మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్.. మనం పెళ్లి చేసుకుందాం!

ఈటీవీ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈవారం 'కమనీయం కార్తీకం' షోతో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి హోస్ట్స్ గా యాంకర్ రవి, రౌడీ రోహిణి వ్యవహరించారు. ముందుగా ఈ షోని కారుణ్య పాడిన అద్భుతమైన శివుడి భక్తిగీతంతో మొదలు పెట్టారు. ఆ పాట వినేసరికి రోహిణి పూలమాల తెచ్చి కారుణ్య మేడలో వేసేసింది. "మీరు, నేను ఎప్పటినుంచో సింగిల్ గా ఉంటున్నాం.. మనం పెళ్లి చేసుకుందాం" అని సడెన్ గా  ప్రపోజల్ పెట్టేసరికి కారుణ్య షాకయ్యాడు. "ఏమిటి ఇవ్వాళ చాలా హెవీ టాపిక్ మాట్లాడుతున్నారు" అని కారుణ్య అడిగేసరికి "మిమ్మల్ని నా నుదిటిన ఒక బొట్టు పెట్టమని అడుగుతున్నా" అంది ఫన్నీగా. "ఎందుకు రోహిణి పెళ్లి చేసుకుని మావాడిని బలి చెయ్యాలని చూస్తావ్" అని రవి అనేసరికి, "నేను బలి చేయాలని చూడడం లేదు పెళ్లి చేసుకుని ఆయనకు ఒక జీవితాన్ని ప్రసాదిద్దామని అనుకుంటున్నా" అంది రోహిణి. "ఇంక నువ్ పెళ్లి చేసుకున్నాక ఆయనకు ఇంకేం మిగులుతుంది జీవితం" అని కౌంటర్ వేసాడు రవి. దీంతో ఈ కామెడీ కౌంటర్స్ ని, పెళ్లి ప్రొపోజల్స్ ని తప్పించుకుని కారుణ్య అక్కడి నుంచి జంపింగ్ జపాంగ్ ఇపోయారు.

'ఆయన ఎంతో మంచి వ్యక్తి'.. డైరెక్టర్ మృతికి అనసూయ నివాళి

తెలుగు ఇండస్ట్రీలో ఒక అమేజింగ్ డైరెక్టర్‌ మదన్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణంపై యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె  దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. "నేను జర్నలిస్ట్ గా నటించిన "గాయత్రి" చిత్రానికి ఆయన డైరెక్టర్. సహనం, అర్థం చేసుకునే గుణం ఉన్న మంచి  వ్యక్తి ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి"... అని అనసూయ తన  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.   మదన్ లాస్ట్ మూవీ  గాయత్రీ.  ఈ  మూవీలో అనసూయ కీ రోల్ లో నటించారు. ఇంకా ఈయన గతంలో 'ఆ నలుగురు' చిత్రానికి మదన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. "పెళ్ళైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం"వంటి  చిత్రాలకు డైరెక్టర్ గా, రైటర్ గా  పనిచేశారు. ఆయన మృతికి ఇండస్ట్రీ పెద్దలు , అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

ఇలాంటి రొమాంటిక్ గేమ్స్ ఆపేస్తే మా ఊపిరి ఆగిపోతుంది!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. "బావగారు బాగున్నారా" టైటిల్ తో ఈ ఎపిసోడ్ రన్ అయ్యింది. ఇక ఈ షోలోకి "అహ నా పెళ్ళంట" వెబ్ సిరీస్ నుంచి రాజ్ తరుణ్, శివాని ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం షోలో ఒక వెరైటీ సెగ్మెంట్ ప్లాన్ చేశారు. ఈ సెగ్మెంట్ ని రొమాంటిక్ గా ప్లాన్ చేసింది ఇంద్రజ. స్టేజి మీద ఒక ఉయ్యాలను ఏర్పాటు చేసి బావల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఒళ్ళో మరదళ్ళు కూర్చుని ఊగుతూ పక్కన పెట్టిన బాల్స్ ని ఎదురుగా ఉండే  టబ్ లో వేయాలి. ఇది సెగ్మెంట్ థీమ్. ఇక జెస్సి-అంకిత, ఆదర్శ్-అన్షు, శ్రీకర్ - నీలిమ, మహేష్-రమ్య, ఆది-శ్వేతవర్మ, నాటీ నరేష్-పవిత్ర, నూకరాజు-ఆసియా, ప్రవీణ్-సింధు, అజర్-మోనికా, పరదేశి-కావ్య.. ఇలా ఈ సెగ్మెంట్ లో ఆది-శ్వేతవర్మ విన్ అయ్యారు. ఈ సెగ్మెంట్ గురించి  ఆది మాట్లాడుతూ "శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్ని ఎపిసోడ్స్ చేసానో తెలీదు కానీ..కుర్చీలాట ఎపిసోడ్, ఈ ఉయ్యాల ఎపిసోడ్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. రాబోయే వారాల్లో ఇలాంటి సెగ్మెంట్స్ పెట్టాలి అని కోరుకుంటున్నా. ఇలాంటి గేమ్ లు అస్సలు ఆపొద్దు..గేమ్ లు ఆపేస్తే మా ఊపిరి ఆగిపోతుంది"అన్నాడు.  ఇక ఫైనల్ గా రాజ్ తరుణ్- శివాని వచ్చారు కానీ పక్క పక్కన కూర్చునేసరికి ఇంద్రజ అదేంటి "మా షో చూసారు కదా పక్క పక్కన కూర్చున్నారేంటి" అనేసరికి "ఏమిటి మీరు రాజశేఖర్ గారి అంకుశం మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారా" అని ఆది కౌంటర్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ఫైనల్ గా రాజ్ తరుణ్- శివాని ఎక్కువ బాల్స్ వేసి ఆది-శ్వేతవర్మ ని బీటౌట్ చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో మెంటల్ స్ట్రెస్.. అందుకే వెయిట్ లాస్!

బిగ్ బాస్ సీజన్ 6లో వాసంతి అందగత్తె. ఈమెను చూసే కొద్దీ చూడ బుద్దేస్తుంది. హోస్ట్ నాగార్జున కూడా గ్లామర్ డాల్ అనే స్టాంప్ వేశారు. ఈ షోకి రాక ముందు వాసంతి ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆడియన్స్ కి ఒక బ్యూటీ క్వీన్ గా అందరికీ తెలుసు. దీంతో ఈమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.  బిగ్ బాస్ హౌస్ లో తనతో ఎవరూ సరిగా కనెక్ట్ అవలేదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వాసంతి ఈజ్ సింగల్ ఇన్ బిగ్ బాస్ అని అంది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక ఎంతో మంది పాపులర్ అయ్యారు. ఇక ఇప్పుడు వాసంతి కూడా అలాగే పాపులర్ అయ్యింది. అందంగా ఉండడమే కాదు మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ కూడా ఇచ్చింది. ఐతే హౌస్ లోకి వెళ్లే ముందు వాసంతి పిక్స్ ని హౌస్ నుంచి బయటికి వచ్చాక వున్న వాసంతి పిక్స్ ని చూస్తే ఇంత సన్నగా ఐపోయింది ఏమిటా అనిపిస్తుంది. ఇక ఇలా ఎందుకు అయ్యిందో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో దానికి సంబందించిన  కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.  "బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లో ఉండకపోయినా ఆ తర్వాత స్థానంలో అయినా ఉంటానని ఆశ పడ్డాను కానీ అలా జరగలేదు. సూర్య, గీతూ ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి మాలో టెన్షన్ మొదలైంది. దాంతో ఎప్పుడు ఎవరూ ఎలిమినేట్ అవుతారో హౌస్ నుంచి వెళ్ళిపోతారో తెలియక టెన్షన్ పడేవాళ్ళం. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక 6 కేజీలు తగ్గాను. అక్కడ అందరికీ సరిపడినంత ఫుడ్ ఉంటుంది. కానీ మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఉంటే తిన్నది సరిగ్గా ఒంటబట్టదు. కాబట్టి  హౌస్ లోకి వచ్చిన చాలామంది కూడా వెయిట్ లాస్ అయ్యారు." అని చెప్పుకొచ్చింది.

ఆదిరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!

నిన్నటి బిగ్ బాస్-6 ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ కి వారు చేసిన మిస్టేక్స్ ని చెప్తూ ఫుల్ ఫైర్ అయ్యాడు. దాంట్లో భాగంగా ఆదిరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. "హౌస్ మేట్స్ మీరు చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఆట అయ్యాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బలం ఉండొచ్చు..నాకే ఆ బలం ఉంది అని అనుకోవడం తప్పు" అని నాగార్జున, రేవంత్ తో చెప్పాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ కి "మీ శక్తిని ఆటలో ప్రదర్శించండి. మాటలో కాదు" అని చెప్పాడు. ఆ తర్వాత ఆదిరెడ్డితో నాగార్జున మాట్లాడుతూ "ఆది..ఎందుకు మాటి మాటికి గేట్లు తీయండి. నేను వెళ్ళిపోతా అని అంటున్నావ్. నువ్వు సరిగ్గా ఆడకుంటే ఆడియన్సే గేట్లు తీసుకొని వచ్చి నిన్ను తీసుకెళ్తారు" అని ఫైర్ అయ్యాడు. శ్రీసత్య కోసం శ్రీహాన్ త్యాగం చేసాడు అని ఆదిరెడ్డి అన్నాడు.మీ ఇష్టం అని రేవంత్ అన్నాడు. "అమ్మాయిలు వీక్ కాబట్టి వాళ్ళ మీద గెలవచ్చు అని రేవంత్ చెప్పలేదు" అని నాగార్జున అనగా, "కానీ నాకు ఆ సెన్స్ లో అనిపించింది" అని ఆదిరెడ్డి అన్నాడు. "బిగ్ బాస్ ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలని ఇనయా అంది. అయినా కూడా నువ్వు ఆడలేదు ఎందుకు? అంటే బిగ్ బాస్ యూజ్ లెస్ టాస్క్ లు ఇస్తున్నాడా? నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే, ఒక జెన్యూన్ కంటెస్టెంట్ ని ఆపేవాడివి కదా? నువ్వే ఆట ఆడిస్తున్నావ్ అనుకుంటున్నావా?" అని నాగార్జున ఆదిరెడ్డితో అన్నాడు. "నాకు అవసరం లేదు సర్" అని ఆదిరెడ్డి చెప్పాడు. "ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే ఎవరినైనా సేవ్ చేయోచ్చు. నువ్వు ఏం అయినా తోపా? తురుమా? ఎప్పుడు గేమ్ లో లూప్ లు వెతికితే ఏం ఉండదు. తుప్పాస్ వర్షన్ లా ఉంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? అంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్ లు అన్నీ వేస్టా? అసలు గేమ్ ని గేమ్ లా ఆడాలి. గేమ్ రూల్స్ చెప్పుకుంటూ, ఆడకుండా పక్కకి ఉండటం తెలివితేటలా?" అని నాగార్జున ఫైర్ అయ్యాడు.

చనిపోతున్నానంటూ స్వర్ణకి కాల్ చేసిన మేఘన లోకేష్

మేఘన లోకేష్ బుల్లితెర నటి. ఈమె ప్రస్తుతం 'కళ్యాణం కమనీయం' సీరియల్ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్స్ కి  షాకిచ్చింది.  టెక్నాలజీ బాగా డెవెలప్ అయ్యాక యూట్యూబ్ చానెల్స్ పెరిగాక ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. షాకిచ్చే థంబ్ నెయిల్స్ తో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మేఘనాలోకేష్ కూడా అలాంటి పనే చేసింది. రోజూ కంటెంట్ దొరకదు కాబట్టి ఒక ప్రాంక్ వీడియో చేసి అందరినీ ఒక్క నిమిషం భయపెట్టేసింది.  మేఘన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కి కాల్ చేసింది.. వాళ్లలో కొందరి కాల్స్ బిజీ రాగా, మరి కొందరికి  కనెక్ట్ కాలేదు. ఫైనల్లీ మేఘన ఫ్రెండ్, యాక్టర్ స్వర్ణ కాల్ బ్యాక్ చేశారు. ఈ క్రమంలో మేఘన.. "అక్కా ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, నువ్వొచ్చేలోపు  చచ్చిపోతానేమో" అని అమాయకంగా మాట్లాడేసరికి అవతల వైపు స్వర్ణ  తెగ కంగారు పడిపోయింది. "ఇప్పుడు వచ్చేస్తా..లొకేషన్ షేర్ చెయ్యి.. కాల్ కట్ చేయొద్దు" అని భయపడిపోయి, ఏడ్చినంత పని చేసింది... చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పేసరికి  అవతల వైపు స్వర్ణ ఫుల్  రిలాక్స్ అయిపోయింది.

సముద్రపు ఒడ్డున తన్మయత్వంలో మునిగితేలుతున్న రష్మి

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గురించి పరిచయం అక్కరలేదు. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇటీవల 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మాల్దీవ్స్ కి వెళ్లి చిల్ అవుతూ మంచి హాట్ హాట్ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ అందరినీ మైమరిపిస్తోంది. ఈ లోకాన్ని మరిచిపోయి తన్మయత్వంలో ఊగిపోతోంది రష్మీ.  ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సముద్రపు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న ఒక వీడియోను షేర్ చేసింది. ఇక కొంతమంది ఈమెను తెగ పొగిడేస్తున్నారు. "మీరు బీచ్ కి వెళ్లినా కూడా ఫుల్ డ్రెస్ వేసుకున్నారు కొందరు మాత్రం మరీ ఘోరంగా బికినీలు వేస్తారు", "ఇలా బీచ్ కి వెళ్లి దుప్పటి కప్పుకుని ఫోటోలు పెట్టింది ప్రపంచంలో నువ్వే" అని కామెంట్స్ చేస్తున్నారు. 'గుంటూరు టాకీస్' మూవీతో రష్మీ కనువిందు చేసింది. తర్వాత తన నటనను, మాటలను చాలా ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దుకుని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

బాగా నటిస్తున్నావ్ శ్రీహాన్.. నాగార్జున ఫైర్!

బిగ్ బాస్ లో జరిగే ఎంటర్టైన్మెంట్ సోమవారం నుండి శుక్రవారం ఒక ఎత్తు అయితే శనివారం, ఆదివారం జరిగేది మరొక ఎత్తు. ఎందుకంటే నాగార్జున శనివారం వచ్చి కంటెస్టెంట్స్ చేసిన తప్పులు అన్ని చెప్తూ వివరిస్తాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ కి గట్టి క్లాస్ పీకాడు. శ్రీహాన్ ని టార్గెట్ చేస్తూ ప్రతీ విషయం గురించి అడిగి బయటకు రప్పిస్తూ, ఎపిసోడ్ మొత్తం శ్రీహాన్ కి తను చేసిన తప్పు తెలిసేలా చెప్తూ వచ్చాడు నాగార్జున.  "గతవారం నువ్వు కీర్తి భట్ ని ఏం అన్నావ్. వంట నేర్చుకో అన్నావ్. మరి శ్రీసత్య ని అలా అనలేదు ఎందుకు? నీ ఫ్రెండ్ అనా?" అని నాగార్జున అడిగాడు. "అలా ఏం అనలేదు సర్! నాకు ఎవరైనా ఒకే" అని శ్రీహాన్ అన్నాడు. అయితే శ్రీహాన్ ఏం అన్నాడో వీడియో బైట్ చూపించాడు నాగార్జున. దీంతో తన తప్పు తాను తెలుసుకొని సారీ చెప్పాడు. ఆ తర్వాత నాగార్జున "బాగా నటిస్తున్నావ్ శ్రీహాన్.. సోమవారం నుండి శుక్రవారం వరకు ఒకలా నటిస్తున్నావ్. శనివారం, ఆదివారం నా ముందు ఒకలా నటిస్తున్నావ్. నటనలో నువ్వు తురుము.. తోపు" అని అన్నాడు. దీంతో శ్రీహాన్ ఆశ్చర్యపోతూ "సర్ మీరు పొగుడుతున్నారో? తిడుతున్నారో? అర్థం కావట్లేదు సర్" అని అన్నాడు. "కీర్తి దీనికి సమాధానం చెప్తుంది" అని నాగార్జున అనగా, తను కూడా ఇదే చెప్పింది.

డిసెంబర్ 2 నుంచి సరికొత్తగా అలరించబోతున్న 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌'

ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' ఇప్పుడు 'కామెడీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌' పేరుతో ఒక సరికొత్త కార్యక్రమాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. 'ఆహా' టీమ్ అనిల్‌ రావిపూడితో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త ప్రోమోని రిలీజ్ చేసింది. ఈ షోలో ఆడియన్స్‌ ని ఇన్వెస్టర్స్ గా, కమెడియన్స్ స్టాక్స్ గా, అనిల్‌ రావిపూడి  ఛైర్మన్‌ గా ఉన్నారు. ఈ సెటప్ అంతా కలిపి కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అని అనిల్ రావిపూడి ప్రోమోలో ఈ న్యూ ఎపిసోడ్ మెయిన్ థీమ్ చెప్పారు.  ఇక బుల్లితెర స్టార్‌ యాంకర్‌ సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి  హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇది రొటీన్ షోస్ లా కాకుండా ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఒక కాన్సెప్ట్ ని ఇందులో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో జడ్జెస్ ఎవరూ  ఉండరు. మార్క్స్ ఉండవు. ఈ షోకి వచ్చిన ఆడియన్స్ చేతికి ఫోన్లు ఇచ్చారు.. తమని బాగా ఎవరు ఎంటర్టైన్ చేసి కామెడీని పంచారో వాళ్ళని ఆడియెన్స్ ఎంపిక చేస్తారు. ఈ షోలో ఆడియన్స్ ని మెయిన్ రోల్ ప్లే చేస్తారన్నమాట.  ఇక మామూలు షోస్ లా ఎవరికి వాళ్ళు వచ్చి స్కిట్స్ చేసేసి వెళ్లిపోయే పద్ధతి ఇక్కడ కనిపించదు. ఇందులో రౌండ్స్ ఉన్నాయి. రౌండ్ 1 స్టోరీస్ ఆఫ్ అట్లుంటది మనతోనే, ఇక రౌండ్ 2 సర్ప్రైజెస్ ఆఫ్ పదా చూసుకుందాం, రౌండ్ 3 మ్యాడ్నెస్ ఆఫ్ ఇచ్చి పడేస్తాం. ఈ రౌండ్స్ లో భాగంగా టంగ్ ట్విస్టర్లు, గేమ్స్ పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా "లాఫింగ్ స్టాక్ ఆఫ్ డే ఈజ్" పేరుతో ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ బట్టి విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. ఇదీ టోటల్ గా కామెడీ  షో యొక్క కాన్సెప్ట్. చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఆడియన్స్ కి పెద్ద పీట వేశారు. ఇక ఈ షోలో కమెడియన్స్ గా ఎక్స్ప్రెస్ హరి, సద్దాం, అవినాష్, వేణు వండర్స్ ఇలా అందరూ వచ్చి కామెడీ చేయబోతున్నారు. ఇక  ఈ షో డిసెంబర్‌ 2 నుంచి ఆహాలో స్ట్రీమ్ కావడానికి సిద్ధంగా ఉంది.

బిగ్ బాస్ లో కప్పులు, పప్పుల లొల్లి.. క్లాస్ పీకిన నాగార్జున!

బిగ్ బాస్ లో శనివారం అంటేనే మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హోస్ట్ గా నాగార్జున తన స్టైల్ లో అదరగొడుతున్నాడు. కంటెస్టెంట్స్ టెన్ మెంబర్స్ ఉంటే అందరిలోను టెన్షన్ ఉంది అంటూ వాళ్ళే చెప్పుకోగా, అనుకున్నట్టే అందరికి గట్టి క్లాస్ పీకాడు నాగార్జున. "నువ్వు ఆడే ఆటతీరుకి, యూ డిజర్వ్ రేవంత్" అని మొదలుపెట్టగా, "కెప్టెన్సీ అనేది బాధ్యత.. కప్పుల విషయంలో నువ్వు అధికారం చూపిస్తున్నావ్" అని నాగార్జున అనగా, "నేను అలా అనలేదు సర్..సాప్ట్ గా చెప్పాను సర్" అని రేవంత్ అన్నాడు. "ఆ రోజున నువ్వు అధికారంతో మాట్లాడావ్. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి అర్థం అయ్యేటట్లు చెప్పాలి. అవే లీడర్ లో ఉండాల్సిన లక్షణాలు" అని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత ఇనయాని పిలిచి "ఆ కప్ లు ఎందుకు అమ్మా? స్టోర్ రూం లోని కబోర్డ్ లో పెట్టెయ్" అని నాగార్జున అన్నాడు. ఇనయా మాట్లాడుతూ "నా కప్పు పగిలిపోయింది సర్. అందుకే సూర్య కప్ లో తాగుతున్నాను" అని చెప్పింది. "ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఈ కప్ ఎందుకు? ఆ కప్ కబోడ్ లో పెట్టేసి రా" అని నాగార్జున చెప్పగా, ఇనయా పెట్టేసి వచ్చింది.  ఆ తర్వాత "రేవంత్ ఎక్కువ పప్పులు తింటాడు. పప్పులు రేషన్ కిందకి రావు అని రాజ్ కి మీరు అలా చెప్పలేదు కదా" అని నాగార్జున ఆదిరెడ్డిని అడిగాడు. "తిన్నా ఏమీ కాదు. రేషన్ లో భాగం కాదు అని రేవంత్ అన్నాడు అని చెప్పాను సర్" అని ఆదిరెడ్డి అన్నాడు. అలా రేవంత్ అనలేదు అని క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.

విశ్వా కొడుకు బర్త్‌డే ఫంక్షన్‌లో సందడి చేసిన స్టార్స్

బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వా తన కొడుకు ర్యాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ఇటీవల ఘనంగా చేసాడు. ర్యాన్ ఏది అడిగితే అది కొనమని తన తమ్ముడు కార్తీక్ పారిస్ నుంచి చెప్పడంతో విశ్వా ర్యాన్ కోసం మంచి షూస్ తీసుకున్నాడు తర్వాత మంచి డ్రెస్ వేసి బర్త్ డే బాయ్ గా రెడీ చేసాడు. ఇక ఈ బర్త్ డే ఫంక్షన్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. మానస్ కి స్పైడర్ వెబ్ టాటూ వేయించాడు ర్యాన్ . మోడల్ జెస్సి, రాకింగ్ రాకేష్, సుజాత, సుష్మ కిరణ్, సిద్, విష్ణు, హిమజ, అలేఖ్య, శ్రీవాణి , ఇలా బుల్లి తెర స్టార్స్ అంతా మెరిశారు. ఇక అలేఖ్య హారికాకు మోకాళ్ళ మీద వంగి ర్యాన్ రెడ్ రోజ్ కూడా ఇచ్చి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. అవినాష్ తన యాంకరింగ్ తో ఫుల్ ఫన్ చేసాడు. యాని మాస్టర్ బర్త్ డే బాయ్ కి  సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక  విశ్వాకి ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం అండగా ఉంది అని చెప్పొచ్చు. అక్కినేని అఖిల్ విశ్వా  క్లాస్ మేట్. దీంతోనే  నాగార్జున నిర్మించిన “యువ” సీరియల్ లో విశ్వాకి అవకాశం వచ్చింది. అలా నటుడిగా విశ్వ ప్రయాణం మొదలయ్యింది.  నాగచైతన్య నటించిన  ఫస్ట్‌ మూవీ జోష్ లోనూ విశ్వాకి అవకాశం దక్కింది. అలాగే  బాడీ బిల్డర్‌ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.

వసంతి లైవ్ చాట్ లోకి అర్జున్ కళ్యాణ్.. విన్నర్ ఎవరు అని చర్చ!

బిగ్ బాస్ సీజన్ సిక్స్ తుది దశకు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఒక్కో కంటెస్టెంట్ ఈ సీజన్ విజేతలు ఎవరు? అని వారి వారి అభిప్రాయాలు చెబుతున్నారు. అలా చెప్తున్న వారిలో రీసెంట్ గా బయటకొచ్చిన వసంతి..తన Instagram లైవ్ లోకి వచ్చి, బిగ్ బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. కాగా ఈ  చాట్ లో అర్జున్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడు. వసంతి లైవ్ చాట్ కి వచ్చి తన ఫాలోవర్స్ కి, తను హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి థాంక్స్ చెప్పింది. ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. మొదటగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కో హౌస్ మేట్ గురించి చర్చించుకున్నారు. "అకార్డింగ్ టు యు ఎవరు గెలుస్తారు" అని వసంతి, అర్జున్ ని అడిగింది. దానికి  అర్జున్ మాట్లాడుతూ " ఇంకెవరు..రేవంతే" అని అన్నాడు.  ఆ తర్వాత " రేవంత్, ఇనయా ఇద్దరికి నా సపోర్ట్ " అని వసంతి అంది. " ఆల్ మై ఫ్రెండ్స్ హావ్ మై సపోర్ట్ ..ఒక్కరు అని చెప్పలేను. రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ వీళ్ళు నలుగురు టాప్ ఫై లో ఉంటారు అని అనుకుంటున్నాను. వీళ్ళు నలుగురు పక్కా ఉంటారనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ పొజిషన్ కోసం కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి వీళ్ళ ముగ్గురి మధ్య కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది అని అనుకుంటున్నా " అని అర్జున్ చెప్పాడు. "కీర్తి ఇండివిజువల్ ప్లేయర్. అందులో కూడా..సో యూ హావ్ టూ సపోర్ట్ హర్. ఇండివిజువల్ ప్లేయర్స్ ఎవరు అయితే లోపల ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఇండివిజువల్ ప్లేయర్ నుండే నేను వచ్చాను. ఆ బాధేంటో నాకు తెలుసు. సో కీర్తి టాప్ ఫై లో ఉండాలి అని కోరుకుంటున్న " అని వసంతి అంది. దానికి అర్జున్ "యా..షీ విల్ బి" అని అన్నాడు. అలా వసంతి, అర్జున్ లా లైవ్ చాట్ ముగిసింది.

ఈ ఫొటో చూశాక శ్రీహాన్, శ్రీసత్య మధ్య ఉన్నది కేవలం స్నేహమే.. అంటారా?

బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్, శ్రీసత్య మధ్య రాపో శ్రుతిమించుతున్నట్టుగా తెలుస్తోంది. కారణం వాళ్ళు చేసే అతి నటన, అతి మాటలు. అయితే నిన్న మొన్నటిదాకా మాములు ఫ్రెండ్స్ అని అనుకున్నారంతా.. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్‌ చూస్తే ఎవరికైనా అది రాంగ్ అనే అనిపిస్తుంది. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందే టాస్క్ లో శ్రీహాన్ బజర్ నొక్కాడు. దానికి విన్నర్ అమౌంట్ నుండి లక్ష రూపాయలు కట్ అవుతాయి. ఆ తర్వాత శ్రీహాన్ తో శ్రీసత్య మాట్లాడింది. "ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఏం చేస్తావ్.. నీ ఫ్రెండ్ కో, వేరే ఎవరికో వాడినా వాళ్ళు ఆ వీక్ వరకే సేవ్ అవుతారు కదా" అంది. "ఒక వీక్ అయినా.. నువ్వు నాతో ఉంటావ్ కదా. నువ్వు ఉన్న వాల్యూ ఒక లక్ష యాభై అంటే అది తక్కువే కదా. లక్ష యాభై అయినా రెండు లక్షలు అయినా, నా అమౌంట్ లో నుండి కట్ చేస్తారంటే నాకు ఓకే" అన్నాడు శ్రీహాన్. అతను అలా అనేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నవ్వేసింది శ్రీసత్య. ఆ తర్వాత శ్రీహాన్ మెల్లగా కవర్ చేసాడు. "అయ్యయ్యో.. మరి అదే కదా ఫ్రెండ్ షిప్ అంటే.. శ్రీసత్యా! నువ్వు అయితే ఏంటి, రేవంత్ అయితే ఏంటి, నా ఫ్రెండ్స్ తో నేను ఉండాలి. అదే నాకు కావాలి"  అన్నాడు.  ఇలా ఎవరికి అనుమానం రాకుండా కవర్ చేసాడు. ఆ తర్వాత శ్రీహాన్ "అయినా.. ఒక విన్నర్ కి ద్రోహం జరగదని, బిగ్ బాస్ అలా చూడడు అని నా గట్టి నమ్మకం" అని శ్రీసత్యతో అన్నాడు. అయితే హౌస్ మేట్స్ ఎవరైనా అడిగితే.. ఎప్పటికప్పుడు "మా మధ్య ఏమీ లేదు. మేం బెస్ట్ ఫ్రెండ్స్" అని అంటున్నారు. కాగా వీరిద్దరు స్నేహం అనే బాండింగ్ దాటేసారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునే కొన్ని మాటలు వేరేలా పొర్ట్రేట్ అవుతున్నాయి.

'Eviction Free Pass' ఫైమా సొంతం!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు ఓటింగ్ రూపంలో తమ అభిప్రాయాలను చెప్తారు. అయితే ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వడానికి, లేదా ఎవరినైనా సేవ్ చేయడానికి ఒక బ్రహ్మాస్త్రం ఈ 'Eviction Free Pass'. అయితే ఈ పాస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అవుతారు. అయితే ఇది దక్కించుకోవడానికి బిగ్ బాస్ కొన్ని షరతులతో కూడిన టాస్క్ ని ఇచ్చాడు. అయితే దీనికి ఫైమా, శ్రీహాన్, రేవంత్ మాత్రమే అర్హత సాధించారు. "బజర్ మోగిన ప్రతీసారి సాండ్ బ్యాగ్ ని భుజాల మీద వేసుకొని మోయాలి. మిగిలిన సభ్యులు వచ్చి ఎవరైతే కెప్టెన్ కి అర్హులు కావొద్దు అని అనుకుంటున్నారో, వారికి ఒక సాండ్ బ్యాగ్ వేయాలి. అయితే  ఈ టాస్క్ లో శ్రీసత్య సంచాలకులురాలిగా వ్యవహరిస్తుంది " అని బిగ్ బాస్ చెప్పాడు. టాస్క్ మొదలయ్యాక ఆదిరెడ్డి సాండ్ బ్యాగ్ ని రేవంత్ కి వేసాడు. ఆ తర్వాత శ్రీహాన్ కి సాండ్ బ్యాగ్ ని వేసాడు. తర్వాత కీర్తి భట్ కి అవకాశం వచ్చింది. కీర్తి భట్ సాండ్ బ్యాగ్ ని శ్రీహాన్ కి వేసింది. తర్వాత రాజ్ కి అవకాశం వచ్చింది. అతను రేవంత్ కి సాండ్ బ్యాగ్ ని వేసాడు. ఆ తర్వాత రోహిత్ కి అవకాశం రాగా, సాండ్ బ్యాగ్ ని శ్రీహాన్ కి వేసాడు. ఆ తర్వాత రేవంత్ కి, ఆదిరెడ్డికి మాటల యుధ్ధం జరిగింది. "నేను అడుగకుండా మధ్యలో దూరకు" అని రేవంత్ అనగా, "నేను దూరుతా.. మధ్యలోనే వస్తా" అని ఆదిరెడ్డి అన్నాడు. " రేవంత్ బ్రో.. మీరు మాట్లాడే ముందు బ్రెయిన్ తో ఆలోచించండి" అని ఆదిరెడ్డి అన్నాడు. మెరీనా సాండ్ బ్యాగ్ ని శ్రీహాన్ కి వేసింది.  ఆ తర్వాత ఇనయాకి అవకాశం రాగా రేవంత్ కి సాండ్ బ్యాగ్ వేసింది.  ఆ తర్వాత కీర్తి భట్ సాండ్ బ్యాగ్ ని రేవంత్ కి వేసింది. ఎక్కువ సాండ్ బ్యాగ్స్ రేవంత్ కి, ఆ తర్వాత శ్రీహాన్ కి పడ్డాయి. కానీ ఫైమా కు రెండు సాండ్ బ్యాగ్ లు ఉన్నాయి. దీంతో ఎక్కువ బరువును, ఎక్కువ సమయం మోయలేక శ్రీహాన్ మొదట డ్రాప్ అవ్వగా, తర్వాత రేవంత్ గట్టిగా ప్రయత్నించి ఓడిపోయాడు. అలా ఫైమా చివరి వరకూ ఉండి విజేతగా నిలిచి..'Eviction Free Pass'  ని సొంతం చేసుకుంది.   

‘మీకు అలుపొస్తదేమో నాకు ఊపొస్తది’.. బాలయ్య డైలాగ్ తో షోలో దుమ్ము రేపిన గాలోడు

"డాన్స్ ఇండియా డాన్స్" షో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా "గాలోడు" ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. గాలోడు స్టేజి మీదకు రాగానే బాబా మాస్టర్ వచ్చి సుధీర్ కి సరిగ్గా సరిపోయే పేరు గాలోడు అని కరెక్ట్ గా పెట్టారు అన్నాడు. ఆ కామెంట్ తో సుధీర్ తన ఫేస్ వెరైటీగా పెట్టేసరికి గాలి అంటే ఒక చోట ఉండదు కదరా. అలా తిరుగుతూనే ఉంటుంది. నువ్వు కూడా అంతే అన్నాడు బాబా. ఇక సుధీర్  "మీకు అలుపొస్తదేమో నాకు ఊపొస్తది" అని బాలయ్య డైలాగ్ చెప్పేసరికి స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు. ఈ స్టేజి మీద  ఫస్ట్ టైం రౌడీ రోహిణి  ఇరగదీసే డాన్స్ వేసి ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక బాబా మాస్టర్ కి రోహిణి డాన్స్ నచ్చేసింది. ఇక అకుల్ బాలాజీ " మా డాన్స్ ఇండియా డాన్స్ లో నువ్వు బంగారు కోడిపెట్టే" అని  కంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. దాంతో రోహిణి "థ్యాంక్యూ ...కానీ గుడ్లు మాత్రం అడగొద్దు" అని కామెడీ చేసింది.. ఇక రోహిణి మీద సోషల్ మీడియాలో వచ్చే బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి చెప్తూ రోహిణి సోదరి స్టేజి మీద ఎమోషనల్ అయ్యింది.

సుధీర్ ఛానెల్స్ మారే విషయాన్ని పిట్ట కథగా చెప్పిన రాంప్రసాద్!

ఈ వారం "ఎక్స్ట్రా జబర్దస్త్" ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సుడిగాలి సుధీర్ ఎంట్రీతో గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ లో మంచి జోష్ వచ్చింది. ఇక వీళ్ళ టీమ్ పెర్ఫార్మ్ చేసిన స్కిట్ ఫుల్ కామెడీగా ఉంది.ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలను స్కిట్ రూపంలో చేసి చూపించారు. సుధీర్ హీరోగా రాంప్రసాద్ డైరెక్టర్ గా చేశారు. సుధీర్ సినిమా మొత్తం చేసాక క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీ ఆపేశామని రాంప్రసాద్ చెప్పడంతో షాకయ్యాడు. "ఎందుకు మూవీ ఆపేశారని" అడిగేసరికి "ప్రొడ్యూసర్ మిమ్మల్ని దూరం నుంచి చూసాడు మీ యాక్షన్ నచ్చలేదట అందుకే మూవీ ఆపేయమన్నారు" అని చెప్పాడు. దీన్ని బట్టి నీకేం తెలుస్తోంది.. రా ఒక పిట్ట కథ చెప్తా అని రాజు, ఏడు చేపల కథ చెప్పాడు..అందులో సారాంశాన్ని సుధీర్ కామెడీ యాంగిల్ లో అర్ధం చేసుకోవడంతో ఆటో రాంప్రసాద్ మరో కథ చెప్పాడు. "అడవిలో మూడు కోతులు ఉండేవి..అందులో ఒక కోతి సిటీకి వెళ్లి తిరిగి తిరిగి మళ్ళీ అడవికే వచ్చింది. దీన్ని బట్టి నీకేం అర్ధమవుతోంది" అని అడిగేసరికి "కోతులు అడవిలోనే ఉండాలి...సిటీకి వెళ్ళకూడదు"..అని ఫన్నీగా చెప్పేసరికి కోపం వచ్చిన రష్మీ సుధీర్ ని వదిలేసి వెళ్ళిపోయింది.

గ్రాండ్‌గా భర్త పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసిన వంటలక్క!

వంటలక్క ఈ పేరు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పేరు కంటే ఈ పేరుతోనే  ఆమెకు స్టార్ డం వచ్చిపడింది. ఈమెకు లేడీ ఫాన్స్ మాములుగా లేరు. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ మన తెలుగమ్మాయి కాకపోయినా మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెకు బ్రహ్మరధం పట్టారు. ఇక ఈమె నటిస్తున్న కార్తీక దీపం సీరియల్ క్రేజ్   గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే  కొంతకాలం పాటు ఈ సీరియల్ ట్రాక్ మారింది. కానీ ఆడియన్స్ ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ ఆ పాత ట్రాక్ ని తీసుకొచ్చి కొన్ని మోడిఫికేషన్స్ చేసి సీరియల్ ని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు వంటలక్క తన భర్త పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని తన ఇన్ గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ భర్తపేరు వినీత్ భట్. ఆయన జ్యోతిష్యం శాస్త్ర నిపుణులు.

సౌమ్యకి ముద్దులిచ్చిన పంచవన్నెల రామచిలుక క్యాండీ

జబర్దస్త్ కు కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్య రావు. ఈమె కన్నడ అమ్మాయి. రష్మీ ప్లేస్ లో ఇప్పుడు ఈమె వచ్చి రాని తెలుగుతోనే యాంకరింగ్ చేస్తూనే హైపర్ ఆది మీద పంచుల వర్షం కురిపిస్తోంది. ఈమెకు  కౌంటర్లు వేయడమే కాదు రంగురంగుల పంచవన్నె చిలకతో కబుర్లు  చెప్పడం కూడా వచ్చు అని తెలుస్తోంది. సౌమ్య సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గానే కనిపిస్తోంది. పసుపు రంగు చీరలో మురిసిపోయిన  ఈ చిలక అదే పసుపు రంగులో ఉన్న మరో చిలకతో కలిసి చిల్ అవుతోంది. ఆ చిలక పేరు క్యాండీ.."క్యాండీ ఓయ్ క్యాండీ ఎటు చూస్తున్నావ్" అని సౌమ్య మాట్లాడుతున్నంత సేపు క్యాండీ కూడా ఆమె అందానికి ఫిదా ఐపోయిందనుకుంటా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇక సౌమ్య దానికి ముద్దు ఇవ్వబోతే క్యాండీ కూడా సౌమ్యకి ముద్దు ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ మొత్తాన్ని సౌమ్య తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఇలాగా తన పెట్స్ తో చిల్ అవుతూ వాటితో మాట్లాడుతూ వాటికి ముద్దులు పెట్టే ఫొటోస్ ని, వీడియోస్ ని చూసాం. ఇప్పుడు సౌమ్య వంతు వచ్చింది. సెలబ్రిటీస్ అంతా కూడా కొంచెం బ్రేక్ దొరికింది అంటే చాలు పెట్స్ తో ఎంజాయ్ చేయడమో, మాల్దీవులకు వెళ్లిపోవడమే చేస్తుంటారు.

నడవలేని స్థితిలో పంచ్ ప్రసాద్!

పంచ్ ప్రసాద్ పేరు 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' చూసేవాళ్లకు బాగా తెలుసు. అప్పటికప్పుడు పంచులు, జోకులు వేస్తూ ఉంటాడు ప్రసాద్. ఐతే ఇతను కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న విషయాన్ని కూడా అన్ని స్టేజెస్ మీద చెప్తూనే ఉంటాడు. ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వించడంలో మాత్రం ఎక్కడా తగ్గేవాడు కాదు. రీసెంట్‌గా ప్రసాద్ మరో సమస్యతో బాధపడుతున్నాడు.  ప్రతీ వారం డయాలసిస్ చేయించుకుని వచ్చి ఆడియన్స్‌ని నవ్విస్తూ ఉండే ప్రసాద్ ఇప్పుడు నడవలేని స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్స్ నూకరాజు, ఆసియా వారం నుంచి ప్రసాద్ ఇంట్లోనే ఉంటూ వాళ్లకు సాయం చేస్తున్నామని చెప్పారు.  ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఇంటికొచ్చేసరికి ఫుల్ ఫీవర్‌తో, నడుము నొప్పితో చాలా బాధపడేసరికి హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించామని, ఐతే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టినట్లు డాక్టర్స్ చెప్పారని చెప్పింది. ఇదంతా నూకరాజు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని నూకరాజు ఈ వీడియో ద్వారా కోరాడు.