అస్మిత హోం టూర్.. ఇల్లు కాదు అది తెల్లని ఇంద్రభవనం!
నటిగా అస్మిత బుల్లితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద అందరికీ పరిచయమే. "యాష్ ట్రిక్స్" పేరుతో చేసిన వీడియోలతో కూడా ఆమె ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈటీవీలో ఒకప్పుడు ప్రసారమైన 'పద్మవ్యూహం' సీరియల్ తో పాటు మరెన్నో సీరియల్స్ లో నటించింది. అలాగే మహేష్ బాబు 'మురారి' మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసింది.
ఇక తర్వాత 'అగ్ని సాక్షి' సీరియల్ లో విలన్ రోల్ లో నటించింది. ఇక ఇప్పుడు అస్మిత యాక్టింగ్ కి బై బై చెప్పేసి యూట్యూబ్ మీద కాన్సంట్రేట్ చేస్తోంది. ఐతే రీసెంట్ గా సోషల్ మీడియాలో అస్మిత హోమ్ టూర్ కి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. మొదట్లో ఈ ఇంటిని చూసినప్పుడు డబ్బాలా ఉంది.. దీంతో ఏం చేయాలి అనుకున్నాం కానీ ఆర్కిటెక్ట్స్ ని పిలిచి నచ్చిన విధంగా ఇంటిని మోడిఫై చేసుకున్నామని చెప్పింది. ఇల్లంతా ఎక్కువగా వైట్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక కిచెన్ ఐతే బెడ్ రూమ్ కన్నా చాలా బాగుంది. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తోంది.
ఇక చిన్న లివింగ్ రూమ్, టు బెడ్ రూమ్స్, మామూలువి మూడు గదులు, రొటేటింగ్ షెల్ఫ్ చూపించింది. అలాగే స్పానిష్ టైల్స్ తో డిజైన్ చేయించుకున్న బాల్కనీ కూడా అదిరిపోయింది. అన్ని రకాల వస్తువులు కొనేయకుండా, ఏది అవసరమో అవే కొనుక్కుని వాటినే జాగ్రత్తగా వాడుకుంటామని చెప్పింది. ఇల్లు మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ అని చూపించింది. ఇక స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న సిటౌట్, హోమ్ థియేటర్ ని అందులో తమ కొత్త వెబ్ సిరీస్ ని కూడా చూపించింది. ఇలా అస్మిత, సుధీర్ తమ ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పారు.