రేవంత్ అందరినీ తక్కువ చేసి మాట్లాడతాడు.. అందుకే అతనంటే కోపం!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక బీబీ కేఫ్ లో అర్జున్ బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. "బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు జనాల ప్రేమ, అభిమానాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పావ్.. కానీ వచ్చేటప్పుడు శ్రీసత్య కోసమే వెళ్లానని చెప్పావ్.. ఎందుకిలా" అని యాంకర్ అడిగేసరికి " మెయిన్ రీజన్ ఐతే అదే" అని ఆన్సర్ ఇచ్చాడు. "అంటే నువ్వు జనాల్ని మోసం చేసావు అనేగా అర్ధం" అన్నాడు యాంకర్.  ఇక నీకు, శ్రీసత్యకు మధ్య అన్న చెల్లెళ్ళ బంధం ఆపాదిస్తున్నాడని రేవంత్ మీద కక్ష పెంచుకున్నావ్ ..ఎందుకు అంత కోపం" అని అడిగేసరికి " ఎప్పుడూ అందరినీ తక్కువ చేయడానికి చూస్తాడు. ఏది చేసైనా గేమ్ గెలిచేయాలి అనుకుంటాడు. నన్ను కూడా చాలా సార్లు చాలా తక్కువగా చేసి మాట్లాడాడు" అన్నాడు అర్జున్.  ఇక దీపావళి పండగ సందర్భంగా క్రాకర్స్ పేర్లు చెప్పి అవి ఏ హౌస్ మేట్ కి సూటవుతుందో అడిగాడు ..."హౌస్ లో భూచక్రం అంటే ఇనయా. డిస్కషన్ స్టార్ట్ చేస్తే భూచక్రంలా అలా తిరుగుతూనే ఉంటుంది. చిచ్చుబుడ్డి సూర్యకి సూటవుతుంది. వెంటనే కోపం వస్తుంది...అంతలోనే తగ్గిపోతుంది. రాకెట్ ని శ్రీహాన్ కి ఇవ్వొచ్చు..దూసుకెళ్ళిపోతున్నాడు..బాగా ఆడతాడు. 1000 వాలాను పాజిటివ్ గా ఐతే శ్రీసత్యకి ఇవ్వొచ్చు. నెగటివ్ గా ఐతే రేవంత్ కి ఇవ్వొచ్చు " అని చెప్పాడు అర్జున్.

కల కాదు నిజం.. లగ్జరీ కారు కొన్న హిమజ!

దీపావళి పండగకు చాలామంది కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. ఇక ఇలాంటి దీపావళిని పురస్కరించుకుని హిమజ తనకు తాను ఒక కార్ ను గిఫ్ట్ గా ఇచ్చుకుంది. బిగ్‌బాస్-3 సీజ‌న్‌ లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి  తనదైన స్టయిల్లో మిగిలిన ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇచ్చి.. కొన్నివారాలు  హౌస్ లో కంటిన్యూ అయ్యింది.  బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక  హిమజకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో మంచి యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తనకు సంబంధించిన అన్ని విషయాలను, ఫోటో షూట్స్ ని తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా ఒక మాంచి లగ్జరీ బిఎండబ్ల్యు కారుతో వీడియో దిగి.. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో  షేర్ చేసింది. "ఈ దీపావళికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. నా కల నేరవేరింది" అని రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో ఎండింగ్ లో తాను కారు కొన్నట్టు కలగన్నట్లు చూపించింది. అది కల కాదు నిజం అంటూ కార్ తో ఫోటో దిగి చూపించింది హిమజ.   ఇక హిమజ కొన్ని  సీరియల్స్ నటించింది. అలాగే కామెడీ షోల ద్వారా వచ్చిన క్రేజ్ తో వెండితెరపై మెరిసే అవకాశం సంపాదించింది. 'నేను శైల‌జ'‌, 'శ‌త‌మానం భ‌వ‌తి', 'వ‌రుడు కావ‌లెను' వంటి మూవీస్ లో నటించింది హిమ‌జ‌.

బిగ్ బాస్ హౌస్ లో హైపర్ ఆది పంచుల టపాసులు!

బిగ్ బాస్ హౌస్ లో సండే అంటేనే సరదాగా గడిచిపోతుంది. అలాంటి సరదాలతో పాటుగా సంచులకొద్ది పంచులు వేసే ఆది వస్తే ఆ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఆది పంచులకి కడుపుబ్బ నవ్వుకున్నాడు నాగార్జున. దీపావళి రోజు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు మాత్రం ఆది మాటలు, పంచులు మంచి కిక్ ఇచ్చాయి. రాగానే మొదటగా ఆది, ఫైమా తో కామెడీ మొదలెట్టాడు. "ఫైమా, ప్రవీణ్ నిన్ను అడుగమన్నాడు" అని అనగా, దానికి రిప్లై గా ఫైమా "నేను కూడా అడిగానని చెప్పు" అంది. "నిన్ను కాదు. నీకు పదివేలు ఇచ్చాడంట కదా, అవి అడగమన్నాడు" అని అనగానే అందరు పగలబడి నవ్వారు. ఆ తర్వాత శ్రీసత్య గురించి మాట్లాడుతూ, "రాత్రి పది అయితే చాలు. కుర్రాళ్ళు అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు నిన్ను చూడటానికి" అని అనగా, "ఓహో థాంక్స్" అని అంది శ్రీసత్య. ఆ తర్వాత పాపం ఆ అర్జున్ కి ఏదో ఒకటి చెప్తే అని అంటూండగానే, అది అవ్వదు అని అనేసింది శ్రీసత్య.  తర్వాత " ఎవ్వరైనా కానీ, ఏమైనా కానీ నీ అవ్వ తగ్గేదేలే అని , భయ్యా నువ్వు 'పుష్ప' లో 'అల్లు అర్జున్' లానే చెప్పావ్, మాకేమో 'ఒక్కడు' లో 'ప్రకాష్ రాజ్' లా అనిపించింది అని రేవంత్ తో అనగానే అందరు నవ్వారు. ఆ తర్వాత శ్రీహాన్ తో, "ఇనయా, శ్రీహాన్ కలిసి ఉండేదానికంటే గొడవపడి విడిపోతే వచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ" అని అనగా, "వాయమ్మో మళ్ళీ మొదటికి వచ్చేస్తాం" అని శ్రీహాన్ నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత "ఉండాలి మామ నువ్వు ఉండాలి మామ అని మొదలుపెట్టి, ఆదిరెడ్డి నీకు భయమంటే ఏంటో తెలియదు కదా, ఒక్కసారి బయటకొచ్చాక హాట్ స్టార్ లో నీ డ్యాన్స్ చూసుకో భయపడతావ్" అని చెప్పాడు. ఆ తర్వాత ఇనయా నేనేమైనా మార్చుకోవాలా అని అనగా, "ఇలా ఒక్కొక్కరుగా మార్చకుండా ఉంటే బాగుంటుంది" అని అన్నాడు. ఇలా ఆది పంచులకి హౌస్ మేట్స్ తో పాటు, ప్రేక్షకులకు మస్త్ ఎంటర్టైన్మెంట్ లభించింది.

దీపావళి స్పెషల్.. బిగ్ బాస్ హౌస్ లో 'సర్దార్' సందడి

మాములుగా సండే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో పండుగలా ఉంటుంది. అలాంటిది దీపావళి పండుగే కావడంతో, అటు గెస్ట్ లు, ఇటు కంటెస్టెంట్స్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించిందనే చెప్పాలి.  దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన సెలబ్రిటీలు మాస్ డ్యాన్స్ లతో , క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ దుమ్ములేపారు. గెస్ట్ సాంగ్ లో జబర్దస్త్ యాంకర్ 'రష్మి' హాట్ సాంగ్ కి కిల్లింగ్ ఎక్స్పెషన్స్ తో అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన అంజలి కూడా అధ్బుతమైన పర్ఫామెన్స్ ఇవ్వగా, స్పెషల్ గెస్ట్ గా 'కార్తి' వచ్చాడు. ఇలా ఒక్కొక్కరుగా మంచి కిక్ ఇచ్చే పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు పండుగ రుచిని చూపించేసాడు బిగ్ బాస్. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దీపావళి సంబరాలు జరిగాయి. తారల డాన్స్ లు, సింగర్స్ పాటలు, కమెడియన్ కామెడీ, హీరో రాక వీటన్నింటితో ఒక్కరోజు ముందుగానే దీపావళి జరుపుకుంది బిగ్ బాస్ హౌస్. మొదటగా నటి అంజలి కంటెస్టెంట్స్ తో ముచ్చటించి, తర్వాత హౌస్ మేట్స్ పెయిర్ డాన్స్ చూసింది. ఆ తర్వాత వచ్చిన శ్రీరామచంద్ర తన సాంగ్ పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్మెంట్ చేసాడు. హైపర్ అది హౌస్ మేట్స్ అందరి గురించి చెప్పడం. తర్వాత కార్తీ వచ్వాడు. తన కొత్త సినిమా సర్దార్ మూవీ ప్రమోషన్ కి రావడంతో స్టేజి మరింత కళకళలాడింది అనే చెప్పాలి. హౌస్ మేట్స్ కి స్వీట్స్ తెచ్చిన కార్తీ నామినేషన్ లో ఉన్న వాళ్లలో ఇద్దరినీ సేవ్ చేసాడు. తరువాత హౌస్ మేట్స్ తో సాగిన చిన్న గేమ్ లో పాల్లొన్నాడు. తర్వాత కంటెస్టెంట్స్ కి అల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయాడు కార్తీ. టీవి చూసే ప్రేక్షకులకు ఈ దీపావళి రోజున బిగ్ బాస్ లో జరిగిన సంబరాలు ఆకట్టుకున్నాయనే చెప్పుకోవాలి.

నీళ్ల అడుగున డాన్స్ ఇండియా డాన్స్ హుక్ స్టెప్ వేసిన హోస్ట్!

జీ తెలుగులో  ప్రసారమవుతున్న  ప్రీమియం రియాలిటీ షో ''డాన్స్ ఇండియా  డాన్స్''  ప్రేక్షకులను ప్రతీ వారం ఎంటర్టైన్  చేస్తోంది. ఇక ఈ షోకి స్టార్టింగ్  లో మహేష్  బాబు   తన కుమార్తె సితారతో కలిసి ఎంట్రీ ఇచ్చారు. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. తెలుగు ఆడియన్స్ ని  అలరించడమే కాదు డాన్సర్స్  తమ ప్రతిభను ప్రదర్శించడానికి , ఈ షో ద్వారా మరిన్ని అవకాశాలు రావడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది.  ఇక డాన్స్ ఇండియా డాన్స్ డాన్స్ షో మొదలైన  దగ్గర నుంచి దూసుకుపోతోంది. ఈ షోకి అకుల్  బాలాజీ  హోస్ట్  గా రౌడీ  రోహిణి కో-హోస్ట్  గా చేస్తున్నారు. ఇక ఈ షోకి  సంగీత, బాబా భాస్కర్ , ఆనంది జడ్జెస్ గా ఉన్నారు. ఇక ఈ షో టైటిల్  సాంగ్   కి ఒక హుక్ స్టెప్ ఉంది . ఈ స్టెప్ బాగా ఫేమస్ అయ్యింది.  ఐతే హోస్ట్ ఆకుల బాలాజీ ఈ స్టెప్ ని నీటి అడుగున వేసి ఒక రికార్డు క్రియేట్ చేసాడు. మాల్దీవ్స్ కి వెళ్లిన అకుల్ అక్కడ నీళ్ల అడుగున స్కూబా డైవింగ్ చేస్తూ ఈ డాన్స్ ఇండియా డాన్స్ హుక్ స్టెప్ వేసి అందరినీ మెస్మోరైజ్ చేసేసాడు. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పోస్ట్ చేసిన ఒక గంటలోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ వీడియో.

నేను తన లెవెల్ కాదంటోన్న అర్జున్!

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుంచి మంచి స్నేహితులు కాస్త  శత్రువులు గా మారారు. రేవంత్ తో అర్జున్ రూడ్ గా మాట్లాడేలా చేసింది శ్రీసత్యనే అని అందరికి తెలిసిన‌ విషయమే. అయితే ఇప్పటికే అర్జున్ కన్ఫ్యూషన్ కంటెస్టెంట్ గా ముద్ర వేసుకోగా,  నిన్న జరిగిన టాస్క్ తో మరోసారి ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసిపోయింది. టాస్క్ లో ఒక చిన్న పాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. అర్జున్ కి, రేవంత్ కి  మాట మాట పెరిగి పెద్ద గొడవలా మారింది.  అసలు ఏం జరిగిందంటే టాస్క్ లో అర్జున్, రేవంత్ ని అడ్డుకున్నాడని అనగా, "అది గేమ్ లో పార్ట్ అంతే " అని రేవంత్ చెప్పుకొచ్చాడు. ఆ విషయం తెలియక కన్ఫూషన్ లో అర్జున్ ఒకే విధంగా ఆలోచిస్తూ తనని అడ్డుకున్నాడని గొడవకు దిగాడు. అంతకముందే జరిగిన రేవంత్, అర్జున్ ల మధ్య గొడవ తెలిసిందే. అది కాస్త  రాను రాను ముదిరింది. అర్జున్ రేవంత్ కి డిజాస్టర్ బ్యాడ్డ్ ఇచ్చి కారణం చెప్పాడు. "నువ్వు టాస్క్ లో మాట్లాడిన పద్ధతి ఏం బాగోలేదు. గేమ్ లోకి వచ్చేసరికి కూల్ నెస్ ని కోల్పోతున్నావ్" అని చెప్పగా, "నువ్వు ఏంటి నాకు చెప్పేది" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, " నా గేమ్ ఇలానే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు చేస్తాను అని ఎలా అనుకుంటున్నావ్. ఏదో మాట్లాడాలని మాట్లాడతున్నావ్ అని నాకు అర్థం అయింది. సర్లే చెప్పేసావ్ గా వెళ్ళు" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి మాట్లాడుతుంటే,అతని గురించి వెక్కిరిస్తు మాట్లాడం టోటల్ గా అన్ ఫార్మల్ గా మాట్లాడడం బాగోలేదు" అని అర్జున్ చెప్పాడు. టాస్క్ జరుగుతున్నంత సేపు  రేవంత్ కి ఒకరితో కాకున్నా, మరొకరితో గొడవ  జరుగుతూనే వచ్చింది. కాగా రేవంత్ టాస్క్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. "నీ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల నీ పర్ఫామెన్స్ మైనస్ అవుతోంది" అని అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత అర్జున్, వసంతి దగ్గర కు వెళ్ళి చెప్పుకున్నాడు. "తన బిహేవియర్ అలానే ఉంటుంది. ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదు. టాప్-5 కంటెస్టెంట్స్ అని అతను అనుకున్న వాళ్ళతోనే మాట్లాడుతాడు. నేను అతని లెవెల్ కాదు కదా" అని అర్జున్, వసంతితో అన్నాడు.

నేను ఫ్రీ.. నా మనసు ఎవరైనా దోచుకోవచ్చు!

లేడీ కమెడియన్ రోహిణి ఇటీవల బుల్లితెర మీద పేరు తెచ్చుకుంటున్న ఆర్టిస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చాక ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తోంది. అలాగే డాన్స్ ఇండియా డాన్స్ షోకి కో-యాంకర్ గా చేస్తోంది. రోహిణి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు రోహిణి కూడా బూతులు వదులుతోంది.  ఈ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ లో బూతు కామెడీ ఎక్కువయ్యింది మహిళల్ని కించపరిచే డైలాగ్స్ ఎక్కువగా హైపర్ ఆది వేస్తుంటాడని విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సొసైటీలో జరిగే కొన్ని అనర్థాలకు వీళ్ళ బూతు డైలాగులు కూడా కారణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక రీసెంట్ గా ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో టీం లీడర్ రోహిణి డైలాగ్స్ వింటే బాబోయ్ అనిపిస్తుంది. ఐతే ఈ స్కిట్ లో 'ఆహ్వానం' మూవీలో విడాకులు సీన్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఈ స్కిట్ లో బాబు, రోహిణి భార్యాభర్తలుగా చేశారు.  విడాకుల ఫంక్షన్ కి రోహిణి.. కృష్ణ భగవాన్ ని ఇన్వైట్ చేసి "ఇప్పుడు చెప్తున్నా.. ఈ విడాకుల తర్వాత నేను ఫ్రీ.. నా మనసెవరైనా దోచుకోవచ్చు" అనేసరికి, "ఇంతకీ నీ అడ్రెస్ ఎక్కడో చెప్పలేదు" అని ఆయన కౌంటర్ వేశారు. ఈ స్కిట్ పూర్తయ్యాక రోహిణిని కోవై సరళతో పోల్చారు కృష్ణ భగవాన్. "ఆవిడలా టైమింగ్ ఉన్న కామెడీ చేస్తున్నారు" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసారు.

నేను అందగత్తెనే.. నాకు సినిమా ఛాన్సులు వస్తాయి!

  ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో అమ్మ క్యారెక్టర్ అంటే చాలు ముందుగా ఆమె గుర్తొస్తుంది. అలాంటి ప్రగతి ఇప్పుడు బుల్లి తెర మీద కూడా దుమ్ము దులుపుతోంది. సోషల్ మీడియాలో ఐతే చెప్పక్కర్లేదు. ఈమె చేసే జిమ్ వీడియోస్ కి ఫాన్స్ చాలామంది ఉన్నారు. రీసెంట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈమె కనిపించింది ఎన్నో విషయాలను వెల్లడించింది. "నా కటౌట్ పెద్దది కాబట్టి  నన్ను ఇబ్బంది పెట్టేవాళ్లని భయపెడతాను. ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోను. త‌మిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ మూవీస్ లో మాత్రమే నటిస్తా అని చెప్పా, అందుకే ఆఫర్స్ లేవు.. ఇక ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ కి తల్లిగా నటించాలంటే వాళ్లకు కాంప్లిమెంట్ కావాలి మనం. నేను ఎలా ఉన్న అందగత్తెనే.. నాకు సినిమాలు వస్తాయి." అని ఆమె చెప్పింది.  త‌ను జిమ్ లో వర్కౌట్స్ చేసేది అందం కోసం కాదు అంటోన్న ఆమె, "నా బలాన్ని ఇంకా పెంచుకోవడానికి, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మెరుగు పరుచుకోవడానికి వ‌ర్క‌వుట్స్ చేస్తుంటాను.. ఇక క్యాట్ వాక్ చేస్తాను. చేతి మీద వేయించుకున్న ఈ టాటూ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఎక్కడికి వెళ్లినా హే ఈ టాటూ చాలా బాగుంది కూల్ అంటూ ఉంటారు." అని చెప్పింది ప్రగతి. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిట్ అయిన డిజాస్టర్ టాస్క్!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కొత్త ఒరవడిని సంతరించుకుంటోంది. కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చేపించే టాస్క్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతూ, వస్తోంది. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో 'డిజాస్టర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ "డిజాస్టర్ టాస్క్ ఏంటి అంటే ఇంతకముందు జరిగిన టాస్క్ లో ఎవరి పర్ఫామెన్స్ తగ్గిందో వారికి డిజాస్టర్ బ్యాడ్జ్ ను ఇవ్వాలి" అని కంటెస్టెంట్స్ కి,  బిగ్ బాస్ ఆదేశించాడు.  తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి వారి అభిప్రాయలను చెప్పి, ఒక్కొక్కరికి డిజాస్టర్ బ్యాడ్జ్ ను ఇచ్చారు. మొదట అర్జున్, రేవంత్ కి డిజాస్టర్ బ్యాడ్జ్ ఇచ్చాడు. "టాస్క్ లు అన్ని బాగా ఆడావ్. కానీ కొన్ని చోట్ల చాలా అగ్రెసివ్ బిహేవియర్ అనిపించింది. కొన్ని కొన్ని సార్లు You lost your cool and అఫెన్సివ్ లాంగ్వేజ్ యూజ్ చేసావ్. మా టీం తో చాలా ఆర్గ్ మెంట్ " అని అర్జున్ చెప్పగా,  "ఓ మీ టీం అంతా అమాయకులు పాపం" అని రేవంత్ అన్నాడు. ఇలా కాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత శ్రీసత్య, రేవంత్ కి డిజాస్టర్ బ్యాడ్జ్ ని ఇచ్చింది. కాగా శ్రీసత్య కారణాలు చెబుతూ, " బిగ్ బాస్ లో రూల్స్ కూడా ఇంపార్టెంట్ ఏ, మనం అందరం పొద్దున్న ప్లెడ్జ్ చేసేప్పుడు రూల్స్ తప్పకుండా ఫాలో అవుతాం అని చెప్పాం. ఆ తర్వాత గేమ్ లో మైక్ వేసుకోలేసని బిగ్ బాస్ లెటర్ ద్వారా చెప్పాడు. అయిన సరే నువ్వు ఫాలో అవ్వలేదు. ఇంకా  చిన్న చిన్న వర్డ్స్ అన్నావ్. అది నాకు డిజాస్టర్ గా అనిపించింది " అని రేవంత్ తో, శ్రీసత్య చెప్పుకొచ్చింది. వసంతి, గీతుకి డిజాస్టర్ ఇచ్చింది. "నాకన్నా తక్కువ పర్ఫామెన్స్ గీతు ఇచ్చింది."అని నేను అనుకున్నా అని వసంతి చెప్పింది. ఆ తర్వాత మెరీనా, గీతుకి డిజాస్టర్ ఇచ్చింది. "శ్రీహాన్, ఆదిని డైవర్ట్ చేయడానికి ఆడావ్ కామెడీ చేసావ్, అక్కడ మన టీం గేమ్ స్లో అయింది." అని మెరీనా అనగా, "కానీ నేను ఆడింది కూడా గేమ్ ఏ" అని గీతు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సూర్య, వసంతికి డిసాస్టర్ ఇచ్చాడు. నువ్వు అలా కొట్టడం నాకు నచ్చలేదు. ఆ తర్వాత వరుసగా గీతు, వసంతికి డిజాస్టర్ ఇవ్వగా, రాజ్, మెరీనా కు డిజాస్టర్ ఇచ్చాడు. ఇలా ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కొక్కరికి డిజాస్టర్ గా చెబుతూ, కారణాలు చెప్పడం. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ గా అనిపించిందనే చెప్పాలి. చాలా మంది ప్రేక్షకులకి కంటెస్టెంట్స్ లో ఎవరు ఏం పర్ఫామెన్స్ ఇచ్చారో అని తెలిపే ఈ టాస్క్ హిట్ అయిందనే చెప్పాలి.   

జైలుకి వెళ్లిన వసంతి!

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న టాస్క్ కు తెర పడింది. రెండు టీమ్స్ లో, ఒక టీం గెలవగా, మరొక టీం ఓడిపోయింది. అయితే ఆ ఓడిన టీంలో వాళ్ళు అందరు కలిసి టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేయని హౌస్ మేట్ ఎవరో బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. అందరు ఏకాభిప్రాయంతో వసంతిని ఎంపిక చేయడంతో, తను జైలుకి వెళ్ళింది. అయితే అంతకముందు మొదలైన టాస్క్ లో మొదటగా  శ్రీసత్య, "నేను ఈ ఛాలెంజ్ ని తీసుకుంటా" అని చెప్పింది. చిట్టీలు వేసి అందరు ఎంపిక చేసుకున్నారు. అందులో శ్రీసత్య పేరు రావడంతో తాను నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినెట్ కి ఓకే అని చెప్పింది. కాగా మరుసటి రోజు శ్రీసత్య వచ్చి, "నేను కూడా గేమ్ లో టఫ్ ఫైట్ ఇచ్చాను. నేను డైరెక్ట్ నామినేట్ కాను" అని చెప్పడంతో, మళ్ళీ వారి గ్రూప్ హౌస్ మేట్స్ తో ఓటింగ్ పోల్  నిర్వహించడం జరిగింది. కాగా రోహిత్, శ్రీసత్యకి ఓట్ వేయగా,    గీతు, వసంతి కి వేసింది. అర్జున్, శ్రీసత్యకి ఓట్ వేయగా, తను మళ్ళీ, "నేను నీతోనే ఉన్నాను అర్జున్. అలా ఎలా మర్చిపోయావ్", అని శ్రీసత్య చెప్పగానే ఒపీనియన్ చేంజ్ చేసుకొని మళ్ళీ మెరీనా కి వేసాడు. మెరీనా, గీతుకి ఓట్ వేసింది. కాగా వసంతి, గీతుకి వేసింది. కాగా చివరగా రాజ్, వసంతికి వెయ్యడం తో నెక్స్ట్ వీక్ లో డైరెక్ట్ నామినేషన్ ఉంది. కాగా వసంతి ఏడ్చేసింది.  "ఇది ఏం గేమ్ అసలు, టాస్క్ ఆడినా, ఆడకపోయినా పర్ఫామెన్స్ లేదు అంటారు. ఏమన్నా అంటే నామినేషన్ కి భయపడుతుంది అని, డిఫెండ్ చేసుకోలే అని అన్ని మీరే అంటారు. ఇక ఆడకుండా ఖాళీగా ఉండాలి" అంటు బాధపడింది వసంతి. ఇనయా, మెరీనా ఇద్దరు వసంతిని ఓదార్చే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిని పిలిచి, "ఈ వారం టాస్క్ లో ఎవరు డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం హౌస్ లో ఎవరో డిజాస్టర్ అని చెప్పి, బ్యాడ్జ్ పెట్టి  కారణం చెప్పాల్సి ఉంటుంది. ఇందులో రేవంత్ వాసంతి మధ్య గట్టి ఆర్గుమెంట్  జరిగింది. అయితే ఎక్కువ ఓట్లు వసంతికి వచ్చిన కారణంగా వసంతి జైలుకి వెళ్ళింది. "మళ్ళీ బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు జైలులోనే ఉండవలసి వస్తోంది వసంతి" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే జైలు నుండి బయటకొచ్చాక తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన రేవంత్ తో మాటలు కొనసాగిస్తుందో లేదో చూడాలి. 

రోహిత్-మెరీనా జంటకి రెమ్యూనరేషన్ మ‌రీ ఇంతనా!

బిగ్ బాస్ హౌస్ లో రియల్ లైఫ్ జంట ని తీసుకోవడం వింతేమి కాదు, కాగా ఈ సీజన్లో  రోహిత్-మెరీనా జంటని తీసుకోవడం జరిగింది. ఇతని పూర్తి పేరు రోహిత్ సాహ్ని. ఇతను హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను M.B.A పూర్తి చేసాడు. తన చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం తో, మొదట మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసాడంట. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ మరియు సీరియల్స్ లో నటించాడు. కాగా 'భార్యామని', 'అభిషేకం',  'అభిలాష', 'అమృత వర్షిణి' లాంటి పలు సీరియల్స్ లో నటించి, బుల్లి తెరపై అలరించాడు. తర్వాత  'చిరు గొడవలు' అనే సినిమాలో మొదటిసారి కథనాయకుడిగా వెండి తెరపై నటించాడు. కాగా తన తోటి నటి అయిన మెరీనా అబ్రహంని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మెరీనా అబ్రహం 1995 జూన్ 12 న గోవాలో జన్మించింది. కాగా మెరీనా ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. తనకు తెలిసినవాళ్ళు మోడలింగ్ లో ఉండడంతో, తాను మోడల్ గా కెరియర్  స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో  నటించింది. 'అమెరికా అమ్మాయి', 'ప్రేమ', 'సిరిసిరి మువ్వలు', 'ఉయ్యాల జంపాల' లాంటి పలు సీరియల్స్ లో నటించింది. ఆ  తరువాత 'రొమాన్స్ విత్ ఫైనాన్స్' అనే మూవీ లో చేసింది. 2017 నవంబర్ లో తన తోటి నటుడు అయిన రోహిత్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బుల్లితెరపై నటిస్తూ, రాణిస్తోన్నారు. బిగ్ బాస్ లోకి పదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ జంట.  అంచనాలకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్స్ అందించలేకపోతున్నారు. అయితే వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ చూసి గత మూడు వారాల నుండి నాగార్జున హెచ్చరించడంతో, ఇప్పుడు పర్వాలేదు అనిపించినా ఎక్కువగా మాత్రం టాస్క్ లో పర్ఫామెన్స్ లేదనే చెప్పాలి. కాగా మూడు వారాల తర్వాత వీళ్ళిద్దరిని బిగ్ బాస్ సపరేట్ చేసి,  ఇండివిడ్యువల్ గా ఆడమని చెప్పాడు. రోహిత్ తన వంతుగా పర్ఫార్మెన్స్ ఇస్తూ తన తోటి హౌస్ మేట్స్ కి గట్టి పోటీ ఇస్తూ వస్తోన్నాడు. కాగా రోహిత్, మేరీనా ఇద్దరు కూడా నామినేషన్ లో ఉన్నారు. రోహిత్ కి రోజుకి నలభై అయిదు వేలు,  మెరీనా కి ముప్పై అయిదు వేల వరకు రెమ్యూనరేషన్ ఉండొచ్చని బయట ప్రచారం జరుగుతోంది. కాగా ఈ వారం నామినేషన్లో నుండి సేవ్ అవుతారో? లేదో చూడాలి. మరి వీళ్ళిద్దరు సేవ్ అయ్యి బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ వరకు ఉండి విజేతగా నిలుస్తారో? లేదో చూడాల్సి ఉంది.

ఆదిత్యకి  రెమ్యూనరేషన్ ఎక్కువేనట.!

బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఆదిత్య  సుపరిచితమే. కాని ఆదిత్య బిగ్ బాస్ లోకి రాకముందే చాలా మందికి తెలుసు. ఇతను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. తండ్రి శంకర్, తల్లి కళ్యాణి. ఒకప్పుడు తండ్రి కూడా నటుడే. తన సోదరుడు కౌశిక్. అందరికి తెలిసిన బుల్లి  తెర నటుడే. అయితే తన చిన్నప్పటి నుండి బాలనటుడిగా అగ్ర హీరోలతో నటించాడు. 2003 లో వచ్చిన 'చంటిగాడు' మూవీలో హీరో గా నటించాడు. ఆ తర్వాత 'సుందరానికి తొందరెక్కువ', '1940 లో ఒక గ్రామం', 'మా ఉరి పొలిమేర', 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'  ఇలా పదికి పైగా సినిమాల్లో నటించగా, అరవైకి పైగా సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తన‌ నటనకు గాను, చిన్నప్పటి నుండి ఎన్నో అవార్డులను సంపాదించుకున్నాడు. తన భార్య పేరు మానస. కాగా తనకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆదిత్య వెండి తెరపై కాకుండా బుల్లితెర సీరియల్స్ లోను నటిస్తూ రాణిస్తోన్నాడు. కాగా రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వ కంటెస్టెంట్ గా ఆదిత్య అడుగుపెట్టాడు. మొదటి రోజు నుండి అందరితో సన్నిహితింగా  ఉంటు, అందరిని ఆకట్టుకుంటున్నాడు. అయితే తను మృదుస్వభావి. ఎవరి మనసు నొప్పించకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇలా ఉంటే హౌస్ లో కొంతమంది  కంటెస్టెంట్స్ 'మాస్క్ వేసుకున్నాడు'. అంత నటన అన్న వాళ్ళు లేకపోలేదు. ఎక్కువ ప్రవచనాలు చెప్తాడు అని కూడా అంటున్నారు. ప్రతి మాట స్పష్టంగా మాట్లాడటమే కాకుండా హౌస్ కి ఒక పెద్ద అన్నయ్యలాగా అందరితో కలిసిపోయి ఉంటున్నాడు. కానీ హౌస్ లో రెండు మూడు వారాలు పెర్ఫార్మన్స్ చెయ్యట్లేదు. అతని పర్ఫామెన్స్ కి నాగార్జున కూడా గట్టిగానే చెప్పాడు. "హౌస్ లో అందరు ఎవరి గేమ్ వారు ఆడాలి. ఎవరి కోసమో ఆడకూడదు. దేనిని త్యాగం చేయకూడదు. నీ ఆట నువ్వు ఆడటానికే హౌస్ లోకి వెళ్లావు" అంటు నాగార్జున చెప్పాడు. కాగా అప్పటి నుండి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ పర్వాలేదు  అనిపిస్తోన్నాడు. హౌస్ లో ప్రతి వారం నామినేషన్ లో ఉంటు వస్తోన్నాడు. కాగా ప్రేక్షకులు సేవ్ చేస్తు వస్తున్నారు. ఈ వారం కూడా నామినేషన్ లో ఉన్నాడు. ఆదిత్య రెమ్యూనరేషన్ రోజుకి యాభై వేల నుండి అరవై వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారంలో ఉంది. మునుముందు తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ, తనని తాను రోజు రోజుకి మెరుగుపరుచుకొని, చివరి వరకు ఉండి విజేతగా నిలుస్తాడో లేదో చూడాలి.

ఇనయా చేతుల మీదుగా శ్రీహాన్ బర్త్ డే సెల‌బ్రేష‌న్‌!

బిగ్ బాస్ హౌస్ లో నిన్న మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న శ్రీహాన్, ఇనయా కలిసిపోయినట్టుగా అనిపిస్తోంది. దీనికి కారణం నిన్న జరిగిన శ్రీహాన్ బర్త్ డే వేడుకుల్లో ఇనయా ఆక్టివ్ పర్ఫామెన్స్. అయితే నిన్న శ్రీహాన్ పుట్టినరోజు కావడంతో హౌస్ మేట్స్ అందరు అతనికి సర్ ప్రైజ్ ఇచ్చారు. హౌస్ లో ఇనయా దగ్గరుండి కేక్ ని తయారు చేసింది. కాగ మిగిలిన హౌస్ మేట్స్  అందరు కూడా అందులో పాల్గొని విషెస్ తెలిపారు. కాగా శ్రీహాన్, ఇనయా మధ్య వైరం తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న గేమ్ తర్వాత ఇనయా, శ్రీహాన్ తో "నువ్వు నన్ను నామినెట్ చేసావని, నేను నిన్ను చేశాను అంతే కాని నీ మీద నాకు ఏం కోపం లేదు. హౌస్  లో నువ్వు అందరికంటే బెస్ట్" అని చెప్పుకొచ్చింది. శ్రీహాన్ ఆ విషయానికే షాక్ లో ఉన్నాడు. కాగా ఇనయా నాతో అలా అనడం ఏంటి అని, కేక్ తానే తయారు చేసింది. కాగా రేవంత్ కేక్ పై శ్రీహాన్ పేరు రాస్తుండగా, "శ్రీహాన్ కాదు చోటు అని రాయు" అని అనడంతో రేవంత్ ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న శ్రీసత్య అది విని, శ్రీహాన్ దగ్గరకెళ్ళి, "ఇనయా కేక్ మీద చోటు అని రాయమంది. నిన్ను చోటు అని‌ అంటోంది." అని శ్రీసత్య చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత "అలాగే కేక్ పై హార్ట్ సింబల్ వెయ్ " అని ఇనయాతో అనగా గీతు చెప్పింది. అలా అనేసరికి ఆశ్చర్యపోయింది గీతు. కేక్ పై హార్ట్ సింబల్ అని ఇనయా అనడంతో హౌస్ లో అందరు సంథింగ్ సంథింగ్ సంథింగ్ అనుకుంటున్నారు. "వీళ్ళు అందరు కలిసి నా కొంప ముంచేలా ఉన్నారు" అంటూ తనలో తానే అనుకున్నాడు శ్రీహాన్. ఆ తర్వాత శ్రీహాన్ కి డ్రెస్ సెలక్ట్ చేసింది గీతు.  అలాగే తన బంగారు గొలుసు శ్రీహాన్ మేడలో వేసింది. శ్రీహాన్ కేక్ కట్ చేసి మొదటగా ఇనయాకి తినిపించగా, అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరిచారు. ఆ తర్వాత అందరు శ్రీహాన్ కి ఒక్కొక్కరుగా కేక్ తినిపించారు.   కాగా ఇనయాతో మొదటి నుండి గొడవలు ఉన్నాయి. కాని శ్రీహాన్ పట్ల తను పుట్టిన రోజు వేడుకలో ఇనయా చూపించిన కేరింగ్ ప్రేక్షకులను ఆలోచింపచేస్తోంది. వీళ్లిద్దరి మధ్య గొడవలు లేకుండా ఇలానే  ఉంటే నామినేషన్లో ఇంట్రెస్ట్ గా ఉండవని ప్రేక్షకులు భావిస్తున్నారు. మునుముందు వీళ్ళ పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

కంటెస్టెంట్స్ తో ప్రతిజ్ఞ చేయించిన బిగ్ బాస్!

  బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక టాస్క్ ని రద్దు చేసాడు బిగ్ బాస్. దాని తర్వాత ఫుడ్ కోసం  ఇష్టపడ్డారు కంటెస్టెంట్స్, కాగా ఇప్పుడు అదే ఫుడ్ కోసం‌ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ప్రతిజ్ఞ చేసి చెప్పండి. "నిన్నటిదాకా ఫుడ్ కోసం టాస్క్ లో పోటీ పడ్డారు. ఇప్పుడు హౌస్ లో ఉండడానికి పోటి పడండి.  మీ పర్ఫామెన్స్ పట్ల నిరాశతో ఉన్న ప్రేక్షకులకు ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో? మీరు మీ అటని ఎలా మార్చుకుంటారో?  అని ప్రతిజ్ఞ చేయండి. ఇకపై హౌస్ లో మీ నుంచి ఏం ఆశించాలో కూడా చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వారి వారి మాటలతో ప్రతిజ్ఞ చేసారు.  "ఈ హౌస్ లో రాజు అయినట్టువంటి బిగ్ బాస్ కి, రాణి అయినటువంటి గీతు ప్రతిజ్ఞ చేస్తోంది. ఏం అంటే అశేష ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని గీతు చెప్పగా, " ఈ హౌస్ లో ప్రతీ నిమిషం ఎంటర్టైన్మెంట్ ఇస్తానని, ఏ ఒక్కరిని నిరాశ పడేలా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. "శ్రీసత్య అనే నేను. బిగ్ బాస్ మరియు కోట్ల ప్రజల సాక్షిగా చెబుతున్నాను. నా వంద శాతం పర్ఫామెన్స్ ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను" అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సూర్య, శ్రీహాన్, రేవంత్ ప్రతిజ్ఞ చేసారు. అలా అందరూ ఒక్కొక్కరు చాలా కాన్ఫిడెంట్ గా ప్రమాణం చేసారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరు తమ పర్ఫామెన్స్ తో బాగానే ఆడుతున్నారు.

కంటెస్టెంట్స్ మధ్య 'నువ్వా నేనా' అన్నట్లు సాగిన టాస్క్!

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్  భాగంగా కంటెస్టెంట్స్ ఫుడ్ కోసం నిన్నటి వరకు ఆటలో పాల్గొన్నారు. కాగా బిగ్ బాస్ ఆదేశానుసారం అందరిని ఇప్పటి నుండి హౌస్ లో ఉండడం కోసం టాస్క్ ఆడమని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ ఫుల్ జోష్ తో గేమ్ అడడానికి సిద్ధం అయ్యారు. కెప్టెన్సీ టాస్క్ రద్దు కారణంగా పనిష్మెంట్ తీసుకోవడం మంచిదే అయింది. ఇప్పుడు అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే టాస్క్ లో అందరు వారికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ టాస్క్ లో ఫిజికల్ అవ్వడం, ఒకరినొకరు తిట్టుకోవడం. ఇదంతా చూసే ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది అని చెప్పడం లో  సందేహం లేదు. నిన్న జరిగిన టాస్క్ లో  రేవంత్  పేరు ఎక్కువ సార్లు వినిపించింది. శ్రీసత్య ప్రతీసారి రేవంత్ ని టార్గెట్ చేసినట్టు తెలుసింది. అలాగే మెరీనా, శ్రీహాన్ మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అప్పటికే హౌస్ రెండు గ్రూప్ లుగా ఉన్నా విషయం తెలిసిందే. కాగా ఇరు గ్రూపులు కూడా నువ్వా నేనా అంటు టాస్క్ ఆడుతున్నారు. రేవంత్ శ్రీసత్య మధ్య కొంత వాగ్వాదం జరిగింది. "ప్రతీసారి నువ్వు నన్నే టార్గెట్ చేసి అంటున్నావ్. నేను చూస్తున్నాను" అని రేవంత్ అనగా, "అదేం లేదు నాకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావ్. నువ్వు ఫేయిర్ గేమ్ ఆడట్లేదు " అని  శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అర్జున్, పైమాను తోసేసాడు. అది చూసిన రేవంత్, "ఎవరు అడ్డమొస్తే వారిని తోసిపడదొబ్బు" అని అన్నాడు. అది విన్న శ్రీసత్య,  "ఫార్మల్  వర్డ్స్ వాడు" అని రేవంత్ తో చెప్పింది. "తోసిపడదొబ్బు, ఏసిపడదొబ్బు అంటే ఎవరు పడేలా లేరు ఇక్కడ. చూసుకొని మట్లాడు" అని శ్రీసత్య, రేవంత్ తో చెప్పగా, అలాగే "మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు" అని రేవంత్ అన్నాడు. శ్రీహాన్, శ్రీసత్య మధ్య ఆర్గుమెంట్ కొనసాగగా, శ్రీహాన్, అర్జున్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. "నువ్వు నా కాళ్ళు పట్టుకొని లాగావ్ అది ఫిజికల్ కాదా" అని అర్జున్ అనగా, "నువ్వు నన్ను లాగేసావ్. ఇది ఫిజికల్ కాదా" అని శ్రీహాన్ చెప్పాడు. కాసేపు ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఇందులో శ్రీహాన్, అర్జున్ తో దమ్ముంటే అడ్డుకో అన్నాడు. " ఆ నేను చూస్తా, నువ్వెలా అడ్డుకుంటావో" అని అర్జున్ అన్నాడు.

ఐ ల‌వ్ యు ఇంద్ర‌జా!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక రాబోయే వారం "మళ్ళీ పెళ్లి" అనే కాన్సెప్ట్ తో ఈ షో ఫన్ క్రియేట్ చేయబోతోంది. ఈ షోకి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ మధ్య కాలంలో చూస్తే గనక ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. షోస్ కి జడ్జెస్ గా వచ్చేవాళ్ళు తమ బెటర్ హాఫ్స్ కి స్టేజి మీద నుంచి, షోస్ నుంచి ఫోన్ చేయడం. క్యూట్ గా మాట్లాడుకోవడం. దాన్ని ప్రోమోలా కట్ చేసి సోషల్ మీడియాలో వదిలి వ్యూస్ సంపాదిస్తున్నారు.   ఇంతకుముందు జబర్దస్త్ లో ఖుష్భు తన భర్త సుంద‌ర్‌కు ఫోన్ చేసింది. ఇక ఇప్పుడు ఇంద్రజ వంతు వచ్చింది. రాబోయే వారం ఎపిసోడ్ లో "మళ్ళీ పెళ్లి" అంటూ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న కొంతమంది జంటలను తీసుకొచ్చి వాళ్లకు మళ్ళీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద పెళ్లి చేశారు. ఇక ఇంద్రజను రష్మీ, రాంప్రసాద్ స్టేజి మీదకు తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేయించారు. "సర్ బాగున్నారా.. ఈరోజు ఈ షోలో మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం. ఇంద్రజ మేడం మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు.." అని ర‌ష్మీ అన్నాక‌, రాంప్రసాద్ ఫోన్ తీసుకుని "మేడంకి ఒకసారి ఐ లవ్ యు చెప్తారా వినాలని ఉంది" అన్నాడు. దాంతో ఆయన "ఒక్కసారేనా చెప్పేది" అంటూ "ఐ లవ్ యు ఇంద్రజ" అని ఎంతో క్యూట్ గా చెప్పేసారు. దానికి ఇంద్రజ సిగ్గుపడిపోయింది "ఐ లవ్ యు సో సో సో మచ్" అని రిప్లై ఇచ్చారు.

ఇనయా కోసం సోషల్ మీడియాలో ఓట్లు అడుగుతున్న ఆర్జీవీ!

సెన్సేషనల్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరూ అంటే  రామ్ గోపాల్ వర్మ అని ఎవ్వరైనా చెప్పేస్తారు. ఆయన చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్  వేదికగా ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఇనయాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి "మీరు వోట్ చేసి సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది" అంటూ ఇనయాకి వోట్ ఎలా వేయాలో మొత్తం వివరించి చెప్పారు ఆర్జీవీ. కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేట్ పార్టీలో ఫుల్ గా తాగేసి ఇనయతో డాన్స్ చేస్తూ ఆమె కాళ్ళ చుట్టూ తిరిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో తర్వాత  ఇనయ ఫుల్ ఫేమస్ అయ్యింది.. అంతే  బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌‌గా అవకాశాన్ని దక్కించుకుంది.  కాక‌పోతే గేమ్ ఆడకుండా అందంతో నెట్టుకొస్తోంది అంటూ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఇనయ కోసం రంగంలోకి దిగిన ఆర్జీవీ హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయాలని నెటిజన్స్ ని కోరుతున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో దొంగలు పడ్డారు!

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్త టాస్క్‌లతో అలరిస్తోంది. కాగా నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి దొంగలు వచ్చి, కంటెస్టెంట్స్‌కి సరిపడా ఉన్నంత ఫుడ్‌ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళడానికి కారణం అంతకముందు మొదలైన 'సెలబ్రిటీ లీగ్ టాస్క్'. ఈ టాస్క్‌లో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో సెలబ్రిటీ పాత్ర ఇచ్చి, ఆ పాత్రలోనే టాస్క్ సమయం ముగిసేవరకు ఉండాలని బిగ్ బాస్ చెప్పగా, ఎవరు కూడా ఆశించినంతగా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ కి కోపం‌ వచ్చి, అందరిని వెళ్ళిపోమని చెప్పిన విషయం తెలిసిందే.  అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో దొంగలు వచ్చి ఫుడ్ తీసుకెళ్ళారు. "ఎప్పుడు అయితే కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్‌తో మెప్పిస్తారో అప్పుడే ఫుడ్ వస్తుంది" అని చెప్పాడు బిగ్ బాస్. ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెటిజన్లు మాత్రం తమకు నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.  "తిండి దండగ అని సింబాలిక్ గా చెప్తున్నాడు బిగ్ బాస్" అని ఒకరు, "ఇది కదా కావాల్సింది. ఫుడ్ కోసం వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు నిజమైన గేమ్ ఆడుతున్నారు." అని ఇలా నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా ఫుడ్ కోసం అయినా కంటెస్టెంట్స్‌ పర్ఫామెన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారో? లేదో? చూడాలి మరి.

థ్యాంక్యూ..షో చూసి ఎంజాయ్ చేయండి

క్యాష్ షో అంటే మూవీ ప్రొమోషన్స్ కి ఒక చక్కని వేదికగా కనిపిస్తుంది. ఇక ఈ షోకి సంబంధించిన లేటెస్ట్  ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి అనుదీప్, శివ కార్తికేయన్, మరియా, రాహుల్ ఎంట్రీ ఇచ్చారు. అనుదీప్ డైరెక్టర్ గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ అవుతోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ టీమ్ మొత్తం క్యాష్ షోకి వచ్చారు. "ఇతన్ని అందరూ లేట్ గా గుర్తించిన ఒక జాతిరత్నం రేయ్ పట్టుకురండిరా" అని సుమ అనేసరికి "బ్యాండ్ మేళంతో, పూలు జల్లుకుంటూ అనుదీప్ ని ఎత్తుకుని ఫాన్స్ స్టేజి మీదకు తీసుకొచ్చారు". "అనుదీప్ గారు మన సభను ఉద్దేశించి ఏదో చెప్పాలని అనుకుంటున్నారు" అని సుమ అనుదీప్ ని అడిగేసరికి "థ్యాంక్యూ..షో చూసి ఎంజాయ్ చేయండి" అన్నారు. ఏదో వీర లెవెల్ లో స్పీచ్ ఇస్తారు అనుకునేసరికి ఒక్క ముక్క మాత్రమే చెప్పడంతో సుమ ఆశ నిరాశ అయ్యింది. ఇక అనుదీప్ డైరెక్టర్ అనేదాన్ని కన్నా కమెడియన్ అనే వర్డ్ సూట్ అవుతుంది. ఇంతకుముందు ఇతను జాతిరత్నాలు అనే మూవీ డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడు. అనుదీప్ క్యాష్ షోలో ఉంటె ఫన్ నెక్స్ట్ లెవెల్ అని పొట్ట పట్టుకుని నవ్వాల్సిందే అని అందరూ అనుకుంటారు.