బిగ్ బాస్ షో ఫెయిర్ గా లేదు...కొంతమందినే బాగా హైలైట్ చేస్తున్నారు..నేహా షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ షో మొదలైన దగ్గర నుంచి వివాదాలను ఎదుర్కుంటూ ఉంది. హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యాక బయటికి వచ్చి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఆ షోని  తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు నేహా చౌదరి కూడా ఒక ఇంటర్వ్యూలో అలాంటి కామెంట్స్ చేసింది. " నేను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యానంటే చాలామంది నమ్మలేకపొతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ ఇవ్వని వాళ్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళ పేర్లైతే నేను చెప్పను. వాసంతి కేవలం  గ్లామర్ డాల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉంది. నావరకు నేను నిజంగా తప్పు చేసుంటే దాన్ని ఎపిసోడ్ లో ఎందుకు హైలెట్ చేయలేదని ప్రశ్నించింది.  ఇనయా గురించి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది రాంగ్ గా మాట్లాడారు. ఐతే   వీకెండ్ లో నాగార్జున గారు వచ్చి నా వెర్షన్ మొత్తాన్ని రివర్స్ చేసేసారు. ఈ షోకి సంబంధించినంత వరకు  నాగార్జున గారు ఫెయిర్ గా లేరనే టాక్ నడుస్తోంది ..కానీ దీనిపై ఇంకేమీ మాట్లాడను. చెప్పాలంటే నాగార్జున గారు ఒకరిద్దరు కంటెస్టెంట్లను మాత్రమే కావాలని  హైలెట్ చేస్తున్నారనే విషయం అందరికీ అర్ధమైపోతుంది. నాగార్జున గారికి  ఆర్జీవీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నందువల్లనే  ఇనయా హౌస్ లో కొనసాగుతోంది. ఆర్జీవీ గారు  ఇనయాను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో  పోస్ట్ పెట్టేసరికి  ఆమె సేవ్ అయ్యింది" అంటూ  నేహా చౌదరి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది.

ఆయనతో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది!

టాలీవుడ్ లో టాప్ హీరోస్ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గీత.  ఇక ఇప్పుడు ఈమె ఆలీతో సరదాగా షో  ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి ఫాన్స్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఆల్ టైం ఫేవరేట్ అని కానీ ఒక కోరిక మిగిలిపోయిందని అదే ఆయనతో నటించలేకపోవడమే అని ఆమె బాధపడ్డారు.   ఆయనతో కలిసి ఒక్క మూవీలో ఐనా నటించాలనుందని ఆమె అన్నారు.  ఇక  ఈమె తన చిన్ననాటి సంగతులను కూడా గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఒకరోజు స్కూల్లో ఫ్రెండ్స్ తో కలిసి జారుడు బల్ల ఆడుకుంటూ ఇంటికి ఆలస్యంగా వెళ్లేసరికి తన  తండ్రి బెల్టుతో చితక్కొట్టారంటూ చెప్పారు. ఇక స్కూల్లో టాప్ ర్యాంకర్స్ తోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవారట గీత ఎందుకంటే అసలే చదువులో వీక్ కాబట్టి  వాళ్ళతో స్నేహం చేస్తే బిట్స్ అవి చూసి కాపీ కొట్టడానికి మంచి అవకాశం దొరుకుతుంది కదా అంటూ నవ్వుతూ  చెప్పింది గీత. తాను చదువుకున్నది జస్ట్ 8th క్లాస్ మాత్రమే అని  చెప్పారు.  వెంటనే ఇండస్ట్రీలోకి వచ్చేశానన్నారు. భైరవి సినిమా తర్వాత  కృష్ణంరాజు గారు నటించిన మన ఊరి పాండవులు సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఇది తనకు రెండవ సినిమా అని అన్నారు. ఇలా  గీత తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

దసరా ధమాకా పెర్ఫామెన్సులతో అదిరిపోనున్న ఢీ డాన్స్ షో

దసరా ఉత్సవాల సందర్భంగా టీవీలో ఎన్నో షోస్ అలరిస్తున్నాయి. ఢీ షో కూడా చక్కగా ఎంటర్టైన్ చేస్తోంది. స్పెషల్ డేస్, పండుగలను  పురస్కరించుకుని ఆ తరహా నృత్యాలతో కంటెస్టెంట్స్ చక్కని డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఢీ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి ముగ్గురు లేడీ జడ్జెస్ వచ్చేసారు. పూర్ణ, యాని మాస్టర్, శ్రద్ధాదాస్. అలాగే ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా తెలంగాణ రాష్ట్ర విమెన్ సేఫ్టీ సీఐడి బి.సుమతి ఐపీఎస్ వచ్చారు. "ఢీ షో అనేది బిగ్ షో..నాకు ఇక్కడకి వచ్చినందుకు ఆనందంగా ఉంది" అని అన్నారామె. దిశా పేరుతో లేడీ కంటెస్టెంట్స్ పోలీస్ యూనిఫార్మ్ లో వచ్చి అదిరిపోయే డాన్స్ చేసేసరికి "ఒక స్త్రీ శక్తి ఎంత గొప్పదో, ఈ యూనిఫామ్ విలువ ఏమిటో డాన్స్ రూపంలో " చూపించారన్నారు. ఇక లేడీ కంటెస్టెంట్ చేసిన ఫీట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తర్వాత ప్రేమికుడు మూవీ లోంచి "అందమైన ప్రేమరాణి" సాంగ్ కి తనుశ్రీ వేసిన డాన్స్ స్టెప్స్ కి జడ్జెస్ ఫిదా ఐపోయి పూర్ణ తనని పిలిచి మరీ హగ్ చేసుకుంది. తర్వాత "అయిగిరి నందిని" భక్తి గీతానికి సాగర్, రిషిక చేసిన డాన్స్ స్టేజి మీద అందరికీ పూనకమొచ్చి ఊగేలా చేసింది. ఇక ఈ రాబోయే ఈ ఢీ డాన్స్ ఎపిసోడ్ మొత్తం పవర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాయి.

'బిబి హోటల్' వర్సెస్ 'గ్లాంప్ ప్యారడైజ్ హోటల్'!

'బిగ్ బాస్'  కంటెస్టెంట్స్ కి కెప్టెన్ పోటీ కోసం టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ పేరు  'బిబి హోటల్' వర్సెస్‌ 'హోటల్ గ్లాంప్ ప్యారడైజ్'. 'బిగ్ బాస్', చంటిని 'కన్ఫేషన్ రూమ్' కి పిలిచి సీక్రెట్ టాస్క్ గురించి వివరించాడు. "చంటి మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే  'బిబి హోటల్' లోని అతిథులు 'గ్లాంప్ ప్యారడైజ్ హోటల్' కి వెళ్ళిపోయేలా చెయ్యాలి అలా చేస్తే మీరు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు" అని బిగ్ బాస్ చెప్పాడు. "బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కొంత మంది 'బిబి హోటల్' స్టాఫ్ మరియు ఉత్సాహవంతులైన అమ్మాయిలు నడుపుతున్న 'హోటల్ గ్లాంప్ ప్యారడైజ్'.  కొందరు ఇంటి సభ్యులు అతిథులు గా వ్యవరించాలి. హౌస్ మేట్స్ లో కొందరు అతిధులు రెండు హోటల్స్ ఇచ్చే సదుపాయాలు ఉపయోగించుకొని వాటికి డబ్బులు చెల్లించాలి. అయితే రెండు హోటల్స్ లో ఉన్నవాళ్ళు కస్టమర్లను ఆకర్షించి, మీ హోటల్ కి వచ్చేలా చేసుకోవాలి. వారి దగ్గరి నుండి వీలైనంత ఎక్కువ డబ్బుని రాబట్టుకోవాలి. టాస్క్ ముగిసే సమయానికి ఏ హోటల్  దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్లలో నుండి కెప్టెన్సీ పోటీదారులు ఎన్నుకోబడతారు.  అతిథుల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళలో నుండి కూడా కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఓడిపోయిన హోటల్లో  కూడా ఎక్కువ డబ్బున్న వ్యక్తి కెప్టెన్సీ పోటీదారు అవుతారు. 'బిబి హోటల్' స్టాఫ్, మేనేజర్ గా సుదీప, చెఫ్ గా ఆదిత్య, అసిస్టెంట్ చెఫ్ గా మెరీనా, వెయిటెర్ గా గీతు, రేవంత్. హెల్పర్ గా చంటి వ్యవహరిస్తారు. 'హోటల్ గ్లాంప్ ప్యారడైజ్' లో వాసంతి, కిర్తి, ఆరోహీ, శ్రీ సత్య. మేనేజర్ గా ఫైమా వ్యవహరిస్తారు. అతిథులుగా రోహిత్ ఉంటాడు. రోహిత్ తన భార్య వదిలేసి పోతే తనని వెతికే పనిలో ఈ హోటల్ దగ్గరగా వస్తాడు. శ్రీహాన్ ఒక హీరో. లైఫ్ లో ఒకే ఒక్క మూవీ హిట్ తో అందరి చూపు తన వైపే ఉండాలనుకునే వ్యక్తి. సూర్య చిన్నప్పుడు దెబ్బ తగిలి గతం మర్చిపోయి తనకు నచ్చినట్టు తనకు గుర్తుకు వచ్చిన పాత్రలో జీవిస్తూ ఉండే వ్యక్తి. ఆదిరెడ్డి ఒక రివ్యూయర్. మరియు వీడియోలు చేసే అతిధి. రాజ్ మరియు అర్జున్ తన స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు మంచి లొకేషన్ ను వెతుక్కుంటూ వచ్చి వెరైటీ ట్రై చేసేవాళ్ళు. ఇక ఇనయా, ఈమె ఒక ధనవంతురాలైన అమ్మాయి." అంటూ అన్ని నియమాలు చెప్పుకొచ్చాడు 'బిగ్ బాస్'. హోటల్ స్టాఫ్ అంత కూడా సంపాదించే పనిలో పడ్డారు. మధ్య మధ్యలో పాటలతో, డాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. 'ఆకలేస్తే అన్నం పెడతా' పాటకి 'సూర్య' లేడీ గెటప్ వేసుకొచ్చి పోల్ డాన్స్ చేస్తుండగా, ఫైమాతో పాటు శ్రీసత్య, వాసంతి కూడా వచ్చి డ్యాన్స్ చేసారు. బాగా ఎంటర్టైన్ చేసారు. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్‌లో హైలెట్ గా నిలిచింది. అయితే నాగార్జున గత శనివారం గట్టిగ ఇచ్చిన కౌంటర్ తో అందరూ బాగా సెట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఎవరి పాత్రలో వారు నటిస్తూ, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.

'మనది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలాగా స్వచ్ఛమైనది'!

'బిగ్ బాస్' ఇరవై నాల్గవ రోజు 'నాది న‌క్కిలీసు గొలుసు' పాటతో మొదలైంది.  ఒక్కొక్కరుగా 'బిబి హోటల్ వర్సెస్ హోటల్ గ్లాంప్ ప్యారడైజ్' టాస్క్ లో పర్ఫామెన్స్ పరంగా ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా నటిస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. నటించడం అనడం కంటే జీవించడం అనడం కరెక్ట్. ఎందుకంటే గతం మర్చిపోయిన వాడిలా సూర్యని నటించమన్నాడు 'బిగ్ బాస్'. దీంతో రోజు రోజుకి 'సూర్య' తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు.  నిన్న జరిగిన టాస్క్ లో భాగంగా 'గజిని' గెటప్ వేసుకున్నాడు. ఎలా అంటే ఒళ్ళంతా పేర్లు రాసుకొని అరుస్తూ, అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఇక 'ఇనయా' ఇదే సరైన సమయం అని తన పర్ఫామెన్స్ మొదలుపెట్టింది. సూర్య దగ్గరగా వచ్చి పక్కన కూర్చొని కళ్ళలో చూస్తూ 'నీకు గుర్తుందా, మనం ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడ కబుర్లు చెప్పుకున్నాం. ఇన్ని రోజులు మనం ఒకరికొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. అప్పుడే మర్చిపోయావా?' అంటూ పాత్రలో లీనమైపోయింది.  ఒక్క క్షణం  ఈ సీన్ చూసిన ప్రేక్షకులు ఇనయా నిజంగానే అంటుందా అన్నట్లుగా నటించేసింది. ఇనయా అలా అనేసరికి సూర్యకి ఏమి అనాలో తోచక కాసేపు ఆలోచించుకొని మళ్ళీ కమల్ హసన్ నటించిన 'గుణ' మూవీలోని హీరో పాత్రలోకి దూరిపోయాడు. "మనుషులు అర్థం చేసుకోవడానికి మనది మామూలు ప్రేమ‌ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది" అంటూ ఓ రేంజ్ లో చెలరేగిపోయాడు. వీళ్ళిద్దరు చేసిన పర్ఫామెన్స్ 'బిగ్ బాస్ హౌస్' కే అద్భుతమైన సన్నివేశంగా మిగిలిపోతుంది అని 'బిగ్ బాస్' ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే ఈ 'హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్' లో పర్ఫామెన్స్ తో పాటు 'టాస్క్' ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధిస్తారు. మరి వీరిద్దరూ డబ్బులు కూడా సంపాదించి కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో నిలుస్తారో లేదో చూడాలి మరి.

దశావతారాల్లో బుల్లితెర కమల్ హాసన్

స్కిట్స్ కి తగ్గట్టు రకరకాల గెటప్స్ తో వచ్చి ఆ స్కిట్ కి న్యాయం చేయడం అనేది ఒక్క శీనూకే చెల్లుతుంది. అందుకే గెటప్ శీను అనే పేరు సరిగ్గా సరిపోయింది. శీను ఎలాంటి గెటప్ తో వచ్చి ఎంటర్టైన్ చేస్తాడా అని ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు దసరా వైభవం స్పెషల్ ఈవెంట్ లో అద్భుతమైన గెటప్స్ తో మెరిశాడు శీను. ఇలాంటి గెటప్స్ వేయడం అనేది బిగ్ స్క్రీన్ మీద కమలహాసన్ కి బుల్లి తెర మీద శీనుకే చెల్లిందని చెప్పొచ్చు. అందుకే అందరూ శీనుని బుల్లితెర కమలహాసన్ అని పిలుచుకుంటారు. ఈటీవీలో అక్టోబర్ 5 న ప్రసారం కాబోయే దసరా వైభవం ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో గెటప్ శీను దశావతారాల గెటప్ లో కనిపించి ఎంటర్టైన్ చేసాడు. బామ్మ గెటప్ లో ఉన్న శీనుని రాంప్రసాద్ "బామ్మ నీ యాక్షన్ సూపర్, చాలాబాగా చేస్తున్నావ్ " అనేసరికి "థ్యాంక్యూ నాన్న " అంటుంది. "కమల్ హాసన్ గారు కూడా బాగా చేశారు" అనేసరికి "ఏమిటి" అని వినిపించినట్టు, అర్ధం కానట్టు  అడుగుతుంది బామ్మ "ఏమిటి కమలహాసన్ గారి నటనను కూడా ఒప్పుకోవా" అంటూ హైపర్ ఆది పంచ్ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.

ఈమె నా భూమి తల్లి.. నా చిన్ని ప్రాణం!

'సాహసం చేయరా డింభకా' షోకి యాంకర్ ఎవరు అని అడిగితే చాలు ఇప్పటికీ ఉదయభాను పేరును గుర్తుచేసుకుంటారు చాలా మంది. ఉదయభాను బుల్లితెర మీద ఒకప్పటి గ్లామరస్ యాంకర్. ఇప్పుడు ప్రతీ షోలో శ్రీముఖి, అనసూయ ఎలా కనిపిస్తున్నారో.. అప్పట్లో అంటే దాదాపు ఒక 20 ఏళ్ళ క్రితం ఉదయభాను, ఝాన్సీ అలా అన్ని షోస్ ని హోస్ట్ చేసేవారు.  తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు పెళ్లి, పిల్లలతో బిజీ ఇపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా సోషల్ మీడియాని బాగా యూజ్ చేస్తున్నారు. ఉదయభాను మంచి డాన్సర్ కూడా కావడంతో కొన్ని మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ప్రేమ వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ ఐపోయి కొన్నాళ్ల పాటు యాంకరింగ్ ని పక్కన బెట్టింది. ఈమెకు ట్విన్ డాటర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాస్త పెద్దవాళ్లయ్యేసరికి ఉదయభాను మళ్ళీ యాంకరింగ్ మీద దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది ఉదయభాను.  తన కూతురితో తీసుకున్న ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. "ఈమె నా భూమి తల్లి.. నా చిన్ని ప్రాణం.. నేను ఉదయం పూట టీ చేసుకునేటప్పుడు అందులో భూమి తల్లి చక్కగా నవ్వుతూ నా టీని అమృతంలా మార్చేస్తుంది" అంటూ ట్యాగ్‌లైన్ పెట్టింది. ఇలా కూతురిని ముద్దాడుతూ మురిసిపోయింది. ఇక నెటిజన్స్ కూడా టు బ్యూటీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ అమ్మాయిని కూడా మా అమ్మే తీసుకుపోయిందేమో..!

బుల్లితెర మీద పండగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త కొత్త షోస్ కొత్త కాన్సెప్ట్స్ తో ఏ వారానికి ఆ వారం ముస్తాబై వస్తోంది. ఇక ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు.. శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం ఎదురుచూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ ఐపోయింది.  మల్లెమాల వాళ్ళు బుల్లితెర సెలబ్రిటీస్ తో పాటు వాళ్ళ ఫామిలీస్ ని ఆహ్వానించి షోస్ చేయిస్తూ ఉంటారు. వారు కూడా బుల్లితెర ఆర్టిస్టుల మీద పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా దసరా పండగ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ‘మంగమ్మ గారి కొడుకు’ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్టేజి పై డ్యాన్సర్ పండు తన ప్రేయసిని తలచుకుంటూ ఎమోషనల్ అవడం చూపించారు.  “ఊహ తెలియని టైంలో మా అమ్మ చనిపోయింది, తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించాను. అమ్మలా ఉంటానని చెప్పి ఆ అమ్మాయి నాకు ప్రామిస్ చేసింది. తల్లి, తల్లి అని పిలుచుకునేవాడిని. కానీ చివరికి ఆమె కూడా  నన్నొదిలేసి నా తల్లి దగ్గరకే వెళ్ళిపోయింది.. తన కంటే బాగా ఆ అమ్మాయి చూసుకుంటుందనే కోపంతో మా అమ్మే తన దగ్గరకు తీసుకుపోయిందేమో” అంటూ పండు ఏడ్చేశాడు. ఇప్పుడు  ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 2న ఆదివారం రోజున ప్రసారం కానుంది.

బంగారం రీల్ కి డాక్టర్ బాబు అద్దిరిపోయే పర్ఫార్మెన్స్!

బంగారం అక్క శాంతి సోషల్ మీడియాలో చేసిన ఒక రీల్ కొన్ని రోజుల నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.  ఇక ఇప్పుడు ప్రతీ ఒక్కరూ బంగారం మీద పడ్డారు. బంగారం వీడియోకు రీల్స్ చేస్తున్నారు.  టీవీ చానెల్స్, యూట్యూబ్, జబర్దస్త్ లాంటి షోస్ లో  బంగారం అక్క సందడి చేస్తోంది. ఇక బంగారం మీద వచ్చిన డీజే సాంగ్, ట్రోల్ వీడియోలకు రీల్స్ ఏ రేంజ్‌లో ఉంటున్నాయి వేరే చెప్పక్కర్లేదు. సెలబ్రిటీస్ చాలా మంది ఈ రీల్ ని చేశారు.  ఇక ఇప్పుడు మంజుల, నిరుపమ్ కూడా ఈ రీల్ ని చేశారు.  బుల్లితెరపై డాక్టర్ బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్.. నెట్టింట్లో  పంచులతో, ప్రాస కవితలతో  హల్చల్ చేస్తుంటాడు. నిరుపమ్‌కు తగ్గట్టే  మంజుల కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో స్పెషల్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ లో ఎన్నో ఇంటరెస్టింగ్ టాపిక్స్ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే  మంజుల చేసే రీల్స్  అందరినీ నవ్విస్తుంటాయి.  అందుకే ఆమె షేర్ చేసే వీడియోలకు మంచి వ్యూస్ వస్తుంటాయి. ఇక నిరుపమ్ ఆ యూట్యూబ్ వీడియోల్లో ఉండే తీరు, మాట్లాడే మాటలు, వేసే పంచులు వైరల్ అవుతుంటాయి. ఇక మంజుల చేసే రీల్ వీడియోలు కూడా అందరినీ నవ్విస్తుంటాయి.డాక్టర్ బాబు మాత్రం ఈ రీల్స్ కి చాలా  దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మంజుల, నిరుపమ్ కలిసి బంగారం ట్రోల్ వీడియోకు రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేశారు. ఇందులో ఫైనల్గా ఛి పోరా అని మంజుల అనేసరికి  చిరాకు పడిన  నిరుపమ్.. పీక పట్టుకుని అలా తోసేసాడు మంజులను. మొత్తానికి ఈ రీల్ వీడియోను చూసిన జనాలు మాత్రం నవ్వుకుంటున్నారు. ఈ రీల్ కి మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

శ్రీహాన్, ఇనయాల మధ్య గొడవ ముదురుతోందా?

ఇరవై మూడవ రోజు 'పైసా వసూల్' పాటతో మొదలైంది. సోమవారం జరిగిన నామినేషన్లో హౌస్ మేట్స్ లో ఉన్న వారిలో దాదాపు తొంభై శాతం ఇనయాని నామినేట్ చేసారు. దీంతో ఇనయా పని అయిపోయింది అని అనుకున్నారు అందరు. కానీ తాజాగా పోలైన ఓట్లలో మాత్రం ఇనయా సెకండ్ ప్లేస్ లో సేఫ్ గా ఉంది. వాసంతి, ఆరోహీ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. బయటకు వెళ్ళేది వారిద్దరిలో ఎవరో ఒకరు అనే అనుకుంటున్నారు ప్రేక్షకులు. నామినేషన్ తర్వాత ఇనయా బాగా ఏడ్చేసింది. తర్వాత ఫైమా మాట్లాడుతూ, "ఇనయాది తప్పు లేదు రా పాపం, కానీ ఒకరు నామినేట్ చేసారు కదా అని అందరూ తననే నామినేట్ చేసారు అది చాలా తప్పురా" అని వాసంతితో చెప్పింది. ఆ తర్వాత ఇనయా దగ్గరికి మెరీనా వచ్చింది. కాసేపు మాట్లాడి, హత్తుకొని ఓదార్చింది. హౌస్ మేట్స్ అందరూ ఇనయాని ఓదార్చే పనిలో ఉండగా, శ్రీహాన్ మాత్రం ఒక్కడే తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. "నేను తనను అనలేదు, అయినా సరే తననే అన్నట్లు, అంతలా ఫీల్ అవ్వాలా, ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇంత సాగాదీయాలా, వామ్మో! 'ఆస్కార్ లెవల్ యాక్టింగ్' అని శ్రీహాన్ ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. హౌస్ లో దాదాపుగా అందరి మధ్య విభేదాలు, చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. కానీ ఎవరి గొడవను వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు. లేదా కాసేపు అయ్యాక ఇద్దరిలో ఎవరిది తప్పో తెలుసుకొని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని మర్చిపోతున్నారు. అయితే శ్రీహాన్ కి, ఇనయాకి మాత్రం గొడవ ఇంకా అలాగే కొనసాగుతోంది. అయితే ఈ వారం వీరిద్దరూ కూడా నామినేషన్లో ఉన్నారు. వీరిద్దరి మధ్యలో జరిగిన గొడవ ఇకముందు ఎంత వరకు వెళుతుందో చూడాలి. 

'బిగ్ బాస్' కంటెస్టెంట్ అభినయశ్రీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

'అ అంటే అమలాపురం'.. ఈ పాట తెలియని వారు ఉండరు. అప్పట్లో ఉర్రూతలూగించిన ఈ పాటలో కనువిందు చేసిన నటి.. అభినయశ్రీ. 'ఆర్య' మూవీలో చేసిన ఆ ఐట‌మ్ సాంగ్‌తో పాపుల‌ర్ అయిన ఆమె.. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా 'హంగామా'లో వేణుమాధ‌వ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించింది కూడా. 2014లో వ‌చ్చిన 'పాండ‌వులు' సినిమా త‌ర్వాత తెలుగు సినిమాల్లో మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. తెలుగులో కంటే త‌మిళ సినిమాల్లోనే ఆమె ఎక్కువ‌గా న‌టించింది. ఇప్పుడు బిగ్ బాస్ 6తో బుల్లితెర మీదకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన రెండవ కంటెస్టెంట్ అభినయశ్రీ. ఈమె 1988లో చెన్నైలో జన్మించింది. అమ్మనాన్నలు అనురాధ, రితీష్ కుమార్. అమ్మ అనురాధ అప్పట్లో శృంగార తార‌గా పాపుల‌ర్‌. తల్లి బాటలోనే అభినయశ్రీ కూడా డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. 2001లో విడుదల అయిన స్నేహ‌మంటే ఇదేరా మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యింది. ఆమె దాదాపు వందకు పైగా పాటలలో డాన్స్ చేసింది. దాదాపు నలభైకి పైగా సినిమాల్లో నటించింది. ఈమెకు ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో పాటలకు కొరియోగ్రాఫర్ గా చేస్తోంది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు ఒక వీడియోలో 'హౌస్ లోకి వెళ్తున్నా, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నా' అని చెప్పింది. తర్వాత హౌస్ లోకి తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. కానీ అభిమానులను సంపాదించుకోలేకపోయింది. కారణం హౌస్ లో అంత ఆక్టివ్ పర్ఫామెన్స్ ఇవ్వలేదు. మొదటి వారం నామినేషన్ లో ఉంది. ఎలిమినేషన్ లేకపోవడంతో సేవ్ అయింది. అలాగే రెండవ వారం నామినేషన్ లో ఉంది. అయితే హౌస్ లో అందరితో కలిసిపోయినా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది. ఓట్లను గెలవలేకపోయింది. దీంతో రెండవ వారమే ఇంటి నుండి బయటికి వచ్చేసింది.  హౌస్ నుండి బాధతో బయటకొచ్చింది. నాగార్జునతో తన 'ఏవి' చూస్తూ ఉద్వేగానికి లోనైంది. తర్వాత నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా లేరో చెప్పమన్నారు. "అందరూ నిజాయితీగా ఉన్నారు. ఒక్క రేవంత్ తప్ప, తను కన్నింగ్" అని చెప్పింది.  హౌస్ నుండి బయటికి వచ్చాక ఒక ఇంటర్వూలో మాట్లాడింది. "బిగ్ బాస్ మేనేజ్ మెంట్ వాళ్ళు నాకు అన్యాయం చేసారు. అసలు నా గురించి, నేను హౌస్ లో చేసిన పనులను, డాన్స్ ని టెలికాస్ట్ చెయ్యలేదు. నేను లేకుండా ఎడిట్ చేసారు. ఓటింగ్ లో కూడా నాకంటే ఇద్దరు తక్కువలో ఉన్నారు. అయినా నన్నే హౌస్ నుండి బయటి పంపించారు" అంటూ చెప్పుకొచ్చింది. రెమ్యునరేషన్ గురించి ఒక టీవి ఛానల్ వాళ్ళు "మీరు రోజుకి నలభై వేలు తీసుకున్నారని, ఇప్పటివరకు  ఐదు లక్షల వరకు తీసుకున్నారని విన్నాం. ఎంత వరకు కరెక్ట్?" అని అడిగితే, "అదేం లేదు అండి, నా పని మధ్యలో ఆపేసి వచ్చాను. నాకు ఇంత ఇచ్చారు అని చెబుతా కదా" అని మాట దాటేసింది అభి. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో తనకి కి రోజుకి ముప్పై నుండి నలభై వేల చొప్పున ఆమెకు అందాయని ప్రచారం జరుగుతోంది.

హిస్టరీ రిపీట్ అంటున్న బాలకృష్ణ ..అన్‌స్టాప‌బుల్ యాంథమ్ సీజన్ 2 రిలీజ్

నందమూరి బాలకృష్ణ నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా  ఎంతో మందిని అలరించారు..అలరిస్తూనే ఉన్నారు..ఇక ఇప్పుడు ఆహా వారి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో తో  హోస్ట్‌గా మారి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2 ద్వారా ఇంకోసారి ఫాన్స్ ని, ఆడియన్స్ ని తనదైన స్టయిల్లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోతున్నారు.  ఎప్పటికప్పుడు కొత్త కొత్త  షోస్‌ను లాంచ్ చేసే ఆహా , ‘అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2’ కోసం టైటిల్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది.   "నేను దిగ‌నంత వ‌ర‌కే" అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది ఈ సాంగ్. మాస్ ఆడియన్స్ మదిని దోచేలా ఉంది ఈ సాంగ్. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 ఎంత సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు సీజన్ 2 అక్టోబర్ లో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.  అందుకు ముందుగా అన్‌స్టాప‌బుల్ యాంథమ్ ని  రిలీజ్ చేశారు.  ఈ సాంగ్‌ను రోల్ రైడా, మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ రూపొందించారు. బాల‌కృష్ణ‌ను స‌రికొత్త కోణంలో ఎలివేట్ చేయనుంది సీజన్ 2 ..దీంతో సీజ‌న్ 2పై భారీగా ఎక్స్పెక్టేషన్స్  నెలకొన్నాయి. ఇండ‌స్ట్రీలోని టాప్ యాక్టర్స్ అంతా  ఈ షోలో  పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు  వార్త‌లు వినిపిస్తున్నాయి.

మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి

జబర్దస్త్ కమెడియన్ మూర్తి కాసేపటి క్రితం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ మీడియాకి తెలిపారు. జబర్దస్త్ కమెడీయన్ గా మిమిక్రీ మూర్తి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.. ఆయన మూడేళ్ళ నుంచి  పాంక్రియాటిక్  క్యాన్సర్ తో బాధపడుతున్నాడు . తన మిమిక్రీతో ఎవ్వరినైనా ఇమిటేట్ చేసే  మూర్తి.. 2018 వరకు బుల్లితెరపై అలరించారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండిపోయారు. ఇక  ఈ మూడేళ్ళలో ఆయన ట్రీట్మెంట్ కోసం ఎన్నో లక్షలు ఖర్చుపెట్టారు కానీ ఫలితం దక్కలేదు. ఎంతో మంది దాతలు కూడా ముందుకొచ్చి ఆయనకు సాయం చేశారు. ఎప్పుడూ తన చుట్టూ ఉండేవారిని నవ్వుతూ నవ్వించే మూర్తి మరణంతో తన ఫాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. జబర్దస్త్ అనే కాదు ఆయన  ఎన్నో వేదికల పైన తన  ప్రదర్శనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మూర్తి. వెండితెర మీద కావొచ్చు, బుల్లి తెర కావొచ్చు  ఎందరో కమెడియన్స్ తమ ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. కానీ వారి జీవితంలో తీరని కష్టాలు ఎన్నో ఉంటాయి.

నూకరాజు మీద మనసు పడిన ప్రేమ ఫన్నీ జాతకం ఫుల్ ఎంటర్టైన్ !

"నవరాత్రి ధమాకా" పేరుతో ఇటీవల ప్రసారమైన షో ఆద్యంతం నవ్వులతో ముంచెత్తింది. ఈ షోకి గెస్టులుగా ప్రేమ, సంఘవి వచ్చారు. హోస్ట్ గా రవి, సిరి హన్మంత్ చేశారు. ఇక ఈ షోలో నూకరాజు, పంచ్ ప్రసాద్ చిలక జోస్యం చెప్పేవారిగా చేసిన స్కిట్ అద్భుతంగా పండింది. ఇందులో ప్రేమ జాతకం చెప్పాలంటూ చిలకతో ఒక కార్డు తీయించి  " నూకరాజు అనే అతని మీద మీరు మనసు పడ్డారు. అతన్ని మీరు ప్రేమిస్తున్నారు..అతను లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటారు " అంటూ తనకు హీరోయిన్ ప్రేమ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పాడు నూకరాజు.  ఇక సంఘవి జాతకం చెప్తూ " రవి అనే అతను మీమీద కన్నేశాడు. ఆ రవిని తప్పించుకునే పరిష్కారం ఏమిటి అంటే నూకరాజుని మీరు ఒక్కరోజైనా పెళ్లి చేసుకోవాలి" అని రాసుంది ఈ కాగితంలో అంటూ చెప్తాడు. సంఘవి నవ్వేస్తుంది.. తర్వాత "చెప్పు తల్లి నూకరాజు మీద మీ అభిప్రాయం" అంటూ ప్రేమను అడిగేసరికి "బాగున్నాడు, నచ్చాడు, పెళ్లి చేసుకుంటాను" అంటుంది ప్రేమ..."ఐతే నూకరాజు వస్తే ఒక ముద్దిస్తారా " అని అడుగుతాడు. "అంత సీను లేదులే" అని చెప్పి నవ్వేసింది ప్రేమ.  ఇక ఫైనల్గా నూకరాజుకి ఫన్నీ  జాతకాన్ని చెప్పి రచ్చ రవి ఎంటర్టైన్ చేసాడు. "ఎందుకో..నువ్వు మళ్ళీ గ్యాప్ తీసుకుంటే బెటర్ అనిపిస్తోంది " అని ఆది రచ్చ రవికి చెవిలో చెప్పేసరికి "నేను గ్యాప్ తీసుకోవడానికి రాలేదు బ్రో...అందరికీ గ్యాప్ ఇద్దామని వచ్చా" అంటూ పంచ్ వేసాడు.

నాకంటే నా కూతురు చాలా ధైర్యవంతురాలు

నటి ప్రగతి ఐతే బుల్లి తెర మీద అటు బిగ్ స్క్రీన్ మీద ఫుల్ ఫేమస్. అన్ని రకాల క్యారెక్టర్స్ చేసింది ప్రగతి. ఇప్పటి కొత్త తరం నటీనటులకు  ధీటుగా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమెకు ఆరోగ్య కాంక్ష కూడా ఎక్కువే అందుకే టైం ఉన్నప్పుడు జిమ్ లో కుస్తీలు పడుతూ కండలు పెంచుతూ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రగతి డాటర్స్ డే సందర్భంగా తన కూతురి చేతి మీద ముద్దు పెడుతూ ఉన్న ఫోటో ఒకదాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నా  ఆశ, నా బలం, నా ఆనందం, నా ఆత్మవిశ్వాసం, నా గర్వం... నా సర్వస్వం నువ్వే. నీలాంటి కూతురు  ఉన్నందుకు గర్వంగా ఉంది !!! నేను  నిన్ను చాలా మిస్ అవుతున్నాను..ప్రేమతో ...లవ్ యూ అమ్ములు" అంటూ ఒక టాగ్ లైన్ కూడా పెట్టింది. ప్రగతి తన కూతురి గురించి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంది.. తన కంటే తన కూతురికి చాలా ధైర్యం ఎక్కువ అని. ఇక ఈ తల్లీకూతుళ్ల  ఫోటోకి నెటిజన్స్ "అందమైన కూతురు, జిమ్ చేసే మదర్, తల్లెవరూ, కూతురెవరు ఇద్దరిలో ?" అంటూ కామెంట్స్ చేశారు. ఇక లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి "మా పెద్దమ్మ" అంటూ కామెంట్ చేసేసరికి ప్రగతి కూడా కొన్ని ఎమోజిస్ తో రిప్లై ఇచ్చింది. ఇక ప్రగతి  భాషతో సంబంధం లేకుండా నటించేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

నేనెవ‌రినీ 'ఆంటీ' అని పిల‌వ‌ను!

యాక్టర్ గీత అంటే తెలియని వారు లేరు. ఈమె హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 40 ఏళ్ళ నట ప్రస్థానంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో నటించి  మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. "ఎందుకండీ ఇప్పుడు పెద్దవాళ్ళను ఆంటీ అంటే కోపం వస్తోంది" అని నటి గీతని అడిగాడు అలీ. "ఏజ్  చూసుకుని పిలవాలి" అంటూ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్  గురించి చెప్పింది గీత. అందుకే తాను అప్పటినుంచి ఎవరినీ "ఆంటీ" అని పిలవను అని చెప్పింది. ఒక మలయాళం మూవీ షూటింగ్ టైంలో గీత వయసు 25 ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్దావిడ అంటే 50  ఏళ్ళ ఆవిడ ఉండేసరికి ఆమెను "హలో ఆంటీ ఎలా ఉన్నారు" అని అడిగిందట గీత. ఆంటీ అన్న మాటకు ఆమె సీరియస్ ఐపోయి "ప్లీజ్ డోంట్ కాల్ మీ ఆంటీ" అని చెప్పేసరికి అప్పటినుంచి తాను ఆంటీ అని పిలవడం మానేసినట్లు చెప్పింది. షూటింగ్ రెండో రోజు ఉదయం ఆ పెద్దావిడ కనిపించేసరికి "గుడ్ మార్నింగ్" అని ఆమె పేరు పెట్టి పిలిచేసరికి ఆవిడ చాలా హాపీ గా ఫీల్ అయ్యారని చెప్పింది గీత.  అలాగే తనకు డాన్స్ చేయడం రాదు కాబట్టే తాను టాప్ హీరోయిన్ ని కాలేకపోయానని  చెప్పింది. "నేను నటించే టైములో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక.. అందరికీ డాన్స్ వచ్చు కాబట్టే టాప్ యాక్టర్స్ అయ్యారు. నాకు డాన్స్ వచ్చి ఉంటే వీళ్లందరినీ బీటౌట్ చేసేసేదాన్ని" అని చెప్పింది గీత.

సుమ, అనసూయ బాతు స్టెప్పులు!

అనసూయ, సుమ.. బుల్లితెర మీద ఇద్దరూ ఇద్దరే. సుమ సీనియర్ మోస్ట్‌ యాంకర్ ఐతే, అనసూయ ఆమెకు జూనియ‌ర్‌. కానీ ఈ ఇద్ద‌రు యాంక‌ర్లు ఒక్క చోట కలిసి పోటాపోటీగా ఏది చేసినా ఆ స్టైలే వేరుగా ఉంటుంది. అనసూయ అందమైన యాంకర్ , సుమ మాటలతో మాయ చేసే యాంకర్. వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ లో "క్రేజీ కిచెన్" పేరుతో స్పెషల్ వంటకాలు చేసి ఆడియన్స్ కి నోరూరిస్తూ ఆ రెసిపీస్ చెప్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.  రీసెంట్ గా అలాంటి ఒక వీడియోను వారు చేశారు. 'క్రేజీ కిచెన్' పేరుతో వీళ్ళిద్దరూ చేసిన కామెడీ డాన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాన్స్ రీల్ ని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వాళ్లిద్దరూ బాతుల్లా స్టెప్పులేసి మరీ ఎంటర్టైన్ చేశారు. ఈ క్రేజీ కిచెన్ ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ పోస్ట్ చేసింది సుమ. కానీ మధ్యలో కొంత కాలం దీన్ని రన్ చేయడం ఆపేసారు.  ఇప్పుడు గ్లామరస్ యాంకర్ అనసూయతో త‌ను చేసిన రెసిపీతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు సుమ‌. ఇక నెటిజన్స్ మాత్రం ఇక్కడ కూడా ఆంటీ మాటను వదిలిపెట్టినట్టు లేరు. "ఆంటీతో డాన్స్ చేస్తున్నావెందుకు.. ఇద్దరు ఆంటీలు బాగా చేస్తున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'బోత్ ఆర్ నాట్ సేమ్'.. బాల‌య్య‌ను ఇమిటేట్ చేస్తూ ఊగిపోయిన శ్రుతి!

బుల్లితెర మీద వరుసగా కొత్త కొత్త షోస్ సందడి చేస్తున్నాయి. ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా "బంగారు బతుకమ్మ" పేరుతో ఈటీవీలో ఒక ఈవెంట్ రాబోతోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అత్తలకు, కోడళ్ళకు మధ్య యుద్ధం ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించారు. ఈ షో అక్టోబర్ 2న ప్రసారం కాబోతోంది. శ్రీముఖి ఈ షోకి హోస్ట్ గా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సీనియర్ నటీమణులు అత్తల క్యారెక్టర్స్ చేయ‌గా, జూనియర్ యాక్టర్స్ అంతా కోడళ్ళుగా మారి అత్తలకు సేవలు చేస్తూ ఉంటారు. ఈ షోలో ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరి పంచ్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. "కోడళ్ళు అత్తల‌ ముందు భయపడతారు.. అత్తలు కోడళ్లను భయపెడతారు.. బోత్ ఆర్ నాట్ సేమ్" అంటూ న‌టి శ్రుతి వీర లెవెల్లో బాలయ్య బాబుని ఇమిటేట్ చేసే ఒక డైలాగ్ చెప్పి స్టేజి మీద ఫైర్ పుట్టించింది.  "మొబైల్ మాత్రమే వైబ్రేట్ ఐతే అది మిస్డ్ కాల్. మొబైల్ తో పాటు మొబైల్ పట్టుకున్నోడు వైబ్రేట్ ఐతే అది మిస్సెస్ కాల్" అంటూ పవిత్ర అద్దిరిపోయే డైలాగ్ చెప్పి "భళా" అనిపించుకుంది. ఇక ఈ షోకి ఫోక్ సింగర్ మధుప్రియ వచ్చి బతుకమ్మ మీద జానపదాలు ఆలపించింది. ఈమెతో పాటు కనకవ్వ కూడా ఈ స్టేజి మీదకు వచ్చింది. ఈ స్టేజి మీద అందరూ బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి పాటలు పాడి ఆడియన్స్ ని హుషారెత్తించారు.

అందరి కంటే ముందుగా ఎలిమినేట్ అయిన షానీకి ఎంత ముట్టింది?

బిగ్ బాస్ ఆరవ సీజన్ లో అందరి కంటే ముందుగా ఎలినేట్ అయిన షాని గుర్తున్నాడా? షాని మహబూబ్‌నగర్ జిల్లా జెడ్చెర్ల గ్రామంలో జన్మించాడు. షాని ప్రొఫెషనల్ 'ఖోఖో' ఆటగాడిగా నేషనల్ లెవల్ అథ్లెటిక్స్‌కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సుమారుగా ముప్పైకి పైగా సినిమాల్లో నటించినా కూడా 'సై' మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. 'సై' సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు, 'రాజమౌళి' చూసి కాస్త డిఫెరెంట్ గా ఉన్నాడని సెలెక్ట్ చేశాడట. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు లేకుండా పోయాయి. కాగా ఇప్పుడు చిన్న చిన్న చిత్రాలలో, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ద్వారా తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నాడు. హౌస్ లోకి పదమూడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇరవై మంది ఉన్న హౌస్ లో ఎవ్వరితోనూ కలవలేకపోయాడు. హౌస్ లో ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించలేకపోయాడు. మొదటి వారం నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు అత‌డిపై విమర్శలు కురిపించారు. మొదటి వారం నామినేషన్ లో ఉన్నా, ఎలిమినేషన్ లేకపోవడంతో సేవ్ అయ్యాడు. రెండవ వారం కూడా నామినేషన్ లో ఉన్నాడు. హౌస్ మేట్స్ అందరూ తనకి 'వేస్ట్ పర్ఫామెన్స్' ఇవ్వడం, అలాగే ఓటింగ్ లో చివరి స్థానంలో ఉండడంతో ఎలిమినేట్ అయ్యాడు. అదే రోజున హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాకా, ఆ వ్యక్తి హౌస్ లో ఉన్న అందరి గురించి ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. షానీకి అలాంటిది లేకపోయేసరికి, తన 'ఏవి'ని కూడా చూపించకపోయేసరికి హౌస్ సీక్రెట్ రూమ్ లో ఉంచారేమో అని ప్రేక్షకులు ఊహించుకున్నారు. కాకపోతే అలాంటిదేమి జరగలేదు. షానీ ఎలిమినేట్ అయ్యాక కనీసం నాగార్జునతో స్టేజ్ మీద కూడా కనిపించలేదు. తన మీద ఇంత చులకన భావం ఎందుకని బాధపడ్డాడట షాని. హౌస్ లోకి వచ్చిన వారందరికి ఎలిమినేట్ అయిన తర్వాత వారి జర్నీ వీడియో చూపించడం ఒక ఆనవాయితీ. అలాంటిది తనకు చూపించకపోవడం బాధాకరం అని వాపోయాడు. అయితే షానీని అత‌డి రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దానికి అత‌ను 'హౌస్ లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు కలుపుకొని, వారానికి ముప్పై నుండి నలభై వేల చొప్పున ఇచ్చారు' అని చెప్పాడు. "బిగ్ బాస్ లో నేను గడిపిన రోజులకు గుర్తుగా నాకంటూ ఒక్క 'ఏవీ'  గానీ, 'జర్నీ వీడియో' గానీ లేదు. నాకంటూ కొన్ని జ్ఞాపకాలు‌ కూడా లేకుండా చేసారు" అని ఓ టీవి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షాని.