అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడను!

బుల్లితెర మీద గ్లామరస్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వైపు షోస్, ఈవెంట్స్ తో.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అను. లేటెస్ట్‌గా 'నిఖిల్‌తో నాటకాలు' షోకి వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు భార్యా భర్తలు. "ఇంటికి బాస్ ఎవరూ లేరు. ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటాం" అని చెప్పారు. సినిమా స్క్రిప్ట్స్, డేట్స్ వంటి వాటి విషయంలో ముందుగా భరద్వాజ్ విన్నాక అనసూయ వింటుందట‌. తాను ఓకే అంటేనే ముందుకు వెళ్తారట ఇద్దరూ.  అలాగే "సోషల్ మీడియాలో అను పై వస్తున్న ట్రోలింగ్స్, మీమ్స్ ని అస్సలు పట్టించుకోను. ఒకవేళ తను అప్సెట్ గా కనిపిస్తే 'అవన్నీ చూడొద్దు' అని చెప్తాను" అన్నారు  భరద్వాజ్. "అలాగే కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి అనసూయ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఉన్నది ఒక్క లైఫ్. ఎలా కావాలంటే అలా ఉండడం ఇంపార్టెంట్. అందుకే అను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నేను పెద్దగా ఇబ్బంది పడేది ఏమీ లేదు" అన్నారు అనసూయ భర్త. ఇంకా ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే "అనుకి పెళ్ళై పిల్లలు ఉన్నాక కూడా తనకు లవ్ ప్రపోజల్స్ చాలా వచ్చాయి" అంటూ నవ్వుతూ చెప్పారు భరద్వాజ్.  ఇక ఈ షోలో ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అనసూయ భరద్వాజ్. "ఇప్పుడు ఎవరైతే మీమ్స్ చేసే వాళ్ళు, ట్రోల్ల్స్ చేసే వాళ్ళు వున్నారో.. వాళ్లకు కూసాలు కదిలేలా ఒక దెబ్బ తగలబోతోంది. దాని మీద నేను వర్క్ చేస్తున్నా. ఆ కాంపెయిన్ అందరికీ వర్తిస్తుంది" అంటూ ఒక బాంబు పేల్చారు. "నాకు విజయ్ సేతుపతి మీద క్రష్ ఉంది. అలాగే నేను ఫెమినిస్ట్ ని కాదు, యాక్టివిస్ట్‌ని. ఎక్కడ తప్పు జరిగినా ఖండిస్తాను" అని చెప్పింది.

బిగ్ బాస్ హౌస్‌లో ఆట ఆడాలి అంటే ఫేక్‌గా ఉంటే చాలు!

చలాకి చంటి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు. ఇక వచ్చాక బీబీ కేఫ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "చలాకి చంటి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమైపోయాడు" అని ఆడియన్స్ అనుకుంటున్నారని యాంకర్ అనేసరికి "ఇది నువ్వు ఇస్తున్న కామెంటా, జనాలు ఇచ్చారని చెప్తున్నావా?.. ఎవరు అన్నారో నా ముందుకు తీసుకురా, నేను సమాధానం చెప్తా" అంటూ ఫైర్ అయ్యాడు.  "హౌస్ లో ఉన్నవాళ్లు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఎవరిని ఇరికించడానికైనా రెడీగా ఉన్నారు.. మీరు గేమ్ ఆడలేదు అని చెప్పకుండా మీ గేమ్ ఆపడం బిగ్ బాస్ తప్పు అంటారా?" అని అడిగేసరికి "ఎలాగైనా అనుకో" అంటూ ఘాటుగా చెప్పాడు చంటి. "బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడాలి అంటే ఫేక్ గా ఉంటే చాలు. అలా ఉన్న వాళ్ళే గేమ్ ఆడగలరు అని నాకు అనిపించింది. నువ్ కూడా ఫేక్ గానే ఆడావుగా" అని యాంకర్ వైపు బాణం సంధించాడు చంటి. "మీకు ఇగో ఎక్కువ కాబట్టి ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు" అని యాంకర్ అనేసరికి "ఇగో ఎప్పుడొస్తుంది.. కెలికినప్పుడు వస్తుంది. నా ఇగోని కెలికిందెవరు" అంటూ గలాటా గీతూ ఇమేజ్ చూపించాడు. "నేను ఇలాగే ఉంటా, ఇలాగే గేమ్ ఆడతా, ఎవరినానైనా మోసం చేస్తా అనే బుద్ది ప్రపంచంలో ఎవరికీ ఉండకూడదు" అన్నాడు చంటి.

'చంటి ఎలిమినేషన్ అస్సలు ఊహించనిది'..అమరదీప్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 6  ఈ వారం మంచి రసవత్తరంగా సాగింది. ఐతే చలాకి చంటి ఎలిమినేషన్ విషయం ఎవరూ ఊహించనిది. ఈ విషయం మీద  చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. ఇలాంటి టైములో అమరదీప్ కూడా కొన్ని కామెంట్స్ చేసాడు. కొంతమంది అడిగిన ప్రశ్నలకు "బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్తున్నట్టు ట్రోల్స్ అవి బాగా వచ్చాయి. కానీ అవకాశం రాలేదు. అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను. ఇక  చంటి అన్న ఎలిమినేట్ అవడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.  ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అన్న ఎలిమినేట్ అయ్యాడు అని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. చాలామంది ఆడని వాళ్ళు కూడా హౌస్ లో ఉన్నారు కదా. ఆయన్ని ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. టాప్ 5 లో చంటి అన్న ఉంటాడని అనుకున్నా. బాగా ఆడతాడు, బాగా కామెడీ చేస్తాడు కదా కానీ  మా అన్న కొంచెం స్ట్రయిట్ ఫార్వర్డ్ మరి అలానే ఉంటుంది. " అన్నాడు అమరదీప్.  ఇక నెటిజన్స్ మాత్రం "చంటి అన్న ఎలిమినేషన్ కి గలాటా గీతూ కారణం.. ఆయన చేసే కామెడీ గురించి హోస్ట్ ముందే కామెంట్ చేసింది. అలాంటి వాళ్ళు హౌస్ లో ఎందుకు ఉంచుతున్నారో ..బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ దేవుడు హైట్ కట్ చేశాడు.. నువ్ శాలరీ కట్ చేస్తున్నావ్.. పెద్ద తేడా లేదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఫామిలీ సర్కస్ పేరుతో ఫామిలీస్ ని పిలిపించి పిక్నిక్ ఏర్పాట్లు చేసి ఫుల్ గా ఆడి పాడారు. ఇక నాటీ నరేష్ , ఆటో రాంప్రసాద్ మధ్య డిస్కషన్ సూపర్ ఫ్లోలో సాగింది. " పొద్దున్న పూట వచ్చే కలలు నెరవేరవుతాయా" అని రాంప్రసాద్ ని నాటి నరేష్ అడిగేసరికి "వీడికేదో కల వచ్చి ఉంటుంది " అనుకుని " ఏం కల వచ్చింది" అని అడిగాడు రాంప్రసాద్ " మీరు బాగుపడినట్టు కలొచ్చింది" అని నరేష్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చేసరికి రాంప్రసాద్ షాకయ్యి "నా మీదే పంచ్ వేస్తావా నీకు శాలరీ కట్ చేస్తా" అనేసరికి " ఆ దేవుడు హైట్ కట్ చేసాడు నువ్ శాలరీ కట్ చేస్తున్నావ్" పెద్ద తేడా లేదు అనేసరికి "ఇదిగో నీ శాలరీలో కొంత కట్ చేస్తి ఇస్తున్నా అంటూ ఒక నోట్ తీసి కత్తెరతో కట్ చేసి ఇచ్చాడు"  రాంప్రసాద్.  ఇక స్కిట్స్, గేమ్స్, డాన్స్ పెర్ఫార్మెన్సులు అయ్యాక పిక్నిక్  లో అందరూ కలిసి భోజనాలు చేశారు. ఇంతలో బులెట్ భాస్కర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా  వచ్చి ఫుడ్ ఐటమ్స్ పరిశీలిస్తుంటే ఆటో రాంప్రసాద్ మాత్రం పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసాడు. ఇక నూకరాజు ఇంద్రజని తెగ పొడిగేసాడు.." ఇంద్రజ గారి నవ్వు  లాంటి తియ్యటి స్వీట్ వేయరా" అని అడిగేసరికి ఇంద్రజ నవ్వేసింది. "పప్పు ఎలా ఉంది" అని రాంప్రసాద్ నూకరాజుని అడిగాడు " ఇంద్రజ మేడం జడ్జిమెంట్ లా ఉంది" అని ఆన్సర్ ఇచ్చేసరికి ఇంద్రజాకి కోపం వచ్చేసింది. "నన్ను ముద్దపప్పు అని ఇండైరెక్ట్ గా పొగుడుతున్నావా..అరేయ్ నీ మనసులో ఏం ఉందో నాకు తెలుసు మళ్ళీ కవర్ చేసుకుంటున్నావా" అంది ఇంద్రజ.

చంటి ఎలిమినేషన్...కంటెస్టెంట్ పై హాట్ కామెంట్స్!

బిగ్‌ బాస్‌ సీజన్  6 ఐదో వారం కంప్లీట్ ఐపోయింది. అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి లేటెస్ట్ గా  ఐదో వారంలో `జబర్దస్త్` కమెడియన్ చలాకీ చంటి ఎలిమినేట్‌ అయ్యారు. ఒక టెన్షన్ క్రియేట్ చేసాక చంటి ఎలిమినేషన్ జరిగింది. ఫైనల్ గా   నామినేషన్‌లో ఇనయ, చంటి ఉండగా ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ గా చంటి ఇంట్లోనుంచి వచ్చేయక  తప్పలేదు.  చంటి వెళ్తూ వెళ్తూ  హౌస్ మేట్స్ పై తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు.  అయితే హోస్ట్ నాగార్జున రిపోర్ట్ కార్డ్ రూపంలో ఇంటిసభ్యులకు మార్కులు వేయాలని ఆదేశించారు. దాంతో చంటి  అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తికి   34 అండ్‌ హాఫ్ మార్కులు వేశాడు. అర్జున్‌  గేమ్‌ ఆడుతున్నా ఎక్కడో  రాజీపడుతున్నాడు అది తగ్గించుకోవాలని చెప్పాడు. సుదీపకి మాత్రం కిచెన్‌లోనే ఎక్కువ టైం సరిపోతోందని  గేమ్ ఆడేంత టైం లేదని చెప్పాడు.  రోహిత్ మాత్రం తనలాగే ఆడుతున్నాడు చెప్పాడు. రాజ్‌ అందరినీ  నమ్ముతుండడంతో తాను చేయాలో అది చేయలేకపోతున్నాడు, అలాగే కీర్తి తన పాస్ట్ చెప్పడంతోనే సరిపోతోందని అది పక్కన పెట్టి గేమ్‌ ఆడాలని చెప్పాడు. ఇక ఈ  షోకి మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్‌ గెస్ట్ గా వచ్చాడు. దేవీ కంపోజ్‌ చేసిన పాటలతో హోస్ట్  గేమ్‌ ఆడిపించాడు.  తర్వాత సామెతలతో ఆట ఆడించాడు నాగ్. ఎవరెవరికి ఏ సామెతలు   వర్తిస్తాయో చెప్పించాడు. ఇక సూర్య, శ్రీహాన్‌, ఫైమా, మరీనా, రేవంత్‌ కు టాప్‌ మార్క్స్ ఇచ్చేసాడు  చంటి. సూర్య ప్రేమించడం ఆపి  ఆట ఆడాలని సలహా ఇచ్చాడు. శ్రీహాన్‌ చాలా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్‌ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫైమా అందరిని నవ్విస్తుందని చెప్పాడు. మెరీనా  మదర్ ఇండియా అని ఐతే ఆమె వీక్నెస్ అనే ప్రాబ్లెమ్‌ రోహిత్‌ అని చెప్పేసాడు ఇక  రేవంత్‌ కి కోపం, ఆవేశం, గారాబం ఎక్కువ అని అన్నాడు. ఇక ఇనయకి వంద మార్కులు ఇచ్చాడు. ఆదిరెడ్డి, గీతూకు 90మార్కులిచ్చాడు. తర్వాత బాలాదిత్య విషయానికి వచ్చి  మంచితనం మేకప్‌ వేసుకుని నటిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటివరకు  ఐదు వారాలు పూర్తి చేసుకుంది బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో వెయిట్ చేయాల్సిందే.

బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన దేవి శ్రీ ప్రసాద్!

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం సరదగా గడిచింది. సండే ఫండే అంటు నాగార్జున వచ్చేసాడు. అయితే ప్రతి ఆదివారం హౌస్ లోకి ఎవరో ఒకరు గెస్ట్ గా రావడం జరుగుతుంది. కాగా ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ 'దేవి శ్రీ ప్రసాద్' రావడం విశేషం. ఆ తర్వాత హస్ మేట్స్ కి పరిచయం చేసాడు నాగార్జున. "ఈ రోజు మిమ్మల్ని ఆడించడానికి, పాడించడానికి మీకో సర్ ప్రైజ్ ఉందని, దేవిశ్రీని కంటెస్టెంట్స్ కు పరిచయం చేసాడు. ఆ తర్వాత దేవిశ్రీని చూసి హౌస్ మేట్స్ అందరు ఓ అంటు అరుస్తు, గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. తర్వాత దేవిశ్రీకి, హౌస్ మేట్స్ అందరు ఒక్కొక్కరుగా పరిచయం చేసుకున్నారు. కాగా ఆదిత్య మాట్లాడుతూ "హాయ్ సర్. దిజ్ ఈజ్ ఆదిత్య, నేను చెన్నై స్కూల్ లో చదివాను. ఆ స్కూల్ లో నేను మీ జూనియర్ ని" చెప్పగానే అవునా అని ఆశ్చర్యంతో  దేవిశ్రీ ఉండగా, నాగార్జున మాత్రం అవునా నిజమా అంటు అవక్కయ్యాడు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ స్కూల్ లో దేవి ఎలా ఉండేవాడు? అని సరదగా ఆదిత్యని అడుగగా, "నాకు ఇంట్రెస్ట్ పోయిందండి, ఆ గేమ్ ఏదో ఆడితే నేను వెళ్ళిపోతా" అని దేవి ఫన్నీగా సమాధానమిచ్చాడు. దేవి తను పాడి, కంపోజ్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ 'ఓ పిల్లా' అనే పాటను రిలీజ్ చేసాడు.ఆ తర్వాత సూర్య తన మిమిక్రీ తో హౌస్ మేట్స్ తో పాటు దేవిని ఇంప్రెస్ చేసాడు. నాగార్జున, సూర్యని మిమిక్రీ చేయమని చెప్పగా మొదటగా దేవి వాయిస్ ని చేసాడు. ఆ తర్వాత 'అల్లు అర్జున్' వాయిస్ ని చేయగా, దేవి మైమరిచిపోయాడు. "వహ్వా ఏం చేసావ్, సూపర్. చాలా బాగా చేసావ్" అని సూర్యని పొగిడేసాడు దేవి. ఆ తర్వాత రేవంత్ పాటతో కాసేపు అలరించాడు. అలా ఒక్కొక్కరుగా వచ్చి తమ ట్యలెంట్ తో అటు దేవికి, ఇటు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసిన చలాకి చంటి!

ప్రతి వారం‌ బిగ్ బాస్ లో ఒకరు బయటకొచ్చేయడం కామన్ గా జరిగే విషయం. అయితే ఈ వారం ఎవరు ఊహించని వ్యక్తి ఎలిమినేట్ కావడం హౌస్ మేట్స్ అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇనయా, చంటి ఇద్దరు మిగిలారు. అయితే లాస్ట్ లో చంటి ఎలిమినేట్ అయ్యాడు. "గేమ్ లో‌ ఎలాంటి పార్టిస్పేషన్ లేదు. గేమ్ బాగా ఆడు. టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేయు." అని నాగార్జున ప్రతి వారం చెప్పాడు. అయినా సరే తన‌ ఆటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎలిమినేట్ అయ్యాక హౌస్ నుండి నాగార్జున దగ్గరకు వచ్చేసాడు. ఆ తర్వాత చంటి మాట్లాడుతూ "కప్పు ఇంపార్టెంట్ కాదు. నేను మనసులు గెలుచుకున్న అది చాలు" అని నాగార్జునతో సరదగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత  తన AV చూస్తూ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. అయితే చంటి ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం గీతుతో గొడవే కారణం అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. చివరగా హౌస్ మేట్స్ తో మాట్లాడటానికి వచ్చాడు చంటి. నాగార్జున హౌస్ మేట్స్ ని చూసి "అందరు సైలెంట్ గా ఉన్నారేంటి? " అని అడుగగా, "మా నవ్వు అక్కడికి వెళ్ళిపోయింది సర్ అందుకే హౌస్ లో ఇంత సైలెన్స్" అని‌ సుదీప చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నాగార్జున ఒక్కొక్కరి గురించి చంటిని చెప్పమన్నాడు. అతను మాట్లాడుతూ "రాజ్ అందరిని ఈజీగా నమ్మేస్తాడు. కీర్తి భట్ నువ్వు ఏం అనుకుంటున్నావో అదే చేయు. ఎక్కువగా ఏడ్వకు. బాధపడకు. సూర్య అందరిని ఎక్కువ ప్రేమిస్తాడు. శ్రీహాన్ కి ఎక్కడ ఎలా ఉండాలో చాలా క్లారిటి ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఫైమా బాధలో ఎవరు ఉన్న నవ్వించేలా చేస్తుంది. మెరీనా మదర్ ఇండియా.ఏ డెసిషన్ తీసుకున్న రోహిత్ ని అడిగి తీసుకుంటుంది. రేవంత్ చాలా మంచోడు. ఆదిత్య అతి మంచితనం వద్దు తీసేయ్" అని ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చాడు. చివరగా టైం అయిపోయిందని బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే బిగ్ బాస్ లో తన కామెడితో అందరిని సరదగా నవ్వించే చంటి కూడా బయటకొచ్చేసాడు.

యంగ్ లుక్ లో రంజుగా అన్‌స్టాపబుల్‌ బాలయ్య.. ఫ్యాన్స్ కి ఐఫీస్ట్

"ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!! మీకోసం... మరింత రంజుగా అన్‌స్టాపబుల్‌" అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి ఫుల్ జోష్ నింపాడు. అన్‌స్టాపబుల్ సీజన్-2 ట్రైలర్ లో బాలయ్య అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన లుక్‌ సూపర్ అని చెప్పొచ్చు.  ఒక చీకటి గుహలో నిధి కోసం వెతుకుతూ "అంధకార అభయరణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమాజినబుల్‌.. అక్కడ ఎదురయ్యే సవాళ్లు అన్‌ ప్రెడిక్టబుల్,  అయినా ఆగని మన పోరాటం అన్‌ స్టాపబుల్‌" అని చెప్పి "గెలుపే ఊరిపిగా, పట్టుదలే ప్రాణంగా, ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌ స్టాపబుల్" అంటూ ఒక కనిపెట్టిన ఒక నిధి పెట్టెలోంచి ఒక బంగారు ఖడ్గం తీసి ఆ గుహ నుంచి మోడరన్ లుక్ లో అన్‌ స్టాపబుల్ షోలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.   ఖడ్గాన్ని తిప్పుతూ "ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్‌.. సరదాల్లో మరింత సెటైర్‌.. మీ కోసం మరింత రంజుగా.. దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలా?" అని బాలయ్య పంచ్ డైలాగ్స్ తో, మాస్ అండ్ క్లాస్ యాక్షన్ తో మీసం మెలేసి చెప్పే డైలాగ్ వేరే లెవెల్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ టాక్ షో  సీజన్-2  అక్టోబర్ 14నుంచి ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుందని ట్రైలర్లో చూపించారు. అయితే ఈ సారి మొదటి ఎపిసోడ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. 

కుర్ర హీరోలతో బాలయ్య 'అన్ స్టాపబుల్' ఫన్!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' ​సీజన్-2 సందడి మొదలైంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 14 నుంచి ఓటీటీ వేదిక ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతుండగా, చివరి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ లో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయని టాక్. ఒక ఎపిసోడ్ లో ఇద్దరు కుర్ర హీరోలు సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. షోకి ఎవరొచ్చినా తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేయడం బాలయ్యకి అలవాటు. అందుకే మొదటి సీజన్ అంత పెద్ద సక్సెస్ అయింది.. అలాగే ఇప్పుడు రెండో సీజన్ కోసం కూడా ప్రేక్షకులు అంతలా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో బాలయ్య ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత పెంచబోతున్నాడట. అందుకే కుర్ర హీరోల నుంచి స్టార్స్ వరకు అందరికి కవర్ చేస్తున్నారట. ఒక ఎపిసోడ్ లో కుర్ర హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఎపిసోడ్ షూట్ ఈరోజు(ఆదివారం) అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ కుర్ర హీరోలతో కలిసి బాలయ్య కుర్రాడిలా మారిపోయి ఏ రేంజ్ వినోదాన్ని పంచుతాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాకు నిద్ర సరిపోవడం లేదు.. బాధపడుతున్న శ్రీముఖి

శ్రీముఖి బుల్లితెర మీద ఎంతో చలాకీగా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య షోస్ మీద షోస్ చేస్తూ ఎటు చూసినా శ్రీముఖినే కనిపిస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో పాపం కనీసం నిద్రపోవడానికి కూడా టైం సరిపోవడం లేదని చాలా బాధపడుతోంది.  'బిగ్ బాస్' సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా వచ్చింది. 'క్రేజీ అంకుల్స్', 'మ్యాస్ట్రో' మూవీస్ లో నటించింది. ఇక ఇప్పుడు 'భోళా శంకర్' సినిమాలో ఓ రోల్ కూడా చేస్తోంది. ఇప్పుడు బుల్లితెర మీద ఖాళీ లేకుండా షోస్ చేస్తోంది. విదేశాల్లో జరిగే ఈవెంట్స్ కి వెళ్తోంది. అక్కడి ఫొటోస్ ని కూడా తన ఫాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఇంత బిజీ శ్రీముఖి  ఇప్పుడు పాపం నిద్రకోసం చాలా తపిస్తోంది. దీనికి సంబంధించి ఒక కామెంట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది.  "నాకు 8 గంటల నిద్ర కావాలి అదీ ఎలా ఉండాలంటే స్కూల్ కి వెళ్ళినప్పుడు, జాబ్ కి వెళ్ళినప్పుడు 8 గంటలు ఎంత భారంగా గడుస్తాయో అంత లేట్ గా గడవాలి అనేది నా కోరిక" అంటూ ఎమోజితో పోస్ట్ చేసింది. కానీ అలా జరగదు కదా. ఇలా పాపం శ్రీముఖి నిద్ర కోసం ఎలా తపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

కొంతమందికి నా బ్యాక్‌ అంటేనే చాలా ఇష్టం!

అష్షు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న హాట్ స్టార్. ఆర్జీవీతో బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసి ఓ రేంజ్ లో ఫేమస్‌ ఐపోయింది. బుల్లితెర కామెడీ షోస్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ ని బాగానే సంపాదించుకుంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అష్షు స్పెషల్‌ ఈవెంట్లు, కవర్‌ సాంగ్స్‌ అంటూ ఫుల్ బిజీ ఐపోయింది. ఆర్జీవీతో కలిసి తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. రూ.8 లక్షలు పెట్టి ఒక నెక్లెస్‌ కొనుక్కుంది. వాళ్ళ నాన్న మెర్సిడీజ్‌ బెంజ్‌ కారును బహుమతిగా ఇచ్చారు.  ఇక ఇప్పుడు అష్షు ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది తన ఇన్స్టాగ్రామ్ పేజీలో. ఆమె నీలం చీర కట్టుకుని సైడ్ యాంగిల్ లో  ఫొటోలకు ఫోజులు ఇచ్చేసి వాటిని  షేర్‌ చేసింది. "కొంతమందికి నా బ్యాక్‌ అంటేనే చాలా ఇష్టం.. ఎందుకంటే వారిలో కొందరు నా వెనుక మాట్లాడుతూ ఉంటారు" అనే కాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ ఫొటోకు బోల్డు కామెంట్స్ వస్తున్నాయి. ఆరియానా గ్లోరీ మాత్రం 'సెక్సీ' అని కామెంట్ పెట్టి పక్కనే ఫైర్ ఎమోజి పెట్టేసింది.  ఇక అష్షు టైం దొరికితే వెకేషన్ కి వెళ్తూ అక్కడి ఫొటోస్ ని తన ఇన్స్టా పేజీ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఏ కామెంట్ ఐనా పెట్టుకోండి నాకేం సంబంధం లేదు నా పేజీ నా ఇష్టం, నా ఫొటోస్ నా ఇష్టం అంటూ అష్షు తనకు నచ్చిన ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటుంది.

'జబర్దస్త్'కి ఆల్టర్నేట్ లేదు.. ఈ స్టేజి లేకపోతే మేం ఉండేవాళ్ళం కాదు!

బుల్లితెర మీద జబర్దస్త్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కామెడీ అనేది లేకుండా కేవలం సీరియల్స్ తో డ్రైగా నడుస్తున్న టైంలో జబర్దస్త్ ఒక తుఫానులా వచ్చి తెలుగు ఆడియన్స్ ని చుట్టేసింది. ఇక అప్పటి నుంచి ప్రతీవారం ప్రసారమయ్యే ఈ కామెడీ షో కోసం ఆడియన్స్ వెయిట్ చేసేవారు. తర్వాత కొంత కాలానికి ఎక్స్ట్రా ఫన్ పేరుతో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది. ఇది కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. మంచి రేటింగ్ తో  దూసుకుపోతున్న ఈ  'ఎక్స్ ట్రా జబర్దస్త్' తాజాగా 400ల ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుని సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా టీం లీడర్లు, ఆర్టిస్టులు ఎక్స్ట్రా జోష్ తో  వేదికపై స్కిట్లు, పంచులు పేల్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు.  ఎక్స్ట్రా జబర్దస్త్ 400 ఎపిసోడ్ లు పూర్తిచేసుకోవడం పై  ఆర్టిస్టులు తమ అభిప్రాయాలను చెప్పారు. రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ "జబర్దస్త్ లేదు అని ఊహించుకోవడమే కష్టం. ఎందుకంటే దీనికి ఆల్టర్నేట్ లేదు మా ఆర్టిస్టుల లైఫ్ కి" అన్నాడు. అలాగే  బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.." 12 కోట్ల మందిలో 12 మందికి ఈ స్టేజి పై  అవకాశం లభించింది. అందులో నేనొకడిని కావడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను" అని చెప్పాడు. తర్వాత  కెవ్వు కార్తిక్ మాట్లాడుతూ.." జబర్దస్త్ నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిది" అంటూ  ఎమోషనల్ అయ్యాడు. "జబర్దస్త్ స్టేజ్ వల్ల నేను ఓ స్టేజీలో ఉన్నాను. థ్యాంక్యూ జబర్దస్త్ " అని చెప్పింది రోహిణి. ఇక గెటప్ శ్రీను స్పందిస్తూ... "మొదట్లో జబర్దస్త్ మాకో  అవకాశం.. ఇప్పుడు బాధ్యతగా మారింది" అంటూ చెప్పాడు. ఇక రష్మీ మాట్లాడుతూ "మాకు ప్రతీ ఎపిసోడ్ ఒక సినిమా లాంటిదే" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జబర్దస్త్ నుంచి ఎంతో మంది  ఆర్టిస్టులు గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో కూడా నటిస్తుండడం విశేషం. ఎక్కడ బ్రేక్ లేకుండా ఇన్నాళ్లుగా ఈ జబర్దస్త్ కొనసాగడం గొప్ప విషయం కూడా.

ధూమ్ ధామ్‌గా జీ ఫ్యామిలీ కిర్రాక్ పార్టీ!

జీ కుటుంబం అవార్డ్స్ 2022 కిర్రాక్ పార్టీ ధూమ్ ధామ్ గా జ‌రిగింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కి బుల్లితెర సీరియల్స్ లో నటించేవాళ్లంతా వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. స్పెషల్ గెస్ట్ గా పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్స్ గా సుడిగాలి సుధీర్ , శ్రీముఖి రచ్చ రచ్చ చేశారు. సుధీర్ ని చాలా రోజుల తర్వాత ఈ షోలో చూసేసరికి ఫాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు "బతుకు జట్కాబండి" ఎంత ఫేమస్ షోనో అందరికీ తెలుసు ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో "ఉతుకు జట్కాబండి" అని పెట్టి అత్తాకోడళ్ల గొడవలకు పరిష్కారం చూపించేలా తన మాటలతో, కౌంటర్లు తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు పోసాని. ఇక సీరియల్స్ వచ్చే కొన్ని ఫన్నీ బిట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ల్స్, మీమ్స్ తో ఎలా ఆడుకుంటున్నారో కొన్ని ప్లే చేసి చూపించారు. తర్వాత ఆనంది "దమ్మారో దమ్" అనే పాటకు బ్లాక్ డ్రెస్ లో వచ్చి అద్దిరిపోయే డాన్స్ చేసి స్టేజిని ఇరగొట్టేసింది. ఈమె డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. తర్వాత సుడిగాలి సుధీర్ వచ్చి తన కోసం ఒక పాట పాడమని ఆనందిని అడిగేసరికి "కమ్మని ఈ ప్రేమలేఖలు" అంటూ పాడింది. ఇక తర్వాత సీరియల్స్ హీరోస్ తో సుధీర్ టీ పెట్టే పోటీ పెట్టి ఎంటర్టైన్ చేసాడు. ఫైనల్ గా యశస్వి, ప్రణవ్ వచ్చి ఊపున్న పాటలు పాడి అందరూ ఊగిపోయేలా చేశారు. అదే టైములో శ్రీముఖి వచ్చి "బంగారం నీకెవరూ లేరా" అని యశస్విని అడిగేసరికి "నువ్వున్నావ్ కదా బంగారం" అని కౌంటర్ వేసాడు. ఇలా ఈ ఈవెంట్ అందరినీ అలరించడానికి ఈ ఆదివారం రాత్రి 6 గంటలకు జీ తెలుగులో రాబోతోంది.

మిస్టర్ అండ్ మిసెస్.. ఒకరికి ఒకరు కొత్త రియాల్టీ షో ప్రారంభం!

బుల్లితెర మీద శని, ఆదివారాల్లో షోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయ్ కానీ మాములు రోజుల్లో షోస్ హడావుడి కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అందుకే దీన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు ఈటీవీలో ప్రతీ మంగళవారం రాత్రి 9 .30 కి మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో అక్టోబర్ 11 నుంచి  స్టార్ట్ కాబోతోంది.  ఐతే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి చేస్తోంది. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం బ్యూటిఫుల్ స్మైలింగ్ స్నేహ ఈ షోకి వచ్చేసింది. ఇక శ్రీముఖి ఆమెను ఇన్వైట్ చేసి "మిస్టర్ ప్రసన్న గారు ఎక్కడ అనేసరికి నా గుండెల్లో ఉన్నారని స్నేహ చూపిస్తుంది. హలో ప్రసన్న గారు" అంటూ పలకరించింది శ్రీముఖి. తర్వాత శివబాలాజీ ఎంట్రీ అదిరిపోయింది. "కోపం అతనికి ముక్కు మీద ఉంటుంది , కానీ ముక్కుసూటితనం ఆయన మాటల్లో ఉంటుంది" అంటూ శివబాలాజీని ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి. "భర్తది అప్పర్ హ్యాండా, భార్యాదా" అని అడిగేసరికి "ఇద్దరి చేతులు సమానంగా లేకపోతే జీవితం వంకరగా ఉంటుందని" చేసి మరీ చూపించాడు శివ బాలాజీ. తర్వాత అనిల్ రావిపూడి ఈ షోలో ఎంట్రీ ఇచ్చారు.  "లవ్ లెటర్ రాసినప్పుడు ఎలాంటి పాయింట్స్ రాస్తే అవతలి వాళ్ళు కచ్చితంగా ఒప్పుకుంటారు ?" అనే ప్రశ్నతో ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి. "నీలాంటి అమ్మాయి ఐతే అబ్బాయి ఉన్న ఆస్తి రాసిస్తానంటే చాలు" అంటాడు అనిల్. మరి అబ్బాయిలకు అని శ్రీముఖి  అడిగేసరికి "అబ్బాయిలు సున్నిత మనస్కులు కదా మనసొక్కటి  ఇస్తే చాలు.. వెనక బోల్డ్ లగ్గేజ్ ఉంటుందిగా. స్ట్రెస్, టెన్షన్, ఇగో, అరవటాలు, తిట్టడాలు, ఓదార్పు యాత్రలు..ఇవన్నీ ఉంటాయిగా" అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చి షోలో ఫన్ క్రియేట్ చేసాడు అనిల్ రావిపూడి.

స్టేజి మీద ఏడ్చేసిన అకుల్ బాలాజీ.. ధైర్యం చెప్పిన భార్య!

డాన్స్ ఇండియా డాన్స్ సరికొత్తగా ముస్తాబవుతూ ప్రతీవారం ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "స్వాతిముత్యం" మూవీ టీమ్ నుంచి హర్షవర్ధన్, బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ వచ్చారు. ఇందులో చిన్న పిల్లలు కూడా రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ చేసి జడ్జెస్ తో వావ్ అనిపించుకున్నారు.  నెల్లూరులో పుట్టిన షో హోస్ట్ అకుల్ బాలాజీ తన డ్రీమ్‌ కోసం తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డాడో ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ చేసి చూపించారు. ఈ పెర్ఫార్మెన్స్ తో అకుల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తర్వాత స్టేజి మీదకు అత‌ని భార్య‌ వచ్చి, "నీ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది.. బాధపడకు" అంటూ ఓదార్చింది.  "మా నాన్న చెప్పారు ఆఖరి శ్వాస వరకు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండు అని.. నేను అలాగే చేస్తున్నా. నాన్నా నువ్ ఎక్కడున్నా.. నేను నువ్వు చెప్పిన కల కోసం కష్టపడుతున్నా" అన్నాడు బాలాజీ. ఈ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూసి "అన్న ప్రాసన రోజునే బిర్యానీ తిన్నట్టు ఉంది" అని కాంప్లిమెంట్  ఇచ్చాడు హర్షవర్ధన్.

రచ్చ రవి కారు కొంటే ఆ రచ్చే వేరప్పా!

దసరా వచ్చిందంటే చాలు సాధారణంగా ఆఫర్స్ ఉంటాయని రకరకాల వస్తువులు కొనేస్తూ ఉంటారు చాలామంది. ఐతే ఇక్కడ సెలబ్రిటీస్ మాత్రం దసరా సందర్భంగా అందరూ కార్లు కొనేసి తెగ ఫోజులు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు కార్ కొనాలంటే డబ్బు కూడబెట్టి చూసి చూసి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాకోలెట్స్ కొన్నట్టు కార్లు కొనేస్తున్నారు. మొన్న షణ్ముఖ్ జస్వంత్ బిఎండబ్ల్యూ కొంటే నిన్న పవిత్ర ఐ20 కొనేసింది. ఇక ఈరోజు రచ్చ రవి నెక్సా గ్రాండ్ వింటారా కార్ కొనేసాడు. రచ్చ రవి బుల్లితెర, వెండితెరపై తన సత్తా చాటుతున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడని కూడా తెలుస్తోంది.  జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీంలో పని చేసి  బాగానే పాపులర్ అయ్యాడు ర‌వి. అలా సొంతంగా టీమ్‌ లీడర్ స్థాయికి వెళ్లాడు. తర్వాత నాగబాబుతో చమ్మక్ చంద్ర, ఆయనతో రచ్చ రవి జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసారు. తర్వాత అవకాశాలు రాక మళ్ళీ మల్లెమాలకు వచ్చేసాడు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో జబర్దస్త్ తనకు అమ్మ లాంటిది అంటూ ఎమోషన్ అయ్యాడు.  ఇప్పుడు రచ్చ రవి తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. షోరూమ్‌లో ఆ కారుతో త‌ను చేసిన ర‌చ్చ‌ను వీడియో రూపంలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రచ్చ రవికి నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. "పార్టీ ఎప్పుడూ?" అంటూ అడుగుతున్నారు.

యు ఆర్ మై ఇన‌యా.. నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా ప్రేమ తగ్గదు!

బిగ్ బాస్‌లో నిన్న మొన్నటి వరకు ఇనయా, సూర్య అంటే ఇద్దరు మంచి స్నేహితులు అని హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు అనుకున్నారు. అయితే రోజుకో మలుపు తిరిగే ఈ షో, నిన్న జరిగిన ఎపిసోడ్‌ లో ఇనయా, సూర్య ప్రవర్తన కాస్త భిన్నంగా అనిపిస్తోంది. ఇనయా, సూర్యకి సపోర్ట్ చేస్తూ, తన ఎమోషన్ ని దాచుకోలేకపోయింది. బిగ్ బాస్ అంటేనే టాస్క్, గేమ్, ఎంటర్టైన్మెంట్, హంగామా, ఎమోషనల్ సీన్స్, సీక్రెట్ టాస్క్, లవ్ బర్డ్స్. అయితే  వీటన్నింటిలో బాగా ఆసక్తిని చూపేది ' సీక్రెట్ లవ్'.  సూర్య, ఇనయాల మధ్య సీక్రెట్ లవ్ మొదలయ్యిందా? అంటే అవుననే అనుకుంటున్నారు ప్రేక్షకులు! నిన్న జరిగిన ఒక టాస్క్ లో సూర్యకి సపోర్ట్ చేయలేకపోయానని ఇనయా బాధపడుతూంటే, సూర్య తన దగ్గరకు వచ్చి, "నువ్వు ఏం బాధపడకు. ఇది ఒక గేమ్ మాత్రమే. నీకు నాకు మధ్య గొడవ జరిగినా, నిన్ను చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళేంత చనువు ఉంది. నీతో గొడవ పడేంత చనువు ఉంది. నీకు అన్నం తినిపించేంత చనువు ఉంది" అంటూ సూర్య చెప్తూంటే, ఇనయా సిగ్గుపడుతూ 'నీకు ఆ రైట్ ఉంది' అని నవ్వేసింది.  ఈ సీన్ లో తను‌ ఒక రకమైన ఫీలింగ్ లో ఉన్నట్లుగా ఉంది. ఈ విషయం చూసిన ప్రేక్షకులకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అయితే తర్వాత ఇనయా తన ఓట్ ని రేవంత్ కి వేసి, దూరంగా వచ్చి  బాధపడుతోంది. అది చూసి సూర్య తన దగ్గరకు వెళ్ళి "నువ్వు ఓటు వేసినా వేయకపోయినా 'You are my Inaya', నువ్వు ఎలా ఉన్నా నీ మీద నా ప్రేమ తగ్గదు" అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇనయా తనకి  హగ్ ఇస్తూ కంటతడి పెట్టుకుంది. సూర్య లాస్ట్ వీక్ వరకు ఆరోహితో ప్రేమలో ఉన్నాడని అనుకున్న ప్రేక్షకులు మాత్రం, ఈ రోజు ఎపిసోడ్ చూసాక‌ సూర్య, ఇనయాకి మధ్యలో 'Something something' ఉంది అనే అనుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇవన్నీ కంటెంట్ కోసం వీళ్ళిద్దరు ఆడుతున్న గేమ్ లా అనిపిస్తోందని అనుకుంటున్నారు. అయితే  మునుముందు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగబోతుందో? ఎంత వరకు వీళ్ళిద్దరు కలిసి ఉంటారో? చూడాలి మరి!

కొత్త కెప్టెన్ గా రేవంత్!

ముప్పై మూడవ రోజు మరింత ఆసక్తితో  మొదలైన బిగ్ బాస్ రోజుకో కొత్త టాస్క్ లతో అలరిస్తోంది‌. అయితే ఈ రోజు హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం పోటీ రెండు లెవల్స్ లో కొనసాగింది. కాగా ఆదిత్య, సూర్య, రేవంత్ మొదటి లెవల్ లో గెలిచారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో రెండవ లెవల్ నియమాలు చెప్పాడు బిగ్ బాస్. "ఏ కంటెస్టెంట్ కెప్టెన్ అవ్వాలనుకుంటారో వారి మెడలో బంతిపూల మాల వేయాలి. ఎక్కువ బంతిపూల మాలలు ఎవరికి వస్తాయో, వారే ఈ వారం కెప్టెన్  అవుతారు" అని బిగ్ బాస్ వివరించాడు. కాగా ఈ టాస్క్ చాలా క్లిష్టంగా కొనసాగింది. అయితే  చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ టాస్క్ లో రేవంత్ గెలిచి, హౌస్ లో కొత్త  కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. రెండవ టాస్క్ ' హైయర్ తగ్గాఫర్'. ఇది ఎవరు బలమైన వాళ్ళో తేల్చే గేమ్. అయితే  ఇందులో కంటెస్టెంట్స్ మధ్య  గొడవలు జరిగాయి.  ఆదిత్యకి, గీతుకి మధ్యలో గట్టిగా గొడవ జరిగింది. "నువ్వు డీగ్రేడ్ చేస్తున్నావ్, ప్రతీసారీ చూస్తున్నా, గొంతు లేపితే కాదు, దేనికైనా లిమిట్ ఉంటుంది" అని గీతుతో గొడవకు దిగాడు ఆదిత్య. గీతు మాత్రం నేను నిన్ను అలా అనలేదు అని సమాధానం చెప్పినా, ఆదిత్య కన్ఫిన్స్ కాలేకపోయాడు. తర్వాత ఆదిరెడ్డి జోక్యం చేసుకొని ఇద్దరిని కాంప్రమైజ్ చేసాడు. హౌస్ లో ఎన్నికైన కొత్త కెప్టెన్ రేవంత్ కి కంటెస్టెంట్స్ అందరు చప్పట్లతో శుభాకాంక్షలు తెలిపారు. అయితే శుక్రవారం కెప్టెన్ ని ఎన్నుకొని, తర్వాత శుక్రవారం వరకు ఆ కెప్టెన్  కొనసాగుతాడు అనే విషయం, ఈ షో చూసే అభిమనులకు తెలిసిన విషయమే. అయితే హౌస్ లో అగ్రెసివ్, హైపర్ ఆక్టివ్ అని పిలువబడే రేవంత్ కెప్టెన్ గా వచ్చే శుక్రవారం వరకు ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తాడో చూడాలి మరి!

నేను చేసిన తప్పే నా కూతురు చేత చేయించలేను!

శ్రీవాణి సోషల్ మీడియాలో వెరైటీ వెరైటీ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ అందరికీ ఎంతో కొంత ఫన్ ని, కొంత జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీవాణి తన కూతురు నందినికి బట్టలు ఉతకడం నేర్పించింది. "చదివేది నైన్త్ క్లాస్.. స్కూల్ యూనిఫామ్, బాడ్మింటన్ యూనిఫామ్ ఉతుకు అని పనులు పురమాయిస్తుంది కానీ తాను చేసుకోవడానికి అస్సలు ఇంటరెస్ట్ ఉండదు" అంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్న కూతురిని పనిమాలా పిలిచి కూర్చోబెట్టి స్టెప్ బై స్టెప్ బట్టలు ఉతికే ప్రాసెస్ నేర్పించింది. "ఏంటమ్మా ఇలా బట్టలు ఉతికితే పనిదాన్ని అనుకుంటారు" అనేసరికి, పనిదానివి అనుకోరు పనిమంతురాలు అనుకుంటారు" అని కరెక్షన్ చేసింది శ్రీవాణి. "జెనెరేషన్స్ మారుతున్నాయి నన్ను పని చేయమంటున్నావ్ ఏమిటి?" అని నందిని సీరియస్ అయ్యింది. "జెనరేషన్స్ మారినా యూనిఫామ్ మారదు కదా. చిన్నప్పుడు నా డ్రెస్సులు నేనే ఉతుక్కుని నా సాక్స్, షూస్ అన్ని రెడీ చూసుకునేదాన్ని. చిన్నప్పటినుంచి నీ చేత పని చేయించక ఇలా అయ్యావ్. ఇప్పటికైనా ఆ తప్పు నేను చేయను, నీకు అన్ని పనులు నేర్పిస్తా" అనేసరికి బిక్కమొహం వేసింది నందిని.  "ఇలాంటి పనులు చేసుకుంటే పొట్టలు రావు వర్కౌట్లు చేయక్కర్లేదు" అని కూతురికి హితబోధ చేసింది శ్రీవాణి. "ఎక్కడికి వెళ్లినా ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అవకుండా ముందు మాన్యువల్ గా నేర్చేసుకుంటే తర్వాత పెద్దగా ఇబ్బంది పడాల్సిన  పని ఉండదు.. అందుకే నందినికి అన్ని పనులు నేర్పిస్తున్నా" అంది శ్రీవాణి.