'శ్రీహాన్‌కి ఓట్లు వేయండి బాస్'.. సిరి హ‌న్మంత్ రిక్వెస్ట్‌!

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీగా యుద్దాలు చేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలను జీడి పాకంలా సాగదీసి మరీ చెప్తున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే బయట వాళ్ళ సంబంధీకులు సోషల్ మీడియా ద్వారా ఓట్లు అడుగుతున్నారు. ఇక ఇప్పుడు సిరి హన్మంత్.. తన బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్ కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఓట్లు అడుగుతోంది. హౌస్ లో ఎలిమినేషన్స్, నామినేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఇటీవల అభినయశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీహాన్ ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చేసాడు. గత ఎపిసోడ్ లో శ్రీహాన్ గాళ్‌ఫ్రెండ్‌ సిరి హన్మంత్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉంది. అప్పుడు బయట నుంచి శ్రీహాన్ ఆమెకు ఫుల్ సపోర్ట్ చేసాడు. ఇక ఇప్పుడు శ్రీహన్ హౌస్ లోకి వెళ్లేసరికి సిరి బయట నుంచి సపోర్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు శ్రీహన్ కి ఓట్లు వేయాలంటూ అందరిని రిక్వెస్ట్ చేస్తోంది సిరి. కొంతమంది నెటిజన్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ పెడితే కొందరు మాత్రం గేమ్ ఆడి టైటిల్ గెలవాలి కానీ ఇలా ఓట్లు అడగడం కరెక్ట్ కాదు అంటూ సిరికి చెప్తున్నారు. మరి సిరి రిక్వెస్ట్ ప్రకారం ఫాన్స్, ఆడియన్స్, నెటిజన్స్ శ్రీహాన్ కి ఓట్లు వేస్తారా? శ్రీహాన్ ఇంట్లో ఉంటాడా? బయటికి వచ్చేస్తాడా? తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

మేకప్ లేకపోయినా అనసూయ అంద‌గ‌త్తే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర మీద కనిపించే అనసూయ గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ ఐన అనసూయ బుల్లి తెర క్వీన్‌గా అటు ఈవెంట్స్ లో, ఇటు మూవీస్ లో చేస్తూ తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. 'రంగస్థలం', 'పుష్ప' వంటి సినిమాల్లో నటనకి స్కోప్ ఉన్న మూవీస్ లో నటించి తనను తాను ప్రూవ్ చేసేసుకుంది.  ఇక అనసూయ షూటింగ్ లేని టైంలో ఎక్కువగా విదేశాలకు వెళుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే తన లవ్లీ పెట్స్ తో మాట్లాడిస్తూ ఆ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అనసూయకు కొంచెం ఖాళీ దొరికినట్టుంది. ఇంట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఎప్పుడూ మేకప్ తో ముఖాన్ని చూపించే అనసూయ ఇంట్లో మేకప్ లేకుండా తన ఫేస్ ఎలా ఉంటుందో, ఇంట్లో పొట్టి నిక్కర్లతో ఎంత ఫ్రీగా ఉంటుందో ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.  'మేకప్ లేకపోయినా అనసూయ అందగత్తె' అని, 'అనసూయ సో హాట్' అని, 'ఆంటీ అన్నది ఎవరు' అని ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలరించడానికి సిద్ధమైన 'రారండోయ్ పండగ చేద్దాం'!

పండగ అంటే అందరూ కలవాలి. అప్పుడే పండగ పండగలా ఉంటుంది. వినాయక చవితి రోజున వర్షం పడడం ఎంత కామనో, పండగ ఈవెంట్ లో గొడవలు పెట్టడం కూడా అంతే కామన్ అంటూ ప్రదీప్ మాచిరాజు "రారండోయ్ పండగ చేద్దాం" అనే  సరికొత్త ఈవెంట్ తో జీ తెలుగులో ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దసరా పండగ సందర్భంగా వస్తున్న ఈ  స్పెషల్  ఈవెంట్  25 న సాయంత్రం 6 గంటలు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.  ఇందులో బుల్లి తెర సీరియల్స్ లో  నటించేవాళ్లంతా కూడా పార్టిసిపేట్ చేసి ఫుల్ మస్తీ చేశారు. స్టేజి మీద అందరూ కలిసి పండగ విందును ఆరగించారు. ఈ షోకి శ్రీ విష్ణు, సుహాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ఆమని, రోహిణి, బాబా భాస్కర్, వేణు వండర్స్, భానుశ్రీ, శోభా శెట్టి, దిలీప్ శెట్టి  ఇలా చాలా మంది ఈ షోకి వచ్చి డాన్సులు చేశారు. లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న 'బంగారం' డైలాగ్ ని, మూవీస్, సీరియల్స్ లో ఫేమస్ ఐన డైలాగ్స్ ని మిక్స్ చేసి సరికొత్త స్కిట్స్ ఈ షోలో కనిపించబోతున్నాయి.

ఉప్పెన మూవీలో సూర్యకాంతం,రేలంగి నటిస్తే ఇలా ఉంటుంది!

కృష్ణ భగవాన్ ఇటీవల జబర్దస్త్ షోలు చేస్తూ అందులో  పంచ్ డైలాగ్స్ వేస్తూ  ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనతో పాటు నటి ఇంద్రజ కూడా జోక్స్ వేస్తూ పడీ పడీ నవ్వుతూ నవ్విస్తోంది. కృష్ణ భగవాన్ కామెడీ అదుర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే బేసిక్ గా ఆయన రైటర్. కాబట్టి ఎప్పుడు ఏ టైములో ఏ డైలాగ్ చెప్తే అది ప్రోమోలోకి సూట్ అవుతుందో బాగా తెలిసినవాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. కొంతకాలం క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు అలా మల్లెమాల ప్రోగ్రామ్స్ కి ఆయన పర్మనెంట్ గా ఫిక్స్ ఐపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో వీడియో కింద ఆడియన్స్ కృష్ణ భగవాన్ జడ్జిగా చేసేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  ఇందులో రాకెట్ రాఘవ స్కిట్ మాములుగా లేదనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఉప్పెన మూవీ అప్పటిలో సూర్యకాంతం, రేలంగి కలిసి తీస్తే అందులో వాళ్ళ నటన ఎలా ఉంటుందో చూడముచ్చటగా చేసాడు రాకెట్ రాఘవ. సూర్యకాంతం దివి నుంచి భువికి దిగి బుల్లితెర మీద జబర్దస్త్ షోకి వచ్చి  స్కిట్ చేస్తోందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె నడిచే విధానం, చేతిలో విసనకర్ర, కొప్పు, అందులో పూలు,  కళ్ళజోడు, మాట తీరు అచ్చు గుద్దినట్టుగా ఆమెను దించేసాడు.  ఇక ఈ స్కిట్ కి అందరూ కుష్ ఇపోయారు. ఇంద్రజ ఆమెను డైరెక్ట్ గా చూడలేకపోయినా మీ రూపంలో చూసుకునే భాగ్యం చేసుకున్నాం అనేసరికి కృష్ణ భగవాన్ మధ్యలో వచ్చి "ఆవిడది మా ఊరే ..కైకవోలు" అనేసరికి "సూర్యకాంతం గారు వచ్చిన ఊరు నుంచా మీరొచ్చారు ? " అని ఇంద్రజ ఆశ్చర్యపోతూ అడిగేసరికి "ఆ అక్కడి నుంచి వచ్చి ఇదా మీరు... అన్నట్టుగా అంటున్నారు మీరు ? " అని ఇంద్రజకి  రివర్స్ లో కౌంటర్ వేసేసరికి అందరూ పగలబడి నవ్వారు. ఇక ఉప్పెన మూవీలోని  "జలజలా పాతం" సాంగ్ కి సూర్యకాంతం పడవలో చేసే నాట్యం ఈ వారం షోకి హైలైట్ గా నిలిచిపోయేలా కనిపిస్తోంది.

హౌస్ లో అతను చాలా కన్నింగ్, ఫేక్ పర్సన్!

బిగ్ బాస్ ఈ షో గురించి ఎంతో మంది ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ షోకి స్టార్టింగ్ లో వచ్చినంత క్రేజ్ ఇప్పుడు రావడం లేదు. ఇక ఈ హౌస్ వెళ్లిన డాన్సర్ , యాక్టర్ అభినయశ్రీ ఎలిమినేట్ ఐపోయి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈమె బీబీ కేఫ్ ని రన్ చేసే ఓల్డ్ బీబీ కంటెస్టెంట్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. " మనిషిని చూడగానే గొడవ పడడం..ప్రొబ్లెమ్స్ క్రియేట్ చేయడం వంటివి నేను చేయలేను. రియల్ లైఫ్ లో ఇవి నాకు అస్సలు ఇష్టం ఉండవు.  నేను అలాంటి మనిషిని కూడా కాదు..నాకు మనుషుల్ని ప్రేమించడమే తెలుసు. అవన్నీ నా వల్ల కాదు. కానీ బిగ్ బాస్ హౌస్ ఉండాలి అంటే అవన్నీ చేయాలి. బట్ నేను అవి చేయలేకపోయాను. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. ఇదే కాదు కూర్చుని అందరూ మాట్లాడుకోవాలి. మధ్య మధ్యలో టాస్క్ లు ఇస్తారు. ఇవే కాదు ఇందులో మైండ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఐతే నన్ను నేను  ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు. వచ్చి ఉంటే వేరేలా ఉండేది. హౌస్ లోకి వచ్చి తిని, కూర్చుని, మాట్లాడుకోవడమేనా అనిపించి గేమ్ ఆడాను. ఇక ఇంట్లో నాకు నచ్చని ఒకే ఒక పర్సన్ సింగర్ రేవంత్. నాకు అతను ఫేక్, కన్నింగ్ , ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తాడు. తన మాటే నెగ్గాలనుకుంటాడు." అంటూ హౌస్ గురించి, రేవంత్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది అభినయశ్రీ. 

కాళ్ళతో తన్నినా వేణుమాధవ్ నన్ను మెచ్చుకున్నారు!

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పేరు రావాలంటే ఎంతో కష్టం. కొంతమందికి ఎన్నాళ్ళు చేసినా మంచి పేరు రాదు. కానీ కొందరికి మాత్రం ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చి పడిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి జయవాణికి  కూడా అంతే. గయ్యాళి పాత్రల ద్వారా ఫుల్ ఫేమస్ ఐపోయింది. రోల్ ఎలా డిమాండ్ చేస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ మంచి పేరు తెచ్చుకుంది. చిన్నప్పటినుంచి ఆమెకు నటన అంటే చాలా ఇష్టం. చదువుకునే టైములో పెళ్లి చేసేసారు ఆమెకు ఇంట్లోవాళ్ళు.   పెళ్ళికి ముందు సినిమాల్లోకి వెళతానన్న జయవాణి కోరికను ఆమె తల్లితండ్రులు యాక్సెప్ట్ చేయలేదు. పెళ్లయ్యాక భర్త సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది.  మొదట సీరియల్స్ లో నటించింది. తర్వాత  చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా సినిమాల్లోకి  అడుగుపెట్టింది. విక్రమార్కుడు, యమదొంగ, మహాత్మా, గుంటూరు టాకీస్ లాంటి మూవీస్ జయవాణికి మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. ఇటీవల ఆమె ఒక  ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్ చెప్పింది.  తాను ఏదైనా క్యారెక్టర్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే అందులోంచి  బయటికి రావడం అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుందని చెప్పింది. క్యారెక్టర్ లోకి దిగాక  ఏం జరిగినా పట్టించుకోకుండా నటించేస్తానని అందుకు సంబంధించిన ఒక  ఇన్సిడెంట్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. ‘అదిరిందయ్యా చంద్రం' మూవీలో వేణు మాధవ్ రోడ్డుపై తాగిపడిపోతే.. అతన్ని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ చేయాలనీ చెప్పి, రిహార్సల్ చేయించారు డైరెక్టర్.  "అయితే.. ఆ రోల్ కి కేవలం డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ సీన్ అంతా అర్థమయ్యాక డైలాగ్స్ తో అంత బాగా రాదనుకున్నా. ఇక కెమెరా ఆన్ అయ్యి 'యాక్షన్' అనగానే.. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ ని కాళ్లతో తంతూ తీసుకెళ్ళాను. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. కానీ ఆ సీన్ టేక్ మాత్రం ఓకే అయిపోయింది. అయితే డైరెక్టర్ టెన్షన్ పడుతూ వచ్చి, 'సీన్ లో ఆయన్ని తన్నుకుంటూ తీసుకెళ్లడమే లేదు కదా మరి నువ్వెందుకు అలా చేసావ్?. ఒకవేళ వేణుమాధవ్ కి కోపం వచ్చి షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి ?' అన్నారు. అప్పుడే వేణుమాధవ్ వచ్చి, సీన్ చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. అప్పుడు నేను హమ్మయ్య అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది జయవాణి.

'గంగూబాయ్' లుక్‌లో నిహారిక.. కాంప్లిమెంట్ ఇచ్చిన అల్లు స్నేహ‌!

సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంత ట్రెండింగో అందరికీ తెలుసు. అలాంటి ఒక రీల్ చేసి నిహారిక కొణిదెల ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. లేటెస్ట్‌గా ఆమె గంగూబాయ్‌గా మారిపోయింది. తెల్ల చీర, ఎర్రటి లిప్ స్టిక్‌, నోట్లో పాన్‌, చేతిలో బ్యాగ్‌ ధరించి చూడడానికి అచ్చంగా ఆలియా భ‌ట్ చేసిన క్యారెక్ట‌ర్‌.. గంగూబాయ్‌ లుక్‌లోకి చేంజ్ ఐపోయింది.  ఒక పార్టీలో ఈ గెటప్ తో వచ్చి ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ మూవీ 'గంగూబాయ్ క‌థియవాడి' ఎంత సూపర్ డూపర్ హిట్  సినిమానో అందరికీ తెలుసు. ఇందులో గంగూబాయ్ గా ఆలియాభట్ నటన వేరే లెవెల్. "గంగూని ఇమిటేట్ చేస్తున్నాను. నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్ పార్టీస్ అంటే ఇష్టమని మీకు తెలుసు కదా.. దయచేసి నా వెనుక ఉన్న కోతులను పట్టించుకోకండి" అని రాసి ఫొటోస్, వీడియో పోస్ట్ చేసింది  నిహారిక. ఈ వీడియోపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పందించింది. "సూపర్‌" అంటూ కామెంట్‌ చేసింది.  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిహారిక తన భర్తతో కలిసి ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోటోలు, వీడియోలు, మూవీ అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ లైమ్ లైట్ లో ఉంటోంది. ప్రస్తుతం నిహారిక ఫోటోలు, ఆమె వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

'డాన్స్ ఐకాన్ ఈజ్ రాకింగ్'.. గట్టిగా అరిచి చెప్పిన రమ్యకృష్ణ!

'డాన్స్ ఐకాన్' ఇలా మొదలయ్యిందో లేదో ఈ షోకి మంచి ప్రశంసలు అందుతున్నాయి ఆడియన్స్ నుంచి. ఎందుకంటే ఈ షోలో డాన్స్ మాత్రమే కనిపిస్తోంది. మిగతా డాన్స్ షోస్ లో ఎంటర్టైన్మెంట్ తప్ప డాన్స్ అనేది కనిపించడం లేదనే టాక్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ఐతే ఇప్పుడు డాన్స్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ మెస్మరైజింగ్‌ పెర్ఫార్మెన్సులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ లేటెస్ట్ ప్రోమోలో చిన్నారి ఫ్లోరినా చేసిన డాన్స్ కి శేఖర్ మాస్టర్ మంచి కంప్లిమెంట్ ఇచ్చేసారు.. "కాంపిటీషన్ లో చేస్తున్నట్టు లేదు.. ఏదో ఇంట్లో చేస్తున్నట్టు ఉంది" అంటూ.  ఇక అల్లరి యాంకర్ శ్రీముఖి "పీఎస్ పీకే మానరిజమ్ చేసేద్దాం" అంటూ యాంకర్ ఓంకార్ చేత కూడా చేయించింది. ఇక కంటెస్టెంట్ అనుదిత పెర్ఫార్మెన్స్ కి రమ్యకృష్ణ ఫిదా ఐపోయింది. ఇక సౌమ్య పెర్ఫార్మెన్స్ కి ముగ్గురు కో - ఓనర్స్ లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు. బుట్టబొమ్మ సాంగ్ కి డాన్స్ చేసిన సౌమ్యని శేఖర్ మాస్టర్ స్టేజి మీదకి వచ్చి మరీ  అభినందించారు. "ఈ బుట్టబొమ్మకు దానమ్మ, దాని అమ్మమ్మ ఎవ్వరొచ్చినా ఈమెలా చేయలేరు" అని అన్నాడు. ఇక అరుంధతి చేసిన డాన్స్ స్టేజిని హీటెక్కించింది. దాంతో శేఖర్ మాస్టర్ ఆ వేడి భరించలేక మంచి నీళ్లు తాగేసి "అరుంధతీ.. ఇక్కడున్న వాళ్లందరినీ ఎందుకు ఇలా పరేషాన్ చేస్తున్నావ్" అనేసరికి అందరూ గట్టిగా నవ్వేశారు. ఆల్రెడీ గత ఎపిసోడ్ లో అరుంధతి పెర్ఫామెన్స్ చూసి "నువ్వు హీరోయిన్ మెటీరియల్" అని కూడా శేఖర్ మాస్టర్ కాంప్లిమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అరుంధతి డాన్స్ కి "సూపర్ సే ఊపర్, ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్" అంటూ రమ్యకృష్ణ పొగిడేసింది. "ఒకళ్ళను మించి ఒకళ్ళు అన్నట్టుగా డాన్స్ చేస్తున్నారు. డాన్స్  ఐకాన్ ఈజ్ రాకింగ్ " అంటూ గట్టిగా అరిచి మరీ చెప్పింది రమ్య కృష్ణ.

బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన 'బబ్లీ బౌన్సర్'!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ ఆదివారం ఎవరో ఒకరు సెలబ్రిటీ రావడం తెలిసిన విషయమే. అయితే ఈ వారం సెలబ్రిటీగా నటి 'తమన్నా' బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.   "బబ్లీ బౌన్సర్ మూవీతో త్వరలో మీ ముందుకు వస్తున్నా" అని చెప్పింది తమన్నా. తర్వాత నాగార్జున కాసేపు తను నటించిన సినిమా గురించి చెప్పమన్నాడు. "క్లాస్ గా, మాస్ గా నటించడం సులభమే కానీ అమాయకంగా నటించడం చాలా కష్టం. ఈ మూవీలో నేను అమాయకంగానూ, మాస్ రోల్ 'బౌన్సర్' గాను చేసాను" అని తమన్నా నాగార్జునతో చెప్పింది. తర్వాత 'ఈ వారం తమన్నా కానుకగా ప్రకటిస్తున్నాను' అని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు. తర్వాత హౌస్ లోకి అడుగుపెట్టింది. కంటెస్టెంట్స్ అందరూ తమన్నాను చూడగానే 'ఓ' అంటూ అరుస్తూ కేకలు వేసారు. "ఎవరైతే తమన్నాను ఇంప్రెస్ చేస్తారో వారికే ఈ వారం బహుమతి" అని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు. రేవంత్, అర్జున్, సూర్య, రోహిత్ తమ మాటలతో ఇంప్రెస్ చేద్దామని ప్రయత్నించారు. సూర్య 'విజయదేవరకొండ' వాయిస్ ని, 'అల్లు అర్జున్' వాయిస్ ని, మిమిక్రీ చేసి తమన్నాను ఇంప్రెస్ చేసాడు. సూర్య టాస్క్ లో గెలిచి తమన్నా కానుకను గెలుచుకున్నాడు.   టైం ఐపోయిందని బిగ్ బాస్ హౌస్ నుండి తమన్నా ను బయటకు వచ్చేయమన్నాడు నాగార్జున. అలా కాసేపు బబ్లీ బౌన్సర్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది.

నన్ను పెళ్లి చేసుకుంటావా?.. ప‌విత్ర‌కు ప్ర‌పోజ్ చేసిన సంతోష్‌!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ వారం సోసోగా సాగింది. ఐతే ఇందులో ఫైనల్ ట్విస్ట్ గా కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు. ఆది తను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయికి రాసిన లవ్ లెటర్ ని ఫన్నీగా చదివి వినిపించాడు. ఇమ్మానుయేల్ తను 8th క్లాస్ చదివేటప్పుడు తన ఫస్ట్ లవ్ కొనిపెట్టిన జామెట్రీ బాక్స్ ని చూపించి దాని హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఇక పంచ్ ప్రసాద్ తన ఫస్ట్ లవ్ ఐన సునీతకు కొనిచ్చిన రింగ్ ని చూపించాడు. నిజ జీవితంలో సునీతనే పెళ్లి చేసుకున్నాడు ప్రసాద్.  ఇక ఈ జోడి పెయిర్ లో పరదేశి జోడి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్యను స్టేజి మీదకు తీసుకొచ్చి ప్రపోజ్ చేసాడు ప‌ర‌దేశి. అలాగే తన గుండెల మీద పొడిపించుకున్న ఆమె పచ్చబొట్టు పేరు చూపించి తన ప్రేమను యాక్సెప్ట్‌ చేయమంటూ అడిగేసరికి ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది. అలాగే పవిత్రకి కూడా యాంకర్ రష్మీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సంతోష్ అనే వ్యక్తిని స్టేజి మీదకు పిలిచారు. అతను వచ్చి తన ప్రేమనంతా గొప్ప కవిత్వంగా మార్చేసి చెప్పేసి పవిత్ర ఫోటోతో ఒక లామినేషన్ చేసి ఇచ్చేసాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని రింగ్ ఇచ్చి మరీ అడిగేసరికి పవిత్ర షాకైపోయింది. "అసలు అతనెవరో నాకు తెలియాలి. నన్నెప్పటినుంచి ప్రేమిస్తున్నావ్? అసలు నేనంటే నీకు ఎందుకంత ఇష్టం" అంటూ ప్రశ్నించే సరికి స్టేజి మీద అందరూ స్ట‌న్న‌య్యారు. "నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాం, చేసాం" అని రష్మీ చెప్పేసరికి అదంతా నిజమో, అబ‌ద్ధ‌మో అర్థం కాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.

‘ఆ శ్రీరాముడికి ఒక లక్ష్మణుడు.. నాకు ఇద్దరు లక్ష్మణులు’!

'ఆట' షోతో స్టార్ అయ్యాడు. చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు యూనివర్సల్ అన్నయ్యగా మారిపోయాడు. తన షోస్ లో ఒక క్రియేటివిటీతో ముందుకు దూసుకెళ్తూ తనకు డాన్స్ రాకపోయినా 'డాన్స్ ఐకాన్' పేరుతో ఒక డాన్స్ షో చేస్తూ ఆడియన్స్ తో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఓంకార్. ఆయన తన లైఫ్ కి సంబంధించి, షోస్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఒక ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నాడు. "ఆ శ్రీరాముడికి ఒక లక్ష్మణుడు ఐతే నాకు ఇద్దరు లక్ష్మణులు. వాళ్ళే.. నా తమ్ముళ్లు. నాకు పేరొస్తుందని వాళ్లకు రావడం లేదని ఎప్పుడూ బాధపడరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవడం కంటే కూడా నా తమ్ముళ్ళతోనే ఆడుకునేవాడిని. స్కూల్ కి వెళ్ళేటప్పుడు చిన్న తమ్ముడిని ముందు, పెద్ద తమ్ముడిని వెనక ఎక్కించుకుని వెళ్ళేవాడిని. నా మాట చిన్నప్పటినుంచీ వాళ్ళు జవదాటరు. నా ప్రోగ్రామ్స్, మూవీస్ లో ఏది సక్సెస్ ఐనా కూడా దాన్ని నా సక్సెస్ అని కాకుండా ఇది మా ఫ్యామిలీ సక్సెస్ గా చూస్తాం. మా ఇంటికి వచ్చిన తమ్ముళ్ల భార్యలు కూడా అర్థం చేసుకునే వాళ్లే వచ్చారు కాబట్టి మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు." అని ఆయ‌న చెప్పాడు. "నాన్న డాక్టర్ ఐనా కూడా పూజలూ, అవీ చేస్తుంటారు. వాటి ఫలితంగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా ఎవరి మధ్యన ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నాం. మా ముగ్గురన్నదమ్ముల పిల్లలు కూడా అంతే బాండింగ్‌తో ఇంట్లో పెరుగుతూ ఉన్నారు. 'ఆట' డాన్స్ షో ద్వారా పరిచయమైన వారిలో నేను ఎక్కువగా చూసి గర్వపడేది ఆట సందీప్, లుక్స్ రాజశేఖర్, మల్లేష్.. 'ఆట జూనియర్స్'లో గీతిక నా ఆల్ టైం  ఫేవరేట్. నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక గాడ్‌ఫాదర్ అల్లు అరవింద్ గారు. నా ఎదుగుదలలో ఆయనదే ముఖ్య భాగం. అని వెల్ల‌డించాడు. "ఇక నా షోస్ విషయానికి వస్తే.. 'మాయాద్వీపం' షోలో ప్రతీ ఒక్కరు నన్ను అన్నయ్య అనే పిలుస్తుండ‌టంతో అందరితో బాండింగ్ కుదిరింది. నాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చింది 'ఆట'. సెకండ్ ఇన్నింగ్స్ ని 'సిక్స్త్ సెన్స్' ద్వారా స్టార్ట్ చేసాను. 'ఇష్మార్ట్ జోడి' అనేది ఒక ఇన్స్పిరేషనల్ బాండింగ్ షో. నా కెరీర్ లో ది టాప్ మోస్ట్ షో డాన్స్ ఐకాన్. " అంటూ ఓంకార్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

ఇంత అడల్ట్ కంటెంట్..డైలాగ్స్ అవసరమా!

బుల్లి తెర ఈ మధ్యన పరిశీలిస్తే అడల్ట్ కంటెంట్ బాగా పెరిగిపోయింది. ఆ డైలాగ్స్ కూడా మరీ అధ్వాన్నంగా ఉంటున్నాయి. వాటికి సెన్సార్ మాత్రం ఉండడంలేదు. ఆదివారం మధ్యాహ్నం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో కొంత ఫన్ , ఎంటర్టైన్మెంట్ అనేది అందిస్తోంది. ఐతే ఈ మధ్యన కాస్త పట్టు తప్పుతోందనే విషయాన్ని రీసెంట్ ఎపిసోడ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. పెద్దలు పిల్లలు కలిసి కూర్చుని చూసే ప్రోగ్రాం ఇది. కానీ ఆ ఎపిసోడ్ ని కూడా ఇప్పుడు బ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు కొంత మంది కమెడియన్స్. ఇక ఇటీవల ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ చూస్తే గనక జోడి నెంబర్. 1  పేరుతో ఈ ఎపిసోడ్ మొదలయ్యింది.  ఐతే ఇందులో రీల్ జోడీస్ తో, రియల్ జోడీస్ తో కలిసి  మ్యూజికల్ జోడి చైర్ గేమ్ ఆడించారు. ఐతే ఇందులో మగవాళ్ళు తమ లేడీ జోడీస్ ని రెండు చేతులతో ఎత్తుకుని తిరుగుతూ మ్యూజిక్ ఆగగానే కుర్చీలో కూర్చోవాలి. ఇదంతా ఒక ఎత్తు ఇక చెప్పిన  డైలాగ్స్ అన్నీ మరో ఎత్తు. అన్నీ  కూడా డబుల్ మీనింగ్ తో నిండినవే. ఇలా అమ్మాయిలను ఎత్తుకుని తిరుగుతూ గేమ్ ఆడుతూ సమాజానికి  వీళ్ళు ఇస్తున్న సందేశం ఏమిటి..? ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ గురించి ప్రజల్లో నెగటివిటీ వచ్చింది. అది హౌస్ లో జరిగే ఈవెంట్ ఐతే ఇది ప్రతీ వారం జరిగే ఈవెంట్.   ఇలాంటి స్కిట్స్ తో , ఇలాంటి గేమ్స్ తో పిల్లల్ని పెద్దవాళ్ళను ఎలా ఎంటర్టైన్ చేస్తారు ? అందులోనూ ఈ షోలో ఈ పర్టిక్యూలర్ గా గేమ్ లో ఆది డైలాగ్స్ వింటే " ఇలాంటి గేమ్ షో ప్రతీ ఎపిసోడ్ లో పెట్టాలి" అనడం ఎంత వరకు సమంజసం.  ఆదితో జోడీగా చేసిన అమ్మాయిని ఆటో రాంప్రసాద్ అడిగాడట కానీ ఆ అమ్మాయిని ఆదికి జోడీగా పెట్టారు. ఏం చేసాడో అంటూ రాంప్రసాద్ డైలాగ్ వింటే అమ్మాయిలపై వాళ్లకు ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధమవుతుంది. "అరే నరేష్ పవిత్ర విషయంలో  అంత కక్కుర్తి ఎందుకు" అంటూ ఆది వేసిన మరో  డైలాగ్ వింటే ఎవరైనా ఛి అనకుండా ఉండరు. ఇలాంటి కంటెంట్ తో, ఇలాంటి డైలాగ్స్ తో ఎన్ని రోజులు ఈ షోని నడిపిస్తారు. సెన్సార్ ఉండదు కదా అని ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడితే ఆడియన్స్ కూడా తగిన బుద్దే చెప్తారు.

అఖిల్‌తో నాది జన్మజన్మల బంధం.. నేను ఆయన భక్తురాలిని!

'జరీ జరీ పంచెక‌ట్టి' సాంగ్ తో సోషల్ మీడియాలో ఈ మధ్య ఫుల్ ఫేమస్ ఐన యాంకర్ విష్ణు ప్రియ. బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి ఈమె వేసిన మాస్ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. విష్ణుప్రియ యాంకర్ నుంచి యాక్టర్‌గా మారాలని ట్రై చేస్తోంది. అందుకే ఇటీవల ఇన్స్టాగ్రామ్‌లో చాలా హాట్ ఫొటోస్ పెట్టి డైరెక్టర్స్ దృష్టిలో పడడానికి ప్రయాసలు పడుతోంది. ఐతే ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో అఖిల్ అక్కినేని గురించి సంచలన కామెంట్స్ చేసింది.  ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "అఖిల్ అక్కినేనితో సినిమా తీసే డైరెక్టర్స్ ఎవరో కానీ.. ప్లీజ్ నాకు అతనితో కలిసి నటించే ఛాన్స్ ఇవ్వండి. ఎట్లీస్ట్ ఏదైనా స్పెషల్ సాంగ్ లో చేసే అవకాశం అన్నా ఇవ్వండి. ఎందుకంటే నేను కొంచెం డాన్స్ బానే చేస్తాను. అఖిల్ అంటే నాకు పిచ్చి. అది ఎందుకు అంటే నేను చెప్పలేను. కానీ నేను గత జన్మ నుంచి ఆయన భక్తురాలిని.. ఈ జన్మలో అది కొనసాగుతోంది. నాది, అఖిల్ అక్కినేనిది జన్మ జన్మల బంధం" అంటూ హాట్ కామెంట్స్ చేసింది.  ఇక తన డాన్స్ వీడియోస్ చూసిన డైరెక్టర్ సుకుమార్ గారు "ఎందుకు డాన్స్ ఆపేశావ్. నేను నీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. చేస్తూనే ఉండు" అనడం తన లైఫ్ లో బెస్ట్ కంప్లిమెంట్ అని చెప్పింది విష్ణుప్రియ. శ్రీముఖి గురించిన ప్రశ్న అడిగినప్పుడు "శ్రీముఖి అంటే నాకు ప్రేమ.. ఒకవేళ తను అబ్బాయి అయ్యుంటే నేను పెళ్లి చేసుకునే దాన్ని. కానీ అమ్మాయైపోయింది" అని చెప్పింది విష్ణు. ఇక ఈమె సుధీర్‌తో క‌లిసి 'పోవే పోరా' షో ద్వారా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిందన్న విషయం తెలిసిందే.

తీరు మార్చుకోని ఆది.. హరితేజ మాములుగా చేయలేదుగా!

దసరా పండగ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ దసరా సందర్భంగా బుల్లి తెర కూడా జోష్ ఫుల్, కలర్ ఫుల్ ప్రోగ్రామ్స్ తో రెడీ ఐపోతోంది. ఇప్పుడు ఈటీవీలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దసరా ఈవెంట్ ఒకటి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. "మా హైదరాబాద్ లో దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి అంటే మా విజయవాడలో బాగా జరుగుతాయి" అంటూ చిన్న ఫైట్ తో ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఈవెంట్ కి సంఘవి, ప్రేమ గెస్టులుగా వస్తారు. ఈ షోలో ఆది, సిరి హన్మంత్, రచ్చ రవి, యాంకర్ రవి, హరితేజ, పవిత్ర, సాయికిరణ్, నాటి నరేష్, జ్యోతక్క, భానుశ్రీ ఇంకా కొంతమంది బుల్లి తెర స్టార్స్ పార్టిసిపేట్ చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు.    స్కిట్ లో సిరికి ఫాదర్ గా ఆది చేసాడు. "నాన్న ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది" అనేసరికి "రెండు రోజులకే బోర్ కొడితే బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉన్నప్పుడు ఎంత బోర్ కొట్టాలో చెప్పు" అంటాడు. "ఎందుకు నేను ఫన్ ఇచ్చాను కదా" అంటుంది సిరి. "ఫన్ అంతా షన్నుకే ఇచ్చావ్ కదా" అంటాడు ఆది. ఆది ఫాదర్ రోల్ లో ఉన్నప్పుడు ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడడం వలన ఆ స్కిట్ లో నెగటివిటీ వస్తుంది. ఆది స్కిట్స్ లో మహిళలను కించపరిచేలా డైలాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయని మహిళలు కూడా ఫైర్ అవుతున్నారు. కానీ ఆది తీరు మారడం లేదు.      ఇక యాంకర్ రవి "గుమ్మాడి గుమ్మాడి" అనే సాంగ్ పాడి అందరిని మెస్మోరైజ్ చేసాడు. ఇక రచ్చ రవి "తాను హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మలా అక్కున చేర్చుకుంది జబర్దస్త్ " అని ఎమోషన్ అవుతూ ఆ స్టేజిని ముద్దు పెట్టుకుంటాడు. హరితేజ సావిత్రిలా నటించి మెప్పించింది. అచ్చంగా సావిత్రినే దివి నుంచి భువికి దిగి వచ్చిందా అన్నట్టుగా మహానటి మూవీలో సాంగ్ కి చేసిన అభినయం ఈ టోటల్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది. "చనిపోయిన వాళ్ళను గుర్తు చేయడం వేరు. డైరెక్ట్ గా వాళ్ళే వచ్చినట్టు చేయడం వేరు. హరితేజ అంత  అద్భుతంగా చేసింది" అంటూ హైపర్ ఆది సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. "నీ నటన చూసేసరికి నాకు మాటలు రాలేదు ఏడుపొచ్చేసింది" అంటూ సంఘవి చెప్పేసరికి హరితేజ ఫుల్ ఖుష్ అయ్యింది. ఇక హరితేజ పెర్ఫార్మెన్స్ కి  స్టేజి మొత్తం నిలబడి ఈలలు, కేకలు వేశారు. ఇక ఈ ఈవెంట్ లో ఇంకా ఎలాంటి పంచులు ఉన్నాయి, ఎలాంటి పెర్ఫార్మెన్సులు ఉన్నాయో తెలియాలంటే 25వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

భాస్కర్ నీకు ఉప్మా కలపడం రాదంటే నేను నమ్మాలా?

సుమ ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎనర్జీ, ఫుల్ మస్తీ చేసేస్తుంది. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా సుమ క్యాష్ ప్రోగ్రాం చూస్తే చాలు ఫుల్ జోష్ వచ్చేస్తుంది మనలో. మరి ఈ వారం క్యాష్ ప్రోగ్రాం అలాగే ఎంటర్టైన్ చేసింది. జబర్దస్త్ స్టార్స్ ని ఈ షోకి పిలిచింది సుమ. బులెట్ భాస్కర్, నాటీ నరేష్ ఎంట్రీ ఇచ్చాక సుమ వాళ్లకు ఒక కప్పులో ఉప్మా ఇచ్చింది. "ఏంటీ ఉప్మా" అని భాస్కర్ అడిగేసరికి .."అదేంటో నువ్వే చెప్పాలి...ఏంటి నీకు ఉప్మా కలపడం రాదా" అంటూ కౌంటర్ వేస్తుంది సుమ .."బయట నువేంటో నాకు తెలుసు " అనేసరికి షాక్ అవుతాడు. "శ్రీరామచంద్రుడు = బులెట్ భాస్కర్.. డిక్షనరీలో కొట్టి చూడండి కనిపిస్తుంది" అంటూ రివర్స్ కౌంటర్ వేస్తాడు. "డిక్షనరీలో కొట్టడం కాదు తర్వాత వాళ్ళు వచ్చి కొడతారు" అంటూ మళ్ళీ పంచ్ డైలాగ్ వేస్తుంది సుమ. "వెల్కం టు ది షో భాస్కర్, నరేష్" అనేసరికి సరే "నాయనమ్మ" అంటాడు నరేష్ "ఇవన్నీ కాకుండా కొత్త పంచ్ డైలాగ్స్ వెయ్యి" అంటుంది. "ఆంటీ అనకూడదని అన్నారని నాయనమ్మా" అన్నాను అని నరేష్ అనేసరికి జుట్టు పట్టుకుని ఫన్నీగా కొడుతోంది సుమ. తర్వాత గడ్డం నవీన్, తేజ షోలోకి ఎంట్రీ ఇస్తారు. "క్యాష్ లో పార్టిసిపేట్ చేయాలని నాలుగేళ్ల నుంచి కల కంటున్నా" అని తేజ అనేసరికి "కల కాదు కనాల్సింది..కళ పెంచాలి" అంటూ కౌంటర్ వేస్తుంది సుమ. ఇలా ఈ వారం ఈ షోలో పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి.

నైనిక కోసం సాయి ఆ డైలాగ్ కావాలనే చెప్పాడా?

ఈ మధ్య షోస్ లో ఎక్కువగా ప్రేమ సీన్లు కనిపిస్తున్నాయి. వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ కి ఏమన్నా చెప్పాలి అంటే స్కిట్ రూపంలో కానీ డైలాగ్స్ రూపంలో కానీ, డాన్స్ రూపంలో కానీ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు చాలా షోస్ లో ఇలాగే జరుగుతోంది. ఇది నిజామా కాదా అనే భ్రమలో ఆడియన్స్ ని ఉంచేసి వాళ్ళ వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఢీ షోలో కూడా అదే జరిగింది. ఈ షోలో రొమాంటిక్ జోడి పెయిర్ గా నైనిక, సాయిని చెప్పుకుంటారు. వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఎక్కువగా ముద్దులు, హగ్గులు ఉంటాయి.  ఐతే కొంత కాలంగా వీళ్ళు కలిసి డాన్స్ చెయ్యట్లేదు. దాంతో వీళ్ళిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసి డాన్స్ చేసేసరికి అందరూ కూడా మళ్ళీ వీళ్ళు కలిసిపోయారని అనుకుంటున్నారు. ఇక ఈ డాన్స్ అయ్యాక సాయి ఒక డైలాగ్ చెప్పాడు. "అమ్మాయిల మైండ్ లో మనం లేకపోతే గుర్తు చేస్తాం, అదే హార్ట్ లో లేరని చెప్తే తట్టుకోలేం కదా" అనే డైలాగ్ ని నైనికా కోసం ఒక నాలుగైదు సార్లు చెప్పించాడు ఆది. దీన్ని బట్టి నైనికాకు సాయి అంటే ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ ఇద్దరి మధ్య ప్రేమ పొంగేలా చేయడానికే ఈ డైలాగ్ ని ఇన్ని సార్లు చెప్పించారని అర్ధమవుతోంది. మరి నైనికా ఈ డైలాగ్ కి ఎలా రియాక్ట్ అయ్యింది. సాయి ప్రేమను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుందా? అసలు ఇద్దరి మధ్య ఎం జరిగిందో తెలియాలంటే 21 న ప్రసారం కాబోయే ఢీ షో చూడాల్సిందే.

'ఆర్ఆర్ఆర్' మూవీపై జబర్దస్త్ లో ఆది సెటైర్లు!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హైపర్ ఆది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది బుల్లితెర ఈవెంట్స్ లో  నటిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత వైట్ అండ్ వైట్ డ్రెస్ లో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇవ్వడంతోనే బులెట్ సాంగ్ కి రష్మితో కలిసి డాన్స్ చేసాడు. "మీరు నేను మాట్లాడుకుంటే పంచ్ పంచ్ పలకరించుకున్నట్టు ఉంటుంది" అని కృష్ణభగవాన్ మీద డైలాగ్ వేసాడు . "హాయ్ ఆది గారు మీకోసం పదేళ్లయినా వెయిట్ చేయొచ్చు" అని ఇంద్రజ అనేసరికి "అంటే మరో పదేళ్లు ఆవిడే జడ్జిగా ఉంటానని హింట్ ఇస్తున్నారు" అంటూ పంచ్ వేసాడు ఆది. "నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రెండే రెండు చోట్ల చాలా మార్పులు జరిగాయి. ఒకటి ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్లు, రెండు జబర్దస్త్ షోలో జడ్జిలు.. అబ్బో ఎంత మంది మారారో" అంటాడు ఆది. ఇక ఈ స్కిట్ లో రాజమౌళి డైరెక్షన్ లో  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీపై సెటైర్లు వేశారు. "అసలు నువ్వా కొమ్మా ఉయ్యాల అనే పాట పడకుండా ఉంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు" అని ఆ స్కిట్ లో పెర్ఫార్మ్ చేసిన పాపతో అంటాడు ఆది.

చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన పాట ఏదో తెలుసా?

ఝాన్సీ అంటే నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు కండక్టర్ ఝాన్సీ అంటే చాలు ఆమె డాన్స్ గుర్తొస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ గురుస్తోంది. ఎందుకంటే పల్సర్ బైక్ సాంగ్ కి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన పెర్ఫార్మెన్స్ తో ఓవర్ నైట్ డాన్స్ స్టార్ ఐపోయింది కండక్టర్ ఝాన్సీ. ఇప్పుడామె ఒక చిన్న సెలెబ్రిటీ ఐపోయేసరికి సోషల్ మీడియా కూడా ఆమె ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. అలా ఆమె ఒక ఇంటర్వ్యూ లో ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పింది.  "నా ఫస్ట్ పెర్ఫామెన్స్ జీ తెలుగులో ఇచ్చాను. తర్వాత జెమినీ డ్యాన్సింగ్ స్టార్స్ లో చేసాను.. అందులో మా రమేష్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. అప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. చిరంజీవి గారి చేతి మీదుగా నేను 5 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాను. తర్వాత మా టీవీ రంగం-2  రన్నరప్ గా నిలిచాను. చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగి ఆ డాన్స్ లు చేసి పేరు తెచ్చుకున్నాను. ఆయన ముందు ఒక రెండు స్టెప్పులు వేసి ఇంకా డాన్స్ ఆపేద్దామని అనుకున్నా. కానీ ఆయన నాకు చేతికి చెక్ ఇచ్చి భుజం మీద చేయి వేసి ఆర్టీసీ కండక్టర్ గా కష్టపడుతూ డాన్స్ చేసి అందరినీ మెప్పిస్తున్నావ్. నువ్వు నీ డాన్స్ ని ఆపొద్దు. కంటిన్యూ చెయ్యి అన్నారు. తర్వాత  ఆయన నటించిన మూవీస్ లో ఏ పాట అంటే ఇష్టం అని అడిగేసరికి  అభిలాషలో 'సందెపొద్దుల కాడ' అని నేను చెప్పాను. ఆ సాంగ్ కి చిరంజీవి గారే తన సొంతంగా కోరియోగ్రఫీ చేసుకున్నారట.. ఇలా ఆ విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం" అని ఝాన్సీ ఒక ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.

నారాయణ గారు ఏ తప్పూ చేయలేదా.. అందరూ పత్తిత్తులేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఒకటి రెండు కాదు.. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా దాదాపు 400 సినిమాల్లో నటించాడు శివాజీ రాజా. తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేసాడు. రెండేళ్ల క్రితం గుండెపోటు వచ్చేసరికి ఆయన అసలు బయటకు రావడమే మానేసాడు. ఐతే ఇటీవల ఆయన యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో గురించి నారాయణ కామెంట్స్ గురించి కొన్ని హీట్ పుట్టించే మాటలు మాట్లాడారు.    "నారాయణ అంటే చాలా గొప్ప వ్యక్తి అనుకున్నా. కానీ ఉదయం నోరు జారడం సాయంత్రమయ్యేసరికి సారీ చెప్పడం. ఎందుకు ఇదంతా? నారాయణ గారి లాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఐతే ఇండస్ట్రీలో అలాంటి కామెంట్స్ ని తిప్పి కొట్టే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. బిగ్ బాస్ అంటే మాటలు కాదు. వాళ్ళు ఎంతో మందిని ఫిల్టర్ చేస్తారు. ఎవరు ఎలా కష్టపడ్డారు, జీవితంలో ఎలా పైకి  వచ్చారు అనే విషయాలేమి చూడకుండా వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోరు. అలా కష్టపడి పైకొచ్చి అలాంటి ప్లాట్ ఫారం పై కంటెస్టెంట్స్ నిలబడ్డారు అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి వాళ్ళను నారాయణ గారు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడ్డం సరికాదు. అందరూ పత్తిత్తులుగానే ఉంటారా? నారాయణ గారు ఏ తప్పు చేయలేదా? నేను ఏఐఎస్ ఎఫ్ నుంచి వచ్చాను. నాకూ అభ్యుదయ భావాలూ ఉన్నాయ్. కానీ నారాయణ గారికి నోటి దూల చాలా ఎక్కువ. అసలు ఈయనకు నాగార్జున మీద కోపమా, బిగ్ బాస్ మీద కోపమో తెలీదు. సిపిఐ పార్టీలో పెద్ద పదవిలో ఉన్న నారాయణ గారు ముందు బిగ్ బాస్ షో చూడడమే తప్పు. అసలు పార్టీ కార్యక్రమాలను  పట్టించుకోకుండా బిగ్ బాస్ చూస్తున్నాడని కదా అర్ధం ..ఇంకో విషయం ఏమిటి అంటే పార్టీలో ఈయన్ని పక్కన బెట్టారు. ఏం చేయాలో అర్ధం కాక ఇలాంటి  చెత్త కామెంట్స్ చేస్తున్నారు.  ఇలాంటి నోటి దూల వాళ్ళు ఉంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది" అంటూ యాక్టర్ శివాజీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.