Karthika Deepam 2: శ్రీధర్ కి డౌట్.. తన సాలిడ్ పవర్ కార్తీక్ అంటున్న శివన్నారాయణ!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -486 లో... కార్తీక్ కి వైరా వార్నింగ్ ఇస్తాడు. నీకు ఒక కుటుంబం ఉంది. చిన్న పాప ఉందని విన్నాను అని వైరా బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఊరికి ముందు పోతురాజు ఉంటాడు. నేను నా కుటుంబానికి పోతురాజుని అని కార్తీక్ తనని తనే హైలెట్ చేసుకుంటాడు. ట్రాన్స్ ఫార్మర్ ముందు డేంజర్ అని రాసి ఉంటుంది. నువ్వు ట్రాన్స్ ఫార్మర్ ముందున్నావ్ జాగ్రత్తా.... నీకు మొదటి పరిచయంలోనే పది కోట్లు నష్టం తీసుకొని వచ్చాను.. బోణి అదిరిందని కార్తీక్ అనగానే వైరాకి కోపం వస్తుంది.   మరొకవైపు అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు కలిసిందని దాస్ ని కాశీ అడుగుతాడు. అనవసరమైన విషయాలు కాకుండా జాబ్ గురించి ఆలోచించమని దాస్ అనగానే తండ్రి కొడుకులకి మాట మాట పెరుగుతుంది. నువ్వు నా కోసం ఏం చేసావ్.. నన్ను వదిలేసావని అనగానే కాశీ పై దాస్ చేయి చేసుకోబోయి ఆగిపోతాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇచ్చి దాస్ ని అక్కడ నుండి పంపిస్తాడు. నువ్వు అలా అని ఉండాల్సింది కాదని కాశీతో శ్రీధర్ మాట్లాడతాడు.    శివన్నారాయణ, దశరథ్ ఇంటికి వచ్చి.. నిన్ను సీఈఓ గా తీసేస్తాం.. నువ్వే రాజీనామా చెయ్ అని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. నాకు టైం ఇవ్వండి అని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. వచ్చే వారం బోర్డు మీటింగ్ ఉంది.. అందరు ఎవరికి ఒకే చెప్తే వాళ్లే సీఈఓ అని శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. పదవి కంటే పరువు ముఖ్యం.. నువ్వే రాజీనామా చెయ్ అని జ్యోత్స్నకి సుమిత్ర సలహా ఇస్తుంది.   దాస్ దగ్గరికి శ్రీధర్ వస్తాడు. నీకు పుట్టినబిడ్డ పురిటిలోనే చనిపోయింది కదా.. జ్యోత్స్న నీ కూతురు ఒకే రోజు పుట్టారు కదా అని అడుగుతాడు. అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు కలిసింది. నా కొడుకు ఆ ఇంట్లో పని చెయ్యడానికి కారణం నీకు తెలుసా అని శ్రీధర్ అడుగుతుంటే.. నాకేం తెలియదని దాస్ అంటాడు. నేనే తెలుసుకుంటానని శ్రీధర్ అంటాడు. బావ కి డౌట్ వచ్చింది.. వదిలి పెట్టడు.. నేను జరిగేది చూస్తానని దాస్ అంటాడు.    మరొకవైపు కార్తీక్ దగ్గరికి శివన్నారాయణ వచ్చి మాట్లాడుతాడు. కాసేపు మనం తాత మనవడిలాగా మాట్లాడుకుందాం.. నేను ఎప్పుడైనా భయపడడం చూసావా.. నిన్న భయపడ్డాను.. నాకు సపోర్ట్ గా నువ్వు ఉంటావా.. నువ్వే నాకు సాలిడ్ సపోర్ట్ అని కార్తీక్ తో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi: పుట్టింటికి వచ్చేసిన కావ్య.. కారణం తెలుసుకొని కనకం షాక్!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -849 లో.... కావ్య తన పుట్టింటికి వస్తుంది. ఎందుకు ఇంత సడెన్ గా వచ్చావని కనకం ఆరా తియ్యడంతో కావ్య చిరాకుగా.. ఒక అమ్మాయి ఇలా పుట్టింటికి వచ్చే స్వేచ్ఛ కూడా లేదా అని అంటుంది. అసలు కావ్య వాళ్ళ అత్తింట్లో ఏం జరిగిందో కనుక్కుందామని అపర్ణకి కనకం ఫోన్ చేస్తుంటే.. కావ్య వచ్చి లాక్కొని ఎవరికి ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు.. ఆకలి అవుతుంది ముందు భోజనం పెట్టమని కావ్య అంటుంది.   మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్ళిందేమోనని కనకంకి అపర్ణ ఫోన్ చేస్తుంది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని అపర్ణ అనగానే.. ఇంకేముంది అసలు కావ్య అక్కడికి వెళ్లి ఉండదు.. వెళ్తే అసలు ఏమైందని ఆ కనకం ఫోన్ చేసేది కదా అని రుద్రాణి అంటుంది. మరొకవైపు అసలు అక్క ఎక్కడికి వెళ్ళిందని కావ్య ఫోటో పట్టుకొని అప్పు ఏడుస్తుంది.    ఆ తర్వాత కావ్య భోజనం చేస్తుంటే రాజ్ తన దగ్గరికి వచ్చి ఇంటికి వెళదామని అడుగుతాడు. మీ నిర్ణయం మార్చుకోండి లేదా ఆ నిర్ణయానికి గల కారణం అయినా చెప్పండి అని కావ్య అంటుంది. వస్తే రా.. లేకపోతే లేదని రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. అసలేం జరిగిందని కనకం అడుగుతున్నా కూడా కావ్య సైలెంట్ గా ఉంటుంది. మరొకవైపు మీ అక్క మీ ఇంట్లోనే ఉందట అని అప్పుతో కళ్యాణ్ చెప్పగానే అప్పు హ్యాపీగా ఫీల్ అవుతుంది.   ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. కావ్య గురించి ఏమైనా తెలిసిందా అని అపర్ణ అడుగుతుంది. వాళ్ళింట్లో ఉంది రమ్మంటే రానంది అని రాజ్ చెప్తాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు.. నా కోడలు నా ఇంట్లో ఉండాలని అపర్ణ అంటుంది. రానంటుంది నేనేం చెయ్యాలని చెప్పి రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్నకి కనకం ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది.    తరువాయి భాగంలో కావ్య దగ్గరికి ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. నీ యాక్టింగ్ సూపర్ అంటారు. యాక్టింగ్ కాదు నేను నిజంగానే ఇంట్లో నుండి వచ్చేసానని కావ్య అనగానే అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు. అసలు ఏమైందని కనకం అడుగుతుంది. కావ్యని రాజ్ అబార్షన్ చేసుకొమ్మంటున్నాడని అపర్ణ చెప్పగానే కనకం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఢీ అంటే ఏంటనుకున్నావ్...జానుకి పండు వార్నింగ్  

  ఢీ - 20 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇది కంప్లీట్ గా స్టూడెంట్స్ స్పెషల్ గా రాబోతోంది. అందరూ కూడా స్కూల్ యూనిఫామ్ లో వచ్చారు. జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ ఇంగ్లీష్ మాష్టర్ అంటూ నందు పరిచయం చేసాడు. "నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంగ్లీష్ సినిమాలు చూడనిదే " అంటూ ఆది ఏదో చెప్పబోయి ఆపేసాడు. ఇక పక్కనే దీపికా స్కూల్ యూనిఫామ్ లో వచ్చి "మా ఫిజిక్స్ మాష్టర్ వచ్చి నాకు అబద్దం చెప్పారు. మనుషులు భూమి మీద జీవిచగలరు అని అన్నారు. కానీ మీరు నా మనసులో కూడా జీవిస్తున్నారు" అనేసరికి నందు, ఆది కలిసి ఆట పట్టించారు "వరదా" అంటూ ఆది డస్టర్ తీసుకుని నా బుర్ర బద్దలుకొట్టేసుకుంటాను" అన్నాడు. ఇక రెజీనా ఇంగ్లీష్ టీచర్ గా వచ్చింది. "టెన్సెస్ గురించి తెలుసా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్" అంది. "రాజు కప్పు కొట్టాడు..అది పాస్ట్ టెన్స్ టీచర్ అన్నాడు ఆది. ఇంతలో పండు వచ్చి. "పండు కప్పు కొడతాడు" అన్నాడు. దానికి ఆది "అది ఫ్యూచర్ ఇంపాజిబుల్ టెన్స్" అన్నాడు. ఇక లాస్ట్ లో పండు జడ్జిమెంట్ ఇచ్చాడు. రాజా నందినికి ఓటేశాడు. దాంతో జాను లిరి సీరియస్ గా "డాన్స్ లో ఎం బాలేదు. ఎం తక్కువయ్యిందో చెప్పు" అని పోయినాటౌట్ చేసింది." "ఎం చేసావ్ " అన్నాడు. "చూళ్ళే" అంది జాను. "షెడ్యూల్ లో గ్యాప్ ఎందుకు తీసుకున్నావ్" అన్నాడు. "రెస్ట్ తీసుకున్నా" అంది. "రెస్ట్ తీసుకుంటే ఇక్కడ అవ్వదు" అన్నాడు. "ఢీ అంటే ఏంటనుకున్నావ్" అన్నాడు సీరియస్ గా పండు. ఇక జాను ఎం చెప్పిందో కానీ వేలెత్తి వార్నింగ్ ఇచ్చాడు పండు.

వ‌రుణ్ తేజ్ నెక్ట్స్ మూవీలో సాంగ్ పాడనున్న తెలుగు ఇండియన్ ఐడల్ ధీరజ్

  తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో సింగర్ ధీరజ్ రావడంతోనే జడ్జెస్ కి పాల కోవాలా పాకెట్స్ పట్టుకుని వచ్చాడు. థమన్ ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో పాల కోవాల కోసం అడిగితే ఇప్పుడు వాటిని తెచ్చి ఇచ్చాడు. ఇక కోర్ట్ మూవీలో సాంగ్ పాడి అలరించాడు. ఇక జడ్జెస్ కి కూడా ఈ పాట బాగా నచ్చేసింది. "ఎగ్జాం పేపర్ లో వస్తుంది ఫిల్ ఇన్ ది బ్లాంక్. నీ పెర్ఫార్మెన్స్ కి నేను వేస్తా ఫస్ట్ రాంక్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు కార్తీక్. "ఎం పాడావురా..ఇంత ఉందా నీలో అనేలా ఉందిరా. రేపు మార్నింగ్ నా స్టూడియోకి రా ఒక సాంగ్ ఉంది నీకు. వరుణ్ తేజ్ నేనొక సినిమా చేస్తున్న. కొరియన్ కనకరాజు అని..ఆ సినిమాలో ఒక సాంగ్ నా కోసం పాడాలి..నేను ఇంకా డైరెక్టర్ ని, హీరోని కూడా అడగలేదు. కానీ నేను నీకోసం ఫైట్ చేస్తా " అంటూ థమన్ బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ఇక కార్తీక్ ఐతే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసరికి జనవరిలో అని చెప్పాడు. సరే ఇంకో ఆఫర్ కూడా నేను ఇస్తున్నా ఫిబ్రవరి 14 న నా షో హైదరాబాద్ లో ఉంది. నువ్వొచ్చి నా షోని స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇక ప్రతీ సీజన్ నుంచి కూడా ఇక్కడ పాడే సింగర్స్ కి ఏదో ఒక ఆఫర్స్ ఇస్తూ కొత్త కొత్త మూవీస్ లో సాంగ్స్ పాడిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు జడ్జెస్. ఇక తర్వాత ఈ షోలో సాంగ్స్ పాడిన డల్లాస్ డైనమైట్ స్నిగ్ద, శ్వేతా పాడిన సాంగ్స్ కి కార్తీక్ కొన్ని ఇన్ పుట్స్ చెప్పాడు. అలా వాళ్ళతో మళ్ళీ సాంగ్స్ పాడించి సరదాగా ఎంటర్టైన్ చేశారు.

Bigg Boss 9 Telugu : భరణితో బలగం2.. బిగ్ బాస్ హౌస్ లో కొత్త కుటుంబం!

  బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే రాసి పెట్టి ఉండాలని, వన్ టైమ్ ఆచీవ్మెంట్  అని అంటారు. హౌస్ లోకి వచ్చి కాస్త ఫేమ్ సంపాదించి తమకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ హిస్టరీ లోనే లేని విధంగా ఈ సీజన్ లో ఎన్నో బంధాలు పెనవేసుకొని ఉన్నాయి. కంటెస్టెంట్స్ కప్ కోసమో లేక బంధాలు పెంచుకోవడం కోసమో ఈ సీజన్-9 కి వచ్చారో అర్థమవ్వడ‌ం లేదు. బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక మమతల కోవెల.. అందులో అన్ని బంధాలు ఉంటాయని చెప్పిన ఏకైక సీజన్ ఏదంటే అది బిగ్ బాస్ 9. ఈ సీజన్-9 ఇంటి పెద్ద ఎవరంటే మన రేలంగి మావయ్య భరణి.. అతనే మహావృక్షం. అతనికి ఇద్దరు కూతుళ్లు.. చిన్న కూతురు దివ్య, పెద్ద కూతురు తనూజ. ఇక కంటెస్టెంట్స్ అందరు కూడా అన్నయ్య, బాబాయ్, మామ అంటూ భరణిని పలకరిస్తుంటారు. ఇలా భరణికి పెద్ద బలగమే ఉంది. ఈ సీజన్ అయ్యాక భరణితో బలగం-2 తీసిన పెద్ద హిట్టే అవుతుంది. ఎందుకంటే అలా అన్ని బంధాలని పెనవేసుకున్నాడు భరణి. ఇక బంధాలకి పుట్టినిళ్ళుగా మారింది సీజన్-9 బిగ్ బాస్ హౌస్. మరోవైపు హౌస్ లో లవ్ ట్రాక్ లు కూడా ఉన్నాయి. అసలు హౌస్ లోకి ఏ పర్పస్ తో వచ్చారన్న విషయమే మర్చిపోయారు కొందరు. మన యువ జంట రీతూ చౌదరి, డీమాన్ పవన్ సందు దొరికితే చాలు హగ్ ఇచ్చుకుంటున్నారు. హౌస్ లో ఈ ఇద్దరు  కరువులో ఉన్నట్లు వారి చేష్టలున్నాయి. ఇక కళ్యాణ్, తనూజ వీళ్లు లవ్ ట్రాక్ నడపలేకపోయారు. ఎందుకంటే కళ్యాణ్ కంటే తనూజ రెండేళ్లు పెద్దదట.. వీళ్లతో ఏమాయ చేసావే-2 తీస్తే సెట్టు. బిగ్ బాస్ హౌస్ లో పెనవేసుకున్న ఇంకొక బంధం తల్లి, కొడుకుల బంధం. సంజన, ఇమ్మాన్యుయల్.. ఇద్దరి బాండింగ్ చూస్తుంటే సొంత తల్లీకొడుకులు కూడా అలా ఉండరేమో.. మమ్మీ అంటూ ఇమ్మాన్యుయల్ బిడ్డ అంటూ సంజన.. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. తాజాగా ఒక ఎపిసోడ్ లో.. నా తల్లి తర్వాత సంజనని అమ్మ అని పిలిచానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తన కోసం ఈ పాట అంటూ సువ్వి సువ్వాలమ్మ పాటని పాడి వినిపించాడు. దీన్ని బట్టి చూస్తే అందరు గేమ్స్ కంటే బంధాలకి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. వెళ్ళందరు కెమెరా స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నారా లేదంటే నిజమైనా ఎమోషనా అనేది తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu weekend promo: సుమన్ శెట్టికి సపోర్ట్ గా నాగార్జున.. రీతూకి ఇచ్చిపడేశాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ‌ఇందులో నాగార్జున మాస్ లుక్ లో‌ ఎంట్రీ ఇచ్చాడు.‌ ఇక వచ్చీ రాగానే వారంలో అందరు చేసిన మిస్టేక్స్ ని బయటకు చెప్తూ క్లాస్ పీకాడు.‌ తాజాగా రిలీజ్ అయిన సెకెండ్ ప్రోమోలో ప్లోరా సైనీ, రాము రాథోడ్ లకి ఇచ్చిపడేశాడు నాగ్ మామ. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కాళ్ళు టచ్ అయ్యాయని సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకున్నాడంటూ తనని ఫ్లోరా సైనీ ఎలిమినేషన్ అంటు ప్రకటించింది. అది రాంగ్ డెసిషన్ అంటు బిబి ఆడియన్ చెప్పారు. మీ రాంగ్ డెసిషన్ వల్ల సుమన్ శెట్టి టీమ్ సేఫ్ జోన్ లోకి రాలేకపోయారని రాము రాథోడ్, ఫ్లోరాలకి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. ఇక మన డీమాన్ పవన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. గ్లాస్ టాస్క్ అయ్యాక ఓ మూలన కూర్చొని రీతూని అలా అనడం కరెక్టేనా అని అడిగాడు.‌ ఇక శ్రీజని సుమన్ శెట్టితో జంటగా ఉండమని నువ్వు చెప్పావా అని రీతూని నాగార్జున అడుగగా..‌తను గుర్తులేదని చెప్పింది. రీతూ కట్ అయింది నీ హెయిర్.. నీ మెమరీ కాదంటూ పంచ్ వేశాడు నాగార్జున. ఇక అందరికి క్లాస్ పీకిన నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చాడు. మీరు ఆటలో ముందుకి వెళ్ళాలంటే మీకు ఒక పవర్ ఫుల్ అస్త్ర కావాలి.. అదే పవర్ అస్త్ర అని చూపించాడు. తనూజ, దివ్య, భరణి, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ ఈ పవర్ అస్త్రకి దగ్గరగా ఉన్నారు. మరి వీరిలో ఈ పవర్ అస్త్ర ఎవరికి దక్కుతుందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg boss 9 Telugu Double Elimination:  డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్ 9 పై భారీ అంచనాల మధ్య మొదలైంది. ఆ అంచనాలకి తగ్గట్టుగానే బిగ్ బాస్ మంచి హైప్ ని క్రియేట్ ని చేస్తున్నాడు. ఈ వారం రాము కెప్టెన్ కాబట్టి నామినేషన్ లో లేడు. ఇమ్మ్యూనిటీ పొంది ఇమ్మాన్యుయల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక భరణి, దివ్య, కళ్యాణ్, తనూజ టాస్క్ లు గెలిచి సేఫ్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వీక్ లో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. సుమన్ శెట్టి మొదటి స్థానంలో ఉండగా సంజన రెండో స్థానంలో, శ్రీజ మూడో స్థానంలో, డీమాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. రీతూ, ఫ్లోరా సైనీ ఇద్దరు మాత్రం లీస్ట్ లో ఉన్నారు. ఈ వారం రీతూ, ఫ్లోరా వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఆటతో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్ ఇదే మొదటిసారి అవుతుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా, రీతూ చౌదరి ఇద్దరు వెళ్లే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే శనివారం నాటి ఎపిసోడ్ లో ఒకరికని, ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఇంకొకరిని పంపిస్తారు.. సండే రోజు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉండబోతుంది. ఈ 2.0 ఎపిసోడ్ లో అయిదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే దానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Bigg Boss 9 Telugu: అయిదో వారం కెప్టెన్ గా పవన్ కళ్యాణ్.. బిగ్ ట్విస్ట్ అదే!

  బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటి వరకు టాస్క్ ల మీద టాస్క్ లతో కంటెస్టెంట్స్ బిజీగా ఉన్నారు.  వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారని బిగ్ బాస్ బాంబ్ పేల్చడంతో హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ లో టెన్షన్ మొదలైంది. అందుకే వారిని డేంజర్ జోన్ లో ఉంచి టాస్క్ లు పెట్టి అందులో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న టీమ్ ని సేఫ్ జోన్ లోకి పంపించాడు. ఇలా గత మూడు రోజుల నుండి ఈ టాస్క్ లు పెట్టిన బిగ్ బాస్ నిన్న ఆఖరి టాస్క్ పెట్టాడు. మీ సర్వైవల్ కోసం నేను ఇస్తున్న టాస్క్ ఫైట్ ఫర్ సర్వైవల్.. గార్డెన్ ఏరియాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటితో నిండే పూల్స్ ఉన్నాయి.. అందులో నీళ్లు చల్లగా ఉండొచ్చు కానీ అవే మీకు అగ్నిపరీక్ష.. ఎందుకంటే స్టార్ట్ బజర్ మోగగానే డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులు తమకు కేటాయింటిన పూల్స్‌లోకి వెళ్లి అందులో ఉన్న రోప్స్‌ని పట్టుకొని పూర్తిగా పడుకోవాలి.. ఆ పూల్స్‌కి కనెక్ట్ చేసిన ట్యాప్స్ ద్వారా ఆ పూల్స్‌లో నీరు క్రమంగా ప్రతి సెకను మీ సహనాన్ని మీ శ్వాసని మీ ధైర్యాన్ని పరీక్షిస్తాయి.. సేఫ్‌ జోన్‌లో ఉన్న సభ్యులు డేంజర్ జోన్‌లో ఉన్న ఎవరిని డేంజర్ జోన్‌ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల పూల్‌లో నీటిని బకెట్‌తో బయటికి తీసి డేంజర్ జోన్‌లోనే ఉంచాలనుకుంటున్న సభ్యుని పూల్‌లో వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ రూల్స్ చెప్పగా ఈ టాస్క్ కి ఫ్లోరా సైనీ సంఛాలక్ గా ఉంది. ఈ టాస్క్ లో మొదటగా సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవ్వగా, తర్వాత డీమాన్, కాసేపటికి రీతూ ఎలిమినేషన్ అయ్యారు. ఇక చివరి దాకా సంజన, తనూజ ఉండగా.. సంజన పూల్ లో ఎక్కువ నీళ్ళు ఉండటంతో తను ఎలిమినేట్ అయింది. ఇక ఈ టాస్క్ లో తనూజ గెలిచి సేఫ్ అయ్యింది. ఇక చివరగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పోటీదారులు అందరూ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చొని ఉంటారు. వారి నెత్తిన ఒక బల్డ్ వేలాడుతూ ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు ఛైర్స్‌లో కూర్చున్న పోటీదారుల్లో ఒకరిని ఎంచుకొని వారి భుజంపై టచ్ చేస్తారు. అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్లకి ఉన్న గంతలు తీసి మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి లైట్‌ని ఆఫ్ చేయాలి. వెంటనే తిరిగి తమ ఛైర్‌లో కళ్లకి గంతలు కట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత అందరూ గంతలు ఓపెన్ చేస్తారు. ఎవరి లైట్ అయితే ఆఫ్ చేసి ఉంటుందో వారు.. ఇది చేసిందెవరో గెస్ చేయాలి. వారు గెస్ చేసిన సభ్యులు లైట్ ఆఫ్ చేసిన సభ్యులు ఒకరే అయితే ఆ లైట్ ఆఫ్ చేసిన సభ్యులు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఈ టాస్క్ లో మొదటగా దివ్య సరిగ్గా గెస్ చేసింది. ఆ తర్వాత కళ్యాణ్, కాసేపటికి తనూజ.. ఇలా అందరు గెస్ అయిన తర్వాత చివరికి తనూజ, కళ్యాణ్ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావడానికి అర్హులో డిసైడ్ చేసుకోమని హౌస్ మేట్స్ కి చెప్పాడు బిగ్ బాస్. ఇక అందరు కలిసి పవన్ కళ్యాణ్ ని కెప్టెన్ గా డిసైడ్ చేశారు. అయితే ఇందులో ఇమ్మాన్యుయల్, సంజన, భరణి మాత్రమే తనూజకి సపోర్ట్ చేశారు. మిగతావారంతా కళ్యాణ్ కి సపోర్ట్ చేయడంతో అతను కెప్టెన్ గా గెలిచాడు. కెప్టెన్ అయిన కళ్యాణ్ కెప్టెన్సీ బ్యాండ్ ని దివ్య నిఖిత చేతుల మీదుగా తీసుకున్నాడు. ఎందుకంటే అంతకముందు కళ్యాణ్ ని వరెస్ట్ ప్లేయర్ అని దివ్య చెప్పిందంట. ఇలా అయిదో వారం పవన్ కళ్యాణ్ కెప్టెన్ గా గెలిచాడు.  

Bigg boss 9 telugu: సుమన్ శెట్టికి అన్యాయం.. సంఛాలక్ గా ఫ్లోరా ఫెయిల్!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఐదో వారం క్రేజీగా సాగుతోంది. హౌస్ లో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇందులో ఒకరిని మించి ఒకరు స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.  సుమన్ శెట్టి, శ్రీజ ఒక టీమ్ గా ఉన్నారు. అయితే ప్రతీ టాస్క్ లో సుమన్ శెట్టి తన వంద శాతం ఎఫర్ట్స్ పెడుతుంటే శ్రీజ మాత్రం ఫెయిల్ అవుతుంది. తను టాస్క్ లని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణం. గొడవకి ముందుండే శ్రీజ ఆటల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు.. దాంతో సుమన్ శెట్టి టీమ్ వెనుకపడింది. కళ్యాణ్ గెలవాలని ఒక స్ట్రాటజీ ప్రకారం శ్రీజ సుమన్ శెట్టిని ఓడిస్తుందని అందరికి అర్థమవుతుంది. అయితే శ్రీజతో పాటుగా ఫ్లోరా కూడా అదే తప్పు చేసింది. నిన్నటి వాటర్ పూల్ టాస్క్ లో సుమన్ శెట్టి నీళ్ళలో పడుకొని ఉన్నాడు. అందులో నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల సుమన్ శెట్టి కాళ్ళు ఆ పూల్ కి తాకాయని ఫ్లోరా అనుకుంది. అయితే తన కాళ్ళు పూల్ ని తాకాయాని కన్ఫమ్ అయిన ఫ్లోరా సుమన్ శెట్టిని ఫస్ట్ ఎలిమినేట్ చేసింది. అయితే సుమన్ శెట్టి మాత్రం.. నా కాళ్ళు తాకలేదు.. నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల మీకు అలా కన్పిస్తుందని అన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వచ్చి సంఛాలక్ డెసిషన్ ఫైనల్ కదా అని చెప్పారు.  సంఛాలక్ డెసిషన్ ఫైనల్ కానీ తను సరిగ్గా చూడలేదు.. అసలు నేనెప్పుడైనా ఆర్గుమెంట్ చేశానా.. తనకి తెలియదు.. నేను చెప్తున్నాను కదా నా కాళ్ళు తాకలేదంటూ సుమన్ శెట్టి చెప్పాడు. అయితే అప్పటికే అందరు వాటర్ పూల్ ఉండటంతో సుమన్ శెట్టి అర్థం చేసుకొని టాస్క్ నుండి క్విట్ అయ్యాడు. పాపం ఫ్లోరా చేసిన మిస్టేక్ వల్ల సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది. మరి ఈ టాస్క్ లో సంఛాలక్ ఫ్లోరా చేసింది కరెక్ట్ అని మీకనపిస్తుందా కామెంట్ చేయండి.

Bigg boss 9 Telugu : దివ్య, తనూజ మధ్య నలిగిపోతున్న భరణి!

  బిగ్ బాస్ సీజన్-9 లో ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్స్ ప్రవర్తన ఉంది.  హౌస్ ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంది.. హౌస్ లోని అందరికి పెద్ద దిక్కుగా మన భరణి ఉంటున్నాడు.. కొందరికి నాన్న, కొందరికి మావయ్య, మరికొందరికి బాబాయ్, ఇంకా కొందరికి అన్నయ్య.. ప్రతీది తనకే చెందుతుంది.. గత వీకెండ్ లో నాగార్జున అన్నట్లే రేలంగి మావయ్య అనే టైటిల్ భరణికి ఆప్ట్ అవుతుంది.  పెద్ద కూతురు తనూజ, చిన్న కూతురు దివ్య.. మధ్యలో నాన్న(భరణి) నలిగిపోతున్నాడు. దివ్య, భరణి ఒక టీమ్ కాబట్టి కలిసి కట్టుగా ఆడుతున్నారు. వాళ్ళు క్లోజ్ అయ్యారని తనూజ మొహం మాడ్చింది. తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావని భరణి మొహం పైనే చెప్పేసింది తనూజ. తాజాగా జరిగిన టాస్క్ లో కళ్యాణ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి తనూజ ఒకే చెప్తుంది.. నువ్వు అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావని తనూజని దివ్య అడుగుతుంది. ఆ కన్వర్ సేషన్ అయ్యో వరకు బాగా మాట్లాడుకున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భరణి, ఇమ్మాన్యుయల్, రాము, కళ్యాణ్, తనూజ, దివ్య ఉన్నారు. అదేంటంటే మాస్క్ పెట్టుకొని మిగతా వాళ్ళ లైట్ ని ఎవరు ఆన్ చేసారో కనిపెట్టాలి. ఆ టాస్క్ లో దివ్య లైట్ ని తనూజ అఫ్ చేస్తుంది. నాకు తెలిసి తనూజ చెయ్యదు.. కళ్యాణ్ చేసి ఉంటాడని కళ్యాణ్ పేరు చెప్తుంది. అది రాంగ్ ఆన్సర్ కాబట్టి దివ్య టాస్క్ నుండి ఎలిమినేట్ అవుతుంది. దాంతో దివ్య ఎమోషనల్ అవుతుంది. అసలు నేను తనూజని నమ్మానని బాధపడుతుంది. అంతా అయ్యాక సారీ చెప్పడానికి దివ్య దగ్గరికి తనూజ వస్తుంది. నేను వినను ఇక ఎవరిని నమ్మనని దివ్య అంటుంది. ఈ రోజు తనూజ చేసింది. ఇక కాసేపటికి పడుకునే ముందు.. సుమన్ శెట్టి, భరణి, దివ్య సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు. మీకెలా అనిపిస్తుందని భరణిని దివ్య అడుగుతుంది. తప్పు అని భరణి అంటాడు. తనని మీ వల్ల నమ్మానని దివ్య తన బాధని భరణికి చెప్తుంది. భరణి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. చిన్నకూతురు, పెద్దకూతురు మధ్య ఏం అనలేకపోతున్నాడు భరణి. మరి వీరి బాండింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jayam serial : గంగపై రౌడీలు ఎటాక్.. రుద్ర కాపాడుతాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -81 లో.....గంగకి మణి తాళి కట్టబోతుంటే లక్ష్మీ కత్తిపీట తీసుకొని వచ్చి.. తనని వదిలి పెట్టమని మణి మెడపై పెడుతుంది. దాంతో గంగని వదిలిపెడతాడు. నీ భర్త నా దగ్గర డబ్బు తీసుకున్నాడు.. అవి ఇచ్చేయండి అని లక్ష్మీని మణి అడుగుతాడు. ఒక ఆరు లక్షల వరకు రావాలి డబ్బు అయిన ఇవ్వండి.. లేక గంగని అయినా పెళ్లి చేసుకుంటానని మణి అంటాడు. నీ డబ్బు నీకు మూడు నెలల్లో ఇచ్చేస్తాను లేదంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికి గంగ చెప్తుంది. దానికి సంబంధించి మణి అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అంత డబ్బు ఎలా ఇస్తావని గంగని లక్ష్మీ అడుగుతుంది. గంగ సైలెంట్ గా వెళ్లిపోతుంది. మరొకవైపు గంగపై హత్య ప్రయత్నం చేసినట్టు రుద్రకి కల వస్తుంది. దాంతో లేచి బయటకు వచ్చి గంగ గురించి తన చెల్లి స్నేహాని అడుగుతాడు. గంగ ఎక్కడ ఉండదు.. ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని అందరికి అర్థమవుతుంది. మీరు అలా తిట్టినప్పుడు ఎలా ఉంటుంది.. అసలే ఆత్మగౌరవం కలిగిన పిల్ల.. తనకి సపోర్ట్ గా మాట్లాడాలనుకున్నా కానీ మీ పెద్దమ్మ అనుకుటుంది. నిజం అనుకుంటుందని సైలెంట్ గా ఉన్నానని పెద్దసారు అంటాడు. అప్పుడే రుద్రకి స్టేషన్ నుండి ఇన్‌స్పెక్టర్ కాల్ చేసి సైదులు స్టేషన్ నుండి తప్పించుకున్నాడు. జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. మరొకవైపు లక్ష్మీ పసుపు, కుంకుమ పట్టుకొని వెళ్తుంటే.. పైడిరాజు ఎదురు వచ్చి అవి కిందపడేలా చేస్తాడు. దాంతో లక్ష్మీ కోప్పడుతుంది. గంగ గిన్నెలు తోముతుంది. అప్పుడే రుద్ర వచ్చి గంగపై హత్యాప్రయత్నం చేసిన అతను తప్పించుకున్నాడంట. గంగ నా బాధ్యత అందుకే తనని తీసుకొని వెళ్తున్నానని గంగ చెయ్ పట్టుకొని పసుపు, కుంకుమ పడ్డ చోటు నుండి తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో గంగ వాటర్ క్యాన్ మోస్తుంటే.. రౌడీలు తనని ఎటాక్ చెయ్యాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Bigg Boss 9 Telugu weekend promo : భరణికి ఇచ్చి పడేసిన నాగ్.. ప్రేక్షకుల మాటలకి బిత్తరపోయిన రేలంగి మావయ్య!

  బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో రానే వచ్చింది. బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో కోసం అభిమానూలు ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. కానీ ప్రోమో ఎప్పుడు ఈవినింగ్ వస్తుంది. ఇలా ఇంత త్వరగా రావడం ఇదే మొదటి సారి. నాగార్జున మాస్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే బెడ్ టాస్క్ లో నువ్వు చేసింది కరెక్టేనా అని తనూజ పై నాగ్ సీరియస్ అయ్యాడు. టాస్క్ లో ముందు ఆడపిల్లలని తోసేద్దామనుకున్నావ్ అలా కాకుండా అందరి తరుపున పోరాడి ఉంటే చివరకు నీ దాకా వచ్చి ఉండేది కాదు కదా అని నాగార్జున అడిగాడు. ఆట నుండి ముందు వెళ్ళిపోయిన సంజన మీరు అందరు కలిసి ఆడండి విడివిడిగా ఆడకండి అని చెప్పింది. అయిన వినలేదు. భరణి, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ నిన్ను తియ్యరనుకున్నావా.. నీ విషయం లో చాలా డెలికేటెడ్ గా ఉన్న భరణి.. శ్రీజని అలా తియ్యడం కరెక్టా? అని తనూజని కన్ఫ్యూషన్ లో పడేసాడు నాగార్జున. ఇప్పుడు దివ్య, తనూజ ఉన్నారు.. భరణి ఎవరికి సపోర్ట్ చేస్తాడని దివ్యని నాగార్జున అడుగుతాడు. తనూజకి సపోర్ట్ చేస్తాడు .. ఎందుకు అంటే నేను అర్థం చేసుకుంటానని దివ్య అనగానే అంటే తనూజ అర్థం చేసుకోదా అని నాగార్జున అంటాడు. ఫ్లోరా కి నాగార్జున బెడ్ టాస్క్ కి సంబంధించిన వీడియోని చూపిస్తాడు. భరణి బెడ్ పై నుండి ఫస్ట్ కింద పడతాడు కానీ ఫ్లోరా డీమాన్ పవన్ పడ్డాడని సంచాలక్ గా నిర్ణయం తీసుకుంటుంది. అది అన్ ఫెయిర్ అని నాగార్జున చెప్తాడు. నేను స్వార్థం గా ఆలోచించాను సర్ తప్పు నాదే అని భరణి గిల్టీగా ఫీల్ అవుతాడు. బెడ్ పై నుండి కాదు.. మా దృష్టిలో నుండి కూడా కింద పడ్డావని నాగార్జున అంటాడు. వారంలో తప్పు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు.. నీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక అమ్మాయి ఇక్కడ ఉంది. తను నీ గురించి ఏం అంటుందో విను అని నాగార్జున చెప్తాడు. మీ గేమ్ కనపడుతలేదు.. బాండింగ్ కనపడుతుంది.. అసలు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచబుద్ది అవ్వడం లేదని ఆ అమ్మాయి భరణి మొహంపై చెప్పేసింది. మరి భరణి ఎలా ఆడతాడు..నాగార్జున ఇంకా ఎవరిని ఏం అన్నాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. 

Illu illalu pillalu : ధీరజ్ కోసం ప్రేమ తపన.. బతుకమ్మ ఆటలో ఇరు కుటుంబాలు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -286 లో.. నర్మద పేరెంట్స్ ని తీసుకొని వచ్చి సాగర్ నర్మదకి సర్ ప్రైజ్ ఇస్తాడు. నర్మద తన పేరెంట్స్ ని చూసి సంతోషపడుతుంది. అమ్మా మీరేలా వచ్చారని నర్మద అడుగుతుంది. సాగర్ వచ్చి.. నా వల్ల మీ కూతురిని బాధపెట్టకండి అని రిక్వెస్ట్ చేసాడు.. దాంతో మీ నాన్న కూడా ఏం అనలేదని నర్మద వాళ్ళ అమ్మ అంటుంది. ఆ తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. నువ్వు మా కుటుంబం కోసం ఏంత చేస్తున్నావ్.. ఈ మాత్రం చేయలేనా అని సాగర్ అంటాడు. ఆ తర్వాత అందరు బతుకమ్మ ఆడుతారు. వేదవతిని ప్రేమ తీసుకొని వెళ్లి తన వాళ్ళ దగ్గర ఆడేలా చేస్తుంది. ఆ తర్వాత నర్మద వాళ్ళ అమ్మని ప్రేమ తీసుకొని వచ్చి నర్మద దగ్గర ఆడెలా చేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కి నీ ప్రేమ విషయం చెప్పమని ప్రేమతో నర్మద చెప్తుంది. అక్క నువ్వే హెల్ప్ చెయ్యాలని ప్రేమ అంటుంది. ఐ లవ్ యూ అని ఒక పేపర్ పై రాసి ఒక పాప కి ఇచ్చి ధీరజ్ కి ఇచ్చి ఆ అక్క పంపిందని చెప్పు అని ప్రేమని చూపిస్తుంది. ఆ పాప వెళ్లి పేపర్ ఇస్తుంది. ఎవరు ఇచ్చారని ధీరజ్ అడుగుతాడు. ఆ పాప ప్రేమని చుపిస్తుంది. కానీ వెనకాల ఐశ్వర్య ఉంటుంది. ఐశ్వర్య పంపింది అనుకొని ధీరజ్ తన దగ్గరికి వెళ్లి.. ఇది రాసింది నువ్వేనా అనీ అడుగుతాడు. నువ్వే రాసి ఇలా నన్ను అంటున్నావని ఐశ్వర్య సిగ్గుపడుతుంది. అప్పుడే ప్రేమ వచ్చి ఏంటే అని ఐశ్వర్యతో గొడవ పడుతుంది. నర్మద వచ్చి గొడవ ఆపుతుంది. ప్రేమతో సైలైంట్ గా మాట్లాడుతుంది నర్మద. ఆ పేపర్ నేను రాసి నువ్వు ఇచ్చావని పంపించాను కానీ ఐశ్వర్య అనుకున్నాడని ప్రేమతో నర్మద అంటుంది. మరొకవైపు సేనాపతి, రామరాజు కలిసిపోయారు కదా మీ ప్రేమ మీ ఇంట్లో బతుకమ్మ తీసుకొని వచ్చింది కదా అని ఒకతను సేనాపతితో అంటాడు. వాడితో కలవడం ఏంటి వాడే సిగ్గు లేకుండా వాళ్ళని అడ్డు పెట్టుకొని మాతో కలవాలని చూస్తున్నాడని సేనాపతి అంటాడు. మరోవైపు రామరాజు తన ఇద్దరు కోడళ్ళని చూసి.. ఈ ఇద్దరు కోడళ్ళు నా పరువు తీసేందుకే ఉన్నారని అనుకుంటాడు. అదే విషయం వేదవతితో చెప్తాడు. అదంతా విన్న శ్రీవల్లి.. రామరాజుకి వచ్చి ఇంకా కోపం పెరిగేలా మాట్లాడుతుంది. అదంతా ప్రేమ, నర్మద వింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో కార్తీక్ వైరం.. ఇప్పుడే మొదలైంది!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -485 లో....బోర్డ్ మీటింగ్ జరుగుతుంది.. అందులో నేనొక నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అనగానే.. మీ కంటే ముందు మేము ఒక నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెంబర్స్ అంటారు. ఈ కంపెనీలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మా ముగ్గురికి ఉంది.. కంపెనీ లాస్ లో ఉంది.. అందుకే మా షేర్స్ అమ్మాలని అనుకుంటున్నామని బోర్డ్ మెంబర్స్ అనగానే అందరు షాక్ అవుతారు. ఎవరికి అమ్ముతున్నారని దశరథ్ అడుగుతాడు. వస్తున్నాడని వాళ్ళే చెప్తారని బోర్డ్ మెంబర్స్ అంటుండగానే అప్పుడే వైరా వస్తాడు. కార్ దగ్గరున్న డ్రైవర్ కి వైరా మేనేజర్ హాయ్ చెప్తాడు. అతను ఎవరని వైరా అడుగుతాడు. శివన్నారాయణ డ్రైవర్ అని అతను చెప్తాడు. ఆ తర్వాత వైరా లోపలికి ఎంట్రీ అవ్వగానే దశరత్, శివన్నారాయణ షాక్ అవుతారు. మేము అమ్మాలనుకుంటుంది తనకే అని బోర్డు మెంబర్స్ చెప్తారు. దశరథ్ కి వైరాకి మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడే శివన్నారాయణ మేనేజర్ కార్తీక్ దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తాడు. కార్తీక్ లోపలికి రావడానికి శివన్నారాయణ పర్మిషన్ అడుగుతాడు. కార్తీక్ ని రమ్మని శివన్నారాయణ చెప్తాడు. మరొకవైపు వంట చేస్తూ దీప మామిడి కాయ పుల్లగా ఉందో లేదో చూస్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. ఏంటి ఏదైనా విశేషామా పుల్లటిది తింటున్నావని అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వచ్చి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు అత్తయ్య అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్ లోపలికి వస్తాడు. మీరు పిల్చింది డ్రైవర్ నా అని వైరా వెటకారంగా మాట్లాడుతాడు. అతను మాజీ సీఈఓ.. నా మనవడు అని శివన్నారాయణ చెప్పగానే వైరా షాక్ అవుతాడు.  ఆ తర్వాత కార్తీక్ బోర్డ్ మెంబర్స్ తో మాట్లాడి కన్విన్స్ చేసి షేర్స్ అమ్మకుండా చేస్తాడు. దాంతో వైరా నీతో మాట్లాడాలి కార్తీక్.. బయట వెయిట్ చేస్తానని వెళ్తాడు. బావని ఎందుకు పిలిచారు.. నన్ను ప్రతిసారీ జోకర్ ని చేస్తున్నారని చెప్పి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. శివన్నారాయణ, దశరథ్ ఇద్దరు కార్తీక్ కి థాంక్స్ చెప్తారు. కార్తీక్ బయటకు వెళ్లి వైరాతో మాట్లాడతాడు. నేను మీ మావయ్య తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.. నువ్వు అడ్డురాకని కార్తీక్ కి వైరా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య కోసం వెళ్ళిన రాజ్.. తన మాట మార్చుకుంటాడా!

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -848 లో.....నా నిర్ణయం అయితే నేను మార్చుకోను. కావ్యని ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు కానీ నేను చెప్పింది చెయ్యాలని రాజ్ తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఇక గొడవలు అయితే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పు జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంది. అత్తయ్య అన్ని మాటలు అంటుందిని కళ్యాణ్ తో అప్పు చెప్తూ బాధపడుతుంది. అసలు అలా వదినని అమ్మ అన్ని మాటలు అనడానికి కారణం నువ్వే.. నువ్వు సరిగ్గా భోజనం చెయ్యకపోవడంతో నీ కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని అమ్మ అంటుందని అప్పుతో కళ్యాణ్ అంటాడు. ఇక జరిగింది చాలు అక్కకి నిజం చెప్తానని అప్పు వెళ్తుంటే వద్దు అన్నయ్య చెప్పకుండా అబార్షన్ చెయ్యాలని చేస్తూన్నాడు కదా.. ఇప్పుడు నువ్వు చెప్తే ఎలా అని అప్పుని కళ్యాణ్ ఆపుతాడు. నువ్వు ఈ జ్యూస్ తాగు లేదంటే అమ్మ మళ్ళీ గొడవ చేస్తుందనగానే అప్పు తాగుతుంది. మరొకవైపు రాజ్ మారేలా లేడని ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి తన గదిలో పెట్టి వెళ్లిపోతుంది. మరుసటి రోజు పనిమనిషి రూమ్ క్లీన్ చేస్తుంటే ఆ లెటర్ బయట పడుతుంది. అది చూసి అపర్ణ చదువుతుంది. కావ్య వెళ్ళిపోయిందని తెలుసుకొని షాక్ అవుతుంది. ఇంట్లో అందరిని పిలిచి విషయం చెప్తుంది. నీ వల్లే నా కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని రాజ్ పై అపర్ణ కోప్పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని రుద్రాణి అంటుంది. దాంతో సుభాష్ తనపై కోప్పడతాడు. కావ్య ఖచ్చితంగా తన పుట్టింటికి వెళ్లి ఉంటుంది అపర్ణ, నువ్వు కనకం కి కాల్ చెయ్యమని సుభాష్ చెప్తాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. అల్లుడు గారు రాలేదా అని కనకం అడుగుతుంది. తరువాయి భాగంలో కావ్య కోసం కనకం ఇంటికి రాజ్ వస్తాడు. మీ నిర్ణయం మార్చుకుంటేనే నేను వస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బలం కావాలంటే తాగాలి పాలు... నాకు కావాలి బాలు 

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఇల్లు-ఇల్లాలు-పిల్లలు వెర్సెస్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇక ప్రభాకర ఆమనితో ముచ్చట్లు పెట్టింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు రామరాజు గారు" అని అడిగింది. "మీరు ఎలా ఉంటారు అనుకున్నాను. చూస్తే మా వైఫ్ లో బుజ్జమ్మను చూసినట్టే ఉన్నారు" అని చెప్పాడు ప్రభాకర్. "బుజ్జమ్మ గారు సెట్ లో కూడా ఇంతే రొమాంటిక్ గా ఉంటారా ఏంటి" అంటూ ఆమనిని అడిగింది. "ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు" అని చెప్పింది. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి వచ్చిన హీరో బాలు శ్రీముఖికి ఒక కంప్లైంట్ చేసాడు. "వీడికి ఎంత కస్టపడి ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే షాప్ ఓనర్ లా రావాలి కానీ వీడేమో మెకానిక్ షాప్ ఓనర్ లా వచ్చాడు." అంటూ సీరియల్ లో తన తమ్ముడు మనోజ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక మనోజ్ ఐతే తానూ వేసుకొచ్చిన బ్లూ కలర్ డ్రెస్ ని కింద నుంచి పై వరకు చూసుకుని కొంచెం ఫీలయ్యాడు. దాంతో సెట్ లో ఉన్నవాళ్ళంతా నవ్వేశారు. ఇక సీరియల్ లోని మీనా గురించి రెండు లైన్స్ చెప్పాడు హరి.."అందరి మీద పడుతుంది వానా. అందరి మనస్సులో ఉంటుంది మీనా" అనేసరికి "అబ్బో" అంటూ అరిచింది శ్రీముఖి. "బలం కావాలంటే తాగాలి పాలు...కానీ నాకు బలం రావాలంటే కావాలి బాలు" అంటూ శ్రీముఖి మంచి జోష్ తో చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే ఈ షోలో బాలును చూసినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.  "బాలు నీ షో లో చూసి చాలా రోజులు అవుతుంది , బాలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.బాలు కోసం ఈ వీక్ షో కచ్చితంగా చూడాల్సిందే." అంటూ కామెంట్ చేశారు.

Bigg Boss 9 Telugu: డ్యాన్స్ తో ఇరగదీసిన సుమన్ శెట్టి.. ఆటలో సంజనని ఓడించాడుగా!

  బిగ్ బాస్ సీజన్-9 లో ప్రస్తుతం టాస్క్ ల పరంపర సాగుతుంది. ఎవ్వరు తగ్గటం లేదు.. ఎందుకంటే డూ ఆర్ డై సిచువేషన్ ఉంది. ఎందుకంటే ఈ వీకెండ్ లో వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో హౌస్ లీస్ట్ లో ఉన్నవారు ఎలిమినేషన్ అవుతారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే గేమ్ లలో ఎవరు బాగా ఆడి టేబుల్ లో టాప్ లో ఉంటారో వాళ్ళు సేఫ్.. కానీ లీస్ట్ లో ఉన్నవాళ్ళు డేంజర్ జోన్ . ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లే సమయం వచ్చింది. అయితే ఎంటర్‌టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్కులో గెలవడం కూడా అంతే ముఖ్యం. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్‌లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటికి రావాలి. ఏ జట్టు సభ్యులైతే ఎక్కువసార్లు ముందుగా బయటికొస్తారో వాళ్లు ఈ టాస్కులో విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక సాంగ్​ మొదలవగానే సుమన్ శెట్టి అద్దిరిపోయేలా స్టెప్పులేశాడు. మిగిలిన అమ్మాయిలతో కలిసి సుమన్ శెట్టి వేసిన డ్యాన్స్ చూసి అందరూ తెగ నవ్వుకున్నారు.  నాది నక్లెస్ గొలుసు పాటకి సుమన్ శెట్టి, సంజనా గల్రానీ చేసిన డ్యాన్స్ నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.  ఇంతలో మ్యూజిక్ స్టాప్ చేసి ఆరెంజ్ కలర్ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అందరికంటే ముందు దివ్య ఆ హోల్​లో దూరింది. వెనకాల నుంచి మిగిలిన వాళ్లు లాగినా సరే బయటపడి గెలిచింది దివ్య. అలా ఈ గేమ్ మూడు  సార్లు జరిగింది. మూడో రౌండ్  లో సుమన్ శెట్టి-సంజనా ఉండగా.. సుమన్ శెట్టి చిరుత వేగంతో వచ్చి హోల్ నుండి బయటకి వచ్చేశాడు. దాంతో సుమన్ శెట్టి టీమ్ గెలిచింది. సంజనా టీమ్ ఓడిపోయింది. ఇలా నిన్నటి టాస్క్ లో భరణి-దివ్యలతో పాటుగా సుమన్ శెట్టి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. 

Bigg boss 9 Telugu : సేఫ్ జోన్ లో ఆ ఇద్దరు.. ఇంటికి వెళ్ళిపోతానంటూ సంజన ఏడుపు!

  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్ప అందరు డేంజర్ జోన్ లో ఉన్నారు. అందరూ టీమ్ లుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అయిదు టీమ్ లలో ఒక్కొక్కరు డాన్స్ చెయ్యాలి.. పాట ఆపినప్పుడు బిగ్ బాస్ చెప్పిన కలర్ గల హోల్స్ నుండి కంటెస్టెంట్స్ వెళ్ళాలి. అలా ఎవరు ముందు వెళ్తారో వాళ్లే ఆ రౌండ్ విన్నర్.. మొదటి రౌండ్ కి కళ్యాణ్, తనూజ టీమ్, రెండో రౌండ్ కి భరణి దివ్య టీమ్.. మూడో రౌండ్ కి డీమాన్ పవన్, రీతూ.. నాలుగో రౌండ్ కి సుమన్ శ్రీజ, చివరగా సంజన ఫ్లోరా ఉన్నారు. పాయింట్స్ బోర్డు పై సంజన ఫ్లోరా నాలుగో స్థానంలో, సుమన్ శ్రీజ అయిదో స్థానంలో ఉన్నారు. అయితే మొదటి స్థానంలో ఉన్న భరణి, దివ్యకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. చివరి రెండు స్థానాలలో ఉన్న ఒక టీమ్ ని తీసేయమని భరణి, దివ్య టీమ్ కి బిగ్ బాస్ చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి డిస్కషన్ చేసుకొని సంజన, ఫ్లోరాలని టాస్క్ నుండి ఎలిమినేట్ చేస్తారు. దాంతో సంజన ఏడుస్తుంది. నన్ను ఇంటికి పంపించండి బిగ్ బాస్ అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత పిరమిడ్ టాస్క్ లో తనూజ, కళ్యాణ్ మొదటగా పూర్తి చేశారు. దివ్య, భరణి రెండవ  స్థానంలో టాస్క్ ని పూర్తి చేశారు, సుమన్ శెట్టి, శ్రీజ మూడవ స్థానం, రీతూ, డిమాన్ నాల్గవ స్థానంలో పూర్తి చేశారు. పాయింట్స్ బోర్డు లో మొదటి స్థానంలో భరణి, దివ్య ఉన్నారు. కాగా వాళ్ళని సేఫ్ జోన్ కి బిగ్ బాస్ పంపిస్తాడు. ఇక రెండో స్థానంలో ఉన్న కళ్యాణ్, తనూజ ఇద్దరిలో ఒకరికి మాత్రమే సేఫ్ జోన్ ఛాన్స్ వస్తుందని బిగ్ బాస్ చెప్పగా ఇద్దరు డిస్కషన్ చేసుకొని కళ్యాణ్ ని సేఫ్ జోన్ అని తనూజ చెప్తుంది. ఇక డేంజర్ జోన్ లో తనూజ ఉంటుంది. 

Jayam serial : జయం సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. గంగ కోసం వచ్చిన రుద్ర!

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -80 లో.. నిన్ను ఎంతో నమ్మాను.. నీలో నా కొడుకు ప్రేమని  చూసుకున్నాను కానీ నువ్వు నాకు నమ్మకద్రోహం చేసావ్.. నాతో ప్రేమగా ఉంటుంటే ఆ రుద్ర ఏం తప్పు చెయ్యలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావని గంగపై శకుంతల కోప్పడుతుంది. నేను అలా మీకు నమ్మకద్రోహం చెయ్యలేదని శకుంతల కాళ్లపై పడుతుంది గంగ. అయిన వినకుండా శకుంతల చిరాకు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గంగ తన గదివైపు వెళ్తుంటే.. ఏంటి గంగ ఎక్కడికి వెళ్తున్నావ్.. ఇంకా ఇంత జరిగిన కూడా ఇంట్లోకి వెళ్తున్నావ్ ఇంట్లో వాళ్లంతా నీపై చిరాకు పడుతున్నారని గంగతో ఇషిక అంటుంటే.. వెళ్తుందిలే ఇషిక అని వీరు అంటాడు. నాకు సంబంధించిన వస్తువులు పైన ఉన్నాయి.. అవి తీసుకొని రావడానికి వెళ్తున్నానని గంగ అంటుంది. ఆ తర్వాత మణికి వీరు ఫోన్ చేసి గంగని ఇంట్లో నుండి గెంటేసారు.. ఏం చేసుకుంటావో నీ ఇష్టమని చెప్తాడు. మరొకవైపు గంగ వెళిపోతు రుద్ర రూమ్ ముందు ఆగి నన్ను క్షమించండి అని చెప్తుంది. ఆ తర్వాత గంగ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మణి తాళితో రెడీగా ఉంటాడు. బలవంతంగా గంగ మెడలో తాళి కట్టబోతుంటే గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి వచ్చి మణి మెడపై కత్తిపీట పెడుతుంది‌. దాంతో మణి భయపడుతాడు. ఈ పైడిరాజ్.. నీ కూతురితో నా పెళ్లి చేస్తానన్నాడు.. డబ్బులు తీసుకున్నాడు.. నా డబ్బు నాకు ఇవ్వండి అని మణి అడుగుతాడు. తరువాయి భాగంలో గంగ ఇంట్లో లేదని రుద్రకి తెలిసి తన ఇంటికి వస్తాడు. నేను మీకు మాటిచ్చాను.. నీ కూతురిని జాగ్రత్తగా చూసుకుంటానని అందుకే గంగని నా వెంట తీసుకొని వెళ్తున్నానని గంగ చెయ్యి పట్టుకొని రుద్ర తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.