'అవన్నీ తుప్పాస్ రీజన్స్' అని అంటోన్న ఆదిరెడ్డి !

బిగ్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదలైన మాటల యుద్ధం  హై వోల్టేజ్ డ్రామాని తలపించింది. హౌస్ లో నామినేషన్లతో హీటెడ్ వాతావరణం నెలకొంది. అర్జున్ ని మొదటగా నామినేషన్ చేసాడు ఆదిరెడ్డి. "దీనికి కారణం, ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో నేను డాన్స్ చెయ్యలేదు అని అన్నావ్. నేను అయిన ఎలాగో అలా  చేశాను కానీ నువ్వు ఏం చేసావ్? ఏం చెయ్యలేదు." అని చెప్పి నామినెటే చేసాడు. అందుకు సమాధానంగా , "But i dissagree with this " అని  చెప్పాడు అర్జున్. అలాగే రెండవ నామినేషన్ గా వసంతి ని చేసి,  "నువ్ నామినేషన్ అంటే బయపడతావ్" అని చెప్పాడు. "హౌస్ లో నామినేషన్ అంటే భయపడని వారు ఎవరు ఉన్నారు" అని సమాధానం చెప్పింది. కాగా "హౌస్ లో ఎలాంటి పర్ఫామెన్స్ లేదు. లెస్ డెజర్వింగ్ ఎవరంటే నువ్వే వసంతి" అని ఆదిరెడ్డి అనగా, "అలా ఏలా అంటారు మీరు. ఎలాంటి పర్ఫామెన్స్ లేదు అని ఎలా అంటవ్" అంటూ వసంతి ఎదురుదాడికి తిగింది‌. "హౌస్ లో నువ్ కెప్టెన్ గా జీరో అయ్యావ్" అని అనగా, "కెప్టెన్ అయి జీరో అయ్యాను అది నీకంటే బెటర్ ఏ" అంటు చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. "నువ్ రెండు వారాలు సోఫా వెనకాల ఉన్నావ్. హౌస్ లో ఎలాంటి పెర్ఫార్మన్స్ లేకుండా ఉంటేనే సోఫా వెనుకాలా ఉన్నావ్. నీతో పోల్చితే నేను చాలా బెటర్ అని నా ఒపీనియన్." అని ఆదిరెడ్డి చెప్పాడు. అలాగే ఆదిరెడ్డిని నామినేట్ చేసాడు అర్జున్. కారణం ఏంటి అని అడుగగా, 'డీసెర్వింగ్' , 'లెస్ డెసెర్వింగ్ ' అని టూ వర్డ్స్ ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసాడు.  ఎందుకు అంటే డిసర్వింగ్ అవునా? కాదా? అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. మీరు ఎలా అంటారు. " అని అర్జున్ అనగా, "నామినేట్ చేయడానికి కారణాలు లేకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకూడదు అర్జున్ బ్రో  " అని చెప్పగా, "ఇది నాకు నచ్చలేదు. అందుకే నామినేట్ చేస్తున్నాను" అని అన్నాడు.ఆదిరెడ్డి మాత్రం, "ఇవి తుప్పాస్ రీజన్స్" అని కొట్టిపారేసాడు. ఇకముందు హౌస్ లో ఆదిరెడ్డి ఆడబోయే ఆటలో ఎంత వరకు పెర్ఫార్మన్స్ చూపించి ప్రేక్షకుల ఓట్లు పొందుతాడో చూడాలి. నిన్న  నామినేషన్ లో ఈ హీటెడ్ ఆర్గుమెంట్ అలా ముగిసింది.

'బిగ్ బాస్ ఈజ్ నాట్ యువ‌ర్‌ కప్ ఆఫ్ టీ'!

బిగ్ హౌస్ లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ  రసవత్తరంగా సాగింది. కంటెస్టెంట్స్ ఎవరిని అయితే నామినేట్ చేస్తారో  వారి పేరు చెప్పి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వాళ్ళు ఒంటి మీద కలర్ నీళ్లు పోసుకోవడం జరుగుతోంది. కాగా హౌస్ లో అతి మంచిగా పిలువబడే ఆదిత్య మీద ఎక్కువ సార్లు కలర్ నీళ్లు పడడం జరిగింది. హౌస్ మేట్స్ లో సగం మంది కూడా లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో బ్యాటరీ మొత్తం వాడుకొని మిగతా సభ్యుల గురించి ఆలోచించలేదు. ఈ విషయం పైనే అందరు నామినెట్ చేసారు ఆదిత్యని. మొదటగా ఫైమా నామినేట్‌ చెయ్యగ, తరువాత శ్రీసత్య చేసింది. శ్రీసత్య రీజన్ మాట్లాడుతూ, "నువ్వు ఎప్పటిదో ఇష్యూ తీసుకొచ్చి నాకు ఓటు వేయకపోవడం వల్ల నాకు కెప్టెన్ అయ్యే అవకాశం పోయింది. అందుకే నామినేట్ చేస్తున్నా" అని శ్రీసత్య చెప్పింది. ఆ తర్వాత వచ్చిన గీతు కూడా ఆదిత్యని నామినేట్‌ చేసింది. తను నామినేట్‌ చేసాక రీజన్ చెప్పుకొచ్చింది. "బిగ్ బాస్ హౌస్ లో మ‌రీ ఇంత మంచిగా ఉండే వాళ్ళు ఉంటే బాగోదు.  'bigboss is not your cup of tea' అని గీతూ అనగా, "నేను నీకు సమాధానం చెప్పదలుచుకోలేదు" అని అనేసి వెళ్ళిపోయాడు. కానీ హౌస్ లో ఎక్కువ మందితో అన్న అని పిలిపించుకొనే వ్యక్తి ఆదిత్య. అలాంటిది అందరు అతన్ని నామినేట్ చేస్తుంటే ఒక రకమైన బాధతో కనిపించాడు. అయితే బాధలో కొన్ని ఎమోషనల్ గా మాట్లాడాడు. "నేను ఏ హౌస్ గురించి అయితే ఆలోచించానో, అదే హౌస్ నాకు ఇప్పుడు చాలా కొత్తగా అర్ధమౌతోంది. నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్ లో చూపించినప్పుడు అది అర్ధం కాలేదు ఇప్పుడు అర్ధం అవుతుంది" అంటు ఎమోషనల్ అయ్యాడు.  అయితే ఈ వారం ఆటలో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆదిత్యకి హౌస్ లో అందరు నెగటివ్ గా ఉన్నా, ప్రేక్షకులు ఓట్లు వేసి సేవ్ చేస్తారో లేదో చూడాలి మరి.

ఏదో ఒక దినంలే.. అడ్జస్ట్ ఐపో!

"ఆది హ్యాపీ బర్త్ డే" అనే కాన్సెప్ట్ తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సగం షో పంచ్ డైలాగ్స్ తో సరిపోయింది. ఇక రష్మీ ఎంట్రీ ఇచ్చి "ఆది గారు హ్యాపీ జనందినం" అని విష్ చేసేసరికి షాకైపోయాడు. "జనందినమా ఇంకా నా దినం అనలేదు..అది జనందినం కాదు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పాలి. తెలుగు పలకడం రాకపోతే ఇంగ్లీష్ లో హ్యాపీ బర్త్ డే" అనొచ్చుగా అనేసరికి "సర్లే..ఏదో ఒక దినం ఉంది కదా..అడ్జస్ట్ ఐపో" అంది రష్మీ. " మీ బర్త్ డే అంత స్పెషలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు" అని రష్మీ అడిగేసరికి "లీప్ ఇయర్ తల్లి..నా పుట్టిన రోజు నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది" అన్నాడు ఆది. ఇక ఈ వారం షోలో అందరూ వెరైటీగా సాంగ్స్ పాడారు. ఇక కండక్టర్ ఝాన్సీ, నెల్లూరు కవిత వచ్చి డాన్స్ అద్దిరిపోయేలా చేశారు. నాటీ నరేష్ తో, హైపర్ ఆదితో కూడా మాస్ స్టెప్స్ వేయించేశారు ఈ ఇద్దరూ. ఇక పటాస్ ప్రవీణ్ లైఫ్ స్టోరీని ఈ షోలో ఒక స్కిట్ గా వేసి అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక ఇంద్రజ మాట్లాడుతూ "ప్రవీణ్ కి నేనెప్పుడూ ఒక తల్లిలా ఉంటాను" అని చెప్పారు. 

‘నాకు మా అమ్మంటే చాలా ఇష్టం’.. ఆది ఎమోష‌న‌ల్ యాంగిల్‌!

బుల్లితెర మీద  హైపర్ ఆది  అందరినీ నవ్విస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు.  కౌంటర్లు, పంచులు, సెటైర్లతో అందరినీ  ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. ఐతే ఇక్కడ ఒకటి గమనిస్తే అందరూ తమ తమ  పర్సనల్ లైఫ్ ఈ స్టేజి మీద షేర్ చేసుకుంటారు కానీ ఆది ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోడు.  గతంలో తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాడు. కానీ ఇప్పుడు తన ఫామిలీ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. బాగా ఎమోషనల్ కూడా అయ్యాడు. స్టేజి మీదే ఏడ్చేశాడు. ఆది తన బాధను అందరి ముందు వినిపించి అందరినీ ఏడిపించేశాడు.  దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. "ఇది కదా పండుగంటే" అనే ఈవెంట్లో సంగీత, యాంకర్ రవి, రష్మీ, జబర్దస్త్ టీం అంతా వచ్చారు. రష్మీ మాట్లాడుతూ హైపర్ ఆది కోసం ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ ఒక వీడియో ప్లే చేసి చూపించింది. అందులో ఆది వాళ్ల అమ్మ మాట్లాడుతూ "అక్కడికి రావాలని ఉంది నాకు .. కానీ నేను రాలేను.. ఎక్కువ సేపు  నిల్చోలేను.. మోకాళ్ల నొప్పులు" అంటూ ఆది వాళ్ల అమ్మ చెప్పేసరికి దానికి ఆది "నాకు మా అమ్మంటే చాలా ఇష్టం" అని చెప్తూ  కన్నీరు పెట్టేసుకున్నాడు.  ఇక ఈ షోలో అమరదీప్, తేజు ఇద్దరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి లవ్ ప్రొపోజ్ చేసుకున్నారు. "బాగా ప్రొపోజ్ చేసావ్ అమర్..ఇంటికి వెళ్లి నేను కూడా మా ఆయన్ని అడగాలి ఇలాగే ప్రొపోజ్ చేయమని" అంది సంగీత. తర్వాత యశస్వి సింగింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఆది, పోసాని కృష్ణమురళి ఇద్దరూ కలిసి "టెంపర్" మూవీలో పోలీస్ సీన్ ని స్పూఫ్ గా చేసి పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు.

ఇదీ వాసంతి కృష్ణన్ రెమ్యూనరేషన్!

బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ గా కనిపించేదెవరు?.. అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు వాసంతి. ఈమె తిరుపతిలో జన్మించింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అందుకే ఆమె పేరు చివరన తన తండ్రి పేరుతో కలిపి 'వాసంతి కృష్ణన్' అని యాడ్ చేసుకుంది. ఈమె బెంగుళూరులో ఏవియేషన్ కోర్స్ పూర్తి చేసి, మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తర్వాత సీరియల్స్ లో యాక్ట్‌ చేస్తోంది. అంత‌టితో స‌రిపెట్ట‌క‌ కన్నడలో నాలుగు సినిమాలు కూడా చేసింది. అయితే అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.   2019లో ఆమెకు తెలుగులో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో 'సిరిసిరి మువ్వలు', 'గోరింటాకు',  'గుప్పెడంత మనసు' సీరియల్స్‌లో నటించింది. ఈమె యాక్టర్ కాకపోయుంటే పైలట్ అయ్యేదట. ఈ విధంగా తన కెరియన్ ని స్టార్ట్ చేయగా తన ప్రతిభతో, ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఈమె హౌస్ లో పెర్ఫార్మన్స్ కంటే గ్లామర్ రోల్ ప్లే చెయ్యడంపై ఎక్కువ శ్రద్ద చూపిస్తోంది. అయితే హౌస్ లో మాత్రం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చెయ్యట్లేదు.  మొన్న నాగార్జున కూడా "గ్లామర్ మీద కాకుండా ఆటలో కూడా ఏకాగ్రతను చూపు" అని చెప్పడం గ‌మ‌నార్హం. చాలా సార్లు వేస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య హౌస్ లో ఎవరితో కూడా గొడవ లేకుండా, అందరితో సన్నిహితంగా ఉంటోంది. అయితే ఒక అర్జున్ తో మాత్రం కాస్త ఎక్కువ చనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్ మేట్స్ కి కూడా అర్జున్, వాసంతి మధ్య ఏదో జరుగుతుంది అనే అనుమానం లేకపోలేదు.  ఆ తర్వాత  వీకెండ్ లో రోహిత్ కోసం ఒకరు త్యాగం చెయ్యాలి అని నాగార్జున అంటే తను ఒప్పుకొని తన జుట్టుని భుజాల వరకు  కత్తిరించుకుంది. ఈవిధంగా చేయడం వల్ల హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జున కూడా మెచ్చుకున్నారు. అయితే హౌస్ లో జరిగే గేమ్ లో ఆమె పర్ఫామెన్స్, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాసంతి రెమ్యూనరేషన్ రోజుకి ఇరవై అయిదు వేల నుండి ముప్పై వేల వరకు ఉంటుందని బయట తెలుస్తోంది. హౌస్ లో జరిగే టాస్క్ లలో యాక్టివ్ గా ఉంటూ, ఎంటర్టైన్మెంట్ ఇస్తే విజేతగా నిలుస్తుంద‌ని అని ప్రేక్షకులు భావిస్తున్నారు. మ‌రి మున్ముందు ఆమె ప‌ర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

'నీలాంటి లెక్చరర్ ఉంటేనా మాములుగా ఉండేది కాదు'!

"గుప్పెడంత మనసు" స్టార్ మాలో మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. రిషి సర్, వసుధారా బుల్లితెరపై మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ రొమాంటిక్ జోడి స్టార్ మా చేసే ఈవెంట్లు, స్పెషల్ షోల్లో కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు " ఆదివారం విత్ స్టార్ మా  పరివారం" అనే పేరుతో ఒక షోని తీసుకొచ్చింది. ఇందులో శ్రీముఖి, అవినాష్, ఎక్స్ ప్రెస్ హరి వచ్చి నవ్విస్తూ ఉంటారు. ప్రతీవారం కొన్ని  సీరియల్ జంటలు ఈ షోలో ఎంటర్టైన్ చేసి వెళ్తుంటాయి . అయితే ఈ వారం మాత్రం గుప్పెడంత మనసు సందడి చేసింది. జగతి, మహేంద్ర, దేవయాని,  రిషి,వసు ఇలా అందరూ వచ్చారు. ఇక  ఈ ఈవెంట్లో రిషి వసు స్పెషల్ పెర్ఫార్మెన్స్  ఇచ్చి సందడి చేశారు. పుష్పరాజ్‌గా రిషి , శ్రీవల్లిగా వసు డాన్స్ చేశారు. ఇక శ్రీముఖి రిషి మీద ఒక పంచ్ వేసింది. " మీలాంటి లెక్చరర్ మా కాలేజీలో ఉంటేనా అంటూ తన చున్నీని తానే చింపేసుకునేంత రెచ్చిపోయింది." "ఈ షోకి యాంకర్ శ్రీముఖి ఐతే ఎలా రావాలి ఒక రేంజ్ లో రావాలి అందుకే ఇంత మేకప్ చేసుకుని వచ్చా" అని రిషి కౌంటర్ వేసాడు. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద సుదీప కామెంట్స్!

బిగ్ బాస్ హౌస్ నుంచి సుదీప ఎలిమినేట్ ఐపోయి బయటికి వచ్చేసింది. ఇక బయటికి వచ్చిన సుదీప కొన్ని ఇంటర్వూస్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. "కీర్తిభట్ చాలా మంచిది. ఏదైనా స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటుంది. కానీ అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది. అది తగ్గించుకుంటే మంచిది. ఫైమా ఇంకా చిన్న పిల్ల. చాలా కూల్. కాకపోతే ఇంకా ఇమ్మెచ్యూర్.. ఫైమా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చింది. షీ ఈజ్ స్వీట్.  ఇక హౌస్ లో ఉన్న 20 మందికి రెండు వాష్ రూమ్స్, రెండు స్నానాల గదులు మాత్రమే ఉంటాయి. అందరూ టైంకి రెడీ అవ్వాలి అంటే కొంచెం  కష్టమే మరి. హౌస్ లో ఉండేవాళ్ళకు  స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక బిగ్ బాస్ టీమ్  నాకు హై రెమ్యూనరేషన్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే వెళ్ళలేరు, రావాలి అనుకుంటే రాలేరు. ఇక లవ్ ట్రాక్స్ విషయం గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు..నాకు ఇచ్చిన వర్క్ నాకే సరిపోయేది..దాంతో అనవసర విషయాలను పెద్దగా పట్టించుకోను. ఇక గీతూ విషయానికి వస్తే గేమ్ గురించి మొత్తం తెలుసుకుని వచ్చింది కాబట్టి గేమ్ ని గేమ్ లాగే ఆడుతోంది. ఇక నా ఎలిమినేషన్ గురించి నెగటివ్ టాక్ ఏమీ రాలేదు పాజిటివ్ టాక్ వచ్చింది. అది హ్యాపీ. పింకీ అంటే వంటగది అనే కామెంట్ మంచి విషయమే కదా" అంటూ సుదీప ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది

ఇనయా.. పొద్దుతిరుగుడు పువ్వు!

బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్స్ లాగా కలిసిపోయి, విడిపోతూ ఉంటారు కంటెస్టెంట్స్. అయితే కొందరు మాత్రం, ఆటలో పెర్ఫార్మన్స్ కంటే కూడా మిగతా వారిని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. కాగా ఈ మధ్య సూర్య తో ఎక్కువ సన్నిహితంగా ఉంటోంది ఇనయా. ఈ విషయమే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు, హౌస్ మేట్స్ కి కొత్త ప్రేమ కథలా తోస్తోంది. ఇలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. మొన్న జరిగిన టాస్క్ లో " హౌస్ లో నీ క్రష్ ఎవరూ? ఎందకు?" అని బిగ్ బాస్ అడుగగా, "సూర్య అంటే నాకు‌ ఇష్టం అని" చెప్పేసింది. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే. అయితే సూర్య కూడా ఆరోహి వెళ్ళిపోయినా తరువాత ఇనయాతో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నాడు. ఇనయా కూడా సేమ్ అలానే ప్రవర్తిస్తోంది. తను గేమ్ పై ఫోకస్ చేయట్లేదు  అని శనివారం రోజు నాగార్జున చెప్పడం జరిగింది. కాగా ఎప్పుడు కూడా సూర్య పక్కనే కన్పించడం, ప్రేక్షకులకు సైతం ఉన్న డౌట్స్ ని క్లియర్ చేసింది. నాగార్జున ఒక గేమ్ లో కూడా బజర్ దగ్గర సూర్య, ఇనయా ఉండగా, "దూరంగా ఉండు బజర్ కి కాదు ఇనయాకి" అని అన్నాడు. ఇనయా మాత్రం హౌస్ లోకి ఒక సూర్య కోసం మాత్రమే వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది. ఇనయ మొదటి రెండు వారాలు సూపర్ గా అడి, నాగార్జున మెప్పుపొందింది. కాగా ఈ శనివారం మాత్రం "పర్ఫామెన్స్ సరిగ్గా లేదని గేమ్ మీద పెట్టు దృష్టిని" అని చిన్నగా హెచ్చరించాడు.  నాగార్జున, ఇనయాని "పొద్దుతిరుగుడు పువ్వు లాగా సూర్య వైపే ఉంటున్నావ్" అని అనడం తో, "అలాగేం‌ లేదు సర్, ఇక నుండి ఆలా ఏం ఉండదు." అంటోంది ఇనయ.  ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని నాగార్జున , సుదీపతో అనగా, సుదీప మాట్లాడుతూ, "సూర్య ఉన్నాడుగా, అందుకే నవ్వుతూనే ఉంటుంది" అని చెప్పింది. ఈ రోజు ఇచ్చిన టాస్క్ లో కూడా 'సొల్లు ఆపు దమ్ముంటే నన్ను ఆపు' అనే ట్యాగ్ డైలాగ్ ఉన్న బోర్డు వేసి వివరించింది. "మొన్న  టాస్క్ లో నన్ను  ఆడనివ్వడం లేదు సార్. నా చేతిలోని బాల్ ని లాగేసుకున్నాడు" అని చెప్పడం తో సూర్య మట్లాడుతూ,  "లాగేసుకోవడం కాదు సార్, నేను గేమ్ ఆడుతున్న" అని చెప్పాడు. దానికి సమాధానంగా, "దమ్ముంటే ఇక ముందు ఆపు" అంటూ సెటైర్లు  వేసింది ఇనయా. రాబోయే రోజుల్లో ఇనయ ఆటలో పెర్ఫార్మన్స్ చూపిస్తుందో లేక క్రష్ అనుకుంటూ, సూర్య వెనకాల తిరుగుతుందో చూడాలి.

మాకు గీతు వ‌ద్దు!

బుల్లితెరకి కొత్త గ్లామర్ ని, రేటింగ్స్ కి గ్రామర్ ని తీసుకొచ్చిన బిగ్ బాస్  కొత్తదనాన్ని మోసుకొచ్చింది. కంటెస్టెంట్స్ తో కొత్త టాస్క్ లు ఆడిస్తూ, ఎలిమినేషన్ ప్రకియను కొనసాగించాడు నాగార్జున. గీతుని ఓ ఆట ఆడుకున్నాడు. "స్టోర్ రూం కి వెళ్ళు రేవంత్" అని నాగార్జున అనగా,"పాపం రేవంత్ కి కాలు నొప్పి ఉంది సర్. వేరే ఎవరినైనా పంపించండి." అంది గీతు. "సరే.. నువ్వు వెళ్ళు గీతు" అని చెప్పాడు నాగ్‌. అలా ప్రతీసారి గీతునే స్టోర్ రూం కి పంపించాడు. ఇది సరదగా సాగింది. ఆ తర్వాత టాస్క్ లో గీతు సేవ్ అవ్వగా, "నాకు ఓట్లు వేసి సేవ్ చేసిన అందరికి థ్యాంక్స్, మీ అందరి ఇంట్లో కూడా నాలాంటి ఒక అమ్మాయి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా" అని గీతు చెప్పింది. ఇది విని నాగార్జునతో పాటుగా ఉన్న ప్రేక్షకులు "మాకు వద్దు" అంటూ అరిచారు. దాంతో గీతు అలిగినట్టుగా అనిపించింది. ఆ తర్వాత నార్మల్ టాస్క్ లు పెడుతూ, ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. చివరలో ఎలిమినేషన్ లో ఆదిత్య, సుదీప ఉండగా సుదీప ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే టాస్క్ గెలిచిన వారికి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. హ్యాంపర్ ఇస్తూండగా, హ్యంపర్ సైజ్ పెంచాలని రేవంత్ సరదాగా చెప్పాడు. నిన్నటి ఎపిసోడ్ ఇలా సరదగా, సంద‌డిగా గడిచింది.

హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎమోష‌న‌ల్ అయిన‌ సుదీప!

బిగ్ బాస్ హౌస్ నుండి ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకి వచ్చేస్తుంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. కాగా ఈసారి అనుకోకుండా సుదీప ఎలిమినేట్‌ అవ్వడం అనేది అటు హౌస్ మేట్స్ ని, ఇటు ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు హౌస్ లో చలాకీగా ఉండే సుదీప, తన లాజిక్ మాటలతో నామినెట్ లో అవతలి కంటెస్టెంట్ నుండి మాట రాకుండా ముక్కు సుటిగా మాట్లాడే వ్యక్తి.   సండే ఫండే అంటూ ఒక వైపు గేమ్స్ ఆడిస్తూ, మరో వైపు నామినేషన్లో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేస్తు వచ్చాడు నాగార్జున. ఇలా సేవ్ చేయగా, చివరగా సుదీప, ఆదిత్య మిగిలారు. కాగా హౌస్ లో అన్నా చెల్లెళ్లుగా చెప్పుకునే వీరిద్దరిలో ఒకరు సేవ్ అయి, మరొకరు ఎలిమినేట్ అవ్వడం అనేది సుదీప, ఆదిత్యకి బాధ కలిగించే విషయమే. గీతుని రెండు బ్యాటరీలు తీసుకురమ్మన్నాడు నాగార్జున.  ఆ తర్వాత  "ఎవరి బ్యాటరీ అయితే ఫుల్ గా ఉంటుందో వాళ్ళు సేవ్, ఎవరిది అయితే సున్నా ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయి ఇక్కడికి వస్తారు" అని నాగార్జున చెప్పాడు. ఆదిత్యది ఫుల్ ఛార్జ్ అయ్యి సేవ్ కాగా, ఎలిమినేట్ అయింది సుదీప. నిన్న మొన్నటి వరకు ఓటింగ్ లో చివరి స్థానం ఉండడంతో ఎలిమినేట్ అయింది. సుదీప హౌస్ నుండి బయటకొస్తుంటే హౌస్ మేట్స్ అందరు కంటతడి పెట్టుకున్నారు. కాగా ఆదిత్త మాత్రం, "తను నాకు బాగా దగ్గరైంది. ఒక అక్కలాగా కేరింగ్ తీసుకునేది. చాలా మంచిది" అంటూ ఏడ్చేసాడు. హౌస్ మేట్స్ కి 'బై' చెప్పి సుదీప హౌస్ నుండి బయటకొచ్చేసింది. ఆ తర్వాత నాగార్జున ఉన్న స్టేజ్ మీదకి వచ్చింది. నాగార్జునతో కలిసి తన జర్నీ వీడియోను చూసి కాసేపు నవ్వుకొని, చివరగా  ఏడ్చేసింది. ఆ తరువాత హౌస్ మేట్స్ గురించి చెప్పాలి. అక్కడ ఉన్న కూరగాయల్లో ఎవరికీ ఏది సెట్ అవుతుందో అది వాళ్లకు ఇచ్చేయ్ అని నాగార్జున చెప్పగా, ఎవరి స్వభావం ఎలాంటిదో దాన్ని బట్టి కూరగాయలు వాటి లక్షణాలు తెలుపబడ్డాయి అని చెప్పగా, ఒక్కొక్కరికి ఒక్కో ఐటెమ్ ఇచ్చింది సుదీప. "సుదీప అక్క, నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. నన్ను బాగా చూసుకున్నారు. నాకు నిన్ను అలా‌ మనసులో తిట్టుకున్నందుకు రీగ్రేట్ గా అనిపిస్తోంది" అని గీతు చెప్పడంతో, సుదీప కొంచెం ఎమోషనల్ అయింది. కాగా నాగార్జున, "అయినా నీకు ఎమోషన్స్ ఏంటి గీతు" అని నాగార్జున సరదాగా‌ అనడంతో అందరు నవ్వేసారు. ఆ తర్వాత ‌ఇక టైం అయ్యిందని చెప్పి సుదీపని బయటికి పంపించేసాడు నాగార్జున.

బిగ్ బాస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి!

బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఇస్తోన్న శ్రీసత్య, అర్జున్ ల మధ్య క్రష్ గురించి మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతోన్న సీన్లు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయని చెప్పుకొవాలి. ప్రతి సీజన్లో కంటెస్టెంట్ కి క్రష్ ఉండడం కామన్ గా మారిపోయింది. అలా ఎవరో ఒకరితో అయిన క్రష్ ఉంటే, హౌస్ లో ఎక్కువ రోజులు ఉంచుతారన్న విషయం కంటెస్టెంట్స్ కి బాగా తెలుసు అనుకుంట. అందుకే హౌస్ లో ఆటలో పెర్ఫార్మన్స్ కంటే ఇంప్రెస్స్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు కంటెస్టెంట్స్. సీజన్లో మొదటి వారం నుండి అర్జున్ కి, శ్రీసత్య అంటే ఇష్టం అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కాగా శ్రీసత్య మాత్రం అర్జున్ తో మాట్లాడడమే మానేసింది. బిగ్ బాస్ 'హోటల్ టాస్క్' లో కూడా శ్రీసత్యకు ఫేవర్ గా ఆడడంతో హౌస్ మేట్స్ కి కోపం వచ్చింది. తర్వాత నాగార్జున కూడా మంచి కౌంటర్ ఇచ్చాడనే చెప్పాలి. కాగా శ్రీసత్య మిగతా హౌస్ మేట్స్ తో సన్నిహితంగానే ఉన్నా కూడా అర్జున్ తట్టుకోలేకపోతున్న సందర్భాలు లేకపోలేదు. శ్రీసత్య మాత్రం తన గేమ్ తన కోసం మాత్రమే ఆడుకోడానికి హౌస్ లోకి వచ్చాను అని చాలా సార్లు చెప్పింది. అర్జున్ కి కూడా పలుమార్లు 'నా మీద కాకుండా గేమ్ మీద ఫోకస్ చెయ్' అని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. ఒక వారం, " ఏం అర్జున్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా" అని నాగార్జున అన్నాడు. ఈ మధ్య వసంతి తో కూడా ఎక్కువ క్లోజ్ ఉండడం వల్ల, ఆ మాట అన్నట్లు తెలుస్తోంది.  రెండు రోజులుగా హౌస్ లో శ్రీసత్య, అర్జున్ ల మధ్య చిన్న హీటెడ్ ఆర్గుమెంట్ జరుగుతూ వస్తోంది. "నన్ను ప్రొవొక్ చేస్తున్నావ్" అంటూ అర్జున్ తో శ్రీసత్య అనగా, "నేను అలా అనలేదు" అని అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత నాతో మాట్లాడకు అని అర్జున్ తో చెప్పింది శ్రీసత్య. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రేక్షకులు డైరెక్ట్ గా, "పాపం అర్జున్, కాస్త పట్టించుకో. మాకు ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలి" అని చెప్పారు. అయితే అర్జున్ తో శ్రీసత్య మాట్లాడి, ఎంటర్టైన్మెంట్ ఇంకా పెంచుతుందో లేదో చూడాలి.

'బిగ్ బాస్' ఆరోహి కన్నీటి గతం.. రెమ్యూనరేషన్ కూడా తక్కువేనట!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్లో మీడియా నుండి ఒక కంటెస్టెంట్ ని తీసుకోవడం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సారి ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ గా చేస్తొన్న ఆరోహి రావ్ హౌస్ లోకి అడుపెట్టింది. ఆరోహి రావ్ అసలు పేరు అంజలి. ఈమె వరంగల్ లో జన్మించింది. ఈమె చిన్నప్పుడే తల్లి చనిపోతే, తండ్రి వేరే పెళ్లి చేసుకొని, పిల్లలని వదిలి వెళ్లి పోయాడు. తనకి ఒక సోదరుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. ఒకానొక టైంలో వీళ్ళకి సరిగ్గా తినడానికి కూడా తిండి దొరికేది కాదట. ఆరోహి గవర్నమెంట్ స్కూల్ లో చదివింది. ఒక ప్రైవేట్‌ కాలేజీలో M.B.A పూర్తి చేసింది. అయితే తనకు చిన్నప్పటి నుండి యాంకరింగ్ అంటే ఆసక్తి ఉండేదంట. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి యాంకర్ గా ప్రయత్నం మొదలు పెట్టింది. ఒక హాస్టల్ లో ఉండేది. తను ఎప్పుడు కష్టాలను ఇంటిపేరుగా, కన్నీళ్లను ముద్దుపేరుగా చెప్పుకుంటూ ఉండేది. తనకు తన చుట్టు ఉన్న వాళ్ళలో 'మేము ఉన్నాం అనే వాళ్ళ కంటే, మాకేంటి అనే వాళ్ళే ఎక్కువ' అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. కొన్ని రోజులకి ఒక చిన్న ఛానెల్ లో అవకాశం రాగా, డబ్బులు సరిపోక కొన్ని రోజులకి అందులో నుండి బయటకి వచ్చేసి, మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ అడిషన్స్ కి వెళ్లగా, అక్కడ ఆరోహి చలాకీతనం, తెలంగాణ యాసలో మాట్లాడం చూసి సెలక్ట్ చేసారట. ఇస్మార్ట్ న్యూస్ లో ఆరోహి సెటైర్ లు, ఇంకా యాస జనాలకు నచ్చడంతో ఆరోహి పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి పంతొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆరోహి, హౌస్ లో మొదటి వారం నుండి అన్నింటిలోను చురుకుగా పాల్గొంది. అయితే హౌస్ లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ లిస్ట్ లో, గీతు తరువాత ఆరోహి అనే చెప్పేస్తారు ఈ షో చూసే ప్రేక్షకులు. కాగా హౌస్ లో అందరితో గొడవలు పెట్టుకోవడం ఒకటి తనకి మైనస్ అని చెప్పుకోవాలి. నామినేషన్ లో నుండి చాలా సార్లు సేవ్ అయినా, కానీ అయిదవ వారం ఓటింగ్ లో చివరి స్థానం ఉండడంతో బయటకొచ్చేసింది. తను బయటికి రావడానికి ఒక రకంగా సూర్య అనే చెప్పుకోవాలి. హౌస్ లో జరిగే అటలో పర్ఫామెన్స్ ఏమీ ఇవ్వకపోగా, సూర్యతో చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం ప్రేక్షకులకు చికాకు తెప్పించింది అని అనడంలో ఆశ్చర్యం లేదు. వీరిద్దరిని చూసి హౌస్ లో లవర్స్ అని చాలా మందే అన్నారు. నాగార్జున ఒక సారి అడుగగా మేము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది. తను బయటకొచ్చాక హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "టాప్-5 లో ఉంటా అనుకున్నా, కానీ అయిదవ వారమే బయటికి రావడం చాలా బాధగా ఉంది" అంటు చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యూనరేషన్ గురించి మీరు రోజుకి నలభై వేల వరకు తీసుకున్నారంట కదా అని అడుగగా, "అలాంటిదేమీ లేదు. నేను అంత ఏమీ తీసుకోలేదు" అని మాట దాటేసింది. అయితే తను రోజుకి పదిహేను నుండి ఇరవై వేల వరకు తీసుకుందని బయట వినిపిస్తోంది.

కంటెస్టెంట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!

బిగ్ బాస్ హౌస్ లో నిన్న మొన్నటిదాకా జరిగిన బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో రోహిత్ ఏడ్చాడు. అది ఎవరు పట్టించుకోకుండా, ఎవరికి వాళ్ళు తమ‌ సొంత ప్రయోజనం చూసుకోవడంతో కంటెస్టెంట్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అయితే మొన్న జరిగిన టాస్క్ లో బ్యాటరీ మొత్తం జీరో అయింది. అప్పుడు " మీలో ఒకరు రానున్న రెండు వారాలు వరుసగా నామినేషన్లో ఉండటానికి సిద్ధపడితే బ్యాటరీ మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవుతుంది" అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వివరించాడు. కాగా ఈ త్యాగానికి రోహిత్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ తమ అవకాశాలను వినియోగించుకోగా, ఒక్కరు కూడా రోహిత్ ని మీ వల్లే మాకు అవకాశం వచ్చింది మొదట మీరు తీసుకోండి ఛాన్స్ అని ఎవరు అనకపోవడంతో, నాగార్జున గట్టిగా అడిగాడు. దీంతో తప్పు చేసినట్టు అందరు తలదించుకొన్నారు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, మీరెవరూ రోహిత్ త్యాగాన్ని గుర్తించనందుకు మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు తీసుకుంటారో చెప్పండని అనగా వసంతి నేను తీసుకుంటానని ఒప్పుకుంది. తర్వాత పనిష్మెంట్ కోసం కన్ఫెషన్ రూంలోకి వెళ్ళిన‌ వసంతికి బిగ్ బాస్ "Cut your Hair Up to shoulder " అని చెప్పగా అలాగే అని ఒప్పుకొంది. ఈ పనిష్మెంట్ మీ అందరికీ, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని నాగార్జున చెప్పుకొచ్చాడు.

రాత్రి పూట దుప్పటి కప్పుకొని ఏడ్చాను!

బిగ్ బాస్ హౌస్ కొత్త కొత్త టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. గీతుని కన్ఫెషన్ రూం కి వెళ్ళమని చెప్పి కాసేపు ఆటపట్టించాడు. కన్ఫెషన్ రూం అనే పేరు చెప్పగానే కంటెస్టెంట్స్ అందరు ఒకరకమైన భయానికి లోనవుతోంటారు, దీనికి అందులో ఇచ్చే సీక్రెట్ టాస్క్ ముఖ్య కారణం. అయితే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే ప్రకియలో భాగంగా నిన్న శ్రీసత్య సేవ్ అయింది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ఆటతీరుకి, గుడ్, యావరేజ్, డెడ్ అనే మూడు ఇచ్చాడు. గీతు మాటతీరుకి గుడ్, కానీ ఆట సరిగ్గా ఆడనందుకు యావరేజ్ ఇచ్చాడు నాగార్జున.   గీతు "నేను కన్ఫెషన్ రూం కి వెళ్తాను సర్" అని చెప్పగా నాగార్జున సరే అన్నాడు. గీతు కన్పేషన్ రూం కి వెళ్ళాక, "ఎందుకమ్మ గేమ్ అలా ఆడావ్" అని అనగా, "వేస్ట్ సర్. అది తుప్పాస్ టాస్క్" అని చెప్పింది. "గీతు కి తగిన టాస్క్ లు వస్తేనే కదా సర్, పర్ఫామెన్స్ చేసేది. అలాగే బిగ్ బాస్ తో ఛాలెంజ్ చేస్తున్న సర్, ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ నన్ను కొట్టి పడేస్తా అంది. అక్కడ నాకు పాజిటివ్ వైబ్ రాలేదని కొంచెం అనిపించింది. ఎక్కడ ఆదిరెడ్డి నాకు దూరం అవుతాడోనని, రాత్రి పూట దుప్పటి కప్పుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చాను సర్. బిగ్ బాస్ ఫ్యామిలీ ఎమోషనస్ కి విలువ ఇచ్చే విధానం నాకు బాగా నచ్చింది. ఈ సీజనే కాకుండా నెక్ట్ సీజన్ కూడా బిగ్ బాస్ కి వస్తాను సర్. కొంచెం రికమెండేషన్ చేయండి." అని చెప్పుకొచ్చింది గీతు. కాగా " డెఫినెట్లీ రికమెండేషన్ డన్. నిన్ను అస్సలు తీసుకురావొద్దని బిగ్ బాస్ కి చెబుతాను" అని నాగార్జున సరదగా అన్నాడు. తర్వాత "ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాట తీరు కొంచెం రూడ్ గా అనిపిస్తోంది. అది ఒక్కటి చూస్కో" అని నాగార్జున ఒక టిప్ ఇచ్చాడు గీతు కి.

'రాయబారమై' వన్ మినిట్ మ్యూజిక్ కి రీల్స్ ని ఇన్వైట్ చేసిన కాంబో సింగర్స్ సునీత, సత్యాయామిని!

"నీలి నీలి కళ్ళలోని చిన్ని చిన్ని ఆశాలేవో అల్లుకున్నవి".. ఇన్స్టాగ్రామ్ లో దూసుకుపోతున్న ఒక రొమాంటింక్ సాంగ్.  ఇద్దరు  అద్భుతమైన సింగర్స్ కలిస్తే ఆ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..ఐతే ఇన్స్టాగ్రామ్ లో సునీత ఈ మధ్య వన్ మినిట్ మ్యూజిక్ పేరుతో హాష్ టాగ్ క్రియేట్ చేసి "రాయబారమై" అంటూ ఒక సాంగ్ పాడారు. నిజం చెప్పాలంటే ఈ సాంగ్ విన్న ఎవరైనా మైమరిచిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు సింగర్ సునీతతో మరో సింగర్ సత్యాయామిని కొలాబరేట్ అవుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అనౌన్స్ చేశారు.  అలాగే ఈ పాటకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయని చెప్పారు.  ప్రేక్షకులు ఈ మినిట్ మ్యూజిక్ ని ఆదరించి పెద్ద సక్సెస్ చేసినందుకు తన పేజీ ద్వారా సునీత విషెస్ చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ "వన్ మినిట్ మ్యూజిక్ రాయబారమై" అనే సాంగ్ కి రీల్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు ఈ సింగర్స్ ఇద్దరూ కలిసి. ఐతే రీల్స్ చేసి "హాష్ టాగ్ వన్ మినిట్ మ్యూజిక్" అని పెట్టి ఈ సింగర్స్ ని టాగ్ చేయమని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కోరారు. "ఈ సాంగ్ తో మీరేం చేస్తారో మేం చూస్తాం" అంటూ అనౌన్స్ చేశారు. దానికి ఇక నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.  "సునీత, సత్య యామిని కాంబో అదుర్స్ , వండర్ ఫుల్" అంటూ కామెంట్స్ చేశారు. మరి ఈ సాంగ్ మీరు కూడా విన్నారు కదా. మీకు నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం ఒక అద్భుతమైన రీల్ చేసేసి ఆ ఇద్దరి సింగర్స్ ని ట్యాగ్  చేసేయండి...ఏమో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో తెలీదు కదా. ఈ సాంగ్ తో మీరు కూడా ఫేమ్ తెచుకోవచ్చేమో... ట్రై చేసేయండి మరి

అవినాష్ లో ఆడవేషాలు..శ్రీముఖిలో మగ వేషాలు ఉన్నాయేమిటి?

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఆడియన్స్ లో జోష్ నింపడానికి వాళ్లకు ఇష్టమైన సీరియల్ యాక్టర్స్ ని తీసుకుని రాబోతోంది. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో భాగంగా "మల్లి", "గుప్పెడంత మనసు" సీరియల్ టీమ్స్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈ షోకి హోస్ట్స్ గా శ్రీముఖి, అవినాష్ వ్యవహరించారు. అవినాష్ గుప్పెడంత మనసు నుంచి దేవయాని, జగతితో కలిసి డాన్స్ చేసాడు కానీ ఆ సాంగ్ కి కొన్ని మాస్ స్టెప్స్ వెయ్యాలి అవి వెయ్యకపోయేసరికి  శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఇలా కాదు ఇలా వెయ్యాలి అంటూ స్టెప్స్ చూపించింది. ఇంతలో ఎక్స్ప్రెస్ హరి వచ్చి "అవినాష్ లో ఆడ వేషాలు..శ్రీముఖిలో మగ వేషాలు ఉన్నాయేమిటి ..?" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి లేచి " రిషి సర్..మీరు వసుధారను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు" అని అడిగింది..దానికి మల్లి కౌంటర్ వేసింది. "నా పేరు మల్లి..చేసుకోండమ్మా పెళ్లి " అనేసరికి స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు. తర్వాత జగతి "నరుడా ఓ నరుడా" సాంగ్ కి , రిషి సర్, వసు కలిసి పుష్ప నుంచి "రారా సామి" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక ఆడియన్స్ నుంచి ఒకామె లేచి "రిషి సర్, వసు ఎప్పుడూ మనసులోనే మాట్లాడుకుంటారు..బయటికి ఎందుకు మాట్లాడుకోరు" అని అడిగేసరికి " గుప్పెడంత మనసు అని సీరియల్ కి పేరు పెట్టినప్పుడు మనసులో మాట్లాడుకోకపోతే ఎలా ఉంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు. దాంతో  అందరు చప్పట్లు కొట్టారు. చివరికి సోషల్ మీడియాలో శ్రీముఖి రచ్చ మీద అవినాష్, హరి కలిసి ఒక రేంజ్ లో ఆమెను ఆడేసుకున్నారు. దాంతో అసలు తానెక్కడుందో అర్ధం కాక " నేనెక్కడున్నా" అని అడిగేసరికి " సండే 11 ..ఎంటర్టైన్మెంట్ కి హెవెన్" ఎక్కడున్నావ్ అని ఆన్సర్ ఇచ్చారు.

హౌస్ లో కొత్త కెప్టెన్ గా  సూర్య!

బిగ్ బాస్ హౌస్ లో గత మూడు రోజులుగా సాగుతోన్న కెప్టెన్సీ టాస్క్ నిన్నటితో ముగిసింది. అయితే చివరగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే టాస్క్ జరిగింది. ఇందులో కెప్టెన్ పోటీదారులుగా శ్రీసత్య,  వసంతి, అర్జున్ ,ఆదిరెడ్డి, రేవంత్, సూర్య, రాజ్,  రోహిత్ లు ఉండగా, ఇందులో ఫైమా సంచాలకులురాలిగా వ్యవహరించింది. కాగా టాస్క్ నియమాలు బిగ్ బాస్ వివరించాడు. "పోటీదారుల ఫోటో మరియు పేరుతో ఉన్న పూలకుండీలు ఉంచబడ్డాయి. అయితే బజర్ రాగానే ఎవరు అయితే వారి పేరుతో ఉన్న  పూలకుండి కాకుండా వేరే వాళ్ళది తీసుకువస్తారో వారు సేఫ్, వారిది వారు తీసుకెళ్తే గేమ్ నుండి అవుట్ అవుతారు. అందరికంటే చివరగా  తెచ్చిన పోటీదారులు మరియు  తన చేతిలో ఎవరి పూల కుండి ఉంటుందో వారు, ఇద్దరు మిగత హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని, ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే టాస్క్ లో కొనసాగుతారు. మిగతా పోటీదారు టాస్క్ నుండి తొలగించబడతాడు" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఈ టాస్క్ లో  మొదటగా రాజ్ తన పూల కుండి తానే తెచ్చుకోవడం వల్ల టాస్క్ నుండి తొలగిపోగా, తర్వాత చివరగా ఆదిరెడ్డి, వసంతి వచ్చారు. హౌస్ మేట్స్ ఓట్లలో ఎక్కువ ఆదిరెడ్డికి రాగా, ఆదిరెడ్డి గేమ్ లో ముందుకెళ్ళాడు. వసంతి టాస్క్ నుండి తొలగించబడింది. తర్వాత రేవంత్, శ్రీసత్య మిగిలారు. ఓట్లు శ్రీసత్యకి ఎక్కువ వచ్చాయి. తను ముందుకెళ్ళగా, రేవంత్ తొలగించబాడ్డాడు. తర్వాత అర్జున్ మరియు రోహిత్ మిగిలారు. రోహిత్ టాస్క్ లో ముందుకెళ్ళగా, అర్జున్ తొలగిపోయాడు. చివరగా సూర్య మరియు రోహిత్ ఉండగా రోహిత్ కు ఎవరు సపోర్ట్ చెయ్యలేదు. సూర్యకి హౌస్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ రావడంతో, సంచాలకులురాలిగా వ్యవహరించిన ఫైమా, కెప్టెన్ గా సూర్యని ప్రకటించింది. ఆ తర్వాత కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన సూర్యకి, హౌస్ మేట్స్ అందరు కృతజ్ఞతలు తెలిపారు. "రాజు ఎక్కడున్నా రాజే" అంటూ ఇనయా అనగా, సూర్య 'ప్రభాస్' లా మిమిక్రీ చేసి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక హౌస్ లో తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడో చూడాల్సి ఉంది.

రోహిత్ త్యాగానికి విలువ లేదా?

బిగ్ బాస్ హౌస్ లోకి జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ ఇద్దరు కూడా బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ తీరుతో రోహిత్ బాధపడ్డాడు. తన త్యాగానికి విలువ లేదా అన్నట్లు ప్రేక్షకులు భావిస్తోన్నారు. నిన్న మొన్నటి వరకు కొనసాగిన ఈ టాస్క్, మెరీనా-రోహిత్ జంటను బాధ పెడుతోందనే చెప్పాలి.  హౌస్ లో దాదాపుగా అందరు తమ ఫ్యామిలీతో మాట్లాడారు. కానీ అవకాశం రానిది మెరీనా-రోహిత్ జంటకి మాత్రమే. హౌస్ మేట్స్ ఎవరు కూడా తన త్యాగానికి విలువ ఇవ్వలేదు అని బాధపడ్డాడు రోహిత్. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ లో తనకి వచ్చిన అవకాశాన్ని లాగేసుకుంది సుదీప. అలా చేసినందుకు కొందరు సుదీప చేసింది తప్పు అని కూడా చెప్పారు. కెప్టెన్సీ  టాస్క్ లో ఎనిమిది మంది పోటీదారులుగా ఉండగా, చివరగా సూర్య, రోహిత్ మిగిలారు. కాగా రోహిత్ కి హౌస్ మేట్స్ ఎవరూ సపోర్ట్ చెయ్యకపోగా, " సెల్ఫ్ నామినేట్ అయ్యినంత మాత్రాన సపోర్ట్ చెయ్యాలని ఏం లేదు. ఒకవేళ సెల్ఫ్ నామినేట్ కాకపోయినా, కచ్చితంగా నామినేషన్ లో ఉండేవాడు." అంటూ సూర్య తో చెప్పుకొచ్చింది గీతు. ఇది చూసిన ప్రేక్షకులకు సైతం ఇది అన్ ఫేయిర్ లా అనిపించింది. కెప్టెన్సీ టాస్క్ లో వెనక్కి తగ్గకు అంటూ గీతు, సూర్యతో చెప్పగా, రోహిత్ ఫీల్ అయినట్టుగా కనిపించాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటి అంటే రోహిత్ భార్య మెరీనా కూడా రోహిత్ కి సపోర్ట్ చెయ్యకుండా సూర్యకి ఓట్ చేసింది. దీంతో అటు హౌస్ మేట్స్ తో పాటు, ఇటు షో చూసే ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. ఇంకా హౌస్ మేట్స్, రోహిత్ గురించి కొన్ని నెగటివ్ పాయింట్స్ చెప్పారు. "నువ్వు అందరిలో కలవవు. ఇంట్రోవర్ట్ గా ఉండకు" అంటు  శ్రీసత్య చెప్పేసింది. ఎక్కువ ఎందులో పార్టిసిపేషన్ ఉండదు అని ఇలా ఒక్కొక్కరుగా తమ కారణాలు చెప్పి, సూర్యకి మద్దతుగా ఎక్కువ ఓట్లు రావడంతో సూర్య కెప్టెన్ అయ్యాడు. రోహిత్ చాలా సార్లు కెప్టెన్ పోటీదారుడిగా ఎన్నికయ్యాడు. గత వారం  కూడా కీర్తి భట్, రోహిత్ ఉన్నప్పుడు హౌస్ లో లేడీ కెప్టెన్ ని చూడాలనుకుంటున్నా అని ఇనయా చెప్పి, కీర్తి భట్ కి సపోర్ట్ గా తనని కెప్టెన్ చేయగా, రోహిత్ ఫీల్ అయ్యినట్టుగా అనిపించింది. కాగా చివరి వరకు వచ్చినా, ఎవరు సపోర్ట్ చెయ్యలేదు అని బాధపడ్డాడు రోహిత్. అయితే తన పట్ల ప్రేక్షకులు సింపతితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నామినేట్ అయిన రెండు వారాలు కూడా సేవ్ చేస్తూ వచ్చారు. వచ్చే వారం అయిన రోహిత్ కెప్టెన్ అవుతాడేమో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.

'ఫైనల్లీ నేను నటించిన మూవీ..బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజ్ కాబోతోంది'

రష్మీ బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్. ఐతే రష్మీ మూవీస్ లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే మూవీలో నందుతో పాటు నటించింది. ఇప్పుడు ఆ మూవీ నవంబర్ 4th న రిలీజ్ కాబోతోంది అంటూ రష్మీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "ఫైనల్లీ నేను నటించిన మూవీ రిలీజ్ కాబోతోంది. కోవిడ్ కి ముందు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాం .  కానీ కోవిడ్ కారణంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మొత్తం ఎంతలా తారుమారైపోతుందో అప్పటికి ఊహించలేకపోయాను. ఏదేమైనా ప్రాజెక్ట్ పూర్తయ్యింది." అని కామెంట్స్ పెట్టుకుంది. ఇక ఈ మూవీ పోస్టర్స్ తో నెటిజన్స్ చేసిన ట్రోల్ల్స్, మీమ్స్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేసుకుని ఎంజాయ్ చేస్తోంది. ఇక దీపికా పిల్లి ఇటీవలే సుధీర్ తో కలిసి "వాంటెడ్ పండుగాడ్" లో నటించింది.  ఇప్పుడు  ఈమె కూడా "వెయిటింగ్ అక్కా నీ మూవీ కోసం" అని కామెంట్ చేసింది. ఇక ఈ మూవీని రాజ్ విరాట్ డైరెక్ట్ చేశారు. గుంటూరు టాకీస్ తో భారీ ఎత్తున విమర్శలను ఎదుర్కున్న రష్మీ ఇప్పుడు ఈ మూవీతో ఎలా ఎంటర్టైన్ చేస్తుందో ఈ మూవీతో ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటుందో చూడాలి.