Kavya Shree Wild Card Entry: బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డ్స్ ఎవరంటే.. కావ్యశ్రీ ఎంట్రీ నిజమేనా!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై మూడు వారాలు కంప్లీట్ అయి నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ మూడు వారాల్లో ప్రతీరోజు ఏదో ఒక కొత్తదనం కన్పిస్తుంది. అయితే ఇది పెద్దగా హిట్ అవ్వాలని భావించిన బిగ్ బాస్.‌. హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి బయట నెట్టింట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్‌కి మరో సర్‌ప్రైజ్ ఇస్తూ బిగ్‌బాస్ 2.0లో భాగంగా మరో ఐదుగుర్ని హౌస్‌లోకి పంపించబోతున్నారు. ఐదవ వారంలో ఈ ప్రాసెస్ జరగనుంది. ఇప్పటికే రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్), దివ్వెల మాధురి (కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్), సుహాసిని (దేవత సీరియల్ ఫేమ్) .. ఈ ముగ్గురూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కన్ఫమ్ అయ్యారు. తాజాగా ఆ లిస్ట్‌లో కావ్యశ్రీ కూడా చేరింది.  బుల్లితెర ఆడియన్స్‌కి కావ్య గురించి పరిచయం అక్కర్లేదు. గోరింటాకు, చిన్ని సహా ఎన్నో సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది కావ్య. అలానే బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ మలియక్కల్-కావ్య ఒకప్పుడు రిలేషన్‌లో కూడా ఉన్నారు. వాళ్ల ప్రేమ, బ్రేకప్ గురించి కూడా ప్రేక్షకులకి తెలుసు. కావ్యని సీజన్-9కి తీసుకురావాలని బిగ్‌బాస్ టీమ్ చాలా ప్రయత్నించింది. కానీ కావ్య దీనికి ఒప్పుకోలేదని టాక్.  అయితే చివరికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చేందుకు కావ్య ఓకే చెప్పిందట. ఇప్పుడు కావ్య వస్తుందని తెలియగానే నిఖిల్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నిఖిల్ కప్పు కొట్టడంలో కావ్య గురించి హౌస్‌లో చేసిన కామెంట్లు, ఎమోషన్ కూడా ఒక కారణం. అయితే హౌస్‌లో ఒకలా బయటికొచ్చాక ఒకలా కావ్య గురించి నిఖిల్ కామెంట్లు చేశాడు. దీంతో కావ్య కూడా పలు షోలలో నిఖిల్ గురించి ఇండైరెక్ట్ కామెంట్లు చేసింది. మరి ఇప్పుడు హౌస్‌లోకి వస్తే నిఖిల్ గురించి కావ్య ఎలా మాట్లాడుతుందో.. తమ బ్రేకప్ గురించి ఏం చెప్తుందో చూడాలి మరి.

Rithu Chowdary love Story: రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే మూడు వారాలు పూర్తయింది. ఈ మూడు వారాల్లో ఒకరు సెలెబ్రిటీ ఎలిమినేట్ అవ్వగా.. ఇద్దరు కామనర్స్ ఎలిమినేషన్ అయ్యారు. అయితే నిన్నటి సండే ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి షాకిచ్చాడు నాగార్జున. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైమ్.. మీకు ఉన్న ఫ్యాన్స్‌ నుంచి కొశ్చన్స్ తెప్పించి.. మీ ఆటతీరు మార్చడానికి చేసే ప్రయత్నం ఇది అంటూ నాగార్జున అన్నాడు‌. ఇక అక్కడ ఉన్న ఆడియన్స్‌తో వాళ్లు చెప్పేది జెన్యూన్ ఆన్సర్ అనుకుంటే యస్ నొక్కండి లేదనుకుంటే థంబ్స్ డౌన్ నొక్కండి అని ఆడియన్స్ కి నాగార్జున చెప్పాడు. ముందుగా రీతూ చౌదరికి వచ్చిన ప్రశ్నని నాగార్జున అడిగాడు. మీరు మీ గేమ్ కన్నా డీమాన్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నారని నాగార్జున అనగా.. నా గేమ్ నేను ఆడుతున్నాను కానీ పవన్‌తో నాకు ఒక ఎఫెక్షన్, ఫ్రెండ్లీ బాండ్ ఉంది అంతే అంటూ రీతూ సమాధానమిచ్చింది. కానీ రీతూ ఆన్సర్‌కి 35 పర్సంట్ యస్.. 65 పర్సంట్ థంబ్స్ డౌన్.. ఇచ్చారు ఆడియన్స్. తర్వాత సుమన్ శెట్టితో మీ మాటల్లో ఉన్నంత పంచ్ గేమ్‌లో ఎందుకు లేదని నాగార్జున అడిగాడు. గేమ్ విషయంలో కానీ టాస్క్ విషయంలో కానీ నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను సర్.. అని సుమన్ ఇచ్చిన ఆన్సర్‌కి 81 పర్సంట్ థంమ్స్ అప్.. 19 పర్సంట్ డౌన్ వచ్చింది. ఇక కామనర్లు అందరిని కలిపి మిమ్మల్ని ఓట్లేసి బిగ్‌బాస్ హౌస్‌కి పంపించింది గొడవలు వేసుకోవడానికా అంటూ నాగార్జున ఫైర్ అయ్యాడు. అందరికీ కొన్ని గేమ్స్ పెట్టారు. అందులో ఒక గిఫ్ట్ గెలిచిన డీమాన్‌ని అది ఎవరికిస్తావ్ నీ టీమ్‌లో అని నాగార్జున అడిగారు. డీమాన్ స్ట్రయిట్‌గా వెళ్లి రీతూ చేతిలో ఆ గిఫ్ట్ పెట్టాడు. ఏదో గొడవపడినందుకు ఇచ్చినట్లున్నాడు.. అని నాగ్ డైలాగ్ వేశాడు. దీంతో రీతూ మరోసరి క్లారిటీ ఇచ్చింది. నాకు డీమాన్ అంటే జెన్యూన్ ఎఫెక్షన్, జెన్యూన్ కేరింగ్ ఉంది.. అని రీతూ చెప్పింది. ఎఫెక్షన్ చూపించడం కోసం నీకు ఇప్పుడు ఒక గిఫ్ట్ గెలుచుకొని మరీ ఇచ్చాడని నాగార్జున. ఆ తర్వాత అందరికి కొన్ని గేమ్స్ పెట్టారు. అందులో ఒక గిఫ్ట్ గెలిచిన డీమాన్‌ని అది ఎవరికిస్తావ్ నీ టీమ్‌లో అని నాగార్జున అడిగారు. డీమాన్ స్ట్రయిట్‌గా వెళ్లి రీతూ చేతిలో ఆ గిఫ్ట్ పెట్టాడు. ఏదో గొడవపడినందుకు ఇచ్చినట్లున్నాడని నాగార్జున అన్నాడు. దీంతో రీతూ మరోసారి క్లారిటీ ఇచ్చింది. నాకు డీమాన్ అంటే జెన్యూన్ ఎఫెక్షన్, జెన్యూన్ కేరింగ్ ఉందని చెప్పింది. ఎఫెక్షన్ చూపించడం కోసం నీకెప్పుడు ఒక గిఫ్ట్ గెలుచుకొని మరీ ఇచ్చాడని నాగార్జున అన్నాడు. ఇక తన మోహం వాడిపోయింది. 

Bigg boss 9 Telugu : ఆ నలుగురికి షాక్ ఇచ్చిన ప్రియా శెట్టి.. కొమ్ములు ఎవరికి వచ్చాయంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం అందరు ఊహించినట్టుగానే ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. అయితే తను ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ అంతా గత రెండు వారాలుగా నిరీక్షిస్తున్నారు. ఎట్టుకేలకి వారి కల నెరవేరింది. అరుంధతి సినిమాలో పశుపతి వాళ్ళ అమ్మ.. ' బిడ్డకు విడుదల'  అన్నట్టుగా ప్రియా శెట్టి బయటకొచ్చేసింది.  హౌస్ లో అందరు ఉన్నప్పుడు నాగార్జున ఎవరి గేమ్ ఎలా ఉందని అడిగినప్పుడు.. అక్కడి ఆడియన్స్ ప్రియాకి 20% ఇచ్చారు. అంటే అసలు హౌస్ లో తను ఉండటం ఎవరికి ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే ప్రతీ దానికి నోరేసుకొని పడిపోతుంది. అనవసరమైన వాటిల్లో దూరిపోవడం, టాస్క్ లలో అసలు కన్పించకపోవడం.. ఇలా తనకి అన్నివైపుల నుండి నెగెటివ్ వచ్చేసింది. సండే ఎపిసోడ్ లో ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చేసింది. ‌తను వచ్చీ రాగానే తన జర్నీ వీడియో చూపించాడు నాగార్జున. అది చూసి ప్రియా కాస్త ఎమోషనల్ అయిన ప్రౌడ్ గా ఉందని నవ్వుతూ చెప్పింది. ఇక హౌస్ మేట్స్ ఎవరు ఎలా ఉన్నారంటూ ప్రియా చెప్పింది. అందరితో తన బాండింగ్ చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఒక ముగ్గురికి హార్న్(కొమ్ములు) ఇచ్చి వారి గురించి చెప్పమని ప్రియని నాగార్జున అడిగాడు.  దాంతో ఫస్ట్ హార్న్(కొమ్ములు) హరీష్‌కి ఇచ్చింది. ఎవరైనా మీది తప్పంటే మీరు అసలు వినరండి.. ఫస్ట్ అందరి పర్ స్పెక్టివ్ వినండి.. అందరితో కలవండి అంటూ ప్రియ సలహా ఇచ్చింది. ఆ తర్వాత మా మమ్మీ తనూజకి ఇస్తున్నానని చెప్పింది. తను చాలా మంచిది నాకు ఒక్కటే ఉంది... అలగకు.. దానికి మించి ఏం లేదు.. నీ హగ్స్ మిస్ అవుతానంటూ ప్రియ ఎమోషనల్ అయింది. ఆ తర్వాత బాబాయ్ భరణి.. సిల్లీ రీజన్స్‌కి అందరిని నామినేట్ చేయకండి బాబాయ్.. నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్.. మీ గేమ్ బాగా ఆడుతున్నారు.. రైట్ మూవ్స్ చేస్తున్నారు.. ఎప్పుడు ఏం చేయాలో.. ఎవరిని ఎలా చేయాలో చేస్తున్నారు.. సూపర్ గేమ్.. నెక్స్ట్ లెవల్.. కానీ కొంచెం అందరితో బావుండండి అంటూ ప్రియ చెప్పింది. ఇక ఎవరికి ఇవ్వాలనుకోవడం లేదని ప్రియ అంది. ఇక ఎవరు లేరని నాగార్జునతో చెప్పిన ప్రియా.. తన ముగ్గురు ఫ్రెండ్స్ తో బాండింగ్ గుర్తుచేసుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి కొమ్ములు పెట్టుకోమంది. ఎందుకంటే ఫ్రెండ్స్‌ని చేసుకోవడం తప్పు కాదు కానీ ఫ్రెండ్స్‌యే నీ గేమ్ అయిపోయారు నీకు.. నేను టాప్-3లో టాప్-1లో నువ్వుండాలి అంతే అంటూ ప్రియ చెప్పింది. ఇక ప్రియా వెళ్తూవెళ్తూ ఇమ్మూ మిస్ యూ అంటూ చెప్పింది. రేపటి నుండి ప్రతీరోజు నన్ను గుర్తుచేస్తుంటా టీవీలో చూడమంటూ ప్రియాతో ఇమ్మాన్యుయేల్ అన్నాడు.

Priya Shetty Elimination: ప్రియా శెట్టి ఎలిమినేషన్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్!

బిగ్ బాస్ సీజన్-9 మూడు వారాలు పూర్తయింది. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. మూడో వారం ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఉన్నారు.  ఇక నిన్నటి సండే ఫన్ డే ఎపిసోడ్ లో భాగంగా హోస్ట్ నాగార్జున సెలెబ్రిటీస్ తో వచ్చాడు. స్టార్ బాయ్ సిద్దూ కొత్త మూవీ ' తెలుసు కదా'.. అతని మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. ఇక వారితో గేమ్స్ ఆడించాడు. వీటితో పాటు నామినేషన్లో ఉన్న ఐదుగురిలో నుండి ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి డేంజర్ జోన్‌లో ప్రియ, పవన్ కళ్యాణ్ మిగిలారు. ఇక వీరిద్దరిని నాగార్జున యక్టివిటీ ఏరియాకి పిలిచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలెట్టాడు. దసరా కావడంతో సింహం బొమ్మని వీళ్ల మధ్యలో పెట్టి.. ఆ సింహం ఎవరివైపు చూసి గర్జిస్తుందో వాళ్లు సేఫ్.. అవతలి వాళ్ళు ఎలిమినేట్ అని నాగ్ చెప్పాడు. అయితే ఈ ప్రాసెస్ మొదలుకాగానే కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే వారి మధ్య అగ్నిపరీక్ష నుండి బాండింగ్ ఉంది. చివరికి కళ్యాణ్ వైపు చూసి సింహం గర్జించడంతో ప్రియ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించారు. ప్రియ ఎలిమినేట్ కాగానే కళ్యాణ్ వెళ్లి పట్టుకొని ఎమోషనల్ అయిపోయాడు. వద్దు నువ్వు వెళ్లొద్దు.. ఉండిపో అంటూ కళ్యాణ్ తెగ ఏడ్చాడు. ఇక హౌస్ మేట్స్ అంతా ఏడ్చేశారు. ప్రియా శెట్టి హౌస్ నుండి ఎలిమినేషన్ అయింది.

Bigg Boss 9: సంజన కోసం ఎవరెవరు త్యాగం చేశారంటే..?

  బిగ్ బాస్ సీజన్-9 లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ ఎవరంటే సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మిడ్ వీక్ ఎలిమినేట్ సంజన అయిందని అనగానే అందరు షాక్ అయ్యారు. రీ ఎంట్రీ ఉంటుందని తెలిసి కూడా ఏదో మూల ఎలిమినేట్ అవుతుందేమోనన్న భయం లేకపోలేదు.   అయినా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి హౌస్ మేట్స్ కొంతమందిని కొన్నిటిని త్యాగం చేయమన్నప్పుడు.. చేశారు. తనూజ కాఫీ త్యాగం చేసింది. ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేసాడు. ఇక భరణి అయితే ఒక్క నిమిషం ఆలోచించకుండా తన సెంటిమెంట్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాడు. సంజనని ఎలిమినేట్ చెయ్యడానికి డిసైడ్ అయినప్పుడు తన వంతు తన పాయింట్స్ చెప్పి తను బయటకు వెళ్ళడానికి ఒక రీజన్ అయ్యాడు. సంజన స్టేజ్ పై ఉన్నప్పుడు భరణి లేచి.. మిస్ యూ సంజన అంటాడు. మీరే బయటకు పంపారు కదా అని నాగార్జున సంజన అనగానే భరణి సైలెంట్ అవుతాడు. అది రీగ్రేట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ సంజన లోపలికి రావడానికి భరణి కారణం అయ్యాడు.   రీతూ ఎప్పుడు అందంగా ఉండాలంటూ నీట్ గా రెడీ అవుతూ అందరి దృష్టిలో పడాలని, స్క్రీన్ స్పేస్ రావాలని పరితపిస్తుంది. ఇక సంజన కోసం తన జుట్టు త్యాగం చేస్తుంది. ఒకవైపు ఏడుస్తునే త్యాగం చేసింది. సంజన లోపలికి వచ్చాక ఏదైనా ఒక వీక్ కాకపోతే ఇంకొక వీక్ సంపాదించుకుంటాం కానీ జుట్టు ఆరు నెలలు టైమ్ పడుతుంది థాంక్స్ అని రీతూ ని హగ్ చేసుకుంటుంది. ఇక సంజన కోసం సుమన్ స్మోక్ చేయకుండా ఉండలేనని ఖచ్చితంగా చెప్పేసాడు. అది తన ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ మెంట్ లాగే ఉంటుంది. సంజన కోసం త్యాగం చేసిన వాళ్ళందరూ తనతో వచ్చిన సెలబ్రిటీస్ మాత్రమే హెల్ప్ చేశారు. ఇకమీద సంజన ఎవరితో ఎలా ఉంటుందో చూడాలి మరి‌.  

రూమ్ లో సీక్రెట్ కెమెరా.. ‌వీరు బండారం బయటపడుతుందా?

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -69 లో... లాయర్ వచ్చి.. రుద్ర గారు ఏ తప్పు చెయ్యలేదు కానీ ఇంకెవరో ఇందులో ఉన్నారని చెప్తాడు. అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడున్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలని గంగ సలహా ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావని తనపై‌ వీరు కోప్పడతాడు. గంగ చెప్పింది నిజమేనని రుద్ర అక్కడ నుండి బయలుదేర్తారు. రుద్ర సర్ నా మాటకి చాలా విలువ ఇస్తాడు. ఎంతైనా రాజకుమారుడు కదా అని గంగ అనుకుంటుంది.    మరొకవైపు రౌడీలకి వీరు ఫోన్ చేసి.. మీ దగ్గరికే రుద్ర వస్తున్నాడని చెప్తాడు. అప్పుడే రుద్ర రౌడీ దగ్గరికి వస్తాడు. మీ వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు.. అసలు ఆ సూర్య ఎక్కడ ఉన్నాడని రౌడీలని రుద్ర కొట్టగా హాస్పిటల్ లో కోమాలో ఉన్నాడని చెప్తారు. రుద్రని రౌడీలు సూర్య దగ్గరికి తీసుకొని వెళ్తారు. కోమాలో ఉన్న అతన్ని రుద్ర కొడతాడు. రౌడీలు డాక్టర్ ని పిలిచి కొడుతున్నాడని చెప్తాడు. ఇలా మీరు రావడం కరెక్ట్ కాదని డాక్టర్ అంటాడు. రుద్ర తమ్ముడు సూర్య ఉన్న రూమ్ లో కెమెరా పెడతాడు.   మరొకవైపు రుద్ర మాజీ లవర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది గంగ. ఇప్పుడు రుద్ర సర్ తప్పు చెయ్యలేదని తెలిస్తే తనని వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వస్తారు కదా అని ప్రీతీ వాళ్ళతో గంగ అంటుంది. అయినా రుద్ర అన్నయ్య ఒప్పుకోడని ప్రీతీ అంటుంది. ఆవిడ ఎలా ఉంటుందని గంగ అడుగుతుంది మాకు తెలియదని వాళ్ళు అంటారు. అన్నయ్య తన జ్ఞాపకాలు అన్ని స్టోర్ రూమ్ లో పెట్టారని చెప్పగానే గంగ చూడాలని అనుకుంటుంది. పెద్దసారు గంగ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావ్ కదా అంటాడు.    తరువాయి భాగంలో రుద్ర ఇంకా, తన తమ్ముడు కలిసి సూర్య రూమ్ లో పెట్టిన వీడియో కెమెరా చూస్తారు. ఇప్పుడు కచ్చితంగా ఎవరైతే ఇదంతా చేస్తున్నారో వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారని రుద్ర, తన తమ్ముడు అనుకుంటారు. అంతలో కోమాలో ఉన్న సూర్య దగ్గరికి వీరు వస్తాడు. అయితే దీని వెనకాల ఉండి నడిపిస్తుంది వీరు అని షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9: హరీష్, రాముని ఏకిపారేసిన నాగార్జున!

  బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. హౌస్ మేట్స్ చేసిన త్యాగాలతో సంజన హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చెప్తూ వచ్చాడు. శ్రీజ నువ్వు సంచాలక్ గా వున్నప్పుడు క్లారిటీగా డెసిషన్ తీసుకోవాలి కదా అని చిన్న క్లాస్ తీసుకున్నాడు.   ఇక ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కి గట్టిగానే ఇచ్చుకున్నాడు. లత్కోర్ అంటే తప్పు కాదు.. అతను అంటే తప్ప అని దానికి సంబంధించిన వీడియోని చూపిస్తాడు. సరే సర్ ఇక అలాంటి పదాలు కాకుండా డీసెంట్ గా మాట్లాడుతానని హరీష్ చెప్తాడు. ఆ తర్వాత రాము రాథోడ్ ని.. నువ్వు మాట మారుస్తున్నావని అంటాడు. సంజన ఇలా అందని తనూజతో వెళ్లి చెప్పడం.. మళ్ళీ అలా అనలేదని చెప్పడం.. అలా చేయోద్దు.‌ ఒక మాట మీదనే ఉండాలని దానికి సంబంధించిన వీడియోని చూపించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌‌‌ ని.‌. నువ్వు అసలు ఎక్కడ కన్పించడం లేదు.. నువ్వు ఆట ఆడకపోతే నా పక్కన ఉంటావని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.   ఆ తర్వాత ఇందాక బ్రేక్ లో తనూజ టీ పెట్టమంది.. నేను పెట్టనని చెప్పాను సర్‌‌‌‌.‌ ఎందుకు అంటే నేషనల్ టెలివిజన్ ముందు నేను నీట్ గా లేనని సంజన చెప్తే హౌస్ మేట్స్ ఎవరు నా కోసం స్టాండ్ తీసుకోలేదు.. అదేం లేదు బాగా వండుతున్నాడు.. హైజీన్ మేన్టైన్ చేస్తున్నాడని సపోర్ట్ చెయ్యలేదని హరీష్ అంటాడు‌. అలా నీకు స్టాండ్ తీసుకునేలా నువ్వు మారాలని అటు తిరిగి.. ఇటు తిరిగి హరీష్ నే అంటాడు నాగార్జున.  

నాన్నకి తెలియకుండా డబ్బులు తీసిన కొడుకు.. నిజం తెలుస్తుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -275 లో... విశ్వ గురించి అమూల్యతో శ్రీవల్లి చెప్తుంటే ప్రేమ వస్తుంది. అమూల్య కాలేజీకి వెళ్ళాక ఏం చేస్తున్నావ్.. ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతున్నావ్.. మా అన్నయ్య మంచోడు అంటున్నావ్.. ఏం చేస్తున్నావని శ్రీవల్లిని ప్రేమ అడుగుతుంది. నేనేం చెయ్యట్లేదని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.   మరొకవైపు నర్మద ఆఫీస్ కి వెళ్తుంటే వేదవతి అన్ని పనులు చెప్తుంది. నీకు ప్రమోషన్ వచ్చింది కదా నువ్వు ఏమైనా మారిపోయావా అని టెస్ట్ చేస్తున్నానని వేదవతి అంటుంది. నర్మద బయటకు వెళ్లి, నేను ప్రమోషన్ వచ్చాక మొదటి రోజు ఆఫీస్ కి వెళ్తున్నానని రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నేను మిల్ కి రాను.. నర్మదని డ్రాప్ చేస్తానని సాగర్ అనగానే అదేంటీ వీడికి ఇంత దైర్యం వచ్చిందని తిరుపతి అనుకుంటాడు.   మరొకవైపు ధీరజ్ దగ్గరికి చందు వస్తాడు. డబ్బు తీసుకొని తిరిగి ఇచ్చేస్తాడు. ఇవి నాన్న డబ్బు వెంటనే తన అకౌంట్ కి పంపాలని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కామాక్షి తన లక్ష రూపాయలు కావాలని రామరాజు దగ్గరికి వస్తుంది. రామరాజు మేనేజర్ కి ఫోన్ చేసి పంపమంటాడు. మరొక వైపు రామరాజు అకౌంట్ లో డబ్బు వెయ్యడానికి ధీరజ్ వస్తాడు. అప్పుడే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మీ అల్లుడు అకౌంట్ కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసానని మేనేజర్ చెప్తాడు. ఇంకా అందులో ఎంత ఉన్నాయో చెప్పండి అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Bigg Boss 9: సంజన కోసం త్యాగాలు చేసిన హౌస్ మేట్స్.. రీఎంట్రీ అదుర్స్!

  బిగ్ బాస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఇస్తున్నాడు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగార్జున స్టేజ్ పైకి రాగానే సంజనని తీసుకొని వస్తాడు. కంటెస్టెంట్స్ తో మాట్లాడి బై చెప్పి పంపిస్తు.. ఒక్క నిమిషం అంటూ వెనక్కి పిలుస్తాడు. నువ్వు మళ్ళీ హౌస్ లోకి  రీఎంట్రీ ఇవ్వాలంటే.. హౌస్ మేట్స్ కొందరు కొన్ని త్యాగం చెయ్యాలని నాగార్జున చెప్తాడు. మీకు బ్యాటరీ పర్సెంట్ జీరో ఉంది.. అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని నాగార్జున చెప్తాడు.   అందుకు ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్సీ వదులుకోవాలని నాగార్జున చెప్తాడు. నాగార్జున ఇంకా కంప్లీట్ చెయ్యకముందే ఇమ్మాన్యుయల్ తన చేతికి ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేస్తాడు. అందరు క్లాప్స్ కొడతారు. దాంతో ట్వింటీ ఫైవ్(25) పర్సెంట్ బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ చీటీలో తనూజ ఉన్నన్ని రోజులు కాఫీ తాగొద్దని ఉంటుంది. అందుకు తనూజ చాలాసేపు ఆలోచించి ఒప్పుకుంటుంది. ఇక బ్యాటరీ ఫిఫ్టీ(50) పర్సెంట్ వస్తుంది. ఆ తర్వాత శ్రీజ తన బట్టలన్నీ త్యాగం చెయ్యాలని ఆ చీటీలో ఉంటుంది‌. అందుకు శ్రీజ ఒప్పుకోదు. ఆ తర్వాత రీతూకి హెయిర్ కట్ చేసుకోవాలని ఉంటుంది. అందుకు రీతూ ఒప్పుకొని హెయిర్ కట్ చేసుకుంటుంది. అందుకు సెవెంటీ ఫైవ్(75) పర్సెంట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నన్ని రోజులు సిగరెట్ త్యాగం చెయ్యాలని ఆ చీటీలో ఉంటుంది. కానీ అందుకు సుమన్ శెట్టి ఒప్పుకోడు. ఆ తర్వాత చివరి అవకాశంగా భరణి తన గిఫ్ట్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాలనగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా భరణి ఆ బాక్స్ ని పెట్టేస్తాడు. దాంతో బ్యాటరీ హండ్రెడ్(100) పర్సెంట్ అవుతుంది. ఇక సంజన హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వస్తుంది.   భరణి తన గిఫ్ట్ బాక్స్ లేకుండా అసలు హౌస్ లోకి వెళ్ళనన్న వాడు ఇప్పుడు సంజన కోసం అంత త్యాగం చేసాడు. నీ కోసం త్యాగం చేసిన వాళ్ళని మర్చిపోకని  సంజన తో నాగార్జున చెప్తాడు. ఇక కాసేపటికి సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అందరు వచ్చి సంజనని హగ్ చేసుకుంటారు. ఒక్క హరీష్ మాత్రం రాడు.. సంజన కూడా అతని దగ్గరికి వెళ్ళదు. ఇక సంజన గేమ్ మొదలవ్వనుందని బిబి ఆడియన్స్ అనుకుంటున్నారు.  

Karthika Deepam 2 : జ్యోత్స్నకి సుమిత్ర వార్నింగ్.. ఏంటి సొంత తమ్ముడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -474 లో... నిద్రపోతున్న కాశీ దగ్గరికి స్వప్న వచ్చి.. నిద్ర లేపుతుంది. జాబ్ గురించి అలోచించి ఇందాకే పడుకున్నానని కాశీ అనగానే.. ఆలోచిస్తూ ఉంటే జాబ్ వస్తుందా? ప్రయత్నం చెయ్యాలని స్వప్న అంటుంది. అదంతా శ్రీధర్, కావేరి వింటారు. ఇప్పుడు అల్లుడు జాబ్ లేదన్న ఫీలింగ్ లో ఉన్నాడు. తనకి సపోర్ట్ గా ఉండాలి తప్ప.. ఇలా మాట్లాడకూడదని స్వప్నకి చెప్పమని కావేరీతో శ్రీధర్ అంటాడు. కార్తీక్ చూడు అన్నీ వదిలేసినా కూడా మళ్ళీ మంచి పొజిషన్ కి వచ్చాడని శ్రీధర్ అంటాడు. అది విన్న కాశీ.. అంటే నేను ట్రై చెయ్యడం లేదా అని శ్రీధర్ ని తప్పుగా అర్థం చేసుకుంటాడు.    మరొక వైపు దీప, దశరథ్ ల మాటలు సుమిత్ర, జ్యోత్స్న వింటారు. చూసావా మమ్మీ డాడ్ దగ్గరికి వెళ్లి ఎలా మాట్లాడుతుందో.. తనని ఇంట్లో నుండి పంపించమని జ్యోత్స్న అంటుంది. దీప మాట్లాడిన దాంట్లో తప్పేముందని సుమిత్ర అంటుంది. తప్పు చేసింది నేను.. నేను తప్పు చేసాను అని మీ నాన్నకి తెలుసు కానీ, ఆ తప్పు చెయ్యడానికి కారణం నువ్వేనని తెలిస్తే అప్పుడు మీ నాన్న రియాక్షన్ ఎలా ఉంటుంది. నువ్వు ఈ చాడీలు చెప్పడం మానేసి, మీ తాతయ్య చెప్పినట్టు విను అని జ్యోత్స్నకి సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది.   మరొకవైపు శ్రీధర్ దగ్గరికి తన రిలేటివ్స్ కార్డ్ ఇవ్వడానికి వస్తారు. శ్రీధర్ గురించి తన కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడతారు. మరొకవైపు గ్రానీ కోపం పోగొట్టాలని కాశీకి జాబ్ ఇప్పిస్తాను.. ఎంతైనా నా సొంత తమ్ముడు కదా అని పారిజాతంతో జ్యోత్స్న అనగానే.. ఏంటి సొంత తమ్ముడా అని కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న, పారిజాతం కలిసి డైవర్ట్ చేస్తారు.  

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ హరీష్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సంజన!

  బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం వీకెండ్ వచ్చేసింది. గత రెండు రోజుల నుండి హాట్ టాపిక్ ఏదంటే.. సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్ అని, తను హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని అన్నారు. మొదట సీక్రెట్ రూమ్ అన్నారు.. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉహించుకున్నారు. కానీ నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రావడంతోనే సంజన స్టేజ్ పైకి వచ్చేసింది. ఇక తను స్టేజ్ మీదకి వచ్చి.. నేను ఎలిమినేట్ అయ్యేంత ఏం తప్పు చేశానని ఎమోషనల్ అవుతుంది.   ఈ స్టేజ్ వదిలి వెళ్లే ముందు నీ హౌస్ మేట్స్ తో మాట్లాడుదామని నాగార్జున అంటాడు. మన టీవీలో అందరిని సంజన చూస్తుంది. అందరి గురించి చెప్పమని నాగర్జున అంటాడు. ఎవరు ఏది మార్చుకోవాలో ఒక్క మాటలో చెప్పమని సంజనని అడుగుతాడు. దాంతో సంజన అందరి గురించి చెప్తుంది. సుమన్ అన్న కన్పించడం లేదు‌‌.. దేనికి స్టాండ్ తీసుకోరు అని సంజన చెప్తుంది. ఇక రాము పై సంజన సీరియస్ అవుతుంది. ఏంట్రా నేను అందరిని చిన్నస్థాయి, పెద్దస్థాయి అని చూస్తానా.. నేను ఎవరినైనా అలా చూసానా.. హరీష్ గారితో ఏదో అంటున్నావ్ చీప్ గా బెహేవ్ చేస్తానని సంజన అనగానే.. నేను అనలేదని రాము అంటాటు. రికార్డు ఉందని సంజన చెప్తుంది.   ఇక హరీష్ గారు నాలుగు రోజుల నుండి ఒకే డ్రెస్ పై ఉన్నారు. హైజీన్ గా లేరని సంజన అంటుంది. తనతో ఏదైనా చెప్దాం అన్నా కూడా అందరు భయపడుతున్నారు. ఏమని చెప్పమంటారు సర్ మా బాధ అని సంజన అంటుంది. ఇక  ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతాడు. తనతో ఉంటే మా అమ్మతో ఉన్నట్లే ఉంటుంది సర్ ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. ఇక సంజన అందరికి బై చెప్పి వెళ్లిపోతుంటే.. సంజన ఒక్క నిమిషం అని నాగార్జున వెనక్కి పిలుస్తాడు.  

Brahmamudi: పాలల్లో అబార్షన్ ట్యాబ్లెట్ కలిపిన భర్త.. భార్య తాగుతుందా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -837 లో... కావ్యకి నిజం తెలిసినట్లు, తను కళ్ళు తిరిగిపడిపోయినట్లు రాజ్ ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఈ విషయం కావ్యకి తెలియొద్దనుకుంటాడు. అసలు ఎందుకు రాజ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడోనని ఇంట్లో అందరు ఆలోచిస్తారు. రాజ్ కి అర్థమయ్యేలా చెప్తాను.. తన నిర్ణయం మార్చుకోవాలని రాజ్ ని రిక్వెస్ట్ చేస్తానని రాహుల్ ఇంట్లో వాళ్ళతో అంటాడు. థాంక్స్ రాహుల్ నువ్వైనా నా చెల్లి బాధని అర్థం చేసుకున్నావని స్వప్న అంటుంది.   ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పండి అని రాజ్ ని కావ్య అడుగుతుంది. నువ్వు మొన్న నేను చెప్పినట్టు వింటానని మాటిచ్చావని రాజ్ అంటాడు. మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. రాజ్ నువ్వు చేస్తుంది తప్పు.. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకోమని రాజ్ తో రాహుల్ అంటాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు కావ్య అని రాజ్ అంటాడు. నేను ఇందుకు ఒప్పుకోనని కావ్య అంటుంది. అయితే నీకు నేను కావాలో, నీ బిడ్డ కావాలో తేల్చుకోమని రాజ్ అనగానే.. నాకు నా బిడ్డనే కావాలని కావ్య అంటుంది.    తరువాయి భాగం లో కావ్య తాగే జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలుపుతాడు రాజ్. కావ్య అది తాగుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. అసలు కళ్యాణ్ ఎంట్రీ ఎపిసోడ్ క్లైమాక్స్ చూపించారంటే కళ్యాణ్ ఏదో చెప్పడానికి వచ్చాడు కాబోలు రిపోర్ట్స్ వదినవి కావు అని చెప్తే రాజ్ పరిస్థితి ఏంటి.. ఇక కావ్య దృష్టిలో రాజ్ విలన్ అన్నమాట. మరి ఈ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.  

Sanjana Mid week Elimination: సంజన మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆడియన్స్ కి షాకిచ్చిన బిగ్‌బాస్!

  బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇది ఒక సూపర్ ట్విస్ట్.. అది సీజన్-9 లోనే జరిగింది. అదేంటంటే మూడో వారంలో మిడ్ వీక్ అర్థరాత్రి డేంజర్ బెల్స్ కొట్టి హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరిని లేపి.. సంజనని బయటకి పంపించేశాడు బిగ్ బాస్. ఇక ఆ తర్వాత అందరు ఎమోషనల్ అయ్యారు. అయితే కొంతమంది మాత్రం సీక్రెట్ రూమ్ అని అనుకున్నారు.  నిన్న మొన్నటి దాకా సంజన సీక్రెట్ రూమ్ లో ఉంటుందని అనుకున్నారు కానీ తను ఎలిమినేషన్ అయ్యింది. తాజాగా రిలీజ్ చేసిన సెకెండ్ ప్రోమోలో .. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటు వీడియోని వదిలాడు బిగ్ బాస్ మామ. దాంతో ఆడియన్స్ కి ఒక్కసారిగా బుర్రపాడు.  ప్రోమోలో ఏం ఉందో ఓసారి చూసేద్దాం..  స్టేజ్ మీద ఉన్న నాగార్జున దగ్గరికి ఎలిమినేషన్ అయి సంజన వచ్చేస్తుంది. నేను ఎలిమినేషన్ అయ్యేంతగా ఏం బ్యాడ్ చేశాను సర్ అని సంజన అంటుంది. ఒక్కసారి అయితే బాగుంటది కానీ అన్నిసార్లు అదే చేస్తే వాళ్లకి కూడా ఇరిటేషన్ ఉంటుందని నాగార్జున అన్నాడు. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పమని సంజనని అడిగాడు నాగార్జున. సుమన్ శెట్టికి స్టాండ్ లేదని, అర్థం చేసుకోడని సంజన అంటుంది. శ్రీజ మార్చుకోవాల్సిందేంటి సంజన అని నాగార్జున అనగానే.. వన్ థౌజెండ్ పర్సెంట్(1000%) ఆర్గుమెంట్స్ నుండి త్రీ హండ్రెడ్  పర్సెంట్(300%) ఆర్గుమెంట్స్ కి ఇప్పుడు దిగారు అని శ్రీజ గురించి సంజన అంది. ఇక భరణి లేచి.. మిస్ యూ సంజన గారు అనగానే.. అదేంటి బయటకు వెళ్ళడానికి నువ్వే కదా ఓటేశావని నాగార్జున ఫిట్టింగ్ పెట్టాడు. అన్న, చెల్లి వద్దు.. ఎప్పుడు గొడవ జరిగిందో అప్పుడు మాట్లాడాలని భరణి గురించి సంజన అంది.   ఇక హరీష్ గురించి సంజనని చెప్పమనగానే తన భాదని చెప్పుకుంది. ఏది మాట్లాడినా గొడవకి వచ్చేస్తాడు. తనే ఫైనల్.. తన మాటే వినాలి.. తను ప్రైమ్ మినిస్టర్ అని అనుకుంటామో.. తనతో బ్రతకలేమో సర్, తను ఒక్కమాట కూడా ఆక్సెప్ట్ చేయలేం మనం.. అంటు సంజన చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కొక్కరి గురించి సంజన చెప్పగానే.. ఎలిమినేషన్ అంటు బయటకు పంపించేశాడు నాగార్జున. మరి ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu Promo : లత్కోర్ హరీష్ .. మాస్క్ మ్యాన్ పై నాగార్జున ఫైర్!

  వచ్చేసింది.. వచ్చేసింది.. బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది.. కానీ ఈ సారి కాస్త త్వరగా రిలీజ్ చేశాడు బిగ్ బాస్ ఎడిటర్ మావ. ప్రతీ వారం ఎప్పుడో అయిదు ఆరుగంటలకి వచ్చే ప్రోమో.. లంచ్ బ్రేక్ ముందే రిలీజ్ చేశాడు.  బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం వీకెండ్ ప్రోమో వచ్చేసింది. మూడో వారం హౌస్ లో ఏం జరిగిందో కనుక్కుందామంటూ మొదలెట్టాడు నాగార్జున. వచ్చీ రాగానే రీతూకి క్లాస్ పీకాడు. నా లక్ బాలేదంటవ్ ఎందుకమ్మా అంటావని రీతూని అడిగాడు. ఆ తర్వాత ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్నాం కదా దాని మీద ఎవరు ఉండట్లేదెందుకని క్లాస్ పీకాడు. సంఛాలక్‌గా ఏం చేశావమ్మా అని శ్రీజని నాగార్జున అడుగగా.. కరెక్ట్‌గానే చేశాను సర్ అని గట్టిగానే సమాధానం చెప్పింది. కరెక్ట్‌గా చేశానని నువ్వు అనుకుంటే సరిపోద్దా అని నాగ్ అనేశాడు. కౌంటర్ ఇచ్చారు నాగార్జున. బిగ్ బాస్ చెప్పినట్టే చేశాను సర్ అని శ్రీజ అంది. అసలు నువ్వు చేసిన పని వల్ల గేమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యిందన్నాడు.  మన మాస్క్ మ్యాన్ హరీష్ నిల్చోబెట్టి అడిగాడు నాగ్.. లత్కోర్ అనే పదం కాస్త ఇబ్బందికరమైనదని నీకు అనిపించలేదా.. లత్కోర్ హరీష్ అని నాగార్జున అన్నాడు‌. అది కామన్‌గా వాడేదే కదా అని హరీష్ అనగానే‌‌.. అయితే హౌస్‌లో వాళ్లంతా నిన్ను లత్కోర్ హరీష్ అని అంటారు.. నీకు ఓకేనా అని నాగార్జున అడిగాడు. దాంతో హరీష్ సైలెంట్ అయ్యాడు. మరి ఎంతమందికి క్లాస్ పడిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

నా బుగ్గలు రియల్...సినిమాలో అలాంటి క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తా!

  బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా గురించి చెప్పాలంటే ఆమె వేసే పంచులు గురించి ఆమె నవ్వు గురించి చెప్పుకోవాలి. అన్ని షోస్ లోకి దీపికను స్పెషల్ గా తీసుకుంటూ ఉంటారు. ఆమె ఏ షోలో ఉంటె ఆ షో రేటింగ్ పెరుగుతుంది అని. ఎందుకంటే అక్కడ పంచ్ డైలాగ్స్ అలాగే విపరీతమైన ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. బ్రహ్మముడిలో మానస్ కి భార్య రోల్ లో నటిస్తోంది. అలాగే ఈమె డాన్స్ ఐకాన్ 2 , చెఫ్ మంత్ర 2 లో చూస్తే ఈమె ప్రోమోస్ బాగా పడేవి. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఢీ షోలో ఆదితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఈమె ఒక చిట్ చాట్ షోలో కొన్ని విషయాలు చెప్పింది. "నేను నా కెరీర్ ని తమిళ్ ఇండస్ట్రీలో న్యూస్ రీడర్ గా చేసాను. నా న్యూస్ రీడింగ్ ని నా ఫేస్ ని చూసి నన్ను సీరియల్ హీరోయిన్ గా కమిట్ చేసేసారు. నా బుగ్గలు రియల్. నేను లవ్ చేసాను చేస్తున్నాను నా ప్రొఫెషన్ ని. నా నాలుకతో ముక్కును టచ్ చేస్తాను అదే నా హిడెన్ టాలెంట్. నాకు ఇందులో కూడా ఒక డౌట్ ఉంది. నా ముక్కు పొడవుగా ఉందా నా నాలుక పొడవుగా ఉందా అని. ఢీ సెట్ లో ఆది, పండు ఇద్దరూ బాగా ఫన్ చేస్తారు. ఏదైనా సినిమాలో నాకు యానిమల్ క్యారెక్టర్ వస్తే లేడీ టైగర్ కాబట్టి అలా చేస్తాను. కానీ అందరూ నేను క్యూట్ గా టెడ్డి బేర్ లా ఉంటాను అని చెప్తారు కాబట్టి టెడ్డి బేర్ క్యారెక్టర్ కూడా. ఢీ షో ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఆ డాన్స్ షోని నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. షోస్ , సీరియల్స్ అంటే ఇష్టం, లాంగ్ హెయిర్ ఇష్టం. హైదరాబాద్ అంటే ఇష్టం అలాగే లవ్ మ్యారేజ్ అన్నా కూడా. ట్రెడిషనల్ వేర్ వేసుకోవడం కాఫీ తాగడం ఇష్టం." అంటూ చెప్పుకొచ్చింది దీపికా రంగరాజు.

Bigg boss 9 Telugu : దివ్య బట్టలు దొంగతనం చేసిన సంజన.‌. మాటిచ్చిన ఇమ్మాన్యుయేల్!

  బిగ్ బాస్ సీజన్-9 లోకి దివ్యని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి తీసుకొచ్చారు. ఇక తను వచ్చీరాగానే సంబంధించిన బట్టలన్నీ సంజన, శ్రీజ దాచేస్తారు వాటిని బీన్ బ్యాగ్ లో పెడుతుంటే ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ వస్తాడు. ఇద్దరు సైలెంట్ గా వెళ్ళిపోతారు. కాసేపటికి దివ్య వచ్చి చూసేసరికి తన బట్టలు లేవు.. దాంతో తను ముందు సంజనని అడుగుతుంది. నాకు తెలియదని సంజన అంటుంది. ఇవ్వకండి ఇలాగే వారం రోజులు ఉంటానని దివ్య అంటుంది. అప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చి బీన్ బ్యాగ్ లో ఉన్నట్లు క్లూ ఇస్తాడు. తను వెళ్లి చూసేసరికి బట్టలు ఉంటాయి. సంజననే బట్టలు తీసిందని శ్రీజ చెప్తుంది.ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ కూడా ఉన్నారని దివ్యతో ప్రియ చెప్తుంది. ఇమ్మాన్యుయల్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తాడు అనుకోలేదని భరణి అంటాడు. ఆ తర్వాత దివ్యతో ఇమ్మాన్యుయల్ మాట్లాడతాడు. అందులో పెట్టడం చూసాను కానీ ఏంటని చూడలేదు రాము వస్తుంటే కూడా మనకి ఎందుకులే అని తీసుకొని వచ్చానని ఇమ్మాన్యుయల్ చెప్తాడు. శ్రీజ కూడా దివ్యకి సారీ చెప్తుంది. దివ్య వచ్చింది ఫస్ట్ డేనే కదా నీకు జోక్ అయి ఉండొచ్చు.. కానీ అందరికి కాదని, మీతో ఉంటే మీరు సేఫ్ మీతో ఉన్నవాళ్ళు బలి అవుతారు అందుకే నేను రాలేదని సంజనతో రీతు అంటుంది. ఆ తర్వాత సంజన, దివ్య మాట్లాడుకుంటారు. నేను తీసాను కానీ నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చేశాను.. మా గురించి నీకు తెలుసు నీ గురించి మాకు తెలియదు కదా.. నీకు సంబంధించినవి దొంగతనం చేస్తే అలుగుతావో‌.. కోప్పడుతావో ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామనుకున్నానని సంజన అంటుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అవుతాడు. నా బట్టలు దొంగతనం చేసిన వాళ్ళకి కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని ఇమ్మాన్యుయల్ తో దివ్య అంటుంది. తప్పకుండా నువ్వు సాటిస్ఫాక్షన్ అయ్యేలా పనిష్మెంట్ ఉంటుందని దివ్యకి ఇమ్మాన్యుయల్ మాటిస్తాడు. దివ్యకి మాటిచ్చిన్నట్టుగా సంజనకి ఇమ్మాన్యుయల్ పనిష్మెంట్ ఇస్తాడా లేక అమ్మ అని వదిలేసి సెంటిమెంట్ చూపిస్తాడా చూడాలి మరి.

Bigg boss 9 Telugu : సంజన ఇన్ సీక్రెట్ రూమ్.. రిటర్న్ వచ్చాక మాములుగా ఉండదు!

  బిగ్ బాస్ సీజన్-9 నిన్నటి(శుక్రవారం) నాటి ప్రోమోలో సంజన ఎలిమినేట్ అని చూపించేసరికి బిబి ఆడియన్స్ కి మతిపోయింది. బిగ్ బాస్ గేమ్ ని చేంజ్ చేసింది సంజన.. అలాంటి సంజన ఎలిమినేట్ అవ్వడమేంటని అందరు షాక్ అయ్యారు. అందులో డౌట్ లేదు. కానీ పూర్తి ఎపిసోడ్ చూసాకే అందరికి ఓ క్లారిటీ వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అర్థరాత్రి డేంజర్ బెల్స్  మోగిస్తాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా షాక్ అవుతారు.‌ ఇక అందరిని సోఫాలో కూర్చోబెట్టి అసలు కథ స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. రెడ్ గింజ కల్గిన వాళ్ళందరూ డిసైడ్ అయి.. ఒక హౌస్ మేట్ ని ఇంట్లో నుండి పంపించాలని బిగ్ బాస.. ఫ్లోరా ఇమ్మ్యూనిటీ పొందింది. దివ్యని నేనే పంపించాను.. వాళ్లిద్దరూ మినహా రెడ్ గింజ లేని వాళ్ళని పంపించాలని చెప్పగా అందరు కలిసి సంజనని డిసైడ్ చేసి పంపిస్తారు. నేను ఈ హౌస్ లో ఉండడానికి అర్హురాలిని.. కానీ బిగ్ బాస్ మాటకు రెస్పెక్ట్ ఇస్తున్నానని సంజన వెళ్ళిపోతుంది. సంజన వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయల్ ఏడుస్తాడు. సంజనని పంపించాలని స్ట్రాంగ్ గా చెప్పిన హరీష్ మాత్రం.. సంజన వెళ్తుంటే అసలు తన దగ్గరికి కూడా రాడు.. సంజన కూడా అందరికి బై చెప్తుంది కానీ హరీష్ తో మాట్లాడదు. ఇక కాసేపటికి సంజన సీక్రెట్ రూమ్ లో ఉంటుంది. మన టీవీలో కంటెస్టెంట్స్ మాటలు వింటుంది. ఇమ్మాన్యుయల్ ఏడుస్తుంటే ఏడవకురా మళ్ళీ వస్తానని టీవీలో చూస్తూ అంటుంది సంజన. అందరు కలిసి నన్ను పంపిస్తారా అని కోపంగా అంటుంది. ఇక సంజన వెళ్ళిపోయిందనుకొని ఆవిడలా మనం చీప్ గా పనులు చెయ్యలేమని రాము, హరీష్ మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళు మళ్ళీ సంజన వస్తుందనుకుంటారు. ఇక సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక మాములుగా ఉండదు. ఒక్కొక్కరికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుందని బిబి ఆడియన్స్ అనుకుంటున్నారు.  

Bigg boss 9 Telugu : మూడో వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్ లో కామనర్స్!

    బిగ్ బాస్ సీజన్-9 విజవంతంగా దూసుకుపోతుంది. రోజొక ట్విస్ట్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులకు విందు భోజనం అందిస్తున్నాడు. ఇక మొదటి వారం హౌస్ నుండి శ్రష్టివర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండవ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఒకరు సెలబ్రిటీ, ఒకరు కామనర్ .. ఇక మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.   ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉండగా.. ఇమ్మ్యూనిటి పొందిన ఫ్లోరా నామినేషన్ నుండి సేవ్ అయింది. టాప్ లో రాము రాథోడ్ ఉన్నాడు.. సెకెండ్ ప్లేస్ లో రీతూ.. థర్డ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్.. ఫోర్త్ హరిత హరీష్.. చివరగా ప్రియా శెట్టి ఉన్నారు. లీస్ట్ లో ముగ్గురు కామనర్స్ ఉన్నారు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఇద్దరు కామనర్స్ ఎలిమినేషన్ అవుతారు.  ఈ వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఇంకా ఒక సీక్రెట్ రూమ్ కి సంజన కూడా జరిగింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఒక కామనర్ ఎంట్రీ జరిగిందంటే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది కామనర్స్ నుండే జరుగుతుంది. అందుకే బిగ్ బాస్ నుండి బిగ్ ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది.  

Bigg boss 9 Telugu : మూడో వారం కెప్టెన్ గా ఇమ్మాన్యుయేల్...

  బిగ్ బాస్ సీజన్-9 చూస్తుండగానే మూడో వారానికి వచ్చేసింది. సంజన, డీమాన్ పవన్ ఇద్దరు గత రెండు వారాలలో కెప్టెన్ గా చేశారు. అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ ని దివ్య నిఖిత సెలక్ట్ చేసింది. కెప్టెన్సీ కంటెంటెండర్స్ రేసులో.. దివ్య నిఖిత, భరణి, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, తనూజ అయిదుగురు ఉన్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే కంటెండర్స్ వేసుకున్న టీ షర్ట్ కి మిగతా వాళ్ళు విసురుతున్న బాల్స్ స్టిక్ అవుతాయి. బజర్ మోగే టైమ్ కి ఎవరి టీ షర్ట్  మీద అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు టాస్క్ నుండి ఎగ్జిట్ అవుతారు. టాస్క్ కి సంఛాలక్ గా పవన్ కళ్యాణ్ ఉంటాడు. మొదటగా టాస్క్ నుండి దివ్య ఎగ్జిట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, తర్వత తనూజ ఎగ్జిట్ అవ్వగా.. చివరికి భరణి, ఇమ్మాన్యుయల్ ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ జరుగగా టాస్క్ లో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు. దాంతో ఇమ్మాన్యుయల్ మూడో వారం కెప్టెన్  అవుతాడు. ఇక డీమాన్ పవన్ కెప్టెన్సీ బ్యాండ్ ని ఇమ్మాన్యుయల్ కి పెడుతాడు. కెప్టెన్ అయ్యానంటే అందరి సపోర్ట్ వళ్లేనని ఇమ్మాన్యుయల్ అంటాడు. టాస్క్ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది. ఇమ్మాన్యుయల్ ఫెయిర్ గా కెప్టెన్ అయ్యాడు. బాల్స్ ఎక్కువగా నన్ను టార్గెట్ చేసి విసిరారని భరణి ఫీల్ అవుతాడు. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయల్ కి ఎక్కువ బాల్స్ విసర్లేదు.  హౌస్ లో అందరికి పాజిటివ్ గా ఉన్న పర్సన్ ఇమ్మాన్యుయల్ అందుకే కంటెస్టెంట్స్ భరణిని టార్గెట్ చేశారు.