"లిటిల్ హార్ట్" తో భానుకి ప్రొపోజ్ చేసిన సింగర్ రమణ

స్పెషల్ ఈవెంట్స్ ని, పండగలను బాగా కాష్ చేసుకోవడంలో బుల్లితెర ముందుంటుంది. ఇక ఇప్పుడు 14 వ తేదీ చిల్డ్రన్స్ డే రాబోతున్న సందర్భంగా ఒక కొత్త షో ఈటీవీలో ప్రసారం కావడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.  ‘లిటిల్ హార్ట్స్’ అనే ఒక కొత్త ప్రోగ్రాంని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ న్యూ స్పెషల్ ఈవెంట్ ని  నవంబర్ 13 ఆదివారం  రాత్రి 7:00 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ప్రోమోలో బుల్లితెర సెలబ్రిటీలంతా వారి వారి పిల్లలతో కలిసి హాజరయ్యారు. స్టేజ్ పై పేరెంట్స్ కి, పిల్లలకు మధ్య సరదాసరదా పోటీలు, డాన్సులు వంటివి చేయించారు. ఈ కార్యక్రమాన్ని హైపర్ ఆది హోస్ట్ చేసాడు. ఇక ఈ ప్రోగ్రాంలో "పల్సర్ బైక్ ఫేమ్ సింగర్ రమణ" స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో  అదరగొట్టాడు. ఈసారి యాట నవీన,  వర్ష, భాను పేర్లు వచ్చేలా ఒక సాంగ్ రాసి పాడాడు.   ఇలాంటి పాట ఎప్పుడైనా విన్నావా అని అంటూనే మోకాలిపై కూర్చుని ఆమెకు హార్ట్ షేప్ రెడ్ బెలూన్ ఇచ్చి  ప్రపోజ్ చేశాడు. దీంతో భాను కూడా స్టేజిపైనే తెగ సిగ్గుపడిపోయింది. అన్ని కుదిరితే భాను, రమణ రీల్ పెయిర్ రాబోయే రోజుల్లో కనిపిస్తుందేమో అనిపిస్తోంది...ఎందుకంటే సుధీర్, రష్మీ, వర్ష, ఇమ్ము పెయిర్స్ చేసే ఎంటర్టైన్మెంట్  కొంచెం పాతబడిపోయింది. ఆడియన్స్ కొత్త పెయిర్ ని, కొత్త కనెక్షన్స్ ని, కొత్త ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళను రాబోయే రోజుల్లో బాగా హైలైట్ చేసి చూపించబోతున్నారేమో చూడాలి...ఇక రమణ భానుకి రెడ్ బెలూన్ ఇచ్చేసరికి నెటిజన్స్ రమణని తెగ తిట్టిపోస్తున్నారు.

ప్రదీప్ కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకుని ఉండి ఉంటే...

'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్ ని చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో నటుడు అలీ రెజా తన కూతురు అమైరాతో, అలాగే యాంకర్ రవి తన కూతురు వియాతో కలిసి వచ్చారు. హోస్ట్ ప్రదీప్ ఈ పిల్లలిద్దరినీ ఎత్తుకుని ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. "హ్యాపీ చిల్డ్రన్స్ డే" అని ప్రదీప్ అమైరాకి విషెస్ చెప్తుంటే చెయ్యి వెనక్కి లాగేసుకుంది. "నువ్వు చిల్డ్రన్ ఏంట్రా.. అని అంది" అని చెప్పి ఫన్ చేసాడు.. "ప్రదీప్ కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఈ పిల్లలకే ఇంట్రడ్యూస్ చేయడానికి టైం సరిపోయేది కాదు." అని అలీ రెజా ప్రదీప్ మీద కౌంటర్ వేసాడు. "ఇద్దరిలో నీ హోమ్ వర్క్ చేసేదెవరు?" అని వియాని ప్రదీప్ అడిగేసరికి వాళ్ళ అమ్మ చేస్తుందని చెప్పింది. "ఇంట్లో డ్రామా ఎవరు చేస్తారు అనేసరికి" వాళ్ళ నాన్న అని చెప్పింది. "ఐతే ఇంట్లో పనికొచ్చే పని ఒక్కటీ చేయడం లేదు.. పెద్ద ఓవర్ యాక్షన్ కాండిడేట్ అన్నమాట నువ్వు" అని రవి మీద సెటైర్ వేసాడు ప్రదీప్.  "ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు?" అని ప్రదీప్ అడిగితే, "అమ్మ అందంగా ఉంటుంది.. నాన్న హ్యాండ్సమ్ గా ఉంటాడు" అని ఎవరినీ హర్ట్ చేయకుండా ఆన్సర్ చేసింది వియా. ఇక పిల్లలిద్దరికీ బొమ్మలు, చాక్లేట్లు ఇచ్చి వాళ్ళతో డాన్స్ లు చేసాడు ప్రదీప్. 

'స్నేక్-లాడర్' ఆటలో గెలిచేదెవరు?

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త టాస్క్ మొదలైంది. అది వైకుంఠపాలి ఆట. కొందరు స్నేక్ టీం, మరికొందరు లాడర్ టీం లుగా ఉంటారు. "ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా స్నేక్, లాడర్ ల ఆట ఆడాల్సి ఉంటుంది. సగం మంది సభ్యులు మట్టితో స్నేక్ ని కట్టాల్సి ఉంటుంది. సగం మంది సభ్యులు లాడర్ ను కట్టాల్సి ఉంటుంది. టాస్క్ లో భాగంగా సమయానుసారం పాము సౌండ్ వచ్చినప్పుడు లాడర్ లు ఏవి? అని వెళ్లి ఆ లాడర్ ను చిన్నదిగా చేసి, ఆ మట్టిని తమ స్నేక్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. " అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ తో చెప్పాడు. కాగా మొదట సగం మంది కంటెస్టెంట్స్ లాడర్ తయారు చేసారు. మిగిలిన వాళ్ళు స్నేక్ ని చేసారు.  కాగా  స్నేక్ టీం లో 'ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, వసంతి, ఫైమా, కీర్తి' ఉండగా, లాడర్ టీం లో 'రేవంత్, రాజ్, ఆదిత్య, మెరీనా, ఇనయా, శ్రీసత్య' ఉన్నారు. కాగా రాజ్, కీర్తి భట్ మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కీర్తి భట్ చేతికి స్వల్పంగా గాయం కాగా, కీర్తి భట్ ఏడ్చేసింది. మిగిలిన హౌస్ మేట్స్ కీర్తి భట్ ని ఓదార్చే ప్రయత్నం చేయగా, "ఈ గాయం వల్ల గేమ్ ఆడలేకపోతున్నా" అని కీర్తి భట్ బాధపడుతూ ఏడుస్తోంది. అయితే ఈ వారం మొత్తం జరిగే ఈ స్నేక్, లాడర్ గేమ్ లో ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళే విజేతలుగా నిలుస్తారు. కాగా రోహిత్, రేవంత్ ఇద్దరు హౌస్ లో ఫిజికల్ గా స్ట్రాంగ్  ఉన్నారు. అయితే ఈ గేమ్ లో అయిన రేవంత్ తన అగ్రెసివ్ బిహేవియర్ తగ్గించుకుంటాడో లేక నాగార్జునతో మాటలు అనిపించుకుంటాడో చూడాలి మరి. 

వరెస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ ఫైమా!

బిగ్ బాస్ అరవై అయిదవ రోజు 'రగులుతోంది మొగలి పొద' పాటతో మొదలైంది. ఆ తర్వాత హౌస్ మేట్స్ మొన్న జరిగిన నామినేషన్ గురించి సరదగా మాట్లాడుకున్నారు. అయితే ఫైమా, ఒక్కో హౌస్ మేట్ దగ్గరకు వెళ్ళి, ఇనయా గురించి నెగెటివ్ గా చెప్పడం మొదలు పెట్టింది. మరో వైపు గీతు లేదని ఆదిరెడ్డి ఒక్కడే కూర్చున్నాడు. "గీతు విల్ కమ్ బ్యాక్. ఐ కుడ్ సెన్స్ ఇట్. నన్ను ఎవరు మోసం చేయలేరు" అంటు ఒంటరిగా కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అయితే స్నేక్ లాడర్ గేమ్ లో ఒక్కో కంటెస్టెంట్ పోటీపడి పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోన్నారు. కాగా మొదటి రౌండ్ లో లాడర్ టీం నుండి  శ్రీసత్య అవుట్ అవ్వగా, స్నేక్ టీం నుండి రోహిత్ అవుట్ అయ్యడు.  ఆ తర్వాత గేమ్ లో భాగంగా ఫైమా, ఇనయాని టార్గెట్ చేసింది. ఇనయా మట్టిని లాగేసుకోవడానికి ప్రయత్నించగా స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇద్దరు శత్రువులు ఒకరికొకరు ఎదురెదురుగా ఉండి గొడవ పడ్డట్లుగా వీరి మధ్య ఆట కొనసాగింది. వీరి ఆటతీరును చూసిన ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇనయా, ఫైమాల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. టాస్క్ ముగిసాక మొదటి రౌండ్ లో ఎవరు తప్పుకున్నారో సంచాలక్ ని చెప్పమన్నాడు బిగ్ బాస్. సంచాలక్ గా  వ్యవహరిస్తోన్న ఫైమా, కంటెస్టెంట్స్ మట్టితో చేసిన స్నేక్ లు చూసింది. కాగా అందులో "ఇనయా చేసిన స్నేక్ సరిగ్గా లేదు బిగ్ బాస్" అని ఫైమా చెప్పి, ఇనయాని తొలగించింది. ఆ తర్వాత ఇనయా బాధపడుతూ మాట్లాడింది. "కావాలని నన్ను గేమ్ నుండి తప్పించారు" అంటూ ఒక్కొక్కరి మీద కోపంతో రగిలిపోయింది. ఫైమాను టార్గెట్ చూస్తూ తిడుతూ ఉండగా, రేవంత్ మధ్యలో ఆపడానికి ప్రయత్నించాడు. కానీ తను ఆపకుండా అలాగే కొనసాగించింది.  "ఫేక్ ఫైమా. వరెస్ట్ పర్ఫామర్. వరెస్ట్ గేమర్ ఇన్ ద హౌస్ ఫైమా" అంటూ ఇనయాను తిట్టేసింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు చెప్పేసరికి బెడ్ రూంకి వెళ్ళి, తన బెడ్ పై పడుకొని ఏడుస్తూ ఉంది‌. అయితే ఈ గేమ్ లో ఏకపక్షంగా సాగింది అనే చెప్పాలి. ఇనయాని టార్గెట్ చేస్తూ ఫైమా ఆడింది. చివరికి ఇనయా గేమ్ నుండి తప్పుకుంది. అలా ఈ టాస్క్ ముగిసింది. 

త్వరలో జీ తెలుగులో ప్రారంభంకానున్న కొత్త సీరియల్ " శుభస్య శీఘ్రం"

జీ తెలుగులో కొత్త సీరియల్స్ హవా ఎక్కువయ్యింది. ఇప్పటికే "పడమటి సంధ్యారాగం, అమ్మాయిగారు" వంటి సీరియల్స్ స్టార్ట్ ఐపోయాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సీరియల్ లైన్ లో ఉంది. అదే "శుభస్య శీఘ్రం".  ఒక మధ్యతరగతి తల్లికి అండగా ఉండే కూతురు తన కుటుంబాన్ని ఆపదల నుండి ఎలా కాపాడుకుందో అనే ఒక ఆసక్తికర కథాంశంతో ఈ సీరియల్  త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీరియల్ లో మహేష్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇంతకు ముందు "మనసిచ్చి చూడు" సీరియల్ లో హీరో ఆది క్యారెక్టర్ లో నటించాడు. హీరోయిన్ గా కృష్ణ ప్రియా నటిస్తోంది. ఈమె మలయాళీ అమ్మాయి..తెలుగులో కృష్ణ ప్రియా నటిస్తున్న మొదటి సీరియల్ ఇదే. ఇక ఈ సీరియల్ లో నటి భావన మెయిన్ రోల్ లో నటిస్తోంది. భావన ఇంతకుముందు "కల్యాణ వైభోగం, కలిసి ఉంటే కలదు సుఖం" సీరియల్స్ లో నటించింది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మరో ముఖ్య పాత్ర సాండ్ర జయచంద్రన్. ఈ సీరియల్ లో హీరోయిన్ కి అక్క పాత్రలో ఈమె నటిస్తోంది. ఈమె ఇంతకుముందు "ముద్దమందారం, కుంకుమ పువ్వు, రాధమ్మ కూతురు" వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఈ సీరియల్ లో అక్కచెల్లెళ్లకు అమ్మ క్యారెక్టర్ లో ఉమాదేవి నటిస్తోంది. ఈమె ఇంతకు ముందు కార్తీక దీపం, కల్యాణ వైభోగం, శ్రీమతి-శ్రీనివాస్ వంటి సీరియల్స్ లో  నటించింది. ఇక ఈ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మోక్ష నటిస్తోంది.

‘కాంతార’ సీన్‌తో అదరగొట్టిన నూకరాజు!

తెలుగు ఆడియన్స్ ని అలరించే కామెడీ షోల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ కామెడీ షోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేటెస్ట్ గా ఈ షో ‘మదర్స్-డాటర్స్’ అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇక ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ కనిపించి షోకి కొత్త ఎనర్జీ ఇచ్చాడు. అయితే ఈ ప్రోమోలో ‘కాంతార’ మూవీలోని క్లైమాక్స్ సీన్ ను నూకరాజు రీక్రియేట్ చేసి అద్భుతంగా నటించాడు. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కూడా ‘కాంతార’ క్లైమాక్స్ ను రీక్రియేట్ చేశారు. ఈ సీన్ వలన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఇదే హైలెట్ గా నిలిచింది. ఇక ఇందులో సుధీర్, రాంప్రసాద్ సందడి వేరే లెవేల్ అని చెప్పొచ్చు. కొంతమంది కమెడియన్స్ సుధీర్ పై సెటైర్లు కూడా వేశారు. 'మదర్స్-డాటర్స్' అనే కాన్సెప్ట్ తో అమ్మలకు, కూతుళ్లకు పోటీలు నిర్వహించారు. బుల్లితెర బ్యూటీలు భాను, వర్ష డాన్సులతో స్టేజిని అదరగొట్టారు.    ఇక భానుశ్రీ తన పాటతో అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. యాకర్ రష్మీ సైతం భానుశ్రీ పాడిన పాటకు కన్నీళ్లు పెట్టేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బర్త్‌డే బేబీ శ్యామల!

యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె మూవీ ప్రమోషన్స్ కి, బుల్లితెర షోస్‌కి హోస్ట్‌గా చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత యాంకర్‌గా సెటిల్ అయ్యి ఫుల్ బిజీ అయిపోయింది. యాంకర్‌గా గా మంచి ఫామ్ లో ఉన్న టైంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది.   హౌస్ నుంచి వచ్చాక ఈమె క్రేజ్ చాలా పెరిగింది. టీవీ షోస్, ప్రీరిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్ ఈవెంట్లు.. ఇలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. అప్పుడప్పుడు మూవీస్‌లో కూడా అడపాదడపా కొన్ని రోల్స్‌లో నటిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తన యుట్యూబ్ ఛానల్‌లో రెగ్యులర్ వీడియోస్ పోస్ట్ చేస్తూ లైంలైట్‌లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది.  ఇప్పుడు శ్యామల తన పుట్టిన రోజు ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్యన శ్యామల తన బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. భర్త నరసింహ, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈమె భర్త నరసింహ ఒక పక్కన 'కార్తీక దీపం'లో దుర్గ కేరక్టర్‌లోలో నటిస్తున్నాడు. ఇటీవల 'ఎక్స్‌పోజ్డ్ 24' అనే వెబ్ సిరీస్‌లో మిత్ర అనే రోల్‌లో ఆకట్టుకున్నాడు.  

జబర్దస్త్ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత? అనసూయని మరిపిస్తుందా?

'జబర్దస్త్' ఎంతోమందిని లైంలైట్ లోకి తీసుకొచ్చేసరికి ఇలాంటి షోలోకి ఎలాగైనా రావాలని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇక యాంకర్‌గా రావాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే జబర్దస్త్ షో యాంకర్స్‌గా చేసిన అనసూయ, రష్మీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఊహించని రేంజ్‌కి వెళ్లిపోయారు. మూవీస్‌లో చిన్న రోల్స్ చేసే రష్మీ హీరోయిన్ అయ్యింది. అలాగే అనసూయ కూడా మూవీస్‌లో మంచి రోల్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక ఆ పోస్ట్ కోసం చాలా మంది ట్రై చేశారు. 'రెమ్యునరేషన్ తక్కువైనా కూడా చేసేస్తాం' అని హింట్ కూడా ఇచ్చారు. ఇక ఏమయ్యిందో కానీ 'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్‌గా ఉన్న రష్మికే జబర్దస్త్ బాధ్యతలు అప్పగించారు. ఎట్టకేలకు సౌమ్య రావు అనే కన్నడ సీరియల్ నటిని అనసూయ ప్లేస్ లోకి తీసుకొచ్చారు. ఈ గురువారం ఎపిసోడ్ నుండి సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్‌గా కనిపించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల అయ్యింది. రష్మీనే కొనసాగిస్తే బెటర్ అని కొందరు అంటుండగా, ఎట్టకేలకు జబర్దస్త్‌లో కొత్త యాంకర్‌ని చూసే అవకాశం దక్కిందని మరికొందరు ఫీల్ అవుతున్నారు.   కాగా ఈ కొత్త యాంకర్‌కి రెమ్యూనరేషన్ ఎంత? వంటి ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చాయి. సౌమ్య రావు రెమ్యూనరేషన్ ఎపిసోడ్‌కి రూ.1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఫిక్స్ చేశారట. రష్మీ ఒక ఎపిసోడ్ కి రూ. 2 లక్షలు పైనే తీసుకుంటున్నారని సమాచారం. ఇక జబర్దస్త్ వంటి కామెడీ షోలో యాంకర్ పాత్ర చాలా ఎక్కువ. ఆడియన్స్‌కి మంచిగా రీచ్ కాకపొతే మాత్రం కామెంట్స్‌తో ఆడేసుకుంటారు. ఇక ఇప్పుడు ఈ కొత్త యాంకర్‌పై అనసూయను మరపించాల్సిన పెద్ద బాధ్యతే ఉంది. 

నాకు అన్నయ్య అంటే ఉదయ్ కిరణ్ గుర్తొస్తారు!

క్యాష్ షోకి  ఈ వారం సీరియల్స్ లో నటించే అత్తా కోడళ్ళు వచ్చారు. సుమ ఎప్పటిలానే వాళ్ళతో ఫుల్ కామెడీ చేసింది.  ఇక ఈ ఎపిసోడ్ కి శిరీష, గౌతమీ కూడా వచ్చారు. సుమ శిరీషతో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తో యాక్ట్ చేసావ్ కదా ఆయన ఎలా ఉండేవారు అనేసరికి " ఆయన డౌన్ టు ఎర్త్ ...అందరితో ఫ్రెండ్లీ గా ఉండేవారు. నాకు అదే ఫస్ట్ మూవీ, ఆడిషన్ తీసుకునేటప్పుడు చుట్టూ ఒక 20 మంది ఉన్నారు. అది ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ ..నాకు చాలా భయమేసింది..13 టేక్స్ అయ్యాయి. చాలా టెన్షన్ వచ్చేసింది. ఏడుపొచ్చేసింది.. అప్పుడు ఉదయ్ కిరణ్ గారు వచ్చి టెన్షన్ పడొద్దు..నేను నీ సొంత అన్నయ్యే అనుకుని మాములుగా అన్నయ్యతో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడేయ్ అన్నారు. అంతే నాలో చాలా ధైర్యం వచ్చింది.  ఎప్పుడైనా ఆర్టిస్టులకు కో-ఆర్టిస్ట్స్ సపోర్ట్ ఉంటే మాత్రం ఎలాంటి సీన్ ఐనా ఈజీగా చేసేయొచ్చు.. నాకు అన్నయ్య అంటే ఉదయ్ కిరణ్ అంతే" అని ఆయన గురించి తన మనసులో మాట చెప్పింది.  

పెళ్లయితే ఫ్రీడమ్ పోతుంది.. అందుకే పెళ్లి మీద ఇంటరెస్ట్ లేదు!

'ఊర్వశివో.. రాక్షసివో' మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు శిరీష్ 'ఆలీతో సరదాగా' షోకి వచ్చాడు. ఇక ఈ షోలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పాడు. "మూవీస్ లోకి రాకపోయి ఉంటే గనక జర్నలిజం చేసి జర్నలిస్ట్ గా వెళ్ళేవాడిని. నాకు మీడియా అంటే చాలా ఇష్టం. నాకు, బన్నీకి చిన్నప్పటినుంచి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే పిచ్చి. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం అది ఎంత డేంజరస్ అనే విషయం తెలిసింది. ఇద్దరం గోడల మీద నుంచి ఒకరినొకరం  పట్టుకుని దూకి పడిపోవడం, కొట్టుకోవడం చేసాం. కానీ సినిమాల్లా అది ఫేక్ అన్న విషయం అప్పటికి మాకు తెలియదు. కానీ రక్తాలొచ్చేసేలా కొట్టేసుకునేవాళ్ళం. ఎవరైనా నన్ను ఏమౌతావ్ పెద్దయ్యాక అని అడిగితే సీరియస్ గా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్లేయర్ ని అవుతా అని చెప్పేవాడిని." అని తెలిపాడు. "మా నాన్న గర్వపడాలంటే ఏం చేయాలో ఇంకా నాకు తెలీదు. కానీ మా అమ్మ గర్వపడాలంటే నేను పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు.. నాకు పెళ్లంటే చాలా భయం.. ఇప్పటి వరకు సింగల్ గా ఉన్నా. పెళ్ళైతే ఫ్రీడమ్ మొత్తం పోతుంది కదా అందుకే పెళ్లి మీద పెద్ద ఇంటరెస్ట్ లేదు." అని తన అభిప్రాయం చెప్పాడు. "చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో చేసాను. తర్వాత దాసరి నారాయణరావు గారు 'మాయాబజార్' అనే మూవీలో అందులో దాసరి గారి ఫ్లాష్ బ్యాక్ రోల్ లో నేనే యాక్ట్ చేసింది. చిన్నప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుంద'రి షూటింగ్ సెట్ లో అమ్రిష్ పురి గారిని చూసి చాలా భయపడ్డాను. ఆయన వాయిస్ అంటే భయం నాకు. కానీ తర్వాత ఆయన నాతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి ఆయన మనల్ని ఏమీ చేయడు అనిపించింది.." అని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు శిరీష్. 

త్వరలో మన పెళ్లి షాపింగ్ చేద్దాం!

'జబర్దస్త్' కమెడియన్స్ వర్ష, ఇమ్ము నిన్న మొన్నటి వరకు ఫుల్ ఫైట్ చేసుకున్నారు. కానీ అంతలోనే కలిసిపోయారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ ఐపోయారు. తన లవ్ లో ఫస్ట్ టైం వర్షకి గిఫ్ట్ ఇచ్చేసాడు ఇమ్ము. వచ్చే నెల వర్ష పుట్టినరోజు రానున్న సందర్భంగా కొంచెం ముందుగానే హైదరాబాద్ లోని ఓ జ్యూవలరీ షోరూంకి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. "గోల్డ్ ఇస్తే ఎక్కువవుతుందని ఇక్కడికి తీసుకొచ్చావా?" అని వర్ష అడిగితే, "నీకు గోల్డ్ కూడా ఉందిరా. అది ఇప్పుడు కాదు. మన పెళ్లికి. పెళ్లి షాపింగ్ కూడా చేస్తామండి త్వరలోనే. మా పిల్లల్ని కూడా చూపిస్తాం." అని ఇమ్ము జోక్ వేశాడు. దీనికి వర్ష పగలబడి నవ్వింది.  "నా పక్కన ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.. వర్ష అందానికి ఎప్పుడూ ఫిదా ఐపోతూ ఉంటాను" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు ఇమ్ము. నెక్లెస్, వడ్డాణం.. అవన్నీ కొనిపెట్టాడు. ఇకపోతే రీసెంట్ గా కారు కొన్న ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు వర్షకి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. 

లైఫ్ లాంగ్ వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేస్తాను!

బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది వారాలు వీర లెవెల్లో గేమ్ ఆడి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన గలాటా గీతూ రాయల్ బీబీ కేఫ్ లో పార్టిసిపేట్ చేసి ఎన్నో విషయాలు చెప్పింది. "నీకు నోటి దురుసు.. హౌస్ లో అరిస్తే బయటకు వినిపించేది".. అని యాంకర్ అడిగేసరికి "ఇనయాతో గొడవపెట్టుకున్నది ఫస్ట్ వీక్ లో. బాలాదిత్య నన్ను ఎన్ని మాటలు అన్నా నేను సైలెంట్ గా ఉన్నా, ఆదిరెడ్డితో వాదన పెట్టుకున్నా అంతే.. నాకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తా.. నాది నటన కాదు.. నేను ఏదైనా పాయింట్ మాట్లాడతాను. రేవంత్ మాత్రం అలా కాదు.. చాలా ఎగ్రెసివ్.. బాలాదిత్యకు సిగరెట్లు ఇవ్వకపోవడం వలన నేను ఆడియన్స్ లో బాగా నెగటివ్ అయ్యానని అనుకుంటున్నా. ఇక హౌస్ లో ఆదిరెడ్డి నన్ను బాగా అర్థం చేసుకున్న మంచి మిత్రుడు. అని చెప్పింది. అందరూ తను గేమ్ ఆడలేదని చెప్తున్నారని, తను సాధ్యమైనంతవరకు గేమ్ ఆడాననీ ఆమె అంది. "నాలో నచ్చని విషయాలను చెప్పినప్పుడు మార్చుకుంటూ వచ్చాను. నేనేమన్నా క్రిమినల్‌నా మారడానికి! బిగ్ బాస్ హౌస్ కి వచ్చాకే మనుషుల విలువ, ఫుడ్ వేల్యూ, టైం వేల్యూ అన్నీ తెలిసాయి. మెరీనా ఫుడ్ బాగా చేస్తుంది దాని గురించన్నా హౌస్ నుంచి బయటికి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్లి తినేసి వస్తా. అని చెప్పింది గీతూ. కానీ మెరీనాతో, రోహిత్ తో  ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేయననేది ఆమె మాట. "ఆదిరెడ్డి, శ్రీసత్య, బాలాదిత్య, శ్రీహాన్, ఫైమా వీళ్ళను లైఫ్ లాంగ్ వదలను. రాజు లాస్ట్ లో నాకు కనెక్ట్ అయ్యాడు. కానీ ఒక్కో నిమిషం ఒక్కోలా ఆలోచిస్తాడు. ఇనయాతో నేను ఉండాలనుకోవట్లేదు. రేవంత్ తో  సిట్యువేషన్ బట్టి ఫ్రెండ్ షిప్ చేస్తాను. వసంతి గేమ్ నాకు బాగా అర్థం కాలేదు. కీర్తి భట్ నాకు పెద్దగా సింక్ అవలేదు" అని హౌస్ నుంచి బయటికి వచ్చే కంటెస్టెంట్స్ తో ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తుంది, ఎవరితో చేయదు వంటి విషయాలను పంచుకుంది చిత్తూర్ చిరుత. 

My Watch Ends Here: గీతు

నిన్న మొన్నటి దాకా బిగ్ బాస్ హౌస్ లో అదరగొట్టిన చిత్తూరు చిరుత గీతు రాయల్. ఎలిమినేషన్ తర్వాత హాట్ టాపిక్ గా మారింది. ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన పెద్దగా పట్టించుకోని బిగ్ బాస్ ప్రేక్షకులు. గీతు ఎలిమినేషన్ తర్వాత అసలు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది ఇక నుండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ, వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గీతు తన సోషల్ మీడియా వేదికగా తను బిగ్ బాస్ లో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ , బయటకు వస్తానని అసలు ఊహించలేదంటు, బాగా మిస్ అవుతున్నట్టుగా పోస్ట్ చేసింది. కాగా ఫ్యాన్స్ ఇప్పుడు ఆ పోస్ట్ ని వైరల్ చేసారు. తను రాసిన పోస్ట్ లో గీతు రాయల్ ఇలా రాసుకొచ్చింది. "బిగ్ బాస్ వాజ్ ది బ్యూటిఫుల్ లైఫ్. ఐ ఎవర్ లివ్డ్! కానీ అందులో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. నా తప్పులను క్షమించండి ప్లీజ్. నన్ను నన్నుగా అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి చచ్చిపోయేంతవరకు ఋణపడతా!  'My Watch Ends Here'! " . కాగా తను రాసిన ఈ నోట్ కి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.

ఇక్కడ హీరో హీరోయిన్లు ఎవరూ లేరు: కీర్తి భట్

బిగ్ బాస్ లో సోమవారం అనగానే నామినేషన్లో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరు కంటెస్టెంట్‌లని నామినేట్ చేస్తారు. రేవంత్ ని ఆదిరెడ్డి నామినేట్ చేసాడు. "గేమ్ గెలవడానికి చాలా దారులు ఉన్నాయి. ఇది నా నామినేషన్ విను రేవంత్. ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత తోపు ఐనా నేను తగ్గను" అన్నాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత ఇనయాని నామినేట్ చేసిన వసంతి, "నువ్వు అక్కడ ఓకే అన్నావ్. మళ్ళీ మాట మార్చావ్. నువ్వు, నేను, రాజ్.. ముగ్గురం కలిసి రాత్రి ఒక ఒప్పందం చేసుకున్నాం కానీ నువ్వు పొద్దున అలా దొంగతనంగా గేమ్ ఆడావ్" అంది.   వసంతిని నామినేట్ చేసిన రేవంత్, "టూ వీక్స్ కంటిన్యూస్ గా నామినేట్ చేసావ్. కొట్టాలి అనే ఇంటెన్షన్‌తో నన్ను కొట్టావ్. గేమ్ అంటే ముందుకొచ్చి ఆడాలి." అని అన్నాడు.  ఆదిరెడ్డిని రేవంత్ నామినేట్ చేసాడు. "వాంటెడ్ గా అన్నారు. నేను హర్ట్ అయ్యాను." అని అన్నాడు. ఆ తర్వాత శ్రీహాన్ ని నామినేట్ చేసిన కీర్తి భట్, "లాస్ట్ నామినేషన్లో హ్యుమానిటి గురించి నామినేట్ చేసావ్ చాలు ఇక. నువ్వు హీరో కాదు. ఇక్కడ హీరో, హీరోయిన్‌ లు ఎవరు లేరు." అంది. తర్వాత శ్రీహాన్ మాట్లాడుతూ, "సరే బయల్దేరు" అని అనగా, "ఇది ఓవర్ అని అనిపించలేదా. ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా.. ఇదే తగ్గించుకో శ్రీహాన్" అని కీర్తి భట్ అంది. ఆ తర్వాత ఇనయాని నామినేట్ చేసిన కీర్తి భట్, "నువ్వు సారీ చెప్పావ్. కానీ అగ్రెసివ్‌నెస్ కొంచెం తగ్గించుకో" అని చెప్పింది.   

'రాజు ఎక్కడ ఉన్నా రాజే'!

బిగ్ బాస్ హౌస్ లో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ఉంటారు. అందులో కొందరు అగ్రెసివ్ అయితే మరికొందరు కామ్ గా ఉంటారు. అయితే మొదటి వారం నుండి కామ్ గా ఉన్న రాజ్, గత రెండు వారాలుగా తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు. ఆదిరెడ్డిని రేవంత్ నామినేట్ చేసాడు. "వాంటెడ్ గా అన్నారు. నేను హర్ట్ అయ్యాను." అని చెప్పాడు రేవంత్. ఆ తర్వాత శ్రీహాన్ ని నామినేట్ చేసిన కీర్తి భట్, "లాస్ట్ నామినేషన్లో హ్యుమానిటి గురించి నామినేట్ చేసావ్. చాలు ఇక నువ్వు హీరో కాదు. ఇక్కడ హీరో, హీరోయిన్‌ లు ఎవరూ లేరు." అంది. తర్వాత శ్రీహాన్ "సరే బయల్దేరు" అనగా, "ఇది ఓవర్ అని అనిపించలేదా? ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా.. ఇదే తగ్గించుకో శ్రీహాన్" అంది కీర్తిభట్. తర్వాత ఇనయాని నామినేట్ చేసింది కీర్తి. "నువ్వు సారీ చెప్పావ్. అయినా అగ్రెసివ్‌నెస్ కొంచెం తగ్గించుకో." అని సలహా ఇచ్చింది. ఆ తర్వాత ఇనయాను నామినేట్ చేసిన మెరీనా, "నువ్వు అలా చేయకుంటే మన టీం గెలిచేది" అని చెప్పింది. దానికి రిప్లైగా, "నేనేం ఆడుతానో, ఎలా గేమ్ ఆడుతానో ఎవరికి చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు" అఅంది ఇనయా. ఆ తర్వాత ఇనయాని నామినేట్ చేసాడు రాజ్. "ఇనయా తీసావా అంటే నేను తీయలేదు అంది. మళ్ళీ లోపలికి వచ్చి ఆడిగితే తీసాను అన్నావ్. ఫస్ట్ నన్ను ఫినిష్ చేయనియ్. నువ్వు గేమ్ ఆడలేదు. జఫ్ఫా గేమ్ ఆడినవ్. నాకు తప్పు అనిపించింది కాబట్టి నేను అడుగుతున్నా" అన్నాడు రాజ్. తర్వాత సెకండ్ నామినేషన్ గా శ్రీహాన్ ని నామినేట్ చేసాడు. అయితే నిన్న జరిగిన నామినేషన్లో రాజ్ చెప్పిన ప్రతీ పాయింట్ కరెక్ట్. దానికి అభిమానులు సైతం కనెక్ట్ అయిపోయారు. "రాజ్ అసలు మాట్లాడడు. కానీ మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడుతాడు. రాజు ఎక్కడ ఉన్నా రాజే " అని నాగార్జున గత వారం చెప్పాడు. ఇది నిజమనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా ఉంటూ తమకు అవకాశం వచ్చినప్పుడు వాడుకునే వాళ్ళలో రాజ్ మొదటగా ఉంటాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

'ఆకలి విలువ అంటే ఏంటో మాకు తెలిసొచ్చింది'.. ఎమోషనల్ అయిన శాంతిస్వరూప్!

'జబర్దస్త్’ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా పరిచయం అయిన కమెడియన్స్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేసే వారి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్లంతా క్యాష్ షోకి వచ్చారు. ఈ షో  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కు జబర్దస్త్ స్త్రీ పాత్రధారులు శాంతి స్వరూప్, మోహన్, హరిత, సాయిలేఖ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి వచ్చారు. శాంతి స్వరూప్ తన తల్లితో కలిసి ఈ షోకి వచ్చాడు. తన జీవితంలో పడిన కష్టాల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు శాంతి స్వరూప్. "మా అమ్మ చాలా ఇళ్లలో పాచిపని చేసేది. అప్పుడు ఆకలి విలువ అంటే ఏంటో మాకు తెలిసొచ్చింది" అని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు.  "మా అమ్మకు చిన్నతనం నుంచి గొంతు సరిగ్గా రాదు, స్పష్టంగా మాట్లాడలేదు..ఏదో మాట్లాడాలనుకుటుంది కానీ మాట్లాడలేదు" అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే శాంతి స్వరూప్ గురించి తల్లి సరోజనమ్మ మాట్లాడుతూ.. "నా కొడుకే నన్ను బతికిస్తున్నాడు. ఆస్పత్రుల చూట్టు తిప్పుతున్నాడు” అని కన్నీటి పర్యంతమైంది. దాంతో స్టేజి మీద ఉన్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. 

తల్లీబిడ్డలను కలిపిన 'శ్రీదేవి డ్రామా కంపెనీ'!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతీ ఆదివారం కొత్త కొత్త టాలెంట్స్ తో, కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరిస్తోంది. అలా గతంలో "నాన్నే.. నా హీరో" అనే ఒక షో చేసింది. ఆ ఎపిసోడ్ కి చెరిష్ అనే ఒక అనాథాశ్రమానికి చెందిన పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అప్పుడు అందులోని పాపను గుర్తుపట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి, తన బిడ్డను తన దగ్గరకు తెచ్చుకుంది ఒక తల్లి. ఇక ఈ ఎపిసోడ్ లో తప్పిపోయిన సింధు అనే అమ్మాయిని తన తల్లి అనురాధకు అప్పగించింది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. రష్మీ మాట్లాడగా అనూరాధ ఎన్నో విషయాలను వెల్లడించారు. "సింధు మూడేళ్లప్పుడు ఒక అమ్మాయి తనను తీసుకెళ్ళిపోయింది. ఆ వీడియో ఫుటేజ్ కూడా మాకు దొరికింది. ఎన్నో ఏళ్ళు పిల్ల కోసం ఏడ్చాను. ఇక ఎంత వెతికినా దొరక్కపోయేసరికి బాధపడ్డాను. కానీ ఒక రోజు టీవీ పెట్టినప్పుడు 'నాన్నే.. నా హీరో' ఎపిసోడ్ ప్రోమో చూసాం. అందులో సింధు కనిపించింది. వెంటనే తానే నా కూతురు అని అర్థమైపోయింది. నాకు ఇందు, సింధు అని ఇద్దరు కూతుళ్లు.. వాళ్ళు ట్విన్స్. ఇక తెలిసిన అందరి ద్వారా ప్రయత్నించి నా కూతురిని నా దగ్గరకు తెచ్చుకున్నాను. నా దగ్గరకు వచ్చిన మొదటి రోజు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు చాలా బాధేసింది. తెలిసిన వాళ్ళు చెప్పగా, ఫొటోస్ అవన్నీ  చూపించగా అప్పుడు గుర్తుపట్టి నాతో మాట్లాడం మొదలు పెట్టింది" అని చెప్పి ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యింది.  ఇక ఇలాంటి గొప్ప షోలో తాము కూడా భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని రష్మీ, వర్ష భావోద్వేగంతో చెప్పారు. 

చేతిలో గీతల కంటే ముడతలు ఎక్కువగా ఉన్నాయి!

రష్మీ గౌతం ప్లేస్ లో కొత్త యాంకర్ వచ్చేసరికి ఇక రష్మీ మీద ట్రోల్స్, మీమ్స్ మాములుగా లేవు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హైపర్ ఆది కూడా రష్మీ మీద సెటైర్లు పేల్చాడు. ఆదివారం ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హైపర్ ఆది, నాటీ నరేష్ జాతకం చెప్పేవాళ్ల గెటప్ లో వచ్చారు. కమెడియన్స్ అందరి చేతి రేఖలు చూసి జాతకం చెప్పి మంచి ఫన్ క్రియేట్ చేశారు.  వీళ్ళతో పాటు రష్మీ కూడా వచ్చి చెయ్యిచ్చి ధనరేఖ ఎలా ఉందో జాతకం చెప్పమంది. "చేతిలో గీతల కంటే ముడతలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధన రేఖ విషయానికి వస్తే ఇప్పుడు తగ్గింది. అదే గురువారం కూడా యాడ్ ఐతే ధనరేఖ బాగా పెరుగుతుంది" అని చెప్పాడు ఆది.  ఇక బులెట్ భాస్కర్ జాతకం చెప్తూ "ఆయష్షు రేఖ ఆ ఈవెంట్లకు, ఈ ఈవెంట్లకు వెళ్లి ఆరేళ్ళు తగ్గిపోయింది." అని చెప్పాడు. దొరబాబు జాతకం గురించి చెప్తూ నీ జాతకం చూడడం కంటే ముందు నా జాతకం నేను చూసుకోవడం బెస్టు" అన్నాడు. "నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నే నీ జాతకం చూడలేదనుకుంటా. అందుకే దొరబాబు అని పేరు పెట్టాడు. చూసి ఉంటే 'దొరుకుతాడు బాబు' అని పేరు పెట్టేవాడు" అని కౌంటర్ వేసి ఫన్ చేసాడు. ఇలా అందరి జాతకాలు చెప్పి ఎంటర్టైన్ చేసాడు ఆది. 

నా జీవితాంతం మీకు ఋణపడిపోతాను బిగ్ బాస్!

  సండే ఎలిమినేషన్ డే అంటూ నాగార్జున వచ్చేసాడు. వచ్చి రాగానే  ఎపిసోడ్‌లో మొదట గీతుతో మాట్లాడాడు. "నువ్వు రోజు పాటకి డ్యాన్స్ చేయడం అయ్యిపోయాక ఒకటి అనుకుంటావ్? ఏంటది?" అని నాగార్జున అడుగగా, "ఈ సారి ఫీమెల్ విన్ అవ్వాలని  కోరుకుంటున్నా" అని గీతు అంది. ఆ తర్వాత స్నేక్, లాడర్ టాస్క్ ఇచ్చాడు. ఏ కంటెస్టెంట్ స్నేక్? ఏ కంటెస్టెంట్ లాడర్ ? అని చెప్పమనగా, ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ తర్వాత నామినేషన్లో చివరగా శ్రీసత్య, గీతు ఉండగా గీతు ఎలిమినేట్ అయింది.  "ఎవరు మాట్లాడమాకండి. నేను వెళ్ళి నా ఫేవరేట్ ప్లేస్ లో కూర్చొని వెళ్ళిపోతా" అని చెప్పి, గీతు తన ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఏడ్చేసరికి వాళ్ళని చూసి తను కూడా ఏడ్చేసింది. రేవంత్ గట్టిగా హత్తుకొని కాసేపు ఏడ్చాడు. "నా జీవితాంతం నీకు ఋణపడిపడిపోతాను బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్. నాకు చాలా నేర్పించావ్ బిగ్ బాస్" అని ఏడ్చేసింది గీతు. ఆ తర్వాత "ఎప్పుడు అయిన, ఎవ్వరినైనా బాధపెట్టుంటే సారీ" అని హౌస్ మేట్స్ తో చెప్పుకుంటు ఏడ్చేసింది. "నేను వెళ్ళను. గేట్లు మూయద్దు బిగ్ బాస్. ఐ రియల్లీ మిస్ యూ బిగ్ బాస్" అని తను ఏడ్చేసింది. తను హౌస్ నుండి వెళ్ళాక రేవంత్, ఆదిరెడ్డితో మట్లాడుకుంటూ ఏడ్చాడు."షీ డిజర్వింగ్ బెటర్" అని శ్రీసత్య అనగా, గీతు సీక్రెట్ రూం కి వెళుతుంది అని రేవంత్ చెప్పాడు. స్టేజ్ మీదకి వచ్చిన గీతుకి, నాగార్జున తన 'AV' ని చూపాడు. అది చూసి నాగార్జున , "గీతు దట్ ఈజ్ ఫ్యాబులస్ జర్నీ " అని అనగా, కన్నీళ్ళు పెట్టుకుంది గీతు. "ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ రూల్ చేద్దామనుకున్నా సర్" అని అంది. ఆ తర్వాత "ఒక గేమర్ లా గేమ్ ఆడావ్.‌ కానీ ఆడియన్స్ కి ఒక లోటు కనపడింది. మరి వాళ్ళు ఏం చూసారో తెలియదు" అని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గీతు ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ అందరిని షాక్ కి గురిచేసింది. ది బెస్ట్ పర్ఫామర్, ద గేమ్ చేంజర్ ఇలా ఎలా ఎలిమినేట్ అవుతుంది అని హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు. కానీ అంచనాలకు మించి ఎలిమినేషన్ జరగడమే బాస్ షో అని కొందరు కామెంట్స్ చేస్తోన్నారు. అయితే బిగ్ బాస్ లో ఇక స్ట్రాటజీస్, గేమ్ ప్లాన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని ప్రేక్షకులు భావిస్తున్నారు.