'నీ వాయిస్ అంటేనే చిరాకు, నీ షాడో అన్న నాకు అసహ్యం' అంటోన్న కీర్తి భట్!

బిగ్ బాస్ నామినేషన్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్యలో మాటల యుద్ధం. ఒక్కో కంటెస్టెంట్ చెప్పే కారణాలు, వాళ్ళు అవతలి కంటెస్టెంట్ ని  నామినేషన్ చేసే విధానాలు అందరిని ఆకట్టుకుంటాయి. కీర్తి భట్, రేవంత్ కి మధ్య మాటలు మితిమీరిపోయాయి. కీర్తి భట్, రేవంత్ ని నామినేట్ చేసింది. నామినేట్ చేసాక కీర్తిభట్ మాట్లాడుతూ, "అన్న, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ ఎక్కువగా చేసి మట్లాడుతావ్. అది నేను తీసుకోలేకపోతున్నాను. ఇదే విషయం చెప్పినా నువ్వు వినట్లేదు. నాకు నచ్చలేదు నువ్వు అలా మాట్లాడటం" అని రేవంత్ తో కీర్తి భట్ చెప్పింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, "నా వాయిస్ ఏ అంత. ఎవరో నా మీద నామినేషన్ వేసారు అని నువ్వు నన్ను నామినేట్ చేస్తా అంటే కుదరదు. తుప్పాస్ రీజన్స్ కి నామినేట్ చేయడం ఏంటి"  అని రేవంత్ అన్నాడు. "ఒకరు ఏమైనా చెప్పినప్పుడు వినాలి ముందు. కానీ అది నువ్వు పాటించవు. అందరికి రూల్స్ చెప్తావు. కానీ నువ్వు ఫాలో అవ్వవు. నాకు అందుకే నీ వాయిస్  అంటే అసహ్యం. నీ షాడో తగిలిన చిరాకు" అంటు రేవంత్ తో కీర్తి భట్ చెప్పుకొచ్చింది. దానికి సమాధానంగా, " ప్రతీసారీ నామినేషన్లో నీతో పడలేకపోతున్నా, ఏం తెలియకుండా నామినేట్ చేస్తావ్. ఒక ఆలోచన లేదు. థింకింగ్ లేదు. నీతో మాట్లాడటం అంటేనే చిరాకు. అసహ్యం" అని రేవంత్ చెప్పాడు. "నా మాట గురించి నువ్వు చెప్పకర్లేదు. ఐ నో వెరీ వెల్ ఎబోట్ ఇట్" అని కీర్తి భట్ అనగా, "అసలు నువ్వు నా గురించి మాట్లాడక్కర్లేదు" అని రేవంత్ కోపంగా వెళ్ళిపోయాడు. అలా రేవంత్ కి , కీర్తి భట్ కి మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది.  అయితే ప్రతీ వారం నామినేషన్లో ఉంటు వస్తోన్న రేవంత్. ఈ సారి కూడా సేవ్ అవుతాడు అని ప్రేక్షకులు భావిస్తోన్నారు. అయితే కీర్తి భట్ కి మాత్రం ఈ వారం ఎలిమినేషన్ తప్పేలా లేదు అనిపిస్తోంది.

ఆమె పొద్దుతిరుగుడు పువ్వు.. ఆయన ప్రకాష్ రాజ్!

బిగ్ బాస్ హౌస్ లో ఆది ఒక్కొక్కరి ఆట తీరు గురించి వర్ణిస్తూ చెబుతూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. అందరినీ నవ్వించాడు. ఇక హైపర్ ఆది.. ఇనయా గురించి చెప్తూ "హౌస్ లో ఎవరు మైక్ పెట్టుకున్నా పెట్టుకోక పోయిన బిగ్ బాస్ అరుస్తాడేమో కానీ ఈమె పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బిగ్ బాస్ ఏమీ అనడు. ఎందుకంటే మాములుగా మాట్లాడితేనే అందరికీ వినిపిస్తుంది. కిక్ సినిమాలో ఇలియానా రవితేజ కోసం బ్రహ్మానందాన్ని అడ్డుపెట్టుకున్నట్టు ఈ హౌస్ లో సూర్యని పడేయడానికి శ్రీహన్ ని అడ్డుపెట్టుకుంది ఇనయా.. మాములుగా ఐతే ఇనయ కానీ నామినేషన్స్ వచ్చాయంటే మాత్రం నేను విననయ్యా అంటుంది. ఇప్పటి వరకు నీ గ్రాఫ్ చాలా బాగుంది. ఐతే కొంచెం మార్చుకోవాలి. ఇలా ఎవరిని బడితే వాళ్ళను మార్చకుండా గేమ్ మీద ఇంటరెస్ట్ పెట్టు. స్వర్గం నుంచి నువ్వు ఇంద్రజలా వచ్చినప్పుడు శ్రీహాన్ కే కాదు మా అందరికీ బాగా నచ్చేసావ్." అన్నాడు ఆది. ఇనయాకి హౌస్ లో పొద్దుతిరుగుడు అనే ముద్దు పేరు ఉంది అని హోస్ట్ నాగ్ చెప్పారు. ఆది తర్వాత రేవంత్ గురించి చెప్తూ "ఎవరైనా రాని, ఏవైనా కానీ తగ్గేదేలే అన్నావు చూడు ఆ డైలాగ్ టైంలో నీలో పుష్ప కనిపించలేదు ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఎవరికైనా గేమ్ మధ్యలో కోపం వస్తుంది కానీ నీ విషయంలో కోపం మధ్యలో గేమ్ వచ్చి వెళ్తుంది అంటూ పంచ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.  ఇంట్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు చేస్తోంది నువ్వే. పెళ్లయింది కాబట్టి అన్ని చూసుకుని ఆడుకోవాలి..లేదంటే ఇక్కడ టైటిల్ గెలిచినా ఇంటికి వెళ్ళాక కొడతారు" అంటూ రేవంత్ ని హెచ్చరించాడు.

రేవంత్ వర్సెస్ గీతు!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. కంటెస్టెంట్స్ మధ్య మాటలు  ఒక మినీ యుద్ధాన్ని తలిపించేలా కొనసాగాయి. అందులో రేవంత్, గీతుకి మధ్య సాగిన మాటల యుద్ధం హౌస్ ని హీట్ చేసేసిందనే చెప్పాలి. కాగా ఈ సారి నామినేషన్ ప్రక్రియ పేరు 'ఫైర్ నామినేషన్ ', అంటే ఒక ఫైర్ లో, మీకు ఎవరు తక్కువగా పర్ఫామెన్స్ ఇచ్చారో వారి ఫోటోని ఆ ఫైర్ లో వేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. అందులో రేవంత్, గీతుని నామినేట్ చేసాడు. నామినేషన్ కి గల‌ కారణం చెప్తూ, "నేను పెరుగు దొంగని అని అన్నావ్. అది బయట వేరేలా పోర్ట్ రేట్ అవుతోంది. నేను ఏం దొంగతనం చేయలేదు." అని రేవంత్ అనగా "అది కాదు రేవంత్ నా కళ్ళతో చూసా నువ్వు పెరుగు తినడం" అని గీతు అనగా, "ఫస్ట్ నేను చెప్తున్నా కదా విను‌. పెరుగంతా నువ్వు తినేస్తున్నావ్ అని అనడం తప్పు, నేను దొంగతనం చేసేది చేసినట్టు ఒక్కరితో చెప్పించు"  అని రేవంత్, గీతుతో అన్నాడు. దానికి కీర్తిభట్ మద్యలో లేచి," చపాతీ వేసుకొని పాలు పోసుకొని తాగావ్ . నేను చూసాను. నువ్వు దొంగతనం చేసావ్." అని కీర్తి భట్  అనగా, "కూర్చో మధ్యలో అని రేవంత్ అన్నాడు." రేవంత్, గీతూతో మాట్లాడుతూ, " నువ్వు రూల్స్ ఫాలో అవ్వవు. నీ స్ట్రాటజీలతో ఎదుటివాళ్ళను తప్పు అంటావ్ కానీ నువ్వు రాంగ్" అని చెప్పాడు. దానికి గీతు సమాధానంగా, " నువ్వు నాకు రూల్స్ గురించి చెప్పడం కామెడీగా ఉంది. నువ్వు పడుకుంటే ఎన్నిసార్లు కుక్కలు మొరిగాయో హౌస్ మేట్స్ అందరికీ తెలుసు. నీతో మాట్లాడటం కూడా వేస్ట్ " అని గీతు అంది. ఆ తర్వాత 'యూ ఆర్ నతింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ' అని గీతు అనగా, "నా ముందు నువ్వు నతింగ్" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత "ఏం పీకుతావ్" అని రేవంత్ అనగా, "రా ఏం పీకుతానో లేదో తెలుస్తుంది" అని గీతు అంది. ఇలా గీతుకి రేవంత్ కి మధ్య మాటల యుద్ధం ముగిసింది. ఇక ముందు చూడాలి వీళ్ళు హౌస్ మేట్స్ లా ఉంటారో? లేదో? చూడాల్సి ఉంది.

సూర్య, ఇనయా మధ్య మాటల యుద్ధం!

బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ గొడవలు ఉంటేనే ఎంటర్టైన్మెంట్  ఫీల్ అవుతారు ప్రేక్షకులు. కాగా నామినేషన్ కోసం వారం అంతా ఎదురుచూస్తారు అనడంలో ఆశ్చర్యమే లేదు. కాగా సోమవారం జరిగిన నామినేషన్ ఉత్కంఠభరితంగా సాగింది. అందులో ముఖ్యంగా సూర్య, ఇనయాని నామినేట్ చెయ్యడం, ఇనయా, సూర్య ను నామినేట్ చేయడం. ఇనాయ నామినేషన్ అంటే ఒక్క మాటలు యుద్ధం అనే చెప్పాలి. ప్రతిసారి ఒకరికొకరు నామినేట్ చేసుకోవడం వింతేమీ కాదు. కానీ ఈ సారి కొత్తగా శ్రీహాన్ ని కాకుండా సూర్య ని నామినేట్ చేయడం, మొదటిసారిగా ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఇనయ, సూర్య ల మధ్య సాగుతోన్న రిలేషన్ షిప్ కాస్త ముగిసినట్టుగా ఉంది. 'సూర్య నా క్రష్' అని ఇనయా కన్ఫెషన్ రూంలో చెప్పడంతో నాగార్జున కూడా  అనుకున్నాడు. అలాగే హౌస్ మేట్స్ కూడా వీళ్లిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అని అనుకోవడం మాములుగా మారింది. "దీనివల్ల సూర్య మన ఇద్దరి గేమ్ డిస్టర్బ్ అవుతోందని, నాకు కొంచెం దూరంగా ఉండడం మంచిది" అని చెప్పింది. ఆ తర్వాత ఇనయా మాట్లాడుతూ, "నువ్వు అందరికి సోప్ వేస్తావ్. ఇక్కడ ఎవరితో  నీకు ఆర్గుమెంట్ లేదు. కత్తితో ఇలా పొడిచేసి, మళ్ళీ దానిమీద పౌడర్ రాస్తావ్. నీ గురించి బాగా తెలిసింది నాకు" అని ఇనయా అంది. "ఇకనుంచి మంచిగా ఉండటం మహా పాపం" అని సూర్య చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇనయా, శ్రీహాన్ ని నామినేట్ చేసింది. "నీకు ఆల్రెడీ సిరి ఉంది. నేను నీకు కేక్ చేసానని అందరు వేరేలా అనుకోవడం. నాకు నచ్చట్లేదు. ఆలా ఏం లేదు అని చెప్పడం కోసమే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా" అని శ్రీహాన్ నామినేట్ చేసింది. దానికి "అది హౌస్ మేట్స్ కి చెబితే సరిపోద్ది కదా. అలా చెయ్యకుండా నన్ను నామినేట్ చేయడం ఎందుకు" అని శ్రీహాన్ అన్నాడు. ఇనయా రెండవ నామినేషన్ గా సూర్యని చేసింది. "నీకు ఆల్రెడీ బుజ్జమ్మ ఉంది. నేను నీకు ఒక ఫ్రెండ్ మాత్రమే. హౌస్ మేట్స్ వేరేలా అనుకుంటున్నారు. అది బయటకు వేరేలా పోర్ట్రేట్ అవుతే బాగుండదు అని చెప్పింది. నీకు నాకు మంచి బాండింగ్ ఉంది. ఒక స్నేహం మాత్రమే. ఇక నుండి నిన్ను ఒక హౌస్ మేట్ గా చూస్తా అంతే"  అని‌ ఇనయా, సూర్య తో చెప్పింది. ఇక ముందు హౌస్ లో వీళ్ళు ఫ్రెండ్స్ గా ఉంటారో హౌజ్ మేట్స్ గా ఉంటారో చూడాలి.

మెరీనాని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్!

మెరీనా బిగ్ బాస్ హౌస్ లో వచ్చినప్పటి నుండి టాస్క్ లలో తన పర్ఫామెన్స్ అంతగా ఏమీ లేదనే చెప్పాలి. ఇప్పటికి చాలా వారాలు అయిన గేమ్ ఇంకా మొదలు పెట్టలేదు అని మొదటి నుండి చూస్తూన్న ప్రేక్షకులకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే జంటగా వచ్చిన ఈ మెరీనా-రోహిత్  విడదీసి ఇండివిడ్యువల్ గేమ్ ని ఆడమన్నాడు బిగ్ బాస్. అయితే ఇండివిడ్యువల్ గా తన పర్ఫామెన్స్ అంతలా ఏమీ లేదని, గత వారంలో మోస్ట్ అన్ డిసర్వింగ్ గా పేరు తెచ్చుకొని, నామినేషన్ లో ఉంది మెరీనా. అయితే హౌస్ లో దాదాపు సగంకి పైగా హౌస్ మేట్స్ తననే నామినేట్ చేయడంతో అందరికి తన పర్ఫామెన్స్ తక్కువగా తెలిసి, అందరికి తనే టార్గెట్ అయింది అని చెప్పాలి. మొదటగా శ్రీసత్య, మెరీనాని నామినేట్ చెయ్యగ. " ఏ విషయం అయినా క్లియర్ గా చెప్పాలి"  అని మెరీనా అనగా "చెప్తేనే కదా తెలిసేది" అని శ్రీసత్య చెప్పింది "నువ్వు చేసిన ఫూలిష్ నెస్ వల్ల మన టీం లో ఉన్న వాళ్ళు అయోమయంలో ఉన్నారు. రాత్రి ఒక మాట చెప్పవ్. మళ్ళీ పొద్దున్నకి వేరే మాట అన్నావ్. నీ ఆలోచన వేరే లెవల్ లో ఉంది. నువ్వు నీ  మాట మీద ఉండలేవు. నైట్ ఒక మాట మీద  ఉన్నావ్ .తెల్లారేసరికి మాట మార్చేసావు" అని మెరీనా, శ్రీసత్య తో చెప్పుకొచ్చింది. తర్వాత ఆదిరెడ్డి, మెరీనాని నామినేట్ చేసాడు. "నువ్వు ఇంకా గేమ్ ఆడట్లేదు" అని ఆదిరెడ్డి అనగా, "నా గేమ్ నాకు క్లారిటీ ఉంది. నేను ఆడుతున్నాను. ఎవరు జడ్జ్ చేయనవసరం లేదు" అని మెరీనా అంది. ఆ తర్వాత వచ్చిన గీతు, మెరీనాని నామినేట్ చేసింది. "ఈ హౌస్ లో మొన్న జరిగిన గేమ్ లో 'లీస్ట్ పెర్ఫార్మన్స్' ఎవరు అంటే నువ్వు అని నాకు అనిపించిది. ఎందుకంటే నీ గేమ్ నాకు ఎక్కడా కూడా కనిపించలేదు" అని గీతు చెప్పింది. "నేను గేమ్ పరంగా బానే ఆడాను" అని మెరీనా సమాధానమిచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఫైమా కూడా మెరీనాని నామినెట్ చేసింది. ఫైమా వెటకారంగా మాట్లాడిన తీరుకి మెరీనా బాధపడినట్టుగా అనిపిస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్, మెరీనా ని నామినేట్ చేసాడు. ఇలా హౌస్ లో  ఎక్కువ మంది నామినేట్ చెయ్యడంతో మెరీనా ఏడ్చేసింది. తనని అలా చూసిన రోహిత్ సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. కాగా ఈ వారం లో అయిన మెరీనా టాస్క్ లో  బాగా పర్ఫామెన్స్ చేసి అటు హౌస్ మేట్స్ ని మెప్పించి, ఇటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో? లేదో? చూడాలి మరి.  

ఇనయాను ఫేక్ అంటోన్న ఆదిరెడ్డి!

బిగ్ బాస్ లో సోమవారం అంటే నామినేషన్ గుర్తొస్తుంటుంది చూసే ప్రేక్షకులకు ఎందుకంటే ఆదివారం జరిగే సండే ఫండే ఎంజాయ్ కంటే కూడా నామినేషన్ నే ఎక్కువ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నామినేషన్లో  కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ అలాంటిది మరి. ఆదిరెడ్డి, ఇనయాని నామినేట్ చేసాడు. కారణం చాలా క్లారిటీ గా వివరించాడు. "నువ్వు  రెండు రోజుల ముందు శ్రీహాన్ ని నామినేట్ చేసి, ఆ తర్వాత 'ఫార్ బెటర్ దెన్ ఎనీవన్' అని శ్రీహాన్ కి  చెప్పడం నాకు అన్ ఫెయిర్ గా అనిపించింది" అని ఆదిరెడ్డి చెప్పాడు. "అలా నాకు అనిపించింది కాబట్టి చెప్పాను" అని ఇనయా సమాధానమిచ్చింది. అయితే "గత వారం జరిగిన  కెప్టెన్సీ టాస్క్ లో నాకు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీలోని ఇంద్రజ పాత్ర ఇచ్చారు. నాకు ఆ మూవీ తెలియదు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన సూర్యని అడిగినా కూడా చెప్పలేదు. కానీ నాకు శ్రీహాన్ అర్థం అయ్యేలా వివరించాడు. అందుకే చెప్పా, నువు నన్ను నామినేట్ చేసావని నిన్ను చేశాను. అంతేగాని నీ మీద నాకు ఏం కోపం లేదని, 'ఫార్ బెటర్ దెన్ ఎనివన్ ఇన్ థిస్ హౌస్' అని శ్రీహాన్ తో  చెప్పాను. అందులో ఏం తప్పులేదు" అని ఇనయా ఆదిరెడ్డితో చెప్పుకొచ్చింది. "ఒక్కొక్క సిట్యువేషన్ లో, ఒక్కోలా బిహేవ్ చేస్తున్నట్లు అనిపించింది. అందుకే నువ్వు ఫేక్ గా ఉంటున్నట్టు అనిపిస్తోంది‌. నీ గేమ్ పూర్తిగా తగ్గిపోయింది. మొదట బాగా పర్ఫామెన్స్ చేసిన నువ్వు డైవర్ట్ అవుతున్నట్టుగా అనిపించి, నువ్వు బాగా పర్ఫామెన్స్ చేయాలని నామినేట్ చేస్తున్నా " అని ఆదిరెడ్డి, ఇనయాతో అన్నాడు. దానికి సమాధానంగా ఇనయా మాట్లాడుతూ, " నేను ఇలానే ఉంటాను. సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటాను. ఇంకా నా గేమ్ మార్చుకుంటాను. తర్వాత ఫేక్ గా నేను ఉండటం లేదు అని ఇనయా, అనగా "ఫేక్ గా ఉండటం కూడా ఒక స్ట్రాటజి. దానిని నేను తప్పు పట్టను" అని ఆదిరెడ్డి అనగా, " నా ఆలోచనలు కూడా మీరెలా అనుకుంటారు.  అయినా నేను ఫేక్ కాదు. అది స్ట్రాటజీ అయితే ఒకే పర్వాలేదు" అని ఇనయా అంది. హౌస్ లో మొదటి వారం నుండి ఆదిరెడ్డి ఇనయాలకు ఎలాంటి గొడవలు లేవు. కాగా ఈ మధ్యలో ఇనయా డ్యూయల్ రోల్ ప్లే చేస్తుండటంతో ఎవ్వరికి నచ్చట్లేదు అనే చెప్పాలి. మొదటి రెండు వారాలు సూపర్ అనిపించిన ఇనయా, ప్రస్తుతం ఫ్లాప్ గా పేరు తెచ్చుకుంటోంది. రాబోయే రోజుల్లో అయిన మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో? లేదో ? చూడాలి.  

అది సెల్ఫ్ కంట్రోలా.. సిరి కంట్రోలా అనేది తెలియదు!

బిగ్ బాస్ హౌస్ లో ఈ దీపావళి ఎపిసోడ్ మాత్రం హౌస్ మేట్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇక ఆది శ్రీహాన్ గురించి చెప్తూ "మొదటి రోజు హౌస్ లోకి వెళ్ళాక నువ్ వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు నీకు షుగర్ అనుకున్నా..కానీ కాదని తర్వాత అర్ధమయ్యింది. ఇక నువ్వు చాలా విషయాల్లో కంట్రోల్ గా ఉన్నావ్. మరి అది సెల్ఫ్ కంట్రోలా, సిరి కంట్రోలా అనేది తెలియదు.   ఎవరైనా సిరి సంపదల కోసం బిగ్ బాస్ కు వస్తారు కానీ శ్రీహాన్ మాత్రం సంపదతో ఇంట్లోంచి బయటకి  వెళ్తే చాలు.. సిరి ఆల్రెడీ  బయట ఉంది అంటూ టైమింగ్ తో కూడిన కామెడీ చేసాడు. ఇక  ఇనయా శ్రీహాన్ ల బంధం గురించి చెప్తూ ఇద్దరూ గొడవ పడినప్పుడు వచ్చే కిక్కు మాములుగా ఉండదు. మీరు కలిసి ఉండేదాన్ని కంటే విడిపోయేటప్పుడు వచ్చే ఎంటర్టైన్ మంచి జోష్ గా ఉంటుంది. చూసావా విడిపోవా అనే మాటను నేను అనేసరికి అక్కడ సూర్యలో చిన్న స్మైల్ వచ్చింది. శ్రీహాన్ బయట ఎలా ఉంటాడో హౌస్ లో అలాగే ఉన్నాడు. ఎవరినీ నొప్పించడు..ఇలాగే గేమ్ ఆడు" అంటూ శ్రీహాన్ కి విషెస్ చెప్పాడు ఆది.

ప్రతి సీజన్‌కీ ఒక రేలంగి మావయ్య ఉంటాడు!

బిగ్ బాస్ సీజన్ 6  దీపావళి సందర్భంగా ఆదిని హౌస్ లోకి తీసుకొచ్చేసరికి  మంచి పంచుల్ని టపాకాయల్ని పేల్చినట్టు పేల్చేసాడు. 'ప్రతీ బిగ్ బాస్ సీజన్ కి ఒక ప్రవచన కర్త, ఒక రేలంగి మావయ్య ఉంటాడు. ఈ హౌస్ లో అతను ఎవరంటే బాలాదిత్య. "గీతూ వల్లే మీరు సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారు. అది తెలీక గీతూ వెళ్లి మీ సిగరెట్లను త్యాగం చేసింది.  ఇక హోటల్ టాస్క్ తర్వాత గీతూకి ఆ 100 రూపాయలు ఇచ్చేసి ఉంటే నీకు 100 ఎపిసోడ్ల టార్చర్ తప్పేది కదా. నువ్వు హౌస్ లోంచి బయటకి వచ్చాక నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఎవరూ ఆలోచించుకోవక్కర్లేదు. అన్ని సిగరెట్ బ్రాండ్స్ తీసుకొచ్చి నీ ముందు పెడతారు. బాలాదిత్య బాయట ఎలా ఉన్నాడో హౌస్ లో కూడా అలాగే ఉన్నాడు. ఏ పాయింట్ ఐనా కరెక్ట్ అనుకున్నప్పుడు ఒక సారి చెప్తే చాలు దాని గురించి ప్రతీ సారీ సంజాయిషీ ఇవ్వక్కర్లేదు" అంటూ చెప్పాడు. ఇక మరీనా, రోహిత్ గురించి చెప్తూ " మీ హౌస్ కి ఈ బిగ్ బాస్ హౌస్ కి ఒకటే తేడా..ఇక్కడ మరీనా వంట గదిలో ఉంటుంది, రోహిత్ గేమ్ ఆడతాడు..వాళ్ళ ఇంట్లో రోహిత్ కిచెన్ లో ఉంటాడు. మరీనా గేమ్స్ ఆడుకుంటది..బిగ్ బాస్ ఎడిటర్లకు చాలా వరకు పని తగ్గించేది మీరే" అంటూ ఇద్దరి మీద సెటైర్స్ వేసాడు.

గజని మొహమ్మద్‌లా దండయాత్ర చేస్తూనే ఉంటుంది!

బిగ్ బాస్ హౌస్ లో దివాళి సెలెబ్రేషన్స్ లో భాగంగా హైపర్ ఆది ఎపిసోడ్ మస్త్ హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు. హౌస్ లో అందరి గురించి చెప్పాడు ఆది. ఇక ఫైమా గురించి మాట్లాడుతూ " ప్రవీణ్ నిన్ను అడిగానని చెప్పమన్నాడు. నీ గురించి అనుకుంటున్నావుకదా కానీ కాదు నీకు పది వేలు ఇచ్చాడట కదా దాని గురించి  గుర్తుచేయమన్నాడు" అన్నాడు దానికి హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ "ఎందుకు అంత డబ్బు ఇచ్చాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికా" అంటూ కౌంటర్ వేశారు. "నేను ఈ హౌస్ రావడం కోసం ఉదయం నుంచి ఏమీ తినలేదు.. ఎందుకంటే ఫైమా అందం చూస్తే కడుపు నిండిపోతుందట అని ఆ అమ్మాయే చెప్పింది అందుకే చూస్తా నా కడుపు నిండుతుందా లేదా"  అంటూ పంచ్ వేసాడు ఆది. "గజని మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు ప్రతీ వారం కెప్టెన్సీ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నావ్. బయట ఆడియన్స్ నీ పట్టుదల చూసి ఏదో  ఒక రోజు నువ్వు కెప్టెన్ వి అవుతావు అంటున్నారు. ఒకవేళ నువ్వు ఈ హౌస్ లో కెప్టెన్ వి కాకపోయినా బయటికి వచ్చాక మన మాటీవీ వాళ్ళు కెప్టెన్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చి మంచి స్కిట్ చేయిస్తారు. నువ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావ్, గేమ్ బాగా ఆడుతున్నావ్, నువ్ కెప్టెన్ ఐతే నాకు చూడాలని ఉంది" అంటూ ఫైమాకి విషెస్ చెప్పాడు హైపర్ ఆది.

దెయ్యానికి కూడా లైన్ వేయాలనిపించింది నిన్ను చూశాక!

బిగ్ బాస్ హౌస్ లో ఆది ఒక్కొక్కరి గురించి చెప్తూ వాసంతి దగ్గరకు వచ్చాడు. "ఆడవాళ్ళకు ఏ రహస్యం కూడా చెప్పకూడదు.. అలా చెప్తే అందరికీ చెప్పేసి సీక్రెట్‌గా ఉంచు" అని వాళ్లకు చెప్తారు. "ఒక పక్కన మెరీనాతో మంచం మీద గుసగుసలాడుతూనే మరో పక్క జైలులో వేసిన అర్జున్ తో ఇనుప చువ్వల మధ్య నుంచి గుసగుసలాడింది. అప్పుడు నిజంగా 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనాలపించింది" అన్నాడు. "దెయ్యం గెటప్ వేసినప్పుడు అందంలో కేర్ తీసుకుంది ఈ అమ్మాయి ఒక్కటే ఈ హౌస్ లో.. అంటే దెయ్యానికి కూడా లైన్ వేయొచ్చు అనిపించింది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఆధార్ కార్డులో నీట్ గా మేకప్ వేసుకుని అందంగా కనిపించేది నువ్వేనేమో. మొదట్లో గేమ్ సరిగా ఆడలేదు కానీ తర్వాత మెరుగు పరుచుకుని మంచి గేమ్ ఆడుతూ వచ్చావ్" అంటూ ఆమెను పొగిడేశాడు. ఇక రాజ్ గురించి చెప్తూ "ఈ హౌస్ లో ఒక పాట పాడాడు. ఇక అప్పటి నుంచి ఎవరూ సరిగా నిద్రపోవడమే లేదు. 'వస పత్ర సాయికి వరహాల లాలి' అనే పాట పాడాడు. ఆ పాట రాసింది ఎవరా అని  గూగుల్ చేస్తుంటే ఏమీ చూపించట్లేదు. అప్పుడు తెలిసింది 'వటపత్ర సాయికి' అనే పాట గురించి అంత తప్పుగా పాడాడు" అంటూ కౌంటర్ వేశాడు.  కీర్తి గురించి చెప్తూ.. "నువ్వూ, మరీనా ఇద్దరూ తెలుగు మాట్లాడుకుంటూ ఒకరికొకరు కరెక్ట్ చేసుకుంటారు చూశారా.. ఆ సీన్ చూసినప్పుడు నిజంగా చాలా బాగుంటుంది. తెలుగు తెలియని ఇద్దరు కూర్చుని తెలుగు కరెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే ఫన్ మాకు బాగా నవ్వు తెప్పిస్తుంది. నువ్వు ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా" అన్నాడు ఆది.

సూర్యలో చాలా ఆకలి ఉంది.. అది హౌస్‌లో బాగా కనిపిస్తోంది!

బిగ్ బాస్ హౌస్ దీపావళి సందడితో ఫుల్ జోష్ గా మారింది. హీరోయిన్ల డాన్స్ లతో, టాప్  గెస్ట్ లతో కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ వీకెండ్ ని మరింత జోష్ గా చేయడానికి బుల్లి తెర స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని తీసుకువచ్చారు టీమ్. ఇక ఆది  హౌస్ మేట్స్ ను తన ప్రాసలు, పంచులతో ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు వచ్చి రావడంతోనే  శ్రీహాన్- ఇనయా , శ్రీహన్ - ఆర్జే సూర్య మధ్య రహస్య సంబంధాలను బయట పెట్టేసాడు. ఏ టాపిక్ మాట్లాడినా గీతూ అందులోకి దూరిపోతుంది కాబట్టి ఆమె నుంచే తన డైలాగ్ డెలివరీ స్టార్ట్ చేసాడు.  "మా పరివార్ అవార్డ్స్" లాగా "మధ్యలో దూరే అవార్డ్ " లాంటిది ఉంటే అది గీతూకే వస్తుంది అన్నాడు. "మైండ్ గేమ్ ఆడకుండా అప్పుడప్పుడు కాస్త ఫిజికల్ గా ఆడరా" అంటూ సలహా ఇచ్చాడు. ఇక అర్జున్ గురించి మాట్లాడుతూ " టిప్పులిచ్చి మరీ  జైలుకెళ్లడమే కాదు భారతంలో  అర్జునుడు ఎలా గురి పెట్టి పిట్టను కొట్టాడో అంతకంటే ఎక్కువగా  శ్రీసత్యాను పట్టడానికి  కష్టపడుతున్నావ్" అంటూ కౌంటర్ వేసాడు హైపర్ ఆది.  అటు శ్రీసత్య ను ఉద్ధేశించి హాట్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ లో  శ్రీసత్యను చూడడానికే  కుర్రాళ్లు టీవీల ముందు కూర్చుంటున్నారు అన్నాడు. ఇక హౌస్ లో జరుగుతున్న లవ్ స్టోరీల గురించి తనదైన స్టయిల్లో పంచులు వేసాడు ఆది.  బిగ్ బాస్ కనుక డైరెక్టర్ సుకుమార్ చూస్తే.."ఆర్య వన్ సైడ్ లవ్ లాగా  సూర్య ఆల్ సైడ్ లైవ్ సినిమా కచ్చితంగా చేస్తాడంటూ" నాన్ స్టాప్ గా ఇచ్చి పడేశాడు ఆది.  "సూర్య ఎక్కడుంటే అక్కడ ఏదో ఉండనే అనుకుంటున్నారు. సూర్య వరల్డ్ ఫేమస్ లవర్ ఐపోయాడు. అంతే కాదు ఈ  లవ్ స్టోరీలు అవి.. కమల్ హాసన్ గారు చేసేసారు కాని.. అదే ఇలాంటి టైములో నువ్వు బయటకు వస్తేనా ఆకలి రాజ్యం సినిమా నీతో చేయడానికి రెడీగా ఉన్నారు డైరెక్టర్లు అంత ఆకలి ఉంది నీలో"   అంటూ సూర్యను ఉద్దేశించి అన్నాడు. "ఇవన్నీ తెలిస్తే బుజ్జమ్మ ఏముంటది సూర్య" అని నాగ్ అడిగేసరికి "నరికేస్తాది సర్" అంటూ సూర్య ఆన్సర్ ఇచ్చాడు.

అమ్మల సెల్ పాస్వర్డ్స్ తెలుసుకుంటారు కానీ వాళ్ళవి చెప్పరు!

చెఫ్ మంత్ర సీజన్ 2 ఎన్నో టాస్క్స్ తో అలాగే డెలీషియస్ ఫుడ్ ప్రిపరేషన్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మంచు లక్ష్మి హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ప్రతీ వారం కొంతమంది సెలెబ్రిటీ గెస్ట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ వారం రీతూ వర్మ, వాళ్ళ అమ్మ సంగీత చెఫ్ మంత్ర సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇక ఈ ఎపిసోడ్ లో "కరెక్ట్ ఆన్సర్ చెప్పండి స్వీట్ తినండి" అనే టాస్క్ ఇచ్చింది మంచు లక్ష్మి. "ఆంటీ రీతుకి 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి" అని అడిగింది. "95 పర్సెంట్ తెచ్చుకుంది. స్కూల్ టాపర్ గా నిలిచింది " అని చెప్పింది సంగీత. తర్వాత "మీ అమ్మతో కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏమిటి" అని రీతూను అడిగింది. " ఏదో గుర్తులేదు కానీ అమ్మతో కలిసి జుమాంజి, జురాసిక్ పార్క్, ఇండిపెండెన్స్ డే చూసాను..ఆ మూవీస్ చూసేటప్పుడు నేను యాక్టర్ ఐతే బాగుండు అనుకునేదాన్ని ఈరోజు యాక్టర్ ని అయ్యాను" అని చెప్పింది రీతూ.  " ఆంటీ రీతూ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ వున్నారు" అని అడిగింది లక్ష్మి "20 లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు" అని కరెక్ట్ ఆన్సర్ చేసింది. "రీతూ మీ అమ్మకు ఏ వయసులో పెళ్లి అయ్యింది" అని అడిగింది. కానీ రీతూ ఆన్సర్ తప్పు చెప్పేసరికి వాళ్ళ అమ్మ కరెక్ట్ చేసింది "24 ఏళ్ళ వయసులో పెళ్లి అయ్యిందని " చెప్పింది.  "ఆంటీ పెళ్లి చూపులు మూవీలో రీతూ క్యారెక్టర్ ఏమిటి" అని అడిగేసరికి "చిత్ర" అని కరెక్ట్ గా చెప్పేసరికి మంచు లక్ష్మి షాకయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక రీతుని ఇంట్లో చిత్ర పేరుతోనే ఎక్కువగా పిలిచేది అందుకే ఆ పేరు గుర్తుండిపోయింది చెప్పింది. ఏ మూవీ రిలీజ్ ఐతే ఆ మూవీ క్యారెక్టర్ నేమ్ తో ఇంట్లో పిలుస్తూ ఉంటా అని చెప్పింది సంగీత.  "మీలో ఒకరి సెల్ పాస్వర్డ్ మరొకరికి తెలుసా అని అడిగేసరికి "నా సెల్ పాస్వర్డ్ రీతుకి తెలుసు ఓపెన్ చేసుకుని చూసుకుంటుంది కానీ తన సెల్ పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చేస్తుంది. స్మార్ట్ కిడ్స్ కదా " అని చెప్పింది సంగీత. "రీతూ మీ అమ్మను ఏ ముద్దు పేరుతో పిలుస్తావ్" అనేసరికి " అమ్మ పేరు సంగీత కదా గీతూ" అని పిలుస్తానని చెప్పింది. ఇలా టాస్క్ రౌండ్ ని కంప్లీట్ చేసింది మంచు లక్ష్మి.

పచ్చిమిర్చి తిన్న భర్తలు.. ఎంజాయ్ చేసిన భార్యలు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. మళ్ళీ పెళ్లి పేరుతో ఆల్రెడీ పెళ్ళైన జంటల్ని తీసుకొచ్చి వాళ్లకు టాస్కులు పెట్టి ఫుల్ జోష్ క్రియేట్ చేశారు. ఇక ఈ షోకి అమ్మ రాజశేఖర్-రాధ ఇద్దరూ వచ్చేసరికి "మొదటిసారి ఇద్దరూ కలిసి చూసిన సినిమా ఏమిటి" అని అడిగింది రష్మీ కానీ రాజశేఖర్ ఆన్సర్ చెప్పకపోయేసరికి మిర్చి తినక తప్పలేదు. తర్వాత నవీన్, బబిత ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు. "మీరు ఇద్దరూ ఆర్టిస్టులు కాబట్టి ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఏమిటి" అని రష్మీ అడిగేసరికి "ప్రేమించేది ఎందుకమ్మా అనే మూవీ చేస్తున్నప్పుడు అక్కడే బబితను చూసాను ప్రేమించాను, అక్కడే పెళ్లి చేసుకున్న, అక్కడే షూటింగ్ చేశా."అని ఆన్సర్ కరెక్ట్ చెప్పినా బబిత మాత్రం తనను ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నవీన్ తో మిర్చి  తినిపించింది.  ఇక తర్వాత దొరబాబు-అమూల్య ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు .."మీ ఇద్దరిలో ముందు ముద్దు ఎవరు పెట్టారు" అని రష్మీ అడిగేసరికి "అరేయ్ ఎప్పుడో విషయం గురించి కాదురా.. మన ఇద్దరి గురించిరా" అంటూ అమూల్య ఫుల్ స్పీడ్ ఐపోయింది. వెంటనే దొరబాబు "నేనే ముద్దుపెట్టుకున్న ముందు అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ ఎల్లో - రెడ్" అని కరెక్ట్ గా చెప్పాడు. కానీ ఇంద్రజ ఆ ఆన్సర్ రాంగ్ అని చెప్పు అంటూ అమూల్యతో అబద్దం చెప్పించేసరికి దొరబాబు మిర్చి తినక తప్పలేదు. ఇలా కొంటె  టాస్కులు ఇచ్చి రష్మీ ఆడియన్స్ ని  ఎంటర్టైన్ చేసింది.

మోస్ట్ డిసర్వింగ్ గా శ్రీహాన్, అన్ డిసర్వింగ్ గా మెరీనా!

బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పులను చెప్పడానికి, మంచి పనిని మెచ్చుకోడానికి వారాంతంలో నాగార్జున వస్తాడన్న విషయం తెలిసిందే. కాగా కంటెస్టెంట్స్ అందరు భయడపడ్డారు. కానీ అంతలా ఏం వార్నింగ్ ఇవ్వలేదు. కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి హౌస్ లో ఉండడానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అని చెప్పమన్నాడు.  కాగా హౌస్ మేట్స్ లో ఎక్కువగా శ్రీహాన్ ని డిసర్వింగ్ అని చెప్పారు. తన అటతీరు, మాటతీరు కూడా బాగుంటుంది. ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అవ్వడు. గేమ్ లో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఆక్టివ్ గా ఉంటూ అలరిస్తోన్నాడు. మరియు ఇతర టాస్క్ లో పాల్లొంటు ఆకట్టుకుంటాడు అని హౌస్ లో సగానికి పైగా మంది చెప్పారు. శ్రీహాన్ తో పాటుగా రేవంత్, గీతు, సూర్య లు కూడా డిసర్వింగ్ గా ఉండగా, శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు పడడం జరిగింది. శ్రీహాన్ ని ఇనయా గురించి అడుగగా, "ఏంటో సార్ ఈ మధ్య నన్ను పొగిడేస్తోంది" అని చెప్పగా, "లేదు శ్రీహాన్. సూర్య, ఇనయా ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు" అని నాగార్జున చెప్పడంతో శ్రీహాన్ ఆశ్చర్యపోయాడు. అయితే ఇప్పటివరకు శ్రీహాన్ ఎన్ని సార్లు నామినేషన్ లో ఉన్నా కూడా అందరికంటే ముందు టాప్ ప్లేస్ లో ఉంటాడు. దీన్ని బట్టి చుస్తే శ్రీహాన్ విన్నర్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ అన్ డిసర్వింగ్ గా మెరీనాను ఎక్కువ మంది ఎన్నుకొన్నారు. హౌస్ లో జంట గా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ బిగ్ బాస్ విడదీసి విడివిడిగా ఆడమని చెప్పిన విషయం తెలసిందే. కాగా ఇండివిడ్యువల్ గా ఆడడం మొదలు పెట్టిన నుండి రోహిత్ పర్వాలేదు అనిపించినా, మెరీనా మాత్రం ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు. అటు ఫిజికల్ టాస్క్ లలో, ఇటు మైండ్ గేమ్ లలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదు. హౌస్ లో సగం కంటే ఎక్కువ మంది మెరీనాని హౌస్ లో ఉండటానికి అనర్హురాలు గా ఓటు వేసి చెప్పారు. వసంతి, రాజ్, అర్జున్ లు కూడా అన్ డిసర్వింగ్ కంటెస్టెంట్స్ కాగా, ఎక్కువగా మెరీనాకి ఓట్లు రావడం వల్ల అన్ డిసర్వింగ్ గా ఎన్నికైంది. ఈ నలుగురు కూడా హౌస్ లో అంతంత మాత్రం పర్ఫార్మన్స్ చేస్తూ, వస్తోన్నారు. అందరికి అన్ డిసర్వింగ్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. "ఇది బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు తీయకూడదు" అని చెప్పాడు బిగ్ బాస్. ఈ మోస్ట్ అన్ డిసర్వింగ్ ఇక ముందు అయిన ఆటలో తమ పర్ఫామెన్స్ మెరుగుపరుచుకొని, ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి హౌస్ లో కొనసాగుతారో? లేదో ? చూడాలి.

కొబ్బరిబొండాం మా ఇద్దరినీ కలిపింది!

దీపావళి పండగలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ అందంగా ముస్తాబై వచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ ని "మళ్ళీ పెళ్లి" అనే కాన్సెప్ట్ తో నడిపించారు. ఈ ఎపిసోడ్ కి రియల్ భార్య భర్తలు కూడా వచ్చారు. ఇక హరిత, జాకీ ఈ వారం ఎపిసోడ్లో తమ లవ్ స్టోరీ చెప్పి ఎంటర్టైన్ చేశారు. వీళ్ళ ఇద్దరికీ రష్మీ ఒక టాస్క్ ఇచ్చింది. "హరిత గారిని ఫస్ట్ టైం డాన్స్ క్లాస్ లో చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చెప్పాలి" అనేసరికి "ఆరోజు గ్రీన్ కలర్ డ్రెస్. నేను ఆ ఇన్స్టిట్యూట్ లో పైన క్లాస్ లో ఉండేవాడిని హరిత కింద క్లాస్ లో డాన్స్ నేర్చుకునేది" అని కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు రష్మీ రెండు స్ట్రాలు వేసి ఉన్న ఒక కొబ్బరి బోండాన్ని ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు జాకీ కొబ్బరిబోండాం పట్టుకుని దీనికి ఒక కథ ఉంది అంటూ అప్పటి జ్ఞాపకాలను చెప్పుకొచ్చాడు.  "అప్పట్లో హరిత చెన్నై నుంచి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చేది. ఆ రోజుల్లో తాను ఎక్కువగా డైటింగ్ లో ఉండేది. ఒకరోజు తినకుండా నీరసమొచ్చి నిద్రపోయింది. ఒక షూటింగ్ టైంలో మా ఇద్దరికీ ఒకే కార్ పంపించారు. నేను ముందు కూర్చున్నా.. వెనక హరిత పడుకుంది. డ్రైవర్ ని అడిగితే ఆమెకు బాలేదని చెప్పేసరికి దారి మధ్యలో కార్ ఆపమని చెప్పి హరిత కోసం కొబ్బరిబోండాలు, ఎలెక్ట్రోల్ పౌడర్ ప్యాకెట్లు తీసుకుని డ్రైవర్ కి ఇచ్చి నేను వెళ్ళిపోయాను" అని చెప్పాడు జాకీ.  తర్వాత హరిత మాట్లాడుతూ "ఎంత ఒంట్లో బాగోకపోయినా రెడీ ఐపోయి షూటింగ్ కి వెళ్ళిపోతాను. అలా షూటింగ్ లో కూర్చుంటే వెనక నుంచి కొబ్బరి బొండాలు అన్నీ వస్తున్నాయి. ఎవరు తీసుకున్నారు అనేసరికి అప్పుడు డ్రైవర్ చెప్పాడు అసలు విషయం..అలా మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ కొబ్బరిబొండామే మా ఇద్దరినీ కలిపింది అంటూ తమ లవ్ సీక్రెట్ చెప్పారు ఇద్దరూ.

'మధ్యలో దూరే అవార్డు' గీతూకే!

బిగ్ బాస్ హౌస్ లో విమెన్ ఆల్ రౌండర్ గా తన పర్ఫామెన్స్ తో గీతు ఆకట్టుకుంటోంది అనే విషయం అందరికి తెలిసిందే. కాగా సండే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కావడంతో కమెడియన్ హైపర్ ఆది వచ్చి తన పంచ్ డైలాగ్స్ తో అలరించాడు. హైపర్ ఆది కంటెస్టెంట్స్ అందరి గురించి ఏదో ఒకటి చెప్తూ కామెడీతో అలరించగా, గీతు గురించి చెప్తూ, "నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. అయితే హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నావు. హౌస్ లో ఏ ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ జరిగినా నీ మాటే వినిపిస్తోంది. గేమ్ పరంగా సూపర్. మాట పరంగా కొంచెం అదుపులో ఉంచుకోవాలి. నోటి దూల బాగా ఉంది. ఎవరిని మాట్లాడనివ్వవు" అంటూ ఆది చెప్పుకొచ్చాడు. గత వారం కూడా నాగార్జున మాట్లాడుతుండగా మధ్యలో దూరి మాట్లాడితే నాగార్జునకి కోపం వచ్చింది. కాగా అప్పుడే గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. "గీతు ఎవరిని మాట్లాడనివ్వవా" అంటూ కోపంగా అనేసాడు నాగార్జున. అయినా కూడా తన తీరు మార్చుకోలేదు. గీతు ప్రవర్తన కొందరికి చిరాకేస్తోంది మరికొందరికి ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తోంది. తన అటతీరుకి, మాట్లాడే చిత్తూరు యాసకి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది అనే చెప్పాలి. కాగా దీపావళి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కమెడియన్ ఆది కూడా అదే విషయం చెప్పాడు. మధ్యలో దూరే అవార్డు అంటూ ఉంటే మాత్రం గీతూకే వస్తది అని చెప్పగా, "నేను కాదు రేవంత్" అని చెప్పే ప్రయత్నం చేసింది. దానికి బదులుగా ఆది మాట్లాడుతూ, "రేవంత్ అందుకునేలోపే నువ్వే మధ్యలో దూరి అవార్డు అందుకుంటావు" అని అనడం తో హౌస్ లో నవ్వులు పూసాయి. గీతు ఆది చెప్పిన మాటలను మనసులో పెట్టుకొని మసులుకుంటుందో? లేక వదిలేస్తుందో చూడాలి.

ఉదయకిరణ్ తో కలిసి 5 సినిమాలకు సైన్ చేసాను!

'నువ్వు నాకు నచ్చావ్' మూవీతో సుదీప పేరు కాస్తా పింకీగా మారిపోయింది. అప్పట్లో ఈ మూవీ ఎంత సూపర్ హిట్టో పింకీ యాక్షన్ మాత్రమే కాదు ఆమె  పేరు కూడా అంత హిట్ కొట్టింది. ఇక ఇన్నేళ్ల తర్వాత సుదీప అలియాస్ పింకీ బిగ్ బాస్ హౌస్ ద్వారా మళ్ళీ లైం లైట్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 6 ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక ఎన్నో విషయాలు చెప్పింది. ఎన్నో ఇంటర్వూస్ ఇచ్చింది. అలాగే ఇదే సందర్భంలో మరణించిన హీరో ఉదయ్ కిరణ్ గురించి కూడా కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.  "ఉదయ్ కిరణ్ ది చాలా సాఫ్ట్ నేచర్. ఎవరైనా కొంచెం డల్ గా కనిపిస్తే దగ్గరకొచ్చి అన్ని కనుక్కునేవారు. చాలా మంచి మనిషి. భౌతికంగా ఆయన  లేకపోయినా అందరి మనస్సులో ఉండిపోయారు" అని సుదీప ఎమోషనల్ అయ్యారు. "ఉదయ్ కిరణ్ తో నేను నటించిన లాస్ట్ మూవీ 'వియ్యాల వారి కయ్యాలు'. ఉదయ్ కిరణ్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళంలో కలిపి  తొమ్మిది చిత్రాలు మొదలయ్యాయి... అయితే వాటిల్లో చాలా వరకు ఆగిపోయాయి. ఒక ఐదు చిత్రాలకు నేను కూడా సైన్ చేశాను. ఇక నేను మూవీస్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాను అంటే ..మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఎం.ధర్మరాజు ఎంఏ మూవీ షూటింగ్ గోదావరిలో జరుగుతున్నప్పుడు ఆ మూవీలో నటించాల్సిన చైల్డ్ ఆర్టిస్ట్ రాకపోయేసరికి ఆ మూవీ రైటర్ మా తాతయ్యకు బాగా పరిచయం. దాంతో ఆ టైములో ఆయనకు నా గురించి చెప్పడం ఈ సినిమాలో ఛాన్స్ రావడం జరిగింది. అలా హీరో, హీరోయిన్స్ చెల్లెలు పాత్రల్లో ఎక్కువగా చేసాను" అని చెప్పింది సుదీప.

బిగ్ బాస్ నుండి బయటకొచ్చేసిన అర్జున్!

బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడు లేని విధంగా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. కాగా ప్రేక్షకులకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలో అనే ఆలోచనలో పడేలా చేసింది. కాగా సండే ఎపిసోడ్ లో, ఓ వైపు ఎంటర్టైన్మెంట్ చేస్తు మరో వైపు అందరిలో నుండి ఒక్కొక్కరిని సేవ్ చేస్తు రాగా చివరగా వాసంతి అర్జున్ లు ఉన్నారు. "మీ ముందు ఇద్దరి పేర్లతో ఫ్లవర్ పాట్ లు ఉన్నాయి, అందులో ఏది వెలుగుతుందో వాళ్ళు సేవ్ అవుతారు. వెలగని వాళ్ళు ఎలిమినేట్ అవుతారు" అని చెప్పాడు నాగార్జున. అందులో అర్జున్ పాట్ వెలగకపోవడంతో , "అర్జున్ యూ ఆర్ ఎలిమినేటెడ్" అని చెప్పేసాడు నాగార్జున. దాంతో అర్జున్ ఎలిమినేట్ అయి బయటకొచ్చేసాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు భావోద్వేగానికి లోనయ్యారు. మొదటిసారిగా శ్రీసత్య, అర్జున్ కోసం ఏడ్చింది. అది చూసి హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోగా, అర్జున్ వెళ్ళిపోతాడని బాధలో ఉన్నారు. ఆ తర్వాత అందరికి బై చెప్పేసి హౌస్ నుండి నాగార్జున దగ్గరకు వచ్చేసాడు. నాగార్జున, అర్జున్ తో కాసేపు మాట్లాడాడు. తర్వాత తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. హౌస్ మేట్స్ గురించి చెప్పమని ఒక టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో "తుస్ బాంబులా ఎవరుంటారు? ఆటంబాంబులా ఎవరుంటారు?" అని చెప్పమన్నాడు. "శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతు, ఫైమా వీళ్ళు ఆటంబాంబులు గా ఉంటారు. రోహిత్, మెరీనా, కీర్తి భట్, ఇనయా, ఆదిత్య వీళ్ళు తుస్ బాంబులా ఉంటారు" అని అర్జున్ చెప్పాడు. అర్జున్ వెళ్లిపోతు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. "బిగ్ బాస్ కి శ్రీసత్య వల్లే వచ్చాను. ఏదో మూవీ షూటింగ్ కి శ్రీసత్య ని డేట్స్ అడిగితే లేవు అంది. ఎందుకని అడిగితే నేను బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాను అంది. అందుకే నేను కూడా బిగ్ బాస్ కి అప్లై చేసుకున్నా, సెలెక్ట్ అయ్యాను" అని చెప్పడం తో అందరు ఆశ్చర్యపోయారు. ఇక టైం అయింది అని అర్జున్ ని నాగార్జున పంపించేసాడు. అయితే ఆడియన్స్ వేస్తోన్న ఓటింగ్ లో చివరి స్థానంలో లేని అర్జున్ ఎలిమినేషన్ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఇది చాలా అన్ ఫెయిర్  అంటు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు.

అఖిల్ కాపురంలో చిచ్చు పెట్టిన హైపర్ ఆది!

ఢీ 14 ఇక దీపావళికి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. "ఈరోజు నేను, అఖిల్ ఒక ఇద్దరికి ప్రపోజ్ చేయబోతున్నాం" అని హైపర్ ఆది ఒక డైలాగ్ వేసాడు. "అఖిల్ ఒక పర్సన్ కి ప్రొపోజ్ చేస్తే ఓకే కానీ, ఎప్ప్పుడూ ఒక్కో రోజు ఒక్కో పర్సన్ ఐతే కష్టం కదా" అంది పూర్ణ. "మేమైతే షూటింగ్ టైములో మాట్లాడుకుని వెళ్ళిపోతాం కానీ అఖిల్ నువ్వు మాత్రం షూటింగ్ ఐపోయాక కూడా కలుస్తున్నావ్ అంటా" అని ప్రదీప్ కూడా అఖిల్ ని కార్నర్ చేసేసరికి "ఎవరిని కలిసాను అన్నా" అన్నాడు అఖిల్.. "శ్రద్ధా దాస్ గారిని కలిసావా లేదా బయట" అని ప్రదీప్ వేసిన ఈ డైలాగ్ కి అందరూ నవ్వేశారు.  తర్వాత ఆది అఖిల్ కార్ డ్రైవర్ గా ఒక సీన్ రీ-క్రియేట్ చేసి చూపించి మంచి ఫన్ చేశారు. ప్రదీప్ శ్రద్ధాదాస్ లా చేసాడు. ఇక అఖిల్ శ్రద్ధాతో చేసిన ఓవర్ యాక్షన్ కి ఆది మధ్యలో వచ్చి "మీరు ఈ అమ్మగారి దగ్గర ఉంటే ఆ అమ్మగారు ఫోన్ చేస్తున్నారు" అని చెప్పేసరికి "ఆ అమ్మగారికి ఈ అమ్మగారికి పడదు. షూటింగ్ లో ఉన్నానని ఏదో చెప్పేసి ఫోన్ పెట్టేయ్" అన్నాడు అఖిల్. ఇక ఆది ఇదే టైం అనుకుని ఆ అమ్మగారికి ఫోన్ చేసి "సర్ షాట్ లో ఉన్నాడు.. కాదు కాదు షూట్ లో" ఉన్నాడు అంటూ అఖిల్ కాపురంలో చిచ్చు పెట్టేసాడు. ఇక కంటెస్టెంట్స్ క్వార్టర్ ఫైనల్స్ సందర్భంగా చేసిన డ్యాన్సులు అద్దిరిపోయాయి. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.