నూకరాజు మీద మనసు పడిన ప్రేమ ఫన్నీ జాతకం ఫుల్ ఎంటర్టైన్ !

"నవరాత్రి ధమాకా" పేరుతో ఇటీవల ప్రసారమైన షో ఆద్యంతం నవ్వులతో ముంచెత్తింది. ఈ షోకి గెస్టులుగా ప్రేమ, సంఘవి వచ్చారు. హోస్ట్ గా రవి, సిరి హన్మంత్ చేశారు. ఇక ఈ షోలో నూకరాజు, పంచ్ ప్రసాద్ చిలక జోస్యం చెప్పేవారిగా చేసిన స్కిట్ అద్భుతంగా పండింది. ఇందులో ప్రేమ జాతకం చెప్పాలంటూ చిలకతో ఒక కార్డు తీయించి  " నూకరాజు అనే అతని మీద మీరు మనసు పడ్డారు. అతన్ని మీరు ప్రేమిస్తున్నారు..అతను లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటారు " అంటూ తనకు హీరోయిన్ ప్రేమ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు నూకరాజు.  ఇక సంఘవి జాతకం చెప్తూ " రవి అనే అతను మీమీద కన్నేశాడు. ఆ రవిని తప్పించుకునే పరిష్కారం ఏమిటి అంటే నూకరాజుని మీరు ఒక్కరోజైనా పెళ్లి చేసుకోవాలి" అని రాసుంది ఈ కాగితంలో అంటూ చెప్తాడు. సంఘవి నవ్వేస్తుంది.. తర్వాత "చెప్పు తల్లి నూకరాజు మీద మీ అభిప్రాయం" అంటూ ప్రేమను అడిగేసరికి "బాగున్నాడు, నచ్చాడు, పెళ్లి చేసుకుంటాను" అంటుంది ప్రేమ..."ఐతే నూకరాజు వస్తే ఒక ముద్దిస్తారా " అని అడుగుతాడు. "అంత సీను లేదులే" అని చెప్పి నవ్వేసింది ప్రేమ.  ఇక ఫైనల్గా నూకరాజుకి ఫన్నీ  జాతకాన్ని చెప్పి రచ్చ రవి ఎంటర్టైన్ చేసాడు. "ఎందుకో..నువ్వు మళ్ళీ గ్యాప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తోంది " అని ఆది రచ్చ రవికి చెవిలో చెప్పేసరికి "నేను గ్యాప్ తీసుకోవడానికి రాలేదు బ్రో...అందరికీ గ్యాప్ ఇద్దామని వచ్చా" అంటూ పంచ్ వేసాడు.

నాకంటే నా కూతురు చాలా ధైర్యవంతురాలు

నటి ప్రగతి ఐతే బుల్లి తెర మీద అటు బిగ్ స్క్రీన్ మీద ఫుల్ ఫేమస్. అన్ని రకాల క్యారెక్టర్స్ చేసింది ప్రగతి. ఇప్పటి కొత్త తరం నటీనటులకు  ధీటుగా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమెకు ఆరోగ్య కాంక్ష కూడా ఎక్కువే అందుకే టైం ఉన్నప్పుడు జిమ్ లో కుస్తీలు పడుతూ కండలు పెంచుతూ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రగతి డాటర్స్ డే సందర్భంగా తన కూతురి చేతి మీద ముద్దు పెడుతూ ఉన్న ఫోటో ఒకదాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నా  ఆశ, నా బలం, నా ఆనందం, నా ఆత్మవిశ్వాసం, నా గర్వం... నా సర్వస్వం నువ్వే. నీలాంటి కూతురు  ఉన్నందుకు గర్వంగా ఉంది !!! నేను  నిన్ను చాలా మిస్ అవుతున్నాను..ప్రేమతో ...లవ్ యూ అమ్ములు" అంటూ ఒక టాగ్ లైన్ కూడా పెట్టింది. ప్రగతి తన కూతురి గురించి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంది.. తన కంటే తన కూతురికి చాలా ధైర్యం ఎక్కువ అని. ఇక ఈ తల్లీకూతుళ్ల  ఫోటోకి నెటిజన్స్ "అందమైన కూతురు, జిమ్ చేసే మదర్, తల్లెవరూ, కూతురెవరు ఇద్దరిలో ?" అంటూ కామెంట్స్ చేశారు. ఇక లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి "మా పెద్దమ్మ" అంటూ కామెంట్ చేసేసరికి ప్రగతి కూడా కొన్ని ఎమోజిస్ తో రిప్లై ఇచ్చింది. ఇక ప్రగతి  భాషతో సంబంధం లేకుండా నటించేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

నేనెవ‌రినీ 'ఆంటీ' అని పిల‌వ‌ను!

యాక్టర్ గీత అంటే తెలియని వారు లేరు. ఈమె హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 40 ఏళ్ళ నట ప్రస్థానంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో నటించి  మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. "ఎందుకండీ ఇప్పుడు పెద్దవాళ్ళను ఆంటీ అంటే కోపం వస్తోంది" అని నటి గీతని అడిగాడు అలీ. "ఏజ్  చూసుకుని పిలవాలి" అంటూ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్  గురించి చెప్పింది గీత. అందుకే తాను అప్పటినుంచి ఎవరినీ "ఆంటీ" అని పిలవను అని చెప్పింది. ఒక మలయాళం మూవీ షూటింగ్ టైంలో గీత వయసు 25 ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్దావిడ అంటే 50  ఏళ్ళ ఆవిడ ఉండేసరికి ఆమెను "హలో ఆంటీ ఎలా ఉన్నారు" అని అడిగిందట గీత. ఆంటీ అన్న మాటకు ఆమె సీరియస్ ఐపోయి "ప్లీజ్ డోంట్ కాల్ మీ ఆంటీ" అని చెప్పేసరికి అప్పటినుంచి తాను ఆంటీ అని పిలవడం మానేసినట్లు చెప్పింది. షూటింగ్ రెండో రోజు ఉదయం ఆ పెద్దావిడ కనిపించేసరికి "గుడ్ మార్నింగ్" అని ఆమె పేరు పెట్టి పిలిచేసరికి ఆవిడ చాలా హాపీ గా ఫీల్ అయ్యారని చెప్పింది గీత.  అలాగే తనకు డాన్స్ చేయడం రాదు కాబట్టే తాను టాప్ హీరోయిన్ ని కాలేకపోయానని  చెప్పింది. "నేను నటించే టైములో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక.. అందరికీ డాన్స్ వచ్చు కాబట్టే టాప్ యాక్టర్స్ అయ్యారు. నాకు డాన్స్ వచ్చి ఉంటే వీళ్లందరినీ బీటౌట్ చేసేసేదాన్ని" అని చెప్పింది గీత.

సుమ, అనసూయ బాతు స్టెప్పులు!

అనసూయ, సుమ.. బుల్లితెర మీద ఇద్దరూ ఇద్దరే. సుమ సీనియర్ మోస్ట్‌ యాంకర్ ఐతే, అనసూయ ఆమెకు జూనియ‌ర్‌. కానీ ఈ ఇద్ద‌రు యాంక‌ర్లు ఒక్క చోట కలిసి పోటాపోటీగా ఏది చేసినా ఆ స్టైలే వేరుగా ఉంటుంది. అనసూయ అందమైన యాంకర్ , సుమ మాటలతో మాయ చేసే యాంకర్. వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ లో "క్రేజీ కిచెన్" పేరుతో స్పెషల్ వంటకాలు చేసి ఆడియన్స్ కి నోరూరిస్తూ ఆ రెసిపీస్ చెప్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.  రీసెంట్ గా అలాంటి ఒక వీడియోను వారు చేశారు. 'క్రేజీ కిచెన్' పేరుతో వీళ్ళిద్దరూ చేసిన కామెడీ డాన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాన్స్ రీల్ ని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వాళ్లిద్దరూ బాతుల్లా స్టెప్పులేసి మరీ ఎంటర్టైన్ చేశారు. ఈ క్రేజీ కిచెన్ ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ పోస్ట్ చేసింది సుమ. కానీ మధ్యలో కొంత కాలం దీన్ని రన్ చేయడం ఆపేసారు.  ఇప్పుడు గ్లామరస్ యాంకర్ అనసూయతో త‌ను చేసిన రెసిపీతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు సుమ‌. ఇక నెటిజన్స్ మాత్రం ఇక్కడ కూడా ఆంటీ మాటను వదిలిపెట్టినట్టు లేరు. "ఆంటీతో డాన్స్ చేస్తున్నావెందుకు.. ఇద్దరు ఆంటీలు బాగా చేస్తున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'బోత్ ఆర్ నాట్ సేమ్'.. బాల‌య్య‌ను ఇమిటేట్ చేస్తూ ఊగిపోయిన శ్రుతి!

బుల్లితెర మీద వరుసగా కొత్త కొత్త షోస్ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా "బంగారు బతుకమ్మ" పేరుతో ఈటీవీలో ఒక ఈవెంట్ రాబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అత్తలకు, కోడళ్ళకు మధ్య యుద్ధం ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించారు. ఈ షో అక్టోబర్ 2న ప్రసారం కాబోతోంది. శ్రీముఖి ఈ షోకి హోస్ట్ గా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సీనియర్ నటీమణులు అత్తల క్యారెక్టర్స్ చేయ‌గా, జూనియర్ యాక్టర్స్ అంతా కోడళ్ళుగా మారి అత్తలకు సేవలు చేస్తూ ఉంటారు. ఈ షోలో ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరి పంచ్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. "కోడళ్ళు అత్తల‌ ముందు భయపడతారు.. అత్తలు కోడళ్లను భయపెడతారు.. బోత్ ఆర్ నాట్ సేమ్" అంటూ న‌టి శ్రుతి వీర లెవెల్లో బాలయ్య బాబుని ఇమిటేట్ చేసే ఒక డైలాగ్ చెప్పి స్టేజి మీద ఫైర్ పుట్టించింది.  "మొబైల్ మాత్రమే వైబ్రేట్ ఐతే అది మిస్డ్ కాల్. మొబైల్ తో పాటు మొబైల్ పట్టుకున్నోడు వైబ్రేట్ ఐతే అది మిస్సెస్ కాల్" అంటూ పవిత్ర అద్దిరిపోయే డైలాగ్ చెప్పి "భళా" అనిపించుకుంది. ఇక ఈ షోకి ఫోక్ సింగర్ మధుప్రియ వచ్చి బతుకమ్మ మీద జానపదాలు ఆలపించింది. ఈమెతో పాటు కనకవ్వ కూడా ఈ స్టేజి మీదకు వచ్చింది. ఈ స్టేజి మీద అందరూ బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి పాటలు పాడి ఆడియన్స్ ని హుషారెత్తించారు.

అందరి కంటే ముందుగా ఎలిమినేట్ అయిన షానీకి ఎంత ముట్టింది?

బిగ్ బాస్ ఆరవ సీజన్ లో అందరి కంటే ముందుగా ఎలినేట్ అయిన షాని గుర్తున్నాడా? షాని మహబూబ్‌నగర్ జిల్లా జెడ్చెర్ల గ్రామంలో జన్మించాడు. షాని ప్రొఫెషనల్ 'ఖోఖో' ఆటగాడిగా నేషనల్ లెవల్ అథ్లెటిక్స్‌కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సుమారుగా ముప్పైకి పైగా సినిమాల్లో నటించినా కూడా 'సై' మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. 'సై' సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు, 'రాజమౌళి' చూసి కాస్త డిఫెరెంట్ గా ఉన్నాడని సెలెక్ట్ చేశాడట. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు లేకుండా పోయాయి. కాగా ఇప్పుడు చిన్న చిన్న చిత్రాలలో, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ద్వారా తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నాడు. హౌస్ లోకి పదమూడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇరవై మంది ఉన్న హౌస్ లో ఎవ్వరితోనూ కలవలేకపోయాడు. హౌస్ లో ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించలేకపోయాడు. మొదటి వారం నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు అత‌డిపై విమర్శలు కురిపించారు. మొదటి వారం నామినేషన్ లో ఉన్నా, ఎలిమినేషన్ లేకపోవడంతో సేవ్ అయ్యాడు. రెండవ వారం కూడా నామినేషన్ లో ఉన్నాడు. హౌస్ మేట్స్ అందరూ తనకి 'వేస్ట్ పర్ఫామెన్స్' ఇవ్వడం, అలాగే ఓటింగ్ లో చివరి స్థానంలో ఉండడంతో ఎలిమినేట్ అయ్యాడు. అదే రోజున హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాకా, ఆ వ్యక్తి హౌస్ లో ఉన్న అందరి గురించి ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. షానీకి అలాంటిది లేకపోయేసరికి, తన 'ఏవి'ని కూడా చూపించకపోయేసరికి హౌస్ సీక్రెట్ రూమ్ లో ఉంచారేమో అని ప్రేక్షకులు ఊహించుకున్నారు. కాకపోతే అలాంటిదేమి జరగలేదు. షానీ ఎలిమినేట్ అయ్యాక కనీసం నాగార్జునతో స్టేజ్ మీద కూడా కనిపించలేదు. తన మీద ఇంత చులకన భావం ఎందుకని బాధపడ్డాడట షాని. హౌస్ లోకి వచ్చిన వారందరికి ఎలిమినేట్ అయిన తర్వాత వారి జర్నీ వీడియో చూపించడం ఒక ఆనవాయితీ. అలాంటిది తనకు చూపించకపోవడం బాధాకరం అని వాపోయాడు. అయితే షానీని అత‌డి రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దానికి అత‌ను 'హౌస్ లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు కలుపుకొని, వారానికి ముప్పై నుండి నలభై వేల చొప్పున ఇచ్చారు' అని చెప్పాడు. "బిగ్ బాస్ లో నేను గడిపిన రోజులకు గుర్తుగా నాకంటూ ఒక్క 'ఏవీ'  గానీ, 'జర్నీ వీడియో' గానీ లేదు. నాకంటూ కొన్ని జ్ఞాపకాలు‌ కూడా లేకుండా చేసారు" అని ఓ టీవి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షాని.

నాన్న‌ను త‌ల‌చుకొని కన్నీరుమున్నీరైన పటాస్ ప్రవీణ్!

పటాస్ ప్రవీణ్ అంటే బుల్లితెర మీద ప్రతీ ఒక్కరికీ పరిచయమే. 'పటాస్' తర్వాత 'జబర్దస్త్' స్టేజ్ మీద మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇదే షోలో ప్రవీణ్, ఫైమా లవ్ స్టోరీ కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఐతే ఫైమా ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉంది. ప్రవీణ్ మాత్రం జబర్దస్త్ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రవీణ్ కన్న తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రే తనను ఇంత ప్రయోజకుడిని చేసాడని ప్రవీణ్ ప్రతీ స్టేజి మీద చెప్పేవాడు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. రీసెంట్ గా రిలీజ్ ఐన 'ఎక్స్ ట్రా జబర్దస్త్' ప్రోమోలో ప్రవీణ్ "నా తండ్రిని కోల్పోయాను" అంటూ  స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్నాడు. "దేవుడు మా అమ్మను తీసుకుపోయాక ఇచ్చింది నాన్న ఒక్కడినే.. అన్నీ తానై పెంచి పోషించాడు.. ఏ బాధ వచ్చినా నాన్నకే చెప్పుకునే వాడిని. ఈరోజు ఆయన కూడా లేకుండా పోయాడు" అని  ప్రవీణ్ ఎంతో బాధపడ్డాడు.   "ప్రతీ రోజూ రాత్రి.. 'నాన్నా తిన్నావారా?' అని నన్ను అడిగితే గానీ నిద్రపోయే వాడు కాదు" అంటూ తండ్రిని తల్చుకుంటూ ప్రవీణ్ కన్నీరు మున్నీరయ్యాడు. ఇక జడ్జి ఇంద్రజ వచ్చి ప్రవీణ్‌ ని ఓదార్చింది. "నీకు మేమంతా ఉన్నాం" అని హత్తుకుని భరోసా ఇచ్చింది. ఇంద్రజను ప్రవీణ్ "అమ్మా" అంటూ పిలుస్తాడు. ఎందుకంటే ఆమె కూడా ప్రవీణ్ ని కొడుకులా చూసుకుంటుంది.  

నన్ను ఇలా పిలిచింది అవమానించడానికా?

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రోజాకు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు బుల్లితెర పై కూడా అంతే క్రేజ్ ఉంది రోజాకి. జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడు రోజాకు మంత్రి పదవి వచ్చేసరికి జబర్దస్త్ షో చేయడం మానేసి మంత్రిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అయితే రోజా చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ చీఫ్ గెస్ట్ గా స్పెషల్ ఈవెంట్‌కు వచ్చింది. దసరా కోసం మల్లెమాల వాళ్ళు ప్లాన్ చేసిన "దసరా వైభవం" అనే ఈవెంట్ లో రోజా మెరిసింది. "ది లేడీ బాస్ ఈజ్ బ్యాక్" అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశారు టీమ్ మెంబ‌ర్స్‌. ప్రోమోలో చూపించిన దాని ప్ర‌కారం రోజా స్టేజి మీదే కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇది ప్రోమో స్టంట్ అని అర్థ‌మైపోతుంది. ప్రోమో చివర్లో రోజా ఎమోషనల్ అయ్యింది. "నన్ను ఇలా పిలిచింది అవమానించడానికా?" అంటూ తనకు మెడలో వేసిన పూల దండను విసిరిపారేసి, నూకరాజు వైపు సీరియస్ గా చూసి అక్కడినుంచి వెళ్ళిపోయింది.  "వాడు కూడా అదే అంటున్నాడు?" అని ఏదో చెప్పి కవర్ చేయడానికి ట్రై చేసాడు ఆది. "మీరంతా ఇలా ప్లాన్ చేసుకునే రమ్మాన్నారా?" అంటూ రోజా అలా వెళ్లిపోయేసరికి స్టేజ్ మీద ఉన్న అంతా షాకయ్యారు. ఇక రోజా ఎందుకు అంతలా హర్ట్ అయ్యింది? నూకరాజు ఏమన్నాడు?.. తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.

హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేహా!

బిగ్ బాస్ లో ప్రతీ వారం చివరలో ఒక ఎలిమినేషన్  ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిరంగా సాగింది. నాగార్జున హౌస్ మేట్స్ అందరితో కొన్ని గేమ్స్ ఆడించాడు. మొదటగా 'సుత్తి గేమ్' ఆడించాడు. ఆ తర్వాత నామినేషన్లో ఉన్నవాళ్ళకి ఎన్వలప్స్ ఇచ్చాడు. అందులో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్లు సేఫ్ అని అన్నాడు. తర్వాత గీతు, శ్రీహాన్  దగ్గర ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల ఇద్దరు సేఫ్ అయ్యారు. తర్వాత 'సుత్తి గేమ్', 'జంగిల్ బుక్ లో జంతువులు' లాంటివి ఆడించాడు. వీటి తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. చివరగా వాసంతి, నేహ మిగిలారు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ "త్రాసులో బరువు ఉంచుతాను ఎవరి ఫోటో ఉన్న త్రాసు పైకి లేస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు" అని చెప్పాడు. తర్వాత నేహా ఎలిమినేట్ అయింది అని ప్రకటించాడు. తన పేరు విన్నాక నేహా షాక్  అయింది. ఆ తర్వాత ఉద్వేగానికి లోనైంది. హౌస్ మేట్స్ అందరూ కన్నీటితో వీడ్కోలు చెప్పారు. తర్వాత 'అందరూ బాగా ఆడండి' అని హౌస్ మేట్స్ కి చెప్పి, నాగార్జున దగ్గరకు వచ్చేసింది నేహ. స్టేజ్ మీదకి వచ్చిన నేహాకి తన 'ఏవి' చూపించాడు నాగార్జున. ఆ తర్వాత నేహాని " హౌస్ లో దుమ్ము కంటెస్టెంట్స్ ఎవరు?, దమ్మున్న కంటెస్టెంట్స్ ఎవరు? ఎందుకు? " అని నాగార్జున అడిగాడు. "దుమ్ము కంటెస్టెంట్స్ ఇనయ, రేవంత్, ఆరోహి, అర్జున్, గీతు, వాసంతి అని చెప్పింది. దమ్ము కంటెస్టెంట్స్ చంటి, సుదీప, ఆదిత్య, ఆదిరెడ్డి, శ్రీసత్య, రాజ్" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్పమన్నాడు నాగార్జున. "రేవంత్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. నేను నమ్మిన వాళ్ళే, నాతో ఉన్నవాళ్ళే నన్ను ఈ స్థానంలో ఉంచారని కాస్త భావోద్వేగానికి గురైంది. చంటి చాలా కనెక్ట్ అయ్యాడు. ఆదిత్య చాలా స్ట్రాంగ్. సుదీప నాకు ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. శ్రీహాన్ అందరిని మంచిగా కలుపుకుపోతూ ఉంటాడు. 'ఒక కామన్ మ్యాన్ గా వచ్చి హౌస్ లీడర్ అయ్యాడు. One more step to go' అని ఆదిరెడ్డితో చెప్పింది. శ్రీసత్య మై స్వీట్ హార్ట్ అంది. రాజ్ తో నాకు మంచి కనెక్షన్ ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్నాం. నాకు చాలా దగ్గరగా వచ్చాడు" అని చెప్పుకొచ్చింది నేహ. మూడవ ఎలిమినేషన్ గా  నేహ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసింది.

నా కోసం చాలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్

కార్తీక దీపం సీరియల్ ద్వారా భాగ్యం గా ఎంతో ఫేమస్ అయ్యింది ఉమాదేవి. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అక్కడ లోబోతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ద్వారా కూడా ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవల ఈమె క్యాష్ షోకి వచ్చింది. ఐతే బిగ్ బాస్ షోలో లోబోతో చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఆమెను దారుణంగా ట్రోల్ చేసేసారు నెటిజన్స్. దాంతో ఆమెకు ఆఫర్స్ లేకుండా పోయాయి. దానికి తోడు కార్తీక దీపం సీరియల్ లో ఆమె క్యారెక్టర్ కూడా ఐపోయేసరికి ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉంది.   ఇక ఇప్పుడు ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చింది. ఇందులో ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి, సింగల్ పేరెంట్ కి వుండే కష్టాల గురించి చెప్పింది. ప్రతీ షోలో కూడా తన సమస్యలు చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. "నేను ఇప్పటివరకు ఎవరికీ థ్యాంక్స్ చెప్పలేదు. మా అమ్మకు కూడా. ఇప్పుడు నా పెద్ద కూతురికి థాంక్స్ చెప్పాలి" అంటూ ఆమెను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది.    "పెద్ద కూతురికి, రెండో కూతురికి మధ్య పదేళ్లు గ్యాప్ వచ్చింది. కనేసి వెళ్ళిపోయాడు అంతే. చిన్న కూతురిని పెద్ద కూతురు కన్న తల్లిలా చూసుకునేది. నా చిన్న కూతురు పెద్దమనిషయ్యింది. అప్పటికి నేను ఇంట్లో లేను. హరిత ఎంతో పెద్ద మనసు చేసుకుని చీర పెట్టింది. ఆ ఫంక్షన్ పేరెంట్స్ చేయాలి.. కానీ జాకీ వాళ్ళ ఫ్యామిలీ చేశారు. వీళ్లకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి" అంది ఉమాదేవి.

తండ్రికి బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన రోహిణి

బుల్లితెర మీద జబర్దస్త్ రోహిణి పేరు తెలియని వారు లేరు. ముందు తెలుగు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. బిగ్ బాస్, జబర్దస్త్ షోస్ ద్వారా మరింత దగ్గరయింది. లేడీ కమెడియన్ గా ఈమె మంచి పేరే తెచ్చుకుంది. వీటితో పాటు ఆమె నటనకు అవార్డులు కూడా వచ్చాయి. రౌడీ రోహిణి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. రకరకాల వీడియోలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండే ఈమె వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.  లేటెస్ట్ గా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని అప్ లోడ్ చేసింది. అందులో ఆమె తన తండ్రికి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటి అంటే వాళ్ళ నాన్నకు ఒక కొత్త బైక్ ని కొని పెట్టింది. వాళ్ళ నాన్నకు బైక్ అంటే చాలా ఇష్టం అని. బైక్ మీద  ఊరంతా తిరగాలని కోరిక ఉందని ఒకసారి మాటల సందర్భంలో చెప్పేసరికి ఇక రోహిణి తన తమ్ముడితో కలిసి షోరూంకి వెళ్లి.. హొండా షైన్ బైక్ ను కొన్నది రోహిణి. ఆ బైక్ ని చూసిన ఆమె తండ్రి చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తన బంగారు తల్లి తనకు బైక్ కొనిపెట్టినందుకు ఎంతో ఎమోషనల్ అయ్యారు.  ఆ తర్వాత ఆయన రోహిణి వాళ్ళ అమ్మను బైక్ మీద ఎక్కించుకుని అలా ఒక రౌండ్ వేసి వచ్చి తర్వాత రోహిణిని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. పిల్లల కోరికలు తల్లిదండ్రులు వద్దన్నా తీరుస్తారు అందుకే నేను మా నాన్న కోరిక తీర్చాను అంది రోహిణి.

హౌస్ లో కొత్త  కెప్టెన్ ఆదిరెడ్డి!

బిగ్ హౌస్ లో వారానికొకరిని కెప్టెన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ వారం కొత్తగా కెప్టెన్సీ కోసం పోటీదారుల మధ్య గట్టి పోటీ జరిగింది. పంతొమ్మిదవ రోజు రెండవ కెప్టెన్సీ టాస్క్ గురించి బిగ్ బాస్ క్లుప్తంగా కంటెస్టెంట్స్ కి వివరించాడు. "టాస్క్ పేరు 'ఎత్తర జెండా'. ఇందులో ఎవరు గెలుస్తారో వారే ఈ వారం హౌస్ లో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ టాస్క్ కి సంచాలకులురాలిగా ఆరోహి ఉంటుంది" అని బిగ్ బాస్ వివరించాడు .ఆ తర్వాత టాస్క్ లో ఆదిరెడ్డి విజేతగా నిలిచాడు. ఆదిరెడ్డి విజేతగా నిలిచిన తర్వాత చాలా సంతోషంగా తనకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ..లవ్ యూ కవిత' అని తన భార్యకు థాంక్స్ చెప్పాడు.  ఆ తర్వాత తనని నమ్మిన బిగ్ బాస్ కి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకున్నాడు. "ఆదిరెడ్డి.. మీరు ఫినోలెక్స్ పైప్స్ తో చేసిన సింహాసనం మీద కూర్చొని, కెప్టెన్ బాధ్యతలు స్వీకరించండి" అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత ఆదిరెడ్డి సింహాసనం మీద కూర్చున్నాడు. హౌస్ మేట్స్ అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. చివరగా ఆదిరెడ్డి మాట్లాడుతూ 'ఇంకా చాలా ఉంది' అని చెప్పాడు. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి, రోజు రోజుకి తన పర్ఫామెన్స్ తో దూసుకుపోతున్న ఆదిరెడ్డి కెప్టెన్ గా ఎన్నికయ్యాడని ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.

ఎనిమిదేళ్లుగా ఒకతన్ని ప్రేమిస్తున్నా.. మా అమ్మానాన్నలకు కూడా తెలీదు!

టిక్ టాక్ ద్వారా మంచి  క్రేజ్ తెచ్చుకున్న వారిలో భాను ఒకరు. దానివ‌ల్లే ఆమెకు  స్మాల్ స్క్రీన్ పై అవకాశం వచ్చింది. టిక్ టాక్ వీడియోస్ తో పాపులర్ అయిన భానుని.. హైపర్ ఆది ‘జబర్దస్త్’ షోలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో చాలా  స్కిట్లు, డ్యాన్స్ ఫెర్ఫామెన్సులు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.  కానీ కొన్నాళ్లుగా ఈమె జ‌బ‌ర్ద‌స్త్‌లో కనిపించడం లేదు. చాలా రోజుల త‌ర్వాత‌ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీపై సందడి చేసింది. వర్షతో కలిసి అదిరిపోయే పాటకు హాట్ హాట్ గా డ్యాన్స్ కూడా చేసింది. వీళ్ళ డాన్స్ చూసి "మీ నడుముల్ని బాగా మెలికలు తిప్పారుగా" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది ఇంద్రజ.  ఇందులో భాను తన లవ్ స్టోరీ గురించి  బయటపెట్టింది. "ఎనిమిదేళ్లుగా ఓ వ్యక్తిని ఇష్టపడుతున్నాను కానీ ఆ విషయం అమ్మనాన్నలకు కూడా తెలియదు" అని  చెప్పింది. మరి భాను ప్రేమిస్తున్న అతనెవరు? జబర్దస్త్ లో చేస్తున్న‌త‌నా లేక‌, బ‌య‌టి వ్య‌క్తా?.. అనేది తెలియాలంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్‌ కోసం కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

'నేనేదైనా త‌ప్పుచేసుంటే సారీ ఇమ్మూ'.. ఎమోష‌న‌ల్ అయిన వ‌ర్ష‌!

జబర్దస్త్ స్టేజి ఎంతో మందిని కలిపింది. ఆ షో ద్వారా పాపుల‌ర్ అయిన రీల్ లైఫ్ జోడీస్ చాలా మంది ఉన్నారు. ఇలాంటి జోడీస్ లో సుధీర్-రష్మీ ఒక సంచ‌ల‌నం అయితే, ఇమ్ము-వర్ష జోడి ఇంకో సంచ‌ల‌నం. కెవ్వు కార్తీక్ టీమ్ లో చేసేటప్పుడు ఇమ్మూతో లవ్ ట్రాక్ నడిపింది వ‌ర్ష‌. ప్రస్తుతం బులెట్ భాస్కర్ టీమ్ లో వర్ష స్కిట్స్ చేస్తోంది.  ఐతే ఈ మధ్య కొన్ని నెలలుగా ఇమ్ము, వర్ష జోడీగా పెర్ఫార్మ్ చేయడం లేదు. వీళ్ళ కెమిస్ట్రీ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏమైంద‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఇమ్ము మీద ఒకసారి వర్ష ఫుల్ ఫైర్ అయ్యింది. ఐతే ఆ టైంలో ఆది, రాంప్రసాద్ వర్ష ని కూల్ చేశారు కానీ ఆ ఎపిసోడ్ ఏమిటో అలా పూర్తయ్యింది.  ఐతే ఇటీవల లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమోలో వర్ష చాలా బాధపడుతూ కనిపించింది. ఈ న్యూ ఎపిసోడ్ లో "అమ్మ నా కోడలా" పేరుతో స్పెషల్‌ ఎపిసోడ్‌ చేశారు. ఇందులో తమ మనసులో ఉన్న బాధని బయటపెట్టమని చెబుతుంది రష్మి. ఒక్కొక్కరు వచ్చి తమ బాధలను చెప్పారు. వ‌ర్ష‌, "ఓ మూడు నాలుగు నెలల నుంచి మేం సరిగా మాట్లాడుకోవట్లేదు. నేను ఏదన్నా తప్పు చేసుకుంటే ఐ యామ్ సారీ" అని చెప్పింది. ఆమె మాట‌ల‌కు ఇమ్ము చాలా ఎలా స్పందించాలో తెలీన‌ట్లు సైలెంట్‌ గా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రెడ్ హాట్ మిర్చి శారీలో శేఖర్‌తో కలిసి స్టెప్పులేసిన‌ రమ్యకృష్ణ!

'డాన్స్ ఐకాన్' స్టార్ట్ చేసీ చేయగానే మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పుడు షోస్ అన్ని కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ఈ డాన్స్ ఐకాన్ కూడా ఆహా ఓటిటిలో వస్తోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఇందులోకి ఎంతో మంది సెలెబ్స్ ఎంట్రీ ఇచ్చారు.  ఇక ఈ షో కాన్సెప్ట్ ని చాలా కొత్తగా పెట్టడంతో, అందులోనూ ఎప్పుడూ చూడని కొత్త కొత్త డాన్స్ స్టైల్స్ ని ఇక్కడ పరిచయం చేయడంతో ఆడియన్స్ కి ఈ షో బాగా కనెక్ట్ అయ్యింది. లేటెస్ట్ ప్రోమోలో రెడ్ హాట్ మిర్చి శారీలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ కలిసి ఈ స్టేజిపై స్టెప్పులేసి సందడి చేశారు. అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురంలో'లోని "నీ కాళ్ళను పట్టుకుని" సాంగ్ కి శేఖర్ మాస్టర్ డాన్స్ చేస్తే, రమ్య కృష్ణ లైట్ స్టెప్స్ వేశారు. రమ్యకృష్ణ ఇప్పుడున్న కొత్త కొత్త తారలకు పోటీగా మారారు. శేఖర్ మాస్టర్ గతంలో ఎంతోమంది బిగ్ స్టార్స్ తో కలిసి స్టేజి మీద స్టెప్పులేయించారు. ఇప్పుడు రమ్యకృష్ణతో కూడా డాన్స్ చేయించారు.

ఎవ్వరైనా సరే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టగలరా!?

అష్షు రెడ్డి గురించి సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలుసు.సమంత పోలికలు ఉండేసరికి అష్షుని జూనియర్ సమంత అనడం స్టార్ట్ చేశారు ఫాన్స్. అలా సోషల్ మీడియాలో తానూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఇక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి, బిగ్ బాస్ కి వెళ్లొచ్చి ఇంక పాపులారిటీని తెచ్చుకుంది.  అషు రెడ్డి గురించి సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలుసు. సమంత పోలికలు ఉండేసరికి అష్షుని జూనియర్ సమంత అనడం స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. అలా సోషల్ మీడియాలో తానూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఇక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి, బిగ్ బాస్ కి వెళ్లొచ్చి మ‌రింత‌ పాపులారిటీని తెచ్చుకుంది.  ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తే గనక అందులో మొత్తం అష్షు హాట్ పిక్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎప్పుడో కానీ చీరకట్టులో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో  ఈమె పోస్ట్ చేస్తున్న హాట్ పిక్స్ మస్త్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తన పేజీలో వేర్వేరు యాంగిల్స్ లో ఫొటోస్ పోస్ట్ చేసి "ఇప్పుడు పోస్ట్ చేసిన ఈ ఫొటోలో ఎవ్వరైనా సరే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టగలరా" అంటూ టాగ్ లైన్ పెట్టి నెటిజన్స్ కి కొంటె సవాల్ విసిరింది. నెటిజెన్స్ ఊరుకుంటారా! "పుట్టుమచ్చలు లెక్కపెడితే మాకేం వస్తది, టైం వేస్ట్ తప్ప" అని ఒకరు, "మీరు చాల బాగుంటారు. కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అవ్వొచ్చు కదా. ఇలాంటి గాలి డ్రెస్సింగ్ స్టైల్ లో ఫొటోస్ ఎందుకు" అని ఒకరు, "మీ నుదురు ఎక్కువగా కనిపిస్తోంది హెయిర్ స్టైల్ చేంజ్ చేయండి" అని మరొకరు కామెంట్స్ పోస్ట్ చేశారు. అలాగే అషు బర్త్ డే ఫొటోస్ ని, అరియనా గ్లోరీ తో కలిసి దిగిన ఫొటోస్ తన ఇన్స్టాస్టేటస్ లో పోస్ట్ చేసుకుంది అష్షు.

కిట్టీ పార్టీకి వచ్చినట్టు మొత్తం ఆడోళ్ళు వచ్చేశారు!

హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి కొద‌వ ఉండ‌ద‌ని చెప్పొచ్చు. లేటెస్ట్‌గా లేడీస్ మీద అత‌ను మ‌రోసారి ఆ త‌ర‌హా కామెంట్ చేశాడు. ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో  "రీక్రియేషన్ థీమ్" మీద ఓల్డ్ సాంగ్స్ కి కంటెస్టెంట్స్ పెర్ఫార్మ్ చేశారు. ఈ షోకి జడ్జెస్ గా ఇప్పుడు శ్రద్ధా దాస్, యాని మాస్టర్, పూర్ణ వచ్చి కూర్చున్నారు.  ఆ ముగ్గురిని చూసేసరికి ఆది కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశాడు. "ఇది ఢీ - 14 షో కదా.. మరేంటి కిట్టి పార్టీకి వచ్చినట్టు ఆడోళ్ళంతా వచ్చేశారు" అన్నాడు. యాని మాస్టర్ ఆ మాటలకు పగలబడి నవ్వింది. తర్వాత సీన్ రీ క్రియేషన్ లో భాగంగా 'ఖుషి' మూవీలో భూమిక బొడ్డు సీన్ ని అఖిల్, ఆది, శ్వేతా నాయుడు, నయని, పావని చేశారు. పావని "సిద్దు నువ్ చూసావ్" అని అఖిల్‌తో అంటే, "వాడు చాలా చూశాడు, ఏం చూశాడో అడుగు" అంటూ ఆది ఒక డైలాగ్ వేశాడు. తర్వాత ఆదితో "నువ్ కూడా చూశావ్" అని శ్వేతా అనేసరికి, "అవును చూసాను కానీ పెద్దగా నచ్చలా, యావరేజ్ గా ఉంది" అన్నాడు  ఆది. ఇలా లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆది తన డైలాగ్స్ తో షోని నడిపించాడు.

వ‌ర్ష‌పై ఇమ్ము బాడీ షేమింగ్!

బుల్లితెర మీద వర్ష, ఇమ్మానుయేల్ జోడి కొంచెం స్పెషల్. ఎందుకంటే సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ తరువాత వీళ్ళ ప్రేమ బుల్లితెర మీద బాగా హైలైట్ అయ్యింది. ఇక స్కిట్స్ లో కూడా "అల్లుడొస్తున్నాడని చెప్పు మీ అమ్మకి" అని ఇమ్ము అంటే.. "కోడలొస్తోందని చెప్పు" అని వర్ష అనడం మనకు తెలుసు. అలాగే ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నారు కూడా.  ఈ మధ్య కాలంలో ప్రసారమవుతున్న స్కిట్స్ లో వీళ్ళ జోడీకి కొంచెం బ్రేక్ పడింది. ఇక వర్ష విషయంలో కమెడియన్స్ అంతా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్ కి ఒక్కోసారి సీరియస్ అవుతుంది.. ఒక్కోసారి లైట్ తీసుకుంటుంది వర్ష. ఆమెను ఎక్కువగా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు స్కిట్స్ లో. కొంత కాలం క్రితమే తన బాడీ షేమింగ్ పై ఫైర్ అయ్యేసరికి అలా అనడం మానేశారు.  కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వర్షను మళ్ళీ అలాగే కామెంట్ చేశాడు ఇమ్మానుయేల్. "బంగారం అందరూ అడుగుతున్నారు" అని వర్ష ఒక కామెడీ డైలాగ్ చెప్పడానికి ట్రై చేస్తున్నంతలోనే, "ఏమని.. నువ్ ఆడా, మగా.. అనా?" అంటూ ఇమాన్యుయేల్ వర్ష  పరువు తీసేశాడు. ఇక ఈ షోలో వర్ష మాత్రం ఏం మాట్లాడకుండా ఆ డైలాగ్ కి నవ్వి ఊరుకుంది.

ఇంటర్నెట్ లేని అడ‌విలో ప్ర‌కృతితో క‌నెక్ట్ అయిన హీరో!

ముఖేష్ గౌడ అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆడియన్స్‌కు. కానీ రిషి సర్ అంటే అందరికీ తెలిసిపోతుంది. 'గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషి గెటప్ కానీ, ఆటిట్యూడ్ కానీ, వసుధారతో ప్రేమ కానీ.. అన్ని కూడా ఆడియన్స్ కు ఎంతో నచ్చుతున్నాయి. దాంతో ఈ షోని ఆడియన్స్ బాగా ఫాలో అవుతున్నారు. ఇక ముఖేష్ సహజ నటన కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. రిషికి ప్రకృతి అన్నా, మూగ జీవాలన్నా చాలా ఇష్టం. ఇటీవల గుర్రం ఎక్కి సముద్రం ఒడ్డున రైడ్ చేశాడు. లేటెస్ట్‌గా ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు ముఖేష్ గౌడ. "అడవిలో ఇంటర్నెట్ లేదు, కానీ మీకు ఈ ప్రకృతితో మాత్రం మంచి కనెక్షన్ దొరుకుతుంది అని నేను ప్రామిస్ చేస్తున్నా" అంటూ ఒక కాప్ష‌న్‌ పెట్టాడు.  ఈ పిక్స్ చూసి నెటిజన్స్ ఆనందపడుతున్నారు. "సూపర్బ్ లొకేషన్, మిస్టర్ హ్యాండ్సమ్ ఆఫ్ మైసూర్.. ఏ యాంగిల్లో ఐనా మీరు సూపర్.. హ్యాండ్సమ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్" అంటూ రిషిని నెటిజన్స్ తెగ పొగిడేస్తూ రిప్లైస్ ఇస్తున్నారు.