బేబీ డాల్స్ గేమ్ లో గెలిచిన కంటెస్టెంట్లు ఎవరు?
తొమ్మిదో రోజు బిగ్ బాస్ "బుట్ట బుమ్మ" సాంగ్ తో మొదలైంది. మొదటగా ఫైమాతో "నువ్వు కామెడీగా ఉండకూ, అందరూ అలానే చూస్తారు. నువ్వు మాట్లాడే విధానం బట్టి సులువుగా తెలిసిపోతుంది" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత ప్రతీసారీ అందరీకి నచ్చినట్టు ఉండటం తన వల్ల కాదని రేవంత్ తో చెప్పింది శ్రీసత్య.
బిగ్ బాస్ టాస్క్ గురించి వివరించాడు. "బేబీ డాల్స్ ని మీ బేబీలా చూసుకోవాలి. ఏ బేబీ ఒంటరిగా ఉంటుందో ఆ బేబీని లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరీయాలో పెట్టాలి" అని బిగ్ బాస్ కంటెస్టెంటలకు వివరించాడు. బిగ్ బాస్ కొత్త గేమ్ ను కంటెస్టెంట్లకు వివరించాడు. ఈ గేమ్ పేరు 'సాక్స్ అండ్ షేప్స్'. "ఈ షేప్స్ ని గార్డెన్ ఏరియాలో ఉన్న బాకస్ లలో సంచితో జంప్ చేస్తూ వెళ్ళి కరెక్ట్ గా సెట్ చేసి, అక్కడ ఉన్న గంటని మొదట కొట్టినవాళ్ళే విజేత" అని చెప్పాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో సంచాలకులురాలిగా నేహా ఉంది. రేవంత్, ఫైమా, చంటి, గీతూ పోటీలో పాల్లొన్నారు. గేమ్ లో చంటి గెలిచాడు. తర్వాత చంటి కెప్టెన్‌గా బ్యాడ్జ్ ధరించాడు.
తన బేబీని రాత్రంతా తన పక్కన పడుకోబెట్టుకోవాలని అనుకున్నానని మెరీనాకు చెప్పుకొని ఏడ్చేసాడు రేవంత్. రేవంత్ కి నేహాకి మధ్య చిన్న గొడవ జరిగింది. "నేను గేమ్ లో ఉన్నప్పుడు రూల్స్ గురించి చెప్పలేదు. నాకు సపోర్ట్ చేయలేదు. ఫైమా తప్పుగా ఆడింది ఐనా నువ్వు తననే సపోర్ట్ చేసావు" అని రేవంత్ చెప్పుకొచ్చాడు. దీనికి సమాధానంగా "నేను తప్పు చేయలేదు, గేమ్ ఎవరైతే సరిగ్గా ఆడారో వారే గెలిచారు" అని నేహా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ "తర్వాత ఛాలెంజ్ కి ఎవరు అర్హులు?" అని కెప్టెన్‌గా ఉన్న ఆదిత్యను అడిగాడు. "అర్జున్, ఇనయా, ఆరోహీ, కీర్తీ, ఫైమా తర్వాత ఛాలెంజ్ కి అర్హులు" అని ఆదిత్య, బిగ్ బాస్ కి వివరించాడు.
ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరీయాలో ఉన్న బేబీలను ఎవరు తీసుకొచ్చి వేసారో వారినే స్టోర్ రూంలో ఆ బేబీలని పెట్టమని ఆదేశించాడు బిగ్ బాస్. మీ బేబీల భాగోగులు చూసుకునే బాధ్యత మీమీదే ఉంటుందని, ఎవరూ తమ బేబీలను దుస్తులలో దాచుకోకూడదని బిగ్ బాస్ ఆదేశించాడు. బేబీ డాల్స్ గేమ్ లో ఎవరు గెలవబోతున్నారని ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. తొమ్మిదో రోజు గీతూ, అభినయశ్రీ, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్, మెరీనా-రోహిత్ నామినేషన్లో ఉన్నారు.