కామెడీ షో నుంచి ఆది వెళ్ళాడు...సద్దాం వచ్చాడు!

జబర్దస్త్ అనే కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఈ షోలో కొన్ని ఎపిసోడ్స్ నుంచి హైపర్ ఆది కనిపించడం లేదు. గతంలో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ కొద్ది రోజులుగా అసలు ఆది స్కిట్స్ లో కనిపించడం లేదు.   ఐతే ఇప్పుడు హైపర్ ఆది ప్లేస్ లోకి సద్దాం వచ్చాడు. ఇప్పటికే సద్దాం ఎంట్రీ ఇచ్చిన టు ఎపిసోడ్స్ కూడా సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతానికి జబర్దస్త్ లో సద్దాం టీమ్ చేస్తున్న కామెడీ నవ్వు తెప్పిస్తోందనే చెప్పొచ్చు. ఐతే ఆడియన్స్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు ఎందుకు అంటే హైపర్ ఆది కంటే కూడా సద్దాం మంచి కామెడీ చేస్తున్నాడని అంటున్నారు.  గతంలో హైపర్ ఆది లేని టైములో షోకి పెద్దగా రేటింగ్ వచ్చేది కాదు.  కానీ ఇప్పుడు షోని జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సద్దాం టీమ్ జబర్దస్త్ లో కనిపించేసరికి మల్లెమాలలో కొత్త కళ కనిపిస్తోంది.  జబర్దస్త్ లో హైపర్ ఆది లేకపొతే ముందుకు నడవదు..ఆడియన్స్ గోల చేస్తారు అనుకున్నటైములో సద్దాం ఎంట్రీతో జబర్దస్త్ కి మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రేటింగ్ వస్తే గనక  హైపర్ ఆది పూర్తిగా ఈటీవీకి బైబై చెప్పేసినా సద్దాం ఆ బాధ్యతలను చూసుకోగలుగుతాడు అనే నమ్మకం మల్లెమాల యాజమాన్యంలో కనిపిస్తోంది.

కట్టప్ప లేకుండా బాహుబలి లేదు...ఆదిరెడ్డి లేకుండా బిగ్ బాస్ సీజన్ 6 లేదు

బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ రేవంత్ గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, మంచి సింగర్ గా అందరికీ పరిచయమే. రేవంత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసాడు.  " హౌస్ లో నేను సెంటిమెంట్ కోసమో ఇంకా దేని కోసమే గేమ్ ఆడలేదు..స్పెషల్ గా  కంటెంట్ ఇవ్వడానికి కూడా నేనెప్పుడూ  ట్రై చేయలేదు. హౌస్ లోకి వెళ్లడానికి ముందు నాకు ఆదిరెడ్డి ఎవరో తెలియదు. అక్కడికి వెళ్లాకే ఆయనతో పరిచయమయ్యింది. దేవుడిచ్చిన మంచి ఫ్రెండ్ ఆదిరెడ్డి.  ఆదిరెడ్డి  బిగ్ బాస్ షోకి చాలా కష్టపడి వచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కానీ ఆదిరెడ్డికి ఉన్నన్ని కష్టాలు మాత్రం ఎవరికీ రాకూడదు అని నేను అనుకుంటాను . ఆదిరెడ్డి ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ గురించే మాట్లాడేవాడు. ఎవరికైనా సరే హెల్ప్ చేసే వ్యక్తి తను.. కట్టప్ప లేకుండా బాహుబలి సినిమా ఎలా అర్ధం కాదో.. ఆదిరెడ్డి లేని బిగ్ బాస్ కూడా అంతే" అని అన్నాడు రేవంత్.  ఇక వెంటనే  ఆదిరెడ్డికి కాల్ చేసిన యాంకర్ .. రేవంత్ గురించి ఒక మాట చెప్పమని అడిగేసరికి  ఆదిరెడ్డి స్పందిస్తూ .. "రేవంత్ ను టఫ్ కంటెస్టెంట్ గా  అందరూ భావించడం వల్లనే ఆయనలో తప్పులు వెతికేవాళ్లం. రేవంత్ కి ఉన్న కసి యూత్ లో ఉంటే జీవితాలే మారిపోతాయి" అంటూ చెప్పాడు ఆదిరెడ్డి..

నచ్చిన వాళ్లకు విన్నర్‌ని.. నచ్చని వాళ్లకు రన్నర్‌ని!

బిగ్ బాస్ సీజన్ 6 శ్రీహాన్ టాప్ 2 లో నిలబడి రన్నరప్ అయ్యాడు. నిజానికి రేవంత్ కంటే కూడా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ చెప్పారు. అందుకే శ్రీహాన్ రన్నర్ కం విన్నర్ అని చెప్పారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రీహాన్ మాట్లాడాడు. "ఫైనల్స్ లో స్టేజి మీద ఉండే ఇద్దరిలో నేను, రేవంత్ ఉండాలి అని కోరుకున్నాను. రేవంత్ ఆల్రెడీ సింగర్ కాబట్టి మంచి క్రేజ్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ ఓట్లు వస్తాయనే అనుకున్నా..కానీ నా ఆటతీరుపై నాకు ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఉంది." అన్నాడు శ్రీహాన్. ఇక ఫైనల్ గా "నాకే ఎక్కువగా ఓట్లు వచ్చాయన్న విషయం బిగ్ బాస్ ఎప్పుడైతే రివీల్ చేశారు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నచ్చిన వాళ్ళు విన్నర్ అని , నచ్చని వాళ్లకు రన్నర్ అని అనుకుంటారు. ఏదైతే ఏముంది. ఇకపోతే  నేను సిరి ఒకే టైంలో బిగ్ బాస్ కి వెళ్లుంటే బాగుండేది అనే కామెంట్స్ గురించి నాకు తెలిసింది కానీ మాకు మాత్రం ఆ ఆలోచన లేదు. ఎందుకంటే ఎవరి ఐడెంటిటీ వారికి చాలా ఇంపార్టెంట్ " అని చెప్పాడు శ్రీహాన్.

ఈయన ఇన్పుట్స్ ఇస్తారు..ఆయన ఏ స్టెప్ ఐనా వేసేస్తారు

టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. ఆయన ఏ పాట చేసినా అది సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సంపాదించుకుంటాయి. ఇప్పుడు ఆయన కోరియోగ్రఫీ చేసిన చిరంజీవి మూవీ "వాల్తేరు వీరయ్య"..బాలయ్య మూవీ "వీరసింహారెడ్డి" సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. వీటికి సంబంధించి ఆయన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.  "వాల్తేరు వీరయ్య మూవీలోని ఐదు సాంగ్స్ కి నేనే కోరియోగ్రఫీ చేసాను. చిరంజీవి గారి గ్రేస్ ని దృష్టిలో పెట్టుకుని మరీ స్టెప్స్ ని కంపోజ్ చేసాను. ఎందుకంటే ఆడియన్స్ కి ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని ఎక్కడ తగ్గించకుండా డాన్స్ కంపోజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ముందుగా నేను రెండు మూడు వెర్షన్స్ చేసి ఆయనకు చూపిస్తాను. ఆయనకి ఏది నచ్చితే దానితోనే  సెట్స్ పైకి వెళతాను. చిరంజీవి గారు కూడా మంచి ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు." అని అన్నారు. ఇక బాలయ్య సార్ విషయానికొస్తే,  'వీరసింహా రెడ్డి' లో రెండు సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసాను. ఆయన గురించి చెప్పక్కర్లేదు..ఎందుకంటే ఆయన  ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో ఆ విధంగా స్టెప్స్ కంపోజ్ చేయాలి. ఆయన స్టెప్స్ కి విజిల్స్ పడేలా కంపోజ్ చేయాల్సి ఉంటుంది. డాన్స్ కంపోజ్ విషయంలో  బాలయ్యగారు చేంజెస్ ఏమీ చెప్పరు. అది ఎలాంటి స్టెప్  అయినా వెనకాడకుండా చేస్తారు. నేను చేసిన భారీ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్ అవుతుండేసరికి  నాలో యాంగ్జైటీ పెరుగుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.

పొట్టి నిక్కరులో శ్రీముఖి..మరీ ఇంత లావుగా ఉందేంటి అన్న అర్జున్!

బీబీ జోడి షో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ తమ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో బాగా ఆకట్టుకున్నారు.  ఐతే యాంకర్ శ్రీముఖి తన గ్లామర్ తో అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ పొట్టి నిక్కరులో స్టేజి మీద మెరిసిపోయింది. డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లో భాగంగా అర్జున్ కళ్యాణ్ - వాసంతి ఇద్దరూ బాగా డాన్స్ చేశారు. వాళ్ళ ఇద్దరి డాన్స్ అయ్యాక శ్రీముఖి అర్జున్ తో కలిసి ఒక గేమ్ ఆడింది. అతని కళ్ళకు గంతలు కట్టి నలుగురిలో ఉన్న వాసంతి చేయి ఏదో గుర్తుపట్టాలని చెప్పింది. ముందుగా  శ్రీముఖి తన చేతిని అర్జున్ కి ఇచ్చింది. ఇక అర్జున్ ఆమె చేయిని పట్టుకుని "ఏమిటి ఈ చేయి మరీ ఇంత లావుగా ఉంది...ఎవరిదో అబ్బాయి చేయి అది" అని ఊహించని కామెంట్ అనేసరికి శ్రీముఖి షాకైపోయింది. స్టేజి మీద ఉన్నవాళ్ళంతా పడీ పడీ నవ్వేశారు.

శ్రీహాన్-సిరితో కలిసి వెబ్ సిరీస్... హిట్ పెయిర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న శేఖర్ మాస్టర్!

బిగ్ బాస్ సీజన్ 6  రన్నర్ శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. టైటిల్ విన్నర్ కావాల్సిన శ్రీహాన్ ని బిగ్ బాస్ టీమ్ ట్రాప్ చేసి ఆ కప్ రేవంత్ కి దక్కేలా చేశారు. మళ్ళీ ఫైనల్ ట్విస్ట్ గా రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. ఏదేమైనా సీజన్ పూర్తయ్యింది. ఇప్పుడు శ్రీహాన్ కి ఇండస్ట్రీ నుంచి మంచి  అవకాశాలు రావడం మొదలయ్యింది. నటుడిగా బిజీ అవుతున్నాడు. శ్రీహాన్-సిరి కాంబినేషన్ లో స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.  బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే టఫ్ కంటెస్టెంట్ గా శ్రీహాన్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదట్లో కొన్ని వెబ్ సిరీస్ లో సిరితో నటించి పేరు తెచ్చుకున్నాడు. సిరి హన్మంత్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్.. ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. శేఖర్ మాస్టర్ ఇప్పుడు వాళ్ళ క్రేజ్ ని ఉపయోగించుకోవడానికి కొత్త వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు.  త్వరలోనే వెబ్ సీరీస్ ను ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొరియోగ్రాఫర్ గా డాన్స్ షోస్ తో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు.

ప్రాణమున్నంత వరకూ ప్రేమిస్తానంటూ సోహైల్ కి రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసిన ఇనాయ!

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్  ఇనాయ సుల్తానా గురించి అందరికీ తెలుసు. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి పేరు తెచ్చుకుని హీరో అయ్యాడు సోహైల్ కూడా బాగా తెలుసు. ఇనాయ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆర్జే సూర్యతో కలిసి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం సోహైల్ కి లవ్ ప్రొపోజ్ చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక రెస్టారంట్ లో "లక్కీ లక్ష్మణ్" మూవీ  టీమ్ కూర్చుకుని ఉండగా ఇనాయ లోపలికి  ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సోహైల్ హీరోగా నటించాడు. "నువ్ లోపలికి  వస్తుంటే ఏమిటి ఇలా వచ్చింది అని షాకయ్యాను" అన్నాడు సోహైల్.  "బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ నీతోనే మాట్లాడుతున్నాను. నా మనసులో ఉన్న విషయం నీకు చెపుదామనుకుంటున్నా.. మీరేమనుకున్నా పర్వాలేదు" అని ఫ్లవర్ బొకే తీసుకుని సోహైల్ దగ్గరకు వెళ్లి "ప్రేమ ఉన్నంతవరకు మాత్రమే కాదు నా ప్రాణం ఉన్నంతవరకు ప్రేమిస్తాను" అని మోకాళ్లపై కూర్చుని ఒక రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసింది ఇనాయ. "మీకు ప్రొపోజ్ చేయడం కోసమే ఇలా రెడీ అయ్యి వచ్చాను..మీరంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ లో చూసినప్పటినుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఎలా చెప్పాలో తెలియడం లేదు బిగ్ బాస్ లో మీరంటే క్రష్ అని చెప్పా కానీ నా మనసులో ఫీలింగ్ ఎప్పుడూ చెప్పలేదు ..ఐ రియల్లీ లవ్ యు" అని సిగ్గుపడుతూ చెప్పింది ఇనాయ. సోహైల్ కి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థంకాలేదు.   ఇంతలో "వెయిట్ ఫర్ ది సోహైల్ రెస్పాన్స్" అని ఒక లైన్ కనిపించింది.  ఐతే ఇనాయ ప్రొపోజల్ ని సోహైల్ యాక్సెప్ట్  చేస్తాడా, లేదా  అనేది తెలియాలంటే ఫుల్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయాలి.

స్టార్ యాంకర్ తో మంతనాలు చేస్తున్న బిగ్ బాస్..నెక్స్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని..

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రేటింగ్ రాకపోవడం, విమర్శలు ఎదుర్కోవడం వంటి వాటి కారణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  2017 లో స్టార్ట్ ఐన ఈ షో ఎంతో సక్సెస్ అయ్యింది. ఐతే  బిగ్ బాస్ సీజన్- 6  అందుకు భిన్నంగా చాలా నిరుత్సాహపరిచింది.  ఈ సీజన్ లో  ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రలోభాల కారణంగా నిజాయితీగా ఆడిన కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఇక వీటన్నిటి వలన  నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి రానా దగ్గుబాటిని హోస్ట్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కొన్ని రోజుల నుంచి ఈ న్యూస్ ఇలా వైరల్ అవుతుంటే ఇప్పుడు మరో న్యూస్ తెర మీదకు వచ్చింది. అదే బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్, ప్రస్తుత స్టార్ యాంకర్ శ్రీముఖిని కలిశారంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.  బిగ్ బాస్ మేకర్స్ ఎలాగైనా సీజన్ 7 కి గ్రాండ్ సక్సెస్ చేయాలనే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హోస్ట్స్ వేట చాలా స్పీడప్ చేశారు. ఇకపోతే వచ్చే ఏడాది జులైలో ఈ సీజన్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

'అన్ స్టాపబుల్' షూట్ లో పవర్ స్టార్.. త్రివిక్రమ్ కి బదులుగా ఆయన!

నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓటీటీ షో 'అన్ స్టాపబుల్' సీజన్-2 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మంగళవారం) ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' మూవీ సెట్స్ లో పవన్ సందడి చేసిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వీరిద్దరూ కలిసి అన్ స్టాపబుల్ షోలో చేసే అల్లరిని చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి ఆశ నెరవేరనుంది. నేడు పవన్ ఎపిసోడ్ షూట్ జరుగుతోంది. పవన్ తో పాటు ఈ షోలో ఆయన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ పాల్గొంటారని భావించారంతా. కానీ ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ జాగర్లమూడి సందడి చేయనున్నారట. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడనున్నాడని సమాచారం. పవన్, సాయి తేజ్ కలిసి 'వినోదయ సిత్తం' రీమేక్ లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. దాని గురించి ఈ షోలో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. 'అన్ స్టాపబుల్' షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన పవన్ కి బాలకృష్ణ, అల్లు అరవింద్ ఘన స్వాగతం పలికారు. ఈ ఎపిసోడ్ ని రెండో సీజన్ ముగింపు ఎపిసోడ్ గా ప్రసారం చేయనున్నారని సమాచారం.

నీకు, మీ ఫ్యామిలీకి యాటిట్యూడ్ అంటూ ఒకరినొకరు స్టేజి మీదే తిట్టుకున్న అవినాష్, ప్రభాకర్

బుల్లితెర యాక్టర్స్ కి ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. అలాంటి బుల్లితెర ద్వారా పరిచయమైన వ్యక్తి నటుడు ప్రభాకర్. ఐతే రీసెంట్ గా ప్రభాకర్ ని ఆయన ఫామిలీని స్టేజి మీద అవమానించాడు అవినాష్. "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇందులో "కృష్ణ ముకుంద మురారి" సీరియల్ తరపున ప్రభాకర్ వచ్చాడు. అలాగే "అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు" అనే సీరియల్ టీమ్ కూడా వచ్చింది. వీళ్ళతో గేమ్స్ ఆడించింది హోస్ట్ శ్రీముఖి. ఈ గేమ్స్ లో భాగంగా కమెడియన్ అవినాష్ ముగ్గురమ్మాయిలను ఎత్తుకున్నాడు. అది చూసిన వెంటనే శ్రీముఖి అవినాష్ భార్య అనూజకు ఫోన్ చేసి ఇంట్లో నిన్ను ఎన్ని సార్లు ఎత్తుకున్నాడు అని అడిగేసరికి ఆమె 3 - 4 సార్లు అని చెప్పింది. కానీ ప్రోగ్రాంలో మాత్రం ముగ్గురమ్మాయిలను ఎత్తుకున్నాడు అని శ్రీముఖి చెప్పింది. అది ప్రొఫెషన్ లో భాగం కదా అని అంది అనూజ..ఇంతలో "వాడి ప్రొఫెషనే అది అని చెప్పండి" అంటూ నటుడు ప్రభాకర్ కౌంటర్ వేసాడు.  తర్వాత కాసేపు డాన్స్, గేమ్స్ తో ఎంటర్టైన్ చేసింది శ్రీముఖి. అదే టైంలో మళ్ళీ "ఎందుకురా నీకు అంత ఆటిట్యూడ్ " అని ప్రభాకర్ మళ్ళీ అవినాష్ ని టార్గెట్ చేసేసరికి "మీ అబ్బాయికి ఎందుకంత యాటిట్యూడ్" అని రివర్స్ లో అవినాష్ అనేసరికి అక్కడున్న వాళ్లంతా షాకైపోయారు. "నువ్వు యాటిట్యూడ్ తగ్గించుకో" అని ప్రభాకర్ చాలా గట్టిగా అరిచాడు. ఆ మాట విన్న అవినాష్ "నాకు యాటిట్యూడ్ లేదు అర్దమయ్యిందా..మీకు మీ ఫామిలీకి ఉంది అర్దమయ్యిందా" అని షాకింగ్ కామెంట్స్ చేసాడు అవినాష్.  

సుమ అలా అందరినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టే ఆ పేరు...

సుమకి కొత్త అర్ధం హైపర్ ఆది. "వేర్ ఈజ్ ది పార్టీ" ఈవెంట్ కి సంబంధించిన మరో కొత్త  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ యాక్టర్స్ అంతా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇంతలో "మౌన పోరాటం" సీరియల్ లో నటిస్తున్న యమున వచ్చి "ఇంతకు మీరు మౌనపోరాటం చూస్తారా..ఐతే లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చెప్పండి" అని హోస్ట్ సుమకి రిస్కీ ప్రశ్న వేసేసరికి సుమ సైలెంట్ గా నిలబడి "నేను మౌన పోరాటం చేస్తున్నాను" అని కౌంటర్ వేసింది.  తర్వాత ఆది సగం వైట్, సగం నారింజ రంగుతో ఉన్న షర్ట్ వేసుకొచ్చాడు... దాంతో పాటు ఒక చేతికి మల్లె పూల దండ చుట్టుకుని మరో చేతిలో కమండలం పట్టుని స్టేజి మీదకు డాన్స్ చేస్తూ వచ్చాడు. "ఈరోజు ఎలాగైనా పెళ్లి అవ్వాలి లేదా హిమాలయాలకు వెళ్ళిపోవాలి" అంటూనే స్టేజి మీద కూర్చున్న ఒక బ్యూటిఫుల్ లేడీని చూసి "ఎవరో ఆ  అమ్మాయి చాలా బాగుంది అక్కడ"..అనేసరికి "ఏయ్ నువ్వు చూడొద్దు, మాట్లాడొద్దు" అని రూల్స్ పెట్టేసరికి ఆదికి ఫ్రస్ట్రేషన్ వచ్చి "నాకు ఇప్పుడు అర్ధమయ్యింది సుమ అంటే అర్ధమేంటో ...సు అంటే సూడనివ్వదు, మ అంటే మాట్లాడనివ్వదు" అనేసరికి షాకయ్యింది సుమ..

యాంకరింగ్ కి గుడ్ బై..సుమ షాకింగ్ నిర్ణయం!

యాంకర్ సుమ తెలుగు ఆడియన్స్ కి ఎంతో దగ్గరైన మలయాళీ అమ్మాయి. ఎవరినైనా  మాటలతో, హావభావాలతో, యాంకరింగ్ తో కట్టిపడేస్తుంది సుమ. ఈవెంట్స్ లో మైక్ పట్టుకుంటే అంతే.  అక్కడ ఉన్నది స్టార్ హీరో కావొచ్చు అప్ కింగ్ హీరోయిన్ ఐనా కావొచ్చు ఆమె పేల్చే పంచులకు పగలబడి నవ్వాల్సిందే.  ఐతే ఇప్పుడు సుమ యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇటీవల రిలీజ్ ఐన "వేర్ ఈజ్ ది పార్టీ" లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయాన్ని వెల్లడించింది. "నేను మలయాళీ ఐనా కూడా ఇక్కడ సెటిల్ అయ్యాను అంటే దానికి కారణం తెలుగు వాళ్ళు చూపిన అభిమానం, ప్రేమ.. వాళ్ళు లేకపోతే నేను లేను..ఇది రాసిపెట్టుకోండి..కానీ నేను కొంత విరామం ఐతే తీసుకోవాలని అనుకుంటున్నాను"  అని చెప్తూ కన్నీళ్లు తుడుచుకుంది సుమ. ఎంత వరకు మాట్లాడాలో తెలిసిన ఒక బెస్ట్ యాంకర్ సుమ. కొత్త యాంకర్స్ కి ఆమె ఒక నిఘంటువు లాంటిది అని చెప్పొచ్చు.  

అలనాటి అందాల నటిని ఏడ్పించిన అవినాష్

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి అనే డాన్స్ షో రీసెంట్ గా బుల్లితెర మీద అలరించడానికి వచ్చింది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఈ షోకి జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, సదా, తరుణ్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. రాబోయే వారం షోలో జోడీస్ చేసిన పెర్ఫార్మెన్సెస్ అద్దిరిపోయాయి. ఇనాయ-రోల్ రైడా జోడి పర్లేదనిపించే పెర్ఫార్మెన్స్ చేసి చూపించింది. ఈ జోడికి ఆరియానా-అవినాష్ జోడి కలిసి 6 మార్క్స్ మాత్రమే ఇచ్చింది. ఫిమేల్ లిరిక్స్ రోల్ రైడా పాడేశాడు  కాబట్టి ఈ మార్క్స్ ఇచ్చాం అని అవినాష్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసరికి మీ స్ట్రాటజీ నాకు అర్ధమవుతోందిలే అని ఇనాయ కౌంటర్ వేసింది. వెంటనే అవినాష్ లేచి నిలబడి నువ్వు ఇది బిగ్ బాస్ అనుకుంటున్నావ్..కానీ కాదు బీబీ జోడి..పాజిటివ్ గా మాట్లాడినప్పుడు పాజిటివ్ గా ఎలా  రియాక్ట్ అవుతారో నెగటివ్ కూడా తీసుకోండి అన్నాడు.. తర్వాత ఆరియానా-అవినాష్ జోడి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. "రాధ గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి..ఎలా ఉన్నారు" అని అవినాష్ కృష్ణ గారి గొంతును ఇమిటేట్ చేసేసరికి రాధ ఏడుస్తూ "నేను ఆయన లేరు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను" అని కన్నీళ్లు తుడుచుకున్నారు.

నారి నారి నడుమ మురారి!

ఓటిటి వేదిక ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ షోకి మంచి స్పందన లభిస్తోంది. మొదటి సీజన్ నుండి భారీ వ్యూయర్ షిప్ తో ఓటిటి లో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకొని, అన్ స్టాపబుల్ గా సీజన్-2 లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్-2 లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఎపిసోడ్‌-6 లో జయప్రద, జయసుధ ఇద్దరు గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ లో బాలకృష్ణ వారిద్దరి మధ్యలో నిల్చొని 'నారి నారి నడుమ మురారి' అని అనడంతో షోలో నవ్వులు పూసాయి. "మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు?" అని బాలకృష్ణ అడిగాడు. "మొదట్లో షూటింగ్ లో కలిసాం. నేను తరచూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని.. వాళ్ళింట్లో తనని 'సుజాత' అని పిలిచేవాళ్ళు. తర్వాత నుండి నేను కూడా తనని సుజాత అనే పిలిచేదాన్ని" అని జయప్రద చెప్పింది. "అంతకు ముందు బాగా మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత అడవి రాముడు సినిమాతో మేం బాగా క్లోజ్ అయ్యాం. మేమిద్దరం దాదాపు నలభై రోజులు ఒక ఫారెస్ట్ లో ఉన్నాం" అని జయసుధ చెప్పింది.  "ఇద్దరు కలిసి సినిమాల్లో నటించేవాళ్ళు. ఆ సినిమాల్లో ఎవరో ఒకరు హీరోని దక్కించుకునేవాళ్ళు..అలా నిజ జీవితంలో కూడా జరిగిందా?" అని బాలకృష్ణ అడిగేసరికి ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ వారిద్దరిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళ స్నేహాన్ని పరీక్షించే ఒక గేమ్ ని  ఆడించాడు. అందులో బాలకృష్ణ చిలిపి సమాధానాలు చెప్తూ.. షోలో నవ్వులు పూయించాడు. 

నిఖిల్ ఇచ్చిన పార్టీలో మెరిసిన సెలెబ్స్!

యూట్యూబర్ గా నిఖిల్ విజయేంద్రసింహ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. యాంకర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లు ఎన్సర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతను చేసే ఇంటర్వ్యూలు కూడా ఎంతో ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.  టాలీవుడ్ నుంచి  బుల్లితెర నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను నిఖిల్  ఇంటర్వ్యూలు చేశాడు.  కొన్ని ఇంటర్వ్యూలు ఫన్నీగా ఉంటాయి ఇంకొన్ని మాత్రం గాసిప్స్ గా మారుతూ ఉంటాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఫేస్ బుక్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో  సెలబ్రిటీలను అడగాలనుకుని అడగలేకపోయిన ఎన్నో ప్రశ్నలను నిఖిల్ సరదాగా నవ్వుతూ అడిగేస్తూ ఉంటాడు. అలా నిఖిల్ ఎంతో బుల్లి తెర సెలబ్రిటీస్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.   క్రిస్మస్ పండగ సందర్భంగా నిఖిల్ తన ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేసి స్మాల్ , బిగ్ స్క్రీన్ సెలెబ్స్ ను ఇన్వైట్ చేసాడు. దానికి  సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్ తన  ఇన్స్టాగ్రామ్ లో  పోస్ట్ చేశాడు. నిఖిల్ ఇచ్చిన పార్టీలో మంచు లక్ష్మి, ప్రగతి, రాజ్ తరుణ్,  హంసానందిని, రాజశేఖర్ కుమార్తెలు, యాంకర్  అనసూయ, యాంకర్ ప్రదీప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలబడ్డారు.

ఇప్పటికీ శ్మశానంలో పడుకుంటాను..రాకింగ్ రాకేష్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ అంటే తెలియని తెలుగు ఆడియన్స్ అంటూ ఎవరూ లేరు. చాలా మంది కమెడియన్స్ కి జబర్దస్త్ మంచి పేరు తెచ్చిపెట్టింది. చిన్నగా ఎదుగుతూ వచ్చిన రాకేష్ ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. చిన్న పిల్లలతో కలిసి.. రాకేష్‌ చేసే  స్కిట్స్‌ కి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. రీసెంట్ గా రాకేష్‌ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.   ‘‘ఈ రోజు  నేను అనుభవిస్తున్న ఈ స్టార్‌ హోదా ఓవర్‌నైట్‌లో నాకు రాలేదు. ఎన్నో కష్టనష్టాలను దాటుకుని.. ఈ స్టేజ్‌కు వచ్చాను. ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో కలలు కన్నాను. అవకాశాల కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ కి వచ్చాను.. దాదాపు 11 ఏళ్ల పాటు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ ఎం లాభం లేదు. ఒక  వైపు అవకాశాల కోసం ట్రై చేస్తూనే  మరో వైపు.. బతుకుదెరువు కోసం మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేసేవాడిని. ఈవెంట్లలో చిన్న చిన్న స్కిట్స్‌ చేసేవాడిని. ప్రోగ్రాం పూర్తయ్యి పేమెంట్‌ ఇచ్చే వరకూ  చేతులు కట్టుకుని అలాగే  నిలబడి ఉండేవాడిని. వాళ్లు.. వచ్చి నేను బాగా చేయలేదని చెబుతూ  500 రూపాయలు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయేవారు.  అప్పటికి  అదే మహాభాగ్యమని సరిపెట్టుకునేవాడిని..  ఇలా స్ట్రగుల్ అవుతున్న టైంలో నన్ను ధనరాజ్‌ అన్న  గుర్తించి.. అవకాశం ఇవ్వడంతో.. నా లైఫ్ టర్న్ అయ్యింది. ఆయన కారణంగానే  నేనిప్పుడు మీ ముందు ఇలా నిలబడ్డాను.  ప్రస్తుతం నాకు మంచి గుర్తింపు, డబ్బు అన్ని లభిస్తున్నాయి కానీ ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎన్నో చూశాను. ఒక్కోసారి అమ్మ పస్తులుండి.. మాకు అన్నం పెట్టేది.  ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు శ్మశనానికి వెళ్లి అక్కడ పాడుకుంటూ ఉంటాను . అక్కడ నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది..మొదట్లో నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. ఆ విషయం ఇంట్లో చెప్పినప్పుడు.. మా అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోతానని  నన్ను బెదిరించింది.  కానీ సుజాతతో పరిచయం అయ్యాక నా ఒపీనియన్ మారింది. ముందుగా ఆమె నన్ను ఇష్టపడింది. తను మా ఫ్యామిలీకి కూడా బాగా నచ్చింది. అలా మా ప్రేమకు పునాది పడింది’’ అని చెప్పుకొచ్చాడు.  

తను సైలెంట్‌, నేను వయొలెంట్.. అయినా మా ప్రయాణం అద్భుతం!

సీరియల్‌ నటి కరుణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె బుల్లితెర మీద ఒక వెలుగు వెలిగిన నటి. 'మొగలి రేకులు' సీరియల్‌ ద్వారా కరుణకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. సీరియల్స్‌, ఫోటోషూట్స్‌లో ఆమె వేసుకునే కాస్ట్యూమ్స్‌ కి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు.   ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పింది. "నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. 30 సినిమాల్లో యాక్ట్ చేసాను. ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోస్ అందరితో నేను నటించాను. "ఆహా" మూవీ ద్వారా నేను స్క్రీన్ మీద కనిపించాను. ఆ తర్వాత ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసాను. చిరంజీవి గారితో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ మూవీలో కూడా కనిపించాను. నా భర్త ఒక డైరెక్టర్‌. 2007లో తొలిసారి తను నాకు ప్రపోజ్‌ చేశాడు. ఐ లవ్యూ అని చెప్పలేదు.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను ఆ మాటకు షాకయ్యాను. ఎందకంటే తను చాలా సైలెంట్‌, నేను చాలా వయొలెంట్. మా రిలేషన్‌ ఎలా సాగుతుంది అనుకున్నాను. కానీ.. 15 ఏళ్లుగా మా ప్రయాణం అద్భుతంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది.  ‘‘నా భర్త తెలుగబ్బాయే.. మేం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు.. ఆ తర్వాత మధ్యలో ఒకసారి మిస్‌ క్యారేజ్‌ అయ్యింది. ఆ సమయంలోనే నేను ఒక సీరియల్‌ నుంచి తప్పుకున్నాను. సినిమాల్లోకి రాకపోయుంటే.. డాక్టర్‌ని అయ్యుండేదాన్ని. నన్ను జీవితంలో చాలామంది మోసం చేశారు. ఆ టైములో ఎంతో బాధపడ్డాను. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని.. ముందుకు సాగుతున్నాను. ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. నా భర్తకు నేనంటే చాలా ఇష్టం. నా జీవితం సంతోషంగా సాగుతుంది.. చేయాలనుకున్నది జీవితంలో చేసేయడమే’’ అని చెప్పింది కరుణ. తాజాగా కరుణ ఎక్స్‌పోజ్డ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.   

బాలయ్య షోలో కాస్టింగ్ కౌచ్‌ టాపిక్! 

కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చినందుకుగాను హీరోయిన్ల తో శారీర‌క సుఖాన్ని ఆశించి అందుకు ఒప్పించ‌డం. అయితే కొంద‌రు బ‌ల‌వంతంగా కూడా ఇలాంటి ప‌నులు చేస్తార‌ని అంటారు.ఇదే  కాస్టింగ్ కౌచ్ అనబడుతుంది. ఇది ఆడవారు మగవారు.. అందరిలోనూ ఏదో ఒక రూపంలో ఉంటుంది. మగవారైతే డబ్బు.. ఆడవారైతే శరీరం అప్పగించాల్సి వస్తుంది. ఇక తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా అలనాటి ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్ల‌యిన  జ‌య‌సుధ‌, జయప్రదల‌ తో కలిసి ఓ ఎపిసోడ్ చేశాడు. ఈ ఎపిసోడ్ కు నేటి హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఒక అతిథిగా  హాజరైంది. ముందుగా ఆయన రాశి ఖ‌న్నా తో మాట్లాడుతూ నువ్వు నటించిన హీరోలలో నీకు ఎవరి మీద క్రష్ ఉంది... అని అడుగ‌గా  రాశి ఖన్నా సెకండ్ కూడా ఆలోచించకుండా విజయ్ దేవరకొండ పేరు చెబుతుంది. వీళ్లిద్దరూ కలిసి గతంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే  అట్టర్ ఫ్లాప్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రాశిఖ‌న్నా విజయ్ దేవరకొండ తో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేసింది. ఇక బాలయ్య మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా అని అడుగుతాడు. అలాంటిది ఏమీ వుండదు.. మన దగ్గర ట్యాలెంట్ వుంటే ఇండస్ట్రీ‌ లో ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మనము ముందుకుపోవచ్చు... ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తారు అని ఆ ప్రశ్నకి జయసుధ, జయప్రద, రాశి ఖన్నా ముగ్గురు కూడా సమాధానం చెప్పారు. మొత్తానికి ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది.

మా అమ్మలా చూసుకుంటావ్ అని లవ్ ప్రొపోజ్ చేసిన ఆసియా!

ఆసియా-నూకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీళ్ళు లవ్ ప్రొపోజ్ చేసుకున్నారు. "నువ్వు మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటావ్..ఆమెలానే అప్పుడే కోప్పడతావ్ అప్పుడే మళ్ళీ నన్ను ఓదారుస్తావ్. మా అమ్మలానే నేను ఎలా ఉండాలో చెప్తావ్.  నేను నిన్ను ఇష్టపడుతున్నాని ఎలా చెప్పాలో తెలియడం లేదు..ఐ లవ్ యు రాజు..నేను నిన్ను నమ్ముతున్నాను..లైఫ్ లాంగ్ ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుతావని అనుకుంటున్నాను..నేను ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు నీ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టను" అని చెప్పింది ఆసియా. తనకు  అందరి ముందు ఐ లవ్ యు అని ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం నచ్చదు అని అంది.  ఇక నూకరాజు కూడా "నీ నమ్మకాన్ని నిలబెడతాను, నీ గోల్స్ నువ్ రీచ్ అయ్యేలా చేస్తాను. ఐ లవ్ యు టూ" అని నుదిటి  మీద ముద్దు పెట్టుకున్నాడు నూకరాజు.