'బీబీ 6 కెఫే' హోస్ట్స్.. అరియనా, శివ!
బిగ్ బాస్ బుల్లితెర మీదకు ఎంట్రీ ఇవ్వడానికి ఇంకెంతో సమయం లేదు. బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ షోకి సంబంధించి 'బీబీ కెఫే' అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. దీనికి హోస్ట్స్ గా అరియనా గ్లోరీ, బీబీ నాన్-స్టాప్ ఫేమ్ శివ ఉన్నారు. వీళ్లు ఈ షోకి సంబంధించిన హైలైట్స్ గురించి ఆడియన్స్ కి చెప్పడమే కాదు హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళు. అప్పటివరకు ఆ కంటెస్టెంట్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ని, ఎమోషన్స్‌ని, ఇంకెన్నో నిజాల్ని వాళ్ళ మాటల్లో చెప్పిస్తారు. ఈ బీబీ కెఫేకి సంబంధించిన టీజర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వచ్చిన అరియానా, బీబీ నాన్ స్టాప్ లో మళ్ళీ కంటెస్టెంట్ గా వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5లో హౌస్ లోంచి ఎలిమినేట్ ఐన కంటెస్టెంట్స్ ని 'బీబీ బజ్' పేరుతో ఇంటర్వూస్ చేసింది. ఇక ఇప్పుడు బీబీ సీజన్ 6 కి కెఫె హోస్ట్ గా చేస్తోంది. ఏదైమైనా బీబీ షో ద్వారా అరియనా మంచి ఫేమస్ ఐపోయింది. ఇక ఈ బీబీ కెఫెలో హౌస్ లోని లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ఆడియన్స్ షేర్ చేసుకునే వ్యూస్ కూడా అందించబోతున్నారు అరియనా, శివ. హౌస్ లో ఉండే గాసిప్పులు, గ్రూపింగ్లు, చాటింగ్లు, చీటింగ్లు అన్నిటి గురుంచి వీళ్ళు చెప్తారు. ఈ షో 5 నుంచి రాత్రి 7.30 గంటలకి స్టార్ మా మ్యూజిక్ లో ప్రసారం కాబోతోంది.