ఇంట్లోవి వద్దట.. ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే ముద్దట.. కూతురి మీద సుమ ఫైర్!

ఇంట్లో ఉండే కూతుళ్ళకు.. అమ్మలు ఎన్ని వెరైటీ వంటకాలు చేసి పెట్టినా తనివి తీరదు. "ఇవేనా ఇంకేం లేవా?" అని అడుగుతూనే ఉంటారు. అమ్మలు కూడా ఏం తక్కువ తినలేదు. అడిగితే గరిటెలు పట్టుకుని జాడించే వాళ్ళు కూడా ఉన్నారు. డైలీ లైఫ్ లో ప్రతీ ఇంట్లో జరిగే ఈ విషయాలను సుమ డబుల్ రోల్ లో ఒక చిన్న రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 'అమ్మ v/s అమ్ము' పేరుతో  "ఎవ్రీడే స్టోరీ ఆఫ్ మథర్స్ ఇన్ ఎవ్రీ హౌస్" అని కాప్షన్ పెట్టింది. అమ్ము డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలన్నీ మూతలు తీసి చూసి... "ఇంకేం లేవా?" అని అడిగింది.  "ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా.. సాంబార్, పాపడ్, పికిల్, దొండకాయ రోటి పచ్చడి, బెండకాయ ఫ్రై చాలా ఉన్నాయి కదా, ఇంకా నీకేం కావాలి?" అని అడిగింది తల్లి సుమ. "అంతేనా!" అని మళ్ళీ అమ్ము ముఖం చిరాగ్గా పెట్టి అడిగేసరికి గరిటె చూపించి, "ఇంకేం కావాలే.. పోనీ దోశ, పల్లీ చట్నీ, ఇడ్లీ, కొబ్బరి చట్నీ చేయనా.. పోనీ పూరి, కుర్మా అవీ వద్దంటే చికెన్ బిర్యాని.. వీటిల్లో ఏదన్నా చేయనా?" అనేసరికి, "వద్దు.. బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోనా.. ఓటీపీ చెప్తావా?" అన‌డిగింది అమ్ము. దాంతో సీరియస్ అయ్యింది సుమ.  ఇలా ఒక రీల్ చేసి పెట్టేసరికి నెటిజన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇదే తంతు అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. "ఈ రెస్టారెంట్స్ అన్నీ ఎలా నడుస్తున్నాయనుకుంటున్నావ్ సుమా.. మన పిల్లల వల్లే.. మన మనశ్శాంతి పోగొట్టుకోవాలంటే పిల్లల్ని కనాలి".. ఇలా ఫన్నీ కామెంట్స్ ఎన్నో వస్తున్నాయి ఈ రీల్ కి.

ఎన్బీకే 'అన్‌స్టాపబుల్' షోకి పీకే!

నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అంతకుమించి 'అన్‌స్టాపబుల్' షో రెండో సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమైన 'అన్ స్టాపబుల్' షో సీజన్-1 ప్రేక్షకులకు కొత్త బాలయ్యని పరిచయం చేసింది. నిజ జీవితంలో బాలయ్య ఇలా ఉంటారా అంటూ ఆయన వ్యక్తిత్వానికి ఎందరో అభిమానులుగా మారిపోయారు.  ఇప్పుడు రెండో సీజన్ తో మరోసారి అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య. దీపావళి నుంచి రెండో సీజన్ ప్రసారమయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది. 'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ మోహన్ బాబుతో మొదలై, మహేష్ బాబుతో ముగిసింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ చంద్రబాబుతో మొదలై పవన్ కళ్యాణ్ తో ముగుస్తుందని అంటున్నారు. సీజన్-1లో అన్ని ఎపిసోడ్లు ఒకెత్తయితే మహేష్ పాల్గొన్న చివరి ఎపిసోడ్ మరో ఎత్తు. ఇప్పుడు సీజన్-2ని కూడా అదే స్థాయిలో గ్రాండ్ గా మొదలుపెట్టి, గ్రాండ్ గా ముగించాలి అనుకుంటున్నారట.  అందుకే మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబుని, చివరి ఎపిసోడ్ కి పవన్ ని తీసుకురాబోతున్నారట. ఇప్పటికే చంద్రబాబు ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే పవన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేస్తారని సమాచారం. బాలయ్య-పవన్ కలిస్తే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందోనంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూగజీవాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన రష్మీ!

యాంకర్ గా రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద ఒక స్టార్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూ వారంలో మూడు రోజుల పాటు ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి సినిమా ఆఫర్స్ వస్తే అందులో కూడా తన టాలెంట్ చూపిస్తూ ఫుల్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అవకాశాలను వినియోగించుకుంటోంది.  ఎంతో హ్యాపీ గా ఉండే రష్మీ తన మనసులో మూగ జీవాలంటే ఆవేదనతో ఉంటూనే ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ఫొటోస్ కన్నా ఇలా మూగజీవాలు పడుతున్న బాధల్ని ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది. అది ఏంటంటే ఆకాశ ఎయిర్ లైన్స్ వాళ్ళు ప్యాసెంజర్స్ తో పాటు వాళ్ళ పెట్స్ కి కూడా త్వరలోనే  అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుకింగ్స్ అక్టోబర్ 15  నుంచి మొదలు కాబోతున్నాయి. ఎప్పటికీ ఇదొక గుడ్ న్యూస్ అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది.  రష్మీ యానిమల్ లవర్. వాటికి హాని జరిగితే ఆమె మనసు భరించలేదు.  మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై  చర్యలు తీసుకునేలా కూడా  సంబంధిత అధికారులకు ఆమె ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ''జంతువులకు సాయం చేసే పరిస్థితి అందరికీ ఉండదు. కానీ వాటికి హాని చేయకూడదని అనే విషయం కూడా అందరికీ  తెలుసు" అని చెప్పింది. వాటికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని హింసించే రైట్ ఎవరికీ లేదు అంటూ ఘాటుగా తిట్టింది ఈ పోస్ట్ ద్వారా.

బిగ్ బాస్ ప్రేక్షకులను హత్తుకున్న కంటెస్టెంట్స్ కోరికలు!

ముప్పై రెండవ రోజు' లైలా ఓ లైల' పాటకి, కంటెస్టెంట్స్ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో హుషారుగా మొదలైంది బిగ్ బాస్. నిన్నటి దాకా 'బిగ్ బాస్ పుట్టిన రోజు' వేడుకలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ అభినందించాడు. "హౌస్ మేట్స్ అందరు తమ కోరికలు ఏంటో ఒక పేపర్ మీద రాసి, గార్డెన్ ఏరియాలో ఉన్న బావిలో పడేయండి" అని బిగ్ బాస్ తెలియజేసాడు. మొదట శ్రీహాన్ వచ్చి సిరి గురించి ఎమోషనల్ అయ్యాడు. "నువ్వు షూట్స్ లో బిజీగా ఉంటావని తెలుసు కానీ మా అమ్మ నాన్నలకి రోజుకి ఒక్కసారైనా కాల్ చెయ్. నేను లేని లోటును తీర్చు" అని కంటతడి పెట్టుకున్నాడు శ్రీహాన్. ఆ తర్వాత సుదీప  తన భర్త 'రంగనాథ్' టీ షర్ట్ మరియు ఫోటో కావాలని అడిగింది. తర్వాత రేవంత్ తన భార్యని బాగా చూసుకొమని వాళ్ళ అమ్మనాన్నకి చెప్పుకున్నాడు.  "నేను ఇక్కడికి వచ్చే వారం ముందే పాప పుట్టింది. పాపకి మంచి పేరు పెట్టాలని ఉందని, నేను ముద్దుగా బుజ్జమ్మా అని పిలుచుకుంటున్నా" అని ఏడ్చేసాడు ఆదిత్య. అర్జున్ వాళ్ళ నాన్నకి డయాబెటిస్. తనకి స్నేహితులు ఎవరు లేరని, నాన్నని జాగ్రత్తగా చూసుకోండని ఏడ్చేసాడు. ఆ తర్వాత సూర్య, "నా బుజ్జమ్మ‌ గురించి, నాన్న గురించి, అమ్మ‌ గురించి ఒక వీడియో చేయమని, వీడియోలో కాస్త ఎక్కువగా మా నాన్నని మాట్లాడమని చెప్పండి" అని ఏడ్చేసాడు.ఇనయా మాట్లాడుతూ, "మమ్మీ , నాన్న కన్నా ఎక్కువగా నేను నిన్ను  చూసుకోలేను. కానీ ఇక్కడికి ఒక్కసారి రా అమ్మ" అంటూ ఏడుస్తూ చెప్పుకుంది ఇనయా. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి తమ‌ కోరికలను చెప్పుకొని బాగా ఎమోషనల్ అయ్యారు. కెప్టెన్ కీర్తి భట్ ని, "కెప్టెన్ పోటీదారులు ఎవరు?" అని బిగ్ బాస్ అడుగగా, "ఫైమా, రేవంత్, సూర్య, గీతు, ఆదిత్య, రాజ్" అని చెప్పింది. "కెప్టెన్సీ పోటీ రెండు లెవల్స్ ఉంటుంది. మొదటి లెవల్ గెలిచిన వారికి రెండవ లెవల్ ఉంటుంది" అని వివరించాడు బిగ్ బాస్. కాగా ఈ పోటీలో సూర్య, ఆదిత్య, రేవంత్ గెలిచారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు? తర్వాత లెవల్ లో గెలిచి, కెప్టెన్ అవుతారో చూడాలి మరి.

ఫైర్ బ్రాండ్ గలాటా గీతు రెమ్యూనరేషన్ ఎంత‌?

బిగ్ బాస్ సీజన్ 6లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది ఎవరంటే.. గీతు రాయల్! గీతు పూర్తి పేరు గ్రీష్మ గీతిక లేఖ రాయల్. తను వ్యాపారవేత్త శేఖర్ కోవూరు, అమ్మ సుధారాజంలకు 1997 ఆగ‌స్ట్ 27న పుట్టింది. ఈమె 2014లో రన్నింగ్ బస్సు ఎక్కుతుండగా కింద పడిపోయి, నెల రోజులు కోమా లో ఉందట. అయితే ఇప్పటికి కూడా చాలా సంగతులు గుర్తుండవట.  ఈమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన వికాస్ ను 4 ఫిబ్రవరి 2021న పెళ్ళి చేసుకుంది. చిన్నప్పటి నుండి తనకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే చదవడం పూర్తవగానే జాబ్ వచ్చిందట. మొదటగా అమెజాన్‌లో జాబ్ వచ్చింది. కానీ ఆమెకు RJ కావాలని ఆసక్తి ఉండేది. ఆ కంపెనీలో జాబ్ మానేసి ఒక ఛానల్ లో RJ గా జాయిన్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తను Blogs, డ‌బ్‌స్మాష్ లతో నెటిజన్స్ ని ఆకట్టుకోవడమే కాకుండా మోటివేషనల్ వీడియోస్ తో మంచి ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. ఈ ఫాలోయింగ్ స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ లో ఛాన్స్ కొట్టేలా చేసింది. దీంతో తన క్రేజ్ అమాంతం‌ పెరిగిపోయింది. తరువాత బిగ్ బాస్ రివ్యూ చేస్తూ పలు వీడియో లు చేయడం, అవి బాగా ఫేమ్ అవ్వడంతో ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. అదే ఇప్పుడు తనకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చేలా చేసింది. చలాకితనం, అల్లరి చేష్టలు, సూటిగా మాట్లాడే గుణం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అని తనే ఎప్పుడూ చెప్తుంటుంది.  ఎనిమిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తను, హౌస్ లో మొదటి వారం.. అటు కంటెస్టెంట్స్ కి, ఇటు చూసే ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పించింది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తోందని అనుకోని ప్రేక్షకులు ఉండరు. కానీ రెండవ వారం తన ఆటతీరును మార్చేసింది. రెండవ వారం నుండి వరుసగా అన్ని వారాలు నామినేషన్  లో ఉంది. కానీ ప్రేక్షకులకు తన ఆట తీరు, ముక్కు సూటిగా చెప్పే విధానం నచ్చి ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు.  అయితే తను మాత్రం ప్రత్యేకమైన శైలితో హౌస్ లో బాగా పర్ఫామెన్స్ చేస్తూ ఉంటోంది. కాగా అందరినీ తన చిత్తూరు యాసతో అలరిస్తూ, బిగ్ బాస్ చూసే వారందరికి వినోదాన్ని ఇస్తోంది. నాగార్జునని సైతం తన ఆట తీరుతో మెప్పిస్తూ, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. "హౌస్ లో ఎలాంటి రిలేషన్ పెట్టుకోను, అలా పెట్టుకుంటే గేమ్ ఆడలేను" అని హౌస్ మేట్స్ తో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అయితే తన మీద ఎప్పుడు కేర్ చూపించే ఆదిరెడ్డి, ఆదిత్య తనకి ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది అంట. బిగ్ బాస్ సీజన్ 6లో గీతు లేనిదే ఎంటర్టైన్మెంట్ లేదని అంటున్నారు, ఈ షో చూసే ప్రేక్షకులు. ఇప్పటివరకు అందరిని తన ఆటతో మెప్పిస్తూ వస్తోంది. కాగా గీతుకి రెమ్యూనరేషన్ రోజుకి ముప్పై నుండి నలభై వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారంలో ఉంది. ఇక  మునుముందు ఈ చిత్తూరు చిరుత పులి ఆట ఏంటో? ఎలా  ఆడుతుందో? చూడాలి మరి.

'దీప్తిని చూసి చాలా నేర్చుకున్నా'.. ఒప్పుకున్న ష‌న్ను!

సోషల్‌ మీడియాలో షణ్ముఖ్‌-దీప్తి రిలేషన్‌షిప్‌ గురించి, వాళ్ళ క్లోజ్‌నెస్ గురించి అందరికీ తెలుసు. యూట్యూబ్‌ క్రియేటర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారు. ఐతే షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ హౌస్ లోకి వెళ్లి వచ్చాక వారి మధ్య రిలేషన్‌ బ్రేక్ అయ్యింది. ఇక ఆ టైంలో వాళ్లిద్దరూ కలిసి ఉండాలంటూ వారి ఫాన్స్ కామెంట్లు పెట్టడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ఫాన్స్  ఏం కోరుకున్నారో ఇక్కడ అదే జరిగింది. ఒక ఈవెంట్‌లో వీళ్ళిద్దరూ కనిపించేసరికి వారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు వాళ్ళ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఒక యూట్యూబ్‌ నెట్‌వర్క్‌ వైజాగ్‌లో ఓపెన్ చేసిన బ్రాంచ్ కి యూట్యూబ్‌ క్రియేటర్లు, ఆ చాన‌ల్‌ సభ్యులతో కలిసి ఒక ఈవెంట్ చేశారు. అక్కడ స్టేజ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌ మాట్లాడుతూ “నేను ఇక్కడి వరకు ఎలా వచ్చానో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. కొత్తలో యూట్యూబ్‌ కవర్‌ సాంగ్స్‌ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాను. కాపీ రైట్ ఇష్యూస్ వల్ల పెట్టిన వీడియోస్ అన్నీ పోయాయి. దాంతో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నేనూ- దీప్తి కలిసి వీడియోలు చేశాం. ఆ సమయంలో నేను దీప్తీని చూస్తూ ఉండేవాడిని. ఆమెకు వచ్చినన్ని నెగెటివ్‌ కామెంట్స్‌ ఎవరికీ వచ్చేవి  కావు. కానీ, ఆ కామెంట్స్ ని చూసి ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నేను దీప్తిని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలూ ఎప్పుడూ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ” అన్నాడు షన్ను. అత‌డు చాలా బాగా చెప్పాడ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

ఫామిలీ సర్కస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసిన బుల్లి తెర స్టార్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం స్పెషల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఫామిలీ సర్కస్ అనే కాన్సెప్ట్ తో బుల్లితెర స్టార్స్ అంతా తమ పిల్లలతో స్టేజి మీదకు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్, స్కిట్స్ చేసి ఫుల్ ఖుష్ అయ్యారు. శిరీష తన కొడుకుతో కలిసి "చిన్ని తండ్రి నిను చూడగా" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. తర్వాత తాగుబోతు రమేష్ తన కూతురుతో కలిసి "గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి" సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక యాట నవీన తన ఇద్దరు కొడుకులతో కలిసి "నీవే నీవే" సాంగ్ కి కలిసి డాన్స్ చేశారు. ఇంకా ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్, పంచ్ ప్రసాద్ ని పంచ్ డైలాగ్స్ చెప్పనివ్వకుండా పిల్లలంతా కలిసి స్టేజి మీద గోల గోల చేసేసారు. ఇంతలో రష్మీ వచ్చి "ఇంద్రజ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది" అని అడిగేసరికి శిరీష కొడుకు మధ్యలో  వచ్చి  రష్మీ దగ్గర బూర ఊదేసి వెళ్ళిపోయాడు. దాంతో ఇంద్రజ పడీ పడీ నవ్వేసింది. బిజీ బిజీగా ఉండే అమ్మానాన్నలు పిల్లలకు అన్నం పెట్టకుండా, సండే కూడా ఎంజాయిమెంట్ లేకుండా పనిలో ఎలా మునిగి తేలుతున్నారో అని చెప్తూ  వేసిన స్కిట్ అందరినీ ఎమోషన్ కి గురి చేసింది.

'కత్తిలా ఉంది పాప' అంటూ ఇంద్రజని కామెంట్‌ చేసిన నరేష్!

జబర్దస్త్ మళ్ళీ పుంజుకుంటోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎంట్రీలోనే ఆది, న‌రేశ్‌ల‌ను ఒక‌త‌ను ఒక బుల్లెట్ బైక్ మీద స్టేజి మీద‌కు తీసుకువ‌చ్చాడు. బండికి అడ్డంగా నిల్చున్న న‌రేశ్‌తో, "కొత్త‌బండి అంట‌. నిమ్మ‌కాయ అనుకొని తొక్కేసినా తొక్కేస్తాడు" అని పంచ్ వేశాడు ఆది. న‌రేశ్ ఏయ్ అని ప‌క్క‌కు జ‌ర‌గ‌గా, అంద‌రూ ఆ పంచ్‌కు విర‌గ‌బ‌డి న‌వ్వేశారు.  ఆదిని "నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్?" అని అడిగాడు న‌రేశ్‌. "అవ్వాలిరా" అన్నాడు ఆది. "ఎక్కడవ్వాలి, ఇంకెన్న‌వ్వాలి.. అరే.. సేల్స్ మాన్ కి కూడా ఒక టార్గెట్ ఉంటుంది, నీ టార్గెట్ ఎంతో చెప్పరా" అని న‌రేశ్ అడ‌గ‌డంతో, అందరూ నవ్వేశారు. తర్వాత వాళ్ల ప‌క్క‌నుంచి ఇంద్రజ, పవిత్ర "ఏ చిలిపి కళ్ళలోన కలవో" అనే సాంగ్ వస్తుండగా  నడుచుకుంటూ వెళ్తున్నారు.  వెంటనే  నరేష్ వాళ్ళ వైపు తిరిగి  "పాప కత్తిలా ఉంది.." అని ఇంద్రజను అనేసరికి, ఆమె సీరియస్ గా నరేష్ వైపు ఒక లుక్ ఇచ్చింది. "ఏంటి అంత సీరియస్ గా చూసింది?" అని ఆదిని అడిగాడు న‌రేశ్‌. "ఆవిడ అలా చూస్తదనే ఆ డైలాగ్ నీకు ఇచ్చా" అన్నాడు ఆది. తర్వాత రాకెట్ రాఘవ నిజాయితీ గల ఒక భర్తగా భార్య ఎలా చెప్తే అలా నడుచుకునే వాడిగా చేసిన స్కిట్ ప్రోమో చాలా బాగుంది.

బీఎండబ్ల్యూ కారు కొన్న షన్ను!

షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. యూట్యూబ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ పేరు సంపాదించాడు. ఇలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న టైంలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ఆటిట్యూడ్ వలన తన ప్రేమికురాలు దీప్తి దూరమైపోయింది.  ఇకపోతే లేటెస్ట్ గా షన్ను వాళ్ళ అమ్మానాన్నతో కలిసి ఖరీదైన బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన కారును కొన్నాడు. ఈ కారు మీద కూర్చుని 'బాస్' అన్న టీషర్ట్ వేసుకుని దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కార్ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేసాడు షన్ను. "ఇదంతా ఒక డ్రీమ్ లా ఉంది. నా ఫామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్లో చూడాలనుకున్న మీరే.. ఇది మన కార్..ఎప్పుడు కనిపించిన ఆపండి.. లిఫ్ట్ ఇస్తా ఇది పక్కా" అని ఒక టాగ్ లైన్ పెట్టాడు. ఇక ఫాన్స్ అందరూ కూడా షన్నుని విష్ చేస్తూ మెసేజెస్ పెట్టారు.

నువ్వసలు ఆడదానివే కాదేమో అని డౌట్!

'దసరా వైభవం' పేరుతో ఈటీవీలో ప్రసారమైన ఈవెంట్ అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి 'జబర్దస్త్' ఫామిలీ, సీనియర్ ఆర్టిస్ట్స్ అంతా వచ్చారు. రోజమ్మ ఇంటికి అందరినీ ఆహ్వానించింది. "అందుకే మనమంతా ఇక్కడికి వచ్చాం" అంటూ షో స్టార్ట్ చేసింది శ్రీముఖి. ఆమె, ఆది మధ్య భయంకరమైన పంచ్ డైలాగ్స్ పేలాయి.  "షోలో అరవటానికే నిన్ను తెప్పించారు శ్రీముఖి" అని ఆది అనేసరికి శ్రీముఖి కౌంటర్ వేసింది. "ఏంటి ఆది.. రోజమ్మ ఇంట్లో ఫంక్షన్ మంచి కలరింగ్స్ వస్తారని తెలిసి కొత్త డ్రెస్ వేసుకొచ్చావా.. బాగా స్కెచ్ వేసావ్ ఐతే" అని అనేసరికి "నేను స్కెచ్ వేశాను కానీ నువ్వే మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తున్నావ్ అంటే నాకంటే ముందే నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావన్నమాటష‌ అన్నాడు ఆది. దాంతో బిత్త‌ర‌పోవ‌డం శ్రీ‌ముఖి వంత‌యింది. ఆ వెంటనే ఆది అందుకుని "మరి ఈ రోజు రోజమ్మ ఇంట్లో ఎలాంటి పార్టీ ప్లాన్ చేసావ్?" అని అడిగాడు. "నేనట్టాంటి ఇట్టాంటి ఆడదాన్ని కాదు బావో" అంటూ డాన్స్ చేసిందామె. "అలాంటి ఇలాంటి ఆడదానివేంటి.. నువ్వసలు ఆడదానివే కాదేమో అని డౌట్" అంటూ ఆది వేసిన చెత్త డైలాగ్ కి అందరూ పడీ పడీ నవ్వేశారు.  ఆ త‌ర్వాత అంద‌రూ రోజ‌మ్మ ఇంట్లోకి అడుగుపెట్టారు. "రోజమ్మ అంటే ఎవరు.. ఒక ఫైర్ బ్రాండ్.. మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుంది?" అని శ్రీముఖి అడిగేసరికి, "నీకు నువ్వే చెప్పాలి ఏ బ్రాండో" అంటూ మరో కౌంటర్ వేశాడు ఆది.

బిగ్ బాస్ బర్త్ డే వేడుకల్లో కంటెస్టెంట్స్!

ముప్పైవ రోజు 'బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు' జరిగాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి  నా బర్త్ డే వేడుకలు చాలా గ్రాండ్ గా, ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. ఒక్కో కంటెస్టెంట్ తమ ప్రతిభను చాటుకున్నారు. సూర్య తన మిమిక్రీతో హౌస్ లో అందరిని అలరించాడు. ఐతే ఈ మిమిక్రీ లో 'చిరంజీవి' లా చేసి వహ్వా అనిపించాడు. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య కలిసి డ్యాన్స్ చేయగా అందరూ ఎంజాయ్ చేసారు. అర్జున్ మాత్రం ఫీల్ బాగా అయినట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఫైమా, అర్జున్ లు డ్రామా కొనసాగించారు. ఫైమా తన పంచులతో హౌస్ మొత్తాన్ని కడుపుబ్బా నవ్వించగా, సూర్య మాత్రం ఫైమా పంచ్ లకు రియాక్షన్ ఇస్తూ, కౌంటర్ ఎటాక్ లతో  సరదాగా గడిపాడు. అయితే ఈ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా గీతుని కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళమని చెప్పాడు బిగ్ బాస్. గీతుకి సీక్రెట్ టాస్క్ ఇస్తాడేమో అని అందరూ అనుకున్నారు కానీ అలా ఏం ఇవ్వకుండా సరదగా ఆటపట్టించాడు. ఆ రూమ్ లోకి వెళ్ళాక, "గీతు అక్కడ ప్లేట్ లో  KFC చికెన్ ఉంది‌. అది నీకు కావాలంటే హౌస్ మేట్స్ పై గాసిప్స్  చెప్పి నన్ను మెప్పించాలి" అని చెప్పాడు. ఆ తర్వాత ఫైమా కి సీక్రెట్ టాస్క్ ఇవ్వగా, తను అందులో గెలవలేకపోయింది. కెప్టెన్ బాధ్యతల కోసం కంటెస్టెంట్స్ అందరూ గట్టిగానే పర్ఫామెన్స్ ఇస్తున్నారు.

ముద్దు అడిగిన ఆది.. లాగిపెట్టి చెంపలు వాయించిన శ్రద్ధ‌!

'ఢీ' షో అంటే చాలు ముద్దుల కోసం, హగ్గులు కోసం ఆది రచ్చ చేస్తూనే ఉంటాడు. ఆది పంచ్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. కానీ ఆ డైలాగ్స్ కొన్ని సార్లు శృతి మించుతూ ఉంటాయి. మ‌రోసారి అలాగే శ్రుతి మించిన ఆదికి చెంప‌లు వాయించి షాకిచ్చింది శ్ర‌ద్ధా దాస్‌. లేటెస్ట్ గా రిలీజ్ ఐన ఢీ షోలో ఆది, శ్రద్ధాదాస్ కలిసి నవ్వులు పూయించారు. ఇందులో శ్రద్దాదాస్ ని ముద్దు అడిగాడు ఆది.. దాన్ని హిందీలో ఏమంటారు? అని యాంక‌ర్‌ ప్రదీప్ ని అడిగాడు. "ముద్దు అంటే హిందీలో థప్పడ్" అని చెప్పాడు ప్ర‌దీప్‌. వెంటనే ఆది ఆ మాటను శ్రద్దాకి చెప్పి "రెండు థప్పడ్ కావాలి" అని అడిగాడు.  "ఏం అడుగుతున్నావో తెలుసా?" అని అడిగింది  శ్రద్ధ‌. అదేం వినకుండా ఆది కళ్ళు మూసుకుని ముద్దు కోసం వెయిట్ చేసేసరికి, శ్ర‌ద్ధ‌ వెనుకాముందు చూడకుండా దొరికిందే చాన్సు అని ఆది రెండు చెంపలను వాయించేసింది. "ముద్దంటే  థప్పడ్ అని చెప్పింది ఎవరు?" అని ప్రదీప్ మీద సీరియస్ అయ్యాడు ఆది. తిన్న దెబ్బలు సరిపోకపోయేసరికి మళ్ళీ "ముద్దంటే శ్రద్ధ‌ వాళ్ళ భాషలో చెప్పండి" అని ఈసారి యాని మాస్ట‌ర్‌ను అడిగాడు. ఆమె "గుస్సా గుస్సా" అని చెప్తుంది. ఇక ఆది రెచ్చిపోయి ఒక అరగంట సేపు గుస్సా అని కళ్ళు మూసుకుంటాడు. లాగిపెట్టి పొట్టలో దబిడి దిబిడి బాదేసింది శ్రద్ధ‌. ఇలా ఈ వారం ఎపిసోడ్ శ్రద్ధ‌ చేతిలో ఫుల్ గా తన్నులు తిన్నాడు ఆది.

చీర గురించి నా ఫాంటసీ చెప్తే సెన్సార్ వాళ్ళు ఊరుకోరు!

'జిన్నా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు 'డాన్స్ ఇండియా డాన్స్' షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. లేడీ కమెడియన్ రౌడీ రోహిణి వచ్చి, "నాకు పెళ్లి కావాలి" అని అడిగింది. హోస్ట్ అకుల్ బాలాజీ, "నాకు సన్నీ లియోన్ కావాలి" అని అడిగాడు. "అయితే మీరు బాంబేకి వెళ్లాల్సిందే" అని ఆట ప‌ట్టించాడు మంచు విష్ణు. "హారర్ టైపు ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు ఏమన్నా చేశారా?" అనే ప్ర‌శ్న హోస్ట్ నుంచి విష్ణుకు ఎదురైంది. "ఇంజనీరింగ్ చదివే టైంలో హాస్టల్ లో ఉండేటప్పుడు అందరినీ భయపెట్టేవాళ్ళం. ఒక చెట్టు కింద ఒకడికి తెల్ల డ్రెస్ వేసి పడుకోబెట్టేవాళ్ళం. తర్వాత అందరం గ్రూప్ గా వచ్చేవాళ్ళం. ప్రతీ గ్రూప్ లో ఒక బకరా ఉంటాడు కదా వాడిని ఏడిపించడానికి ఇలా చేసేవాళ్ళం. మా నాన్నకు  ఈ విషయాలు తెలియవు.. లేదంటేనా బెల్టు తీసి కొడతాడాయన" అని చెప్పాడు విష్ణు.  శరత్-ఆయుషి జంట వచ్చి "తెల్లా తెల్లని చీర" అనే సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక హోస్ట్ "చీర మీద మీ ఒపీనియన్ ఏమిటి? అని అడిగితే, "చీర కంటే అందమైన వస్త్రధారణ మరొకటి లేదు" అని చెప్పాడు విష్ణు. "మరి మీకు ఇలాంటి ఫాంటసీస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా?" అని హోస్ట్ అడిగాడు. "నా ఫాంటసీస్ చాలా క్రేజీ.. నేను చెప్తే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత మీకే ప్రాబ్లమ్" అంటూ సెన్సార్ లేని ఫాంటసీ చెప్పాడు విష్ణు. "వెన్నెలవే.. వెన్నెలవే అనే సాంగ్ కి నేను నా భార్య విన్నీతో కలిసి డాన్స్ చేస్తాను. అదే నా ఫాంటసీ " అని చెప్పాడు. తర్వాత ఈ పాటకు సంగీతతో కలిసి డాన్స్ చేసాడు మంచు విష్ణు.

శ్రీహాన్ తో రొమాన్స్..బాధలో అర్జున్..ఖుషీగా శ్రీసత్య !

బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం అని చెప్పొచ్చు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి  శ్రీసత్య వెంట పడుతూ ఉన్నాడు. కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా అవసరమైనప్పుడే మాట్లాడుతూ ఉంటుంది.  ఇక ఇప్పుడు బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా తనని ఎంటర్టైన్ చేయాలని కోరడంతో  ‘ఓ సీతా..’ అనే పాటకు శ్రీ సత్య-శ్రీహాన్‌ రొమాంటిక్ డాన్స్ చేశారు. శ్రీహాన్ కూడా తక్కువేం తినలేదు  శ్రీసత్యని ఎత్తుకుని మరీ డాన్స్ చేసేసాడు ఆమె  కూడా అతని వైపు చాలా ఆరాధనగా చూడడం చూస్తే ఇద్దరి మధ్య ఏమన్నా లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందా అనిపించక మానదు.   ఇక పాపం వాళ్ళ పెర్ఫార్మెన్స్  చూసి మన అర్జున్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ ఫేస్ ఫీలింగ్స్ గమనిస్తే మాత్రం మనోడు తెగ ఫీల్ అయిపోనట్టుగా కనిపించింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో చూపిస్తా అంటూ లాస్ట్ వీక్ చెప్పి ఎలాగో సేవ్ అయ్యాడు. కానీ ఈవారం శ్రీసత్య కోసం త్యాగం చేసి నామినేట్ అయ్యాడు. ఆమె కోసం ఏదైనా చేసేలా కనిపిస్తున్నాడు. కానీ ఆమె మాత్రం తనను పట్టించుకోకుండా శ్రీహాన్ తో డాన్స్ వేయడం చూస్తూ కక్కలేక మింగలేక రోజులు గడుపుతున్నాడు అర్జున్.

సుధాచంద్రన్ కోసం పాట పాడిన పార్వతి..చంద్రముఖి డాన్స్ వేసిన రోహిణి!

డాన్స్ ఇండియా డాన్స్ షో నెమ్మదిగా సెలబ్రిటీస్ రాకతో ఒక మోస్తరు రేటింగ్ పెంచుకుంటూ వెళ్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ కి మయూరి మూవీ హీరోయిన్ సుధా చంద్రన్ వచ్చి డాన్స్ చేసి స్టేజిని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక ఎపిసోడ్ నిర్వాహకులు ఒక అట్ట మీద ఆమె పాద ముద్రలు వేయించి భద్రపరిచారు. తర్వాత సింగర్ పార్వతి స్టేజి మీదకు వచ్చి ఆమెను చూసి మాట్లాడలేకపోయింది.  సుధాచంద్రన్ గారికి పాదాభివందనం చేసి మిమ్మల్ని ఇంత దగ్గర చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు మేడం..దేవుడా నా జన్మ ధన్యమైపోయింది. పుస్తకాల్లో మీ గురించి చదివేటప్పుడు ఎవరామె, నేను కలుస్తానా ఎప్పుడైనా అనుకునేదాన్ని. నా ఫ్రెండ్స్ తిరుపతికి వచ్చి క్లాసికల్ డాన్స్ వేసి మిమ్మల్ని కలిసినట్లుగా ఫొటోస్ చూపించేసరికి నేను ఎప్పుడు కలుస్తానా అనుకునేదాన్ని.  కానీ ఈ రోజు ఈ షో ద్వారా ఆ అవకాశం వచ్చింది అని పార్వతి అనేసరికి సుధాచంద్రన్ మాట్లాడుతూ నేను నీ పాటకు పెద్ద ఫ్యాన్ ని అందుకే నీ గెలుపు కోసం చాలా ఓట్లు వేసాను" కానీ ఇప్పుడు నా కోసం ఒక పాట పాడాలి  అనేసరికి "ఊరంతా చీకటి" సాంగ్ పాడింది పార్వతి. ఇక రోహిణి చంద్రముఖి డాన్స్ తో ఆమెను భయపెట్టేసింది.  ఇక ఫైనల్ గా జడ్జెస్ కి కంటెస్టెంట్స్ అందరికి " ఐ లవ్ యు అని చెప్పి ఈ షో రాక్ చేస్తూనే ఉంటుంది..మీరు డాన్స్ మంచిగా పెర్ఫార్మ్ చేయండి అని బ్లెస్సింగ్స్" ఇచ్చారు సుధా.

'నేను మంత్రిని కావడం మీకు ఇష్టం లేదా?'.. ఏడ్చేసిన రోజా!

దసరా పండగని పురస్కరించుకుని దసరా వైభవం పేరుతో ఈటీవీ ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ షోకి మంత్రి రోజా గెస్ట్ గా వచ్చారు. రోజా ప్రస్థానం ఎక్కడినుంచి మొదలయ్యింది అనే అన్ని విషయాలను యోధ‌ అనే కంటెస్టెంట్ స్కిట్ కమ్‌ డాన్స్ రూపంలో వేసి చూపించింది. తర్వాత టీం మొత్తం కలిసి రోజాకు సన్మానం చేశారు. ఆ త‌ర్వాతే అనుకోనిది జ‌రిగింది. తర్వాత జబర్దస్త్ కి, కమెడియన్స్ కి సంబంధించి కొన్ని విషయాలను కూడా  ప్రస్తావించారు రోజా. ఐతే తన ఆరోగ్యం మంచిగా ఉండడానికి కారణం డాక్టర్ చెప్పిన టిప్స్ అనేసరికి, నూకరాజు లైన్ లోకి వచ్చి "ఏంటి మేడం ఇంత కామెడీగా మాట్లాడుతున్నారు.. ఇంతకు ముందు మీరు ఏం అన్నారో ఒకసారి వీడియో చూడండి" అంటూ ఒక ఓల్డ్ ఫుటేజ్ ని ప్లే చేసి చూపించాడు. అందులో "జబర్దస్త్ వల్లనే నేను ఇంత హెల్తీగా ఉన్నాను" అని అప్పట్లో చెప్పారు రోజా.  దాన్ని చూసి "అప్పుడు అది  నా ఫీలింగ్" అని ఆమె అన్నారు. "మరి జబర్దస్త్ అంటే నాకు ఇష్టం, మీరంతా నా ఫామిలీ అని చెప్పారు. మంత్రి పదవి వచ్చేసరికి జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోయారు. అంటే మీరు జబర్దస్త్ గురించి చెప్పింది నిజం అనుకోవాలా? లేదంటే మంత్రి కాగానే  వెళ్ళిపోయింది నిజమనుకోవాలా?" అని నూకరాజు అడిగాడు. "అవును మీరంతా నాకు ఇష్టం.. ఇందులో తప్పేముంది" అని రోజా జవాబిచ్చారు. "అదే మేడం నూకరాజు అడిగేది.. 'మీ సక్సెస్ లో జబర్దస్త్ ఉంది కానీ జబర్దస్త్ లో మీరు లేరు' అని అడిగాడు అంతే" అంటూ ఆది కవర్ చేయబోయాడు. "ఏమిటి అందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి పిలిచింది అవమానించడానికా?" అంటూ పూల దండ విసిరేసి ఏడ్చేశారు రోజా. "నేను జబర్దస్త్ ని చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు ఈ షోకి చాలా ధైర్యం చేసి వచ్చాను. మీరే చెప్పండి నేను మంత్రిని కావడం మీకు ఇష్టం లేదా?" అని రోజా అడిగేసరికి "మీరు మంత్రి కావడం మీ అదృష్టం.. మీరు జబర్దస్త్ లో లేకపోవడం మా దురదృష్టం" అన్నాడు ఆది.  "మీకు నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి, లేదా వీలు చూసుకుని నేను వస్తాను, ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ లో కలుద్దాం. అంతేగాని ఎప్పుడూ ఇలా బాధపెట్టొద్దు" అనేసరికి నూకరాజు రోజాకి సారీ చెప్పాడు. ఇక ఫైనల్ గా అందరూ విందు భోజనాలు చేశారు. రోజా దగ్గరుండి అందరికీ వడ్డించి స్టేజి మీద ఉన్న అందరికీ ముద్దలు కలిపి పెట్టింది. ఇలా ఈ వారం దసరా వైభవం స్పెషల్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.

షోకి పిలిచి ఇలా కాంట్రవర్సీ ప్రశ్న వేస్తారా ? ఆలీ మీద ఫైర్ ఐన అల్లు అరవింద్

  ఆలీతో సరదాగా షో గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రతీ వారం కొత్త కొత్తగా సాగిపోతోంది. ఇక ఇప్పుడు కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చారు. "అరవింద్ గారి ఫామిలీకి, చిరంజీవి గారి ఫామిలీకి మధ్య చిన్న డిస్టర్బన్స్ వచ్చింది ఏమిటది " అని ఆలీ అడిగేసరికి " మీరు కాంట్రవర్షియల్ ప్రశ్నలు అడుగుతాను అంటే అవి ముందు చెప్పండి అన్నాను..ఆబ్బె ఏమీ లేదండి సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉన్నాయన్నారు. అందులో ఇదొకటా" అంటూ ఆలీ మీద సీరియస్ అయ్యారు అల్లు అరవింద్. ఇక తన మనవరాలు గురించి ఎక్కువ చెప్పకూడదు కానీ అల్లు అర్హ చాలా తెలివైనది, అల్లరిది అని చెప్పారు. "మీ నాన్నగారు ఎప్పుడైనా తెలివిగలవాడేనా అని మిమ్మల్ని చూసి అనుకున్నారా" అని అడిగేసరికి "అనుకునే ఉంటారు. ఎందుకంటే నాకు 18 ఏళ్ళ వయసున్నప్పుడు ఫైనాన్సియల్ గా కొన్ని సలహాలు అడిగేవారు. చిన్నప్పుడు ఎవరో ఒక షూటింగ్ కోసం 12000 మాత్రమే ఇస్తానన్నారు. ఐతే నాన్నకు 15000 కావాలి కాబట్టి సింగల్ పేమెంట్ తీసుకుని షూటింగ్ ఐపోయేంత వరకు ఉంచుకుని ఇంటరెస్ట్ వేసి 15000 అడుగు. సరిపోతుందని సలహా ఇచ్చా" అన్నారు అల్లు అరవింద్.

చంద్ర, సుధీర్ తిరిగి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ...? గెటప్ శీను హాట్ కామెంట్స్!

పాన్‌ ఇండియా లెవల్లో చిరు నటించిన గాడ్ ఫాదర్ మూవీ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా గెటప్ శీను చిరుతో కలిసి వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్ లో ట్రావెల్ చేయడం, ఆయనతో కలిసి భోజనం చేయడం వీటిని శీను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసాడు. తన అభిమాన నటుడితో ఇలా కలిసి ప్రయాణించడం గొప్ప అనుభూతి అని చెప్పాడు. అలాగే ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుతో తన జర్నీ గురించి అలాగే జబర్దస్త్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు గెటప్ శీను. అలాగే ఒక బౌల్ లో జబర్దస్త్ కమెడియన్స్ నేమ్స్ చిట్టీలుగా వేసి తీయించాడు యాంకర్. చమ్మక్ చంద్ర పేరు వచ్చేసరికి "ఆయన్ని చాలా మిస్ అవుతున్నా... ఎంతో డెడికేటెడ్ పర్సన్..ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎన్ని సార్లైనా రిహార్సల్స్ చేసి ఆ స్కిట్ ని పెర్ఫార్మ్ చేస్తాడు. తిరిగి మళ్ళీ జబర్డస్త్ కి వచ్చేస్తే బాగుంటుంది..వచేస్తాడేమో అనిపిస్తోంది" అన్నాడు గెటప్ శీను. తర్వాత సుధీర్ పేరు లిస్ట్ వచ్చేసరికి. "నాలుగు షోలు చేసిన కింగ్ వాడు. జబర్దస్త్ కి సుధీర్ తిరిగి వచ్చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఒకప్పుడు రాంప్రసాద్ కి మేం దూరమైతే ఎలా బాధపడ్డాడో ఈరోజు నేను రాంప్రసాద్ సుధీర్ లేకపోవడంతో అంతే బాధగా ఉన్నాం...జబర్దస్త్ కి తిరిగి వచేస్తాడనిపిస్తోంది. ఎందుకంటే సుధీర్ చైర్ అలాగే ఖాళీగా ఉంది" అని చెప్పాడు. 

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్మాల్ స్క్రీన్ స్టార్స్..షో పైకి లేస్తుందా ?

బిగ్ బాస్ సీజన్ 6  భయంకరమైన బోర్ కొట్టిస్తోంది ఆడియన్స్ కి.  ముందు హోస్ట్ ని మార్చేస్తే చాలా బెటర్ అనుకుంటున్నారు బిగ్ బాస్ ఫాన్స్. కింగ్ హోస్టింగ్ సప్పగా ఉండడం వలన టీఆర్పి రేటింగ్ కూడా పడిపోతోంది. స్టార్టింగ్ సీజన్స్ లో జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి వాళ్ళు చేసినప్పుడు ఎంత రేటింగ్ వచ్చేదో అందరికీ తెలుసు. కింగ్ ని రీప్లేస్ చేసి వాళ్ళతో షో నడిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పటివరకూ జరిగిన ఐదు  సీజన్ల టీఆర్పీ పెద్ద ఆశాజనకంగా లేదు.  ఇక ఈ  సీజన్ 6  గురించి చెప్పనే అక్కరలేదు. ఈ సీజన్  మీద సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ కూడా ఎక్కువైపోయింది. అందుకే షోని మధ్యలో ఆపేయలేక హౌస్ మేట్స్  మధ్య  గొడవలు పెడుతూ యాజమాన్యం ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. కానీ వర్కౌట్ కావట్లేదు అని అర్ధం చేసుకుని మరో ప్లాన్ ని లైన్ లో పెట్టడానికి రెడీ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీని అడ్డం పెట్టుకుని ఫేమస్ స్మాల్ స్క్రీన్ స్టార్స్ ని హౌస్ లోకి పంపించి ఎంటర్టైన్ చేయించడానికి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవకముందు కొంతమందిని సంప్రదించినట్టుగా పేర్లు వినిపించాయి కానీ వాళ్ళు మాత్రం హౌస్ లో కనిపించలేదు.  ఈ వైల్డ్ కార్డు ఎంట్రీతో అప్పుడు సంప్రదించిన వాళ్లందరినీ ఇప్పుడు తేవడానికి భారీగానే ఎత్తుగడ వేస్తున్నారనిపిస్తోంది. ఈ వైల్డ్ కార్డు ద్వారా బుల్లి తెర జబర్దస్త్ స్టార్స్ ఐన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ఎంట్రీ ఇచ్చి అలరించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సుధీర్, ఆది ప్రూవెన్ ఆర్టిస్టులు, బిజీ ఆర్టిస్టులు కూడా.. మరి బిగ్ బాస్ ని గొడవలతో, కొట్లాటలతో పైకి లేపలేక అవస్థలు పడుతున్నారు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వీళ్ళను పంపించి  షోని ఏ రేంజ్ కి తీసుకెళ్తారో చూడాలి.