ఢీ-15 డాన్సింగ్ షో లోకి సుడిగాలి సుధీర్ రీ-ఎంట్రీ ?!

ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ డ్యాన్సింగ్  షో ఇప్పటి వరకు విజయవంతంగా 14 సీజన్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇప్పుడు సీజన్ 15 మొదలవబోతోంది. ప్రతి బుధవారం రాత్రి 9 . 30   అయితే చాలు ఆడియన్స్ టీవీకి అతుక్కుపోయేవారు..ఇటీవలే సీజన్ 14 గ్రాండ్ ఫినాలే జరిగింది. దీనికి  మాస్ మహారాజ రవితేజ ముఖ్య అతిధిగా వచ్చారు..ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ గా జతిన్ నిలిచాడు.. ఇక అతి త్వరలోనే 15 సీజన్ ఘనంగా ప్రారంభం కాబోతుంది అని హోస్ట్ ప్రదీప్ అనౌన్స్ చేసాడు. ఐతే రాబోయే సీజన్ లో టీంలీడర్ గా సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది .. సుధీర్ గతంలో నాలుగు సీజన్స్ కి టీంలీడర్ గా ఉన్నాడు..డాన్స్ పెర్ఫార్మెన్సెస్ మధ్యలో ఆయన చేసే చిన్న చిన్న కామెడీ స్కిట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండేది .. కానీ గత టు సీజన్స్ నుంచి సుధీర్ కనిపించలేదు. వేరే షోస్ చేస్తుండడం వలన ఇక్కడ ఆది ఆ ప్లేస్ ని రీ-ప్లేస్ చేసాడు.  ఐతే ఆడియన్స్ మాత్రం సుధీర్ ని  మిస్ అవుతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండేసరికి ఇప్పుడు స్టార్ట్ కాబోయే ఢీ-15 షోకి సుధీర్ వస్తున్నట్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. దీంతో సుధీర్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఐతే సుధీర్ నిజంగానే ఈ షోలో కనిపించబోతున్నాడా ? ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు కనిపిస్తారు ? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఢీ-15 టీజర్ రిలీజ్...ప్రోమోలో మెరిసిన ప్రభుదేవా!

ఢీ-14 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు సీజన్ - 15 స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన ఆడిషన్స్ కూడా ఆగష్టు నుంచి నిర్వహించి టాలెంటెడ్ కంటెస్టెంట్స్ ని ఫిల్టర్ చేసినట్టుగా సోషల్ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది.  ఇక ఇప్పుడు ఈ సీజన్ 15 కి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కనిపించి అలరించారు. ఈ సీజన్ ని ప్రభుదేవా లాంఛ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఢీ - 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ని ఈ నెల 11 వ తేదీ ఆదివారం రాత్రి 7  ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోలో 12 మంది కంటెస్టెంట్స్ ని రెడీ చేశారని అలాగే వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సీజన్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. సండే ఢీ 14  గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు సీజన్ 15 ని కూడా సండే రోజునే గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఐతే ఎపిసోడ్స్ అనేవి ఇదివరకు బుధవారం పూట ప్రసారమైనట్టు అవుతుందా లేదా వాటి టైమింగ్స్ ని ఏమన్నా చేంజ్ చేస్తారా  ? వంటి ఎన్నో విషయాలు తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.

కంటెస్టెంట్స్ టాస్క్ లతో బిజీ.. బిగ్ బాస్ సరికొత్త గేమ్ ప్లాన్!

  బిగ్ బాస్ ప్రతీరోజు సరికొత్త‌ టాస్క్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే విన్నర్ కోసం‌ జరిగే రేస్ లో కంటెస్టెంట్స్ అంతా తమ‌ పర్ఫామెన్స్ తో  ఆకట్టుకుంటున్నారు. నిన్న జరిగిన టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కన్ఫెషన్ రూంకి పిలిచి, "ఎవరు గెలుస్తారో చెప్పి, మీ ఓట్ ని తెలియజేయండి"‌ అని అన్నాడు. అయితే మొదట ఈ టాస్క్ లో ఇనయా, రేవంత్ పాల్గొన్నారు. వీరిద్దరిలో ఇనయా ఓడిపోతుందని కీర్తిభట్ చెప్పగా, రేవంత్ ఓడిపోతాడని శ్రీసత్య, ఇనయా ఓడిపోతుందని శ్రీహాన్ ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఓట్ వేసారు. "మీకు‌ బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ 'పిరమిడ్ పడొద్దు'. ఈ టాస్క్ లో పేపర్ కప్స్ తో పిరమిడ్ ని చేసి, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కేటాయించిన పెడస్టియల్ మీద పెట్టాలి. అలా మొదట గేమ్ పూర్తి చేసినవాళ్ళే.. ఈ టాస్క్ విజేత" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టాస్క్ లో రేవంత్ విజయం సాధించాడు. టోటల్ అయిదుగురు ఓట్లు వేయగా, రేవంత్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ టాస్క్ గెలిచిన హౌస్ మేట్స్ ఒక లక్ష పదివేల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ 'మనీ ట్రాన్స్‌ఫర్' టాస్క్ ఇచ్చాడు. ఇందులో శ్రీసత్య, శ్రీహాన్ ఒక జట్టుగా.. ఆదిరెడ్డి, కీర్తి భట్ ఒక జట్టుగా ఉన్నారు. కాగా ఈ టాస్క్ లో శ్రీహాన్, శ్రీసత్య కలిసి బాగా ఆడి, గెలిచారు. ఆ తర్వాతి టాస్క్ 'పవర్ పంచ్',  "పవర్ పంచ్ చేసి బ్యాగ్ లో ఉన్న ఇసుకని వారికిచ్చిన కంటైనర్ లో నింపాలి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఇనయా, రేవంత్ టాస్క్ లో పాల్గొనగా కీర్తి భట్ సంచాలకులురాలిగా ఉంది. అయితే ఒక్కో కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూంకి పిలిచి "ఎవరు గెలుస్తారు" అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో అందరూ రేవంత్ గెలుస్తాడని తమ ఓట్ ని తెలియజేసారు. అయితే ఈ టాస్క్ లో రేవంత్ గెలిచి, ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.

అన్నయ్యా అన్న హీరోయిన్..హర్ట్ ఐన ఆది

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. ఐతే ఈవారం ప్రోమోలో లేడీస్ ఎక్కువగా కనిపించి ఎంటర్టైన్ చేయనున్నారు.  "సిటీ అమ్మాయిలు వర్సెస్ విలేజ్ అమ్మాయిలు" అనే కాన్సెప్ట్ తో ఈ వారం ఎపిసోడ్  ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. స్టేజ్ పై హైపర్ ఆది ఎప్పటిలానే  అమ్మాయిల మీద పంచులు వేసాడు. "ముఖచిత్రం" మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా .. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియా వడ్లమాని, డైరెక్టర్ సందీప్ రాజ్ తో కలిసి ఈ షోకి  హాజరైంది. ఇక ప్రియ కనబడగానే హైపర్ ఆది ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రియ మాత్రం చాలా తెలివిగా అన్నయ్యా అని పిలిచి ఆదిని ఇరుకున పెట్టింది. దాంతో ఆది సీరియస్ గా స్టేజి మీదనుంచి దిగి వెళ్ళిపోయి అక్కడ కెమెరా రోల్ చేసే ట్రాక్ మీద పడుకుని బాధపడ్డాడు. ఇక ఇంద్రజ వేసిన డాన్స్ మాములుగా లేదు. అలాగే ఈ ఎపిసోడ్ లో ఢీ-14 జోడి టీం లీడర్ శ్వేతా నాయుడు, జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు వంటి లేడీస్ అంతా కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడారు.. అలాగే రాంప్ వాక్ కూడా చేశారు. ఇక మోడల్ జెస్సి వచ్చి అమ్మాయిల ముందు నాంచాక్ తిప్పి కాస్త హడావిడి చేసాడు. ఇది చూసిన ఆది ఆడవాళ్ళ ముందు ఏమిటి నీ పిల్లాటలు అని జెస్సి పరువు తీసేసాడు ఆది.

నాగార్జున ‌వేసుకునే కాస్ట్యూమ్స్ మరీ అంత కాస్టా!

బిగ్ బాస్ ఇప్పుడు ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న రియాలిటీ షో. దీనికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. ఎందుకంటే సెలబ్రిటీలు కూడా ఈ షోని ఇంట్రెస్ట్ గా చూస్తూ సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇస్తూ ఉంటారు. అదేకాక భారీ అంచనాలు, వాటికి తగ్గట్టుగా ఒక్కో కంటెస్టెంట్ కి భారీ రెమ్యూనరేషన్ తో దూసుకుపోతున్న షో అని అనడంలో ఆశ్చర్యమే లేదు. అందులోనూ వీకెండ్ లో వచ్చే నాగార్జున కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. కాగా నాగార్జున శని, ఆదివారాల ఎపిసోడ్స్ షూటింగ్ కోసం ఏ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా అటెండ్ అవుతారన్న విషయం తెలిసిందే. అయితే వీకెండ్స్ లో వచ్చే నాగార్జున వేసుకునే ఒక్కో డ్రస్ ధర చూస్తుంటే నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. మొన్నటి ఎపిసోడ్ లో వేసుకున్న ఒక్క షర్ట్ ధర సుమారుగా రెండు లక్షలు ఉంది. అయితే ఈ విషయం తెలుసుకొని, సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. ఒక్క షర్ట్ కే అంత ధర ఉంటే ఇంక నాగార్జున రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు.  మరికొందరు అయితే "నాగార్జున ఒక వీకెండ్ ధరించే దుస్తులతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంవత్సరమంతా బ్రతికేస్తారు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా బిగ్ బాస్ ఈ సీజన్ మొదలై ఇప్పటికి పదమూడు వారాలు కాగా, అందులో శనివారం ఆదివారాల్లో నాగార్జున కాస్ట్యూమ్స్ కి సుమారుగా కోటి‌ రూపాయల వరకు ఖర్చు ఉండొచ్చని వీక్షకులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

'బిబి కేఫ్' లో ఫైమా.. వెటకారం తగ్గించుకోమన్న యాంకర్!

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఫైమా, బిబి కేఫ్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది.  అందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు పంచుకుంది. అయితే యాంకర్ శివ మామూలుగానే సూటిగా ప్రశ్నలు కురిపిస్తాడు. "హౌస్ నుండి ఎందుకు బయటకొచ్చావో తెలుసా నీకు? ఇంత వెటకారం ఎందుకు ఫైమాకి అని జనాలు అనుకుంటున్నారనే విషయం తెలుసా?" అని శివ ప్రశ్నించగా, "నేను ఇలా ఉంటానని ఏం ఫిక్స్ అయి రాలేదు. నేను నాలాగనే ఉందామనుకున్నాను.‌ ఒకరు చెపితే మారడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే అది ఒపీనియన్ కాదు. నా అంతట నేను మారకపోవడం అనేది అంత పెద్ద క్రైమ్ ఏం కాదు" అని ఫైమా చెప్పింది. "వెటకారం అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి సుదీప గారితో మట్లాడిన.. అది తప్పని నేనే ఆక్సెప్ట్  చేసిన. నెక్స్ట్ ఆరోహీతో మాట్లాడేటప్పుడు వెటకారం అన్నారు. వాళ్ళిద్దరు కాకుండా వేరే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే చెప్పండి. వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని అంటున్నప్పుడు నేను అలా మాట్లాడాను" అని ఫైమా చెప్పగా, "డిఫెండ్ చేసుకోలేక.. మాటలాపేసి స్టార్ట్ చేస్తావా ఇక" అని యాంకర్ అనేసరికి నవ్వేసింది ఫైమా.  "ఇనయా నీ ఫ్రెండ్ కదా? మరి ఎందుకు వదిలేసావ్? అని శివ  అడిగాడు. "తను నాతో బాగా మాట్లాడేది. ఒక టాస్క్ లో నేను తనకి 'చూడు ఇనయా.. నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ నీ మాటల వల్ల నువ్వు నెగెటివ్ అవుతున్నావ్ చూసుకో' అని చెప్పాను. 'నా ఫ్రెండ్ అయి ఉండి నాకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతావా?' అని ఇనయా అంది. అప్పటినుండి మా మధ్య దూరం పెరిగింది" అని ఫైమా చెప్పింది. ఆ తర్వాత "హౌస్ లో మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేది ఎవరు?" అని అడిగాడు శివ. "ఆదిరెడ్డి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు" అని చెప్పింది. ఇలా తనకి హౌస్ లో ఎవరితో ఎంత రాపో ఉంది, హౌస్ మేట్స్ ఎలా ఉన్నారనే విషయాల గురించి మాట్లాడింది ఫైమా.

ఒక్క ఓట్ కూడా రాని శ్రీసత్య.. యునానిమస్ గా  గెలిచిన రోహిత్ !

బిగ్ బాస్ టాస్క్ లతో  ప్రేక్షకులను అలరిస్తాడు. కాగా ఈ టాస్క్ లలో కొన్ని ట్విస్ట్ లు, కొంత ఓపిక కావాలి అని చెప్తాడు. అందులోనే భాగంగా బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ను తెచ్చాడు. అది 'ఇట్స్ పే బ్యాక్ టైం' టాస్క్. "ఈ టాస్క్ లో గెలిచి మీరు ఎంత డబ్బుని అయితే కోల్పాయారో, అంత డబ్బుని మళ్ళీ పొందవచ్చు. అయితే ఈ డబ్బు పొందాలంటే మీరందరూ కలిసి జాగ్రత్తగా ఓటింగ్ వేయాలి. మీలో ఇద్దరు కలిసి టాస్క్ ఆడుతారు. ఎవరైతే ఓడిపోతారు అని అనుకుంటున్నారో వారికి ఓటింగ్ వేసి సీక్రెట్ గా బ్యాలెట్ బాక్స్ లో వేయాలి" అని చెప్పాడు బిగ్ బాస్. "ఇది మనకి బిగ్ బాస్ ఛాలెంజ్ కాబట్టి మనం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి ఆడుదాం" అని రేవంత్ చెప్పగా హౌస్ మేట్స్ అంతా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ టాస్క్ కోసం రోహిత్, శ్రీసత్యను రేవంత్, హౌస్ మేట్స్ అంతా కలిసి ఏకాభిప్రాయంతో ఎంచుకున్నారు. ఇక శ్రీసత్య, రోహిత్ ని గార్డెన్ ఏరియాకి రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత రేవంత్ ని కన్ఫెషన్ రూంకి రమ్మన్నాడు. "మీరు మొదటి చాలెంజ్ లో పోటీ పడటానికి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ అడుగగా, " రోహిత్, శ్రీసత్య ఇద్దరు బాగా ఆడుతారు. కానీ రోహిత్ స్ట్రాంగ్ కాబట్టి నేను రోహిత్ గెలుస్తాడని అనుకుంటున్నా బిగ్ బాస్. శ్రీసత్య ఓడిపోతుందని ఓటు వేస్తున్నాను" అని చెప్పి ఓటు వేసి బయటకొచ్చాడు రేవంత్. ఆ తర్వాత శ్రీహాన్ ని కన్ఫెషన్ రూంకి పిలిచాడు బిగ్ బాస్. " చెప్పండి శ్రీహాన్.. ఎవరు ఓడిపోతారు ఈ టాస్క్ లో?" అని అడుగగా, "శ్రీసత్య ఓడిపోతుందని అనుకుంటున్నా బిగ్ బాస్" అని శ్రీసత్యకి ఓట్ వేసాడు శ్రీహాన్. ఇలా ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూంకి వచ్చి ఓట్లు వేయగా, అందరూ శ్రీసత్య ఓడిపోతుంది అని ఓట్లు వేసారు. ఒక్కరంటే ఒక్కరు కూడా శ్రీసత్య గెలుస్తుందని ఓటు వేయలేదు. హౌస్ మేట్స్ అందరు తమ ఓట్లతో యునానిమస్ గా రోహిత్ ని గెలిపించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టాస్క్ లో శ్రీసత్య గెలిచింది. రోహిత్ ఓడిపోయాడు. దీంతో "హౌస్ మేట్స్ కి ఇక 'పే బ్యాక్' అనేది రాదు" అని బిగ్ బాస్ చెప్పాడు.  

ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్.. షాకిచ్చిన బిగ్ బాస్!

బిగ్ బాస్ గత మూడు వారాల నుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే ఒక వైపు ర్యాంకింగ్స్ కోసం కంటెస్టెంట్స్ అందరు అయోమయంలో ఉండగా "ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇందులో తక్షణమే హౌస్ నుండి ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. "ఎవరిని తక్షణమే హౌస్ నుండి పంపాలో.. టికెట్ టు ఫినాలే రేస్ లో గెలిచి మొదట ఫైనల్ కి వెళ్ళిన శ్రీహాన్ చెప్తాడు" అని బిగ్ బాస్ చెప్పడంతో, "ఆశ్చర్యంగా ఏంటి బిగ్ బాస్.. ఇలా చెప్పారు" అని శ్రీహాన్ అన్నాడు. ఇది కూడా ఏకాభిప్రాయంతో చెప్పండి అంటే సరిపోతుంది కదా?.. నన్ను ఎందుకు ఇరికించారు. తక్షణమే ఎలిమినేషన్ అంటే నా వల్ల కాదు బిగ్ బాస్" అని శ్రీహాన్ అన్నాడు.  "చెప్పండి శ్రీహాన్.. ఎవరు ఈ హౌస్ లో అన్ డిజర్వింగ్ అని మీరు భావిస్తున్నారు? ఎవరిని హౌస్ నుండి బయటకు పంపాలనుకుంటున్నారు?" అని బిగ్ బాస్ మరోసారి అడిగాడు. దీంతో చేసేదేమి లేక రోహిత్ పేరు చెప్పాడు శ్రీహాన్. "పర్సనల్ రీజన్ ఏమీ లేదు‌‌.. ఫస్ట్ వీక్ నుండి మీరు ఏమీ ఆడలేదు. ఈ నాలుగు, అయిదు వారాల నుండి అందరితో కలిసి ఉంటున్నారు. ఇదే ఫస్ట్ వీక్ నుండి ఉంటే బాగుండేది, చాలా చేంజ్ అయ్యారు మీరు" అని శ్రీహాన్ అనగా "స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నానో, ఇప్పుడు అలానే ఉన్నాను. అన్నీ బాగున్నాయని అన్నావ్ కానీ అలా చెప్పడం కాదు" అని రేవంత్ జవాబిచ్చాడు. ఆ తర్వాత కీర్తి, రోహిత్ మాట్లాడుకున్నారు. "శ్రీహాన్ ఆర్టిఫిషియల్.. హీ ఈజ్ నాట్ నాచురల్.. హీ ఈజ్ నాట్ జెన్యూన్.. ఇంటరాక్షన్ తక్కువ అని అన్ డిజర్వింగ్  ఇవ్వడం ఏంటి" అని కీర్తిభట్ తో రోహిత్ అన్నాడు. 

హౌస్ లో ఒకరికొకరు ర్యాంకింగ్ ఇచ్చుకున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ లో సోమవారం అనగానే నామినేషన్స్ హీట్ గుర్తొస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉండటంతో ఇంకా దాని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో పర్ఫామెన్స్ వైజ్ గా ఎవరు ఉండాలి, ఎవరు బయటకెళ్ళాలో అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు అనే విషయం బిగ్ బాస్ మరోసారి స్పష్టంగా కంటెస్టెంట్స్ కి చెప్పాడు. అయితే బిగ్ బాస్ ఈ సారి నామినేషన్స్ ని కొత్తగా ఏర్పాటు చేసాడు. "ఒక్కో కంటెస్టెంట్ కి ఏ ర్యాంకు ఇవ్వాలో హౌస్ మేట్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోండి" అని  చెప్పాడు. అలా చెప్పగానే ర్యాంకింగ్ వైజ్ ఒక్కో కంటెస్టెంట్ వచ్చి నిల్చున్నారు. మొదటి ర్యాంక్ వెనుక రేవంత్, సెకండ్ ర్యాంక్ వెనుక ఇనయా, థర్డ్  కీర్తిభట్, ఫోర్త్ శ్రీసత్య, ఫిఫ్త్ శ్రీహాన్, ఆదిరెడ్డి సిక్స్త్, రోహిత్ సెవన్.. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ర్యాంకింగ్ లో నిల్చున్నారు. ఇలా నిల్చున్న తర్వాత అసలు కథ మొదలైంది. ఇక ఆ తర్వాత ఏకాభిప్రాయంతో అందరూ కలిసి ఒక్కో కంటెస్టెంట్ కి ఏ ర్యాంకు అయితే బాగుండో అని చర్చించుకున్నారు. అలా మొదటి ర్యాంకు కోసం రేవంత్ కి మెజారిటీ ఆఫ్ కంటెస్టెంట్స్ ఓట్లు వేయడంతో అతడికే మొదటి స్థానం ఇవ్వగా, తర్వాత స్థానానికి ఇనయా, ఆదిరెడ్డి, శ్రీహాన్ పోటీ పడగా ఎక్కువ మెజారిటీ శ్రీహాన్ కి దక్కడంతో శ్రీహాన్ కి సెకండ్ ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత మూడవ స్థానంలో ఇనయా, శ్రీసత్య, ఆదిరెడ్డి పోటీపడగా ఆదిరెడ్డికి ఎక్కువ మెజారిటీ లభించండంతో మూడవ ర్యాంక్ ఆదిరెడ్డికి దక్కింది. ఆ తర్వాత నాల్గవ ర్యాంక్ ఇనయాకి, అయిదు శ్రీసత్యకి, ఆరు రోహిత్ కి, ఏడు కీర్తి భట్ కి దక్కాయి. ఇలా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో ర్యాంక్ ని ఇచ్చుకున్నారు హౌస్ మేట్స్.

నేను జబర్దస్త్ ని చాలా మిస్సవుతున్నా!

టాలీవుడ్ మోస్ట్ చార్మింగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మూవీస్ లో కూడా చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అనసూయ ఏ పోస్ట్ పెట్టినా, ఎలాంటి పిక్ పెట్టినా ఇట్టే ట్రెండ్ ఇపోతూ ఉంటుంది.  ఇక జబర్దస్త్ నుంచి కావాలనే వచ్చేశానని అక్కడ జరుగుతున్న బాడీ షేమింగ్ కామెంట్స్ నచ్చకే అక్కడ చేయడం లేదని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇక అప్పుడప్పుడు ఫాన్స్  అడిగే  ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఎక్స్ట్రా మాట్లాడితే కౌంటర్లు  కూడా వేస్తుంది. అలా ఒక అభిమాని ఇటీవల  "మీ కొత్త షో ఏమిటి మేడం" అని అడిగేసరికి   ‘టీవీ షోస్ కి  కావాలనే బ్రేక్ తీసుకున్నాను, ఏదైనా మంచి ఎక్సయిటింగ్ షో వచ్చినప్పుడు చేస్తా’ అని ఆన్సర్ చేసింది.  అలాగే ‘ఇప్పుడు జబర్దస్త్ ని మిస్ అవుతున్నారా ?’ అని అడిగిన ప్రశ్నకు “అఫ్ కోర్స్ మిస్ అవుతున్నా.. నా జీవితంలో, నా మనసులో  జబర్దస్త్ కి ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కొన్ని చోట్ల  మనకు ఉండాలనిపిస్తుంది కానీ పరిస్థితులు అనుకూలించవు.. అలాంటి టైంలో రిస్క్ చేసైనా కొన్ని డెసిషన్స్ తీసుకోక తప్పదు"  అని ఆన్సర్ చేసింది. "మీరు రీసెంట్ గా పూజ చేయించుకున్నారు కదా అది దేని కోసం ?"  అనే ప్రశ్నకు " నాన్న సంవత్సరీకం ఇటీవలే అయ్యింది. దాని  తర్వాత సుదర్శన హోమం, సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదట. అందుకే చేయించాను" అని కూల్ గా ఆన్సర్ చేసింది.

'నిన్ను మసాల్ వడ అని కాదు పిలుస్తోంది ముసలావిడ అని'

ఎంటర్టైన్మెంట్ కి పర్ఫెక్ట్ అడ్రస్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఒక పాజిటివ్ కామెంట్ ఇచ్చేసారు పోసాని కృష్ణమురళి. ఇక నెక్స్ట్ వీక్ ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. కమెడియన్స్ అంతా మంచి స్కిట్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు.  ఇక ఇందులో అన్నపూర్ణ, ఆటో రాంప్రసాద్, బాబు కలిసి వేసిన స్కిట్ ప్రోమో కడుపుబ్బా నవ్వించింది. ఈ స్కిట్ లో కమెడియన్  బాబు లేడీ గెటప్ లో రాంప్రసాద్ కి భార్య క్యారెక్టర్ లో చేసాడు. అన్నపూర్ణ రాంప్రసాద్ కి అత్తగారిగా చేసింది. అల్లుడు ఇంటికి రావడంతోనే "బట్టలుతికావా" అని గదమాయించింది. "ఉతుకుతాను అత్తయ్య" అని రాంప్రసాద్ అనేసరికి "ఒక్కపని చేయడం సరిగా చేయడం చేతకాదు" అని సీరియస్ అయ్యింది .." "నువ్వింతకు ఆడదానివేనా ?" అని సీరియస్ అయ్యాడు రాంప్రసాద్.  " నేను ఆడదాన్నే బయటికి వెళితే అందరూ నన్ను మసాల్ వడ, మసాల్ వడ అంటున్నారు అంది అన్నపూర్ణ. "మసాల్ వడ కాదు అది ముసలావిడ" అని అంటున్నారు నిన్ను అన్నాడు రాంప్రసాద్.."మా డబ్బులన్నీ నువ్వే ఎత్తుకుపోతున్నావ్ అని సీరియస్ గా అనేసరికి రాంప్రసాద్ దుడ్డుకర్రతో ఒక్కటి ఇచ్చాడు. దాంతో అన్నపూర్ణ స్పృహ తప్పి పడిపోయింది.. ఇక డాక్టర్ గెటప్ లో శీను వచ్చి కామెడీ పండించాడు. ఇలా ఈ రాబోయే వారం స్కిట్స్ అన్నీ కూడా బాగా అలరించనున్నాయి.

వాళ్ళ మనసుల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఇవే... షకీలా, సన్నీలియోన్, ఖత్తర్ పాప

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఇక ఇందులో ఈ వారం "చదివింపులు" పేరుతో ఈ షో రన్ అయ్యింది. ఇందులో "మనసులో మాట..మనసులో బొమ్మ" సెగ్మెంట్ లో కమెడియన్స్ అంతా స్టేజి మీదకు వచ్చి పొగ వేశారు. అలా వేసినప్పుడు పక్కన ఎల్ఈడీ స్క్రీన్ మీద వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిక్చర్స్ కనిపించాయి. ఇక ఈ సెగ్మెంట్ ఫుల్ కామెడీని పండించింది. మధ్యలో ఆది సెటైర్లు, కమెడియన్ లండన్ బాబు డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ముందుగా  హైపర్ ఆది పొగ వేసాడు. స్క్రీన్ మీద ఖత్తర్ పాప బొమ్మ కనిపించింది. ఇక ఆమె కోసం బులెట్ భాస్కర్‌కు ఫోన్ కూడా చేసాడు. కానీ కలవలేదు. తర్వాత నాటీ నరేష్ పొగ వేసాడు. స్క్రీన్ మీద దొండకాయ పిక్చర్ వచ్చింది. ఇమ్మానుయేల్ పొగ వేయడంతో టిక్ టాక్ భాను, వర్ష ఇద్దరూ స్క్రీన్ మీద కనిపించారు. దాంతో ఇమ్ము ఒక నిమిషం  షాకయ్యాడు. "అసలు వీళ్ళిద్దరూ నా లిస్ట్ లో లేరు కదా. వర్ష అంటే ఒక మూల పడుంటుంది..కానీ భాను ఎందుకొచ్చింది" అని డైలాగ్స్ వేసాడు. తాగుబోతు రమేష్ స్టేజి మీదకు వచ్చి పొగ వేసేసరికి స్క్రీన్ మీద షకీలా బొమ్మ పడింది. దాంతో రమేష్ షాకయ్యాడు. ఇంతలో ఆది ఎంట్రీ ఇచ్చి "తెలుగు ఇండస్ట్రీ నుంచి మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నట్టు చాలా సార్లు చెప్పాడు ఇందుకా" అని కౌంటర్ వేసాడు. ఇక కమెడియన్ సన్నీ పొగ వేసేసరికి స్క్రీన్ మీద సన్నీలియోన్ బొమ్మ వచ్చింది. అది చూసిన ఆది వచ్చి "యూట్యూబ్ లో జబర్దస్త్ సన్నీ అని కొట్టగానే నీ స్కిట్లు, బిట్లు రెండూ కనిపిస్తున్నాయి" అని పంచ్ డైలాగ్ వేసాడు. ఇక రష్మీ పొగ వేసేసరికి స్క్రీన్ మీద యాంకర్ సౌమ్య రావు బొమ్మ పడింది. "సౌమ్యకి హార్టీ వెల్కమ్..జబర్దస్త్ లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది..కానీ ఎప్పుడైనా జబర్దస్త్ కి నా అవసరం ఉంటే స్టాండ్ బైగా ఎప్పుడూ ఉంటాను" అని చెప్పింది. ఇలా ఈ సెగ్మెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

సముద్రం ఒడ్డున సుప్రీత.. వీడియో వైరల్!

సుప్రీత.. సురేఖావాణి కూతురిగా సోషల్ మీడియాలో అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. రీల్స్‌, ఫన్నీ వీడియోస్‌తో మస్త్ ఫేమస్‌ అయ్యింది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన తల్లికి మళ్లీ పెళ్లి చేసేస్తాననడం, ఎవరో ఒక పర్సన్ కూడా రెడీగా ఉన్నారంటూ సుప్రీత చేసిన వ్యాఖ్యలు వైరల్‌ కూడా అయ్యాయి. సుప్రీత సోషల్‌ మీడియాలో తన ఫాంగ్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది.   ఇప్పుడు లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ రీల్‌ షేర్‌ చేసింది. సముద్రం ఒడ్డున మెట్లపై నిలబడి ఉన్న ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. నవ్వుతూ పాటకు తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఈ వీడియో చేసింది. ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులరైన సుప్రీత వెండితెర మీద మెరవడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్-అర్జున్ డ్యూయల్ కాంబినేషన్‌లో డైరెక్ట్ చేసిన "లేచింది మహిళా లోకం" అనే మూవీలో మంచు లక్ష్మితో కలిసి నటించి అందరినీ మెప్పించింది.  

ఢీ-14 టైటిల్ విన్నర్ జతిన్...కొరియోగ్రాఫర్ రామ్ కి మంచి ఆఫర్ ఇచ్చిన రవితేజ!

ఢీ 14 సీజన్ కి ది ఎండ్ కార్డు  పడింది. ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి  సాగర్ - రిషిక, జతిన్ ఎంపికయ్యారు. ఇక ఫైనల్ రౌండ్ లో జతిన్ ఢీ-14 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. సాగర్-రిషిక రన్నరప్ గా నిలిచారు.  ఇక జతిన్ కి 75 లక్షల క్యాష్ ప్రైజ్ ని, టైటిల్ ని  రవితేజ అందించారు. రవితేజ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు చెప్పారు. ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ అయ్యి కాస్త ఎమోషనల్ గా ఎండ్ అయ్యిందని అన్నారు. విన్నర్స్ ని అనౌన్స్ చేసినప్పుడు రవితేజ చాలా టెన్షన్  పడ్డారు. ఇక ఇదే విషయాన్ని హైపర్ ఆది కూడా స్టేజి మీద చెప్పాడు. ఇక రవితేజ జతిన్ కొరియోగ్రాఫేర్ కి అద్దిరిపోయే ఆఫర్ ని ఈ గ్రాండ్ ఫినాలే స్టేజి మీద అనౌన్స్ చేశారు. జతిన్ కి కోరియోగ్రఫీ చేసిన రామ్ మాస్టర్ ని హగ్ చేసుకుని త్వరలో మనం కలిసి ఒక సాంగ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆ మాటతో రామ్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇలా ఈ షో ముగిసింది. ఇక ఈ షో హోస్ట్ ప్రదీప్ ఈ షోకి ఎండింగ్ లో నెక్స్ట్ వీక్ ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్ రౌండ్ లో కలుద్దాం అని అందరికీ సెండాఫ్ ఇచ్చేసాడు.

ఎంటర్టైన్మెంట్, ఎనెర్జీ అనే పదాలకు రూపముంటే దాని పేరే రవితేజ!

ఢీ-14 గ్రాండ్ ఫినాలేకి మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేశారు. ఇక రవితేజ గురించి హైపర్ ఆది ఒక రేంజ్ లో చెప్పి ఔరా అనిపించుకున్నాడు. " మీ  కెరీర్ స్టార్టింగ్ లో ఆ చేతులు అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టాయి. ఇప్పుడు మీ కెరీర్ చూసి మా చేతులు క్లాప్స్ కొడుతున్నాయి, కొడుతూనే ఉంటాయి. అల్లరి ప్రియుడు మూవీలో హీరోకి ఎక్కడో బాక్గ్రౌండ్ లో ఉన్నారు.  తర్వాత ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా వచ్చారు. కాలేజీ ఎగ్గొట్టి వేరే వాళ్ళ సినిమాకు మీరు వెళ్లే స్థాయి నుంచి మేము కాలేజీ ఎగ్గొట్టి మీ సినిమా చూసే స్థాయి వరకు మీ జర్నీ సూపర్.  హీరో ఐన పదేళ్లకు మీకు కిక్కు వస్తే మాకు మీరు హీరో ఐనప్పుడే కిక్ వచ్చింది. ఎంటర్టైన్మెంట్ , ఎనెర్జీ అనే పదాలకు రూపం ఉంటే ఆ రూపానికి కచ్చితంగా రవితేజా అనే పేరే పెడతాను. ఇండస్ట్రీ ప్రతీ హీరోకి వేరే హీరో కాంపిటీషన్ ఉంటారు. కానీ మీకు మీరే కాంపిటీషన్. ఎందుకంటే రవితేజ అన్న పేరులో రన్నర్ మీరే, విన్నర్ మీరే..ఇండస్ట్రీ మొత్తం రాజా ది గ్రేట్ అంటుందేమో మాలాంటి ఫాన్స్ అంతా మాత్రం రవితేజ ది గ్రేట్ అంటాము. మీ సినిమా చూసేటప్పుడు మా మూతి మీద చిరునవ్వు ఉంటది, సినిమా చూసి బయటికి వచ్చాక మా చెయ్యి మా మీసం మీద ఉంటది. వెంకీ, దుబాయ్ శీను మీకు బ్లాక్ బస్టర్స్ ఐతే మాకు స్ట్రెస్ బస్టర్స్..మీరు ఎంత డబ్బు సంపాదించారో తెలీదు కానీ ఇప్పటికీ మీమర్స్ వాటిని క్రియేట్ చేసుకుని కాష్ చేసుకుంటున్నారు. ఇంకా వెనకే ఉండి డాన్స్ చేస్తున్నాం  అని ఫీల్ అవుతున్న వారందరికీ ఒకటే చెప్తున్నా కర్తవ్యం మూవీలో రవితేజ గారు కనబడపడకుండా వెనకే ఉండేవారు.  తర్వాత కష్టపడి పనిచేసి ఇలా మాస్ మహారాజ రవితేజ అయ్యారు. ఆయన గురించి చెప్పాలంటే అవతల వాడిని  నమ్ముకుంటే ఆరిపోతాయి, పక్కవాడిని నమ్ముకుంటే పారిపోతావ్, ముందు వాడిని నమ్ముకుంటే మునిగిపోతావు, వెనకవాడిని నమ్ముకుంటే వెనక్కి పోతావ్..మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఆయన సిద్ధాంతం. ఆయనకు సలహాలు ఇచ్చే అలవాటు లేదు, తీసుకునే అవసరం కూడా లేదు..అందుకే ఇండస్ట్రీలో ఆయనకు తిరుగు లేదు..." అని రవితేజ గురించి ఆయన చరిత్ర మొత్తం ఆది స్టేజి మీద చెప్పుకొచ్చాడు.

మేము కలిసే ఉన్నాం.. కలిసి పనిచేస్తున్నాం!

ఆర్జే సూర్య బిగ్ బాస్ కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే టైములో హోస్ట్ నాగార్జున ముందు టాప్ హీరోలను మిమిక్రీ చేస్తూ వావ్ అనిపించాడు. విజయ్ దేవరకొండని మిమిక్రీ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఐతే సూర్య హౌస్‌లో ఎక్కువగా లవ్ ట్రాక్స్ నడుపుతున్నాడని, పులిహోర బాగా కలుపుతున్నాడని తెలుసుకుని ఆడియన్స్ ఆయన్ని బయటికి పంపేశారు. తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌తో తో రెచ్చిపోతూ పోస్టులు పెడుతున్నాడు.  లేటెస్ట్‌గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" పేరుతో తన ఫ్యాన్స్‌కి ఒక టాస్క్ ఇచ్చాడు. "బిగ్ బాస్ హౌస్‌లో ఎవరంటే ఇష్టం?" అని అడిగిన ప్రశ్నకు "చలాకీ చంటి అంటే ఇష్టం" అని చెప్పాడు. "ఆరోహి, నువ్వు కలిసారా" అని అడిగేసరికి "హా.. కలిశాం, కలిసి వర్క్ చేస్తున్నాం, ఫ్యూచర్‌లో కూడా కలిసే వర్క్ చేస్తాం" అని చెప్పాడు.  "హౌస్‌లో ఉన్నప్పుడు బుజ్జమ్మ బుజ్జమ్మ అన్నారు.. బయటికి వచ్చాక ఫ్రెండ్ అన్నారు" అని అడిగేసరికి "మా రిలేషన్ మీద మాకు, మా ఫామిలీ మెంబర్స్‌కి చాలా క్లారిటీ ఉంది. బయట వచ్చిన కొన్ని ఆర్టికల్స్ వల్ల తన లైఫ్ ఎఫెక్ట్ అయ్యింది" అని బాధపడుతూ బుజ్జమ్మకు సారీ చెప్పి రిప్లై ఇచ్చాడు. "బీబీ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?" అనేసరికి "చాలా బాగుంది. చేతిలో సెల్ ఫోన్ లేకుండా, తెలియని పర్సన్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం చాలా బాగుంది" అన్నాడు సూర్య. 

ఆయన పశువులకు అర్జునరెడ్డి.. చలికి తట్టుకోలేనంటే హీరోయిన్స్ ని పెట్టాం

హండ్రెడ్ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గురించి, మంచి కామెడీ టైమింగ్ ఉన్న కృష్ణ భగవాన్ కలిస్తే ఎలా ఉంటుంది..కామెడీకి రెక్కలొచ్చినట్టు ఉంటుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఉంది. "అమ్మ దీనెమ్మ బత్తాయో" మూవీ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లాం. ఐతే అక్కడ హీరో పృథ్వి చలికి తట్టుకోలేను అనేసరికి  ఇద్దరు హీరోయిన్లను కూడా పెట్టాం. ఐనా తట్టుకోలేను అన్నాడు..దాంతో ఏదో అలా కనిచేసాం..అని మూవీ డైరెక్టర్ కృష్ణ భగవాన్ అన్నారు. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్ గా జ్యోతి మాట్లాడుతూ " ఈ సినిమా కోసం అన్నీ సమర్పించేసుకున్నా" అనే డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పింది. తర్వాత మూవీ  హీరో పృథ్వి మాట్లాడుతూ "ఈ సినిమాను చేయమని మా డైరెక్టర్ ఎంతో మందిని అడిగారు వాళ్లంతా ఛీ వద్దన్నారు..ఇక తప్పక నేను చేయాల్సి వచ్చింది" అని  చెప్పారు. కట్ చేస్తే ఇదంతా క్యాష్ షోలో ఒక సెగ్మెంట్ అన్నమాట. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి కృష్ణ భగవాన్, పృథ్వి , జ్యోతి, కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చారు.  ఇలా  రావడంతోనే కృష్ణ భగవాన్ కామెడీను షురూ చేసేసారు. "అసలు మమ్మల్నిద్దరిని పిలిచారు కానీ వాళ్లిద్దరూ సరిపోతారు" అని జ్యోతి, కరాటే కళ్యాణి మీద కౌంటర్ వేశారు. "ఇంత తెల్లగా ఉన్నారు...ఏం పౌడర్ వాడతారేమిటి" అని జ్యోతి పృథ్విని అడిగేసరికి "నువ్వు వాడిందే నేను వాడతాను" అన్నాడు.."నేను మా రూమ్ మేట్స్ ది వాడతాను" అని కృష్ణ భగవాన్ మళ్ళీ పంచ్ వేశారు. ఇక ఈ షోలో "సుమ మెడికల్ క్యాంపు" పేరుతో ఒక సెగ్మెంట్ చేసింది. పృథ్వి గారు ఆ రోజుల్లో అర్జునరెడ్డి..తెలుసా  అని సుమ అనేసరికి అదేంటి ఆయన డాక్టర్ కదా అని జ్యోతి అడిగింది. ఇక ఇవన్నీ విన్న కృష్ణభగవాన్ పృథ్వి పశువులకు అర్జునరెడ్డి అనేసరికి ఆయన షాకైపోయాడు. ఇలా  రాబోయే వారం క్యాష్ షో ఫుల్ కామెడీని పంచనుంది.

ఫైమా చెప్పిన 'ఫన్' ఎవరు? 'ఫ్రస్టేషన్' ఎవరు?

బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చిన ఫైమా, స్టేజ్ మీదకి వచ్చింది. నాగార్జున కాసేపు మాట్లాడాక, తన ఏవీ చూసుకుంది. కాస్త ఎమోషనల్  అయ్యింది. ఆ తర్వాత ఫైమాని, హౌస్ మేట్స్ తో టీవీలో మాట్లాడించాడు నాగార్జున. "నా లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా.. చాలా మెమోరీస్ ఇచ్చారు" అని చెప్పింది. ఆ తర్వాత ఫైమాకి, నాగార్జున ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే హౌస్ లో ఫన్ ఎవరు? ఫ్రస్టేషన్ ఎవరు? అని చెప్పమన్నాడు. ఇక ఫైమా మాట్లాడుతూ "ఆదిరెడ్డికి 'ఫన్'. ఎందుకంటే సూపర్ ఫన్‌ ఇస్తాడు. ఆది మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఫన్ ఇస్తుంటాడు. తర్వాత కీర్తి 'ఫన్'. కీర్తి.. నీలో కూడా ఒక కమెడియన్ దాగి ఉన్నాడు. బయటకు తీయ్. శ్రీసత్య 'ఫన్'. సత్య, నేను కలిసి కూర్చున్నామంటే మాటలు ఎక్కడికో వెళతాయి సర్. ఫుల్ జోక్స్ వేస్తుంది సత్య" చెప్పింది. "ఆ తర్వాత శ్రీహాన్ ఫన్ సర్. ఎందుకంటే ఒక టాస్క్ లో గొడవ అవుతూ ఉంది. వాళ్ళతో మాట్లాడుతూ సడన్ గా నా వైపుకి తిరిగి, దా ఫైమా చూసుకుందాం అని అన్నాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. తర్వాత మస్త్ నవ్వుకున్నాం" అంటూ శ్రీహాన్ గురించి చెప్పింది ఫైమా. అలాగే రోహిత్ కి ఫన్ ఇచ్చింది.  ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ "ఫైమా.. మరి ఫ్రస్టేషన్ ఎవరూ లేరా?" అని అడుగగా, "రేవంత్ ఫ్రస్టేషన్" అని చెప్పింది. రేవంత్ 'ఫ్రస్టేషన్ కి బ్రాండ్ అంబాసిడర్' అని చెప్పింది. ఆ తర్వాత  "ఇనయా ఫన్" అని చెప్పగా "అంటే ఏంటి ఇనయా ఫ్రస్టేట్ అవ్వదా ఫైమా" అని నాగార్జున అడుగగా "ఒకప్పుడు ఫ్రస్టేషన్ ఉండేది సర్. కాని ఇప్పుడు కాదు సర్. మారిపోయింది" అని చెప్పింది. ఇలా హౌస్ లో ఒక్కొక్కరి గురించి ఫైమా చెప్పుకొచ్చింది.

ఫైమా ఎలిమినేట్ కావడంతో ఫస్ట్ టైమ్ ఏడ్చిన ఆదిరెడ్డి!

బిగ్ బాస్ హౌస్‌లో సండే వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ పక్కా కమర్షియల్‌గా ఉంటుంది. కాగా వినోదాన్ని పంచుతూ సస్పెన్స్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్. నాగార్జున వచ్చినప్పటి నుండి వినోదాన్నిచ్చే గేమ్స్ ఆడిస్తూ, మధ్య మధ్యలో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ ఉంటాడు.  ఆ తర్వాత 'సమ్ మోర్ ఫన్ గేమ్స్' అంటూ డమ్ షల్ ఆర్ట్స్ ఆడించాడు నాగార్జున. బిగ్ బాస్ 'ఓ పిట్ట కథ' సినిమా పోస్టర్‌ని ఇనయా, శ్రీహాన్‌కి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీసత్య 'దేశముదురు' మూవీ టైటిల్‌ని చెప్పలేకపోగా శ్రీహాన్‌కి ఆ టైటిల్‌ని ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఫైమా 'మిస్టర్ పర్ఫెక్ట్' టైటిల్ చెప్పగా, ఆ టైటిల్‌ని రోహిత్‌కి డెడికేట్ చేసాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి, 'చంద్రముఖి' టైటిల్‌ని గెస్ చేయలేకపోగా, ఆ టైటిల్‌ని కీర్తి భట్‌కి డెడికేట్ చేసారు. 'క్రాక్' టైటిల్‌ని రేవంత్‌కి ఇవ్వగా, ఫైమాకి 'జాతి రత్నాలు' టైటిల్‌ని, శ్రీసత్యకి 'అందాల రాక్షసి' టైటిల్‌ని ఇచ్చాడు. ఆ తర్వాత నామినేషన్స్‌లో చివరగా ఆదిరెడ్డి, ఫైమా ఉండగా ఫైమా ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత "హౌస్‌మేట్స్‌కి సెండ్ ఆఫ్ చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేయి ఫైమా" అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. బయటకొచ్చే ముందు కీర్తితో "ఆదికి పొద్దున్నే ఆమ్లెట్ వేయి. సరేనా" అని చెప్పగానే ఆదిరెడ్డి ఏడ్చేసాడు. అయితే బాగా క్లోజ్‌గా ఉన్న గీతు వెళ్ళినప్పుడు కూడా ఏడ్వని ఆదిరెడ్డి.. ఇప్పుడు ఫైమా వెళ్లిపోతుంటే ఏడ్చాడా.. అని రేవంత్ కూడా ఆశ్చర్యపోయాడు. ఏదేమైనా ఈ వారం హౌస్ నుండి ఎలిమేట్ అయి బయటకొచ్చేసింది ఫైమా.