గీతు, రోహిత్ మధ్య కన్ఫ్యూజన్..ఇనయాపై రేవంత్ పంతం!
బిగ్ బాస్ హౌస్ లో పోటాపోటీగా సాగిన నామినేషన్ల ప్రక్రియలో గీతు హైలైట్ కాగా, రేవంత్ సూపర్ అనిపించుకున్నాడు. అయితే గీతు మాట్లాడిన మాటతీరుని అందరూ కామెంట్ చేస్తూ ఉండగా, మరికొందరు మాత్రం ఒకవేళ గీతు హౌస్ నుండి బయటకొస్తే బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ గా ఏమీ ఉండదు అని అభిప్రాయపడుతున్నారు. కాగా నిన్న జరిగిన నామినేషన్లు వాడివేడిగా సాగాయి.
గీతు, మెరీనాని నామినేట్ చేసింది. కారణం చెబుతూ, "నువ్వు నాకు డిజాస్టర్ ఇచ్చావ్. కానీ ఫిజికల్ గేమ్ లో నువ్వు ఆట సరిగ్గా ఆడలేదు. అది నాకు నచ్చలేదు" అని చెప్పింది గీతు. ఆ తర్వాత తన సెకండ్ నామినేషన్ గా గీతు, రోహిత్ ని నామినేట్ చేసింది. గీతు మాట్లాడుతూ, "యూ ఆర్ ఏ కన్‌ఫ్యూజియస్ క్యారెక్టర్, అసలు నువ్వు ఏంటో అర్థం కాలేదు నాకు. ఎంత అర్థం చేసుకుందామనుకున్నా నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు. నీ గేమ్ నాకు కనిపించట్లేదు. నీ ఎంటర్టైన్మెంట్ నాకు కనిపించట్లేదు" అని రోహిత్ ని నామినేట్ చేసింది. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ, "అభిప్రాయం అనేది ఒక్కొక్కరి మీద ఒక్కోలా ఉంటుంది. నేను మీకు అర్థం కాకపోవడం అనేది మీ ప్రాబ్లమ్" అని అన్నాడు. కాగా గీతుకి, రోహిత్ కి మధ్య నామినేషన్ వేసాక, వీరిద్దరి ఎమోషన్ కాస్త కన్ఫ్యూజన్ గా మారి, వీరిద్దరికి మధ్యలో గొడవ ముదిరిందేమోనని అనిపిస్తోంది.
ఆ తర్వాత రేవంత్, ఇనయాని నామినేట్ చేసాడు. "ఏకాభ్రిప్రాయం అంటే మన ఇద్దరం కలిసి అనుకోవాలి. నాతో ఇక్కడ ఓకే అనేసి, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్వడం. సూర్య వచ్చి నిన్ను ఓదార్చడం. అక్కడ ఎలా ఉంది అంటే, నేనేదో నీకు రావాల్సింది లాగేసుకున్నట్టుగా అనిపించింది. అందుకనే నిన్ను నామినేట్ చేస్తున్నాను" అని రేవంత్ చెప్పుకొచ్చాడు. అయితే రేవంత్ మాట్లాడేటప్పుడు, ఇనయా ఒకే మాటని పదే పదే అంటూ, గట్టిగా అరుస్తుండటంతో, "ఇనయా గారు మీ మాట వింటున్నాను. కాసేపు నెమ్మదిగా మాట్లాడండి" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత ఇనయా, " మీరు నన్ను అలా ఎలా అంటారు" అని అనగా, "మీరు ఆడిన డ్రామాల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత సూర్య గురించి అడుగగా, "మీరు సూర్య గురించి ఇక్కడ తీసుకురావలసిన అవసరమే లేదు" అని ఇనయా చెప్పింది.
రేవంత్, ఇనయాల మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రేవంత్, ఇనయాని ఫేక్ అని చెప్పకనే చెప్పాడు. ఇనయా మాత్రం నా ఆటే అంత అన్నట్టుగా ధీమా కనబరుస్తోంది. అయితే రేవంత్, ఇనయా మీద చూపిన అగ్రెసివ్ చాలా కరెక్ట్ అని తెలుస్తోంది. అయితే ఎక్కువ నామినేషన్లు ఇనయాకి పడిన కారణంగా ఈ వారం ఇనయా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.