‘ఫెవిస్టిక్ లా ఇనాయ ఆర్జే సూర్య వెంటపడుతూనే ఉంది’..బుజ్జిమా కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ హౌస్ లో ఆర్జే  సూర్య ఆట తీరు గురించి అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు సూర్య గర్ల్ ఫ్రెండ్ ఐన బుజ్జిమా సూర్య మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ " ముందు సూర్యకి ఈ బిగ్ బాస్ ఆఫర్ అనేది ఓటిటి ప్లాట్ ఫామ్ మీద వచ్చింది ఐతే ఇక్కడ అనుకున్నంత పేరు రాదు బిగ్ స్క్రీన్ మీద ఐతే ట్రై చేద్దాం అనుకునే టైంలో ఆ ఆఫర్ వచ్చింది అండ్ ఫైనల్లీ హౌస్ లో ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ఐతే సూర్య, ఆరోహి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే..కాకపొతే అది కొంచెం ఎక్స్ట్రీమ్ కి వెళ్లేసరికి ఆడియన్స్ కి నచ్చలేదు. టాప్ 5 ఉంటాడో , ఉండదో తెలీదు కానీ ఉంటే విన్ ఐనట్టే లెక్క కాబట్టి టాప్ 5 లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే  సూర్య ప్రత్యేకించి ఎవరినీ ఇష్టపడింది లేదు ఐతే ఆరోహి వెళ్ళిపోయాక సూర్య పైన  క్రష్ ఉంది అని ఇనాయ చెప్పింది. సూర్య ఎక్కడికి వెళ్తే తానూ అక్కడికే వెళ్ళేది. దీనికి సంబంధించి కామెంట్స్ లో కూడా చదివితే ఇనాయ ఎందుకు గేమ్ ఆడకుండా సూర్య వెనక వెళ్తున్నావ్ అని నెటిజన్స్ కూడా అడుగుతున్నారు..ఇనాయ ఫెవిస్టిక్ లాగే సూర్య  వెనకే వెళ్తుంది. నాకు తెలిసి ఇది సూర్య తప్పు కూడా కానీ..ఏమో సూర్యకి  కూడా ఇంటరెస్ట్ ఉందేమో నాకైతే తెలీదు"  అంటూ బుజ్జిమా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

'పిల్లల్ని పెంచడంలో మహిళలకు వంద గోల్డ్ మెడల్స్ ఇచ్చేయొచ్చు'

ఒక్క తల్లి వంద మంది పిల్లల్ని చూసుకోగలుగుతుంది కానీ వంద మంది పిల్లలు ఒక తల్లిని చూసుకోలేరు అనేది నానుడి. ఐతే ఇలాంటి విషయం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ పిల్లల్ని పెంచడంలో మహిళలకు వంద గోల్డ్ మెడల్స్ ఇచ్చేయొచ్చు అని ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. ఒక రిలేషన్ షిప్ లో 99 మార్కులు ఆడవాళ్ళకు 1 మార్కు మగవాళ్లకు వెయ్యాలి.  ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెపుదామనుకుంటున్న కానీ అవకాశం రాలేదు అంటూ మిస్టర్ అండ్ మిస్సెస్ వేదికపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇక ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర భార్యాభర్తలు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీవాణి- విక్రమ్ చేసిన డాన్స్ కి అందరూ ఫుల్ కుష్ అయ్యారు. ఐతే విక్రమ్ మేడలో వేసుకున్న హారం చూసిన రాకేష్ "శ్రీకృష్ణదేవరాయలు వేసుకున్న హారమా ఏంటి"  అని అడిగేసరికి అనిల్ రావిపూడి "ఏంటి రాకేష్... చేతికి వేసుకున్న ఉంగరాలు , గొలుసులు, హారాలు అవీ చూస్తావా నువ్వు " అని అడిగారు. "వయసు అలాంటి కదా సర్" అని రాకేష్ ఆన్సర్ ఇచ్చేసరికి "వయసులో ఎవరైనా ఆడవాళ్లను చూస్తారు ..నువ్వెంటి మగవాళ్ళను చూస్తావా" అంటూ శ్రీముఖి కౌంటర్ వేసింది.  తర్వాత రాకేష్ స్నేహకి ఆపిల్ పీసెస్ తినిపిస్తాడు. కానీ అనిల్ మాత్రం తనకు తినిపించొద్దు అని చెప్పేసరికి శివ బాలాజీ తినిపించబోతాడు రాకేష్ .."నువ్ నా దగ్గర హార్ట్ ఫుల్ గా మాట్లాడితే మాట్లాడు లేదంటే వెళ్ళిపో" అనేసరికి "అన్నయ్యా ఎన్నో రాత్రులు మనం కలిసి చేసాం " అని రాకేష్ కౌంటర్ వేసరికి అందరూ పడీ పడీ నవ్వేశారు.

చలాకి చంటి రెమ్యూనరేషన్ ఎంత!

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన చంటి గుర్తున్నాడా. చలాకి చంటి రెండు తెలుగు రాష్టాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ లో  ఒక ఆట ఆడుకున్న చంటి అందరికీ సుపరిచితమే. చంటి పూర్తి పేరు వినయ్ మోహన్. ఇతను 1986 జూన్ 29 న హైదరాబాద్ లో జన్మించాడు. చిన్నప్పుడే తల్లి చనిపోతే, తన అమ్మమ్మ మామయ్య ల దగ్గర పెరిగాడంట. డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్థికపరిస్థితి బాగోలేక చదువు మానేసి, ఒక చిన్న కంపెనీలో కస్టమర్ ఎక్జిక్యూటివ్ గా పని చేసాడట. ఆ తర్వాత ఒక గెస్ట్ హౌస్ మేనేజర్ గా చేసాడు. ఇంకా రేడియో జాకిగా కూడా చేసాడంట. రేడియో జాకిగా ఉన్నపుడే చలాకీ చంటి అనే పేరు వచ్చిందట. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేయగా, చంటి-బంటి ప్రోగామ్ తో మంచి గుర్తింపు వచ్చిందట. రచయితగా మరియు 2009 లో వచ్చిన జల్లు సినిమాలో నటించాడు. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టులో నటించాడు. దాదాపు పదహారు సినిమాలలో అవకాశం వచ్చి దూరం అయ్యాయట. సినిమా అవకాశాలు రాలేక,చాలా కష్టాలు అనుభవించాడట. యూట్యూబ్ లో కామెడీ స్క్రిప్ట్ తో మళ్ళీ తన సత్తా చాటడం వల్లే, అవకాశాలు రావడం స్టార్ట్  అయ్యాయట. 2013 లో  జబర్దస్త్ వాళ్ళు చంటికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి తన సక్సెస్ స్టార్ట్ అయ్యిందట. ఫేమ్ అంతా జబర్దస్త్ వల్లనే వచ్చిందని చెబుతుంటాడు చంటి. 'నా షో నా ఇష్టం' షో కి హోస్ట్ గా కూడా చేసాడు. 2016 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చంటి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంటి దాదాపు యాభై నుండి అరవై సినిమాల వరకు నటించాడట. బిగ్ బాస్ లో 5వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన చంటి, హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని ప్రేక్షకులు ఆశించినా, హౌస్ లో అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాడు. అటు  ఎంటర్టైన్మెంట్ లేక, ఇటు గేమ్ లో కూడా సరిగ్గా పర్ఫామెన్స్ లేకపోవడంతో వరెస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాడు. నాగార్జున తన ఆటతీరు మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా, ఆటలో అంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. హౌస్ లో ఎలాంటి కామెడిని పండించలేకపోయాడు. ప్రతీవారం నామినేషన్ లో ఉన్నప్పటికీ, అభిమానులు సేవ్ చేస్తూ వస్తోన్నారు. కానీ అయిదవ వారం సేవ్ చెయ్యలేకపోవడంతో,ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్నాడు. చంటి హౌస్ మేట్స్ తో నాకు హౌస్ లో ఉండాలని లేదు, బయటికి వెళ్లాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన కూడా, దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. కాగా ఓటింగ్ లో చివరి స్థానంలో ఉండడంతో అయిదవ వారం ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు. ఆ తర్వాత బయటికొచ్చాక కూడా హౌస్ మేట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. చంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "లోపల ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు, ఎక్కువగా ఫేక్ రిలేషన్స్ ఉన్నాయి. టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ చేయకపోతే ఎవరైనా బయటకొచ్చేయాల్సిందే" అని చెప్పాడు. తర్వాత రెమ్యూనరేషన్ గురించి అడుగగా, "అవన్నీ చెప్పకూడదు, చెప్పను" అని మాట దాటేసాడు. అయితే చంటికి అయిదు వారాలకి రెమ్మునెరేషన్ రోజుకి నలభై నుండి నలభై వేల వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది.

'రెమ్యూనరేషన్ పెంచమంటుంటే..కొత్త టీమ్స్ ని తీసుకొస్తాం అంటున్నారు'.

ఈ మధ్య జబర్దస్త్ లో రెమ్యూనరేషన్స్ గొడవలు బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కమెడియన్స్ డైరెక్ట్ గా చెప్పలేక స్కిట్స్ రూపంలో మేనేజర్ లకు హింట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రాకెట్ రాఘవ కూడా అలాగే చేసాడు. రీసెంట్ గా రిలీజ్ ఐన జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. రాబోయే వారం రాకెట్ రాఘవ క్యూట్ లేడీ గెటప్ లో టెన్నిస్ ప్లేయర్ గా పాప అనే పేరుతో రాఘవ స్కిట్ చేయబోతున్నాడు.  టెన్నిస్ ప్రత్యర్థిగా బరిలోకి దిగి రాకెట్ పట్టుకుని  స్టేజ్ పై ఆడనా, వద్దా అన్నట్టుగా కామెడీ చేసేసరికి ఆపోజిట్ టీమ్ నుంచి  నాగి వచ్చి “రేయ్ నేను ఇంతలా ఎగురుతుంటే...ఇదేంటి ఇది ఇంత కూడా ఎగరట్లేదేంటిరా ?” అనేసరికి  దానికి రాఘవ..”ఎగిరెగిరి దంచినా అదే కూలీ.. ఎగరకుండా దంచినా అదే కూలీ” అంటూ పంచ్ డైలాగ్ వేసాడు.. దాంతో నాగి వచ్చి "అందుకే మరి మేనేజర్ దగ్గరికి వెళ్లి మాట్లాడమంటున్నాను అనే సరికి ఆ..నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడల్లా  కొత్త టీమ్ లను తీసుకొస్తాం" అని బెదిరిస్తున్నారంటూ రాఘవ ఒక రేంజ్ ఫీలింగ్స్ తో చెప్పేసరికి నాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాకెట్ రాఘవ జబర్దస్త్ మొదలైన దగ్గర నుంచి ఇందులోనే ఉన్నాడు. ఐతే ఈమధ్య రెమ్యూనరేషన్స్ కి సంబంధించి చాలామంది స్కిట్స్ చేస్తున్నారు.. ఇంటర్వూస్ లో కూడా  చెప్తున్నారు. ఇప్పుడు రాఘవ కూడా అలాంటి స్కిట్ చేసేసరికి రెమ్యూనరేషన్ పెంచడం లేదు అనే విషయం నిజమేనేమో అనిపిస్తోంది.

విశాఖ గర్జనకు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు మ‌ద్ద‌తు!

ఏపీలో కాపిటల్ ఇష్యూ ఇప్పటికీ  హీట్ పుట్టించే అంశమే. అమ‌రావ‌తి రైతులు మహాపాదయాత్ర చేసేసరికి ప్రభుత్వం రాజ‌కీయ ల‌బ్ది ల‌క్ష్యంగా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అక్టోబర్‌ 15న "విశాఖ గర్జన"కు పిలుపునిచ్చింది.  ఈ కార్యక్రమానికి  జబర్దస్త్  ఫేమ్‌ అప్పారావు  విశాఖ గర్జనకు మద్దతు ఇస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు. విశాఖపట్నం కళాకారుడిగా ‘మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ గర్జనను విజయవంతంగా చేయాలని.. ‘‘మన విశాఖను రాజధానిగా మార్చే ప్రక్రియలో ప్రజలంతా మద్దతు  ఇవ్వాల"ని కోరారు. తాను అక్టోబర్‌ 15న విశాఖకు వస్తున్నట్లు చెప్పారు. "ఐ సపోర్ట్  ‘మన విశాఖ-మన రాజధాని’" అన్నారు. జబర్దస్త్ అప్పారావుకు పాలిటిక్స్ తో పని ఏంటి అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఆయ‌న‌ సొంత ఊరు విశాఖలో ఉన్న అక్కాయపాలెం.  అందుకే విశాఖపట్నం వాసిగా విశాఖను రాజధానిగా  చేయాలని ఆయన కోరుకున్నట్లు చెప్పారు. ఇక జబర్దస్త్ అప్పారావు కొన్ని మూవీస్ లో నటించారు. తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. 

నువ్వు ఏడ్వకు అమ్మ! నేను నీ కూతుర్ని!!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా కంటెస్టెంట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం బిగ్ బాస్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో 'హైలెట్ అఫ్ ది డే' గా ఫైమా తన అమ్మతో మాట్లాడిన వీడియో కాల్ ప్రేక్షకుల హృద‌యాల‌ను హత్తుకుంటోంది. హౌస్ లో కాల్ రాగానే, ఫైమా ఫోన్ లిఫ్ట్ చేయడంతో టాస్క్ మొదలైంది. అందులో తనకు రెండు ఆప్షన్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటిది వాళ్ళ 'అమ్మతో వీడియో కాల్'. రెండవది 'లక్కీ నుండి ఆడియో మెసేజ్' . అయితే ఈ రెండింటిలో ఫైమా అమ్మతో వీడియో కాల్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోగా, కాసేపటికి హౌస్ లోని టీవీలో ఫైమా వాళ్ళ అమ్మ వీడియో కాల్ మొదలైంది. ఫైమా చాలా సంతోషంగా తన అమ్మతో మాట్లాడింది. తన అటతీరు, మాటతీరు గురించి అడిగి తెలుసుకుంది.  "నేను బాగా నవ్విస్తున్నానా?" అని ఫైమా అడుగగా, "బాగా నవ్విస్తున్నావ్, ఇంకా నవ్వించాలి" అని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఫైమా సంతోషపడింది. ఫైమా "నేను మేకప్ వేసుకుంటలేను. టీవిలో బాగా కనిపిస్తున్నానా?" అని అడుగగా, "నువ్ మేకప్ వేసుకున్న, వేసుకోకపోయినా నువ్ నా కూతురువి. ఎప్పుడు అందంగానే ఉంటావ్" అని గర్వంగా చెప్పుకొచ్చింది తన అమ్మ. ఆ తర్వాత "నేను మొన్న హౌస్ లో కట్టెలు కొట్టిన చూసావా, నువ్ నన్ను కట్టెలు కొట్టడానికి తీసుకుపోయినప్పుడు సరిగా కొట్టలేదు అన్నావ్ కదా కానీ మొన్న జరిగిన టాస్క్ లో మంచిగానే కొట్టిన" అని ఫైమా అంది. ఇది విన్న వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఏడ్చేసారు. ఇది హౌస్ మేట్స్ అందరినీ ఎమోషనల్ చేయగా, అందరూ ఫైమాని ఓదార్చే ప్రయత్నం చేసారు. "నువ్వు ఏడ్వకు అమ్మ, నేను బాగా ఆడి, అందరిని  మెప్పిస్తా. నేను నీ కూతురుని. ఇప్పటి నుండి షహీదా కూతురు ఫైమా అని అందరూ చెప్పుకుంటారు చూడు" అని ఫైమా అనడంతో వాళ్ళ అమ్మతో పాటు హౌస్ మేట్స్ అందరు నవ్వేసారు. ఈ వీడియో కాల్ సీన్ అంతా కూడా అటు హౌస్ మేట్స్ , ఇటు ప్రేక్షకుల మనసును హత్తుకుంటోంది. ఫైమా చిన్న వయసులోనే తన కుటుంబం గురించి ఆలోచించే విధానం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో ఫైమా హౌస్ లో బాగా రాణిస్తే తనే ఈ సీజన్ విజేత కావడం ఖాయమనిపిస్తోంది. ఫైమా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుందో, లేదో.. చూడాలి మరి.

ఆమె రెమ్యూనరేషన్ అంటే మాటలా.. 100 పెద్దమనిషి ఫంక్షన్లు చేయాలి!

హైపర్ ఆది అంటే పంచ్ ల  ప్రవాహం అని మరో సారి నిరూపించుకున్నాడు. ఆ పంచ్ లు   ఏంటో లేటెస్ట్ గా రిలీజ్ ఐన జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. దీపావళి రాకముందే   కమెడియన్స్ అందరూ టు టీమ్స్ గా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు పేల్చుకున్నారు. బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్ , రాకింగ్ రాజేష్, సన్నీ ఒక టీమ్ గా మారి క్రికెట్ బ్యాట్స్ తో ఎంట్రీ ఇచ్చారు.  "మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిలని ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. మా అబ్బాయిలని వదిలేయండి.. లేకుంటే రక్తపాతాలే" అంటూ ఇమ్మాన్యూల్ కామెడీ వార్నింగ్ ఇచ్చాడు.  ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ తన గ్యాంగ్ తో హాకీ స్టిక్స్ పట్టుకుని వచ్చి "ఎవర్రా ఈ మంగళవారంగాళ్ళను శుక్రవారం పెట్టింది" అంటూ బులెట్ భాస్కర్ టీమ్ మీద విరుచుకు పడేసరికి రష్మీ "నేనే పెట్టాను" అంది.  దాంతో బులెట్ భాస్కర్  మధ్యలో  కల్పించుకుని.. "ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు రష్మీ.. పద.. నీ పేమెంట్ నేను ఇంటికి పంపిస్తా" అని కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసరికి " నువ్వు రష్మీకి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే 100 పెద్దమనిషి ఫంక్షన్లు చేయాలి" అంటూ ఆది కౌంటర్ వేసాడు.  ఇక ఈ డైలాగ్ జడ్జెస్ అంతా నవ్వేశారు.  తర్వాత  రాకెట్ రాఘవ వేసిన  లేడీ గెటప్ అదిరిపోయింది. 

మొట్టమొదటి సారిగా ఏడ్చిన మెరీనా-రోహిత్ జంట!

బిగ్ బాస్ ఈ వారం కంటెస్టెంట్స్ లో జోష్ ని నింపడానికి, ఒక వినూత్నమైన రీతిలో  కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చాడు. ఇందులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు, ఆడియో రూపంలో వినిపిస్తూ గానీ, వీడియో రూపంలో కనిపిస్తూ గానీ, గిఫ్ట్ లు, ఫోటో ఫ్రేమ్స్ రూపంలో గానీ.. హౌస్ లో కంటెస్టెంట్స్ కి కనువిందు చేస్తూ, వాళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపాలి. ఈ టాస్క్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.  అయితే కంటెస్టెంట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఊరకనే ఏం ఇవ్వలేదు. తర్వాత కంటెస్టెంట్స్ కి టాస్క్ నియమాలు చెబుతూ, "బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ గా ఉండాలి. ఒక్కొక్కరుగా వచ్చి  కొంత మేరకు ఛార్జ్ ఉపయోగించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి. అయితే ఛార్జింగ్ కూడా వంద శాతం ఉంటేనే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాగా వంద శాతం కావడానికి కూడా కొందరు హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చెయ్యాలి" అని బిగ్ బాస్ చెప్పడంతో, అందరు ఆలోచనలో పడ్డారు. "ఆదిత్య సీజన్ మొత్తం సిగరెట్ తాగకూడదు. అలాగే రోహిత్, వాసంతి ఇద్దరిలో ఎవరో ఒకరు వరుసగా రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ కావాలి" అని బిగ్ బాస్ చెప్పడంతో, రోహిత్ సెల్ఫ్ నామినేట్ అవుతానని ఒప్పుకొన్నాడు. దాంతో బ్యాటరీ ఛార్జ్ వంద శాతానికి చేరుకుంది. దీంతో చివరగా మిగతా ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడానికి కారణం అయిన రోహిత్ కి మాత్రం ఎవరూ అవకాశం ఇవ్వలేదు. 'కనీసం మీరు కాల్ మాట్లాడతారా?' అని ఎవరూ అడుగలేదని రోహిత్ బాధతో ఏడ్చాడు. దీంతో మొట్టమొదటిసారిగా రోహిత్ ఏడ్వడం హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు చూసారు. మెరీనా కూడా బాధపడుతూ రోహిత్ ని ఓదార్చింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్ అయ్యే అవకాశం అందరికి సమానంగా ఇచ్చాడు. బాల్స్ ని బాస్కెట్ లో ఎవరు ముందుగా పడేస్తారో వారు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఆ టాస్క్ లో మెరీనా-రోహిత్ ఇద్దరు బాగా ప్రయత్నించారు కానీ ఓడిపోయారు.  తర్వాత మెరీనా రోహిత్ హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. 'ఇద్దరం బాగా కష్టపడ్డాం, కానీ ఎవరూ మనకి సపోర్ట్ చేయలేదు' అంటూ ఇద్దరు భావోద్వేగానికి లోనై ఒకరినొకరు ఓదార్చుకున్నారు. "హౌస్ మేట్స్ కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావ్. ఐనా కనీసం విలువ కూడా నీకు లేదు" అని మెరీనా చెప్పగా, రోహిత్ బాధపడ్డాడు. అయితే డీసెంట్ గా, ఫేర్ గేమ్ ఆడే రోహిత్  కెప్టెన్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాగా ఈ వారం కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతారో తెలియాల్సి ఉంది‌. 

బ్యాటరీ ఈజ్ ఫుల్ ఛార్జ్, కంటెస్టెంట్స్ ఇన్ ఫుల్ జోష్!

ముప్పై తొమ్మిదవ రోజు బిగ్ బాస్ సరికొత్తగా ఆరంభమైంది. 'బ్యాటరీ ఛార్జ్' టాస్క్ లో భాగంగా ఒక్కొక్కరు తమ ఫ్యామిలితో సరదగా మట్లాడుతూ ఎమోషన్స్ ని పంచుకొన్నారు. ఈ టాస్క్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. "ఈ రోజు టాస్క్ లో భాగంగా, ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరు ఫస్ట్ లిఫ్ట్ చేస్తారో వారికే ఫ్యామిలితో మాట్లాడే అవకాశం లభిస్తుంది" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ కి వివరించాడు. కాసేపటికి ఫోన్ రింగ్ రాగానే సూర్య కాల్ లిఫ్ట్ చేసాడు. అతడికి రెండు ఆప్షన్స్ ఇవ్వగా, అందులో తన అమ్మ రాసిన ఉత్తరం కావాలనే ఆప్షన్ ని ఎంచుకొన్నాడు. తర్వాత ఆ లెటర్ రాగానే‌ దాన్ని చదువుకుంటు, చాలా ఏడ్చేసాడు. బాధలో ఉన్న సూర్యని చూసి హౌస్‌ మేట్స్ ఓదార్చారు. ఆ తర్వాత కాల్ రేవంత్ ఆన్సర్ చేసాడు. రేవంత్ కి ఇచ్చిన రెండు ఆప్షన్స్ లో తన భార్య ఫోటో కావాలనే ఆప్షన్ ని ఎంచుకొన్నాడు. కాగా ఆ ఫోటో రాగానే చూసుకొంటు ఏడ్చేసాడు. ఆ తర్వాత వసంతి కాల్ అన్సర్ చేసింది.  తన మేనకోడలు ఫోటోని కోరగా, కాసేపటికి అది వచ్చింది. ఆ ఫోటో చూస్తూ ఏడ్చేసింది వసంతి.  ఆ తర్వాత రాజ్ కి అవకాశం లభించింది. రాజ్ వాళ్ళ అమ్మతో మాట్లాడే ఆప్షన్ ని ఎన్నుకొన్నాడు. కాసేపటికి ఇంటి దగ్గర నుండి వాళ్ళ అమ్మ కాల్ చేసి మాట్లాడుతూ, "నీ ఆట ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఆ రోజు గీతుతో ఎలా మట్లాడినావో, అందరితో అలాగే మాట్లాడు, గట్టిగా మట్లాడు. నీ తప్పు లేనప్పుడు భయపడకుండా గట్టిగ మాట్లాడాలే " అని రాజ్ తో చెప్పుకొచ్చింది. బ్యాటరీ ఛార్జ్ పూర్తిగా అయిపోవడంతో టాస్క్ పూర్తి అయ్యింది. హౌస్ మేట్స్ బాగా పర్ఫామెన్స్ చేయడంతో, ఈ వారం అందరికి పోటీదారులు అవ్వడానికి అందరికి సమాన అవకాశాలు కల్పించాడు. ఆ తర్వాత 'బాల్ త్రో బాస్కెట్'  టాస్క్ కి ఎన్నుకోబడ్డారు ‌. అయితే ఆ టాస్క్ లో రేవంత్ వసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్ ,అర్జున్, రోహిత్ కెప్టెన్సీ పోటీదారులుగా రెండవ టాస్క్ ఆడటానికి ఎంపికయ్యారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ రాజ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం బిగ్ బాస్ లో కెప్టెన్ అయ్యిన రాజ్, ఒకప్పుడు మోడల్ రాజశేఖర్. మరి ఇప్పుడేమో అందరికి సుపరిచితమైన వ్యక్తి. రాజ్  1992 జూన్ 15 న హైదరాబాద్ లో జన్మించాడు. కాగా తన చదువు మొత్తం హైదరాబాద్ లోనే పూర్తి చేసుకొన్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, తనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు. చదువు పూర్తి కాగానే ఆర్థిక పరిస్థితులు బాగోలేక, కొన్ని రోజులు ఆఫీస్ బాయ్ గా కూడా చేసాడట. ఆ తర్వాత కొన్ని రోజులు చిన్న ఉద్యోగం చేసాడు. అయితే తనకు మోడల్ కావాలనే ఆశ ఉండేదట. మాడల్ గా ట్రై చేస్తూనే జాబ్ చేసేవాడట. అయితే 2015 లో జరిగిన ఒక ఫ్యాషన్ కాంపిటీషన్ లో మాడల్ గా రాంప్ వాక్ చేసాడు. తనకి అప్పుడే మెగా మోడల్ గా గుర్తింపు లభించింది. దీంతో టాప్-5 లో చోటు దక్కించుకున్నాడు. 2017 లో సెంట్రల్ క్లాతింగ్ బ్రాండ్ కి యాక్ట్ చేసాడు. 2018 లో ఒక మ్యాగజైన్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా సుమారుగా 250 మంది డిజైనర్స్ తో వర్క్ చేసాడంట. ఇదే కాకుండా, స్టార్ క్రికెటర్స్ తో యాడ్స్ చేసాడట. ఒక ఆఫీస్ బాయ్ నుండి బిగ్ బాస్ హౌస్ చేరే వరకు తను చాలా కష్టాలను ఎదుర్కొన్నాడంట. అయితే తన కష్టమే ఇప్పుడు బిగ్ బాస్ లో అవకాశం వచ్చేలా చేసింది. బిగ్ బాస్ లోకి పద్దెనిమిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ యంగ్ బ్యాచిలర్, మొదటి వారం నుండి హౌస్ మేట్స్ చూపే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయితే రాజ్ ని బిగ్ బాస్ లో 'వీక్ కంటెస్టెంట్ అఫ్ ది హౌస్' అనే మార్క్ కూడా ఇచ్చారు. హౌస్ లో అడుగుపెట్టిన నుండి పెద్దగా పర్ఫామెన్స్ ఏం కనిపించలేదనే చెప్పాలి. ఒకసారి కెప్టెన్ అయిన కూడా సింపతితో అయ్యాడనే మార్క్ వచ్చేసింది . చాలా సార్లు వేస్డ్ పర్ఫామర్ గా పేరు తెచ్చుకోగా, నాగార్జున పలుమార్లు తన అటతీరు మెరుగు పరుచుకోవాలని చెప్పిన మారట్లేదు. ప్రతి వారం నామినేషన్ లో ఉన్నా, ప్రేక్షకులు సేవ్ చేస్తూ వస్తోన్నారు. హౌస్ లో ఫైమా, కీర్తి భట్ తో సన్నిహితంగా ఉంటున్నాడు రాజ్. కాగా ఈ వారం కూడా నామినేషన్ లో ఉన్నాడు. ఈ వారం రాజ్ సేవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లుగా ఓట్ల మెజారిటీతో తెలుస్తోంది. అయితే రాజ్ రెమ్మునెరేషన్ రోజుకి పదిహేను వేల నుండి ఇరవై వేలు ఉంటుందని ప్రచారంలో ఉంది. అయితే రాజ్ ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతాడో? లేక ఎలిమినేట్ అయి బయటికి వెళ్తాడో? చూడాలి మరి.

ఎందెందు వెతికినా అందందే శ్రీముఖి...అన్ని షోస్ లోనూ ఆమెదే హవా

ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద ఏ ఛానెల్లో చూసినా ఆ అల్లరి హోస్ట్ మాత్రమే కనిపిస్తోంది. ఆమె పేరే వినిపిస్తోంది. ఒకానొక సమయంలో సుమ, ఝాన్సీ, ఉదయభాను పోటాపోటీగా షోస్ ని హోస్ట్ చేసే వాళ్ళు. కానీ వాళ్ళల్లో అప్పటినుంచి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా సుమ మాత్రమే స్మాల్ స్క్రీన్ ని  ఏలుతున్న క్వీన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను బీటౌట్ చేసేసి శ్రీముఖి టాప్ పొజిషన్ లోకి చేరిపోయింది. అంతేకాదు అనసూయని కూడా వెనక్కి నెట్టేసి ఆ షో కాదు, ఈ షో కాదు అన్ని షోస్ లో శ్రీముఖి మాత్రం తెగ హైలైట్ ఐపోతోంది. శ్రీముఖి ఒక పక్క సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హోస్ట్ గా, జాతిరత్నాలు, సరిగమప సింగింగ్ సూపర్ స్టార్, బంగారు బతుకమ్మ, దసరా వైభవం ఒకటేమిటి ఏ షో చూసినా అంతా శ్రీముఖిమయమే అన్నట్టుగా ఉంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్..ఒకరికి ఒకరు షోకి  హోస్ట్ గా చేస్తోంది. అలాగే ఫారెన్ లో జరిగే ఈవెంట్స్ కి కూడా శ్రీముఖి అటెండ్ అవుతూ అక్కడ కూడా ఎంటర్టైన్ చేసేస్తోంది. అలాగే మరో వైపు మంచి ఛాన్సులు వస్తుంటే మూవీస్ లో నటిస్తోంది. అలాగే యూట్యూబ్ ఒకటి రన్ చేస్తూ... సోషల్ మీడియాలో ఫాన్స్ ని కూడా పెంచుకుంటోంది. అందుకే శ్రీముఖికి టైం సరిపోక నిద్ర సరిపోవడం లేదు అంటూ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టేటుస్సుల్లో పోస్ట్ పెడుతూ ఉంటుంది. వెనకటికి  మన పెద్దలు అన్నట్టు "దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి" అనే సామెతను శ్రీముఖి చక్కగా ఫాలో అవుతోంది.

భావోద్వేగానికి  లోనవుతున్న హౌస్ మేట్స్!

బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బ్యాటరీ ఛార్జ్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ గత మూడు రోజుల నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉత్కంఠభరితంగా కొనసాగుతూ, ప్రతి హౌస్ మేట్ కంటతడి పెట్టేలే జరుగుతోంది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో గీతు తన నాన్న గారితో ఆడియో కాల్ మాట్లాడగా, శ్రీసత్య తన వాళ్ళ ఫ్యామిలితో వీడియో కాల్ మాట్లాడింది. శ్రీసత్య తన తల్లితండ్రులతో మాట్లాడుతుండగా ఎమోషనల్  అయింది. తను అలా ఏడ్వటం చూస్తూ హౌస్ మేట్స్ కూడా  కంటతడి పెట్టుకొన్నారు. తరువాత ఇనయ వంతు రాగా, బ్యాటరీలో ఛార్జ్ తక్కువగా ఉండటంతో తన వాళ్ళతో ఆడియో కాల్ గాని, వీడియో కాల్ గాని మాట్లాడలేకపోయింది. తన అమ్మ నాన్న ఉన్న ఫోటో ఫ్రేమ్ ని ఎంపిక చేసుకొంది. కాసేపటికి ఆ ఫోటోఫ్రేమ్ లోపలికి వచ్చింది. తర్వాత హౌస్ మేట్స్ కి తన పేరెంట్స్ ని చూపించి ఏడ్చేసింది. తను ఏడ్వటం చూసి అందరు తనని ఓదార్చే ప్రయత్నం చేసారు. "చాలా రోజుల నుండి మా అమ్మ నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆడియో కాల్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఏం మాట్లాడేదో" అంటు బాధపడింది. ఆ తరువాత   ఆదిత్యకి అవకాశం రాగా, తన భార్యతో ఆడియో కాల్ సెలెక్ట్ చేసుకున్నాడు. తన భార్యతో మాట్లాడుకుంటూ ఏడ్చేసాడు. ఆ తర్వాత తన అట తీరు గురించి అడిగి తెలుసుకున్నాడు. తన కూతురుతో మాట్లాడేసరికి కన్నీళ్ళు ఆగలేదు. హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ఆదిత్య తన భార్యతో ఆడియో కాల్ సెలక్ట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ సున్నా శాతం అయింది. దానికి   బాస్ ఏదైనా బ్యాటరీ ఛార్జ్ పెంచుకునే అవకాశాలు కల్పిస్తాడేమో చూడాలి. అయితే ఈ టాస్క్ మొదలైన రోజు నుండి అందరూ వాళ్ళ ఫ్యామిలీని గుర్తుచేసుకుంటూ హౌస్ లో ఎమోషనల్ అవుతున్నారు. కాగా ఈ టాస్క్ లో విజేతగా ఎవరు నిలుస్తారో?  కెప్టెన్ గా బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారో చూడాలి మరి.

నాకు వెన్నెల కిషోర్ బెస్ట్ ఫ్రెండ్ ఏంటి.. అతనికి చాలా పొగరు!

మంచు విష్ణు నటించిన 'జిన్నా' మూవీ అక్టోబర్ 21న విడుదల కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను బాగా జరుగుతున్నాయి. ఇదే టైములో వెన్నెల కిషోర్ మీద మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేసాడు. ఒక ఇంట‌ర్వ్యూలో "జిన్నాలో మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ గారు.. ఇలా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు" అని యాంకర్ అంది.  "వెన్నెల కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్ కాదు. అతనికి చాలా పొగరు.. నాకు వెన్నెల కిషోర్ అంటే అస్సలు ఇష్టం లేదు. నన్ను మాట్లానివ్వకుండా నా మీద కౌంటర్ లు వేసేది ఎవరైనా ఒకరు ఉన్నారు అంటే అది వెన్నెల కిషోర్ మాత్రమే. అందుకే అతనంటే నాకు ఇష్టం లేదు. చనువు ఇచ్చేది ఏమీ లేదు. అతనొక పెక్యులియర్ కేరెక్టర్.. చనువు తీసేసుకుంటాడు.. అందుకే వెన్నెల కిషోర్ అంటే నాకు నచ్చదు." అని విష్ణు చెప్పాడు. "ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు మీరు కిషోర్ గురించి సరదాగా అంటున్నారేమో అనుకున్నా" అని యాంకర్ అంది. దానికి "నో.. నిజమే చెప్తున్నా.. వెన్నెల కిషోర్ నీకు పొగరు.. నువ్వంటే నాకు  అస్సలు ఇష్టం లేదు" అనే బిట్ మళ్ళీ చెప్పి, "ఇది కట్ చేసి అతనికి చూపించండి" అని కౌంటర్ వేసి అంతలోనే "ఇదంతా జోక్" అనేశాడు విష్ణు.

క్లాస్ రూమ్‌లో లాస్ట్ బెంచీలో కూర్చుని మీ సీరియల్ చూస్తాం!

'గుప్పెడంత మనసు' సీరియల్ లో వసుధార తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. వసుధార అలియాస్ రక్షా గౌడ సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు వసుధార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో "టెల్ మీ యువర్ సీక్రెట్స్" అంటూ నెటిజన్స్ కి  టాస్క్ ఇచ్చింది. వాళ్ళు చేసిన పనులు చెప్పేసరికి వసుధార వాటికి రిప్లైస్ కూడా ఇచ్చేసింది. "నేను బలపాలు తింటాను, మీరు తింటారా?" అని అడిగేసరికి వసుధారా "నో" అంటూ తల ఊపుతూ చెప్పింది. "నాకు సైకిల్ తొక్కడం రాదు.. ఇదే నా బిగ్ సీక్రెట్" అని మరో నెటిజన్ చెప్పేసరికి "నాకు రాదు" అన్నట్టుగా హైఫై ఎమోజిస్ ని పోస్ట్ చేసింది వసు. "నేను మా నాన్న పర్సులో డబ్బులు కొట్టేసాను.. మీరు" అని ఇంకో నెటిజ‌న్ అడిగితే, "నేనూ డబ్బులు కొట్టేసాను" అని చెప్పింది వసు. "నేను, మా ఫ్రెండ్ లాస్ట్ బెంచ్ లో కూర్చుని మీ 'గుప్పెడంత మనసు' సీరియల్ చూస్తాము.. ఇదే మా బిగ్గెస్ట్ సీక్రెట్" అని ఇంకో నెటిజ‌న్ చెప్పారు. దానికి " చాలా మంచిది, కానీ దొరక్కుండా చూసుకోండి టీచర్స్ కి" అని రిప్లై ఇచ్చింది వసు.  "మా  ఫ్రెండ్స్ పర్సులు  కొట్టేసి ఆ డబ్బులతో వాళ్ళకే పార్టీ ఇస్తాము.. మరి మీరు" అని మరో నెటిజన్ అడిగేసరికి "నేనెప్పుడూ ఇలా చేయలేదు.. కానీ భలే గ్రేట్ ఐడియా" అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా నెటిజన్స్, వసు వాళ్ళ వాళ్ళ సీక్రెట్స్ చెప్పేసుకున్నారు.

'ఆదితో నా ఎంగేజ్మెంట్ అయ్యింది'.. శ్రద్ధా దాస్ కామెంట్స్ వైరల్!

'ఢీ - 14 ది డాన్సింగ్ ఐకాన్' షో ప్రతీ వారం దుమ్ము రేపుతోంది. ఈ వారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది కూడా కంటెస్టెంట్స్ కి సపోర్టింగ్ డాన్స్ కంటెస్టెంట్ గా చేశాడు. "వెయ్ రా చెయ్ వెయ్ రా" అనే సాంగ్ కి ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ తో పాటు ఆది వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఆ స్టెప్స్ చూసిన పూర్ణ "ఆది పొలంలో మొలకలొచ్చాయ్" అని గట్టిగా అరిచింది.  ఇక ఆర్నాల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి పూర్ణ ఆ కుర్రాడిని  పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులిచ్చింది. శ్రద్ధకి ఆది మీద కోపం వచ్చేసింది. పిల్లలంతా డాన్స్ చేస్తున్నారు. ఎన్ని సార్లు తాను అడుగుతున్నా ఆది చేయకపోయేసరికి కామెంట్ చేసింది శ్రద్ద. దాంతో పిచ్చి పిచ్చి స్టెప్పులేసి, పిల్లిమొగ్గలేసి పండుతో కలిసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు ఆది. ఇదే టైంలో రిషిక, సాగర్ డాన్స్ చేస్తున్నప్పుడు "ఆదితో పాటు నా ఎంగేజ్మెంట్ అయ్యింది" అంటూ శ్రద్ధాదాస్ హాట్ కామెంట్స్ చేసింది. ఆ టీమ్ అంతా కలిసి ఆదిని శ్రద్ధ దగ్గరకు పూల జల్లు కురిపిస్తూ తీసుకెళ్లారు. అక్కడ ఆదికి శ్ర‌ద్ధ‌ రింగ్ పెడుతున్నట్టుగా చూపించారు.  ఇక ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి ఈ వారం మెగా ఎలిమినేషన్ రౌండ్ అని అనౌన్స్ చేసాడు. మరి ఈ వారం ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకోవాలంటే 19 వరకు వెయిట్ చేయాల్సిందే.

అర్జున్ ని ఏడ్చేలా చేసిన వీడియో బైట్!

బిగ్ బాస్ లో మొదలైన 'బ్యాటరీస్ రీఛార్జ్' అనే ఈ  సరికొత్త గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీని కనెక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అర్జున్ వాళ్ళ నాన్న వీడియో బైట్ రిక్వెస్ట్ చేసాడు. కాసేపటి తర్వాత వీడియో బైట్ 'హౌస్ టీవి' లో రావడం మొదలైంది. హౌస్ మేట్స్ అందరూ చూస్తూ ఉండిపోయారు. అర్జున్ వాళ్ళ నాన్న వీడియోలో మాట్లాడుతూ, "హాయ్ అర్జున్. బాగున్నావా? నేను ఛాయ్ తాగేప్పుడు, టిఫిన్ చేసేప్పుడు మిస్ అవుతున్నా, ఏం పర్వాలేదు. నీ గేమ్ నువ్వు ఆడు. కోటిలో ఒకరికి వస్తుంది ఈ అదృష్టం. ఈ అవకాశం అందరికి రాదు. బాగా ఆడు" అని చెప్పుకొచ్చాడు. ఇది చూసి అర్జున్ కి కన్నీళ్ళు ఆగలేదు. ఒకే నాన్న ఆడుతాను అని ఏడుస్తూనే ఉన్నాడు. హౌస్ మేట్స్ అందరూ ఓదార్చినా అర్జున్ కి కన్నీళ్ళు ఆగలేదు. రేవంత్ వచ్చి ఓదార్చితే, "కాసేపు నన్ను ఒంటరి వదిలెయ్ బ్రో, టైం పడుతుంది" అని అర్జున్ చెప్పాడు. ఈ బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో అర్జున్ తో పాటు శ్రీసత్య, కీర్తిభట్ కూడా ఏడ్వగా, వాళ్ళు ఫ్యామిలితో మాట్లాడే మాటలు ప్రేక్షకులను హత్తుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ టాస్క్ కారణంగా అందరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గుర్తొచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఈ వారం ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో చూడాలి మరి.

ఘనంగా ఆలీ బర్త్ డే సెలెబ్రేషన్స్..బిర్యానీ వండి తినిపించిన జుబేదా!

కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో నటిస్తూ షోస్ కి హోస్ట్ గా చేస్తూ, ఆలీతో సరదాగా అంటూ ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంటారు ఆలీ. ఐతే ఆలీ రీసెంట్ తన బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.  ఇక ఈ బర్త్ డే వీడియోని జుబేదా ఆలీ తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఆలీ ఫ్రెండ్ మోహన్ ఆలీ ఫామిలీకి వాళ్ళ ఫ్రెండ్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. ఇక తన భర్త ఆలీ పుట్టిన రోజు సందర్భంగా జుబేదా ఆలీ చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి వెళ్లి రక్త దానం చేశారు. "రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి" అని చెప్పి చిరంజీవి అన్నయ్యకు, డాక్టర్స్ కి ధన్యవాదాలు చెప్పారు జుబేదా. సినీ, టీవీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్లంతా వచ్చి ఆలీతో కేక్ కట్ చేయించారు.  ఇక వాళ్ళ ఫార్మ్ హౌస్ కి వెళ్లి అక్కడ ఆలీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఎలా వండేవారో అలా జుబేదా వండి ఆలీకి తినిపించారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్లంతా  కాసేపు ఎంజాయ్ చేసి చివరికి ఇంటికి వచ్చేసారు. ఇక ఇంటికి వచ్చాక ఆలీ ఫ్రెండ్ వెంకురెడ్డి కూడా ఆయన బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఇలా ఆలీ ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ మధ్యలో బర్త్ డే ఫంక్షన్ జరిగింది.

పవన్ కళ్యాణ్ కి ‘ఐ లవ్ యు’ చెప్తా...చిరుతో కలిసి ఆయన ప్రైవేట్ జెట్ లో డేట్ కి వెళ్తా..

దివి బిగ్ బాస్ గ్లామర్ గర్ల్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు దివి అంటే ఎవరో ఎవరికీ పెద్దగా తెలీదు కానీ హౌస్ లోకి వెళ్లి వచ్చాక ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటి వాటిల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. గాడ్ ఫాదర్ సినిమాలో చిరుతో  కలిసి నటించే అవకాశం కొట్టేసింది దివి. ఐతే ఇప్పుడు దివి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి గమ్మత్తుగా ఆన్సర్స్ ఇచ్చింది. "చిరుతో కలిసి ఆయన ప్రైవేట్ జెట్ లో డేట్ కి వెళ్లాలనుందట పాపకి. పవన్ కళ్యాణ్  అంటే పిచ్చి. ఆయన మేనరిజం, ఆయన స్టైల్ నాకు బాగా ఇష్టం. ఒకవేళ ఆయన్ని కలిసే అవకాశం వస్తే "ఐ లవ్ యు సర్" అని చెప్తాను.. ఇక ఆయన సినిమాలో  అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను" అని చెప్పింది దివి. ఇక తర్వాత ప్రభాస్ గురించి చెప్తూ "అవకాశం వస్తే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పింది. తాను ఎంటెక్ చదివే  రోజుల్లో ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్ లో ఆయన చూస్తారేమోనని  ‘నేను మీతో కలిసి  డేట్ కి వెళ్లాలని ఉంది’ అంటూ  మెసేజ్ పెట్టిందట. కానీ ఆయన చూడలేదట.  ఇక వెంకటేష్, అఖిల్ అక్కినేనితో అవకాశం వస్తే డేట్ కి వెళ్తానని చెప్పింది. రామ్ సింగల్ కాబట్టి పెళ్లి చేసుకుంటా అంటూ ఒక్కో స్టార్ గురించి తన అభిప్రాయాన్ని ఈ రాపిడ్ ఫైర్ లో చెప్పింది దివి.

ఆ కామెడీ షోకి పోటీగా ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’

ఈటీవీ జబర్దస్త్ కి పోటీగా ఆహా ఓటీటీ వేదికగా ఒక కామెడీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తర్వాత మళ్ళీ అలాంటి కామెడీ షోస్ అనేవి బుల్లితెర మీద లేవనే చెప్పాలి. ఐతే జబర్దస్త్ పై వస్తున్న రూమర్స్ , ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్న వైనం చూస్తుంటే మరో కొత్త కామెడీ షో వస్తే బాగుంటుంది అని తెలుగు ఆడియన్స్ అనుకుంటున్నారు. మరి అలాంటి ఒక షో ఇప్పుడు రెడీ అవుతోందని చెప్పొచ్చు. ఇక ఇది "కామెడీ స్టాక్ ఎక్సేంజ్" అని టైటిల్ తో సుడిగాలి సుధీర్ ని ముందు పెట్టి  ఈ షోని నిర్వహించేందుకు  ఆహా టీం రెడీ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ప్రోమో చూస్తే ఫేమస్ కమెడియన్స్ అందరూ ఉన్నారు.  ముక్కు అవినాష్, యాదమ్మ రాజు, సద్దాం, హరి, ఇంకా పలువురు జబర్దస్త్,  పటాస్ కమెడియన్ ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నారు. ఇక జడ్జిగా నాగబాబు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ ఫాన్స్ ఈ షో కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే  డాన్స్ ఐకాన్ కార్యక్రమం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.  ఈ ప్రోగ్రాం పూర్తయ్యే లోపు కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఆహా కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ఓటిటితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. డాన్స్ ఐకాన్ తో పాటు  బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా స్టార్ట్ అవబోతోంది. నెమ్మదిగా ఆహా కామెడీ జానర్ వైపు దృష్టి సారిస్తోందని దీన్ని బట్టి అర్ధమవుతోంది.