'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పిన గుడ్ న్యూస్ అదేనా!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఈ షోలో ప్రభాస్ ఒక శుభవార్తని పంచుకున్నట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ లో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ప్రభాస్ తో పాటు ఈ ఎపిసోడ్ లో ఆయన స్నేహితుడు, హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడట. అంతేకాదు "ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు" అని చరణ్ అనడంతో.. ఆ న్యూస్ ఏంటని బాలయ్య ప్రభాస్ ని అడిగి తెలుసుకుంటాడట. 'అన్ స్టాపబుల్'లో ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు ప్రభాస్ కి సంబంధించిన గుడ్ న్యూస్ అంటే పెళ్లి గురించే అయ్యుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా ఆయన ఇటీవల హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తలను కృతి ఇప్పటికే ఖండించింది. మరి ప్రభాస్ ఈ షోలో పెళ్లి గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి.

శ్రీసత్య ఎమోషనల్ జర్నీ.. ఓటింగ్ కి ప్లస్ పాయింటా!

బిగ్ బాస్ ఫినాలే వీక్ చాలా గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకుంటుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మొదటి వారం నుంచి నిర్వహించిన టాస్క్ లు, వాటికి సంబంధించిన  వస్తువులను గార్డెన్ ఏరియాలో పెట్టి, లాంతరు దీపాలతో అలంకరించాడు. ఫినాలేలో ఉన్న కంటెస్టెంట్ కి.. తను హౌస్ లో గడిపిన ముఖ్యమైన క్షణాలను ఫోటో రూపంలో బంధించి, గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మొదట రేవంత్ జర్నీ వీడియోని బిగ్ బాస్ ప్లే చేయగా, రెండవ వీడియో శ్రీసత్యది కావడం విశేషం.  ఆ తర్వాత బిగ్ బాస్, శ్రీసత్యని గార్డెన్ ఏరియాకి పిలిచి.. ఆమెకి సంబంధించిన ఫొటోస్ ని, ఇంకా తను హౌస్ లో గడిపిన మధురమైన క్షణాలన్నింటిని ఫోటోలుగా చూపించాడు. బిగ్ బాస్ మాట్లాడుతూ,  "ఈ హౌస్ లోకి మీరు భయంతో అడుగుపెట్టి, ఎవరికి దగ్గర కావాలో తెలియని సంకోచంలో ఉన్నారు. మీ అమ్మ కోసం మీరు బిగ్ బాస్ కి వచ్చారని మీకు మీరే సర్ది చెప్పుకొని ముందుకెళ్ళారు. మీ ప్రయాణం లో, మీ జర్నీని సులభతరం చేసే ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. కష్టం వచ్చిన ముందుకెళ్లగలగాలి. మీరు అలా ఒంటరితనం నుండి హౌస్ లో, అందరితో కలిసి ముందుకెళ్ళారు. ఇలాగే జీవితంలో కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్ ది బెస్ట్" అని చెప్పాడు. శ్రీసత్య తన జర్నీ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయింది. వీడియో ప్లే అవుతున్నంత సేపు ఏడ్చేసింది. అయితే అక్కడ డెకరేట్ చేసిన దీపకాంతలు.. తనని ఎంతగానో అబ్బురపరిచాయి. శ్రీసత్య జర్నీ వీడియోకి చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్‌ తో శ్రీసత్యకి ఓటింగ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిడ్ వీక్ ఎలిమినేషన్ గా రేవంత్.. అబ్బురపరిచిన రేవంత్ జర్నీ వీడియో!

బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఒక ప్రత్యేక శైలి కలిగిన  కంటెస్టెంట్. తన గాత్రంతో ఫ్యాన్స్ ని సంపాదించుకొని, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన చివరి కంటెస్టెంట్. బిగ్ బాస్ ప్రతీ సీజన్ ఫినాలే ఎపిసోడ్స్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ యొక్క జర్నీ వీడియోను లీస్ట్ నుండి చూపించడం అలవాటు. రేవంత్ జర్నీ వీడియో మొదట ప్లే చేసాడు బిగ్ బాస్. దీంతో విశ్లేషకులు ఈ సారి రేవంత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జర్నీ వీడియో ప్లే చేసే ముందు బిగ్ బాస్ మాట్లాడుతూ "ఇది ఫిజకల్ గేమ్స్ కి సంబంధించినది కాదు. ఇది పర్సనాలిటీ గేమ్. ఎవరి వ్యక్తిత్వం ఏంటో తెలిపే రియాలిటీ షో. ఇప్పటి వరకు మీరు మీ ఆటను ఫిజికల్ గా మాత్రమే చూసారు. కానీ మీ కోపం సరైనది కాదు. ఇక్కడ మనిషి యొక్క అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఉండగలగాలి. మీరు తండ్రి అయ్యే క్షణాలలో మీ వాళ్ళ దగ్గర లేకుండా బిగ్ బాస్ కోసం త్యాగం చేసారు. మీ వాళ్ళకి దూరంగా ఉండి, గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్ళాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఇక ముందు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి" అని చెప్పాడు. "థాంక్స్ బిగ్ బాస్. నేను తెలిసో, తెలియకో హౌస్ మేట్స్ ని ఇబ్బంది పెట్టాను. అందరికీ ఇప్పుడు సారీ చెప్తున్నా, ఇక నుండి నా కోపాన్ని మార్చుకుంటాను. నా వాళ్ళ కోసం కష్టపడతాను. నేను టైటిల్ గెలిచి ఆ కప్ నా కూతురికి బహుమతిగా ఇస్తాను. థాంక్స్ ఫర్ జర్నీ వీడియో. వేరే లెవెల్ బిగ్ బాస్" అంటూ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.

ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే అన్నారు...కానీ ఫైనల్ గా అలా జరిగిపోయింది!

ఆర్ ఆర్ ఆర్ మూవీలో "నాటు నాటు" సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందన్న  విషయం అప్పట్లో నాకు తెలీదు అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్ ఆలీతో సరదాగా షోలో.  ఎందుకంటే ఆ సాంగ్ పాడేటప్పుడు కీరవాణి గారు ఇది జస్ట్ ట్రాక్ మాత్రమే..ఇదే ఫైనల్ కాదు  అని చెప్పారు.  మొదట్లో ఈ సాంగ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలోది అన్న విషయం తెలియదు. లిరిక్స్ అవీ పాడేటప్పుడు తెలిసింది ఈ మూవీ కోసం పాడుతున్నామని.. అప్పుడు కీరవాణి గారు చెప్పారు. నేను ఈ సాంగ్ పాడిన  ఏడాదిన్నర తర్వాత  రిలీజ్ అయ్యింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. నాకు టెన్షన్ గా ఉంది. నా సాంగ్ ఉంటుందా ఉండదా అనే విషయం తెలియదు. అసలే పెద్ద మూవీ..ఎప్పటికప్పుడు డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి, వాయిస్ సెట్ అవ్వదేమో అనిపించింది. కానీ దేవుడి దయ వలన  తమిళ్, కన్నడ, హిందీలో కూడా నేనే పాడాను. నేను రాంచరణ్ గారికి పాడితే, కాలభైరవ జూనియర్ ఎన్టీఆర్ కి పాడారు. అన్ని భాషల్లో పాడాలనేది కీరవాణి గారి డెసిషన్ మాత్రమే ఇందులో నేను రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు.  ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తే బెస్ట్ అవుట్ ఫుట్ అనేది ఇవ్వలేం..ఫైనల్గా మనం ఇండస్ట్రీలో ఉండాలంటే కష్టపడాల్సిందే. కీరవాణిగారు అవకాశం ఇవ్వడమే పెద్ద కాంప్లిమెంట్ నాకు. తర్వాత జనాలలోకి వెళ్ళింది వాళ్ళు కూడా ఈ సాంగ్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు అంతకుమించిన కాంప్లిమెంట్  ఏముంది " అన్నాడు రాహుల్ సిప్లిగంజ్.

తన కంటెస్టెంట్ అప్పుల్ని తీరుస్తాను అని గొప్ప మనసును చాటుకున్న సుదర్శన్ మాస్టర్!

ఢీ-15 ఛాంపియన్ షిప్  బ్యాటిల్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోలో కంటెస్టెంట్ రాహుల్, అతని కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్ తో కలిసి వచ్చి స్టేజి మీద డాన్స్ ని  ఇరగదీసాడు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక ప్రదీప్ వాళ్ళ అమ్మను, తమ్ముడు రుతురాజ్ ను  స్టేజి మీదకు పిలిచాడు. వాళ్ళను అలా  చూసేసరికి రాహుల్ ఏడ్చేశాడు. తన తమ్ముడు స్పెషల్ పర్సన్ అని చెవుడు, మూగ అని చెప్పాడు. రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతోంది ముక్కులోంచి రక్తమొస్తోందని చెప్పేసరికి తనకు ఏం చేయాలో అర్ధం కాలేదన్నాడు.  ఇక రాహుల్ వాళ్ళ అమ్మ మాట్లాడుతో "నేను ఇళ్లల్లో పాచిపని చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లోకి సరిపడినంత డబ్బులు కూడా ఉండవు. రాహుల్ ఇలా డాన్స్ షోకి వస్తాను అన్నప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు. అందరి దగ్గరా డబ్బులు పోగేసి ఇలా పోటీలకు పంపించాను. ఇప్పుడు నా బిడ్డ నా పేరు నిలబెట్టాడు" అని ఏడుస్తూ గర్వంగా చెప్పింది. ఇక సుదర్శన్ మాస్టర్ తన కంటెస్టెంట్ కోసం తన ఉదారతను చాటాడు. "ఇలాంటి మంచి డాన్సర్ ని మాకు అందించారు. రాహుల్ కి  ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ నేను తీర్చడానికి సాయం చేస్తాను. ఈసారి వచ్చే పేమెంట్ మొత్తం రాహుల్ ఫామిలీకి ఇచ్చేస్తాను" అని చెప్పాడు.  ఇక ప్రభుదేవా కూడా "నీకేం భయం అక్కర్లేదు మేమంతా ఉన్నాం, ఈ ఢీ టీమ్ అంతా నీ వెనక ఉంది...భయపడకు, నీ డాన్స్ నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యి" అని అభయమిచ్చారు.  

ఒక కామెడీ రోల్ లో మీరే చేయాలి అని అడిగినందుకు ఆయన చేసిన పని ఇది!

"ఆలీతో సరదాగా" షోకి ఈ వారం రాహుల్ సిప్లిగంజ్, సోహైల్ ఇద్దరూ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళిద్దరూ ఎన్నో విషయాలు ఈ షోలో చెప్పారు. ఇక సోహైల్ ఆలీ సర్ గురించి మీకెవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తాను అని అన్నాడు " నేను ఆలీ సర్ ఒక ఫంక్షన్ లో కలిసాము  అంతే..ప్రత్యేక పరిచయం అంటూ ఏమీ లేదు.  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే "మిస్టర్ ప్రెగ్నెంట్" అనే ఒక మూవీ చేసాను. ఆ మూవీలో కామెడీ డాక్టర్ గా చేయడానికి ఒక రోల్ ఉంది. దానికి ఒక వ్యక్తి కావాలి అనేసరికి సెట్ లో అంతా  ఆలీ సర్ ఐతే కరెక్ట్ అని చెప్పేసరికి నేను ఆయనకు ఫోన్ చేసాను. ఫోన్ తీసి చెప్పు సోహైల్ అన్నారు  బాగా పరిచయమున్న వ్యక్తిలా..దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది.  తర్వాత ఇలా ఈ మూవీ విషయం అందులో పాత్ర గురించి చెప్పాను...ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చుకునే పరిస్థితి లేదని చెప్పాను. ఆయన అవేమీ ఆలోచించకుండా వచ్చి ఆ రోల్ చేసి వెళ్లారు. మాలాంటి ఎంతో మందిని ఆయన ఇలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మణికొండ నుంచి కొంపల్లి దాకా అంటే రెండు గంటలు ప్రయాణం చేసి నా కోసం వచ్చి ఆ రోల్ చేసి వెళ్లారు " దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా అని ఈ షోలో సోహైల్ ఆలీ గురించి చెప్పారు.

ఘనంగా యాదమ్మ రాజు పెళ్లి వేడుకలు..హాజరైన సెలబ్రిటీస్

"పటాస్" కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు.  బుల్లితెర మీద కనిపిస్తూనే అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.  అమాయకమైన హావభావాలతో ఆడియన్స్ ని  నవ్వించడం ఇతని స్టైల్. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతున్నాడు. మొన్న హల్దీ వేడుకల ఫోటోలు వైరల్ ఆయాయ్యి.  ఇక ఇప్పుడు వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగిపోయింది. వీళ్ళ ఇద్దరి పెళ్ళికి బిగ్ బాస్ సెలబ్రిటీలు వచ్చి  సందడి చేశారు. ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లు  సోహెల్, ముక్కు అవినాష్, హైపర్ ఆది, పరదేశి, శ్రీవాణి ఫామిలీ, నాగబాబు, వేణు వండర్స్, ఆకాష్ పూరి, డాన్సర్ పండు, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, ఇక కామెడీ స్టాక్ ఎక్స్చేంజి షో కమెడియన్స్ అంత వీళ్ళ పెళ్ళికి వచ్చి విషెస్ చెప్పారు.

ఘనంగా అమరదీప్, తేజు హల్దీ వేడుకలు!

అమర్ దీప్ చౌదరి ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన నటుడు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా "ఐరావతం" అనే మూవీలో కూడా మెరిశాడు. ఇక అలాంటి అమర్ దీప్ కు రీసెంట్ గా ‘ కోయిలమ్మ’ సీరియల్  ఫేమ్ తేజస్విని గౌడ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.  ఇక ఇప్పుడు వీరి పెళ్లి డేట్ దగ్గర పడుతుండేసరికి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయి.  తేజస్విని గౌడ.. తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇక అమర్ దీప్ ను కూడా వాళ్ళ ఫామిలీ మెంబర్స్   పెళ్లి కొడుకును చేశారు. హల్దీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. పసుపు కొట్టే కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమర్ దీప్ ను అభినందించేవారు.. అలాగే అతని ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు.

'ఢీ' షో అనేది మాహిష్మతి సామ్రాజ్యం..అందులో బాహుబలి ప్రభుదేవా!

ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్ చాలా జోష్ గా స్టార్ట్ అయ్యింది. ఈ షోలో "డి" ఫర్ "దేవా" అంటూ ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ ఐన గణేష్, జానీ, నోబెల్, శ్రీధర్  అలాగే మిగతా డాన్స్ మాస్టర్స్ తో కలిసి స్టెప్పులేసి స్టేజి మీదకు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఢీ- 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు గ్రాండ్ గా 15 సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ షో.  ఇక ఈ షో హోస్ట్ ప్రదీప్ మాట్లాడుతూ "ఇంటికి పెద్దన్నయ్య వచ్చినట్లు ఉంది..మీరే కొబ్బరికాయ కొట్టి ఈ షోని స్టార్ట్ చేశారు. మళ్ళీ మీ రాజ్యానికి రాజుగా వచ్చేసారు. ఢీ షో అనేది మాహిష్మతి సామ్రాజ్యం ఐతే అందులో బాహుబలి మీరే అనేసరికి ప్రభుదేవా కూడా తన సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తోంది అన్నారు..నా పొలంలో కూడా ఇంత పెద్ద పెద్ద మొలకలొచ్చాయి. తమిళనాడు వెళ్తే హీరో అవుతాను, బొంబాయికి వెళ్తే డైరెక్టర్ అవుతాను, ఆంధ్రాకి వస్తే కొరియోగ్రాఫర్ ని ఐపోతాను. మల్లెమాల వారికి ధన్యవాదాలు.  ఇక్కడున్న డాన్సర్స్  చాలా డెంజరస్. వాళ్ళతో  నేను పోటీ పడలేను. హమ్మయ్య నేను ముందే వచ్చేశాను. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు.  నా తర్వాతే మీరంతా పుట్టినందుకు చాలా థాంక్స్' అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. కొరియోగ్రాఫర్స్ అందరినీ పేరుపేరునా పిలిచి విషెస్ చెప్పారు. "శేఖర్ మాస్టర్ ని మిస్ అవుతున్నా. నాకు తెలుగు సాంగ్స్ అంటే చాలా ఇష్టం"  అని చెప్పి అందరినీ ఆయన మాటలతో మెస్మోరైజ్ చేశారు.

యాంకర్ శివకి దిమ్మ తిరిగే షాకిచ్చిన ఇనయా!

బిగ్ బాస్ సీజన్-6 లో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా హౌస్ నుంచి బయటకొచ్చాక, యాంకర్ శివతో ఎగ్జిట్ ఇంటర్వ్యూ జరిగింది. "ప్రతిసారీ బిగ్ బాస్ విన్నర్ నేనే అంటూ అరిచేదానివి కదా.. ఏమైంది నీ ఓవర్ కాన్ఫిడెన్స్" అని శివ అనగా, "అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. నా మీద నాకున్న నమ్మకం" అని ఇనయా సమాధానమిచ్చింది. "మొదటి వారమే బయటకొస్తావనుకున్నా.. కానీ సడెన్ గా నీ గ్రాఫ్ పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గింది" అని శివ అన్నాడు. "ఎక్కడ తగ్గింది?" అని ఇనయా అడిగేసరికి, "సూర్య విషయంలో.‌. లవ్ ట్రాక్ వల్ల తగ్గింది" అని శివ రిప్లై ఇవ్వడంతో.. "నేను లవ్ అని ఎప్పుడైనా చెప్పానా" అని అంది ఇనయా. "హౌస్ లో గట్టి పోటీ ఇచ్చి అనవసరంగా నోరు జారావ్ కదా" అని ప్రశ్నించగా, "నన్ను హౌస్ మేట్స్ రెచ్చగొట్టారు. ఆ ఫ్రస్టేషన్ లో కొన్ని మాటలు జారాను. అందరూ నన్ను కార్నర్ చేసారు. నాకు సపోర్ట్ లేదు. ఎంకరేజ్ లేదు.‌. ఎవరికీ నేను ఇష్టం లేదని అనిపించింది" అని చెప్పింది.  ఆ తర్వాత శివ మాట్లాడుతూ, "హౌస్ లో శ్రీహాన్ తో కొన్ని రోజులు గొడవ పడ్డావ్. మళ్ళీ కలిసిపోయి కాంప్లిమెంట్ ఇచ్చావ్. మళ్ళీ నామినేట్ చేసావ్. నువ్వు నీ మాట మీద ఉండవా" అని అడగగా, "హౌస్ లో శ్రీహాన్ కి నాకు గొడవ ఉంది. కానీ ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ మా మధ్య ఏదో ఉంది అని అనుకోవడం, నాకు ఇష్టం లేదు. అందుకే మళ్ళీ అతడిని నామినేట్ చేశాను" అంటూ చెప్పుకొచ్చింది ఇనయా. "హౌస్ మేట్స్ గురించి నీ మాటల్లో చెప్పు" అని అడగగా, "కీర్తి భట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఇంకా రేవంత్ కి రెండు ముఖాలు ఉన్నాయి. ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడుతాడు. శ్రీసత్య చాలా రెచ్చగొడుతుంది. ఆదిరెడ్డి పర్ఫెక్ట్ గేమర్. రోహిత్ జెన్యూన్ పర్సన్. ఇంకా నా హార్ట్ లో మెరీనా అక్కకి సెపరేట్ స్పేస్ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.

మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్!

రోజు రోజుకి ట్విస్ట్ లతో ప్రేక్షకుల అంచనాలను దాటి వినోదాన్ని అందిస్తున్నాడు బిగ్ బాస్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇనయాని ఎలిమినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ మరో షాక్ ఇచ్చాడు. అయితే సోమవారం నుండి బుధవారం వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరు లీస్ట్ లో ఉంటారో.. వారు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అవుతారని.. నాగార్జున ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో చెప్పాడు. అయితే  తాజాగా జరిగిన‌ ఓటింగ్ లో రోహిత్ రేవంత్ ల మధ్య మొదటి స్థానానికి పోటీ జరుగుతోంది. గంట గంటకి వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం జరుగుతుంది. ఆయితే రోహిత్ జెన్యూన్ గా, జెంటిల్ మెన్ గేమ్ ఆడతాడు కాబట్టి ఈ సారి అతనే టైటిల్ విజేత అనే ఊహాగానాలు వస్తోన్నాయి. కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మూడవ స్థానంలో, శ్రీహాన్ నాల్గవ స్థానంలో, కీర్తి భట్ ఐదవ స్థానంలో ఉండగా, చివరి స్థానంలో శ్రీసత్య ఉంది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీసత్య దాదాపు బయటకొచ్చేస్తుందనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రెండు రోజుల్లో శ్రీసత్యకి ఓటింగ్ ఎక్కువ అవుతుందేమో చూడాలి మరి.

'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' రెడీ అన్న ఆర్పీ

జబర్దస్త్ కమెడియన్ గా కిర్రాక్ ఆర్పీ ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఐతే తర్వాత షో నుంచి నాగబాబు వెళ్లిపోయేసరికి ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక మూవీ తియ్యడానికి ట్రై చేసాడు కానీ దాని డీటెయిల్స్ ఏమీ తెలీదు.  ఇక జబర్దస్త్ గురించి సోషల్ మీడియాలో ఆర్పీకి మిగతా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కి బాగా గొడవలు కూడా జరిగాయి. అలా ఆర్పీ టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. ఎక్కడా స్థిరంగా ఉండని ఆర్పీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నాడు. రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలో "నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రీసెంట్ గా  ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ.  ఈ నెల్లూరు పెద్దారెడ్డి రెస్టారెంట్ ప్రత్యేకతల గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ లో అన్ని వంటకాలు కట్టెల పొయ్యి పైనే  వండుతామని.. పదేళ్ల కిందటే  మొదలు పెడదామనుకున్న రెస్టారెంట్ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీ ఊరు నెల్లూరు అని తెలిసిన విషయమే. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రుచిని హైదరాబాద్ వాసులకు అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసినట్లు చెప్పాడు.  

సోహైల్ వచ్చాడంటే కథ వేరే ఉంటది!

ఆలీతో సరదాగా షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. వారంవారం కొత్తకొత్త గెస్ట్ లతో వినోదాన్ని పంచుతూ ఉంటుంది ఈ షో. ఇక ఈ నెక్స్ట్ వీక్ షోకి యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాళ్ళు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్  సోహెల్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంట్రీ ఇచ్చారు.   బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సోహెల్.. సింగర్ గా క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ ఇద్దరూ తమ జీవితంలో పడిన కష్టాలను , కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్  గురించి కూడా ఈ షోలో  చర్చించారు.  బిగ్ బాస్ తర్వాత సోహెల్ హీరోగా సినిమాలు చేస్తుండగా.. రాహుల్ సినిమా పాటలతో పాటు బిజినెస్ లో మంచి సక్సెస్ సాధిస్తున్నాడు. అయితే.. హోస్ట్ ఆలీ.. “ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళావంట కదా.. ఎందుకు?” అని సోహెల్ ని అడిగాడు. దీంతో ఎమోషనల్ అయిన సోహెల్.. ‘ఎందుకంటే సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ టైములో  డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఏం చేసినా సెట్ అయితలేదు ఇంతేనా లైఫ్’ అని అనిపించిందని చెప్పుకొచ్చాడు. 

వైరల్ గా మారిన ఇనయా ఎలిమినేషన్.. లక్ష ట్వీట్స్ తో ఫ్యాన్స్ ట్రెండ్!

బిగ్ బాస్ సీజన్-6  ఇన్ని వారాల్లో ఎన్నడూ లేనంత‌ క్రేజ్ ని, పాపులారిటీని ఓవర్ నైట్ లో సంపాదించుకుంది.  అది కూడా ఇనయా ఎలిమినేషన్ అని తెలిసిన ఒక్క రోజులోనే ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట కొచ్చి రచ్చ రచ్చ చేసారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే.. కామన్ గా సీజన్ మొదటి వారం నుండి ఎవరు‌ ఎలిమినేట్ అవుతారనేది, ఒక రోజు ముందే తెలిసిపోతుంది. అలాగే ఓ‌ వారం ఇనయా ఎలిమినేట్ అవుతుందని శనివారం ఉదయమే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో ఇనయాకు సపోర్ట్ చేస్తూ, మొదటి నుండి తనకి ఓట్లు వేసిన ఫ్యాన్స్ స్టూడియో బయటకొచ్చి ధర్మా చేసారు. "అన్ ఫెయిర్ ‌ఎలిమినేషన్ ఇనయా" అంటూ ప్లకార్డులతో భారీగా జనాలు వచ్చి, అరవడంతో పోలీసులు వచ్చి జోక్యం చేసుకొని అభిమానులని చెదరగొట్టారు. ట్విట్టర్ లో‌ 'అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఇనయా' అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ట్రెండ్  చేస్తున్నారు ఫ్యాన్స్. "ఫేక్ ఎలిమినేషన్, బిబి పాలిటిక్స్, మేనేజ్మెంట్ కోటాలో తొలగించారు" అంటూ ట్వీట్స్ తో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.  ఇప్పుడు అదే ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం. అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ ని సవాల్ చేస్తూ, తమ నిరసనని తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇనయా వల్ల బిగ్ బాస్ సీజన్-6 కూడా పాపులర్ అయ్యింది.

ఇనయా అవుట్.. కంటెస్టెంట్స్ షాక్!

బిగ్ బాస్ హౌస్ లో 'ఉమెన్ ఆఫ్ ది సీజన్' గా  పేరు తెచ్చుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇనయా. అలాంటిది ఆమె ఎలిమినేట్ అయ్యిందంటే హౌస్ మేట్స్ తో పాటు, ఫ్యాన్స్ కూడా నమ్మలేకపోతున్నారు. ఇనయా మొదటి నుండి తనదైన శైలిలో పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చింది. అయితే మొదటి వారాల్లోనే కొంచెం నోటి దురుసు ఉన్నా కూడా.. వారాలు గడిచేకొద్ది తనలో చాలా మార్పు వచ్చింది. ఎప్పటికప్పుడు ఆటతీరును, మాటతీరును మెరుగుపరుచుకుంటూ తనని తాను 'విన్నర్ మెటీరియల్' గా మార్చుకుంది ఇనయా. అలాంటిది తను ఎలిమినేట్ అవ్వడం అనేది ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఎలిమినేషన్స్ లో చివరి వరకు ఆదిరెడ్డి, ఇనయా ఉండగా, "ఇనయా యూ ఆర్ ఎలిమినేటెడ్. హౌస్ మేట్స్ కి బై చెప్పేసి వచ్చేయ్" అని‌ నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ఇక ఒక్కో హౌస్ మేట్ తమ అనుభవాలను పంచుకున్నారు. "బయట కలుద్దాం స్టోరీ లు చెప్పుకుందాం" అని ఆదిరెడ్డి మాట్లాడాడు. "నో రీగ్రేట్స్ ఇనయా" అని రేవంత్ చెప్పగా, "అందరితో మాట్లాడు ఇనయా" అని శ్రీహాన్ చెప్పాడు.

నువ్వు అమ్మాయివి కాదని తెలిసే ఇంకో పెళ్లి చేసుకున్నా!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోస్ లో లేడీస్ మీద పంచ్ డైలాగ్స్ మరీ శృతి మించిపోతున్నాయి. హైపర్ ఆది దారిలోనే ఇమ్మానుయేల్ కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇమ్మానుయేల్, వర్ష ఇద్దరూ రీల్ జోడి అన్న విషయం అందరికీ తెలుసు. సందు దొరికితే చాలు ఇమ్ము వర్ష మీద కుళ్ళు జోకులు వేస్తూ చాలా హర్ట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో వర్ష కూడా ఒక్కోసారి కౌంటర్ వేస్తుంది లేదంటే సైలెంట్ గా ఉంటుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య కొంత కాలం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కొన్ని ఎపిసోడ్స్ లో కూడా బాగా ఫోకస్ అయ్యింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇమ్ము తన పాత స్టైల్ లోనే వర్ష మీద జోకులు వేయడం స్టార్ట్ చేసాడు.  ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో చూస్తే గనక ఇమ్మానుయేల్ మహారాజు గెటప్ వేశాడు. ఇక ఆయనకు భార్యగా వర్ష నటించింది. "నేను ఉండగా మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్?" అని వర్ష స్కిట్ లో భాగంగా ఒక డైలాగ్ చెప్పేసరికి "నిన్నుపెళ్లి చేసుకున్నాకే తెలిసింది అమ్మాయివి కాదని, అందుకే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా" అని  సెటైర్ వేశాడు. ఇలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు స్కిప్ చేయాలని కూడా తెలీకుండా మరీ ఇలా ఒక అమ్మాయిని అవమానించండం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు ఆడియన్స్. "నువ్వు అమ్మాయి కాదు" అనగానే వర్ష మొహం సీరియస్ గా మారిపోయింది. మరి వర్ష ఇమ్మూకి రివర్స్ కౌంటర్ వేసిందా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

నాగార్జున ఆదిరెడ్డిని టార్గెట్ చేసాడా!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, టాస్క్ లలో వాళ్ళు చేసిన పర్ఫామెన్స్ గురించి మాట్లాడాడు. నాగార్జున మాట్లాడుతూ "బిగ్ బాస్ హిస్టరీ లో‌ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో ‌ఆఫ్ ది సీన్ చూపిస్తా" అని చెప్పి, గోస్ట్ టాస్క్ లో కంటెస్టెంట్స్ భయపడిన తీరును చూపించాడు. అందులో‌ ఆదిరెడ్డి భయపడిన విధానం హైలైట్ గా నిలిచిందని చెప్పగా, శ్రీసత్య బాగా చేసిందని, శ్రీహాన్ కూడా ‌బాగా చేసాడని చెప్పాడు. "సర్ అందులో నా పర్ఫామెన్స్ చూపించలేదు" అని అడుగగా ‌"నువ్వు ఎక్కడ భయపడ్డావ్" అని నాగార్జున ‌అన్నాడు. "నాకు యాక్ట్ చేయడం రాదు సర్.. నేను నాలాగే  ఉంటాను" అని రేవంత్ అనగా "అంటే ఏంటి.. ఇప్పుడు శ్రీహాన్ యాక్ట్ చేసాడని అంటున్నావా రేవంత్" అని నాగార్జున చెప్పగా, "నా వీడియో వద్దు సర్" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత "ఏం ఆదిరెడ్డి.. శ్రీహాన్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడా" అని అడుగగా, "ఏమో‌ సర్.. నాకైతే సరిగ్గా గుర్తులేదు" అని‌ ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత "ఏం ఆదిరెడ్డి నువ్వు పెద్ద ఫ్లిప్పర్ ? అని అంటున్నారు ప్రేక్షకులు" అని నాగార్జున అడుగగా, "నేను ఎప్పుడు వేరే వాళ్ళ గురించి వాళ్ళ వెనుకాల మాట్లాడను సర్. కచ్చితంగా నాకు తెలియదు సర్. ఎందుకంటే నేను ఏదీ పర్ఫెక్ట్ గా చేయాలనుకోను" అని ఆదిరెడ్డి చెప్పాడు. అయితే ఇలా నాగార్జున, ఆదిరెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడటం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. 

సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ సమస్యలను అడిగి తెలుసుకున్న సుమ!

క్యాష్ షో ప్రతీ వారం సరికొత్తగా అలరిస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి మహేష్, మధునందన్, రాజ్ కుమార్, మహేష్ విట్టా వచ్చారు. ఇందులో సుమ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ డిమాండ్స్ ని అడిగి తెలుసుకుంది. "మాకు వర్క్ టైం తగ్గించి, రెస్ట్ ఎక్కువగా ఇవ్వాలి" అని ఆడియన్స్ ఆన్సర్ చేశారు.  జావా అంటే ఏమిటి అని సుమ అడిగేసరికి "సగ్గు జావా, నూకల జావా" అని ఆన్సర్ ఇచ్చాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మహేష్. "అసలు నువ్వెందుకు ఆన్సర్ చెప్పావ్ నిన్ను అడిగానా" అని ఫైర్ అయ్యింది సుమ. "మీరు లాప్ టాప్ లు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటున్నాయి కానీ మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండడం లేదు" అని సీరియస్ అయ్యాడు రాజ్ కుమార్. "నా కేబిన్ చుట్టూ అమ్మాయిలు ఉండాలి" అని ఒక ఆడియన్స్ నుంచి ఒక కుర్రాడు చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇలా ఈ వారం క్యాష్ షో ఎంటర్టైన్ చేయబోతోంది.

బీబీ జోడీలతో అదిరిపోయే డాన్స్ రియాలిటీ షో

బిగ్ బాస్ ప్రతీ సీజన్ సరికొత్తగా స్టార్ట్ అవుతూ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ టీమ్ సరికొత్త షోని తెర మీదకు తీసుకురాబోతున్నారు. ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో చాలామంది మంచి డాన్సర్స్ ఉన్నారు. ఇక వాళ్ళ టాలెంట్ ని ఫుల్ గా వాడేసుకుని ఆడియన్స్ అటెన్షన్ ని తమ వైపు తిప్పుకోవడానికి సరికొత్తగా 'బీబీ జోడి' పేరుతో అదిరిపోయే డాన్స్ రియాలిటీ షోని త్వరలో స్టార్ మాలో ప్రసారం చేయడానికి సిద్ధం చేశారు. ఇక ఈ షోకి సంబంధించిన కలర్ ఫుల్ ప్రోమో ఒకటి రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్.  "బీబీ కోరిక మేరకు ఇంటి సభ్యులంతా డాన్స్ చేయండి" అని బిగ్ బాస్ వాయిస్ తో ఈ ప్రోమో మొదలయ్యింది. ఇక ఈ షోలో జోడీలుగా ఎవరెవరు ఉన్నారు అంటే.. అర్జున్-వాసంతి, అఖిల్-తేజస్విని, అవినాష్-అరియనా, సూర్య-ఫైమా, మెహబూబ్-అష్షు, రవికృష్ణ-భాను, రోల్ రైడ-స్రవంతి, ఆర్జే చైతు-కాజల్.  ఇటీవలి కాలంలో డాన్స్ షోస్, కామెడీ షోస్ విపరీతంగా పెరిగిపోయాయి. అందులో భాగంగా ఇప్పుడు బీబీ టీమ్ కూడా ఇలా ప్లాన్ చేశారు. లోతుగా ఆలోచిస్తే ఇంకో విషయం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. బీబీ జోడీస్ తో ఈ షో చేస్తూ రాబోయే  కొత్త సీజన్ కోసం తమ ఆడియన్స్ ని ఇప్పటినుంచే ప్రిపేర్ చేస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఇక ఈ కొత్త షోని రోల్ రైడా రాప్ సాంగ్ తో స్టార్ట్ చేశారు. హోస్ట్ గా కలర్ ఫుల్ క్యూటీ, నాటీ మాటల స్వీటీ శ్రీముఖి స్టేజి మీద కార్ లోంచి దిగి "డాన్స్ అంటే ఇలా గ్రాండ్ గానే ఉంటుంది" అని షో గురించి చెప్పి పెర్ఫార్మర్స్ తో కలిసి డాన్స్ చేసింది.