టమాటో పచ్చడి చేసీ చేసీ నేను పచ్చడైపోయా!

'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' షో ఎవ్రీ వీక్ ఫుల్ టు ఫన్‌ని అందిస్తోంది. ఇక ప్రదీప్ హోస్టింగ్ కానీ అతను చేసే కామెడీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ షోకి యాంకర్ లాస్య, మంజునాథ్ ఎంట్రీ ఇచ్చారు. "అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? అలాగే భార్యలు ఇంట్లో ఉంటే వాళ్ళ సతాయింపు మాములుగా ఉండదు కదా మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది" అని మంజునాథ్‌ని అడిగాడు ప్రదీప్. "మా ఇంట్లో మామూలు సతాయింపు ఉండదు. పీక్స్‌లో ఉంటుంది. ఆ సతాయింపుల్లో టాప్ పాయింట్స్ చెప్పాలంటే రీసెంట్‌గా కుకింగ్ విషయంలో నన్ను లాస్య తెగ సతాయిస్తూ ఉంది. ఒక్కసారి టమాటో పచ్చడి చేయమని అడిగింది. అది తిన్నాక ఇక రోజూ అదే పచ్చడి చేయమని చంపేస్తోంది. ఇక అలా టమాటో పచ్చడి చేసీ చేసీ నేను పచ్చడైపోయాను" అన్నాడు. అందుకు లాస్య, "అందుకే భర్తలు వంట నేర్చుకోకూడదు అనేది. అసలే నోటికి ఏం తిన్నా రుచించడం లేదు. మా అత్తగారు టమాటో పచ్చడి చేస్తున్నా నచ్చడం లేదు. మంజునాథ్ చేస్తేనే సూపర్‌గా ఉంటుంది. ఇక ఈయన నాతో ఆర్గ్యుమెంట్ చేసి గెలవలేక పచ్చడి చేస్తున్నారు" అని కామెడీగా అనేసరికి "అవును. నోటికి ఏదీ రుచించకపోతే రోజూ టమాటో చట్నీ తింటారా.. ఐనా మీ లేడీస్ తో వాదించి ఎవరు గెలుస్తారులే" అని కౌంటర్ సెటైర్ వేసాడు ప్రదీప్.  

బుల్లెట్ భాస్కర్‌తో కుష్బూ క్యూట్ స్టెప్పులు.. వర్ష ముచ్చట్లు, ఇమ్ము ఇక్కట్లు!

బుల్లితెర మీద కుష్బూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. 'ఎక్స్ట్రా జబర్దస్త్'కి జడ్జిగా చేస్తోంది నిన్నటి అందాల తార కుష్బూ. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్‌తో ఆమె చిందేశారు. చాలా చిన్న చిన్న స్టెప్స్‌తో ఎంతో స్మార్ట్‌గా, ఎంతో హుషారుగా డాన్స్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్‌కు హైలెట్ అంటే కుష్బూ-బుల్లెట్ భాస్కర్ డ్యాన్స్ అనే చెప్పాలి. 'కాంచన' మూవీలోని "నలుపు నేరేడంటి కళ్లే" అనే పాటకు ఇద్దరూ కలిసి సూపర్‌గా స్టెప్పులేశారు. ఇక వర్ష.. ఇమ్ముని వదిలేసి బులెట్ భాస్కర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇలా ఇమ్ముతో తనకు గ్యాప్ వచ్చిందో లేదో భాస్కర్‌తో ముచ్చట్లు పెట్టింది వర్ష. రాబోయే ఎపిసోడ్‌లో భాస్కర్‌తో కలిసి 'వైఫ్ అండ్ హజ్బెండ్' స్కిట్ చేసింది వర్ష. ఈ స్కిట్ చూసి ఇమ్మూకి ఏడుపొక్కటే తక్కువ.  రానున్న ఎపిసోడ్‌లో గెటప్ శీను టీమ్ లో అన్నపూర్ణ వెరైటీ స్కిట్‌తో అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇందులో చేతబడి చేసే మాంత్రికుల గెటప్‌లో కనిపించారు ఆటో రాంప్రసాద్, అన్నపూర్ణ. 

ట్రాక్టర్, బైక్ మీద సుదీప స్టిల్స్.. ఇదీ నెటిజెన్స్ రిక్వెస్ట్!

సుదీప అలియాస్ ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన పింకీ అలియాస్ సుదీప తన పర్సనల్స్ ని, ప్రొఫెషన్ కి సంబంధించిన అప్ డేట్స్ ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సుదీప ట్రాక్టర్ ఎక్కి సందడి చేస్తోంది. పొలంలో ట్రాక్టర్ ఎక్కి నిలబడిన పిక్ ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పిక్ నెటిజన్స్ ని అలరిస్తోంది.  అలాగే ఒక పెద్ద బైక్ తో దిగిన పిక్స్ ని కూడా షేర్ చేసింది. "ఎనీవన్ డౌన్ టు రేస్" ఎవరైనా నాతో పోటీకి దిగుతారా ?  అని ఛాలెంజ్ విసిరింది. ఇలా సుదీప సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.  ఇక సుదీపను ఇన్‌స్టాగ్రామ్‌లో 52K మంది  ఫాలో అవుతున్నారు. నెటిజన్స్ ఈమె పిక్స్ చూసి "మీరు మళ్ళీ ఎక్కువ మూవీస్ లో చేయాలి" అని రిక్వెస్ట్ చేస్తున్నారు. "ఏమిటి మీరు బైక్ కూడా నడుపుతారా" అని సుదీపను అడుగుతున్నారు.  

ఫేక్ లోన్ యాప్స్ నిర్వాకం.. సూసైడ్ చేసుకున్న నూకరాజు! కదిలించిన స్కిట్!!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలాగే సరికొత్తగా అలరించడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించి న్యూ ప్రోమో రిలీజ్ కూడా ఐపోయింది. ఈ వారం 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా కూడా వెరైటీ గేమ్ ఆడారు. చిన్నప్పుడు పిల్లలంతా ఆడే సాక్ రేస్ ని వీళ్లంతా ఇప్పుడు "గోనెలో గెంతులు" పేరుతో ఆడి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ షోకి చరణ్ అర్జున్ ని  తీసుకురావడం, అతనితో "నువ్వో రాయి నేనో శిల్పి" సాంగ్ పాడించడం హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన సాంగ్ పాడుతున్నంత సేపు ఇంద్రజ అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది. "అమ్మ ఒడిలో పడుకున్నాక బుజ్జగించినప్పుడు ఎలా ఉంటుందో అలా వుంది మీ పాట" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక నూకరాజు, రాఘవ అందరూ కలిసి ఒక స్కిట్ ప్లే చేశారు. ఈమధ్య కాలంలో ఫేక్ లోన్ యాప్స్ కారణంగా ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఈ స్కిట్ ని ఆద్యంతం రక్తి కట్టించారు. నూకరాజు సూసైడ్ చేసుకొన్న సీన్ అందరి హృదయాల్నీ కదిలించింది.

‘నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పాలి’.. ఎమోషనల్ అయిన రష్మీ!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలానే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రెడీ అయ్యింది. ఇందులో రష్మీ ఒక కొత్త ఐడియాతో ఎంట్రీ ఇచ్చింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద ఒక టేబిల్ వేసి దానికి ఒక 8 గాజు గ్లాసులు పెట్టి అందులో ఎల్లో, ఆరెంజ్ జ్యూస్  పోసింది. ఇక ఆ జ్యూస్‌లో లో ఒక సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ వేసింది. ప్రతీ జ్యూస్ గ్లాస్‌లో ఈ కాయిన్స్ వేసింది. ఇక "ఈ జ్యూస్ తాగాక ఫైనల్‌గా సిల్వర్ కాయిన్ వస్తే గనక ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఈ స్టేజి ద్వారా ఆ పర్సన్‌కి థ్యాంక్స్ చెప్పొచ్చు" అని చెప్పింది. "అదే జ్యూస్ తాగాక ఫైనల్‌గా గోల్డ్ కాయిన్ వస్తే గనక వాళ్ళు ఎవరికైతే సారీ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్లకు ఈ స్టేజి ద్వారా సారీ చెప్పొచ్చు" అని కూడా చెప్పింది రష్మీ. ఈ కాన్సెప్ట్ థీమ్ విన్నాక ఆటో రాంప్రసాద్ "ఫస్ట్ నువ్వే స్టార్ట్ చెయ్యి" అని చెప్పేసరికి, రష్మీ జ్యూస్ తాగింది. కానీ లాస్ట్‌లో గోల్డ్ కాయిన్ వచ్చింది. అంటే సారీ చెప్పాల్సిన టైం వచ్చిందన్నమాట. గోల్డ్ కాయిన్‌ని చూసిన ఆటో రాంప్రసాద్ "ఎవరికి సారీ చెపుదామనుకుంటున్నావ్?" అని అడిగాడు. "నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పక తప్పదు" అని ఎమోషనల్ అయ్యింది. రష్మీ మాటలకు ఇంద్రజ కూడా చాలా బాధ పడింది. ఇంతకు ఎవరెవరు ఈ జ్యూస్ తాగారు, వాళ్లకు ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ వచ్చాయి, వాళ్ళు ఎవరెవరికి సారీ, థ్యాంక్స్ చెప్పారో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే. 

విజయ్ దేవరకొండ వల్లనే 'అర్జున్ రెడ్డి'లో చేసే ఛాన్స్ వచ్చింది!

తెలుగు ఇండస్ట్రీలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఒక్కసారిగా కెరటాల్లా వచ్చిపడిన కమెడియన్స్. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాదు విజయ్ దేవరకొండ కూడా వీళ్లకు మిత్రుడే..రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి ఎన్నో మూవీస్ లో నటించారు. వీళ్ళు చేసే పాత్రలన్నీ టపాకాయల్లా పేలుతూ ఉంటాయి. "జాతిరత్నాలు" మూవీ వీళ్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో కనిపించారు. అక్కడ ఎన్నో విషయాలను వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ .. "నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్ లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నాకు చిన్నప్పుడు సినిమాలు చూసే అలవాటు కూడా పెద్దగా లేదు. నాకు పుస్తకాలే ప్రపంచం..పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. కానీ మా ఇంట్లో కల్చరల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. నాకు థియేటర్ అంటే ఇష్టం..ఆ ఇష్టంతో వీధి నాటకాలు వేసే టైంలో అనుకోకుండా తరుణ్ భాస్కర్ టీమ్ లో చేసే అవకాశం వచ్చింది. అలా అతని టీమ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ లో చేసాక తరువాత ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి.. ఇక అదే టైంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి 'అర్జున్ రెడ్డి' సినిమా చేస్తున్నాడు. అప్పుడు ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ మూవీలో  'శివ' పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ మూవీ షూటింగ్ ఐపోయి నా పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నప్పుడు అసలు విషయం తెలిసింది "శివ" పాత్రకు నా కంటే ముందుగా ప్రియదర్శిని అనుకున్నారని" అంటూ చెప్పుకొచ్చాడు.

సౌమ్యరావు, నేను ఒకరి తర్వాత మరొకర్ని వరసగా కంటాం!

'జబర్దస్త్' ఖతర్నాక్ కామెడీ షో మొదట్లో అలాగే ఖతర్నాక్ గా అలరించేది. ఐతే రాను రాను కమెడియన్స్ అందరూ ముదిరిపోయి ఎక్స్ట్రా పంచులు, ఎక్స్ట్రా డైలాగ్స్ వేస్తూ వెకిలిగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన నెగటివ్ కామెంట్స్ కారణంగా మళ్ళీ కాస్త దారిలోకి వచ్చింది ఈ షో. ఈ షోకి సంబంధించి యాంకర్స్, జడ్జెస్ విషయానికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఆడియన్స్ కి పరీక్ష పెట్టారు నిర్వాహకులు. చివరికి జబర్దస్త్ కి కొత్త యాంకర్ ని పట్టుకొచ్చారు. తెలుగు, కన్నడ సీరియల్స్ చేసిన సౌమ్య రావుని తీసుకొచ్చారు.. వచ్చి రాని తెలుగుతో అందరినీ ఆడేసుకుంటోంది సౌమ్య. రావడంతోనే  హైపర్ ఆదిపై వరస పంచులేసింది. ఈ వారం కూడా ఆది తన మార్క్ పిచ్చి డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. ‘ప్రపంచంలో అందరూ చనిపోయి మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారు’ అని జడ్జి కృష్ణ భగవాన్.. హైపర్ ఆది, సౌమ్యని ఉద్దేశించి ఒక కామెడీ ప్రశ్న అడిగారు. దీనికి హైపర్ ఆది.. తామిద్దరం కలిసి ఓ ప్రపంచాన్ని సృష్టిస్తాం అని, వరసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాం" అని చెప్పి పిచ్చి కామెడీ చేసాడు. ఇక ఆది డైలాగ్స్ కి ఎలా స్పందించాలో అర్ధంకాక పక్కనే ఉన్న సౌమ్య తలదించుకుని ఒక నవ్వు నవ్వేసింది.

ఇండస్ట్రీలో "నో" అని చెప్పడం ఒక పెద్ద ఆర్ట్!

టాలీవుడ్ లో జనరేషన్ మారి కొత్త కొత్త కామెడీ టైమింగ్స్ ఎంట్రీ ఇస్తున్న టైంలో పరిచయమయ్యారు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. "పెళ్లి చూపులు" మూవీతో    ప్రియదర్శి పరిచయం కాగా, రాహుల్ రామకృష్ణ "అర్జున్ రెడ్డి" మూవీతో  ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శి ఎలా మాట్లాడినా ఆడియన్స్ ఫుల్ గా నవ్వేస్తారు. ఇక ఆయన నటించిన "మల్లేశం" కావొచ్చు "జాతిరత్నాలు" కావొచ్చు ఆయనలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన మూవీస్.  ఇక ఇప్పుడు ఈయన ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. "ఇండస్ట్రీలో "నో" అని చెప్పడం ఒక పెద్ద ఆర్ట్ అన్నాడు. బయటైనా, ఇండస్ట్రీలో ఐనా హిపోక్రసి  అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎలాంటి స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినా వాటిని స్టార్టింగ్ లెవెల్ లోనే ఫిల్టర్ చేసేస్తాను. ఇప్పటివరకు నాకు మంచి పాత్రలే వచ్చాయి. నాకు నచ్చని పాత్రలు అంటే బాడీ షేమింగ్ గురించి కానీ, వెకిలి కామెడీ వంటి వాటికి సంబంధించి వచ్చినప్పుడు సున్నితంగానే 'నో' చెప్పేస్తాను. అయితే ఇక్కడ  'నో' చెప్పడం కూడా పెద్ద కళ. ఎందుకంటే నో అని చెప్తే గనక తలపొగరు అనేసి ప్రచారం చేసేస్తారు. ఈయన పెద్ద ఆర్టిస్టు .. ఈయనకి నచ్చాలంటే .. నిన్నగాక మొన్నొచ్చాడు" అని అందరూ ఏదేదో అనేసుకుంటారు. అందుకే "ఇండస్ట్రీలో నోరు చాలా వరకు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది. మరీ ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రం మా మేనేజర్ సీతారాం గారు రంగంలోకి దిగుతారు.  ఇప్పుడు కాదు లెండి .. మరోసారి చూద్దాం అంటూ చెప్పి ఎదుటివాళ్లను జాగ్రత్తగా డీల్ చేసి మేనేజ్ చేసేస్తాడు. నటుడిగా నాకు  కొంత గుర్తింపు రావడం మొదలయ్యాక కాస్త కోపాన్ని తగ్గించుకుని చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.

న్యూస్ రీడర్ గా నా కెరీర్ గా స్టార్ట్ అయ్యింది!

ఆలీతో సరదాగా ప్రతీ వారం అలుపులేకుండా సాగిపోతున్న షో. ఇక ఈ వారం ఈ షోకి వక్కంతం వంశి, శ్రీవిద్య వచ్చారు. అసలు తన  ప్రస్థానం ఎలా మొదలయ్యింది అనే ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పాడు వంశీ. "ఈటీవీతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకు అంటే ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలీనప్పుడు ఈటీవీలో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. ఎలా అంటే అప్పట్లో పేపర్ లో న్యూస్ రీడర్స్ కావాలని యాడ్ పడింది. మా నాన్న నన్ను ఎంకరేజ్ చేసి ఫోటో షూట్స్ చేయించారు.  తర్వాత లక్కీగా నేను సెలెక్ట్ అవడం నా వాయిస్, భాష స్పష్టంగా ఉండేసరికి న్యూస్ చదివించారు. అప్పటికి న్యూస్ రీడింగ్ అంటే ఒక ప్రొఫెషన్ అని కూడా నాకు తెలీదు. ఆ టైములో  నాకు సినిమాలు తప్ప వేరే ఆలోచన లేదు. అలా నా ప్రస్థానం న్యూస్ రీడర్ గా స్టార్ట్ అయ్యింది. తర్వాత  ఈటీవీలో అప్పట్లో ఫణి అనే కామెడీ సీరియల్స్ రాసే ఒక  రైటర్ ఉండేవారు ఆయన పేపర్ లో ఒక  కటింగ్ చూసి అప్లై చేయమంటే దాసరి గారికి అప్లై చేసి  ఇంటర్వూకి వెళ్లాను..అలా కల్యాణ ప్రాప్తిరస్తు మూవీ చేసాను కానీ అది కాస్తా కల్యాణ ఫ్లాప్తిరస్తు గా మిగిలిపోయింది. ఇంక హీరోగా చేయకూడదు అనుకున్నా. ఇక అప్పుడే  నాలో రైటర్ ని మేల్కొలిపాను.   ఇప్పుడు నితిన్ తో ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నాను..ఒక సాంగ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది." అని చెప్పారు వక్కంతం వంశీ.

బ్రేక్ ఇచ్చినా భోజనం చేయకుండా డాన్స్ కంపోజ్ చేశారు..అంత డెడికేషన్ ఆయనది!

"డాన్స్ ఇండియా డాన్స్" షో కామెడీ విత్ డాన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో గాలోడు మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది.  ఇక ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ " నేను బాబా మాస్టర్ కి  ఫోన్ చేసి నా మూవీ టైటిల్ సాంగ్ కి మీరే డాన్స్ కంపోజ్ చేయాలి అన్నప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐతే ఎవరైనా రెమ్యూనరేషన్ ఎంత అని అడుగుతారు. కానీ మాస్టర్ మాత్రం ఇప్పటివరకు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. మాస్టర్ కి టు నైట్స్ టైం ఇచ్చాం డాన్స్ కంపోజింగ్ కి..ఐతే ఆయన పని చేసినంత సేపు ఫుడ్ తినలేదు. తినమని చెప్పినా కూడా సుధీర్ అంటే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మరి అతనికి డాన్స్ కంపోజ్ చేయడం మాటలు కాదు కదా అన్నారు. నేను కూడా అలా తినకుండా చేద్దామని అనుకున్నా. కానీ రెండో రోజే పడిపోయాను. దాంతో ఫుల్ గా తినేసి వెళ్లి డాన్స్ చేసాను." అని చెప్పాడు. ఇక సుధీర్ మాటలకు బాబా మాస్టర్ మాట్లాడుతూ  "గాలోడు మూవీలో డాన్స్ కోరియోగ్రఫీ చేసాను. ఎందుకంటే సుధీర్ ఐదేళ్ల క్రితం నాకు మాట ఇచ్చాడు. తన మూవీకి నేనే డాన్స్ కంపోజ్ చేయాలని. ఇన్నేళ్ళైనా మర్చిపోకుండా ఆ ఛాన్స్ నాకే ఇచ్చాడు సుధీర్. సుధీర్ ది చాలా మంచి మనసు..రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే అవకాశం రావడం అనేది ఇంపార్టెంట్ ..ఇలాంటి అవకాశం వలన ఎవరు, ఎంత ఎత్తుకు, ఎలా ఎదుగుతారో తెలీదు కదా" అని చెప్పాడు బాబా మాస్టర్.

పంచ్ ప్రసాద్ మళ్లీ నడుస్తాడా? మరో వారం గడిస్తే కానీ..

‘జబర్దస్త్’ లో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు. ఈ షో ద్వారా  అందరినీ ఎంటర్టైన్  చేసే ఇతని లైఫ్ లో  చాలా కష్టాలున్నాయి. కొన్నేళ్ల నుంచి పంచ్ ప్రసాద్  కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాడు. రీసెంట్ గా ఒక షూట్ కి వెళ్ళొచ్చాక అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు.  ఇప్పుడు ప్రసాద్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. తన హెల్త్ కి సంబంధించి లేటెస్ట్ హెల్త్ అప్ డేట్ తో మరో వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం మెరుగయ్యిందని చెప్పాడు. కర్ర కానీ, మనిషి హెల్ప్ కానీ తీసుకుని నడవగలుతున్నట్లుగా చూపించాడు ఈ వీడియోలో. ఇక తాను నాలుగు రోజుల నుంచి  కూర్చుని సైలెన్స్ ఎక్కించుకుంటున్నాడు. ఇలాగే మరో నాలుగు రోజులు కూడా చేయాల్సి ఉంటుందని  నూకరాజు చెప్పాడు. ఇక తాను జాయిన్ ఐన హాస్పిటల్ లో స్కానింగ్ కూడా చేశారు. వారం గడిస్తే గాని ప్రసాద్ నడవగలిగే విషయం చెబుతామని డాక్టర్స్ వివరించారు. ప్రసాద్ పూర్తిగా రికవరీ అయ్యాక మరో వీడియో చేసి పెడతానని నూకరాజు చెప్పాడు. ఇక తన హెల్త్ బాగుండాలని కోరుకున్న  ప్రతి ఒక్కరికీ పంచ్ ప్రసాద్ తన ఈ  వీడియో ద్వారా ధన్యవాదాలు చెప్పాడు.

బిగ్ బాస్ నేహ పెళ్లి గోల మొదలయ్యింది!

సెలబ్రిటీస్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా నేహా చౌదరి పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తానే స్వయంగా చెప్పింది. బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న సెలబ్రిటీస్ లో యాంకర్ నేహా చౌదరి కూడా ఒకరు. ఒక వైపు టీవీ షోస్ తో పాటు గేమ్స్ కి  సంబంధించిన  ప్రోగ్రామ్స్ కి కూడా హోస్ట్ గా చేస్తుంటుంది. ఇక ఫైనల్ గా తనకు పెళ్లి కాబోతోంది అంటూ ఒక వీడియోలో అనౌన్స్ చేసింది . అంతేకాదు పెళ్లిచేసుకోబోయే వరుడిని కూడా అందరికీ పరిచయం చేసింది. తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుని మరీ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్లు సీజన్ 6 స్టార్టింగ్ లో చెప్పింది. ఇక ఇప్పుడు  నేహా తన పెళ్లి వార్తను ఫ్రెండ్స్ సమక్షంలో అనౌన్స్ చేసేసింది. ఆమె ఫ్రెండ్స్ ఎవరంటే యాంకర్ ప్రశాంతి, సింగర్ లిప్సిక, ఆర్జే కాజల్, అభిరుచి యాంకర్ గీతాసౌజన్య  తదితరులు వచ్చారు. ఇక నేహా తనకు కాబోయే భర్త పేరు అనిల్ అని,13 ఏళ్లుగా తాము మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం అని, ఇక ఇప్పుడు ఆ ఫ్రెండ్ షిప్ కాస్త రిలేషన్ షిప్ లోకి వెళ్ళబోతున్నట్లు చెప్పింది.  ‘నా పెళ్లి గోల మొదలైంది’ అనే పేరుతో  "అలా నేహాతో" అనే తన యూట్యూబ్ లో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నేహాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇంద్రజ ఇంట్లో ఐటీ దాడులు!?

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఈ వారం థంబ్ నెయిల్స్ సెగ్మెంట్ భలే ఫన్నీగా సాగింది. "ఇంతమందికి దానాలు చేయడంతో ఇంద్రజగారి ఇంట్లో జరిగిన ఐటీ దాడులు" అనే థంబ్ నెయిల్ చూసి ఇంద్రజ షాకయ్యింది. మొదట ఆమెను చూసేసరికి ఎమోషనల్ ఐనట్టు కనిపించింది కానీ వెంటనే "ఇన్ని దానధర్మాలు చేసినప్పుడు ఇంకా నా దగ్గర ఏముంటుంది అని ఐటీ దాడులు చేస్తారు. ఎవరికైనా సాయం కావాలని నాకు తెలిస్తే చేయగలిగింది చేస్తాను.. అంతే కానీ ఇదంతా నిజం కాదు" అని చెప్పింది.  ఇక తర్వాత మరో థంబ్ నెయిల్ చూస్తే "నరేష్ తన లోపం గురించి డాక్టర్ కి చెప్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసా" అనే ప్రశ్నకి నరేష్ నాటి ఆన్సర్ ఇచ్చాడు. ఈ థంబ్ నెయిల్ చూసేసరికి అందరి ఎమోషనల్ ఫేసెస్ ని జూమ్ చేసి చూపించేసరికి నిజంగా ఏదైనా తేడానా అనిపించింది. కానీ అలాంటిది ఏం లేదు అని తర్వాత అర్థమయ్యింది.. ఇక నాటీ నరేష్ మాట్లాడుతూ "నేను ఇంక హైట్ పెరగనని డాక్టర్ చెప్పేసాడు.. దానికి నేను పెద్దగా  ఫీల్ అవలేదు. .పెళ్లి చేసుకోవచ్చన్నారు. సో.. నేను ధైర్యంగా ఉన్నాను " అని కామెడీగా ఆన్సర్ చేసాడు.

నేనే ఆ హీరోని.. కార్లు, ఫ్లాట్లు, విల్లాలు నేనే కొనుక్కుంటున్నాను!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' వల్ల ఒక్కొక్కళ్ళ  గుట్టు థంబ్ నెయిల్స్ ద్వారా బయటపడ్డాయి."రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంట? ఎవరా హీరో?" అనే థంబ్ నెయిల్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.. ఇక అది చూసి ఇంద్రజ కూడా "రష్మీ! ఎవరా హీరో?" అని అడిగింది. "థంబ్ నెయిల్ కింద ఉన్న ఫోటో చూస్తే సునిసిత్ లా ఉన్నాడు" అని ఆది కామెడీ చేసాడు. ఇక రష్మీ మాట్లాడుతూ, "మా సొంత డబ్బులతో ఫ్లాట్ లు, విల్లాలు కొనుక్కుంటే ఎవరో ఇచ్చారనే ఫిక్స్ ఐపోతారా ఏమిటి ? ఎవరా హీరో అని అడిగారు కాదా... నేనే ఆ హీరోని.. ఎందుకంటే నేను సంపాదించిన డబ్బులతో కార్లు, ఫ్లాట్ లు, విల్లాలు నేనే కొనుక్కుంటున్నాను.. ఇలాంటి థంబ్ నెయిల్స్ ని నమ్మకండి.. మేం డే అండ్ నైట్ షూట్ చేస్తాం, చెక్ తీసుకుంటాం" అని రష్మీ చాలా సీరియస్ గా యూట్యూబర్స్ కి వార్నింగ్ ఇచ్చేసరికి ఆది ఎంట్రీ ఇచ్చి "రష్మీ హీరోయిన్ కాదు హీరో.. అని మరో థంబ్ నైల్ రాస్తారు, సైలెంట్ గా ఉండు" అనేసరికి అందరూ నవ్వేశారు.  తర్వాత "ఎవరికీ డౌట్ రాకుండా లేడీస్ హాస్టల్ లో పరదేశి అన్ని రోజులు ఉన్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు" ..అనే ఫన్నీ థంబ్ నెయిల్ గురించి అతను మొదట కాస్త సీరియస్ ఐనట్టు నటించి తర్వాత కామెడీగా ఆన్సర్ చేసాడు. "ఎవరి మీదనైనా ఒక రూమర్ వస్తే దానికి ఇంకొన్ని కలిపి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం వైరల్ చేస్తూ ఉంటారు. ఈ థంబ్ నెయిల్ నిజం కాదు. ఎందుకంటే లేడీస్ హాస్టల్ లో జెంట్స్ ని ఉండనివ్వరు" అని చెప్పి అందరినీ నవ్వించేసాడు పరదేశి.

హౌస్ మేట్స్ చెప్పిన బాటమ్-ఫైవ్, టాప్-ఫైవ్ ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్-ఫైవ్ లో ఉంటారు. ఎవరు బాటమ్-ఫైవ్ లో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిని సీక్రెట్ రూం కి పిలిచి ఎవరు బాటమ్-ఫైవ్, టాప్-ఫైవ్ లో ఉంటారో చెప్పమన్నాడు. దీంతో హౌస్ మేట్స్ అందరు తమ అభిప్రాయాలు తెలుపుతూ వచ్చారు. "మెరీనా, రాజ్, కీర్తి, రోహిత్, ఇనయా బాటమ్-ఫైవ్ లో ఉంటారని నేను అనుకుంటున్నాను" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత శ్రీసత్య మాట్లాడుతూ " మెరీనా, కీర్తి, ఇనయా, రాజ్, రోహిత్ బాటమ్-ఫైవ్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు టాప్ లో ఉంటారు" అని చెప్పింది. ఆ తర్వాత రోహిత్ "శ్రీహాన్, కీర్తి, ఇనయా, మెరీనా, రాజ్ బాటమ్-ఫైవ్ లో ఉంటారు" చెప్పాడు. శ్రీహాన్ మాట్లాడుతూ " రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి బాటమ్-ఫైవ్ లో ఉంటారు" అని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ " ఇనయా, కీర్తి, మెరీనా, రోహిత్ బాటమ్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు టాప్-ఫైవ్ లో ఉంటారు" అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ " ఆదిరెడ్డి, ఇనయా, శ్రీహాన్, మెరీనా, రోహిత్ బాటమ్- ఫైవ్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు టాప్- ఫైవ్ అని చెప్పాడు. ఇప్పటివరకు హౌస్ లో జరిగిన టాస్క్ లలో ఆటతీరు, మాటతీరు పరంగా ఒక్కో కంటెస్టెంట్ తమ అభిప్రాయాలు తెలిపారు. కాగా మెజారిటి సభ్యులు రాజ్, కీర్తి, ఇనయా, మెరీనా, రోహిత్ బాటమ్-ఫై లో ఉంటారని చెప్పారు. ఇక టాప్-ఫైవ్ లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఆదిరెడ్డి ఉంటారు అని చెప్పుకొచ్చారు. 

మెరీనా ఎలిమినేషన్ వెనుక కారణం ఏంటి?

బిగ్ బాస్ హౌస్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఆదివారం సండే ఫండే అంటూ సాగిన ఎపిసోడ్‌లో నాగార్జున, కంటెస్టెంట్స్ తో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తూ, నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు. అయితే ఇలా ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరగా ఇనయా, మెరీనా మిగిలారు. ఆ తర్వాత 'ఒక మిషన్ లో ఇద్దరి ఫోటోలో వేస్తాను. అందులో నుండి ఎవరి ఫోటో చెరిగిపోతుందో వారు బయటకు వస్తారు' అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత మెరీనా ఎలిమినేటెడ్ అని చెప్పాడు. మెరీనా హౌస్ నుండి బయటకు వస్తుంటే రోహిత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి వచ్చేసింది. డేంజర్ జోన్ లో మెరీనా-రోహిత్ తో పాటుగా శ్రీసత్య ఉండగా మెరీనాని ఎలిమినేట్ చేయడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే గత వారం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్, ఇప్పుడు ఓటింగ్ లో మెరీనా కంటే శ్రీసత్య తక్కువగా ఉన్నా మెరీనానే ఎలిమినేట్ చేయడం వెనుక చాలా కథే ఉన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత వారం 'ఫ్యామిలీ మీట్' ఉండటమే కారణం అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం శ్రీసత్య వల్ల కంటెంట్ వస్తుందని అంటున్నారు. అయితే ఈ వారం మెరీనాని ఎలిమినేట్ చేస్తే తర్వాత వారం మళ్ళీ ఫ్యామిలీ మీట్ లో తిరిగి హౌస్ లోకి తీసుకొస్తే, అప్పుడు ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండడమే కాకుండా, TRP కూడా పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆది మీద జడ్జి ఇంద్రజ ప్రశంసల వర్షం...నెగటివ్ టాక్ కి ఫుల్ స్టాప్!

శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ వారం మంచి కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఐతే ఆది మీద జడ్జి ఇంద్రజ ప్రశంసల వర్షం కురిపించింది.  ఇక ఈ వారం బావగారు బాగున్నారా సెగ్మెంట్ చూస్తే అవే ఆది రొటీన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపించాయి . "ఆది గారు చేసే స్కిట్ ఎంతో ఫన్నీగా ఉంటుంది..ఆది స్కిట్స్ చాలా బాగుంటాయి. అందరికీ సమానంగా పంచులు పంచుతాడు. ఆది టీమ్ లో ఉండే  అందరికీ సమానంగా డైలాగ్స్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఆదితో పని చేయడానికి ఇష్టపడతారు.." అంది ఇంద్రజ. ఇక తర్వాత శ్వేతా వర్మని, సీరియల్ యాక్టర్ శ్రీకర్ ని కూడా  అడిగింది ఆది స్కిట్ గురించి వాళ్ళు కూడా పొగిడేసరికి " ఆది స్కిట్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది" అని ఆకాశానికి ఎత్తేసింది. ఈమధ్య స్కిట్స్ లో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ని పర్సనల్ రిలేషన్స్ ని మిక్స్ చేసి మరీ స్కిట్స్ వేస్తున్నారు, పంచులు పేలుస్తున్నారు. ఆది మీద వస్తున్న నెగటివ్ టాక్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే  ఇంద్రజ ఇలా ఆదిని పొగిడి ఆకాశానికి ఎత్తే పని పెట్టుకున్నట్టున్నారని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఆది ఒక స్కిట్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఈ వారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో యూట్యూబర్స్ క్రియేట్ చేసిన థంబ్ నెయిల్స్ కి కూడా ఒక ప్లేస్ ఇచ్చేసరికి ఈ షో రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆదిని టార్గెట్ చేసే ఒక థంబ్ నెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది  " ఆది జబర్దస్త్ లో ఒక స్కిట్ కి ఎన్ని లక్షలు తీసుకుంటాడో మీకు తెలుసా ? అనేదే ఆ థంబ్ నెయిల్.  ఇక ఆదిని స్టేజి మీదకు పిలిచి అడిగింది రష్మీ..ఆది కాస్త ఎక్కువగానే ఓవర్ యాక్షన్ చేసి "మా షోలో కూడా చాలామందికి ఈ డౌట్ వచ్చింది. ఐతే ఇప్పటి వరకు నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే చెప్తున్నాను..ఒక స్కిట్ కోసం మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడతారు..మంచి డైలాగ్స్ రాయాలి, మంచి పంచులు ఆలోచించాలి...ఇంత చేస్తున్నప్పుడు మరి ఎక్కువే తీసుకోవాలి కదా అని చేత్తో ఇంత తీసుకుంటున్నాం" అని ఫన్నీ గా చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక మధ్యలో సీరియల్ నటుడు ఐన శ్రీకర్ మాట్లాడుతూ " ఆది తన స్కిట్ కోసం తీసుకునే లక్ష కన్నా స్కిట్ తరువాత ఉండే తన లక్ష్యం గురించి ఎక్కువగా పాకులాడతాడు" అని కౌంటర్ డైలాగ్ వేసేసరికి  అందరూ నవ్వేశారు. ఈ ఫేక్ థంబ్ నెయిల్స్ చూసి ఆడియన్స్ కూడా అదే అనే భ్రమలో ఉంటారు కానీ కాదు అని చెప్పడానికే ఇలాంటి సెగ్మెంట్ పెట్టాం అని చెప్పి ఈ షోని ఎండ్ చేసింది రష్మీ.

గీతూ గురించి ఒక స్టూడెంట్ ఆన్సర్ షీట్ లో రాసిన ఒపీనియన్ వైరల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో గీతు రాయల్ ఒక తుపాను అని చెప్పొచ్చు. ఆమె ఆట తీరుపై  ఎవరి అభిప్రాయం వారిది. టాప్-5లో ఉంటుందనుకున్నారు చాలామంది. కానీ  ఆమె మధ్యలోనే ఇంటికి వచ్చేయడం చాలామందికి షాకిచ్చింది. ఇక ఎలిమేషన్ టైములో ఆమె ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఇంటర్వ్యూలు చేసిన తీరు చూస్తే కొంచెం అతిగా అనిపించినా చాలామంది మనసుల్ని ఆమె కదిలించింది. బిగ్ బాస్ హౌస్ పై ఆమె చేసిన కామెంట్స్ ఫుల్  వైరల్ అయ్యాయి. ఐతే గీతూ ఇప్పుడు తన మిత్రుడు, తనకు బాగా ఇష్టమైన వ్యక్తి ఐన  ఆది రెడ్డి అలియాస్ ఉడల్ మామను సోషల్ మీడియాలో  ప్రమోట్ చేస్తోంది. ఇక ఇప్పుడు  గీతూకి సంబంధించి ఒక న్యూస్ సోషమీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఆమె  తన ఇన్ స్టాలో ఒక  స్టోరీ పెట్టింది. ఎవరో స్టూడెంట్‌ తన ఇంగ్లీషు అసైన్‌మెంట్‌లో.. "తనను ఇన్‌స్పైర్ చేసిన మహిళ ఎవరు..?ఎందుకు" అనే ప్రశ్నకు ఆ స్టూడెంట్ గీతూ గురించి రాశారు. "ఆమె చాలా శక్తివంతమైన మహిళ, ధైర్యవంతురాలు, ఎవరి మీదా ఆధారపడదు..ఎవరేం అనుకున్నా తన అభిప్రాయాలను బయట పెట్టేస్తుంది" అని చెప్తూ ఇలా ఆమెలోని ఎన్నో క్వాలిటీస్ ని వివరిస్తూ ఆ ఆన్సర్ షీట్ లో ఆ స్టూడెంట్ పేర్కొన్నారు. " తప్పు తనవైపు లేకపోతే దేని  గురించి భయపడదు. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా.. తనపై నమ్మకంతో ఉంటారని" పేర్కొంది. దీంతో ఆ అసైన్‌మెంట్‌ ఆన్సర్ షీట్ ని  సోషల్ మీడియాలో షేర్ చేసింది గీతూ.. అది చూసి తనపై అభిమానులు చూపుతున్న ప్రేమకు పిచ్చెక్కిపోతోందని వెల్లడించింది.