ఇన్‌స్టాగ్రామ్‌లోకి 'దేవత' ఫేమ్ రుక్మిణి.. చిన్నప్పటి ఫొటోతో సందడి!

'దేవత' సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన రుక్మిణి.. అదే మన సుహాసిని ఎట్టకేలకు దసరా పండగ రోజున ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది. 'దేవత' సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ ఐన నటి సుహాసిని. ఇన్స్టాగ్రామ్ పేజీలో ముందుగా స్కూల్ యూనిఫామ్ లో ఉన్న‌ చిన్నప్పటి ఫోటో ఒకటి పోస్ట్ చేసి "చిన్నతనంలో దిగిన ఫొటోస్ నుంచే స్టార్ట్ చేయనివ్వండి" అంటూ కాప్షన్ పెట్టింది.  సుహాసినికి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు. తన సహనటులంతా కూడా సుహాసినికి  ఇన్స్టాగ్రామ్ లోకి స్వాగతం పలికారు. 'చంటిగాడు' మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. అలాగే 'లక్ష్మీ కళ్యాణం', 'అడ్డా', 'దోస్త్'.. ఇలా దాదాపు 30  సినిమాల్లో నటించింది. అలాగే ఈమె తమిళం, కన్నడంలోనూ కొన్ని మూవీస్ లో యాక్ట్‌ చేసింది.  జెమినీలో వచ్చిన 'అపరంజి' సీరియల్ తో బుల్లి తెర మీద అడుగుపెట్టిన సుహాసిని తర్వాత అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'దేవత' సీరియల్ లో లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది.

"ఐ కెన్ మోర్ డిసర్వింగ్ దెన్ యూ" అని చెప్పిన ఇనయా!

రోజు కొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాను ప్రేక్షకులకు కలుగజేస్తుంది "బిగ్ బాస్ సీజన్ 6". దీనికి కారణం ఇనయా, శ్రీహాన్ ల మధ్య పెరుగుతున్న 'Ego' తో  కూడిన గొడవలు. హౌస్ లో రోజు రోజుకి వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. కాగా నిన్న మొన్నటి దాకా మనస్పర్ధలతో దూరంగా ఉన్న చంటి, గీతు ఇద్దరూ కూడా నామినేషన్లో కలిసిపోయినట్టుగా కనిపించారు. అయితే ఎవరు కలిసినా కలవకపోయినా, మేం కలవటం జరుగదు. మేం ఇంతే ఇలానే ఉంటాం అని శ్రీహాన్, ఇనయా మరోసారి నిజం చేస్తూ మరోసారి కంటెంట్ గా మారారు. నామినేషన్లో భాగంగా శ్రీహాన్, ఇనయాతో "మీ ఇద్దరిలో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో? ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటారో? చెప్పండి " అని  బిగ్ బాస్ కోరాడు. ఒకరి గురించి ఒకరు‌ చెప్పుకోవడం మొదలు పెట్టారు. "నేను టాస్క్ లో , గేమ్స్ లో, పనులలో అన్నింట్లో 100% ఇస్తున్నాను. నేను ఎలిమినేట్ అవ్వాలనుకోవట్లేదు" అని ఇనయా చెప్పగా, "నువ్వు పనులు చేస్తున్నావ్. గేమ్ ఆడుతున్నావ్. ఎంటర్టైన్మెంట్ ఏం అయినా చేస్తున్నావా?" అని శ్రీహాన్ అనగా, దీనికి సమాధానంగా ఇనయా మాట్లాడుతూ "ఇది బిగ్ బాస్ షో, ఇందులో ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు టాస్క్ లు,  ఆటలు, మాటలు అన్ని కలుపుకొని పాయింట్లు ‌కలుస్తాయి" అని చెప్పింది. ఇలా అనగానే శ్రీహాన్ " ఇది బిగ్ బాస్ సీజన్ 6, ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్" అంటూ గట్టిగా అరిచేసాడు. కాసేపు ఆలోచించిన ఇనయా, 'ఆ ఇప్పుడేంటి నువ్వు నామినేట్ అవుతావా అవ్వవా అని' అడుగుగా 'నేను అవ్వను' అని శ్రీహాన్ చెప్పాడు. "సరే పో..నేను నామినేట్ అవుతున్నాను. కానీ ఈ వారం నేను నీకన్నా  బాగా పర్ఫామ్ చేస్తాను. ఇక్కడ ఉంటాను. టైటిల్ కొట్టుకునే వెళ్తాను. ఐ కెన్ మోర్ డిసర్వింగ్ దెన్ యూ " అని ఇనయా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది. చివరగా ఇనయా నామినేట్ అవ్వడంతో ఈ గొడవ ఆగింది. అయితే లాస్ట్ వీక్ కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ "ఎప్పటి గొడవ అప్పుడే మాట్లాడి పరిష్కారించుకోవాలి" అని చెప్పాడు. మరి ఆ విషయాన్ని మర్చిపోయి వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు ఎలా స్పందిస్తాడో మరి. ఇద్దరి మధ్య పెరిగిన దూరానికి గాను నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకునేలా‌ ఉన్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే చూడాలి మరి ఇనయా, శ్రీహాన్ ల మధ్య గొడవ ఇంకా ఎంత దూరం కొనసాగుతుందో!

బిగ్ బాస్ హౌస్‌లో 'నువ్వా, నేనా' అంటూ సాగిన నామినేషన్!

ఇరవై తొమ్మిదో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, చివరిదాకా ఉత్కంఠభరితంగా కొనసాగింది. అయితే ఈ ప్రక్రియలో ఎంటర్టైన్మెంట్ డోస్ ని రోజు రోజుకి అమాంతం పెంచేస్తున్నాడు బిగ్ బాస్. సరికొత్త టాస్క్ లతో అటు హౌస్ మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు సస్పెన్స్ తో కూడిన వినోదాన్ని అందిస్తున్నాడు. "హౌస్ లో ఉన్నవాళ్ళలో ఇద్దరి పేర్లు పిలవడం జరుగుతుంది. కెప్టెన్ కీర్తి, ఆ ఇద్దరికి సంకెళ్లు వేస్తుంది. ఎవరు నామినేట్ అవుతారో, ఎవరు సేవ్ అవుతారో ఇద్దరూ కలిసి డిసైడ్ చేసుకోండి" అని బిగ్ బాస్ నిర్దేశించాడు. మొదట ఇనయా, శ్రీహాన్ పేరు పిలిచాడు. శ్రీహాన్ కి, ఇనయాకి మధ్య జరిగిన సంభాషణలో చివరికి ఇనయా "నామినేట్ అవుతున్నా" అని చెప్పేసింది.  ఆ తర్వాత సుదీప, వసంతికి మధ్య జరిగిన సంభాషణలో వసంతి నామినేట్ గా మిగిలింది. ఆదిరెడ్డికి, రేవంత్ కి జరిగిన మాటల్లో చివరికి ఆదిరెడ్డి నామినేట్ అయ్యాడు. ఫైమాకి, సూర్యకి మధ్య జరిగిన డిస్కషన్ లో నామినేషన్ గా ఫైమా తప్పుకుంది. చంటికి, గీతూకి జరిగిన చర్చలో చంటి నామినేట్ అవ్వడానికి అంగీకరించగా హౌస్ మేట్స్ అందరు చప్పట్లతో కంగ్రాట్స్ చెప్పారు.  ఇక జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ లకు సెపరేట్ గా ఉండి ఎవరి గేమ్ వారు ఆడాలి అని, "ఇద్దరిలో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటున్నారు?" అని బిగ్ బాస్ అడుగగా, ఇద్దరు నిర్ణయించుకోలేకపోయారు. రోహిత్ ఏడుస్తుండగా, మెరీనా ధైర్యం చెప్పి రోహిత్ ని ఒప్పించింది. చివరకు మెరీనా "నేను నామినేట్ అవుతున్నా" అని తప్పుకుంది.  అర్జున్ కి, శ్రీసత్యకి జరిగిన మాటలలో అర్జున్ మళ్ళీ శ్రీసత్య కోసం నామినేషన్లో ఉంటానని ఒప్పుకున్నాడు. కాగా ఈ వారం అర్జున్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిమానులు అనుకుంటున్నారు. ఐతే గట్టి పోటీదారులు ఐనా గీతు, రేవంత్ నామినేషన్లో నుండి సేవ్ అవ్వడం బాగుందంటున్నారు. పోటా పోటీగా సాగిన నామినేషన్ల ప్రకియలో కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలకు, ఈ వారం హౌస్ లో అందరు టాస్క్ లు, గేమ్ లు బాగా ఆడుతారనిపిస్తోంది. కాగా పోటీ మాత్రం గట్టిగానే ఉండేలా ఉంది. ఇక ఈ వారం ఎవరు బాగా ఆడి నామినేషన్లో నుండి సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ వారం మెరీనా, ఇనయా, వసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామినేషన్లో ఉన్నారు.

ఐ20 కారుకు ఓన‌ర్ అయిన పాగ‌ల్ ప‌విత్ర‌!

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన‌ లేడీ కమెడియన్స్  చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు పవిత్ర. 'పాగల్ పవిత్ర' అనే యూట్యూబ్ చాన‌ల్‌ ద్వారా ఈమె ఫుల్ ఫేమస్. ఇక బుల్లితెర మీద జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో పవిత్ర రెగ్యులర్ గా కనిపిస్తుంది.   సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవిత్రకు. రీసెంట్ గా పాగల్ పవిత్ర తన  ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.  కొత్త కారు కొన్న వార్తను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అలాగే తన యూట్యూబ్ లో కొత్త కారును కొన్న సందర్భంగా ఒక వ్లాగ్ చేసి పోస్ట్ చేసింది. అయితే.. తనతో ఎప్పుడూ  తోడుగా కనిపించే మరో జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణిని తోడుగా తీసుకెళ్లి పవిత్ర హ్యుందాయ్ ఐ20 మోడల్ కారును కొనుగోలు చేసింది. తర్వాత తన తల్లికి వీడియో కాల్ ద్వారా ఈ విషయాన్నీ షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో పాగల్ పవిత్ర ఫ్యాన్స్ అంతా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఆరోహి!

'దసరా' పండుగ ముందుగానే వచ్చినట్టుగా ఆదివారం గ్రాండ్ గా  మొదలైంది బిగ్ బాస్. నాగార్జున దసరా బుల్లోడిలా రెడీ అయ్యి వచ్చాడు.  కొంతమంది సింగర్స్ వచ్చి పాటలతో అలరించారు. నాగార్జున, కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విభజించి వారితో 'బతుకమ్మ' ఆడించాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ "విజయదశమి పండుగకి సరిగ్గా పది మంది నామినేషన్లో ఉన్నారు" అని సరదాగా అన్నాడు. నాగార్జున ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుండగా, మధ్యలో గీతు మాట్లాడింది. దానికి నాగార్జున కోపగించుకున్నాడు. "నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకు కూర్చో ఫస్ట్" అని అన్నాడు. ఆ తర్వాత కీర్తి భట్, చంటికి మధ్య ఉన్న 'మిస్ కమ్యూనికేషన్' ని దూరం చేసాడు. "హౌస్ లో ఎవరైనా సరే చూసింది మాత్రమే నమ్మండి. ఎవరితోనైనా గొడవలు ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని వెంటనే సరిచేసుకోండి" అని కంటెస్టెంట్స్ తో చెప్పుకొచ్చాడు. నామినేషన్స్ లో ఒక్కో గేమ్ లో ఒక్కొక్కరుగా సేవ్ అయ్యారు. చివరగా ఆరోహి ఎలిమినేట్ అయింది. "ఆరోహి ఇంట్లో వాళ్ళకి 'బై' చెప్పేసి వచ్చేయమ్మా" అని చెప్పాడు నాగార్జున. ఆరోహి ఎలిమినేట్ అయింది అనగానే  కీర్తి భట్, సూర్య బాగా ఏడ్చేసారు. ఆ తర్వాత నాగార్జున దగ్గరకు వచ్చేసింది ఆరోహి. స్క్రీన్ మీద తన 'AV' చూపించగా, అది చూస్తూ ఏడ్చేసింది. ఆ తర్వాత "హౌస్ లో కల్మషం ఎవరు? స్వచ్ఛం ఎవరు?" అని నాగార్జున అడగగా.. "సూర్య, కీర్తి భట్, వాసంతి, మెరీనా-రోహిత్, శ్రీహాన్, ఆదిత్య స్వచ్ఛమైనవారు" అని చెప్పింది. "కీర్తి భట్ నన్ను అమ్మ లెక్కనే చూసుకునేది. నేను తిన్నానో లేదో అని, ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి మరి తినిపించేది. నాకు ఎప్పుడూ దగ్గరగా ఉండి చూసుకునేది" అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. "రేవంత్, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయ, గీతు కల్మషం కలవారు" అని చెప్పింది. "గీతు స్ట్రాంగ్. రేవంత్ చాలా సాఫ్ట్.. మాట తీరు కొంచెం మారాలి. శ్రీసత్య గాసిప్స్ క్వీన్. ఈ హౌస్ లో కీర్తి తర్వాత అర్థం చేసుకుంది ఇనయ" అంటూ ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చింది. "ఇనయాతో నా పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాను.. చాలా దగ్గర అయ్యాం" అని ఆరోహి అనగానే "మిస్ యూ" అంటూ ఇనయ ఏడ్చేసింది. ఆ తర్వాత నాగార్జున టైం అయిందని ఆరోహిని బయటకు పంపించేసాడు. అలా ఎలిమినేషన్ లో నాలుగవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసింది ఆరోహి.

నేహా చౌదరికి రెమ్యూనరేషన్ రోజుకి నలభై వేలా!

  నేహా చౌదరి గుర్తుందా?.. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్. ఈమె తిరుపతిలో 11 సెప్టెంబర్ 1993లో జన్మించింది. ఈమె స్పోర్ట్స్ విమెన్, స్విమ్మర్ మరియు యోగా ట్రైనర్. ఈమె  2012లో  ప్రొఫెషనల్ కెరియర్ స్టార్ట్ చేసింది. మొదట 'గూగుల్' కంపెనీలో పని చేసింది. కొంత కాలానికి ఆ జాబ్ మానేసి, టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈమె న్యూస్ రీడర్ గా పలు ఛానల్స్ లో పని చేసింది. ఆ తర్వాత 'మా మ్యూజిక్' లో యాంకర్ గా చేసింది. తనకి చిన్నప్పటి నుండి ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసిందంట. అందుకే ఇప్పుడు తనకి నచ్చిన రంగంలో పనిచేస్తూ రాణిస్తోంది. తను 'రిథమిక్ జిమ్నాస్టిక్' లో నేషనల్ లెవల్ గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం తను 'ఐపీఎల్' లో విమెన్ రిప్రెజెంటర్ గా చేస్తోంది. తనకి మంచి వాక్చాతుర్యం కలదు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ, ఎక్కువ రోజులు హౌస్ లో నిలదోక్కుకోలేకపోయింది. గేమ్ లో ఫోకస్ గానే ఆడినా అభిమానులని ఎక్కువగా మెప్పించలేకపోయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కువగా గొడవల్లో కనిపించేది. దీంతో హౌస్ లో వాళ్ళకి నచ్చలేదు. చూసే ప్రేక్షకులకు సైతం చిరాకుగా అనిపించింది. నామినేషన్ లో నువ్వా? నేనా? అంటూ గొడవలకు దిగేది. ఎంతలా అంటే హౌస్ మేట్స్, తనతో మాట్లాడటానికి కూడా ఆలోచించేట్టు చేసేది. హౌస్ లో ఎక్కువగా రేవంత్ తో గొడవ కొనసాగేది. అయితే హౌస్ మేట్స్ లో కీర్తి భట్, మెరీనా, సుదీప వాళ్ళని తన ఫ్యామిలీ మెంబెర్స్ గా భావించిందంట. హౌస్ నుండి మూడవ వారమే బయటకొచ్చింది. "బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది" అంటూ నాగార్జునతో స్టేజి మీదనే చెప్పేసింది. నాగార్జున హౌస్ లో "దమ్మున్న వాళ్ళు ఎవరు? ఫేక్ వాళ్ళు ఎవరు?" అని అడగగా కొంతమంది పేర్లు చెప్పింది. "నేను ఎలిమినేట్ కావడానికి మాత్రం రేవంత్ కారణం" అని షాకింగ్ కామెంట్స్ చేసి బయటకొచ్చింది. ఇదిలా ఉంటే నేహాకి బిగ్ బాస్ లో రెమ్యూనరేషన్ రోజుకి నలభై వేల వరకూ ఉంటుందని బయట ప్రచారంలో ఉంది. అయితే నేహా హౌస్ నుండి బయటకొచ్చాక ఒక ఇంటర్వ్యూలో తనని రెమ్యూనరేషన్ గురించి అడుగగా, "నాకు అంత ఏమీ ఇవ్వలేదు" అంటూ చెప్పుకొచ్చింది.

అన్యాయం జరిగితే ఎదిరిస్తా కానీ గాంధీ చెప్పినట్టు నా చెంప చూపించను!

సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయంత్రం స్టార్ మాలో వచ్చే 'గుప్పెడంత మనసు' సీరియల్ చూస్తే తెలిసిపోతుంది. మహేంద్ర రోల్ లో చాలా చక్కగా నటిస్తూ ఆడియన్స్ మనసును దోచుకున్నారు. ఆయనొక సింగర్, యాక్టర్. ఒకప్పుడు బిగ్ స్క్రీన్ మీద చేసి, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద షోస్, ఈవెంట్స్ , సీరియల్స్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.  అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా, ఇప్పుడు ఆయన గాంధీకి సంబంధించి ఒక కామెంట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. "నేను గాంధీజీకి కానీ, ఆయన ఉద్దేశించిన విధానాలకు నేను పెద్ద అభిమానిని కాదు. అన్యాయం జరిగినప్పుడు ఎదిరిస్తాను కానీ నా చెంపను చూపించి దెబ్బల కోసం ఎదురు చూడను" అంటూ తనదైన స్టయిల్లో పోస్ట్ చేశారు.    బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'నువ్వే కావాలి'తో న‌టునిగా ప‌రిచ‌య‌మైన‌ సాయి కిరణ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని మూవీస్ లో నటించాడు. ఈటీవీలో ప్రసారమయ్యే 'శివ లీలలు' సీరియల్ లో విష్ణు మూర్తి క్యారక్టర్ లో నటించాడు. మలయాళం, తమిళ సీరియల్స్ కూడా సాయికిరణ్ నటించాడు. ఆయ‌న దివంగ‌త గాయ‌కుడు రామ‌కృష్ణ కుమారుడు.

ఇంటర్వ్యూ మధ్యలో అనిల్ కుమార్ యాదవ్‌కి ఫోన్ చేసిన బండ్ల గణేష్!

  బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్ చేసి వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఆయన పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమాని. ఆయ‌న‌ను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగిపోతారు. లేటెస్ట్‌గా బండ్ల గణేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. "ఏపీ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ మీకు వార్నింగ్‌ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఎందుకు వార్నింగ్‌ ఇచ్చారు?" అని బండ్ల గణేష్‌ను యాంకర్ అడిగాడు. వెంటనే అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు ఫోన్ చేసి, ‘హాయ్‌ అనిల్‌ అన్నా.. మీరు నాకు వార్నింగ్‌ ఇచ్చారా? ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది, అందులో అడుగుతున్నారు’ అని అడిగారు గ‌ణేశ్‌. అందుకు మాజీ మంత్రి.. ‘నేను నీకు ఎందుకు వార్నింగ్‌ ఇచ్చాను అన్న’ అంటూ జవాబిచ్చేసరికి "ఐ లవ్ యు అన్నా" అని చెప్పి బండ్ల గణేష్ ఫోన్ పెట్టేశారు. ఏ విషయం నచ్చకపోయినా ట్వీట్స్ చేస్తాను అని చెప్పారు బండ్ల గణేష్. అలాగే పవన్‌ కళ్యాణ్‌ని ఎవరు ఏమన్నా భరించలేనని చెప్పారు. ఇక ఆంధ్ర రాజకీయాలతో తనకు ఎలాంటి  సంబంధం లేదని ఆయ‌న అన్నారు. తమ కుటుంబం 50 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చిందని.. షాద్‌నగర్ తన సొంత ఊరు అని చెప్పుకొచ్చారు.

అత్తా కోడళ్ల రిలేషన్ గురించి ఒక రేంజ్ లో చెప్పిన జ్యోతక్క!

ఈటీవీ వారి బతుకమ్మ స్పెషల్ ఈవెంట్ లో "బంగారు బతుకమ్మ" పేరుతో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అత్తలు కోడళ్ళకు మధ్య వార్ బాగా జరిగింది. బుల్లి తెర నటీమణులంతా అత్తా కోడళ్ళుగా విడిపోయి ఈ షోని రక్తి కట్టించారు. ఇక కోడళ్ళు అత్తలను కాకా పట్టడానికి భజన చేస్తుంటారు.  వెంటనే హోస్ట్ శ్రీముఖి "ఇంక ఆపుతారా మీ భజన కార్యక్రమాలు" అనేసరికి జ్యోతక్కకి బాగా కోపం వచ్చేసి అసలు శ్రీముఖి నీకేం తెలుసు మా అత్తా కోడళ్ల బాండింగ్ గురించి అంటూ  "కోడళ్లను ఎప్పుడూ కంట్రోల్ లో పెట్టుకోవాలనే అత్త, అత్తను కాకాపట్టాలని చూసే కోడళ్ళు, ఇంటి పని నాదంటే నాది అంటూ వాళ్లలో వాళ్ళు యుద్దాలు చేసుకుంటూనే ఉంటారు..వాళ్ళను మించిన వారియర్స్ ఎవరు. ఇంట్లో ఎంత కొట్టుకుని తిట్టుకున్నా బయటి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రేమను నటిస్తారు. వాళ్ళను మించిన ఆర్టిస్టులు ఎవరున్నారు.  పగలంతా ఎలా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఒకే సీరియల్ చూసుకునే వాళ్ళను మించిన ఫ్రెండ్స్ ఎవరున్నారు, పెళ్లికైనా, పేరంటానికైనా, ఫంక్షన్ కైనా ఆఖరికి ఫారెన్ కైనా సరే ఒళ్ళంతా నగలు వేసుకుని జంటగా వెళ్లే వాళ్ళను మించిన ప్రేమికులు ఎవరున్నారు. ఇంట్లో, బయట ఎలాంటి పరిస్థితినైనా స్మూత్ గా హ్యాండిల్ చేసే వీరనారీమణులు ఎవరు, వాళ్ళే రైటర్స్, వాళ్ళే ఫైటర్స్, వాళ్ళే క్రియేటర్స్, వాళ్ళే డిక్టేటర్స్ వాళ్ళే అన్నీ.." అంటూ ఒక రేంజ్ లో అత్తా కోడళ్ల గురించి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పింది జ్యోతక్క .

సుమ పోలీసుస్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చిన సింగర్ కారుణ్య!

చూసినవాళ్లెవరైనా సరే క్యాష్ షోని కడుపుబ్బా నవ్వుకునే షో అనే  అనుకుంటారు. ప్రతీ వారం కొంతమందిని షోకి తీసుకొచ్చి కామెడీతో పాటు క్వశ్చన్స్ అడిగి ఎంటర్టైన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వీక్ క్యాష్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈసారి షోకి సింగర్స్ ని తీసుకొచ్చింది సుమ.  శ్రీకృష్ణ, మాళవిక, పర్ణిక, కారుణ్య. వీళ్ళు పాటలే పాడతారనుకుంటాం కానీ కామెడీ చేస్తారని అస్సలు అనుకోము కానీ ఈ ఎపిసోడ్ చూసాక  వీళ్ళు చేసే కామెడీ అర్థమైపోతుంది. శ్రీకృష్ణని స్టేజి మీదకి పిలిచి "మణిశర్మ, కోటి గారు వీళ్ళ ఇద్దరిలో ఎవరినుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారంటూ" అడిగేసరికి "కోటి గారు నా గాడ్ ఫాదర్" అని శ్రీకృష్ణ అనేసరికి అంటే "మణిశర్మ గారు ఏం చేయలేదనా" అన్నట్టుగా సుమ సీరియస్ అయ్యేసరికి "మణిశర్మ గారి దగ్గర పాటలు పాడడం నేర్చుకున్నా కాబట్టే ప్రపంచంలో ఎక్కడైనా పాడగలుగుతున్నా " అని ఆన్సర్ ఇచ్చారు. ఇక ఈ షోలో "సుమ పోలీస్ స్టేషన్" పేరుతో ఒక కాన్సెప్ట్ పెట్టింది.   అందులో షోకి వచ్చిన నలుగురి నుంచి కంప్లైంట్స్ తీసుకుంటుంది. ఇంతలో కారుణ్య "నా శృతిపెట్టె పోయింది."అనేసరికి కంప్లైంట్ నోట్ చేసుకో అంటూ కానిస్టేబుల్ కి చెప్తుంది. " సర్ పిట్ట వయసెంత" అని కానిస్టేబుల్ అడిగాడు  "కోడిపెట్ట కాదండి ఇది శృతిపెట్టె" అని కారుణ్య క్లారిటీ ఇచ్చేసరికి అందరూ నవ్వేశారు.  " ఆ పెట్టెకి ముందు రెండు సొట్టలు ఉంటాయి..మధ్యమం పెడితే పంచమం వస్తుంది పంచమం పెడితే మధ్యమం వస్తుంది.." అనేసరికి "ఆ శృతిపెట్టె పోవడం మంచి పనే అయ్యింది " అని మాళవిక కామెడీ చేసింది.

వర్ష, ఇమ్ము పెళ్ళికి వచ్చిన స్టార్ హీరోస్!

ఎక్స్ట్రా జబర్దస్త్ కొంత కాలం నుంచి మంచి స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ జోడి చేసే సందడి హైలైట్ గా నిలుస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే వర్ష, ఇమ్ము ప్రేమ ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. కొంత కాలం ఇద్దరి మధ్యన మాటలు లేవు. మళ్ళీ ఈ స్టేజెస్ మీద సారీ చెప్పుకోవడం, కలిసిపోవడం కామన్ ఐపోయింది వీళ్లిద్దరికీ. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేయడానికి  రెడీ ఇపోయారు.  స్టేజ్‌పై వీళ్ళ కెమిస్ట్రీ వేరే లెవెల్. ఇక  తమ పెళ్లి జరగాలంటే ఒక  పని చేయాలని ఒక సూపర్ కండిషన్  పెట్టింది వర్ష.  "ఇమ్మూ మన పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి " అంటుంది.. వెంటనే  ఇమ్మాన్యుయెల్‌ "అంతేనా నాకు  చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌ అందరూ  తెలుసు" అంటూ బిల్డప్‌ ఇచ్చేసరికి ఐతే వాళ్లందరినీ తీసుకోచ్చేయ్ ..పెళ్లి చేసుకుందాం" అని  చెప్పింది వర్ష. వెంటనే చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్  డూప్స్ వీళ్ళ పెళ్ళికి వచ్చేసారు. వాళ్లంతా డాన్సులు వేసి హంగామా చేశారు. ముందు మనం ఒక సంగీత్ ఫంక్షన్ పెట్టుకుందాం అని ఇమ్ముని అడిగింది వర్ష.  తర్వాత  "కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు" సాంగ్ కి డూప్ హీరోస్ తో కలిసి వర్ష స్టెప్పులేస్తుంది. ఇది చూసిన ఇమ్ము  చిరు,  నాగ్‌,  పవన్‌ డూప్స్ కి సారీ చెబుతూ, "ఆమె ఇంతకు  ముందు అదే చేసేది అందుకే ఆ పాట పెట్టించి అవే స్టెప్పులు వేయించింది,  ఏమనుకోకండి" అనేసరికి  అందరూ నవ్వేశారు కానీ  వర్ష ముఖం  మాత్రం మాడిపోయింది. ఇక ఈ ఎపిసోడ్ లో గెటప్  శ్రీను, గౌతమ్‌రాజు, రాకేష్‌ టీమ్‌ పెర్ఫార్మ్ చేసిన  స్కిట్లు సైతం నవ్వులు పూయించాయి. దీనికి ఖుష్బు  చాలా ఖుషి ఐపోయి "ఇదే అసలు సిసలైన  కామెడీ షో" అంటూ కితాబిచ్చింది.

ఏం మాట్లాడుతున్నావ్...యాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన ఆరోహి!

బిగ్ బాస్ షో మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా డోంట్ కేర్ అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ మామూలుగానే జరిగిపోయాయి. ఆరోహి రావు హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. ఇక ఆమె బయటికి రావడంతోనే బీబీ కేఫ్ లో సంచలన కామెంట్స్ చేసింది.  శ్రీహాన్, కీర్తితో తాను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయని చెప్పింది. అలాగే మనీ కోసం, మంచి ఫామిలీ కోసం హౌస్ లోకి వెళ్ళానంది. "ఇండివిడ్యువల్ గేమ్ ఆపేసిన దగ్గర నుంచి నీ గ్రాఫ్ పడిపోయింది" అంటూ యాంకర్ అనేసరికి ఆరోహి ఆ విషయాన్ని కొట్టి పడేసింది. ఇక హౌస్ లో ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళ ఫొటోస్ ని విరగొట్టేసింది. "సుదీప అక్క డామినేటింగ్ గా అనిపిస్తుంది. ఆమె వాయిస్ అంతే కానీ" అంటూ ఆమె ఫోటో విరగొట్టేసింది.  "హౌస్ లో ఉన్నన్ని రోజులు నామినేట్ చేశా కానీ ఈయన ఉండాలి ఆడాలి, ఆట తెలిసిన వ్యక్తి కాబట్టి" అంటూ రేవంత్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఫోటో పక్కన పెట్టింది. "శ్రీహాన్ చాలా బాగా ఆడతాడు. టాప్ 5 వరకు వెళ్తాడు అందులో డౌట్ లేదని చెప్పి" అతని ఫోటో పక్కన పెట్టింది. "హౌస్ లో ఆరోహి మితిమీరింది" అని అర్ధమవుతోంది అని యాంకర్ అనేసరికి "సూర్యది నాది ప్యూర్ ఫ్రెండ్ షిప్" అంది. "అంత ప్యూర్ అని ఎవరికీ అనిపించలేదు" అని సీరియస్ గా అడిగాడు యాంకర్.  పచ్చ కామెర్ల వాడికి లోకం మొత్తం పచ్చగా కనిపిస్తుంది. "చేసేది కరెక్ట్ ఐతే ఎవరూ  మాట్లాడుకోరు కదా" అని రివర్స్ లో యాంకర్ అడిగేసరికి "అలా ఎవ్వరు అన్నా కూడా  అస్సలు ఊరుకోను, అది ఇంటర్వ్యూ ఐనా సరే ఊరుకోను". "ఫైర్ బ్రాండ్ లా వెళ్లాను అలాగే బయటికి వచ్చాను" అంటూ సీరియస్ గా చెప్పింది ఆరోహి.

విశ్వ విరాట్ కోహ్లీ లా ఉంటాడు...అని ఆయనకు పెద్ద ఫ్యాన్ !

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటిలాగే ఈవారం కూడా అలరించింది. "మంగమ్మ గారి కొడుకు" టైటిల్ తో ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో విశ్వ ఆయన భార్య శ్రద్దా జోడి లవ్ స్టోరీ ఈ వారం  హైలైట్ అని చెప్పొచ్చు. రష్మీ వీళ్ళ ఇద్దరినీ స్టేజి మీదకి పిలిచి మీ ఇద్దరి జర్నీ గురించి విశ్వ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పమని అడిగేసరికి శ్రద్దా  "ప్రియతమా ప్రియతమా" అనే సాంగ్ పాడి విశ్వ కోసం డేడికేట్ చేస్తుంది.  ఆ పాట విని విశ్వ "మాట్లాడానికి మాటలు రావడం లేదు" అంటూ తన భార్య నుదిటి మీద ముద్దు పెట్టి తన హ్యాపీనెస్ ని ఎక్ష్ప్రెస్స్ చేసాడు. ఇంకో స్పెషల్ సాంగ్ పాడి విశ్వాని ఖుషి చేసేస్తుంది.  వాళ్ళ ప్రేమ చూసి రష్మీ ఎమోషన్ ఐపోయి స్టేజి మీదకు వచ్చి విశ్వాతన  బ్రదర్ చనిపోయినప్పుడు తాను ఎలా ఫీల్ అయ్యింది.అలాగే తన ప్రేమలో ఎన్ని కష్టాలు పడింది అన్ని విషయాలు చెప్పింది. ఇక శ్రద్ద తన మనసులో మాటలు చెప్పింది.."నాకు ఆయనెవరో తెలీదు, నేనెవరో తనకు తెలీదు. నేను ఆయన్ని క్రికెట్ లో చూసాను..విరాట్ కోహ్లీలా ఉంటాడు. అందుకే నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను.  ఆయన సీరియల్స్ కూడా నేను చూడలేదు. కానీ తర్వాత  ఆయన నాకు కావాలి అనుకున్నా..ఈరోజు ఆయన నా పక్కన వున్నారు" అని విశ్వా మీద ప్రేమ గురించి చెప్పింది. విశ్వా కూడా "తన అమ్మ తర్వాత అమ్మ లాంటి భార్య దొరకడం ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం" అంటూ తన ప్రేమను వ్యక్తం చేసాడు.

స్టేజి పై ఎమోషన్ ఐన మంత్రి రోజా!

రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద తిరుగులేని పేరు తెచ్చుకుని ఇప్పుడు బుల్లి తెర మీద జబర్దస్త్ తో తన మార్క్ వేసిన లేడీ బాస్. ఐతే ఆమె లైఫ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వైపు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉంటూ మరో వైపు పాలిటిక్స్ లో కూడా దూసుకుపోతోంది.  ప్రస్తుతం ఏపీ కేబీనెట్ లో మంత్రిగా కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రస్తుతానికి ఈమె టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.  ఐతే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆమె మళ్ళీ స్టేజి పైకి రీ ఎంట్రీ ఇచ్చేసారు. "దసరా వైభవం" పేరుతో మల్లెమాల వాళ్ళు ఒక ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ కోసం సినీనటి, ఏపీ మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే చివర్లో మంత్రి రోజా గారి జీవిత ప్రస్థానం గురించి ఒక స్కిట్ వేసి చూపించారు . అది చూస్తూ.. రోజా ఎమోషనల్ అయ్యారు. “అందరి పిల్లల్లాగే నా పిల్లలు కూడా  అమ్మ అన్నం తినిపించాలని అనుకుంటారు. కానీ నేను వెళ్లలేను. అందరికీ కోవిడ్ అనేది ఓ కష్టమైన పిరియడ్ ఐతే నాకు, నా పిల్లలకి మాత్రం అది హ్యాపీయెస్ట్ పీరియడ్” అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అలా ప్రోమో ఎండ్ చేశారు.  ఇంకా రోజా ఏం షేర్ చేసుకున్నారు, ఈ ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి ఇంటరెస్టింగ్ టాపిక్స్ నడిచాయి అనే విషయం తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం దసరా వరకు ఎదురుచూడాల్సిందే.

డాన్స్ ఇప్పుడు ఒక ప్రొఫెషనే ...అరిచి చెప్పిన సుధాచంద్రన్

డాన్స్ ఇండియా డాన్స్ షో మిగతా డాన్స్ షోస్ తో పోటాపోటీగా ముందుకు వెళ్తోంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ఇక ఈ షోలో చందన-తన్మయ్ జోడీ డాన్స్ ఇరగదీసేసారు. నవరాత్రి సందర్భంగా చేసిన ఈ పెర్ఫార్మెన్స్ లో రాక్షసుడిని సంహరించడానికి అన్నట్టుగా నాట్య మయూరి సుధా చంద్రన్ అమ్మవారి రూపంలో ఎంట్రీ ఇచ్చి అందరినీ మెస్మోరిజ్ చేసేసారు. ఈమె చేసిన పవర్ ఫుల్ యాక్షన్ కి స్టేజి మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. "వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ స్టేజి మీద వచ్చిన చందన-తన్మయ్ చేసిన క్లాసికల్ అద్దిరిపోయింది " అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారామె. ఇక వీళ్లిద్దరికీ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చిన అవార్డ్స్, సర్టిఫికెట్స్ అన్నిటిని చూపించారు. ఇక ఈ జోడి మాట్లాడుతూ "ఇప్పటివరకు గెలుచుకుంది అంతా ఒక ఎత్తు ఇప్పుడు సుధాచంద్రన్ గారితో స్టేజి షేర్ చేసుకోవడం నిజంగా అదృష్టం. జీవితంలో ఇదే ఒక పెద్ద అచీవ్మెంట్ " అని చెప్పారు. "డాన్సింగ్ ఒక ప్రొఫెషనా అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు . ఇప్పుడు చెప్తున్నా డాన్సింగ్ ఒక ప్రొఫెషనే..నేను ఒక డాన్సర్ ని ఐనందుకు  ఎంతో గర్వపడతాను " అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పారు సుధాచంద్రన్.

ఈ వారం కొత్త కెప్టెన్ గా కీర్తి భట్.. వరెస్ట్ పర్ఫామర్ గా అర్జున్!

ప్రతీ రోజు ఏదో ఒక రకమైన వినోదం ప్రేక్షకులకు తీసుకొస్తుంది 'బిగ్ బాస్'. అయితే ఇరవై ఆరవ రోజు మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. ఒకే రోజు 'కొత్త కెప్టెన్', 'వరెస్ట్ పర్ఫామర్'  నియామకం జరగడం అనేది ప్రేక్షకులకు 'డబుల్ ఎంటర్టైన్మెంట్ ' లా అనిపిస్తోంది. మొట్టమొదటి 'ఫీమేల్ కెప్టెన్' గా 'కీర్తి భట్' ఎన్నుకైంది.  ఈ సీజన్ లో ఇప్పటివరకు కెప్టెన్ లుగా  ఆదిరెడ్డి, ఆదిత్య,  రాజ్ కెప్టెన్ గా చేయగా, హౌస్ లో తొలి మహిళా కెప్టెన్ గా 'కీర్తి భట్' కావడం బాగుందని హౌస్ మేట్స్ లో అందరూ అనుకున్నారు. 'పంచ్ పడుద్ది' టాస్క్ లో  "నేను హౌస్ లో గర్ల్ కెప్టెన్ గా ఉండటం చూడాలనుకుంటున్నాను. అందుకే శ్రీహాన్ ని నామినేట్ చేస్తున్నా" అని ఇనయా చెప్పింది. ఆ తర్వాత శ్రీహాన్ కి  నామినేట్ చేసే అవకాశం వచ్చింది. "ఇనయ చెప్పిన మాటకి విలువ ఇచ్చి నేను రోహిత్ ని నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే బాయ్స్ లో మీరు ఒక్కరే ఉన్నారు. డోంట్ మైండ్, గర్ల్ కెప్టెన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను" అని శ్రీహాన్ చెప్పాడు. టాస్క్ ముగిసిన తర్వాత శ్రీసత్య, సుదీప, కీర్తిభట్  ముగ్గురు మాత్రమే మిగిలారు. ఈ ముగ్గురికి 'బ్లాక్ బస్టర్ కెప్టెన్' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత "ఈ టాస్క్ లో కీర్తి భట్ గెలిచింది. తర్వాత తను సింహాసనం మీద కూర్చోగానే 'అందరికి స్పూర్తి' అని ఆదిత్య అంటుంటే, 'మా కెప్టెన్ కీర్తి' అని మిగతా హౌస్ మేట్స్ గట్టిగా 'ఓ' అంటూ అరుస్తూ తమ‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికి కంటెస్టెంట్స్ తో "ఒక్కొక్కరుగా వెళ్ళి, ఈ వారం వరెస్ట్ పర్ఫామెన్స్ ఎవరో వారి పేరు ఆ కాగితం మీద రాసి, గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ లో వేయాలని, వరెస్ట్ ఎందుకో కారణం కూడా చెప్పాలి" అని అన్నాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది వరెస్ట్ పర్ఫామర్ గా అర్జున్  ఉన్నాడని  కారణాలు చెప్పుకొచ్చారు 'బిగ్ బాస్' కి.  దీంతో అర్జున్ వరెస్ట్ పర్ఫామర్ గా రెండవసారి జైలుకి వెళ్ళాడు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో వరుసగా రెండుసార్లు జైలుకి వెళ్ళడం అనేది అర్జున్ ఒక్కడికే సాధ్యమైన ఘనత!  అర్జున్ జైలులోకి వెళ్ళాక శ్రీసత్య తనతో మాట్లాడటానికి వచ్చింది."నీ గేమ్ నువ్వు ఆడు. ఎవరి కోసమో ఎందుకు ఆడతావ్. నువ్వు నాకోసం గేమ్ ఆడకు. నన్ను గెలిపించాలని ఆడకు. నీ కోసం వచ్చావ్. ఎవరి కోసం ఏమీ త్యాగం చేయకు" అని మోటివేషన్ క్లాస్ ఇచ్చింది శ్రీసత్య. తన దగ్గర నుండి అందరు వెళ్ళిపోయాక జైలు లో ఉన్న కెమెరాను చూస్తూ తన ఆవేదనను చెప్పుకున్నాడు. "లాస్ట్ టైం పాపం అమ్మాయిలు అని నేను‌ జైలుకి వచ్చాను. ఈ సారి ఆ అమ్మాయిలే నన్ను జైలుకి పంపారు. సాఫ్ట్ గా ఉండకూడదు అని ఇప్పుడు అర్థం అయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ నా ఆట ఏంటో చూపిస్తా, ప్లీజ్ ఆడియన్స్ ఈ ఒక్క వీక్ నన్ను సేవ్ చేయండి. నా ఆట ఏంటో, నేనేంటో హౌస్ లో ఉన్న అందరికీ తెలియజేస్తాను" అంటూ అర్జున్ ఆవేదనతో వేడుకున్నాడు. ఈ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో అతను కొనసాగుతాడో లేదో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

సుమక్కా! నువ్వులేని ఆ ప్రిరిలీజ్ ఈవెంట్స్ చూడ‌లేక‌పోయాం!!

టీవీ షోస్‌తో పాటు మూవీ ప్రిరిలీజ్‌ ఈవెంట్స్ లో సుమ సందడి మాములుగా ఉండదు.. వెరైటీ కామెడీతో ఆ కార్య‌క్రమం మొత్తాన్ని హుషారుగా ముందుకు తీసుకెళ్లడంలో సుమది అందె వేసిన చెయ్యి అని చెప్పొచ్చు. ఐతే ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఐనా సరే.. సుమ హోస్ట్ గా ఉండాల్సిందే. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేస్తుంది సుమ.  కానీ ఇప్పుడు అక్టోబ‌ర్ 5న రిలీజ‌వుతున్న‌ 'గాడ్‌ఫాదర్', 'ది ఘోస్ట్' మూవీస్ ప్రిరిలీజ్ ఈవెంట్స్ లో సుమ కనిపించలేదు. ఈ విషయంపై చాలా మంది ఫీల్ అయ్యారు. "సుమక్క ఉంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ అన్నట్టే.. ఎందుకంటే అంత జోష్ తో ప్రోగ్రాం చేస్తుంది" అంటూ  కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఇదే టైములో సుమ కొంత‌మంది ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ కి వెళ్లినట్టుంది. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్‌ను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాన్స్ తో షేర్ చేసుకుంది.  సుమ లేకపోవడం వలన ఆమె ప్లేస్ లో వేరే యాంకర్స్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు.  ఐతే వెకేషన్ ఫొటోస్ చూసిన నెటిజన్స్ మాత్రం "సుమక్కా! నువ్వు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నావా.. 'గాడ్ ఫాదర్', 'ఘోస్ట్' మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నువ్ లేకపోయేసరికి ఆ ప్రోగ్రామ్స్ మేం చూడలేకపోయాం. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హోస్ట్ గా నిన్ను తప్ప ఎవరినీ చూడలేం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీహాన్ ని కన్నా అని ఎప్పటినుంచి పిలుస్తున్నావ్?

శ్రీహాన్-సిరి రిలేషన్ గురించి అందరికీ తెలుసు. ఇక వీళ్ళ మధ్య ప్రేమ ఉంది...మరి పెళ్లి ఎప్పుడు అని నెటిజన్స్ నుంచి వస్తున్నా ప్రశ్నలకు  బాస్ హౌస్ నుంచి శ్రీహాన్ బయటికి వచ్చాక అంటూ రీసెంట్ గా సిరి హన్మంత్ చెప్పింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ఇంట్లోకి వెళ్లి గేమ్ ఆడింది. ఐతే అక్కడ షన్నుతో ప్రేమాయణం నడిపేసరికి షన్ను-దీప్తి విడిపోయారు..సిరి-శ్రీహాన్ కూడా విడిపోయారు. ఐతే తర్వాత ఇదంతా అర్ధం చేసుకున్న శ్రీహాన్ మాత్రం సిరితో తన రిలేషన్ కంటిన్యూ చేసాడు కానీ షన్ను-దీప్తి మాత్రం ఇంకా కలవనే లేదు. ఐతే ఇటీవల సిరి సోషల్ మీడియాలో తన పాపులారిటీని యూజ్ చేసుకుని శ్రీహాన్ ని గెలిపించడానికి తెగ ట్రై చేస్తోంది. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఇక ఇప్పుడు నెటిజన్స్ ని "ఆస్క్ మీ ఆ క్వశ్చన్" పేరుతో చాట్ చేసింది. అందులో ఒక నెటిజన్ "శ్రీహాన్ ని  ఎప్పటినుంచి కన్నా అనడం స్టార్ట్ చేసావ్" అని అడిగేసరికి "మొదట్లో నాన్న అని పిలిచేదాన్ని దాంతో ఛీ నన్ను అలా పిలవకు అన్నాడు..అప్పటినుంచి కన్నా అనడం స్టార్ట్ చేశా" అంటూ రిప్లై ఇచ్చింది. "శ్రీహాన్ పుట్టినరోజుకి బిగ్ బాస్ హౌస్ కి వస్తారా" అన్న ప్రశ్నకు "వాళ్ళు పిలవాలిగా చూద్దాం" అంది సిరి. "వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా వదిన" అని మరో నెటిజన్  అడిగేసరికి "అమ్మబాబోయ్ మన వల్ల కాదు" అంటూ ఫన్నీ ఫన్నీ రిప్లైస్ ఇచ్చేసింది సిరి.

'భార్యని, పిల్లల్ని ప్రేమించనోడు మనిషా అన్నా!'.. పూరిపై బండ్ల గణేష్ సెన్సేష‌న‌ల్ కామెంట్‌!

సందు దొరికితే చాలు ఈమ‌ధ్య‌ పూరి జగన్నాథ్‌ మీద చుర‌క‌లు వేస్తూ ఉన్నాడు బండ్ల గ‌ణేశ్‌. పూరి కొడుకు ఆకాశ్ హీరోగా న‌టించిన‌ 'చోర్ బజార్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన గణేష్ అక్కడ స్టేజి మీద పూరీపై సెటైర్ల మీద సెటైర్లు వేసాడు. ఆ కామెంట్స్  సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. “పూరి ఎంతోమందిని  స్టార్లని చేశాడు కానీ కన్న కొడుకుని స్టార్ ని చేయలేకపోయాడు" అంటూ గణేష్ సెటైర్స్ వేయడం, దానికి కౌంటర్ గా పూరి కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రివర్స్ కౌంటర్ లు వేయడం మనకు తెలిసిన విషయమే.  ఐతే ఇటీవల బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నార"ని యాంకర్ అడిగేసరికి .. "నేనెక్కడ కెలికాను" అంటూ  బండ్ల గణేష్ మాట దాటేశాడు. "పోసానికి చావు మామూలుగా ఉండదు అని  మీరెలా చెప్తారు?" అని యాంకర్ అడిగేసరికి  “నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. బండ్ల గణేష్ పడడు” అంటూ సమాధానమిచ్చాడు. "అసలు పోసాని గురించి ఆ మాట ఎందుకన్నారు? ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీయే కదా" అని అడిగేసరికి, “బండ్ల గణేష్ మీద కోపముంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు. కానీ మా అమ్మ, నాన్న ఏం చేశారు?” అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు బండ్ల గణేష్.  “మరి పూరీ ఎందుకు స్పందించారు? నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని ఎందుకన్నారు?” అని యాంకర్ అడగడంతో  ''భార్యని, పిల్లల్ని  ప్రేమించనోడు మనిషా అన్నా"  అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. “ప్రేమించడం, ప్రేమించకపోవడం ఆయనిష్టం” అని యాంకర్ సమాధానం ఇచ్చి పూరికి ఫోన్ చేయబోతే.. “పూరీ అనే వాడికి మంచి, చెడు చెప్పే రైట్ నాకు ఉంది. అతను నా ఫ్రెండ్. నువ్ ఫోన్ పెట్టు ముందు” అంటూ బండ్ల గణేష్ గట్టిగా అరిచేసాడు. ఇక ఈ హాట్ హాట్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.