గురువు గారి దగ్గర గొంతు సవరించుకుని భక్తి గీతాలు పాడిన కరాటే కళ్యాణి!

సినీ నటి కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలుసు. ఎన్నో మూవీస్ లో బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించారు. ఆమె యాక్చ్యువల్ గా హరికథ  కళాకారిణి...పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. సుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు   లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకుంది. ఐతే ఇటీవలి కాలంలో ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.  ఇక  ఇప్పుడు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇది చూస్తే కరాటే కల్యాణి గాత్రం ఇంత బాగుందా అని అనిపించక మానదు. కరాటే మాత్రమే కాదు తనలో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించింది. ఆమె తన గురువు దగ్గర భక్తి గీతాలను తన్మయత్వంతో ఆలపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు ఒక పోస్ట్ కూడా పెట్టింది. " గురువు గారి  వద్ద చాలా రోజులకు  గొంతు సవరించుకుని నేర్చుకుంటే చిన్నపిల్లనైపోయాను.. ధన్యవాదాలు గురువుగారు...మా మాస్టారు కేవీ  బ్రహ్మానందంగారు..ఆయన  సినీనటి జయప్రద గారికి  కూడా సంగీతం నేర్పిన గురువు... మా ఇంటికి విచ్చేసి నాకు మంచి గీతాలను నేర్పించారు.. ధన్యవాదాలు మరొక్కసారి గురువుగారు శ్రీ గురుబ్యోనమః " అని పెట్టింది.  టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి ఓ వెలుగు వెలిగింది. ఈమె ఎక్కువగా వ్యాంప్ రోల్స్ కి పెట్టింది పేరు. ఆ డైలాగ్స్ ని ఆమె తప్ప ఎవరూ చెప్పలేరేమో అనిపిస్తోంది. ఐతే ఇలాంటి పాత్రల్లో నటించడం వలన తనపై వ్యభిచారిణి అనే ముద్ర పడింది..అది చాలా బాధ కలిగిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  

'నా మొలతాడు దానికి ఇచ్చావా నువ్వు'.. జెస్సీతో ఆది వెటకారం!

'ఢీ-15' ఛాంపియన్స్ బ్యాటిల్ ప్రతీ వారం సరి కొత్తగా అలరిస్తోంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది కామెడీ మాములుగా లేదు. ఆది, జెస్సి ఇద్దరూ చాప, దుప్పటి తెచ్చుకుని ఢీ స్టేజి మీద పరుచుకుని పడుకుంటారు.. ఇంతలో ఆది పక్కింట్లో ఉండే కో-యాక్టర్ కూడా ఇంట్లో స్పేస్ లేక స్టేజి మీద పడుకోవడానికి వస్తుంది. "రండి రండి.. మాకూ అదే కావాలి" అని ఆది అనేసరికి "నేను మీకు కిలోమీటర్ దూరంలో పడుకుంటాను" అంది ఆ అమ్మాయి. "మాకు నిద్రలో కిలోమీటర్ పాకే అలవాటు ఉంది" అని పంచ్ వేసాడు ఆది.  తర్వాత "ఆది గారు చెప్పడం మర్చిపోయాను.. నిన్న జెస్సి నాకు ప్రపోజ్ చేసి గుర్తుగా తాడు కూడా ఇచ్చాడు" అని సిగ్గుపడుతూ చెప్పింది. "నా మొలతాడు దానికి ఇచ్చావా నువ్వు" అని జెస్సీతో ఆది అనేసరికి అందరూ నవ్వేశారు.  ఇంతలో జెస్సి "ఆది అన్నా నాకు నిద్ర రావట్లేదు.. ఏదైనా కథ చెప్పు" అన్నాడు. "అనగనగ ఢీ 15 అనే సీజన్ ఆరు నెలలంట. కొత్తగా టీమ్ లీడర్లంటా.. వాళ్ళు రిజిస్టర్ అవడానికి పది నెలలు పడుతుందట" అని చెప్పాడు ఆది. "వద్దన్నా..చాలు" అని జెస్సి నిద్రపోయాడు. "కథలు కావాలంట ఎదవకి" అని జెస్సి మీద పంచ్ వేశాడు ఆది. 

'కార్తీక దీపం'ను దాటేసి టాప్ 1 ప్లేస్‌లో 'గుప్పెడంత మనసు'!

స్టార్ మాలో వచ్చే సీరియల్స్‌ని ఆదరించని ఆడియన్స్ లేరు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ తమదైన శైలిలో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి సీరియల్‌నైనా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఇకపొతే స్టార్ మాలో ప్రసారమయ్యే ధారావాహికలకు ఎక్కువ రేటింగ్ కూడా వస్తూ ఉంటుంది.  ఇందులో ప్రసారమయ్యే కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, త్రినయని.. ఇలాంటి ఎన్నో సీరియల్స్ మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ రేటింగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందులోనూ ఎన్నో కొత్త కొత్త సీరియల్స్ కూడా లైన్ లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఐతే ఇప్పుడు సాయికిరణ్ తాను నటిస్తున్న "గుప్పెడంత మనసు" సీరియల్ ప్రస్తుతం అర్బన్ మార్కెట్స్ లో టాప్ 1గా 9.77 రేటింగ్‌తో నిలిచింది.. అంటూ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టుకుని మురిసిపోతున్నారు.  ఇక ఆ లిస్ట్ చూస్తే.. టాప్ 2లో కార్తీక దీపం (9.62), టాప్ 3లో త్రినయని (8.75), టాప్ 4లో ఇంటింటి గృహలక్ష్మి (8.59), టాప్ 5లో పడమటి సంధ్యారాగం (7.97) రేటింగ్‌తోతో ముందుకు దూసుకెళ్తున్నాయి.

ఇక్కడ కౌంటర్లు మానేసి అక్కడ వేస్తున్నారు.. రోజాపై కృష్ణ భగవాన్ కామెడీ పంచ్

జబర్దస్త్ 500 ఎపిసోడ్‌లో మంత్రి రోజా ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాకతో స్టేజి మొత్తం కళకళలాడింది. రాఘవ తన స్కిట్ లో భాగంగా రాజు వేషంలో స్టేజి మీదకు వచ్చి "ఆవిడని ఎప్పుడో, ఎక్కడో చూసినట్టుందే" అని రోజాని చూపిస్తూ డైలాగ్ చెపాడు. కో-కమెడియన్ ఎంట్రీ ఇచ్చి "నీకు బాగా బలిసింది.. ఆవిడతో కలిసి తిరుపతి వెళ్లి ఫ్రీగా లడ్డులు తెచ్చుకుని ఇప్పుడు ఎవరూ అంటావా?" అనేసరికి రోజా పకపకా నవ్వేశారు.  ఇంతలో జడ్జి కృష్ణ భగవాన్ మాట్లాడుతూ "రోజా మేడం ఇక్కడ ఉన్నన్ని రోజులు మీమీద కౌంటర్లు వేసేవారు. ఇప్పుడు అక్కడ వేస్తున్నారనుకోండి" అని చెప్పి ఆమెను నవ్వించారు.  జబర్దస్త్ జడ్జెస్ గా రోజాకి, నాగబాబుకి మంచి పేరు ఉంది. తర్వాత నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు ఈ షో నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు 500వ ఎపిసోడ్ కి రోజా వచ్చి అందరినీ ఖుషి చేశారు. ఐతే ఆమెతో పాటు నాగబాబు కూడా వస్తే బాగుండేది కదా అని అభిమానులు అంటున్నారు. 

ఇప్పటికీ నేను గుర్తున్నానంటే దాని వల్లే...జబర్దస్త్ 500 వ ఎపిసోడ్ కి రోజా మాటలు!

నెక్స్ట్ వీక్ జబర్దస్త్ దుమ్ము రేపడానికి రెడీ ఐపోయింది. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందించబోతోంది వచ్చే వారం ఎపిసోడ్. రీసెంట్ గా రిలీజ్ ఐన ఈ ఎపిసోడ్  ప్రోమో చూస్తే చాలు అర్థమైపోతుంది.  ఇక జబర్దస్త్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా రోజా ఈ షోకి  వచ్చి ఎంటర్టైన్ చేశారు. టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత  ఆమె జబర్దస్త్ జడ్జి సీటు నుంచి తప్పుకున్నారు.  ఆ తర్వాత ఆమె ప్లేసులోకి ఇంద్రజ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రోజా రావడంతో కమెడియన్స్ అందరిలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఆమె మీద పంచులు బాగా పేల్చారు. ఫైనల్ గా ఆమెను అందరూ కలిసి సత్కరించారు. ఇక రోజా మాట్లాడుతూ " నాతో పాటు చేసిన హీరోయిన్స్ ని ప్రేక్షకులు చాలామంది మరిచిపోయారు. నేను ఇప్పటి జనరేషన్ కి కూడా  గుర్తు ఉన్నాను అంటే అది కేవలం జబర్దస్త్ వల్లే..థాంక్యూ" అని చెప్పారు. ఇంకా ఆమె మాటలకు స్టేజి మొత్తం ఈలలు, కేకలతో మారుమోగింది.

మీడియా ముందు నటించడం రాక ఆ కామెంట్స్ చేశా..త్వరలో నటించడం నేర్చుకుంటా

"లక్కీ లక్ష్మణ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని నెగటివ్  కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు సోహైల్. ఈ కామెంట్స్ మీద ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాను చేసిన కామెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో  రచ్చ రచ్చ చేస్తున్నారని బాధపడ్డారు. తన వీడియోలపై సోషల్‌ మీడియాలో కామెంట్లు చూసినప్పుడు తనకు  చాలా బాధ కలిగిందని, తనను మాత్రమే కాదు హీరోలపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారనే  ఆవేదనలో స్టేజ్‌పై  అలా మాట్లాడానని చెప్పారు. బయట మామూలుగా ఎలా మాట్లాడతానో, స్టేజ్‌ మీద కూడా అలానే మాట్లాడేశానని అన్నారు. తనకు నటించడం రాదు అని మీడియా ముందైనా బయటైనా ఒకలాగే ఉండడంపెద్ద సమస్యగా మారుతోందన్నారు.  ఇక మీదట కెమెరా ముందే కాదు బయట కూడా నటించాలేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలు నెగటివ్‌నే ఎక్కువగా  ఇష్టపడుతున్నారని, మా నాన్న పడిన కష్టంపై వీడియో పెడితే ఐదు వందల వ్యూస్ మాత్రమే వచ్చాయని, అదే ప్రీరిలీజ్ ఈవెంట్ లో  స్టేజ్‌పై తాను చేసిన కామెంట్ల వీడియోలకు లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయన్నారు.  చిరంజీవి గారి వాల్తేర్‌ వీరయ్య ప్రెస్‌మీట్‌ వీడియోలకంటే తన నెగటివ్ కామెంట్స్  వీడియోకే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయన్నారు. సినిమాల్లో నటించడం ఈజీ కానీ స్టేజ్‌మీద, మీడియా ముందు నటించడం రావడం లేదు త్వరలో నేర్చుకుంటాను అన్నారు బిగ్‌ బాస్‌ ఫేస్‌ సోహైల్‌.   సోహైల్ నటించిన తొలి చిత్రం `లక్కీ లక్ష్మణ్‌` మూవీ డిసెంబర్‌30న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ అద్భుతమైన క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పారు.

అరియానాని హాట్ అని కామెంట్ చేసిన రాధ.!

బిగ్ బాస్ సీజన్-6 తర్వాత  సరికొత్త షో మొదలైంది. బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లోని కంటెస్టెంట్స్ తో కలిసి డ్యాన్స్ షో మొదలుపెట్టారు.  అదే ఇప్పుడు 'బిబి జోడి'. అయితే ఇప్పుడు ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఈ షోలో యాంకర్ గా శ్రీముఖి, జడ్జ్ లుగా సదా, తరుణ్ మాస్టర్, రాధ ఉన్నారు. మొన్న జరిగిన డ్యాన్స్ షోలో అరియానా, అవినాష్ కలిసి జోడిగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత రాధ మాట్లాడుతూ "డ్యాన్స్ చింపేశారు. లవ్ యూ" అని చెప్పింది. దానికి యాంకర్ శ్రీముఖి "మేడమ్.. లవ్ యూ అవినాష్కా..లేక అరియానాకా" అని  అడిగేసరికి, "ఇద్దరికి" అని చెప్పింది రాధ. ఆ తర్వాత "అవినాష్ నువ్వు ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఇరగదీసావ్" అని రాధ చెప్పింది. "మేడమ్.. మరి అరియానా?" అని శ్రీముఖి అడుగగా, "తనని చూసి నాకు జెలస్ గా ఉంది. ఆ షేప్ చూడండి" అని రాధ అనేసరికి, షోలో అరుపులు, విజిల్స్ తో మారు మ్రోగింది. ఆ తర్వాత "కోఠీలో చేయించింది మేడమ్" అని అవినాష్ జోక్ చేసాడు. 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో' పాటకి అవినాష్ , రాధ కలిసి స్టెప్పులేశారు. అయితే అరియానాని హాట్ అని రాధ చెప్పిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

శ్రీముఖి డ్రెస్ పై హీరోయిన్ కామెంట్స్...ఆమె బాడీకి సెట్ కాలేదంటూ పోస్ట్

శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ని ఉద్దేశించి హీరోయిన్ మాధవీ లతా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బుల్లితెర మొత్తం కూడా శ్రీముఖి హవానే నడుస్తోంది. అలాగే ఆమె వేసుకునే డ్రెస్సులు కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో యాంకర్ శ్రీముఖి చేతినిండా ఆఫర్స్ తో మస్త్ ఎంజాయ్ చేస్తోంది. మూవీస్ లో నటించడమే కాదు..మూవీ ఫంక్షన్స్, ఈవెంట్స్ అన్నిట్లో కనిపిస్తోంది. అలాగే జాతిరత్నాలు, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సారంగదారియా, మిస్టర్ అండ్ మిసెస్, వంటి షోస్ కి హోస్ట్ గా చేస్తూ బిజీ యాంకర్ ఐపోయింది.  రీసెంట్ స్టార్ట్ ఐన కొత్త షో "బీబీ జోడి" నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు. అందులో బుల్లి నిక్కరుతో కనిపించింది శ్రీముఖి. ఇక ఈమె వేసుకున్న ఈ డ్రెస్ మీద చాలా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. సెలెబ్రిటీస్ కూడా ఈ డ్రెస్ మీద తమ స్పందనను చెప్తున్నారు. ఇక ఇప్పుడు శ్రీముఖి వేసుకున్న ఈ డ్రెస్ మీద మాధవిలత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీ పోస్ట్ చేసుకుంది. 'శ్రీ.. నువ్వు మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకో. కానీ అవి నీ శరీరానికి  సెట్ అయ్యేలా చూసుకో. కళ్లకు నచ్చితే కాదు.. బాడీకి నప్పాలి. అప్పుడే  చూడ్డానికి బాగుంటుంది' అంటూ చెప్పుకొచ్చింది.  మరి శ్రీముఖి రియాక్షన్ ఏమిటి..తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటుందా..లేదా చూడాలి. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు మాధవీలత కామెంట్ మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది.

ఇప్పుడు వాళ్లంతా చనిపోయారు...ఎమోషనల్ ఐన పంచ్ ప్రసాద్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరిస్తోంది. కంటెంట్ కొత్తగా ఉంటోంది. కాన్సెప్ట్ కి తగ్గ ప్లానింగ్ కూడా ఉండేసరికి ఈ షోకి రేటింగ్ కూడా అదే పిచ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. కొత్త ఏడాది రోజున ఈ షో ప్రసారం కాబోతోంది..  ఇక ఈ షో ప్రోమో చూస్తే గనక స్టార్టింగ్ అంతా సరదాగా సాగినా ఎండింగ్ లో మాత్రం కన్నీళ్లు పెట్టించేసింది. ఇందులో  పంచ్ ప్రసాద్ ఫస్ట్ టైమ్ తన చిన్ననాటి ఫ్యామిలీ ఫోటోని అందరికీ చూపించాడు..ఆ ఫోటోలోని వారిని చూపిస్తూ తన  ఫ్యామిలీ గురించి చెప్పాడు. ‘ మా అమ్మ అప్పట్లో బలవంతంగా ఈ ఫోటో తీయించింది.  మా ఫ్యామిలీలో అమ్మానాన్నతో పాటు నాకు ఓ అక్క, అన్న ఉండేవారు. మా అన్న మంచి థియేటర్ ఆర్టిస్ట్ ఆయన్ని చూసే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. కానీ.. ఇప్పుడు మా ఫ్యామిలీలో నాన్న, అన్న, అక్క ముగ్గురూ చనిపోయారు. ప్రస్తుతం నేను, అమ్మ మాత్రమే మిగిలి ఉన్నాం..ఈ ఒక్క ఫోటో మాత్రమే ఉంది మా ఇంట్లో’ అని చెబుతూ ఏడ్చేశాడు. దీంతో ప్రసాద్ ఫ్యామిలీ గురించి తెలిసి షోలో ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు.

రష్మిని పోర్న్ స్టార్ తో పోల్చిన రాంప్రసాద్..ఆమె రియాక్షన్ ఇలా..

ప్రతీ వారంలాగే ఈవారం కూడా  శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించడానికి సిద్దమయ్యింది. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది.  అయితే ఈ ప్రొమో చూస్తే గనక ఒక కాంట్రోవర్సి డైలాగ్ వాడాడు ఆటో రాంప్రసాద్.  జబర్దస్త్ లాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా  రాను రాను కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐతే ఈ డైలాగ్ ఫ్లో లో వచ్చిందా... కావాలనే ఆడియన్స్ అటెంషన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం అన్నాడా అనే విషయం తెలియదు. అదేంటంటే రష్మిని ఒక పోర్న్ స్టార్ట్ తో పోల్చాడు ఆటో రాంప్రసాద్. ఐతే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆటో రాంప్రసాద్, రష్మీ , ఇంద్రజ నరేష్ అందరూ కలిసి దేవుడిని ప్రార్ధించి బాల్యంలోకి వెళ్లే వరాన్ని కోరుకుంటారు. ఆ దేవుడు కూడా అడిగిన వెంటనే వరం ఇచ్చేసాడు.   వెంటనే స్టేజి మీద ఉన్న వాళ్ళ కాస్ట్యూమ్స్ చేంజ్ ఐపోయాయి. ఆ వరం తర్వాత  స్కూల్ యూనిఫామ్ లో కనిపించారు రాంప్రసాద్, రష్మీ. రష్మిని ఆ డ్రెస్ లో చూసిన ఇమ్మానుయేల్ ఎక్కడో చూసినట్టుంది అని డైలాగ్ వేసాడు. "అదేంటి ఎప్పుడూ చూడలేదా మియా ఖలీఫా" అనేసరికి స్టేజి మీద ఉన్న వారంతా షాకయ్యారు. కానీ రష్మీ మాత్రం కళ్ళజోడు పెట్టుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. జడ్జి ఇంద్రజ మాత్రం తన చేతిలో ఉన్న బెత్తంతో రామ్ ప్రసాద్ ను కొట్టింది. వీళ్లకు ఈ డైలాగ్స్ బాగున్నాయేమో కానీ వినే ఆడియన్స్ కి మాత్రం ఇదేంటి ఇంత మాటన్నాడు అని అనుకుంటున్నారు. దేవుడి వరం కారణంగా  కమెడియన్స్ అంతా చిన్నపిల్లల్లా మారిపోయి.. బాల్యంలోకి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకున్నారు. తాగుబోతు రమేష్ తో స్కూల్ డ్రెస్ లో పిల్లి మొగ్గలు వేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు.

బుర్జ్ ఖలీఫా దగ్గర సుజాతతో కలిసి సందడి చేసిన రాకేష్!

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైం లైట్ లోకి వచ్చారు..అలాంటి వాళ్లలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఐతే ఈ షో చాలా మంది స్క్రీన్ పెయిర్స్ గా ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నారు. రాకేష్ కూడా తన జోడి సుజాతతో కలిసి అలాగే ఎంటర్టైన్ చేసేవాడు. ఐతే మొదట అందరూ కూడా స్క్రీన్ కోసం నటిస్తున్నారు అనుకున్నారు కానీ తర్వాత తమ ప్రేమ రీల్ కాదు రియల్ అని లవ్ ప్రొపోజ్ చేసి మరీ చూపించాడు. పెళ్లి కాకుండానే ఎన్నో షోస్ లో  రియల్ భార్యాభర్తల్లా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు.  ఇక ఇప్పుడు ఇద్దరూ టూర్స్ కూడా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా దుబాయి వెళ్లిన ఈ జోడీ.. బూర్జ్ ఖలీపా టవర్ ముందు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీళ్ళు  ఈవెంట్ కోసం వెళ్లారా ? పర్సనల్ ట్రిప్ప అనే విషయం తెలీదు.  ఇక వీళ్ళిద్దరూ ‘జబర్దస్త్’తో పాటు ‘మిస్టర్ అండ్ మిసెస్’ షోలోనూ జంటగా కనిపిస్తూ  ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నాం అని అనౌన్స్ కూడా చేశారు. మరి వీళ్ళు పెళ్ళెప్పుడు చేసుకుంటారో వేచి చూడాలి.

ప్రభాస్ ఎపిసోడ్ విషయంలో ఆహా సంచలన నిర్ణయం!

పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ రీసెంట్‌గా ఓటీటీ వేదిక ఆహాలో నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న‌ పాపుల‌ర్ టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌'లో పార్టిసిపేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లై అందరిని ఆకర్షించింది. ఇటు బాల‌కృష్ణ, అటు ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల ఫ్యాన్స్ కి ప‌ర్‌ఫెక్ట్ విందు భోజ‌నంలాంటి ఎపిసోడ్‌ ను సిద్ధం చేసినట్లు ఆహా తెలిపింది. ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దేనని, దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ విషయన్ని తాజాగా ప్రేక్షకులతో ఆహా పంచుకుంది. 'బాహుబలి' చిత్రం మొదటి భాగానికి 'ది బిగినింగ్', రెండో భాగానికి 'ది క‌న్‌క్లూజ‌న్' అని పెట్టినట్లుగా.. ఆహా కూడా 'అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే'లో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి అవే పేర్లు పెట్టింది. 100 నిమిషాల నిడివి ఉన్న బాహుబలి ఎపిసోడ్‌ని.. ది బిగినింగ్ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబ‌ర్ 30న, క‌న్‌క్లూజ‌న్ పేరుతో రెండో భాగాన్ని జ‌న‌వ‌రి 6న ప్ర‌సారం చేయనున్నారు. 'అన్‌స్టాప‌బుల్' హిస్ట‌రీలో ఓ ఎపిసోడ్‌ను రెండు ఎపిసోడ్స్‌గా అందించ‌టం ఇదే మొద‌టిసారి. కొత్త సంవ‌త్స‌రం ట్రీట్‌గా డిసెంబ‌ర్ 30న ప్ర‌సారం కాబోయే తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందట. ఇక డిసెంబ‌ర్ 6న ప్ర‌సారం కాబోయే రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌ తో పాటు ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్ కూడా సందడి చేయనున్నాడు. ఇందులో ప్ర‌భాస్‌, గోపీచంద్ కెరీర్ ఇండ‌స్ట్రీలో ఎలా ప్రారంభ‌మైంది. వారి స్నేహం ఎలా ప్రారంభ‌మైంది.. ఇన్నేళ్ల‌లో ఎలా బ‌ల‌ప‌డింది అనే విష‌యాలుంటాయట. ఈ రెండు ఎపిసోడ్స్ లో ఎవ‌రూ ఊహించ‌ని కొత్త విష‌యాలు, అంత‌కు మించిన ఫ‌న్ ఉంటుందని ఆహా టీమ్ చెబుతోంది. 

నేను టీవీ కోసమే పుట్టాను.. సుమ క్లారిటీ!

స్టార్ యాంకర్ సుమ యాంకరింగ్ మానేస్తునట్లు.. కొంత బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పంధించిన ఆమె అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ‘‘రీసెంట్‌గా ఒక న్యూ ఇయర్ ఈవెంట్ ని చేసాం. దాని ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఐతే ఆ ప్రోమో సోషల్ మీడియాలో కొంచెం హల్‌చల్ చేస్తోంది. ఆ ప్రోమోలో నేను కొంచెం ఎమోషనల్ ఐన మాట వాస్తవమే. అయితే, మొత్తం ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయమేంటో మీకే అర్థమవుతుంది. కంగారు పడకండి.. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను... నేను టీవీ కోసమే పుట్టాను, నేను ఎంటర్‌టైన్మెంట్ కోసమే పుట్టాను, నేను ఎటూ వెళ్లట్లేదు. కాబట్టి, మీరు హాయిగా ఉండండి.. హ్యాపీగా ఉండండి.. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్’’ అని సుమ ఒక వీడియో మెసేజ్‌ ని రిలీజ్ చేశారు. సో.. సుమ ఫ్యాన్స్ కంగారు పడాల్సిందేమీ లేదన్న మాటే. రెండు దశాబ్దాలకు పైగా యాంకర్‌గా టాప్ రేంజిని ఆస్వాదిస్తూ వస్తోంది సుమ. వీక్షకులు ఇప్పటికీ ఆమె యాంకరింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారనేది నిజం.

అందుకే రాంప్రసాద్ తలకు మాస్క్ పెట్టుకుని నటిస్తున్నాడు!

జబర్దస్త్ కమెడియన్స్ లో రామ్ ప్రసాద్ కి రైటర్ గా, కమెడియన్ గా మంచి పేరుంది. ఆటో పంచ్ డైలాగ్స్ కి రామ్ ప్రసాద్ ఫేమస్. అందుకే ఆయన్ని ఆటో రామ్ ప్రసాద్ అంటారు.   జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీ ఆయన్ని సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లేలా చేసింది. కొన్ని మూవీస్ లో రాంప్రసాద్  కమెడియన్ గా చేసాడు. అయితే రామ్ ప్రసాద్  ఇటీవలి స్కిట్స్ లో  తలకు మాస్క్ పెట్టుకుని నటిస్తున్నారు. అసలు రామ్ ప్రసాద్ కి ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ అవుతున్నారు. ఆయన ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ ప్రసాద్ కి ఏమీ కాలేదు. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అందుకే తలకు మాస్క్ తో కనిపిస్తున్నారట.అంతే కానీ వేరే కారణాలు లేవట.  ఇక ఈ విషయం తెలిశాక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.  సుధీర్ టీమ్ లోంచి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో కొత్త కమెడియన్స్ ని తీసుకుని  రామ్ ప్రసాద్ స్కిట్స్ చేశారు. మళ్ళీ కొంతకాలానికి గెటప్ శీను వచ్చి  రామ్ ప్రసాద్ తో కలిసి  స్కిట్స్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా రాలేదు. ఆయన త్వరలో వస్తున్నానని ప్రకటించారు కానీ, అది జరగలేదు.

ఆ పని చేసి డబ్బు సంపాదిస్తున్న రష్మీ...రాకేష్ కామెంట్స్ వైరల్

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు స్మాల్ స్క్రీన్ మీద అటు బిగ్ స్క్రీన్ మీద దున్నేస్తోంది. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' మూవీలో నటించింది. ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లు , సోషల్ మీడియాలో ఫోటో షూట్లు, పర్సనల్ ట్రిప్స్ ఫొటోస్, వీడియోస్ పెడుతూ ఉంటుంది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది రష్మీ.  రీసెంట్ గా 'ఎక్స్ట్రా జబర్ధస్త్' ఎపిసోడ్‌ లేటెస్ట్  ప్రోమో రిలీజ్ అయ్యింది.  ఇందులో జడ్జ్ ఖుష్బూ తనదైన స్టెప్పులు వేసి అలరించింది.  కమెడియన్లు పంచులతో నవ్వించారు. ఐతే  రాకింగ్ రాకేష్ మాత్రం యాంకర్ రష్మీ సంపాదనపై కామెంట్స్ చేశాడు. 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఎపిసోడ్‌లో భాగంగా రాకేష్ తన స్కిట్‌లో స్వామీజీలా దర్శనమిచ్చాడు. ఇందులో అతడి కో- ఆర్టిస్టు ప్రవీణ్.. రష్మీ జాతకం చెప్పమని అడిగాడు. దీనికతను 'అందరూ డబ్బులు లేకపోతే గుండెలు బాదుకుంటారు. కానీ, ఈ అమ్మాయి గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది' అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ డైలాగ్ కి అంతా నవ్వేశారు.

బాడీ షేమింగ్ కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్న కమెడియన్స్..షో నుంచి తప్పుకుంటున్న కొత్త యాంకర్!

జబర్దస్త్ దాదాపు పదేళ్లకు పైగా నడుస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద ఎన్ని వివాదాలు, తగాదాలు వచ్చినా ఈ షో మాత్రం చక్కగా నడుస్తూ వెళ్తోంది. చాలా మంది వెళ్లిపోవడం రావడం వంటివి జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే  ఈ జబర్దస్త్ లో ఎక్కువగా బాడీ షేమింగ్ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ కారణంగా అనసూయ షో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిపోయేసరికి సౌమ్యరావుని రంగంలోకి దింపింది యాజమాన్యం. ఐతే ఇప్పుడు సౌమ్య కూడా షో నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. ఈ మధ్య కాలంలో  జబర్దస్త్ పై కాంట్రవర్షియల్ కంటెంట్ ఎక్కువైపోతోంది. షో నుంచి బయటకు వెళ్లినవాళ్లు   జబర్థస్త్ పై గట్టిగానే విమర్షలు చేస్తున్నారు. అంతేకాదు జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.  కొన్ని ఎపిసోడ్స్ బానే చేసిన సౌమ్య మీద హైపర్ ఆది బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువైపోయానని తెలుస్తోంది.. అందుకే  ఆమె అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి  షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

అష్షు మనసు ఎంత విశాలమో!

సోషల్ మీడియాలో అష్షురెడ్డి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. రీసెంట్ గా ఆర్జీవీతో కలిసి చేసిన మూవీ ప్రమోషన్ తో ఆమె వార్తల్లో నిలిచింది. అప్పుడు ఆమెను తిట్టని వాళ్ళు లేరు. ఐతే ఇప్పుడు అష్షురెడ్డి అద్భుతమైన పని చేసి మళ్ళీ వార్తలకెక్కింది. అష్షు తనకు తోచినంతలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అలా చేస్తున్న వారిలో ఇద్దరమ్మాయిలు బీటెక్‌ డిగ్రీని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అషురెడ్డి చెప్పుకొచ్చారు.  ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో.. ‘‘ నన్ను  శాంటాలాగా ఉండమని వాళ్లు అంటున్నారు. నాకు దేవుడిచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చదువుకు ఆయే ఖర్చును నేను స్పాన్సర్ చేయడం నిజంగా అదృష్టం. ముఖ్యంగా కళ్యాణి, శ్రేయలకు నేను కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి ఎందుకంటే  వాళ్లు ఇప్పుడు  బీటెక్‌ డిగ్రీని పూర్తి చేశారు. మీరంతా నా జీవితంలోకి వచ్చినందుకు   సంతోషంగా ఉంది. నేను ఎం చేసానో తెలీదు కానీ మీ అందరి ప్రేమా నాకు అందింది.   ఐతే  నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు వేరేవారితో దయగా ఉన్నప్పుడు వాళ్లకు సాయం చేయడానికి  దేవుడు మీకో దారిని చూపిస్తాడు. మీరు తప్పకుండా సాయం చేయండి’’ అని చెప్పింది అష్షు. ఇక అష్షు చేసిన ఈ మంచి పనికి నెటిజన్స్ తెగ పొగిడేశారు.

అనవసరంగా ఆ అమ్మాయి పేరు చెప్పారు...పెళ్లి పుకార్లపై ప్రదీప్ స్పందన ఇలా..

ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద ఖాళీ లేకుండా పనిచేసే యాంకర్. డాన్సర్, యాంకర్ మాత్రమే కాదు నటుడు కూడా. ప్రస్తుతం టు మూవీస్ లో నటిస్తున్నాడు ప్రదీప్. బుల్లితెర మీద ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. ఏ షో చేసిన, ఇంటర్వ్యూ చేసిన పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది.  2018లో ప్రదీప్ స్వయంవరం థీమ్ తో ఓ షో కూడా చేసాడు. ఆ షోతో  ప్రదీప్ పెళ్లి అయిపోతుంది అంటూ పుకార్లు షికార్లు  చేశాయి. ఐతే  ఇప్పుడు మరోసారి ప్రదీప్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు దీని మీద ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు. “ నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకే దీనిపై ఇంతవరకు స్పందించలేకపోయాను. నా పెళ్లి వార్తలపై వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదు.  ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానికి అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. ప్రొఫెషన్ పరంగా మా టీమ్ వాళ్లు ఆమెతో మాట్లాడి ఉండచ్చు. కొన్ని పోస్టుల్లో ట్యాగ్ చేసి ఉండొచ్చు. ఇలాంటి వార్తల్లో ఆమె పేరు రావడం చాలా బాధగా ఉంది. నాకు ఇప్పుడే  పెళ్లి చేసుకోవాలని లేదు. నాన్న చనిపోయిన బాధ నుంచి మా ఫామిలీ ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. నా పెళ్లికి ఇంకాస్త సమయం ఉంది. నేను ప్రస్తుతం నా రెండో సినిమా మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. 2023లో నేను హీరోగా నేను నటిస్తున్న సెకండ్ మూవీ రాబోతోంది. దాని కోసమే రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాను” అంటూ ప్రదీప్ మాచిరాజు క్లారిటీ ఇచ్చాడు.    

'ఆఖరి శ్వాస వరకు నువ్వే' అంటున్న సుధీర్ పోస్ట్ వైరల్!

బుల్లితెర మీద ఒక్కసారి బాగా క్లిక్ ఐతే వాళ్లకు వచ్చే హెడ్ వెయిట్ అంతా ఇంతా కాదు. చాలా మందికి  స్టేటస్ అమాంతం  వచ్చేసరికి బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ సుడిగాలి సుధీర్ తనకు ఎంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా అది ఎప్పుడూ బయట ప్రదర్శించుకోవడం ఆడియన్స్ ఇప్పటివరకు చూసింది లేదు. మిగతా స్టార్స్ లానే సుధీర్ కూడా షూటింగ్స్ వంటి వాటి మధ్య కొంచెం గ్యాప్ దొరికినా ఆ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటాడు సుధీర్. రీసెంట్ గా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.  సుధీర్ కి రోహన్ అనే తమ్ముడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఐతే అతనికి పెళ్లై చిన్న పాప కూడా ఇటీవలే పుట్టింది. ఆ పాపను ఎత్తుకుని దిగిన ఫోటోని షేర్ చేసాడు సుధీర్. దానికి ఒక టాగ్ లైన్ కూడా పెట్టుకున్నాడు.  ‘నా చివరి శ్వాస వరకు నేను ప్రేమించే మనిషి’ అని రాసుకున్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద ఫోకస్ ఎక్కువగా పెడుతున్నాడు. అలాగే ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ పై వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు.