నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్!

పంచ్ ప్రసాద్ పేరు 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చూసేవాళ్లకు బాగా తెలుసు. అప్పటికప్పుడు పంచులు, జోకులు వేస్తూ ఉంటాడు ప్రసాద్. ఐతే ఇతను కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న విషయాన్ని కూడా అన్ని స్టేజెస్ మీద చెప్తూనే ఉంటాడు. ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వించడంలో మాత్రం ఎక్కడా తగ్గేవాడు కాదు. రీసెంట్‌గా ప్రసాద్ మరో సమస్యతో బాధపడుతున్నాడు.  ప్రతీ వారం డయాలసిస్ చేయించుకుని వచ్చి ఆడియన్స్‌ని నవ్విస్తూ ఉండే ప్రసాద్ ఇప్పుడు నడవలేని స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్స్ నూకరాజు, ఆసియా వారం నుంచి ప్రసాద్ ఇంట్లోనే ఉంటూ వాళ్లకు సాయం చేస్తున్నామని చెప్పారు.  ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఇంటికొచ్చేసరికి ఫుల్ ఫీవర్‌తో, నడుము నొప్పితో చాలా బాధపడేసరికి హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించామని, ఐతే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టినట్లు డాక్టర్స్ చెప్పారని చెప్పింది. ఇదంతా నూకరాజు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని నూకరాజు ఈ వీడియో ద్వారా కోరాడు.   

భానుశ్రీ పాడిన పాటను ఫన్నీగా ట్రోల్ చేసిన అష్షు!

సోషల్ మీడియాలో అష్షు రెడ్డి  ఏది చేసిన ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాత్ టబ్ లో స్నానం చేసినా, ఆర్జీవీతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నా, పవన్ కళ్యాణ్ పేరు నడుము మీద వేయించుకున్నా ఏదో ఒక న్యూస్ తో రోజూ ట్రెండింగ్ లో ఉంటుంది.  ఇక ఇప్పుడు కూడా భానుశ్రీని ఇమిటేట్ చేస్తూ ఫుల్ వైరల్ అవుతోంది అష్షు. శ్రీదేవి డ్రామా కంపెనీలో రీసెంట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో యాక్టర్ భానుశ్రీ పవన్ కళ్యాణ్ మూవీ  ‘తీన్ మార్’ నుంచి   ‘గెలుపు తలుపులే’ అనే  సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన తర్వాత జడ్జి ఇంద్రజ.. ‘పాటలో డెప్త్ కనబడుతోంది’ అని కామెంట్ చేసింది. ఇక ఈ బిట్ మీద సోషల్ మీడియాలో  మీమ్స్ బాగా వస్తున్నాయి.  ఇదంతా ఒక ఎత్తు ఐతే  అషూరెడ్డి భాను పడిన పాటనే ఫన్నీగా రీల్ గా చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నీకున్నంత ఎనర్జీ ఎవరికీ ఉండదు..ఈ రీల్ నీకోసమే డేడికేట్ చేస్తున్నా" అని ఒక టాగ్ లైన్ పెట్టింది ఈ వీడియోకి.

టాస్క్‌లో టఫ్ ఫైట్ ఇచ్చి ట్రెండింగ్‌లో ఉన్న ఇనయా!

బిగ్ బాస్ లో ప్రతీవారం కెప్టెన్ కోసం పోటీ జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఆ టాస్క్ లు గెలవాలంటే బుద్ధి బలంతో పాటుగా, కండ బలం కూడా ఉండాలి. అయితే ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్ తో పాటుగా ఇనయా ఉంది.  అయితే టాస్క్ మొదలవ్వక ముందు ఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తా అని మాట్లాడాడు రేవంత్. తర్వాత శ్రీహాన్ తో కలిసి ఆడాడు. ఆ తర్వాత ఇనయాని రేవంత్ ఓడించాడు. అయితే రేవంత్ కి గట్టి పోటీని ఇచ్చింది ఇనయా. ఇది చూసి హౌస్ మేట్స్ అందరు 'వెల్ డిఫెండ్ ఇనయా' అంటూ సపోర్ట్ గా ఉన్నారు.  కాగా తను మాత్రం ఏడుస్తూ కనిపించింది. "కెప్టెన్ కోసం జరిగే చివరి టాస్క్ లో ఓడిపోవడం కొత్తేమీ కాదు. నాకు ప్రతీసారి ఇదే జరుగుతుంది"  అని ఇనయా ఒక్కతే, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. అయితే ఇనయా ఫైట్ ని వీక్షించిన ప్రేక్షకులు, తమ‌ సపోర్ట్ ని తెలుపుతున్నారు.  కాగా ఇప్పుడు #Inaya ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఎలిమినేషన్ లో ఉన్న ఇనయా గ్రాఫ్ అమాంతం పెరిగి, ప్రస్తుతం సెకండ్ ప్లేస్ కి చేరుకుంది. ఇది ఇలాగే కొనసాగితే తనే బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

డేంజర్ జోన్ లో మెరీనా-రోహిత్ !

బిగ్ బాస్ హౌస్ లో గందరగోళం జరుగుతుంది. కారణం కంటెస్టెంట్స్ చేసే పనులకి, స్ట్రాటజీలకు బిగ్ బాస్ వీక్షించే ప్రేక్షకులు..ఎవరు నటిస్తున్నారు? ఎవరు ఫేక్ ? అని తెలుసుకోలేకపోతున్నారు. అయితే నిన్న మొన్నటి దాకా అందరూ కలసి ఇనయాను టార్గెట్ చేసారు అని అనిపించింది. కానీ నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో తనను సపోర్ట్ చేసేవారు ఎక్కువ అయ్యారు. అయితే కీర్తి భట్, శ్రీహాన్ ల మధ్య ఒక ఇగోతో కూడిన కోల్డ్ వార్ జరుగుతోంది అని చెప్పాలి.  అయితే టాప్ త్రీ లో ఉండాల్సిన ఆదిరెడ్డి , ఓటింగ్ పర్సెంటేజ్ పూర్తిగా పడిపోయింది. ఆదిరెడ్డి టాస్క్ లో సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వకపోవడం ఒక కారణం అయితే, హౌస్ మేట్స్ తో తన ప్రవర్తన మారిపోవడం మరొక కారణం. కాగా మెరీనా, రోహిత్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. కీర్తి భట్  గేమ్ లో బాగా పర్ఫామెన్స్ ఇవ్వడంతో,  ఓటింగ్  శాతాన్ని పెంచుకుంది. దీంతో ఆదిరెడ్డిని దాటి తన టాప్ ఫై లో స్థానం సంపాదించింది. ఇక వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అని ఉత్కంఠ అందరిలోను ఉంది.

కొత్త కెప్టెన్ గా రేవంత్!

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బయట ఫ్యాన్ బేస్ కూడా చాలానే ఉంది. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా జరిగిన గేమ్ లో రేవంత్ గెలిచాడు.  టాస్క్ లో గెలిచి, కెప్టెన్ గా ఎన్నికైన రేవంత్ కి ఇది సెకండ్ టైం కావడం విశేషం. కాగా సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.  రేవంత్ హౌస్ లో అందరిని బాగా హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే ఆ లీడర్ షిప్ క్వాలిటీస్ తనలో ఉన్నాయని మొదటిసారి కెప్టెన్ అయ్యినప్పుడు స్వయంగా నాగార్జునే చెప్పాడు. కాగా హౌస్ లో ఉన్న పది మందిలో అందరు రేవంత్ తో బాగా మాట్లాడేవాళ్ళే, ఒక్క ఇనయా తప్ప. అయితే రేవంత్ మరో వారం  కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినందువల్ల ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.

BB Transport Task లో గెలిచిందెవరు?

ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో బిగ్ బాస్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అలాంటిది టాస్క్ ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఈ టాస్క్ లు ఎలా ఉంటాయంటే మిత్రులుగా ఉన్నవాళ్ళు, శత్రువులు అవుతారు. ఇప్పటికే దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా దూరం అవుతారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఒక కొత్త టాస్క్ మొదలైంది. అదే 'BB Transport Task'. ఈ టాస్క్ ఏంటంటే, "గార్డెన్ ఏరియాలో ఒక 'బిబి ట్రాన్స్ పోర్ట్' వాహనం ఉంది. ఒక్కో స్టాప్ కి మొదట ఎవరు ఎక్కి హారన్ కొడతారో? వారే కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అర్హతను సాధిస్తారు. అందులో ఓడినవారు.. ఒక్కో సభ్యుడు ఇద్దరు చొప్పున సభ్యులను  ఎన్నుకొని వారిని ఈ గేమ్ లో నుండి తొలగించాలి. ఆ తర్వాత ఉన్నవాళ్ళు ఈ గేమ్ ని కొనసాగిస్తారు" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో అదిరిపోయే ట్విస్ట్ లు ఉన్నాయి. బిగ్ బాస్ ప్రతీ రౌండ్ కి ఒక అమౌంట్ ను ఫిక్స్ చేసాడు. ఈ అమౌంట్ అనేది విన్నర్ ప్రైజ్ మనీ నుండి కోత విధించబడుతుంది. ఆ తర్వాత గేమ్ లో ఓడినవాళ్ళు ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. రాజ్ ని ఇనయా సెలెక్ట్ చేసి తనని కెప్టెన్ పోటీ నుండి తొలగించగా, ఫైమా కూడా అదే తరహాలో తొలగిపోయింది‌. ఇక రేపు జరుగబోయే చివరిదైన కెప్టెన్సీ పోటీలో పాల్గొనడానికి రంగం సిద్ధమైంది. కాగా ఈ 'బిబి ట్రాన్స్ పోర్ట్' టాస్క్ లో విజేతలుగా నిలిచింది అయిదుగురు మాత్రమే. 'శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా' కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధించారు. అయితే ఈ పోటీలో గెలిచేదెవరో? కెప్టెన్ అయ్యేదెవరో? చూడాలి మరి!  

శ్రీహాన్ కి ఓపెన్ కౌంటర్ ఇచ్చిన కీర్తి భట్!

రోజుకో ట్విస్ట్ తో బిగ్ బాస్ మలుపులు తిరుగుతుంది. గత సోమవారం నామినేషన్స్ లో మొదలైన గొడవలు మరింతగా పెరిగాయి. కారణం ఏంటంటే కంటెస్టెంట్స్ ఈ గొడవలను ఇంకా పెంచుకుంటూ రావడమే. అయితే సోమవారం జరిగిన నామినేషన్స్ లో కీర్తిభట్ తనకి శ్రీహాన్ కెప్టెన్సీ నచ్చలేదు అని చెప్పడం..శ్రీసత్య ఆటిట్యూడ్ బాగోలేదని చెప్పి నామినేట్ చేయడం. అంతా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అదే 'BB Transport Task'. కాగా మొదట బజర్ రాగానే అందరు పాల్లొనగా అందులో ఆదిరెడ్డి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ కి అర్హత సాధించాడు. అయితే శ్రీహాన్, శ్రీసత్యని ఎన్నుకుంది కీర్తి భట్. తను అలా ఎన్నుకున్నాక కారణం చెబుతూ " శ్రీసత్య అల్రెడీ కెప్టెన్ గా చేసింది. ఇంకా శ్రీహాన్ కెప్టెన్సీ బాగోలేదు..ముందు ఉన్నట్టుగా లేడు" అని అంది. దానికి రిప్లైగా శ్రీహాన్ మాట్లాడుతూ "అర్థం అయ్యింది..టార్గెట్ చేసావ్" అని అన్నాడు. అలా అనేసరికి విసిగిపోయిన కీర్తి భట్ "అవును..నువ్వే నా టార్గెట్" అని ఓపెన్ కౌంటర్ ఇచ్చింది. "ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు తీసుకోవాలి.. అలా తీసుకోకపోతే మనమేం చెయ్యలేం" అని కీర్తి భట్ అంది. అలా అనడంతో శ్రీహాన్ "ఆ మాట నువ్వు మాట్లాడుతున్నావా?" అంటూ సెటైర్ వేసాడు. దీనికి కీర్తి భట్ కూడా గట్టిగా సమాధానమిచ్చింది. "నువ్వు మాట్లాడుతున్నావ్ గా..నేను మాట్లాడుతాను" అని అలాగే సెటైర్ వేసింది. దీంతో శ్రీహాన్ సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ మొదలైంది. గేమ్ లో ఒక్కొక్కరుగా కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధించారు. అలా అందరూ అయిపోగా, ఇనయా, కీర్తి భట్, మెరీనా ముగ్గురు మిగిలారు. వీరు ముగ్గురు డిసైడ్ చేసుకొని వారి ఏకాభిప్రాయం చెప్పాలి. కానీ మొదట ఇనయా డ్రాప్ అవుతా అంది. ఆ తర్వాత కీర్తిభట్ డ్రాప్ అవుతా అంది. అయితే శ్రీహాన్, రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి నలుగురు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే కీర్తి భట్ ని గేమ్ నుండి తప్పించి..ఇనయా, మెరీనాని కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో కీర్తి భట్ బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. 

ఏమిటి మంచం అడిగావంట..హీరోయిన్ ముందు సుధీర్ పరువు పాయే!

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వల్ల స్టార్ యాంకర్ హోదా సంపాదించుకున్నాడు. ఒక వైపు టీవీ షోస్, మరో వైపు మూవీస్, ఈవెంట్స్ వంటి వాటితో  ఫుల్ బిజీగా ఉన్నాడు. "సాఫ్ట్ వేర్ సుధీర్" మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ రీసెంట్ గా "గాలోడు" మూవీలో నటించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు ఈ టీమ్.  ఇక ఇప్పుడు ఈ మూవీ హీరో హీరోయిన్స్ సుధీర్‌, గెహ్నాసిప్పి బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో  బిత్తిరి సత్తి, సుధీర్‌పై పంచుల వర్షం కురిపించాడు.  వీళ్ళ మధ్య జరిగిన ఒక ఇంటరాక్షన్ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఇంటర్వ్యూ ప్లేస్ లో  వీళ్ళ ముగ్గురు నిలబడి ఉన్నారు. ఇంతలో సత్తి పోస్టర్ చూసి దుమ్ము లేపుతున్నావుగా అని సుధీర్ ని అనేసరికి "ఏదో యాక్షన్ సీన్ అన్నా...మనం కూర్చుని మాట్లాడుకుందాం’’ అని అన్నాడు. అందుకు సత్తి ‘‘కుర్చీల్లేవు ..ఏం లేవు..ఆ టెంటు వాడికి చెప్పాను..ఛ..కుర్చీలు నేనే తెచ్చుకోవాలి..మైకులు కూడా నేనే తెచ్చుకోవాలి’’ అని అసహనంతో ఫోన్ చేసి ‘‘ అరే రాజు ! ఓ మూడు కుర్చీలు తీసుకురా.. చెక్కవి. మా దోస్తురా.. సినిమా చేస్తున్నాడు. ఓ మెట్లు ఎక్కుతున్నావా’’ సరే రా " నువ్వు మంచాలు తెమ్మని చెప్పినావా"  అని సుధీర్‌ వైపు చూసి అడిగేసరికి. అయ్యో "నేనెందుకు మంచాలు తెమ్మని చెప్తాను...ఇంటర్వ్యూ కదా  కుర్చీలు తెమ్మని చెప్పు అన్నా’’ అన్నాడు.  ఇక సత్తి ‘‘నీ ప్రోగ్రాం అంటే మంచాలు అంటున్నారు వాళ్ళు మరి’’ అనేసరికి  సుధీర్‌ నవ్వుతూ ‘‘కాదన్నా’’ అని సమాధానం ఇచ్చాడు. చివరికి కుర్చీలు తెప్పించాడు సత్తి.

అర్ధరాత్రి ఆమె గుర్తుకొచ్చింది.. క్రీం బిస్కెట్ వేసిన జెస్సీ!

మోడల్ జెస్సీ కాస్తా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక ఇప్పుడు హీరో కూడా ఐపోయాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక జెస్సీకి మంచి ఆఫర్స్ రావడం మొదలయ్యింది. 'ఎక్స్‌పోజ్డ్' వెబ్ సిరీస్‌లోలో ఒక కీలక రోల్‌లో నటించాడు. ఇక ఇటీవల జెస్సీ నటించిన 'ఎర్రర్‌ 500' మూవీ ట్రైలర్‌ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చేసింది.  ఇక మూవీ ప్రమోషన్స్‌ పనిలో మునిగి తేలుతున్నాడు జెస్సీ. లేటెస్ట్‌గా 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి గెస్ట్‌గా వచ్చిన జెస్సీ సీరియల్‌ నటితో కలిసి స్టెప్పులేశాడు. "బావగారు బాగున్నారా" టైటిల్‌తో ఈ వారం బావామరదళ్ళు అంతా కలిసి ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. జెస్సీ ఈ ఎపిసోడ్‌లో అమ్మాయిలను బాగా పటాయించాడు. తాను డాన్స్ చేసిన అమ్మాయి కోసమే ఈ షోకి వచ్చినట్లు చెప్పాడు. రెండ్రోజులు తనతో చేసిన కలిసి డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేసరికి ఆమె మాయలో పడిపోయినట్లు జెస్సీ చెప్పుకొచ్చాడు.   అంతేనా! అర్ధరాత్రి 12 గంటలకు ఆమె గుర్తొచ్చి ఏం చేయాలో తెలియకపోయేసరికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి ఆమె ఫొటోలే చూస్తూ ఉండిపోయానంటూ క్రీం బిస్కెట్ వేసాడు. ఇక జెస్సీ మాటలకు ఫ్లాట్ ఐపోయిన ఆ నటి అతడిని గట్టిగా హగ్ చేసేసుకుంది. ఈ మధ్య గ్యాప్‌లో జడ్జి ఇంద్రజ చేత్తో హార్ట్‌ సింబల్‌ వేసి రొమాంటిక్ సాంగ్ హమ్ చేసింది. ఇక స్క్రీన్‌ మీద హార్ట్‌ సింబల్స్‌, లవ్‌ సాంగ్స్‌ ప్లే అయ్యాయి. ఇదంతా నిజంగా ప్రేమేనా.. లేదంటే షో కోసం చేశారా అనే విషయం తెలియాలంటే సండే వరకు వెయిట్ చేయాలి. 

రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో ఎవరు?

రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్‌ని ని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కొత్త ప్రోమో విడుదల చేశారు. "బావగారు బాగున్నారా" అనే కాన్సెప్ట్‌తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ ఎపిసోడ్‌కి బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ చాలా రొమాంటిక్‌గా ఉంది.  ఐతే ఇందులో ఫైనల్‌గా మరో కాన్సెప్ట్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ఇంటరెస్టింగ్ థంబ్ నెయిల్స్ కొన్నిటిని తీసుకుని ప్లే చేసి వాటికి ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ థంబ్ నెయిల్ ఆది పోస్టర్‌తొ పెట్టింది. అది.. "ఆది జబర్దస్త్‌లో ఒక స్కిట్‌కి ఎన్ని లక్షలు తీసుకుంటాడో మీకు తెలుసా?". ఇక రష్మీ పోస్టర్‌తో ప్లే చేసిన సెకండ్ థంబ్ నెయిల్ "రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చారంట..ఎవరా హీరో?". దీనికి ఇంద్రజ "ఎవరా హీరో?" అనేసరికి రష్మీ ఆన్సర్ చేయలేక తుళ్ళిపడింది.   ఇక నాటి నరేష్ పోస్టర్‌తో ప్లే చేసిన మూడవ థంబ్ నెయిల్ "నాటీ నరేష్ లోపం గురించి డాక్టర్ ఏమన్నారో తెలుసా?". ఇలా థంబ్ నెయిల్స్‌కి వీళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు కానీ వాటిని ఈ ప్రోమోలో మ్యూట్ చేశారు. కాబట్టి ఈ ప్రశ్నలకు వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.  

నువ్వు దరిద్రంగా ఉంటావ్.. ఆదిపై నయని కామెంట్స్ వైరల్!

ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ షో ఇప్పుడు సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కింగ్ మూవీ సాంగ్‌తో గిటార్ ప్లే చేస్తూ వచ్చి డాన్స్ చేశాడు అఖిల్ సార్థక్.   ఇక అఖిల్ డాన్స్ చూసి చాలా బాగుంది అంది పూర్ణ.. "నాకు అఖిల్ డాన్స్ అంటే చాలా ఇష్టం" అని ఆది సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక ఈ షోలో నయని పావనిని టీజ్ చేయకుండా ఉండడు ఆది. అదే ధోరణిలో "ఎప్పుడూ లేనంత దరిద్రంగా ఉంది ఈ రోజు నయని" అని కామెంట్ చేసాడు. "నువ్వైతే రోజూ దరిద్రంగానే ఉంటావ్" అని కౌంటర్ ఇచ్చిపడేసింది నయని.  తర్వాత జోడీస్ టీం లీడర్ శ్వేత వచ్చి అద్దిరిపోయే డాన్స్  పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఫైనల్‌గా ఆది స్టేజి మీదకు వచ్చి "వచ్చే వారం ఎపిసోడ్‌లో ఫస్ట్ పెర్ఫార్మెన్స్ నాదే" అని చెప్పాడు.  ఇక ప్రదీప్ కొంటెవాడని ఆల్రెడీ తెలుసు కదా! "నెక్స్ట్ వీక్ డాన్స్‌కి సంబంధించి కమింగ్అప్ ఏమన్నా ఇవ్వొచ్చుగా" అనేసరికి ఆది ఒక రెండు స్టెప్పులేసి స్టైల్ కొట్టాడు. మరి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్‌కి ఫైనల్స్‌కి ఏ జోడి వెళ్తుందో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయాలి. 

రాజ్ ఒక్కడే సేఫ్!

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుండి ఒకరు సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ అవకాశం కల్పించాడు.  "తమని తాము సేవ్ చేసుకోడానికి, విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుండి కోత విధించడం జరుగుతుంది. బిగ్ బాస్ మీకు చెక్ ఇస్తున్నారు. గార్డెన్ ఏరియాలో ఉన్న డ్రాప్ బాక్స్ లో చెక్ పై తమ ఇమ్యూనిటి పెంచుకోవడం కోసం ఒక ధరను ఎంచుకొని అందులో వేయాలి. ఇమ్యూనిటి ధర ఒక లక్ష నుండి మొదలు అయిదు లక్షల వరకు ఉంటుంది. మీరు ఒక యూనిక్ ధరను ఆ చెక్ పై రాయాలి. అయితే మీరు చెక్ మీద రాసిన అమౌంట్ ని ఏ విధంగా కూడా ఇంటి సభ్యులతో చర్చించకూడదు" అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమకి నచ్చిన అమౌంట్ ని రాసి, డ్రాప్ బాక్స్ లో వేసారు. అయితే శ్రీసత్య కోడ్ భాషలో తను రాసిన అమౌంట్ ని శ్రీహాన్ కి చెప్పింది. "శ్రీసత్య, అలా మాట్లాడటం తప్పు. మీరు చేసింది స్పష్టంగా తెలుస్తుంది. అలా చెప్పినందువల్ల మీరు ఈ పోటీ నుండి తొలగించబడ్డారు" అని బిగ్ బాస్ చెప్పాడు. కాగా రేవంత్, కీర్తి భట్ ఇద్దరు ఒకే నెంబర్ రాయడం వల్ల రిజెక్ట్ అయ్యారు. ఇనయా, మెరీనా రెండవ అత్యధిక మొత్తాన్ని రాసారు. కాబట్టి వారిని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు సేమ్ రాసారు కాబట్టి వీరిద్దరు కూడా తొలిగిపోయారు. చివరగా రోహిత్ రెండు లక్షలు రాయగా, రాజ్ నాలుగు లక్షలు రాసాడు. కాబట్టి రాజ్ అందరి కన్నా హై యూనిక్ వాల్యు రాసినందువల్ల, ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యాడు.

‘నా పేరు సూర్య’ మూవీని తారక్ తో చేయాల్సింది

ఆలీతో సరదాగా షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి వక్కంతం వంశి వచ్చారు. ఈ షోలో ఆయన  ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు కూడా చెప్పారు.   ‘‘నా జీవితంలో ఒక రచయితగా మంచి గుర్తింపు తెచ్చిన  చిత్రం ‘కిక్‌’. ‘నా పేరు సూర్య’ మూవీ ఒరిజినల్‌గా తారక్‌తో చేయాల్సిన చిత్రం. ఆయనే నన్ను డైరెక్టర్ ని చేస్తానని  చెప్పారు ఐతే అప్పటికే టెంపర్ మూవీ ఐడియా చెప్పాను. అలా ఆయన ఆ మూవీని చేయలేదు తర్వాత అల్లు అర్జున్ కి కథ వినిపించాను ఆయన ఓకే చేశారు అని చెప్పారు. ఇక  ఈ షో మధ్యలో  ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ భార్య  ఒకప్పటి ‘ఆట’ ఫేమ్‌ శ్రీవిద్య వచ్చారు. "కొంతకాలం క్రితం వరకు సోషల్ మీడియాలో కనిపించేదానివి ఈ మధ్య ఎందుకు కనిపించట్లేదు ఎవరైనా నీ మనసును బాధ పెట్టారా" అని ఆలీ అడిగేసరికి " బాధ కంటే పెద్ద పదం ఏదీ లేదు" అని కన్నీటి పర్యంతమయ్యింది శ్రీవిద్య. ఇక తన మనసులో తన బిడ్డ గురించి చెప్తూ ఏడ్చేసరికి ఆలీ కూడా ఈ షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక రోజు, రెండు రోజు లవ్‌లు ఈ వయసుకు అవసరం లేదు!

చిల్డ్రన్స్ డే సందర్భంగా లిటిల్ హార్ట్స్ పేరుతో ప్రసారమైన షోలో  పిల్లలకు మధ్య పోటీ మంచి రసవత్తరంగా సాగింది. ఇక ఈ షోకి హోస్ట్స్ గా సిరి హన్మంత్, డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ వచ్చారు. అలాగే ఈ షోకి జడ్జెస్ గా ఆమని, అన్నపూర్ణ వచ్చారు. మణికంఠ చిన్నపిల్లలతో డాన్స్ చేయించి స్టేజి ఇరగొట్టేసారు. ఇక పిల్లల్ని పేరెంట్స్ నిద్ర పుచ్చే టాస్క్ ఇచ్చారు యాంకర్స్.  ఐతే పేరెంట్స్ ఎంత ట్రై చేసినా వాళ్ళు నిద్రపోకుండా అల్లరి చేసేసరికి పిల్లలు గెలిచారని అనౌన్స్ చేసాడు డాక్టర్ బాబు. ఇక పల్సర్ బైక్ రమణ వచ్చి టిక్ టాక్ బాను కి లవ్ ప్రొపోజ్ చేసాడు. దాంతో స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. అలాగే రమణ స్టేజి మీదకు వాళ్ళ అమ్మను పిలిచేసరికి "మీకు అమ్మాయి నచ్చిందా" అని ఆది అడిగాడు. "అమ్మాయి నచ్చింది" అని ఆమె కూడా చెప్పేసింది.  ఇక భాను కోసమే రెండు పాటలు కూడా పాడాడు. ఇక అన్నపూర్ణ  ఆ పాటలు విని ఫుల్ మెస్మోరైజ్ ఐపోయింది. ఇలాంటి ఒక రోజు, రెండు రోజు లవ్ లు ఈ వయసుకు అవసరం లేదు దాని గురించి ఆలోచించకు అని చెప్పింది.

బర్రెల గురించి తెలీదు కానీ బఫెలో లోన్ కావాలంట

క్యాష్ షోకి ఈ వారం లవ్లీ కపుల్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుంచి హరికృష్ణ-ప్రశాంతి, సుధీర్-అస్మిత, ఆట సందీప్-జ్యోతిరాజ్, అమ్మ రాజశేఖర్ - రాధా వచ్చారు. ఇక సుమ పంచ్ డైలాగ్స్ వేసి ఎంటర్టైన్ చేసింది. మొగుడు పెళ్లాలంటే పౌడర్, అద్దంలా ఉండాలి అని అమ్మ రాజశేఖర్ పెయిర్ కి చెప్పింది. ఇక తర్వాత  భార్యలకు ఒక అదిరిపోయే టాస్క్ కూడా ఇచ్చింది. లిప్ స్టిక్ వేసుకుని వాళ్ళ వాళ్ళ భర్తల పేరులోని ఫస్ట్ లెటర్ ని పేపర్ మీద లిప్స్ తో రాయాలి అని చెప్పింది. ఇక అందరూ స్పీడ్ గా టాస్క్ కంప్లీట్ చేస్తే అమ్మ రాజశేఖర్ వైఫ్ కంప్లీట్ చేయకపోయేసరికి ఒక అరగంట టైం ఇవ్వండి అని అడిగేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఫైనల్ లోన్ ఇచ్చే ఏజెంట్ అవతారం ఎత్తింది సుమా. "బర్రెలు కొనుక్కోవడానికి బఫెలో లోన్ కావాలి అని అడిగేసరికి వాళ్ళ వైఫ్ మధ్యలో వచ్చి ఆడ గేదె పాలిస్తుందా, మగ గేదె పాలిస్తుందా అనే విషయమే తెలియదు" అని చెప్పేసరికి ఇలాంటాయనకు లోన్ ఎలా ఇవ్వాలి" అని అరిచింది సుమ. ఇక "ఆట సందీప్ వచ్చి నా వైఫ్ కి తాజ్ మహల్ కట్టిద్దామనుకుంటున్న అనేసరికి జ్యోతి వచ్చి ముద్దు పెడుతుంది..ఆ సీన్ చూసిన సుమ ఏంటి పొంగిపోతున్నావ్ తాజ్ మహల్ అంటే సమాధి..నువ్ బతికుండగానే సమాధి కట్టిస్తాడట" అనేసరికి అందరూ నవ్వేశారు.

అఖిల్‌ని నలిపేస్తానంటున్న విష్ణుప్రియ!

ఇటీవల "జరీ జరీ పంచెకట్టు" సాంగ్‌తో ఫుల్ ఫేమస్ ఐన యాంకర్ విష్ణుప్రియ. ఇటీవల ఆమె 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో సుడిగాలి సుధీర్‌తో కలిసి నటించింది. ఈమె లేటెస్ట్‌గా జీ తెలుగులో ప్రసారం అవుతున్న 'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' షోకి గెస్ట్‌గా వచ్చింది.  ఇక ఈ షో హోస్ట్‌గా ఉన్న ప్రదీప్ "నీ క్రష్ ఎవరు?" అని విష్ణుప్రియను అడిగాడు. దానికి ఆమె "అక్కినేని అఖిల్" అని జవాబిచ్చింది. "అఖిల్ అంటే నాకు క్రష్. అతన్ని చూస్తే చాలు నలిపేస్తా" అన్నట్టుగా రెండు చేతులతో ఒక పోజ్ పెట్టేసరికి అందరూ షాకయ్యారు.  "అఖిల్ భయ్యా ఆ 'ఏజెంట్' మూవీలో వాడినవి నిజమైన గన్నులైతే వెంటనే కాల్చేయ్" అని కౌంటర్ వేశాడు ప్రదీప్. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా' అనే షోతో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది విష్ణుప్రియ. ఆ షో కొంత వరకు సక్సెస్ అయ్యేసరికి ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఐతే సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్‌గా కెరీర్ పరంగా ఉండట్లేదు విష్ణుప్రియ. 

తన హెల్త్ అండ్ బ్యూటీ సీక్రెట్ ని రివీల్ చేసిన యాంకర్ రష్మీ

చెఫ్ మంత్ర అంటే చాలా మంచి ఫుడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించే షో.. ఈ షోకి దాదాపు ఇండస్ట్రీ నుంచి చిన్నా పెద్దా సెలెబ్స్ వచ్చి వంటలు చేసి ఫన్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఈ షోకి రష్మీ, గెటప్ శీను వచ్చారు. "రష్మీ నేను నిన్ను పదేళ్ల నుంచి చూస్తున్నా అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావ్"..కారణం ఏమిటి అని మంచు లక్ష్మి అడిగేసరికి.."నేను సాత్వికాహారం తినడానికే ఇష్టపడతాను. పెద్ద టెన్షన్స్ అవి పెట్టుకోను..అలాగే ఒక ట్రైనర్ ద్వారా వెయిట్ లాస్ అవడానికి కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాను. అంటే దాదాపు 10 అంతస్తుల వరకు మెట్ల మీద నడిచే వెళ్తాను. అన్ని మెట్లు ఎక్కినా ఆయాస పడను..ఎందుకంటే నా టార్గెట్ అది. ఎన్ని మెట్లెక్కినా ఆయాసపడకూడదు అని. చాలామంది నన్ను వెయిట్ లాస్ కి సంబంధించి నేను ఏ టిప్స్ ఫాలో అవుతానో చెప్తూ  వీడియోస్ చేయమని అడిగారు. కానీ నేను అలా చేయను. ఎందుకు అంటే నేను ఒక ప్రొఫెషనల్ దగ్గర ట్రైన్ అవుతున్నాను. నాకు సెట్ ఐనవి వేరే వాళ్లకు సెట్ కాకపోవచ్చు. దాంతో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఎవరికీ ఇది చేయండి అని సజెస్ట్ చేయను. అలాగే నేను ఇదే తినాలి అని ఒక పర్టికులర్ గా ఏ నియమం పెట్టుకొను..అదే నా బ్యూటీ సీక్రెట్ కూడా ". అని తన హెల్త్ సీక్రెట్ గురించి మంచు లక్ష్మి షో చెఫ్ మంత్రలో రివీల్ చేసింది.

శ్రీసత్యపై నెటిజన్ల కామెంట్ల వర్షం!

ఈ బిగ్ బాస్ సీజన్లో బ్యూటీ ఆఫ్ ది సీజన్ గా చెప్పుకునేది శ్రీసత్య అనే విషయం తెలిసిందే. కాగా గత వారం గెస్ట్ గా వచ్చిన కమెడియన్ హైపర్ ఆది కూడా 'నీ కోసమే చాలా మంది ఫ్యాన్స్  బిగ్ బాస్ చూస్తున్నారు' అని అన్నాడు. ఇలా అందరు తన గ్లామర్ ని పొగడటంతో, కాస్త తల పొగరుగానే ప్రవర్తిస్తోంది. కాగా గత నాలుగు వారాల నుండి శ్రీసత్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీసత్య గత కొన్ని రోజులుగా రేవంత్, శ్రీహాన్ లతో మాత్రమే ఉంటుంది. మిగతా కంటెస్టెంట్స్ తో సరిగా మాట్లాడట్లేదు. అదే విషయం గురించి కీర్తి భట్  సోమవారం జరిగిన నామినేషన్ లో మాట్లాడుతూ "నేను సత్య.. సత్య అని పిలిచినా కూడా పట్టించుకోకుండా, నా ముందు నుండే వెళ్ళావ్" అని చెప్పి నామినేట్ చేసింది. ఇనయా,  కీర్తి భట్ లతో శ్రీసత్య మాట్లాడే విధానం, వాళ్ళని వెక్కిరించడం, ఒక ఆటిట్యూడ్ తో కూడిన వెటకారం చూసి ప్రేక్షకులకు కూడా చిరాకు వేస్తుందనే చెప్పాలి.  కెప్టెన్ గా కూడా ఆమె ఫెయిల్ అయింది. నామినేషన్ లో కూడా తన పొగరుతో ఒక నెగెటివ్ మార్క్ పడిందనే చెప్పాలి. అయితే ఒక వైపు  నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా మరో వైపు శ్రీసత్య, శ్రీహాన్ గుసగుసలాడుతూ నవ్వుకున్నారు. ఇలా చేయడం వల్ల బిగ్ బాస్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 'శ్రీసత్యా!  మీరు నామినేషన్ ప్రక్రియను అవమానించారు' అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పించే అంశాలుగా ఉన్నాయి. అందుకే శ్రీసత్యకి ఓటింగ్ కూడా తక్కువే  ఉంది.  ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు శ్రీసత్యకి 'అసత్య' అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. కాగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో 'అసత్యని ఎలిమినేట్ చెయ్యాలి' అనే ట్యాగ్ లైన్ తో ఒక ట్రెండ్ క్రియేట్ చేసారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే ఈ వారం శ్రీసత్యనే ఎలిమినేట్ అవుతుంది అని ఎక్కువ మంది వీక్షకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికైనా శ్రీసత్య తన ప్రవర్తన మార్చుకుంటుందో, లేదో..చూడాలి మరి.

‘కమనీయం కార్తీకం’ షోలో ఆలీతో సరదాగా మినీ షో..ఫుల్ ఎంటర్టైన్మెంట్

కార్తీకమాసం సందర్భంగా "కమనీయం కార్తీకం" పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ బుల్లితెర పై ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ షోకి హోస్ట్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి చేశారు. ఇక ఈ షోకి ఆలీ, శ్రీవాణి ఫామిలీ, విశ్వా ఫామిలీ, శివ బాలాజీ, సీరియల్ యాక్టర్స్ వచ్చిన ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోలో ఆలీతో సరదాగా ఒక మినీ షో చేసి ఎంటర్టైన్ చేసాడు ఆలీ. ముందుగా రాకింగ్ రాకేష్, సుజాతని ఇంటర్వ్యూ చేసాడు. "రాకేష్ నీకు ఎంత బంగారం కొనిపెట్టాడు" అని సుజాతను అడిగేసరికి "నాకేం కొనలేదు నా దగ్గర రావాల్సినవన్నీ రాబట్టేసారు" అని కామెడీ గా చెప్పింది సుజాత. తర్వాత శ్రీవాణి ఫామిలీని ఇంటర్వ్యూ చేసాడు. "నేను మా ఆయన్ని బాగా ఫాలో అవుతాను" అని శ్రీవాణి అనేసరికి ఎలా అని ప్రశ్నించాడు. దానికి శ్రీవాణి హస్బెండ్  "భార్యాభర్తలు  అంటే సగం సగం అంటారు కానీ మేము అలా కాదు ఫుల్" అనేసరికి "అంటే ఫుల్ బాటిల్ తీసుకొస్తే ఐపోవాలి" అంతేకదా అని ఫన్ చేసాడు ఆలీ. ఇక ఈ షోలో పిల్లలంతా  మహాశివుడి సాంగ్స్ పడేసరికి అందరిలో భక్తి భావం పొంగిపొర్లింది. ఇక ఈ షో ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.