వన్ సైడ్ లవ్ కి, టు సైడ్ లవ్ కి కొత్త అర్ధం చెప్పిన నూకరాజు

జబర్దస్త్ ప్రతీ వారం కొత్త కొత్త స్కిట్స్ తో డిఫరెంట్ గా అలరిస్తూ సాగుతోంది. ఇక ఇప్పుడు రాబోయే వారం జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది. వన్ సైడ్ లవ్ కి, టు సైడ్ లవ్ కి డిఫరెన్స్ ఏమిటి అని నూకరాజుని తన టీమ్ కమెడియన్ అడిగేసరికి "వన్ సైడ్ లవ్ అంటే జబర్దస్త్ లో యాంకరింగ్ లాంటిది ఒకరికి నచ్చితే చాలు, అదే టు సైడ్ లవ్ అంటే జడ్జిమెంట్ లాంటిది ఇద్దరికీ నచ్చాలి..." అని ఆన్సర్ ఇచ్చాడు. దాంతో ఇంద్రజ ఎంట్రీ ఇచ్చి టీమ్ మెంబెర్స్ కి నచ్చాలి, డైరెక్టర్స్ కి నచ్చాలి అని కౌంటర్ వేసింది.  ఇక తాగుబోతు రమేష్ స్కిట్ కూడా వెరైటీగా ఉంది.. ఇంట్లో భర్త తన సెల్ కి పెట్టుకునే పాస్వర్డ్ చెప్పమని భార్య అడిగితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చేసి చూపించారు. తాగుబోతు రమేష్ సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చేసరికి అంబులెన్సు కి ఫోన్ చేయమని తన కమెడియన్ వైఫ్ కి చెప్పి ఆమె చేతికి సెల్ ఇచ్చాడు. ఇక ఆమె పాస్వర్డ్ చెప్పండి అని అడిగేసరికి గుండెనొప్పి తగ్గిపోయిందిలే అని చెప్పి సెల్ లాగేసున్నాడు...ఇలా తాగుబోతు రమేష్ తన స్కిట్ తో ఆడియన్స్ ని అలరించాడు.

ఎవరికీ తెలియకుండా వాడి ప్యాంట్ తెచ్చేసా!

చమ్మక్ చంద్ర జబర్దస్త్ కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాలకూ సుపరిచితుడే. ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తూ ఫామిలీ ఆడియన్స్ కి అందులో గృహిణులకు మరింత దగ్గరయ్యాడు. అలాంటి చమ్మక్ చంద్ర తన లైఫ్ లో ఒక చిలిపి పని చేసాడట..ఆ చిలిపి పని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "నేను అప్పుడు నాలుగవ తరగతి చదువుతున్నాను. మా అత్త కొడుకు ఏడవ తరగతి చదువుతున్నాడు. అప్పటికి మా ఇంట్లో లాగూలు మాత్రమే వాడుకోమనే వాళ్ళు నన్ను..మా అత్తా కొడుక్కు ప్యాంట్ ఉండేది. నాకు లాగూ కంటే ప్యాంట్ అంటే చాలా ఇష్టం. మా అమ్మానాన్నలు నాకు ప్యాంట్ కుట్టించలేదు, వాడికి మాత్రం ప్యాంట్లు కూడా కొట్టించారు మా అత్తా వాళ్ళు. అలా ఇద్దరం కామారెడ్డిలో చదువుకునేవాళ్ళం. అప్పుడు నేను వాడి ప్యాంట్ ఒకదాన్ని తెలియకుండా ఇంటికి తెచ్చేసుకుని వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నా. కట్ చేస్తే రెండు రోజుల తర్వాత కామారెడ్డి నుంచి అత్త మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ప్యాంట్ తీసి దాచేసాను. ఇక ఫైనల్ గా ఆ విషయం మా ఇంట్లో చెప్పేసరికి మా అమ్మ నన్ను కొట్టి ఆ ప్యాంట్ ఇచ్చేయమని చెప్పింది. ఇక వాడి ప్యాంట్ వాడికి ఇస్తూ నేను పడిన బాధా చాలా ఉంది. లైఫ్ లో మరిచిపోలేని విషయం ఇది. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను " అని సరదాగా సంఘటన చెప్పి నవ్వించాడు.

మీ తాతగారి కొడుకు కొడుకు నాన్న కొడుకు నాన్న కొడుకు నీకేమవుతాడు...

కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో సెకండ్ రౌండ్ "పద చూసుకుందాం" అనే కాన్సెప్ట్ లో సబ్జెక్టు అనేది ప్రతీ వారం మారుతూ ఉంటుంది. ఇక ఈ వారం చుట్టరికాలు చెప్పి ఎవరికీ ఎవరు ఏమవుతారో అడిగారు. "మీ నాన్నగారి భార్య చెల్లెలి కొడుకు మీ అన్నయ్యకు ఏమవుతాడు" అని హోస్ట్ అడిగేసరికి హరి బజర్ నొక్కి "సోదరుడు" అవుతాడని రైట్ ఆన్సర్ చెప్పాడు. " మీ అమ్మగారి వాళ్ళ నాన్నగారి వాళ్ళ కూతురు కూతురు భర్త మీకేమవుతాడు" అని అడిగేసరికి సద్దాం "బాబాయ్" అని రాంగ్ ఆన్సర్ చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ "బావ" అని హరి చెప్పాడు. "మీ తాతగారి వాళ్ళ కొడుకు కొడుకు నాన్న కొడుకు నాన్న కొడుకు నీకేమవుతాడు" అని అడిగేసరికి " యాదమ్మ రాజు బజర్ ప్రెస్ చేసి "తమ్ముడు" అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ఇక ఈ రౌండ్ లో ఆఖరి ప్రశ్నని దీపికా పిల్లి అడిగింది "అవినాష్ వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ అమ్మ చెల్లెలు అవినాష్ కి ఏమవుతుంది" అనేసరికి వేణు ఆన్సర్ చెప్పాలని చైర్మన్ అన్నారు.  "కొడుకు" అని రాంగ్ ఆన్సర్ చెప్పేసరికి "మరదలు" రైట్ ఆన్సర్ అని చెప్పింది దీపికా. ఇక సెకండ్ రౌండ్ అయ్యాక కామెడీ ఇండెక్స్ ప్రకారం  యాదమ్మ రాజు విన్నర్ గా నిలిచాడు. ఇక సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి లోయెస్ట్ స్టాక్ గా అవినాష్ నిలిచాడు.

ఎపిసోడ్ కి గ్యాప్ ఉంటుందేమో మా ఎనెర్జీకి కాదు..ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి బేరాల్లేవ్

"కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" ఫన్నీఫన్నీగా అలరిస్తోంది. ఈ వారం థర్డ్ రౌండ్ "ఇచ్చి పడేస్తాం" లో స్టాక్స్ అంతా కల్లు తగిన కోతుల్లా ప్రవర్తించాలి అంటే మెంటల్ వాళ్ళలా మారి అల్లరి చేస్తుంటే వాళ్ళను కంట్రోల్ చేయడానికి డాక్టర్ గా సుడిగాలి సుధీర్ రావాలని టాస్క్ ఇచ్చారు చైర్మన్ అనిల్ రవి రావిపూడి. ఇక ఈ రౌండ్ లో స్టాక్స్ అంతా గ్రీన్ డ్రెస్ వేసుకొచ్చి ఎంటర్టైన్ చేశారు. వేణు కామెడీ వేరే లెవెల్లో ఉంది. అలా ఆ మెంటల్ పేషేంట్స్ కి ఇచ్చిన టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలని చెప్పడంతో వేణు అందరినీ పిలిచి ఇదిగో.. టాబ్లెట్స్ వేసుకునే  టైం అయ్యింది..అందరూ ఈ టైం మీద టాబ్లెట్స్ వేసేయండి అని చెప్పాడు. పది సంవత్సరాల క్రితం చనిపోయిన నాన్నను డబ్బు సంపాదించి బతికించుకోవాలని చెప్పి కామెడీ చేసారు. ఇక డాక్టర్ గా వచ్చిన సుధీర్ ని వీళ్లంతా ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. వేణు టేప్ పట్టుకుని స్కిట్ ఎంత ఉందో కొలుస్తూ ఎనిమిది నిమిషాలు వచ్చింది ఇక అందరూ చచ్చిపోవాలి అని కింద పడిపోయారు. స్కిట్ ఎయిట్ మినిట్స్ ఓకే కానీ అందులో కామెడీ ఉండాలి కదా అని సుధీర్ అనేసరికి అందులో  కామెడీని నేనే  మాయం చేసేశానుగా అని సద్దాం కామెడీ చేసాడు. ఇక ఈ వారం చిల్లెస్ట్ పెర్ఫార్మర్ గా యాదమ్మ రాజు నిలవగా , లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డేగా వేణు నిలిచాడు. అలా ఈ వారం ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఫైనల్ గా "ఎపిసోడ్ కి గ్యాప్ ఉంటుందేమో మా ఎనెర్జీకి గ్యాప్ ఉండదు" అని సుధీర్ చెప్పేసరికి "ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి బేరాలు లేవమ్మా" అని చైర్మన్ సర్ చెప్పి మార్కెట్ ని క్లోజ్ చేసేసారు.

ఈ వారం ఇనయా ఎలిమినేషన్ నిజమేనా!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా, ఈ సండే ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే ప్రతీ సీజన్ బిగ్ బాస్ ఫినాలేకి ఐదుగురు మాత్రమే వెళ్తారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే ఇనయా ఎలిమినేషన్ అంటూ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే బిగ్ బాస్ ఈ ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేసి, మిడ్ వీక్ ఎలిమినేట్ గా మరొక కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికి ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నారు వీక్షకులు. అయితే ఈ వారం జరిగిన గోస్ట్ టాస్క్ లో అందరు బాగా పర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అని ఉత్కంఠ అందరిలోను ఉంది. అయితే శ్రీహాన్ ఫినాలేకి వెళ్ళిన విషయం తెలిసిందే. కాబట్టి అతను ఎలిమినేషన్స్ లో లేడు. మిగతావాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటింగ్ పోల్స్ బట్టి రేవంత్ మొదట స్థానంలో ఉండగా, రోహిత్ రెండు, ఇనయా మూడు, ఆదిరెడ్డి నాల్గవ స్థానాలలో ఉన్నారు. కాగా అందరి కన్నా లీస్ట్ లో శ్రీసత్య ఉండగా, స్వల్ప ఓట్ల ఆధిక్యతతో  కీర్తి ఉంది. అయితే అంచనాలు తారు మారు చేస్తూ బిగ్ బాస్ తన వర్షన్ లో ఎలిమినేషన్ ప్రక్రియను చేస్తాడేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

పల్లెటూళ్లలో రిలేషన్స్ ని చూపించిన కంటెస్టెంట్స్..విన్నర్స్ గా నిలిచిన భాస్కర్-జ్ఞానేశ్వర్!

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి మంచి కామెడీ స్కిట్స్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఫస్ట్ రౌండ్ లో సద్దాం వచ్చి పల్లెటూళ్లలో పెద్ద మనుషులతో బస్సు లో వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో చేసి చూపించాడు. బస్సులో డ్రైవర్ చిల్లర ఇవ్వకుండా టికెట్ వెనక రాసి ఇవ్వడం వంటి  అన్ని విషయాలు ప్రెజంట్ చేసాడు. తనకు కూడా ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయని తనకు డ్రైవర్ ఎప్పుడూ చిల్లర ఇవ్వలేదని చెప్పారు చైర్మన్ అనిల్ రావిపూడి.  ఇక తర్వాత యాదమ్మ రాజు వచ్చి కొత్తగా పెళ్లైనప్పుడు అల్లుడికి అత్తగారు మొదట్లో ఇచ్చే విలువ ఎలా ఉంటుంది...ఉద్యోగం పోయి పండగకు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చేసి మస్త్ ఫన్ జెనెరేట్ చేసాడు. తర్వాత వేణు వండర్స్ వచ్చి ఆర్టిస్ట్స్ కి, ఫాన్స్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది..ఆర్టిస్ట్ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పిచ్చి ఫాన్స్ ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించాడు.  తరువాత బావాబామ్మర్దులు ఐన  భాస్కర్-జ్ఞానేశ్వర్ వచ్చి మందు తాగము అని ప్రమాణం చేయడం, అప్పటివరకు  జరిగిన గొడవల్ని మర్చిపోవడానికి మళ్ళీ మందేయడం అనే ఇష్యూ మీద మంచి కనెక్టింగ్ స్కిట్ వేశారు. చైర్మన్ పడీ పడీ నవ్వేసాడు. అలా ఫస్ట్ రౌండ్ కామెడీ స్కిట్స్ పూర్తయ్యాక  ఫస్ట్ రౌండ్ లో భాస్కర్ - జ్ఞానేశ్వర్ విన్నర్స్ గా నిలిచారు.  

ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ మీద నేనేం చెప్తాను!

"కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" ఎపిసోడ్ 2 ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక చైర్మన్ అనిల్ రావిపూడి వస్తూనే తన వైఫ్ తో గొడవ పెట్టుకుని మరీ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని  హోస్ట్ సుధీర్ మీద చూపించాడు. ఇక లేడీ హోస్ట్ దీపికా పిల్లి మాత్రం చైర్మన్ ని కూల్ చేసి షో స్టార్ట్ చేయించింది.  ఇక ఫస్ట్ రౌండ్ "అట్లుంటది మనతోని" లో ఫామిలీ రిలేషన్ షిప్స్ గురించిన స్కిట్స్ పెర్ఫార్మ్ చేశారు  స్టాక్స్...ఫస్ట్ కంటెస్టెంట్ గా హరి వచ్చి ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వచ్చే  ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ తో చేసి చూపించాడు. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా అవినాష్ వచ్చి "నైట్ ఐతే వేస్తాం లైటు, ఈరోజు నా కంటెంటు ఫస్ట్ నైటు" అని చెప్పి పల్లెటూళ్ళో ఫస్ట్ నైట్ రోజు ఎవరు, ఎంత హడావిడి చేస్తారో ఆ  మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టు  చూపించాడు.  ఇక స్కిట్ ఐపోయాక చైర్మన్ అనిల్ రావిపూడి నవ్వుకుంటూ తన సెల్ చూసుకుంటుండగా  హోస్ట్ సుధీర్ ఆయన్ని పిలిచాడు. "హా..ఏంటమ్మా ..నన్ను ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటావా ఏమిటి..అవినాష్ చేసాడు..బాగుంది...దీని మీద కూడా పేరాగ్రాఫు నేనెక్కడ చెప్పగలను" అని కౌంటర్ వేశారు.

కంటెస్టెంట్స్ కామెడీ చేయడం లేదు...జడ్జెస్ కామెడీ చేస్తున్నారు!

ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాంప్రసాద్  సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ పెట్టి రన్ చేస్తూ ఉంటాడు. ఈ స్కిట్ లో కామెడీ పీక్స్ అని అర్థమైపోయింది. కంప్యూటర్ కి మదర్ బోర్డు లేదేంటండి అని కమెడియన్ బాబు అడిగేసరికి ఇదొక అనాధ..దీనికి అమ్మ ఉండదు అని పంచ్ వేసాడు. ఇక గెటప్ శీను రష్యా నుంచి వచ్చే ఆఫీసర్ పాత్రలో కనిపించి ఎంటర్టైన్ చేసాడు.  తర్వాత  ఇండియాలో వస్తున్న జబర్దస్త్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ..ఐతే అందులో ఒక మైనస్ ఉంది అదేంటంటే  కామెడీ మీద కాన్సంట్రేట్ చేయాలి కానీ  రాంప్రసాద్ జుట్టు మీద కాదు అని కౌంటర్ వేసాడు గెటప్ శీను. అంతేకాదు జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ ఎవరూ కామెడీ చేయడం లేదు జడ్జెస్ కామెడీ చేస్తున్నారు..అని అన్నాడు.   ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ కి జుట్టు అంతగా కనిపించలేదు. ఎందుకంటే ఇటీవలే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్  చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.   

హల్దీ ఫంక్షన్ లో ఈగకు సంతాపం ప్రకటించిన సింగర్ అండ్ ఫ్రెండ్స్!

సింగర్, `సరిగమప నెక్ట్స్ ఐకాన్‌` విన్నర్‌ ఐన యశస్వి కొండేపూడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `జాను` మూవీలోని  `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌` పాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌ సింగరైపోయాడు. యశస్వి మూవీస్ లో సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. యశస్వికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు.  ఇక ఇప్పుడు లేటెస్ట్ గా తన చెల్లి సంకీర్తన  హల్దీ ఫంక్షన్ వీడియోని అప్ లోడ్ చేసాడు. ఈ హల్దీ ఫంక్షన్ కి అందరూ కలిసి యెల్లో డ్రెస్సెస్ వేసుకుని,  ఎల్లో జ్యువెలరీ పెట్టుకుని సెపరేట్ గా డెకరేట్ చేసిన ప్లేస్ కి వచ్చి అక్కడ ఫుల్ గా డాన్స్, హంగామా చేశారు. ఇక పెళ్ళికొడుకు, పెళ్లికూతురిని రాంప్ వాక్ చేయించారు. ఫైనల్ గా ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు.  ఒక వాటర్ బాటిల్ లో చనిపోయిన ఈగ కోసం అందరూ సంతాపం ప్రకటించారు. అందరూ నిలబడి " ఈగ ఓ మంచి ఈగ నువ్వు స్వర్గానికి వెళ్లాలని... వచ్చే జన్మలో మనిషిలా పుట్టి ఇంకొన్నేళ్లు బతకాలని అందరూ కోరుకుంటున్నారు..నువ్వు లేకపోవడం బాధగా ఉంది" అని ప్రతిజ్ఞ చేసి కాసేపు మౌనం పాటించారు. ఇలా అందరూ హల్దీ ఫంక్షన్ ని ఎంజాయ్ చేశారు.

ఖుష్బూ రొమాంటిక్ గా చూసేసరికి స్టేజి మీద పడిపోయిన హోస్ట్!

"డాన్స్ ఇండియా డాన్స్" మంచి కలర్ ఫుల్ గా  ఫుల్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొడుతోంది. ఇక ఈ వారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఈ షోకి అతిలోక సుందరి, ది క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా ఖుష్భూ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచంలోనే ఒక హీరోయిన్ కి టెంపుల్ కట్టారంటే అది ఖుష్బూ గారికే అని చెప్పి  హోస్ట్ అకుల్ బాలాజీ ఆమెను ఇన్వైట్ చేసాడు.  ఇక మరో హోస్ట్ రౌడీ రోహిణి వచ్చి ఖుష్బూ గారిని ఆట పట్టించింది. మీరు క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా ఐతే నేను క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సింగర్స్ అని తనని తాను పరిచయం చేసుకుంది. ఇక ఖుష్బూ గారికి ఒక టాస్క్ ఇచ్చింది జడ్జి సంగీత. ఒక పది సెకన్లు రొమాంటిక్ గా అకుల్ వైపు  క్షుష్బూ చూసేసరికి హోస్ట్ ఆ చూపుకు కింద పడిపోయాడు.  తర్వాత హోస్ట్ అకుల్, జడ్జి ఆనంది కలిసి స్టేజి మీద "శుభలేఖ రాసుకున్న" అనే  సాంగ్ కి రొమాంటిక్ గా డాన్స్ చేశారు. తర్వాత 80 స్ గ్యాంగ్ ఫోటోని షోలో చూపించారు.  తర్వాత అఖిల్ - సుధాన్షు ఇద్దరూ కలిసి సీతారామం మూవీలో సాంగ్ పాడి వినిపించారు. వాటి తర్వాత  బాబా మాస్టర్ వచ్చి సింగర్ అవతారం ఎత్తారు. "వై థిస్ కొలవెరి" అనే సాంగ్ పాడి ఎంటర్టైన్ చేశారు. ఫైనల్ గా చంటి మూవీలోని "ఓ ప్రేమ..నా ప్రేమ" సాంగ్ కి ఖుష్బూ అద్దిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

ఎంటర్‌టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ అన్ని సీజన్లలోనూ ఈ సీజన్-6 బోరింగ్ అనే మాట ప్రతీ వారం వినిపిస్తుంది. కానీ ఈ వారం బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా అలా అనరనే చెప్పాలి. ఎందుకంటే ప్రతీ కంటెస్టెంట్ తమ పర్ఫామెన్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. అయితే గత వారం నుండి జరుగుతున్న విన్నర్ ప్రైజ్ టాస్క్ లు అన్నీ కూడా చాలా ఎంటర్‌టైన్మెంట్ గా ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కూడా తమకిచ్చిన టాస్క్ లలో బాగా ఇన్వాల్వ్ అయ్యి, ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో కీర్తి, సత్యని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. చీకటి గదిలో వాళ్ళకి భయాన్ని దగ్గర నుండి చూపించాడు బిగ్ బాస్. అయితే అలా భయపడటం చూసేవాళ్ళకి వినోదాన్ని పంచింది. ఇంకా లాస్ట్ లో బిగ్ బాస్, కంటెస్టెంట్స్ అందరినీ ఒకేసారి కన్ఫెషన్ రూంకి పిలవగా, అందరూ భయంతో గందరగోళం చేసారు. వీళ్ళందరి భయంతో కూడిన పర్ఫామెన్స్ వినోదాన్ని పంచింది. ఇంకా ఆ తర్వాత కంటెస్టెంట్స్ చేసిన రోల్ ప్లే టాస్క్ లో.. ఇప్పటివరకు హౌస్ లో జరిగిన గొడవలు, అందరికి గుర్తుండిపోయిన సంఘటనలు మళ్ళీ చేసి చూపించమన్నాడు బిగ్ బాస్. అయితే ఎవరి రోల్ వారికి ఇవ్వకుండ క్యారెక్టర్ మార్చి ఇవ్వగా, అందరూ కూడా బాగా చేసారు. శ్రీహాన్, ఇనయాల మధ్యలో జరిగిన పిట్ట గొడవను.. అర్జున్ రేవంత్ మధ్యలో పప్పు గొడవను.. ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్.. ఇంకా రోహిత్, రేవంత్ ల గొడవ. వీటికి సంబంధించిన రోల్ ప్లే బాగా చేసారు. ఆ తర్వాత "కంటెస్టెంట్స్ రోల్ ప్లే బాగా చేసి నాకు వినోదాన్ని అందించారు" అంటూ బిగ్ బాస్ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత విన్నింగ్ ప్రైజ్ మనీ అమౌంట్ 47 లక్షలుగా ఉందని అనడంతో కంటెస్టెంట్స్ అందరు సంతోషపడ్డారు. అయితే ఈ టాస్క్ లో రోహిత్, శ్రీసత్య బాగా పర్ఫామెన్స్ చేసారంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

సూర్య గారి పక్కన ఛాన్స్ వస్తే చేయాలని ఉంది!

జబర్దస్త్ కమెడియన్ వినోద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐతే కొన్ని నెలలుగా ఈ కామెడీ షోలో అయన కనిపించడం లేదు. అనారోగ్య కారణాల వలన కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు.  ఇక ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న మాటల్ని చెప్పారు. " జబర్దస్త్ అనేది సక్సెస్ ఫుల్ షో కాబట్టి దాని మీదే రూమర్స్ వస్తూ ఉంటాయి. ఐతే జబర్దస్త్ లోకి రావాలి అనుకుంటే వాళ్లకు టాలెంట్ ఉండాలి లక్ అనేది ఉండాలి. టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే వాళ్ళు ముందుకెళ్తున్నారు లేని వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఇక జబర్దస్త్ లో పేమెంట్ విషయానికి వస్తే పర్సనల్ గా ఎవరికీ పే చేయరు. టీంలీడర్ కి ఇస్తారు. టీం లీడర్ ఆ అమౌంట్ ని టీమ్ మెంబర్స్ కి షేర్ చేస్తాడు. ఇక షోస్ నుంచి చాలా మంది ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మంచి ఆఫర్స్ రావడం వలన, కొంతమందికి ఆరోగ్యం సరిగా లేక ఎవరి పర్సనల్ ఇష్యూస్ తో వాళ్ళు వెళ్లిపోతున్నారు.  ఇక అందరిలోకి సుధీర్ అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే అతను చాలా పద్దతిగా మాట్లాడతాడు. మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. చిన్నప్పటినుంచి మా నాన్నకు స్టేజి షోస్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాకు మా సపోర్ట్ చాలా ఉంది. డాక్టర్ కావడం నా లక్ష్యం. మా అమ్మ కోరిక కూడా అదే ..నాకు ఎంసెట్ లో సీట్ వచ్చింది. అదే టైములో యాక్టింగ్ లో అవకాశం కూడా వచ్చింది. సూర్య గారి పక్కన చేయాలని ఒక డ్రీం అనేది ఉంది నాకు. "ఆకాశమే నీ హద్దురా" మూవీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ చివరిలో ఒక సాంగ్ పాడి వినిపించాడు" జబర్దస్త్ కమెడియన్  వినోద్.

ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ వినోద్ !

చమ్మక్ చంద్ర టీమ్ లో జబర్దస్త్ వినోద్ లేడీ గెటప్స్ వేస్తూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వినోద్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆడ వేషంలో కనిపిస్తూ అదరగొట్టే పంచులతో వినోదిని పేరుతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. చీర కడితే అచ్చం అమ్మాయిలా కనిపించేసరికి అందరూ మొదట్లో నిజంగా అమ్మాయే అనుకున్నారు. అబ్బాయి అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు..  ఇక ఇప్పుడు వినోద్ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. " రెగ్యులర్ జర్నీల కారణంగా, జంక్ ఫుడ్ కారణంగా హెల్త్ అంతా బాగా పాడైపోయింది..లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. జబర్దస్త్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అనేది ఉంది. అభి, రాకేష్, రచ్చ రవి, చంద్ర అన్న అందరూ నాకు బాగా హెల్ప్ చేస్తారు. హాస్పిటలైజ్ ఐనప్పుడు చాలా బాగా కేరింగ్ గా చూసుకున్నారంతా.  ఇక కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యాక అవకాశం ఉంటే జబర్దస్త్ లో చేస్తాను లేదా మిగతా ఏదైనా చానెల్స్ లో ప్రసారమయ్యే షోస్ నుంచి ఏమన్నా ఆఫర్ వస్తే వెళ్లి చేస్తాను. ఇక రీసెంట్ గా "హౌస్ అరెస్ట్" "ఇందువదనా" "లంక" అనే మూవీస్ లో  కూడా యాక్ట్ చేసాను. ఓన్లీ లేడీ గెటప్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. నా జీవితంలో వరస్ట్ డే అనేది ఏదైనా ఉంది అంటే మా నాన్న నా చేతుల్లో చనిపోయిన రోజు..అలాంటి రోజులు ఎప్పటికీ రాకూడదు " అని ఎన్నో విషయాలను చెప్పాడు వినోద్.

పటాస్ హౌస్ లో నా కొత్త ప్రాజెక్ట్ ప్రోమో షూటింగ్ మొదలయ్యింది!

మంజుల నిరుపమ్ ..బుల్లితెర మీద సీరియల్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు రియల్ వైఫ్ మంజుల. మంజుల కన్నడంలో మనయందు మూరుబాగిలు, ప్రేమ పిశాచిగలు, క్షణ-క్షణ, కాదంబరి, తులసి, కల్యాణి, రంగోలి వంటి సీరియల్స్ లో ఇక  తెలుగులో చంద్రముఖి, అమ్మాయి కాపురం, చంద్రలేఖ, నీలాంబరి, ఇద్దరమ్మాయిలు, ఆకాశమంత, కాంచనగంగ, తరంగాలు, లేతమనసులు వంటి సీరియల్స్ లో  హీరోయిన్ పాత్రల్లో చేసింది. ఇక మంజుల సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా జెమినీ టీవీలో తన కొత్త సీరియల్ షూటింగ్ ప్రారంభమయ్యింది చెప్పుకొచ్చింది. అది కూడా సీరియల్ ప్రోమో షూటింగ్ అట..జెమినీ ఛానల్ వాళ్ళు చేస్తున్నారని చెప్పింది. ఐతే జెమినీకి సంబంధించిన వాళ్ళు  అంతగా ఎవరూ తెలియదని చెప్పింది. ఇక ఇంటి నుంచి లంచ్ బాక్స్ ని, కావాల్సిన కాస్ట్యూమ్స్ ని, మేకప్ కిట్ ని అలాగే మినీ ఫ్యాన్ ని మొత్తాన్ని ఎలా ప్యాక్ చేసుకుని షూటింగ్ లొకేషన్ కి తీసుకెళ్ళిందో చూపించింది. ఇక ఫస్ట్ డే షూటింగ్ ప్రోమో పటాస్ హౌస్ లో జరిగిందని చెప్పింది. అంటే పటాస్ మూవీని ఆ ఇంట్లోనే  షూట్ చేశారట. అలాగే కార్తీకదీపం సీరియల్ లో ఫస్ట్ లో చూపించిన ఇల్లు అని కూడా చెప్పింది మంజుల.  ఇక ఫుల్ మేకప్ వేసుకుని రెడీ అయ్యింది..ఐతే తన మేకప్, డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో రేటింగ్ ఇవ్వండి అని తన ఫాన్స్ ని కోరింది మంజుల. ఇక నెటిజన్స్ అందరూ పదికి పది మార్కులు వేసి కొత్త ప్రాజెక్ట్ సందర్భంగా బెస్ట్ విషెస్ కూడా చెప్పారు.

ఫైమాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పటాస్ ప్రవీణ్!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేసిన ఫైమాకి తన మిత్రుడు పటాస్ ప్రవీణ్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాడు. స్పెషల్ గిఫ్ట్ తో ఆమెను  సర్ప్రైజ్ చేసాడు. ముందుగా ఒక కేక్ కట్ చేసి ఫైమాకి తినిపించాడు.  తర్వాత ఫైమా కూడా ప్రవీణ్ కి వాళ్ళ అమ్మకు తినిపించింది. ఆ తర్వాత కడపకు వెళ్లి అక్కడి దర్గా నుంచి హోలీ వాటర్ తీసుకొచ్చి ఫైమా చేతికి ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏదో అనుకునేవు ఈ హోలీ వాటర్ నే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం అందుకే ..అని చెప్పాడు. ఇక తన మెడలోని గోల్డ్ చైన్ కూడా ఫైమాకి ఇచ్చాడు. ఫైమాని చూస్తుంటే తనకు చాలా భయమేస్తోందని చెప్పాడు. ఎందుకంటే హౌస్ లో అందరితో ఫైట్ చేసి వచ్చింది కదా తనను కూడా ఏమన్నా అంటుందేమో అని భయం వేసిందట.  ఇక ఫైమా హౌస్ లో బాగా ఆడిందని..ఇన్ని రోజులు హౌస్ లో ఉండడం చాలా గ్రేట్ అని హోస్ట్ నాగార్జున ఫైమా ఆటను మెచ్చుకోవడం చాలా సంతోషం అని తన కూతురు ఫైమా గురించి చెప్పి సంబరపడింది  వాళ్ళ అమ్మ.

నాకు మళ్లీ కంటెస్టెంట్ గా చేయాలని ఉంది..కానీ ఓడిపోతానని భయంగా ఉంది!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్  లేటెస్ట్ గా మరో టీజర్ ని రిలీజ్ చేసింది. కిరాక్‌ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ’. ఇప్పటికి 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఆదివారం నుంచి సీజన్ 15 ఆడియన్స్ ముందుకు రావడానికి  సిద్ధమైపోయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా రాబోతున్నారు.  ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ ఎంతోమందికి ఆయన డాన్స్ కోరియోగ్రఫీ కూడా చేశారు..అలాంటి ఇండియన్ మైకేల్ జాక్సన్  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా.. ఆయన సత్తా చాటారు. నటుడిగా కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేసారు.  ఇప్పుడు ఢీ-15 లో మెరవడానికి సిద్ధమయ్యారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చారు.  ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు అలరించడానికి సిద్దమయ్యాడు. అలాగే ఈ షో లేటెస్ట్ గా రిలీజ్ ఐన టీజర్ లో శ్రద్ధాదాస్ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ తో కలిసి స్టేజి మీదకు వచ్చి "నాకు కంటెస్టెంట్ గా మళ్లీ చేయాలనుంది..కానీ సెలెక్షన్స్ లోనే ఓడిపోతానని నాకు తెలుసు" అని ఒక డైలాగ్ వేసి అందరినీ నవ్వించారు.

రూల్స్ పెట్టారు..ఏం లాభం..ఫాలో అవ్వాలి కదా!

బుల్లితెర నటుడు పవన్ సాయి గురించి అందరికీ తెలుసు. ఫస్ట్‌టైమ్‌ కామెడీ రోల్‌ ఉన్న "హ్యాపీడేస్‌" సీరియల్‌లో ‘బ్లూటూత్‌’ పాత్రలో నటించే అవకాశం వచ్చింది పవన్ కి . తర్వాత మొగలిరేకులు, శ్రావణసమీరాలు వంటి సీరియల్స్ లో నటించాడు.  ‘జీ తెలుగు’ ఛానల్ లో ‘ముద్దమందారం’ సీరియల్‌లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు.  ఇప్పుడు స్టార్ మాలో ప్రసారమవుతున్న "మల్లీ..నిండు జాబిల్లి" సీరియల్ లో అరవింద్ పాత్రలో నటిస్తున్నాడు. ఐతే పవన్ సాయికి ఈమధ్య బాగా కోపం వచ్చింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. కార్ లో వెళుతూ అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలతో  ట్రాఫిక్ సమస్యలతో ఆయనకు  బాగా కోపం వచ్చింది. "భరత్ అనే నేను" మూవీలో మహేష్ బాబు ఎలాగైతే ట్రాఫిక్ ని చూసి షాకయ్యాడో అచ్చం అలాగే పవన్ సాయి కూడా రియాక్ట్ అయ్యాడు.  "ఈ ట్రాఫిక్ తో చాలా చిరాగ్గా ఉంది. ఎలా పడితే అలా వెళ్తున్నారు. ట్రాఫిస్ రూల్స్ అసలు ఎవరూ పాటించడంలేదు...24 / 7 ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎవరికీ ఏ సమస్య రాదు" అని కోపంగా ఉన్న ఎమోజిస్ ని కూడా కలిపి తన ఒపీనియన్ ని  తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు.

ఘనంగా కమెడియన్ యాదమ్మరాజు, స్టెల్లా హల్దీ వేడుకలు!

‘పటాస్’ కామెడీ షో ద్వారా బాగా పాపులరైన కమెడియన్ యాదమ్మ రాజు. ఆయన తర్వాత  జీ తెలుగు నిర్వహించిన కామెడీ షోలో కూడా కొన్నాళ్ళు కామెడీ స్కిట్స్ వేసి ఎంటర్టైన్ చేసాడు. తన ఇన్నోసెంట్ ఫేస్ తో ఎలాంటి డైలాగ్స్ నైనా కామెడీగా చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు.  ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో కామెడీ స్కిట్స్ వేస్తూ అలరిస్తున్నాడు. ఇక యాదమ్మ రాజు ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ వేడుకను చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు స్టెల్లా …! వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళ పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. రీసెంట్ గా  హల్దీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.  యాదమ రాజు- స్టెల్లా చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ మతాలు వేరైనా  మనసులు కలిసేసరికి ఆ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడాయిని త్వరలో  పెళ్లితో ఒకటి కాబోతున్నారు.  2020 ఆగష్టు 22న జీతెలుగులో ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే ఒక షోలో  తన స్నేహితురాలిని  పరిచయం చేశాడు యాదమ రాజు.

ఘనంగా బుల్లితెర సీరియల్ నటి త్రిష వివాహం!

కరోనా టైములో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఫుల్ ఎంటర్టైన్ చేసి ఇండస్ట్రీ మొత్తం కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.  ఇక ఈ  ఇయర్ మొదటి నుంచి చూసుకుంటే కరోనా టైములో వాయిదా పడిన పెళ్లిళ్లు అన్నీ ఈ సంవత్సరం  ఘనంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన  త్రిష ఇప్పుడు ఎన్నో సీరియల్స్ మంచి మంచి పాత్రల్లో నటిస్తోంది. స్టార్ మాలో ప్రసారమైన ‘మనసిచ్చి చూడు’సీరియల్ లో కీర్తిభట్ చెల్లెలు రేణు పాత్రలో కనిపించి అలరించింది త్రిష.  ఇక ఇప్పుడు ఈమె ఘనంగా వివాహం చేసుకుంది. ఇక ఈ భర్త పేరు విశాల్. ఈమె వివాహానికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. త్రిష ఎన్నో మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే బుల్లితెర మీద చక్రవాకం, మొగలిరేకులు, భార్యామణి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ లో కూడా నటించింది.