Illu illalu pillalu : బ్యాచిలర్ పార్టీలో ధీరజ్ కి దగ్గరగా ఐశ్వర్య.. ప్రేమ ఏం చేయనుంది

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -279 లో.. ప్రేమ బ్యాచిలర్ పార్టీ కోసం ఏం డ్రెస్ వేసుకోవాలో ఆలోచిస్తుంటే.. నర్మద వేదవతి వచ్చి డ్రెస్ సెలక్ట్ చెయ్యడం హెల్ప్ చేస్తానని అంటారు. ప్రేమ వెస్టన్ వేసుకుంటే వేదవతి వద్దని అంటుంది. లంగావోణి వేదవతి సెలక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ లంగావోణి వేసుకొని వస్తుంది. ప్రేమని ఆ డ్రెస్ లో చూసి ధీరజ్ షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు.. నేను ఎలా ఉన్నానని ప్రేమ అనగానే బాగున్నావని ధీరజ్ అంటాడు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అదంతా నర్మద చూసి మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. ఆ తర్వాత అసలు ప్రేమ ఫోటోస్ గురించి ఎదురింట్లో ఎలా తెలిసిందని నర్మద ఆలోచనలో పడుతుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తారు. అందరు అక్కడ ధీరజ్ ని ఆటపట్టిస్తారు. ఐశ్వర్య వచ్చిందని ధీరజ్ ఫ్రెండ్స్ తనకి చెప్తారు. ఐశ్వర్య వచ్చి ధీరజ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే ప్రేమ కోపంగా.. ధీరజ్ చెయ్ పట్టుకుంటుంది. ఎవరు ఆవిడా అని ఐశ్వర్య అనగానే.. నా భార్య అని ధీరజ్ చెప్తాడు. అయిన వినకుండా ధీరజ్ కి దగ్గరగా ఉంటే ప్రేమ కోపంగా దూరంగా వస్తుంది. మరొకవైపు ప్రేమ ఫోటోస్ గురించి ఎదురింట్లో ఎలా తెలిసిందో కనుక్కోడానికి తిరుపతి హెల్ప్ తీసుకుంటుంది నర్మద. తరువాయి భాగంలో ధీరజ్ తో ప్రేమ డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: చెక్ ఇచ్చినా తీసుకొని కార్తీక్.. కుటుంబమంతా షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -478 లో..... జ్యోత్స్నకి శ్రీధర్ చెక్ ఇచ్చి నా కొడుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్ అంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. కార్తీక్ చెక్ తీసుకొని శ్రీధర్ కి ఇచ్చి.. నాకు ఇలా ఇష్టం ఉండదు.. ఎవరి సాయం వద్దని కార్తీక్ ఖచ్చితంగా చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతాడు.... ఎందుకురా.. నువ్వు ఇలా డ్రైవర్ గా ఉండడం నాకు ఇష్టం లేదు.. సాయం చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావని కార్తీక్ పై శ్రీధర్ కోప్పడుతాడు. కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. అసలు కార్తీక్ ఎందుకిలా ఛాన్స్ వచ్చిన వాడుకోట్లేదు.. మనసులో ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని సుమిత్ర అంటుంది. నీతో మాట్లాడాలి దీప అని శ్రీధర్ బయటకు పిలుస్తాడు. అసలు కార్తీక్ ఎందుకు వద్దని అంటున్నాడు.. కారణం చెప్పమని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. నాకు తెలియదని దీప అంటుంది. మీరు తననే అడగండి అని దీప అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కొడుకు నిజం చెప్పడు.. కోడలు నిజం చెప్పదని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్నకి శివన్ననారాయణ రెస్టారెంట్ గురించి టైమ్ ఇస్తాడు. దాని గురించి కనుక్కుంటాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తనూజ లవ్ స్టోరీ రివీల్.. టాస్క్ లో గెలిచిందెవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ జోరుగా సాగుతోంది. నిన్నటిదాకా వీళ్ళేం ఆడుతారులే అనుకున్న కంటెస్టెంట్స్ అదరగొడుతున్నారు.. ఇక అందరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న మరికొందరు కెప్టెన్సీలో అంతగా ఆకట్టుకోవడం లేదు. బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, గ్రీన్ టీమ్ అంటూ నాలుగు టీమ్ లుగా బిగ్ బాస్ విడదీశాడు. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ రేస్ నుంటి మొదటగా తనూజ అవుట్ అవ్వగా.. ఎపిసోడ్ చివర్లో గ్రీన్ టీమ్ తప్పుకుంది. గ్రీన్ టీమ్ లోని దమ్ము శ్రీజ, భరణి, సంజన కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నారు. ఇక ఈ టాస్క్ ల మధ్యలో హౌస్ మేట్స్ అంతా సరదగా మాట్లాడుకున్నారు. రీతూ, తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల, దమ్ము శ్రీజలు కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో తనూజకి ట్రూత్ అని రావడంతో.. నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి.. ట్రూత్ అన్నారు కాబట్టి నిజమే చెప్పాలి.. అబద్దం చెప్తే దూరం అయిపోతారని ఇమ్మాన్యుయల్ అన్నాడు. దాంతో తనూజ.. హృతిక్ రోషన్ అని చెప్పింది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల వంతు రావడంతో.. ఈ హౌస్‌లో లవ్ చేయొచ్చని అనిపించే వాళ్లు ఎవరున్నారని ఇమ్మాన్యుయల్ అడిగాడు. తనూజ అని కళ్యాణ్ చెప్పాడు. తర్వాత మళ్లీ తనూజకి ట్రూత్ రావడంతో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పమని ఇమ్మాన్యుయల్, శ్రీజ అడిగారు. దాంతో తనూజ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. నా ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలో మొదలైంది. అతని పేరు కళ్యాణ్ అని చెప్పింది. ఆ మాట వినగానే కళ్యాణ్.. ఆహా అంటూ తెగ ఫీల్ అయిపోయాడు.  డ్యాన్స్ క్లాస్‌లో నా ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. నాకు డైరెక్ట్‌గా గ్రీటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నాకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతనే. తను చాలా మంచోడు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అది చాలా క్యూట్ లవ్ స్టోరీ.. బట్ వన్ సైడ్ లవ్ స్టోరీ తనకి. తను ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నాడు. తనకి పెళ్లైపోయిందంటూ తన ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పింది తనూజ. ఆ తర్వాత మళ్లీ డేర్ రావడంతో.. కళ్యాణ్‌ పడాలతో కలిసి స్టెప్‌లు వేసింది తనూజ. ఇలా ఎపిసోడ్ ఫన్ అండ్ టాస్క్ లతో గడిచింది. ఈ ఎపిసోడ్ లో తనూజ చెప్పిన లవ్ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

 కెప్టెన్సీ రేస్ నుండి తనూజ అవుట్.. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్!

బిగ్‌బాస్ సీజన్ -9 నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ సహా లగ్జరీ ఫుడ్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్కులు పెట్టాడు. ఇందులో భాగంగా సభ్యులందరినీ మళ్లీ నాలుగు టీములుగా డివైడ్ చేసి టాస్కులు పెట్టాడు. ఇందులో గెలిచిన టీమ్ నుంచే కెప్టెన్సీ కంటెండర్‌షిప్ సహా కొన్ని పవర్ కార్డ్స్ లభించనున్నాయి. నిన్న జరిగిన టాస్కు అయితే గట్టిగానే జరిగింది. కెప్టెన్ డీమాన్ పవన్‌ని మళ్లీ సంచాలక్‌గా పెట్టి నాలుగు టీములుగా 12 మందిని డివైడ్ చేశాడు. హరీష్, తనూజ, రీతూ చౌదరి (బ్లూ టీమ్), ఇమ్మానుయేల్, ఫ్లోరా, కళ్యాణ్ (రెడ్ టీమ్), సంజన, రాము, సుమన్ శెట్టి (ఎల్లో టీమ్), శ్రీజ, దివ్య, భరణి (గ్రీన్ టీమ్)‌.. ఇలా నాలుగు టీములు టాస్కులో పోటీ పడ్డాయి. స్టార్ట్ బజర్ మోగగానే టీమ్ లీడర్స్ సమయానుసారం చెప్పిన కలర్ బాల్స్‌ని ఆ నెట్ నుంచి బయటికి తీయాలి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. వెంటనే బ్లూ అని బిగ్‌బాస్ చెప్పాడు.. దీంతో బ్లూ బాల్ అందుకోవడానికి టీమ్స్ అన్నీ తెగ తన్నుకున్నాయి. ఈ టాస్కులో రెడ్ టీమ్ సత్తా చాటింది. కెప్టెన్సీ కంటెండర్ షిప్ మాత్రమే కాదు లగ్జరీ ఐటెమ్ మరెన్నో ప్రయోజనాలు పవర్ కార్డ్స్ ద్వారా లభిస్తుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అందులో కంటెండర్, కిక్ ఔట్, మటన్, లగ్జరీ ఫుడ్.. అని నాలుగు కార్డ్స్ ఉన్నాయి. కంటెండర్ కార్డ్ తీసుకుంటే తమ టీమ్ నుంచి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట, కిక్ ఔట్ కార్డ్ పొందిన వారు వాళ్లకి నచ్చిన టీమ్‌ని రేసు నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. అలానే మటన్, లగ్జరీ ఫుడ్ కార్డ్స్ గెలిస్తే ఆయా సదుపాయాలు వస్తాయి. టాస్కులో భాగంగా కొంతమంది ప్లేయర్ల మధ్య ఫిజికల్ ఫైట్ అయింది. బ్లూ టీమ్‌లో ఉన్న తనూజ తనని మూతి మీద కొడుతున్నాడు.. అంటూ కళ్యాణ్ మీద కంప్లెయింట్ చేసింది. కావాలని కొట్టరు కదమ్మా.. అని ఇమ్మూ అంటే చేయి తగలడం డిఫరెంట్ ఇలా అనుకొని వెళ్లడం డిఫరెంట్ అంటూ ఎలా కొట్టాడో తనూజ చూపించింది‌. మరోవైపు తమ బాస్కెట్‌లో ఉన్న బాల్‌ని తీయడానికి ట్రై చేసిన రీతూపై ఫైర్ అయ్యాడు కళ్యాణ్. బ్రో పెట్టు అక్కడ అంటూ రీతూకి చెప్పాడు కళ్యాణ్. తర్వాత తనూజ-కళ్యాణ్ మధ్య కూడా గొడవ జరిగింది. ఇక ఏ టీమ్ కారణంగా బ్లాక్ బాల్ బయటికొచ్చిందని మీరు అనుకుంటున్నారో ఆ టీమ్ నుంచి ఒకర్ని తప్పించండి అంటూ  డీమాన్‌కి బిగ్ బాస్ చెప్పాడు. దీంతో తనూజ నువ్వు ఎలిమినేట్ అంటూ డీమాన్ అన్నాడు. అయితే కీ ప్లేయర్లని పంపించాలి.. సపోర్టర్స్‌ని పంపించడానికి లేదంటూ డీమాన్‌తో పవన్ కళ్యాణ్ గొడవపడ్డాడు. డీమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్టో కామెంట్ చేయండి.

మరో కథతో రుద్ర ముందుకు వెళ్ళిన గంగ.. తనకి దగ్గరవ్వగలదా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రుద్రకి గంగ వేరే నెంబర్ నుండి స్వీటీలాగా ఫోన్ చేస్తుంది.‌ రుద్రకి స్వీటి ఫోన్ చేసి సాయం కావాలని అడుగుతుంది. ‌ఇక‌ కాసేపు సోది‌ పెడుతు రుద్రని విసిగిస్తుంది. మరోవైపు రుద్ర ప్రేమించిన పారు ఒంటరిగా కుర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళ అన్న ఒక వరుడి ఫోటోని తీసుకొచ్చి.. నువ్వు ఒప్పుకుంటే ఇతనితో నీ ఎంగేజ్ మెంట్ అని అంటాడు. దానికి పారు ఒప్పుకోదు. అతను కాబోయే కిక్ బాక్సింగ్ చాంపియన్. ‌ అతని కోసం స్పాన్సర్స్ క్యూలో నిల్చుంటున్నారని పారుతో వాళ్ళ అన్నయ్య చెప్పగానే.. కాబోయే ఛాంపియన్ నాకు వద్దు.. సక్సెస్ అయినవాడే కావాలి.. ఆ రుద్రని మించిన కిక్ బాక్సర్ లేడు.. కానీ అతడి దురదృష్టం ఒక్క రోజులో పతనం చేసింది. నాకు సమాజంలో గుర్తింపు, పేరు ఉన్నవాడే కావాలని పారు అనగానే అలాగే చెల్లెమ్మ..‌ నువ్వు ఎలా అంటే అలానే అని అతను అంటాడు. మరోవైపు గంగ స్వీటీలా రుద్రకి దగ్గరవ్వాలనుకుంటుంది. అందుకే తను ఆపదలో ఉన్నట్టు వంశీతో యాక్ట్ చేపిస్తుంది. రుద్రకి గంగ కాల్ చేసి నిజంగానే తను ఆపదలో ఉన్నట్టుగా.. వంశీ ఒక రౌడీలా గంగని బెదిరిస్తాడు. ఇక అది నిజమే అనుకున్న రుద్ర కంగారుగా ఆ లొకేషన్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ నెంబర్ కాల్ చేయగానే స్వీటీలాగా ఓ నర్స్ డ్రెస్ వేసుకొని ఉంటుంది గంగ. ఇక గంగ దగ్గరకు రుద్ర వెళ్తాడు. ఇక ఏంటి ప్రాబ్లమ్ అని రుద్ర అడుగుతాడు. నేను ఒక చిన్న హాస్పటల్ లో నర్స్ ని.. చిన్న ఆశలతో బతుకుతున్నా.. కానీ అన్నీ చిన్నగా ఉన్నా, ప్రాబ్లమ్స్ మాత్రం పెద్దగా వచ్చాయంటూ గంగ  చెప్తూంటే రుద్ర అలాగే వింటుంటాడు. రుద్రకి గంగ మరో కథ అల్లబోతుంది. తనకి దగ్గరవ్వడానికి స్వీటీలాగా వచ్చిన గంగని రుద్ర కనిపెడతాడా లేదా చూడాలి మరి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 ధీరజ్, ప్రేమల మధ్య గొడవ.. రామరాజు ఫైర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -278 లో......వేదవతిపై రామరాజు కోప్పడుతాడు. కోడళ్లకి నువ్వు అంటే భయం లేదు.. వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటున్నారని రామరాజు అంటాడు. ఆ తర్వాత రామరాజు భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. భాగ్యం టెన్షన్ పడుతుంది. మరొకవైపు నాన్నకి డబ్బు విషయం ఎందుకు చెప్పావని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. ఆ వల్లి అక్క అన్ని మాటలు అంటుంటే నాకెలా అనిపిస్తుంది. నువ్వు ఎందుకు కలుగజేసుకోవడం అని ధీరజ్ అంటుంటే ఎందుకంటే నువ్వు నా మొగుడివి అని ప్రేమ అంటుంది. మరొకవైపు వేదవతి ముగ్గు వేస్తూ భద్రవతిని చూస్తూ తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే నర్మద వచ్చి ఏదో లవర్స్ అయినట్టు అలా చూసుకుంటున్నారని అంటుంది. ప్రొద్దున నర్మద ఆఫీస్ లో జరిగింది చెప్తుంది. నేను చేసింది తప్పా అని నర్మద అడుగుతుంది. లేదని వేదవతి చెప్తుంది. మరొకవైపు భాగ్యం వాళ్ళకి రామరాజు ఫోన్ చేస్తుంటే.. లిఫ్ట్ చెయ్యరు. దాంతో శ్రీవల్లిని పిలిచి రామరాజు కోప్పడతాడు. మరొకవైపు అసలు బ్యాచిలర్ పార్టీ కోసం.. ఏం డ్రెస్ వేసుకోవాలని ప్రేమ ఆలోచిస్తుంటే నర్మద, వేదవతి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కొడుకు కోసం పదికోట్ల చెక్ ఇచ్చిన శ్రీధర్.. కార్తీక్ ఒప్పుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -477 లో..... కాంచనకి శ్రీధర్ డబ్బు ఇచ్చి ఈ విషయం కార్తీక్ కి చెప్పకని అంటాడు. సరుకులు తీసుకొని వస్తాడు.. అవి చూసి ఎందుకు తీసుకొని వచ్చావని కార్తీక్ అడుగుతాడు. నువ్వు నా కోసం ఏదైనా చేయొచ్చు కానీ నీ కోసం నేను ఏం చెయ్యోద్దా అని శ్రీధర్ అంటాడు. సరే ఈ ఒక్కసారి పర్లేదు కానీ ఇంకొకసారి తీసుకొని రాకు అని చెప్తాడు. నువ్వు మాత్రం డ్రైవర్ గా ఉండడం నాకు ఇష్టం లేదని కార్తీక్ తో శ్రీధర్ చెప్తాడు. ఇప్పుడు నీ భార్యకి ఎలా ఉందని శ్రీధర్ అడుగుతాడు. ఎదురుగా ఉంది కదా.. నువ్వు అడుగమని కార్తీక్ అంటాడు. బానే ఉందని దీప అంటుంది. దీపకి ఏమైందని కాంచన అడుగుతుంది. కళ్ళు తిరిగిపడిపోయిందని కార్తీక్ చెప్తాడు. మరొకవైపు సుమిత్ర భోజనం చెయ్యకుండా దశరథ్ కోసం చూస్తుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి దశరథ్, సుమిత్ర మధ్య దూరం పెరిగేలా జ్యోత్స్న మాట్లాడుతుంటే.. వాళ్లకి ఇంకా కోపం పెరిగేలా మాట్లాడకు జ్యోత్స్న అని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు శ్రీధర్ నిద్రపోకుండా ఆలోచిస్తాడు. ఏమైందని కావేరి అంటుంది. కార్తీక్ డ్రైవర్ గా ఉండడం నాకు ఇష్టం లేదు వాడికోసం ఏదైనా చెయ్యాలని శ్రీధర్ అంటాడు. మరుసటిరోజు శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వెళ్తాడు. జ్యోత్స్నతో మాట్లాడుతాడు. అగ్రిమెంట్ క్యాన్సల్ చెయ్ అగ్రిమెంట్ రద్దు చేస్తే పది కోట్లు ఇవ్వాలి కదా.. ఇదిగో పది కోట్లు చెక్ అనగానే అందరు షాక్ అవుతారు. తన కొడుకు కోసం తను అడగడంలో న్యాయం ఉందని శివన్నారాయణ అంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. మీ నాన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యమని పది కోట్ల చెక్ ఇచ్చాడు. నువ్వేమంటావని కార్తీక్ ని దశరథ్ అడుగుతాడు. నీ నిర్ణయం ఫైనల్ బావ అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

రిపోర్ట్స్ చూసి కావ్య షాక్.. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా రాజ్ ఆపగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -840 లో....అసలు ఈ జ్యూస్ ఎందుకు మార్చారు.. ఇది ఇవ్వకుండా అది ఎందుకు ఇచ్చారని కావ్య అనుకుంటుంది. తన ఫ్రెండ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ కి కాల్ చేసి ఆ జ్యూస్ పార్సెల్ పంపిస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే కావ్యకి ల్యాబ్ టెక్నీషియన్ ఫోన్ చేసి ఆ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపారని చెప్తాడు. అది విని కావ్య షాక్ అవుతుంది. మరి ఆ జ్యూస్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజ్ చేసుకున్నాడు. అసలు డాక్టర్ ని కలిస్తే అసలు విషయం తెలుస్తుందని కావ్య అనుకుంటుంది. రేపు రాజ్ ని బయటకు పంపించండి.. అయన ఉంటే నేను అసలు విషయం ఏంటని కనుక్కోవడానికి వీలు ఉండదని ఇందిరాదేవితో కావ్య అంటుంది. దానికి ఇందిరాదేవి సరే అంటుంది.  నాకు మోకాళ్ళ నొప్పులకు తైలం తీసుకొని రా అని రాజ్ ని ఇందిరాదేవి బయటకు పంపిస్తుంది. రాహుల్ మారిపోయాడని రాహుల్, రుద్రాణి కలిసి స్వప్నని నమ్మించే ప్రయత్నం చేస్తారు  మరొకవైపు కావ్య హాస్పిటల్  విషయం కళ్యాణ్ కి తెలిసి రాజ్ కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ కి రాజ్ ఫోన్ చేసి కావ్యకి నిజం చెప్పకండి అని అంటాడు. చెప్తాను.. ఇప్పటికే లేట్ అయిందని డాక్టర్ చెప్తుంది. నర్సు కావ్యని చూసి రాజ్ కి ఫోన్ చెసి చెప్తుంది. కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆపమని నర్సుకి రాజ్ చెప్తాడు. దాంతో కావ్యని నర్సు లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ని నిజం చెప్పమని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

చంద్రబోస్‌తో హైపర్ ఆది గొడవ... ఎక్కి ఎక్కి ఏడ్చిన రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో హోస్ట్ రష్మీ ఎప్పుడూ లేనంతగా ఏడ్చేసింది. చంద్రబోస్ ఒక పాట పాడి ఆమెను ఏడిపించారు. ఈ షోకి "బాడ్ గర్ల్స్" మూవీ టీమ్ నుంచి గీత రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ వచ్చారు. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఫుల్ జోష్ తో సాగింది. రష్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది కానీ ప్రోమో లాస్ట్ లో ఐతే రష్మీ అదే పనిగా ఏడుస్తూనే ఉంది. జీవితంలో ఒక్క మనిషైనా మన కోసం ఉంటె ఆ ఆనందమే వేరు. అది అమ్మాయైనా , అబ్బాయైనా...ఇక్కడ రష్మీ బాధ కూడా అదే. ప్రోమో చివరిలో అనూప్ రూపెన్స్ గిటార్ ప్లే చేస్తుంటే చంద్రబోస్ ఒక సాంగ్ పాడారు. "ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే..కన్నీళ్లను అడుగుతానే నవ్వుల్లోనే రావాలని...దూరాన్నీ అడుగుతానే ఏడడుగులతో ఆగాలని...మరణాన్నే అడుగుతానే ఇద్దరికీ ఒకేసారి రావాలని" అంటూ ఒక హార్ట్ టచ్చింగ్ సాంగ్ ని పాడారు. ఆ పాట పట్టినంత సేపు రష్మీ ఏడుస్తూనే ఉంది. "నిజంగా మీ పాట విన్న తర్వాత మనస్ఫూర్తిగా ఇలాంటి ఒక అబ్బాయి దొరికితే మాత్రం అదృష్టమే అనుకోవాలి." అంటూ చెప్పి మళ్ళీ ఏడ్చింది. దాంతో చంద్రబోస్ కూడా పాపం చాలా ఫీలయ్యారు రష్మీ మాటలకు. ఇక ఆ పాట పాడే టైములో ఆది వెళ్లి చంద్రబోస్ కాళ్ళు మొక్కాడు. బుల్లితెర మీద రష్మీ - సుధీర్ జోడి చేసిన మ్యాజిక్ గురించి అందరికీ తెలుసు. చాలా షోస్ లో వీళ్లకు పెళ్లి కూడా చేసేసారు. రియల్ లైఫ్ లో కూడా ఇద్దరికీ పెళ్ళైపోతుంది అని అంతా ఎదురు చూసారు. కానీ ఇద్దరూ వేరైపోయారు. సుధీర్ ఛానెల్ చేంజ్ ఐపోయాడు అలాగే మూవీస్ లో నటిస్తున్నాడు. ఏ షోలో సుధీర్ టాపిక్ వచ్చిన రష్మీ రియాక్షన్ కొంచెం డల్ గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చంద్రబోస్ సాంగ్ కి కూడా రష్మీ ఏడ్చేసింది.

వీడు వేస్ట్..వీడికి డాన్స్ రాదు ఏమీ రాదు...

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి... సెలెబ్రిటీ టాక్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం డాన్స్ మాష్టర్ ప్రభుదేవాతో చిట్ చాట్ చేశారు జగ్గు భాయ్. "మీ బ్రదర్ రాజు సుందరం నాతో ఫస్ట్ సాంగ్ చేసాడు. ఒక గంట రెండు గంటలు చూసాడు నా డాన్స్ ని. వీడు వేస్ట్..వీడికి డాన్స్ రాదు ఏమీ రాదు మ్యూజిక్ లేదు ఈ బాడీలో నేను చేయను అన్నాడు. అచ్చంగా ఇలాగే చెప్పాడు. అప్పుడు ఊరుకుని సాయంత్రం క్లాస్ పీకా. నువ్వు మాష్టర్ వి. నేర్పే బాధ్యత నీది. నాకు రాలేదు అంటే వచ్చే వరకు నువ్వు ట్రై చెయ్యి నేను చేస్తాను అని చెప్పి అప్పటి నుంచి నేను అతను మంచి ఫ్రెండ్స్ ఐపోయాం. సరే నువ్వు చెప్పు నాకు డాన్స్ వస్తుందా రాదా" అని జగపతి బాబు ప్రభుదేవాకి అడిగారు. "అలా అని కాదు. ఎనీ బాడీ కెన్ డాన్స్" అని చెప్పాడు ప్రభుదేవా. ఇక చిరంజీవితో ఫస్ట్ సాంగ్ గురించి చెప్పుకొచ్చారు ప్రభుదేవా.."అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీలో మెరుపులా సాంగ్ కి కంపోజ్ చేసాను. అప్పటికి నా వయసు 14 , 15 స్కూల్ వెళ్తూ ఉన్నాను. అప్పటికి అంత సీరియస్ నెస్ తెలీదు నాకు. మా నాన్న దగ్గర అసిస్టెంట్ గా చేసేవాడిని. నేను స్టెప్స్ చూపించేసి వెళ్లి నాన్న ఒళ్ళో కూర్చునేవాడిని. ఒకసారి నేను ఆడుతున్నాను. ఆయన కూడా డాన్స్ చేసేస్తున్నారు. బాహాయంకరంగా ఆడుతున్నారే అనుకున్నా. ఆ తర్వాత ఆయన వీడియోస్ అన్నీ చూసాను. ఆయనకు మంచి డాన్సర్ అప్పటికే. నేను చిరు సర్ వల్లనే అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాను. ఆయనకు చిన్నా, పెద్ద అన్న తేడా ఉండదు. అలాగే చాల హార్డ్ వర్క్ చేస్తారు. ఇలా చెప్పగానే అలా పట్టేస్తారు. అబ్బని తియ్యని దెబ్బ సాంగ్ ని నాన్న కంపోజ్ చేశారు. నేను అసిస్టెంట్ గా ఉన్న. ఒక రోజు నన్ను కొన్ని స్టెప్స్ వదిలేసి వెళ్లారు. దాన్ని నేను పూర్తి చేసాను. అది డ్యూయెట్ సాంగ్. అది చేయడం ఎలానో నాకు అప్పటికి తెలీదు." అని చెప్పారు. "నిజానికి నేను విన్నది ఏంటంటే ఆ సాంగ్ ని వద్దు అనుకుని మళ్ళీ దాన్ని పెట్టారని తెలుసు. కానీ తర్వాత ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది" అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు. "ఐతే ఆ విషయం నాకు తెలీదు. అది హిట్ అవుతుందని డైరెక్టర్ సర్ కి తెలుసో ఏమో అందుకే సాంగ్ ని మళ్ళీ పెట్టారు" అని ప్రభుదేవా చెప్పారు. "నీది చాలా చిన్న వయసు కాబట్టి అప్పటికి నీకు శ్రీదేవి గారి అందం కూడా తెలిసి ఉండదు కదా" అని జగ్గు భాయ్ అనేసరికి "లేదు తెలీదు..నేను నా లోకంలో అలా ఉండేవాడిని " అని చెప్పారు ప్రభుదేవా.

Bigg boss 9 Telugu: దిగజారిన మాస్క్ మ్యాన్ హరీష్..... ఈ వారం కూడా చివాట్లు తప్పేలా లేవు!

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హరీష్ ని సుమన్ శెట్టి టీమ్ అయిన రాము నామినేషన్ చేస్తాడు. రాము చెప్పినారు రీజన్ ఏంటంటే. మొన్న సంజన గారు హౌస్ నుండి వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వస్తారు. అక్కడ మీ గురించి ఏదో హైజినీక్ గా లేరని అన్నారు. అది ఆమె పర్సనల్ ఒపీనియన్ కానీ మీరు ఆ తర్వాత తనూజ గారు వచ్చి.. టీ చేసి ఇవ్వండి అంటే నేను చెయ్యను హైజీనిక్ గా లేనని అంటున్నారని రాము చెప్పాడు. అలా మీరు అనడం కరెక్ట్ కాదు ఫుడ్ మానిటర్ గా ఓనర్స్ ఏం చెప్తే అది చెయ్యాలి మీ బాధ్యత అని రాము అంటాడు. నేను అన్నాను.. అలా సంజన అన్నప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ గా మాట్లాడారా.. ఇప్పుడు వచ్చి నంగనాచి తుంగ బుర్రలాగా వచ్చి మాట్లాడుతున్నారని హరీష్ అంటాడు. నేను వంట చేసినప్పుడు యమ్మీ అంటూ తిని అలా మాట్లాడతాడు.. ఇక రాము ఒక్కొక్క పాయింట్స్ చెప్తుంటే.. నువ్వు మెల్లిగా డ్యాన్స్ చెప్పు.. నువ్వు కామ పెడుతూ చెప్తావ్.. నేను అలాగ ఉండను.. చెప్తే ఫుల్ స్టాపే అని రాము గురించి హరీష్ వెటకారంగా మాట్లాడతాడు. ఇక హరీష్ మాటలకి మధ్యలో తనూజ కలుగజేసుకుంటుంది ఇద్దరికి మాట మాట పెరిగి గొడవ అవుతుంది. గత మూడు వారాలుగా హరీష్ కి నాగార్జున క్లాస్ తీసుకుంటున్నాడు. కానీ అయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు.. తన మాటలకి అడ్డుఅదుపు లేకుండాపోయింది. ఈ వారం కూడా వీకెండ్ లో నాగార్జునతో చీవాట్లు తప్పేలా లేవు.

Bigg boss 9 Telugu : మూడు టీమ్ ల మధ్య రోల్ ది డైస్.. నామినేషన్లో ఉందెవరు!

  బిగ్ బాస్ సీజన్-9 అప్పుడే నాలుగో వారానికి వచ్చేసింది. నాలుగో వారానికి సంబంధించినది నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతుంది. ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. సుమన్ శెట్టి, భరణి, తనూజ, పవన్ కళ్యాణ్.. నలుగురిని టీమ్ లీడర్స్ గా బిగ్ బాస్ సెలక్ట్ చేస్తాడు. ఒక్కో టీమ్ కి ముగ్గురు సభ్యులు లు ఉంటారు. సుమన్, రాము, ఫ్లోరా ముగ్గురు ఎల్లో టీమ్.. తనూజ, రీతూ, దివ్య బ్లూ టీమ్.. హరీష్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ రెడ్ టీమ్, భరణి, సంజన శ్రీజ గ్రీన్ టీమ్ గా ఉన్నారు. సంఛాలక్ గా డీమాన్ పవన్ ఉన్నాడు. టాస్క్ లో గెలిచిన వారికి నామినేషన్ చేసే ఛాన్స్ వస్తుంది. బిగ్ బాస్ ఆదేశానుసరం బజర్ వస్తుంది. అప్పుడు డీమాన్ పవన్ డైస్ రోల్ చేస్తాడు. మొదటగా తనూజకి ఛాన్స్ వస్తుంది. తను సుమన్ శెట్టి టీమ్ ని టాస్క్ ఆడడానికి సెలక్ట్ చేసుకుంటుంది. కానీ ఆ టాస్క్ సుమన్ శెట్టి టీమ్ గెలిచి. తనూజ టీమ్ లోని రీతూని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత భరణికి ఛాన్స్ రాగా.. అతను కూడా ఎల్లో టీమ్ అయినా సుమన్ ని సెలక్ట్ చేసుకుంటాడు అందులో భరణి గెలుస్తాడు .ఆ టీమ్ ఎల్లో టీమ్ లోని ఫ్లోరాని నామినేట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ భరణికి ఛాన్స్ రాగా.. సుమన్ శెట్టి టీమ్ ని సెలక్ట్ చేసుకుంటాడు. తర్వాత సుమన్ శెట్టి టీమ్ గెలవగా సంజనని నామినేషన్ చేస్తారు. ఆ తర్వాత తనూజ టీమ్ కి ఛాన్స్ రాగా గ్రీన్ టీమ్ లోని శ్రీజని నామినేషన్ చేస్తారు.ఆ తర్వాత  సుమన్ శెట్టి టీమ్ ఎల్లో  టీమ్ కి ఛాన్స్ వస్తుంది. దాంతో హరీష్ ని నామినేషన్ చేస్తారు. ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు ఎవరు నామినేషన్ లో ఉన్నారని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam Serial: ఆల్బమ్ చూసి గంగని తిట్టిన రుద్ర.. సాయం చేస్తాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-71 లో... వీరు రౌడీలతో మాట్లాడతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి.. ఆ రుద్ర మిమ్మల్ని ఫాలో అవుతాడని చెప్తాడు. సరే సర్ మీ తమ్ముడిని అక్కడ నుండి తీసుకొని వెళదామా అని రౌడీలు అడుగుతారు. లేదు ఇప్పుడు తమ్ముడు దగ్గరికి ఎవరు వస్తున్నారు ఏంటని రుద్ర కనిపెడుతుంటాడని వీరు అంటాడు.   మరొకవైపు రుద్ర, సూర్యకి ఫోన్ చేసి హాస్పిటల్ కి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. లేదని సూర్య అంటాడు. ఆ తర్వాత రుద్ర జ్ఞాపకాల తాలూకు ఫోటో ఆల్బమ్ ని గంగ బయటకు తీస్తుంది. ఓపెన్ చేసి చూస్తుంటే స్నేహ వచ్చి ఇది ఎవరి ఆల్బమ్ అని ఆటపట్టిస్తుంది. ఆల్బమ్ ని తీసుకొని బయటకు వచ్చి పెద్దసారుకి చెప్తుంది‌. వంశీ, సూర్య స్నేహ అందరు కలిసి ఆల్బమ్ తో ఆడుతూ గంగని ఆటపట్టిస్తారు. అది నాది కాదు రుద్ర సర్ ది అని గంగ అంటున్నా వాళ్ళు వినిపించుకోరు.. ఆల్బమ్ కిందపడుతుంది.   ఆ తర్వాత రుద్ర వచ్చి ఆల్బమ్ చూసి తన మాజీ లవర్ ని గుర్తు చేసుకుంటాడు. ఎందుకు ఈ ఆల్బమ్ బయటకు తీశారని గంగపై కోప్పడతాడు. ఆ తర్వాత రుద్ర గంగకి ఫోన్ చేస్తాడు. నిన్న ఫోన్ చేశారు ఎవరు అని అడుగుతాడు. చిట్టి ఫ్రెండ్ ని నాకూ హెల్ప్ చెయ్యమని చెప్పింది కదా అని అంటుంది. అవునని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Illu Illalu Pillalu: శ్రీవల్లిని ఇరికించిన ప్రేమ.. యాక్టింగ్ తో కవర్ చేసుకుందిగా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -277 లో... అసలు నా అకౌంట్ లో డబ్బు ఎందుకు తీసావ్, అంత అవసరం ఏం వచ్చిందని ధీరజ్ ని రామరాజు కొట్టబోతుంటే రామరాజు చేయి పట్టుకుంటుంది ప్రేమ. దాంతో అందరు షాక్ అవుతారు. మావయ్య గారి చేయి పట్టుకుంటున్నావ్ ఏంటి? నీకు మావయ్య గారంటే గౌరవం లేదా? అని ప్రేమని శ్రీవల్లి తిడుతుంది. మీ ఆయన జల్సా కోసం అలా ఖర్చు చేస్తుంటే.. అడిగితే తప్పా అని ప్రేమతో శ్రీవల్లి అంటుంది. అసలు మా ఆయన డబ్బు తీసింది మీ ఆయన కోసమే అని ప్రేమ అనగానే అందరు షాక్ అవుతారు.    చందుకి రామరాజు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు. ధీరజ్ నీకు లక్ష రూపాయలు ఇచ్చాడా అని అడుగుతాడు ఇచ్చాడని చందు చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. మీకు తెలియకుండా పెద్ద తప్పు చేశాను నాన్న.. నేను వల్లి వాళ్ళ కుటుంబానికి డబ్బు ఇచ్చానని జరిగింది మొత్తం చెప్పబోతుంటే అంతలో శ్రీవల్లి అడ్డుపడి లక్ష రూపాయలు ఇచ్చాడని అంటుంది. మరి నీకు ఇదంతా తెల్సినప్పుడు మా అయనని దొంగ అంటూ మాట్లాడుతున్నావని శ్రీవల్లిపై ప్రేమ గొడవకి దిగుతుంది. మీరందరు ఒకటి.. నేను ఒకటి అని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంటే సమాధానం చెప్పకుండా అలా అంటున్నావని నర్మద అంటుంది. ఇద్దరు ఒకటై నన్ను ఇలా చేస్తున్నారని శ్రీవల్లి అంటుంది. అలా తోడికోడల్లు గొడవ పడుతుంటే రామరాజు కోప్పడతాడు.. అందరిని లోపలికి వెళ్ళమంటాడు.   నాన్న దగ్గర నుండి ఎందుకు తీసావ్ రా అని ధీరజ్ ని చందు అడుగగా అంతకు మించి మార్గం కన్పించలేదని ధీరజ్ అంటాడు. చందు, ధీరజ్, సాగర్ హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతారు. మరొకవైపు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది.. కోడళ్ళకి నువ్వు అంటే భయం ఉందా.. ఎలా గొడవ పడుతున్నారని వేదవతితో రామరాజు అంటాడు. వాళ్ళకి నేనంటే భయం ఉందని వేదవతి అంటుంది. తరువాయి భాగంలో ఎందుకు మా అన్నయ్యకి డబ్బు ఇచ్చానని  మా నాన్నకి చెప్పావని ప్రేమతో ధీరజ్ గొడవపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Karthika Deepam 2: దీపకి భోజనం పెట్టిన సుమిత్ర.. కార్తీక్ హ్యాపీ.. జ్యోత్స్నకు బీపీ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -476 లో... దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో సుమిత్ర వచ్చి లేపుతుంది. ప్రొద్దున నుండి భోజనం చెయ్యలేదట అని భోజనం తీసుకొని వస్తుంది. నాకు మానవత్వం ఉంది కాబట్టే భోజనం తీసుకొని వచ్చాను కానీ, నీకు తినిపించేంత ప్రేమ లేదు నువ్వే తినమని సుమిత్ర అంటుంది.    దీప భోజనం తినడం స్టార్ట్ చేస్తుంది. ఇక సుమిత్ర తన మాటలతో బాధపెడుతుంది. పెరుగు అన్నం వేసుకోమని తీసుకొని వస్తుంది. అందులో ఉప్పు వెయ్యలేదు. ఉప్పు తిన్న విశ్వాసం ఇప్పటివరకు చూపించింది చాలని సుమిత్ర అంటుంది. సుమిత్ర మాటలకి దీప ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్ వాళ్ళు వస్తారు. దీపకి సుమిత్ర ప్రేమతో భోజనం పెట్టిందనుకుంటారు. వాళ్ళు రాగానే నాకు మానవత్వం ఉంది కాబట్టి భోజనం పెట్టానని సుమిత్ర చెప్పి వెళ్ళిపోతుంది. మీ అమ్మ ప్రేమతో భోజనం పెట్టిందని దీపతో కార్తీక్ అంటాడు. మరొకవైపు ఈ రోజు భోజనం పెట్టింది.. రేపు కలిసిపోతారని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. పారిజాతం కోపంగా మాట్లాడుతుంటే.. గ్రానీ నేను చేసింది తప్పు.. నీ మాటలతో చంపకు అని జ్యోత్స్న అంటుంది. ఇప్పటికైనా నేనంటే ఏంటో తెలిసిందని పారిజాతం అంటుంది.    మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ సరుకులు తీసుకొని వస్తాడు. వద్దని కాంచన అంటుంది. కొంత డబ్బు కాంచనకు శ్రీధర్ ఇచ్చి అవసరం ఉన్నప్పుడు వాడుకోండి దయచేసి వద్దనకు.. కార్తీక్ కి చెప్పకని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే కార్తీక్ వాళ్ళు వస్తారు. కాంచన డబ్బు దాస్తుంది. థాంక్స్ కాంచన అని శ్రీధర్ అంటాడు. ఈ సరుకులు ఎవరు తీసుకొని వచ్చారని కార్తీక్ అడుగగా.. మీ నాన్న అని అనసూయ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: చివరి నిమిషంలో ట్యాబ్లెట్ ఇవ్వకుండా ఆగిపోయిన రాజ్.. కావ్యకి డౌట్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -839 లో... రాజ్ మనసులో ఏముందో, అసలు బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నాడో కనుక్కుందామని ఇందిరాదేవితో కావ్య అంటుంది. అప్పుడే రాజ్ వస్తాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆయనకి ఏమైంది.. ఈ ఫోటోస్ చూసి కోప్పడుతాడనుకున్న, రెచ్చగొట్టి అసలు విషయం ఏంటో కనుక్కుందామనుకున్న.. కానీ సైలెంట్ గా ఉన్నారు. వేరే రూట్ లో ప్రయత్నం చెయ్యాలని కావ్య అనుకుంటుంది.   ఆ తర్వాత పనిమనిషి కావ్య కోసం జ్యూస్ చేస్తుంటే.. రాజ్ వచ్చి నేను చేస్తానని చేస్తాడు. రాజ్ జ్యూస్ చేసి అందులో అబార్షన్ టాబ్లెట్స్ కలుపుతాడు. ఆ జ్యూస్ కావ్య దగ్గరికి వెళ్లి ఇస్తాడు. నా కడుపులో ఉన్న బిడ్డ వద్దట కానీ, నా కోసం జ్యూస్ తీసుకొని వచ్చాడని కావ్య అంటుంది. మరొకవైపు అన్నయ్య చేస్తుంది తప్పు అని కళ్యాణ్ అనుకుంటాడు. కావ్య జ్యూస్ తాగుకుండా ఆపడానికి కళ్యాణ్ వస్తాడు. ఆ లోపే కావ్య జ్యూస్ తాగుతుంది.   ఆ తర్వాత రాజ్ ని కళ్యాణ్ పక్కకి తీసుకొని వెళ్లి ఎందుకు అన్నయ్య క్రూరంగా బిహేవ్ చేస్తున్నావని అనగానే.. లేదురా చివరి నిమిషంలో అబార్షన్ కోసం ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ ఇవ్వలేదని రాజ్ అంటాడు. రాజ్ జ్యూస్ మార్చి తీసుకొని వెళ్ళింది గుర్తు చేసుకుంటాడు. మంచి పని చేసావని రాజ్ ని కళ్యాణ్ హగ్ చేసుకుంటాడు.    తరువాయి భాగంలో కిచెన్ దగ్గర రాజ్ జ్యూస్ మార్చడం కావ్య చూస్తుంది. ఆ జ్యూస్ ని టెస్ట్ కోసం పంపిస్తుంది. ఆ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపారని డాక్టర్ చెప్తాడు. నా బిడ్డ వద్దనుకున్నప్పుడు ఆ జ్యూస్ ఎందుకు ఇవ్వలేదని కావ్య అనుకుంటుంది. అసలు ఎందుకు ఇలా అంటున్నాడో డాక్టర్ కి తెలిసే ఛాన్స్ ఉందని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

మీ చున్నీ ముట్టుకున్నానంటే ఆగమైపోతారు బిడ్డా.. సిద్ధు స్వీట్ వార్నింగ్!

  సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి 'తెలుసు కదా'(Telusu Kada) మూవీ టీమ్ నుంచి సిద్ధు జొన్నలగడ్డ, వైవా హర్ష, రాశి ఖన్నా వచ్చారు. ఇక షో లింక్ ని సిద్దు చెప్పాడు. "వెల్కమ్ టు సుమ అడ్డా.. సిద్ధు జొన్నలగడ్డ" అనేసరికి సుమా పడీపడీ నవ్వేసింది. సుమ అందరికీ పులిహోర ఇచ్చింది. "మొన్న ఒక షోకి వెళ్తే అక్కడ పాత పులిహోర పెట్టారు" అంటూ సిద్దు ఫీలయ్యాడు. "ఇది ఫ్రెష్ జున్ను మా గేదె నిన్ననే ఈనింది. తీసుకో బాబు" అంటూ హర్షకి ఇచ్చింది సుమ. "గేదె నిన్న ఈనితే అప్పుడే జున్ను ఎలా ఐపోయిందండి అంటూ కామెడీ చేసాడు హర్ష.    "మీరు రాశి గురించి అరె ఇది తెలుసు కదా అనే విషయం చెప్పండి" అంటూ సిద్ధుని అడిగింది సుమ. "రాశి ఒక స్ట్రిక్ట్ అమ్మాయి. ఇందాక కూడా ఫోన్ చేసి సిద్దు నేను 45 మినిట్స్ నుంచి ఇక్కడ ఉన్నాను" అంటూ అమ్రిష్ పురి వాయిస్ లో చెప్పాడు. దాంతో సుమ "నాకు తెలీలేదు అమ్రిష్ పురి గారు మీకేమవుతారు" అని సరదాగా అడిగింది. "రాశి ఖన్నా అందం రహస్యం ఏమిటి" అని అదిగింది సుమ. "నిద్ర పోవడమే" అని చెప్పింది రాశి. "షూటింగ్ చేసే టైములో కూడా నిద్రపోతుంది" అంటూ సిద్దు ఆమె పరువు తీసేసాడు.    "మేడం వైవా హర్షకు, నాకు పదేళ్ల ఫ్రెండ్ షిప్ ఉంది. వాడంత దొంగ నాకొడుకు లేడు" అన్నాడు సిద్దు. "ఇదేంటి నేను ఫీలైనా నువ్వు ఆడడం మానేస్తావేంటి" అంటూ హర్షా అడిగాడు. "నా వలన ప్రాబ్లమ్ ఐతే వెళ్ళిపోతా మావా నేను" అంటూ సిద్దు ఆటపట్టించాడు. "రాశి వాళ్ళ పిఆర్ టీమ్ ఎం చెప్పింది అంటే అక్కడ ఎం జరుగుతున్నా నువ్వు నవ్వుతూనే ఉండు. అందుకే రాశి అలా నవ్వుతూనే ఉంది " అంటూ రాశి మీద సెటైర్స్ వేసాడు సిద్దు. "ఈ బాంబే వాళ్ళు అలాగే చెప్తారు. అన్నిటికీ నవ్వితే పిచ్చి అనుకుంటారు జనాలు" అన్నాడు సిద్దు.    ఫైనల్ లో కాయ్ రాజా కాయ్ గేమ్ ఆడించింది సుమ. అందులో సిద్దు షర్ట్ పట్టుకుని రాశి లాగుతూ ఉంటుంది. ఆమె మీద అరుస్తాడు సిద్దు. ఇంతలో వైవా హర్ష పక్కన మరో నటి "సచ్ ఏ బాయ్" అంది. ఆ డైలాగ్ కి సిద్దు "సచ్ ఏ బాయ్ ఆ.. మీ దగ్గరకు వచ్చి చున్నీ ముట్టుకున్నానంటే ఆగమైపోతారు బిడ్డా" అంటూ భయపెట్టేసాడు.  

Bigg Boss 9: నాలుగో వారం ఇమ్యూనిటీ పొందిన కంటెస్టెంట్ ఎవరంటే..?

  బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. ‌ఇక నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి కానీ, దానికి ముందు ఇమ్మ్యూనిటీ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన వారికి ఇమ్యూనిటీ లభించి నామినేషన్ ప్రక్రియ నుండి సేవ్ అవుతారు.   నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ 'ఇమ్యూనిటీ స్టార్స్'.. హౌస్ లో మొత్తంగా 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిని ఆరుగురు చొప్పున రెండు టీములుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇక డీమాన్ కెప్టెన్ కావడంతో సంచాలక్‌గా వ్యవహరించాడు. మీవైపు ఉన్న మొత్తం స్క్వేర్ బ్లాక్స్‌ని పూర్తిగా పగలగొట్టి.. అక్కడ ఉన్న మూడు స్టార్స్‌లో ఒకసారి ఒకదాన్ని మాత్రమే తీసుకొని కిందకి వచ్చి టీమ్ బాస్కెట్లో పెట్టాలి. ఇక మొదటి రౌండ్‌లో సుమన్ శెట్టి-దివ్య ఒక టీమ్, ఇమ్మాన్యుయల్ -సంజన‌లు ఒక టీమ్ గా ఆడారు. వీళ్లిద్దరి మధ్య టాస్క్ హోరాహోరీగా సాగింది. అయితే వీళ్లలో దివ్య-సుమన్ శెట్టి విజయం సాధించారు. ఆ తర్వాత తనూజ-భరణి, హరీష్-ఫ్లోరా మధ్య టాస్క్ జరిగింది. అయితే వీళ్లు బాక్సులు పగలగొట్టకుండానే స్టార్స్ తీసేశారు. దీంతో రూల్ ప్రకారం ఇద్దరూ ఫౌల్ చేశారు కాబట్టి, నో విన్నర్ బిగ్‌బాస్ అంటూ డీమాన్ షాకిచ్చాడు.   బిగ్‌బాస్ ఇచ్చిన రెండో లెవల్ టాస్క్.. 'వారధి కట్టు.. ఇమ్యూనిటీ పట్టు.' ఈ టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ చేయాల్సిందల్లా మీకు కేటాయించిన బ్రిడ్జెస్‌కి ఉపయోగపడే ప్లాంక్స్ మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఉంటాయి.. వాటిని పొందడానికి పోటీదారులు ఆ ఇంటి సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. టాస్కులో తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య పోటీపడ్డారు. ముందుగా భరణి ఆ ప్లాంక్స్ పట్టుకొని వీళ్ల ముందు నిల్చున్నాడు. నేను కరెక్ట్ గా జడ్జ్ చేయలేకపోవడం వల్ల, నేను చేసిన మిస్టేక్స్ వల్ల.. ఇందాక ఫస్ట్ గేమ్‌లో నాతో పాటు తనూజ కూడా ఎఫెక్ట్ అయింది.. ఆ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి ఈ రెండూ నేను తనూజకి ఇవ్వాలనుకుంటున్నానని భరణి అన్నాడు. ఇంతలో ఒక్కటే ఇవ్వాలంటూ మిగిలిన కంటెస్టెంట్స్ రూల్స్ మాట్లాడారు.    తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చి సుమన్ శెట్టిని సపోర్ట్ చేశాడు. ఈ గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫర్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపించిందని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. దీంతో కింద నేను అంత కొట్టాను కాబట్టి, ఆయన పైన అలా కొట్టగలిగారు కదా.. నేను చెప్పిన స్ట్రాటజీ అది.. అంటూ దివ్య అంది. పైకి వెళ్తానన్నది నేను.. అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. మరి ఈ వారం టాస్క్ లు గెలిచి ఫైనల్ గా ఇమ్యూనిటీ పొందిన వారెవరో తెలియాలంటే మరో రోజు ఎదురుచూడాల్సిందే.  

Jayam Serial: రుద్ర ప్లాన్ కనిపెట్టేసిన వీరు‌‌.. భళే తప్పించుకున్నాడుగా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -70 లో.. హాస్పిటల్ ఉన్న వీరు తమ్ముడిని ఓ సీసీటీవీ ఏర్పాటు చేసి రుద్ర గమనిస్తుంటాడు. అయితే వాళ్ళ తమ్ముడిని రుద్ర కొడతాడు. ఆ విషయం వీరుకి రౌడీలు ఫోన్ చేసి చెప్తారు. అతను కోమాలో నుండి బయటకి రావచ్చని డాక్టర్ ఆ రౌడీలకి చెప్తాడు. తమ్ముడు కోమాలో నుండి బయటకి వస్తాడంట, డాక్టర్ నిన్ను రమ్మన్నారని వీరూతో రౌడీలు చెప్పగానే అతను బయల్దేరి వస్తాడు.    మరోవైపు పెద్దసారుని స్టోర్ రూమ్ తాళం అడిగి తీసుకుంటుంది గంగ. అందులో బూజు కర్ర ఉందని పెద్దసారుకి చెప్తుంది. అయితే గంగ మాత్రం రుద్ర ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని స్టోర్ రూమ్ కి వెళ్తుంది. మరోవైపు హాస్పిటల్ లో సీసీటీవీలు ఫిక్స్ చేసి రుద్ర  అసలు సూత్రధారి కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో వీరు వస్తాడు. అతడి తమ్ముడి దగ్గరున్న ఇద్దరు రౌడీలని కొడతాడు. దాంతో వాళ్ళు జరిగిందంతా చెప్తారు. నా తమ్ముడిని ఆ రుద్ర కొడతాడా.. వాడిని అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి త్వరలో మీ తమ్ముడు కోలుకుంటాడని చెప్తాడు.    ఇక గదిలో నుండి వీరు బయటకి రాగానే ఎదురుగా రుద్ర ఉంటాడు. అతడిని చూసి వీరు షాక్ అవుతాడు. ఏంటి బావ మీరు ఇక్కడ అని ఏమీ తెలియనట్లుగా రుద్రని వీరూ అడుగుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏదో కవర్ చేయాలని చూస్తాడు వీరు. నువ్వు హాస్పిటల్ కి వచ్చింది..  అ రౌడీలని కొట్టింది అంతా చూసానని రుద్ర అంటాడు. దాంతో వీరు షాక్ అవుతాడు. ఇక వీరూ ఏదో కవర్ చేస్తాడు. ఇంతలో ఒకడు బ్లాక్ డ్రెస్ వేసుకొని మాస్క్ తో వీరు తమ్ముడి గది దగ్గరికి వస్తాడు. అతడిని చూసి వాడే అసలు సూత్రధారి అనుకొని రుద్ర వెంబడిస్తాడు. కానీ వాడు తప్పించుకుంటాడు. ఇక వీరు వాడికి కాల్ చేసి, గుడ్ జాబ్ టైమ్ కి వచ్చావ్.‌. అక్కడి నుండి వెళ్ళిపో.. డబ్బులు పంపిస్తానని చెప్తాడు. హాస్పిటల్ బయట రుద్ర కార్ చూసిన వీరు.. డైవర్ట్ చేయడానికి అలా ఒక మనిషిని సెట్ చేస్తాడన్న మాట.    మరోవైపు గంగకి స్టోర్ రూమ్ లో ఓ ఫోటో ఆల్బమ్ దొరుకుతుంది. ఇక అప్పుడే రుద్ర ఇంటికి రావడంతో.. గంగ కంగారుగా ఆ ఆల్బమ్ తీసుకొని వస్తుంది. ఇంతలో రుద్రని ఢీకొడుతుంది గంగ. ఇక తనని డైవర్ట్ చేసి ఆ ఆల్బమ్ తీసుకొని వెళ్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.