గుండెల్ని హత్తుకునేలా ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి మాటలు!
బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క. నిన్న మొన్నటి దాకా గొడవలతో సాగిన షో కాస్త ఎమోషనల్ గా మారింది. కాగా బిగ్ బాస్ లో ప్రతి శనివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ చేసిన తప్పులు చెప్తూ, వాటికి పనిష్మెంట్ ఇస్తుంటాడు అనే విషయం తెలిసినదే. కానీ ఇప్పుడు అవేవి లేకుండా హౌస్ మేట్స్ సన్నిహితులు, ఇంకా గత సీజన్లలో కంటెస్టెంట్స్ గా ఉన్న సెలబ్రిటీలను కలిపి తీసుకొచ్చాడు బిగ్ బాస్.
అయితే అలా వచ్చినవాళ్ళలో మొదటగా ఇనయాని సపోర్ట్ చేస్తూ సోహెల్, ఇనయా బ్రదర్ వచ్చారు. అలాగే శ్రీహాన్ కి సపోర్ట్ గా ఫాదర్ అమీర్ సాప్, బిగ్ బాస్ సీజన్-1 విజేత శివ బాలాజీ వచ్చారు. ఆ తర్వాత ఫైమాని సపోర్ట్ చేస్తూ బుల్లెట్ భాస్కర్ రాగా, ఇంకా ఫైమా వాళ్ళ సిస్టర్ సల్మా వచ్చింది. రేవంత్ కి సపోర్ట్ గా రేవంత్ బ్రదర్ సంతోష్, రోల్డ్ రైడా వచ్చారు. అలాగే రోహిత్ కి సపోర్ట్ గా ప్రభాకర్ రాగా, ఇంకా రోహిత్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. ఆదిరెడ్డికి సపోర్ట్ గా తన చెల్లెలు నాగలక్ష్మి రాగా, ఇంకా గత సీజన్ కంటెస్టెంట్ లహరి షారి వచ్చింది. అలాగే రాజ్ కి సపోర్ట్ గా తన స్నేహితులు రాగా, శ్రీసత్యకి సపోర్ట్ గా తన స్నేహితులు వచ్చారు. కీర్తీకి సపోర్ట్ గా సీరియల్ యాక్టర్ ప్రియాంక, ఇంకా గత సీజన్ కంటెస్టెంట్ విథిక వచ్చింది.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆదిరెడ్డి చెల్లి నాగలక్ష్మి స్టేజ్ మీదకి వచ్చింది. "అన్న నువ్వు కనిపించట్లేదు.. ఇన్ని రోజులు మా పక్కనే ఉండేవాడివి.. ఇప్పుడు లేవు" అని ఏడ్చేసింది నాగలక్ష్మి. ఆ తర్వాత నాగార్జున ఓదార్చాడు. "కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు. రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు. కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అన్నా" అని చెప్పి ఆదిరెడ్డికి మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. కాగా ఇప్పుడు ఈ మాటలు గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు.