కంటెస్టెంట్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్‌లో పదిహేడవ రోజు  "దేఖో దేఖో గబ్బర్ సింగ్" పాటతో మొదలైంది."అడవిని కాపాడుకోవడం పోలీసుల బాధ్య‌త గీతూ.. కేవలం దొంగలు దొంగతనం చేసినవి మాత్రమే కొనుక్కోవచ్చు. విఐపి బాల్కనీలోకి ఎవరూ కూడా గీతు అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. ఒకవేళ  ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి గీతు ఎటువంటి శిక్ష  అయినా విధించవచ్చు" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి చెప్పాడు. "గేమ్ జరుగుతున్నప్పుడు బిగ్ బాస్, మీలో కొంతమందిని పదే పదే ఆపినప్పటికి, ఇంట్లో పైకెక్కడం చేస్తున్నారు. ఇది ఇంటి నియమాలకు వ్యతిరేకం మరియు మీ ప్రాణాలకు కూడా హానికరమైనది. ఒకవేళ హెచ్చరిక తర్వాత కూడా ఎవరైనా మళ్ళీ ఇలా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత టాస్క్ కొనసాగింది. గీతు, రేవంత్, శ్రీహాన్, చంటి, ఆదిత్య, వాసంతి, ఇనయా, ఆరోహి ఈ వారం నామినేషన్లో ఉన్నారు.

నాకు అత్తా, పిత్తా అని పిలిపించుకోవాలని లేదు!

సుమ తన యూట్యూబ్ ఛానల్ లో 'క్రేజీ కిచెన్' పేరుతో ఒక షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేసింది. అలాగే "ఈ షోకి వచ్చిన గెస్ట్ ఎవరు?" అంటూ ఒక రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా పోస్ట్ చేసింది.  ఐతే ఈ షోకి అనసూయను గెస్ట్ గా తీసుకొచ్చింది సుమ. రావడంతోనే అనసూయ "క్రేజీ కిచెన్ స్పెల్లింగ్ తప్పుంది కదా" అని అనేసరికి  "ఇంగ్లీష్ భాషను తిరగేసి, మరగేసి అలా పెట్టాను" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది సుమ. "చేసి పెడితే తింటుంది, వంట రాదు అన్నట్టుగా చూస్తారు నన్ను చాలా మంది. కానీ నాకు చాలా వంటలు వచ్చు అన్న విషయం ఈరోజు ఈ షో ద్వారా ప్రూవ్ చేస్తా" అంటూ చెప్పింది అనసూయ.  "అత్తాకోడళ్లంటే ఏ ఊర్లోనైనా ఒకేలా ఉంటారా.. లేదంటే బిహారీ అత్తకు, తెలుగు కోడలికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా?" అని సుమ వెరైటీగా అడిగింది. అనసూయ ఆన్సర్ కి మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసింది సుమ. తర్వాత వంట చేస్తూ "ట్విట్టర్ వార్ లోకి దిగాక నాకు తెలిసింది ఏమిటంటే నాకు అత్తా, పిత్తా అని పిలిపించుకోవాలని లేదు. స్టైల్ గా అనసూయ, అను అని పిలవాలి. నా కోడలైనా సరే అలాగే పిలవాలి" అంది అనసూయ.  "మరి నీకు ఎలా పిలిస్తే నచ్చుతుందో అది చెప్పేస్తే సరిపోతుంది.. అక్కడితో ఐపోతుంది కదా.. ఇదంతా ఎందుకు?" అన్నట్టుగా సుమ చెప్పేసరికి అనసూయ పగలబడి నవ్వేసింది.

రోజా లేకపోతే మా ల‌వ్ స్టోరీ స్క్రీన్ మీదకు వచ్చేది కాదు!

బుల్లితెర మీద ఈమధ్య రియాలిటీ షోస్ ఎక్కువయ్యాయి. వీటికి టీఆర్పీలు పెంచుకోవడానికి రీల్ లవ్ స్టోరీస్ ని వండి వడ్డిస్తున్నారు ఆడియన్స్ కి. అలాంటి ఒక రీల్ లవ్ స్టోరీ గురించి అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది  రష్మీ-సుధీర్ లవ్ స్టోరీ. ఐతే రీల్ లవ్ స్టోరీస్ మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు రియల్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయని నిరూపించారు రాకేష్ అండ్ జోర్దార్ సుజాత.  మొదట్లో వీళ్ళ లవ్ స్టోరీ అందరిలాంటిదే అనుకున్నారంతా. కానీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. వెంటనే సుజాతకు రింగ్‌ తొడిగి  ప్రపోజ్ చేసి తమది నిజమైన ప్రేమ అని చెప్పాడు రాకేశ్‌. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించింది సుజాత. దీని గురించి తన యూట్యూబ్‌ చానెల్‌లో కూడా చెప్పింది. ఐతే వీళ్ళ ప్రేమ, పెళ్ళికి కారణం జబర్దస్త్ జడ్జి రోజా అని చెప్పింది సుజాత.  లేటెస్ట్ గా తన యూట్యూబ్‌ చానెల్‌లో రోజా హోమ్‌ టూర్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసింది సుజాత. ఆ వీడియోలో తాను, రాకేష్‌ ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగా రోజా గుర్తించారని తెలిపింది సుజాత. తర్వాత ఆమె ఇద్దరితో మాట్లాడినట్టు చెప్పింది సుజాత. "రోజా గారు లేకపోతే మా విషయం స్క్రీన్ మీదకు వచ్చేది కాదు.. మా పెళ్లి అనౌన్స్మెంట్ కూడా ఇంత తొందరగా వచ్చేది కాదు. మా ప్రేమకు కారణం రోజాగారే" అని  చెప్పింది సుజాత. జబర్దస్త్ లో మనో, రోజా, ఖుష్బూ అంటే  ఇష్టమని చెప్పింది. త్వరలో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యాక అనౌన్స్ చేస్తామని చెప్పింది.

నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం కృష్ణంరాజు గారు..ఆయన లేకపోవడం బాధాకరం

ఒకప్పటి అందాల నటి గీత గురించి చెప్పాలంటే ముందుగా సాగర సంగమం సినిమా గుర్తొస్తుంది. తన కెరీర్ లో ఎన్నో మూవీస్ లో నటించింది  గీత. ఇక ఇప్పుడు ఈమె  ఆలీతో సరదాగా షోకి వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈ షోలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ షో ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు. " డాన్స్ రాదంటున్నారు.. సాగర సంగమంలో కమల్ హాసన్ పక్కన ఎలా చేశారు ?" అని ఆలీ అడిగేసరికి "నేనెక్కడ డాన్స్ చేసాను..కమల్ హాసన్ గారు డాన్స్ చేస్తుంటే నేను అటు ఇటు పరిగెత్తాను అంతేగా"  అంటూ నవ్వుతూ చెప్పింది గీత. " చిరంజీవి గారితో నటించాలనే కోరిక ఉండిపోయిందట..అని అడిగేసరికి ఆయన నా ఆల్ టైం ఫెవరేట్" అని చెప్పింది గీత.  "ఫస్ట్ మీరు కెమెరా ముందుకు వచ్చిన సినిమా మన ఊరి పాండవులు కదా" అని ఆలీ అడిగేసరికి "నేను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి కారణం కృష్ణంరాజు గారు.. ఈ రోజున ఆయన లేరు అంటే మనసుకు చాలా బాధగా ఉంది. అందరూ వచ్చి ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారి సడెన్ గా ఆయన లేరు అంటే తట్టుకోవడం కష్టంగా ఉంది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గీత. "శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేసాను. అప్పట్లో డైలాగ్స్ అరచేతిలో రాసుకుని ఏడుస్తూ డైలాగ్స్ చెప్పేసరికి అదే యాక్టింగ్ అన్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా ప్రామ్ప్టింగ్ అడుగుతున్నారు". "అప్పట్లో ఇండస్ట్రీ లో అందరూ మంచి డాన్సర్ అనేవారు కదా" అని ఆలీ అడిగేసరికి "తల కొట్టుకుని అయ్యో దేవుడా..పేడలో కాలేసి బయటికి వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా డాన్స్ " అని చెప్పింది గీత.

'నా లైఫ్ చాలా మారిపోయింది'.. ఎమోష‌న‌ల్ అయిన‌ కండక్టర్ ఝాన్సీ

కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఫుల్ ఫేమస్ ఐపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ సాంగ్ తో ఒక్కసారిగా ఆమెకు పేరొచ్చి పడింది. ఐతే తనకు డాన్స్ అంటే ఇష్టమని కానీ ఈ రంగాన్ని ఎంచుకున్నందుకు బంధువులతో పాటు తనను చాలామంది తిట్టారని ఝాన్సీ ఆ స్టేజి పై చెప్పింది.   ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో వర్షతో కలిసి ఇండియన్ డాన్స్ ఫైనల్స్ పేరుతో జరిగే కాంపిటీషన్ లో ఝాన్సీ పార్టిసిపేట్ చేసే స్కిట్ ఉంది. ఇక విన్నర్ గా ఇంద్రజ ఝాన్సీ పేరు అనౌన్స్ చేస్తుంది. డాన్స్ ఐపోయాక "ఝాన్సీ అంటే కండక్టర్ అనుకున్నావ్.. జనరేటర్ తగ్గేదేలే" అంటూ బులెట్ భాస్కర్ కి అదిరిపోయే డైలాగ్ చెప్పింది. ఇక స్కిట్ ఐపోయాక రష్మీ స్టేజి మీదకు వచ్చి "ఝాన్సీ గారు మీ పెర్ఫార్మెన్స్ రీసెంట్ గా టీవిలో టెలికాస్ట్ అయ్యింది. మరి లైఫ్ ఎలా ఉంది?" అని అడిగేసరికి ఝాన్సీ స్పందిస్తూ "ఎందుకు డాన్స్ చేసావ్ అన్నవాళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి మీ వల్ల మా ఫామిలీ పరువు నిలబడింది" అని చెప్తున్నారు. ఈ స్టేజికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ స్టేజి మీదే ఎమోషనల్ అయ్యింది. అలా ఏడుస్తూనే  జబర్దస్త్ స్టేజిని ముద్దాడింది కండక్టర్ ఝాన్సీ.

లాస్య‌కు ‘బేబీ ఇన్ ప్రోగ్రెస్-2’.. విషెస్ చెప్తున్న ఫాన్స్!

యాంకర్ లాస్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏనుగు చీమ జోక్స్ చెప్పడంలో పెట్టింది పేరు లాస్య. తన కెరీర్ స్టార్టింగ్ లో రవి, లాస్య యాంకరింగ్ జోడి చాలా బాగుండేది. లాస్య యాంకరింగ్ చేస్తూ, అప్పుడప్పుడు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ తన భర్త మంజునాథ్ ని కూడా షోస్ కి తీసుకొస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కొంచెం ఆక్టివ్ గానే ఉంటుంది లాస్య. ఇక ఇప్పుడు లాస్య రెండో సారి తల్లికాబోతున్నట్టు చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు లాస్య, మంజునాథ్ దంపతులు . ప్రెగ్నెన్సీ కిట్ ని, మెడికల్ రిపోర్ట్ ని  చూపిస్తూ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్యకి ముందు జున్ను అనే బాబు ఉన్నాడు. లాస్య తల్లి అవుతున్న సందర్భంగా ఫాన్స్, రిలేటివ్స్, బుల్లితెర నటులు  అంతా విషెస్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.  యాంకర్ గా ఫేమస్ అయిన లాస్య బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. లాస్య, మంజునాథ్ ఇద్దరూ  ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల లాస్య చాలా హై ఫీవర్ తో హాస్పిటల్ లో చేరి తిరిగి కోలుకుని ఇప్పుడు ఇలా గుడ్ న్యూస్ చెప్పింది.

'యూ నాటీ.. ఏయ్ ఆంటీ'.. సుమపై బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్!

సుమ ఎంత కామెడీ చేస్తుందో బ్రహ్మాజీ కూడా అంతే కామెడీ చేస్తుంటాడు. బ్రహ్మజీ ఏజ్ అనేది ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎంత వయసొచ్చినా అలాగే ఉంటాడు అంటారు ఆడియన్స్ కూడా. ఇటీవల బ్రహ్మాజీని అంకుల్ అంటూ ట్విట్టర్ లో నెటిజన్స్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు 'కృష్ణ వ్రింద విహారి` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుమ, బ్రహ్మాజీ కామెడీ సూపర్ అని చెప్పొచ్చు. సుమ బ్రహ్మజీ పక్కకు వచ్చి కూర్చుని "హమ్మయ్య ఇక్కడ హాయిగా, రిలాక్స్ గా అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి బ్రహ్మాజీ గారు మీ మనోభావాలు ఏమైనా దెబ్బ తిన్నాయా?" అని అడిగింది సుమ. "దేనికి?" అని ఆయన అనేసరికి "లేట్ గా పిలిచాను కదా.. అందుకు" అంది సుమ. దానికి బ్రహ్మాజీ "కొంచెం ఆకలేస్తోంది, షూటింగ్ నుంచి వచ్చాం, మళ్ళీ మార్నింగ్ షూటింగ్ ఉంది" అని చెప్పాడు. "మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి" అని సుమ అనేసరికి, "మీరు ఏమీ అడగరా?" అని బ్రహ్మాజీ రివర్స్ లో ప్రశ్నించాడు.. దానికి సుమ "మీ ఆస్తి వివరాలు చెప్పండి" అనేసరికి "రాజీవ్ కనకాల కంటే ఎక్కువే" అంటాడు.  సెకండ్ క్వశ్చన్ "మీ ఏజ్ ఎంత?" అని అడిగేసరికి "యూ నాటీ.. ఏయ్ ఆంటీ" అంటూ కామెంట్స్ చేసి షాకిచ్చాడు. దాంతో సుమ ఏమీ మాట్లాడలేక "ఏమిటో ఎటు వెళ్తుందో.. నో కామెంట్స్.. రేపు మీకు ఎవరితో షూటింగో ఏమిటో చూసుకోండి" అంది సుమ. ఇటీవల అనసూయను సోషల్ మీడియాలో  ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం, వాళ్ళ మీద కేసులు పెట్టిన విషయం తెలిసిందే.  

'కంటెస్టెంట్స్ అందరూ న‌న్ను నెగ‌టివ్‌గా చూస్తున్నారు'.. ఏడ్చేసిన రేవంత్!

పదహారవ రోజు బిగ్ బాస్ 'దొంగ దొంగ వచ్చాడే అన్నీ దోచుకుపోతాడే' పాటతో మొదలైంది. "నీ వాయిస్ అస్సలు వినిపించడం లేదు" అని రాజ్ తో శ్రీసత్య చెప్పింది. "హౌజ్ లో ఉన్న పదిమందిని నువ్వు ఆక్సెప్ట్ చేయకపోతే రేపు లక్ష మంది ప్రేక్షకులను ఎలా ఆక్సెప్ట్ చేస్తావ్" అని ఆరోహి గురించి‌ చంటి, రాజ్ తో చర్చించాడు. తర్వాత  "రేవంత్ ఎందుకు ఏడుస్తున్నావ్" అని సూర్య అడిగాడు. "నా తప్పు లేదు. అయినా సరే నేహాతో నేనే వెళ్ళి  మాట్లాడాను. అది పట్టించుకోకుండా నేనేదో తప్పు చేసానని, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదని, నాకు సంస్కారం లేదని చెప్పింది. ఆ విషయాలకి తను నన్ను నామినేట్ చేసింది. ఇలా పదిమంది ముందు మట్లాడితే అందరూ నన్ను నెగెటివ్ గా అర్థం చేసుకుంటారు కదా" అని రేవంత్, సూర్యతో చెప్పుకుంటూ ఏడ్చేసాడు. తర్వాత "అడవిలో ఆట" అనే టాస్క్ ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు.  "ఈ టాస్క్ లో పోలీసులుగా 'శ్రీసత్య, అది రెడ్డి, ఆదిత్య, ఫైమా, మెరీనా-రోహిత్, ఇనయా, రాజ్' ఉంటారు. దొంగలుగా 'ఆరోహీ, రేవంత్, సుదీపా, నేహా,‌ శ్రీహాన్, వాసంతి, అర్జున్, కీర్తిభట్, సూర్య' ఉంటారు. అత్యాశ వ్యాపారిగా గీతూ ఉంటుంది" అని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో చెప్పాడు. తర్వాత కాసేపు గడిచాక "ఈ రోజు టాస్క్ ఇప్పటితో ముగిసింది. మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుల భాద్యత మీదే" అని బిగ్ బాస్ చెప్పాడు. శ్రీహాన్, నేహా, చంటి, గీతూ, ఆదిత్య, వాసంతి, ఇనయా, ఆరోహీ, రేవంత్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు.

రక్తంతో పేరు రాసి ప్రపోజ్ చేసింది.. ఆ హీరో ఆమె నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడు!

శ్రీసత్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఫుల్ ఫేమస్ అయ్యింది. తిండి పిచ్చిది అని కూడా పేరు తెచ్చుకుంది. ఈ  అమ్మడుది విజయవాడ.. స్టడీస్ మొత్తం ఇక్కడే పూర్తి  చేసింది..  ఆ తర్వాత మిస్ విజయవాడ టైటిల్ , మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ గెలుచుకునే సరికి  ఆమెకు ఇండస్ట్రీ నుంచి  ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అలా రామ్ పోతినేని నటించిన మూవీ 'నేను శైలజ'లో చిన్న రోల్ లో నటించింది. ఎన్నో వెబ్ సిరీస్ లో నటించింది.  ఆ తర్వాత ఆమెకు  సీరియల్స్‌లో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ముద్ద మందారం, నిన్నే పెళ్లాడతా, త్రినయని ఇలా బుల్లితెరపై కూడా కనిపిస్తూ అలరిస్తోంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూలో తనకు రామ్ అంటే ప్రాణం అని "దేవదాస్" మూవీ నుంచి ఎంతో ఇష్టం అని చెప్పింది. ఒక రోజు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఆ రక్తం వేస్ట్ కాకూడదని కొన్ని పేపర్స్ మీద తనకు ఇష్టమైన  "రామ్" అనే పేరు రాసిందట. ఒక రోజు బీరువా సర్దేటప్పుడు ఆ పేపర్లు చూసిన వాళ్ళ అమ్మ  బాగా తిట్టిందని చెప్పింది. ఎఫ్ టీవీ చూసి ఇంట్లో రాంప్ వాక్ చేసేదట. చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.  అలాగే "ఫోన్ ఎడిక్ట్" అనే ముద్దు పేరు ఉందట ఎందుకంటే నిద్ర లేచి అద్దంలో ముఖం చూసుకున్నాక ఫుల్ డే ఫోన్ తోనే ఉంటుందట.  ఇన్స్టాగ్రామ్ అలా టైం ఫెవరేట్ అంది శ్రీ సత్య. అలాగే రామ్ గురించి ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పింది. ఇండస్ట్రీలో తనకు బాగా తెలిసిన ఒక్క అన్నయ్యకు రాఖీ కట్టినందుకు రామ్ నెంబర్ గిఫ్ట్ గా పంపించాడట. దాన్ని ట్రూ కాలర్ లో, జిమెయిల్ లో చెక్ చేసాక తెలిసిందట అది రామ్ ఒరిజినల్ నెంబర్ అని. వెంటనే "ఐ లవ్ యు" అని మెసేజ్ పెట్టిందట. తన మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్స్ వచ్చాయట కానీ తన నెంబర్ ని బ్లాక్ చేసేశాడని చెప్పింది శ్రీ సత్య.

లేటు వయసులో ఘాటు రొమాన్స్.. షో మొత్తం చూడలేక చావాలి!

క్యాష్ షో ప్రతీ వారం కొత్తగా కలర్ ఫుల్ గా ముస్తాబై వస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో లోబో, ఉమాదేవి, విశ్వ, సింధూర వచ్చారు. ఇక లోబో, ఉమాదేవి మీద యాంకర్ సుమ షో స్టార్టింగ్ లోనే  సెటైర్లు వేసేసింది. బిగ్ బాస్ సీజన్ 5 లో  లోబో, ఉమాదేవీ చేసిన రచ్చ  అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి  రొమాన్స్‌ చూసిన ఆడియన్స్ తలలు పట్టుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లోబోని 'భంగు' అని పిలిచేది ఉమాదేవి. అదే పదం ఈ షోలో కూడా కంటిన్యూ చేసింది. క్యాష్ స్టేజి మీదకి ఎంట్రీ ఇచ్చిన లోబో.. ఉమాదేవి ముఖాన్ని మొత్తం చేత్తో తడుముతూ "ఎలా ఉన్నావ్ పొట్టి?" అని అడిగాడు.. "ఎక్కడికెళ్ళిపోయావ్ ఇన్ని రోజులు" అంటూ ఉమాదేవి రొమాంటిక్ గా అడిగేసరికి "హలో మీ కళ్ళకు మేము కనిపించడం లేదు కదా.. ఏంటి అమెరికా నుంచి డైరెక్ట్ గా దిగినట్టున్నారు" అంటూ లోబో వేసుకున్న టీషర్ట్ చూసి కౌంటర్ వేసింది సుమ.. వెంటనే "ఏంటి భంగు అమెరికా వెళ్లిపోయావా" అని  ఉమాదేవి అడిగేసరికి "ఓరి నాయనో ఈవిడకి భంగు, ఆయనకు పొట్టి.. మీ రొమాన్స్ చూడలేక చావాలి ఎపిసోడ్ అంతా" అని సుమ పంచ్ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఉమాదేవికి సీరియల్స్ లో ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు అలాగే 'కార్తీక దీపం' సీరియల్ లో కూడా కనిపించడం లేదు. ఏదేమైనా వీళ్ళ ఇద్దరి రొమాన్స్ మాత్రం ఫుల్ ఫేమస్ అయ్యింది.

మీ ఇద్దరి కాంబినేషన్ చాలా ఇరిటేషన్ అన్న ప్రదీప్

ఇప్పుడు మూవీ టైటిల్స్ ని కామెడీ షోస్ కి, ఈవెంట్స్ కి పేరడీ టైటిల్స్ లా పెట్టేసి ఆడియన్స్ అటెన్షన్ ని తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తున్నాయి చానెల్స్ యాజమాన్యాలు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ ని పేరడీ టైటిల్ గా మార్చి "క్రేజీ ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ ఆన్ డ్యూటీ" అనే ఎంట్రీ లైన్ తో  లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే షో జీ తెలుగులో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షోకి ఫ్రెండ్స్ ని పిలిచి ఎంటర్టైన్ చేసాడు ప్రదీప్. సింగర్ గీతామాధురి, హరితేజ స్టేజి మీదకు జంటగా వచ్చారు. "ఈ షో పేరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఎందుకు పెట్టారో అర్ధం కావట్లేదు "అని హరితేజ అనేసరికి "మీరిద్దరూ లేడీస్ నేను జెంటిల్మెన్ " అని ప్రదీప్ కొంటె ఆన్సర్ ఇచ్చేసరికి గీత, హరి పగలబడి నవ్వేశారు. తర్వాత భానుశ్రీ, అమిత్ స్టేజి మీదకు వచ్చారు.  "అమిత్ మన ఫ్రెండ్ కదా" అన్నాడు ప్రదీప్ .."మన ఫ్రెండ్ ఏంటి" అంటూ భాను సీరియస్ గా అడిగేసరికి ప్రదీప్ వెంటను వాళ్లిద్దరూ  చేసిన "ఏమున్నావే పిల్ల" సాంగ్ కి డాన్స్ చేసేసరికి ఇద్దరూ నవ్వేశారు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ వేణు వండర్స్, ధనాధన్ ధన్ రాజ్ స్టేజి మీదకు వచ్చారు. "మీ ఇద్దరి కాంబినేషన్, కో-ఆర్డినేషన్ గురించి మీరు డాన్స్ వేయగానే తెలిసిపోయింది" అన్నాడు ప్రదీప్..డాన్స్ వేస్తె ఇరిటేషన్ అనా" అంటూ ధన్ రాజ్ అనేసరికి అందరూ పగలబడి నవ్వేశారు. మరి ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేశారు వీళ్ళ జర్నీ గురించిన విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మేం కలిసి స్టెప్పులేస్తే మామూలుగా ఉండదు!

డాన్స్ అంటే బుల్లితెరపై ముందుగా గుర్తొచ్చేది శేఖర్ మాస్టర్. ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన కోరియోగ్రఫీ చేసిన డాన్స్ స్టెప్స్ చూస్తే చాలు ఆయన ఎంత టాలెంటెడ్ పర్సనో అర్థమైపోతుంది. ఆయన ఎప్పుడో తన కూతురు సాహితి, కొడుకు విన్నీని బుల్లితెరకు పరిచయం చేసేసాడు. విన్నీ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక శేఖర్ మాస్టర్ తన పిల్లలకు నచ్చిందే చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాన్సులు చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.  సాహితి, విన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళ డాన్స్ లు ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ కూడా వాళ్ళతో కలిసి డాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మూవీ 'సర్కారు వారి పాట' మూవీ నుంచి "కమాన్ కమాన్  కళావతి" సాంగ్ కి పిల్లలతో కలిసి  స్టెప్పులు వేశాడు శేఖర్ మాస్టర్.  అలా ఈ ముగ్గురు చేసిన ఈ డాన్స్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.    శేఖర్ మాస్టర్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇప్పుడు 'డాన్స్ ఐకాన్' షోలో జడ్జిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ షోలో కంటెస్టెంట్స్ తో కలిసి, ఈ షో కో-ఓనర్ శ్రీముఖి తో కలిసి వేసే స్టెప్పులు చూసి మైండ్ బ్లాక్ ఐపోతుంది.

'శ్రీహాన్‌కి ఓట్లు వేయండి బాస్'.. సిరి హ‌న్మంత్ రిక్వెస్ట్‌!

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీగా యుద్దాలు చేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలను జీడి పాకంలా సాగదీసి మరీ చెప్తున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే బయట వాళ్ళ సంబంధీకులు సోషల్ మీడియా ద్వారా ఓట్లు అడుగుతున్నారు. ఇక ఇప్పుడు సిరి హన్మంత్.. తన బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్ కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఓట్లు అడుగుతోంది. హౌస్ లో ఎలిమినేషన్స్, నామినేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఇటీవల అభినయశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీహాన్ ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చేసాడు. గత ఎపిసోడ్ లో శ్రీహాన్ గాళ్‌ఫ్రెండ్‌ సిరి హన్మంత్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉంది. అప్పుడు బయట నుంచి శ్రీహాన్ ఆమెకు ఫుల్ సపోర్ట్ చేసాడు. ఇక ఇప్పుడు శ్రీహన్ హౌస్ లోకి వెళ్లేసరికి సిరి బయట నుంచి సపోర్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు శ్రీహన్ కి ఓట్లు వేయాలంటూ అందరిని రిక్వెస్ట్ చేస్తోంది సిరి. కొంతమంది నెటిజన్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ పెడితే కొందరు మాత్రం గేమ్ ఆడి టైటిల్ గెలవాలి కానీ ఇలా ఓట్లు అడగడం కరెక్ట్ కాదు అంటూ సిరికి చెప్తున్నారు. మరి సిరి రిక్వెస్ట్ ప్రకారం ఫాన్స్, ఆడియన్స్, నెటిజన్స్ శ్రీహాన్ కి ఓట్లు వేస్తారా? శ్రీహాన్ ఇంట్లో ఉంటాడా? బయటికి వచ్చేస్తాడా? తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

మేకప్ లేకపోయినా అనసూయ అంద‌గ‌త్తే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర మీద కనిపించే అనసూయ గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ ఐన అనసూయ బుల్లి తెర క్వీన్‌గా అటు ఈవెంట్స్ లో, ఇటు మూవీస్ లో చేస్తూ తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. 'రంగస్థలం', 'పుష్ప' వంటి సినిమాల్లో నటనకి స్కోప్ ఉన్న మూవీస్ లో నటించి తనను తాను ప్రూవ్ చేసేసుకుంది.  ఇక అనసూయ షూటింగ్ లేని టైంలో ఎక్కువగా విదేశాలకు వెళుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే తన లవ్లీ పెట్స్ తో మాట్లాడిస్తూ ఆ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అనసూయకు కొంచెం ఖాళీ దొరికినట్టుంది. ఇంట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఎప్పుడూ మేకప్ తో ముఖాన్ని చూపించే అనసూయ ఇంట్లో మేకప్ లేకుండా తన ఫేస్ ఎలా ఉంటుందో, ఇంట్లో పొట్టి నిక్కర్లతో ఎంత ఫ్రీగా ఉంటుందో ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.  'మేకప్ లేకపోయినా అనసూయ అందగత్తె' అని, 'అనసూయ సో హాట్' అని, 'ఆంటీ అన్నది ఎవరు' అని ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలరించడానికి సిద్ధమైన 'రారండోయ్ పండగ చేద్దాం'!

పండగ అంటే అందరూ కలవాలి. అప్పుడే పండగ పండగలా ఉంటుంది. వినాయక చవితి రోజున వర్షం పడడం ఎంత కామనో, పండగ ఈవెంట్ లో గొడవలు పెట్టడం కూడా అంతే కామన్ అంటూ ప్రదీప్ మాచిరాజు "రారండోయ్ పండగ చేద్దాం" అనే  సరికొత్త ఈవెంట్ తో జీ తెలుగులో ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దసరా పండగ సందర్భంగా వస్తున్న ఈ  స్పెషల్  ఈవెంట్  25 న సాయంత్రం 6 గంటలు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.  ఇందులో బుల్లి తెర సీరియల్స్ లో  నటించేవాళ్లంతా కూడా పార్టిసిపేట్ చేసి ఫుల్ మస్తీ చేశారు. స్టేజి మీద అందరూ కలిసి పండగ విందును ఆరగించారు. ఈ షోకి శ్రీ విష్ణు, సుహాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ఆమని, రోహిణి, బాబా భాస్కర్, వేణు వండర్స్, భానుశ్రీ, శోభా శెట్టి, దిలీప్ శెట్టి  ఇలా చాలా మంది ఈ షోకి వచ్చి డాన్సులు చేశారు. లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న 'బంగారం' డైలాగ్ ని, మూవీస్, సీరియల్స్ లో ఫేమస్ ఐన డైలాగ్స్ ని మిక్స్ చేసి సరికొత్త స్కిట్స్ ఈ షోలో కనిపించబోతున్నాయి.

ఉప్పెన మూవీలో సూర్యకాంతం,రేలంగి నటిస్తే ఇలా ఉంటుంది!

కృష్ణ భగవాన్ ఇటీవల జబర్దస్త్ షోలు చేస్తూ అందులో  పంచ్ డైలాగ్స్ వేస్తూ  ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనతో పాటు నటి ఇంద్రజ కూడా జోక్స్ వేస్తూ పడీ పడీ నవ్వుతూ నవ్విస్తోంది. కృష్ణ భగవాన్ కామెడీ అదుర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే బేసిక్ గా ఆయన రైటర్. కాబట్టి ఎప్పుడు ఏ టైములో ఏ డైలాగ్ చెప్తే అది ప్రోమోలోకి సూట్ అవుతుందో బాగా తెలిసినవాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. కొంతకాలం క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు అలా మల్లెమాల ప్రోగ్రామ్స్ కి ఆయన పర్మనెంట్ గా ఫిక్స్ ఐపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో వీడియో కింద ఆడియన్స్ కృష్ణ భగవాన్ జడ్జిగా చేసేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ఇందులో రాకెట్ రాఘవ స్కిట్ మాములుగా లేదనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఉప్పెన మూవీ అప్పటిలో సూర్యకాంతం, రేలంగి కలిసి తీస్తే అందులో వాళ్ళ నటన ఎలా ఉంటుందో చూడముచ్చటగా చేసాడు రాకెట్ రాఘవ. సూర్యకాంతం దివి నుంచి భువికి దిగి బుల్లితెర మీద జబర్దస్త్ షోకి వచ్చి  స్కిట్ చేస్తోందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె నడిచే విధానం, చేతిలో విసనకర్ర, కొప్పు, అందులో పూలు,  కళ్ళజోడు, మాట తీరు అచ్చు గుద్దినట్టుగా ఆమెను దించేసాడు.  ఇక ఈ స్కిట్ కి అందరూ కుష్ ఇపోయారు. ఇంద్రజ ఆమెను డైరెక్ట్ గా చూడలేకపోయినా మీ రూపంలో చూసుకునే భాగ్యం చేసుకున్నాం అనేసరికి కృష్ణ భగవాన్ మధ్యలో వచ్చి "ఆవిడది మా ఊరే ..కైకవోలు" అనేసరికి "సూర్యకాంతం గారు వచ్చిన ఊరు నుంచా మీరొచ్చారు ? " అని ఇంద్రజ ఆశ్చర్యపోతూ అడిగేసరికి "ఆ అక్కడి నుంచి వచ్చి ఇదా మీరు... అన్నట్టుగా అంటున్నారు మీరు ? " అని ఇంద్రజకి  రివర్స్ లో కౌంటర్ వేసేసరికి అందరూ పగలబడి నవ్వారు. ఇక ఉప్పెన మూవీలోని  "జలజలా పాతం" సాంగ్ కి సూర్యకాంతం పడవలో చేసే నాట్యం ఈ వారం షోకి హైలైట్ గా నిలిచిపోయేలా కనిపిస్తోంది.

హౌస్ లో అతను చాలా కన్నింగ్, ఫేక్ పర్సన్!

బిగ్ బాస్ ఈ షో గురించి ఎంతో మంది ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ షోకి స్టార్టింగ్ లో వచ్చినంత క్రేజ్ ఇప్పుడు రావడం లేదు. ఇక ఈ హౌస్ వెళ్లిన డాన్సర్ , యాక్టర్ అభినయశ్రీ ఎలిమినేట్ ఐపోయి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈమె బీబీ కేఫ్ ని రన్ చేసే ఓల్డ్ బీబీ కంటెస్టెంట్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. " మనిషిని చూడగానే గొడవ పడడం..ప్రొబ్లెమ్స్ క్రియేట్ చేయడం వంటివి నేను చేయలేను. రియల్ లైఫ్ లో ఇవి నాకు అస్సలు ఇష్టం ఉండవు.  నేను అలాంటి మనిషిని కూడా కాదు..నాకు మనుషుల్ని ప్రేమించడమే తెలుసు. అవన్నీ నా వల్ల కాదు. కానీ బిగ్ బాస్ హౌస్ ఉండాలి అంటే అవన్నీ చేయాలి. బట్ నేను అవి చేయలేకపోయాను. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. ఇదే కాదు కూర్చుని అందరూ మాట్లాడుకోవాలి. మధ్య మధ్యలో టాస్క్ లు ఇస్తారు. ఇవే కాదు ఇందులో మైండ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఐతే నన్ను నేను  ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు. వచ్చి ఉంటే వేరేలా ఉండేది. హౌస్ లోకి వచ్చి తిని, కూర్చుని, మాట్లాడుకోవడమేనా అనిపించి గేమ్ ఆడాను. ఇక ఇంట్లో నాకు నచ్చని ఒకే ఒక పర్సన్ సింగర్ రేవంత్. నాకు అతను ఫేక్, కన్నింగ్ , ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తాడు. తన మాటే నెగ్గాలనుకుంటాడు." అంటూ హౌస్ గురించి, రేవంత్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది అభినయశ్రీ. 

కాళ్ళతో తన్నినా వేణుమాధవ్ నన్ను మెచ్చుకున్నారు!

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పేరు రావాలంటే ఎంతో కష్టం. కొంతమందికి ఎన్నాళ్ళు చేసినా మంచి పేరు రాదు. కానీ కొందరికి మాత్రం ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చి పడిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణికి  కూడా అంతే. గయ్యాళి పాత్రల ద్వారా ఫుల్ ఫేమస్ ఐపోయింది. రోల్ ఎలా డిమాండ్ చేస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ మంచి పేరు తెచ్చుకుంది. చిన్నప్పటినుంచి ఆమెకు నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే టైములో పెళ్లి చేసేసారు ఆమెకు ఇంట్లోవాళ్ళు.   పెళ్ళికి ముందు సినిమాల్లోకి వెళతానన్న జయవాణి కోరికను ఆమె తల్లితండ్రులు యాక్సెప్ట్ చేయలేదు. పెళ్లయ్యాక భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది.  మొదట సీరియల్స్ లో నటించింది. తర్వాత  చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా సినిమాల్లోకి  అడుగుపెట్టింది. విక్రమార్కుడు, యమదొంగ, మహాత్మా, గుంటూరు టాకీస్ లాంటి మూవీస్ జయవాణికి మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. ఇటీవల ఆమె ఒక  ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్ చెప్పింది.  తాను ఏదైనా క్యారెక్టర్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే అందులోంచి  బయటికి రావడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుందని చెప్పింది. క్యారెక్టర్ లోకి దిగాక  ఏం జరిగినా పట్టించుకోకుండా నటించేస్తానని అందుకు సంబంధించిన ఒక  ఇన్సిడెంట్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. ‘అదిరిందయ్యా చంద్రం' మూవీలో వేణు మాధవ్ రోడ్డుపై తాగిపడిపోతే.. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ చేయాలనీ చెప్పి, రిహార్సల్ చేయించారు డైరెక్టర్.  "అయితే.. ఆ రోల్ కి కేవలం డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ సీన్ అంతా అర్థమయ్యాక డైలాగ్స్ తో అంత బాగా రాదనుకున్నా. ఇక కెమెరా ఆన్ అయ్యి 'యాక్షన్' అనగానే.. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ ని కాళ్లతో తంతూ తీసుకెళ్ళాను. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. కానీ ఆ సీన్ టేక్ మాత్రం ఓకే అయిపోయింది. అయితే డైరెక్టర్ టెన్షన్ పడుతూ వచ్చి, 'సీన్ లో ఆయన్ని తన్నుకుంటూ తీసుకెళ్లడమే లేదు కదా మరి నువ్వెందుకు అలా చేసావ్?. ఒకవేళ వేణుమాధవ్ కి కోపం వచ్చి షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి ?' అన్నారు. అప్పుడే వేణుమాధవ్ వచ్చి, సీన్ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. అప్పుడు నేను హమ్మయ్య అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది జయవాణి.

'గంగూబాయ్' లుక్‌లో నిహారిక.. కాంప్లిమెంట్ ఇచ్చిన అల్లు స్నేహ‌!

సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత ట్రెండింగో అందరికీ తెలుసు. అలాంటి ఒక రీల్ చేసి నిహారిక కొణిదెల ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. లేటెస్ట్‌గా ఆమె గంగూబాయ్‌గా మారిపోయింది. తెల్ల చీర, ఎర్రటి లిప్ స్టిక్‌, నోట్లో పాన్‌, చేతిలో బ్యాగ్‌ ధరించి చూడడానికి అచ్చంగా ఆలియా భ‌ట్ చేసిన క్యారెక్ట‌ర్‌.. గంగూబాయ్‌ లుక్‌లోకి చేంజ్ ఐపోయింది.  ఒక పార్టీలో ఈ గెటప్ తో వచ్చి ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ మూవీ 'గంగూబాయ్ క‌థియవాడి' ఎంత సూపర్ డూపర్ హిట్  సినిమానో అందరికీ తెలుసు. ఇందులో గంగూబాయ్ గా ఆలియాభట్ నటన వేరే లెవెల్. "గంగూని ఇమిటేట్ చేస్తున్నాను. నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్ పార్టీస్ అంటే ఇష్టమని మీకు తెలుసు కదా.. దయచేసి నా వెనుక ఉన్న కోతులను పట్టించుకోకండి" అని రాసి ఫొటోస్, వీడియో పోస్ట్ చేసింది  నిహారిక. ఈ వీడియోపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పందించింది. "సూపర్‌" అంటూ కామెంట్‌ చేసింది.  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారిక తన భర్తతో కలిసి ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోటోలు, వీడియోలు, మూవీ అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ లైమ్ లైట్ లో ఉంటోంది. ప్రస్తుతం నిహారిక ఫోటోలు, ఆమె వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.