బిగ్ బాస్ సీక్రెట్ అజెండా అదేనా!

బిగ్ బాస్ లో రోజు రోజుకి కథ మారుతూ వస్తోంది. కారణం నిన్న మొన్నటి దాకా డబుల్ ఎలిమినేషన్ అనే కథనాలు వచ్చాయి. ఇప్పుడేమో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వారం టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామెన్స్ చేసారనే దానికంటే కూడా ఎవరు వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారనేది చూస్తే అది కచ్చితంగా ఫైమానే అని చెప్పాలి. ఎందుకంటే గతవారమే తను ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాల్సింది. కానీ 'ఎవిక్షన్ ఫ్రీ' ఉండటం వల్ల తను సేవ్ అయ్యింది.  అయితే బిగ్ బాస్ సీక్రెట్ మిషన్ మొదలుపెట్టాడు. అది ఏంటంటే హౌస్ లో బాగా పర్ఫామెన్స్ చేసేవాళ్ళని సీక్రెట్ రూంకి పిలిచి మాట్లాడాడు. కాగా ఈ వారం ఓటింగ్ చూస్తే లీస్ట్ లో కీర్తి భట్, ఫైమా, ఆదిరెడ్డి ఉండగా, వీరిలో ఎవరు  ఎలిమినేట్ అవుతారు అనే సస్పెన్స్ ఇప్పుడు అందరిలోను ఉంది. ఓటింగ్ లో ఇనయా లేకపోవడంతో ఆ ఓట్లు అన్ని రోహిత్ కి పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ అయితే బెస్ట్ ఓటింగ్ తో ఎప్పటిలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక చివరి స్థానంలో కీర్తి, ఫైమా ఉన్నారు. అయితే గత వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.  ఈసారి కూడా ఫైమాని పక్కని పెట్టి, కీర్తి భట్ ని ఎలిమినేట్ చేస్తారేమోనని, సీక్రెట్ అజెండా అదే కావొచ్చు అని వీక్షకులు భావిస్తున్నారు.

రేవంత్, శ్రీహాన్ మధ్య 'టికెట్ టు ఫినాలే'.. గెలుపు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'టికెట్ టు ఫినాలే' రేస్  వారం రోజుల నుండి జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రేస్ చివరి దశకి చేరుకుంది. ఇందులో ఒక్కో టాస్క్ లో ఒక్కొక్కరుగా రేస్ నుండి తొలగిపోయారు. అయితే ఈ రేస్ లో అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టు తగ్గ ఫోటీ ఇస్తూ వచ్చారు. ఒక్కో లెవెల్ కి ఒక్కొక్కరుగా తప్పుకోగా, చివరికి స్కోర్ బోర్డు పై అందరి కంటే ఎక్కువ పాయింట్స్ తో రేవంత్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఆదిరెడ్డి, శ్రీహాన్ ‌ఇద్దరూ సమానమైన పాయింట్లతో ఉన్నారు. దీంతో బిగ్ బాస్ 'టై బ్రేకర్ టాస్క్' ఇచ్చాడు.  ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు పాల్గొన్న ఈ టాస్క్ లో శ్రీహాన్ గెలిచాడు. అయితే రేపటి ఎపిసోడ్ లో రేవంత్ తో పాటుగా శ్రీహాన్ ఫైనల్ లెవల్ ఆడనున్నాడు. అయితే ఈ రేస్ ఆ ఇద్దరిని శత్రువులుగా మారుస్తోందో? లేదో చూడాలి. ఎందుకంటే హౌస్ లో రేవంత్, శ్రీహాన్ లు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇద్దరు కూడా హౌస్ లో మంచి ఫైటర్స్ గా ఉన్నారు. ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా ఆడుతారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఈ సీజన్ లో 'టికెట్ టు ఫినాలే'  లభిస్తుందో చూడాలి మరి!

బిగ్ బాస్ లో అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందులో నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అయితే వారం నుండి సాగుతున్న 'టికెట్ టు ఫినాలే' రేస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు రేపుతోంది. బిగ్ బాస్ ప్రతీసారి ఏకాభిప్రాయంతో ఒక్కో కంటెస్టెంట్ ని తప్పిస్తూ వస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో "ముగ్గురు మాత్రమే నెక్ట్ లెవెల్ కి వెళతారు. ఆ ముగ్గురు ఎవరో  చెప్పండి" అని  శ్రీసత్య, ఇనయా, కీర్తిభట్ లను బిగ్ బాస్ అడిగాడు.  వారు రోహిత్, ఫైమా, రేవంత్ ని ఎంపిక చేసుకొన్నారు. అందుకు వాళ్ళు అంగీకరించకపోవడంతో శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డిలను నెక్స్ట్ లెవెల్ కి పంపించారు. వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కు పంపించే ప్రక్రియలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.  కాగా హౌస్ లోని అబ్బాయిలు అంతా ఒక వైపు..అమ్మాయిలంతా ఇంకో వైపుగా అయ్యారు. ఎవరికి వారే విడిపోయి గ్రూప్ లుగా డిస్కస్ చేసుకోగా, హౌస్ మొత్తం రెండు టీంలు గా మారారు. రోహిత్, ఇనయాకి మధ్య ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరిగింది. మధ్యలో రేవంత్ కలుగచేసుకొని.. "రోహిత్ ఆడనని చెప్పినా వినకుండా బుజ్జగించి ఆడిస్తారా?" అని   అడుగగా, "ఎవరిది సరైన నిర్ణయమో శనివారం రోజు నాగార్జున సర్ చెప్తారు" అని సమాధానమిచ్చింది ఇనయా. అయితే బిగ్ బాస్ ఇచ్చిన 'సెరా' టాస్క్ లో కూడా అమ్మాయిలంతా ఒక వైపు, అబ్బాయిలంతా మరో వైపు ఉన్నారు. అందులో అమ్మాయిల టీం గెలిచి ప్రైజ్ మనీని గెలుచుకుంది.

అసలు కామన్ సెన్స్ ఉందా...ఈ షో చైర్మన్ ని ఇలాగేనా గౌరవించేది!

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది.  ఇక ఈ  షో చైర్మన్ అనిల్ రావిపూడి ఎంట్రీ  ఫుల్ కామెడీగా ఉంది. అనిల్ ఎంట్రీకి చుటూ బౌన్సర్లు వచ్చి నిలబడ్డారు. కానీ వాళ్లంతా ముందుకు వెళ్ళిపోయి అనిల్ రావిపూడిని  వెనకే నిలబెట్టేస్తారు. దాంతో సుధీర్ వచ్చి "ఏమిటి సర్ ఇక్కడే ఆగిపోయారు..రండి" అనేసరికి "చేసుకో నువ్వే చేసుకో షో ఆ బౌన్సర్స్ ని పెట్టుకుని..రెడ్ కార్పెట్ మీద నేను వచ్చేలోపే బౌన్సర్లు ముందు వెళ్ళిపోతే ఇంకా నేను ఎందుకు..అసలు కామన్ సెన్స్ ఉందా నీకు...నేను ఈ షో చైర్మన్ ని కదా ఇలాగేనా నన్ను గౌరవించేది..అసలు ఏం ప్లానింగ్ ఇది..నువ్వే కదా ఈ స్కెచ్ అంతా వేసింది. టేకాఫ్ లోనే నన్ను తొక్కేస్తే షో మొత్తం నువ్ కేప్చర్ చేయొచ్చు అని అనుకుంటున్నావు కదా...చూస్తా నీ సంగతి" అనేసరికి సుధీర్ అలా ఏమీ లేదని చెప్పి ఇద్దరూ ఫన్ క్రియేట్ చేసాడు.  తర్వాత అనిల్ రావిపూడిని ఖిలాడీ సాంగ్ తో షోలోకి ఇన్వైట్ చేసాడు హోస్ట్ సుధీర్.

నా నరనరాల్లో కామెడీ ప్రవహిస్తది..అట్లుంటది మనతోని!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ముక్కు అవినాష్. తన   కామెడీతో, ఓవర్ యాక్షన్ తో  ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇక ఇప్పుడు అవినాష్ ఆహాలో స్టార్ట్ ఐన కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ స్టాక్ గా ముక్కు అవినాష్ వచ్చాడు. అసలే అవినాష్ బాలయ్య వీరాభిమాని.  ఇక బాలయ్య రేంజ్ లో "జై బాలయ్య, నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు..వెల్కమ్ టు  కామెడీ స్టాక్ ఎక్స్చేంజి..అన్ స్టాపబుల్... ప్రతీ ఒక్కరి నరాల్లో రక్తం ప్రవహిస్తే...నా నరనరాల్లో కామెడీ ప్రవహిస్తది..అట్లుంటది మనతోని " అని అద్దిరిపోయే  డైలాగ్ తో తన ఎంట్రీని హైలైట్ చేసుకున్నాడు.  ఇక అవినాష్ చార్ట్ లో ఓవర్ యాక్షన్ 50 పర్శంట్, ముక్కు 30 పర్శంట్ , టైమింగ్, స్పాంటేనిటీ, నాన్-సింక్ కలిపి 20 పర్శంట్ వచ్చింది. "ఇందులో కామెడీ ఎక్కడుంది అవినాష్" అని హోస్ట్ దీపికా పిల్లి అడిగేసరికి "నీ దగ్గర యాంకరింగ్ ఎక్కడ ఉంది" అని రివర్స్ కౌంటర్ వేసాడు.  

పెళ్లి వేడుకలో ప్రగతి రచ్చ...తీన్మార్ కి తగ్గట్టు బాడీ మూమెంట్స్!

ప్రగతి ఆంటీ గురించి అందరికీ తెలుసు..జిమ్ లో రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాని ఈ వయసులో కూడా షేక్ చేసేస్తున్న బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అందం, ఆరోగ్యం విషయంలో ప్రగతి చాలా కేర్ తీసుకుంటుంది. ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్స్ తో పాటు పోటీ పడుతూ ఉంటుంది.  ఇక ఇప్పుడు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఎనర్జీ చూస్తే మైండ్ బ్లాంక్ ఐపోతుంది.  తన చెల్లెలి పెళ్ళి జరుగుతుండగా పూనకం వచ్చినట్లు  మాస్ డాన్స్ చేశారు.  తీన్మార్ బీట్ ఎక్కడ వినిపించినా ఎవ్వరైనా డాన్స్ చేసేస్తారు. మరి ప్రగతి ఆంటీ ఊరుకుంటుందా డోలు మీద కూర్చుని మరీ  బీట్ కి తగ్గట్టు బాడీ మూమెంట్స్ చేసి పెళ్లిలో రచ్చ చేశారు. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి.. “ ఇది నా చెల్లి పెళ్లి. ఇంత సౌండ్ విన్నాక సైలెంట్ గా ఉండడం అనవసరం. అందుకే ఇలా పిచ్చిగా డాన్స్ చేస్తున్నా” అని టాగ్ లైన్ పెట్టింది.  

నేను ప్రొడక్షన్ బాయ్ ని అనుకున్నావా..కామెడీ ప్రొఫెషనల్ ని

ఈటీవీలో ప్రసారమైన " పటాస్" అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి  పరిచయమైన కమెడియన్ యాదమ్మ రాజు.  తర్వాత జీ తెలుగు  నిర్వహించిన "అదిరింది" అనే కామెడీ షోలో చేసాడు.   ఇక ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలోకి ఎంట్రీ ఇచ్చాడు..స్టేజి మీదకు  వచ్చిన యాదమ్మ రాజుని చూసి "అవినాష్ రెండు ఛాయ్ తే" అనేసరికి "రాజు ఎవరు అనుకుంటున్నావు  స్టాక్" అన్నాడు సుధీర్. "చెప్పాలి కదా ముందే  నేను ప్రొడక్షన్ అనుకున్నా" అని కవర్ చేసుకున్నాడు అవినాష్. "హలో ఇక్కడ ప్రొఫెషనల్..నాట్ ప్రొడక్షన్" అని యాదమ్మ రాజు అనేసరికి "ప్రొఫెషనల్" ఐతే స్పెల్లింగ్ చెప్పు ఆ పదానికి అని అన్నాడు. దాంతో యాదమ్మ రాజు సైలెంట్ ఐపోయాడు. నీ స్టాక్ చార్ట్ ఎలా ఉందో చూద్దాం అని సుధీర్ అనేసరికి " ఇఫ్ యూ సీ మై స్టాక్.. యువర్ మైండ్ విల్ బ్లాక్" అని డైలాగ్ వేసాడు రాజు.  ఇక చార్ట్ లో 60 పర్శంట్ అదృష్టవంతుడు అని వచ్చేసరికి కమెడియన్ అనుకున్నాం అందరం అన్నారు సుధీర్, దీపికా..ఇక యాదమ్మ రాజు వెళ్లి చైర్మన్ అనిల్ రావిపూడి చేతి మీద ముద్దు పెట్టి అతని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు.

ఎక్స్ ప్రెస్ హరిపై బాడీ షేమింగ్ డైలాగ్స్ వేసిన దీపికా పిల్లి!

ఎక్స్ ప్రెస్ హరి  గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..బుల్లితెర అన్ని రకాల కామెడీ షోస్ లో హరి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. పటాస్ షోలో యాదమ్మ రాజుతో కలిసి జోడీగా స్కిట్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు.  ఇక ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజి కామెడీ షోకి ఫోర్త్ స్టాక్ గా స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చాడు. టెంపర్ మూవీలో సాంగ్ తో హడావిడి చేసి డాన్స్ వేసాడు..ఫ్లోర్ స్టెప్స్ కూడా వేసి ఎంటర్టైన్ చేసాడు. "2 జి, 3 జి, 4 జి, 5 జి ఎన్ని "జి"లు మారినా తగ్గదు మా స్టూడెంట్స్ ఎనర్జీ" అని అద్దిరిపోయే డైలాగ్ వేసాడు. "అవినాష్, యాదమ్మ రాజు వచ్చి నాకు బిస్కెట్ వేస్తే హరి మాత్రం డైరెక్ట్ గా ఆడియన్స్ కి బిస్కెట్ వేసేశాడు" అని పంచ్ పేల్చాడు అనిల్ రావిపూడి. దాంతో  "దేవుడు ఉండేది గుడి, మా ముందున్నది అనిల్ రావిపూడి" అని చెప్పి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు హరి.  ఇక ఇతని స్టాక్ చార్ట్ చూస్తే "ఆత్రం 60 శాతం, టెన్షన్, పంచులు, డాన్స్ కలిసి 40 శాతం" అని చూపించింది. డాన్స్ కి 5 శాతం మాత్రమే మార్క్స్ పడేసరికి "డాన్స్ కి ఇన్ని తక్కువ మార్క్స్ ఏమిటి..ఆ రేంజ్ లో డాన్స్ చేస్తే నా బాడీలో రిథమ్ కనిపించలేదా" అన్నాడు హరి .."నీ బాడీలో దమ్ము లేదు ఇంకా రిధం ఎక్కడ కనిపిస్తది" అని పంచ్ వేసింది దీపికా పిల్లి. "అంటే నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావా" అన్నాడు హరి. "అసలు నీకు బాడీ ఉందా బాడీ షేమింగ్ చేయడానికి" అని రివర్స్ కౌంటర్ వేసింది.  

‘దిల్ సే నవ్వుకోండి…దిల్లుకు మంచిది’ అనే కాప్షన్ తో ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త కొత్త మూవీస్ తో, వెబ్ సీరిస్ లతో పాటు మరెన్నో రియాలిటీ షోస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. డాన్స్ , సింగింగ్ రియాల్టీ షోస్ నిర్వహించి సక్సెస్ అయ్యింది ఆహా. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కామెడీ షోను కూడా స్టార్ట్ చేసింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోస్ ని బీటౌట్ చేయడానికి అన్నట్టుగా ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ సీజన్ వన్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం  ఫస్ట్ ఎపిసోడ్ కూడా  స్ట్రీమింగ్ అవుతోంది.  స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఛైర్మన్ గా ఆహా ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ కార్యక్రమాన్ని ‘దిల్ సే నవ్వుకోండి … దిల్లుకు  మంచిది’ అనే మాటతో మొదలు పెట్టారు. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి హోస్ట్స్ గా ఈ  షోని ముందుకు తీసుకెళ్లారు. ఇందులో అవినాష్, రాజు, వేణు, హరి, భాస్కర్ - జ్ఞానేశ్వర్, సద్దాం ఆరు టీమ్స్ గా పాల్గొన్నారు. ఇక ఫస్ట్ రౌండ్ "అట్లుంటుంది మనతోనే" లో ‘స్కూల్ అండ్ కాలేజ్’ థీమ్ లో ఎవరికీ వారు ఇండివిడ్యువల్ గా ఇచ్చిన  పెర్ఫార్మెన్సెస్ ని బట్టి ఆడియెన్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే  యాప్ ద్వారా ఓట్లు వేశారు. ఇక కామెడీ స్టాక్ ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ లో సద్దాం మొదటి స్థానంలో నిలబడ్డాడు. ఇక సెకండ్ రౌండ్ లో "పదా చూసుకుందాం" లో  పాత తెలుగు సామెతలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్  చేసి కామెడీ చేయాలి. ఇక ఈ రౌండ్ ప్రతీ ఎపిసోడ్ కి మారుతూ ఉంటుంది అని చైర్మన్ చెప్పారు. ఇక ఈ సెకండ్ రౌండ్ లో యాదమ్మ రాజు ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇక మూడో రౌండ్ ‘ఇచ్చి పడేస్తాం’లో అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. ఈ రౌండ్ లో కమెడియన్స్ ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్సెస్ కి మార్కులు వేశారు. ఈ మొత్తం మూడు రౌండ్స్ పూర్తయ్యే సరికీ ‘లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డే’గా అవినాష్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ‘ స్ట్రెస్ ఫ్రీ చిల్లెస్ట్ పెర్ఫార్మెన్స్’ కు సద్దాంని ఎంపిక చేశారు అనిల్ రావిపూడి. షోకి తగ్గట్టు ఎలా  బొమ్మ దద్దరిల్లిపోయిందో  మన స్టాక్ మార్కెట్ కూడా దద్దరిల్లిపోయింది అని చెప్పారు.

దీపికను గాడిద అన్న సుధీర్ ...హర్ట్ ఐన అనిల్ రావిపూడి!

కామెడీ స్టాక్ ఎక్స్చేంజి షోలోకి అవినాష్, వేణు, యాదమ్మ రాజు, భాస్కర్-జ్ఞానేశ్వర్, హరి వచ్చారు. ఇక ఫైనల్ గా సద్దాం స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. "హాయ్ సద్దాం ఎలా ఉన్నావ్" అని దీపికా అడిగేసరికి " నేను స్టేజి మీద ఉన్నా" అన్నాడు..."ఇప్పుడు నీ చార్ట్ వస్తుంది అప్పుడు చూద్దాం" అనేసరికి "చాటతో పాటు బియ్యం కూడా తీసుకురండి వండుకుందాం" అన్నాడు "నేను సద్దాంని హ్యాండిల్ చేయలేను నువ్వే చూసుకో" అని సుధీర్ అనేసరికి "గాడిద పని గాడిద చేయాలి..గుర్రం పని గుర్రం చేయాలి" అని దీపికా కౌంటర్ వేసింది.  దాంతో సుధీర్ "నేను గుర్రాన్ని కాబట్టి సైలెంట్ గా ఉంటాను..నువ్వు గాడిదవు కాబట్టి నువ్వే హ్యాండిల్ చెయ్యి" అని దీపికను గాడిదతో పోల్చాడు..ఆ మాటకు  అనిల్ రావిపూడికి బాగా కోపమొచ్చేసింది. "నువ్వు గాడిదవి అని అనుకుంటేనే దీపికా నెక్స్ట్ స్టెప్ వేస్తుంది...లేదంటే లేదు" అని సీరియస్ గా చెప్పేసరికి "నేను గాడిదలా పక్కన ఉంటా..మీరు గుర్రంలా మీ పని చేయండి" అని సుధీర్ అనేసరికి ఎగిరి గంతేసింది దీపికా.. ఇక సద్దాం చార్ట్ చూస్తే 50 పర్శంట్ రచ్చ, 30 పర్శంట్ ట్రేండింగ్, 20 పర్శంట్ చిల్లర పంచులు, పిచ్చి పిచ్చి మేనరిజాలు అని చూపించేసరికి షాకయ్యాడు సద్దాం. 

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య !

బిగ్ బాస్ లో రేవంత్ జర్నీ అంతా కూడా ఎమోషనల్ గానే సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ బిగ్ బాస్ లోకి రాకముందే తను తండ్రి కాబోతున్నాడని తెలిసిందే.. కాగా రేవంత్ మొదటి నుండి ఆ ఎమోషన్ తోనే హౌస్ లో ఉన్నాడు. తన భార్య శ్రీమంతం వేడుకను బిగ్ బాస్ టీవీలో చూపించగా భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే ఫ్యామిలీ వీక్ లో కూడా అందరి ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా రేవంత్ ఎమోషనల్ అవ్వడం చూసాం. రేవంత్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు.. తన భార్య గురించి పదే పదే అడగడం. అన్విత జాగ్రత్త అని చెప్పడం. తన బ్రదర్ వచ్చిన కూడా అన్విత గురించే మాట్లాడి, ఎమోషనల్ అవడం చూసాం. బిగ్ బాస్ టీవీలో అన్విత కనిపించినప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యాడు. "బిగ్ బాస్ విన్నర్ అయ్యి పుట్టబోయే నా బిడ్డకు గిఫ్ట్ ఇస్తాను" అంటూ రేవంత్ చాలా సార్లు చెప్పడం చూసాం. అన్విత నిన్న రాత్రి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లు తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ కి ట్యాగ్ చేస్తూ, ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  కాగా ఈ విషయాన్ని నాగార్జున, రేవంత్ కి సర్ ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నెటిజన్లు రేవంత్ కి ఇది డబుల్ ధమాకా అని అంటున్నారు. తనకి కూతురు పుట్టడం ఒకటి అయితే, టైటిల్ విన్నర్ మరొకటి అంటూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ విషెస్ చెబుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఏక్ హరి హోమ్ టూర్..ఎంత ప్రశాంతంగా ఉందో!

స్మాల్ స్క్రీన్ మీద స్మార్ట్ గా కనిపిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు ఏకనాథ్. ఎన్నో సీరియల్స్ లో నటించాడు. ఇప్పుడు కేరాఫ్ అనసూయ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాడు.  ఇక ఈయన భార్య హారిక కూడా సీరియల్స్ లోనే నటిస్తూ ఉంటుంది.  ఇక ఇప్పుడు వీళ్ళు ఒక వీడియో చేసి ఏక్ హరి అనే  పేరుతో ఉన్న వాళ్ళ యూట్యూబ్‌ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఏక్‌నాథ్‌ సొంత ఊరు చిట్టూర్పులో తాను పుట్టి, పెరిగిన ఇంటిని చూపించాడు. ఈ ఇల్లు పెంకుటిల్లు, చుట్టూ పెద్ద తోట..బోలెడు మొక్కలు, లోపల చిన్న చిన్న గుడిసెలు, జామ, సపోటా, కొబ్బరి చెట్లు, తులసివనం వంటివి అన్నీ ఉన్నాయి.  అన్ని గదులు కూడా ఎంతో విశాలంగా కట్టినవి. వంట చేసుకోవడానికి వీలుగా.. ఇంటి బయట ప్రత్యేకంగా ఓ పాకను కూడా కట్టుకున్నారు.    ఇక ఇంట్లో పాతకాలం నాటి వస్తువుల్ని చూపించింది హారిక. ఏకనాథ్ వాళ్ళ నాన్న ఇంటి గురించి వివరిస్తుంటే ..హారిక వీడియో షూట్ చేసింది..ఇక అక్కడ వర్షం పడుతుండేసరికి కోడలికి అత్తగారు గొడుగు పట్టారు. ఇవన్నీ చూసిన అభిమానులు.. "అబ్బా మీ ఇల్లు ఎంత బాగుంది అండి.. ప్రశాంతంగా.. హాయిగా ఉంది. మీ ఇంటిని చూస్తే.. మా బాల్యం గుర్తొస్తోంది... మీ అమ్మా, నాన్న కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు." అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాకు పుట్టిల్లు ఐనప్పుడు తనకు అత్తవారిల్లే కదా...

లేడీస్ అండ్ జెంటిల్మన్ షో ఎవ్రీ వీక్ ఫుల్ కామెడీతో సాగిపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సింగర్స్ అండ్ రైటర్స్ ఐన  చంద్రబోస్, ధనుంజయ్, అనూప్ రూబెన్స్ వాళ్ళ వాళ్ళ భార్యలతో ఈ షోకి వచ్చారు. "నేను సుచిత్రను షోస్ కి తీసుకురావాలి అంటే బుజ్జగించాలి..కానీ జీ తెలుగుకి రమ్మంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ జీ తెలుగు నాకు పుట్టిల్లు ఐతే సుచిత్రకు అత్తవారిల్లు" అని చెప్పారు చంద్రబోస్. ఇక తర్వాత సింగర్ ధనుంజయ్ తన వైఫ్ తో స్టేజి మీదకు  ఎంట్రీ ఇచ్చారు "పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక  పాట పాడి మా మావయ్యగారి మనసు కరిగించాను" అని చెప్పి ఫుల్ కామెడీ చేశారు. ఇక ఫైనల్ గా అనూప్ రూబెన్స్ తన వైఫ్ తో రెండు స్టెప్స్ వేసి స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. ప్రదీప్ అనూప్ రూబెన్స్ కి అద్దం ఇచ్చి లవ్ ప్రొపోజ్ చేయమని టాస్క్ ఇచ్చాడు. " అద్దంలో కనిపించేది ఎవరికి వారు..ఇద్దరిలో కనిపించేది ఒకరికి ఒకరు" అనే పాట పాడి తన వైఫ్ ని ఇంప్రెస్ చేసాడు. ఇక తర్వాత వీళ్లకు కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించాడు ప్రదీప్.  ఈ షో డిసెంబర్ 4 న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

ఆదిరెడ్డి కామన్ మ్యానా.. ఎలా? 

బిగ్ బాస్‌లో మొదటిసారిగా కామన్ మ్యాన్‌కి అవకాశం ఇచ్చారు అని చాలా మంది అనడం వింటూనే ఉన్నాం. "ఒక కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు.. రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు.. కంటెస్టెంట్ కంటెండర్ అయ్యాడు.. కంటెండర్ కెప్టెన్ అయ్యాడు" అంటూ ఆదిరెడ్డే చాలా సార్లు హౌస్ లో చెప్పుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తనకి భిన్నంగా ట్రోల్స్ వస్తున్నాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోన్న అంశం "అసలు ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ అని ఎలా అంటారు? ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు" అంటూ పలువురు కామెంట్స్ చెయ్యగా.. "ఎంత స్టార్ హీరో అయిన కెరీర్ మొదట్లో కామన్ మ్యాన్ అంటారు. కానీ ఒక హీరో అయ్యాక కూడా కామన్ మ్యాన్ అని చెపితే అది తప్పు అవుతుంది. ఆదిరెడ్డిని సీజన్-5 లోనే పిలిచారు. అప్పుడే సెలబ్రిటీ లిస్ట్ వరకు వెళ్ళాడు. ఇంకా క్రికెట్ ఫాంటసీ చానెల్స్ ప్రెడిక్షన్స్.. చాలా చాలానే ఉన్నాయి. ఒక యూట్యూబ్ రివ్యూయర్. ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఒక్కప్పుడు కామన్ మ్యాన్ అంటే ఓకే కానీ ఇప్పుడు అలా అనడం తప్పు. ఆదిరెడ్డితో కంపేర్ చేస్తే రాజ్, ఇనయా, ఫైమా, ఆఖరికి శ్రీహాన్ కూడా తక్కువే" అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.    ఇదే విషయంపై గీతు రాయల్ కూడా ఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. కానీ సోషల్ మీడియాలో "ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు. అలా చెప్పుకోవడం తప్పు" అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

డాక్టర్ బాబు ఇంటికి వచ్చి వంట చేసిన వంటలక్క!

డాక్టర్ బాబు, వంటలక్క 'కార్తీక దీపం' సీరియల్‌తో ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఈ సీరియల్ ఆరేళ్ళ నుంచి సాగుతున్నా కూడా డాక్టర్ బాబు ఒక్క సారి కూడా వంటలక్కను తన ఇంటికి ఇన్వైట్ చేయలేదట. వంటలక్క అన్ని సార్లు అడిగేసరికి ఫైనల్‌గా ఇప్పుడు తన ఇంటికి ఇన్వైట్ చేసాడు. వంటలక్కకు తన ఇల్లంతా తిప్పి చూపించాడు నిరుపమ్. అలాగే తన కుమారుడు రిక్కీ వేసిన పెయింటింగ్స్ చూపించింది నిరుపం భార్య మంజుల. ఇక నిరుపమ్ వాళ్ళ అమ్మ వంటలక్కను చూసి చాలా ఖుషి ఐపోయింది. ఇక షూటింగ్ సెట్‌లో వంటలక్క ప్రొడక్షన్ బాయ్ తెచ్చే ఫుడ్‌కి రకరకాల పేర్లు పెడుతుందని బాగా వండేవాళ్లు కూడా ఇలా పేర్లు పెట్టరని అనేసరికి వంటలక్కకు కోపమొచ్చింది. దాంతో "బాగోకపోతే బాగోలేదని చెప్పాలి కదా. మా ఇంట్లో నేనే  వంట చేస్తాను" అంది. "ఐతే ఈరోజు నువ్వు మా ఇంట్లో సాంబార్ పెట్టాలి" అని నిరుపమ్ అనేసరికి, "ఓహ్ ఈ రోజు మీ ఇంట్లో వంట మనిషి రాలేదా.. అందుకే నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేసావా?" అని కౌంటర్ వేసింది. దాంతో అందరూ నవ్వేశారు. ఈ సరదా సరదా వీడియోను నిరుపమ్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసాడు. 

ఈ జన్మకు కష్టం..బెటర్ లక్ నెక్స్ట్ టైం..సౌమ్యకి మంచి ఆఫర్ ఇచ్చిన నాటీ నరేష్

రాఘవ ఏ స్కిట్ చేసినా అందులో వెరైటీ కనిపిస్తుంది. ఇక రాబోయే వారం జబర్దస్త్ లో రాఘవ బామ్మ గెటప్ లో బైక్ మీద ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా  రిలీజ్ అయ్యింది. బండి మీద స్టైల్ గా 16 ఏళ్ళ వయసు సాంగ్ పాడుకుంటూ వచ్చాడు రాఘవ. ఇక ఇంద్రజ రాఘవ గెటప్ ని సాంగ్ ని చూసి కూర్చుంటే లేవలేని వయసులో ఈ పడిపడి లేచే పాటలు అవసరమా అని కౌంటర్ వేసింది. ఈ స్కిట్ భార్య భర్తల మధ్య పుల్లలు పెడితేనే కడుపు నిండుద్ది అన్న కాన్సెప్ట్ తో చేసాడు. ఇక నూకరాజు టీమ్ మొత్తం విక్రమ్ నటించి అన్ని మూవీస్ లోని క్యారెక్టర్లు చేసి ఎంటర్టైన్ చేశారు. నాటీ నరేష్ టీం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్ లో ఒక స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో జీని క్యారెక్టర్ ని నరేష్ చేసాడు. సౌమ్య దగ్గరకు వెళ్లి " నేను నీకు నచ్చి ఉండొచ్చు, కానీ ఈ జన్మకు నన్ను దక్కించుకోలేవు ..బెటర్ లక్ నెక్స్ట్ టైంరా నాన్న " అని మంచి ఆఫర్ ఇచ్చాడు నాటీ నరేష్. దానికి కౌంటర్ గా సౌమ్య " ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తున్నాను..ఇలా వున్నాడేంటి" అనే అర్ధం వచ్చేలా పంచ్ పడేసరికి నరేష్ సైలెంట్ ఐపోయాడు.

గోల్డెన్ హార్ట్ రోహిత్..ది బెస్ట్ పర్ఫామర్ ఆఫ్ ది సీజన్!

రోహిత్ ఓడిపోయినా కూడా తను బిహేవ్ చేసిన విధానం తనని గెలిపించింది అంతే.. అంటే ఇక్కడ టాస్క్ ఓడిపోవచ్చు కానీ ప్రేక్షకుల మనసు గెలిచాడు. ప్రతీ దగ్గర జెంటిల్ మెన్ నేచర్, గుడ్ బిహేవియర్. కచ్చితంగా అతడి స్థాయిని పెంచుతాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్ లో ఏ కంటెస్టెంట్ కూడా అంత క్లీన్ ఫెయిర్ గేమ్ ఆడలేదు. ప్రతీ టాస్క్ లోను బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవుతూ.. ఎక్కడా ఫేవరెటిజం చూపించకుండా, తన గేమ్ తను ఆడుతూ గోల్డెన్ హార్ట్ రోహిత్ అని అనిపించుకుంటున్నాడు.  సోషల్ మీడియాలో రోహిత్ ని 'జెంటిల్ మెన్ రోహిత్' అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రేక్షకులు. అయితే నిన్న జరిగిన రోల్ బేబీ రోల్ గేమ్ లో శ్రీహాన్ కి ఫేవరెటిజం చేసింది శ్రీసత్య. ఇనయాని మానిపులేట్ చేసి రోహిత్ ని లెవెల్ నుండి బయటకొచ్చేలా ఇనయాతో మార్చి చెప్పించింది శ్రీసత్య. వరెస్ట్ సంచాలక్ గా శ్రీసత్యని ప్రేక్షకులు తిడుతూ కామెంట్స్ చేయగా, ప్యూర్ అండ్ జెంటిల్ మెన్ రోహిత్ అంటున్నారు. ఓటింగ్ లో నిన్న మొన్నటి దాకా అడుగున ఉన్న రోహిత్.. తన బెస్ట్ పర్ఫామెన్స్ తో టాప్ త్రీ కి చేరుకున్నాడు. కాగా శ్రీసత్య, ఫైమా డేంజర్ జోన్ లో ఉన్నారు. 

ఏకాభిప్రాయాలే టికెట్ టు ఫినాలేనా?

బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వింతగా ఈ సీజన్ సాగుతోంది. ఇప్పటివరకూ టాస్క్ లో గెలిచినవారిదే కెప్టెన్సీ. దాంతో గేమ్ లో బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడేమో ఈ టికెట్ టు ఫినాలే కోసం ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోండి అని బిగ్ బాస్ ప్రతీ టాస్క్ లోని లెవెల్ లో చెప్తూ వస్తున్నాడు. దీంతో హౌస్ మేట్స్ హై ఇంటెన్స్ గా ఫీల్ అవుతున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ప్రతీ కంటెస్టెంట్ బిగ్ బాస్ కి ఎదురు తిరిగారు. ఎందుకంటే టాస్క్ లో కష్టపడి ఆడి ఆరుగురు గెలిస్తే వారిలో నుండి ఏకాభిప్రాయంతో ఇద్దరిని తొలగించాలి అంటే కంటెస్టెంట్స్ కే కాకుండా, అలా ఎలా అంటూ చూసే ప్రేక్షకులకు కూడా విసుగొచ్చింది. గత రెండు రోజుల నుండి 'టికెట్ టూ ఫినాలే' టాస్క్ జరుగుతోంది కానీ ప్రతీ లెవెల్ లో ఒక్కో కంటెస్టెంట్ ని ఏకాభిప్రాయంతో తొలగించాలి అని చెబుతూ వస్తున్నాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ పెడితే వాళ్ళలో ఎవరు ఎంత ఆడతారో అని తెలిసిపోతుంది అలాంటిది ఏ టాస్క్ పెట్టకుండా ఏకాభిప్రాయం ఏంటి? అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ లాంటి మెరుగైన కంటెస్టెంట్ కి సరైన టాస్క్ లు ఇవ్వకుండా వేరొకరి మీద నిర్ణయాన్ని ఉంచడమేంటి ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నోరు జారుతున్న కీర్తి భట్!

బిగ్ బాస్ హౌస్ లో నాలుగు రోజులుగా సాగుతున్న 'టికెట్ టు ఫినాలే' టాస్క్ చివరి దశకి కి చేరుకుంది. ఇందుకే ఒక్కో లెవెల్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఒక్కో రేస్ నుండి తొలగిస్తున్నాడు బిగ్ బాస్. కాగా నిన్న జరిగిన టాస్క్ లో రేస్ లో చివరన ఉన్నవాళ్ళకి కూడా అవకాశం ఇచ్చాడు. "టాస్క్ పేరు 'రోల్ బేబి రోల్'. ఇందులో ఎవరు అయితే బ్రిక్స్ తో  హైట్ బిల్డిండ్ కడతారో, వాళ్ళు ఈ లెవెల్ లో మొదట్లో ఉంటారు. కాగా ఈ టాస్క్ కి ఇనయా, శ్రీసత్య సంచాలకులు గా ఉంటారు" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో రోల్ చేసుకుంటూ బ్రిక్స్ ని తీసుకెళ్ళి, హైట్ బిల్డింగ్ కట్టాలి అనే రూల్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో కీర్తి, ఫైమా, రోహిత్, శ్రీహాన్ నలుగురు పాల్గొన్నారు. టాస్క్ ముగిసే సమయానికి అతి తక్కువ బ్రిక్స్ తో కీర్తి, ఫైమా ఉండగా, శ్రీహాన్ మొదటి స్థానం, రోహిత్ రెండవ స్థానంలో ఉన్నారు. అయితే ఇదే విషయం సంచాలకులుగా చేస్తున్న ఇనయా, శ్రీసత్యలు బిగ్ బాస్ కి చెప్పగా, కీర్తి కోపంగా "శ్రీసత్య సంచాలకురాలిగా ఉండి కూడా శ్రీహాన్ కి సపోర్ట్ చేసింది. గ్యాప్స్ ఉండకూడదు అని ముందు మీరు చెప్పారు" అని శ్రీసత్యని అడిగింది కీర్తి. "మనమెందుకు కష్డపడాలి. ఇంత అన్ ఫెయిర్ గా ఆడితే ఎలా, కష్టపడి ఆడినందుకు ఇలా చేస్తారా, ఎందుకు ఇలా చేస్తారు. తుప్పాస్ సంచాలక్ " అని కీర్తి వచ్చేసింది. "ప్రతీసారీ ఫెవరిజం చూపిస్తున్నారు. కష్టపడేవాళ్ళకి ఏం సపోర్ట్ ఉండదు. థు.. ఇలాంటి జనాల మధ్య నేనున్నానా " అని కీర్తి ఒంటరిగా కూర్చొని బాధపడింది. నా స్ట్రెంత్ మీద నాకు నమ్మకం ఉంది" అంటూ చెప్పుకుంది. అయితే కీర్తి సంచాలకులు ఇచ్చిన నిర్ణయాన్ని వినకుండా కొన్ని మాటలు జారింది. "ఫుల్ నెగెటివ్ అవుతున్నాను బిగ్ బాస్.. ప్లీజ్ నన్ను ఒక్కసారి కన్ఫెషన్ రూంకి పిలవండి" అని కీర్తి రిక్వెస్ట్ చేసింది. ఆమె రిక్వెస్ట్ ని ఒప్పుకోలేదు బిగ్ బాస్.ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ "లెవల్స్ పూర్తి అయ్యేసరికి తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి టికెట్ ఫినాలే రేస్ లో నుండి తొలగిపోయింది" అని చెప్పాడు.