బీబీ జోడీ జడ్జ్ గా అలనాటి అందాల నటి రాధ!
బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇక ఈ బిగ్ బాస్ నుంచి ఆడియన్సు దృష్టిని మరల్చకుండా ఉండడం కోసం బీబీ జోడి పేరుతో ఒక డాన్స్ షోని తెరపైకి తీసుకొచ్చారు. ఇక బీబీ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేలో ఈ బీబీ జోడి గ్లిమ్ప్స్ చూపించారు నాగార్జున.
ఈ బీబీ జోడి డిసెంబర్ 25 న మొదలుకాబోతోందని చెప్పారు. ఇక ఈ షోకి జడ్జెస్ గా బ్యూటిఫుల్ రాధ, వెళ్ళవయ్యా వెళ్ళు సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించనున్నారు. ఇక డ్యాన్సర్స్ గా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయించనున్నారు.
బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-స్రవంతి, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. ఇక ఈ షోకి హోస్ట్ గా బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది.