అల్లు అర్జున్ తో రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేయాలనుంది

బుల్లితెర సీరియల్స్ ని ఫాలో అయ్యవాళ్లకు వసుధార గురించి పెద్ద చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ పేరు ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్. ఐతే వసుధార తన లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఎవరో రివీల్ చేసేసింది. మరి ఎవరో తెలుసా .... "నా ఫస్ట్ క్రష్ వాళ్ళే.. యష్, కార్తికేయ, విజయ్ దేవరకొండ. వీళ్ళ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం. కన్నడలో నేను ఒక మూవీ చేస్తున్నప్పుడు నాకు గుప్పెడంత మనసు సీరియల్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైములో అనుకోకుండా ఓకే చెప్పేసాను. ఇక సీరియల్ విషయానికి వస్తే మాత్రం  వర్షంలోనే వశుధార, రిషి సర్ కలుస్తారు. ఎందుకంటే  వర్షం అనేది ఒక డిఫరెంట్ వైబ్..రొమాంటిక్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక రిషి సర్ కి వసుధారకు అసలు రొమాన్స్ అంటే ఏమిటో తెలీదు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్లినా, ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ఆడియన్స్ నా సీరియల్ చూస్తున్నామని చెప్తారు. తర్వాత వెంటనే ఎందుకు రిషి సర్ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు..పాపం కదా రిషి సర్  అని అడుగుతారు. ఇక  మా ఫొటోస్ అన్ని కలిపి ఫ్యాన్ పేజెస్ రన్ చేస్తుంటారు చాలా మంది. వాళ్లకు, నా సీరియల్ చూసే అందరికీ ధన్యవాదాలు. ఎక్కడైనాసరే నా బుర్ర ఎవరూ తినరు ఎందుకంటే నేనే అందరి బుర్ర తింటుంటాను కాబట్టి. అలాగే నేను డబ్బుల్ని ఎక్కువగా తినడానికి, షాపింగ్ కి ఖర్చు చేస్తుంటాను. ఐతే నా జీవితంలో ఇప్పటివరకు లేదు అనే ఫీల్ అయ్యింది బార్బీ డాల్ విషయంలో. బార్బీ డాల్ సెట్ ఇప్పటికీ నా దగ్గర లేదు...ఎన్ని సార్లు కొనడానికి ట్రై చేసినా అది మాత్రం తీసుకోలేకపోయాను. ఇక నేను ఒక రొమాంటిక్ సాంగ్ చేయాల్సి వస్తే అల్లు అర్జున్ తో చేస్తాను.. ఎందుకంటే నాకు ఆయన డాన్స్ బాగా నచ్చుతుంది." అంటూ వసుధార అలియాస్ రక్షా గౌడ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది.

స్కూల్ డేస్ లోనే లైంగిక వేధింపులు.. అన్నా అని పిలిచినా అలా చేసాడు

అంజలి అలియాస్ ఆరోహిరావు యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అందరిని ఒక ఆట ఆడుకుంటోంది. చాలామంది అమ్మాయిల లాగానే  తాను కూడా లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నట్లు చెప్పింది.  "నా మీద చిన్నప్పుడే రేప్ అట్టెంప్ట్ జరిగింది. చేతులు గట్టిగా పట్టుకుని అటూ ఇటూ నన్ను తోసేసరికి నన్ను కొడుతున్నాడనుకున్న. కానీ నాకు ఒక ఏజ్ వచ్చాక అర్ధమయ్యింది. ఆ రోజు అతను ఎందుకు అలా చేశాడా అని. మా ఊళ్ళో చిన్నప్పుడే మా బాబాయ్ వాళ్ళింట్లో ఉన్నప్పుడు వాళ్లకు సంబంధించిన అబ్బాయి ఇలా చేసాడు నన్ను. నేను అతన్ని అన్నా అని పిలిచేదాన్ని. ఇలా నా చిన్నప్పుడు నేను చాలా అవస్థలు పడ్డాను. స్కూల్లో కూడా నన్ను చాలా టార్చర్  పెట్టారు. రెండేళ్లు భరించాను. ఆడపిల్లలలకు ఎవరూ లేరు అంటే వాళ్ళను బద్నాం చేయాలనే చూస్తారు మగవాళ్ళు. అందుకే ఆ ఇన్సిడెంట్స్ అన్ని చూసి నాకు ఒకరకమైన ఫోబియా వచ్చేసింది. మగవాళ్ళతో మాట్లాడ్డం కోపం..వాళ్ళతో ఎక్కువగా ఉండలేను. కానీ ఇప్పుడు నేను చాలా మారాను అందరూ ఒకేలా ఉండరు కాబట్టి నా మంచి ఆలోచించేవాళ్లతో నేను చక్కగా ఉంటున్నాను. ఇల్లాంటి పరిస్థితుల్లోంచి ఎవ్వరైనా బయటికి రావాలంటే అది సెల్ఫ్ రియలైజెషన్ ద్వారా మాత్రమే అవుతుంది. పచ్చిగా చెప్తున్నా.. చాలామంది వాళ్లకి సంబంధించిన అశ్లీల వీడియోలు బయటికొచ్చాయని  సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు. వీడియోలు బయటికొస్తే  నువ్ చనిపోవాలని ఎందుకు అనుకోవాలి. తప్పు నువ్వు చేయలేదు కదా ఎవడో బలిసినోడు చేసిన పనికి నువ్వెందుకు బలవ్వాలి. మన చుటూ ఉన్న ప్రపంచం గురించి అస్సలు ఆలోచించకూకాదు. మన బుర్రలో ఒకటే ఉండాలి.. తప్పు నాది కాదు అని." అంటూ ఆరోహి రావు ఒక ఇంటర్వ్యూలో ఎంతోమంది అమ్మాయిల కోసం ఒక మోటివేషన్ ని అందించింది.

నేను జబర్దస్త్ షోకి వచ్చానా పాలిటిక్స్ లోకి వచ్చానా!?

జబర్దస్త్ షో లోంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయినా వాళ్ళు మళ్ళీ షోకి తిరిగి వస్తూ ఉండడం  నిజంగా గొప్ప విషయం. వెళ్లిపోయిన గెటప్ శీను తిరిగొచ్చాడు.  ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా వచ్చేసాడు. ఇప్పుడు రిలీజ్ ఐన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆది ఇందులో ఒక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో దణ్ణాలు పెట్టుకుంటూ వచ్చాడు.  "అసలు నేను జబర్దస్త్ కి వచ్చానా పాలిటిక్స్ లోకి వచ్చానా అనే విషయం ఒక్కసారి నాకు అర్ధం కాలేదు" అనేసరికి అందరూ గట్టిగా అరిచారు. "నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏంచేయాలి అని ఆది రష్మిని అడిగేసరికి నా వెనకాల చానాలు తిరగాలి తెలుగు అచ్చుతప్పు చెప్పేసరికి ..చానాలు తిరగాలా ఇది తెలియక మన గాలోడు (సుడిగాలి సుధీర్) ఛానళ్లన్నీ తిరిగేస్తున్నాడుగా" అనేసరికి రష్మీ సిగ్గుపడిపోయింది. తర్వాత రాకెట్ రాఘవ మురారి ఇద్దరూ కలిసి అత్తిలి సత్తి గెటప్స్ లో వచ్చి ఎంటర్టైన్ చేశారు. "రాకెట్ రాఘవ ఇక్కడ  నేనొస్తే మినిమం ఉంటది అనేసరికి నేనొస్తే మిలియన్స్ లో ఉంటది" అని కౌంటర్ ఇచ్చాడు మురారి. "ఏంట్రా అత్తిలి సత్తిబాబుని వస్తే అనుష్క జింతాతా జిత అనట్లేదు అంటాడు. నిన్ను ముత్తాత అంటారు కానీ జింతాత అని ఎందుకు అంటారు" అనేసరికి రాఘవ సైలెంట్ ఐపోయాడు.  తర్వాత బంగారం పాప వచ్చి చలాకి చంటితో స్కిట్ వేస్తుంది. ఇలా నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది.

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫన్నీ wwf ఫైటింగ్ పోటీలు

శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు wwf తరహాలో ఒక ఫన్నీ ఫైటింగ్ తో వచ్చేసారు కమెడియన్స్ . "భార్యలు పారిపోయారని ఏడుస్తున్న భర్తలు, భర్తలను వదిలించుకుని పారిపోయే వచ్చిన భార్యలు" అనే కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు ఈ వారం. భర్త wwf లో కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ భార్యలు మాత్రం హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. wwf లో వేసుకునే చెడ్డీలతో, బెల్టులతో వచ్చి ఫన్నీ రెజ్లింగ్ పోటీలు పెట్టుకుంటారు.ఇల్లీగల్ అఫైర్స్ కాండిడేట్స్ అంటూ పంచ్ ప్రసాద్ వాళ్ళందరి గురించి ఇంట్రడక్క్షన్ ఇస్తాడు. తర్వాత  రింగ్ లోకి వెళ్లిన  ఆది, సన్నీ రెజ్లింగ్ చేసుకుంటూ మధ్యలో సన్నీ ఆదికి హెడ్ మసాజ్ బాడీ మసాజ్ చేస్తుంటాడు. ఆ సీన్ చూసేసరికి ఆ షోకి  వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు పడీ పడీ నవ్వుతారు. తర్వాత ఒక స్కూల్ నుంచి ఒక చిన్నారి వచ్చి నాటీ నరేష్ తో మ్యాజిక్ చేస్తుంది. ఆ మేజిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత ఆటో రాంప్రసాద్ సరిగా రెజ్లింగ్ చేయకపోయేసరికి నువ్వు చేతబడి చేస్తున్నావా ఫైట్ చేస్తున్నావా అంటూ ఫన్ క్రియేట్ చేసాడు. 

అమ్మతో కలిసి ఓనం సెలెబ్రేట్ చేసుకున్న సుమ!

యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ షోలో ఐనా ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో  వీడియోలు చేస్తూ ఇన్స్టా లో పోస్ట్లు పెడుతూ  అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది.   ఇక ఇప్పుడు సుమ లేటెస్ట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇటీవల సుమ వాళ్ళ అమ్మతో కలిసి ఎక్కువగా  సందడి చేస్తూ కనిపిస్తోంది. ఆమె 80వ పుట్టిన రోజు, వరలక్ష్మీ వ్రతం చీర అంటూ సుమ షాపింగ్ చేయించింది. వాళ్ళ అమ్మ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది.  సుమ కేరళ కుట్టి అని అందరికీ తెలుసు ఇక ఇప్పుడు సుమ వాళ్ళ ఇంట్లో చేసుకున్న ఓనం ఫెస్టివల్ వీడియోని షేర్ చేసేసరికి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజీవ్ కనకాల సుమ తలలో పూలు పెడుతూ ఇద్దరూ ఎంతో చూడముచ్చటగా కనిపించారు. ఓనంకి వేసే స్పెషల్ ముగ్గును కూడా అందంగా డెకరేట్ చేసింది పూలతో. చివరికి చక్కగా భోజనం కూడా ఆరగించింది సుమ. ఇలా వాళ్ళ అమ్మతో కలిసి ఓనం ఫెస్టివల్ ని సెలెబ్రేట్ చేసుకుంది సుమ.

పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ కి వెళ్ళేది అతను మాత్రమే!

హైపర్ ఆది బుల్లి తెర మీద ఎంతో ఫేమస్. ఇక అతని పంచ్ డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో పేలతాయి. ఇక ఆది పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఏ చిన్న సందర్భం దొరికినా పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక విషయం చెప్పకుండా మాత్రం ఉండడు. ఇప్పుడు కూడా అదే పని చేసాడు ఆది. ఢీ డాన్స్ షోలో సందడి చేస్తున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ లో కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇక ఇదే షోకి "నేను మీకు బాగా కావాల్సినవాడిని" సినిమా ప్రమోషన్స్ కోసం కోడి దివ్య, కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ వచ్చారు. "చాలా తక్కువ వయసులో ఎక్కువ సినిమాలు చేసింది కిరణ్ అబ్బవరం.  చిన్నవాళ్లకు అన్నలా, పెద్దవాళ్లకు తమ్ముడిలా, ప్రతీ పేరెంట్ కి ఒక కొడుకులా అనిపిస్తాడు. నాకు  పవన్ కళ్యాణ్ గారి మాట కానీ పాట కానీ వింటే నోటికి తెలియకుండా అరుపులు  , చేతికి తెలియకుండా చప్పట్లు, వేళ్ళకు తెలియకుండా విజిల్స్  వచ్చేస్తాయి. నాకు మళ్ళీ ఆయన స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కిరణ్ అబ్బవరం అని అనిపిస్తుంది. అందరూ సినిమాలు చేస్తారు కానీ ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టే హీరో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది కిరణ్ అబ్బవరం మాత్రమే" అంటూ కామెంట్స్ చేసాడు.

రిషి, వసుధార నిజంగా పెళ్లి చేసుకుంటే అంతే...మహాభారతంలో పేరుతో తిట్టుకుంటారు!

గుప్పెడంత మనసు సీరియల్ కార్తీక దీపంతో పోటాపోటీగా రన్ అవుతున్న సీరియల్. ఈ సీరియల్ లో మహేంద్ర, జగతి, రిషి, వసుధారా క్యారెక్టర్స్ ఫుల్ హైలైట్. అందులోనూ రిషి, వసుధార గురించి ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళు నటనలో జీవించేస్తారు. ఐతే  ఆఫ్ స్క్రీన్ లో వీళ్ళు టామ్ అండ్ జెర్రీ కంటే ఎక్కువగా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు అని సాయికిరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "ఎందుకు గొడవ పడతారో తెలీదు. ఒకళ్ళ కాలు ఇంకొకళ్ళు తొక్కి కంప్లైంట్ చెప్పడం..ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుని తిట్టుకోవడం వంటివి చేస్తుంటారు. ఆ తిట్లు కూడా మహాభారతంలో క్యారెక్టర్లతో పిలుచుకుని మరీ తిట్టుకుంటారు.  హిడింబి అని, కుంభకర్ని అని, రావణ అని, సూర్పణకి ఇలా. ఇక వీళ్ళిద్దరూ  నిజ జీవితంలో పెళ్లి చేసుకుంటే ఇంకా అంతే సంగతులు. ఒకళ్ళనొల్లకు పొడుచుకు చచ్చిపోతారు అందుకే ఇద్దరూ అస్సలు పెళ్లి చేసుకోకూడదు. వాళ్లకు ఒక్క నిమిషం కూడా పడదు. ఎందుకో తెలీదు.  ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ధ్యేయంలా అనుకుంటారు. ముఖేష్ గురించి చెప్పాలంటే చాలా మంచివాడు. వాళ్ళ పేరెంట్స్ అతన్ని బాగా పెంచారు. చాలా సాఫ్ట్ గా , ఇన్నోసెంట్ గా ఉంటాడు. నాకు రిషి, వసుధార అంటే చాలా ఇష్టం. అందుకే ఇద్దరికీ ప్రతీ నెలా ఏదో ఒకటి బర్త్డే గిఫ్ట్ లా ఇస్తూ ఉంటాను" అని చెప్పారు సాయికిరణ్.

దేవుడు నాకు కనిపిస్తే మా నాన్న కావాలని అడుగుతాను

కీర్తి భట్ బుల్లి తెర మీద ఫేమస్ ఐన నటి. "మనసిచ్చి చూడు" సీరియల్ లో హీరోయిన్ గా, "కార్తీక దీపం" సీరియల్ లో హిమగా ఫేమస్ అయిన కీర్తి భట్ జీవితంలో ఎంతో విషాదం ఉంది. ఇప్పుడు కీర్తి బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి "గాంధారీ గాంధారీ" అనే సాంగ్‌కు స్టెప్పులేస్తూ ఫస్ట్ కంటెస్టెంట్ గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఐతే హౌస్ లోకి  వెళ్లకుముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.    "ఒకరోజు ధర్మస్థలికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నాం. ఐతే మా నాన్న దేవుడి ప్రసాదాన్ని దారిలో ఉన్న తన ఫ్రెండ్ కి ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు.. అలా ప్రసాదం ఇచ్చి రిటర్న్ అవుతున్న టైంలో జరిగిన ఆక్సిడెంట్ తో నా జీవితం అంతా తల్లకిందులైపోయింది. నేను 32 రోజులు కోమాలో ఉన్నా. తర్వాత తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నాన్న ఉన్నప్పుడు అన్నీ ఆయనే నాకు. అమ్మతో అంత బాండింగ్ లేదు నేనెప్పుడూ అమ్మ అని కూడా పిలిచేదాన్ని కాదు పేరు పెట్టి పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఒక బిడ్డను దత్తత తీసుకున్నాక తెలిసింది అమ్మ విలువ. ఎన్ని రోజులు ఏడ్చానో లెక్కేలేదు. నాకు దేవుడు కనిపిస్తే మా నాన్న కావాలని అడుగుతాను...మా నాన్న కనిపిస్తే నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావని అడుగుతాను" అంటూ ఎమోషనల్ అయ్యింది కీర్తి.    "ఒక రోజు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్ళాను. ఐతే అక్కడ అందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు. నాకు తెలీదు. అప్పుడు నాన్న ఫోన్ చేసేసరికి చెప్పాను  లొకేషన్ షేర్ చేయమన్నారు వెంటనే  వచ్చి నన్ను ఇంటికి  తీసుకెళ్లారు. అలాగే ఫ్రెండ్స్ అందరిని రెండో రోజు ఇంటికి రమ్మన్నారు. నన్ను కొడతారనుకున్న..కానీ ఒక్కమాట కూడా అనలేదు. అందరూ వచ్చాక ఎవరి మీద అరవలేదు, కోప్పడలేదు..మీ పేరెంట్స్ అంతా మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళను ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే  పనులు చేయొద్దని చెప్పారు. బతికినంతకాలం నీ మీద ఎలాంటి బ్లాక్ మార్క్ ఉండకూడదు...ఎవరూ వేలెత్తి చూపించకూడదు అని చెప్పారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నాన్న మాటకు కట్టుబడి ఉన్నాను." అంటూ చెప్పింది కీర్తి.

పాములకు, నాకు విడదీయరాని బంధం!

సాయికిరణ్ సింగర్ గా, నటుడిగా అందరికీ పరిచయమున్న వ్యక్తి. "అనగనగా ఆకాశం ఉంది" అనే పాటతో అప్పట్లో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఐతే సాయికిరణ్ కి దైవ భక్తి చాలా ఎక్కువ. ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం. అలాగే ఆయన ఎన్నో పాముల్ని కూడా పట్టి అడవుల్లో వదిలినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.    "ఒక రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఒక పెద్ద తాచుపాము రోడ్డు మధ్యలో ఉండేసరికి అక్కడివాళ్లంతా చంపుదామని తరుముతున్నారు. ఆల్రెడీ అప్పటికే నాలుగు దెబ్బలు కొట్టేసారు. దాంతో అది ఫుల్ కోపంలో ఉంది. అది చూసి నేను వాళ్లకు తమిళ్ లో చెప్పాను చంపొద్దని. నేను పట్టుకుందామని వెళ్లేసరికి అది నా మీద బుసలు కొట్టింది దాంతో వాళ్ళు దాన్ని చంపేశారు. ఆ ఘటన చూసాక నాకు స్నేక్ పార్క్ పెట్టి  వాటిని కాపాడాలని అనుకున్నా. కానీ ప్రభుత్వం నుంచి ఎన్నో పర్మిషన్లు తెచ్చుకోవాలి అదంతా ఎందుకు అని పాముల్ని ఎలాగయినా కాపాడాలనే సంకల్పంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ఆర్గనైజషన్ లో చేరాను. ఆ తర్వాత ఎన్నో పాముల్ని కాపాడాను. చిరంజీవి, నాగార్జున, పవన్కళ్యాణ్ గారి ఇళ్లల్లోంచి ఎన్నో పాముల్ని బయటికి తీసి అడవిలో వదిలాను. ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఐతే ఎన్నో పాముల్ని కాపాడాను. ఈ సంస్థలో చేరిన 12 నుంచి 15 ఏళ్లలో దాదాపు 3 వేల పాముల వరకు పట్టాను. వాటిని గోనెసంచుల్లో వేసుకుని తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో వదిలేస్తాం. ఒకసారి ఒక గోనెసంచిలో 16 పాముల్ని  తీసుకెళ్ళాం అక్కడ వదిలేద్దామని. ఐతే పాములు ఆ సంచిలో పాస్ పోసేసరికి కింద గోనెసంచి తడిసిపోయి  తాళ్లు ఊడిపోయాయి..ఆ విషయం నాకు తెలియక పైన మూత తీస్తున్నా.. ఇంతలో కింద నుంచి ఆ పాములన్నీ నా కాళ్ళ మీద పడిపోయాయి. అప్పుడు ఆ విషయం తెలిసి మా అమ్మ తిట్టింది. ఇదంతా నీకవసరమా అని అప్పుడు ఇదంతా థ్రిల్ అమ్మా కిక్కు..అనేవాడిని ..కానీ తర్వాత నాకూ అనిపించింది ఇదంతా అవసరమా" అని. అలా పాములతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు సాయికిరణ్.

ప్రదీప్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అంటున్న ఆమని

జీ తెలుగులో ఎన్నో షోస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి ప్రతీ వారం. ఇక ఇప్పుడు జీ తెలుగు సూపర్ ఫామిలీ సీజన్ 1 గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ ఐపోయింది. ఇప్పుడు దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నాలుగు సీరియల్స్ యాక్టర్స్ పోటీ పడ్డారు. కల్యాణ వైభోగం టీమ్ vs అగ్ని పరీక్ష టీమ్, ముత్యమంతా ముద్దు vs గుండమ్మ కథ టీమ్ మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది.  ఇక మేఘన లోకేష్ ముసలమ్మ వేషంలో ఎంట్రీ ఇచ్చేసరికి " ఏమిటి పెద్దమ్మ .. మీ ఒరిజినల్ క్యారెక్టర్ లో ఈ షోకి వచ్చారు  అంటూ కౌంటర్ వేసాడు ప్రదీప్. అసలు ఈ షోకి మీకు ఏం చెప్పి తీసుకొచ్చారు అనేసరికి మిమ్మల్ని చూసే అవకాశం అప్పుడప్పుడే దొరుకుతుంది కదా అందుకే పిలవగానే వచ్చేసా" అంటుంది మేఘన లోకేష్.  ఇక ఈ షోకి గెస్ట్ గా సినీ యాక్టర్ ఆమని వచ్చింది. అప్పుడు ప్రదీప్ ఈ టీమ్స్ లోని యాక్టర్స్ ని చూపించి వాళ్ళ టాలెంట్ కి తగ్గట్టు మూవీ టైటిల్ ఇవ్వండి అని అడిగాడు. "సిద్దార్ధ్ వర్మని చూసిన ఆమని సిసింద్రీ అంటూ మూవీ టైటిల్ ఇస్తుంది. ప్రదీప్ కి ఒక మూవీ టైటిల్ ఇవ్వండి అని ఒక సీరియల్ యాక్టర్ అడిగేసరికి మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ "అంటూ ఆమని సినిమా టైటిల్ ఇచ్చేస్తుంది. ఇక అలా మొదలయ్యింది సినిమాలో ఫుల్ ఎంటర్టైన్ చేసిన స్నిగ్ద ఈ షోకి వచ్చి తన సింగింగ్ టాలెంట్ ని పరిచయం చేసింది. కొన్ని పాటలు పాడింది. ఇక ఈ షోలో పోటీ పడిన నాలుగు టీమ్స్ లో ఏ టీమ్ టైటిల్ విన్ అయ్యిందో తెలుసుకోవాలంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆగాల్సిందే.

శ్రద్దా చాలా హాట్ అంటున్న జానీ మాస్టర్

ఢీ సీజన్ 14 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, హీరోయిన్ శ్రద్దాదాస్ జడ్జెస్ గా వచ్చారు. ఈ షోలో హైపర్ ఆది కామెడీ కామన్ అనే విషయం అందరికీ తెలుసు. ఆది పక్కనే ఉన్న అఖిల్ ని ఇండస్ట్రీకి వచ్చి ఎన్నాళ్లయ్యిందని అడిగాడు. పదేళ్లు అయ్యింది అని అఖిల్ అనేసరికి ఎంత సంపాయించావ్ అని మళ్ళీ ఆది అడుగుతాడు. బానే సంపాయించా అన్నాడు. "అసలు ఏమీ చేయకుండానే ఇంత సంపాదించావంటే, ఏమన్నా చేసుంటే ఇంకెంత సంపాదించేవాడివో" అంటూ పంచ్ వేశాడు. దానికి అందరూ గట్టిగా నవ్వేశారు.    అనంతరం జడ్జి శ్రద్దాని ఆది ఒక క్వశ్చన్ అడిగాడు. "గణేష్, జానీ మాస్టర్స్ ఇద్దరిలో ఎవరు నాటీ? ఎవరు స్వీటీ? అని అడిగాడు. జానీ మాస్టర్ నాటీ.. గణేష్ మాస్టర్ స్వీటీ అని శ్రద్దా ఆన్సర్ ఇచ్చింది. పక్కన కూర్చుని  ఎంత ఇబ్బంది పెట్టకపోతే అలా మాట్లాడుతుంది చెప్పు అని  ఆది అన్నాడు. తర్వాత శ్రద్దా జానీ మాస్టర్ ఇవాళ నాకు ఓ కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పేసరికి.. ఏమన్నాడని ఆది చాలా ఇంటరెస్టింగ్ గా అడిగాడు. నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్ అన్నాడు.. అని చెప్పడంతో ఆది సడెన్ గా కూర్చున్నవాడల్లా లేచి నిలబడి నాకు తెలిసి పశుపతి కూడా అరుంధతిని కొంచెమే ఇబ్బంది పెట్టుంటాడు. జానీ మాస్టర్ మాత్రం... బాబోయ్ అంటూ అతనికి  ఆది దణ్ణం పెట్టేస్తాడు. ఆది పంచ్ కి అందరూ గట్టిగా నవ్వేశారు. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాటీ నరేష్ ని వాడుకుని వదిలేసిన గర్ల్ ఫ్రెండ్!

ఈ మధ్య బుల్లి తెర షోస్ లో లవ్ పెర్ఫార్మెన్సులు ఎక్కువయ్యాయి. వాళ్ళ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీస్ నే స్కిట్స్ రూపంలో డాన్సస్ రూపంలో చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో లవ్ స్టోరీ. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో చేసే నాటీ నరేష్ లవ్ స్టోరీ నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ ఐన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమోలో నరేష్ తన లవర్ స్టోరీ పెర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టేసాడు. తన రియల్ రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందని చెప్పాడు.  నరేష్ ఒక  ఈవెంట్ లో డాన్స్ చేస్తుండగా అతడి డ్యాన్స్ కి ఫిదా ఐన ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. నరేష్ ఆ అమ్మాయితో రొమాంటిక్ గా డ్యాన్స్ కూడా చేస్తాడు.  ఒక రోజు ఆ అమ్మాయి తన అసలైన బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడడం నరేష్ చూసేస్తాడు. ఇంకా ఆ పొట్టోడితోనే తిరుగుతున్నావా అని ఆమె బాయ్ ఫ్రెండ్ అడిగేసరికి  అలా కాదు అభి ఆ పొట్టోడు ఈవెంట్స్ లో సంపాదించిన డబ్బు మొత్తం తీసేసుకుని ఆ తర్వాత వాడిని వదిలేద్దాం అని చెబుతుంది. తనని ప్రేమ పేరుతో మోసం చేయడం మాత్రమే కాక తన లోపాన్ని హేళన చేసేసరికి నాటీ నరేష్ గుండె పగిలిపోతుంది. గుండె పగిలేలా ఏడుస్తాడు. పిచోడైపోతాడు. నరేష్ చేసిన ఈ ఎమోషనల్  పెర్ఫామెన్స్ అందరి చేతా కన్నీళ్లు తెప్పించింది.  ఈ షోకి గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ సదా కూడా నరేష్ స్కిట్ చూసి  ఆశ్చర్యపోతుంది. స్కిట్ అయ్యాక  చాలా నాచురల్ గా యాక్ట్ చేశారు అంటూ నరేష్ కి కాంప్లిమెంట్ ఇస్తుంది.. "మీ లైఫ్ లో ఏదైనా బాధ ఉందా  అని అడిగేసరికి అవును మేడం ఉంది" అంటాడు. ఇక ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది, సన్నీ, ఆటో రాంప్రసాద్, నూకరాజు వీళ్లంతా ఇల్లీగల్ ఎఫైర్స్ కాంటెస్ట్ పేరుతో ఒక ఫన్నీ రెజ్లింగ్ పోటీలు పెట్టి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి గెస్టులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ, సుధీర్ బాబు వచ్చి స్కిట్స్ ని ఎంజాయ్ చేశారు.

మూడో రోజు నామినేషన్లో ఉన్న ఆ ఏడుగురు కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ మూడవ రోజు "హాత్ లగా దేంగే" పాటతో మొదలైంది. రోహిత్ మరియు మెరీనా ఒక జంటలా అడుగుపెట్టిన కారణంగా, ఒక జంటలానే బయటకు వెళ్తారని, జంటగానే ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. ఎవరిని ఇంటికి పంపించాలనుకుంటున్నారో వారి పేరు రాసి ఫ్లష్ చేయండని బిగ్ బాస్ చెప్పాడు. రేవంత్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు. ఫైమాని, ఆరోహిని నామినేట్ చేసాడు రేవంత్. నేను చూసింది మాత్రమే చెప్తున్నాను. నా పాయింటాఫ్ లో నాకు ఏదైతే అనిపించిందో అదే చేసానని రేవంత్ చెప్పుకొచ్చాడు. తర్వాత రేవంత్‌ని, చంటిని సుదీప నామినేట్ చేసింది. తర్వాత రేవంత్‌ని, అర్జున్‌ని ఫైమా నామినేట్ చేసింది.  ఫైమాకి సమాధానంగా.. రేవంత్ నెగెటివ్ అయ్యాడని మోటివేట్ చేసానని అర్జున్ చెప్పుకొచ్చాడు. రేవంత్, శ్రీసత్యని నామినేట్ చేసింది ఫైమా. ఆరోహి, ఫైమాని అర్జున్ నామినేట్ చేసాడు. అర్జున్ నీ చూపుల్లో చాలా అర్థాలు ఉన్నాయని ఆరోహి అంది. ఇది తనకు నచ్చలేదని అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేసారు. చివ‌ర‌గా, "ఆరోహీ, శ్రీసత్య, చంటి, రేవంత్, ఇనయ, అభినయశ్రీ, ఫైమా నామినేషన్లో ఉన్నారు." అని బిగ్ బాస్ చెప్పాడు.

'ప్రాజెక్ట్ కె' కి కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను!

‘మహానటి’ మూవీతో డైరెక్టర్ గా నిరూపించుకున్న నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ కె’ అనే సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకోనే హీరోయిన్ గా నటిస్తోంది.. బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 'ఆలీతో సరదాగా' షోలో ఎన్నో సినీ విశేషాలను వివరిస్తున్న క్రమంలో 'ప్రాజెక్టు కే' ప్రస్తావ‌న‌ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఎన్నో విషయాలను నాగ్ అశ్విన్ తనతో చర్చించారన్నారు సింగీతం. తాను 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ లో లేనని చెప్పారు. "నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నాడు. కొన్ని మార్పులు చేర్పులు చేయమని కోరితే కాస్త సహకరించాను. నాకు తెలిసినవరకు కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చాను. అక్కడితో నా పని అయిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు. ఇలా 'ప్రాజెక్ట్ కె' సినిమాలో తాను ఎలా ఎంతవరకు భాగమాయ్యాన‌నే విషయాన్ని సింగీతం తెలియ‌జేశారు. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఇంటరెస్టింగ్ నెరేష‌న్‌తో ‘ప్రాజెక్ట్ కె’ అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతోంది.

‘ఊ అంటావా మావ’ అంటూ శేఖర్‌తో చిందేసిన శ్రీముఖి!

గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకరింగ్ మాత్ర‌మే కాదు, డాన్స్ కూడా ఇరగదీసేస్తుంది. ఎప్పుడూ యాక్టీవ్ గా, స్టేజిపై సందడి చేస్తూ ఉంటుంది  శ్రీముఖి.. బుల్లితెర మీద శ్రీముఖి ఎన్నో షోస్ చేస్తూ అలరిస్తూ ఉంది. ఇప్పుడు "డాన్స్ ఐకాన్" లోకి టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో అతి పెద్ద డిజిటల్ ప్లాట్ ఫామ్ ఐన ఆహాలో ఈ డాన్స్ షో స్టార్ట్ కాబోతోంది. దీన్ని పాపులర్ యాంక‌ర్‌ ఓంకార్ నిర్వహిస్తున్నారు.  సెప్టెంబర్ 11న 'డాన్స్ ఐకాన్' ప్రారంభం కానుంది. ఈ షో కోసం శ్రీముఖి స్పెషల్ పెర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతః అనొచ్చు. గ్లామరస్ పింక్  డ్రెస్ లో ‘ఊ అంటావా మావ’ పాటకు డ్యాన్సర్స్ తో కలిసి  స్టెప్పులు ఇరగదీసేసింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి వేసిన హాట్ స్టెప్స్ తో ఒక ప్రోమో   సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  శ్రీముఖి డ్యాన్స్ పై నిర్మాత అల్లు అరవింద్, శేఖర్ మాస్టర్ ప్రశంసలు కురిపించారు. "ఈ పాటకు ఒక అమ్మాయి చేస్తేనే మాములుగా ఉండదు, అలాంటిది నలుగురు అమ్మాయిలూ చేసేసరికి అదిరిపోయింది" అని శేఖర్ మాస్టర్ అంటే "మిగతా ప్రొఫెష‌న‌ల్‌ డాన్సర్స్ తో సమానంగా చేసావ్ష‌ అంటూ శ్రీముఖిని పొగిడేశారు అల్లు అరవింద్.

'ఆర్ఆర్ఆర్‌'లో చరణ్, తార‌క్‌.. ఎవరు బాగా చేశారు? జక్కన్నను ఇరుకున పెట్టిన సుమ!

సుమ ఎప్పుడూ తన షోకి వచ్చే వాళ్లందరికీ ట్విస్టులు ఇస్తూ ఇరుకున పెడుతూ ఉంటుంది. లేటెస్ట్ గా రిలీజ్ ఐన క్యాష్ ప్రోమో చూస్తే అది అర్థ‌మవుతుంది. రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కొమురం భీమ్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటన వేరే లెవెల్.  లేటెస్ట్‌గా రాజమౌళి క్యాష్ షోకి వచ్చారు. అందులో రాజమౌళి వెపన్ షాప్ చూపించింది సుమ‌. ఆ షాపులో రాజమౌళి తన సినిమాల్లో ఇప్పటివరకు వాడిన కత్తుల్ని ప్రదర్శనకు పెట్టింది. ఫైనల్ గా "ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఇద్దరిలో ఎవరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు" అని ప్రశ్నించేసరికి క్యాష్ షోకి వచ్చిన 'బ్రహ్మాస్త్ర' హీరోహీరోయిన్లు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ షాకయ్యారు. జక్కన్న ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎవరి పేరు చెప్తే ఎవరు ఫైర్ అవుతారో అన్నట్టుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక ప్రోమో అక్కడితో కట్ చేసేసారు. ఇంతకు జక్కన్న ఏం ఆన్సర్ ఇచ్చారు? అనే విషయం షో చూస్తేనే తెలుస్తుంది. ఇక ఆయన ఎలా స్పందిస్తారనే విషయంపై తార‌క్‌ ఫ్యాన్స్, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ ఆసక్తికరంగా వెయిట్‌ చేస్తున్నారు. శనివారం ప్రసారం కాబోయే ఫుల్ షోలో రాజమౌళి ఎలా స్పందించారో చూడాలి.

హౌస్‌లో గొడవలు మొదలు!

బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ డే నుంచే రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా క్లాస్-మాస్-ట్రాష్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్స్ పోటీకి దిగారు. "స్లైడ్ జరా స్లైడ్ జరా" అనే టాస్క్ లో భాగంగా సింగర్ రేవంత్ తో త‌ల‌ప‌డిన‌ అభినయశ్రీ ఓడిపోయింది. తర్వాత 'రోల్ బేబీ రోల్' టాస్క్ లో నేహా చౌదరి, ఇనయా సుల్తానా తలపడ్డారు. పాచికలను పోలిన బాక్సులను నిర్ణయించిన ప్రదేశంలో పెట్టాల్సిన ఈ టాస్క్ లో నేహా చౌదరి గెలిచింది.  ఇనయ ఓడిపోయేసరికి తనకు ఈ గేమ్ లో ఎవరి సపోర్ట్ దొరకలేదని బాధపడింది. ఆదిరెడ్డి, రేవంత్ ఇద్దరూ ఆమెకు నచ్చజెప్పారు. ఇక క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. టాస్క్ పూర్తయ్యే సమయానికి క్లాస్ లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా చౌదరి ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యార‌ని ప్రకటించాడు. ఇక ట్రాష్ లో మిగిలిన అభినయశ్రీ, బాలాదిత్య, ఇనయ ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించారు. ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నందుకు ఆ ముగ్గురు ఫుల్ ఖుషి అయ్యారు.  మరో పక్క టాస్క్స్, ఎలిమినేషన్స్ గురించి  భర్త రోహిత్ తో ఏదో సీరియస్ గా చెప్పబోయి అద్దంలో బాడీ చూసుకుంటూ వింటుండేసరికి కోపంతో, "చెప్పేది విను లేదంటే బాడీ అయినా చూసుకో" అంటూ విసుక్కుంది. అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఫైనల్ గా 21 మంది కంటెస్టెంట్స్ లో కొందరు సేవ్ అయ్యారు. కొందరు డేంజర్ జోన్ లోకి వెళ్లారు. ఫస్ట్ వీక్ హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యేదెవరో చూడాలి.  

రెండు రోజులు షూటింగ్ చేశాక బాల‌కృష్ణ సినిమాలోంచి న‌న్ను తీసేశారు!

'స‌రిలేరు నీకెవ్వ‌రు' మూవీలో "నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్" డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ ఐపోయిన న‌టి సంగీత 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సంగీత ఇప్పటికీ యంగ్ గా ఉంది అంటూ అలీ ఇన్డైరెక్ట్‌గా అన్నాడు. "సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ తల్లిగా చేసావ్ కదా.. అది నీకు ప్లస్ అయ్యిందా మైనస్ అయ్యిందా?" అని అడిగా అలీ. "రెండూ" అని సమాధానం ఇచ్చింది సంగీత. "అనిల్ రావిపూడిని ఇప్పటికీ తిడుతుంటాను, అలా చేయించినందుకు" అంటూ కామెడీ చేసింది. తర్వాత 'మసూదా' మూవీ టీమ్ నుంచి హీరో హీరోయిన్స్ ఐన తిరువీర్, కావ్య వచ్చారు. ఈ చిత్రం హారర్ కమ్‌ థ్రిల్లర్ మూవీగా ఎంటర్టైన్ చేయబోతోందని చెప్పింది కావ్య. "నీ చిన్నప్పుడే డేట్స్ తీసుకున్నారట కదా.. ఇప్పుడు బిగ్ స్టార్స్" అని అలీ అడిగేసరికి, కావ్య నవ్వేసి "అల్లు అర్జున్ గారు అన్నారు నువ్ పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా చేయాలని.. నేను కూడా నవ్వేసి నేను హీరోయిన్ అయ్యేసరికి  మీరు ముసలోళ్ళు ఐపోతారు అన్నాను" అంది కావ్య. "నీకొచ్చిన అవకాశాల్లో ఇది ఎందుకు వదులుకున్నాను అని ఫీల్ అయ్యింది ఏదన్నా ఉందా?" అని సంగీతను అడిగాడు అలీ. "బాలకృష్ణ గారి సినిమా కోసం ఒక రెండు రోజులు షూటింగ్ చేసాను. తర్వాత అందులోంచి నన్ను తీసేసారు" అని షాకింగ్ విష‌యం చెప్పింది సంగీత‌.

బిగ్ బాస్ నామినేషన్స్‌కి వెళ్లిందెవరు.. త‌ప్పించుకుందెవ‌రు?

బిగ్ బాస్ రెండవ రోజు.. రజనీకాంత్ నటించిన ‘పెట్టా’ మూవీలోని 'మరణం... మాసు మరణం' అనే పాటతో మొదలైంది. ఉదయం 8:15 గంట‌ల‌కు అర్జున్, కీర్తి భ‌ట్ మధ్య గుసగుసలు. ఉదయం 9 గంటలకు భార్యాభర్తల మధ్య చిలిపి మాటలు "హగ్ ఇలా ఇచ్చాడు" అని నవ్వుతూ చెప్పుకొచ్చింది మెరీనా. ఉదయం 11:45 గంట‌ల‌కు "ఎవరు క్లాస్‌లో ఉండాలో, క్లాస్ నుండి ఎవరు ట్రాష్లోకి వెళతారో మీరే నిర్ణయించుకోండి. క్లాస్ సభ్యులు, ట్రాష్ సభ్యులు ఎక్కడికైనా వెళ్ళి చర్చించుకోండి" అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత గలాటా గీతూ గట్టి టాస్క్ ఇస్తే త‌ను ఓడిపోతానని చెప్పింది. టాస్క్ ఏంటో కూడా తెలియకుండా అలా ఎలా ఓడిపోతానని చెప్పగలవని చలాకీ చంటి అన్నాడు. అలాగే రేవంత్ ఓపిక లేదని, టాస్క్ ఇచ్చినా ఓడిపోతానని అన్నాడు. "నామినేషన్స్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నాకు నవ్వొస్తుంది" అని గీతూ అంది. "ట్రాష్ నుండి క్లాస్ కి ఎవరు  వెళ్తారు?" అని బిగ్ బాస్ అడిగితే, "గీతూని పంపిస్తున్నా" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత అర్జున్‌తో రేవంత్, "పొద్దున్నుంచి ఏం తినలేదు భయ్యా.. ఓపిక లేదు" అని ఏడ్చేసాడు. అర్జున్ "ఊరుకోండి బ్రో.. మీరు స్ట్రాంగ్" అని చెప్పి ఓదార్చాడు. ఆ తర్వాత క్లాస్లోకి వెళ్ళిన గలాటా గీతూ తన ఆధిపత్యం చలాయించింది. ఆరోహీతో గీతూ "ఆరోహి.. నీళ్ళు తీసుకొస్తే చేయి కడుక్కుంటా. టిష్యూ ఎవడు తెస్తాడు"" అనగానే ఆరోహీ నవ్వుతూ "దీంతో తుడుచుకో" అని టీ షర్ట్ ఇవ్వబోయింది. ఆ తర్వాత ఇనయ మీద గట్టిగా పగతీర్చుకోడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.  ఇనయతో గీతూ, "నిమ్మకాయ నీళ్ళు తీసుకురా చక్కెర వేసుకొని" అని చెప్పింది. తీసుకొచ్చాక "ఓ పాట పాడు రాజా" అంది. అప్పుడు ఇనయ "నాకు పాటలు పాడటం రావు. ఇంట్లో పనులు ఏవైనా చెప్పు చేస్తాను. నీ కోసం రైమ్ ఎందుకు పాడుతా. బిగ్ బాస్ రూల్స్లో పాటలు పాడాలని లేదు" అని చెప్పేసింది. తర్వాత "అర్జున్ నువ్వు పాట పాడు. ఆరోహీ నువ్వు గిటార్ ప్లే చేయి" అని ఆర్డర్ వేసింది గీతూ. ఆదిరెడ్డికి, ఇనయ సుల్తానాకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆదితో "కళ్ళు పెద్దవి చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నావ్" అంది సుల్తానా. ఆది "నా మాటే అంత. లీవ్ ఇట్ " అన్నాడు. అభినయశ్రీ , రేవంత్ సెకండ్ టాస్క్ లో పాల్గొన్నారు. సంచాలకురాలిగా గలాటా గీతూను ఎన్నుకున్నారు. టాస్క్‌లో గెలిచి ట్రాష్ నుండి మాస్ లోకి వెళ్ళాడు రేవంత్. "మాస్ నుండి ట్రాష్ లోకి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ అడిగాడు. డైస్ టాస్క్ తర్వాత నేహా మాస్ నుండి క్లాస్లోకి వెళ్ళింది. సూర్య తను క్లాస్‌ నుండి మాస్‌కి వెళ్ళాలనుకుంటున్నట్లు ఆదిత్యతో చెప్పుకున్నాడు. బెడ్ రూంలో మెరీనా తన భర్తకు ఒక విషయం గురించి చెబుతూంటే అతను తను చెప్పేది వినట్లేదని అలిగి బయటకు వెళ్ళిపోయింది. నేహా, ఆదిరెడ్డి , గీతు ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకుంటున్నారు. అభినయశ్రీ, ఇనయ సుల్తానా, ఆదిత్య నేరుగా నామినేషన్స్ కు వెళ్తారని బిగ్ బాస్ చెప్పాడు. మొత్తానికి రెండవ రోజు నామినేషన్స్‌కు  ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు తప్పించుకున్నారు.