డేంజర్ జోన్ లో రాజ్, ఫైమా!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం ఫ్యామీలి వీక్ కావడంతో ఎపిసోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అయితే ఎలిమినేషన్స్ ఓటింగ్ లో ఫైమా, రాజ్ తక్కువ ఓటింగ్ తో చివరి స్థానాలలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైమా ముందు వారం గేమ్ పరంగా చూస్తే చాలా అన్ ఫెయిర్ గా ఆడింది. ఇంకా ఇనయాతో మాటిమాటికి గొడవ పడడంతో గతవారమే ఎలిమినేషన్ గా బయటకు వచ్చేస్తుందేమోనని అనుకున్నారంతా.. కానీ ఎవరు ఊహించని విధంగా మెరీనాని ఎలిమినేట్ చేసారు. ఇదే కాకుండా హౌస్ లో నాన్ సింక్ కామెడీతో రేవంత్ కి ఇరిటేషన్ తెప్పిస్తోంది ఫైమా. అయితే ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ లో చివరి స్థానంలో ఫైమా ఉంది. ఫైమా కంటే కాస్త ఎక్కువ ఓట్లతో ముందు స్థానంలో రాజ్ ఉన్నాడని సమాచారం. మొన్న జరిగిన ఎపిసోడ్‌లో రాజ్ వాళ్ళ అమ్మ హౌస్ లో వచ్చి " అందరితో జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా ఫైమాతో, శ్రీసత్య తో " అని చెప్పింది. అప్పటినుండి వాళ్ళతో గొడవలకి పోకుండా ఉండటం వల్ల ప్రేక్షకుల మద్దతు దొరికినట్టుగా ఓటింగ్ చూస్తుంటే తెలుస్తోంది. అయినప్పటికీ రాజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫైమా దగ్గర 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఉంది. దీనిని ఉపయోగించుకొని ఫైమా సేవ్ అవుతుందో లేదా ఎవరినైనా సేవ్ చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ లో మాత్రం ఫైమా, రాజ్ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.

ఇనయా కలని నిజం చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలాంటి గొడవలకి తావు లేకుండా.. ఎమోషన్స్, టాస్క్ లతో ఫుల్ జోష్ లో సాగుతోంది. అయితే ఫ్యామిలి వీక్ స్పెషల్ గా జరుగుతున్న ఎపిసోడ్‌లో భాగంగా హౌస్ లో ఇప్పటి దాకా శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా వాళ్ళ కుటుంబాలు రావడం చూసాం. కాగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో ఇనయాకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు వస్తారన్నది? ప్రేక్షకులకు ప్రశ్నగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే గత కొంత కాలంగా ఇనయాను తన కుటుంబ సభ్యులు దూరం పెట్టారనే విషయం అందరికి తెలియడమే. దీనికి కారణాలు లేకపోలేదు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇండస్ట్రీకి రావడం. తనకు నచ్చినట్టు ఉండటం వల్ల ఎవరు మాట్లాడం లేదు. రాంగోపాల్ వర్మ తో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయినప్పుడు, 'మా పరువు తీసావ్' అంటూ తనని తిట్టారంట. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎలాంటి మాటలు లేవని ఓ ఇంటర్వ్యూ లో తనే చెప్పుకొచ్చింది. ఇదే విషయం తను కూడా హౌస్ లో చాలా సార్లు చెప్పింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇనయా అమ్మ రావడం, హౌస్ మేట్స్ తో పాటుగా తనని సైతం ఆశ్చర్యపరిచింది. కొంత సమయం దాకా వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత కాళ్ళు పట్టుకొని చాలా సేపు ఏడ్చింది. అమ్మ మాట్లాడుతూ "కప్‌ గెలుచుకొని రా" అని చెప్తుంటే, ఇనయా పొంగిపోయింది. ఆ తర్వాత టైం అయ్యిందని బిగ్ బాస్ ఇనయా వాళ్ళ అమ్మని బయటకు పంపించేయగా, "నా డ్రీమ్ ని నెరవేర్చారు బిగ్ బాస్.. థాంక్స్ బిగ్ బాస్" అని ఇనయా చెప్పింది.

'Family Week Episodes' లో తగ్గేదేలే అంటున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ వీక్షకులకు ఈ వారం కంటెస్టెంట్స్ అందించే వినోదం మామూలుగా లేదు. ' ఎంటర్టైన్మెంట్ పరంగా ఫుల్ మీల్స్' అనే చెప్పాలి. కంటెస్టెంట్స్ ఎన్నడూ లేని విధంగా ఎమోషన్స్ తో కలగలిపి వినోదాన్ని ఇస్తూ వస్తోన్నారు. అయితే వారం కెప్టెన్సీ టాస్క్ గా ఇచ్చిన 'బిగ్ బాస్ కోచింగ్ సెంటర్' లో ప్రతి కంటెస్టెంట్ చిన్న పిల్లలు అయిపోయారు. సమయానుసారం బిగ్ బాస్ పంపించే ఆదేశాలను ఫాలో అవుతూ,  వీక్షకుల మనసును గెలుచుకుంటున్నారు. అయితే కంటెస్టెంట్స్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ రోల్ ని ఇన్వాల్వ్ అయ్యి వినోదాన్ని పంచాలి. అందులో భాగంగా ఫైమా ఇంగ్లీష్ టీచర్ గా 'వచ్చి రాని ఇంగ్లీష్' తో ఫన్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆదిరెడ్డికి డ్యాన్స్ టీచర్ రోల్ రావడంతో, అందరిని తన మార్క్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు అని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే తనకు రాని డాన్స్ ని ఫన్నీ గా నేర్పిస్తూ, హౌస్ మేట్స్ తో పాటుగా వీక్షకులను మెప్పించాడు. అదే విధంగా రాజ్ సింగర్ గా చేసి అలరించాడు. ఆ తర్వాత శ్రీసత్య మేకప్ టీచర్ గా అదరగొట్టింది. ఆ తర్వాత  శ్రీహాన్ 'Flirting Teacher' గా ఆకట్టుకోగా, రేవంత్ యోగా టీచర్ గా చేసాడు. మంచి కామెడీ టైమింగ్ తో హౌస్ లో  నవ్వులు పూయించాడు. టాస్క్ లే కాకుండా, ఫ్యామిలీ మెంబెర్స్ రావడంతో వినోదానికి, ఎమోషన్ తోడైంది. హౌస్ మేట్స్ టాస్క్ మీద చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే ఫ్యామిలీతో వాళ్ళ ఎమోషన్ ని పంచుకుంటున్నారు. అందరూ కూడా ఎవరి ఫ్యామిలీ వచ్చినా, వాళ్లతో కలిసిపోయి మాట్లాడటం అనేది 'హైలైట్ అఫ్ ది వీక్' అని చెప్పొచ్చు. ఒక్కో కంటెస్టెంట్ తమ ఫ్యామిలీ ఎమోషన్ ని తీర్చుకుంటూ, టాస్క్ లో ఇరగదీస్తున్నారు. 

సిరి, చైతూల రాకతో క్యూట్ గా మారిన బిగ్ బాస్ ఎపిసోడ్!

శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ సిరి రావడంతో బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ నిండింది. వీళ్లిద్దరిని చూసి లవ్ బర్డ్స్ అని అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్ లో సిరి రాకతో అట్రాక్షన్ లా ఉంది. యూత్ అంతా ఈ జంటని చూడటానికి చాలా ఉత్సాహంతో ఉన్నారని, సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తూనే తెలుస్తోంది. అయితే ఈ జంటతో పాటుగా వాళ్ళిద్దరు కలిసి దత్తత తీసుకున్న బాబు చైతు కూడా రావడంతో, శ్రీహాన్ ఆనందం రెట్టింపు అయ్యింది. హౌస్ మేట్స్ అందరి గురించి చైతు చెప్తుంటే శ్రీహాన్ మురిసిపోయాడు.  సిరి ఒక్కో హౌస్ మేట్ గురించి చెప్తూ పలకరించింది. "నీ సగం ఫుడ్ అంతా సత్యనే తింటున్నట్టుంది. ఇనయా..లేడి టైగర్ బాగా ఆడుతున్నావ్. హాయ్ కీర్తి ఏడపు మానేసావా, ఆదిరెడ్డి గారు, ఏది ఇప్పుడు అనండి. అయిందా..బాగా అయ్యిందా.. గేమ్ బాగా ఆడుతున్నారు. రాజ్, మనతో మినిమమ్ ఉంటుందా? ఇనయా ఏంటి ఈ మధ్య మావోడి మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు" అని అందరి గురించి మాట్లాడింది సిరి. ఆ తర్వాత సిరి, శ్రీహాన్ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకున్నారు. "నువ్వు నాతో ఇన్ని రోజులు లేవు కదా కన్నా.. అందుకే నాతో ఉండాలి అని పచ్చబొట్టు వేసుకున్నా" అని సిరి అనగా,  "లవ్ యూ రా కన్నా " అని శ్రీహాన్ అన్నాడు. ఆ తర్వాత టైం అయిందని బిగ్ బాస్ చెప్పడంతో సిరి, చైతులు బయటకు వెళ్లిపోయారు.  

అలాంటి అమ్మాయి కావాలి నాకు!

ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ సెమీఫైనల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం ప్రసారమైన ఈ షో ఆద్యంతం నవ్వులు పూయించింది. డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా అలరించాయి.. ఇక ఆది ఈ షోలో తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పాడు. "పూజ హెగ్డే లాంటి ఫేస్ ఉండాలి, రష్మిక స్ట్రక్చర్ ఉండాలి, అనుష్క అంత  హైట్ , మాట్లాడే విధానం చూస్తే ఈ అమ్మాయిని తొందరగా పెళ్లి చేసేసుకోవాలి అనే విధంగా ఉండాలి అంటే వాయిస్ కాజల్ లా ఉండాలి, డ్రెస్సింగ్ వచ్చేసరికి చాలా మోడరన్ గా ఉండాలి ఎలా అంటే బిల్లా మూవీలో అనుష్క బికినీ వేస్తుంది కదా  అలా ఉండాలి" అని హైపర్ ఆది అనేసరికి ప్రదీప్ మాట్లాడుతూ " నేను ఆదిని  చూసినప్పుడు అతను చాలా స్లో, ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా..కానీ ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అని చెప్పాక అతనికి నచ్చిన క్వాలిటీస్ ఉన్నవాళ్లు రారు, అలాంటి వాళ్ళు లేరు, ఇక ఉండరు" అన్నాడు.. "ఫస్ట్ టైం మంచి జోక్ వేసి ఆది ఎంటర్టైన్ చేసాడు" అని పూర్ణ సెటైర్ వేసేసరికి " ఆదికి బాగా మండింది. " ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే  నాకు పూర్ణ గారిలాంటి అమ్మాయి కావాలి' అని క్రీం బిస్కెట్ వేసాడు.  ఇక  ఢీ- 14 డాన్సింగ్ ఐకాన్ నుంచి  జోడీస్ టీమ్ నుంచి సాగర్ - రిషిక గ్రాండ్ ఫినాలేకి వెళ్లారు. ఇక జూనియర్స్ టీమ్ నుంచి మహాలక్ష్మి - కిస్సి ఈ ఇద్దరికి వచ్చిన స్కోర్ సమానంగా ఉండేసరికి టై అయ్యింది. గ్రాండ్ ఫినాలేకి ఈ ఇద్దరిలో ఒక్కరే వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ వీక్ నిర్వహించే  షూటౌట్ రౌండ్ లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళే గ్రాండ్ ఫినాలేకి వెళ్తారని జడ్జెస్ అనౌన్స్ చేశారు.  

అమ్మానాన్నల రాకతో శ్రీసత్య కంటతడి.. ఎమోషనల్ అయిన హౌస్‌మేట్స్!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ సూపర్ ఎమోషనల్ గా సాగింది. మొదట ఫైమా వాళ్ళ అమ్మ రాగా, ఆ తర్వాత శ్రీసత్య వాళ్ళ అమ్మ, నాన్నలు వచ్చారు. మొదటగా హౌస్ లో సోను.. సోను.. అనే పిలుపు వినిపించింది. హౌస్ మేట్స్ అందరు ఎవరోనని ఆశ్చర్యపడ్డారు. "సోను అంటే మా అమ్మ వచ్చినట్టుంది" అని శ్రీసత్య ఎమోషనల్ గా మెయిన్ గేట్ దగ్గరకు పరుగున వచ్చేసింది. ఆ తర్వాత శ్రీసత్య వాళ్ళ అమ్మ, నాన్న వచ్చారు. హౌస్ లో వాళ్ళని చూడగానే శ్రీసత్య ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. హౌస్ మేట్స్ అందరు ఎమోషనల్ అయ్యారు. "మీ పేర్లు అన్ని తెలుసు.. మీరు అందరూ గేమ్ బాగా ఆడుతున్నారు" అని శ్రీసత్య వాళ్ళ నాన్న అన్నాడు. ఆ తర్వాత  అమ్మకి, శ్రీసత్య అన్నం తినిపించింది. "బయట అంతా బాగుందా? నేను గేమ్ ఆడుతున్నానా?" అని శ్రీసత్య అడిగింది. "కొంచెం మార్చుకోవాలి. వెటకారం తగ్గించుకో.. అంతకముందు పొలైట్ గా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యావ్?" అని నాన్న అడిగాడు. "నా కూతురు, ఇంత ఎత్తుకు ఎదుగుతుంది అని అనుకోలేదు." అని ఆయన అన్నాడు. "ఇంకా చాలా ఉంది" అని శ్రీసత్య అంది. "ఇంకా చాలా ఉంది. దాచాం.. కుప్పలు కప్పలుగా ఉంది" అని శ్రీహాన్ అనగా, "ఏకాభిప్రాయమేగా" అని నాన్న అన్నాడు. దీంతో కాసేపు అందరు నవ్వుకున్నారు. శ్రీసత్యతో "నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ వేస్తున్నావ్" అని నాన్న అన్నాడు. "ఒక్కసారే అలా చేసాను" అని సత్య చెప్పగా, "ఒక్కసారి చేసినా వంద సార్లు చేసినా తప్పు తప్పే.. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి" అని నాన్న అన్నాడు. ఆ తర్వాత కొన్ని సలహాలు చెప్పాడు. బిగ్ బాస్ టైం అయిందని చెప్పగానే అమ్మ, నాన్నలు బై చెప్పేసి వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే, శ్రీసత్య ఏడుస్తూ ఉండిపోయింది. 

అమ్మ ఎంట్రీతో ఫైమాకి ఆనందం.. కీర్తి భట్ కన్నీటి పర్యంతం!

బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా సాగుతున్న 'ఫ్యామిలీ వీక్' ఎపిసోడ్స్ వరుసగా హిట్ అవుతూ, వీక్షకుల మనసును గెలుచుకుంటున్నాయి. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఫైమా  వాళ్ళ అమ్మ వచ్చింది. దాంతో ఫైమా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మకి హౌస్ అంతా చూపించి, తన ఆట ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంది. తనకి అమ్మ చాలా జాగ్రత్తలే చెప్పింది. "హౌస్ మేట్స్ తో జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది. "ఎవిక్షన్ ఫ్రీ పాస్ నువ్వే వాడుకో..ఎవరికి ఇవ్వకు. సత్యతో జాగ్రత్తగా ఉండు..నీ ముందు ఒకలా, నీ వెనుక ఒకలా మాట్లాడుతుంది. నామినేషన్స్ లో చూసి మాట్లాడు. ఎటకారం తగ్గించుకో, కోపం తగ్గించుకో.. నీకొచ్చిన పాస్ ని నువ్వే వాడుకో" అని సలహాలు ఇచ్చింది. ఆ తర్వాత గార్డెన్ ఏరియాకి వచ్చి డాన్స్ చేసారు. అమ్మని ఫైమా ఎత్తుకొని డ్యాన్స్ చేయగా, కీర్తి భట్ భావోద్వేగానికి లోనైంది. తను ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇది చూసి శ్రీసత్య "మా మమ్మీ కూడా నడుస్తుంటే బాగుండేది" అని ఏడ్చింది.  ఆ తర్వాత  హౌస్ నుండి వెళ్ళిపోమని బిగ్ బాస్ చెప్పాడు. అమ్మ అందరికి బై చెప్పేసి వెళ్లిపోయింది. "థాంక్స్ బిగ్ బాస్. మా అమ్మను ఈ హౌస్ లో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది.. లవ్ యూ బిగ్ బాస్" అని ఫైమా సంబరపడింది.

జీ తెలుగు నా సొంత కుటుంబంలా అనిపిస్తోంది : నమిత

జీ తెలుగులో ప్రసారమవుతున్న షో డాన్స్ ఇండియా డాన్స్ ప్రతీ వారం కొత్త కొత్త గెస్టులను తీసుకొస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఈ ఆదివారం ఒకప్పటి నటి నమిత తన భర్తతో కలిసి ఈ షోకి వచ్చింది. నమిత నటించిన "సొంతం" మూవీలోని "తెలుసునా" అనే సాంగ్ కి స్టేజి మీద అద్భుతంగా డాన్స్ చేశారు.  ఇంకా డాన్స్ తర్వాత నమిత మాట్లాడుతూ "కోవిడ్ టైంలో మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ అందరూ పిల్లల్ని కనడానికి మంచి టైంగా ప్లాన్ చేసుకున్నారు. నాకు కూడా ఆ కోవిడ్ టైం కలిసి వచ్చింది. నేను కూడా పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకున్నా." నమిత వచ్చిరాని తెలుగులో గమ్మత్తుగా చెప్పేసరికి అందరూ నవ్వేశారు.  ఇక అకుల్ బాలాజీ మాట్లాడుతూ "ఒక్కరితో కాదు ఇద్దరితో ఫినిష్ చేశారు" అన్నాడు ఫన్నీగా..ఇక జీ తెలుగు తమ ఇంట్లోకి వచ్చిన ఆడపడుచుగా భావించి నమితకు  చీరా సారె పెట్టారు. "జీ ఛానల్ కి వస్తే నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది" అని నమిత చెప్పింది. ఇక నమిత ఇటీవల ట్విన్స్ కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఢీ-14 గ్రాండ్ ఫినాలేకి మాస్ మహారాజా!

సౌత్‌ ఇండియాలోనే అతి పెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షోగా 'ఢీ' షో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం 14వ సీజన్‌ దుమ్ము రేపుతోంది. మంచి రేటింగ్‌తో రన్‌ అవుతోంది. టాలెంట్ ఉన్న ఎంతో మందికి ఈ షో చక్కని వేదికగా నిలుస్తోంది. ఈ షో ద్వారా పరిచయమైన ఎంతో మంది నేడు టాప్‌ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.  ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్‌ లీడర్స్‌, యాంకర్స్, జడ్జెస్‌ అందరూ కలిసి చేసే ఫన్నీ స్కిట్లు కూడా ఆడియన్స్‌ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. వీటికి మిలియన్ల కొద్ది వ్యూస్‌ వస్తూ ఉంటాయి. టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దిశగా అడుగులేస్తోంది.   ఏదైనా షో ఫైనల్‌కి చేరుకున్నప్పుడు ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని ఆహ్వానించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఢీ 14 గ్రాండ్ ఫినాలేలో రాబోయే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా రిలీజ్ అయ్యింది. ఈ గ్రాండ్ ఫినాలేకి వచ్చే ప్రముఖులు ఎవరా అని ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘మాస్ మహారాజా’గా ప్రసిద్ధి చెందిన రవితేజని ఈ షో గ్రాండ్ ఫినాలేకి ఆహ్వానిస్తున్నారు.  ఇక రవితేజ కామెడీ టైమింగ్ పీక్స్ అని చెప్పొచ్చు. ఈ షో కంటెస్టెంట్స్ ఐన సోమేష్, మహాలక్ష్మి.. ఇంకా కొందరు ఈ సీజన్‌లో ఇప్పటికే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. ఈ గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

నేను ఇంతందంగా ఉన్నా ఒక్క ప్రపోజల్ కూడా రావట్లేదు!.. వాసంతి వింత బాధ!!

బిగ్ బాస్ హౌస్ నుంచి గ్లామర్ డాల్ వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి, తన లవ్ ప్రపోజల్స్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. "నేను గతంలో అస్సలు బాగుండేదాన్ని కాదు.. ఓకేఓకేగా ఉండేదాన్ని. కానీ అప్పుడు చాలా మంది వెంటపడేవాళ్లు.. ఇప్పుడు ఇంత అందంగా ఉన్నా కూడా సీరియస్లీ.. ఒక్క ప్రపోజల్ కూడా రావట్లేదు. బిగ్ బాస్ అంటే ఏమోలే అనుకుని వెళ్లాను. కానీ ఏమో కాదది.. వామ్మో బిగ్ బాస్." అని కామెంట్ చేసింది. తను తిరుపతిలో స్కూలింగ్, ఇంటర్ కంప్లీట్ చేశానని తెలిపిన ఆమె, "బెంగుళూరులో డిగ్రీ పూర్తి చేసాను. అలా అక్కడినుంచి మోడలింగ్ స్టార్ట్ చేసాను. బిగ్ బాస్ హౌస్‌లో నన్ను ఫన్నీగా ఏడిపించేది రేవంత్. హౌస్ లోకి నేను వెళ్లిన దగ్గర నుంచి నాతో ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. ఐనా నేను బాధపడలేదు. కానీ హౌస్ లోకి వెళ్ళాలి అంటే మాత్రం షో గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్తే బాగా ఆడే అవకాశం ఉంటుంది." అని తెలిపింది. "నాకు సుదీప అంటే చాలా ఇష్టం. నాకు ఎవరైతే దగ్గరగా ఉండేవారో వాళ్లంతా ఇంట్లోంచి వెళ్లిపోతుండేసరికి చాలా బాధేసేది. నేను హౌస్‌లో ఎప్పుడూ ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళాక బిగ్ బాస్ వాయిస్ మాత్రమే మాకు వినిపిస్తుంది. బిగ్ బాస్ టీమ్ నుంచి మాకు ఎలాంటి ఇన్‌పుట్స్ అనేవి రావు" అని వాసంతి ఎన్నో విషయాలు చెప్పింది. 

కెప్టెన్ రేవంత్ పంతం.. హౌస్‌మేట్స్ బలి!

ఆకలి బాధతో హౌస్‌లోని కంటెస్టెంట్స్ రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నారు. కారణం రేవంత్ కెప్టెన్‌గా ఉండటమే అని కొందరు హౌస్‌మేట్స్ అనుకుంటున్నారు. కెప్టెన్‌గా ఉన్న ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారా? సక్సెస్ అయ్యారా?.. అనే దాని గురించి నాగార్జున ప్రశ్నిస్తూ ఉంటాడు. కాగా హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అయిన రేవంత్ హౌస్ మేట్స్‌కు కఠిన నియమాలు పెట్టడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ నియమాలు పెట్టడం వల్ల హౌస్‌మేట్స్‌కి ఆకలి బాధతో కడుపు మండుతోంది.  ఇదే విషయం గురించి కీర్తి, ఇనయా మాట్లాడుకున్నారు. అయితే ఫైమా తన బాధను చెప్పుకొచ్చింది. "హౌస్‌లో అందరికి సరిపోయేంత అన్నం పెట్టకుంటే ఎలా? రేవంత్ అన్న.. ఒక్క నీ కెప్టెన్సీ లోనే ఇలా అవుతోంది" అని అంది. "నా ఇష్టం.. నేను ఇలాగే చేస్తాను" అని పంతం చూపించాడు రేవంత్. ఆ తర్వాత శ్రీహాన్ కూడా రేవంత్‌ని ప్రశ్నించాడు. "నీ కెప్టెన్సీలో రేషన్ మిగిలితే, నాగార్జున సర్ మెచ్చుకోవాలని అందరికి సగం సగం పెట్టి.. వాళ్ళ కడుపు నిండకుండా చేస్తున్నావ్. వారం మొత్తం సగం సగం అన్నం పెట్టి చివర్లో మిగిలినవి కదా అని ఎక్కువ పెడితే ఎలా! అందరి గురించి ఆలోచించాలి కదా రేవంత్" అని వాదించాడు. దానికి రేవంత్, "రేయ్.. ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఇలా అనకు" అన్నాడు. "రేవంత్.. మీరు పాల పాకెట్స్ ఇవ్వండి‌" అని ఇనయా అడిగింది. దానికి రేవంత్, "అందరికి కప్పుల వారీగా ఇస్తాను. ఇప్పుడు లేవు, సాయంత్రం ఇస్తాను" అని చెప్పాడు. "అంతా మీ ఇష్టమేనా రేవంత్" అని ఇనయా అనడంతో, రేవంత్ విసుక్కున్నాడు. "ఎవరు ఏమైనా అనుకోండి, నేను ఇలాగే ఉంటాను" అన్నాడు రేవంత్.  మిగతా హౌస్ మేట్స్ అందరు కూడా రేవంత్‌పై కోపంగా ఉంటున్నారు. అయితే హౌస్ మేట్స్ ఎదుర్కుంటున్న ఈ సమస్యను ఎవరూ గట్టిగా బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నాగార్జున మెప్పు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అయితే రేవంత్ కెప్టెన్సీలో హౌస్‌మేట్స్ పడుతున్న ఇబ్బంది గురించి వీకెండ్‌లో నాగార్జున అడుగుతాడో, లేదో.. చూడాలి మరి.  

'బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీయా.. అంత సీన్ లేదు'! తేల్చేసిన గీతు!!

బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ రాయల్ తన యాసతో మంచి గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈమె బిగ్ బాస్ హౌస్‌లో టాప్ ఫైవ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ ఐపోయింది. ఐతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే గీతూ బిగ్ బాస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించాయి.  ఈ వార్తలపై గీతు స్పందించింది. తాను ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. "రీఎంట్రీ ఇచ్చాక ఇలాగే మధ్యలో వెళ్లాల్సి వస్తే ఆ బాధ ఇంకా నేను తట్టుకోలేను కాబట్టి మళ్ళీ వెళ్ళను" అని చెప్పింది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు తన బాధ అంతా ఇంతా కాదని తెలిపింది.   ఎప్పుడైతే తన ఎలిమినేషన్ గురించి బిగ్ బాస్ చెప్పాడో ఆ క్షణం ఎంతో బాధేసిందని చెప్పింది. "నా లైఫ్ లో హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది నా ఎలిమినేషన్" అంది గీతూ. ఈ చిట్ చాట్‌లో భాగంగా "రేవంత్ హౌస్ లో ఉన్నప్పుడు మీతో పోట్లాడాడు, అయితే మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చాడు" అని అడిగేసరికి, "రేవంత్ నా దగ్గర మంచిగా మాట్లాడి పక్కకు వెళ్లేటప్పుడు బ్యాడ్‌గా మాట్లాడేవాడు. అయితే నేను ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం అతని ఏడుపు మాత్రం రియల్" అంటూ సమాధానమిచ్చింది. ఇక ఆదిరెడ్డి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. 

ఫ్యామిలీ వీక్‌లో భార్య, కూతురు ఎంట్రీ.. ఆదిరెడ్డి భావోద్వేగం!

బిగ్ బాస్ కి అత్యధిక TRPని తెచ్చే ఎపిసోడ్ రానే వచ్చింది. అదే 'ఫ్యామిలీ వీక్'. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం అనేది బిగ్ బాస్ లో ఆనవాయితీగా ఉంది. కాగా ఈ ఫ్యామిలీ వీక్ లో మొదట ఆదిరెడ్డి భార్య కవిత తమ కూతురు అద్వితతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఫ్యామిలీ వీక్ కంటెస్టెంట్స్ కి మంచి ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం వల్ల ఇంకా హ్యాపీ గా ఉంటారు. కాగా భార్య కవిత, పాప అద్విత రాగానే ఆదిరెడ్డికి కన్నీళ్ళు ఆగలేదు. పాపని చూడగానే ఆదిరెడ్డి చిన్నపిల్లాడే అయ్యాడు. పాపని లాలించి, తినిపించి, కాసేపు ఆడుకున్నాడు. ఇదంతా బిగ్ బాస్ వీక్షకుల మనసుల్ని హత్తుకుంది. ఆదిరెడ్డి పాప అద్వితకి ఈ మధ్యనే ఏడాది నిండింది. అప్పుడు ఆదిరెడ్డి ఫ్యామిలీతో లేడు. అందుకుగాను పాప బర్త్ డే వేడుకలను హౌస్ లో సెలబ్రేట్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేసాడు. కేక్ పంపించి పాప పుట్టిన రోజు వేడుకులను జరిపేలా చేసాడు. దీంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. "థాంక్స్ బిగ్ బాస్.. లవ్ యూ బిగ్ బాస్. నా లైఫ్ లాంగ్ మీకు ఋణపడి ఉంటాను బిగ్ బాస్" అన్నాడు ఆదిరెడ్డి. ఆ తర్వాత పాప పుట్టిన రోజు వేడుకలు చేసారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి "నేను గేమ్ బాగా ఆడుతున్నానా? నా డ్యాన్స్ ఎలా ఉంది? నేనేమైనా మార్చుకోవాలా? నీ పది ఓట్లు నాకే కదా?" అని కవితను అడిగి తెలుసుకున్నాడు. దానికి కవిత "నీ డ్యాన్స్ కి నవ్వుకుంటున్నాం" అని చెప్పింది.

'మా అమ్మాయిని దూషించడం తగునా?'.. కంటతడి పెట్టిన నటి తల్లి!

  సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 16 లేటెస్ట్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ సుంబుల్ తౌఖీర్ తండ్రి ఆడియో సంభాషణ ద్వారా మాట్లాడుతూ ఆమె తోటి కంటెస్టెంట్లు షాలిన్, టీనా దత్తాల సామర్థ్యం ఏమిటో వారికి తెలియజేయాలని కూతురికి బోధించాడు. అంతే కాదు, వారిని ముఖంపై కొట్టమని కూడా సూచించాడు. దాంతో నేషనల్ టీవీలో తన కూతుర్ని దూషించడం, తప్పుగా మాట్లాడటం కరెక్టేనా?.. అని టీనా దత్తా తల్లి ప్రశ్నించింది.  సోమవారం షోలో ఒక ఘటన చోటు చేసుకుంది. వైద్యపరమైన కారణాలతో సుంబుల్‌తో మాట్లాడే అవకాశం ఆమె తండ్రికి లభించింది. ఆయన రూల్స్‌కు విరుద్ధంగా హౌస్‌కు సంబంధించిన సమాచారాన్ని సుంబుల్‌కు తెలిపాడు. టీనా, షాలిన్‌లను కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా జాతీయ టెలివిజన్‌లో టీనాను దుర్భాషలాడాడు. సుంబుల్ తండ్రికి రెండోసారి మాట్లాడే అవకాశం వచ్చిందనేది నిజం. ఇది టీనా వాళ్లమ్మను కలవరపెట్టింది.  జాతీయ టీవీపై తన కుమార్తెను కించపరచడం, దుర్భాషలాడటం చూసిన ఆమె భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టింది. టీవీలో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే అవకాశం రాకపోవడంతో, టీనా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను ఆమె రిలీజ్ చేసింది. జాతీయ వేదికపై తన కుమార్తెను ఎవరైనా కించపరచడం, దుర్భాషలాడటం కరక్టేనా?.. అని వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. తమ హోదాను ప్రదర్శించమని చెప్పడం తల్లితండ్రుల కర్తవ్యమా?.. అని కూడా ఆమె అడిగింది. 

'లైగర్' కి నేనెందుకు వర్క్ చేయలేదంటే...

'ఆలీతో సరదాగా' టాక్ షోకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. మణిశర్మ పేరు చెప్తే చాలు.. ఎన్నెన్నో పాపులర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సంగతి సరే సరి. కాకపొతే ఇప్పుడు కొంచెం ఆయన హవా తగ్గిందనే చెప్పొచ్చు. ఐనా ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' తో మరోసారి తన మ్యూజిక్ పవర్ ఎలాంటిదో తెలియజేశారు. ఇకపోతే పూరితో కలిసి ఇస్మార్ట్ శంకర్ మూవీ చేసాక ఆయన నెక్స్ట్ మూవీకి కూడా మణిశర్మ వర్క్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇలాంటి సందర్భంలో మణిశర్మ 'లైగర్' సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టారు. అసలు తాను ఈ మూవీ ఎందుకు చేయలేకపోయారో  వివరించారు.  "పూరీ జగన్నాథ్‌తో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేశారు కదా.. ఆ తర్వాత 'లైగర్' కోసం వద్దనుకున్నారా? తీసుకోలేదా? అని అలీ అడిగేసరికి సమాధానంగా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి మణిశర్మ ఆపారు. ఫుల్ ఎపిసోడ్‌లో మనకు ఆ కారణాలు ఏంటనే విషయం వెల్లడి కావచ్చు. అంత దాకా వెయిట్ చేయాల్సిందే. 

ఆ విరిచేసిన యాంటెనాల గురించి ఆంటీకి ఎందుకు చెప్పడం!

క్యాష్ షో  లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే వారం ఈ షోకి "ధమాకా" మూవీ టీమ్ వచ్చింది. శ్రీలీల, సమీర్, భీమ్స్, ప్రసన్నకుమార్, నక్కిన త్రినాధరావు వచ్చారు. ఐతే సమీర్ ని కలవడానికి ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చారు అని ఒక పండిపోయిన ముసలివాడిని స్టేజి మీదకు పిలిచింది సుమ. " చెప్పండి మీ జ్ఞాపకాలేమిటో"  అని అతన్ని అడిగేసరికి "ఇండస్ట్రీకి రాకముందు నేను సమీర్ గారు యాంటెనాలను విరిచేసే వాళ్ళం...అని చెప్పేసరికి ...ఆ యాంటెనాల గురించి ఆంటీకి ఎందుకు చెప్పడం" అని సమీర్ కౌంటర్ వేసాడు. దాంతో సుమకి ఏమనాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయింది. ఇంతలో "మనం రాజీవ్ కనకాలను ఎత్తుకుని ఆడిపించాం..గుర్తుందా" అని ఆ ముసలాయన సమీర్ తో అనేసరికి "అవునవును రాజీవ్ కి సమీర్ కి ఇద్దరికీ 20  ఏళ్ళ తేడా ఉంది" అని కామెడీ చేసింది సుమ. "అప్పటికి నువ్వింకా పుట్టనే పుట్టలేదు..తెలుసా" అని ఆ ముసలాయన సుమ మీద కౌంటర్ పంచ్ వేసాడు. దాంతో సుమ "ఆమ్మో ఈయన అన్నీ నిజాలే చెప్తున్నాడు" అంది ఫన్నీగా. ఇక ఆ ముసలి వేషం వేసుకున్న అతను " నన్ను గుర్తుపట్టావా" అనుకుంటూ సమీర్ దగ్గరకు వచ్చేసరికి "నిన్ను గుర్తుపట్టాలి..అంతేకదా" అని అతని గడ్డాన్ని, జుట్టుని లాగేస్తాడు. అప్పుడు అసలు వేషం బయటపడుతుంది. అతను మరెవరో కాదు పటాస్ ప్రవీణ్. ఇక ప్రవీణ్ చేసిన కామెడీకి అందరూ ఫుల్ గా నవ్వేశారు.

మొదట్లో స్నేహితులు.. ఇప్పుడు శత్రువులు ఎలా అయ్యారు?

బిగ్ బాస్ హౌస్‌లో మొదటగా ఇనయా స్నేహం చేసింది ఫైమా, రాజ్, సూర్యలతో.. అలాంటిది ఇప్పుడు రాజ్, ఫైమా శత్రువులుగా మారిపోయారు. కారణం.. మధ్యలో జరిగిన టాస్క్‌లు ఒక కారణం కాగా, రెండవది ఫైమా, ఇనయా ఎవరి గేమ్ పరంగా వారు ఆలోచిస్తూ ఇండివిడ్యువల్‌గా ఉండటమే వీరి మధ్య శత్రుత్వానికి దారి తీసిందని, బిగ్ బాస్ వీక్షకులు భావిస్తున్నారు.  కాగా నామినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని సీక్రెట్ రూంకి పిలిచి నామినేషన్ వేయమన్నాడు. అయితే సీక్రెట్ రూంకి వెళ్ళిన ఇనయా ఎమోషనల్ అయింది‌. "హౌస్ లోకి వచ్చిన వెంటనే సూర్య, రాజ్, ఫైమా నాకు బాగా క్లోజ్ అయ్యారు. సూర్య వెళ్ళిపోయాడు. నాకు, సూర్యకి గొడవ అయితే రాజ్, ఫైమా దూరం అయ్యారు. ఒకప్పుడు మేము ఫ్రెండ్స్ గా ఉన్నాం..అలాంటిది ఇప్పుడు వారిద్దరిని నామినేట్ చేయాల్సి వస్తోంది" అని బిగ్ బాస్‌తో చెప్పుకొచ్చింది.  ఇలా తన బాధను చెప్పుకుంటూ కంటతడి పెట్టుకున్న ఇనయా, మొదట ఫైమాని నామినేట్ చేసింది. "గతవారం జరిగిన టాస్క్‌లో ఫైమా నన్నే టార్గెట్ చేస్తూ ఆడి, నన్ను టాస్క్‌లో ఓడిపోయేలా చేసింది" అని చెప్పింది. తర్వాత రాజ్‌ని నామినేట్ చేసింది. "రాజ్ నా మీద పర్సనల్‌గా కోపం పెంచుకొని, కావాలని నన్ను నామినేట్ చేసాడు" అని చెప్పింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇనయాకి దూరంగా ఉంటున్నారు. కారణం తను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే రాజ్ తననుండి దూరంగా ఉంటూ.. జాగ్రత్తగా ఉంటున్నాడేమోనని అనిపిస్తోంది.  

నామినేషన్స్ లో ఉన్నదెవరు? లేనిదెవరు?

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీవారం జరిగే నామినేషన్ ప్రక్రియ కీలకమైంది. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్నవారికి ఓట్లు వేసి, హౌస్ లో ఈ వారం ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు? అని ఓట్ల ద్వారా ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అయితే నామినేషన్స్ ని మొదట రోహిత్ మొదలుపెట్టాడు‌‌. కాగా సీక్రెట్ రూంలో నామినేషన్ ప్రక్రియ సీక్రెట్ గా సాగింది. రోహిత్ తన మొదటి నామినేషన్ గా శ్రీహాన్ ని చేయగా, తర్వాత ఫైమాని నామినేట్ చేసాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీసత్య మొదట రోహిత్ ని నామినేట్ చేయగా, సెకండ్ నామినేషన్ గా రాజ్ ని చేసింది. "రాజ్ మూడు వారాల నుండి సేవ్ అవుతు వస్తున్నాడు..అందుకే నామినేట్ చేస్తున్నాను" అని శ్రీసత్య అనగా, " శ్రీసత్య మీరు రాజ్ ని ఎందుకు నామినేట్ చేసారో వ్యాలిడ్ రీజన్ చెప్పండి? అని బిగ్ బాస్ అడుగగా, "రాజ్ గేమ్ లో ఎక్కువగా పాల్గొనలేదు..గేమ్ లో తన పర్ఫామెన్స్ లేదు బిగ్ బాస్" అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత సీక్రెట్ రూంకి వచ్చిన కీర్తిభట్ తన మొదటి నామినేషన్ గా శ్రీహాన్ ని, సెకండ్ నామినేషన్ గా శ్రీసత్య ని నామినేట్ చేసింది. కాగా ఫైమా మొదట రోహిత్ ని, సెకండ్ ఇనయాని నామినేట్ చేసింది.  ఆ తర్వాత శ్రీహాన్, రోహిత్ ని నామినేట్ చేసి, సెకండ్ నామినేషన్ గా ఆదిరెడ్డిని చేసాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరిని నామినేట్ చేసారు. అయితే ఈ నామినేషన్స్ లో మెజారిటీగా శ్రీహాన్ కి నాలుగు నామినేషన్స్ పడ్డాయి‌. ఆ తర్వాత ఫైమాకి మూడు, రోహిత్ కి మూడు నామినేషన్స్ పడ్డాయి. ఆ తర్వాత రాజ్, శ్రీసత్య, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డికి రెండు చొప్పున నామినేషన్స్ పడ్డాయి. అయితే ఈ వారం నామినేషన్స్ లో లేనిది కీర్తి భట్, రేవంత్.. కాగా మిగిలిన కంటెస్టెంట్స్ అందరు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. 

మెరీనా కామెంట్స్ ఆన్ హౌస్ మేట్స్!

బిగ్ బాస్ నుండి గత వారం బయటకొచ్చిన మెరీనా..హౌస్ మేట్స్ గురించి ప్రేక్షకులకు తన వర్షన్ వినిపించింది. తను బిగ్ బాస్ కి రావడం..ఇదే ఫస్ట్ టైం అంటూ అంచనాలకు మించి తను హౌస్ లో ఎలా ఉందో? తన తోటి హౌస్ మేట్స్ ఎలా ఉంటారో? ప్రేక్షకులతో సరదాగా పంచుకుంది. "హౌస్ లోకి డిఫరెంట్ పర్సనాలిటీస్ వస్తారు..ఒక్కొక్కరిది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. నేను హౌస్ మేట్స్ అందరితోనూ ఈక్వల్ గానే ఉన్నాను. టాప్ లో రోహిత్, రేవంత్ ఉంటారు. ఇక ఆదిరెడ్డి, ఇనయా టాప్ ఫైవ్ లో ఉండొచ్చు. కాగా శ్రీహాన్, శ్రీసత్య ఫేక్ గా ఉంటారు. శ్రీసత్య ప్రొవొక్ చేస్తుంది. ఆ తర్వాత మాట మార్చేస్తుంది" అంటూ మెరీనా చెప్పుకొచ్చింది. ఒక ఫ్యాన్ మాట్లాడుతూ "అయితే మీరు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు కదా? ఎక్కడ నెగెటివ్ అయ్యింది అని అనుకుంటున్నారు?" అని అడుగగా, "ఐ డోంట్ థింక్ సో..మీరే చెప్పాలి?" అని మెరీనా సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఒక ఫ్యాన్ "బెస్ట్ ఫుడ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ?" అని అడుగగా , "Kichidi" అని సమాధానమిచ్చింది మెరీనా. ఆ తర్వాత "రోహిత్ కి కాకుండా మీ సపోర్ట్ ఎవరికి అని ఒక ఫ్యాన్ అడుగగా, " నా సపోర్ట్ అందరికి " అని చెప్పింది.  ఇలా మెరీనా ఒక్కో ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మదర్ ఇండియాగా పిలుచుకునే మెరీనా.. బయటకు రావడం పట్ల ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.