మొదట్లో నాకు అవకాశాలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెట్టేవారు

ఆసియా, నూకరాజు తమది రీల్ లవ్ కాదు అని రియల్ లవ్ అని బుల్లితెర ఆడియన్స్ కి చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు ఆసియా - నూకరాజు ఒక ఇంటర్వ్యూలో కనిపించి తమ లైఫ్ లో పడిన కష్టాల గురించి ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఆసియా తన జర్నీ గురించి చెబుతూ " బిటెక్ చదివేటప్పుడు పటాస్ ఆడిషన్స్ లో పార్టిసిపేట్ చేసేసరికి అందులో మంచి అవకాశం వచ్చింది అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. అప్పుడే నూకరాజు పరిచయం అయ్యాడు. మా అమ్మా నాన్న కూలీ పని చేసి మమ్మల్ని పెంచారు.  ఐతే మా పేరెంట్స్ కి ఇదంతా ఇష్టం లేదు. కానీ నేను నా చదువును, నటనను బాలన్స్ చేసుకుంటూ వచ్చాను. మొదట్లో అవకాశాలు బాగా ఇచ్చారు కానీ నూకరాజుతో ప్రేమ గురించి తెలిసాక అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఎందుకో అర్ధమయ్యేది కాదు. అలా రెండేళ్లు ఖాళీగా ఉన్నాను. అప్పుడు నాకు నూకరాజే డబ్బు సాయం చేసేవాడు. తర్వాత నూకరాజు తాను చేసే కామెడీ షోస్ లో నాకూ క్యారెక్టర్ ఇమ్మని అడిగేవాడు. అలా అడిగి అడిగి ఇప్పటికి నేను కొంచెం ఫేమస్ అయ్యాను. ఐతే అవకాశాలు ఇవ్వకుండా నన్ను బాధపెట్టినప్పుడు నూకరాజు నా చేత యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయించాడు. ఇక ఇప్పుడు నేను చాలా బాగున్నాను. షోస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి" అని చెప్పింది ఆసియా. 

'మాకు తెలిసిన ప్రభుదేవా, లారెన్స్ వాళ్లిద్దరే'

"లేడీస్ అండ్ జెంటిల్ మాన్" షోకి ఈ ఆదివారం "లక్కీ లక్ష్మణ్" టీమ్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది. దానికి సంబంధించిన  ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ షో స్టేజి మీదకు మోక్ష, సమీర్, రాజారవీంద్ర, షాని, సోహైల్, మూవీ డైరెక్టర్ అభి అందరూ వచ్చారు. స్టేజి మీదకు అందరూ డాన్స్ చేస్తూ వస్తే డైరెక్టర్ మాత్రం వాళ్ళ హీరో, హీరోయిన్ ని చూసుకుంటూ ఉంటాడు. అదే విషయాన్ని హోస్ట్ ప్రదీప్ చెప్పేసరికి "వాళ్ళు ఓకే అండి..వీళ్ళను చూడండి" అన్ని సమీర్ ని, రాజారవీంద్రని సోహైల్  చూపించేసరికి "మాకు తెలిసిన ప్రభుదేవా, లారెన్స్ వాళ్ళే" అని సెటైర్ వేసాడు ప్రదీప్.  ఇక తర్వాత వాళ్ళతో  కొన్ని గేమ్స్ ఆడించాడు హోస్ట్. "కాలేజెస్ వాటిల్లో వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా" అని ప్రదీప్ సమీర్, రాజారవీంద్రని అడిగాడు. "వాళ్లేమో నువ్వు చెప్పు ప్రదీప్" అనడంతో "మాదంతా ఓఆర్ఆర్" అని కామెడీ చేసాడు. ఇక ఫైనల్ గా సోహైల్, మోక్ష ఇద్దరూ కలిసి "వెన్నెలవే వెన్నెలవే" సాంగ్ కి రొమాంటిక్ డాన్స్ చేశారు.

ఆసియా కోసం కార్ కొన్న జబర్దస్త్ నూకరాజు!

బుల్లితెర ఆడియన్స్ కి   కమెడియన్ నూకరాజు గురించి పరిచయం చేయక్కర్లేదు. "పటాస్" షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన నూకరాజు తర్వాత  జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. అప్పటినుండి చలాకి చంటి టీమ్ లో సభ్యుడిగా ఉంటూ స్కిట్స్ చేస్తూ వస్తున్నాడు. అలా జబర్దస్త్ , ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎంటర్టైన్ మెంట్ షోస్ అన్నిట్లో కూడా  తనదైన పెర్ఫార్మన్స్ లతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఇప్పుడు  జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయ్యాడు. ఇంతకాలం చలాకి చంటి టీమ్ లో ఉన్న నూకరాజు.. ఇప్పుడు ‘నాన్ స్టాప్ నూకరాజు’ అనే టీమ్ పేరుతో స్కిట్స్ చేస్తున్నాడు. ఇక నూకరాజు-ఆసియా ప్రేమాయణం సంగతి తెలిసిందే. మరి అలాంటి తన స్నేహితురాలి కోసం నూకరాజు  సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కియా కంపెనీకి చెందిన ఒక కారును కారును ఆసియా కోసం కొన్నాడు నూకరాజు. దానికి సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది ఆసియా.

యాంకరింగ్ ని అవమానించిన యాంకర్ రవి.. అవార్డు వద్దని వెళ్ళిపోయిన అకుల్ బాలాజీ!

ఏడాది చివరికి వచ్చేసింది. కొత్త కొత్త షోస్ హంగామా చేస్తున్నాయి. అందులో ఇప్పుడు   బుల్లితెర మీద అవార్డ్స్ ఫంక్షన్ ఈవెంట్ ఒకటి రాబోతోంది. అదే  జీ తెలుగులో ‘ఫెంటాస్టిక్ అవార్డ్స్’ అనే ఒక షో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, బిగ్ బాస్ సిరి హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 6 గంటలు ప్రసారమయ్యే ఈ ఈవెంట్ కి సంబంధించిన  ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.  ఫెంటాస్టిక్ అవార్డులలో భాగంగా అవార్డుల పేర్లు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.  ఈ క్రమంలో ఈ ఏడాది బెస్ట్ యాంకర్ అవార్డును యాంకర్, నటుడు, డాన్స్ ఇండియా డాన్స్ షోని హోస్ట్ చేస్తున్న అకుల్ బాలాజీని వరించినట్లు తెలుస్తోంది. అయితే.. అకుల్ బాలాజీని బెస్ట్ యాంకర్ అవార్డు అందుకోవడానికి రావాలంటూ  పిలిచాడు. ఆయన్ని ‘వాగుడు వీరయ్య’ అని సంబోధిస్తూ స్టేజి మీదకు పిలిచాడు. ‘యాంకరింగ్ ని వాగుడు అనడం బాలేదని.. అందుకు తాను ఈ అవార్డును తీసుకోలేనని చెప్పి సీరియస్ గా  స్టేజ్ దిగి అక్కడినుండి వెళ్ళిపోయాడు".

డబ్బులు ఆఫర్ చేస్తే ఎందుకు తీసుకోలేదు?

బిగ్ బాస్ సీజన్-6 లో టాప్-3 లో నిలిచిన కీర్తి భట్.. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "ఎలా ఉంది టాప్-3 ఫీలింగ్? మాములుగా లేదు కదా" అని యాంకర్ అడిగాడు. "అమేజింగ్ ఫీలింగ్. అసలు తగ్గేదేలే" అని చెప్పింది కీర్తి.  "అసలు టాప్-3 లో ఉంటావని ఊహించావా? ఏ పొజిషన్ లో ఉంటావని అనుకున్నావ్" అని యాంకర్ ప్రశ్నించాడు. " అసలు టాప్-3 లో ఉంటానని అనుకోలేదు. 7 or 8 పొజిషన్ లో ఉంటానని అనుకున్నాను" అని కీర్తి సమాధానమిచ్చింది. ఆ తర్వాత "డబ్బులు ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా? ఎందుకు తీసుకోలేదు" అని అడిగాడు యాంకర్. "నేను వద్దని అనుకున్నాను. ఎలాగైతే బయటకు రావాలని అనుకున్నానో‌ అలాగే బయటకొచ్చాను" అని కీర్తి అంది.  "ఇన్ని వారాల్లో ఎప్పుడైనా.. మీకు భయం వేయలేదా? అంటే బాగా గేమ్ ఆడేవాళ్ళు, టాస్క్ లు బాగా పర్ఫామెన్స్ చేసేవాళ్ళు, అందరూ బయటకు వచ్చేస్తుంటే మీకు భయం వేయలేదా?" అని యాంకర్ అడిగాడు. "మొదట్లో కొంచెం భయం అనిపించేది. కానీ పోను పోను ఇక అంతలా ఏం అనిపించలేదు. ఎక్కడో ఒక మూలన ఏం వచ్చినా ఓకే అన్నట్టుగా ఉన్నాను" అని కీర్తి అంది. "శ్రీసత్య నిన్ను అలా వెక్కిరించింది కదా.. మీకెలా అనిపించింది. తను ఎందుకు అలా అంది? మీరేందుకు అలా రియాక్ట్ అయ్యారు?" అని యాంకర్ అడిగాడు. "శ్రీసత్యతో ఒక గేమ్ గురించి మాట్లాడినప్పుడు.. తను అటిట్యూడ్ చూపించింది. ఆ తర్వాత తనకి ఎదురు తిరిగి మాట్లాడానని.. నన్ను ఇమిటేట్ చేసింది. అది నేను తీసుకోలేకపోయాను" అని చెప్పుకొచ్చింది కీర్తి.

ఇనయా నిన్నే ఎందుకు టార్గెట్ చేసింది?

బిగ్ బాస్ సీజన్-6 లో రన్నర్ గా నిలిచిన శ్రీహాన్.. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.  యాంకర్ "డబ్బులు ఆఫర్ చేస్తుంటే మొదట వద్దు అన్నావ్. మళ్ళీ ఎందుకు తీసుకున్నావ్?" అని అడిగాడు. "నాతో ఉన్న హౌస్ మేట్స్ దాదాపుగా అందరూ డబ్బులు తీసుకోమనే అన్నారు. నేను మొదటి నుండి వద్దు అనే ఉన్నాను. ఇక నేను మా నాన్న డెసిషన్ కోసం వెయిట్ చేసాను. ఎప్పుడు అయితే మా నాన్న తీసుకోమన్నాడో.. అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఇక వేరే ఆలోచించకుండా తీసుకున్నాను" అని సమాధానమిచ్చాడు. "శ్రీసత్యకి, నీకు మధ్య ఏం ఉంది. అన్నా చెల్లెళ్ళా? లేక ఇంకేమైనా ఉందా?" అని యాంకర్ అడిగాడు. "మా మధ్య ఏం లేదు. అలా అని అన్నా చెల్లెళ్ళు కాదు. కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్" అని శ్రీహాన్ చెప్పాడు. "ఏం సిరి విన్నావా.. శ్రీహాన్ ఏమన్నాడో" అని యాంకర్ నవ్వుతూ అన్నాడు. దీంతో శ్రీహాన్ "ఇక నువ్వు కానియ్" అని అన్నాడు. "ఇనయా ఎందుకు నిన్నే టార్గెట్ చేసింది?.. నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేసావ్?" అని యాంకర్ అడిగాడు. ‌దానికి రిప్లై ఇస్తూ "నేను ఏం అన్నా.. తను వేరేలా తీసుకుంటుంది.‌ దాని బదులు రియాక్ట్ అవ్వకుండా కామ్ గా ఉంటే బెటర్ అని అనుకున్నాను. ఆ తర్వాత ఎందుకురా ఈ పిల్లతో అని‌ వదిలేసా" అని చెప్పాడు శ్రీహాన్. "శ్రీసత్య ఏం చెప్తే అది చేస్తావ్ కదా?" అని యాంకర్ ప్రశ్నించాడు. "ఏం చెప్తే కాదు. కొన్ని చిన్నవి ఉంటాయి. చికెన్, ఎగ్, ఫుడ్ ఇలాంటివి. వాటిలో చేసేవాడిని కాని, టాస్క్ ల పరంగా కానీ, హౌస్ పరంగా కానీ, వేరే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో.. వాటిని నేను ఫాలో అవ్వను" అని చెప్పాడు.

కళ్ళకు గంతలు కట్టుకుని కూతురిని చేతుల్లోకి తీసుకున్న రేవంత్!

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చారంటే ఫామిలీ మెంబర్స్ అందరినీ మిస్ అవక తప్పదు. ఇందులో ఉన్నన్ని రోజులు బయటి ప్రపంచంతో అసలు సంబంధమే ఉండదు. అలా ఉంటుంది. అలాంటి టైంలో రీసెంట్ గా సీజన్ - 6 కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ కూడా తన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాడు. తన వైఫ్ ప్రెగ్నెంట్ కావడంతో హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెను కలవలేకపోయాడు.  కానీ.. ఫైనల్లీ ఇటీవల రేవంత్ భార్య అన్విత.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే.. హౌస్ లో ఉండి.. కేవలం వీడియో కాల్స్ కే పరిమితమైన రేవంత్.. విన్నర్ గా ఇంటికెళ్ళాక .. మొదటిసారి తన కూతురుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. మొదటిసారి చూస్తున్నాడు కాబట్టి పాప దగ్గరికి కళ్ళకు గంతలు కట్టుకుని కూతురిని చేతుల్లోకి తీసుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇకపోతే తాను గెలిచిన బిగ్ బాస్ 6 ట్రోఫీ కూడా కూతురికి  అంకితం ఇచ్చేస్తున్నట్లు స్టేజి మీద చెప్పాడు.  

కార్తీకదీపం సీరియల్ నుంచి మోనిత అవుట్...చారుశీల ఇన్!

కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న సీరియల్. ఇందులోని క్యారెక్టర్లను ఇంట్లో వాళ్ళల్లా ఫీలవుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. ఇక ఈ సీరియల్ లో లేడీ విలన్ గా చేసిన మోనితను బాగా తిట్టుకుంటూ ఉంటారు. అలాంటి మోనిత క్యారెక్టర్ ఇప్పుడు సీరియల్ లో కనిపించకుండాపోయింది. మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ ఈ కార్తీక దీపం.  ఐతే ఈ సీరియల్ లో తన రోల్ ఐపోయేసరికి మోనిత బాధపడుతోంది. తన లైఫ్‌లో ఎన్నో  సీరియల్స్ చేసింది. కానీ ఇంతలా ఎప్పుడూ బాధపడలేదంటూ చెప్పింది మోనిత. రీ ఎంట్రీ తరువాత  ఐదు నెలలు మాత్రమే వర్క్ చేసినట్లు చెప్పింది. "కార్తీకదీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నా. జైలుకు వెళ్లొచ్చాక నా రీఎంట్రీ మళ్ళీ ఉంటుందని ఎదురుచూస్తున్నా..కానీ సీరియల్ నుంచి తీసేశామని చెప్పారు..ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు" అని బాధపడింది శోభా శెట్టి. కానీ అంతలోనే "తనను కావాలని తీసేయలేదని..కథ అలా మలుపు తిరిగిందని చెప్పుకొచ్చింది" మోనిత. కథ  ఇంకా ఆసక్తికరంగా ఉండాలి అంటే  తనను తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అంది.  కథ ప్రకారం చూసుకుంటే  మోనిత క్యారెక్టర్ గురించి  కార్తీక్ కి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి అతను నమ్మే పరిస్థితి ఉండదు..అంతా  తెలిసిపోయింది కాబట్టి  కథలో కొత్తదనం కూడా ఉండదు చూసేవాళ్లకు కూడా చాలా బోర్ కొట్టేస్తుంది  కాబట్టే తీసేశారని చెప్పుకొచ్చింది మోనిత. ఐతే తన ప్లేస్ లో చారుశీల అనే కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె కథను నడిపిస్తోంది. తన జర్నీ ఇక్కడితో అయిపోలేదని ఇకముందు మంచి ప్రాజెక్ట్స్ లో చేసి ఆడియన్స్ కి మరింత దగ్గరవుతానని చెప్పింది.

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న యాంకర్ శ్యామల!

యాంకర్ శ్యామల గురించి  ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన  అవసరం లేదు. కాకినాడకు చెందిన ఈమె మొదట్లో సీరియల్స్ లో తర్వాత సినిమాలలో కూడా చేసింది. మూవీ ప్రొమోషన్స్,  ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్ లు వంటి వాటికి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయడంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు.  అలాంటి శ్యామల ఇప్పుడు క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో మునిగితేలుతోంది. ఇంట్లో క్రిస్మస్ ట్రీ, స్టార్స్, లైట్స్ అన్ని డెకరేట్ చేసుకుని సెలెబ్రేట్ చేసుకుంటోంది. కాండిల్ పట్టుకుని ఆ వెలుగుల్లో శ్యామల అందంగా మెరిసిపోతోంది.  సీరియల్ యాక్టర్ నరసింహారెడ్డిని లవ్ మ్యారేజ్  చేసుకున్న శ్యామల తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా చక్కగా  బ్యాలెన్స్ చేసుకుంటోంది. శ్యామల భర్త కూడా బుల్లితెర నటుడే..కార్తీకదీపం సీరియల్ లో దుర్గ పాత్రతో బాగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఎక్సపోజ్డ్ వెబ్ సిరీస్ లో మిత్ర పాత్రలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తూ అలరిస్తున్నాడు.

శ్రద్ధాకు ఫోటోగ్రాఫర్ ని అవుతానంటున్న ఆది..ముగ్గు ఎలా వేయాలో నేర్పిస్తానంటున్న జెస్సి!

ఢీ-ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ఎప్పటిలాగే ఈ వారం కూడా బాగా  నవ్వించింది. డ్యాన్సుల కన్నా కూడా హైపర్ ఆది స్కిట్స్  పంచెస్ ఈ షో మొత్తాన్ని డామినేటింగ్  చేసేస్తున్నాయి . ఈ వారం ఎపిసోడ్ లో లుంగీ  గురించి పెద్ద  స్పీచ్  ఇచ్చాడు  ఆది. హోస్ట్ ప్రదీప్ లుంగీని అవమానించేసరికి చాలా ఫీలయ్యాడు. దాంతో ఆదికి కోపం వచ్చి తన లుంగీకి సారీ చెప్పాలని బట్టుబట్టి చెప్పించుకున్నాడు.  తర్వాత కో-కమెడియన్ జెస్సి వచ్చి "దేవుడు నీ ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు" అని ఆదిని అడిగేసరికి "శ్రద్ధాదాస్ కి ఫోటోగ్రాఫర్ గా పుట్టాలని కోరుకుంటా..ఆవిడ ఫోటోషూట్స్ చూసావా నువ్వు..తెలియని అందం ఉంటుంది శ్రద్దాలో..ఫొటోగ్రాపర్ ఐతే ఆమె అందాన్ని ఆస్వాదించొచ్చు " అని చెప్పాడు. అరేయ్.. శ్రద్దా మా పక్క ఫ్లాట్ లో  నువ్వు ఉండాల్సింది కానీ వేరే అమ్మాయి ఉంటోంది అనేసరికి తలుపు తీసుకుని మరో కో-కమెడియన్ ముగ్గు గిన్నె పట్టుకుని ఢీ స్టేజి మీద ముగ్గేయడానికి వచ్చింది.  ఇక జెస్సి ఆ అమ్మాయిని పటాయించాడు. ముగ్గు ఎలా వేయాలో చుక్కలు ఎలా పెట్టాలో చేసి చూపించాడు ఆది, జెస్సి.

పంటకు పురుగు పట్టకుండా రెండు పంచులు వేస్తె చాలు చచ్చిపోతాయి...

ఈ నెల 25 న ఫార్మర్స్ డే, క్రిస్మస్ డే సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ దీని మీద షో చేయడానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా దీని  ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎప్పటిలాగే కమెడియన్స్ అలరించారు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" మూవీ థీమ్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా రైతులకు విషెస్ చెప్పారు. అలాగే కొంతమంది రైతుల్ని కూడా ఈ షోకి తీసుకొచ్చారు. వాళ్ళతో కూడా ఆది, పంచ్ ప్రసాద్ పంచ్ డైలాగ్స్ వేయించారు. "తాత మీరేంచేస్తుంటారో" అని ఆది అడిగేసరికి "మీరేం చేస్తారో మేము అదే చేస్తున్నాం పత్తేపారం" అనడంతో  అందరూ నవ్వేశారు. తర్వాత పంచ్ ప్రసాద్ వచ్చి " పంటకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి " అని మరో రైతును అడిగాడు "ఏముంది రెండు పంచులు వెయ్యి సచ్చి ఊరుకుంటాయి" అనేసరికి ఇంద్రజ పడీ పడీ నవ్వేసింది. తర్వాత ఇంద్రజ ఆ రైతులు వేసే పంటల గురించి, తెగుళ్లు పట్టి ఎలా పంట నష్టపోతోంది అనే విషయాల గురించి అడిగి తెలుసుకుంది.  "ఉన్నా రెండు ఎకరాలను కళ్ళా జూడలే" అనే ఫోక్ సాంగ్ ని పాడి అలరించారు ఫోక్ సింగర్ రాంబాబు. ఈయన పాడిన జానపదానికి అందరూ ఫిదా ఇపోయారు. "ఈ పాట విని అమెరికా నుంచి ఒకతను వచ్చి ఇతన్ని కలిసి కొంత డబ్బు సాయం చేసి వెళ్ళాడు" అని చెప్పాడు ఆది. అలా  ఈ కాన్సెప్ట్స్ మధ్యలో టీం అంతా కూడా క్రిస్మస్ ని పురస్కరించుకుని స్టేజి మీద కేక్ కోసి ఎంటర్టైన్ చేశారు.

శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి రష్మీని తప్పించే ప్లాన్ చేస్తున్న ఆది

జబర్దస్త్ యాంకర్ సౌమ్య మీద మనసు పారేసుకున్నాడు హైపర్ ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ 100 వ ఎపిసోడ్ లో ఆమె గురించి తెగ చెప్పేసి ఆకాశానికెత్తేసాడు. ఐతే ఈ షో యాంకర్  రష్మీ సౌమ్య గురించి ఆదిని చిన్న ఇంటర్వ్యూ చేసింది. "సౌమ్య మీకు ఎప్పుడు, ఎలా తెలుసు, ఫస్ట్ టైం సౌమ్య ఏ కలర్ డ్రెస్ వేసుకుంది. సౌమ్య మీద మీ అభిప్రాయం" ఇలా ఎన్నో ప్రశ్నలు వేసింది..ఇక ఆది తనదైన స్టయిల్లోనే జవాబులు ఇచ్చాడు   "మా జబర్దస్త్ యాంకర్ పెర్ఫార్మెన్స్, డాన్స్ నాకు అన్నీ బాగా నచ్చాయి. సౌమ్య హోస్ట్ చేస్తేనే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ముందుకెళ్తుందేమో అని అనిపిస్తోంది. సౌమ్యని ముందు ఈటీవీ 27 ఇయర్స్ ఫంక్షన్ లో కలిసాను. అప్పుడు ఆ అమ్మాయిని చూసాకా ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయి పక్కన ఉంటే బాగుండనిపించింది. సౌమ్యను ఫస్ట్ చూసినప్పుడు లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని కనిపించింది. సౌమ్య ఎక్కడుంటే నాకు అక్కడే ఉండాలనిపిస్తోంది." అని చెప్పాడు ఆది. అదేంటి ఈ స్టేజి మీద వర్ష, రష్మీ ఉన్నారు కదా వాళ్ళను ఎందుకు పడేయట్లేదు అని సౌమ్య అడిగేసరికి వాళ్ళల్లో లేని ఫీల్ ఏదో నిన్ను చూసినప్పుడు వచ్చింది అని మరో బిస్కట్ వేసాడు. దాంతో జడ్జి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చి "రష్మీ మీ జోడి  తొమ్మిదేళ్లు చూసినా బోర్ కొట్టలేదు కానీ ఆది వేసే ఈ ఎక్స్ట్రా డైలాగ్స్ వింటుంటే  చాలా బోర్ కొడుతోంది" అని కౌంటర్ వేసింది.

‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు హేమచంద్రకి ఉన్న రిలేషన్ తెలుసా?

‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు సింగర్ హేమచంద్రకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?పాడుతా తీయగా..అనే షో ఈటీవీలో ఎంతో ఫేమస్. 1996 లో ఈ షో మొదలైంది.  ఈ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల్లో  పాటలు పాడే అవకాశాలను కూడా దక్కించుకున్నారు. ఇంకొంతమందైతే నటీనటులకు  డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నారు.  ఈ షోని ఒకప్పుడు బాలు గారు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన  మన మధ్య లేకపోవడంతో ఆయన స్థానంలో ఆయన తనయుడు చరణ్   జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో సీజన్ - 20 ద్వారా టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచి 4 లక్షల క్యాష్ ప్రైజ్  గెలుచుకుని పాపులర్ అయిన పిల్లాడు ఆశ్రిత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమే. ఈ కుర్రాడు పాట పాడే విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.   ఐతే ఈ కుర్రాడు స్టార్ సింగర్ హేమచంద్రతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. మరి ఇద్దరికీ ఉన్న రిలేషన్ ఏమిటి అనుకుంటున్నారా ?  ఆశ్రిత్ రాఘవ  మరెవరో కాదు హేమచంద్రకి మేనల్లుడు. హేమచంద్ర అక్క హిమబిందు పెద్ద కొడుకే ఈ  ఆశ్రిత్.  మరి ఫ్యూచర్ లో ఈ కుర్రాడు కూడా మేనమామలా మంచి సింగర్ అయ్యే అవకాశం ఉంది.

నవ్యను పెళ్లిచేసుకోబోతున్న యాంకర్ ప్రదీప్!

సిల్వర్ స్క్రీన్ మీద ప్రభాస్ పెళ్లి విషయం ఒక హాట్ టాపిక్ ఐతే స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ ప్రదీప్ పెళ్లి విషయం అంతే హాట్ టాపిక్. ఏ షోలో ఐనా ప్రదీప్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్న వినబడుతూనే ఉంటుంది. టాలీవుడ్ లో టాప్ మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి మంచి పేరుంది. తన యాంకరింగ్ తో ఎన్నో షోస్ సక్సెస్ సాధించాయి..ప్రదీప్ హీరోగా  `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే మూవీ కూడా చేసాడు.. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అబ్బాయిగారు పెళ్ళికి రెడీ ఐనట్లు తెలుస్తోంది.  లేటెస్ట్ గా  ప్రదీప్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ప్రదీప్ న్యూస్ ఉంటే మంచి రేటింగ్ కూడా వచ్చేస్తోంది. అంత హాట్ టాపిక్ గా మారింది ప్రదీప్ పెళ్లి. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు.  కొంత కాలం నుంచి న‌వ్య‌తో ప్ర‌దీప్ సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడుపుతున్నాడని  ఫైనల్ గా ఈ విషయం  అటువాళ్ళు, ఇటువాళ్ళు తెలుసుకుని  వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుని ముహూర్తాలు పెట్టడానికి రెడీ అయ్యారట . అలా  కొత్త సంవత్సరంలో ప్రదీప్  కొత్త పెళ్ళికొడుకు కాబోతున్నాడట ప్రదీప్.

బిగ్ బాస్-7 హోస్ట్ గా రానా?

'ఎంటర్‌టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్' అనే ట్యాగ్ లైన్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్-6 ఎంతగా హిట్ అయ్యిందో మనందరికి తెలుసు. మరి ఇప్పుడు అదే తరహాలో సీజన్-7 అతిత్వరలో ప్రారంభం కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుందంట. ఒక్కో కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టీం అప్రోచ్ అవ్వడం, వారి డాటా అంతా కలెక్ట్ చెయ్యడం, ఇంకా బిగ్ బాస్ సెట్ రెడీ చెయ్యడం.. లాంటివి ఇప్పటి నుండి మొదలు పెడితే దాదాపు తొమ్మిది నెలలు పడుతుంది. మొదటి రెండు సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ లు గా వ్యవహరించగా, మిగతా నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేసారు. అయితే తర్వాత జరిగే సీజన్ కి హోస్ట్ గా చెయ్యనని నాగార్జున చెప్పాడంట. దీంతో బిగ్ బాస్  టీం.. వేరే స్టార్ ని సంప్రదించారని తెలుస్తోంది. కాగా బిగ్ బాస్ టీం, హీరో రానాని సంప్రదించగా.. హోస్ట్ గా చేయడానికి ఆయన ఓకే చెప్పాడని వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే గత నాలుగు సీజన్ల నుండి నాగార్జున బిగ్ బాస్ ని ఎంతో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారని, ఈ సీజన్-6 అయితే శని, ఆదివారాలలోనే ఎక్కువ మంది నాగార్జున హోస్టింగ్ చూశారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త హోస్ట్ అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.

గీతూతో అంత బాండింగ్ ఎలా కుదిరింది?

బిగ్ బాస్ ముగియగానే టాప్-5 లో ఉన్నవాళ్ళకి 'బిబి కేఫ్' ఎగ్జిట్ ఇంటర్వ్యూ అనేది కామన్ గా జరుగుతుంది. అయితే ఇందులో టాప్-4 గా నిలిచిన  కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఇంటర్వ్యూ ‌తీసుకున్నాడు యాంకర్ శివ. శివ ఇంటర్వ్యూ అంటేనే కాంట్రవర్సీ ఆర్గుమెంట్ తో మొదలుపెడతాడు. "ఒక రివ్యూయర్ గా లోపలికి వెళ్లి, హౌస్ లో గీతూతో కలిసి రివ్యూ చేసారు. అసలు బయట ఎలా ఉంటుందో తెలుసా మీకు? హౌస్ మేట్స్ ని ఎలా జడ్జ్ చేయగలరు?" అని శివ అడిగాడు. "హౌస్ లో జరిగిన ప్రతి విషయం టీవీలో చూపించకపోవచ్చు. కానీ నేను దగ్గర నుండి చూసా కాబట్టి కొన్ని అంచనా వేయగలను. నేను  రివ్యూయర్ గా బిగ్ బాస్ కి రివ్యూ ఇస్తున్నాను. చాలా మంది గురించి పాజిటివ్స్ ఇంకా నెగెటివ్స్  చెప్పాను. కానీ హౌస్ లోకి వెళ్ళాక నా గురించి ఒక్క పాజిటివ్సే మాట్లాడాల్సి వచ్చింది. ఒకవేళ నేను మిస్టేక్ చేస్తే.. 'తన వరకు వచ్చేసరికి ఇలానే ఉంటాడా ఆదిరెడ్డి' అని ప్రేక్షకులు అనుకుంటారు. ఆ ప్రెజర్.. నాకు అందరితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంది" అని ఆదిరెడ్డి చెప్పాడు. "మీరు ఇంట్రావర్ట్ కదా? మరి గీతూతో అంత బాండింగ్ ఎలా కుదిరింది? ఇద్దరు రివ్యూయర్స్ అనా?" అని అడిగాడు శివ. "అలా ఏం లేదు.. బిగ్ బాస్ ఇద్దరు రివ్యూయర్స్ ని తీసుకున్నాడు. నేను ఫస్డ్ లోపలికి వెళ్ళాక, మా  ఇద్దరికీ కాంట్రవర్సీ ఉంటుందేమోనని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. గీతు మంచి గేమర్" అని చెప్పాడు ఆదిరెడ్డి. "నువ్వు ఉండగా సూట్ కేస్ తీసుకొస్తే తీసుకునేవాడివా?" అని శివ అడిగాడు. "అసలు తీసుకునేవాడినే కాదు. అది విన్నర్ ప్రైజ్ మనీ. ఇంకా హౌస్ లోకి వెళ్ళేముందు ఎవరితో అయినా మాట్లాడాలంటే సిగ్గుపడేవాడిని. ఇప్పటికీ నేను ఇంట్రావర్టే. కానీ హౌస్ లోకి వెళ్ళాక తగ్గింది. అందరితో కలిసి ఉండేసరికి ఆ ఫీలింగ్ తగ్గింది" అని తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. 

ఈసారి కూతురు పుడితే బాగుంటుంది అంటూ గుడ్ న్యూస్ చెప్పిన విశ్వ!

బుల్లితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వాకి ఇండస్ట్రీలో ఎవరైనా తెలుసు  అంటే అది అక్కినేని కుటుంబం అని చెప్పుకోవాలి. అక్కినేని అఖిల్ విశ్వా క్లాస్ మేట్. దీంతో నాగార్జున నిర్మించిన “యువ” సీరియల్ లో విశ్వాకి ఛాన్స్ వచ్చింది. ఇక్కడే నుండే నటుడిగా విశ్వ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా విశ్వ తన మొదటి కొడుకు ర్యాన్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు.  ఇక ఇప్పుడు ఆయన వైఫ్ శ్రద్దా మరో గుడ్ న్యూస్ చెప్పింది. తన యూట్యూబ్ ద్వారా ఒక ప్రాంక్ వీడియో చేసి అందులో విశ్వకి తన సెకండ్ ప్రెగ్నన్సీ గురించి చెప్పింది. కొబ్బరినీళ్లు తాగాలనిపిస్తుందంటూ విశ్వాన్ని కార్ లో  ఊరు మొత్తం తిప్పించింది. కొబ్బరి నీళ్లు తాగి పుల్లగా ఉన్నాయని ఆటపట్టించింది. అసలే తాము డాన్స్ ప్రాక్టీస్ షూట్ కి వెళ్లాల్సి ఉండేసరికి శ్రద్ద చేస్తున్న లేట్ కి  విశ్వకి కొంచెం కోపం కూడా వచ్చింది. అలా డాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చాక పెద్ద చాక్లేట్ కావాలని మారాం చేసింది. ఎప్పుడూ తనకు చాక్లెట్స్, పువ్వులు తెచ్చివ్వలేదని కంప్లైంట్ కూడా చేసింది. ఫైనల్ గా ప్రెగ్నెన్సీ కిట్ ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చింది.  ఇక అది ఓపెన్ చేసిన విశ్వ ఏడ్చేశాడు. శ్రద్దా కాలేజీ ఎడ్యుకేషన్ కి ఈ ప్రెగ్నెన్సీ అడ్డొస్తాదని భయమేసింది అని చెప్పాడు. కానీ తనకు  అమ్మాయి పుడితే బాగుంటుందని  తన మనసులో అనుకున్న మాట చెప్పాడు..అమ్మాయి పుడితే కర్లీ హెయిర్ ఉంటే ఇంకా అందంగా ఉంటుందని చెప్తూ  ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు.

మా మధ్య గ్యాప్ కి కారణం వాళ్ళే..అందుకే పవన్ పెళ్ళికి రాలేదు!

పవన్ కళ్యాణ్,  అలీ జంటను మూవీస్ లో చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన  ప్రతి మూవీలో ఆలీకి కచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది. ఐతే రాజకీయంగా కొంతకాలం నుంచి పవన్ కి ఆలీకి మధ్యన కాస్త గ్యాప్ వచ్చింది.   రాజకీయ కారణాలతో వీళ్ళు  విడిపోయారనే ప్రచారం బయట బాగా జరుగుతుండేసరికి ఆలీ దానికి సరైన సమాధానం ఇచ్చారు. యాంకర్ సుమ ప్రశ్నకు సమాధానంగా… పవన్ కళ్యాణ్ తో నాకు ఎలాంటి గ్యాప్ రాలేదు. కొంతమంది కావాలనే  గ్యాప్  క్రియేట్ చేశారు. మీడియాలో ఏవేవో  కథనాలు ప్రచారం చేశారు. అవే నిజం అనుకుని జనాలు నమ్మేశారు. నా కూతురు వివాహానికి  పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేయడానికి ఆయన  నటిస్తున్న మూవీ సినిమా సెట్స్ కి వెళ్ళాను. అదే టైములో  వేరే వాళ్ళు కూడా ఆయన్ని కలవడానికి వచ్చారు. వాళ్ళను వెయిట్ చేయమని చెప్పి  పవన్ నన్ను కలిశారు. దాదాపు 15 నిమిషాలు మేము సరదాగా మాట్లాడుకున్నాము.  మా అమ్మాయి పెళ్ళికి ఆయన రావాల్సి ఉంది. ఐతే లాస్ట్ మినిట్ లో  ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు. మా అమ్మాయి పెళ్లికి పవన్ రాకపోవడానికి కారణం అదే. అంతకు మించి మా మధ్య ఎలాంటి గ్యాప్ అనేది లేదు.

డిసెంబర్ 31 న ఈటీవీలో ‘వేర్ ఈజ్ ది పార్టీ’...

మరి కొద్ది రోజుల్లో డిసెంబర్ నెల వెళ్ళిపోయి కొత్త సంవత్సరం  రాబోతోంది. ఇక ఈ సందడిని క్యాష్ చేసుకోవడం కోసం బుల్లితెర రెడీ ఐపోయింది. టన్నుల కొద్ది ఎంటర్టైన్మెంట్ తో కొత్త కొత్త ఈవెంట్  ప్రోమోస్ ని రిలీజ్ చేసేస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఈ షోస్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని తెగ ఆరాటపడిపోతున్నారు. అలాంటి దానిలో ఇప్పుడు ఈటీవీలో రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. " క్యాష్.. వేర్ ఈజ్ ది పార్టీ" పేరుతో ఈ కొత్త ఈవెంట్ డిసెంబర్ 31 న రాత్రి 9 .30 లకు ప్రసారం కాబోతోంది. ఈ ప్రోగ్రాంకి  హోస్ట్ గా సుమ వ్యవహరిస్తోంది. ఇందులో బుల్లితెర నటులు అందరూ కనిపించారు. ఆది, రాంప్రసాద్, శ్రీవాణి, యాదమ్మ రాజు, యాట నవీన, కావ్య, అమ్మ రాజశేఖర్, సోహైల్ వంటి ఎంతోమంది ఈ ఈవెంట్ లో కనిపించి ఎంటర్టైన్ చేయబోతున్నారు. హోస్ట్ ఈ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరి కళ్ళకు గంతలు కట్టుకుని మ్యూజికల్ చైర్స్ ఆడించారు. మంగ్లీ తన హస్కీ వాయిస్ తో సాంగ్స్ పాడి అలరించింది. ఇలా ఎన్నో రకాల కాన్సెప్ట్స్ అనేవి ఈ ఈవెంట్ లో కనిపించబోతున్నాయి. ఫైనల్ గా సుమకి అందరూ కలిసి షాల్ కప్పి ఆమెను సత్కరించారు.