షీ ఈజ్ ఏ ట్రూ పాన్ ఇండియా యాక్ట్రెస్!

చెఫ్ మంత్ర సీజన్ 2 ప్రతీ వారం మంచి జోష్ తో సాగిపోతోంది. ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రగతి 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది అలాంటి ప్రగతికి జోడి గెస్ట్ గా 25 ఏళ్ళ వయసున్న నిధి అగర్వాల్ ని గెస్ట్ గా తీసుకొచ్చింది మంచు లక్ష్మి.  నిధి అగర్వాల్ ని మంచు లక్ష్మి ఈ షో మొత్తం సరదాగా ఆట పట్టించేసింది.  "ఏమిటి తెలుగు నేర్చుకోలేదా ఎక్కడా" అని అడిగేసరికి " నేను తెలుగు నేర్చుకున్నాను నాకు తెలుగు తెలుసు" అని ఆన్సర్ ఇచ్చింది నిధి. తర్వాత  "షీ ఈజ్ ఏ ట్రూ పాన్ ఇండియా యాక్ట్రెస్" అని నిధి ప్రగతికి సూపర్ కంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక నిధి, ప్రగతితో చపాతీలు చేయించింది.."చిన్నప్పటి నుంచి నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నావా" అని లక్ష్మి అడిగేసరికి "పుట్టినప్పటినుంచి యాక్టర్ అవ్వాలనుకున్నా" అని ఆన్సర్ చేసింది నిధి.  "నిధి నువ్వు చేసిన మొదటి వంటకం ఏమిటి" అని అడిగింది లక్ష్మి.."చాయ్ చేసాను" అని ఫన్నీగా ఆన్సర్ చేసింది.."పవన్ కళ్యాణ్ గారిని ఏమని పిలుస్తావ్ " అని అడిగేసరికి " సర్" అని పిలుస్తానంటూ జవాబిచ్చింది. ఇలా రాబోయే వారం ఈ ముగ్గురూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు.    

డాక్టర్ ని చేద్దామనుకున్నారు నేను యాక్టర్ ని అయ్యాను

ఆలీతో సరదాగా షో ప్రతీ వారం ఫుల్ కామెడీతో ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్ గా సాగిపోతోంది. ఇక ఇప్పుడు ఈ షోకే గెస్టులుగా తులసి, ప్రభాస్ శీను వచ్చారు. ప్రభాస్ శీను తనకు సంబంధించి ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పాడు. "మా నాన్న శరత్ బాబు గారు ఇద్దరూ ఫ్రెండ్స్..మా నాన్న డాక్టర్ అవుదామనుకున్నారు. ఆర్ధిక స్తొమత లేక అవలేదు. నన్ను డాక్టర్ చేద్దామనుకున్నారు. నేను అవలేదు. అసలు నాకు ఇంటరెస్ట్ లేదు. తర్వాత శరత్ బాబు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ కి పంపించామని చెప్పేసరికి మా నాన్న పంపించారు. అలా కొంచెం ఇంటరెస్ట్ వచ్చింది. ప్రభాస్ గారి దగ్గర అవకాశం ఎలా వచ్చింది అంటే నేను సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో చేరినప్పుడు ప్రభాస్ కూడా అక్కడే జాయిన్ అయ్యారు. ఆయనకు మేమంతా కో-ఆర్టిస్టుల్లా ఉండేవాళ్ళం." అని చెప్పాడు ప్రభాస్ శీను. "ఇంటర్ ఫెయిల్, పాలిటెక్నిక్ ఫెయిల్ అన్ని ఫట్టే. చదువు సరిగా అబ్బాలేదు నాకు... మా నాన్నకు నా చిన్నప్పుడు అన్నీ నిరాశలే నా వల్ల. నేను నల్లగా ఉండే సరికి సినిమాల్లో పనికిరావు అని చాలామంది అనేవారు. ఆ మాటల వలన కూడా మా నాన్న బాధపడేవారు. కానీ ఇప్పుడు నన్ను చూసి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. కృష్ణంరాజు గారు నన్ను మంత్రి అని పిలుస్తూ ఉంటారు. మా ఊళ్ళో చిన్నప్పుడు మా వీధిలోంచి ఎవరైనా సెకండ్ షో చూసి త్రిబుల్స్ ఎక్కి వస్తే వాళ్ళను ఆపి డబ్బులు వసూలు చేసేవాడిని" అని చిన్నప్పటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పాడు శీను.

ఆదిరెడ్డి ఒంటరితనం.. పట్టించుకోని హౌస్‌మేట్స్!

బిగ్ బాస్ హౌస్ లో నుండి ప్రతి వారం ఒక కంటెస్టెంట్ బయటకి వెళ్లిపోవడం తెలిసిందే. కాగా హౌస్ నుండి వెళ్లినవారికి మరియు హౌస్ మేట్స్ కి అంత స్నేహం మొదలవ్వలేదనే చెప్పాలి. కాబట్టి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని అందరు లైట్ తీసుకున్నారు. కాని పది వారాలుగా కొనసాగి, ఇప్పుడు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని చాలా మిస్ అవుతున్నారు. అయితే  ఇనయా మాత్రం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సూర్యని చాలా సార్లు గుర్తుచేస్తోంది. అలాగే ఆదిరెడ్డి తనకి అత్యంత దగ్గరైన గీతుని మర్చిపోలేకపోతున్నాడు. తను హౌస్ నుండి వెళ్లినప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు. అదే విషయమై తనలో తాను మాట్లాడుకుంటూ "గీతు, నాకు హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆదిరెడ్డి అని అనేది తనే వెళ్లిపోయింది. అలాగే ఆదిత్య, 'నువ్వు గాడ్ ఇచ్చిన గిఫ్ట్' సోదరా అంటు సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. హౌస్ లో సపోర్ట్ చేసేవాళ్ళే లేరు బిగ్ బాస్"  అంటు బాధపడుతూ కనిపిస్తున్నాడు. కాగా హౌస్ లో కంటెస్టెంట్స్ ఇండివిడ్యువల్ గా కాకుండా జట్లుగా విడిపోయి ఉండడం. గత రెండు వారాలుగా చూస్తూనే ఉన్నాం.  'శ్రీసత్య, ఫైమా, శ్రీహాన్, రేవంత్' ఒక టీం గా, ఎప్పుడు ఒకే దగ్గర ఉండడం. అలాగే కీర్తి భట్, ఇనయా ఒక టీంగా, మెరీనా-రోహిత్ లు ఒక దగ్గర ఉన్నారు. ఆదిరెడ్డి మాత్రం ఎప్పుడు సింగల్ గానే ఉంటూ, కెమెరాలలో చూస్తూ తన బాధని పంచుకుంటున్నాడు. హౌస్ లో మొదటి వారం నుండి గీతక్క..గీతక్క అంటూ  గీతుతోనే ఉండేవాడు.  ఇప్పుడు ఎవరు హౌస్ లో సపోర్ట్ లేకపోవడంతో ఒంటరి గా ఫీల్ అవుతున్నాడు. రాబోయే రోజుల్లో అయిన ఆదిరెడ్డి మిగత హౌస్ మేట్స్  తో కలిసి మెలిసి ఉంటాడో? లేదో? చూడాలి.

అందుకే జబర్దస్త్ మానేస్తున్నా!

జబర్దస్త్ కమెడియన్ వర్ష షాకింగ్ నిర్ణయం ఒకటి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వర్షపై ఇమ్మానుయేల్ వేసే పంచులు చాలా వల్గర్ గా ఉంటున్నాయని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్ గురించి సోషల్ మీడియా ట్రోల్స్ కూడా బాగా పెరిగిపోయేసరికి ఇంట్లో వాళ్ళు జబర్దస్త్ షో మానేయమని చెప్తున్నారని, కాబట్టి షో మానేస్తానని చెప్పి అందరికీ షాకిచ్చింది వర్ష. ఒక పక్కన  ఇమ్మానుయేల్ దారుణంగా కామెంట్ చేస్తూనే మరోవైపు వర్ష బర్త్ డేకి మంచి హారాన్ని కొనిచ్చేసరికి "మీరు పెళ్లి చేసుకుంటారా?" అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ తమ మధ్య అలాంటిది ఏమీ లేదని, తాము మంచి ఫ్రెండ్స్ అని వారు చెప్తున్నారు.  ఐతే ఇలాంటి ట్రోలింగ్స్ అవీ చూసాక  ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు వర్ష సన్నిహితులు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ఇలాంటి టైములో జబర్దస్త్ మానేయాలి అని ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి తాను అదే ఆలోచనలో ఉన్నాననేసరికి అందరూ షాకయ్యారు. నిజంగా ఇంట్లో వాళ్ళు చెప్పారనే మానేస్తానంటోందా, లేదా ఏదైనా మూవీలో ఆఫర్ వచ్చిందా? లేదా ఇమ్ము టార్చర్ భరించలేక షాక్ ఇవ్వడానికే ఇలాంటి కామెంట్స్ చేసిందా.. అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి.

పిచ్చి పడుతుంది అమ్మ: ఆదిరెడ్డి !

బిగ్ బాస్ డెభ్బై ఒకటవ రోజు 'సత్తే ఏ గొడవ లేదు' పాటతో మొదలైంది. ఆ తర్వాత ఆదిరెడ్డి ఒక్కడే కూర్చొని మాట్లాడుకున్నాడు. "సింబాలిక్ గా నేను కూడా వెళ్ళిపోతా అని చెబుతున్నారా బిగ్ బాస్" అని ఆదిరెడ్డి ఒంటరిగా చెప్పుకుంటు ఉన్నాడు. ఆ తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి. "మీ దగ్గర ఉన్న అతిపెద్ద శక్తిని ఉపయోగించి, ఇంటి సభ్యుల నుండి ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నారో, ఎందుకు ఇంటిలో ఉండకూడదు. అని అనుకుంటున్నారో చెప్పండి. కెప్టెన్ అయినందున ఫైమా మీరు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించండి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఫైమా మొదటగా రోహిత్ ని నామినేట్ చేయగా, తర్వాత ఇనయాని నామినేట్ చేసింది. "గేమ్ గేమ్ లా ఆడట్లేదు.  ఫిజికల్ గా ఆడకు. పర్సనల్ గా ఆడకు" అని ఇనయాతో, ఫైమా చెప్పింది. ఆ తర్వాత ఆదిరెడ్డి, శ్రీహాన్ ని నామినేట్ చేసాడు. సెకండ్ నామినేషన్ గా రోహిత్ ని నామినేట్ చేసాడు. "మన అగ్రెసివ్ ఓవర్ అయినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి" అని ఆదిరెడ్డి, రోహిత్ తో చెప్పాడు.  ఇనయా, ఆదిరెడ్డిని నామినేట్ చేసింది.  ఇనయా కారణం చెబుతూ, "నువ్వు ఆ వారం మైక్ విసేరయకపోతే మన టీం గెలిచేది. అలా నువ్వు తప్పు చేసి, ఇప్పుడు రోహిత్ ని నామినేట్ చేసావ్ అది నాకు నచ్చలేదు" అని ఇనయా, ఆదిరెడ్డికి చెప్పింది. దీంతో ఆదిరెడ్డి మాట్లాడుతూ "పిచ్చి పడుతుంది అమ్మా..నీ రీజన్స్ కి..ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నామినేట్ చేయడం ఏంది అమ్మ" అని ఇనయాతో చెప్పాడు. ఇలా ఇనయాకి, ఆదిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ జరిగింది. అయితే చివరలో ఆదిరెడ్డి మాట్లాడుతూ "బిగ్ బాస్, నా తర్వాత వీక్ నామినేషన్ ఇనయా" అని చెప్పాడు. వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుందో? ఏమో? చూడాలి.

ఆసక్తిగా మారిన ఈ వారం ఎలిమినేషన్!

ప్రేక్షకులు సోమవారం జరిగే నామినేషన్స్ ని ఇంట్రెస్ట్ గా చూస్తారు. కారణం కంటెస్టెంట్స్  చెప్పే సిల్లీ రీజన్స్, వీటికి వాళ్ళు వేసే నామినేషన్స్ కి అసలు సంబంధం ఉండదు. కానీ కంటెస్టెంట్స్ మధ్య జరిగే ఈ నామినేషన్స్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. కాగా అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్ మీదే ఉంది.  గతవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే సోమవారం జరిగిన నామినేషన్స్ లో ఒక్కొక్కరు వచ్చి తమ అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పారు. గతవారం నాగార్జున వచ్చినప్పుడు "నామినేషన్స్ లో అందరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి" అని చెప్పాడు. అది కంటెస్టెంట్స్ కి బాగానే గుర్తున్నట్టుంది‌. అందుకేనేమో ఒక్కో కంటెస్టెంట్ అవతలి కంటెస్టెంట్ గురించి పర్సనల్ గా మాట్లాడకుండా, ఏవైతే అవసరమో అవే చెప్పి నామినేట్ చేసారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న గీతు హౌస్ నుండి బయటకు వెళ్ళింది. ఆచితూచి మాట్లాడే ఆదిత్య బయటకొచ్చేసాడు. గ్లామర్ కి తప్ప మనుషులని పట్టించుకోని వసంతి కూడా బయటకు రావడంతో, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తర్వాత ఎవరు బయటకు వెళతారో అనే భయంతో ఉన్నారు.  దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ వారం హౌస్ ను వీడేది ఎవరో అని చూడాలి మరి.

హార్ట్‌ని హీటేక్కిస్తున్న రష్మీ!

స్మాల్ స్క్రీన్ స్టార్ట్ యాంకర్ రష్మీ ఇండస్ట్రీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. జబర్దస్ , శ్రీదేవి  డ్రామా కంపెనీ షోస్ కి హోస్ట్ గా చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. యాంకరింగ్ మాత్రమే కాదు అటు వెండితెరపై కూడా తన టాలెంట్ ను నిరూపించుకుంటూనే ఉంది. గతంలో గుంటూర్ టాకీస్ పేరుతో వచ్చిన మూవీతో ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టింది రష్మీ.  తాజాగా "బొమ్మ బ్లాక్ బస్టర్" తో మరోసారి తెలుగు ఆడియన్స్ ని  పలకరించింది. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మీ ఇక కాస్త బ్రేక్ తీసుకుంది. కొంచెం టైం చిల్ అవడానికి   మాల్దీవులకు వెళ్లి ఫుల్ ఎంజాయ్  చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో మునిగి తన్మయత్వంతో  సముద్రాన్నిచూస్తున్న ఫోటో ఇది. నీళ్ళల్లో ఒక మునకేసి తన చేతులతో లవ్ సింబల్ ను పెట్టింది రష్మీ."ఒన్స్ ఏ వాటర్ బేబీ ఆల్ వాజ్ ఏ వాటర్ బేబీ” అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పల్లవి రామిశెట్టి!

పల్లవి రామిశెట్టి పాపులర్ సీరియల్ యాక్టర్..ఇప్పుడు పల్లవి తన ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. "ఆడదే ఆధారం", "భార్యామణి", "మాటే మంత్రం" సీరియల్ నటి పల్లవి. తనకు పండంటి బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా తన ఫాన్స్ కి చెప్పింది.  పుట్టిన బాబుకు సంబంధించి చిన్ని పాదాలను పిక్ తీసి ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో  పోస్ట్ చేసింది. దీంతో ఫాన్స్, సహా నటీనటులు ఆమెకు  విషెస్ చెప్తున్నారు.  ఇక పల్లవి  మోడలింగ్ ద్వారా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భార్యామణి సీరియల్ కి  బెస్ట్ టీవీ యాక్ట్రెస్ గా నంది అవార్డును  అందుకుంది. ఆడదే ఆధారం సీరియల్ లో అమృత రోల్ లో, అత్తారింటికి దారేది సీరియల్ లో  కృష్ణవేణిగా, మాటే మంత్రం సీరియల్ లో వసుంధరగా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యిది.  ఇక ఇప్పుడు  పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్ లో జ్యోతి క్యారెక్టర్ లో చాలా ఇన్నోసెంట్ అమ్మాయిగా నటిస్తోంది. ఈమె  2019లో ఈమెకు దిలీప్ కుమార్ తో వివాహం జరిగింది.  

బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ వసంతి అవుట్!

బిగ్ బాస్ ప్రతీ వారం సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ ని జోడిస్తూ వస్తోంది. శనివారం రోజు ఆదిత్య ఎలిమినేట్ కాగా, ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో వసంతి ఎలిమినేట్ అయింది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే అందరు ఠక్కున వసంతి పేరు చెబుతారు..అంటే అంతలా మేకప్ అవుతు ఉంటుంది. ఎప్పుడు ఎవరితో గొడవలు లేకుండా, తన దాకా వస్తేనే పాయింట్ మాట్లాడే వసంతి ఎలిమినేట్ అవ్వడం అందరిని నిరాశకి గురి చేస్తోంది. అయితే నాగార్జున వచ్చి రాగానే నామినేషన్లో ఉన్నవాళ్ళని పిలిచి సేవింగ్ ప్రకియను మొదలుపెట్టాడు.  అందులో నుండి ఫైమా, కీర్తి భట్ సేవ్ అయ్యారు.‌ సన్ డే ఫండే అంటూ ఆడించాడు. గేమ్ పేరు 'బొమ్మ గీసి..సినిమా పేరు చెప్పాలి'. దీనికి గాను నాగార్జున, హౌస్ మేట్స్ ని రెండు టీంలుగా విభజించి గేమ్ ఆడించాడు. "ప్రతీ రాంగ్ ఆన్సర్ కి పనిష్మెంట్ ఉంటుంది" అని నాగార్జున చెప్పాడు. ఆ గేమ్ జరుగుతున్నప్పుడు హౌస్ మేట్స్ లోని ఆడవాళ్ళతో ఆదిరెడ్డిని డ్యాన్స్ చేపించాడు. కాగా పనిష్మెంట్ గా  ఒకసారి ఇనయా, వసంతిని కోడిలా డ్యాన్స్ చేపించాడు.‌ అయితే రేవంత్ టర్న్ వచ్చేసరికి 'బాహుబలి' సినిమా పేరు గీసి చెప్పాలి. రేవంత్ గెలిచాడు. దీంతో బిగ్ బాస్, అదే సినిమాలోని రేవంత్ పాడిన 'మనోహరి సాంగ్'  ప్లే చేసాడు. దానికి రేవంత్  డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ కానుక రేవంత్ కి వచ్చింది. చివరగా మెరీనా, వసంతి నామినేషన్లో ఉన్నారు. కాగా ఇందులో వసంతి ఎలిమినేట్ అయ్యింది. ‌ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు ఎమోషనల్ కాగా, "అందరు బాగా ఆడండి‌. ఆల్ ది బెస్ట్ అందరికి" అని చెప్పేసి, నాగార్జున దగ్గరకి వచ్చేసింది. కాసేపు నాగార్జునతో మట్లాడింది. ఆ తర్వాత వసంతి తన 'AV' చూస్తూ కంటతడి పెట్టుకుంది. "వండర్ ఫుల్ జర్నీ. మిస్ యూ ఆల్" అని వసంతి అంది. "బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవెర్ , బెస్ట్ ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు" అని నాగార్జున అడిగాడు. "మెరీనా, రేవంత్, కీర్తి భట్, ఇనయా బెస్ట్ ఫ్రెండ్స్. రాజ్, ఆదిరెడ్డి, ఫైమా వీళ్ళతో నాకు ఎక్కువ రాపో లేదు. అందుకే వీళ్ళని ఫేక్ ఫ్రెండ్స్ " అని వసంతి చెప్పింది. అలా సండే ఫండే ఎపిసోడ్‌ ముగిసింది. 

హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఆదిత్య!

బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ గా ఉండి ఇరవై మందిని హ్యాండిల్ చేసిన ఆదిత్య ఎలిమినేట్ అవడం అనేది హౌస్ మేట్స్ కి ఒక లోటు అనే చెప్పాలి. అయితే నామినేషన్లో ఉన్న తొమ్మిది మంది నుండి ఆదిత్యని ఎలిమినేట్ చేసాడు నాగార్జున. ఆదిత్య ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో అందరు ఎమోషనల్ అయ్యారు. హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా తమ అభిప్రాయలను పంచుకున్నారు. "పాప జాగ్రత్త, చిట్టి తల్లిని అడిగానని చెప్పు" అని శ్రీసత్య అంది. "సిరితో మాట్లాడండి" అని శ్రీహాన్ అన్నాడు. ఇలా అందరూ ఒక్కొక్కరుగా చెప్పుకొచ్చారు. బయటకు వెళ్ళేప్పుడు హౌస్ మేట్స్ అందరికి, "బాగా ఆడండి. టాస్క్ లో గెలిచే వరకు డోంట్ గివ్ అప్. వండర్ ఫుల్ జర్నీ గాయ్స్. మిస్ యూ గాయ్స్. లవ్ యూ గాయ్స్" అని ఆదిత్య, హౌస్ మేట్స్ కి బై చెప్పి వచ్చేసాడు.  ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన ఆదిత్య, నాగార్జునతో కాసేపు మాట్లాడాడు. కాగా నాగార్జున తన ఏవీ చూపించాడు. అది చూసి కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆదిత్య మాట్లాడుతూ, "బిగ్ బాస్ టాట్ మి ఏ లాట్" అని నాగార్జునతో చెప్పాడు. అయితే వెళ్ళేముందు హౌస్ మేట్స్ అందరి వీక్ నెస్ చెప్పమని అన్నాడు. ఆ తర్వాత ఆదిత్య ఒక్కొక్కరి గురించి ఇలా చెప్పుకొచ్చాడు. "ఫైమా స్టాటజీ లు వాడొచ్చు. మనం గెలవాల్సింది ఆటనే కాదు. ప్రేక్షకుల మనసు గెలవాలి. ఇక రాజ్ నువ్వు సూపర్..గ్రోత్ లో రాజ్ హై. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం క్లారిటితో కాన్ఫిడెంట్ గా ఆలోచించి మాట్లాడాలి. రోహిత్ స్టే బ్యాలెన్స్. మెరీనా ప్లే ఇండిపెండెంట్. సత్య నువ్వు నా చెల్లి అనుకున్నా. ఐ మిస్ యూ ఏ లాట్. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నోరు కొంచెం అదుపులో ఉంచుకోవాలి. ఇక శ్రీహాన్..నువ్వు స్మాట్ కాబట్టి బ్యాలెన్స్ గా ఉండి ఆలోచించు. కీర్తిభట్ ఎక్కువగా ఆలోచించకు, యూ ఆర్ ఏ బెస్ట్ ప్లేయర్. యూ ఆర్ ఏ డైమండ్. చాలా ఉంది నీలో, కమ్ ఆవుట్" దట్స్ ఆల్ యువర్ హానర్ అని ఆదిత్య చెప్పి ముగించాడు. ఆ తర్వాత నాగార్జున ఈ రోజు దట్స్ ఆల్ యువర్ హానర్ అని ముగించాడు.

హౌస్ మేట్స్ అంతా ఒక వైపు..ఇనయా ఒక వైపు!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఓటింగ్ లో లీస్ట్ గా ఉంటూ డేంజర్ జోన్ లో ఉన్న ఇనయా, ఒక్కసారిగా తన పర్ఫామెన్స్ తో గ్రాఫ్ పెంచుకొని టాప్ ఫోర్ లోకి వచ్చేసింది. కారణం తను గేమ్ బాగా ఆడటం. అయితే తను నిన్న మొన్నటి వరకు గొడవలు పడి, ఇప్పుడు కొందరితో కలిసిపోతుండటం ప్రేక్షకులను అయోమయంలో పడేస్తోంది. కారణం ఫైమా, ఇనయా నిన్నటి వరకు ప్రతీ విషయంలో గొడవ పడుతూ, వస్తున్నారు. కానీ నిన్న కొత్తగా ఫైమా కెప్టెన్ అయ్యాక ఇనయా కలిసిపోయింది. ఇనయాని ఫేక్ అని అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నిన్న జరిగిన టాస్క్ లో ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య అందరు కలిసి రోహిత్ ని టార్గెట్ చేసి ఆడారు. ఈ విషయం ఇనయా స్పష్టంగా సంచాలకుడిగా ఉన్న రేవంత్ కి చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో తను "నిన్న మొన్నటిదాకా గీతు ఉంది. ఇప్పుడు మీరు తయారు అయ్యారా" అని అంది. దాంతో " ఆదిరెడ్డి అనేవాడు తప్పు చేయడు. తప్పుగా ఆడడు" అని ఆదిరెడ్డి అన్నాడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, హౌస్ లో అందరూ ఒకవైపు, ఇనయా మరోవైపు అని తెలుస్తోంది. తనకి ఎవరి సపోర్ట్ లేకున్నా గేమ్ లో గెలవగలదు అని ప్రతీసారి ఋజువు చేస్తుంది. కానీ గేమ్ లో టీం సపోర్ట్ ఉండాలి. టీం సపోర్ట్ లేకుండా ఎంత పోరాడిన గేమ్ లో గెలవలేరు. ఇనయా ఒంటరిగా పోరాడుతూనే ఉంటోంది. తన బలహీనత ఒక్కటే..ఎవరైనా రెచ్చగొడితే మాటలు జారడం కామన్. అది అయిపోయాక క్షమాపణలు చెప్పడం. హౌస్ మేట్స్, ఇనయాని ఫేక్ అని అనుకుంటున్నారు.  కానీ తను ఒక్కతే రియల్ గేమ్ ఆడుతోంది. నిజానికి హౌస్ లో ఉండాలంటే ధైర్యంగా గేమ్ ఆడాలి. ఎవరి తప్పు ఉన్నా చెప్పాలి. అలా లేదంటే కామ్ గా గేమ్ చూస్తూ కూర్చోవాలి. అయితే ఇనయా టాస్క్ లలో బాగా పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది. తన దగ్గర ఉన్న మైనస్ ఒక్కటే.. ఏదైనా గొడవ జరిగితే దాన్ని అలాగే సాగదీయడం. అలా సాగదీయడం వల్ల చూసే ప్రేక్షకులకు చిరాకు వస్తుంది. ఇనయా గేమర్. ఏ గేమ్ లో ఎవరు, ఎవరికి సపోర్ట్ చేస్తారో అన్ని తెలుసుకొని తన అవకాశం రాగానే ఉపయోగించుకుంటుంది. తను నోరు అదుపులో పెట్టుకుంటే టాప్ త్రీలో ఉండే అవకాశం ఉంది.

బిగ్ బాస్ సీజన్ 4 - సీజన్ 5కి మధ్య రసవత్తరమైన పోటీ!

'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తోంది. ఇక ఈ వారం బిగ్ బాస్ సీజన్ 4 - సీజన్ 5కి మధ్య పోటీ మంచి రసవత్తరంగా ఉండబోతోంది. సీజన్ 4 నుంచి సోహైల్, నోయెల్, అరియానా గ్లోరి, దివి,, అమ్మ రాజశేఖర్ వచ్చారు.  సీజన్ 5 నుంచి టైటిల్ విన్నర్ వీజే సన్నీ, ఆర్జే కాజల్, మానస్, సిరి హనుమంత్, హమిదా హాజరయ్యారు. ఖైదీ మూవీలో కార్తీ  గెటప్ లో బిర్యానీ తింటూ సోహేల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతలో " సిరి.. హౌజ్ లో ఉన్న మీ హార్ట్  శ్రీహాన్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు" అని బిగ్ బాస్ సడెన్ గా అడిగేసరికి  సిరి కన్నీళ్లు పెట్టుకుంది.   తర్వాత " సోహేల్ మీ కథ ఎలా ఉంది" అని అడిగేసరికి .. "బిగ్ బాస్ వల్ల ఇప్పుడు  నేను ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాను. కానీ ఏదో  భయం" అంటూ చెబుతుండగా  వీజే సన్నీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నోయెల్ వచ్చి ఒక అద్భుతమైన రాప్ పాడి అందరిలో ఒక కసిని, జోష్ ని నింపాడు.  ఇక మాజీ కంటెస్టెంట్స్ అంతా  ఏం మాట్లాడారు, వాళ్ళ  జర్నీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే  ఎపిసోడ్ చూడాల్సిందే.

రష్మీకి రోజ్ ఇచ్చి.. గెహెనాతో స్టెప్పేసి.. వర్షను పెళ్లి చేసుకుంటానన్న 'గాలోడు'!

రాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ రోజునే 'గాలోడు' మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సుధీర్ మాత్రమే కనిపించాడు. అలా ఈ మూవీని  ప్రమోట్ చేసుకున్నాడు. ఇక దీనికి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇక ఈ ఎపిసోడ్ మొత్తం కూడా వేరే స్కిట్స్ ఏవీ కనిపించలేదు. ఓన్లీ సుడిగాలి సుధీర్ మాత్రమే కనిపించాడు. 'డీజే టిల్లు' సాంగ్ తో సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. రాంప్రసాద్ డైరెక్టర్ గా, సుధీర్ హీరోగా ఒక స్కిట్ పెర్ఫార్మ్ చేశారు. "చాలా మంది హీరోస్ కి నేను ఫ్లాప్స్ ఇచ్చాను, నీకు కూడా మంచి ఫ్లాప్ ఒకటి ఇస్తాను" అని పంచ్ వేశాడు రాంప్రసాద్. ఇక స్కిట్ లో భాగంగా మూవీ సీన్ ఒకటి చేసాడు సుధీర్. రష్మీకి రోజ్ ఇచ్చి "నేను చచ్చిపోతే నువ్వేడుస్తావో లేదో తెలీదు కానీ నువ్ ఏడిస్తే నేను చచ్చిపోతాను" అనేసరికి, "చావరా చావు" అని తిట్టేసింది రష్మీ. ఇక సుధీర్ , గెహెనా సిప్పీ హీరో హీరోయిన్స్ గా నటించిన 'గాలోడు' మూవీ థియేటర్స్ లో 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి వచ్చింది. సుధీర్, వర్ష, ఇమ్ము ముగ్గురు కలిసి చేసిన స్కిట్ లో "మన పెళ్లి అవుతుందా అసలు?" అని వర్ష, సుధీర్ ని అడిగేసరికి "గాలోడు రిలీజ్ అవగానే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పాడు.. "నాకు అర్థమయ్యిందిలే మన పెళ్లి అవదు" అని కౌంటర్ వేసింది వర్ష. ఇక ఫైనల్ గా రష్మీతో ఒక రొమాంటిక్ సాంగ్ కి స్టెప్స్ వేసి అందరిని ఫిదా చేసేసాడు సుధీర్. 

వరెస్ట్ పర్ఫామర్ గా ఇనయా!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీవారం వరెస్ట్ పర్ఫామర్ ని ఎన్నుకొని జైలు లో వేయడం అనేది‌ అందరికి తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఇది ఆసక్తిని రేపుతోంది. కారణం ఇనయా. తన మాస్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోతున్న ఇనయాకి వరెస్ట్ పర్ఫామర్ ఇవ్వడం అనేది ఇంట్రెస్ట్ గా మారింది. "ఈ వారం హౌస్ లో వరెస్ట్ పర్ఫామర్ ఎవరో? అందరూ కలిసి చెప్పండి" అని బిగ్ బాస్, కంటెస్టెంట్స్ ని అడిగాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా వచ్చి వారికి ఎవరు వరెస్ట్ అనిపించారో, ఎవరి పర్ఫామెన్స్ తక్కువగా ఉందో చెప్తూ ఒక్కొక్కరికి వరెస్ట్ అని స్టాంప్ వేసారు. అలా ఇంటి సభ్యులు, వరెస్ట్ పర్ఫామర్ ఎవరు? ఎవరిని జైలుకి పంపించాలనుకుంటున్నారో అని చర్చించుకున్నారు. అలా అందరు ఒక్కొక్కరిని ఎన్నుకున్నారు. రాజ్, శ్రీసత్యకి వరెస్ట్ పర్ఫామర్ ఇచ్చాడు. మెరీనా, కీర్తి భట్ ని వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకుంది. శ్రీసత్య, రేవంత్ ని వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకోగా, రేవంత్, శ్రీసత్యని వరెస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. అయితే శ్రీహాన్ ఇనయాకి వరెస్ట్ పర్ఫామర్ ఇచ్చాడు. ఆదిరెడ్డి, వసంతి కూడా ఇనయాకే వరెస్ట్ పర్ఫామర్ ఇవ్వడంతో, ఎక్కువ హౌస్ మేట్స్ ఇనయాని వరెస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకున్నట్టుగా డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాత కెప్టెన్ గా ఉన్న ఫైమాని, "ఈ వారం వరెస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పండి" అని బిగ్ బాస్ అడిగాడు. దానికి ఫైమా, "ఎక్కువ మెజారిటీ ఇనయాకి రావడంతో ఇనయా ఈ వీక్ వరెస్ట్ పర్ఫామర్ బిగ్ బాస్" అని చెప్పింది. ఆ తర్వాత ఫైమా, ఇనయాని జైలులో పెట్టి తాళం వేసింది. కాసేపటికి జైలు దగ్గర  మెరీనా, వసంతి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాగా ఈ వారం నామినేషన్ లో ఉన్న ఇనయా సేఫ్ జోన్ లో ఉంది.

హౌస్ లో కొత్త కెప్టెన్ ఫైమా!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీవారం కెప్టెన్ లు మారుతు ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ వారం కొత్త కెప్టెన్ వచ్చేసారు. గత వారం నుండి శ్రీసత్య కెప్టెన్ గా ఉండగా, ఈ వారం ఫైమా ఎన్నికైంది. నిన్న మొన్నటి వరకు సాగిన 'స్నేక్-లాడర్', 'నాగమణి' టాస్క్ లలో ఓడిపోయిన కంటెస్టెంట్స్ ని పక్కన పెడితే, 'కీర్తి భట్, శ్రీసత్య, ఫైమా, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి' మిగాలారు. అయితే ఈ కంటెస్టెంట్స్ చివరి గేమ్ అయిన 'బస్తాలో బాల్స్' టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో చివరగా శ్రీసత్య, ఫైమా ఉన్నారు. ఫైమా తన స్ట్రాటజీ ఉపయోగించి శ్రీసత్య బస్తాలోని బాల్స్ ని పడేసింది. బజర్ మోగేవరకు ఫైమా బస్తాలో బాల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, సంచాలకులుగా వ్యవహరిస్తున్న రేవంత్ ఫైమాని విజేతగా ప్రకటించి, బిగ్ బాస్ కి తెలియజేసాడు. దీంతో హౌస్ లోకి కొత్త కెప్టెన్ గా ఫైమా ఎన్నుకోబడింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు చప్పట్లతో అభినందనలు తెలిపారు. "లోకంలో గొప్పది ప్రేమ..మా ఇంటికి కెప్టెన్ ఫైమా" అని ఆదిత్య గట్టిగా చెప్పగా, హౌస్ మేట్స్ ఓ అంటూ అరిచారు. ఆ తర్వాత ఫైమా కెప్టెన్ అయ్యింది. "అందరికి చెబుతున్నా ఈ వీక్ అందరికి అన్నీ చేకూరేలా, పర్ఫెక్ట్  కెప్టెన్ గా ఉంటానని చెబుతున్నాను" అని ఫైమా, హౌస్ మేట్స్ ని ఉద్దేశించి చెప్పింది. మొదటి సారి కెప్టెన్ అయ్యనందుకు గాను ఫైమా అందరికి థాంక్స్ చెప్పింది.  ఈ మధ్య ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫైమా, కెప్టెన్ గా తన భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుందో? లేదో? చూడాలి మరి.

నువ్వెంత పులిహోర కలిపినా నేను నీకు పడను!

జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ సౌమ్యా రావు వచ్చింది. ఐతే ఈమె ప్రస్తుతానికి పర్వాలేదనిపించేలా చేస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "కొత్తగా వచ్చిందో లేదు అప్పుడే ఆది ట్రాక్ వేయడం స్టార్ట్ చేసాడు", "సౌమ్య వాయిస్ వేరే లెవెల్".. ఇలా అంటూ ఆమె యాంకరింగ్‌కి నెమ్మదిగా అలవాటుపడుతున్నారు ఆడియన్స్.  ఇక నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సౌమ్య బుట్టబొమ్మ సాంగ్‌కి రెడ్ కలర్ డ్రెస్‌లో డాన్స్ వేస్తూ వచ్చింది. ఇంతలో ఆది స్టేజి మీదకు వచ్చి "నువ్వొక్కదానివే చేస్తే ఉత్తి బొమ్మ అవుతుంది.. నాతో కలిసి చేస్తేనే బుట్టబొమ్మఅవుతుంది" అని పంచ్ వేసాడు.  "నువ్వెంత పులిహార కలిపినా నేను నీకు పడను" అని యాంకర్ సౌమ్య కూడా సీరియస్ గానే చెప్పింది. "ఛాలెంజా.. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలుసు కదా!" అని ఆది రివర్స్ అనేసరికి, "చిరంజీవి గారు కాదు కదా" అని టైమింగ్‌తో రివర్స్ పంచ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.  స్టేజి మీద ఎవరేం మాట్లాడినా, కామెంట్ చేసినా సౌమ్య రావు కూడా స్ట్రైట్ గానే కౌంటర్లు పేల్చేస్తోంది. దాంతో ప్రస్తుతానికి బాగానే యాంకరింగ్ చేస్తొందనే అభిప్రాయం కలిగిస్తోంది.

గ్రాండ్ గా రాకేష్ తమ్ముడి కూతురు బర్త్ డే ఫంక్షన్!

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లో రాకింగ్  రాకేష్ ఒకరు. ఇక రాకేష్ ఇటీవలి కాలంలో జోర్దార్ సుజాతతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఏ షోలో ఐనా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించారు కూడా. పెళ్లవకుండానే ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ కి వెళ్లొచ్చారు. ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఐతే రీసెంట్ గా వీళ్ళ ఇంట్లో ఎంతో గ్రాండ్ గా జరిగిన ఒక ఫంక్షన్ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ కంటే ముందే అతని తమ్ముడికి   2021 జనవరిలో వివాహం జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ పెళ్లికి జోర్దార్ సుజాత  కూడా వెళ్ళింది.  ఇక ఇటీవల రాకేష్ తమ్ముడి కూతురు నక్షత్ర ఫస్ట్  బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు రాకేష్ తో పాటు జోర్దార్ సుజాత, శివబాలాజీ, ధన్ రాజ్, రచ్చ రవి, శ్రీవాణి, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి  లాంటి సెలబ్రిటీలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఇక ఈ చిన్నారికి నెటిజన్స్ అందరూ విషెస్ చెప్పారు.

కొత్త టీమ్స్ కి స్కిట్స్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్న ఆది!

హైపర్ ఆది జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. కాబట్టి స్కిట్ ఎలా చేయాలి...ప్రోమోకి ఎలాంటి డైలాగ్ చెప్పాలి...ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అన్ని తెలుసు. ఇక ఇప్పుడు జబర్దస్త్ కి వస్తున్నా కొత్త టీమ్స్ కి సూపర్ సీనియర్ అని చెప్పొచ్చు. ఇక ఆది కొత్తగా వచ్చే కమెడియన్స్ కి యాక్టింగ్ టిప్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా ఒక టీంకి రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో క్లాస్ పీకాడు. కిలాడి కాజా పేరుతో ఒక టీమ్ ఈమధ్య జబర్దస్త్ స్టేజి పైన కనిపిస్తోంది. ఈ టీంలో ఒక కమెడియన్ అసలేం మాట్లాడతాడో అర్ధమే కాదు, అసలది ఏ భాషో కూడా తెలీదు అనిపించేలా డైలాగ్ చెప్పాడు. ఇక పక్కన ఉండి చూస్తున్న హైపర్  ఆది స్టేజి మీదకు వచ్చి "మనం కామెడీ చేసేటప్పుడు ఎడిటర్స్ వెనక్కి వెళ్ళాలి, జడ్జెస్ ముందు రావాలి కానీ మీరు ఎడిటర్స్ ముందుకొచ్చేలా జడ్జెస్ వెనక్కి వెళ్లిపోయేలా స్కిట్ పెర్ఫామ్ చేస్తున్నారు." అని అదిరిపోయే టిప్ ఒకటి ఇచ్చాడు.  తర్వాత "ఇంతకు నీ పేరేంట్రా" అని అడిగేసరికి "ఖిలాడీ ఖాజా" అంటి గట్టిగా అరిచి చెప్పేసరికి "300 ఎపిసోడ్లు చేసిన నేను కూడా ఎప్పుడూ నా పేరుని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదు." అని ఆది కౌంటర్ వేసి కొత్త టీమ్స్ కి స్కిట్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాన్ని చెప్పాడు.

14 నుంచి స్టార్ మాలో 'కృష్ణ ముకుంద మురారి'!

స్టార్ మా ఛానెల్‌లో 'దేవత' సీరియల్ ప్లేస్‌లో 'కృష్ణ ముకుంద మురారి' అనే ఒక కొత్త సీరియల్ ప్రసారం కావడానికి రెడీ అయ్యింది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ సీరియల్ బెంగాలీలో సూపర్ హిట్ అయిన 'కుసుమ డోలా'కి రీమేక్‌గా తెరకెక్కింది.   ఇక ఈ సీరియల్‌లో హీరో మురారి పాత్రలో గగన్ చిన్నప్ప నటిస్తున్నాడు. గగన్ కన్నడలో 'మంగళ గౌరీ మధువే' అనే సీరియల్‌లో నటించాడు. అలాగే బిగ్ బాస్ కన్నడ సీజన్లో 8వ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఇక ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా ప్రేరణ కంభం నటిస్తోంది. ఈమె కన్నడలో 'రంగనాయకి', 'హరహరమహాదేవ' అనే సీరియల్స్‌లో నటించింది. ఇంకా 'కరాళి', 'చురకత్తి' అనే మూవీస్‌లో నటించింది. అలాగే ఈ సీరియల్‌లో సెకండ్ హీరోయిన్‌గా యష్మి గౌడ నటిస్తోంది. ఈమె 'నాగ భైరవి' సీరియల్‌లో భైరవిగా నటించింది.  ఇంకా ఈ సీరియల్‌లో ప్రభాకర్ హీరోయిన్ తండ్రిగా కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిన ఈ సీరియల్ తెలుగులో ఎలా ఉండబోతుంది, ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక ఈ కొత్త సీరియల్ నవంబర్ 14 నుంచి స్టార్ మాలో రాత్రి 8.30 గంటలకు ప్రసారం కాబోతోంది.