నేను ఆంటీ ఐతే మీరు తాతయ్య ఐనట్టే కదా!

'ఆంటీ' అనే పదం కొన్ని నెలల ముందు అనసూయ కారణంగా ఎంత సెన్సేషన్ సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. దీని మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇలాంటి టైంలో లేటెస్ట్ గా మరోసారి ఆంటీ వివాదం తెర మీదకు వచ్చింది. శ్యామలని "ఆంటీ" అని సంభోదించాడు సీనియర్‌ నటుడు రాజా రవీంద్ర. నవంబర్ 4న ‘తగ్గేదే లే’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు రవీంద్ర.  ఈ మూవీ  ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాజా రవీంద్ర మాట్లాడుతూ ‘‘మా ప్రొడ్యూసర్స్ ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లు తలుచుకుంటే ‘బాహుబలి’ లాంటి పది సినిమాలు తీయగలరు కానీ అలాంటివి కాకుండా ఆడియన్స్ కోసం  మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే చాలు అనుకుంటున్నారు. అందుకే ఈ ‘తగ్గేదేలే’ అనే మూవీని తీశారు. కరోనా టైంలో ఎంతో కష్టపడి ఈ సినిమాకి పని చేసాం. అలాగే  భద్ర ప్రొడక్షన్ కంపెనీ, నిర్మాతలు అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ ముందుగానే వ్యాక్సిన్‌లు వేయించి టైంకి పేమెంట్స్ కూడా ఇచ్చేసారు’’ అని చెప్పాడు.  ఇలా అందరికీ  ధన్యవాదాలు చెబుతూ.. ఫైనల్ గా "శ్యామలా ఆంటీకి కూడా థాంక్యూ" అంటూ ఆమెపై కౌంటర్ వేశాడు. రాజా రవీంద్ర మాటలకు షాకైన శ్యామల వెంటనే రివర్స్ కౌంటర్ పేల్చింది.. "నేను  ఆంటీ ఐతే మీరు తాతయ్య అయిపోయినట్టే" అని రిటార్ట్ ఇచ్చింది. 

పెద్ద రోజ్ కి రోజ్ బొకే ఇచ్చినట్టుంది..డాన్స్ ఐకాన్ స్టేజిపై రాశీఖన్నాను పొగిడిన ఓంకార్

డాన్స్ ఐకాన్ ఒక రేంజ్ లో టాప్ షోస్ తో సమానంగా దూసుకుపోతోంది. ఆహా ఓటిటి ప్లాట్ఫారం పై ఈ డాన్స్ షో వస్తోంది. ఈ షో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ డాన్స్ ఐకాన్ షో 14 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే 15, 16వ ఎపిసోడ్ లకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ కొత్త ప్రోమోలో కంటెస్టెంట్ లతో పాటు శేఖర్ మాస్టర్ పెర్ఫార్మన్స్ కూడా ఓ రేంజ్ లో  అదిరిపోయింది. అయితే.. రాబోయే ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్ రాశిఖన్నా ఎంట్రీ ఇచ్చింది. అలాగే షోలో స్టేజిపై యష్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి సర్ప్రైజ్ చేసింది.   ఇక హోస్ట్ ఓంకార్ వచ్చి బొకే ఇస్తూ " ఒక పెద్ద రోజ్ కి రోజ్ బొకే ఇచ్చినట్టు ఉంది" అని రాశీఖన్నాని గులాబీ పువ్వుతో పోల్చాడు. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ థీమ్ "జడ్జెస్ ఛాలెంజ్" రౌండ్. ఇక సౌమ్య తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది..కానీ రిజెక్ట్ అయ్యేసరికి మోనాల్ చాలా ఎమోషనల్ అయ్యింది. "ఎవరైనా తక్కువగా డాన్స్ చేస్తే ఒక రెడ్ ఇస్తారు..కానీ మనం ఎంత కష్టపడి చేసినా టు రెడ్స్ ఇచ్చేస్తారు..ఎందుకంటే జడ్జెస్ మన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు" అని ఆ కంటెస్టెంట్ కి చెప్పింది. ఇలా ఈ వారం డాన్స్ ఐకాన్ ఎంటర్టైన్ చేయబోతోంది.

ఇనాయ ఏది చేసినా అది కంటెంట్ అవుతోంది

బిగ్ బాస్ లో ఆడే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యాక వాళ్ళను బీబీ కేఫ్ కి తీసుకొచ్చి కాంట్రావర్సీ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు యాంకర్స్. పనిలో పనిగా హౌస్ మేట్స్ కి సంబందించిన వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇనాయ క్లోజ్ ఫ్రెండ్ రణతిని ఆరియానా గ్లోరీ బీబీ కేఫ్ కి తీసుకొచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగింది. "మీరు ఇనాయాకి ఎలా పరిచయం" అనేసరికి "మనం ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అనుకుంటామో ఇనాయా కూడా అలాగే ఉంటుంది..ఎలాంటి విషయాన్నైనా బయటికి చెప్పేస్తుంది... సీక్రెట్ అనేది మెయింటైన్ చేయదు " అని చెప్పాడు. " మరి హౌస్ లో కూడా అలాగే ఉందా" అనేసరికి "హౌస్ లో మాస్క్ లేకుండా ఎవరైనా ఉన్నారు అంటే అది ఇనయానే" అని ఆన్సర్ ఇచ్చాడు. "మెజారిటీ ఆఫ్ హౌస్ మేట్స్ ఇనాయని ఫేక్ అంటున్నారు కదా" అని అడిగింది అరియానా.."సూర్యని ఆమె నామినేట్ చేసింది. సూర్య వెళ్లిపోయేటప్పుడు ఏడ్చేసింది. " ఏమిటిది అని అడిగేసరికి "లవ్ లాంటిది ఏమీ లేదు" అన్నాడు . "ఇనాయ గేమ్ ప్లాన్ కి సూర్య బలయ్యాడని అనిపించిందా" అనేసరికి "లేదు మనుషులతో గేమ్ ఆడే టైపు కాదు" అన్నాడు. "సూర్య మీద ఇనాయ ఫీలింగ్ నిజమేనంటారా" అని అడిగింది. "ఫ్రెండ్ గా ఐతే ఇనాయ ఫీలింగ్ నిజమే" అని తెలివిగా ఆన్సర్ చేసాడు . "మరి క్రష్ అనేది ఏమిటి" అనేసరికి "ఇష్టం వేరు,  ప్రేమ వేరు" అన్నాడు. "ఆడియన్స్ సూర్య, ఇనాయ రిలేషన్ షిప్ ని ఎలా తీసుకుంటున్నారు" అని అనేసరికి " ఏదో ఒకరకంగా సెన్సేషన్ ఐతే అవుతోంది కదా" అన్నాడు .."ఇనాయ చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద ఇష్యూ చేస్తుందని ఆడియన్స్ అంటున్నారు..మరి మీ ఒపీనియన్" అని అడిగేసరికి "ఇనాయ కంటెంట్ కోసం చేయదు..తాను ఏది చేసినా అది కంటెంట్ అవుతోంది" అన్నాడు..మరి రణతితో చేసినా ఈ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనుదీప్ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళను కొట్టి మరీ నవ్వుతాడు

జాతిరత్నాలు మూవీ ద్వారా ఒక ఫేమ్ తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో  సంతోష్ శోభన్ తో కలిసి  జంటగా నటించిన చిత్రం ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా షోకి వచ్చారు ఇద్దరూ.  ఇటీవల ఫరియా, సంతోష్   బిగ్ బాస్ సీజన్ 6 లో నాగార్జునతో కలిసి సందడి చేశారు.   ఇక జాతిరత్నాలు షూటింగ్‌ టైమ్‌లో ఆ మూవీ డైరెక్టర్ అనుదీప్ కొట్టడంపై ఆలీ అడిగిన ప్రశ్నకు ఫరియా  క్లారిటీతో సమాధానం చెప్పింది. ‘ డైరెక్టర్ అనుదీప్ కి ఒక మేనరిజమ్ ఉంది.. ఏదైనా జోక్ విన్నా.. చెప్పినా నవ్వుతూ పక్కన ఎవరు ఉంటే వాళ్ళను  కొడుతుంటాడు. షూటింగ్ టైంలో అనుదీప్ అందరితో చాలా ఫన్నీగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేస్తూ  నవ్విస్తుంటారు. జాతిరత్నాలు మూవీ షూటింగ్ సమయంలో అలాగే ఆయన ఒక జోక్ వేశారు.. ఆ సమయంలో ఆయన పక్కన నేనే  ఉన్నాను..ఆ జోక్ కి ఆయన నవ్వుతోనే నన్ను సరదాగా కొట్టారు .. దాన్ని చూసి అందరూ వేరే రకంగా ఊహించుకున్నారు. ఇది జస్ట్ ఫన్నీగా జరిగింది మాత్రమే..వేరే సీరియస్ రీజన్స్ అంటూ ఏమీ లేవు  ’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

'నోరు మూసుకుని వెళ్లి కూర్చో!'.. ఆదిని రఫ్ఫాడించిన పూర్ణ!!

ఢీ - 14 డాన్సింగ్ ఐకాన్ క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసింది. కంటెస్టెంట్స్ ఎంతో పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశారు. ఇక క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఎవరు సెమీ ఫైనల్స్ కి అడుగు పెడతారో చూడాలి. ఇక ఈ డాన్స్ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో పూర్ణ, గణేష్, యాని మాస్టర్స్ వచ్చారు. ఇక హైపర్ ఆది మామూలుగానే ఎంటర్టైన్ చేసాడు. టీం లీడర్ శ్వేతా నాయుడు "నీతోనే  డాన్స్ టునైట్" అనే సాంగ్ కి డాన్స్ చేసింది.  ఆమె పక్కనే ఆది మాస్ స్టెప్స్ వేసాడు అదే సాంగ్ కి. ఇంతలో ప్రదీప్ వచ్చి "ఫేస్ ఆఫ్ లో ఇద్దరిలో ఎవరి డాన్స్ బాగుందో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం" అనేసరికి "శ్వేతాదే బాగుంది" అని పూర్ణ అంది. "సీరియస్లీ ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు" అని వెళ్ళిపోయాడు ఆది. "నువ్వు ఇలా ప్రవర్తించకూడదు" అని కౌంటర్ వేసింది పూర్ణ. "నాకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు" అనేసరికి "సిగ్గుంటే వెళ్ళిపో, సిగ్గు లేదంటే స్టేజి మీదకు రా" అని పూర్ణ కూడా సీరియస్ గానే చెప్పింది. "నాకు సిగ్గు లేదు, సిగ్గు రాదు, ఫ్యూచర్ లో మీరే చూస్తారు నా సిగ్గేమిటో" అన్నాడు సీరియస్ గా ఆది. "సరేలేగాని నోరు మూసుకుని వెళ్లి కూర్చో" అంది పూర్ణ. ఇలా రాబోయే ఢీ ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగానే కాకుండా చాలా టఫ్ కాంపిటీషన్ తో అలరించబోతోంది.

రోహిత్, రేవంత్ మధ్య రచ్చ.. హడలెత్తిపోయిన హౌస్ మేట్స్!

బిగ్ బాస్ లో గొడవలు కామన్ గా జరుగుతోంటాయి. అయితే ఈ గొడవలు పీక్స్ స్టేజ్ కి చేరాయి. కాగా మొన్నటి నుండి సాగుతోన్న మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో మొట్టమొదటిసారిగా రోహిత్ సీరియస్ అయ్యాడు. రోహిత్ మాములుగానే సింపుల్ గా, రిజర్వ్ గా ఉంటాడు. అలాంటి రోహిత్ ఫైర్ అయ్యాడు.  బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోనూ గొడవలు పెట్టుకోని ఏకైక‌ కంటెస్టెంట్ రోహిత్. మొన్నటి దాకా కలిసి ఆడిన మెరీనా-రోహిత్. విడిపోయి ఆడుతున్నప్పటి నుండి రోహిత్ తన పర్ఫామెన్స్ తో మెరుగవుతూ వస్తోన్నాడు. నిన్న జరిగిన టాస్క్ లో రోహిత్, రేవంత్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాగా రేవంత్ గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. అది విని రోహిత్ హైపర్ అయ్యాడు. "నార్మల్ గా మాట్లాడు రేవంత్. నేను నార్మల్ గా మాట్లాడుతున్నా కదా, నువ్వు నార్మల్ గా మాట్లాడు" అని అన్నాడు. రేవంత్ " మీరు గేమ్ ఆడండి " అని అన్నాడు. దానికి సమాధానంగా  "మొన్న ఫైమా ఎందుకు అలా చేసింది. మీ టీం సభ్యులు చేస్తే తప్పు లేదు కాని మా మీద ఎందుకు అరుస్తున్నావ్ రోహిత్" అని రోహిత్ అన్నాడు. రోహిత్, రేవంత్ మధ్య సాగిన ఈ గొడవను చూసి హౌస్ మేట్స్ అందరు హడలెత్తిపోయారు. ఆ తర్వాత శ్రీహాన్, రేవంత్ ని కూల్ చేసి పక్కకి తీసుకెళ్ళగా, మెరీనా, రోహిత్ ని పక్కకి తీసుకెళ్ళి సర్దిచెప్పింది. అలా ఈ గొడవ ముగిసింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవ వల్ల మునుముందు ఎలా ఉంటారో చూడాలి మరి.

గీతు పంతం.. రెండో రోజూ ఆదిత్య కన్నీటి పర్యంతం!

బిగ్ బాస్ లో మొదలైన  'మిషన్ ఇంపాజిబుల్' గేమ్ రోజు రోజుకి ట్విస్ట్ లతో అదరగొడుతోంది. మొన్నటి నుండి మాములుగా సాగిన ఈ టాస్క్ గీతు ప్లే చేసే మైండ్ గేమ్ తో హౌస్ మేట్స్ గందరగోళంలో పడిపోగా, ఇది ఒక్కొక్కరి మధ్య జరిగే గొడవలకు దారి తీస్తోంది. అయితే నిన్న జరిగిన టాస్క్ మొత్తం కూడా బ్లాక్ మెయిల్ గేమ్ లా మారిపోయింది. ఆదిత్య, గీతుల మధ్య జరిగిన మాటల యుద్ధం ఆదిత్య కన్నీటితో పూర్తవుతుంది అని అందరు అనుకున్నారు. కానీ రెండవ రోజు కూడా ఆ గొడవ కొనసాగుతోంది. కీర్తిభట్, ఫైమాల దగ్గరకు ఆదిత్య వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. "గీతు సిగరెట్లు దాచేసింది. అవి లేకపోతే నేనేం చచ్చిపోను కదా. సిగరెట్ల కోసం ఆదిత్య ఏడ్చాడని బయట అందరు అనుకుంటున్నారు. ఆఫ్ ట్రాల్ ఒక సిగరెట్ కోసం నేను అంత దిగజారుతునా.. మా అమ్మ ఇది చూస్తే బాధపడుతుంది. తనకి నేను సిగరెట్లు తాగడం ఇష్టం లేదు. నా కూతురు చూస్తే ఎలా ఉంటుంది. ఒక సిగరెట్ కోసం నేను ఇంత దిగజారుతానా" అని చెప్పుకుంటు ఏడ్చేసాడు ఆదిత్య. కాగా వీరి మధ్య జరుగుతున్న ఈ గొడవను క్లియర్ చేయాలని ఆదిరెడ్డి వెళ్ళి గీతుకి సర్ది చెప్పాడు. "సిగరెట్లు తాగడం అనేది అతని పర్సనల్ విషయం. తప్పు.. అలా బ్లాక్ మెయిల్ చేయకూడదు. ఓవర్ మిస్టేక్ అవుతోంది చూసుకో. తప్పుని సరిదిద్దుకో గీతు" అని ఆదిరెడ్డి చెప్పాడు. ఇవేవి పట్టించుకోకుండా గీతు తన పంతాన్ని వదులుకోలేదు. అయితే గీతు పంతానికి, ఆదిత్య గట్టిగా ఎదురు తిరుగుతాడో లేదో.. చూడాలి మరి.

గొడవల్లో కంటెస్టెంట్స్ ..!

'లాలా భీంలా' పాటతో బిగ్ బాస్ యాభై తొమ్మిదో రోజు సందడిగా మొదలైంది. మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో భాగంగా మొదటి మిషన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ మిషన్ పూర్తి అయ్యేసరికి చివరగా శ్రీహాన్, ఇనయా, ఫైమా ఉండగా శ్రీహాన్ ఇనయాని తోసేసి శ్రీహాన్ కూడా ఓడిపోయి, ఫైమాని గెలిపించాడు. టాస్క్ ముగిసాక శ్రీహాన్, ఇనయా గొడవ పడ్డారు. "ఇనయా ఆగు, ఇందాక టాస్క్ లో నోరు జారావ్? ఏమన్నావ్? ఎందుకు అలా అన్నావ్. అది నోరా పెంటనా" అని శ్రీహాన్ అడిగాడు.  "మీరు అక్కడ అలా పడుకోవడం నేను చూసా", అని అంది. దానికి పక్కనే ఉన్న శ్రీసత్య," హా చెప్పు. ఏం చేసామో చెప్పు" అని ఇనయాతో అంది. "మీరిద్దరు చాలా మాట్లాడారు" అని ఇనయా చెప్పింది శ్రీహాన్ తో.  ఆ తర్వాత "ఒక కొశ్చన్ అడుగుతా చెప్పు, నువ్వు తన బెడ్ మీద పడుకున్నావ్ అని నేను  చెప్పానా? అని ఇనయా అనగా, "బాగా కవర్ చేసావ్. డ్రామా క్వీన్ ఈజ్ హియర్. నోరంతా పెంట పెట్టుకుంది" అని శ్రీహాన్ అన్నాడు. దానికి రిప్లై గా, " మీ క్లారిటీ మీ దగ్గర పెట్టుకో" అని ఇనయా అంది. గీతు ఏడుస్తు కూర్చోగా, 'ఏడ్వకు కళ్ళు తూడ్చుకో" అని ఆదిరెడ్డి అన్నాడు. "బయట అలా ప్రవర్తిస్తు ఉంటా కానీ, నేను లోపల ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను" అని గీతు ఏడ్చేసింది. "నేను దొంగ. ఎదవ. ఎదవన్నర ఎదవ" అని గీతు, ఆదిరెడ్డితో చెప్పింది. ఆ తర్వాత గీతుకి, ఇనయాకి వాగ్వాదం జరిగింది. అది అయ్యాక మళ్ళీ మరో గొడవ మొదలైంది. "బెడ్ మీద ముగ్గురు పడుకున్నారు అని ఇనయా అంది" అని శ్రీసత్య, గీతుతో చెప్పుకొచ్చింది. "నువ్వు తీసుకుంటావేమో కాని, నేను తీసుకోను. నా క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. కూర్చొని ముద్దులు పెట్టుకున్నొళ్ళు. అంతా బాగానే ఉన్నారు" అని శ్రీసత్య, గీతూతో చెప్పుకుంటు ఏడ్చింది.

ఆదిరెడ్డికి సీక్రెట్ టాస్క్..సక్సెస్ అవుతాడా?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ని రెట్టింపు చేసేది 'సీక్రెట్ టాస్క్'. ఎందుకంటే ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ సపోర్ట్ లేకుండా సోలో గా తమ సత్తాను చూపించే అవకాశం. అలాంటిది ఇప్పుడు ఈ సీక్రెట్ టాస్క్ ఆదిరెడ్డిని వరించింది. 'మిషన్ ఇంపాజిబుల్' టాస్క్ లో అందరు బాగా పర్ఫామెన్స్ చేస్తున్నారు. అయితే గేమ్ మధ్యలో బిగ్ బాస్, ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూంకి రమ్మని పిలిచాడు. అందులో బిగ్ బాస్ మాట్లాడుతూ, " ఆదిరెడ్డి మీరు వాష్ రూంని పూర్తిగా అశుభ్రపరిచి, ఆ పనిని రెడ్ స్క్వాడ్ లోని  ఏ సభ్యులైనా చేసారని నింద వారిపై మోపాల్సి ఉంటుంది. ఈ మిషన్ ని పూర్తి చేయడానికి కావాలంటే మీ సభ్యల సహాయం తీసుకోవచ్చు" అని చెప్పాడు. దీనికి సమాధానంగా ఆదిరెడ్డి, " ఒకే బిగ్ బాస్ అలాగే చేస్తాను" అని చెప్పాడు. "అయితే ఈ సీక్రెట్ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేస్తే మీ  స్క్వాడ్ లో చనిపోయిన ఒకరిని రీవైవ్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ సీక్రెట్ మిషన్ గురించి ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. ఎవరికైనా అనుమానం వస్తే వారిని దారి మళ్లించండి" అని బిగ్ బాస్ చెప్పగా, సరేనని ఆదిరెడ్డి సమాధానమిచ్చాడు. మరి చూడాలి ఆదిరెడ్డి  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో? లేదో?  

రష్మీ తెలుగు కంటే నా తెలుగు చాలా బెటర్

చెఫ్ మంత్ర సీజన్ 2 ప్రతీవారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు ఆహాలో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం జబర్దస్త్ స్టార్స్ ని ఇన్వైట్ చేసింది లక్ష్మి. యాంకర్ రష్మీ సెట్ లోకి అడుగుపెట్టేసరికి మంచు లక్ష్మి వెనక ముందు చూస్తూ రష్మీ వస్తే సుధీర్ కూడా రావాలి కదా అని చూస్తున్నా అనేసరికి రష్మీ నవ్వేసింది. ఇంతలో గెటప్ శీను సెట్ లోకి అడుగుపెట్టాడు. "మా బంగారు తల్లి ఫోన్ చేస్తుంటే ఫోన్ తియ్యకుండా ఏం చేస్తున్నావ్ బ్రదర్" అంటూనే  ఇదిగో మాట్లాడు అని సెల్ ని రష్మీకి ఇచ్చాడు శీను.  "హాయ్ సుధీర్" అనడంతో   "హే రష్మీ" అని అవతల నుంచి వచ్చిన రెస్పాన్స్ కి రష్మీ  సిగ్గుమొగ్గలయ్యింది. వెంటనే శీను "సిగ్గూ మొగ్గాయే" అని పాట పాడేశాడు. ఇక ఇద్దరికీ గారెలు వేసే పోటీ పెట్టింది. వెంటనే కొన్ని ప్రశ్నలు అడిగింది "రష్మీ నటించిన ఫస్ట్ మూవీ పేరు  ఏమిటి" అని అడిగింది. "అప్పుడొచ్చావా తల్లీ నువ్వు" అని శీను కౌంటర్ వేసాడు. "రష్మీ ని డైరెక్ట్ గా మీట్ ఐనప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ ఏమిటి" అని అడిగేసరికి "ఈ విషయం శీనుకి తెలియదు సుధీర్ గా బాగా తెలుసు "అని చెప్పకనే చెప్పేసరికి సుధీర్ ఇప్పుడు నెంబర్ చెప్పేస్తున్నా పబ్లిక్ గా అనేసరికి "ఎవరైనా వాళ్ళ భార్య నెంబర్ గుర్తుపెట్టుకుంటారు కానీ సుధీర్ నెంబర్ ఎందుకు గుర్తుపెట్టుకున్నావ్" అని రివర్స్ కౌంటర్ వేసింది రష్మీ. ఇక వడలు వేస్తూ "నా వడలో కూడా వన్ద్రం ఉంది " అంటూ కామెడీ చేసింది. ఇక మంచు లక్ష్మికి దొరికిందే సందుగా "నేను ఎక్కడికి వెళ్లినా రష్మీని వెంట తీసుకెళ్తా ఎందుకంటే  రష్మీ తెలుగు ముందు నా తెలుగు చాలా బాగుంది" అంది.

రష్మీ, నందు వేసిన దోశలు బ్లాక్‌బ‌స్ట‌ర్‌!

'బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌' మూవీ ప్రమోషన్స్ ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు నందు, రష్మీ. ఇక ఇప్పుడు టేస్టీ తేజ కిచెన్ కి వచ్చి దోస ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశారు. 'రష్మీ మేడంకి వంటొచ్చా?' అని తేజ అనేసరికి "నాకు వంట వచ్చు..నా వంట నేనే చేసుకుని తింటాను...నా పక్క వాళ్లకు కూడా పెడతాను. నచ్చిందా లేదా అనేది నా సమస్య కాదు." అని ఫన్నీ గా ఆన్సర్ ఇచ్చేసింది రష్మీ. పెనాన్ని పిండి గిన్నె దగ్గరకు తీసుకొచ్చేసరికి తేజ పడీ పడీ నవ్వేసాడు. "పిండి పెనం దగ్గరకు కదా వెళ్ళాల్సింది.. పెనం పిండి దగ్గరకొచ్చిందేంటి" అనేసరికి "నేను సెట్ దోస వేస్తున్నా" అంది రష్మీ. ఇక రష్మీ పెనాన్ని ఊపేసరికి తేజ భయపడిపోయి "ఏంటండీ పెనాన్ని అలా చేస్తున్నారు?" అని అడిగాడు. "దీన్ని ప్రొఫెషనలిజమ్ అంటారు" అని రష్మీ అనేసరికి "చైనీస్ వంటలు చేసేవాళ్ళు పెనాన్ని ఇలాగే తిప్పుతూ ఉంటారు" అన్నాడు నందు. ఇక తర్వాత నందు బాహుబలి దోశ వేసాడు. తర్వాత టేస్టీ తేజ ఎమోజిస్ ఛాలెంజ్ టాస్క్ ఇచ్చాడు. తన మొబైల్ లో కొన్ని రకరకాల ఎమోజిస్ చూపించి నందుని, రష్మీని అలాగే చేయమని చెప్పేసరికి వాళ్ళు కూడా వెరైటీగా ఫన్నీ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి నవ్వు తెప్పించారు.

బ్యూటీ టాక్స్ ఉంటే చిట్టినే పెద్ద టాక్స్ పేయర్ అవుతుంది

నవంబర్ 4 నా తెలుగులో మూడు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్, ఊర్వశివో-రాక్షసివో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రయిబ్. ఇక ఈ మూవీస్ ప్రొమోషన్స్ కూడా అంతే జోరుగా హుషారుగా సాగుతున్నాయి. ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రయిబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా, సప్తగిరి ఇద్దరూ  టేస్టీ తేజ కిచెన్ వివాహ భోజనంబుకి  వచ్చారు. ఇక తేజ ఫరియాని పొగడ్తలతో ముంచెత్తాడు. "ఇండియాలో ఇన్కమ్ టాక్స్ లాగా బ్యూటీ టాక్స్ ఉంటే గనక అందరికంటే ఎక్కువ టాక్స్ మీరే కడతారు అని జోక్ చెప్పి మరీ కళ్ళు మూసుకుని సిగ్గుపడిపోయాడు" తేజ. ఇక తేజ సప్తగిరిని అసలు పేరేమిటి .. అసలు సప్తగిరిగా ఎందుకు మారాల్సి వచ్చింది అని అడిగాడు.."తన అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్ అని చెప్పాడు. ఐతే  ఒకరోజు తిరుమలకి దైవదర్శనం కోసం వెళ్లాను. స్వామి వారి దర్శనం అయ్యాక బయటికొచ్చి గుడిని చూస్తూ ఉండగా మఠ పీఠాధిపతులు కొందరు అక్కడ తిరుమాడ  వీధుల్లో  తిరుగుతూ ఉన్నారు. నేను వాళ్ళను అస్సలు గమనించలేదు. ఇంతలో వాళ్ళ దారికి అడ్డుగా ఉన్న నన్ను ఒక పీఠాధిపతి వచ్చి నాన్న సప్తగిరి పక్కకు జరుగు అన్నారు. అలా పక్కకు జరిగాక వాళ్లంతా వెళ్తూ వెళ్తూ చిన్న చిరునవ్వు నవ్వారు. తర్వాత ఆ పేరే నాకు మళ్ళీ మళ్ళీ రీసౌండ్ లో వినిపించింది. ఇక అప్పుడు ఎందుకో మైండ్ లో అనిపించింది..అందుకే అప్పటినుంచి నా అసలు పేరును పక్కన పెట్టి ఇలా సప్తగిరిగా మారాను" అని చెప్పాడు.

రిగ్రెట్ తో ఉండలేను బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లో అందరు తననే కావాలని టార్గెట్ చేసారని బాధపడుతూ ఇనయా వాష్ రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుంది. అందులో ఏడుస్తూ ఉండగా, హౌస్ మేట్స్ అందరు తన కోసం వెతికి, చివరికి వాష్ రూంలో ఉందని తెలుసుకొని బయటకు రమ్మని ఎంత పిలిచినా రాలేదు. దీంతో హౌస్ మేట్స్ లో అందరికి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. కాగా ఇనయా మాట్లాడుతూ, "నన్ను కన్ఫెషన్ రూం కి పిలవండి బిగ్ బాస్" అని అనగా, సరే అని బిగ్ బాస్ పిలిచాడు. ఆ తర్వాత ఇనయా కన్ఫెషన్ రూంకి వెళ్ళింది. అక్కడ ఏడుస్తూ చెప్పింది. " బిగ్ బాస్ నేను ఈ హౌస్ లో ఉండలేను. సూర్య నా వల్లే వెళ్ళిపోయాడు. ఈ రిగ్రెట్ తో ఉండలేను" అని చెప్పగా, "ఈ ఇంట్లోకి రావడం వరకే మీ నిర్ణయం ఉంటుంది. ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అనేది ఆటలో ఒక భాగం. బయటకు వెళ్ళాలి అనేది ప్రేక్షకులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీకు బాగా దగ్గర అయిన వాళ్ళు ఇలా నిన్ను ఏడుస్తూ చూడాలనుకుంటున్నారా..మీ కన్నీళ్ళు తూడ్చుకొని బయటకు వెళ్ళండి " అని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఇనయా కళ్ళు తూడ్చుకొని బయటకు వచ్చేసింది. ఇనయా, ఫైమాతో మాట్లాడుతూ, "ఎక్కువ ఇష్టపడ్డవాళ్ళు అందరు దూరం అవుతారు. నాకు ఎవరు లేరు. నేను బాగా ఇష్టపడే మా నాన్న నాకు దూరం అయ్యాడు. నేను బాగా ఇష్టపడే సూర్య హౌస్ నుండి వెళ్ళిపోయాడు" అని  ఏడుస్తూ చెప్పుకుంది. ఇలా నిన్న జరిగిన సీన్ హౌస్ మేట్స్ అందరిని టెన్షన్ కి గురిచేసింది.

బిగ్ బాస్ లో మిషన్ ఇంపాజిబుల్ !

బిగ్ బాస్ హౌస్ లో కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ మొదలైంది.  ఈ టాస్క్ పేరు 'మిషన్ ఇంపాజిబుల్'. బిగ్ బాస్ ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ ని రెండు టీంలు గా, ఒకటి రెడ్ టీం, మరొకటి బ్లూ టీంలుగా డివైడ్ చేసాడు.  అయితే రెడ్ టీం లో 'శ్రీహాన్, గీతు, కీర్తి భట్, ఫైమా, శ్రీసత్య ఉండగా, బ్లూ టీంలో 'ఇనయా, వసంతి, ఆదిత్య, మెరీనా, రోహిత్, రాజ్  ఉన్నారు. ఆట మొదలయ్యాక తోపులాట జరిగింది. ఇందులో ఇనయాకి, శ్రీసత్యకి  వాగ్వాదం సాగింది. రేవంత్ ని పాలు కావాలని ఇనయా అడిగింది . దానికి రేవంత్ మాట్లాడుతూ, " పాలు కావాలంటే టైం పడుతుంది " అని అన్నాడు". ఆ తర్వాత "నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానా లేక జైల్లో ఉన్నానా, నాకు తలనొప్పిగా ఉంది కాఫీ కావాలి అంటే టైం పడుతుంది అని రేవంత్ అన్నాడు" అని ఇనయా బాధపడింది. మొత్తానికి ఈ టాస్క్ తో గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. ఈ టాస్క్ వల్ల వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్  స్ట్రాంగ్ అవుతున్నారు. స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. అయితే నిన్న మిన్నటి దాకా వీక్ కంటెస్టెంట్ అనిపించుకున్న ఆదిత్య తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే నిన్నటి టాస్క్ లో , "ఆదిత్య వీక్ నెస్ మీద దెబ్బ కొట్టాలి. లైటర్ దాచిపెట్టు" అని శ్రీహాన్ తో, శ్రీసత్య అంది. "ఒక లైటర్ కి టూ బ్లూ స్ట్రిప్స్" అని గీతు అనగా, ఆదిత్యని రేవంత్ పక్కకి తీసుకెళ్తుండగా, "మీ టీం కదా రేవంత్, అందుకే మిమ్మల్ని అడగుతున్నాను. గెలిస్తే ఆటలో గెలవండి కానీ ఈ పిచ్చి ఏంది" అని  అన్నాడు.  ఆ తర్వాత రేవంత్ వాయిస్ పెంచి ఆదిత్యతో వాగ్వాదం కి దిగాడు. దీంతో ఆదిత్య, "మర్యాదగా మాట్లాడు రేవంత్" అని అన్నాడు.  

గీతు మాట తీరుకి కన్నీరు పెట్టుకున్న ఆదిత్య!

మంగళవారం బిగ్ బాస్ హౌస్ లో కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ మొదలైంది. అందులో రెండు టీం లు పాల్గొన్నాయి. అందులో గీతు ఒక టీం లో ఉండగా, రేవంత్ మరో టీం లో ఉన్నాడు. అయితే ఈ గేమ్ లో ఆదిత్య, గీతుని నమ్మి తన‌ లైటర్ ఇచ్చాడు. అయితే తను మాత్రం హ్యూమానిటి లేకుండా నీకు లైటర్ కావాలంటే నాకు టూ స్ట్రిప్స్ ఇవ్వు అని ఆదిత్యతో అంది. అలా వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదిత్య కి సపోర్ట్ గా రేవంత్ మాట్లాడుతూ,  "గీతు నువ్వు చేసేది తప్పు" అని అన్నాడు. గీతు మాత్రం ఎవరు ఏం అన్నా కూడా పట్టించుకోకుండా, "నా గేమ్ ఇంతే. నేను ఇలాగే ఆడుతాను" అని గీతు అంది. "నీ లైటర్ నీకు కావాలంటే రెండు స్ట్రిప్స్ ఇవ్వు" అని గీతు అనగా, ఆదిత్య మాట్లాడుతూ, " నువ్వు మారవా..అందరూ నిన్ను నమ్మొద్దు అన్నా కూడా నేను ప్రేమతో దగ్గరయ్యా నీకు" అని చెప్పుకొచ్చాడు. "ఎంత నమ్మాను నిన్ను. నువ్వు కొంచెం కూడా హ్యూమనిటీ లేకుండా అలా ఎలా మాట్లాడుతావ్" అని ఆదిత్య ఏడ్చేసాడు. ఆదిత్య ఏడ్వడం ఇదే తొలిసారి. ఎప్పుడు అందరితో కలిసిపోయి ఉండే ఆదిత్య , ఎవరు ఏమైనా మాట జారినా కూడా వాళ్ళకి తప్పు అని వివరించే ప్రయత్నం చేస్తాడు. ఆదిత్య ఏడ్వడం చూసి హౌస్ మేట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ ఎపిసోడ్ తో నామినేషన్లో ఉన్న ఆదిత్యకి ఒక్కసారిగా ఓటింగ్ పెరుగుతుంది. చూడాలి మరి ఈ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామెన్స్ చేస్తారో? .

విష్ణుప్రియను వదలని హ్యాకర్స్.. మళ్ళీ అశ్లీల వీడియోల దర్శనం!

యాంకర్ విష్ణుప్రియను హ్యాకర్స్ వదలడం లేదు. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి అశ్లీల వీడియోలు పోస్ట్ చేసి ఆమెను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇటీవల విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అధికారిక ఖాతాలో అశ్లీల వీడియోలు కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన విష్ణుప్రియ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, అందరూ అన్ ఫాలో చేయాలని కోరింది. ఆ తర్వాత ఆమె ఖాతా నుంచి ఆ వీడియోలు డిలీట్ అవ్వడంతో ఆమె హ్యాకర్ల బారి నుంచి బయటపడ్డారని అనుకున్నారంతా. కానీ ఆమెను హ్యాకర్స్ వదలడం లేదు. 3.7 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్న ఆమె అధికారిక ఖాతా నుంచి తాజాగా హ్యాకర్లు మళ్ళీ అశ్లీల వీడియోలను స్టోరీస్ గా పోస్ట్ చేశారు. హ్యాకర్లు చేస్తున్న ఈ పని విష్ణుప్రియకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఎక్కడికెళ్లినా చిట్టి అనే పిలుస్తారు..ఆ పేరు విని ఎమోషన్ ఐన కార్ డ్రైవర్

జాతిరత్నాలు ఫేమ్ చిట్టి అలియాస్  ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా సంతోష్ శోభన్ సరసన లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీలో నటిస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 4 న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ టైములో మూవీ ప్రొమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆలీతో సరదాగా షోకి వచ్చి వీళ్ళిద్దరూ ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో విషయాలు చెప్పారు. ఫారియా మాట్లాడుతూ  " విజయ్ ఆంథోనీతో తమిళ్ లో ఒక చిత్రం, రవితేజతో రావణాసుర మూవీ, హిందీలో ఒక వెబ్ సిరీస్ , అటు తమిళనాడులో, ఇటు మహారాష్ట్రలో, ఇంకో వైపు మలయాళీ, బెంగాలీ అన్ని వైపులా నా నటన ప్రస్థానాన్ని విస్తరిస్తున్న.. నేను పుట్టింది హైదరాబాద్ లో. మా నాన్న ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. ఇంతకు ముందు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూసుకునేవారు. ఇంట్లో నేను, చెల్లి ఉంటాం. జాతిరత్నాలులో నా పేరు చిట్టి కదా..ఆ పేరుతోనే అందరూ పిలుస్తారు. ఒక రోజు నేను క్యాబ్ లో మాస్క్ వేసుకుని వచ్చేటప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ తన చిన్నప్పటి క్రష్ గురించి చెప్పాడు. ఆ పిల్ల పేరు కూడా చిట్టి అంట. అతను అలా చెప్పేసరికి నా పేరు కూడా చిట్టి అని చెప్పా. డ్రైవింగ్ చేస్తున్నవాడల్లా ఒక్కసారి వెనక్కి చూసి మీ పేరు చిట్టినా ఏ స్కూల్ అని అడిగాడు. నేను షాకయ్యా. తర్వాత అతను నాతో ఒక సెల్ఫీ తీసుకున్నాడు. జాతిరత్నాలు చేసాక ఆ బ్రేక్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ లో ఒక క్యారెక్టర్ చేశా, బంగార్రాజు లో ఒక సాంగ్ చేసాను. అలాగే ఎన్నో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసాను. అలాగే ఈవెంట్స్ కి ఆర్గనైజర్ గా కూడా చేసాను. బంగార్రాజులో పాట నాకు నచ్చింది. అందులోనూ నాగార్జున గారు ఉన్నారు అందుకే ఆ సాంగ్ చేసాను. " అంటూ ఫారియా అబ్దుల్లా  ఎన్నో విషయాలు చెప్పింది.

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది..మీరు అక్కడినుంచి వచ్చిన వాళ్లే కదా

జబర్దస్త్ వేదిక ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అసలు ఊరు పేరు తెలియని వాళ్ళని కూడా  సెలబ్రిటీస్ ని చేసేసింది.  ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ ఐన  జబర్దస్త్ ప్రోమో చూస్తే అందులో యాంకర్ రష్మీ, కమెడియన్ నూకరాజు చేసిన కామెంట్స్ చాలామందిని బాధపెట్టేలా ఉన్నాయి. వాళ్ళేదో డైలాగ్ చెప్పేసి ఫన్ క్రియేట్ చేయాలనుకున్నారు కానీ వర్కౌట్ అవలేదు. జబర్దస్త్ లేటెస్ట్  ప్రోమోలో నూకరాజు స్టేజి పైకి వచ్చి.. “ ఈ సోషల్ మీడియా నాకు అంటే చిరాకు వచ్చేస్తోందిరా.. ఎవరుపడితే వారు ఏవో వీడియోలు చేయడం, ఫేమస్ అయిపోవడం..” అనేసరికి  యాంకర్ రష్మీ అందుకుని .. “ఆ వెంటనే శ్రీదేవి డ్రామా షోకి వచ్చేయడం” అని పంచ్ వేసింది. ఐతే వీరి మాటలు కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉన్నా కూడా అది అందరి మీద నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే ఇటీవలి కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా  ఫేమ్ అయినవారిలో గాజువాక కండక్టర్ ఝాన్సీ, బంగారం, నెల్లూరు కవిత, భాను ఇలా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ స్టేజి క్రియేట్ చేసి ఫేమ్ ఇచ్చింది.  ఇక రష్మీ కామెంట్స్ విన్న నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. "ఎవరు పడితే వారు వీడియోలు చేయడం అని ఎగతాళిగా  మాట్లాడి చిన్నచూపు చూస్తున్న  మీరు కూడా ఒకప్పుడు ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే కదా...మీ స్కిట్ లో డైలాగ్స్ అలాంటి వారి  మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఇంకోసారి ఒళ్ళు దగ్గర  పెట్టుకొని  మాట్లాడండి  రష్మీ అండ్  నూకరాజు " అంటూ ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.

"ఊ" అంటే అర్ధం " ఉడతలు పట్టే శ్రీముఖి"

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో "నువ్వు, నేను ప్రేమ" సీరియల్ టీం ఇంకా "కలిసి ఉంటే కలదు సుఖం" టీమ్స్ వచ్చి పోటీ పడ్డాయి. ఇందులో నువ్వు, నేను ప్రేమ సీరియల్ టీం నుంచి విక్రమాదిత్యని స్టేజి మీదకు పిలిచింది శ్రీముఖి. ఇక అతనితో తెలుగు "అ, ఆ"లు బోర్డు మీద రాయిస్తుంది. అంతలో ఊ అక్షరం వచ్చేసరికి "ఊ అంటావా మావా" అనే పాటందుకుంది శ్రీముఖి. ఇంతలో ఎక్ష్ప్రెస్స్ హరి మధ్యలో వచ్చి "ఊ" అంటే ఏమిటి అని అడిగేసరికి " ఉడతలు పట్టే శ్రీముఖి" అని ఆన్సర్ ఇచ్చాడు విక్రమాదిత్య. ఆ మాటకు షాకైపోయింది శ్రీముఖి. ఇక సీరియల్ యాక్టర్ ప్రకాష్, యాంకర్ శ్రీముఖి అంతు చూడడానికి ఈ గ్యాప్ లో ఒకతన్ని ట్రెయిన్ చేసాను అంటూ ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు అవినాష్. ఇక కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విక్రమాదిత్య సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. "ఏంట్రా బాబు రోజు ఇంతమంది అందమైన హీరోలు వస్తుంటే మాలాంటి అందమైన అమ్మాయిలు ఏమైపోవాలి " అనే డైలాగ్ చెప్పింది శ్రీముఖి..."స్వామి మీకోసం ఒకటి చెప్పనా అంటూ పుష్పాలో " అమ్మీ అమ్మీ అనే సాంగ్ కి డాన్స్ చేసింది శ్రీముఖి. ఇలా ఈ రెండు టీమ్స్ నెక్స్ట్ వీక్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోయాయి.