ఏక్ హరి హోమ్ టూర్..ఎంత ప్రశాంతంగా ఉందో!

స్మాల్ స్క్రీన్ మీద స్మార్ట్ గా కనిపిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు ఏకనాథ్. ఎన్నో సీరియల్స్ లో నటించాడు. ఇప్పుడు కేరాఫ్ అనసూయ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాడు.  ఇక ఈయన భార్య హారిక కూడా సీరియల్స్ లోనే నటిస్తూ ఉంటుంది.  ఇక ఇప్పుడు వీళ్ళు ఒక వీడియో చేసి ఏక్ హరి అనే  పేరుతో ఉన్న వాళ్ళ యూట్యూబ్‌ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఏక్‌నాథ్‌ సొంత ఊరు చిట్టూర్పులో తాను పుట్టి, పెరిగిన ఇంటిని చూపించాడు. ఈ ఇల్లు పెంకుటిల్లు, చుట్టూ పెద్ద తోట..బోలెడు మొక్కలు, లోపల చిన్న చిన్న గుడిసెలు, జామ, సపోటా, కొబ్బరి చెట్లు, తులసివనం వంటివి అన్నీ ఉన్నాయి.  అన్ని గదులు కూడా ఎంతో విశాలంగా కట్టినవి. వంట చేసుకోవడానికి వీలుగా.. ఇంటి బయట ప్రత్యేకంగా ఓ పాకను కూడా కట్టుకున్నారు.    ఇక ఇంట్లో పాతకాలం నాటి వస్తువుల్ని చూపించింది హారిక. ఏకనాథ్ వాళ్ళ నాన్న ఇంటి గురించి వివరిస్తుంటే ..హారిక వీడియో షూట్ చేసింది..ఇక అక్కడ వర్షం పడుతుండేసరికి కోడలికి అత్తగారు గొడుగు పట్టారు. ఇవన్నీ చూసిన అభిమానులు.. "అబ్బా మీ ఇల్లు ఎంత బాగుంది అండి.. ప్రశాంతంగా.. హాయిగా ఉంది. మీ ఇంటిని చూస్తే.. మా బాల్యం గుర్తొస్తోంది... మీ అమ్మా, నాన్న కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు." అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాకు పుట్టిల్లు ఐనప్పుడు తనకు అత్తవారిల్లే కదా...

లేడీస్ అండ్ జెంటిల్మన్ షో ఎవ్రీ వీక్ ఫుల్ కామెడీతో సాగిపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగర్స్ అండ్ రైటర్స్ ఐన  చంద్రబోస్, ధనుంజయ్, అనూప్ రూబెన్స్ వాళ్ళ వాళ్ళ భార్యలతో ఈ షోకి వచ్చారు. "నేను సుచిత్రను షోస్ కి తీసుకురావాలి అంటే బుజ్జగించాలి..కానీ జీ తెలుగుకి రమ్మంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ జీ తెలుగు నాకు పుట్టిల్లు ఐతే సుచిత్రకు అత్తవారిల్లు" అని చెప్పారు చంద్రబోస్. ఇక తర్వాత సింగర్ ధనుంజయ్ తన వైఫ్ తో స్టేజి మీదకు  ఎంట్రీ ఇచ్చారు "పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక  పాట పాడి మా మావయ్యగారి మనసు కరిగించాను" అని చెప్పి ఫుల్ కామెడీ చేశారు. ఇక ఫైనల్ గా అనూప్ రూబెన్స్ తన వైఫ్ తో రెండు స్టెప్స్ వేసి స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. ప్రదీప్ అనూప్ రూబెన్స్ కి అద్దం ఇచ్చి లవ్ ప్రొపోజ్ చేయమని టాస్క్ ఇచ్చాడు. " అద్దంలో కనిపించేది ఎవరికి వారు..ఇద్దరిలో కనిపించేది ఒకరికి ఒకరు" అనే పాట పాడి తన వైఫ్ ని ఇంప్రెస్ చేసాడు. ఇక తర్వాత వీళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్.  ఈ షో డిసెంబర్ 4 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

ఆదిరెడ్డి కామన్ మ్యానా.. ఎలా? 

బిగ్ బాస్‌లో మొదటిసారిగా కామన్ మ్యాన్‌కి అవకాశం ఇచ్చారు అని చాలా మంది అనడం వింటూనే ఉన్నాం. "ఒక కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు.. రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు.. కంటెస్టెంట్ కంటెండర్ అయ్యాడు.. కంటెండర్ కెప్టెన్ అయ్యాడు" అంటూ ఆదిరెడ్డే చాలా సార్లు హౌస్ లో చెప్పుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తనకి భిన్నంగా ట్రోల్స్ వస్తున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోన్న అంశం "అసలు ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ అని ఎలా అంటారు? ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు" అంటూ పలువురు కామెంట్స్ చెయ్యగా.. "ఎంత స్టార్ హీరో అయిన కెరీర్ మొదట్లో కామన్ మ్యాన్ అంటారు. కానీ ఒక హీరో అయ్యాక కూడా కామన్ మ్యాన్ అని చెపితే అది తప్పు అవుతుంది. ఆదిరెడ్డిని సీజన్-5 లోనే పిలిచారు. అప్పుడే సెలబ్రిటీ లిస్ట్ వరకు వెళ్ళాడు. ఇంకా క్రికెట్ ఫాంటసీ చానెల్స్ ప్రెడిక్షన్స్.. చాలా చాలానే ఉన్నాయి. ఒక యూట్యూబ్ రివ్యూయర్. ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఒక్కప్పుడు కామన్ మ్యాన్ అంటే ఓకే కానీ ఇప్పుడు అలా అనడం తప్పు. ఆదిరెడ్డితో కంపేర్ చేస్తే రాజ్, ఇనయా, ఫైమా, ఆఖరికి శ్రీహాన్ కూడా తక్కువే" అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.    ఇదే విషయంపై గీతు రాయల్ కూడా ఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. కానీ సోషల్ మీడియాలో "ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు. అలా చెప్పుకోవడం తప్పు" అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

డాక్టర్ బాబు ఇంటికి వచ్చి వంట చేసిన వంటలక్క!

డాక్టర్ బాబు, వంటలక్క 'కార్తీక దీపం' సీరియల్‌తో ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఈ సీరియల్ ఆరేళ్ళ నుంచి సాగుతున్నా కూడా డాక్టర్ బాబు ఒక్క సారి కూడా వంటలక్కను తన ఇంటికి ఇన్వైట్ చేయలేదట. వంటలక్క అన్ని సార్లు అడిగేసరికి ఫైనల్‌గా ఇప్పుడు తన ఇంటికి ఇన్వైట్ చేసాడు. వంటలక్కకు తన ఇల్లంతా తిప్పి చూపించాడు నిరుపమ్. అలాగే తన కుమారుడు రిక్కీ వేసిన పెయింటింగ్స్ చూపించింది నిరుపం భార్య మంజుల. ఇక నిరుపమ్ వాళ్ళ అమ్మ వంటలక్కను చూసి చాలా ఖుషి ఐపోయింది. ఇక షూటింగ్ సెట్‌లో వంటలక్క ప్రొడక్షన్ బాయ్ తెచ్చే ఫుడ్‌కి రకరకాల పేర్లు పెడుతుందని బాగా వండేవాళ్లు కూడా ఇలా పేర్లు పెట్టరని అనేసరికి వంటలక్కకు కోపమొచ్చింది. దాంతో "బాగోకపోతే బాగోలేదని చెప్పాలి కదా. మా ఇంట్లో నేనే  వంట చేస్తాను" అంది. "ఐతే ఈరోజు నువ్వు మా ఇంట్లో సాంబార్ పెట్టాలి" అని నిరుపమ్ అనేసరికి, "ఓహ్ ఈ రోజు మీ ఇంట్లో వంట మనిషి రాలేదా.. అందుకే నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేసావా?" అని కౌంటర్ వేసింది. దాంతో అందరూ నవ్వేశారు. ఈ సరదా సరదా వీడియోను నిరుపమ్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసాడు. 

ఈ జన్మకు కష్టం..బెటర్ లక్ నెక్స్ట్ టైం..సౌమ్యకి మంచి ఆఫర్ ఇచ్చిన నాటీ నరేష్

రాఘవ ఏ స్కిట్ చేసినా అందులో వెరైటీ కనిపిస్తుంది. ఇక రాబోయే వారం జబర్దస్త్ లో రాఘవ బామ్మ గెటప్ లో బైక్ మీద ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా  రిలీజ్ అయ్యింది. బండి మీద స్టైల్ గా 16 ఏళ్ళ వయసు సాంగ్ పాడుకుంటూ వచ్చాడు రాఘవ. ఇక ఇంద్రజ రాఘవ గెటప్ ని సాంగ్ ని చూసి కూర్చుంటే లేవలేని వయసులో ఈ పడిపడి లేచే పాటలు అవసరమా అని కౌంటర్ వేసింది. ఈ స్కిట్ భార్య భర్తల మధ్య పుల్లలు పెడితేనే కడుపు నిండుద్ది అన్న కాన్సెప్ట్ తో చేసాడు. ఇక నూకరాజు టీమ్ మొత్తం విక్రమ్ నటించి అన్ని మూవీస్ లోని క్యారెక్టర్లు చేసి ఎంటర్టైన్ చేశారు. నాటీ నరేష్ టీం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్ లో ఒక స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో జీని క్యారెక్టర్ ని నరేష్ చేసాడు. సౌమ్య దగ్గరకు వెళ్లి " నేను నీకు నచ్చి ఉండొచ్చు, కానీ ఈ జన్మకు నన్ను దక్కించుకోలేవు ..బెటర్ లక్ నెక్స్ట్ టైంరా నాన్న " అని మంచి ఆఫర్ ఇచ్చాడు నాటీ నరేష్. దానికి కౌంటర్ గా సౌమ్య " ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తున్నాను..ఇలా వున్నాడేంటి" అనే అర్ధం వచ్చేలా పంచ్ పడేసరికి నరేష్ సైలెంట్ ఐపోయాడు.

గోల్డెన్ హార్ట్ రోహిత్..ది బెస్ట్ పర్ఫామర్ ఆఫ్ ది సీజన్!

రోహిత్ ఓడిపోయినా కూడా తను బిహేవ్ చేసిన విధానం తనని గెలిపించింది అంతే.. అంటే ఇక్కడ టాస్క్ ఓడిపోవచ్చు కానీ ప్రేక్షకుల మనసు గెలిచాడు. ప్రతీ దగ్గర జెంటిల్ మెన్ నేచర్, గుడ్ బిహేవియర్. కచ్చితంగా అతడి స్థాయిని పెంచుతాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్ లో ఏ కంటెస్టెంట్ కూడా అంత క్లీన్ ఫెయిర్ గేమ్ ఆడలేదు. ప్రతీ టాస్క్ లోను బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవుతూ.. ఎక్కడా ఫేవరెటిజం చూపించకుండా, తన గేమ్ తను ఆడుతూ గోల్డెన్ హార్ట్ రోహిత్ అని అనిపించుకుంటున్నాడు.  సోషల్ మీడియాలో రోహిత్ ని 'జెంటిల్ మెన్ రోహిత్' అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన రోల్ బేబీ రోల్ గేమ్ లో శ్రీహాన్ కి ఫేవరెటిజం చేసింది శ్రీసత్య. ఇనయాని మానిపులేట్ చేసి రోహిత్ ని లెవెల్ నుండి బయటకొచ్చేలా ఇనయాతో మార్చి చెప్పించింది శ్రీసత్య. వరెస్ట్ సంచాలక్ గా శ్రీసత్యని ప్రేక్షకులు తిడుతూ కామెంట్స్ చేయగా, ప్యూర్ అండ్ జెంటిల్ మెన్ రోహిత్ అంటున్నారు. ఓటింగ్ లో నిన్న మొన్నటి దాకా అడుగున ఉన్న రోహిత్.. తన బెస్ట్ పర్ఫామెన్స్ తో టాప్ త్రీ కి చేరుకున్నాడు. కాగా శ్రీసత్య, ఫైమా డేంజర్ జోన్ లో ఉన్నారు. 

ఏకాభిప్రాయాలే టికెట్ టు ఫినాలేనా?

బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వింతగా ఈ సీజన్ సాగుతోంది. ఇప్పటివరకూ టాస్క్ లో గెలిచినవారిదే కెప్టెన్సీ. దాంతో గేమ్ లో బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడేమో ఈ టికెట్ టు ఫినాలే కోసం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోండి అని బిగ్ బాస్ ప్రతీ టాస్క్ లోని లెవెల్ లో చెప్తూ వస్తున్నాడు. దీంతో హౌస్ మేట్స్ హై ఇంటెన్స్ గా ఫీల్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ప్రతీ కంటెస్టెంట్ బిగ్ బాస్ కి ఎదురు తిరిగారు. ఎందుకంటే టాస్క్ లో కష్టపడి ఆడి ఆరుగురు గెలిస్తే వారిలో నుండి ఏకాభిప్రాయంతో ఇద్దరిని తొలగించాలి అంటే కంటెస్టెంట్స్ కే కాకుండా, అలా ఎలా అంటూ చూసే ప్రేక్షకులకు కూడా విసుగొచ్చింది. గత రెండు రోజుల నుండి 'టికెట్ టూ ఫినాలే' టాస్క్ జరుగుతోంది కానీ ప్రతీ లెవెల్ లో ఒక్కో కంటెస్టెంట్ ని ఏకాభిప్రాయంతో తొలగించాలి అని చెబుతూ వస్తున్నాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ పెడితే వాళ్ళలో ఎవరు ఎంత ఆడతారో అని తెలిసిపోతుంది అలాంటిది ఏ టాస్క్ పెట్టకుండా ఏకాభిప్రాయం ఏంటి? అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ లాంటి మెరుగైన కంటెస్టెంట్ కి సరైన టాస్క్ లు ఇవ్వకుండా వేరొకరి మీద నిర్ణయాన్ని ఉంచడమేంటి ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నోరు జారుతున్న కీర్తి భట్!

బిగ్ బాస్ హౌస్ లో నాలుగు రోజులుగా సాగుతున్న 'టికెట్ టు ఫినాలే' టాస్క్ చివరి దశకి కి చేరుకుంది. ఇందుకే ఒక్కో లెవెల్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఒక్కో రేస్ నుండి తొలగిస్తున్నాడు బిగ్ బాస్. కాగా నిన్న జరిగిన టాస్క్ లో రేస్ లో చివరన ఉన్నవాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాడు. "టాస్క్ పేరు 'రోల్ బేబి రోల్'. ఇందులో ఎవరు అయితే బ్రిక్స్ తో  హైట్ బిల్డిండ్ కడతారో, వాళ్ళు ఈ లెవెల్ లో మొదట్లో ఉంటారు. కాగా ఈ టాస్క్ కి ఇనయా, శ్రీసత్య సంచాలకులు గా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో రోల్ చేసుకుంటూ బ్రిక్స్ ని తీసుకెళ్ళి, హైట్ బిల్డింగ్ కట్టాలి అనే రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కీర్తి, ఫైమా, రోహిత్, శ్రీహాన్ నలుగురు పాల్గొన్నారు. టాస్క్ ముగిసే సమయానికి అతి తక్కువ బ్రిక్స్ తో కీర్తి, ఫైమా ఉండగా, శ్రీహాన్ మొదటి స్థానం, రోహిత్ రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ఇదే విషయం సంచాలకులుగా చేస్తున్న ఇనయా, శ్రీసత్యలు బిగ్ బాస్ కి చెప్పగా, కీర్తి కోపంగా "శ్రీసత్య సంచాలకురాలిగా ఉండి కూడా శ్రీహాన్ కి సపోర్ట్ చేసింది. గ్యాప్స్ ఉండకూడదు అని ముందు మీరు చెప్పారు" అని శ్రీసత్యని అడిగింది కీర్తి. "మనమెందుకు కష్డపడాలి. ఇంత అన్ ఫెయిర్ గా ఆడితే ఎలా, కష్టపడి ఆడినందుకు ఇలా చేస్తారా, ఎందుకు ఇలా చేస్తారు. తుప్పాస్ సంచాలక్ " అని కీర్తి వచ్చేసింది. "ప్రతీసారీ ఫెవరిజం చూపిస్తున్నారు. కష్టపడేవాళ్ళకి ఏం సపోర్ట్ ఉండదు. థు.. ఇలాంటి జనాల మధ్య నేనున్నానా " అని కీర్తి ఒంటరిగా కూర్చొని బాధపడింది. నా స్ట్రెంత్ మీద నాకు నమ్మకం ఉంది" అంటూ చెప్పుకుంది. అయితే కీర్తి సంచాలకులు ఇచ్చిన నిర్ణయాన్ని వినకుండా కొన్ని మాటలు జారింది. "ఫుల్ నెగెటివ్ అవుతున్నాను బిగ్ బాస్.. ప్లీజ్ నన్ను ఒక్కసారి కన్ఫెషన్ రూంకి పిలవండి" అని కీర్తి రిక్వెస్ట్ చేసింది. ఆమె రిక్వెస్ట్ ని ఒప్పుకోలేదు బిగ్ బాస్.ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ "లెవల్స్ పూర్తి అయ్యేసరికి తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి టికెట్ ఫినాలే రేస్ లో నుండి తొలగిపోయింది" అని చెప్పాడు.

అరియనా చంకనెక్కిన అష్షు..వైరల్ అవుతున్న ఫోటో

అష్షు రెడ్డి సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తన షూట్స్ కి సంబంధించిన వీడియోస్, ఫామిలీ పిక్స్, అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫొటోస్ , ఆర్జీవీతో కలిసి బర్త్ డే ఫంక్షన్ చేసుకున్న ఫొటోస్  అన్ని కూడా తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు అష్షు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో మరో యాంకర్ అరియనాతో కలిసి ఒక  వెరైటీ పోజ్ లో  కనిపించింది. ఈ  ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్..అంతేకాదు వీళ్ళిద్దరూ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ ఐనవాళ్లు. ఇక ఇప్పుడు అరియానా చంకనెక్కింది అష్షు పాప. అష్షు అప్పుడప్పుడు షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆరియానా ప్రస్తుతం బీబీ కేఫ్ లో చేస్తోంది. ఈ ఇద్దరూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్..ఇక వీళ్ళిద్దరూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రోల్ అవుతూనే ఉంటారు. ఇలా వీళ్ళు ఈ  ఫోటోని పోస్ట్ చేసి ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. "నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఓదారుస్తావ్" అనే అర్థంలో కాప్షన్ కూడా పెట్టుకుంది.

క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన మల్లెమాల ఆర్టిస్ట్స్ టీమ్

జబర్దస్త్ టీంకి కొంచెం టైం దొరికేసరికి ఛిల్ల్ అవడానికి గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ఆడేశారు. జబర్దస్త్ యాక్టర్స్, మేనేజ్మెంట్  టీమ్, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని రౌడీ రోహిణి షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ఇక ఇక్కడ కూడా వీళ్ళ పంచులు, కౌంటర్లు పేల్చారు. నాటీ నరేష్, యాక్టర్ బాబు కలిసి "అసలు వికెట్లు ఎన్ని ? కవర్ లో దాక్కుని  డ్రైవ్ చేయడాన్ని  కవర్ డ్రైవ్ అంటారు..  గార్డ్ అంటే ఏమిటో తెలుసా ? మొబైల్ కి వాడే గార్డ్ ని అలా పిలుస్తాం" అంటూ కామెడీ చేశారు. తర్వాత  రోహిణి కాసేపు బౌలింగ్ వేసింది, తర్వాత బాటింగ్ కూడా చేసింది. ఇక ఈ క్రికెట్ మ్యాచ్  చూడడానికి వర్ష కూడా వచ్చింది. తర్వాత సన్నీ గ్రౌండ్, ఆది ఎంట్రీ ఇచ్చారు. ఇక మిగతా వాళ్లంతా సన్నీ మందుకొట్టి బాల్ వేస్తే అది ఎటో వెళ్తుంది అని ఫుల్ ఫన్ చేశారు. ఇక ఫైనల్ గా  ఆర్టిస్టుల టీమ్ కి మేనేజర్స్ టీమ్ కి పోటీ బాగా జరిగింది. అందులో మేనేజర్స్ టీమ్ ఓడిపోయింది. ఇక క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని అడిగిన రోహిణికి "ఇదొక  స్ట్రెస్ బస్టర్ కొంచెం రిలాక్సేషన్ కోసం" అని ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ ఐన శ్రీపాద చెప్పారు.

నాగార్జునని కలిసిన గలాటా గీతు.. వైరల్ అయిన చిరుత టాటు!

బిగ్ బాస్ హౌజ్ లో ఒక వెలుగు వెలిగిన గలాట గీతు.. తొమ్మిదో వారంలో ఊహించ‌ని విధంగా ఎలిమినేట్ అయింది. ఇప్పటికీ ఆమె ఆ బాధ నుండి బయటకు రాలేకపోతుంది. హౌస్ లో మొన్నటి వరకు జరిగిన ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌ చూస్తూ ఏడ్చేసింది. "నేను హౌస్ లో ఉండి ఉంటే నా ఫ్యామీలి కూడా వచ్చేది" అని అనుకుంటూ బాధపడింది గీతు. అయితే లేటేస్ట్ గా గీతు తన సోషల్ మీడియాలో నాగార్జునతో కలిసి దిగిన ఫోటోతో కూడిన వీడియోని అప్లోడ్ చేసింది. ఆ ఫోటో గురించి మాట్లాడుతూ "నాగార్జున సర్ నుండి పిలుపు వచ్చింది" అని చెప్పింది. ఇంకా తను ఎలిమినేట్ అయినప్పుడు బాగా ఏడ్చేసింది. అది ఇప్పుడు చూసుకొని ఏమిరా సామి అలా ఏడ్చేసాను అని తన మీద తనకే జాలేసిందని చెప్పింది. అయితే హౌస్ లో ఉన్నప్పుడు తనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని కలలు కన్న గీతుకి.. బిగ్ బాస్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగార్జున నుండి పిలుపు వచ్చిందంటూ అప్లోడ్ చేసిన వీడియోకి విశేష స్పందన రావడంతో, ఈ వీడియో వైరల్ గా మారింది.  అయితే చిత్తూరు చిరుతతో మామూలుగా ఉండదంటూ, చిరుత చారలు టాటూగా వేసుకుంది. అది తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "chittoor Chirutha..A Painful but a Perfect Tattoo..No Pain No Gain" అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది గీతు. ఇంకా తన యూట్యూబ్ ఛానల్‌లో బిగ్ బాస్ కి వెళ్ళే ముందు చేసిన సెల్ఫ్ డబ్బా వీడియో అంటూ మరొక వీడియో అప్లోడ్ చేయగా మంచి స్పందన వస్తోంది.

ఇవ్వాళ నువ్వు నా చేతిలో ఐపోయావ్...ఆదికి రవితేజ మాస్ వార్నింగ్!

ఢీ-14 గ్రాండ్ ఫినాలే ప్రోమో మంచి కలర్ఫుల్ గా తయారై ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ ప్రోమోలో రవితేజ మాస్ ఎంట్రీకి ఆడియన్స్, ఫాన్స్ కేకలు పెట్టారు. ఇక హైపర్ ఆది మాట్లాడుతూ "మీ గురించి చెప్పడానికి నాకు అదృష్టం ఉండాలి..మిమ్మల్ని కలిస్తే చాలు అనుకునే నేను...మీతో కలిసి ధమాకా మూవీలో చేసాను..ఇది నా అదృష్టం" అనేసరికి "నీతో చేయాలనీ నేనూ అనుకున్నాను.. ఎప్పటినుంచో...అది సరే కానీ ఆది..నీకు ఈ ప్రోగ్రాంకి అసలు సంబంధం ఏమిటి" అని మాస్ మహారాజ రవితేజ అడిగేసరికి అందరూ నవ్వేశారు.  "ఆది అసలు ఎవ్వరినీ వదిలిపెట్టడు..అందరినీ ఆడేసుకుంటాడు...ఇవ్వాళ నువ్వు నా చేతిలో ఇపోయావ్" అని అనేసరికి ఆది కూడా  గట్టిగా నవ్వేసాడు. ఇక తర్వాత ఒక డాన్స్ కంటెస్టెంట్ తో కలిసి "ధమాకా" మూవీ నుంచి "నిన్ను చూడబుద్దాయితాంది రాజిగో" అనే సాంగ్ కి రవితేజ కూడా వచ్చి డాన్స్ వేశారు.  దాంతో హోస్ట్ ప్రదీప్ "మేం లైవ్ లో ఇలా చూడడం ఇదే మొట్టమొదటిసారి" అని అనేసరికి "లేదబ్బాయ్ నాకు కూడా ఊపొచ్చేసింది" అని కామెడీ చేశారు రవితేజ..

వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న వస్తువులే ఆమె హోంటూర్ లో ప్రధాన ఆకర్షణ!

పేరుకు మాత్రమే సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ తను. కానీ ఏ మూవీలో నటించినా చాలా హైలైట్ అవుతుంది. మిగతా క్యారెక్టర్స్  కంటే కూడా ఈమె నటించిన పాత్రే ఎక్కువగా  గుర్తు ఉంటుంది. అలా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న  న‌టి ధ‌న్య బాల‌కృష్ణ‌. "సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు", "సాఫ్ట్‌వేర్ సుధీర్" లాంటి మూవీస్ తో  తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ ముందుగుమ్మ‌.  ఇప్పుడు ధన్య బాలకృష్ణ తన హోమ్ టూర్ వీడియో ఒకదాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ముందుగా లివింగ్ ఏరియాని చూపించింది. తనకు  మీటింగ్స్ ఉన్నా వాళ్ళ  నాన్న కోసం గెస్టులు వచ్చినా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పింది. తన  ఫామిలీ మొత్తం కూడా కూర్చుని మాట్లాడుకునే మంచి హ్యాంగౌట్ ప్లేస్ కూడా ఇదే అంది. అలాగే వాళ్ళ నాన్న మ్యూజిక్ రూమ్ ని కూడా  చూపించింది. ఆయన ఒక వీణ ప్లేయర్. కాబట్టి ఆయన  ఉదయం పూట, సాయంత్రం పూట క్లాసెస్ ఇక్కడే తీసుకుంటారట. ఆయన కూడా ఇక్కడే వీణ ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పింది. అలాగే  100 ఏళ్ళ చరిత్ర ఉన్న వీణని కూడా చూపించింది ధన్య. ఇక ఇంట్లో ఉన్న తమ  ఓపెన్ కిచెన్ ని చూపించింది. నానమ్మలా నేను వంట చేస్తాను. అందుకే మా నాన్నకు నా వంట చాల ఇష్టం అని చెప్పింది.  అలాగే తన తాతయ్యకు 1983 లో వచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా చూపించింది.  ఇక తన  ఇంట్లో ఎవరికీ చెట్లను నరకడం ఇష్టం ఉండదు కాబట్టి తమ  ఇంట్లోంచి బయటికి ఎదిగిన  ఒక కొబ్బరిచెట్టుని తొలగించకుండా ఇల్లు కట్టుకున్నాం అని చెప్పింది. అలాగే బయట ఉన్న బావిని కూడా చూపించింది. ఇక  వాళ్ళ నానమ్మ గదిని,  అక్కడ ఉన్న పాత రేడియో, చెక్క ఉయ్యాల ఇలా తన ఇంట్లో 100 , 150 ఏళ్ళ క్రితం నాటి యాంటిక్ వస్తువులన్నిటిని చూపించింది.

రీఎంట్రీ ఇచ్చిన శ్రీసత్య...మరి చమ్మక్ చంద్ర ఎంట్రీ ఎప్పుడో?

జబర్దస్త్ కామెడీ షోలో కనిపించే లేడీ కమెడియన్స్ లో శ్రీసత్యకి ఒక మోస్తరు పేరు ఉంది. ఈమె చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా పరిచయం ఐన లేడీ కమెడియన్. చంద్ర స్కిట్స్ అన్నీ కూడా ఫామిలీ డ్రామాలే.  లేడీస్ ని టార్గెట్ చేసుకునే స్కిట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలా తన స్కిట్స్ లో లేడీ కమెడియన్ పాత్రల కోసం శ్రీసత్యని తెచ్చుకున్నాడు చమ్మక్ చంద్ర. ఆమె తనకున్న కామెడీ టైమింగ్ తో మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత కొంతకాలానికి చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నెమ్మది నెమ్మదిగా శ్రీసత్య జారుకుంది. తర్వాత కొన్ని కామెడీ షోస్ లో కనిపించారు ఇద్దరు. కానీ పెద్దగా వర్కౌట్ అవలేదు.  ఇక సోషల్ మీడియాలో చంద్ర, సత్య గురించి చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే ఆ కామెంట్స్ కి సమాధానం ఇచ్చింది సత్య. తమది  గురుశిష్యుల బంధం అని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలం వరకు  బుల్లితెర మీద కనిపించలేదు శ్రీసత్య. కానీ సడెన్గా ఎక్స్ట్రా జబర్దస్త్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. అది కూడా తాగుబోతు రమేష్ టీమ్ లో చేసింది. ఇక ఇదే టీమ్ లో మరో లేడీ కమెడియన్ రౌడీ రోహిణితో  కలిసి స్కిట్ చేసింది. ఐతే "శ్రీసత్య మళ్ళీ షోలో రీఎంట్రీ ఇచ్చారు..చమ్మక్ చంద్ర రీఎంట్రీ కోసం వెయిటింగ్, సత్య చాలా మంచి యాక్టర్"  అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'ఆహా' ఆఫర్.. ఉచితంగా 'మిస్ట‌ర్ పెళ్లాం' డైలీ సిరీస్!

షోలు, సిరీస్ లు, సినిమాలతో అలరిస్తున్న ఓటీటీ వేదిక 'ఆహా' సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. తెలుగులో ఓ డెయిలీ సిరీస్‌ను అందిస్తుంది. దీని ద్వారా రెగ్యుల‌ర్ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌తో పాటు కొత్త యూజ‌ర్స్ కి సైతం వినోదాన్ని పంచనుంది. ప్ర‌తి సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు 'మిస్ట‌ర్ పెళ్లాం' అనే డెయిలీ తెలుగు సిరీస్‌ను ఆహా ఫ్రీగా అందిస్తుంది. ఈ డెయిలీ సిరీస్ ను 'కార్తీక దీపం' మేకర్స్ రూపొందిస్తుండటం విశేషం. ఇది నవంబర్ 28 నుంచి ప్రసారమవుతోంది. మహిళా ప్రేక్షకులను అలరించేందుకు ఈ డెయిలీ సిరీస్‌ను తీసుకొచ్చినట్టు ఆహా చెబుతోంది. 'మిస్టర్ పెళ్లాం' డెయిలీ సిరీస్ భవ్య (పూజా మూర్తి), నివాస్(అమర్ దీప్), రేఖ (సోనియా) అనే ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ. తనను తనలాగా ప్రేమించే భర్త కోసం భవ్య క‌ల‌లు కంటుంటుంది. నివాస్ ధ‌న‌వంతురాలిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాల‌నుకుంటాడు. భ‌వ్య ద‌గ్గ‌ర ప‌ని చేసే రేఖ డబ్బుల‌ను ప‌ట్టించుకోకుండా అప‌రిమిత‌మైన ప్రేమ చూపించే వ్య‌క్తి కావాల‌ని కోరుకుంటుంది. వీరు ముగ్గురు ఒక‌టి త‌లిస్తే విధి మ‌రోలా త‌లిచింది. విధి ఆడిన నాట‌కంలోని ట్విస్టుల‌తో ముగ్గురు ఒక‌రితో ఒక‌రు ముడిప‌డ‌తారు. భ‌వ్య‌, రేఖ నిజంగానే వారు కోరుకుట‌న్న‌ట్లు నిజ‌మైన ప్రేమ‌ను పొందుతారా? వీరి ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే ఉచితంగా 'మిస్ట‌ర్ పెళ్లాం' చూసి తెలుసుకోండి అంటోంది ఆహా.

ఏకాభిప్రాయం  తెచ్చిన పెంట.. కీర్తికి మంట!

బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' రేస్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొదటి లెవెల్ పూర్తి అయ్యే సమయానికి శ్రీసత్య, ఇనయా రేస్ నుండి తొలగిపోయిన విషయం తెలిసిందే. కాగా రేస్ లో‌ ఇంకా ఆరుగురు సభ్యులు ఉండగా 'జెండాల జగడం' టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో ఆరుగురు పాల్గొన్నారు. "అయితే ఇందులో నుండి నలుగురు మాత్రమే తర్వాతి లెవెల్ కి వెళ్తారు. వారు ఎవరో మీరే ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకోండి" అని బిగ్ బాస్ చెప్పగా,‌ అందరూ కొంతసేపు ఆలోచించారు. అందురు కూడా "ఏకాభిప్రాయం వద్దు బిగ్ బాస్.. మీరే చెప్పండి" అంటూ కెమెరాలకి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎవరికి వారు "మేము తర్వాత లెవెల్ కి వెళ్ళాలనుకుంటున్నాం" అని చెప్పారు. శ్రీహాన్ మాట్లాడుతూ "నన్ను ఏకాభిప్రాయంతో ఎవరన్నా తీసేస్తే ఎవడిని గెలవనివ్వను.. ప్లేట్లు అన్ని పగులగొడతాను" అని అన్నాడు. ఆ తర్వాత రేవంత్ కూడా నాది సేమ్ డైలాగ్ అంటూ అలాగే వార్నింగ్ ఇచ్చాడు. "కంటెస్టెంట్స్ అంతా ఏకాభిప్రాయం తీసుకోవడంలో విఫలం అయ్యారు కాబట్టి సంచాలకులుగా ఉన్న ఇనయా, శ్రీసత్య మీరు ఇద్దరు కలిసి ఏ నలుగురు అయితే తర్వాత లెవల్ కి వెళ్ళాలనుకుంటున్నారో ఏకాభిప్రాయంతో డిసైడ్ చేసుకొని చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికి "లీస్ట్ ఉన్న రోహిత్, ఇంకా కీర్తీలను రేస్ నుండి తొలగిస్తున్నాం బిగ్ బాస్" అని చెప్పారు. దీంతో హౌస్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. కీర్తీ, ఇనయాల మధ్య గొడవ జరిగింది. "కీర్తి.. మాకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ లీస్ట్ లో ఎవరు ఉన్నా ఇలానే చేస్తాం" అని ఇనయా చెప్పగా, "గ్రేట్ డెసిషన్ " అంటూ కీర్తి వెటకారంగా అంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరగా కీర్తి కంటతడి పెట్టగా, హౌస్ మేట్స్ వచ్చి ఓదార్చారు.

గెలుపుని తీసుకున్నప్పుడు ఓటమిని కూడా తీసుకోవాలి: శ్రీసత్య

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే వారాలు గడిచేకొద్దీ హౌస్ మేట్స్ ప్రవర్తన చేంజ్ అవుతూ వస్తోంది. 'టికెట్ టు ఫినాలే' రేస్ లో అందరూ కూడా వారి బెస్ట్ ఇస్తున్నారు. ఒక్కో లెవల్ పూర్తయ్యే కొద్ది రేస్ నుంచి ఒక్కో కంటెస్టెంట్ బయటకొస్తున్నారు. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో భాగంగా ఇద్దరు బయటకొచ్చారు. మిగతా నలుగురు రేస్ లో ముందుకెళ్ళారు. అయితే వారికి బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్ లో మొదటగా ఫైమా వెళ్ళిపోగా, తర్వాత రేవంత్, శ్రీహాన్ లు వెళ్ళిపోయారు. చివరగా ఆదిరెడ్డి ఉన్నాడు.  రేవంత్ టాస్క్ నుండి వెళ్లిపోతూ "నా శాడిస్టిక్ చూపిస్తా" అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న శ్రీసత్య, రేవంత్ దగ్గరికి వెళ్ళి "ఏంటి రేవంత్ ఎందుకలా అంటున్నావ్, టాస్క్ లో అందరూ ఫన్నీ గానే కదా జోక్స్ వేసుకున్నారు. గెలుపుని తీసుకున్నప్పుడు.. ఓటమిని కూడా తీసుకోవాలి" అంటూ చెప్పింది. "నాకు తెలుసులే.. నువ్వు వెళ్ళు" అని రేవంత్ అన్నాడు. అయితే రేవంత్ తో ఇంతకముందు ఇదేమాట ఆదిరెడ్డి కూడా చెప్పాడు. అయితే రేవంత్ తనకి ఫేవర్ గా ఉండి గెలిస్తే కామ్ గా ఉంటాడు. తను గెలవకపోతే కోపాన్ని చూపిస్తాడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

‘ఇంటింటి రామాయణం’ ద్వారా ఓటీటీలోకి నవ్యస్వామి ఎంట్రీ..

బుల్లితెర సీరియల్ నటి నవ్య స్వామి ఓటీటీ ఫ్లాట్‌ఫాం మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యింది. స్మాల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎంతోమంది ఛాన్స్ దొరకడమే ఆలస్యం ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఇప్పుడు నవ్యస్వామి వంతొచ్చింది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి  "ఇంటింటి రామాయణం" మూవీతో ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో నవ్య స్వామి లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ఈ మూవీ టీజర్ నవంబర్ 25న విడుదల చేశారు. ఐతే ఈ మూవీ డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు మేకర్స్. నాగ వంశీ సమర్పణలో మారుతి టీం, ఐవీఎఫ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సురేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణకి జోడీగా నవ్యస్వామి కనిపించబోతోంది. ఈమె  'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' వంటి టీవీ సీరియల్స్ తో పాపులారిటీని సంపాదించుకుంది. కొంతకాలం రవికృష్ణతో కలిసి కొన్ని షోస్, ఈవెంట్స్ లోనూ, ఢీ షోలోనూ కనిపించింది. మరి ఈ మూవీలో నవ్యస్వామి ఎలా నటించింది.. ఆడియన్స్ నుంచి ఎన్ని మార్క్స్ తెచ్చుకోబోతోందో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నరేష్, గంగవ్వ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

కొత్త సీరియల్ "ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు"లో కనిపించనున్న బీబీ-6 వాసంతికృష్ణన్! 

బిగ్ బాస్ సీజన్ 6 లో గ్లామర్ డాల్ గా అందరినీ అలరించిన వాసంతికృష్ణన్ స్టార్ మాలో ఒక సీరియల్ లో నటిస్తోంది. "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" అనే ఒక కొత్త సీరియల్ లో ఈమె మెయిన్ రోల్ లో కనిపించబోతోంది.  ఇక ఈ సీరియల్ లో సిద్దార్ధ్ వర్మ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో ఒకదాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీరియల్ లో  వాసంతి రాయలసీమ యాసలో భలే  గమ్మత్తుగా మాట్లాడింది. ఈ స్టోరీ విషయానికి వస్తే - "మనోజ్, ఢిల్లీ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇందులో మనోజ్ రాముడు మంచి బాలుడు టైపు. కానీ ఒళ్ళంతా కూడా ఓసీడి..ఇక ఢిల్లీ అనే వాడికి ఒళ్ళంతా పొగరు. వీడు మహా కంత్రి టైపు. ఇద్దరూ ఒకే కడుపున పుట్టినా కూడా మనోజ్ బెంగళూరులో ఢిల్లీ కాళహస్తిలో పెరుగుతూ ఉంటారు.  తిమ్మిని బమ్మిని చేసే ఢిల్లీ గాడు కళావతి మెడలో తాళి కడితే మనోజ్ మాత్రం పూజని పెళ్లి చేసుకుంటాడు. ఈ క్లాసు..మాస్ భార్యభర్తల యవ్వారం ఎట్టా ఉండబోతోందో ? త్వరలో మీ స్టార్ మా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడండి అని ఈ స్టోరీ మెయిన్ లైన్ గురించి వాయిస్ ఓవర్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్. ఐతే ఈ సీరియల్ ఏ టైం స్లాట్ లో ప్రసారమవుతుందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా ఉంచారు.