వాళ్లకి ఆడటం చేతకాదు.. నీ ఓవరాక్టింగ్ తగలెయ్య!
బిగ్ బాస్ హౌస్ లో రోజుకో గొడవ కామన్ గా జరుగుతోంది. అయితే ఇది టాస్క్ లోనే కావడం విశేషం. కాగా బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. అది 'Sticky situation'. అయితే ఈ టాస్క్ ని, ముందు గేమ్ లో ఓడిన కంటెస్టెంట్స్ కి కల్పించారు. ఇందులో గెలిచి కెప్టెన్సీ పోటీదారుల రేస్ లోకి వచ్చే అవకాశం శ్రీసత్య, ఇనయా, ఫైమా, రోహిత్ కి కల్పించారు. ఈ గేమ్ లో శ్రీసత్య, రోహిత్ గెలిచి కెప్టెన్సీ పోటీకి మళ్ళీ అర్హత సాధించారు. అయితే ఈ గేమ్ లో ఇనయా తప్పుగా మట్లాడింది. ఆ తర్వాత కాసేపటికి "నేను గేమ్ లో తప్పుగా మట్లాడాను. సారీ" అని ఇనయా అందరి ముందు చెప్పింది. "తప్పు చేసి సారీ చెప్పడం కాదు. తప్పు చేయకుండా ఉండటం ఇంపార్టెంట్" అని ఆదిరెడ్డి, రాజ్ తో చెప్పాడు.
ఆ తర్వాత ఫైమా, రేవంత్ కి మధ్య వాగ్వాదం జరిగింది. "ఓవర్ యాక్టింగ్ చేయకు. ప్రతీ ఒక్కరు ఫిజికల్ అంటున్నారు" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత "రేవంత్ చూసుకొని ఆడు" అని శ్రీసత్య అంది. "ఆడితే ఫిజికల్ అంటారు. వాళ్ళకి ఆడటానికి చాతనవ్వదు" అని రేవంత్ అనగా, "ఏంటి నీ ఓవరాక్టింగ్ తగలెయ్య" అని కీర్తి భట్ అంది.
"నా మీద ఒక్క గోరు పడ్డా, నేను ఫిజికల్ అవుతాను. కావాలంటే నా మీద నామినేషన్ వేసుకో" అని ఆదిరెడ్డితో, రేవంత్ అనగా, "నేను సైలెంట్ గా ఆడుతాను. నామినేషన్ లో నిన్ను వెతుక్కోనవసరం లేదు. అరగంటకో నామినేషన్ పాయింట్ ఇస్తావ్. నేను నీట్ గా ఆడుతాను. నువ్వు ఫిజికల్ గా ఆడినా, నేను సైలెంట్ గానే ఆడుతాను" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత "నువ్వు ఎలాగైతే ఫ్లోలో చేసావో. నేను అలాగే చేసాను" అని ఫైమా అంది. "నువ్వు డైలాగ్ లేకుండా ఆడు" అని రేవంత్ అనగా, నువ్వు ఫిజికల్ లేకుండా ఆడు" అని ఫైమా అంది. "మెరీనా దగ్గర బంగారు మణి ఉన్నందువల్ల ఎవరికి మీరు కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ కోరగా, అందరూ కలిసి మెరీనా ని కెప్టెన్సీ పోటీకి ఎంపిక చేసారు.