హౌస్ లో స్నేక్ ఎవరు? లాడర్ ఎవరు?
బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎపిసోడ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ గా ప్రేక్షకులు భావిస్తారు. ఎందుకంటే నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ తో సరదగా గేమ్ ఆడిస్తూ, ఆటపట్టిస్తూ ఉంటాడు. కాగా కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ని డిసైడ్ చేస్తూ బిగ్ బాస్ ఒక స్నేక్ డాల్, లాడర్ ని పంపించాడు.
కాగా హౌస్ లో స్నేక్ ఎవరో అని నాగార్జున ఒక్కొక్కరిని చెప్పమన్నాడు. ఇక ఒక్కో కంటెస్టెంట్ తమ అభిప్రాయాలను చెప్పారు. రేవంత్, "తనవి పాము కళ్ళలా అనిపిస్తాయి సర్. అందుకే తనని స్నేక్ అని అనుకుంటున్నాను" అని వసంతి గురించి చెప్పాడు. దానికి నాగార్జున మాట్లాడుతూ, "అన్విత నీ కళ్ళు గుర్తుపట్టలేని రేవంత్, వసంతి కళ్ళు స్నేక్ కళ్ళలా ఉంటాయంటా" అని నాగార్జున సరదాగా చెప్పాడు. ఆ తర్వాత ఫైమా మట్లాడుతూ, "ఇనయా స్నేక్" అని అనగా, "ఇనయా కాటు వేసిందా" అని నాగార్జున అన్నాడు. "అవును సర్. ఇంకా ఆ మరకలు కూడా పోవట్లేదు " అని ఫైమా చెప్పింది. ఆ తర్వాత రాజ్ మాట్లాడుతూ, " ఆదిరెడ్డి స్నేక్ సర్. ఎందుకంటే తను మైక్ పగులగొట్టకపోతే మా గేమ్ లో మేము గెలిచేవాళ్ళం సర్ " అని చెప్పాడు.
ఆ తర్వాత నాగార్జున, రోహిత్ తో మాట్లాడుతూ, "తాళం తీయడానికి ఫెయిల్ అయినప్పుడు మెరీనా ఏం చెప్పింది" అని అనగా, "తాళం తీయడం రాదా? అంత ఈజీ, ఇంత సింపుల్ గా ఉంది అని అంది" అని రోహిత్ చెప్పగా, "అప్పుడు నువ్వు చెప్పాలి. నాకు నీ గుండె తాళం తీయడం వచ్చు. వేరే తాళం తీయరాదు అని చెప్పాలి" అని నాగార్జున అనగానే హౌస్ లో అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరిచారు. ఆ తర్వాత ఆదిరెడ్డిని నాగార్జున డ్యాన్స్ చేస్తూ వెళ్ళి కూర్చోమనగా, దిగు దిగు నాగన్న పాటకి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాడు. అది చూసి హౌస్ అంతా నవ్వులు పూసాయి.