నా బుగ్గలు రియల్...సినిమాలో అలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తా!

  బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా గురించి చెప్పాలంటే ఆమె వేసే పంచులు గురించి ఆమె నవ్వు గురించి చెప్పుకోవాలి. అన్ని షోస్ లోకి దీపికను స్పెషల్ గా తీసుకుంటూ ఉంటారు. ఆమె ఏ షోలో ఉంటె ఆ షో రేటింగ్ పెరుగుతుంది అని. ఎందుకంటే అక్కడ పంచ్ డైలాగ్స్ అలాగే విపరీతమైన ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బ్రహ్మముడిలో మానస్ కి భార్య రోల్ లో నటిస్తోంది. అలాగే ఈమె డాన్స్ ఐకాన్ 2 , చెఫ్ మంత్ర 2 లో చూస్తే ఈమె ప్రోమోస్ బాగా పడేవి. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఢీ షోలో ఆదితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఈమె ఒక చిట్ చాట్ షోలో కొన్ని విషయాలు చెప్పింది. "నేను నా కెరీర్ ని తమిళ్ ఇండస్ట్రీలో న్యూస్ రీడర్ గా చేసాను. నా న్యూస్ రీడింగ్ ని నా ఫేస్ ని చూసి నన్ను సీరియల్ హీరోయిన్ గా కమిట్ చేసేసారు. నా బుగ్గలు రియల్. నేను లవ్ చేసాను చేస్తున్నాను నా ప్రొఫెషన్ ని. నా నాలుకతో ముక్కును టచ్ చేస్తాను అదే నా హిడెన్ టాలెంట్. నాకు ఇందులో కూడా ఒక డౌట్ ఉంది. నా ముక్కు పొడవుగా ఉందా నా నాలుక పొడవుగా ఉందా అని. ఢీ సెట్ లో ఆది, పండు ఇద్దరూ బాగా ఫన్ చేస్తారు. ఏదైనా సినిమాలో నాకు యానిమల్ క్యారెక్టర్ వస్తే లేడీ టైగర్ కాబట్టి అలా చేస్తాను. కానీ అందరూ నేను క్యూట్ గా టెడ్డి బేర్ లా ఉంటాను అని చెప్తారు కాబట్టి టెడ్డి బేర్ క్యారెక్టర్ కూడా. ఢీ షో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఆ డాన్స్ షోని నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. షోస్ , సీరియల్స్ అంటే ఇష్టం, లాంగ్ హెయిర్ ఇష్టం. హైదరాబాద్ అంటే ఇష్టం అలాగే లవ్ మ్యారేజ్ అన్నా కూడా. ట్రెడిషనల్ వేర్ వేసుకోవడం కాఫీ తాగడం ఇష్టం." అంటూ చెప్పుకొచ్చింది దీపికా రంగరాజు.

Bigg boss 9 Telugu : దివ్య బట్టలు దొంగతనం చేసిన సంజన.‌. మాటిచ్చిన ఇమ్మాన్యుయేల్!

  బిగ్ బాస్ సీజన్-9 లోకి దివ్యని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి తీసుకొచ్చారు. ఇక తను వచ్చీరాగానే సంబంధించిన బట్టలన్నీ సంజన, శ్రీజ దాచేస్తారు వాటిని బీన్ బ్యాగ్ లో పెడుతుంటే ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ వస్తాడు. ఇద్దరు సైలెంట్ గా వెళ్ళిపోతారు. కాసేపటికి దివ్య వచ్చి చూసేసరికి తన బట్టలు లేవు.. దాంతో తను ముందు సంజనని అడుగుతుంది. నాకు తెలియదని సంజన అంటుంది. ఇవ్వకండి ఇలాగే వారం రోజులు ఉంటానని దివ్య అంటుంది. అప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చి బీన్ బ్యాగ్ లో ఉన్నట్లు క్లూ ఇస్తాడు. తను వెళ్లి చూసేసరికి బట్టలు ఉంటాయి. సంజననే బట్టలు తీసిందని శ్రీజ చెప్తుంది.ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ కూడా ఉన్నారని దివ్యతో ప్రియ చెప్తుంది. ఇమ్మాన్యుయల్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తాడు అనుకోలేదని భరణి అంటాడు. ఆ తర్వాత దివ్యతో ఇమ్మాన్యుయల్ మాట్లాడతాడు. అందులో పెట్టడం చూసాను కానీ ఏంటని చూడలేదు రాము వస్తుంటే కూడా మనకి ఎందుకులే అని తీసుకొని వచ్చానని ఇమ్మాన్యుయల్ చెప్తాడు. శ్రీజ కూడా దివ్యకి సారీ చెప్తుంది. దివ్య వచ్చింది ఫస్ట్ డేనే కదా నీకు జోక్ అయి ఉండొచ్చు.. కానీ అందరికి కాదని, మీతో ఉంటే మీరు సేఫ్ మీతో ఉన్నవాళ్ళు బలి అవుతారు అందుకే నేను రాలేదని సంజనతో రీతు అంటుంది. ఆ తర్వాత సంజన, దివ్య మాట్లాడుకుంటారు. నేను తీసాను కానీ నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చేశాను.. మా గురించి నీకు తెలుసు నీ గురించి మాకు తెలియదు కదా.. నీకు సంబంధించినవి దొంగతనం చేస్తే అలుగుతావో‌.. కోప్పడుతావో ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామనుకున్నానని సంజన అంటుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అవుతాడు. నా బట్టలు దొంగతనం చేసిన వాళ్ళకి కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఇమ్మాన్యుయల్ తో దివ్య అంటుంది. తప్పకుండా నువ్వు సాటిస్ఫాక్షన్ అయ్యేలా పనిష్మెంట్ ఉంటుందని దివ్యకి ఇమ్మాన్యుయల్ మాటిస్తాడు. దివ్యకి మాటిచ్చిన్నట్టుగా సంజనకి ఇమ్మాన్యుయల్ పనిష్మెంట్ ఇస్తాడా లేక అమ్మ అని వదిలేసి సెంటిమెంట్ చూపిస్తాడా చూడాలి మరి.

Bigg boss 9 Telugu : సంజన ఇన్ సీక్రెట్ రూమ్.. రిటర్న్ వచ్చాక మాములుగా ఉండదు!

  బిగ్ బాస్ సీజన్-9 నిన్నటి(శుక్రవారం) నాటి ప్రోమోలో సంజన ఎలిమినేట్ అని చూపించేసరికి బిబి ఆడియన్స్ కి మతిపోయింది. బిగ్ బాస్ గేమ్ ని చేంజ్ చేసింది సంజన.. అలాంటి సంజన ఎలిమినేట్ అవ్వడమేంటని అందరు షాక్ అయ్యారు. అందులో డౌట్ లేదు. కానీ పూర్తి ఎపిసోడ్ చూసాకే అందరికి ఓ క్లారిటీ వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అర్థరాత్రి డేంజర్ బెల్స్  మోగిస్తాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా షాక్ అవుతారు.‌ ఇక అందరిని సోఫాలో కూర్చోబెట్టి అసలు కథ స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. రెడ్ గింజ కల్గిన వాళ్ళందరూ డిసైడ్ అయి.. ఒక హౌస్ మేట్ ని ఇంట్లో నుండి పంపించాలని బిగ్ బాస.. ఫ్లోరా ఇమ్మ్యూనిటీ పొందింది. దివ్యని నేనే పంపించాను.. వాళ్లిద్దరూ మినహా రెడ్ గింజ లేని వాళ్ళని పంపించాలని చెప్పగా అందరు కలిసి సంజనని డిసైడ్ చేసి పంపిస్తారు. నేను ఈ హౌస్ లో ఉండడానికి అర్హురాలిని.. కానీ బిగ్ బాస్ మాటకు రెస్పెక్ట్ ఇస్తున్నానని సంజన వెళ్ళిపోతుంది. సంజన వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. సంజనని పంపించాలని స్ట్రాంగ్ గా చెప్పిన హరీష్ మాత్రం.. సంజన వెళ్తుంటే అసలు తన దగ్గరికి కూడా రాడు.. సంజన కూడా అందరికి బై చెప్తుంది కానీ హరీష్ తో మాట్లాడదు. ఇక కాసేపటికి సంజన సీక్రెట్ రూమ్ లో ఉంటుంది. మన టీవీలో కంటెస్టెంట్స్ మాటలు వింటుంది. ఇమ్మాన్యుయల్ ఏడుస్తుంటే ఏడవకురా మళ్ళీ వస్తానని టీవీలో చూస్తూ అంటుంది సంజన. అందరు కలిసి నన్ను పంపిస్తారా అని కోపంగా అంటుంది. ఇక సంజన వెళ్ళిపోయిందనుకొని ఆవిడలా మనం చీప్ గా పనులు చెయ్యలేమని రాము, హరీష్ మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళు మళ్ళీ సంజన వస్తుందనుకుంటారు. ఇక సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మాములుగా ఉండదు. ఒక్కొక్కరికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుందని బిబి ఆడియన్స్ అనుకుంటున్నారు.  

Bigg boss 9 Telugu : మూడో వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో కామనర్స్!

    బిగ్ బాస్ సీజన్-9 విజవంతంగా దూసుకుపోతుంది. రోజొక ట్విస్ట్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులకు విందు భోజనం అందిస్తున్నాడు. ఇక మొదటి వారం హౌస్ నుండి శ్రష్టివర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండవ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఒకరు సెలబ్రిటీ, ఒకరు కామనర్ .. ఇక మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.   ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉండగా.. ఇమ్మ్యూనిటి పొందిన ఫ్లోరా నామినేషన్ నుండి సేవ్ అయింది. టాప్ లో రాము రాథోడ్ ఉన్నాడు.. సెకెండ్ ప్లేస్ లో రీతూ.. థర్డ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్.. ఫోర్త్ హరిత హరీష్.. చివరగా ప్రియా శెట్టి ఉన్నారు. లీస్ట్ లో ముగ్గురు కామనర్స్ ఉన్నారు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఇద్దరు కామనర్స్ ఎలిమినేషన్ అవుతారు.  ఈ వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఇంకా ఒక సీక్రెట్ రూమ్ కి సంజన కూడా జరిగింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఒక కామనర్ ఎంట్రీ జరిగిందంటే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది కామనర్స్ నుండే జరుగుతుంది. అందుకే బిగ్ బాస్ నుండి బిగ్ ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది.  

Bigg boss 9 Telugu : మూడో వారం కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్...

  బిగ్ బాస్ సీజన్-9 చూస్తుండగానే మూడో వారానికి వచ్చేసింది. సంజన, డీమాన్ పవన్ ఇద్దరు గత రెండు వారాలలో కెప్టెన్ గా చేశారు. అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ని దివ్య నిఖిత సెలక్ట్ చేసింది. కెప్టెన్సీ కంటెంటెండర్స్ రేసులో.. దివ్య నిఖిత, భరణి, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ అయిదుగురు ఉన్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే కంటెండర్స్ వేసుకున్న టీ షర్ట్ కి మిగతా వాళ్ళు విసురుతున్న బాల్స్ స్టిక్ అవుతాయి. బజర్ మోగే టైమ్ కి ఎవరి టీ షర్ట్  మీద అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు టాస్క్ నుండి ఎగ్జిట్ అవుతారు. టాస్క్ కి సంఛాలక్ గా పవన్ కళ్యాణ్ ఉంటాడు. మొదటగా టాస్క్ నుండి దివ్య ఎగ్జిట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, తర్వత తనూజ ఎగ్జిట్ అవ్వగా.. చివరికి భరణి, ఇమ్మాన్యుయల్ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ జరుగగా టాస్క్ లో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ మూడో వారం కెప్టెన్  అవుతాడు. ఇక డీమాన్ పవన్ కెప్టెన్సీ బ్యాండ్ ని ఇమ్మాన్యుయల్ కి పెడుతాడు. కెప్టెన్ అయ్యానంటే అందరి సపోర్ట్ వళ్లేనని ఇమ్మాన్యుయల్ అంటాడు. టాస్క్ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది. ఇమ్మాన్యుయల్ ఫెయిర్ గా కెప్టెన్ అయ్యాడు. బాల్స్ ఎక్కువగా నన్ను టార్గెట్ చేసి విసిరారని భరణి ఫీల్ అవుతాడు. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ కి ఎక్కువ బాల్స్ విసర్లేదు.  హౌస్ లో అందరికి పాజిటివ్ గా ఉన్న పర్సన్ ఇమ్మాన్యుయల్ అందుకే కంటెస్టెంట్స్ భరణిని టార్గెట్ చేశారు. 

Bigg boss 9 Telugu : దివ్యకి పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్.. టాప్-7 కంటెస్టెంట్స్!

  బిగ్ బాస్ సీజన్-9 లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో దివ్య నిఖితకి బిగ్ బాస్ ఒక ముఖ్యమైన భాద్యతని అప్పగించాడు. రెండు వారాలు హౌస్ మేట్స్ ఆటతీరు చూసావ్ కదా హౌస్ లోని వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వమని దివ్యకి బిగ్ బాస్ చెప్తాడు. దివ్య చాలా స్మార్ట్ గా అందరికి ర్యాంకింగ్ ఇస్తూ పర్ఫెక్ట్ రీజన్ చెప్తుంది. పదమూడో స్థానం నుండి మొదలు పెట్టిన దివ్య.. పదమూడో స్థానం ఫ్లోరా సైనీకి.. పన్నెండో స్థానం రాము రాథోడ్ కి. పదకొండో స్థానం పవన్ కళ్యాణ్.. పదో స్థానం శ్రీజ.. తొమ్మిది హరిత హరీష్.. ఎనమిది ప్రియ.. ఏడు రీతూ.. ఆరు సుమన్ శెట్టి.. అయిదు తనూజ.. నాలుగు డీమాన్ పవన్.. మూడు సంజన.. రెండు ఇమ్మాన్యుయల్.. మొదటి స్థానం భరణి. ఇలా అందరికి వారి పర్ఫామెన్స్ బట్టీ ర్యాంకింగ్ ఇచ్చింది దివ్య. దాంతో టాప్-7 కంటెస్టెంట్స్ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే అందులో అయిదుగురిని దివ్యని సెలక్ట్ చేసుకోమంటాడు. అందులో తన పేరు కూడా చేర్చుకోవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. నాకు వచ్చిన ఛాన్స్ నేను మిస్ చేసుకోనని తన పేరు ఖుడా చెప్పుకుంటుంది దివ్య. తనతో పాటుగా సుమన్ శెట్టి, తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి, దివ్య వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలెక్ట్ చేసుకుంటుంది దివ్య. ఆ తర్వాత నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని దివ్యని రీతూ అడుగుతుంది. ఇప్పుడు నేను సెలక్ట్ చేసినవాళ్లు అందరు కూడా ఎటాక్ చేసే ముందు ఒక థర్టీ సెకెండ్స్ ఆలోచిస్తారు కానీ నువ్వు అలా థింక్ చెయ్యవ్.. నాకు సేఫ్ సైడ్ గా ఉండాలని.. నిన్ను తీసుకోలేదని దివ్య సమాధానం చెప్తుంది.

Jayam serial : గంగకి రుద్ర కాల్..  లాయర్ ఏమి చెప్పాడు ?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -68 లో....రుద్ర గురించి గంగ ఆలోచిస్తుంది. అప్పుడే తన అంతరాత్మ బయటకు వస్తుంది. అసలు రుద్ర సర్ కి నీకు ఎలా సెట్ అవుతుంది. తను కోటీశ్వరుడు తను క్లాస్ .. మరి నువ్వు మాస్ అని అంతరత్మ చెప్తుంది. ఇంకా చెప్పాలంటే రుద్ర సర్ ప్రేమించిన అమ్మాయి ఒకవేళ వస్తే ఏం చేస్తావని అంతరాత్మ గంగని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత రుద్ర ప్రేమించిన అమ్మాయి గురించి ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకుంటుంది గంగ. అప్పుడే స్నేహ దగ్గరికి గంగ వెళ్లి.. రుద్ర మాజీ లవర్ గురించి అడుగుతుంది. నువ్వే వెళ్లి మా అన్నయ్యని అడుగుమని స్నేహ అంటుంది. ఆ తర్వాత గంగ రాత్రి రుద్రకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు.. ఉదయం లేచిన రుద్ర ఇన్ని సార్లు ఎవరు చేశారని  ఫోన్ చూసుకొని రిటర్న్ కాల్ చేస్తాడు. రుద్ర సర్ ఫోన్ చేసాడని గంగ పట్టరాని సంతోషంతో అందరికి నాకు ఫోన్ వచ్చిందంటూ సంతోషంగా చెప్తూ ఇల్లంతా తిరుగుతుంది. అప్పుడే రుద్ర ఎదురుపడతాడు. ఏంటి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నావని రుద్ర తనపై కోప్పడతాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి పెద్దసారు వెళ్లి.. నీకు ఫోన్ చేసింది ఎవరు.. నీ ప్రేమ గురించి చెప్పావా అని అడుగుతాడు. లేదు ట్రై చేస్తున్నానని గంగ చెప్తూ మళ్ళీ అదేం లేదని అంటుంది. అప్పుడే లాయర్ వస్తాడు. లాయర్ వచ్చి సీన్ రీక్రియేట్ చేసాం కదా అందులో రుద్ర తప్పేం లేదని కోర్ట్ నమ్ముతుందా అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే ఈ విషయం శకుంతలకి చెప్పాలి స్వీట్ చెయ్యండి అని పెద్దసారు అనగానే.. అది భాను డెత్ గురించి మీరు అలా అంటున్నారని ఇషిక అంటుంది. నాకూ తెలుసు కానీ రుద్ర తప్పు చెయ్యలేదని తెలిసింది కదా అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu illalu pillalu : శ్రీవల్లిపై నర్మద డౌట్.. అమూల్య కోసం విశ్వ చేస్తున్న విశ్వప్రయత్నాలు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -274 లో.....ఆ రామరాజు కుటుంబంపై పగ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు.. నాకూ వదిలెయ్యండి అని సేనాపతితో విశ్వ అంటాడు. మరొకవైపు ప్రేమ దగ్గరికి నర్మద వస్తుంది. ఫీల్ మై లవ్ అనీ సాంగ్ పాడుతుంది. నాకు నువ్వు కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఎందుకు చెప్పలేదని ప్రేమని నర్మద అడుగుతుంది. ఇద్దరం ఒకరికొకరు అన్ని చెప్పుకోవాలనుకున్నాం కదా అని నర్మద అంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పలేదని ప్రేమ అంటుంది. నీ గురించి ధీరజ్ మాట్లాడిన తీరు నాకూ బాగా నచ్చింది. తనకి ఇప్పుడే నీపై ప్రేమ మొదలైంది. ఎప్పుడు అలాగే ప్రేమగా ఉండండి అని నర్మద చెప్తుంది.ఆ తర్వాత అసలు ఎదురింటి వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసిందని శ్రీవల్లి దగ్గరికి నర్మద వెళ్తుంది‌. నువ్వే కదా ఈ ఇంట్లో జరిగేది ఆ ఇంట్లో చెప్తున్నావని నర్మద అడుగుతుంది. నేనేం చెప్పట్లేదని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ప్రేమ బట్టలు పిండేస్తుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. హెల్ప్ చెయ్యమని ప్రేమ అడుగుతుంది. హెల్ప్ చేస్తాడు. ధీమా అంటే ఏంటని ధీరజ్ అడుగుతాడు. నిన్న నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని ప్రేమ అడుగుతుంది. ఆ తర్వాత అమూల్య దగ్గరికి శ్రీవల్లి వస్తుంది మీ బావ ఏంటి నిన్నే చూస్తున్నాడు అని విశ్వ గురించి అడుగుతుంది. అతనిపై నీ ఉద్దేశ్యం ఏంటని శ్రీవల్లి అడుగగా విశ్వని అమూల్య తిడుతుంది. అప్పుడే ఎదురుగా ప్రేమ ఉంటుంది. విన్నావా ప్రేమ వదిన.. మీ అన్నయ్య మంచోడు అని చెప్తుందని ప్రేమతో అమూల్య అనగానే శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అమూల్య కాలేజీకి వెళ్తుంది. శ్రీవల్లి వంక నర్మద కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: దీపకి సపోర్ట్ గా సుమిత్ర.. షాక్ లో జ్యోత్స్న!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -473 లో.....శౌర్య స్కూల్ కి వెళ్ళనని మారాం చేస్తుంది. ఎందుకు వెళ్లవని కార్తీక్ అడుగుతాడు. నేను చదవట్లేదు. నాకు మీరు వచ్చాక చదువు చెప్పట్లేదని కార్తీక్, దీపలతో శౌర్య అంటుంది. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి.. నిన్న జరిగిన దానికి మీరు ఇక పనికి రారు కదా.. ఇక అగ్రిమెంట్ ప్రకారం పది కోట్లు ఇవ్వాలి రెడీ చేసుకోమని అంటుంది. దానికి సమాధానంగా.. "మనం ఏదో జరిగిందానికి వెళ్లకుండా ఉంటే మూర్కులు గెలిచారని ఫీల్ అవుతారు‌" అంటూ  శౌర్యాతో కార్తీక్ అంటే అదంతా ఫోన్ లో లైన్ లో ఉన్న జ్యోత్స్న వింటుంది. బావ ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నాడని అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. శివన్నారాయణ ఎదురు వచ్చి వద్దని చెప్తాడు. ఇక మీరు పని మానెయ్యండి అని చెప్తాడు‌. మేం వస్తామని కార్తీక్, దీప రిక్వెస్ట్ చేస్తారు. దాంతో శివన్నారాయణ లోపలికి వెళ్తాడు. అసలు ఈ గొడవ అంత మీ వల్లే.. నిన్న సుమిత్ర, దశరథ్ గొడవ పడ్డారు. దాంతో దశరత్ ని జ్యోత్స్న ఏదో మాట అందని జ్యోత్స్నని సుమిత్ర కొట్టిందని కార్తీక్, దీపలతో పారిజాతం అంటుంది. మరొకవైపు దశరథ్ కి కాఫీ తీసుకొని వెళ్తుంది దీప. నా వల్ల మీరు, అమ్మ ఎందుకు గొడవ పడుతున్నారని దీప అంటుంది. నా భార్య మొదట్లో ఎలా ఉందేదో అలా మార్చుకోవాలనుకుంటున్న ప్లీజ్ దీప.. ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడకని దశరథ్ అంటాడు. అదంతా సుమిత్ర వింటుంది. జ్యోత్స్న వచ్చి ఆ దీప ని తిట్టు మమ్మీ అని అంటుంది. ఎందుకు తిట్టాలి తను అన్నదాంట్లో తప్పేముందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : నిజం చెప్పిన  అపర్ణ..  సృహతప్పి పడిపోయిన కావ్య !

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -836 లో.....రాజ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఎందుకు అన్నయ్య ఎవరికి నిజం చెప్పకుండా నీలో నువ్వే దాచుకొని అందరికి చెడ్డవాడివి అయ్యావని కళ్యాణ్ అంటాడు. రాజ్ తన బాధని కళ్యాణ్ కి చెప్పుకుంటాడు. నువ్వు వదినతో కాకుండా పెద్దమ్మ తో అయినా అసలు విషయం చెప్పమని రాజ్ కి కళ్యాణ్ సలహా ఇస్తాడు. ఆ తర్వాత  అసలు రాజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్లి తేల్చుకుంటానని అపర్ణ వెళ్ళబోతుంటే రాజ్ నే ఎదురుగా వస్తాడు. నేను అలా చెయ్యడానికి కారణం ఉంది.. కావ్య బేబీని మోస్తే తన ప్రాణానికి ప్రమాదమని రాజ్ చెప్పగానే అపర్ణ, సుభాష్ ఇద్దరు షాక్ అవుతారు. ఈ విషయం కావ్యకి చేప్తే తట్టుకోలేదని రాజ్ బాధపడుతాడు. ఈ విషయం కావ్యకి చెప్పాలని అపర్ణ అంటుంది. మరొకవైపు ఎందుకు ఇలా రాజ్ బెహేవ్ చేస్తున్నాడోనని ఇందిరాదేవితో కావ్య చెప్తుంది. అప్పుడే అపర్ణ వచ్చి నువ్వు బేబీని మోస్తే.. నీ ప్రాణానికే ప్రమాదమని కావ్యకి చెప్తుంది. లేదు మీరు అబద్ధం చెప్తున్నారని కావ్య అంటుంది. నేను అబార్షన్ చేయించుకోనని కావ్య అంటూ స్పృహ తప్పుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

సంజన ఎలిమినేషన్.. అమ్మ కోసం ఏడ్చిన ఇమ్మాన్యుయేల్!

  బిగ్ బాస్ సీజన్-9 ఎవరి ఊహలకి అందకుండా రోజుకో ట్విస్ట్ తో దూసుకెళ్తుంది.  గతవారం జరిగిన ఓ టాస్క్ లో ఆపిల్ చెట్టుకి ఉన్న ఆపిల్ తీసుకున్న కంటెస్టెంట్స్ కి మూడు రకాల గింజలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే నీలం గింజ కలిగిన వారికి ఫ్యామిలీ నుండి గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఇక నలుపు గింజ కలిగిన వాళ్ళకి ఇమ్మ్యూనిటి టాస్క్ పెట్టాడు. ఇక చివరగా రెడ్ గింజ కలిగిన వాళ్ళు హౌస్ లోఎవరినైనా ఎలిమినేట్ చెయ్యొచ్చు. ఆ రకంగా రెడ్ గింజ కలిగిన కంటెస్టెంట్స్ అందరు కూడా డిసైడ్ అయ్యి సంజనని సెలక్ట్ చేస్తారు. " సంజన మీరు ఎలిమినేట్ అయ్యారు.. మీ లాగేజ్ తీసుకొని మెయిన్ గేట్ నుండి వెళ్ళండి" అని బిగ్ బాస్ చెప్తాడు. ఇక సంజన చేసేదేమీ లేక నన్ను కార్నర్ చేశారు బిగ్ బాస్ అని సంజన ఎమోషనల్ అవుతుంది. హౌస్ నుండి లగేజ్ తో బయటకు వచ్చేస్తుంది. సంజన వెళ్లిపోవడంతో ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. కానీ కంటెస్టెంట్స్ అందరిలో టాప్-3 గా ఉన్న సంజన ఎలిమినేట్ అవ్వడమనేది జరగదు. అందుకే ఎలిమినేషన్ అని చెప్పి సీక్రెట్ రూమ్ లో పెడతాడు బిగ్ బాస్. లేదంటే ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే హైలైట్ గా నిలుస్తుంది.  ఆదివారం రోజు ఆ విషయం నాగార్జున రీవీల్ చేసే ఛాన్స్ ఉంది. మరి మీకేనపిస్తుందో కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu: దమ్ము శ్రీజ దుమ్ముదులిపిన దివ్య నిఖిత!

  బిగ్ బాస్ సీజన్-9 రెండు వారాల దాకా ఒక లెక్క.. మూడో వారం నుండి ఒక లెక్క అన్నట్టుగా సాగుతుంది. దానికి కారణం కామనర్స్ కోటాలో హౌస్ లోకి వచ్చిన దివ్య నిఖిత. తను వచ్చీ రాగానే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టిలకి ఇచ్చిపడేసింది.  తాజాగా విడుదలైన బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu)ప్రోమోలో.. హౌస్‌లో ఉన్న వాళ్ల పర్ఫామెన్స్‌ని బట్టి వారి స్థానాలను కేటాయించమన్నాడు బిగ్ బాస్. దాంతో దివ్య నిఖిత ఒక్కొక్కరి గురించి చెప్తూ కెప్టెన్సీ టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. హౌస్‌లో ఉన్న పదమూడు(13) మంది కంటెస్టెంట్స్‌కి వారి వారి పర్ఫామెన్స్ చెప్తూ తను ఇచ్చిన ర్యాకింగ్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హౌస్ లో ఫ్లోరా సైనీకి చివరి స్థానం ఇచ్చిన దివ్య.. మీరు గేమ్‌లో యాక్టివ్‌గా లేరని చెప్పింది. రాము రాథోడ్‌కి పన్నెండవ స్థానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పడాలకి పదకొండవ స్థానం ఇచ్చింది. ఇక దమ్ము శ్రీజకి పదో స్థానం ఇచ్చింది. దమ్ము శ్రీజని దుమ్ముదులిపేసింది దివ్య. నువ్వు గొడవని పెంచడానికే ట్రై చేస్తావ్ తప్ప.. దానికో సొల్యూషన్ కోసం కాదు. ఒకరిపై రాయి వేసేసి.. సైలెంట్‌గా ఉండు అంటే ఉంటారా.. నీ ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చవు.. నీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే.. ఒక్క లుక్‌తోనే యాటిట్యూడ్ చూపిస్తావ్. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా చూస్తావంటూ దమ్ము శ్రీజ దుమ్ముదులిపింది దివ్య.  మాస్క్‌మెన్‌కి తొమ్మిదో నెంబర్ ఇవ్వడంతో అతని వాదన స్టార్ట్ చేశాడు. గాయపడ్డ పులి అంటూ తనకి తానే లేపుకున్నాడు. ఇక సంజన వైపు చూస్తూ.. ఇదే స్మైల్‌తో నొప్పి తెలియకుండా సూది గుచ్చేస్తారని సెటైర్ వేసింది దివ్య. భరణికి నెంబర్ వన్ స్థానం ఇచ్చిన దివ్య.. అందరికంటే మీరు స్మాట్ అని చెప్పింది.  

Bigg boss 9 Telugu : టీ తెచ్చిన పెంట....రాముని తిట్టినా తనూజ!

  బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం క్రేజీగా సాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనూజ అందరికి టీ పెడుతుంది. ఎవరెవరు తాగుతారో ఒకసారి అందరిని అడగమని రాముని పంపిస్తుంది తనూజ. రాము వచ్చి ఫ్లోరా లేదని చెప్తాడు. ఇక అందరూ టీ తాగుతారు. సంజన రెండవసారి టీ తాగుతుంది. ఫ్లోరా వచ్చి.. నేను ఏం టీ తాగలేదని అంటుంది. దాంతో తనూజ వచ్చి నిన్ను అందరిని అడగమని చెప్పాను కదా ఎందుకు అడగలేదని రాము పై కోప్పడుతుంది. ఆ తర్వాత రీతూ, సంజన, డీమాన్ మాట్లాడుకుంటుంటే రాము వస్తాను. నాతో ఫ్లోరా లేదు .. తను తాగదని చెప్పిందని తనూజతో రాము చెప్తాడు అవునా అని వెంటనే సంజన దగ్గరికి వెళ్తుంది తనూజ. మీరు ఎందుకు ఫ్లోరా గారి గురించి చెప్పారని తనూజ గొడవ పెట్టుకుంటుంది. నేను ఫ్లోరా గురించి ఏం మాట్లాడలేదు.. తను లేదని చెప్పాను.. తను తాగుతుంది తాగదని నాకెలా తెలుసని సంజన కోప్పడుతుంది. మళ్ళీ రాము వచ్చి సంజన గారు అలా అనలేదని అంటాడు. నువ్వు ఇందాక ఏం అన్నావ్ రాము ఇలా మాట మారిస్తే నాకు నచ్చాదు.. ఇక నువ్వు ఫుడ్ కి సంబంధించినవి ఏం పట్టించుకోనని రాము పై తనూజ కోప్పడుతుంది. ఆ తర్వాత అలా అడగడం తన డ్యూటీ.. తన డ్యూటీ రాముకి చెప్పి, ష వాడు సరిగాగ్గాచెయ్యలేదు అనీ తినే వాడిపై కోప్పడ్డం ఎందుకు అనీ రాముకి సపోర్ట్ గా ఇమ్మాన్యుయల్ మిగతా వాళ్ళతో అంటాడు.

Jayam serial : ఊహల్లో తేలుతున్న గంగ.. పెళ్ళి చేయమంటావా అని అడిగిన పెద్దసారు!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -67 లో.....గంగ రుద్ర కలిసి ఇంటికి వస్తారు. వాళ్లని చూసి ఎక్కడికి వెళ్లారని పెద్దసారు అడుగుతాడు. పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాం.. గంగ ని చంపాలని ప్రయత్నం చేసిన వాడి గురించి తెలిసిందని ఇన్‌స్పెక్టర్ కాల్ చేస్తే వెళ్ళామని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత గంగ ఊహల్లో తేలుతుంటే తనని పెద్దసారు చూస్తాడు. ఎవరు ఆ అబ్బాయి పెళ్లికి ముహూర్తం పెట్టించామంటావా అబ్బాయి పేరు ఏంటని అడుగుతాడు. రుద్ర అని గంగ చెప్పబోతు ఆగిపోతుంది. నేనే టెన్షన్ లో ఉన్నా తలనొప్పిగా ఉందని టాపిక్ డైవర్ట్ చేసి గంగ వెళ్ళిపోతుంది. నా దగ్గర నీ నాటకాలు బాగా నేర్చావ్ తెలుసుకుంటానని పెద్దసారు అంటాడు. గంగ బయటకి వెళ్లి క్రేజీ కష్మోరా నుండి రాజకుమారుడిని బయటకు తీసుకొని రావాలని అనుకుంటుంది. లోపల బుక్స్ చదువుకుంటున్న రుద్రకి ఫోన్ చేస్తుంది. రుద్ర దగ్గర గంగ ఫోన్ నెంబర్ లేకపోవడంతో రుద్ర లిఫ్ట్ చెయ్యడు. రుద్ర దగ్గరికి గంగ వచ్చి మీకు ఫోన్ వస్తున్నట్లు ఉందని అంటుంది. సైలెంట్ లో ఉన్నా ఫోన్ వచ్చిందని నీకెలా తెలుసని రుద్ర అంటాడు. అంటే ఫోన్ లైట్ వచ్చింది అనిపించిందని గంగ అంటుంది. గంగ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రుద్ర రిటర్న్ కాల్ చేసినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : ధీరజ్, ప్రేమల సరికొత్త ప్రేమాయణం.. విశ్వ ప్రయత్నం ఫలించేనా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -273 లో.....ప్రేమ గురించి ధీరజ్ మాట్లాడిన మాటలకి వేదవతి నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేదవతి అయితే అందరు వెళ్ళాక విజిల్ వేస్తూ నర్మదతో కలిసి డాన్స్ చేస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమపై ధీరజ్ కి ఎక్కడో ఓ మూలన ప్రేమ ఉందని ఇద్దరు అనుకుంటారు. మరొకవైపు ధీరజ్ వంక ప్రేమ చూస్తుంది. అతను అన్న మాటలు గుర్తుచేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరికి భోజనం తీసుకొని వచ్చి తినమంటుంది. నేను తిననని ధీరజ్ అంటుంటే.. నువ్వు తినకపోతే నేను తిననని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ తింటాడు. నేను ఒకటి అడుగుతున్నా చెప్పు.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా అని అడుగుతుంది. నువ్వు వాళ్ళతో అలా మాట్లాడుతుంటే నన్ను సేవ్ చెయ్యడానికి అనుకున్నాను కానీ నీ కళ్ళలో ప్రేమ కనిపించిందని ప్రేమ అంటుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావ్.. లేదని గట్టిగా అరిచేవాడివి అని ప్రేమ అనుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ సిగ్గుపడుతూ గోడపై ధీమా అని రాస్తుంది. అది చూసి ఏంటని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ నవ్వుకుంటుంది. మరొకవైపు నా కూతురుపై అలాంటి నిందలు వేస్తారా.. వాళ్ళ సంగతి చెప్పాలని సేనాపతి అంటుంటే అవసరం లేదు ఆల్రెడీ ఆ రామరాజు సంగతి చెప్పే పనిలో ఉన్నానని విశ్వ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్.. కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్!

  బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన అనూష రత్నం, షకీబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత నలుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఒక్కరే హౌస్ లో పర్మినెంట్ గా ఉంటారు. నలుగురు లోపల ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతారు. తమని హౌస్ లో కి వచ్చేందుకు సపోర్ట్ చెయ్యమని ఓటు అప్పీల్ చేసుకుంటారు. నలుగురు కూడా ఓటు అప్పీల్ చేసుకుంటారు. హౌస్ లో ఏది మిస్ అయిందో అది మేమ్ ఫుల్ ఫీల్ చేస్తామని మాటిస్తారు. ఓటు అప్పీల్ తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని ఒక్కొక్కరిగా వచ్చి తమ ఫేవరెట్  పర్సన్ ఎవరైతే హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఓటు చెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో అందరూ ఓటు వేస్తారు. తాము ఎవరికీ వేశారు అనేది బయటకు చెప్పొద్దని బిగ్ బాస్ చెప్తాడు. అందరు గార్డెన్ ఏరియాలో ఉంటారు. మీరు సెలక్ట్ చేసుకున్న పర్సన్ ని ఇప్పుడు రివీల్ చేసే టైమ్ వచ్చింది.  ఇది రణరంగం కాదు చదరంగం ఎక్కువ మంది ఓటు వేసిన వాళ్ళని కాకుండా చద్దనుకున్న వాళ్ళని హౌస్ లోకి పంపిస్తున్నానని బిగ్ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. దివ్య నిఖితా ని హౌస్ లోకి  ఎంట్రీ చేపిస్తాడు బిగ్ బాస్. అసలు అందరు దివ్యని వద్దనుకున్నారు ఈ ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్ అయింది. మీరందరు నన్ను వద్దనుకున్నారు కదా అని దివ్య అంటుంది. ఇక దివ్యకి నామినేషన్ పాయింట్స్ దొరికినట్లే.  దివ్య నిఖిత ఎంట్రీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : జ్యోత్స్నకి  చెంపదెబ్బ.. దీప ఒప్పుకుంటుందా మరి!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -472 లో..... ఒక్క దీప తప్పు ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు కలుస్తాయని శ్రీధర్ అంటాడు. నా భార్య ఏ తప్పు చెయ్యలేదు ఒప్పుకోదని కార్తీక్ అంటాడు. ఇక నిర్ణయం నీదే దీప అని శ్రీధర్ అంటాడు. ఇది నా కుటుంబం.. దానికి సంబంధించిన సలహాలు సూచనలు నువ్వేం ఇవ్వనవసరం లేదని కార్తీక్ కోపంగా అరుస్తాడు. సరే నీ కుటుంబం కదా అని శ్రీధర్ డల్ గా వెళ్లిపోతాడు. మరొకవైపు అసలు ఇంట్లో పనిమనిషికి ఉన్న విలువ ఇంటికోడలికి లేదని జ్యోత్స్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావని దశరథ్ అంటాడు. మరి తప్పు చేసింది ఒప్పుకోవచ్చు కదా అని జ్యోత్స్న అనగానే దీప తప్పు చేయలేదు.. మరి నువ్వు తప్పు చేసావ్ కదా ఒప్పుకున్నావా అని దశరథ్ అడుగుతాడు. నేనేం తప్పు చేసానని జ్యోత్స్న అంటుంది. అసలు దీప చేతిలోకి గన్ ఎలా వచ్చిందని దశరథ్ అనగానే నా దగ్గర నుండి తీసుకుందని జ్యోత్స్న అంటుంది. అసలు నీ చేతిలోకి ఎలా వచ్చిందని దశరథ్ అడుగుతాడు. దీప ఏమైనా చేస్తుందోనని తాత గన్ తీసానని జ్యోత్స్న అంటుంది. అయితే దీపకి కోపం వచ్చేంత తప్పేం చేసావని దశరథ్ అడుగుతుంటే జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది. దీపని నమ్ముతున్నావ్.. మూర్ఖుడివి అని దశరథ్ ని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది సుమిత్ర. ఆ తర్వాత జ్యోత్స్న చెంపకి పారిజాతం ఆయింట్మెంట్ రాస్తుంది. మరొకవైపు దీప దగ్గరికి కార్తీక్ వచ్చి జరిగింది మర్చిపోమని చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్ దగ్గరికి స్వప్న కావేరి వస్తారు. రెండు కుటుంబాలు కలిసే ఛాన్స్ వస్తే మీ వదిన మిస్ చేసింది. అసలు కార్తీక్ కి ఈ పరిస్థితి రావడానికి కారణం దీప అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi :  కావ్య.. అబార్షన్ చేయించుకుంటుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmmudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -835 లో..... కావ్యని తీసుకొని రాజ్ హాస్పిటల్ కి వెళ్తాడు. కావ్యని బయటే కూర్చో పెట్టి డాక్టర్ దగ్గరకి వెళ్తాడు రాజ్. నా భార్యకి అబార్షన్ చెయ్యండి కానీ తనకి చెప్పొద్దని రాజ్ అనగానే.. లేదు అలా చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదని డాక్టర్ అంటుంది. ఆ తర్వాత డాక్టర్ ని రాజ్ రిక్వెస్ట్ చేస్తుంటే కావ్య వస్తుంది. ఏం చేస్తున్నారు.. బేబీ చెకప్ అని తీసుకొని వచ్చి నాకు అబార్షన్ చేయించడానికి తీసుకొని వచ్చావా అని రాజ్ పై కావ్య కోప్పడుతుంది. కావ్య కోపంగా అక్కడ నుండి ఆటోలో ఇంటికి వెళ్తుంది. రాజ్ వెనకాలే వెళ్తాడు. కావ్య ఇంటికి వెళ్లి జరిగిందంతా అందరికి చెప్తుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఎందుకు అబార్షన్ అంటున్నావ్ రా అని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. నా బిడ్డ నా ఇష్టం నేను చెప్తున్నాను కదా.. అబార్షన్ చేయించుకోవాల్సిందేనని కావ్యతో రాజ్ అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ బిడ్డపై మీకేంత హక్కు ఉందో నాక్కూడా అంతే ఉందని కావ్య అంటుంది. నాకు అదంతా అవసరం లేదు. రేపు నువ్వు వచ్చి నేను చెప్పినట్టు వింటున్నావ్ అంతే అని రాజ్ వెళ్ళిపోతాడు. మరొకవైపు అసలు ఏం జరుగుతుందోనని రుద్రాణి ఆలోచిస్తుంటే రాహుల్ వస్తాడు. ఇదే మనకి మంచి ఛాన్స్ రాజ్ పై ఇంట్లో అందరికి కోపం కలిగేలా చెయ్యాలని అంటాడు. తరువాయి భాగంలో రాజ్ అసలు విషయం అపర్ణ, సుభాష్ కి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

బాహుబలి మూవీకి 100 కోట్లు ఎందుకు...

  బాలాదిత్య దూరదర్శన్ కాలం నుంచి తెలిసిన నటుడు. ఎన్నో మూవీస్ లో నటించాడు. ముఖ్యంగా "ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం" మూవీలో స్టాంప్ రోల్ లో అందరికీ గుర్తుండిపోయాడు. అలాంటి బాలాదిత్య ఇప్పుడు "శ్రీహరి కళ్యాణం" అనే సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక సుమ తన చాట్ షోలో ఈ సీరియల్స్ యాక్టర్స్ ఐన బాలాదిత్య, షెరీన్ తో కలిసి చిట్ చాట్ చేసింది. అందులో బాలాదిత్య తనకు జరిగిన ఒక పెళ్లిచూపులు విషయాన్నీ షేర్ చేసుకున్నాడు. "ఆ ఆరో, ఏడో పెళ్లి చూపులు..ఆ టైములో నేను ఛాంపియన్ షో చేస్తున్న ఈటీవీలో..ఆ అమ్మాయి ప్రొఫైల్ ని వాళ్ళ అమ్మగారు హ్యాండిల్ చేస్తుంటారు. పెళ్లిచూపులు ఈవెనింగ్ 6 కి అని మెసేజ్ పెట్టారు. సరిగ్గా ఆ టైంకి నా షో వస్తుంది. నేను ఒక కాఫీ షాప్ లో కూర్చున్న. అక్కడ టీవీ ఉంది. అక్కడి వాళ్ళు నన్ను చూసి ఆ షోకె పెట్టారు. కాసేపటికి ఆ అమ్మాయి వచ్చింది. నేను చాల జోవియల్ గా ఉంటుంది అనుకున్నా. కానీ రావడమే మూడీగా వచ్చింది. రాగానే లాప్ టాప్ ఆన్ చేసుకుని హాయ్ నేను పని మధ్యలో రావాల్సి వచ్చింది..అని చెప్పింది. ఒక కాల్ అటెండ్ చేసింది. నేను ఓకే అన్నాను. అప్పుడు నేను మూవీస్ గురించి మీ ఒపీనియన్ ఏమిటి అని అడిగాను. ఐ హేట్ మూవీస్ అంది. మీరు నా ప్రొఫైల్ చూడలేదా అని అడిగాను. అదంతా మా అమ్మ చూసుకుంటుంది అని చెప్పింది. ఆ అమ్మాయి యూఎస్ లో పుట్టి చదుకుని ఇక్కడికి వచ్చింది. జనాలు ఎందుకు మూవీస్ మీద అంత డబ్బును వేస్ట్ చేస్తారో అర్ధం కాదు అంది. ఆ మాటలకు అర్జెంటుగా ఆ షాప్ అతనికి చెప్పి ఆ టీవీ ఆపించాను. అంటే నేను ఫస్ట్ టైం ఒక మనిషితో ఐదు నిముషాలు మాట్లాడాక అర్థమైపోయింది. అవతలి వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా...ప్రొఫెషన్ గురించి తెలుసుకోకుండా మాట్లాడకూడదు అనుకున్న. ఇక ఆ టైములో బాహుబలి మూవీ వస్తోంది. బాహుబలి అనే మూవీ 100 క్రోర్స్ ఎందుకు ఖర్చుబెడుతున్నారండి...అదే టెక్నాలజీ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయరు. టెక్నాలజీ డెవలప్ అవుతోంది కదా  అని అంది. ఓ అని నైస్ మీటింగ్ యు అని చెప్పి బయటకు వచ్చేసాను" అని చెప్పాడు బాలాదిత్య.