హౌస్ లో కొత్త కెప్టెన్ ఎవరు?
బిగ్ బాస్ హౌస్ లో యాభై మూడవ రోజు 'కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి' పాటతో మొదలైంది. కాగా ఇప్పుడు హౌస్ లో ఆరవ కెప్టెన్ కోసం పోటీ జరుగుతోంది. గేమ్ ఆడినవాళ్ళు, తమ పర్ఫామెన్స్ తో సత్తా చాటినవాళ్ళకే, ఈ కెప్టెన్ పోటీలో విజయం దక్కుతుంది అనే విషయం అందరికి తెలిసిందే.
కాగా హౌస్ లో గత మూడు రోజులుగా సాగుతోన్న చేపల చెరువు టాస్క్ ఎట్టకేలకు ముగిసింది. ఈ చేపల టాస్క్ లో ఎక్కువ చేపలు సేవ్ చేసుకున్నందువల్ల శ్రీహాన్, శ్రీసత్య నేరుగా కెప్టెన్ పోటీకోసం నామినేట్ అయ్యారు. ఆ తర్వాత టాస్క్ కి గాను హౌస్ లో జంటగా ఉన్న సభ్యుల నుండి ఒక్కొక్కరిని ఎంచుకోమన్నాడు బిగ్ బాస్. అలా ఒక్కో జంట నుండి ఒక్కరు మాత్రమే కెప్టెన్ పోటీకి ముందుకొచ్చారు. "మీలో ఎవరు కెప్టెన్ పోటీదారులుగా ఉంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని అడుగగా, "శ్రీహాన్, శ్రీసత్య ,సూర్య, ఫైమా, కీర్తిభట్, రేవంత్ కెప్టెన్ పోటీదారులుగా ఉంటారు" అని హౌస్ మేట్స్ చెప్పారు.
తర్వాత గేమ్ "చిక్కుల్లో కెప్టెన్సీ" టాస్క్. కెప్టెన్ పోటీదారులుగా ఈ టాస్క్ లో శ్రీహాన్, శ్రీసత్య, సూర్య, ఫైమా, కీర్తి భట్, రేవంత్ పోటీపడగా మొదటి స్థానంలో కీర్తి భట్, రెండవ స్థానంలో సూర్య, మూడవ స్థానంలో శ్రీహాన్ నిలిచి, తర్వాత రౌండ్ కి క్వాలిఫై అయ్యారు. అయితే తర్వాత రౌండ్ లో గెలిచేదెవరో? హౌస్ లో కొత్త కెప్టెన్ అయ్యేదెవరో? అని అందరిలో ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో శ్రీహాన్ కి, హౌస్ మేట్స్ లో చాలా మంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం శ్రీహాన్ కెప్టెన్ అవ్వొచ్చని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో గెలిచేదెవరో? కొత్త కెప్టెన్ అయ్యేదెవరో? అని తెలియాల్సి ఉంది.