Illu illalu pillalu : భాగ్యమే అసలు సూత్రధారి.. నర్మదకి తెలిసిన నిజం!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -280 లో.....ప్రేమ ఫొటోస్ గురించి ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసిందోనని కనుక్కోవడానికి తిరుపతిని భద్రవతి ఇంటికి పంపిస్తుంది నర్మద. మరొకవైపు ధీరజ్ వంక ఐశ్వర్య అలాగే చూస్తుంటే.. అది ప్రేమ చూసి కుళ్ళుకుంటుంది. ధీరజ్ ని డ్రింక్ చెయ్యమని ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటే నేను ప్రేమ వచ్చామురా మళ్ళీ సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి కదా వద్దని ధీరజ్ అంటాడు. మరొకవైపు ప్రేమని తన ఫ్రెండ్స్ డ్రింక్ చెయ్యమని ఫోర్స్ చేస్తుంటే వద్దని అంటుంది. ఆ తర్వాత తిరుపతి ఎదురింట్లోకి వెళ్ళగానే ఎందుకు వచ్చావని అందరు కోప్పడతారు. మొన్న ప్రేమ విషయంలో వాళ్లకు సపోర్ట్ చేసావ్.. అలాంటి వాడికి ఇక్కడ ఏం పని అని భద్రవతి కోప్పడుతుంది. రామరాజు బావ ప్రేమ అలా వేరొకరితో ఫొటోస్ లో ఉన్నా కూడా ప్రేమని ఒక్క మాట కూడ అనలేదు. మీరే అనవసరంగా వచ్చి గొడవ చేసారని తిరుపతి అంటాడు. అనవసరంగా ఏం రాలేదు.. ఆధారం తోనే వచ్చామని విశ్వ అంటాడు. అలాంటి గొడవకి వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి కదా అని తిరుపతి అంటాడు. మాకు వాళ్ళ వియ్యంకురాలు భాగ్యలక్ష్మి చెప్పిందని విశ్వ చెప్పగానే తిరుపతి షాక్ అవుతాడు.  ఆ తర్వాత నర్మద దగ్గరికి తిరుపతి వెళ్లి అక్కడ తెలుసుకున్న నిజం చెప్తాడు. దాంతో నర్మద కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమకి తన ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో మందు ఇస్తారు. ధీరజ్ తో ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే ప్రేమ చూడలేక కోపంగా ఐశ్వర్యని పక్కకి లాగి తను ధీరజ్ తో డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్ళను...

షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్ళాడు. ఇక హౌస్ లో షణ్ముఖ్ జశ్వంత్ కలిపిన పులిహోర మాములుగా లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఒక ప్రశ్న అడిగారు. "బిగ్ బాస్ లోకి మళ్ళీ పిలిస్తే వెళ్తారా" అని. అప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఇలా చెప్పాడు. "కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని కొన్ని పనులు చేయను అందులో బిగ్ బాస్ కి అవకాశం వచ్చినా వెళ్ళను. లేదు అస్సలు వెళ్ళను. మొదటిసారి నన్ను వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నేను బిగ్ బాస్ కి రాను అనే చెప్పాను. దాదాపు 7 మీటింగ్స్ అయ్యాయి వాళ్ళు చాలా కన్విన్స్ చేశారు.  బిగ్ బాస్ తర్వాత నాతోనే సినిమా అని కూడా అన్నారు. ఇక సినిమా అనే మాట వినేసరికి నేను వెళ్లాలనుకున్నాను. లేకపోతె వెళ్ళేవాడిని కాను. ఎందుకంటే నేను ఆ షోకి పర్ఫెక్ట్ కాదు అన్న విషయం నాకు తెలుసు. నేను ఎంటర్టైనర్ ని కాను. యాక్షన్, కట్ అంతే నాకు తెలుసు. ఇంకో సారి బిగ్ బాస్ అవకాశం వస్తే నేను వెళ్ళను. ఆ షో ఇంట్రావర్ట్స్ కి, యాక్టర్స్ కి కాదు. ఆ షో కంటిన్యుయస్ గా ఎంటర్టైన్ చేసేవాళ్లకు మాత్రమే. హౌస్ లో అన్ని రోజులూ ఎంటర్టైన్ చేయడం ఎవరూ చేయలేరు కూడా." అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఎదురయ్యింది. "బిగ్ బాస్ వరమా, శాపమా" అని అడిగారు. "బిగ్ బాస్ కి వెళ్లడమే రాంగ్ స్టెప్. అది నాకు వరమూ కాదు అలాగని శాపం అని చెప్పి నేను చేసినదాన్ని వేరే వాళ్ళ మీదకు తోసేయలేను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చూస్తే అక్కడ నా కోసం కాదు మిగతా వాళ్ళ కోసం గొడవ పడి రెచ్చిపోయాను. నాగ్ సర్ ని నేను ఎంత ఇష్టమో వీకెండ్స్ లో కనిపించేది. ఆయనతోనే నేను కొంచెం ఫన్నీగా ఉండేవాడిని. నేను బిగ్ బాస్ కి వెళ్లడం రిగ్రెట్ లా ఫీల్ కావట్లేదు దాని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. బిగ్ బాస్ కి ముందు నాకు ఏమీ తెలీదు. కానీ అక్కడికి వెళ్లొచ్చాక నన్ను నేను ఎలా ట్యూన్ చేసుకోవాలో తెలిసింది." అని బిగ్ బాస్ గురించి షణ్ముఖ్ జశ్వంత్ చెప్పుకొచ్చాడు.

ఇంట్లో హీరో శ్రీకాంత్  పరిస్థితి...ఊహ ఏం చెప్పిందంటే!

  సిల్వర్ స్క్రీన్ మీద శ్రీకాంత్ ఎంత అందాల నటుడో ఊహ కూడా అంత కంటే అందాల నటి. ఆమె అందం ఒక పక్కన ఆమె పిల్లికళ్ళు మరో పక్కన వెరసి ఆమెకు ఒకప్పుడు బాయ్ ఫాన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. "ఆమె" మూవీ ఊహ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ కూడా. ఆమె ఎన్నో మూవీస్ లో నటించారు. ఆమె పేరుతో వచ్చిన "ఊహ" మూవీ కూడా అప్పట్లో హిట్ కొట్టింది. అలాగే ఆమె "అమ్మ నాగమ్మ" అనే మూవీలో ఆ తర్వాత ఊహా చిత్రం అనే మూవీస్ లో నటించారు. ఇక శ్రీకాంత్ కూడా ఎన్నో మూవీస్ లో నటించాడు. "పెళ్ళిసందడి, మహాత్మా, కోట బొమ్మాలి, శంకర్ దాదా ఎంబిబిఎస్" ఇలాంటి ఎన్నో మూవీస్ లో నటించారు. ఇక రీసెంట్ గా ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 ప్రోమోలో కనిపించరు. రాగానే శ్రీకాంత్ శ్రీముఖితో డాన్స్ చేసాడు. "నాకే టెన్షన్ లేదు శ్రీముఖి నా పక్కన ఉందిగా అంతా తనే చూసుకుంటుంది" అన్నాడు. తర్వాత శ్రీకాంత్ కళ్ళకు గంతలు కట్టింది. కొంతమంది అమ్మాయిల్ని పెట్టింది. అలాగే హీరోయిన్ ఊహను స్టేజి మీదకు సైలెంట్ గా తీసుకొచ్చింది. "మీ అసలైన సౌందర్య లహరి ఎవరో టచ్ చేసి చెప్పాలి" అని శ్రీకాంత్ కి టాస్క్ ఇచ్చింది. "అది ఏదన్నా పొరపాటు జరిగితే ఇంటికి వెళ్ళాక చాలా ప్రాబ్లమ్ అవుతుంది" అన్నాడు. ఇక హోస్ట్ ప్రదీప్ చేతిని పట్టుకుని ఏయ్ ఏందయ్యా ఇది అన్నాడు శ్రీకాంత్ తర్వాత ఊహ చేతికున్న వ్వాచ్ పట్టుకుని పైకి లేపాడు. అలాగే ఆమెను హగ్ చేసుకున్నాడు. "ఒకవేళా ఆయన కనిపెట్టకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏమిటి" అంటూ శ్రీకాంత్ గురించి ఊహను అడిగింది శ్రీముఖి. "ఇంటికి వెళ్ళాక ఉండేది" అని చెప్పింది ఊహ. దాంతో శ్రీకాంత్ హెయిర్ సర్దుకున్నాడు. శ్రీముఖి గట్టిగా నవ్వింది.

శ్రీముఖి తనకు కాబోయే భర్త గురించి ఏమి చెప్పిదంటే?

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ అచ్చంగా #singles పేరుతో తీసుకొచ్చారు. ఇక ఇందులో గుప్పెడంత మనసు రిషి సర్, ఆరియానా, అన్షు రెడ్డి, రోహిణి, శ్రీకర్ కృష్ణ, అర్జున్ కళ్యాణ్, భానుశ్రీ వంటి వాళ్లంతా ఈ ఎపిసోడ్ లో  ఉన్నారు. అబ్బాయిలు తమకు ఎలాంటి అబ్బాయిలు కావాలో అమ్మాయిలు తమకు ఎలాంటి అబ్బాయిలో కావాలో చెప్పుకుంటూ ఉంటే బ్యాక్ స్క్రీన్ మీద వాళ్ళ వాళ్ళ ఫొటోస్ వస్తూ ఉన్నాయి. ఇక శ్రీముఖి తనకు కాబోయే అబ్బాయి ఎలా ఉండాలో చెప్పింది. "నాకన్నా హైట్ కొంచెం పెద్దగా ఉన్న అబ్బాయి కావాలి." ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఒక అబ్బాయి ఫోటో వచ్చింది. దాంతో శ్రీముఖి "గర్ల్స్ నాకు సిగ్గేస్తోంది. మీరు మీ బావను చూస్తున్నారా" అంటూ ముఖం అరచేతుల్లో దాచుకుని తెగ సిగ్గుపడిపోయింది. "ఈ మధ్య నేను కొంచెం స్పిరిట్యుయల్ ఐపోయాను. నాతో పాటు గిరి ప్రదక్షిణలు చేసేవాడు కావాలయ్యా. ఓ మై గాడ్ షో మీ మై పిల్లల డాడ్. రారా రాజా" అని తెగ అరుస్తూ సందడి చేసింది. ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఎక్స్ప్రెస్ హరి ఫుల్ ఫోటో పడింది. అంతే శ్రీముఖి, హరి, రోహిణి స్టేజి మీద ఉన్న వాళ్లంతా షాకయ్యారు. ఇక "బావొచ్చాడోయమ్మా బావొచ్చాడు" అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యింది. ఇక స్టేజి మీద నుంచి శ్రీముఖి పారిపోతూ కిందకి వచ్చేసింది. ఇక హరి అని తెలిసేసరికి శ్రీముఖి మళ్ళీ స్టేజి మీదకు వచ్చి ఏడుస్తూ కూర్చుంది. వెంటనే హరి పక్కకొచ్చి "అమ్మగారు నిజంగా మీ మనసులో నేనున్నానా" అని ఆశ్చర్యంతో అడిగాడు. దాంతో శ్రీముఖి ఇంకా గొంతు పెంచేసి "నాకు అన్యాయం జరిగిపోయిందక్కో" అంటూ శోకాండాలు పెట్టింది.

నేనొక బ్యాట్స్ మెన్ ని... క్రికెటర్ ని అయ్యేవాడిని...

  ఒకప్పుడు తరుణ్ అంటే చాలు ముందుగా గుర్తొచ్చే సినిమా ఆదిత్య 369 . అమ్రిష్ పురి, బాలకృష్ణ వంటి లెజెండ్స్ తో చిన్న వయసులోనే నటించేసాడు. ఆ తర్వాత యంగ్ ఏజ్ లోకి వచ్చింది "నువ్వే కావాలి" మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఎన్నో మూవీస్ చేసాడు. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ గా దూరమైపోయాడు. ఇక ఇన్నాళ్లకు పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు షోకి వచ్చాడు. అలాగే పూర్ణ పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది. ఆమె కూడా ఈ షోకి వచ్చింది. ఐతే ఆమె ఒక విషయం అడిగింది. "తరుణ్ గారు యాక్టర్ కాకపోయి ఉంటే ఎం అయ్యేవారు" అంటూ అడిగింది పూర్ణ. శ్రీముఖి కూడా అడిగింది. "తరుణ్ గారు మీరు హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అని పూర్ణ గారికి తెలుసుకోవాలని ఉంది" అని చెప్పింది. "అసలు హీరో అవ్వాలనే ఐడియానే లేదండి నాకు. నేను క్రికెటర్ ని అవుదామనుకున్నా. అనుకోకుండా ఈటీవీ వాళ్ళ ఉష కిరణ్ మూవీస్ నుంచి నువ్వే కావాలి మూవీ ఆఫర్ వచ్చింది. దాంతో క్రికెట్ వదిలేసి హీరో అయ్యాను." అని చెప్పాడు తరుణ్. ఇక ఈ షోకి ఆదితో కలిసి జంటగా వచ్చిన సౌమ్య ఐతే "సర్ మీరు క్రికెటర్ ఐతే మీరు బౌలింగ్ చేయకుండా ముందే అన్ని వికెట్స్ వదిలేస్తారు" అని చెప్పేసరికి "లేదండి నేను బ్యాట్స్ మెన్ ని" అని చెప్పాడు తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తరుణ్ నటించిన చిన్నపిల్లలా మూవీ అంజలి అప్పట్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో నటనకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు.

నేను యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాడిని 

పిఠాపురం కమిటీ కుర్రాళ్ళు పేరుతో ప్రసారమైన దసరా ఈవెంట్ అందరినీ అలరించింది. ఇందులో ఒక స్కిట్ చేశారు డ్రామా జూనియర్స్ లోని కొంతమంది పిల్లలు. ఆర్టిస్టులు కాకపోయి ఉంటే లైఫ్ లో ఇంకేం అయ్యేవాళ్ళు అంటూ.. అందులో ఒక కుర్రాడు ఆది పోస్టర్ వేసుకుని సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా వచ్చాడు. ఒక చిన్నారి పూర్ణ పోస్టర్ వేసుకుని డాన్స్ టీచర్ ల వచ్చింది. ఇంకో కుర్రాడు రాంప్రసాద్ పోస్టర్ తో మెడికల్ షాప్ ఓనర్ లా వచ్చాడు. ఇంకో చిన్నారి సుహాసిని పోస్టర్ తో డాక్టర్ డ్రెస్ లో వచ్చింది. ఇక శ్రీముఖి ఒక్కొక్కరి ప్రొఫెషన్ గురించి అడిగి తెలుసుకుంది. "ఒకవేళా ఇలా యాక్టర్ కాకపోయి ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యేవాళ్ళ" అని ఆదిని అడిగింది శ్రీముఖి. "అవును నేను బిటెక్ కంప్లీట్ చేసి ఒక రెండు నెలలు ట్రై చేసాను. వాళ్లేమో ఒక చోటే కూర్చోమన్నారు. నాకేమో ఒక చోట కూర్చోవడం ఇష్టం లేదు. ఇక్కడంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. కానీ అక్కడా అలా ఏమీ మాట్లాడలేనుగా" అన్నాడు. "సుహాసిని నువ్వు యాక్టర్ కాకపోయి ఉంటే డాక్టర్ అయ్యేదానివన్నమాట ఇలాగా" అని శ్రీముఖి అనేసరికి "అవును నాకు ఇంజక్షన్ చేయడం అంటే ఇష్టం" అని చెప్పింది. తర్వాత ఎంబిబిఎస్ అంటే ఏంటి అని శ్రీముఖి అడిగేసరికి చెప్పలేకపోయింది సుహాసిని. "మిస్టర్ రాంప్రసాద్ మీరేంటి మెడికల్ షాప్ ఏంటి" అని శ్రీముఖి అడిగేసరికి "నేను ఇండస్ట్రీలోకి రాకముందు మెడికల్ లో ఉండేవాడిని ఒక షాప్ కూడా ఉంది నాకు., ఇక్కడ చేస్తూ అక్కడ షాప్ చూసుకునేవాడిని. ఇక్కడ బాగుండేసరికి అది వదిలేసి వచ్చాను. చాలామంది ప్రాణాలు కాపాడాను" అని చెప్పాడు.  

ఆర్టిస్ట్ ని కాకపోయి ఉంటే టిప్పర్ లారీ డ్రైవర్ ని అయ్యేవాడిని

దసరా సందర్భంగా ప్రసారమైన పిఠాపురం కమిటీ కుర్రోళ్ళు షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో శ్రీముఖి ఒక సెగ్మెంట్ పెట్టింది. అదేంటంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఈ ప్రొఫెషన్ లో కాకుండా వేరే ప్రొఫెషన్ లో ఉండి ఉంటే ఎలా ఉంటుంది అనే లైన్ తో డ్రామా జూనియర్స్ లో పిల్లలంతా వచ్చి ఒక స్కిట్ వేశారు. అందులో రిషి అనే కుర్రాడు అమరదీప్ పోస్టర్ ని మెడలో వేసుకొచ్చి ఫన్ చేసాడు. "హాయ్ నా పేరే అమరదీప్ టిప్పర్ లారీ అమరదీప్..ఈ టైర్ లు ఏంటి ఇంత మరకగా ఉన్నాయి. ఏంటో నా బతుక్కి  నేనే ఓనర్ నేనే క్లీనర్" అని చెప్పి ఒక బొమ్మ టిప్పర్ లారీని తీసుకొచ్చాడు స్టేజి మీదకు. ఇక ఫైనల్ గా ఏంటి అమరదీప్ నువ్వు ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే టిప్పర్ లారీ తోలేవాడివా అంటూ శ్రీముఖి అడిగింది. "అవును బేసిక్ గా నాన్న ఆర్టీసీలో జాబ్ చేసేవారు. చిన్నప్పటినుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఫామిలీ పాస్ ఉండేది. ఆ స్టీరింగ్ చూసి చూసి నేను కూడా డ్రైవర్ ని ఐపోతా అని ఒకరోజు చెప్పా. ఆ మాటకు మా అమ్మ నన్ను గట్టిగ కొట్టింది. లేదంటే లారీ డ్రైవర్ ని అవుదామనుకున్నాను." అని చెప్పాడు. డ్రైవర్ అవుదామనుకున్నావ్ అలా ఇప్పుడు సినిమా హీరో ఇపోయావ్ అంటూ శ్రీముఖి పొగిడేసింది. ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చిన పూర్ణ ఐతే రిషిని బుగ్గ కొరికింది. అమరదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే హీరో రవితేజ వీరాభిమాని. ఇక బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు.

నిఖిల్ కి తప్ప ఎవరికైనా నేను ఒకే చెప్తాను

ఆదివారం విత్ స్టార్ మా పరివారం #singles కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో నిఖిల్ విజయేంద్ర సింహ వచ్చి కూర్చున్నాడు. వెనక స్క్రీన్ మీద ఒక అమ్మాయి బొమ్మ అలా వస్తూ ఉంటుంది. ఇక శ్రీముఖి "నిఖిల్ అమ్మాయిలో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ" అనేసరికి "కొంచెం హైట్ ఉండాలి.నా పార్టనర్ ఎంప్లొయ్ అయ్యి ఉండాలి " అని చెప్పాడు. "నిఖిల్ ఇదంతా నువ్వు అనుకుంటున్నావు చెప్తున్నావా లేదంటే ఎవరైనా ఆల్రెడీ ఉన్నారా" అని అడిగింది. వెంటనే నిఖిల్ "కత్తిలా ఉండాలబ్బా" అన్నాడు. ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఒక అమ్మాయి బొమ్మ వచ్చింది. "వాడి ఫీలింగ్ ఏంటో తెలుసా హమ్మయ్య నేను అనుకున్న ఫోటో రాలేదు" అనుకుంటున్నాడని శ్రీముఖి చెప్పింది. తర్వాత కావ్య తనకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పింది. "నాకన్నా హైట్ ఉండాలి. డ్రెస్ సెన్స్ బాగుండాలి..ఆ ఒక్కళ్ళు తప్ప వేరే ఎవరైనా కానీ ఒకే చెప్తాను " అని చెప్పింది. దాంతో బ్యాక్ స్క్రీన్ మీద నిఖిల్ విజయేంద్ర సింహ పిక్ వచ్చింది. "పేరులోనే ఆల్రెడీ" అని కావ్య అనేలోపు "మతలబు ఉందంటావా" అంటూ శ్రీముఖి అనేసింది. ఇక పరివారం షో మొదటి ప్రోమోలో ఐతే శ్రీముఖి కావ్య గురించి చెప్పుకొచ్చింది.." ఈ మధ్య కాలంలో కావ్య ఎక్స్క్లూజివ్ గా సింగల్ ఐపోయింది కాబట్టి" అనేసరికి "సింగల్ గా ఉండడం ఈ ఫేజ్ చూసిన తర్వాత ఇలా ఉండడమే బాగుంది" అని చెప్పింది కావ్య. దాంతో శ్రీముఖి "ఏయ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్ అని గూగుల్లో కొడితే కావ్య పేరే వస్తుంది" అంటూ మంచి జోష్ తో చెప్పుకొచ్చింది.

తండేల్ సినిమా రిలీజయ్యాక నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు

జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో విత్ జగపతి మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ కి కింగ్ నాగార్జున వస్తే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఆయన సుపుత్రుడు నాగ చైతన్య వచ్చాడు. "మహానటిలో నాగేశ్వరావు గారి క్యారెక్టర్ చేసావు కదా" అని జగపతి బాబు అడిగారు. " అబ్బా తాతగారికి ఏదో నా ట్రిబ్యూట్ ఇవాలనుకున్నా.. మంచి ఆపర్చ్యునిటీ రావడంతో చేసాను" అన్నాడు నాగచైతన్య. "మనం మీ నాన్నతో చేసావు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది" అని అడిగారు. " అమ్మో కష్టం" అన్నాడు చైతన్యు. "నీ లైఫ్ ని ఒక బుక్ టైటిల్ గా పెట్టాలంటే" అంటూ జగ్గు భాయ్ అడిగారు. "లైఫ్ లో ఫుల్ స్టాప్స్ పెట్టకూడదు..అలా కామాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి." అన్ని చెప్పాడు నాగ చైతన్య. "లవ్లీ, ఐ లవ్ ఇట్" అంటూ జగ్గు భాయ్ లేచి నాగచైతన్యను హగ్ చేసుకున్నాడు. "గొడవుల్లో కూడా అందం ఉంది" అనేసరికి "ఆ గొడవలు లేకపోతె ఆ రిలేషన్ షిప్ రియల్ కాదు. తండేల్ సినిమా రిలీజయ్యాక నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు" అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఈ తండేల్ మూవీతో నాగచైతన్య ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్ లో చేరాడు. చైతన్య కెరీర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి తెరకెక్కిన ఈ తండేల్ లవ్ స్టోరీ ఎంతోమంది ఆడియన్స్ మనసుల్ని దోచుకుంది.

తల్లి కాబోతున్న జ్యోతక్క...అందుకే ఇన్ని రోజులు చెప్పలేదు

బుల్లితెర మీద శివజ్యోతి అలియాస్ జ్యోతక్క ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. గంగులు, శివ జ్యోతి ఇద్దరూ కలిసి ఎన్నో టీవీ షోస్ లో కనిపిస్తూ ఉంటారు. జ్యోతక్క బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. అలాంటి శివ జ్యోతి రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పింది. ఆ విషయాన్నీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ఒక వీడియోని కూడా పోస్ట్ చేసింది. పిల్లలు ఆదుకునే ఒక స్కూటర్, ఒక జీప్ ని చూపిస్తూ గంగులు, జ్యోతి ఇద్దరూ కలిసి అమ్మాయి పుడతది అంటే కాదు అబ్బాయి పుడతాడు అంటూ పోట్లాడుకున్నారు. సరే చూసుకుందాం 2026 లో అంటూ సరదాగా ఫైట్ చేసుకున్నారు. "అందరికీ దసరా శుభాకాంక్షలు..ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో మాకు 2026 లో బిడ్డ పుట్టబోతోంది. మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు నాకు కావలిసినవాళ్లు.  సొంత అక్క బావకి బిడ్డ పుట్టాలి అని  గట్టిగా కోరుకున్నారు ..ఇట్ల బిడ్డ  అస్తుంది అని చెప్పగానే మా వాళ్ళు ఇచ్చిన రియాక్షన్  నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోను. మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్  అయితరు అనుకుంటున్న అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట ..దిష్టి పెట్టకండి. దీవెనలు ఇవ్వండి. దిష్టి కన్నా దీవెనే గొప్పది అని ప్రూవ్  చేద్దాం. ఈ బ్యూటిఫుల్ జర్నీలో సపోర్ట్  చేసినోళ్లను నా సపోర్ట్ గా ఉన్నళ్లోను లైఫ్  లాంగ్  మర్చిపోను. అలాగే  బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను .. థ్యాంక్యూ మీ లవ్ , సపోర్ట్ కి అండ్  బ్లెస్సింగ్స్  ఎప్పుడూ ఉండాలి నాకు, మా ఫ్యామిలీకి, స్పెషల్  గా మా ఈ చిన్న బేబీకి" అంటూ పోస్ట్ చేసింది. ఇక ప్రియాంక జైన్, రవికృష్ణ, సుప్రీతా, మహిశివన్, అనిల్ గీలా, సిరి హన్మంత్, నాగదుర్గా, అంజలి తోట, వింధ్య విశాఖ, అన్షు రెడ్డి, హరితాజాకి, రోహిణి ఇలా అందరూ విషెస్ చెప్తున్నారు.

Bigg boss 9 telugu: కంటెండర్స్ గా ఆ నలుగురు.. వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ!

  బిగ్ బాస్ సీజన్-9 లో నాలుగో వారం టాస్క్ లతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. అయితే పవర్ కార్డ్స్  ని పొందే క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్, ఎమోషనల్ స్టోరీస్ జరిగాయి. నిన్నటి గురువారం నాటి ఎపిసోడ్ లో మొదటగా ఆడిన టాస్క్ లలో గెలిచి పవర్ కార్డ్స్ పొందిన రెడ్ టీమ్ కి బిగ్ బాస్ అభినందించాడు. ఆ తర్వాత మిగిలిన వారిలో నుండి కంటెండర్స్ గా సెలెక్ట్ చేయడం కోసం రెడ్ టీమ్ ని  టీమ్ లుగా  చేయమన్నాడు బిగ్ బాస్. దాంతో కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ కలిసి టీమ్ లు చేశారు. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రాము.. ఇలా టీమ్స్‌ని ఏర్పాటు చేశారు. గేమ్ ఏంటంటే.. స్టార్ట్ బజర్ మోగగానే ఒక జంట వచ్చి ఎల్లో లైన్ స్టార్ట్ పాయింట్ నుంచి తాళ్లతో కూడిన ఆ ఉచ్చు లోపలికి వెళ్లి దాని నుంచి బయటికొచ్చి టైర్స్ లోపల తమ అడుగులు ఉండేలా నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న ఉడెన్ ప్లాంక్స్‌ని దాటి బోన్‌ని తీసుకోవాలి.. ఎవరైతే ముందుగా ఆ బోన్‌ని తీసుకుంటారో వారు ఆ రౌండ్ విజేతలవుతారు.. అలానే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు..మీరు ఉడెన్ ప్లాంక్స్ దాటే సమయంలో మీ కాళ్లు ఉడెన్ ప్లాంక్స్ మధ్య ఉండేలా చూసుకోవాలి.. తాళ్ల కింద నుంచి పాకుతూనే వెళ్లాలంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. సుమన్ శెట్టి-తనూజ మొదటగా టాస్క్ ఆడారు. అయితే సుమన్ శెట్టి టైర్ లోపలి నుంచి బయట కాలు పెట్టడంతో మధ్యలోనే డిస్‌క్వాలిఫై అయిపోయాడు. అయితే తనూజ కూడా ఉడెన్ ప్లాంక్స్ అన్నింటి మధ్యలో నుంచి వెళ్లలేదని ఇమ్మూ డిస్‌క్వాలిఫై చేశాడు. దీంతో వీళ్లిద్దరి నుంచి ఎవరూ కంటెండర్‌ కాలేకపోయారు. దీనికి హర్ట్ అయిన తనూజ వాష్‌రూమ్‌కి వెళ్లి తలుపేసుకుంది. దీంతో రీతూ-డీమాన్ వెనకాలే వెళ్లి.,. రా బయటికి.. ప్లీజ్ తనూజ రా ఒకసారి రా.. ఒక్కసారి తియ్ ప్లీజ్ ఒక్కసారి తీయవా.. డోర్ తీయవా..నేను వస్తా లోపలికి.. అంటూ రీతూ బ్రతిమాలింది. తనూజ చూడు తనూజ.. గేమ్ మానేసి వచ్చేసింది. నీ గురించి.. అంటూ డీమాన్ కూడా రిక్వెస్ట్ చేశాడు. దీంతో తనూజ డోర్ ఓపెన్ చేయగానే రీతూ లోపలికి వెళ్లి డోర్ వేసింది. ఇద్దరూ లోపల ఏడుస్తూ కూర్చున్నారు. బయట ఉన్న డీమాన్.. త్వరగా రండి మీరు.. అంటూ బతిమాలాడు. ఎంత కష్టపడి ఆడాను.. డిస్‌క్వాలిఫై అని అంత ఈజీగా చెప్పేశారు.. కష్టపడే కదా ఆడాం.. ఈజీగా చెప్పేస్తారు.. దాన్ని కన్సిడర్ చేయకుండా డిస్‌క్వాలిఫై అంటే ఎలా ఉంటుంది చెప్పు.. అంటూ లోపల తనూజ ఏడ్చింది. సరే ఏం కాదు అయిపోయింది కదా తనూజ.. స్టే స్ట్రాంగ్.. రీతూ రండి బయటికి.. అంటూ డీమాన్ పిలిచాడు. వద్దు నేను రాను.. నేను ఇప్పుడు రాను ప్లీజ్.. అంటూ రీతూతో చెప్పింది తనూజ. నువ్వు రాకపోతే నేను వెళ్లను ప్లీజ్ రా.. అని రీతూ పట్టుపట్టడంతో ఇద్దరూ బయటికి వచ్చారు. ఏం మాట్లాడకండి కామ్‌గా ఉండండి కాసేపు .. అంటూ సలహా ఇచ్చాడు డీమాన్.  ఆ తర్వాత సంజన-రాము మధ్య ఇదే ఛాలెంజ్ పెట్టగా రాము గెలిచి కంటెండర్ అయ్యాడు. చివరగా ఫ్లోరా-రీతూ మధ్య పోటీలో రీతూ గెలిచి కంటెండర్‌ అయింది. దీంతో ఓవరాల్‌గా కళ్యాణ్, ఇమ్మూ, రాము, రీతూ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. ఇక శుక్రవారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో వీరికి టాస్క్ పెట్టి కెప్టెన్ ఎవరో డిసైడ్ చేస్తారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

Bigg boss 9 telugu: పవర్ కార్డ్స్ కోసం వేట.. సుమన్ శెట్టికి సంజన అన్యాయం!

  బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం నుండి కెప్టెన్సీ టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా పవర్ కార్డ్స్ ని కంటెస్టెంట్స్ పొందాలి వారికి బెనిఫిట్స్ ఉంటాయంటూ బిగ్ బాస్ చెప్పాడు.  పవర్ కార్డ్స్ పొందడం కోసం బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ హంగ్రీ హిప్పో. గార్డెన్ ఏరియాలో బాగా ఆకలితో ఉన్న ఒక హిప్పో ఉంది.. దానికి సమయానుసారం ఆకలి వేసినప్పుడల్లా సౌండ్ చేస్తూ ఉంటుంది.. ఆ సమయంలో హౌస్‌లో ఉన్న వేరు వేరు ప్రదేశాల్లో ఆ హిప్పో ఆకలి తీర్చడానికి కావాల్సిన బాల్స్ దొరుకుతాయి.. హిప్పో సౌండ్ చేసినప్పుడల్లా పోటీదారులు హౌస్‌లో వేరు వేరు ఏరియాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న బాల్స్‌‌ని వెతికి వాటిని తీసుకొచ్చి హిప్పో నోటిలో వేసి ఆహారంగా తినిపించాలి.. ఈ ఛాలెంజ్ ముగిసే సమయానికి ఏ టీమ్ సభ్యులైతే హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేసి దాని ఆకలి తీరుస్తారో ఆ టీమ్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతలు అవుతారు.. వారికి నచ్చిన ఒక పవర్ కార్డ్‌ని పొందుతారు. ఈ ఛాలెంజ్‌లో పోటీదారులు తాము తీసుకున్న బాల్‌ని విసరడానికి వీల్లేదు.. తీసుకున్న బాల్స్‌ని కేవలం మీ చేతులతోనే మీ ఇతర టీమ్ సభ్యులకి పాస్ చేయాల్సి ఉంటుంది.. హిప్పో సౌండ్ చేసినప్పుడల్లా కేవలం ఒక బాల్ మాత్రమే లభిస్తుంది.. పోటీదారులు బాల్ తీసుకొని ఆరెంజ్ లైన్ దాటిని తర్వాత ఆ బాల్స్‌ని ఎవరూ తాకడానికి వీల్లేదు.. ఈ ఛాలెంజ్‌కి భరణి మీరు సంచాలకులాంటూ బిగ్‌బాస్ చెప్పాడు.  బ్లూ టీమ్ (తనూజ, రీతూ, హరీష్), ఎల్లో టీమ్ (సంజన, రాము, సుమన్ శెట్టి), రెడ్ టీమ్ (ఇమ్మూ, కళ్యాణ్, ఫ్లోరా) లు ఈ ఛాలెంజ్‌లో బరిలోకి దిగాయి. గ్రీన్ టీమ్ రేసు నుంచి కిక్ ఔట్ అవ్వడంతో తప్పుకుంది. అయితే ఈ టాస్క్ లో ఎల్లో టీమ్ లో ఉన్న సంజన వారికి సపోర్ట్ చేయకుండా రెడ్ టీమ్ కి సపోర్ట్ చేసింది. దాంతో సుమన్ శెట్టి ఎందుకు మేడమ్ అలా అని అడిగాడు. దానికి సంజన చెప్పిన సమాధానం విని సుమన్ శెట్టికి ఏం చేయాలో అర్థం కాలేదు. మన టీమ్ కంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారని, మనం ఎలాగు గెలవలేం కదా అని అంది. ఒకే కానీ మన టీమ్ కూడా గెలవాలి కదా.. అందరు మన వాళ్ళే కానీ  ఈ గేమ్ వరకు మనం ఎల్లో టీమ్.. మనం గెలవాలి మేడమ్ అంటు సంజనకి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ తను అసలు వినలేదు. సుమన్ శెట్టి టాస్క్ లో బాగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. 

Jayam serial :  గంగ లేదని వెతికిన ఇంట్లో వాళ్ళు.. తనని చూసి రుద్ర షాక్!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -73 లో... రుద్రని పార్క్ దగ్గరికి రమ్మని  స్వీటీలాగా లొకేషన్ పెడుతుంది గంగ. దాంతో  గంగ పంపిన లొకేషన్ కి వెళ్తాడు రుద్ర‌. అప్పటికే గంగ నర్స్ గెటప్ లో రెడీగా ఉంటుంది. ఇక రుద్ర తన దగ్గరికి రాగానే యాక్టింగ్ షురూ చేస్తుంది.  ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు, తనకి బోలెడన్ని కష్టాలంటూ చెప్తుంది. అసలేం జరిగిందని రుద్ర అడుగుతాడు. ఒకడు తనని ఏడ్పించాడని గంగ చెప్తుంది. వాడు ఎక్కడున్నాడని అడుగగా.. ఇక్కడే పార్క్ లోనే ఉంటాడని చెప్పాడంటూ గంగ అంటుంది. ఇక వాడి కోసం రుద్రని పార్క్ అంతా తిప్పుతుంది గంగ. ఎక్కడున్నాడఝటూ రుద్ర విసుక్కుంటాడు‌. అప్పుడే గంగ ఫ్రెండ్ అయిన ఒక బోండం గాడిని చూపిస్తుంది. ‌వాడిని చూసిన రుద్ర.. నిజంగా ఇతను నిన్ను ఏడ్పించాడా అని అడుగుతాడు. అవును.. వీడే అని గంగ అంటుంది. ఇక రుద్ర వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు.  ఇక రుద్రకి గంగ  థాంక్స్ చెప్తుంది. అతను వెళ్ళిపోగానే గంగ పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో పారు జాగింగ్ చేస్తూ గంగని డ్యాష్ ఇస్తుంది. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక అప్పుడే రుద్ర కార్ లో ఉన్న చాక్లెట్లు చూసి పాపకి ఇవ్వాలని అనుకుంటాడు. ఇక వెంటనే ఆ చాక్లెట్ల కవర్ తీసుకొని గంగకి ఇవ్వడానికి బయల్దేరి వెళ్తాడు. అప్పటికే గొడవ జరిగి అందరు ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్తారు. ఇక రుద్ర వచ్చి గంగకి చాక్లెట్లు ఇచ్చి.. పాపకి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు పెద్దసారు ఇంట్లో గంగ కోసం వెతికి టెన్షన్ పడుతుంటాడు. రుద్రకి కాల్ చేసి గంగ కనపడటం లేదని చెప్తాడు. దాంతో రుద్ర కంగారుగా బయల్దేరి వెళ్తాడు. కాసేపటికి రుద్ర ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఇంట్లోని వాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు. గంగ కోసం ఇళ్ళంతా వెతికామని చెప్తారు. ఇక అప్పుడే గంగ ఒక బూజుకర్ర పట్టుకొని ఇల్లు క్లీన్ చేసినట్టు నటిస్తూ వస్తుంది. గంగని చూసి అందరు షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్ళావ్.. ఇంట్లోని వాళ్ళంతా నీకోసం వెతికారని గంగపై పెద్దసారు, రుద్ర కోప్పడతారు. స్టోర్ రూమ్ కి వెళ్ళానంటూ గంగ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : డాక్టర్ ని కలవకుండా ఆపిన రాజ్.. కళ్యాణ్ నిజం చెప్తాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -841 లో... డాక్టర్ ని కలవడానికి కావ్య వెళ్తుంది. అయితే ఆ విషయం తెలుసుకున్న రాజ్ డాక్టర్ దగ్గర ఉండే నర్స్ కి కాల్ చేసి ఒక పది నిమిషాలు మేనేజ్ చేయ్.. నేను చూసుకుంటానని చెప్తాడు. దాంతో నర్స్ .. కావ్యని డాక్టర్ దగ్గరికి పంపకుండా వేరేవాళ్ళని పంపిస్తుంది. ఇక నర్స్ ని డాక్టర్ పిలిచి కావ్యని పంపించమని చెప్తుంది. బయట ఇతర పేషెంట్స్ ఉన్నారని తను వాష్ రూమ్ కి వెళ్ళిందని చెప్తుంది. ఇక బయటకి వచ్చిన నర్స్ ని కావ్య నిలదీస్తుంది.  అందరిని లోపలికి పంపుతున్నారు.. నన్న ఆపుతున్నారేంటని నర్స్ ని కావ్య  అడుగగా.. వాళ్ళు వెళ్ళాక వెళ్ళండి అని తను చెప్తుంది.  ఇక రాజ్ పటాన్ చెరు దగ్గర్లో ఉన్నానని నర్స్ తో అనగానే.. డాక్టర్ గారి అత్తగారిల్లు అక్కడే అని చెప్తుంది. దాంతో ఆ అడ్రెస్ తీసుకొని అక్కడికి వెళ్తాడు రాజ్. అక్కడికి వెళ్ళి డాక్టర్ గురించి నెగెటివ్ గా చెప్తాడు రాజ్. మీ కోడలికి మీరంటే భయం లేదు.. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా అదే అనుకుంటున్నారని అనగానే.. అదేం లేదని డాక్టర్ గారి అత్త అంటుంది. మరి నిరూపించండి అని రాజ్ అనగానే.. తను డాక్టర్ కి వీడియో కాల్ చేస్తుంది. దొంగ వచ్చాడు.. నన్ను కట్టేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడని డాక్టర్ తో తన అత్త చెప్తుంది.  అది విని డాక్టర్ వెంటనే బయల్దేరి ఇంటికి వెళ్తుంది. ఇక డాక్టర్ తో సరిగ్గా కావ్య మాట్లాడే సమయానికే ఫోన్ రావడంతో తను వెళ్ళిపోతుంది. దాంతో కావ్య డిస్సప్పాయింట్ అవుతుంది. ఇంటికి వెళ్తుంది. మరోవైపు కళ్యాణ్ తైలం తీసుకొని ఇంటికొచ్చి ఇందిరాదేవికి ఇస్తాడు. దాంతో ఇందిరాదేవి షాక్ అవుతుంది. నేను రాజ్ కి చెప్తే నువ్వు తీసుకొచ్చావేంటని ఇందిరాదేవి అడుగుతుంది. అన్నయ్యకి ఏదో పని ఉందంటూ వెళ్ళాడని కళ్యాణ్ చెప్తాడు. నాకు తైలం తీసుకురావడానికన్నా వాడికి ముఖ్యమైన పని ఏంటని ఇందిరాదేవి అంటుంది. అప్పటికే కావ్య ఉంటుంది. తనని చూసిన కళ్యాణ్.. ఏంటి వదిన డాక్టర్ ని కలవలేదు కదా అని అడుగుతాడు. అదేంటి నేను హాస్పిటల్ కి వెళ్ళానని నీకెలా తెలుసని కావ్య అడుగుతుంది.  దాంతో కళ్యాణ్ షాక్ అయి.. వెంటనే స్వప్న వదిన చెప్పిందని చెప్తాడు. హాస్పిటల్ కి అయితే అక్క చెప్పిందని అనుకుందాం.. కానీ నేను డాక్టర్ ని కలవలేదని నీకెలా తెలుసు.. నేను ఇంకా ఎవరికి చెప్పలేదు కదా అని నీకెలా తెలుసని కావ్య అంటుంది.  దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : బ్యాచిలర్ పార్టీలో ధీరజ్ కి దగ్గరగా ఐశ్వర్య.. ప్రేమ ఏం చేయనుంది

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -279 లో.. ప్రేమ బ్యాచిలర్ పార్టీ కోసం ఏం డ్రెస్ వేసుకోవాలో ఆలోచిస్తుంటే.. నర్మద వేదవతి వచ్చి డ్రెస్ సెలక్ట్ చెయ్యడం హెల్ప్ చేస్తానని అంటారు. ప్రేమ వెస్టన్ వేసుకుంటే వేదవతి వద్దని అంటుంది. లంగావోణి వేదవతి సెలక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ లంగావోణి వేసుకొని వస్తుంది. ప్రేమని ఆ డ్రెస్ లో చూసి ధీరజ్ షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉండిపోతాడు.. నేను ఎలా ఉన్నానని ప్రేమ అనగానే బాగున్నావని ధీరజ్ అంటాడు. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అదంతా నర్మద చూసి మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. ఆ తర్వాత అసలు ప్రేమ ఫోటోస్ గురించి ఎదురింట్లో ఎలా తెలిసిందని నర్మద ఆలోచనలో పడుతుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తారు. అందరు అక్కడ ధీరజ్ ని ఆటపట్టిస్తారు. ఐశ్వర్య వచ్చిందని ధీరజ్ ఫ్రెండ్స్ తనకి చెప్తారు. ఐశ్వర్య వచ్చి ధీరజ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే ప్రేమ కోపంగా.. ధీరజ్ చెయ్ పట్టుకుంటుంది. ఎవరు ఆవిడా అని ఐశ్వర్య అనగానే.. నా భార్య అని ధీరజ్ చెప్తాడు. అయిన వినకుండా ధీరజ్ కి దగ్గరగా ఉంటే ప్రేమ కోపంగా దూరంగా వస్తుంది. మరొకవైపు ప్రేమ ఫోటోస్ గురించి ఎదురింట్లో ఎలా తెలిసిందో కనుక్కోడానికి తిరుపతి హెల్ప్ తీసుకుంటుంది నర్మద. తరువాయి భాగంలో ధీరజ్ తో ప్రేమ డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: చెక్ ఇచ్చినా తీసుకొని కార్తీక్.. కుటుంబమంతా షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -478 లో..... జ్యోత్స్నకి శ్రీధర్ చెక్ ఇచ్చి నా కొడుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్ అంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. కార్తీక్ చెక్ తీసుకొని శ్రీధర్ కి ఇచ్చి.. నాకు ఇలా ఇష్టం ఉండదు.. ఎవరి సాయం వద్దని కార్తీక్ ఖచ్చితంగా చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతాడు.... ఎందుకురా.. నువ్వు ఇలా డ్రైవర్ గా ఉండడం నాకు ఇష్టం లేదు.. సాయం చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావని కార్తీక్ పై శ్రీధర్ కోప్పడుతాడు. కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. అసలు కార్తీక్ ఎందుకిలా ఛాన్స్ వచ్చిన వాడుకోట్లేదు.. మనసులో ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని సుమిత్ర అంటుంది. నీతో మాట్లాడాలి దీప అని శ్రీధర్ బయటకు పిలుస్తాడు. అసలు కార్తీక్ ఎందుకు వద్దని అంటున్నాడు.. కారణం చెప్పమని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. నాకు తెలియదని దీప అంటుంది. మీరు తననే అడగండి అని దీప అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కొడుకు నిజం చెప్పడు.. కోడలు నిజం చెప్పదని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్నకి శివన్ననారాయణ రెస్టారెంట్ గురించి టైమ్ ఇస్తాడు. దాని గురించి కనుక్కుంటాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

తనూజ లవ్ స్టోరీ రివీల్.. టాస్క్ లో గెలిచిందెవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ జోరుగా సాగుతోంది. నిన్నటిదాకా వీళ్ళేం ఆడుతారులే అనుకున్న కంటెస్టెంట్స్ అదరగొడుతున్నారు.. ఇక అందరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న మరికొందరు కెప్టెన్సీలో అంతగా ఆకట్టుకోవడం లేదు. బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, గ్రీన్ టీమ్ అంటూ నాలుగు టీమ్ లుగా బిగ్ బాస్ విడదీశాడు. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ రేస్ నుంటి మొదటగా తనూజ అవుట్ అవ్వగా.. ఎపిసోడ్ చివర్లో గ్రీన్ టీమ్ తప్పుకుంది. గ్రీన్ టీమ్ లోని దమ్ము శ్రీజ, భరణి, సంజన కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నారు. ఇక ఈ టాస్క్ ల మధ్యలో హౌస్ మేట్స్ అంతా సరదగా మాట్లాడుకున్నారు. రీతూ, తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల, దమ్ము శ్రీజలు కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో తనూజకి ట్రూత్ అని రావడంతో.. నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి.. ట్రూత్ అన్నారు కాబట్టి నిజమే చెప్పాలి.. అబద్దం చెప్తే దూరం అయిపోతారని ఇమ్మాన్యుయల్ అన్నాడు. దాంతో తనూజ.. హృతిక్ రోషన్ అని చెప్పింది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల వంతు రావడంతో.. ఈ హౌస్‌లో లవ్ చేయొచ్చని అనిపించే వాళ్లు ఎవరున్నారని ఇమ్మాన్యుయల్ అడిగాడు. తనూజ అని కళ్యాణ్ చెప్పాడు. తర్వాత మళ్లీ తనూజకి ట్రూత్ రావడంతో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పమని ఇమ్మాన్యుయల్, శ్రీజ అడిగారు. దాంతో తనూజ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. నా ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలో మొదలైంది. అతని పేరు కళ్యాణ్ అని చెప్పింది. ఆ మాట వినగానే కళ్యాణ్.. ఆహా అంటూ తెగ ఫీల్ అయిపోయాడు.  డ్యాన్స్ క్లాస్‌లో నా ఫస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. నాకు డైరెక్ట్‌గా గ్రీటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నాకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతనే. తను చాలా మంచోడు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అది చాలా క్యూట్ లవ్ స్టోరీ.. బట్ వన్ సైడ్ లవ్ స్టోరీ తనకి. తను ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నాడు. తనకి పెళ్లైపోయిందంటూ తన ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పింది తనూజ. ఆ తర్వాత మళ్లీ డేర్ రావడంతో.. కళ్యాణ్‌ పడాలతో కలిసి స్టెప్‌లు వేసింది తనూజ. ఇలా ఎపిసోడ్ ఫన్ అండ్ టాస్క్ లతో గడిచింది. ఈ ఎపిసోడ్ లో తనూజ చెప్పిన లవ్ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

 కెప్టెన్సీ రేస్ నుండి తనూజ అవుట్.. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్!

బిగ్‌బాస్ సీజన్ -9 నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ సహా లగ్జరీ ఫుడ్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్కులు పెట్టాడు. ఇందులో భాగంగా సభ్యులందరినీ మళ్లీ నాలుగు టీములుగా డివైడ్ చేసి టాస్కులు పెట్టాడు. ఇందులో గెలిచిన టీమ్ నుంచే కెప్టెన్సీ కంటెండర్‌షిప్ సహా కొన్ని పవర్ కార్డ్స్ లభించనున్నాయి. నిన్న జరిగిన టాస్కు అయితే గట్టిగానే జరిగింది. కెప్టెన్ డీమాన్ పవన్‌ని మళ్లీ సంచాలక్‌గా పెట్టి నాలుగు టీములుగా 12 మందిని డివైడ్ చేశాడు. హరీష్, తనూజ, రీతూ చౌదరి (బ్లూ టీమ్), ఇమ్మానుయేల్, ఫ్లోరా, కళ్యాణ్ (రెడ్ టీమ్), సంజన, రాము, సుమన్ శెట్టి (ఎల్లో టీమ్), శ్రీజ, దివ్య, భరణి (గ్రీన్ టీమ్)‌.. ఇలా నాలుగు టీములు టాస్కులో పోటీ పడ్డాయి. స్టార్ట్ బజర్ మోగగానే టీమ్ లీడర్స్ సమయానుసారం చెప్పిన కలర్ బాల్స్‌ని ఆ నెట్ నుంచి బయటికి తీయాలి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. వెంటనే బ్లూ అని బిగ్‌బాస్ చెప్పాడు.. దీంతో బ్లూ బాల్ అందుకోవడానికి టీమ్స్ అన్నీ తెగ తన్నుకున్నాయి. ఈ టాస్కులో రెడ్ టీమ్ సత్తా చాటింది. కెప్టెన్సీ కంటెండర్ షిప్ మాత్రమే కాదు లగ్జరీ ఐటెమ్ మరెన్నో ప్రయోజనాలు పవర్ కార్డ్స్ ద్వారా లభిస్తుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అందులో కంటెండర్, కిక్ ఔట్, మటన్, లగ్జరీ ఫుడ్.. అని నాలుగు కార్డ్స్ ఉన్నాయి. కంటెండర్ కార్డ్ తీసుకుంటే తమ టీమ్ నుంచి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట, కిక్ ఔట్ కార్డ్ పొందిన వారు వాళ్లకి నచ్చిన టీమ్‌ని రేసు నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. అలానే మటన్, లగ్జరీ ఫుడ్ కార్డ్స్ గెలిస్తే ఆయా సదుపాయాలు వస్తాయి. టాస్కులో భాగంగా కొంతమంది ప్లేయర్ల మధ్య ఫిజికల్ ఫైట్ అయింది. బ్లూ టీమ్‌లో ఉన్న తనూజ తనని మూతి మీద కొడుతున్నాడు.. అంటూ కళ్యాణ్ మీద కంప్లెయింట్ చేసింది. కావాలని కొట్టరు కదమ్మా.. అని ఇమ్మూ అంటే చేయి తగలడం డిఫరెంట్ ఇలా అనుకొని వెళ్లడం డిఫరెంట్ అంటూ ఎలా కొట్టాడో తనూజ చూపించింది‌. మరోవైపు తమ బాస్కెట్‌లో ఉన్న బాల్‌ని తీయడానికి ట్రై చేసిన రీతూపై ఫైర్ అయ్యాడు కళ్యాణ్. బ్రో పెట్టు అక్కడ అంటూ రీతూకి చెప్పాడు కళ్యాణ్. తర్వాత తనూజ-కళ్యాణ్ మధ్య కూడా గొడవ జరిగింది. ఇక ఏ టీమ్ కారణంగా బ్లాక్ బాల్ బయటికొచ్చిందని మీరు అనుకుంటున్నారో ఆ టీమ్ నుంచి ఒకర్ని తప్పించండి అంటూ  డీమాన్‌కి బిగ్ బాస్ చెప్పాడు. దీంతో తనూజ నువ్వు ఎలిమినేట్ అంటూ డీమాన్ అన్నాడు. అయితే కీ ప్లేయర్లని పంపించాలి.. సపోర్టర్స్‌ని పంపించడానికి లేదంటూ డీమాన్‌తో పవన్ కళ్యాణ్ గొడవపడ్డాడు. డీమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్టో కామెంట్ చేయండి.

మరో కథతో రుద్ర ముందుకు వెళ్ళిన గంగ.. తనకి దగ్గరవ్వగలదా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రుద్రకి గంగ వేరే నెంబర్ నుండి స్వీటీలాగా ఫోన్ చేస్తుంది.‌ రుద్రకి స్వీటి ఫోన్ చేసి సాయం కావాలని అడుగుతుంది. ‌ఇక‌ కాసేపు సోది‌ పెడుతు రుద్రని విసిగిస్తుంది. మరోవైపు రుద్ర ప్రేమించిన పారు ఒంటరిగా కుర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళ అన్న ఒక వరుడి ఫోటోని తీసుకొచ్చి.. నువ్వు ఒప్పుకుంటే ఇతనితో నీ ఎంగేజ్ మెంట్ అని అంటాడు. దానికి పారు ఒప్పుకోదు. అతను కాబోయే కిక్ బాక్సింగ్ చాంపియన్. ‌ అతని కోసం స్పాన్సర్స్ క్యూలో నిల్చుంటున్నారని పారుతో వాళ్ళ అన్నయ్య చెప్పగానే.. కాబోయే ఛాంపియన్ నాకు వద్దు.. సక్సెస్ అయినవాడే కావాలి.. ఆ రుద్రని మించిన కిక్ బాక్సర్ లేడు.. కానీ అతడి దురదృష్టం ఒక్క రోజులో పతనం చేసింది. నాకు సమాజంలో గుర్తింపు, పేరు ఉన్నవాడే కావాలని పారు అనగానే అలాగే చెల్లెమ్మ..‌ నువ్వు ఎలా అంటే అలానే అని అతను అంటాడు. మరోవైపు గంగ స్వీటీలా రుద్రకి దగ్గరవ్వాలనుకుంటుంది. అందుకే తను ఆపదలో ఉన్నట్టు వంశీతో యాక్ట్ చేపిస్తుంది. రుద్రకి గంగ కాల్ చేసి నిజంగానే తను ఆపదలో ఉన్నట్టుగా.. వంశీ ఒక రౌడీలా గంగని బెదిరిస్తాడు. ఇక అది నిజమే అనుకున్న రుద్ర కంగారుగా ఆ లొకేషన్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ నెంబర్ కాల్ చేయగానే స్వీటీలాగా ఓ నర్స్ డ్రెస్ వేసుకొని ఉంటుంది గంగ. ఇక గంగ దగ్గరకు రుద్ర వెళ్తాడు. ఇక ఏంటి ప్రాబ్లమ్ అని రుద్ర అడుగుతాడు. నేను ఒక చిన్న హాస్పటల్ లో నర్స్ ని.. చిన్న ఆశలతో బతుకుతున్నా.. కానీ అన్నీ చిన్నగా ఉన్నా, ప్రాబ్లమ్స్ మాత్రం పెద్దగా వచ్చాయంటూ గంగ  చెప్తూంటే రుద్ర అలాగే వింటుంటాడు. రుద్రకి గంగ మరో కథ అల్లబోతుంది. తనకి దగ్గరవ్వడానికి స్వీటీలాగా వచ్చిన గంగని రుద్ర కనిపెడతాడా లేదా చూడాలి మరి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.