ఫైమాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పటాస్ ప్రవీణ్!

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేసిన ఫైమాకి తన మిత్రుడు పటాస్ ప్రవీణ్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాడు. స్పెషల్ గిఫ్ట్ తో ఆమెను  సర్ప్రైజ్ చేసాడు. ముందుగా ఒక కేక్ కట్ చేసి ఫైమాకి తినిపించాడు.  తర్వాత ఫైమా కూడా ప్రవీణ్ కి వాళ్ళ అమ్మకు తినిపించింది. ఆ తర్వాత కడపకు వెళ్లి అక్కడి దర్గా నుంచి హోలీ వాటర్ తీసుకొచ్చి ఫైమా చేతికి ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏదో అనుకునేవు ఈ హోలీ వాటర్ నే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం అందుకే ..అని చెప్పాడు. ఇక తన మెడలోని గోల్డ్ చైన్ కూడా ఫైమాకి ఇచ్చాడు. ఫైమాని చూస్తుంటే తనకు చాలా భయమేస్తోందని చెప్పాడు. ఎందుకంటే హౌస్ లో అందరితో ఫైట్ చేసి వచ్చింది కదా తనను కూడా ఏమన్నా అంటుందేమో అని భయం వేసిందట.  ఇక ఫైమా హౌస్ లో బాగా ఆడిందని..ఇన్ని రోజులు హౌస్ లో ఉండడం చాలా గ్రేట్ అని హోస్ట్ నాగార్జున ఫైమా ఆటను మెచ్చుకోవడం చాలా సంతోషం అని తన కూతురు ఫైమా గురించి చెప్పి సంబరపడింది  వాళ్ళ అమ్మ.

నాకు మళ్లీ కంటెస్టెంట్ గా చేయాలని ఉంది..కానీ ఓడిపోతానని భయంగా ఉంది!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్  లేటెస్ట్ గా మరో టీజర్ ని రిలీజ్ చేసింది. కిరాక్‌ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ’. ఇప్పటికి 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఆదివారం నుంచి సీజన్ 15 ఆడియన్స్ ముందుకు రావడానికి  సిద్ధమైపోయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా రాబోతున్నారు.  ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ ఎంతోమందికి ఆయన డాన్స్ కోరియోగ్రఫీ కూడా చేశారు..అలాంటి ఇండియన్ మైకేల్ జాక్సన్  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా.. ఆయన సత్తా చాటారు. నటుడిగా కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేసారు.  ఇప్పుడు ఢీ-15 లో మెరవడానికి సిద్ధమయ్యారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చారు.  ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు అలరించడానికి సిద్దమయ్యాడు. అలాగే ఈ షో లేటెస్ట్ గా రిలీజ్ ఐన టీజర్ లో శ్రద్ధాదాస్ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ తో కలిసి స్టేజి మీదకు వచ్చి "నాకు కంటెస్టెంట్ గా మళ్లీ చేయాలనుంది..కానీ సెలెక్షన్స్ లోనే ఓడిపోతానని నాకు తెలుసు" అని ఒక డైలాగ్ వేసి అందరినీ నవ్వించారు.

రూల్స్ పెట్టారు..ఏం లాభం..ఫాలో అవ్వాలి కదా!

బుల్లితెర నటుడు పవన్ సాయి గురించి అందరికీ తెలుసు. ఫస్ట్‌టైమ్‌ కామెడీ రోల్‌ ఉన్న "హ్యాపీడేస్‌" సీరియల్‌లో ‘బ్లూటూత్‌’ పాత్రలో నటించే అవకాశం వచ్చింది పవన్ కి . తర్వాత మొగలిరేకులు, శ్రావణసమీరాలు వంటి సీరియల్స్ లో నటించాడు.  ‘జీ తెలుగు’ ఛానల్ లో ‘ముద్దమందారం’ సీరియల్‌లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు.  ఇప్పుడు స్టార్ మాలో ప్రసారమవుతున్న "మల్లీ..నిండు జాబిల్లి" సీరియల్ లో అరవింద్ పాత్రలో నటిస్తున్నాడు. ఐతే పవన్ సాయికి ఈమధ్య బాగా కోపం వచ్చింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. కార్ లో వెళుతూ అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలతో  ట్రాఫిక్ సమస్యలతో ఆయనకు  బాగా కోపం వచ్చింది. "భరత్ అనే నేను" మూవీలో మహేష్ బాబు ఎలాగైతే ట్రాఫిక్ ని చూసి షాకయ్యాడో అచ్చం అలాగే పవన్ సాయి కూడా రియాక్ట్ అయ్యాడు.  "ఈ ట్రాఫిక్ తో చాలా చిరాగ్గా ఉంది. ఎలా పడితే అలా వెళ్తున్నారు. ట్రాఫిస్ రూల్స్ అసలు ఎవరూ పాటించడంలేదు...24 / 7 ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎవరికీ ఏ సమస్య రాదు" అని కోపంగా ఉన్న ఎమోజిస్ ని కూడా కలిపి తన ఒపీనియన్ ని  తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు.

ఘనంగా కమెడియన్ యాదమ్మరాజు, స్టెల్లా హల్దీ వేడుకలు!

‘పటాస్’ కామెడీ షో ద్వారా బాగా పాపులరైన కమెడియన్ యాదమ్మ రాజు. ఆయన తర్వాత  జీ తెలుగు నిర్వహించిన కామెడీ షోలో కూడా కొన్నాళ్ళు కామెడీ స్కిట్స్ వేసి ఎంటర్టైన్ చేసాడు. తన ఇన్నోసెంట్ ఫేస్ తో ఎలాంటి డైలాగ్స్ నైనా కామెడీగా చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు.  ఇప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో కామెడీ స్కిట్స్ వేస్తూ అలరిస్తున్నాడు. ఇక యాదమ్మ రాజు ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ వేడుకను చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు స్టెల్లా …! వీళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళ పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. రీసెంట్ గా  హల్దీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.  యాదమ రాజు- స్టెల్లా చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ మతాలు వేరైనా  మనసులు కలిసేసరికి ఆ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడాయిని త్వరలో  పెళ్లితో ఒకటి కాబోతున్నారు.  2020 ఆగష్టు 22న జీతెలుగులో ‘బాపు బొమ్మకు పెళ్లంట’ అనే ఒక షోలో  తన స్నేహితురాలిని  పరిచయం చేశాడు యాదమ రాజు.

ఘనంగా బుల్లితెర సీరియల్ నటి త్రిష వివాహం!

కరోనా టైములో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఫుల్ ఎంటర్టైన్ చేసి ఇండస్ట్రీ మొత్తం కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.  ఇక ఈ  ఇయర్ మొదటి నుంచి చూసుకుంటే కరోనా టైములో వాయిదా పడిన పెళ్లిళ్లు అన్నీ ఈ సంవత్సరం  ఘనంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన  త్రిష ఇప్పుడు ఎన్నో సీరియల్స్ మంచి మంచి పాత్రల్లో నటిస్తోంది. స్టార్ మాలో ప్రసారమైన ‘మనసిచ్చి చూడు’సీరియల్ లో కీర్తిభట్ చెల్లెలు రేణు పాత్రలో కనిపించి అలరించింది త్రిష.  ఇక ఇప్పుడు ఈమె ఘనంగా వివాహం చేసుకుంది. ఇక ఈ భర్త పేరు విశాల్. ఈమె వివాహానికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. త్రిష ఎన్నో మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే బుల్లితెర మీద చక్రవాకం, మొగలిరేకులు, భార్యామణి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ లో కూడా నటించింది.

ఘనంగా బుల్లితెర నటి శ్రీవాణి ఇంటి గృహప్రవేశ వేడుక!

స్మాల్ స్క్రీన్ మీద శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక పక్కన సీరియల్స్ లో నటిస్తూ ఉంటుంది. మరో పక్క ఫామిలీఫామిలీ కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ తన ఫాన్స్ ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.  ఇక ఇప్పుడు లేటెస్ట్ తన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. శ్రీవాణి ఇంటి గృహప్రవేశ వేడుకకు పలువురు బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. ఈ గృహప్రవేశ వేడుకను శ్రీవాణి ఎంతో ఘనంగా నిర్వహించారు. భర్త విక్రమాదిత్య, కూతురు నందినితో  కలిసి శ్రీవాణి స్వామి వారికి పూజ చేసి  వంటగదిలో పాలు పొంగించారు.  ఇక ఈ వేడుకలో హిమజ, జబర్దస్త్ ఫేమ్ పవిత్రతో, సుష్మకిరణ్, నవీన, అంజలితో పాటు పలువురు నటీనటులు పాల్గొనే శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొంతమంది  సోషల్ మీడియా ద్వారా శ్రీవాణికి శుభాకాంక్షలు చెప్పారు. శ్రీవాణి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్లాగ్‌ లు  ఎక్కువగా చేస్తుంది. వీటిల్లో తన పర్సనల్ విషయాలు, తన ఇబ్బందులు, తన చేసే షాపింగ్ లు ఇలాంటి రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటుంది.  

శ్రీసత్యకి ఎలిమినేషన్ తప్పదా!

బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి సస్పెన్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ప్రతీ వారం ఎలిమినేషన్ అనేది కామన్ గా జరిగేదే. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పేలా లేదు. ఎందుకంటే ఫైనల్ కి ఇంకా మిగిలింది ఒక్క వారమే.. కాబట్టి ఈ వారం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంటుందని వీక్షకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ కేటగిరీ చూసుకుంటే అందరికన్నా చివరగా శ్రీసత్య ఉంది.  దీంతో తనకి ఎలిమినేషన్ ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ వారం అంతా శ్రీసత్య పర్ఫామెన్స్ చూసుకుంటే పర్వాలేదనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి నుండి జరిగిన టాస్క్ లలో తనే విజేతగా నిలిచింది. అయితే శ్రీసత్యకి హౌస్ లో ఎవరి మద్దతు లేకపోవడంతో.. తను సింగిల్ గా పర్ఫామెన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.  ఫ్యామీలి వీక్ ముందు వరకూ శ్రీసత్య మీద చిరాకుగా ఉన్న ప్రేక్షకులు, ఫ్యామిలీ వీక్ లో శ్రీసత్య పేరెంట్స్ ని చూసి కనెక్ట్ అయ్యారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఓటింగ్ లో శ్రీసత్య గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇదే కాకుండా ఈ మధ్య తను హౌస్ లో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకపోవడం ఒకటి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ని బట్టి తనే చివరి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే చివరికి వరకు ఉండే సస్పెన్స్ రివీల్ అవ్వాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.

వాటిని బాధపెట్టడానికి ఎలా మనసొప్పుతుంది ఎవరికైనా ? రష్మీ సూటి ప్రశ్న

రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు నటన, ఐతే ఎంజాయ్మెంట్ వీటితో పాటు ఆమెకు మూగ జీవాలు అంటే చాలా ఇష్టం..అందులోనూ కుక్కలంటే మరీ ఇష్టం.  ఈమె ప్రస్తుతం "ఎక్స్ ట్రా జబర్దస్త్ " షోకి , ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి యాంకర్ గా పనిచేస్తోంది. రష్మీ అంటే కేవలం యాంకర్ మాత్రమే కాదు.. మానవతావాది కూడా అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. రష్మీ కష్టాల్లో ఉన్న ఎంతో మందికి హెల్ప్ చేసింది అంతేకాదు కరోనా టైంలో స్వయంగా తానే ఫుడ్ తీసుకెళ్లి రోడ్డు మీద ఉండే మూగజీవాలకు పెట్టేది.  ఐతే ఇప్పుడు రష్మీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ నెటిజన్స్ ని బాగా  ఆకర్షిస్తోంది. చాలా క్యూట్ గా కూడా ఉంది. ఒక పిల్లాడు స్కూల్ బస్సు నుంచి దిగి పరిగెత్తుకుని వస్తుంటే ఆ కుర్రాడు పెంచుకునే కుక్కపిల్ల రోడ్డు మీద ఆ పిల్లాడి కోసం వెయిట్ చేసి అతను వచ్చేసరికి ఎలా పరిగెత్తిందో ఈ వీడియోలో కనిపిస్తుంది.  ఇక దీనికి కాప్షన్ గా " ఆ కుక్కపిల్లలకు ఉన్నంత స్వచ్ఛమైన మనసు మనకు అసలు ఉండనే ఉండదు. మరి అలాంటి వాటిని బాధపెట్టడానికి ఎలా మనసొప్పుతుంది ఎవరికైనా ?" అని ప్రశ్నించింది.

రంగమ్మత్తా మజాకానా..వెయిటర్స్ తో కలిసి స్టెప్పేసినా రక్కమ్మ!

అనసూయ సోషల్ మీడియాలో ఏది చేసినా చాలా క్యూట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు అనసూయ కొంతమందితో కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు  ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనసూయకి లాంగ్ డ్రైవ్ అన్నా, మాల్దీవ్స్ అన్నా, పెట్స్ అన్నా చాలా ఇష్టం. అందులో భాగంగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ  దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగింది.. చిట్యాలలో 7 మిడ్వే ప్లాజాలో ఆగి ఫుడ్ తిన్నది అనసూయ. ఇక అదే టైంలో రెస్టారెంట్ లో ఉన్న కొంత మంది బాయ్స్ సెలెబ్రిటీని చూసేసరికి ఆనందంతో ఆమె కోసం డాన్స్ కూడా చేసారు.  ఇక ఆమెను కూడా ఇన్వైట్ చేసి తమతో కలిసి స్టెప్పేయాలని పట్టుబట్టేసరికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలా  "రారా రక్కమ్మ" సాంగ్ కి  వెయిటర్లతో కలిసి ఈ బ్యూటీ చేసిన డాన్సు దుమ్ము రేపుతుంది. రంగమ్మత్తా మజాకానా అని నిరూపించింది. ప్రస్తుతానికి అనసూయ సినిమాల పరంగా చాలా  బిజీగా ఉంది.  దాదాపు పదికి పైగా సినిమాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఆమె మూవీస్ చేస్తోంది.

కొత్త ఇంట్లో పాలు పొంగించిన దీప్తి సునయన!

బిగ్ బాస్ హౌస్ ఇద్దరిని విడదీసింది. వాళ్ళే దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్. బిగ్ బాస్   సీజ‌న్ 5 లో యూట్యూబ‌ర్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌ ఒక కంటెస్టెంట్.. ఐతే  హౌస్‌లో సిరి హ‌న్మంత్‌తో షన్ను  న‌డిపిన ట్రాక్ వలన అతనికి నెగటివిటీ బాగా పెరిగింది. దీంతో దీప్తి షన్నుకి బ్రేకప్ చెప్పేసింది. అలా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.  ఐతే ఈ ఏడాది ఇద్దరికీ బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే షణ్ముఖ్ మొదట కొత్త ఇంట్లోకి వెళ్తూ దానికి సంబంధించిన గృహప్రవేశం ఫోటోలను తర్వాత కొత్త కార్ కొని ఫోజులిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.  ఇక ఇప్పుడు దీప్తి కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. తెలిసిన కొంత మంది ఫ్రెండ్స్ మధ్యన కొత్త ఇంట్లో పాలు పొంగించింది. ఇక తన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ కూడా ఆమెను విష్ చేస్తున్నారు.  ఇక దీప్తికి ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ద పెడుతుంది. జిమ్ లో ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది..సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్స్ తో తన ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది..

అమ్మాయిల తొడల గురించి మాట్లాడాలి అనేదే నా సిద్ధాంతం!

ఆర్జీవీ "డేంజరస్" మూవీ ప్రొమోషన్స్ ఎలా చేశారో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఒక సినిమాని   ప్రమోట్ చేసుకోవడం కోసం కెమెరా ముందు ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకుని ముద్దులు పెడుతూ సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడుతూ..అసలు   బుద్దిజ్ఞానం ఉందా మీకు...ఇంతకు ముందు వచ్చిన మీ మూవీస్ ఎలా ఉండేవి.. మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న మీరు ఇలాంటివి చేయడం కరెక్టేనా ? అని అడిగిన యాంకర్ ప్రశ్నకు ఆర్జీవీ ఇలా సమాధానమిచ్చారు.  "ఆడవాళ్లను ఎప్పుడూ ముంగురులు, ముక్కు, కళ్ళు, పెదాలు అనే పొగుడుతూ ఉంటారు..దేవుడో ఏ సృష్టో అమ్మాయిలోని అన్ని భాగాలను సృష్టించినప్పుడు   పైన ఉన్నవాటిని ఎందుకు ఎక్కువగా  పొగుడుతారు..అంటే అవి అప్పర్ కాస్ట్ కి సంబంధించినవా మిగతా అవయవాలు లోయర్ కాస్ట్ కి చెందినవా ? అందుకే నేను కింద ఉన్న భాగాలను బడుగు అవయవాలు అని టర్మ్ ని వాడతాను. వాటికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని నా ఆలోచనలో భాగంగానే ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాను.  ఎలాగయితే కార్ల్ మార్క్స్ పీడితవర్గ ప్రజల కోసం ఆలోచించి ఒక ఫిలాసఫీ రాశాడో నేను మాత్రం దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా ప్రజల కోసం పోరాడుతున్నా. కళ్ళ గురించి మాట్లాడినప్పుడు తొడల గురించి కూడా మాట్లాడాలి. బాడీ పార్ట్స్ లో కొన్ని భాగాలు అణిచివేతకు గురి కాకుండా ఉండడం కోసమే నేను ఎక్కువగా కింద భాగాల గురించి మాట్లాడుతూ ఉంటాను" అని చెప్పారు.

బిగ్ బాస్ హౌస్ లో సస్పెన్స్!

బిగ్ బాస్ ఈ  సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సీజన్ ముగింపుకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ విజేత ఎవరు అనే సస్పెన్స్ అందరిలోను మొదలైంది. కాగా ఒక్కో కంటెస్టెంట్ తమ బెస్ట్‌ ఇస్తూ వస్తోన్నారు. ఎవరూ తగ్గకుండా వారి వారి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. హౌస్ లో మొత్తంగా ఇప్పుడు ఏడుగురు ఉన్నారు. అయితే అందరిలో రేవంత్ ప్రతీ నామినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నాడు. దీంతో రివ్యూయర్స్ అందరూ తనే ఈ సీజన్ విజేత అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది. కారణం హౌస్ లో ఉన్నంత సేపు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఒక వెలుగు వెలిగిన గీతూనే బయటకు పంపించేసారు ప్రేక్షకులు. అయితే రేవంత్ అగ్రెసివ్. ఇంకా మాటలు జారుతూ ఉంటాడు. ఇది ఎక్కువ అయిందంటే ప్రేక్షకులు కూడా ఓట్లు వేయడం మానేస్తారు అని అనుకుంటున్నారు.  అయితే రేవంత్ కాకుండా ఇంకా ఎవరు ఈ సీజన్ విజేత అవుతారంటే అది కచ్చితంగా రోహిత్ అనే చెప్పాలి. ఎందుకంటే రోహిత్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ అధిగమించలేదు. కావాలని ఎవరితో గొడవలకు వెళ్ళలేదు. ఎవరితోనూ రూడ్ గా మాట్లాడలేదు. ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా. ఇతనే ఈ సీజన్ విజేతగా నిలిచే ఛాన్స్ లు లేకపోలేదు. అయితే శ్రీహాన్ బాగానే పర్ఫామెన్స్ ఇచ్చినా విన్నర్ మెటీరియల్ కాదనే అంటున్నారు విమర్శకులు. ఎందుకంటే శ్రీహాన్ ప్రతీసారీ శ్రీసత్య, రేవంత్ తో గొడవలు పెట్టుకోవడం అనేది ప్రేక్షకులకు చికాకును తెప్పిస్తున్నాయి. ఇక ఆదిరెడ్డి, శ్రీసత్య, కీర్తి భట్ లు ఉన్నా కూడా వారు పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వట్లేదనే చెప్పాలి. మొత్తానికి ఈ సీజన్ విజేత ఎవరు? అనే ఈ సస్పెన్స్ వీడాలంటే ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

లంగావోణీలో అల్లాడించిన ఇంద్రజ..పాతికేళ్ళు వెనక్కి వెళ్లిపోయారంటూ కామెంట్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ మిగతా కామెడీ షోస్ తో సమానంగా పోటీ పడుతూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే ఈ షోకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇందులో  ఫన్‌, ఎంటర్‌టైన్‌, మెసేజ్‌ ఒరియెంటెడ్‌ స్కిట్స్‌ అన్ని కలగలసిన ఒక అద్భుతమైన కామెడీ షో ఇది. ఈ షోకి రష్మీ యాంకర్ జడ్జి ఇంద్రజ. ఇక ఇప్పుడు రాబోయే వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "ముఖచిత్రం" డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌తో కలిసి వచ్చింది హీరోయిన్ ప్రియా వడ్లమాని. హైపర్‌ ఆది ఆమెను టీజ్ చేయడానికి ట్రై చేసాడు కానీ వర్కౌట్ కాలేదు.   ఇక షోలో భాగంగా.. ఇంద్రజ తన డ్యాన్స్‌తో స్టేజిని అల్లాడించింది. ఇంద్రజకి ఆల్రెడీ డాన్స్ మీద మంచి పట్టు ఉంది. ఎలాంటి డాన్స్ ని ఐనా అవలీలగా చేసేస్తుంది. రాబోయే వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో  తన డ్యాన్స్‌తో అందరిని ఎంటర్టైన్ చేసి అలరించింది. ప్రియమైన నీకు సినిమాలోని "మనసున ఉన్నది" అనే  పాటకు లంగా ఓణీ వేసుకుని డ్యాన్స్‌ చేసింది ఇంద్రజ.." ఈ పాటతో పాతికేళ్ళు ముందుకెళ్లారు అంత బాగా చేశారు" అని  ఆది మంచి కంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత జీన్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని "గజినీ సినిమాలోని.. "రహతుల్ల రహతుల్ల "  పాటకు మంచి ఎనెర్జీతో డాన్స్ చేసింది ఇంద్రజ.

ఆర్జీవీ హీరోగా చేసే సినిమాలో విలన్ ఎవరో తెలుసా ?

ఆర్జీవీని  హీరోగా పెట్టి మీరే సినిమా డైరెక్ట్ చేయాల్సి వస్తే అందులో విలన్ గా ఎవరిని పెడతారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన్నే విలన్ గా పెట్టి డ్యూయల్ రోల్ చేయిస్తా అని ఆన్సర్ ఇచ్చారు కృష్ణ భగవాన్. కమెడియన్ కృష్ణ భగవాన్ స్మాల్ స్క్రీన్ మీద అన్ని రకాల షోస్ లో కనిపిస్తూ ఆడియన్స్ ని తన టైమింగ్ కామెడీతో అలరిస్తున్నారు.  ఇక ఈయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని వెరైటీ ఆన్సర్స్ ఇచ్చారు. "నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నటుడిగానే పుట్టాలని అనుకుంటున్నా ఎందుకంటే నాకు ఈ నట జీవితం పెద్దగా సాటిస్ఫాక్షన్ గా లేదు. ఇప్పటివరకు చేసినవి ఏవీ కూడా బాగా చేయలేదు అందుకే మళ్ళీ మొదటి నుంచి మంచిగా చేసుకుని వద్దామని అనుకుంటున్నా. లేదా అసలు మరో జన్మ అనేదే వద్దు..ఐతే నాలో సడన్గా ఆధ్యాత్మికత ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో చిన్నప్పుడు అందరూ పూజలు అవీ చేసేవారు. తర్వాత పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ఆ టైంలో నాకు ఎవరో షిర్డీ సాయి బాబా గురించి చెప్పారు. ఆయన్ని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుందని ఆయన కొన్ని లీలల ద్వారా నాకు అప్పుడు అర్ధమయ్యింది. అలా  రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశా..అప్పుడు అర్ధమయ్యింది జీవితం అంటే ఏమిటి..నేను అంటే ఏమిటి  అని అలా ఆధ్యాత్మికత వైపుకు నా దృష్టి మళ్లింది" అని చెప్పారు కృష్ణ భగవాన్.

ఇనాయ కప్పు గెలిస్తే హగ్ అడుగుతా..పది రోజులు స్నానం కూడా చేయను!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్జీవీ హవానే బాగా వీస్తోంది. రకరకాల ఇంటర్వ్యూస్ లో  కనిపిస్తూ డిఫరెంట్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు.  ఇక అలాంటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "బిగ్ బాస్ హౌస్ లోకి నన్ను రమ్మని చాలా సార్లు అడిగారు కానీ నాకు అసలు ఇంటరెస్ట్ లేదు అసలు వెళ్ళను కూడా. ఒక్కసారి అనుకుంటా సన్నీలియోన్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఒక పావుగంట చూసా అంతే. ఒక వేళ బిగ్ బాస్ హౌస్ లో 15 మంది అమ్మాయిలు ఉంటే మాత్రం మేల్ కంటెస్టెంట్ గా నేను వెళ్తా..ఎవరు ఏం అనుకున్నా దానికి నాకు సంబంధం లేదు..ఇనాయ కోసం సపోర్ట్ చేస్తాను కానీ ఆమె కోసం షో ఎందుకు చూడాలి ? పోనీ నాగార్జున గారు ఉంటే మాత్రం బిగ్ బాస్ స్టేజి మీదకు ఎందుకు వెళ్ళాలి. ఒకవేళ ఇనాయ గెలిచి కప్పు తీసుకుని బయటికి వస్తే గనక ఒక హగ్ కావాలని అడుగుతాను. తర్వాత పది రోజుల పాటు స్నానమే చేయను. టీవీ షోస్ దేని మీద కూడా నాకు పెద్దగా ఇంటరెస్ట్ ఉండదు. అసలు స్టేజి మీదకు కానీ హౌస్ కానీ వెళ్లి వాళ్లంతా అక్కడ ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు..ఎవరూ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. ఒక వేళ ఇనాయ కోసం బిగ్ బాస్ టీమ్ గనక నన్ను పిలిస్తే వెళ్తాను ఎందుకంటే ఆమెను హగ్ చేసుకోవడానికి కచ్చితంగా వెళ్తాను" అని చెప్పారు ఆర్జీవీ.

డిజేబుల్ అయిన రోహిత్ ఇన్ స్టాగ్రామ్.. బిగ్ బాస్ టీం రోహిత్ ని టార్గెట్ చేసారా?

బిగ్ బాస్ రోజు రోజుకి సరికొత్త మలుపులతో, సరికొత్తగా మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ గా, మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటున్న రోహిత్, సోషల్ మీడియా అకౌండ్ డిజేబుల్ అయింది. అయితే రోహిత్ ఫ్యాన్స్ అంతా తనకి సంబంధించిన అప్డేట్స్ కోసం అతని ఇన్ స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు, కానీ ఇప్పుడు అది డిజేబుల్ అయింది. దీంతో  అందరిలో గందరగోళం ఏర్పడింది.  ఇక రీసెంట్ గా బిగ్ బాస్ నుండి బయటకొచ్చిన రోహిత్ భార్య మెరీనా, ఈ విషయాన్ని  ఫ్యాన్స్ తో పంచుకుంది. అయితే తాజాగా రోహిత్ నామినేషన్లో‌ ఉండగా ఓటింగ్ లో‌ దూసుకెళ్తున్నాడు. రేవంత్ తో పోటీగా మొదటి స్థానానికి పోటీపడుతున్న రోహిత్ కి బిగ్ బాస్ కి రాకముందు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకపోవడం గమనార్హం. అయితే "రోహిత్ అకౌంట్ డిజేబుల్ అయింది. సపోర్ట్ గా ఉండండి ఫ్రెండ్స్, బిగ్ బాస్ కావాలనే.. రోహిత్ ని ఎక్కువగా ఎపిసోడ్ లో చూపించట్లేదు" అంటూ ఎమోషనల్ అయ్యింది మెరీనా. అయితే "బిగ్ బాస్ రోహిత్ ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు" అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా రోహిత్ ప్లేస్ లో, కీర్తి భట్ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. అందుకే రోహిత్ ని ఎక్కువగా చూపించట్లేదని రోహిత్ కి సపోర్ట్ గా, మెరీనా తన ఇన్ స్టాగ్రామ్ లో‌‌ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి రోహిత్ కి సంబంధించి అప్డేట్ ఇస్తూ వస్తుంది. "రోహిత్ ఇన్ స్టాగ్రామ్ డిజేబుల్ అయ్యింది. సపోర్ట్ చేయండి. ఎవరో కావాలని డిజేబుల్ చేసారు. మేం‌ రిక్వెస్ట్ చేసాం. ఇంకో ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం నా ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. మీరు చేసే ప్రతీ ఒక్క ఓటు కూడా చాలా విలువైంది" అంటూ మెరీనా ఎమోషనల్  అయ్యింది. కాగా ఈ విషయమై బిగ్ బాస్ పీఆర్ టీమ్ వాళ్ళు రోహిత్ ని టాప్-5 లో ఉండనివ్వొద్దు అని ఇలా చేసారేమోనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

'ఇంట్లో దెయ్యం మాకేం భయం' అంటున్న కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ లో గత నాలుగు రోజుల నుండి సాగుతోన్న ఫినాలే రేస్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో హౌస్ మేట్స్ చేసే ప్రతీ చిన్న తప్పు పెద్దదిగా చూపిస్తూ వస్తోన్నారు బిగ్ బాస్. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ‌కంటెస్టెంట్స్ లాస్ అయిన అమౌంట్ ని సంపాదించుకోవాడానికి టాస్క్ లు పెడుతూ వస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇందులో మొదటి టాస్క్ అయిన 'బాంబ్ డిఫ్యూజ్ వైర్' టాస్క్ లో ముగ్గురు పాల్గొన్నారు. "వీరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో ఏకాభిప్రాయంతో చెప్పండి" అని బిగ్ బాస్ చెప్పగా, "ఇనయా గెలుస్తుంది" అని మిగిలిన సభ్యులు చెప్పారు. అయితే ఈ టాస్క్ లో‌ శ్రీసత్య గెలిచింది. ఆ తర్వాత ఇనయాని కన్ఫెషన్ రూంకి పిలిచాడు బిగ్ బాస్.‌ ఇనయా వెళ్ళే ముందు హౌస్ మేట్స్ తో "నాకు భయమా, అసలు లేదు. పిల్లలు మీరు. వెళ్ళి పడుకోండి" అని చెప్పి, లోపలికి వెళ్ళింది. ఇక లోపలికి వెళ్ళాక అసలు హర్రర్ కథ చూపించాడు బిగ్ బాస్. ఆ సౌండ్స్ కి, గోస్ట్ మూవీని లైవ్ లో చూసిన ఫీలింగ్ ఇనయాకి కలిగిందనే చెప్పాలి. అంతలా భయపడింది. దెయ్యంని చూసినట్లుగా భయానికి లోనైంది ఇనయా. ఆ తర్వాత రేవంత్ కన్ఫెషన్ రూంకి వెళ్ళాడు. హర్రర్ డబుల్ డోస్ ని పరిచయం చేసాడు బిగ్ బాస్. మొత్తానికి హౌస్ లో ఒక మినీ హర్రర్ సినిమాని చూపించాడు బిగ్ బాస్.

కంగ్రాట్స్ ఎందుకు చెప్పాలంటూ మెహబూబ్ పరువు తీసేసిన శ్వేతనాయుడు

బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం ప్రతీ వారం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని రెడీ చేస్తూ ఉన్నారు మేకర్స్ . అలాంటి కొన్ని షోస్ లో కొత్తగా స్టార్ట్ ఐన షో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ కూడా ఒకటి. ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షోకి   సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులరైన వారంతా వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. రాబోయే వారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే  సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మెహబూబ్  – శ్వేతా నాయుడు, సిద్ధూ – సోనియా సింగ్, యాంకర్ స్రవంతి చొక్కారపు – ప్రశాంత్ జంటలుగా పాల్గొన్నారు. ఫస్ట్ స్టేజి మీదకు మెహబూబ్ – శ్వేతా ఎంట్రీ ఇచ్చారు. కేజీఎఫ్ 2లో మెహబూబా సాంగ్ కి డాన్స్ చేశారు. అయితే.. డాన్స్ అయ్యాక శ్వేతా మెహబూబ్ దగ్గరికి వచ్చి.. "చెవిలో కంగ్రాట్స్ చెప్పినట్టే చెప్పి ఏం పీకావని కంగ్రాట్స్ చెప్పడానికి..’ అని సెటైర్ వేసింది. ఆ తర్వాత దిల్ సే అంటే మొదట్లో మెహబూబ్  ఇంటిపేరు అనుకున్నాను అని పంచ్  వేసి పరువు తీసేసింది.

శ్రీహాన్ ని మార్చేసిన సిరి!

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామీలీ వీక్ లో సిరి హనుమాన్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాగా సిరి హౌస్ లోకి వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీహాన్ లో చాలా మార్పు వచ్చిందని హౌస్ మేట్స్ అందరూ భావిస్తున్నారు.  కాగా తాజాగా సిరి బిబి కేఫ్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.‌ ఇందులో అరియానాతో చాలా విషయాలను పంచుకుంది సిరి. తను శ్రీహాన్ కి ఏమీ చెప్పలేదని చెప్పుకొచ్చింది. అయితే అరియానా "ఏంటీ మీ వోడు నువ్వు వెళ్ళొచ్చాక మారిపోయాడు అనే జపం వినిపిస్తోంది" అని అడిగేసరికి, "నేనేం చేయలేదు. ఇండివిజువల్ గా ఆడు.. వెటకారం తగ్గించుకో" అని చెప్పాను అని అంది. "ఎవరూ హైలైట్ అవ్వనిది శ్రీహాన్ మాత్రం హైలైట్ అవుతున్నాడు. మారాడు" అని అరియానా అడిగింది. దానికి సిరి మాట్లాడుతూ " వాళ్ళ పక్కనున్న ఫ్రెండ్సే అలా వంద సార్లు అనడం వల్ల హౌస్ లో ఉన్నవాళ్ళకి, అలాగే బయట చూసే ఆడియన్స్ కి.. మైండ్ లో‌ఎక్కడో అవునా.. అవునా అనే పాయింట్ కి వెళ్తారు " అని చెప్పింది సిరి. ఆ తర్వాత సిరిని, శ్రీసత్య గురించి అరియానా అడిగి తెలుసుకుంది. "బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవెర్ అనే ట్యాగ్ ఎవరూ శ్రీహాన్ కి ఇవ్వలేదు ఎందుకంటావ్" అని అడిగేసరికి, "నాకే బాధనిపించింది. అలాంటిది అక్కడున్న తను ఎంత బాధపడి ఉంటాడు" అని ఎమోషనల్ అయింది సిరి. ఆ తర్వాత సరదగా కొన్ని యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ ని చూపించగా, అందులో ఒక్కో థంబ్‌నెయిల్ చూసి నవ్వుకున్నారు ఇద్దరు. ఇలా సిరి మాట్లాడుతూ "ఎలాగైనా గెలిచి రా శ్రీహాన్.. ప్లీజ్ సపోర్ట్ ఆడియన్స్" అని చెప్పింది.