'జై బాల‌య్యా' పాట‌కు రెచ్చిపోయిన కంటెస్టెంట్స్‌!

పన్నెండో రోజు బిగ్ బాస్ హౌస్ చాలా సందడిగా జరిగింది. డీజే పాటలకు కంటెస్టెంట్స్ వేసిన‌ స్టెప్పులు ప్రేక్షకులను అలరించాయి. "జై బాలయ్యా" పాట రాగానే కంటెస్టెంట్స్ అందరూ రెచ్చిపోయి డ్యాన్స్ చేసారు. పాట ముగిసాక "జై బాలయ్య జైజై బాలయ్య" అంటూ కాసేపు మంచి జోష్ మీదున్నట్టుగా అనిపించారు. "రెండో వారం ఎవరు కెప్టెన్ గా ఉండాలో నిర్ణయించాలి కాబట్టి ఓటింగ్ ప్రక్రియను ప్రతీ డీజే పాట పూర్తి అయిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు వచ్చి మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో తమ ఓట్ ఎవరికో చెప్పాల్సి ఉంటుంది" అని బిగ్ బాస్ చెప్పాడు.  ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి నాలుగు ఓట్లతో రాజ్ గెలిచాడు. "రాజ్.. మీరు ఇంటి కెప్టెన్ అయినందున మిమ్మల్ని అభినందిస్తున్నారు బిగ్ బాస్. ఫినోలెక్స్ పైప్స్ సింహాసనం మీద కూర్చొని బాధ్యతలు స్వీకరించు" అని బిగ్ బాస్ చెప్పాడు. హౌస్ మేట్స్ అందరూ 'రాజ్ రాజ్ ' అంటూ అరుస్తూ అభినందనలు తెలిపారు.  ఆ తర్వాత ఇనయా బెడ్రూం కి వెళ్ళి ఏడ్చింది. తను ఏడ్వడం చూసి చంటి, వాసంతి వచ్చి ఓదార్చారు. తర్వాత "ఇక్కడ ఎవరూ అమాయకులు కాదు. నీ గేమ్ నాకు అర్థమ‌వుతోంది. ఎవరి గేమ్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు. నేను జాగ్రత్తగా ఉంటాను" అని గీతూతో అన్నాడు ఆదిరెడ్డి. గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా,ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు.

'నాన్న ఉన్నా, చనిపోయాడని చెప్తాను' అంటూ ఎమోష‌న‌ల్ అయిన‌ మెరీనా!

హౌస్‌లో పదకొండో రోజు "సిసింద్రీ టాస్క్ లో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకని ఒక్కొక్కరుగా వచ్చి మీ జీవితంలో బేబి ఉన్నారా? ఉంటే వారితో ఎలా ఉండేది మీ అనుబంధం వివరించండి అని బిగ్ బాస్ చెప్పాడు. కెప్టెన్ గా ఉన్న ఆదిత్య ఒక్కొక్కరి పేరు పిలవ‌గా, వారు వచ్చి త‌మ అనుభ‌వాలు పంచుకున్నారు. మెరీనా-రోహిత్ త‌మ‌ గురించి చెప్పడానికి వచ్చారు. మెరీనా మాట్లాడుతూ, "మా నాన్న ఉన్నాడు. కానీ ఎవరు అడిగినా చనిపోయాడు అని చెప్తాను. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుండి రాలేదు. ఎప్పుడూ అమ్మని కొడుతుండేవాడు. మా అమ్మని నాన్న గది లోపల కొడుతూ ఉంటే బయట నేను ఏడుస్తూ ఉండేదాన్ని. ఓదార్చ‌డానికి ఎవరూ ఉండేవారు కాదు. నాన్న ప్రేమ తెలియదు. కానీ పెళ్ళితో రోహిత్ నాకు ఎవరూ లేరు అనే లోటును తీర్చాడు. బాగా చూసుకుంటున్నాడు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. నాల్గవ నెల న‌డుస్తుండ‌గా హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తే హార్ట్‌ బీట్ లేదు. బేబీని తీసేయాలని డాక్టర్ లు చెప్పారు. నేను ఒప్పుకోలేదు. కానీ తప్పలేదు. చాలా ఏడ్చాను. రోహిత్ ఎంత‌గానో ఓదార్చాడు" అని చెప్పుకొచ్చింది.  దీంతో హౌస్ లోని ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత అభినయశ్రీ, 'One day you will get baby' అని చెప్పింది మెరీనాతో. తర్వాత వంతు చంటిది. అత‌ను మాట్లాడుతూ, "నాకు ఇద్దరు కూతుళ్లు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నా కళ్ళ ముందే మా అమ్మ మంటల్లో కాలి చనిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు నాకు పాప పుట్టింది. పాపను చూడగానే పట్టరాని సంతోషం. కంటి నిండా కన్నీరు. హాస్పిటల్ బయటకు వెళ్ళి ఒక టీ షాప్ దగ్గర నిల్చోని మా అమ్మే వచ్చిందని ఒక గంట సేపు ఏడ్చాను. తర్వాత మరో పాప పుట్టింది. ఇప్పుడు రోజూ వాళ్ళు స్కూల్ కి వెళ్ళాక నేను లేస్తాను. వాళ్ళు పడుకున్నాక నేను ఇంటికి వస్తాను. ఆ దేవుడు మా అమ్మను ఇద్దరిగా పుట్టించాడు. పిల్లలని కనే తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నా.. అడుక్కు తినండి కానీ పిల్లల్ని రోడ్ల మీద వదిలేయకండి ప్లీజ్ "అని చెప్పి వెళ్ళిపోయాడు.

బిగ్ బాస్ లోకి అతిథులుగా అడుగుపెట్టిన సుధీర్ బాబు, కృతి శెట్టి!

బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతీవారం అతిథులుగా సెలెబ్రిటీస్ రావడం కామన్.  అయితే ఈ వారం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీలో నటించిన సుధీర్ బాబు, కృతి శెట్టి వచ్చారు. సుధీర్ బాబు, కృతి శెట్టి కంటెస్టెంట్స్ తో కాసేపు వారిద్దరు కలిసి నటించిన సినిమా గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. తర్వాత "ఎవరు బాగా పర్ఫామెన్స్ చేస్తారో వారికి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది" అని సుధీర్ బాబు, కంటెస్టెంట్స్ తో చెప్పాడు. శ్రీహాన్, ఫైమా 'పోకీరి' మూవీ పేరడీ చేసారు. గీతూ చిన్నపాపలా మిమిక్రీ చేసి ఆకట్టుకుంది. ఈ పేరడితో కాసేపు అందరూ బాగా నవ్వుకున్నారు. 'ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. అయితే ఆ అమ్మాయి ఒకేసారి ద్విపాత్రాభినయం చేయాలి' అని సుధీర్ బాబు కంటెస్టెంట్స్ తో చెప్పాడు.ఈ టాస్క్ చేయడానికి శ్రీసత్య, రాజ్ ముందుకు వచ్చారు. శ్రీసత్య తన నటనతో మెప్పించింది. శ్రీహాన్ మధ్యలో సపోర్టింగ్ క్యారెక్టర్ గా వచ్చి బాగా నటించాడు. ఆ తర్వాత సుధీర్ బాబు, కృతి శెట్టి కలిసి బెస్ట్ యాక్టర్ గా శ్రీహాన్ ని, బెస్ట్ యాక్ట్రెస్ గా శ్రీసత్యని ప్రకటించారు. కాసేపటి తర్వాత సుధీర్ బాబు, కృతి శెట్టికి మెయిన్ గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోమని బిగ్ బాస్  చెప్పాడు. అలా అతిథులతో పన్నెండో రోజూ కంటెస్టెంట్స్ కాసేపు సరదగా గడిపారు. గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ ఈ వారం నామినేషన్లో ఉన్నారు.

కొరియన్ భాషలో మాట్లాడి హోస్ట్ ని భయపెట్టిన కమెడియన్ రోహిణి!

డాన్స్ ఇండియా డాన్స్ షో ప్రతీ వారం కొత్త కొత్త పెర్ఫార్మెన్సులతో అలరిస్తోంది. ఇక ఈ షోకి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షో కి శాకినీ డాకిని మూవీ హీరోయిన్స్ రెజీనా కాసాండ్రా, నివేద థామస్ వచ్చారు. ఇక హోస్ట్ అకుల్ బాలాజీ ఆ ఇద్దరితో కలిసి డాన్స్ చేసేసరికి కో - హోస్ట్ కమెడియన్ రోహిణి కౌంటర్ వేసేసింది. "ఇద్దరు హీరోయిన్లు దొరికారని పెద్ద హీరో ఇపోయావ్ కదా నువ్వు అంటుంది. హీరో దొరికినప్పుడు నేను వదల్లేదా నీకు అని రివర్స్ కౌంటర్ వేస్తాడు" అకుల్ బాలాజీ. "నేనంటే అందమైన ఆడపిల్లని తప్పదు" అని రోహిణి అనేసరికి సంగీత గట్టిగా నవ్వేస్తుంది. వెంటనే రోహిణి స్టేజి మీదకు వచ్చి "సారంగియే" అని కొరియన్ లో చెప్పేసరికి అకుల్ బాలాజీకి ఏమీ అర్ధం ఆ పదానికి అర్థమేంటి అని  అడిగేసరికి "ఐ లవ్ యు " అని నవ్వుతూ చెప్తుంది నివేద థామస్. "నాకు ఈ స్టేజి మీదకు ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. కంటెస్టెంట్స్ మంచి ఎనెర్జీ తో డాన్స్ చేస్తున్నారు" అంది నివేదా. ఇక జడ్జెస్ , గెస్ట్స్ అంతా కలిసి కంటెస్టెంట్స్ తో డాన్స్ చేసి స్టేజిని కాసేపు వేరే లెవెల్ కి తీసుకెళ్లారు.  ఇక ఫైనల్ గా ఒక కంటెస్టెంట్ ని రీప్లేస్ చేయాల్సి వచ్చిందని హోస్ట్ చెప్పి కావ్య అనే మరో కంటెస్టెంట్ ని ఈ స్టేజి మీదకు తీసుకొచ్చారు. ఆమె పేరు కావ్య అని అనౌన్స్ చేసి ఇంతకు కావ్య ఎవరు , ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి ఈమె టాలెంట్, ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తోంది అనే విషయాలు తెలుసుకోవాలనుందా అనడంతో ప్రోమో కట్ చేశారు. ఇక ఈ కావ్య ఎవరో తెలియాలంటే ,  ఈ షోలో డాన్స్ పెర్ఫామెన్సులు ఎలా ఉన్నాయో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేశాను!

ధనాధన్ ధన్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు ధన్ రాజ్. జబర్దస్త్ కి రాక ముందే ఎన్నో మూవీస్ లో కూడా  నటించాడు. ఇప్పుడు కూడా మూవీస్ లో నటిస్తున్నాడు కానీ మల్లెమాల టీమ్ నుంచి ఆయన ఎప్పుడో ఆగిపోయాడు. దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.  "జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి తప్పు చేసాను. ఈ విషయంలో నేను వేణును చాలాసార్లు తిట్టాను కూడా. అప్పట్లో మా టీవీలో 'ఆలీ టాకీస్' అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ షోకి ఆలీ గారు అనుకోని కారణాల వలన దూరమయ్యేసరికి ఆ షో పేరుని 'మా టాకీస్'గా మార్చారని వేణు చెప్పాడు. ఇక అందులో నేను, నువ్వు యాంకర్స్ అని చెప్పి ఒప్పించాడు వేణు. 'మనం యాంకరింగ్ చేయగలమా?' అని కూడా అడిగాను.. చేయగలం అని చెప్పాడు. అప్పటికి  జబర్దస్త్ లో ఉన్నాం. 'మా టాకీస్' యాంకరింగ్ ఆఫర్  గురించి జబర్దస్త్ దీప్తి గారితో చెప్పాను. అది యాంకరింగ్, ఇది కామెడీ.. రెండూ చేస్తే బాగోదు. ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. 'మా టాకీస్' షో కాంట్రాక్టు అయిపోయిన తర్వాత జబర్దస్త్ కు రావాలని దీప్తి గారు చెప్పారు. నాకు ఆ విషయం ఎంతో నచ్చింది." అని చెప్పుకొచ్చాడు ధ‌న్‌రాజ్. "మా టాకీస్ ఐపోయాక జబర్దస్త్ కి వెళదాం అని అనుకున్నా కానీ అప్పటికే నేను, వేణు లేని లోటును గెటప్ శీను, సుడిగాలి సుదీర్ భర్తీ చేశారు. నేను, వేణు మళ్ళీ జబర్దస్త్ కి వెళ్తే అప్పటివరకు టీమ్ లీడర్లుగా చేస్తున్న వాళ్లు మళ్లీ కంటెస్టెంట్లుగా చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. మేమెందుకు వెళ్లి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనుకుని వెళ్ళలేదు." అంటూ ధన్ రాజ్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

తల్లి కాబోతున్నాన‌ని చెప్పిన‌ 'దేవత' ఫేమ్‌ వైష్ణవి!

స్టార్ మాలో దేవత సీరియల్‌ను ఫాలో అయ్యే వీక్ష‌కులు చాలామందే. ఆ సీరియల్ లో హీరోయిన్‌ సుహాసిని చెల్లిగా చేసిన వైష్ణవి అందరికీ తెలుసు. ఆమె ఎమోషనల్ నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఐతే ఆ మ‌ధ్య ఈ సీరియల్ నుంచి ఆమె పక్కకు తప్పుకుంది. ఆమె ఎందుకు సీరియల్ నుంచి వెళ్లిపోయిందో ఎవరికీ తెలీదు. ఆమె ప్లేస్ లో మరో నటి వచ్చింది. సీరియల్‌ నుంచి బయటికి వచ్చేశాక "వాహ్‌ వైష్ణవి" అనే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి ఫాన్స్ తో టచ్ లో ఉంది. ఈ ఛానల్ ద్వారా ప్రతీ విషయం తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటోంది. వైష్ణవి కరీంనగర్ కు చెందిన సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. దానికి సంబంధించిన‌ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. కానీ తర్వాత చాలా రోజుల పాటు యూట్యూబ్ లో ఆమె ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ లేదు. ఇప్పుడు ఒక కొత్త వీడియోతో ఫ్యాన్స్ ముందుకొచ్చింది వైష్ణవి.  ఆమె త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది. వారి కుటుంబంలోకి కొత్త మెంబర్‌ రాబోతున్నట్లు ఈ వీడియో ద్వారా చెప్పింది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాలేదని, బాగా వాంతులు వాంతులవుతున్నాయని, కాబట్టి ఆడియన్స్ ముందుకు రాలేకపోయాయని, ఇక ఇప్పుడు కాస్త ఓపిక తెచ్చుకుని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

సుదీప తన గురించి చెప్తుంటే ఏడ్చేసిన కంటెస్టెంట్స్!

  పదకొండో రోజు బిగ్ బాస్ హౌస్ లో 'నిన్న జరిగిన సిసింద్రీ టాస్క్ లో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకని ఒక్కొక్కరుగా వచ్చి మీ జీవితంలో బేబి ఉన్నారా ? ఉంటే వారితో ఎలా ఉండేది మీ అనుబంధం వివరించండి' అని బిగ్ బాస్ చెప్పాడు. సుదీప మాట్లాడుతూ, "నా కాళ్ళ మీద నేను బ్రతకాలని బయటకు వచ్చేసాను. 2015 లో ప్రెగ్నెన్సి కన్ఫమ్ అయ్యింది. బేబీ హార్ట్ బీట్ వచ్చింది. అయితే నాకు థైరాయిడ్ ఉంది. అది చూసుకోలేదు. థైరాయిడ్ హై అయింది. I lost my baby. తర్వాత చాలా ఏడ్చాను. ఎంత ఏడ్చినా మన బేబీ రాదు అని మా ఆయన చాలా ధైర్యం చెప్పాడు. మా చెల్లికి కూతురు  పుట్టే వరకూ నేను మామూలు అవ్వలేదు. మా చెల్లి కూతురిని తెచ్చుకొని ఆడుకునేదాన్ని. అప్పుడు మా ఆయన అనేవాడు 'తను వాళ్ళ కూతురు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి'. అందరి పిల్లలు నా దగ్గరకు వస్తారు. కానీ నా పిల్లలే రావట్లేదు అని నా భర్త అన్నాడు. తను అలా అనగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు" అని సుదీప చెప్పుకొచ్చింది. ఇది వింటూ  అందరూ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇనయా సుల్తానా, కీర్తీభట్ చాలా ఏడ్చారు. పదకొండో రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు.

నా కళ్ళ ముందే మా అమ్మ కాలిపోయింది!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6 గురించి పర్లేదు అనే టాక్ వినిపిస్తోంది. ఐతే ఆడియన్స్ ని కట్టి పడేయడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ని ఎంచుకున్నాడు. అదే కంటెస్టెంట్స్ లైఫ్ లో జరిగిన ఎమోషనల్ స్టోరీస్ చెప్పిస్తూ ఆడియెన్స్ ని కట్టి పడేసాడు. ఇక ఈ హౌస్ లో అందరూ తమ తమ కన్నీటి కథలు చెప్పుకొచ్చారు. అందరినీ నవ్వించే చంటి జీవితంలో కూడా ఒక విషాదం ఉంది. ఇప్పటి వరకు తెలియని బాధ ఈ బిగ్ బాస్ హౌస్ లో తెలిసింది.  "అందరికీ చెప్తున్నా.. నేనెప్పుడూ  ఆడపిల్లలంటే దూరంగా ఉంటాను. వాళ్ళను ఎక్కువగా అభిమానించను.. నేను ఉదయం  నిద్రలేచే సమయానికి నా కూతుళ్లు స్కూల్‌కి వెళ్లిపోతారు. వాళ్లు నిద్రపోయాక నేను ఇంటికి వస్తాను. వాళ్లకు కావాల్సినవి కొనిస్తాను, ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను. వాళ్ళతో కొంత సమయం గడుపుతాను కానీ  ఎక్కువగా దగ్గరవ్వను.. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రేమించే వాళ్ళెవరూ నా దగ్గర ఉండరు.. అది కన్ఫర్మ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే నేను ఎక్కువగా ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోదల్చుకోలేదు. అది నా సెంటిమెంట్‌ కూడా. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఊహ తెలిశాక అమ్మ నా కళ్ల ముందే ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. వాళ్ళు లేకపోయేసరికి అన్నా, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం” అని చెప్తూ ఎమోషన్ అయ్యాడు చంటి.  “నేను కాస్త సెటిలయ్యాక , పెళ్లి చేసుకున్నాను. తర్వాత  నాకు  కూతురు పుట్టింది.. చిన్న పాపను నా చేతిలో పెట్టారు. నాకు ఎత్తుకోవాలన్నా భయం. ఆ పాపను చూసేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. కింద టీ కొట్టు ఉంటే అక్కడికి వెళ్లి గంటన్నర ఏడ్చాను. మా అమ్మే మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఒక్కరిగా కాదు ఇద్దరిగా..  తల్లిదండ్రులు అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. అడుక్కు తినండి కానీ, పిల్లలను రోడ్డు మీద వదిలేయకండి. తల్లిదండ్రులు లేని పిల్లల బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఓపిక లేకపోతే కనకండి. ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంది అదే” అంటూ చంటి ఎమోషనల్‌గా మాట్లాడేసరికి అందరూ కూడా ఎమోషనల్‌ అయ్యారు.

రౌడీవేర్ నుంచి ఎలాంటి ఫాషన్ వేర్ ఐనా తీసుకో!

ఆహా వేదికగా ఫస్ట్ టైం డాన్స్ ఐకాన్ ప్రోగ్రాంని  లాంచ్ చేశారు. ఈ డాన్స్ షోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చి ఆనంద్ అనే కుర్రాడికి భరోసా ఇచ్చి తన మంచితనం చాటుకున్నాడు. డాన్స్ కంటెస్టెంట్స్ లో  ఒక కంటెస్టెంట్ బాధలు విని కరిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక స్లమ్ ఏరియా నుంచి  ఆనంద్ అనే కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో డాన్స్ ఐకాన్ స్టేజి పై  డాన్స్ చేసి అందరిని ఫిదా చేసేసాడు.  ఇక  తన గురించి హోస్ట్  చెబుతూ ఆనంద్ కు అమ్మ అంటే ఎంతో ఇష్టం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేక ఇలా మామూలు బట్టలతో ఈ స్టేజి మీదకు వచ్చి టాలెంట్ నిరూపించాడు అని చెప్పారు.  ఆ మాటలకు  విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. అతని డాన్స్ ను మెచ్చుకుంటూనే.. గతంలో తాను అనుభవించిన కష్టాల గురించి  గుర్తు చేసుకున్నాడు.  తన ఫస్ట్ మూవీ  "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా చేస్తున్న టైములో ప్రొమోషన్స్ కోసం వెళ్ళడానికి  తన దగ్గర కూడా సరైన బట్టలు లేవని ఆ మూవీ  ప్రొడ్యూసర్ ని అడిగి కాస్ట్యూమ్ వేసుకొని ప్రమోషన్ కి వెళ్ళానని తెలిపారు.  అంతే కాదు కాస్ట్యూమ్ లేవని బాధపడకు అని చెప్తూనే తను రన్ చేస్తున్న రౌడీ వేర్ నుంచి తనకు కావాల్సినన్ని  ఫ్యాషన్ వేర్స్ పంపుతానన నచ్చిన స్టైల్ వేసుకుని డాన్స్ పెర్ఫామెన్స్  చేయమని  విజయ్ దేవరకొండ ఆనంద్ కు హామీ  ఇచ్చేసాడు.  ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి మూవీ చేస్తున్నాడు విజయ్.

కంటెస్టెంట్స్ తో పాటూ ప్రేక్షకులలో  స్పూర్తిని నింపిన ఆదిరెడ్డి స్పీచ్!

పదకొండో రోజు బిగ్ బాస్ హౌస్ లో  'నిన్న జరిగిన సిసింద్రీ టాస్క్ లో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకని ఒక్కొక్కరుగా వచ్చి మీ జీవితంలో బేబి ఉన్నారా ? ఉంటే వారితో ఎలా ఉండేది మీ అనుబంధం వివరించండి అని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్పాడు. కెప్టెన్ గా ఉన్న ఆదిత్య ఒక్కొక్కరి పేరు పిలుస్తాడు వారు వచ్చి మీ అనుబంధం గురించి చెప్పండి ' అని అన్నాడు. మొదటగా ఆదిరెడ్డి తన గురించి మాట్లాడుతూ... 'మా అమ్మ 2013 లో బాత్రూంలో ఉరి వేసుకొని చనిపోయింది. అప్పట్లో మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ అప్పుల బాధ తట్టుకోలేక అమ్మ ఉరి వేసుకొని చనిపోయింది.  నా అంత హైట్ లో ఉండేది మా అమ్మ. బాత్రూం కాస్త ఎత్తులో ఉండేది అంతే, దానికి ఉరి వేసుకొని చనిపోయింది అంటే ఎంత నరకం అనిపించిందో పాపం'. అది చూసి కంటెస్టెంట్స్ కూడా ఏడ్చేసారు. 'అందుకే అందరికీ చెప్తున్నా కష్టాలు ఉన్నాయని ఎవరూ సూసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కష్టాలు అనుభవించినవారే, తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవడానికైనా మనం బ్రతికుండాలి. మన వాళ్ళ కోసం అయినా మనం బ్రతికుండాలి ' అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. 'నాకు బేబీ పుట్టకుముందు పిల్లలు అంటే అంత ఇష్టం ఉండేదీ కాదు. మా అక్కకు కళ్ళు కనపడవు. నేనే ఇల్లు చూసుకునేవాడిని. నా భార్య డెలివరీ టైం లో నేను నెల్లూరు వెళ్లాను. బేబీ పుట్టిన తర్వాత ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది. బేబీ  కళ్ళు సరిగ్గా చూడట్లేదని చెప్పారు. వెంటనే నేను వచ్చేసాను. తర్వాత డాక్టర్ కి తీసుకెళ్ళి చూపించాను.కళ్ళు బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత మా అమ్మ పుట్టింది అని చాలా సేపు ఏడ్చాను. ఆ క్షణం నుండి కంటికిరెప్పలా చూసుకుంటున్నాను. అయితే బేబీ పుట్టినప్పుడు నువ్వు నా పక్కన లేవు అని ఇప్పటికీ నా భార్య నన్ను అంటూనే ఉంటుంది. నా కూతురు పేరు 'అద్విత'. అందుకే నిన్న జరిగిన సిసింద్రీ టాస్క్ లో ఇచ్చిన బేబీని అద్విత అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నా' అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. పదకొండో‌ రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు. 

ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ..

బిగ్ బాస్ సీజన్ 6 అలా చక్కగా సాగిపోతోంది. ఐతే బిగ్ బాస్ ఈసారి హౌస్ మేట్స్ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పడిన ఇబ్బందులను చెప్పమని అడిగేసరికి అందరూ వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ స్టోరీస్ చెప్పుకొచ్చారు. ముందుగా సుదీప మాట్లాడింది . తాను ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో థైరాయిడ్ సమస్య వల్ల బేబీని పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పింది. ఇక కీర్తి మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన భయంకరమైన సంఘటనలు గురించి చెప్పింది . దేవాలయానికి వెళ్లి వస్తూ.. తన కుంటుంబం అంతా కారు యాక్సిడెంట్ లో మరణించారని. ఫ్యామిలీ మొత్తం మీద తాను ఒక్కతినే బతికాకాని అసలెందుకు ఎందుకు బతికానురా  దేవుడా అనుకున్నానంటూ ఏడ్చేసి.. హౌస్ లో అందరిని ఏడిపించేసింది కీర్తి. బంధువులు కూడా తన ఆస్తిని తీసుకుని తనను రోడ్డు మీద వదిలేశారంటూ బాధపడింది.  ఇంట్లో వాళ్లంతా చనిపోయాక ఒక పాపను దత్తత తీసుకుందని చెప్పింది. తాను బిగ్ బాస్ హౌస్ కు వచ్చే ముందు ఆ బిడ్డకు వచ్చిన అనారోగ్య సమస్య వలన ఆమె కూడా చనిపోయిందని చెప్పింది. పోనీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారనే ఆశ కూడా లేదని ఎందుకంటే యాక్సిడెంట్ లో తన గర్బసంచి తీసేశారంటూ.. కీర్తి చెపుతుంటే.. హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా  ఉన్న మెరీనా జంట కూడా ఎమోషనల్ స్టోరీ చెప్పారు. మెరీనాకు రెండు సార్లు అబార్షన్ అయ్యిందని. లాక్ డౌన్ టైంలో చాలా నరకం చూసిందని కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడు రోహిత్. మరో పక్క సింగర్ రేవంత్ వాళ్ళ స్టోరీ వింటూ చాలా బాధపడ్డాడు. ఇక అభినయశ్రీ ఈసారి మంచి పాప పుడుతుంది అంటూ రోహిత్, మెరీనాకు ధైర్యం చెప్పింది . ఇలా హౌస్ మేట్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ స్టోరీస్ ని చెప్పుకొచ్చారు.

వాళ్ళిద్దరి ప్రేమ స్టేజి వరకే.. ఫైమా దృష్టి అంతా కెరీర్ మీదే!

పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ ఫైమా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ ఐన పర్సన్స్. ఫైమా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ స్టేజి పై ప్రవీణ్ రాసిన ఫన్నీ ప్రేమలేఖను చదివి హౌస్ లోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారంటూ చాలా షోస్ లో చెప్పిన విషయం తెలిసిందే. ఐతే ఇటీవల వీళ్ళ పెళ్లి విషయం గురించి ఫైమా వాళ్ళ అమ్మ కొన్ని ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "ప్రస్తుతానికి మా అమ్మాయి కాన్సంట్రేషన్ అంతా కెరీర్ మీదే ఉంది" అని చెప్పింది. మరి సోషల్ మీడియాలో ప్రవీణ్ తో ప్రేమ విషయం వార్తల గురించి ఏంటి అంటూ ఆమెను ప్రశ్నించగా.. "అదంతా స్టేజి వరకే.. ప్రేమ, పెళ్లి అంటూ ఇంట్లో మాకెవ్వరికీ చెప్పలేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది. "ప్రవీణ్ మా ఇంట్లో కలిసిపోతాడు. ఎందుకంటే మాకు కొడుకులు లేరు కాబట్టి అతను కూడా కొడుకు లెక్క మంచిగా ఉంటాడు" అంది ఫైమా వాళ్ళ అమ్మ. ఐతే ఆడియన్స్ కి కూడా ఫైమా కొంచెం కొంచెంగా నచ్చుతోంది. అటు జబర్దస్త్ లోనూ ఆమెకు మంచి సపోర్ట్ దొరుకుతోంది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఆటకు ఆడియన్స్ కూడా ఓట్లేసి ఆమెను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.

బర్నింగ్ స్టార్ నెక్స్ట్ మూవీ లో కండక్టర్ ఝాన్సీ కి బంపర్ ఆఫర్!

కొంచెం టాలెంట్ ఉండి సోషల్ మీడియాలో పాపులర్ ఐతే చాలు ఆఫర్స్ వెతుక్కుంటూ ఇంటికే వస్తాయి. ఇటీవల అలా డాన్స్ లో ఫేమస్ ఇన మహిళ గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ. ఓవైపు కండక్టర్ జాబ్ చేస్తూ గుర్తింపు తెచుకుంటూనే  మరోవైపు డాన్సర్ గా చేస్తోంది. తన కష్టానికి ఇన్నేళ్లకు మంచి ప్రతిఫలం దక్కింది.   గతంలోనే పలు ప్రముఖ డాన్స్ షోస్ లో  కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసే  ఝాన్సీ.. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ షోలో చేసిన ‘పల్సర్ బైక్’ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఒక్కసారిగా ఝాన్సీని స్టార్ ని చేసేసింది. అప్పటినుండి ఎక్కడ చూసినా ఝాన్సీ పేరే వినిపిస్తోంది. ఐతే ఇటీవల ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక గుడ్ న్యూస్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నెక్స్ట్ మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ ఇచ్చారని ఆ విషయాన్ని ఆయన ఫోన్ చేసి అడిగారని చెప్పింది.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఈమెకు స్టార్ గుర్తింపు లభిస్తోంది. తాను పని చేసే చోట కూడా ఒక సెలబ్రిటీలా చూస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే  ఇంటర్ పూర్తయ్యాక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఝాన్సీ చేసే ప్రతి పనిలో తన భర్త అండగా ఉంటాడని చెప్పింది. భర్తతో పాటు,  గురువు రమేష్ మాస్టర్ సపోర్ట్ కూడా చాలా ఉందని చెప్పింది ఝాన్సీ.

పుట్టినరోజు బహుమతిగా ఖరీదైన కారు, డైమండ్ నెక్లెస్ అందుకున్న అష్షు

అష్షు రెడ్డి సోషల్ మీడియా స్టార్. ఇప్పుడు అష్షు రెడ్డి ఒక కార్ ఓనరమ్మ అయ్యింది. అష్షు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి నుండి లగ్జరీ బెంజ్ కారుని బహుమతిగా పొందింది . ఈ విషయం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో  పోస్ట్ చేసింది. " ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే.." అంటూ టాగ్ లైన్ పెట్టింది అష్షు. కారుతో పాటు  తన తండ్రితో  దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరినుంచో మంచి కాస్ట్లీ గిఫ్ట్ కూడా అందుకుంది అష్షు. ఒక జ్యువెలరీ  షాప్ కి వెళ్లిన అష్షు అక్కడ ఉన్న  డైమండ్  నెక్లెస్ లు చాలా వాటిని ట్రై చేసింది. ఫైనల్ అన్ని మోడల్స్ లోకి ఒకటి సెలెక్ట్ చేసుకుంది. దాని ఖరీదు రూ. 7.5 లక్షల విలువైన  డైమండ్ నెక్లెస్ ను సొంతం చేసుకుంది. ఇక తన బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ బర్త్ డే పార్టీ కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాగే తన ఫ్రెండ్స్ , బుల్లితెర నటులు బిగ్ బాస్ హౌస్ మిత్రులతో ఫుల్ జోష్ తో పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంది అష్షు.  

దారుణంగా పడిపోయిన 'బిగ్ బాస్' రేటింగ్!

బిగ్ బాస్ షో తెలుగు ఆరో సీజన్ ఇటీవల ప్రారంభమైంది. అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. బిగ్ బాస్-6 ఫస్ట్ ఎపిసోడ్ కి దారుణమైన రేటింగ్ వచ్చింది.   2017లో బిగ్ బాస్ తెలుగు ప్రకటన వచ్చినప్పుడు.. ఈ షోని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ఈ షోని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. లాంచ్ ఎపిసోడ్ కి ఏకంగా 16.18 రేటింగ్ వచ్చింది. రెండో సీజన్ ని నాని హోస్ట్ చేయగా ఫస్ట్ ఎపిసోడ్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో 15.05 రేటింగ్ వచ్చింది. ఇక మూడో సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వచ్చాక రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. మూడో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి 17.9, నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి 18.5 రేటింగ్ తో సంచలనం సృష్టించాడు నాగ్. ఐదో సీజన్ కి కాస్త తగ్గినప్పటికీ 15.71 అనేది మంచి రేటింగ్ అనే చెప్పాలి. అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్-6 లాంచ్ ఎపిసోడ్ రేటింగ్ మాత్రం దారుణంగా ఉంది.   బిగ్ బాస్-6 ఫస్ట్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న ప్రసారం కాగా కేవలం 8.86 రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. గత సీజన్లలో నాగ్ సృష్టించిన రికార్డులతో పోలిస్తే సగానికి పడిపోయినట్టే లెక్క. అయితే రేటింగ్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. అదేరోజున ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉండటంతో బిగ్ బాస్-6 రేటింగ్ పై తీవ్ర ప్రభావం పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే సీజన్ సీజన్ కి బిగ్ బాస్ పై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతోంది. పైగా ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు తప్ప సాధారణ ప్రేక్షకులకు తెలిసినవారు పెద్దగా లేరు. గత సీజన్లతో పోల్చితే ప్రమోషన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. ఇలా పలు కారణాలతో బిగ్ బాస్ రేటింగ్ పడి పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ని డాన్స్ షోస్‌లో కింగ్ 'డాన్స్ ఐకాన్‌'!

'డాన్స్ ఐకాన్' పేరుతో ఆహా ఓటీటీలో ఇప్పుడు సరికొత్త డాన్స్ షో స్టార్ట్ అయ్యింది. ఈ షోకి యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి  రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో "కింగ్ ఆఫ్ ఆల్ డాన్స్ షోస్" అంటూ రమ్యకృష్ణ కితాబిచ్చారు. రీసెంట్ గా  డ్యాన్స్ ఐకాన్ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు ఆహా టీం. ఈ ప్రోమోలో డాన్సర్లు తమ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్సులతో స్టేజి మీద పూనకం తెప్పించారు.  శేఖర్ మాస్టర్, శివగామి దేవి ఇద్దరూ ఫుల్ జోష్ తో కనిపించారు. యశ్వంత్ మాస్టర్ కంటెస్టెంట్స్ తో కలిసి స్టెప్పులేసరికి వన్స్ మోర్ అంటూ విజిల్స్ పడ్డాయి. "ఎవరైనా  డాన్స్ చేస్తే వాళ్లకు అలుపొస్తుందేమో.. మాకు మాత్రం ఊపొస్తుంది" అంటూ బాలకృష్ణ లెవెల్లో శ్రీముఖి చెప్పిన మాస్ డైలాగ్ అదిరిపోయింది. రమ్యకృష్ణ వన్స్ మోర్ అనేసరికి శ్రీముఖి ఇంకా రెచ్చిపోయి మళ్ళొకసారి ఆ డైలాగ్ చెప్పి ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. "స్వింగ్ జరా" సాంగ్ కి అదరగొట్టేసింది. ఒక లేడీ కంటెస్టెంట్ ని శేఖర్ మాస్టర్ "నువ్వు హీరోయిన్ మెటీరియల్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇలా లేటెస్ట్ గా రిలీజైన‌ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది. సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ డాన్స్ ఐకాన్ షో  ప్రసారం కానుంది.

కంటతడి పెట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ పదో రోజూ 'లై' మూవీలోని 'బొమ్మోలె ఉన్నదిరా పోరీ బంబాటుగా ఉన్నదిరా నారీ' పాటతో మొదలైంది. గీతూ రాత్రి ఎవర్వికి నిదుర లేకుండా చేసిందని రేవంత్, ఆదిత్యతో చెప్పాడు. గీతూతో శ్రీహాన్ కామెడీ చేసాడు.'అయ్యో గీతూ బొమ్మ‌ కూడా వచ్చేసిందే తోడుగా' అని అన్నాడు. దానికి గీతూ నవ్వుతూ ఏం పర్లేదులే ఇదంతా గేమ్ అని వదిలేసింది. బిగ్ బాస్  టాస్క్ ఇచ్చాడు. టాస్క్ పేరు  ‘రింగ్ లోపల ఉన్నోడే కింగ్’. ఈ టాస్క్ లో చివరి వరకూ రింగ్ లో ఉన్నవారే విజేతని, కాగా టాస్క్ లో రేవంత్ సంచాలకుడిగా వ్యవహరిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. కీర్తీభట్, ఆరోహీ, ఫైమా, అర్జున్, ఇనయా మొదటగా టాస్క్ ఆడారు. ఇందులో కీర్తీభట్ అలసిపోయి ఉండగా అదే అదునుగా చూసుకొని ఇనయా రింగ్ బయటకు తోసేసింది. కీర్తిభట్ చాలా కోపంగా ఇనయా ' నేను అలసిపోయి ఉండగా అలా తోసేస్తావా ? ' అని అడిగింది. దానికి సమాధానంగా 'దిజ్ ఈజ్ మై గేమ్, మై స్ట్రాటజీ' అని చెప్పింది. ఐతే తర్వాత కీర్తీభట్ కి మళ్ళీ ఆడే ఛాన్స్ వచ్చినా,తను ఓపికలేక, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడిపోయింది. అది చూసి కంటెస్టెంట్లు అందరూ భయపడ్డారు. వెంటనే కూర్చోమని చెప్పారు. ఆ తర్వాత గేమ్ లో భాగంగా  రేవంత్, చివరి వరకూ రింగ్ లో ఉన్న ఇనయాని విజేతగా ప్రకటించాడు. బెడ్ రూంలోకి వెళ్ళి ఫైమా ఏడుస్తూ కూర్చుంది. అటుగా వెళ్ళిన కీర్తిభట్  చూసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే 'నాకు బొమ్మ లేదు, నన్ను ఆడకుండా చేసారు. ఇప్పుడు ఈ ఆటలో కావాలని కూర్చోకూడదన్నాడు, ఇలా రేవంత్  నన్ను గేమ్ ఆడకుండా చేసాడు' అని చెప్పుకుంటూ ఏడ్చేసింది. మరో వైపు వాసంతితో  ' నేనెప్పుడూ చూసినా మేకప్ వేసుకుంటానంట అర్జున్ అన్నాడు, అప్పటినుండి నాకు అస్సలు మంచిగా అనిపిస్తలేదు. రాత్రంతా నిద్ర కూడా పోలేదు' అని చెప్పుకుంటూ వాసంతి ఏడ్చేసింది. 'రండే అర్జున్ ని పంపిద్దాం' అని ఆ రోజు నువ్వు అన్నావ్. అసలు ఆడవాళ్ళను అలా అనొచ్చా, ఎందుకు అలా అన్నావ్. అలా నువ్వు అనడం నాకు నచ్చలేదు . ఆరోహీ, రేవంత్ తో చెప్పగా అలా  అనలేదని రేవంత్ అన్నాడు. తర్వాత మధ్యాహ్నం సమయంలో చంటి, రేవంత్ పడుకున్నారు. హౌస్ లో గట్టిగా హారన్ లు మ్రోగాయి. ఆ శబ్దాలకు కెప్టెన్ గా ఉన్న ఆదిత్య వచ్చేసాడు. 'పడుకున్నారా' అని రేవంత్, చంటిని అడిగి, పడుకోకూడదని చెప్పాడు. తర్వాత అక్కడే ఉన్న అర్జున్  శ్రీసత్యతో "పడుకున్నప్పుడు చెప్పాలి కదా, ఏం పీకుతున్నారు మీరు " అని ఆదిత్య అరిచేసాడు. తర్వాత  'ఐస్క్రీం స్కూప్  టైం' గేమ్. ఇనయ సంచాలకురాలిగా ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. రాజ్, షానీ, మెరీనా-రోహిత్ లు పాల్గొన్నారు. ఫస్ట్ రౌండ్ లో రాజ్ గెలిచాడు. రెండో రౌండ్ లో సూర్య, రోహిత్, షానీ ఆడగా మొదటగా సూర్య ఐస్క్రీం స్కూప్ చేయడం వల్ల గెలిచాడు. 'ఇంతటితో సిసింద్రీ టాస్క్ ఐపోయింది, మీ దగ్గర ఉన్న బేబీలకు తగిన విధంగా వీడ్కోలు చెప్పి స్టోర్ రూంలో పెట్టండి'  అని బిగ్ బాస్ చెప్పాడు. బేబీలను స్టోర్ రూం లో పెట్టేముందు ఆరోహీ, కీర్తిభట్ ఏడ్చేసారు. రేవంత్ దగ్గరికి వెళ్ళి 'డిసెంబరులో మంచి పాప పుట్టాలని ఆశీర్వదిస్తున్నా' అని చెప్పేసి వెళ్ళిపోయాడు చంటి. ఈ వారం గీతూ,ఫైమా, ఆరోహీ, అభినయశ్రీ, షానీ, మెరీనా-రోహిత్, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారని బిగ్ బాస్ ప్రకటించాడు.

జానీ మాస్టర్ జీవితంలో ఇంత విషాదం ఉందా?

"ఢీ: ది డ్యాన్సింగ్‌ ఐకాన్" షో ప్రతీ వారం సరికొత్తగా దూసుకుపోతూ ఉంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో జానీ మాస్టర్ రియల్ లైఫ్‌ని ఒక సాంగ్ కమ్‌ స్కిట్ రూపంలో వేశారు కంటెస్టెంట్స్. ఆ సాంగ్ చూసేసరికి జానీ మాస్టర్ సెట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. జానీ మాస్టర్ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో పరిచయమై ప్రాణ స్నేహితుడిలా ఆదుకున్న సిరాజ్ అనే ఫ్రెండ్ సౌదీ వెళ్లి డబ్బు పంపిస్తానని చెప్పాడు. దాంతో మూవీస్‌లో డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది అని సిరాజ్ చెప్పేసరికి జానీ మాస్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడట.  అదే టైంలో సిరాజ్ ఇండియా వస్తున్నా అని చెప్పడంతో ఆనందపడిన జానీ అంతలోనే  ఓ రోడ్డు ప్రమాదంలో సిరాజ్ మరణించాడనే వార్త విని కుంగిపోయాడు. ఆ త‌ర్వాత తన కొడుక్కి ఫ్రెండ్ పేరు పెట్టుకున్నాడు. ఈ విష‌యం చెప్పి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు జానీ. ఈ న్యూ ఎపిసోడ్ లో "ఢీ డ్యాన్సింగ్‌ స్టార్ జానీ మాస్టర్" అంటూ అనౌన్స్ చేసాడు ప్రదీప్. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ "రాసుకునే వాళ్లకు నేను చెప్పేది ఏమిటంటే ఏదన్నా రాసుకోండి కానీ ఢీ స్టేజిని మాత్రం అవమానించవద్దు.. చాలా సీరియస్ గా చెప్తున్నా" అంటూ నేల మీదకు వంగి దణ్ణం పెట్టుకున్నాడు.  ఇక ఫైనల్‌గా జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ డాన్స్ లతో స్టేజిని ఇరగదీసేసారు. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని చోట్ల  జానీ మాస్టర్ తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసాడంటే అవి ఫుల్ వైరల్ ఐపోతాయి. ఆ స్టెప్పులు వేసిన‌ స్టార్ కూడా ఫుల్ ఫోకస్ ఐపోతాడు. ఈ మద్యే 'బీస్ట్' మూవీలో విజయ్, పూజా హెగ్డేతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు జానీ మాస్టర్.  ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా ‘యథా రాజా తథా ప్రజా’ సినిమాలో నటిస్తున్నాడు.

మేక‌ప్ లేని రష్మిని చూసి షాకైన రోహిణి!

మేకప్ తో ఉంటేనే సెలబ్రిటీస్ ని చూడగలుగుతాం. ఒకవేళ మేకప్ లేదు అంటే వాళ్ళను గుర్తుప‌ట్ట‌డం క‌ష్టం. 'ఏమిటి ఇలా ఉన్నారు'.. అని అనుకోకుండా మాత్రం ఉండం. ఇప్పుడు రోహిణి కూడా రష్మీని చూసి అలాగే భయపడింది. కొత్తగా  ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో ఈ స్కిట్ రాబోతోంది. హాట్ యాంకర్ గా, గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న రష్మీ.. రోహిణి మాటలకు షాకైపోయింది. ఈ ఎపిసోడ్ లో బుల్లెట్‌ భాస్కర్‌ స్కిట్‌లో రోహిణి, వర్షతో పాటు ఇమ్మాన్యుయెల్‌ కూడా క‌నిపించాడు. భాస్కర్ వాళ్ళ అమ్మగా కమెడియన్  రోహిణి నటించింది. "అమెరికా వెళ్దావమ్మా" అని అడిగేసరికి, రోహిణి " నేను హైదరాబాద్‌ చూశాకే అమెరికా వస్తాను" అంటూ పంతం పట్టుకుని కూర్చొంటుంది. దీంతో భాస్కర్‌ ఫ్యామిలీ హైదరాబాద్‌ వచ్చి, అక్కడ జబర్దస్త్ సెట్ ని చూపించడానికి తీసుకెళ్లారు.   అసిస్టెంట్‌గా ఉన్న ఇమ్మాన్యుయెల్‌ జబర్దస్త్ సెట్‌ని చూపించి, "అదిగో యాంకర్ రష్మీ, రష్మీ" అంటూ భాస్కర్‌ వాళ్లమ్మకి చూపించి ఆమె దగ్గరకు తీసుకెళ్లారు. రోహిణి చాలా ఎగ్జైట్‌మెంట్‌ తో రష్మి దగ్గరికెళ్లి "వాయమ్మో" అంటూ షాక్‌లోకి వెళ్ళిపోయింది. సృహ కోల్పోయినంత పని చేసి స్టేజి మీద అలాగే పిచ్చిదానిలా కూర్చుండిపోయింది. ఇది చూసిన ఇమ్మాన్యుయెల్‌, "నీకు ముందే చెప్పాను, మీ అమ్మకు హార్ట్ ఎటాక్‌ పెట్టుకుని భయంకరమైనవి చూపించకూడదు" అని రష్మిపై పంచ్‌లు వేశాడు.  దీనికి రష్మి కొంటెగా ఒక ఎక్స్ ప్రెషన్‌ ఇచ్చింది. ఈ స్కిట్‌ ఆద్యంతం కామెడీని పంచింది.