు, భావ‌నా రెడ్డి, విష్ణు ప్రియ‌, ద్వార‌కేష్ నాయుడు, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, శ్రీ‌స‌త్య త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు రాత్రి 8:30 ప్ర‌సారం అవుతోంది. భూష‌ణ్ బ్ర‌తికే వున్నాడ‌ని తెలుసుకున్న తిలోత్త‌మ ఆలోచ‌న‌లో ప‌డుతుంది. ఇదే స‌మ‌యంలో అత‌ని భార్య ఫోన్ చేసి ఎందుకు బెదిరించిందో క‌నుక్కుంటే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వ‌ల్ల‌భ అంటాడు. క‌రెక్ట్ టైమ్ లో గుర్తు చేశావ‌ని త‌న‌కు భూష‌ణ్ భార్య గా ఫోన్ చేసిన నంబ‌ర్ కు తిలోత్త‌మ ఫోన్ చేస్తుంది. క‌ట్ చేస్తే ఆ ఫోన్ ఇంట్లోని హాల్ లో రింగ్ అవుతుండ‌టం గ‌మ‌నించిన వ‌ల్ల‌భ‌, తిలోత్త‌మ ఒక్క‌సారిగా షాక్ అవుతారు. అది గ‌మ‌నించిన హాసిని ఫోన్ మ‌ర్చిపోయాన‌ని కంగారు ప‌డుతూ వుంటుంది. ఇదే స‌మయంలో ఆ ఫోన్ ద‌గ్గ‌రికి న‌య‌ని రావ‌డంతో తిలోత్త‌మ షాక్ అవుతుంది. అంతా త‌నే చేసింద‌ని కొత్త కుట్ర‌కు తెర తీస్తుంది. జ్వ‌రం అనే నెపంతో న‌య‌ని శ్రీ‌మంతాన్ని అడ్డుకునే ప్లాన్ వేస్తుంది. అయితే తిలోత్త‌మ ఎత్తుకు పై ఎత్తు వేసిన న‌య‌ని త‌న తిక్క కుద‌ర్చ‌డానికి స్వామిజీని పిలిపిస్తుంది. బ్ర‌మ‌ల‌తో భ‌య‌ప‌డి బాధ‌ప‌డుతున్న మా అత్తయ్య‌ గారికి సోకిన గాలి వ‌దిలిపోయేలా చూడండి అని చెబుతుంది. దాంతో స్వామీజీ మీ అత్త‌గారి మెడ‌లో ఈ దిష్టితాడు క‌ట్ట‌మ‌ని ప‌శువుల మెడ‌లో క‌ట్టే తాడుని ఇస్తాడు స్వామీజీ.. అది చూసిన తిలోత్త‌మ ఎద్దుకు క‌ట్టిన‌ట్టు ఆ తాడు నాకు క‌ట్టడ‌మేంటీ? అంటేంది. దీంతో విశాల్ వారిస్తాడు. క‌ట్టుకోమంటాడు. వెంట‌నే న‌య‌ని తిలోత్త‌మ మెడ‌లో దిష్టితాడు క‌డుతూ ఓవ‌రాక్ష‌న్ చేసిన నిన్ను దిష్టిబొమ్మ‌ను చేశానంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. తిలోత్త‌మ ఎలా రియాక్ట్ అయింద‌న్న‌ది తెలియాలంటే మండే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.    

బోనాల సెలెబ్రేషన్స్ లో భార్యతో సందడి చేసిన రియాజ్

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు రియాజ్‌. ఆ త‌రువాత బొమ్మ అదిరింది, అదిరింది షోల‌తో బాగా పాపుల‌ర్ అయ్యాడు. జ‌న‌సేన త‌రుపున నెల్లూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. ఇటీవ‌లే రియాజ్ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. తొలి సారి భార్య‌తో క‌లిసి జీ తెలుగులో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన జాత‌ర షోలో పాల్గొన్నాడు. ఇదే వేదిక సాక్షిగా త‌న భార్య‌ని అంద‌రికి ప‌రిచ‌యం చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది.   బోనాల సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా జీ తెలుగు వారు ప్ర‌త్యేకంగా జాత‌ర ఈవెంట్ ని నిర్వ‌హించారు. శ్రీ‌ముఖి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఈ షోలో రియాజ్ త‌న భార్య యాస్మిన్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇదే క్ర‌మంలో త‌న భార్య పేరు యాస్మిన్ అని చెప్ప‌డం.. స‌ద్దాం మాత్రం యాస్మిన్ రియాజ్ అని అన‌డంతో రియాజ్ మురిసిపోవ‌డం ప్రోమోలో న‌వ్వులు పూయిస్తోంది. ఇక స్టేజ్ పై రియాజ్‌, యాస్మిన్, స‌ద్దాంల‌ని కూర్చోబెట్టి ఈ ఇద్ద‌రిలో కామెడీ ఎవ‌రు బాగా చేస్తార‌ని యాస్మిన్ ని అడిగింది శ్రీ‌ముఖి. వెంట‌నే రియాజ్ అని స‌మాధానం చెప్పింది యాస్మిన్‌. దీంతో షోలో పాల్గొన్న వాళ్లంతా న‌వ్వుల్లో మునిగితేలారు. ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ షో ప్ర‌సారం కానుంది. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో నెట్టింట ప్ర‌స్తుతం సంద‌డి చేస్తోంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ ని ఇమిటేట్ చేసిన రియాజ్ ఆ త‌రువాతజ‌గ‌న్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వ‌డంతో క్ష‌మాప‌ణ‌లు చెప్పి వివాదానికి ముగింపు ప‌లికాడు. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా వున్నాడు రియాజ్‌. 

 జైలు నుంచి బ‌య‌టికి రావ‌డానికి కైలాష్ కొత్త ప్లాన్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌,  ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, ఆనంద్‌, సులోచ‌న‌, వ‌ర‌ద‌రాజులు త‌దిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది. ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. అమ్మ‌వారికి బోనం స‌మ‌ర్పంచే స‌మ‌యంలో మాళ‌విక బోనం చేయి జారి కింద ప‌డి ప‌గిలిపోతోంది. దీంతో వేద త‌న బోనాన్ని అమ్మ‌వారికి స‌మ‌ర్పించి సోద‌మ్మ చెప్పిన మాట‌లు నిజ‌మ‌వుతాయి. ఆ త‌రువాత వేద కాలి గాయానికి య‌ష్ మందు రాస్తుంటాడు. కాలికి గాయ‌మైనా ఎలా న‌డ‌వ‌గ‌లిగావ్‌.. నేనైతే అలా చేయ‌లేన‌ని య‌ష్ ..వేద‌తో అంటాడు. అందుకు వేద `నా బిడ్డ కోసం ఎంత‌టి నొప్పినైనా భ‌రించ‌డానికి సిద్ధ‌మే. నా క‌డుపున బిడ్డ‌ని క‌నే అదృష్టాన్ని ఆ భ‌గ‌వంతుడు ఎలాగూ ఇవ్వ‌లేదు క‌నీసం నా బిడ్డ‌ని కాపాడుకునే నొప్పినైనా భ‌రించాలి క‌దా అంటుంది. క‌ట్ చేస్తే .. జైలులో వున్న కైలాష్ ద‌గ్గ‌రికి కాంచ‌న వెళుతుంది. త‌న వ‌ల్లే నీకు ఇలాంటి క‌ష్టం వ‌చ్చింద‌ని, అందుకు త‌న‌ని క్ష‌మించ‌మ‌ని బోరున విల‌పిస్తుంది. ఇంత జ‌రిగినా గుడ్డిగా కైలాష్ ని న‌మ్ముతూ వుంటుంది. దీన్ని ఆవ‌కాశంగా తీసుకున్న కైలాష్ ఎలాగైనా జైలు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ప్లాన్ వేస్తాడు.. మీ త‌మ్ముడు య‌ష్ త‌లుచుకుంటే క్ష‌ణాల్లో నేను బ‌య‌టికి వ‌స్తాన‌ని, కానీ అది నాకు ఇష్టం లేద‌ని, అలా అని నువ్వు ఇంట్లో వాళ్ల‌తో వాదించి న‌న్ను ఎలాగైనా బ‌య‌టికి తీసుకురావాల‌ని మీ త‌మ్ముడు య‌ష్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని కైలాష్ తెలివిగా కాంచ‌న‌ని రెచ్చ‌గొడ‌తాడు. త‌న ప్లాన్ తెలియ‌ని కాంచ‌న ఇంటికి వ‌చ్చాక ఆ విష‌యాన్ని మాలినితో చెబుతుంది. య‌ష్ ని కేస్ వాప‌స్ తీసుకోమ‌ని చెప్ప‌మంటుంది. అదే విష‌యాన్ని ఆఫీస్ కి వెళుతున్న య‌ష్ తో మాలిని చెబుతుంది. కానీ య‌ష్ మాత్రం  కైలాష్ భ‌విష్య‌త్తుని డిసైడ్ చేసేది నేను కాద‌ని ఆ దేవుడ‌ని చెబుతాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.   

 హిమ‌తో డ్రీమ్ సాంగ్ వేసుకున్న ప్రేమ్‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌స్తుతం కొంత ప‌ట్టుని కోల్పోయింది. వంట‌ల‌క్క కార‌ణంగా టాప్ 1  రేటింగ్ తో రికార్డు సృష్టించిన ఈ సీరియ‌ల్ మ‌ళ్లీ ఆ మార్కుని అందు కోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది కానీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఇక తాజా ఎపిసోడ్ వివ‌రాల్లోకి వెళ‌దాం. క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో శౌర్య‌ని నిరుప‌మ్ ఎత్తుకుని తీసుకెళుతూ వుంటాడు. మ‌ధ్య‌లో క‌ళ్లు తెరిచి చూసిన శౌర్య‌ని నిరుప‌మ్ చూసి ఏంటీ మెల‌కువ వ‌చ్చిందా? అంటాడు. ఆ త‌రువాత అంతా ఇంటికి వెళ‌తారు. సోఫాపై శౌర్య‌ని నిరుప‌మ్ ప‌డుకోబెడ‌తాడు. వెంట‌నే లేచి కూర్చున్న శౌర్య ఎదురుగా కూర్చున్న నిరుప‌మ్ ని చూస్తుంది. నిన్ను మోసి అల‌సిపోయాడ‌ని సౌంద‌ర్య అంటుంది. బాధ్య‌త‌గా కాకుండా తిడుతూ మోయ‌డం ఎందుకు అంటూ చిరాగ్గా శౌర్య గ‌దిలోకి వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే.. హిమ చీర క‌ట్టుకుని త‌ల స్నానం చేసి కురులు ఆర‌బెట్టుకుంటూ వుంటుంది. అప్పుడే ప్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. హిమ‌ని అలా చూసి త‌న‌ని తాను మ‌రిచిపోతాడు. వెంట‌నే డ్రీమ్ లోకి వెళ్లి సాంగ్ వేసుకుంటాడు. క‌ట్ చేస్తే డాక్ట‌ర్ గా జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ రైజింగ్ రాజు ఎంట్రీ.. శౌర్య‌కు జ్వ‌రంగా వుంద‌ని పిల‌వ‌డంతో వ‌చ్చి రచ్చ ర‌చ్చ చేస్తాడు. శౌర్య‌కు జ్వ‌రం త‌గ్గిందంటాడు. అయితే హిమ మాత్రం అది వైర‌ల్ ఫీవ‌ర్ అని వారం వ‌ర‌కు త‌గ్గ‌ద‌ని చెబుతుంది. నాక‌న్నా నీకు ఎక్కువ తెలుసా? అంటూ రైజింగ్ రాజు హిమ‌తో గొడ‌వ‌కు దిగుతాడు. నానా యాగీ చేసి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.. త‌రువాత హిమ వెళ్లి శౌర్య టెంప‌రేచ‌ర్ చెక్ చేస్తానంటుంది. లేని ప్రేమ‌ని న‌టించ‌డం ఎందుకు అంటూ శౌర్య అన‌డంతో ఫీలైన హిమ బ‌య‌టికి వెళ్లి ఏడుస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే నిరుప‌మ్‌, హిమ మాట్లాడుకోవ‌డం గ‌మ‌నించిన శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఆ త‌రువాత ఏంజ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.  

రాజా ఎప్పుడైనా నన్ను అలా పిలిచావా?

క్యాష్ ప్రోగ్రాంతో సుమకి ఒక క్రేజ్ అనేది వచ్చేసింది ఆడియెన్స్ లో. క్యాష్ ప్రోగ్రాంకి సుమ తప్ప వేరేవారిని అస్సలు ఊహించుకోలేరు. సుమకి, ఆమె భ‌ర్త‌ రాజీవ్ కనకాలకు ఉన్న‌ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద అందరి జంటల్లాగే వీళ్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ లో. గతంలో ఈ ఇద్దరూ విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిని బ్రేక్ చేస్తూ సుమ ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఐనా సోషల్ మీడియాకి గొంతు పెద్దది.. ఎప్పుడూ ఎదో ఒకటి అంటూనే ఉంటుంది. సుమ, రాజీవ్ అస్సలు కలిసి ఏ షోలో కూడా కనిపించరు, ఇద్దరి మధ్య పొసగట్లేదని కూడా తర్వాత వార్తలు వస్తూనే ఉన్నాయి. సుమ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం మానేసింది. ఐతే  క్యాష్ ప్రోగ్రాం రాబోయే ఎపిసోడ్ కి సీతారామం టీం ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్, తరుణ్ భాస్కర్, సుమంత్, హను రాఘవపూడి గెస్టులుగా వచ్చారు. సుమ దుల్కర్ తో కలిసి స్టెప్పులేసింది. దుల్కర్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని ఈ ప్రోమో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆడియన్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ దుల్కర్ పై కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. కళ్యాణి అనే ఒక అమ్మాయి "మీ భార్య మిమ్మల్ని ఏమని పిలుస్తారు" అని దుల్కర్ ని అడిగింది. "జాన్" అని పిలుస్తుందని చెప్పారు దుల్కర్. తర్వాత సుమ "మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు?" అని అడిగింది. 'సీజియో' అని ఒక వెరైటీగా నిక్ నేమ్ చెప్పాడు దుల్క‌ర్‌. అమల్ సూఫియా, జాన్ కాబట్టి రెండు పేర్లు కలిపి ముద్దుగా పిలుస్తాడనే విషయం అర్థ‌మవుతోంది. వెంటనే సుమ అందుకుని  "రాజా చూసావా, ఎప్పుడైనా అలా పిలిచావా నన్ను?" అని అడిగింది. ఆ ప్రశ్నకు స్టేజి మీద అందరూ నవ్వేశారు. తర్వాత ఒక అమ్మాయి దుల్కర్ కోసం ఒక సాంగ్ పాడింది. తర్వాత లేడీ ఫాన్స్ అంతా గులాబీలు ఇచ్చి అతనితో కలిసి డాన్స్ చేశారు.

అందుకే నాకు సుధీర్ అంటే ఇష్టం!

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన వ్యక్తిత్వంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుని బుల్లి తెర మీద మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి లేడీ ఫ్యాన్ ఫాలోవర్లు చాలామంది ఉన్నారు. ఐతే ఇటీవల సుధీర్ గురించి 'దర్జా' మూవీ ఇంటర్వ్యూలో అక్సా ఖాన్ కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. ఈటీవీ గురించి, మల్లెమాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు "గోల్డెన్ ఆపర్చ్యునిటీ" అని చెప్పింది అక్సా. శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్యూ అని, జబర్దస్త్ చాలా స్పెషల్ అని  చెప్పింది. అలాగే సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అని అడిగేసరికి. "అతను నా గురువు.. నా మెంటార్, అతని వ్యక్తిత్వం చాలా గొప్పది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ముందు అందరిని గౌరవించడం అనేది అతనికున్న గొప్ప సంస్కారం.. నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్ కూడా" అని అంటోంది అక్సా.  "అతను వ్యవహరించే తీరు చాలా స్వీట్ గా ఉంటుంది. మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నో మంచి క్వాలిటీస్ నేను అత‌ని దగ్గరనుంచి నేర్చుకున్నా. అందుకే నేను అతన్ని గురువుగా చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అందుకే నాకు సుధీర్ అంటే ఇష్టం" అంటూ సుధీర్ లో ఆడియన్స్ కు తెలియని ఎన్నో గుణాల్ని ఆఖ్సా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే సుధీర్ ని చూసి నేర్చుకోవాలంటూ సింపుల్ గా చెప్పింది అక్సా.

జాత‌ర‌లో త‌ప్పిపోయిన అనుప‌మ వాళ్ల బావ‌!

ప్ర‌తీ ఆదివారం ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోల‌ని అందిస్తున్న మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్మెంట్ ఈ షోని కూడా ప్ర‌జెంట్ చేస్తోంది. ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు న‌టి ఇంద్ర‌జ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌ల క్రితం సుడిగాలి సుధీర్ హోస్ట్ గా మొద‌లైన ఈ షో ప్ర‌స్తుతం మంచి రేటింగ్ తో కొన‌సాగుతోంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోల‌కు సంబంధించిన టీమ్ లీడ‌ర్స్‌, క‌మెడియ‌న్ లు అంతా ఈ షోలోనూ పాల్గొంటున్నారు. ప్ర‌ధానంగా ఆటో రామ్ ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, బుల్లెట్ భాస్క‌ర్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, వ‌ర్ష‌, ఇమ్మానుయేల్, ఫైమా.. త‌దిత‌రులు ఈ షోలో త‌మ‌దైన స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ నెల 31న‌ ఆదివారం ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఈ వారం `బోనాల జాత‌ర‌` పేరుతో స్పెష‌ల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ లో `కార్తికేయ 2` టీమ్ సంద‌డి చేసింది. నిఖిల్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ఆగ‌స్టు 12న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ` షోలో పాల్గొని సంద‌డి చేశారు. కొంత మంది కంటెస్టెంట్స్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బాల‌య్య‌, విక్ట‌రీ వెంక‌టేష్ ల‌ని అనుక‌రిస్తూ వారి పాట‌ల‌కు డ్యాన్సులు చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. జాత‌ర‌లో చిన్న‌ప్పుడు నా మ‌ర‌ద‌లు త‌ప్పిపోయింద‌ని నిఖిల్ అన‌గానే, అదే టైమ్ లో మా బావ కూడా మిస్స‌య్యాడ‌ని అనుప‌మ అనేసింది. దీంతో ఇమ్మానుయేల్ స్టేజ్ పైకి వ‌చ్చేసి "నేనే అనుప‌మ బావ" అంటూ ర‌చ్చ చేశాడు. ఆ త‌రువాత అనుమ‌ప‌తో క‌లిసి లేడీ కంటెస్టెంట్ లంతా "రాను రానంటూనే సిన్న‌దో.." అంటూ అదిరిపోయే స్టెప్పులేశారు. 'కార్తికేయ 2' టీమ్ తో 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ' టీమ్ చేసిన అల్ల‌రిని చూడాలంటే జూలై 31న ఈటీవీలో ప్ర‌సారం అయ్యే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.   

దీన్ని చూసేటప్పుడు తినొద్దు, తాగొద్దు!

స్టార్ మాతో సమానంగా పోటాపోటీగా జీ తెలుగు కూడా ఎన్నో కొత్త కొత్త షోస్ ని ఆడియన్స్ ముందుకు తెస్తోంది. ప్రతీ వారం ఏదో ఒక వెరైటీ కంటెంట్ తో జీ తెలుగు అందరి ముందుకు వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు జీ సూపర్ ఫామిలీ కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సూపర్ ఫామిలీలో ఒక షోకి ఇంకో షోకి మధ్య టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ చేస్తున్నాడు.  ఈ ప్రోమోలో 'అదిరింది' టీమ్, 'సరిగమప' టీమ్ పోటీపడుతున్నాయి. రెండు టీమ్స్ నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ రెండు టీములు కూడా ప్రదీప్ మీద ఫుల్ పంచ్ డైలాగ్స్ వేసేసరికి ప్రదీప్ కూడా రివర్స్ కౌంటర్లు వేస్తూ ఫన్ చేసాడు. 'అదిరింది' టీమ్ నుంచి సద్దాం టీమ్ ఆడియన్స్ కి సందడి పంచింది. షో స్టార్టింగ్ లోనే "జీ" అనే పేరువచ్చేలా కొన్ని పదాలు వాడి ఎంటర్టైన్ చేశారు.  జీ అంటే చిన్నపిల్లలు బాత్రూం కి కూర్చోపెట్టేటప్పుడు వాడే మాటను వీళ్లంతా కలిసి కొన్ని పదాలతో కలిపి అలా పలుకుతూ  ఎంటర్టైన్ చేశారు. అందుకే ప్రోమో ముందు ఒక టాగ్ కూడా పెట్టేసారు "డోంట్ ఈట్ ఆర్ డ్రింక్ వైల్ వాచింగ్ థిస్ ప్రోమో" అని. కనిపిస్తుంది. ఇక తర్వాత సరిగమప టీమ్ కంటెస్టెంట్స్ అంతా వచ్చి మంచి మంచి సాంగ్స్ పాడుతూ డాన్సులు చేసి మైమరిపించారు. తర్వాత బొమ్మలు వేయించి వాటిని గుర్తుపట్టమని చెప్పే టాస్క్.  ఇలా రెండు టీమ్స్ కి వెరైటీ టాస్కులు ఇచ్చి గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసాడు ప్రదీప్. ఈ ఎపిసోడ్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. సద్దాం టీమ్ లో ఒకత‌ను నిజాలన్నీ చెప్పేస్తాడు. తమిళనాడు ఆంటీ, ఓయో రూమ్ అంటూ సీక్రెట్స్ లీక్ చేసేస్తాడు సద్దాం. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.