ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. అక్క బాట‌లో అన‌సూయ చెల్లి!

ఏ ఫీల్డ్ లో ఐనా సరే ఒక ఇంట్లోంచి ఒకరు బయటికి వచ్చి సక్సెస్ ఐతే వాళ్ళ అడుగుజాడల్లో మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఇలా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కనిపిస్తుంది. అన్నలు తమ తమ్ముళ్లను తీసుకొస్తారు, అక్కలు తమ చెల్లెళ్లను తీసుకొస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఫైర్ బ్రాండ్ యాంకర్ అనసూయ చేరింది. ఆమె తన చెల్లెలు వైష్ణవిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.  తన చెల్లెలికి ఇప్పుడు అనసూయ వెనక నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తోంది..  అనసూయకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరిలో వైష్ణవి ఒకరు. ఆమెలో అనసూయ పోలిక‌లు ఎక్కువ‌. అనసూయ తన తండ్రి మరణంతో చెల్లి వైష్ణవి కెరీర్ బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవిని ఒక షో కోసం రికమండ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.  ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం కానున్న ఒక షో ద్వారా వైష్ణవి యాంకర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న‌దంటూ వార్తలు వస్తున్నాయి. బుల్లితెర మీద, వెండితెర మీద నటిగా తన సత్తా చాటుతోంది అనసూయ. ఎన్నో అవమానాలను తట్టుకున్న అనసూయ ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు తన చెల్లి ఎలా రాణిస్తుందో.. ఇండస్ట్రీలో ఎలా తట్టుకుని నిలబడుతుందో చూడాలి.

తన హెయిర్ డ్రెస్సర్ ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన ఖుష్భు

ఖుష్భు.. జబర్దస్త్ జడ్జిగా ఇప్పుడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న పేరు. ఇక ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్  షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తోంది జబర్దస్త్. ఒక స్కిట్ లో టైం మెషిన్ కాన్సెప్ట్ ఉండేసరికి కుదిరితే వెనక్కి వెళదాం అనుకుంటే ఎవరు ఎం కోరుకుంటారు అని రష్మీ అడిగింది. " కుష్బూ ఈ ప్రశ్నకు  సమాధానం ఇస్తూ..” నేను 1984లో మూవీస్ చేయడం స్టార్ట్ చేసాను. అప్పుడు నాతో ఉబెన్ ఆంటీ వచ్చారు. ఆమె నా హెయిర్ డ్రెస్సర్. అప్పటి నుంచి 2011 వరకు నా దగ్గరే ఉంది. కానీ క్యాన్యర్ తో ఆమె చనిపోయింది..ఆమె నన్ను ఎంతో సపోర్ట్ చేసేవారు నా గైడ్ కూడా  ” అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. జీవితంలో ఒకసారి వెనక్కి వెళితే  ఆమె చనిపోకూడదు అని నేను కోరుకుంటాను అని ఆమె అన్నారు. "నేను ఒక్కరోజు వెనక్కి పోతా ఎందుకంటే నిన్న తాగలేదు" అన్నాడు సన్నీ. "నువ్వేం కోరుకుంటావ్ అని రాంప్రసాద్ రష్మీని" అడిగేసరికి గెటప్ శీను ఆన్సర్ ఇచ్చాడు "2014 కి ఫిబ్రవరి 14 కి వెళ్తావ్ అనేసరికి రష్మీ కన్నుకొట్టి ఇంకేం చెప్పొద్దూ అని శీనుకు సైగ చేసింది. మరి అప్పట్లో సుధీర్, రష్మీ జోడి బుల్లితెర మాములుగా ఎంటర్టైన్ చేయలేదుగా మరి. మళ్ళీ ఇప్పుడు ఆ విషయాలను గుర్తు చేసాడు శీను.   ఖుష్బూ తెలుగులో స్టార్ హీరోలందరితో నటించారు. కలియుగ పాండవులు, పేకాట పాపారావు, స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి మూవీస్ లో నటించారు. ఆమెపై అభిమానంతో అభిమానులు ఆమె కోసం గుడి కూడా కట్టేశారు. మూవీస్ చేయడం కాస్త తగ్గించి  పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ  క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.

ఆకలి రాజ్యం లో కంటెస్టెంట్స్ ఆటపాటలు!

హౌస్ లోని కంటెస్టెంట్స్ కి కడుపు మంట రుచి చూపిస్తోన్నాడు బిగ్ బాస్. మొన్న ఇచ్చిన టాస్క్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వని కారణంగా నిన్న మండిపడ్డ బిగ్ బాస్ ఫుడ్ అంతా దొంగలను పంపించి లాగేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఫుడ్ కావాలంటే టాస్క్ లు ఆడి గెలుచుకోవాలి అని చెప్పాడు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్కోలా బాధపడుతూ ఉన్నారు. "కడుపులో రయ్ రయ్ అని ఎలుకలు పరుగెడుతున్నాయి అని" వసంతి చెప్పింది. ఆ తర్వాత "మనకు కావాల్సిందే, We Deserving This" అంటు బాధపడింది శ్రీసత్య. ఒకవైపు రేవంత్ 'సపాటు ఎటూ లేదు పాట అయిన పాడు బ్రదర్' అని పాడుతుండగా, శ్రీహాన్ ‌కో సింగర్ గా పాడి కాసేపు ఆకలిని కామెడీ గా చూపారు. ఇక సూర్య అయితే కిచెన్ లో ఉన్న ఖాళీ డబ్బాలలో ఉన్న పప్పులను, చక్కెరను ఏరుకుంటు తిన్నాడు. ఇది చూసిన‌ ప్రతీ ప్రేక్షకుడికి 'ఆకలి రాజ్యం' సినిమానే గుర్తొస్తుంది. అంతలా ఆకలికి విలవిలలాడారు అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే తర్వాత ఆడిన టాస్క్ లలో రెండు టీం లు గెలిచి అందరికి ఫుడ్ లభించడంతో కాసేపటికి అందరు మళ్ళీ మాములుగా అయ్యారు. లేదంటే ఆకలికి పడిపోయేవాళ్ళు అన్నట్టుగా అనిపించింది చూసిన ప్రతీ ఒక్కరికి. ఆకలితో కంటెస్టెంట్స్ చేసిన ప్రతీది ఎంటర్టైన్మెంట్ ని సృష్టించిందనే చెప్పాలి. ఈ ఆకలి బాధను చవిచూసాక, ఇకముందు కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారనే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

అంట్లు తోమిన గీతు, ఆదిరెడ్డి!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం టాస్క్ రద్దైన విషయం తెలిసిందే. కాగా బిగ్ బాస్ కి కోపం వచ్చింది. దీంతో హౌస్ లో  ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేకుండా ఎత్తుకెళ్లారు. ఇక హౌస్ మేట్స్ ఆకలితో అలమటించారు. కాగా హౌస్ మేట్స్ ని రెండు జట్లుగా విభజించిన విషయం‌ తెలిసిందే. అయితే వీరికి టాస్క్ లు ఇవ్వడం జరిగింది. "ఈ టాస్క్ లో ఏ టీం అయితే గెలుస్తుందో, వారికే ఫుడ్ లభిస్తుంది."అని బిగ్ బాస్ చెప్పాడు. కాగా ఫస్ట్  ఇచ్చిన టాస్క్ 'కబడ్డీ కబడ్డీ'. ఇందులో సంచాలకులురాలిగా గీతు చేసింది. అయితే టాస్క్ లో రెండు జట్లు పాల్లొనగా అందులో ఒకటి అయిన 'టాలీవుడ్ డైనమైట్స్' గెలిచి ఫుడ్ ని గెలుచుకున్నారు. ఆ తర్వాత రెండవ టాస్క్ 'రివర్స్ తగ్గాఫర్' లో మరొక టీం 'టాలీవుడ్ ఫెంటాస్టిక్'  వాళ్ళు గెలిచి ఫుడ్ ని  గెలుచుకున్నారు. కాగా ఆ జట్టులోని ఆదిరెడ్డి. మరో జట్టు లో ఉన్న గీతుకి తాను పొందిన ఫుడ్ ఇవ్వడం ద్వారా బిగ్ బాస్ వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే, కొన్ని  తోమాల్సిన గిన్నెలను పంపించి అవి తోమమని చెప్పాడు. వారు ఎలా చేస్తున్నారో చూడమని బాధ్యతలు రాజ్ కి అప్పజెప్పడం జరిగింది. కాగా నిన్న జరిగిన టాస్క్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు కానీ గీతు, ఆదిరెడ్డి గిన్నెలు తోముతున్నంత సేపు హౌస్ లో నవ్వుల వర్షం కురిసింది. దానికి తగ్గట్టుగా శ్రీహాన్ కామెడీ బాగుంది.  "పెళ్లి లో వేస్తారు టెంట్లు మన గీతక్క తోముతోంది అంట్లు" అంటు ఫన్ ని క్రియేట్ చేసాడు రేవంత్. సరదాగా వాళ్ళని అటపట్టించాడు. కాని హౌస్ లో టాస్క్ లో అయిన గొడవలో అయిన నామినేషన్ లో అయిన గీతు ఉండాల్సిందే అని మరోసారి నిరూపించుకుంది. కాగా గీతు ప్రేక్షకులకు కావలిసిన వినోదాన్ని అందించడంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది. ఆదిరెడ్డి, గీతుల కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అంటోన్న ప్రేక్షకులు, ఆదిరెడ్డి ప్రతిసారి గీతుని "గీతక్క గీతక్క" అని పిలవడం కామెడిగా అనిపిస్తోంది.   కాగా ఇద్దరి మధ్య మంచి బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంది అనే చెప్పాలి.ఇద్దరు రివ్యూ రైటర్స్ ఏ కాబట్టి ఇద్దరి మైండ్ సెట్ ఒకటేనని, వాళ్ళని ఫాలో అయ్యే ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే బెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు టాప్-5 లో ఉంటారు అని బయట గుసగుసలు. ఈ ఇద్దరు ఎలా ఆడతారో చూడాలి మరి.

ఇనయా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ లో ఇనయా అంటే ఇప్పుడు తెలియని వారు లేరు. ఇనయా పరిచయం అక్కరలేని పేరు. ఈమె పూర్తి పేరు ఇనయా సుల్తానా. ఈమె 1995 అగష్టు 21 న ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. ఈమెకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే మక్కువ ఎక్కువ. తన తండ్రి ఇండస్ట్రీకి వచ్చి,  ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తిరిగి వెళ్ళిపోయాడంట.  తన నాన్న చనిపోయాడు. అందుకే తన నాన్నకి గుర్తుగా తన పేరు చివరన ఇనయా ముజిబుర్ రహమాన్ అని కలుపుకొని చెప్పుకుంటుందంట. కాగా తను ఇండస్ట్రీకి రావడం, ఇంట్లో ఎవరికి ఇష్టం లేదంట. దీంతో ఇంటి నుండి ఒక వంద రూపాయలతో బయటకొచ్చిందంట. మొదటగా తన కెరియన్ ని మోడల్ గా స్టార్ట్ చేసి, తర్వాత మెల్లి మెల్లిగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయట. ఆ తర్వాత 2021లో 'ఎవమ్ జగత్' లో, తర్వాత 'బుజ్జి ఇలా రా', ఆ తర్వాత 'యద్భావం తధ్భావం', ఇంకా కొన్ని సినిమాల్లో నటించింది. అటు  మోడల్ గా, ఇటు నటి గా రాని పాపులారిటీ, ఒక్క వీడియోతో ఫేమస్ అయింది. అది ఏ వీడియో అంటే కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో   చేసిన డ్యాన్స్  వీడియో. అందులో రామ్ గోపాల్ వర్మ తన కాళ్లు పట్టుకున్నాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారి పాపులర్ అయింది. కాగా ఇప్పుడు‌ అదే  బిగ్ బాస్  లో ఛాన్స్ వచ్చేలా చేసిందని పులువురు అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి పద్నాలుగో కంటెస్టెంట్ గా అడుపెట్టింది. అయితే హౌస్ లో ఎక్కువ పెర్ఫార్మన్స్ లేకపోయినా కూడా గొడవలకు అవకాశం ఎక్కువగానే ఇచ్చింది. కాగా ఇప్పుడు హౌస్ లో ఎక్కువగా సూర్యతో సన్నిహితంగా ఉంటోంది. అంతే కాకుండా "సూర్య నా క్రష్" అని  చెప్పేసింది. ఎప్పుడు సూర్య వెంట ఉంటూ కనిపిస్తోంది. శ్రీహాన్ తో మాత్రం మొదటి వారం నుండి తగాదాలు అనే చెప్పాలి. రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య గొడవ ముదురుతుందే కానీ తగ్గట్లేదు. అయితే  ప్రస్తుతం వేస్ట్ పరఫార్మెన్స్ తో ప్లాప్ గా పేరు తెచ్చుకుంటోంది.  ఇప్పుడిప్పుడే హౌస్ లో పెర్ఫార్మన్స్ మొదలు పెట్టింది అని చెప్పొచ్చు. కాగా ఇప్పుడు నామినేషన్లో ఉంది. ఇనయా రెమ్మునెరేషన్ రోజుకి ఇరవై అయిదు వేల నుండి ముప్పై వేల వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇనయ చివరి వరకు ఉండి వాళ్ళ నాన్నకి గొప్ప కీర్తిని తీసుకొస్తుందో? లేదో చూడాలి మరి.

'అన్ స్టాపబుల్-2'తో బాలయ్య సంచలన రికార్డు!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో సీజన్-2 ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయింది. రెండో సీజన్ కి మొదటి సీజన్ ని మించిన రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో ఫస్ట్ ఎపిసోడ్ సంచలనాలు సృష్టిస్తోంది. 'అన్ స్టాపబుల్-2' మొదటి ఎపిసోడ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు నారా లోకేష్ కూడా సందడి చేశారు. ఆ ఇద్దరితో బాలయ్య ముచ్చటించిన తీరు ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 14 నుంచి ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలనం సృష్టించింది. ఓ టాక్ షోకి ఓటీటీలో ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. 'అన్ స్టాపబుల్-2' నుంచి ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల కానుంది. అక్టోబర్ 21న స్ట్రీమింగ్ కానున్న రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మూడో ఎపిసోడ్ లో రమ్యకృష్ణ, రాశి ఖన్నా పాల్గొనబోతున్నారని సమాచారం. 

ఒకరి తప్పులు మరొకరు చెప్పుకుని కొట్టుకున్నారు... నచ్చిన విషయాలు చెప్పి తీపి తినిపించుకున్నారు

మిస్టర్ అండ్ మిస్సెస్ షోకి సిద్దు-విష్ణుప్రియ, రవి-సుష్మకిరణ్, రాకేష్-సుజాత, ఆట సందీప్-జ్యోతి  ఎంట్రీ ఇచ్చారు. మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో స్టేజి మీదకు వచ్చేసారు. కొంచెం ఇష్టం - కొంచెం కష్టం అనే సెగ్మెంట్ ఒకటి ఈ షోలో పెట్టారు. ఈ సెగ్మెంట్ లో సుత్తి-గులాబీ పూలు ఇచ్చారు. ఏ విషయంలో కోపం వస్తుందో చెప్పి సుత్తితో ఒక దెబ్బ కొట్టడం, ఏ విషయంలో హ్యాపీనెస్ వస్తుందో అప్పుడు ఒక గులాబీ ఇవ్వాలి అనే టాస్క్ ఉంది. సిద్దు-విష్ణుప్రియ ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. "ఆల్రెడీ సర్దిన బట్టలే సర్ది నన్ను మా అమ్మతో తిట్టిస్తుంది విష్ణు అప్పుడు కొట్టాలనిపిస్తుంది అని సుత్తితో కొట్టాడు. ఇక సిద్దు గురించి చెప్పాలంటే స్నానం చేసాక తుడుచుకున్న టవల్ కూడా అక్కడే పడేస్తాడు అది నాకు నచ్చదు" అని సుత్తితో కొట్టింది విష్ణు. ఇక తర్వాత ఈ సెగ్మెంట్ కి రవికిరణ్-సుష్మ వచ్చారు. వీళ్లకు కొంచెం ఇష్టం-కొంచెం కష్టం సెగ్మెంట్ లో "డబ్బులు ఎక్కువ ఖర్చుపెడతానని ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడు అని రవికి ఒక్కటిచ్చింది..సుష్మ ఇంట్లో పని చేయకుండా ఎప్పుడూ ఇన్స్టా లో రీల్స్ చేస్తూనే ఉంటుంది" అని చెప్పాడు రవి. తర్వాత ఆట సందీప్-జ్యోతికి ఈ సెగ్మెంట్ లో రొట్టెల కర్ర, లడ్డులు పెట్టారు. "ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెడీ అవ్వమంటే గంటలు గంటలు రెడీ అవుతుంది అప్పుడు ఈ కర్రతో కొట్టాలనిపిస్తుంది అని జ్యోతి నెత్తి మీద ఒక్కటిచ్చాడు. సందీప్ ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటాడు. దాంతో సమస్యలు వస్తాయి అంటూ కర్రతో ఒక్కటి ఇచ్చింది. ఇక ఎప్పుడు ప్రేమొస్తుంది అంటే మా నాన్నకు జీపే చేసినప్పుడు ప్రేమొస్తుంది" అంటూ లడ్డు తినిపించింది. ఇలా గత వారం ఎపిసోడ్ పూర్తయ్యింది.

'ఆర్జే సూర్య నవ్వు వెనుక చాలా బాధే ఉంది..!'

బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తోన్న  సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతని పూర్తి పేరు సూర్య నారాయణ. ఇతను తూర్పు గోదావరి జిల్లా పసువులంకలో సత్యనారాయణ, సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు.  తల్లి తండ్రులు కూలి పని చేస్తూ ఉన్నారు. సూర్య బాల్యంలో ఒక్క రోజు కూడా సరైన తిండి తినట్లేదంట. చిన్నతనం నుండి చదువుకుంటూనే ఒక కిల్లీకొట్టు లో సోడాసీసాలు కడిగేవాడంట. అది కూడా  రోజంతా పనిచేస్తే పది రూపాయలు వచ్చేయంట. బాల్యం నుండి చాలా కష్టాలు అనుభవించాడట. ఇతను భీమవరంలో బి.కాం చేస్తూ, రాజమండ్రి లో పీజీ పూర్తి చేసాడట.  సూర్యకి మిమిక్రీ అంటే ఇష్టం. తనలో తానే ప్రముఖ నటుల వాయిస్ లను ప్రాక్టీస్ చేసేవాడట. అయితే  సూర్య తనలో తానే అలా మాట్లాడడం చూసి బయపడి వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి తీసుకెళ్లిందట. అ డాక్టర్ సూర్య ని చూసి 'మీ అబ్బాయిలో మంచి టాలెంట్ ఉంది. ఎంకరేజ్ చెయ్యండి" అని చెప్పాడట. ఆంధ్ర యూనివర్సిటిలో తను చేసిన మిమిక్రీ‌కి గాను గోల్డ్ మెడల్ కూడా సాధించాడట. తర్వాత 2013లో ఆర్జేగా తన కెరీర్ స్టార్ట్ చేససిన సూర్య, ఓ వైపు ఆర్జెగా మరోవైపు యాంకర్ గా బిజీ అయిపోయాడు. తర్వాత 'గుంటూరు టాకీస్', 'గరుడావేగ' వంటి సినిమాలలో కూడా నటించాడు. తర్వాత ఇస్మార్ట్ న్యూస్ ఆడిషన్స్ కి వెళ్లగా, అక్కడ ఇతని ట్యాలెంట్ చూసి సెలక్ట్ చేసారంట. కాగా ప్రస్తుతం ఇస్మార్ట్ న్యూస్ లో కొండబాబుగా చేస్తున్నాడు. ఆ కొండబాబు క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చడంతో, అది పాపులర్ అయింది. ఆ తర్వాత సూర్యని జూనియర్ విజయ్ అని పిలుస్తున్నారు. తను కష్టపడి సంపాదించి, కూడబెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న లకి కొత్త ఇల్లుని కొని, గిఫ్ట్ గా ఇచ్చాడంట. అంతే కాకుండా వాళ్ళు కష్టపడొద్దు అని చెప్పి ప్రతి నెల సూర్య ఇంటికి కొంత డబ్బుని కూడా పంపిస్తున్నాడంట. ఈ రోజుల్లో సూర్యలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు అని అంటున్నారు తన గురించి తెలిసిన వాళ్ళు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి పదిహేనవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన‌ సూర్య. తనదైన శైలిలో అందరిని అలరిస్తూ, ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోన్నాడు. హౌస్ లో జరిగే ప్రతీ టాస్క్ లో పాల్గొంటూ, అన్నింట్లో తనదైన స్టైల్ లో గేమ్ ని ఆడుతున్నాడు. అలాగే మిమిక్రీలతో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన ఆరోహి వల్ల కొంచెం అట వెన్నక్కి వెళ్ళింది అని చెప్పాలి. తను బయటికి వెళ్ళాక అటలో కాస్త ముందుకెళ్ళగా, ప్రస్తుతం ఇనయాతో క్రష్ ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కాగా గేమ్ పై కొంచెం ఫోకస్ తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి కెప్టెన్ అయ్యాడు. అయితే సూర్య రెమ్యూనరేషన్ రోజుకి నలభై వేల నుండి నలభై అయిదు వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారం జరుగుతోంది. కాగా తను మాత్రం హౌస్ లో కొత్త కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. చివరి వరకు ఉండి ఈ సీజన్ విజేతగా నిలుస్తాడో? లేదో? చూడాల్సి ఉంది.

'రేవంత్..నువ్వు నీ లైన్ క్రాస్ చేసావ్', అర్జున్!

నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ హౌస్ నామినేషన్లో  మాత్రమే మాటల యుద్ధం జరుగుతుంది అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో కూడా హీటెడ్ అర్గుమెంట్ జరిగింది. అయితే టాస్క్ లో భాగంగా సినిమా పోస్టర్లు ఎవరు ఎక్కువ అతికిస్తే వాళ్ళు ఈ లెవల్ లో గెలుస్తారు అని బిగ్ బాస్ చెప్పగా, టాస్క్ ముగిసాక సంచాలకులురాలిగా చేస్తోన్న ఇనయా తను రిజల్ట్స్ గురించి చెప్తుండగా, రేవంత్ అలా కాదు, మాది రైట్ అని ఆర్గుమెంట్ చేస్తుండగా అర్జున్ ని రేవంత్ ఒక మాట అన్నాడు. ఈ మాట అర్జున్ చెవిన పడలేదు. దీంతో శ్రీసత్య, అర్జున్ తో "నువ్వు మనిషివి కదా, ఏం ఫిలింగ్స్ లేవా" అని అనగానే,  అర్జున్ రేవంత్ తో గొడవకు వెళ్ళాడు. "అరెయ్ అసలు ఎవరికి వాల్యూ ఇవ్వవా, హౌస్ లో అందరిని ఇష్టం ఉన్నట్లు పిలుస్తావ్. ఏం అన్నావ్ రా", అని అనగా "ఎవరో వచ్చింది చెపితే అనడం కాదు. నువ్వు సొంతగా ఆలోచించి మాట్లాడితే బెటర్. ఇన్ని రోజులు లేనిది ఎవరో వచ్చి చెప్తే నువ్వు మాట్లాడుతున్నావ్. ఇది మొదటి వారం నుండి ఉంటే బాగుండు. But I am Happy ఇప్పటికైనా మాట్లాడుతున్నావ్"  అని చెప్పాడు రేవంత్‌. ఆ తర్వాత అర్జున్, రేవంత్ తో "ఇకముందు నా లిమిట్స్ లో నేను ఉంటాను, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. అంతేకానీ ఎక్కవ మాట్లాడకు. నువ్వు నీ లైన్ క్రాస్ చేస్తున్నావ్. చూసుకో, చాలా బాగోదు" అని అనగా, "సర్లే పోరా బాబు" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత అర్జున్, రేవంత్ తో గొడవకు దిగాడు. అర్జున్, రేవంత్ దగ్గరికి వచ్చి "సారీ రా సడన్ గా అనేసాను అంటే ఆ టాపిక్ క్లోజ్ అయిపోయేది కదరా " అని అర్జున్ అనగా "చాలు రా బాబు" అంటు కోపంగా మాట్లాడాడు. ఈ ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ రావడానికి మాత్రం శ్రీసత్యనే కారణం అని చెప్పాలి. ఎందుకంటే అర్జున్ ని ప్రొవొక్ చేయడంతో, అర్జున్ కి కోపమొచ్చి రేవంత్ తో గొడవకి దిగాడు. కాని అర్జున్ హౌస్ లో ఇన్ని రోజులుగా ఒక్కసారి అయిన వాయిస్ ఎక్కువ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ శ్రీసత్య చెప్పడంతో ఒక్కసారి ఆర్గుమెంట్ కి దిగాడు. ఈ గొడవ నామినేషన్  వరకు ఉంటుందో లేదా మళ్ళీ మాములు అయి కలిసిపోతారో లేదో చుడాలి.

'కంటెస్టెంట్స్ ని బయటకు వెళ్ళిపోమన్న బిగ్ బాస్'!

నిన్న జరిగిన సెలబ్రిటీ లీగ్ టాస్క్ లో ఎవరు కూడా వారికి ఇచ్చిన సెలబ్రిటీ పాత్రకు సరైన న్యాయం చేయలేకపోవడంతో కంటెస్టెంట్స్ ని బయటకు వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్. అయితే టాస్క్ లో పర్ఫామెన్స్ చేయడానికి కంటెస్టెంట్స్ వాటికి సంబంధించిన దుస్తులు మాత్రమే ధరించారు. కాని దానికి తగ్గట్టుగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ఎంత సేపటికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక, ఎక్కడ వాళ్ళు అక్కడే రిలాక్స్ గా ఉండిపోయారు. ఈ ఎపిసోడ్ చూసే ప్రేక్షకులకు ఎప్పుడు అయిపోతుంది రా అన్నట్లుగా పర్ఫామెన్స్ చేసారు కంటెస్టెంట్స్. ఏదో కబుర్లు చెప్పుకోడానికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఎవరి పాత్ర లో వారు లేకుండ ఎప్పటికప్పుడు పాత్ర నుండి బయటకొస్తూ, కామెడిగా టాస్క్ ని చేస్తోన్నారు. ఇదంతా చుసిన బిగ్ బాస్ కి చాలానే కోపం వచ్చింది. ప్రేక్షకులకు కూడా ఇదేంటి ఏదో రిసార్ట్ కి వెళ్ళారా వీళ్ళు అనే అనుమానం రాలేదంటే వింత గానే ఉంటుంది. "హౌస్ మేట్స్ దేనిపై ఆసక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు. హౌస్ లో ఫైమా, శ్రీహాన్, సూర్య, గీతు,  రాజ్ వీళ్ళు మాత్రం ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా ఇంటి సభ్యులు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. ఆసక్తి లేని వారు హౌస్ నుండి బయటికి వెళ్ళండి" అని బిగ్ బాస్  చెప్పుకొచ్చాడు. మొట్ట మొదటి సారిగా బిగ్ బాస్ చరిత్ర లో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేయబడుతుంది అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరు ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చొని క్షమించమని అడిగారు. అయిన బిగ్ బాస్ వినకుండా మీరు ధరించిన వస్త్రాలు స్టోర్ రూమ్ లో పెట్టండి అని చెప్పాడు. దాంతో టాస్క్ లో పెర్ఫార్మన్స్ చెయ్యడానికి ప్రయత్నించిన ఫైమా, శ్రీహాన్, సూర్య, రాజ్, గీతు కెమెరా ముందుకు వచ్చి ఆడినవాళ్ళకి అన్యాయం జరుగుతోంది బిగ్ బాస్. ఈ ఒక్కసారి క్షమించండి అని అడిగారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

గీతా ఆర్ట్స్ అని అందుకే పెట్టారు..మగధీరకు మూడు రేట్లు వచ్చింది.. మొత్తం పోయింది

ఆలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ సెకండ్ పార్ట్ లో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "అల్లు అరవింద్ కి గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి గీత ఆర్ట్స్ పెట్టారా " అని ఆలీ అడిగేసరికి " దాసరి సత్యనారాయణమూర్తి గారు, వీర్రాజు గారు అనే పార్టనర్స్ ఉండేవారు...వాళ్ళ ముందు మా నాన్న గీత ఆర్ట్స్ బ్యానర్ పెడదామని ఒక  ప్రొపోజల్ పెట్టారు. ఎందుకు అంటే భగవద్గీత సారాంశం ఏమిటి అంటే ప్రయత్నం మాత్రమే మనది రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ఈ పేరు పెడితే సరిపోతుంది అని అన్నారు. అంటే ఈ బ్యానర్ మీద వచ్చే మూవీస్ హిట్ కొట్టాలి అంటే అదంతా ప్రేక్షక దేవుళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ పేరే సరిపోతుందని ఆయన చెప్పారు. మా నాన్న గారు గీత ఆర్ట్స్ బ్యానర్ మీద  చాలా సినిమాల్లో నటించారు. ఏవో కొద్ది సినిమాల్లో తప్ప. క్యారెక్టర్ ఉంటేనే చేసే మనిషి ఆయన. నాన్నగారికి , చిరంజీవిగారికి, అల్లు అర్జున్ కి వాళ్ళ మార్కెట్ రెమ్యూనరేషన్ ఎంత ఉందో అంత డబ్బుని కూడా సినిమా రిలీజ్ కి ముందే ఇచ్చేస్తాం.  మగధీర మూవీకి అనుకున్న దాని  కంటే బడ్జెట్ ఎక్కువయ్యింది. కానీ అంతకు మూడు రేట్లు ఎక్కువగా డబ్బొచ్చింది. ఐతే తర్వాత చూడాలని ఉంది మూవీని హిందీలో కలకత్తా మెయిల్ అని తీశాను. ఫుల్ లాస్ వచ్చింది." అని చెప్పారు అల్లు అరవింద్.

నిర్లక్ష్యం..బిగ్ బాస్ నియమాలంటే నిర్లక్ష్యం.. బిగ్ బాస్ టాస్క్ అంటే నిర్లక్ష్యం..!

మంగళవారం బిగ్ బాస్ చెప్పిన‌ టాస్క్ లో ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా పర్ఫామెన్స్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ కి సెలబ్రిటీ లీగ్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. కాగా ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా పర్ఫామెన్స్ చేయలేకపోయారు. హౌస్ లో బజర్ మొదలైనప్పటి నుండి మళ్ళీ బజర్ వచ్చేంతవరకు టాస్క్ అనేది కొనసాగుతోంది అని అందరికి తెలిసిన‌ విషయమే. అయితే ఎవరు కూడా ఈ సంగతి గుర్తుంచుకోకుండా కాసేపు వారికిచ్చిన సెలబ్రిటీ పాత్రలో ఉండి, తర్వాత మాములుగా ఉండిపోయారు. కొందరు బెడ్ రూం‌కి వెళ్ళి కబుర్లు చెప్పుకోగా, మరికొందరు కెమెరాల ముందుకు వెళ్ళి పర్ఫామెన్స్ చేసారు. దీంతో బిగ్ బాస్ కి కోపం వచ్చి, కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు. "మీరు అసలు ఏ టాస్క్ బాగా చేసారు. ఇప్పటిదాకా ఇచ్చిన టాస్క్ లు అన్నీ కూడా నిరాశజనకంగా సాగాయి. అందుకు కారణం నిర్లక్ష్యం. ఇంటి నియమాల పట్ల నిర్లక్ష్యం. బిగ్ బాస్ రూల్స్ పట్ల నిర్లక్ష్యం. బిగ్ బాస్ ని ఆత్రుతగా చూస్తోన్న ప్రేక్షకుల పట్ల నిర్లక్ష్యం. ఇలా మీ నిర్లక్ష్యం వల్ల బిగ్ బాస్ రూల్స్ ని ఉల్లంఘించి, అటు బిగ్ బాస్ ని, ఇటు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయలేకపోగా, నిరాశకి గురి చేస్తోన్నారు" అంటూ కంటెస్టెంట్స్ ని నిలదీసాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ మాట్లాడుతూ, "మీకు అట మీద ఆసక్తి లేకపోతే హౌస్ ముఖద్వారం గుండా బయటకు పోండి" అని అనడంతో, అందరు ఒక్కసారిగా బిత్తరపోయారు. 

ఎయిర్‌లైన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ అనసూయ!

అనసూయ బుల్లితెర ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఏ విషయం మీదైనా కుండ బద్దలు కొట్టినట్టు సోషల్ మీడియా వేదికగా చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి అనసూయ ఫామిలీ బయల్దేరింది. ఐతే వీళ్ళు ప్రయాణించాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థ వాళ్ళు ఫ్లైట్ రన్ వే మీద నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందని ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపించలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళే అవసరం లేదు అన్నారు. ఇక ఆఖరి నిమిషంలో ఫామిలీ మొత్తాన్ని ఈ ఎయిర్ లైన్ సిబ్బంది వాళ్ళు పరిగెత్తించారు.  ‘అలయన్స్ ఎయిర్ 9I 517 ప్లైట్ ప్రొటో‌కాల్‌ వలన చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు ఈ ఎయిర్ లైన్ సిబ్బందికి ఎందుకు ఇంత  క‌న్‌ఫ్యూజ‌న్. పోనీ విమానం ఎక్కాక సీట్లు కూడా ఎక్కడెక్కడో ఇచ్చారు. వరుసగా సీట్లు బుక్ చేసుకున్నప్పుడు  వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పలేదట.  ఇక  ఆ పరిగెత్తిన హడావిడిలో , ఆ కంగారులో నా షర్ట్ సీటుకు తగిలి  చిరిగిపోయింది. పాసెంజర్స్ కి  చెప్పే ముందు మీరు వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి’ అంటూ అనసూయ ఫైర్ అయ్యింది. విమాన సిబ్బంది కారణంగా అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులను ట్వీట్ రూపంలో సోషల్ మీడియాలో చెప్పింది. ప్యాసింజర్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.  

మేం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. స్కూల్లో నా వేలు తొక్కేశాడు!

'చెఫ్ మంత్రం' సీజన్ 2 మంచి రెసిపీస్ తో అప్పుడప్పుడు కొన్ని నవ్వులతో, సరదాగా సాగిపోతోంది. ఇక ఈ వారం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఈ షోకి నిహారిక కొణిదెల, కాలభైరవ వచ్చారు. ఇక నిహారిక, కాలభైరవ ఫ్రెండ్‌షిప్ గురించి అడిగేసరికి "కాలభైరవ, నేను స్కూల్ నుంచి ఫ్రెండ్స్. నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు నా పెన్సిల్ కింద పడిపోయింది. దాన్ని  తీసుకుంటున్నప్పుడు భైరవ నా వేలిని తొక్కేసాడు. అది నాకు బాగా గుర్తు. ఆ తర్వాత థర్డ్ క్లాస్ మిడిల్ నుంచి భైరవ స్కూల్ లోంచి వెళ్ళిపోయాడు. నేను అదే స్కూల్లో ఉన్నాను. తర్వాత కట్ చేస్తే మళ్ళీ డిగ్రీ లో సేమ్ కాలేజీలో కలిసి చదువుకున్నాం." అని చెప్పింది నిహారిక. "కాలభైరవ పేరు వెరైటీగా ఉంది. అలాంటి పేరు పెట్టారేమిటి దాని వెనక రీజన్ ఏంటి?" అని లక్ష్మి అడిగేసరికి, "నా పేరును మా తాతగారు, నాన్నగారు కలిసి పెట్టారు. శివుడికి మరో పేరు ఈ కాలభైరవ. నేను పుట్టే సమయానికి మా నాన్నగారు కాలభైరవ అష్టకమ్ రికార్డింగ్ లో ఉన్నారు. ఇక అదే టైములో నేను ఈ భూమ్మీదకు వచ్చానని నాకు ఆ పేరు పెట్టారు" అని చెప్పాడు.  ఇక ఆయనతో ఈ చెఫ్ మంత్రం సీజన్ 2 షోలో ఒక సాంగ్ పాడించింది మంచు లక్ష్మి. "మా నాన్నకు  నేను సింగర్ ని కావాలని ఉండేది కానీ నేను సింగర్ ని కాలేదు" అని చెప్పింది మంచు లక్ష్మి.

ఏవయ్యా హెయిర్ స్టైలిస్ట్.. సిద్ధుకి జుట్టు దువ్వకుండా షోకి పంపావేంటి?

'అన్‌స్టాపబుల్ సీజన్ 2' హాట్ హాట్ గా స్టార్ట్ అయ్యింది. ఇంత హాట్ వద్దు అనుకున్నారేమో నెక్స్ట్ వీక్ కాస్త కూల్ చేయడానికి ఇండస్ట్రీలో బాలయ్యకు నచ్చిన ఇద్దరు కుర్రాళ్లను ఈ షోకి తీసుకొచ్చారు. వాళ్ళే డీజే టిల్లు అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్. నెక్స్ట్ వీక్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "ఏయ్‌.. హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడయ్యా నువ్వు.. షోకి వస్తున్న సిద్ధుకి జుట్టు దువ్వకుండా పంపించేశారు!" అని స్టార్టింగే కామెడీ చేశారు బాలయ్య. "అది మెస్సి లుక్ సర్" అని సిద్ధు చెప్పేసరికి "అలా నేను మెస్సి లుక్ తో కనిపించిన సినిమాలన్నీ మెస్సి ఐపోయాయి" అని చెప్పి నవ్వించారు. "మీ ఇద్దరూ బయట కలిసినప్పుడు ఎన్ని పెగ్గులేస్తారు?" అని ఇద్దరినీ అడిగేసరికి నవ్వులే నవ్వులు. "ఒకడేమో మాస్ కా దాస్, ఇంకొకడు మాస్ కా బాస్.. మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా.. గాడ్ ఆఫ్ మాస్" అని తన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు బాలయ్య.  "ఒక అమ్మాయిని ఎలా పొగడాలో తెలీదు, కొన్ని టిప్స్ ఇవ్వండి" అని అడిగితే, "వాళ్ళను ముందు పొగడాలి, తర్వాత వాళ్ళ జుట్టు అది సరిగా లేదు అని చెప్తే చాలు" అని చెప్పారు. ఇక ఇద్దరూ కలిసి బాలయ్యని "మీ ప్రస్తుత క్రష్ ఎవరు?" అని అడిగేసరికి "రష్మిక మంద‌న్న‌" అని ఆన్సర్ ఇచ్చారు బాలయ్య.  తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కి బాలయ్య ఫోన్ చేసి "అన్ స్టాపబుల్ షోకి ఎప్పుడొస్తున్నావ్?" అని అడిగారు. "మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వచ్చేస్తాను" అన్నారు త్రివిక్ర‌మ్‌. "ఎవరితో రావాలో తెలుసుగా" అని రివర్స్ లో బాలయ్య అడిగారు. పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చే బాధ్యతను త్రివిక్రమ్ అప్పగించినట్టు అర్థ‌మవుతోంది. ఇక ఈ షో అక్టోబర్ 21న ప్రసారం కాబోతోంది.

45 ఏళ్ళ వయసులో అల్లు అరవింద్ కి ఘన సన్మానం

ఆలీతో సరదాగా షో సెకండ్ పార్ట్ వచ్చేసింది. ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చిన అల్లు అరవింద్ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పారు. "ఒక రోజు అమ్మకి, నాన్నకి మధ్య డ్రింక్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. అప్పటికి ఆ గొడవ ఎందుకయ్యిందో నాకు అర్ధం కాలేదు. కానీ నాన్న గారు అమ్మతో గొడవ పెట్టుకుని సీరియస్ గా ఇంట్లోంచి చెప్పులు వేసుకోకుండా వెళ్లిపోయారు. అమ్మ అది చూసి వెంటనే నన్ను పిలిచి నాన్నను తీసుకురమ్మని  పంపింది. నేను కార్ వేసుకుని వీధి చివరికి వెళ్లాను. నాన్న గారిని కార్ లో ఎక్కమంటే బెట్టు చేస్తున్నారు. చివరికి ఏదో చెప్పి కార్ లో ఎక్కించాను. ఐతే అప్పటికే నాన్న ఇంట్లో గొడవ ఇలా వీధిలోకి వచ్చేసారు అనే కోపంలో ఉన్నా. ఇక నాన్న గారు కార్ లోకి ఎక్కేసరికి ఆ కోపంలో బ్రేక్ మీద పొరపాటున కాలేసేసాను. అంతే ఆయన తల కార్ కి తగిలింది. అంతే ఇప్పుడు ఆయనకు కోపం వచ్చేసి ఎవర్రా నీకు కార్ డ్రైవింగ్ నేర్పించింది అంటూ లాగి పెట్టి ఒక్కటి పీకారు నన్ను. నాకు కార్ డ్రైవింగ్ ఆయనే నేర్పారు అన్న విషయం మర్చిపోయారు. దాంతో నేను షాకయ్యాను. చుట్టూ చూసాను ఎవరైనా చూశారేమో అని ...వెనక్కి చూసా మా ఇంటి బాల్కనీ నుంచి మా ఆవిడ ఎమన్నా చూసిందేమో అని..కానీ ఎవరూ చూడలేదు అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నా రూమ్ లోకి వెళ్లేసరికి మా ఆవిడ అడిగింది ఎందుకు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టారు. మిమ్మల్ని అలా కొట్టడం చూసి భయమేసి లోపలి వచ్చేసాను అని చెప్పింది. దాంతో నాకు నవ్వాగలేదు. 45 ఏళ్ళ వయసులో నేను మా నాన్నతో అలా సన్మానం చేయించుకోవడం నాకు ఎప్పటికీ స్వీట్ మెమరీ" అని చెప్పారు.

ఆకాశం నుంచి ఆ దేవతలే దిగి వచ్చినట్టుంది

"డాన్స్ ఐకాన్" టెలివిజన్ హిస్టరీలో నిజంగా ఒక ఐకాన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో పెర్ఫార్మెన్సెస్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంత టాలెంటెడ్ కంటెస్టెంట్స్ ఈ షోలో ఉన్నారు. ఇక ఇప్పుడు దీపావళి పండగ వస్తున్న సందర్భంగా ఈ షోకి సంబంధించిన కొత్త  ప్రోమో రిలీజ్ అయ్యింది. "డేర్ టు డాన్స్" కాన్సెప్ట్ తో ఈ పెర్ఫార్మెన్స్ లు  నెక్స్ట్ వీక్ రాబోతున్నాయి. ఐతే ఈసారి ఈ షోకి రమ్యకృష్ణ, శ్రీముఖి, మోనాల్ ముగ్గురు  అందంగా పట్టుచీరల్లో  దేవతల్లా వచ్చారు. ఇక ఇటు శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్ ఇద్దరు  సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఇక రమ్యకృష్ణను చూసి "పైనుంచి దేవతలు దిగితే ఎలా ఉంటారో అలా ఉన్నారు మీరు" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక తర్వాత "ఉండిపోరాదే" అనే పాటకు యష్ మాస్టర్ రమ్యకృష్ణతో కలిసి డాన్స్ చేసాడు. ఇక శ్రీముఖి మేల్ జడ్జెస్ ని చూసి "అందం అబ్బాయైతే నీలా ఉందే..అన్నట్టుందే" అని పాడింది. రాజు-అసిఫ్ పెర్ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా ఇపోయారు. "కొరియోగ్రాఫర్ లా చేయలేదు హీరోలా చేసావ్" అని శేఖర్ మాస్టర్ రాజుకి కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక తర్వాత మోనాల్ శ్రీముఖి మధ్యన యష్ మాస్టర్ నిలబడి "పల్సర్ బైక్" సాంగ్ కి డాన్స్ చేశారు. "శ్రీ సూపర్ గా చేసావ్ డాన్స్" అని శ్రీముఖికి కాంప్లిమెంట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. ఇక రాయచూర్ ఆనంద్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. రమ్యకృష్ణకు ఎంతో బాగా నచ్చేసింది. "రాయచూర్ ఆనంద్ వచ్చి డాన్స్ చేస్తున్నట్టు లేదు ఆ హనుమంతులు వారే వచ్చి డాన్స్ చేసినట్టు ఉంది" అని యాంకర్ ఓంకార్ అన్నారు.

తగ్గేదేలే అంటోన్న రేవంత్!

బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ అనగానే అర్థ‌మైపోయే విషయం ఏంటంటే 'నామినేషన్స్'.  ఇందులో జరిగే హైడ్రామా ఏ పోటీ లో కూడా జరుగదు అన్నట్టుగా కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. అయితే నామినేషన్లో అత్యధిక ఓట్లు వచ్చింది రేవంత్ కి. హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది రేవంత్ కి నామినేట్ చేసినా తగ్గేదేలే అని అన్నాడు రేవంత్. అయితే నామినేషన్ ప్రకియ మొదలవ్వగానే రేవంత్ ని నామినేట్ చేసింది శ్రీసత్య. కారణం ఏంటి అని అడుగగా, "నువ్వు గేమ్ జరుగుతున్నప్పుడు రెండు సార్లు పడుకున్నావ్, దాని వల్ల హౌస్ బ్యాటరీ రీఛార్జ్ అనేది తగ్గిపోయింది. అది తగ్గిపోకుంటే వేరేవాళ్ళకు ఛాన్స్ వచ్చేది" అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, "నేను పడుకున్నది.. అది నా తప్పే ఒప్పుకుంటాను. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఒక పది శాతం ఛార్జ్ మాత్రమే తీసుకొన్నాను. ఎందుకంటే నా తర్వాత వేరేవాళ్ళకి ఛాన్స్ రావాలని, ఇట్స్ ఓకే ఫైన్" అని రేవంత్ వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీసత్య వచ్చి రేవంత్ ని నామినేట్ చేసింది. నెక్ట్స్‌ వచ్చిన ఆదిత్య కూడా తననే నామినేట్ చేసాడు. చివరగా కెప్టెన్ సూర్య కూడా నామినేట్ చేయగా, "ఎవ్వరైనా కానీ ఏది అయినా కానీ నీ అవ్వ తగ్గేదేలే" అని రేవంత్, 'పుష్ప' మూవీలోని 'అల్లు అర్జున్' లా నడుచుకుంటూ వచ్చేసాడు.

'చమ్కీల లొల్లి'లో శ్రీహాన్, ఇనయా! ఇద్ద‌రూ త‌గ్గ‌ట్లే!!

నామినేషన్ అనగానే మొదటగా గుర్తొచ్చే రెండు పేర్లు శ్రీహాన్, ఇనయా. ఎందుకంటే వీళ్ళిద్దరు మొదటి వారం నుండి ఒకరి మీద ఒకరు నామినేషన్ వేసుకుంటూ వ‌స్తున్నారు. శ్రీహాన్ తన నామినేషన్ ప్రకియలో భాగంగా ఫస్ట్ నామినేషన్ ఇనయా అని మొదలుపెట్టాడు. కారణం చెబుతూ, "హ హ నువ్వు లయర్ వి అని అన్నావ్. ఆ రోజు టాస్క్ లో మేం గెలిచిన తర్వాత అలా అన్నావ్.. అది నాకు నచ్చలేదు" అని శ్రీహాన్ చెప్పగా, "సిల్లీ రీజన్ కి నామినేట్ చేసావ్, వన్ మినిట్ కూడా ఏం పర్ఫామెన్స్ ఇవ్వలేదు. నువ్వు ఏం పీకావ్ అస్సలు" అంటూ ఫైర్ ఐంది ఇనయా.  "నీ గురించి చెప్పడానికి నాకు చాలా పాయింట్లు ఉన్నాయి" అని శ్రీహాన్ అనగా, "అసలు పాయింట్ ఉంటే కదా చెప్పడానికి" అని ఇనయా అంది. ఇనయా తన నామినేషన్ ని శ్రీహాన్ కి వేసి మాట్లాడుతూ, "సోఫాలో నా చమ్కీలు పడ్డాయి. అది డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చు కదా, హౌస్ లో అందరికి చెబుతూ, దాన్ని లాగి లాగి ఇక్కడి దాకా తీసుకొచ్చావ్. నాకు డైరెక్ట్ చెబితే నేను చేస్తా కదా" అంది ఇన‌యా. "నేను చెబితే నువ్వు వింటావా? అయిన నేను నీకు ఎందుకు చెప్తాను. కెప్టెన్ కి చెబుతాను. అది ఎవరితో చెప్పుకోవాలనేది నా ఇష్టం. నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ.. చెప్పేది విను. గట్టిగా మాట్లాడితే కాదు. అయినా నువ్వు నన్ను 'ఏం పీకావ్' అంటే తప్పు లేదు కానీ నేను నిన్ను 'ఏ' అంటే తప్పు అనిపించిందా?" అని అడిగాడు శ్రీ‌హాన్‌.