శేఖర్ మాష్టర్ నడుము గిల్లిన నాగబాబు

త్వరలో దీపావళి పండగ రాబోతున్న సందర్భంగా ఆల్రెడీ షోస్ అన్నీ కూడా ఆ కాన్సెప్ట్ మీద రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈటీవీలో "ఈ దీపావళికి మాస్ జాతర" పేరుతో ఆల్రెడీ ఒక షో రెడీ అయ్యింది. ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ కనిపించాడు. అలాగే నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. "ప్రతీ ఈవెంట్ జాతరలా ఉంటుంది. ఈ ఈవెంట్ మాస్ జాతరలా ఉంటుంది." అని చెప్పాడు ప్రదీప్. " ది రియల్ ఓజిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ బ్యాక్" అంటూ నాగబాబు, శేఖర్ మాష్టర్ ని స్టేజి మీదకు పిలిచాడు. "ఈ దీపావళి వచ్చే దీపావళి వరకు యాద్ ఉంటది" అని చెప్పాడు ప్రదీప్. "మీ స్మైల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు తెలుసా బాబు గారు" అన్నాడు శేఖర్ మాష్టర్. "ఊరుకో శేఖర్.. నీ డాన్స్ కి మాత్రం ఎంత మంది ఫాన్స్ ఉన్నారు" అంటూ ఆట పట్టించడానికి నాగబాబు శేఖర్ మాష్టర్ నడుము గిల్లేసాడు. ఇక శేఖర్ మాష్టర్ ని చూసి ఆది తెగ నవ్వేసాడు. ఇక బుల్లితెర మీద కనిపించే హీరోయిన్స్, కమెడియన్స్ అంతా వచ్చి డాన్స్ లు వేశారు. అలాగే చివరికి అందరూ కలిసి దీపావళి టపాసులు కాల్చి పండగను సెలెబ్రేట్ చేసుకున్నారు.

bigg boss 9 Telugu : రీతూ చేసిన తప్పుకి సంజన-ఫ్లోరాలకి శిక్ష.. అదే బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్  సీజన్-9 అయిదో వారం కంటెస్టెంట్స్ ఎమోషన్స్ పీక్స్ కి వెళ్తున్నాయి. కథలో మలుపు, ట్విస్ట్ లు అన్నట్టుగా అయిదో వారం ఆట సాగుతుంది. డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ తమ ఆటతీరు మెరుగుపరుచుకున్బారు. మరోవైపు ఇమ్మాన్యుయల్ ఇరగదీస్తున్నాడు. ఇక రాము రాథోడ్ బెస్ట్ సంఛాలక్ గా చేస్తున్నాడు.  నిన్నటి ఎపిసోడ్ లో..  కంటెస్టెంట్స్ ని టీమ్ లుగా విభజించి కొన్ని టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. భరణి-దివ్య ఒక టీమ్, సంజన-ఫ్లోరా ఒక టీమ్, రీతూ-డీమాన్ పవన్ ఒక టీమ్, తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ  టీమ్ లుగా ఉన్నారు. ఇక మొదటి టాస్క్ 'పట్టు వదలకు' లో డీమాన్ పవన్-రీతూ టీమ్ గెలిచింది. టాస్క్ లో పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో డీమాన్ పవన్, భరణి చివరి వరకు ఉన్నారు. కానీ చివర్లో భరణి నొప్పి భరించలేక వదిలేశాడు. దాంతో డీమాన్ పవన్ గెలిచాడు. ఇక ఈ టాస్క్ లోని అందరికి వారి పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్స్ ఇచ్చాడు బిగ్ బాస్.  ఇక రెండో టాస్క్ లో ఈ  టీమ్ లు పాల్గొంటాయి. దానికి సంచాలక్ గా ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ ఉన్నారు.  ఇక సెకెండ్ టాస్క్ లో బెలూన్ ఊది గాలిలో ఉంచాలి.. అయిదు నిమిషాలు అయిందని మీకు అనిపిస్తే వెళ్లి గంట కొట్టండి అని టీమ్ లకి బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. అయితే ఈ రూల్స్ ను రీతూ, డిమాన్ కంప్లీట్ గా మిస్ లీడ్ చేశారు. ఇద్దరు ఫౌల్ ఆడుతారు. వాళ్ళని చూసి తనూజ- కళ్యాణ్ అలాగే ఆడుతారు. అలాగే వాళ్ళని చూసి శ్రీజ-సుమన్ శెట్టి ఆడతారు. భరణి- దివ్య ఇద్దరు బాగానే ఆటినా వారికిచ్చిన మూడు బెలూన్లు పగిలిపోవడంతో కౌంట్ అవ్వలేదు. గేమ్ ఫౌల్ లేకుండా పర్ఫెక్ట్ గా ఆడింది మాత్రం సంజన-ఫ్లోరా మాత్రమే. అయితే ఈ బెలూన్ టాస్క్ పూర్తయ్యాక అందరిపై కోప్పడుతాడు బిగ్ బాస్. ఈ స్కూల్ కి నేనే ప్రిన్సిపల్.. నా ముందే మీ వేషాల అన్నట్లు అందరికి మాస్ వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్.  ఆ తర్వాత ఇక మీకు నచ్చింది చేసుకోండి అని బిగ్ బాస్ అనగానే అందరు సారీ చెప్తారు. తప్పు చేసినందుకు మీకు ఇది వరకు టాస్క్ లో వచ్చిన పాయింట్లలో నుండి సగం తీసేస్తున్నాను.. ఒక్క సంజన-ఫ్లోరా టీమ్ కి మాత్రం పాయింట్స్ అలాగే ఉంటాయని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో సంజన ఫ్లోరా టీమ్  పాయింట్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటారు. ఈ టాస్క్ లో గెలుపు దగ్గరిదాకా వచ్చి ఓడిపోయినందుకు సంజన ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే వారు గేమ్ గెలిచారు‌.‌ కానీ  రీతూ చేసిన ఫౌల్ వల్ల అందరికి శిక్ష వేశాడు బిగ్ బాస్. ఒక్కరి వల్ల అందరికి శిక్ష వేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్. గెలుపు వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ వచ్చి సంజనని ఓదారుస్తారు. ప్రతీసారి ఓడిపోతూ ఉండటం నచ్చట్లేదు.‌ ఓడిపోయిన చోట ఎవరుంటారు చెప్పు అంటూ ఇమ్మాన్యుయల్, రాములతో సంజన చెప్పుకుంటూ ఏడుస్తుంది. 

Bigg boss 9 Telugu : పట్టు వదలకు టాస్క్ లో డీమాన్ పవన్ గెలుపు.. గట్టి పోటీ ఇచ్చిన భరణి!

బిగ్ బాస్  సీజన్-9 అయిదో వారం లో కెప్టెన్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు. ఇక అయిదో వారం చివర్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ల ఎంట్రీ ఉంటుందని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి(మంగళవారం) నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీలని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతారు. అలాగే సంజనా తనకిచ్చిన పనిష్మెంట్ అంట్లు తోమడం చేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంది. ఇక ఇలా కాసేపు వీరి కబుర్లు చూపించిన బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేశాడు. ఇక అందులో అప్పటికే డేంజర్ జోన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ లు పెట్టి, బార్డర్ లు కూడా కట్టేశాడు బిగ్ బాస్. 'రణరంగం మీ ఊహలకి అందని ప్రదేశం.. ఈ వారం డేంజర్‌లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది.. వచ్చే ఫైర్ స్టార్మ్ డేంజర్‌లో ఉన్నవారిని కుదిపేస్తుంది.. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో మీకు తెలుసా.. వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ తుఫాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒకే ఒక్క ఛాన్స్' అంటూ కంటెస్టెంట్స్ కి దడ పుట్టించాడు బిగ్ బాస్.  వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఆపాలంటే మీరు కొన్ని టాస్క్ లు ఆడాలని కంటెస్టెంట్స్ ని టీమ్ లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ లని ఈ టాస్క్ లకి సంచాలకులుగా నియమించాడు. భరణి-దివ్య ఒక టీమ్, సంజన-ఫ్లోరా ఒక టీమ్, రీతూ-డీమాన్ పవన్, తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ  టీమ్ లుగా ఉన్నారు. మొదటి టాస్క్..  పట్టు వదలకు .. ఇందులో పోటీ పడే వాళ్ళు తమ సీసాని చివరివరకూ ప్లాట్‌ఫామ్‌కి టచ్ కాకుండా చూసుకోవాలి. వారే ఈ టాస్కు విజేతలు అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో మొదటగా సుమన్ శెట్టి ట్రాప్ అవుతాడు. ఆ తర్వాత సంజనా ట్రాప్ అవుతుంది. కాసేపటికి పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతాడు. ఇక చివరగా డీమాన్ పవన్, భరణి ఉంటారు.  చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన భరణి నొప్పి భరించలేక డ్రాప్ అవుతాడు.‌ ఇక 'పట్టు వదలకు' టాస్క్ లో డీమాన్ పవన్-రీతూ టీమ్ గెలుస్తుంది. ఇక టాస్క్ లో పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. డీమాన్-రీతూ గెలిచారు కాబట్టి వారికి వంద పాయింట్లు వచ్చాయి. ‌ఇక రెండో స్థానంలో లో భరణి-దివ్య,  మూడవ స్థానంలో తనూజ-కళ్యాణ్, నాల్గవ స్థానంలో సంజన-ఫ్లోరా, అయిదవ స్థానంలో సుమన్ శెట్టి-శ్రీజ ఉన్నారు.

Bigg Boss 9 Telugu:ఓటింగ్ లో తనూజ టాప్.. డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం క్రేజీగా సాగుతుంది. కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతూ బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. గతవారం వరకు వీక్ అనుకున్న కంటెస్టెంట్స్ అంతా అయిదో వారం చెలరేగిపోతున్నారు. ఇమ్మ్యూనిటీ పొందాలని టాస్క్ లలో తమ సత్తా చాటుతున్నారు. హౌస్ లో కంటెస్టెంట్స్ ఆటతీరుని చూసిన ఆడియన్స్ అదే రేంజ్ లో ఓటింగ్ వేస్తున్నారు. హౌస్ లో నిన్న జరిగిన టాస్క్ లో బాగా ఆడినవారికి ఓటింగ్ పెరిగింది. అయిదో వారం పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలు నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్పించి మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌ లో ఉన్నారు. ఇక అనఫీషియల్ వోటింగ్ ప్రకారం తనూజ 19.44 శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ గా నిలిచింది. గత వారం రీతూ చౌదరి వెన్నుపోటుతో కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిన పడాల పవన్ కళ్యాణ్ కు కూడా మెరుగైన ఓటింగ్ లభిస్తోంది. నాగార్జున క్లాస్ తీసుకోవడంతో పవన్ ఆటతీరులో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. టాస్క్ లలో మన సైనికుడు అరివీర భయంకరంగా రెచ్చిపోతున్నాడు. తాజా ఓటింగ్ లో 15.82 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. రీతూ చౌదరి, డీమాన్ కి  తక్కువ ఓటింగ్ పడుతోంది. అలాగే శ్రీజకి కుడా ఓటింగ్ తక్కువనే ఉంది. స్వల్ప ఓట్ల తేడాతో రీతు చౌదరి, డీమాన్, శ్రీజ లీస్ట్ లో ఉన్నారు. ఈ వారం వీరి ముగ్గురిలో నుండే ఎలిమినేషన్ అనేది ఫిక్స్. మరి వీరిలో ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Jayam serial : ఇషిక గీసిన స్కెచ్ లో బలైన గంగ.. రుద్ర ఆన్ ఫైర్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -78 లో.....గంగ ఎక్కడికి వెళ్ళింది కన్పించడం లేదని పెద్దసారు వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే గంగ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని గంగ చెప్పడంతో ఇషిక ఇండైరెక్ట్ గా గంగతో మాట్లాడుతుంది. వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్ట్ తీసుకోమని ఇషిక అంటుంది. ఆ తర్వాత ఇషిక శకుంతల దగ్గరికి వెళ్లి గంగ ఈ ఇంటికి కోడలుగా వచ్చేలా ఉందని అంటుంది. ఏం అంటున్నావ్ నువ్వు.. గంగని రుద్ర నాకు దగ్గర కావడం కోసం వాడుకుంటున్నాడని ఇంట్లో నుండి పంపిస్తానన్నానని శకుంతల అంటుంది. మీరే చూడండి అని గంగ పార్క్ వెళ్ల గెటప్ చేంజ్ చేసి రుద్రని కలిసిన వీడియోని శకుంతలకి ఇషిక చూపిస్తుంది. దాంతో శకుంతల షాక్ అవుతుంది. మరొకవైపు ఇషిక ఇంట్లో అందరికి టీవీలో ప్లే చేసి వీడియో చూపిస్తుంది. అందరు అది చూసి షాక్ అవుతారు. రుద్ర కూడా ఆ వీడియో చూస్తాడు. స్నేహ గంగని తీసుకొని రావడానికి గదిలోకి వెళ్తుంది. రుద్ర ఇచ్చిన చాక్లెట్ తింటుంది. అప్పుడే ఒక ఆమె వచ్చి నిన్ను అందరు రమ్మంటున్నారని గంగని తీసుకొని వెళ్తుంది. గంగ వెళ్లి ఆ వీడియో చూస్తుంది..నేను కాదని మొదట అంటుంది. ఇషిక మొత్తం వీడియో చూపిస్తుంది. దాంతో గంగ టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో గంగని రుద్ర కొట్టబోయి ఆగిపోతాడు. నిన్ను నమ్మాను.. ఇలా చేస్తావ్ అనుకోలేదని కోప్పడతాడు. శకుంతల కూడా గంగపై కోప్పడుతుంది. గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : సివంగిలా రెచ్చిపోయిన ప్రేమ.. శ్రీవల్లికి వార్నింగ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -283 లో..... భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి హార్ట్ ఎటాక్ డ్రామా ఆడి రామరాజు ఇంటి నుండి బయల్దేరతారు. తప్పించుకున్నామని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నర్మద ఎదురుపడుతుంది. తనని చూసి ఇద్దరు షాక్ అవుతారు. మీరు యాక్టింగ్ చేస్తున్నారని నాకు తెలుసు.. అసలు ప్రేమ ఫోటోస్ గురించి తన పుట్టింట్లో ఎందుకు చెప్పారని వాళ్ళని నర్మద నిలదీస్తుంది. ఏదో మాట వరుసకి చెప్పామని భాగ్యం అంటుంది. నాకు మీరు మాట వరుసకి చెప్పినట్టు అనిపించడం లేదు.. ఒకవేళ ఇందులో ఏదైనా రహస్యం ఉందని తెలిస్తే.. మీ సంగతి చెప్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు ఒకవేళ మేమే ఫోటోస్ గురించి వాళ్ళింట్లో చెప్పామని ప్రేమకి తెలిస్తే పరిస్థితి ఏంటని శ్రీవల్లి భయపడుతుంది. దాంతో ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. ఏదో మాట వరుసకి నేను మా అమ్మకి చెప్పాను.. మా అమ్మ మీ వాళ్ళతో అందని శ్రీవల్లి కూల్ గా చెప్తుంది. దాంతో ప్రేమ సివంగిలాగా తన పైకి కోపంతో లేస్తుంది. మీ బండారం ఇప్పుడే బయటపెడతానని ప్రేమ వెళ్తుంటే.. నర్మద వచ్చి ఆపుతుంది ఇద్దరు కలిసి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తారు. నాకు వార్నింగ్ ఇస్తారా.. మీ సంగతి చెప్తానని శ్రీవల్లి అనుకుటుంది. మరొకవైపు బతుకమ్మ చేయడానికి కావల్సిన పువ్వుల కోసం అన్నదమ్ములు వెళ్తారు. ఆ తర్వాత అసలు రాత్రి ధీరజ్ నాకు ముద్దు పెట్టాడా లేదా అని ప్రేమ ఆలోచిస్తుంది‌. నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ప్రేమ బ్యాచిలర్ పార్టీలో జరిగింది మొత్తం చెప్తుంది. అసలు ధీరజ్ నాకు ముద్దు పెట్టాడో లేదో తెలియదు.. మరి నువ్వు చూడలేదా అని నర్మద అడుగుతుంది. లైట్ గా డ్రింక్ చేసానని ప్రేమ చెప్తుంది. అక్క నువ్వే ధీరజ్ ని కనుక్కో ప్లీజ్ నేను దేనిపై కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతున్నానని ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. అడుగు అక్కా అని నర్మదకి చెప్పి ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధీరజ్ మొన్న బ్యాచిలర్ పార్టీలో ఏదో అయిందట అని నర్మద అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కార్తీక్ ని మెచ్చుకున్న శివన్నారాయణ.. దీప హ్యాపీ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -482 లో.. శివన్నారాయణ కార్తీక్ చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ పెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. తప్పు చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి జ్యోత్స్న అని శివన్నారాయణ అడుగగా మెడ పట్టుకొని బయటకు గెంటెయ్యలని జ్యోత్స్న అంటుంది. నోరు ముయ్ అని జ్యోత్స్న పై శివన్నారాయణ విరుచుకుపడుతాడు. పదకొండు కోట్ల నష్టం నుండి కాపాడాడు కార్తీక్ అని శివన్నారాయణ చెప్తుంటే అందరు షాక్ అవుతారు. వేలంపాట నుండి జ్యోత్స్న ని వచ్చేలా చేసింది వాడు.. జ్యోత్స్నని ఎందుకు తప్పు పడుతున్నారని సుమిత్ర అడుగుతుంది. అసలేం జరిగిందో అందరికి చెప్పమని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. దాంతో వైరాకి దశరథ్ ఫోన్ చేస్తాడు. చివరి వరకు వేలంపాట పాడి నిన్ను నష్టాల్లో పారెద్దామనుకున్న టైమ్ కి నీ కూతురుకి ఫోన్ చేసి రప్పించావ్ కదా అని వైరా అంటాడు. అసలు ఫుడ్ సెక్యూరిటీ  వాళ్ళు వచ్చారని కాల్ చేయించింది కూడా జ్యోత్స్ననే.. కార్తీక్ ని అక్కడే ఉంచి వెళ్ళాము.. కార్తీక్ ఫోన్ చేసి అక్కడ జరుగుతుంది మొత్తం చెప్పాడని దశరథ్ అందరికి చెప్తాడు. ఇక ఏం చెయ్యాలో తెలియక ఫేక్ కాల్ చేసి జ్యోత్స్న బయటకు వచ్చేలా చేసానని కార్తీక్ అంటాడు. నీలాంటి వాడు ఇక్కడ పని వద్దు నీకు టాలెంట్ ఉందని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న మేడమ్ వద్దంటే వెళ్ళిపోతానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్ దగ్గరికి సుమిత్ర వచ్చి హాల్లోకి తీసుకొని వెళ్తుంది. నా చేతిలో చెయ్ వేసీ నిజం చెప్తానని మాటివ్వు అనగానే కార్తీక్ మాటిస్తాడు. అసలు నీకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం వచ్చినా చేసుకోకుండా ఎందుకు ఉన్నావని సుమిత్ర అనగానే నీ కూతురు కోసమని కార్తీక్ అంటాడు. మొత్తం తర్వాత అర్థం అవుతుందని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్, దీప కిచెన్ లోకి వెళ్ళిపోతారు. నిజం చెప్పావ్ బావ కానీ వాళ్ళకి అర్ధం కాలేదని దీప అంటుంది. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. నా కోసం ఎందుకు ఉన్నావని జ్యోత్స్న ఆడుగుతుంది. కూతురు అంటే నువ్వు కాదా ఏంటి అని కార్తీక్ అనగానే పారిజాతం, జ్యోత్స్న టెన్షన్ పడుతారు. నీకు బుద్ది చెప్పడానికి అని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. పారిజాతం, జ్యోత్స్న కన్ఫ్యూషన్ లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య ప్లాన్ ఫెయిల్..... రాజ్ తగ్గేదేలే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -845 లో......రాజ్ భోజనం చెయ్యడానికి వస్తాడు. అక్కడే అపర్ణ, ఇందిరాదేవి, కావ్య ఉంటారు కానీ రాజ్ పిలిచిన వడ్డించడానికి ఎవరు పోరు.. దాంతో రాజే వడ్డించుకొని తింటాడు. ఆ తర్వాత రాజ్ గదిలోకి పడుకోవడానికి వస్తాడు. మీరు ఇక్కడేం వద్దు బయట హాల్లో పడుకోండి అని రాజ్ ని కావ్య బయటకు పంపిస్తుంది. రాజ్ హాల్లోకి వస్తాడు. మరొకవైపు సుభాష్ నిద్రపోతుంటే కొడుకు, కోడలు అలా ఉంటే ఈయన మంచిగా పడుకుంటాడా అని అపర్ణ నిద్ర లేప్తుంది. రాజ్ కావ్య సఖ్యతగా ఉండేంత వరకు మీరు హాల్లోనే పడుకోవాలని సుభాష్ ని అపర్ణ పంపిస్తుంది. రాజ్ దగ్గరికి సుభాష్ వెళ్తాడు. నాకు అదే పరిస్థితి అంటూ ప్రకాష్ ఎంట్రీ ఇస్తాడు. రాజ్ ఇవన్నీ ఎందుకురా నువ్వు అసలు నిజం ఏంటో చెప్పమని రాజ్ ని సుభాష్ రిక్వెస్ట్ చేస్తాడు. రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరుసటి రోజు రాజ్ స్నానం చేస్తుంటే కావ్య, ఇందిరాదేవి కలిసి వాటర్ ఆఫ్ చెయ్యాలని ప్లాన్ చేస్తారు. వాటర్ ఆగిపోవడంతో రాజ్ ఏమైందని అడుగుతాడు. నేనే ఆఫ్ చేశాను.. ఇప్పుడు నిజం చెప్పండి బిడ్డని ఎందుకు వద్దని అనుకుంటున్నారోనని అని కావ్య అడుగుతుంది కానీ రాజ్ మాత్రం నిజం చెప్పడు. మరొకవైపు అప్పు డల్ గా ఉంటుంది. అది చూసి ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి తనని తీసుకొని వచ్చి.. అప్పుని చూపిస్తుంది.‌ నీ కోడలు ప్రెగ్నెంట్ కదా అలా ఉంటే ఎలా అని ఇదంతా కావ్య వల్లే అని ధాన్యలక్ష్మితో రుద్రాణి చెప్తుంది. తరువాయి భాగంలో అప్పు కళ్ళు తిరిగిపడిపోతుంది. నా కోడలు అలా అవ్వడానికి కారణం నువ్వేనని కావ్యని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు

జబర్దస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ గా శ్రీదేవి విజయ్ కుమార్, కృష్ణ భగవాన్ వచ్చారు. ఇక నూకరాజు, కొమరక్కా ఇద్దరూ కలిసి ఒక స్కిట్ వేశారు. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు. "మిడిల్ క్లాస్ అంటే ఏమిటి" అని కొమరక్కా అడిగేసరికి " పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు" అంటూ నూకరాజు చెప్పారు. "పైసలు తక్కువున్నప్పుడు పిల్లలెందుకు ఎక్కువ" అని అడిగింది. "రిచ్ పర్సన్..పని తప్ప వేరే కోరిక ఉండదు. మిడిల్ క్లాస్. కోరికలు తప్ప పనులే ఉండవు" అని చెప్పాడు. ఇక రాంప్రసాద్, సున్ని కలిసి వేసిన స్కిట్ లో బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాడు. "మన బెస్ట్ ఫ్రెండ్ ఏరా మనం నాశనమైపోవాలని కోరుకుంటాడు ఫస్ట్" అన్నాడు రాంప్రసాద్. "అదేంట్రా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వేగా" అన్నాడు సున్ని. "నీకు మందు అలవాటు చేసింది. నీ కెరీర్ డల్ కావడానికి కారణం ఎవరు" అనేసరికి "నువ్వు" అన్నాడు సన్నీ. "ఇప్పుడు నేనేమవుతాను" అన్నాడు రాంప్రసాద్. "నువ్వు " అన్నాడు. ఇక లాస్ట్ లో బులెట్ భాస్కర్, ఫైమా కలిసి ముష్టి వాళ్ళలా గెటప్ వేసుకుని స్కిట్ చేశారు. "ఇంద్రజ అమ్మగారు వస్తున్నారు వెళ్లి అడుక్కో" అంటూ ఫైమా భాస్కర్ కి చెప్పింది. "సావమన్నా సస్తాను కానీ ఆవిడని అడుక్కొను. ఎందుకంటే భాస్కర్ గారు బొచ్చు లెఫ్ట్ హ్యాండ్ లో కాదండి రైట్ హ్యాండ్ లో ఉండాలి. అడుక్కునేటప్పుడు వాయిస్ లో డెప్త్ ఉండాలి. మీ పెర్ఫార్మెన్స్ లో సిజిలింగ్ ఉండాలి" అంటారు అంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇక భాస్కర్ వాళ్ళ నాన్న ఐతే కౌంటర్ వేసాడు. "వైజాగ్ లో రోడ్ ల మీద చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారమ్మా మాకు. ఈడు అక్కడి నుంచి తప్పిపోయి వచ్చాడనుకున్నాను." అనేసరికి భాస్కర్ నవ్వేసాడు.

శ్రీముఖి అసలైన రాధికా...డిజె టిల్లు కౌంటర్

  జీ కుటుంబం 2025 అవార్డ్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ ప్రోమోలో "తెలుసు కదా" మూవీ టీమ్ నుంచి సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా వచ్చారు. అలాగే సీరియల్స్ నుంచి కొంతమంది లేడీ యాక్టర్స్ కూడా వచ్చారు. డిజె టిల్లు మూవీలో రాధికా రోల్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఈ అవార్డ్స్ ఈవెంట్ కూడా రాధికా రోల్ మీదనే నడిచింది. ఈ షోకి హోస్ట్స్ గా ప్రదీప్, శ్రీముఖి ఉన్నారు.  "మా ప్రతీ సీరియల్ లోనూ ఒక రాధికా ఉంటుంది" అని ప్రదీప్ అనేసరికి. "రాధికా లైఫ్ లోనే ఉంటుంది సర్" అన్నాడు సిద్దు. "నాకు లైఫ్ అప్పుడప్పుడు రాధికలా ఉంటుంది" అన్నాడు ప్రదీప్. "ఇప్పుడు మీ ముందుకు కొంతమందిని ప్రెజెంట్ చేస్తాను. వాళ్లలో రాధికా ఎవరో చెప్పాలి" అన్నాడు ప్రదీప్. "మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డ్రెస్సింగ్ ని బట్టి రాధికా తెలిసిపోతుంది" అంటూ శ్రీముఖి చెప్పింది. "నీ గోల ఏంటి మధ్యలో.." అంటూ శ్రీముఖి మీద సిద్దు సెటైర్స్ వేసాడు. ఆ యాక్టర్స్ లో ఒకమ్మాయిని చూసి రాధికా అని అన్నాడు సిద్దు. "రైట్ ఆన్సర్. వచ్చి హగ్ చేసుకో  " అని శ్రీముఖి చెప్పేసరికి ప్రదీప్ వచ్చి "ఆయన ఏ డెసిషన్స్ లేవా" అని అడిగాడు. "అసలు రాధికా" అంటూ శ్రీముఖిని ఆటపట్టించాడు సిద్దు.  సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ పేరుతో వచ్చిన మూవీస్ ద్వారా అందరికీ ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా సిద్దు, రాశి "తెలుసు కదా" అనే మూవీలో నటించారు. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రతీ షోని విజిట్ చేస్తున్నారు. ఇక ఈ నెలలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  

సింగపూర్ లో  కీర్తి సురేష్ క్రైమ్ స్టోరీ...

  జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి మోడరన్ మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక జగపతి బాబు మీదనే కీర్తి ఫుల్ సెటైర్స్ వేసింది. "నువ్వు మహానటివి అని తెలుసు...బయట పెద్ద మహానటివి" అనేసరికి "మీకు మహానాటీ" అంటూ కన్ను కొట్టి సరదాగా మాట్లాడింది కీర్తి సురేష్. "స్కూల్ లో ఎలా ఉండేదానివి" అనేసరికి "ఉందా మీ దగ్గర ఫోటో" అని అడిగింది. "అదిగో" అంటూ కీర్తి స్కూల్ ఫోటో చూపించారు. "పాకెట్ మనీ నీకు ఇచ్చేవాళ్ళా నువ్వు జేబులోంచి కొట్టేసేదానివా" అని అడిగారు. "జేబులోంచి తియ్యడం..ఆ సంతోషమే వేరు" అని చెప్పేసరికి జగపతి బాబు పగలబడి నవ్వారు. "సింగపూర్ లో నువ్వేదో క్రైమ్ లో ఇరుక్కున్నావ్ ఏంటది" అని అడిగారు. "అదొక్కటే తక్కువ..పోస్టర్ పెట్టేస్తారు స్టేషన్ లో " అంది కీర్తి. "అవును కుంభకర్ణి..ఆరు నెలలు తింటావ్ ఆరు నెలలు పడుకుంటావ్" అని అడిగేసరికి "కుంభకర్ణి.. నా గురించి మీకు అన్నీ తెలుసు.." అనేసింది కీర్తి. "సావిత్రి గారి బయోపిక్ ఎట్టాగో చూపించావ్ ఇప్పుడు నీ బయోపిక్ కి వెళదాం" అన్నారు జగపతి బాబు. "అన్ని చూస్తారు ఎంజాయ్ చేస్తారు" అంది కీర్తి. మహానటి సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులో కీర్తి సురేష్ నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. ఈ జెనెరేషన్ వాళ్లకు మహానటి సావిత్రి ఇలా ఉండేది అని చెప్పడానికి ఈ మహానటి మూవీ ఉపయోగపడుతుంది. అలాంటి కీర్తి సురేష్ జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చి ఎన్నో విషయాలను కిలకిలా నవ్వుతూ షేర్ చేసుకుంది.

Wild cards Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేది వీళ్ళే!

  బిగ్ బాస్ సీజన్-9 మొదలై నాలుగు వారాలు కంప్లీట్ అయి అయిదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నాలుగు వారాల్లో ప్రతీరోజు ఏదో ఒక కొత్తదనం కన్పిస్తుంది. అయితే ఇది పెద్దగా హిట్ అవ్వాలని భావించిన బిగ్ బాస్.‌. హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని నిన్నటి(సోమవారం) ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ చెప్తాడు. అయితే వైల్డ్ కార్డ్ గురించి బయట నెట్టింట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.  బిగ్‌బాస్ 2.0లో భాగంగా మరో ఐదుగుర్ని హౌస్‌లోకి పంపించబోతున్నాడు బిగ్ బాస్. ఐదవ వారం చివర్లో ఈ ప్రాసెస్ జరగనుంది. ఇప్పటికే రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్), దివ్వెల మాధురి (కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్), సుహాసిని (దేవత సీరియల్ ఫేమ్) .. ఈ ముగ్గురూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కన్ఫమ్ అయ్యినట్టు తెలుస్తోంది. తాజాగా ఆ లిస్ట్‌లో కావ్యశ్రీ కూడా చేరింది. గృహలక్ష్మి సీరియల్ లో కొడుకుగా చేసిన ప్రేమ్ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరితో పాటుగా ప్రభాస్ శీను కూడా ఉన్నాడని తెలుస్తోంది. అలాగే అఖిల్ రాజ్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  బిగ్ బాస్ సీజన్-9 లో ఇప్పటికే నలుగురు ఎలిమినేషన్ అయ్యారు. హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ తప్ప మిగిలిన అందరు నామినేషన్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వస్తే బాగుంటుందో‌ కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu : శ్రీజని బెడ్ పై నుండి పడేసిన భరణి.. బోరున ఏడ్చేసిన దివ్య!

  బిగ్ బాస్ సీజన్-9 విజయవంతంగా అయిదో వారంలోకి అడుగు పెట్టింది. దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఒక్క కెప్టెన్  రాము తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు.. బజర్ మొగినప్పుడల్లా బెడ్ పై నుండి కిందకి ఎవరు కాలు పెడతారో.. వాళ్ళకి ఇమ్మ్యూనిటీ లభించదు. చివరివరకు ఉన్నవాళ్ళకి ఇమ్మ్యూనిటీ పొంది నామినేషన్ నుండి సేవ్ అవుతారు. మొదటగా బెడ్ పై నుండి అందరు కలిసి సంజనని తోసేస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి ని తోసేస్తారు. తర్వాత దివ్యని తోసేస్తారు. అయితే దివ్య బయటకు వెళ్లకుండా చాలా ఫైట్ చేస్తుంది. అందరు కలిసి తనని తోసేస్తారు దాంతో దివ్య బయటకు వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత డీమాన్ పవన్, రీతూ బయటకు వెళ్తారు. భరణి, ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, తనూజ, శ్రీజ అందరు కలిసి ఎవరు దిగాలని డిస్కషన్ చేసుకుంటుండగా.. భరణి త్వరగా శ్రీజని బెడ్ పై నుండి తోసేస్తాడు. దాంతో శ్రీజ కోప్పడుతుంది. మీరు నిజంగా రేలంగి మావయ్య లాగే బెహేవ్ చేస్తున్నారు.. మీరంతా ఫ్రెండ్స్ కాబట్టి తనూజని బయటకి పంపలేదని శ్రీజ అనేస్తుంది.  అక్కడ తనూజ కూడా ఉంది కదా ఓహ్.. మీకు బాండింగ్ ఉంది కదా అని భరణిని ఉద్దేశ్యించి శ్రీజ అంటుంది. చివరగా బెడ్ పై భరణి, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఉంటాడు. వాళ్ళకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అందులో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు. ఇమ్మ్యూనిటి సాధించి నామినేషన్ నుండి సేవ్ అవుతాడు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్-9 లోకి ప్రభాస్ ఫ్రెండ్.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9వ సీజన్ రంజుగా సాగుతున్నది. సెలబ్రిటీలు వర్సెస్ కామన్ మ్యాన్ గ్రూపులకు మధ్య జరుగుతున్న వార్ అంచనాలకు మించి కొనసాగుతున్నది. సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గుకుండా కామన్ మ్యాన్స్ మాత్రం అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్, ఇలా ప్రతీ టాస్క్‌లోను రెండు గ్రూపులు సత్తా చాటుతున్నాయి. అయితే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2.O గురించి చర్చ జరుగుతున్నది.  బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో 2.O వెర్షన్‌లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. వారి ఎంట్రీ 5వ వారం చివర్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగర్ సాయితేజ్, టీవీ యాక్టర్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ గా కన్ఫమ్ అయినట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే వీరితో పాటు టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రభాస్ శీను కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ శీను ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు. విక్రమార్కుడు, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్, సింగిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సినిమాల్లో నటించాడు. కాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, శ్రీను ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచ్ మేట్స్ గా కూడా ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల్లో హీరోగా బిజీ అయిన తర్వాత పర్సనల్ అసిస్టెంట్ గా ప్రభాస్ డేట్స్ శ్రీనునే మేనేజ్ చేస్తున్నాడు. ఇటీవలే సింగిల్ సినిమాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ప్రభాస్ శీను చేతిలో మరో రెండు, మూడు సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలకు బ్రేక్ ఇచ్చి అతను బిగ్ బాస్ సీజన్-9 లోకి వస్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jayam serial :  వీరు ప్లాన్ జస్ట్ మిస్.. రుద్ర కనిపెడతాడా!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -77 లో.....గంగ నర్స్ గెటప్ లో వచ్చి రుద్రని కలుస్తుంది. చిట్టి ఎక్కడ అని రుద్ర అడుగగా.. ఇక్కడ ఎందుకు ఉంటుంది. స్కూల్ లో ఉంటుంది కదా అని గంగ అంటుంది. జోక్ చేయకు.. చిట్టి వాళ్ళ మేడమ్ ని ఎవరో కొట్టారట బెదిరించారట.. తను నాకు ఫోన్ చేసి రమ్మందని రుద్ర అంటాడు. అయ్యో నాకు తెలియదే ఇప్పుడు తెలియదని చెప్తే ఏమైనా అంటారేమో అని గంగ అనుకుంటుంది. ఆ తర్వాత కవర్ చేసి గంగ వెళ్ళిపోతుంది. ఇక రుద్ర ఏం చేస్తాడని గంగ పక్కకి దాక్కుని అతడినే  చూస్తుంది. చిట్టిని రుద్ర కలిసి మాట్లాడుతాడు. నిన్ను ఎవరు బెదిరించారు చెప్పమని అడుగుతాడు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుందని చిట్టి అంటుంది. మరొకవైపు హాస్పిటల్ లో కోమాలో ఉన్న వీరు తమ్ముడిని తీసుకొని వెళ్లడనికి మాస్క్ పెట్టుకొని ఒకతను వస్తాడు. అది సీసీటీవీ ద్వారా సూర్య చూస్తాడు. ఆ తర్వాత చిట్టీతో గొడవపడ్డ పారుని చిట్టి వెనకాల నుండి చూస్తుంది. అక్కడ ఉందని రుద్రని తీసుకొని వెళ్తుంది.. ఇక అక్కడికి వెళ్ళేలోపే పారు అక్కడ నుండి వెళ్తుంది. దాంతో చిట్టి డిస్సపాయింట్ అవుతుంది. పారుని వాళ్ళ అన్నయ్య అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. నువ్వు కాబోయే ఛాంపియన్ వి ఇలా చేస్తావా.. రుద్ర ఇలా చేసాడని సక్సెస్ లేదని వదిలేసావ్.. ఇప్పుడు నువ్వు సక్సెస్ ని వదులుకుంటావా అని తనని అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత పారు వెళ్తుంటే గంగ చూసి చిట్టి వాళ్ళతో గొడవ పడ్డది అదేనేమో.. ఆ పారు ఇది ఒకతే అయి ఉంటుందా.. అందుకే రుద్ర సర్ ని చూసి వెళ్ళిపోయి ఉంటుందా అని గంగ తనలో తనే కన్ఫ్యూషన్ అవుతుంది. గంగని ఫాలో అవుతున్న ఇషిక అంతా వీడియో తీసి.. నువ్వు ఇలా మోసం చేస్తున్న విషయం అందరికి చెప్తాననుకుంటుంది. మరొకవైపు చిట్టి తో రుద్ర మాట్లాడుతాడు. నీ ఫ్రెండ్ స్వీటీ కూడా వచ్చింది కదా అని రుద్ర అనగానే తన పేరు గంగ అని చెప్పేలోపు రుద్రకి సూర్య ఫోన్ చేసి హాస్పిటల్ లో ఉన్న ఆతన్ని తీసుకొని వెళ్తున్నారు. వీరు ప్రీతీ అక్కడే ఉన్నారని సూర్య చెప్తాడు. వెంటనే వీరుకి రుద్ర కాల్ చేసి అతన్ని అడ్డుకోమ్మంటాడు. వీరు అతన్ని అడ్డుకున్నట్టు యాక్ట్ చేస్తు వెళ్ళిపోమంటాడు. రౌడీ అతన్ని తీసుకొని వెళ్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు. ఏంటి మీరు.. మీకు ఏమైనా అయితే రుద్ర అన్నయ్య ఇలాగే చేస్తాడని వీరుతో ప్రీతి అంటుంది. మీరు వెళ్ళండి నేను అతని కార్ నెంబర్ చూసా పట్టుకోవడానికి ట్రై చేస్తానని రుద్ర అనగానే వద్దు రిస్క్ ఎందుకని వీరు, ప్రీతి అనడంతో సరే అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : చందు నిజం చెప్పేస్తాడేమోనని హార్ట్ ఎటాక్ డ్రామా ఆడిన భాగ్యం దంపతులు!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -282 లో.... శ్రీవల్లిని ప్రేమ ఒక ఆట అడేసుకుంటుంది. గాజు పెంకులపై డ్యాన్స్ చేయిస్తుంది. దాంతో ప్రేమ అంటే శ్రీవల్లికి భయం వేస్తుంది. మరుసటి రోజు శ్రీవల్లి కాలికి గాజు పెంకులు గుజ్జుకున్నాయని ఏడుస్తుంటే నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ఆ తర్వాత ప్రేమ నిద్ర లేచి.. రాత్రి జరిగింది గుర్తుచేసుకుంటుంది. ధీరజ్ వచ్చి నా డ్రెస్ ఎక్కడ అని అడుగుతాడు. నాకేం తెలుసు.. మీ ఐశ్వర్యకి తెలుసని వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కాలికి ఏమైందంటే సైలెంట్ గా ఉన్నావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ఇప్పుడు ప్రేమ ఇలా చేసిందని చెప్తే మళ్ళీ ప్రేమని అడుగుతుంది. ఇంకా నాపై కోపం పెంచుకుంటుందిని.. ఏం లేదు.. నేను చూసుకోకుండా గాజు పెంకపై అడుగుపెట్టానని శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత భాగ్యం ఆనందరావు ఇంటికి వస్తారు. ఇప్పుడు చెప్పండి మీరు డబ్బు ఎందుకు మావాడిని అడిగారని భాగ్యం వాళ్ళని రామరాజు అడుగుతాడు. మేం అడగలేదు మేం అమ్మాయితో మాట్లాడుతుంటే విని అతనే ఇచ్చాడని భాగ్యం అంటుంది. నిజమేనా అసలేం జరిగిందని చందుని రామరాజు అడుగుతాడు. ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని ఆనందరావు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు యాక్టింగ్ చేస్తాడు. భాగ్యం తనని తీసుకొని ఆటోలో వెళ్తుంది. బాగా ప్లాన్ చేశామని ఇద్దరు నవ్వుకుంటారు. ఎదురుగా నర్మద ఉంటుంది. తరువాయి భాగంలో ముగ్గురు కోడళ్ళు బతుకమ్మ పేరుస్తారు. ఎవరిది బాగుందని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కార్తీక్ కి అగ్రిమెంట్ పేపర్ ఇచ్చేసిన శివన్నారాయణ.. బయటకు గెంటేస్తాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -481 లో..... రెస్టారెంట్ నుండి కాల్ రాగానే వేలంపాట నుండి కార్తీక్ ని తీసుకొని దశరథ్, శివన్నారాయణ బయల్దేరతాడు. బయటకు వెళ్ళాక జ్యోత్స్న ఏం చేస్తుందో ఏమో నువ్వు ఇక్కడే ఉండమని దశరథ్ అనగానే కార్తీక్ ఉండిపోతాడు. కార్తీక్ వేలంపాటలో వెనుక నిల్చొని.. జ్యోత్స్న ఏం చేస్తుందో చూస్తాడు. వేలంపాట మొదలవుతుంది. వైరా ఇంకా జ్యోత్స్న అసలు తగ్గకుండా వేలంపాట పాడుతారు. పది కోట్లు విలువ గల రెస్టారెంట్ కి ఎక్కువ పాడుతారు. అదేంటి దాని విలువ పది కోట్లే కదా జ్యోత్స్న పోటీపడి ఎక్కువ పాడుతుందని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న పంతొమ్మిది కోట్లు అనగానే వైరా ఇరవై అంటాడు. ఇక ఆపేయాలి, జ్యోత్స్నని ఇంకా ఎక్కువకు పాడించి నష్టాల్లోకి పంపించాలని వైరా అనుకుంటాడు. ఆ తర్వాత వేలంపాటలో జ్యోత్స్న అనేలోపు కార్తీక్ ఎవరితోనో ఫోన్ చేయించి జ్యోత్స్నని బయటకు వచ్చేలా చేస్తాడు. అదేంటి వెళ్ళిపోతుందని వైరా డిస్సపాయింట్ అవుతాడు. జ్యోత్స్న బయటకు రాగానే కార్తీక్ ఉంటాడు. కార్తీక్ నే రప్పించాడని జ్యోత్స్నకి అర్థమవుతుంది. మరొకవైపు వాళ్ళ అత్త కావేరిని కాఫీ అడగలేకపోతాడు కాశీ. అది శ్రీధర్ చూసి స్వప్నని పిలిచి కాఫీ ఇచ్చి పంపిస్తాడు. నువ్వు నీ భర్త అడగముందే ఏదైనా చెయ్యాలని చెప్తాడు. మరొకవైపు జ్యోత్స్న ఇంటికి వచ్చి నేను వేలంపాట పాడకుండా ఆపాడని శివన్నారాయణకి చెప్తుంది. తనేదో గెలిచి ప్రూవ్ చేసుకుంటా అంటే నువ్వు ఎందుకు అడ్డు పడుతున్నావ్.. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న ఆ అగ్రిమెంట్ పేపర్ తీసుకొని రా అని శివన్నారాయణ చెప్తాడు. నా కూతురు గెలవడం ఇక్కడ ఎవరికి ఇష్టం లేదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని రాగానే కార్తీక్ కి శివన్నారాయణ ఇచ్చి వెళ్ళమంటాడు. తప్పు చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి జ్యోత్స్న అని శివన్నారాయణ అనగానే మెడపట్టుకొని గెంటెయ్యాలని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : అప్పుని తిట్టిన కావ్య.. ఇదంతా రాజ్ వల్లేనా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -844 లో......కావ్య దగ్గరకి అప్పు వచ్చి విడాకులు తీసుకుంటానని ఎందుకు అంటున్నావని అడుగుతుంది. అప్పుకి నేను ఆడుతుంది నాటకం అని తెలిస్తే అందరికి తెలిసే ప్రమాదం ఉందని అప్పుకి చెప్పదు. ఏ తల్లి అయిన బిడ్డకి జన్మనివ్వాలనుకుంటుంది. ప్రాణం తియ్యాలనుకోదు.. అలాంటిది మీ బావ నన్ను అబార్షన్ చేసుకోవాలంటున్నాడని కావ్య అంటుంది.  అదంతా రుద్రాణి వింటుంది. అప్పు తన రూమ్ లో ఆలోచిస్తుంటే ధాన్యలక్ష్మి వచ్చి భోజనానికి పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని అప్పు చెప్తుంది. తర్వాత తింటానని అప్పు అనగానే ధాన్యలక్ష్మి వెళ్లి భోజనం చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. అప్పు ఎక్కడ అని అపర్ణ అడుగుతుంది. తర్వాత తింటానని చెప్పిందని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుని వాళ్ళ అక్క ఇష్టం వచ్చినట్లు తిట్టింది.. అందుకే భోజనానికి రాలేదని రుద్రాణి అనగానే చెల్లిని అక్క ఎందుకు తిడుతుందని ఇందిరాదేవి అడుగుతుంది. మీ గొడవల్లోకి నా కోడలిని లాగకండి అని కావ్యపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఆ తర్వాత అప్పుకి భోజనం తీసుకొని వెళ్తాడు‌ కళ్యాణ్. తనకి నచ్చజెప్పి భోజనం తినేలా చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ ని కావ్య బయట పడుకోమని పంపిస్తుంది. మరొకవైపు సుభాష్, ప్రకాష్ లు కూడా బయట హాల్లో పడుకోవడానికి వస్తారు. నీ వల్లేరా ఇదంతా అని రాజ్ తో సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Mask man Harish Remuneration: మాస్క్ మ్యాన్ హరీష్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బిగ్ బాస్ సీజన్-9 ప్రారంభంలో మోస్ట్ టఫెస్ట్ కంటెస్టెంట్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీష్ అని అనుకున్నారంతా.. కానీ సీన్ రివర్స్ అయింది. తను వెళ్లిన నుండి హౌస్ మేట్స్ తో సరిగ్గా మాట్లాడింది లేదు.. కబుర్లు చెప్పింది లేదు.. ఎంత సేపు లోన్లీగా ఉండటం.. ఇలా ప్రతీది నెగెటివ్ గానే పోట్రేట్ అయింది.  నాలుగో వారం హౌస్ నుండి మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. అతను కొందరికి బ్లాక్ మాస్క్ అండ్ వైట్ మాస్క్ ఇచ్చాడు.  హరీష్ ఎలిమినేషన్ అని నాగార్జున అన్నాక హౌస్ మేట్స్ ఎవరు బాధ పడలేదు. అంటే అతను హౌస్ లో ఉండటం కంటే వెళ్ళిపోతేనే బాగుంటుందని అందరు అనుకున్నారు. ఇక నాగార్జున అయితే డైరెక్ట్ గా ఓ మాట అనేసాడు. హౌస్ లో సోఫాలు, ఫ్రిడ్జ్, టేబుల్స్ ఎలాగో నువ్వు అలాగే అని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అన్నాడు. అయితే మాస్క్ మ్యాన్ ఎలిమినేషన్ అయ్యాక.. బజ్ ఇంటర్వ్యూ చేశాడు శివాజీ. తను బయట కూడా అలానే ఉంటాడని, నీతిగా నిజాయితీగా ఉందామని చూస్తానంటూ మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పాడు. అయితే జనాలని గెల్చుకుంటేనా హౌస్ లో ఉంటావని శివన్న అన్నాడు. బిగ్ బాస్ హౌజ్‌లో అందరితో ఎక్కువగా వాదించడం, టాస్క్‌లు పెద్దగా ఆడకపోవడం, రూడ్‌గా ఉండటం మైనస్‌గా మారింది. ఈ కారణాల వల్ల హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు తనకి రెమ్యునరేషన్ ఎంతో ఓసారి చూసేద్దాం..  బిగ్ బాస్‌ లో పాల్గొన్నందుకు హరీష్‌కు వారానికి రూ. అరవై(60)వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు వారాలు హౌస్ లో ఉన్న మాస్క్ మ్యాన్ హరీష్.. సుమారుగా 28 లేదా 29 రోజుల పాటు ఉన్నాడు. ఇరవై ఎనిమిది(28) రోజుల్లో రూ. 2 లక్షల 40 వేల వరకు డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. మరి హౌస్ లో మాస్క్ మ్యాన్ ఆటతీరు మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.