ఆఫర్ కోసం ట్రోఫీని వదిలేసుకున్న శ్రీహాన్..విన్నర్ ఐన సింగర్ రేవంత్!
బీబీ హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఐతే వీరిలో ముందుగా రోహిత్, తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. చివరకి రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. వీరిద్దరిలో ఎవరు విన్నర్ అనే ఉత్కంఠ చాలా సేపు కొనసాగింది. ఐతే నాగార్జున వీరి ముందు డబ్బును పెట్టి బేరాలు మొదలుపెట్టారు.
25 లక్షల నుంచి బేరం మొదలు కాగా.. రేవంత్, శ్రీహన్ ఎక్కడా టెంప్ట్ కాలేదు. వారంతట వారే పోటీ నుంచి తప్పుకుంటే 30 లక్షల ఆఫర్ అని ప్రకటించారు. ఐనా రేవంత్, శ్రీహాన్ అంగీకరించలేదు. కానీ నాగార్జున ఒక్కసారిగా 40 లక్షల ఆఫర్ ప్రకటించేసరికి ఇద్దరూ ఆలోచించడం మొదలు పెట్టారు. చెప్పాలంటే విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దానితో పోల్చుకుంటే 40 లక్షలు ఏమంత చిన్నఅమౌంట్ కాదు.
ఇక అప్పుడు శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి ఒప్పుకున్నాడు. దీంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. ఐతే ఇక్కడ కథ వేరేలా ఉంది. అదేంటంటే రేవంత్ కంటే శ్రీహన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఐతే శ్రీహన్ తొందరపడి 40 లక్షలకు టెంప్ట్ కాకపోయి ఉంటే విన్నర్ అయ్యేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్కింది. అంటే రేవంత్ ని విన్నర్ గా శ్రీహన్ చేసినట్లే లెక్క. ఏదేమైనా డబ్బు పరంగా ఇద్దరికీ పెద్ద తేడా లేదు.