'పాన్ ఇండియా' మూవీలో సుధీర్..టైటిల్ మార్చమంటూ సలహా ఇచ్చిన డైరెక్టర్

బుల్లితెర మీద ఎన్నో కామెడీ షోస్ ప్రసారం అవుతున్నాయి. వాటికి కొంచెం భిన్నంగా ఆహా ఓటిటిలో "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ " పేరుతో ఒక కామెడీ షో డిసెంబర్ లో మొదలయ్యింది. ఇప్పటికి 5 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి..ఇక ఇప్పుడు ఎపిసోడ్ 6 కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ రకరకాల గెటప్స్ లో వచ్చి నవ్వించారు. హోస్ట్స్ దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ స్టైలిష్ డ్రెస్సెస్ లో వచ్చి అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.  ఇక ప్రోమో ఎంట్రీ చూస్తే "సుధీర్ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు సర్" అంటూ ఈ షో చైర్మన్ అనిల్ రావిపూడికి చెప్పింది దీపికా. ఆ మాటలకు  సుధీర్ తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. "ఐతే అన్ని భాషల్లో రిలీజ్ అవుద్దా" అని చైర్మన్ అడిగేసరికి "లేదు సర్ తెలుగులోనే రిలీజ్ అవుతుంది" అని ఇన్నోసెంట్ ఫేస్ తో చెప్పాడు సుధీర్. "తెలుగులో విడుదల అయితే పాన్ ఇండియా ఎలా అవుద్దిరా " అని చైర్మన్ అడిగేసరికి "సినిమా పేరే పాన్ ఇండియా. అది షార్ట్ ఫిల్మ్.. యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది" అని సుధీర్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు." వీలైతే టైటిల్ మార్చొచ్చా" ప్లీజ్ అన్నట్టుగా సుధీర్ చేతులు పట్టుకుని మరీ బతిమాలాడాడు అనిల్ రావిపూడి. "ఏం మార్చొచ్చు సార్" అని సుధీర్ ఆనాడు.  "పాన్ ప్లేస్ లో బ్యాన్ పెట్టు" అంటే బాగుందని అంటాడు సుధీర్. తర్వాత మరి "ఇండియా ప్లేస్  లో ఏం పెట్టాలి" అనేసరికి  "నీ పేరు పెట్టు" అని వెళ్ళిపోయాడు డైరెక్టర్. దీంతో ఆ "పాన్ ఇండియా" అనే సినిమా పేరు కాస్తా "బ్యాన్ సుధీర్" గా మారింది.

'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటున్న 'కస్తూరి' నటి!

అనితా చౌదరి 'కస్తూరి' టీవీ సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన నటి.. ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో నటించే అవకాశం వచ్చినప్పుడు టీవీ సీరియల్ కోసం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది.. అలా ఒకసారి కాదు రెండు సార్లు. కానీ ఇప్పుడు "ఒక్క ఛాన్స్ ప్లీజ్" అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. 'కస్తూరి' సీరియల్ తో పాపులరైన ఈమె కొంత కాలం మూవీస్ లో నటించి సడెన్ గా మాయమైపోయింది. మళ్ళీ తర్వాత ప్రత్యక్షమయింది.  ఇప్పుడు అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. పవర్ స్టార్ తో చేజార్చుకున్న మూవీ ఛాన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో విషయాలు మాట్లాడారు. "కస్తూరి టీవీ సీరియల్ లో నటిస్తూ ఉన్నప్పుడు 'తొలిప్రేమ' మూవీ కోసం ఆ మూవీ టీమ్ నన్ను అడిగింది. కాకపోతే అప్పుడు నేను టైటిల్ రోల్ చేస్తున్నాను అందుకే డేట్స్‌ని ఇవ్వలేమని చెప్పేశారు. అప్పటికి తెలీదు కదా.. మాకెవరికీ తెలియలేదు ఓ మంచి సినిమాని మిస్ అవుతున్న విషయం.. ఆ ఒక్క సినిమానే కాదు.. చాలా సినిమాల్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సీరియల్స్‌కి దూరమై.. సినిమాల్లో చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఛాన్సెస్ ని వదులుకోవాల్సి వచ్చింది’’ అని చెప్పింది అనితా చౌదరి. అలాగే పవన్ కళ్యాణ్ మూవీ 'తీన్‌మార్'లో కూడా అవకాశం వచ్చేసరికి ఆలోచించకుండా సైన్ కూడా చేసేసి అనుకోని పరిస్థితుల వలన సినిమాకు దూరం కావాల్సి వచ్చిందని చెప్పింది.  "ఆ మూవీ షూటింగ్ యూఎస్ లో అన్నారు. దాంతో నేను టీమ్ యూనిట్ కంటే ముందే అక్కడికి వెళ్లిపోయాను. కానీ.. టీమ్‌ మెంబర్స్‌కి వీసా ప్రాబ్లమ్ వచ్చి ఆ మూవీని మరో దేశంలో షూట్ చేశారు. అప్పుడు నేను చేయాల్సిన క్యారెక్టర్‌ని భార్గవితో చేయించారు. ఇలా పవన్ కళ్యాణ్‌తో చేసే అవకాశం రెండు సార్లు చేజారిపోయింది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. నాకు ఇలా రిక్వెస్ట్ చేసే రోజు వస్తుందని అనుకోలేదు’’ అంది అనితా చౌదరి. 'ఛత్రపతి' మూవీలో కళ్ళు లేని తల్లి పాత్రలో కొడుకుని "సూరీడు" అని పిలుస్తూ నటించి మెప్పించింది అనితా చౌదరి.  ఆ తర్వాత  మురారి, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించింది. కానీ ఈ మధ్య ఆమెకు అవకాశాలు చాలా తగ్గిపోయాయి అనే చెప్పాలి.

కిర్రాక్ ఆర్పీ 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' షాప్ క్లోజ్!

జబర్దస్త్ షోతో పాపులర్ ఐన కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. ఐతే ఈ కమెడియన్ షోకి దూరమైపోయినా టీం పేరు మాత్రం తన ఇంటి పేరుగా మారిపోయింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో 'నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు' పేరుతో ఒక కర్రీ పాయింట్ ని ఓపెన్ చేసాడు. కిర్రాక్ ఆర్పీ ఫాలోయింగ్ వలన షాప్ కి మంచి క్రేజ్ కూడా వచ్చింది.  ఈ షాప్‌కి కస్టమర్స్ రద్దీ బాగా పెరిగి ట్రాఫిక్ జామ్ ఐపోయేది. దీంతో ఇక్కడ కర్రీస్ చేయడానికి సరిపడా సిబ్బంది లేక ఆర్పీ ఇబ్బంది పడుతున్నాడు. జనం ఎక్కువై, వంటకాలు తక్కువయ్యేసరికి సరైన సమయంలో పార్సిల్స్ చేయలేకపోతున్నారు. ఇదంతా చాలా కష్టమైపోవడంతో  కిర్రాక్‌ ఆర్పీ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కొత్త ఏడాది సందర్భంగా కర్రీ పాయింట్‌ని క్లోజ్‌ చేసి కస్టమర్లకి షాకిచ్చాడు.   ఇక ఈ విషయం మీద ఆర్పీ మాట్లాడుతూ, "మా కర్రీ పాయింట్‌కి జనం తాకిడి ఎక్కువయ్యింది. చాలా దూరం నుంచి జనం వస్తున్నారు. వాళ్లకు సరైన టైములో కూరలు అందించలేకపోతున్నాం. అందుకే షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. కిచెన్ కెపాసిటీని పెంచి కొన్ని మార్పులు చేసాక తిరిగి కర్రీ పాయింట్‌ని ఓపెన్‌ చేస్తాం" అని చెప్పాడు.. ఐతే ఈ విషయం తెలియని వాళ్ళు షాపుకు వస్తున్నారని వారికి క్షమాపణలు చెబుతూ, దయజేసి ఈ విషయాన్ని గమనించాలని కోరాడు. అంతేకాదు.. నెల్లూరు చేపల పులుసు బాగా వండే మహిళలను తీసుకొచ్చి వారితో వండిస్తే బాగుంటుందన్న ఆలోచనతో త్వరలో నెల్లూరులో ఆడిషన్స్ పెట్టి మంచి లేడీ చెఫ్స్‌ని సిటీకి తీసుకొస్తాం" అని చెప్పాడు ఆర్పీ.   

మేకప్ లేకుండా..ముద్దుల్లో మునిగి తేలిన అనసూయ!

అనసూయ న్యూ ఇయర్ లో సరికొత్తగా కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఫాన్స్ కి నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే బుల్లితెర మీద మంచి హాట్ గా కనిపించే అనసూయ వితౌట్ మేకప్ తో కనిపించింది. 2022 ఇయర్ ఎండింగ్ డేని ఫామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది..దీనికి సంబంధించి ఒక వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో  షేర్ చేసింది.  ఇందులో అనసూయ ముద్దుల్లో మునిగి తేలింది. ఓ వైపు భర్త, మరోవైపు పెంచుకున్న పెట్‌ డాగ్‌, మరోవైపు చిలుక, అలాగే తన పిల్లలు అంతా కలిసి ఆమెను ముద్దులతో  ముంచెత్తారు. జనరల్ గా చూస్తే సెలెబ్రేషన్స్ ని ఎవ్వరైనా బయట చేసుకుంటారు .. కానీ అనసూయ ఫామిలీతో ఎంజాయ్ చేసింది. జబర్దస్త్ లో చేసినన్ని రోజులు ఫోటో షూట్స్ తో అందరినీ అలరించేది.  కానీ ప్రస్తుతం అనసూయ మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీ ఐపోయింది. చిన్న బడ్జెట్‌ మూవీస్‌ నుంచి భారీ ప్రాజెక్ట్స్ వరకు ఆమె ఖాతాలో ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అనసూయ దృష్టి మొత్తం నటనకు స్కోప్ ఉన్న బోల్డ్ రోల్స్ లో నటించడానికి ఇంటరెస్ట్ చూపిస్తోంది. తనలోని నటిని బయటకి తీసుకొచ్చి మంచి నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తోంది.

క్యాష్‌కి ఇక బైబై.. 'సుమ అడ్డా'కి జైజై!

ఈటీవీలో ఒక రేంజ్ లో అలరించి కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్టు  ప్రకటించిన షోస్ "ఆలీతో సరదాగా" "క్యాష్".. వీటి స్థానంలో "సుమ అడ్డా" పేరుతో ఒక షో టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. చూస్తుంటే బ్రేక్ తీసుకున్న ఈ  రెండు ప్రోగ్రామ్స్ ని మిక్స్ చేసి సరికొత్తగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈటీవీలో సుమ హోస్ట్ గా ప్రసారమైన షో "క్యాష్" 12 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా సాగింది.  బుల్లితెర మీద ఎంత మంది యాంకర్స్ వచ్చినా సుమని ఎవరూ బీటౌట్ చేయలేకపోయారు. ఒకవైపు టీవీ షోలు.. మరో వైపు సినిమా ఈవెంట్లను హోస్ట్ చేస్తూ..సెలెబ్స్ ని ఇంటర్వూస్ చేస్తూ... ఫుల్ బిజీగా ఉంటున్నారు సుమ. ఇక ఇప్పుడు ఈ న్యూ షో  ‘సుమ అడ్డా’ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వేదిక చూస్తుంటే ఇది సరికొత్త  టాక్ షోలా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ షో స్టేజి మీద ఒక పెద్ద, రెండు చిన్న సోఫాలు వేసి ఉన్నాయి. స్టార్ సెలబ్రిటీస్ ని, కాలేజీ స్టూడెంట్స్ ని కూడా తీసుకొచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారట.  ఇక ఈ షోలో ఫన్, గేమ్స్, ఫైట్, ఎమోషన్, అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ అని టీజర్ లో చూపించారు. ఇక సుమ రెడ్ శారీలో కూలింగ్ గ్లాసెస్ తో ఒక స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.  

కార్తీక్ ని పెళ్లి చేసుకుంటానంటోన్న చారుశీల

శనివారం రోజు ఎపిసోడ్‌లో  పూజ గదిలో పూజ చేసుకుంటుంది దీప. అలా దీప పూజ చేస్తుండగా చారుశీల వస్తుంది. "నేను నీ గురించి అనుకునే లోపే నువ్వే టవచ్చావ్. లోపలికి వెళ్దాం.. నీతో మాట్లాడాలి" అని చారుశీలతో అంటుంది దీప. చారుశీల మాట్లాడుతూ "ఒక్క నిమిషం అక్క.. నేను కూడా మొక్కుకొని వస్తా" అని తులసి చెట్టుకు దండం పెట్టుకుంటుంది. "కార్తిక్ తో నా పెళ్ళి జరగాలి" అని వేడుకుంటుంది. ఆ తరువాత ఇద్దరు లోపలికి వెళ్లి మాట్లాడుకుంటారు.  మరో వైపు శౌర్య, హేమచంద్ర మాట్లాడుకుంటారు. "మా అమ్మ నాన్నల ఆచూకీ గురించి ఏమైనా తెలిసిందా?" అని హేమచంద్రతో అంటుంది శౌర్య. దానికి హేమచంద్ర మాట్లాడుతూ "శౌర్య.. నీ ఫోటో ఒకటి కావాలి" అని అడుగుతాడు. దానికి శౌర్య "వెతకాల్సింది నన్ను కాదు. మా అమ్మనాన్నలని. నా ఫోటో ఎందుకు?" అని అంటుంది. అప్పుడు హేమచంద్ర "ఎక్కడైనా మీ అమ్మనాన్నలు కన్పిస్తే.. నీ ఫోటో చూపించి, మీ కూతురు మీ కోసం వెతుకుతుందని చెప్తాను" అని అంటాడు. దానికి శౌర్య "మీరు చెప్పింది నిజమే. ఫోటో ఎందుకు అంకుల్. సెల్ఫీ దిగుదాం. అది చూపిస్తే మనం ఫ్రెండ్స్ అనుకుంటారు" అని శౌర్య చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు సెల్ఫీ దిగుతారు.  ఆ తర్వాత చారుశీల, దీప ఇద్దరూ గదిలోకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. దీప మాట్లాడుతూ "నేను వెళ్ళిపోయాక.. డాక్టర్ బాబుకి ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వే వెతికి పెట్టాలి" అని చారుశీలని అడుగుతుంది. "ఒక తోడు కావాలి అంటున్నావు. కానీ ఆ తోడు నేనే కావాలని ఎందుకు అనుకోవట్లేదు. అయినా కార్తిక్ ని ఎలాగైనా నేనే పెళ్ళి చేసుకుంటాను కదా" అని మనసులో చారుశీల  అనుకుంటుంది. ఆ తర్వాత గండ, అతని భార్య మాట్లాడుకుంటారు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు హిమ వస్తుంది. "సారీ బాబాయ్.. పిన్ని. మిమ్మల్ని నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాను. నేను కావాలని ఏం అనలేదు" అని హేమ అంటుంది. దానికి గండ మాట్లాడుతూ "అదేం లేదమ్మా.. మాకు జ్వాలమ్మ ఎలాగో, నువ్వు అలాగే " అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హిమ గురించి శౌర్య, గండ మాట్లాడుకుంటారు. ఆనందరావు, హిమ ఇద్దరు కలిసి శౌర్య గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.‌

వసుధార, రాజీవ్ ల పెళ్ళిని రిషి ఆపగలడా..!

వసుధార ఇంటికి వస్తాడు రాజీవ్. చక్రపాణి, రాజీవ్ తో కంగారుగా మాట్లాడుతుంటాడు. "భయంగా ఉంది అల్లుడు గారు.. రిషి పెళ్లి ఆపేస్తానని అంటున్నాడు. నాకు కంగారుగా ఉంది" అని చక్రపాణి అంటాడు. దానికి రాజీవ్ మాట్లాడుతూ "మామయ్య.. మీరు ఏం టెన్షన్ పడకండి. మనం రిషి సర్ ని బెదిరించాల్సిన పని లేదు. భయపెట్టాల్సిన అవసరం లేదు. వసుధారతోనే 'రిషి సర్ నాకొద్దు' అనేలా చేస్తాను చూడండి" అని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత వసుధార గదిలోకి చీర తీసుకొని వెళ్తాడు రాజీవ్. అలా వెళ్ళగానే వసుధార చూస్తుంది. "బావ.. ఎందుకొస్తున్నావ్. ఇక్కడి నుండి వెళ్ళు" అంటూ అరుస్తుంది. అలా వసుధార అనేసరికి.. రాజీవ్ నవ్వుతూ మాట్లాడుతుంటాడు. "నువ్వు బావ.. బావ అని అనకు. నీకు కాబోయే భర్తని నేను. కాబట్టి ఇకనుండి ఏవండి.. ఏవండి అని ప్రాక్టీస్ చెయ్. నా ఫోన్ లో నువ్వు, రిషి సర్ కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి. నువ్వు  నాతో పెళ్లికి ఒప్పుకోకుంటే, వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ ఫ్యామీలీలో ఎవరూ బ్రతకరు. ఒంటరిదానివి అవుతావు. నువ్వు దానికి కూడా ఒప్పుకోకపోతే, నేను ఈ గన్ ని వాడాల్సి వస్తుంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే, నిన్ను ఏం చెయ్యను. ఎందుకంటే నువు నా ప్రాణానివి. నీ ప్రాణమైన రిషి సర్ కి మొదటి బుల్లెట్,  మీ జగతి మేడంకి రెండవ బుల్లెట్, మీ మహేంద్ర సార్ కి మూడవ బుల్లెట్  వాడుతాను. మొదటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం అనే చెప్తున్నాను. నా ఇష్టం అంత కూడా పెళ్లి అయిన తరువాత టిఫిన్ చేస్తు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ రిషి సార్ వస్తాడు. నా చేతిలో చస్తాడు నా దగ్గర బుల్లెట్లు చాలా ఉన్నాయి. మీ రిషి సర్ తో సామరస్యంగా మాట్లాడి పంపించు. నేనేం మాట్లాడను. ఇది నీ పెళ్లి చీర. దీన్ని కట్టుకొని, నువ్వు తొందరగా రెడీ అయి వస్తే.‌. మనం తొందరగా పెళ్లి చేసుకుందాం. మన ఇద్దరి పెళ్లి అంటే నాకు గాల్లో తేలినట్లుంది. నేను కూడా అందంగానే ఉంటా, బాగానే సంపాదిస్తాను. నన్ను గన్ వాడే అవసరం రానివ్వవని అనుకుంటున్నాను. నువ్వు తెలివైన అమ్మాయివని నాకు తెలుసు" అని రాజీవ్ మాట్లాడి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత వసుధార ఆలోచిస్తూ, పెళ్ళికి రెడీ అవుతుంటుంది. ఒకవైపు రాజీవ్ అన్న మాటలు, మరో వైపు రిషి సర్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది వసుధార. ఆ తర్వాత జగతి మేడం పంపిన మంగళ సూత్రాలని చూస్తుంది. "మేడం ముందు జాగ్రత్తతోనే ఇవి పంపినట్లుంది" అని అనుకుంటుంది. ఆ తర్వాత రిషి సర్ తన ముందు ఉన్నట్లు ఊహించుకుంటుంది. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.  

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాకింగ్ రాకేష్-సుజాత!

బుల్లితెర రియల్ లవర్స్ రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. జబర్దస్త్ వేదిక మీద వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. తనకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన రాకేష్ చివరికి సుజాత ప్రేమలో పడిపోయాడు.  ఇక సుజాత జోర్దార్ వార్తలు చదువుతూ ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా హౌస్ మేట్స్ కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే  నూతన సంవత్సరం అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాకింగ్ రాకేష్, వాళ్ళ అమ్మ, జోర్దార్ సుజాత ముగ్గురూ వచ్చి  విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. రాకేష్-సుజాత ఇటీవలి కాలంలో అన్ని ప్లేసెస్ ని చుట్టేసి వస్తున్నారు. వీళ్ళు పెళ్లి కాకుండా అన్ని షోస్ లో కనిపిస్తున్నారు.  పెళ్ళెప్పుడు అని అడిగిన వాళ్లందరికీ  త్వరలో పెళ్లి.. మీకు చెప్పే చేసుకుంటాం అని ప్రకటించారు. రాకేష్ తల్లి మాత్రం తనకు  కాబోయే కోడలు సుజాత  గురించి ప్రశంసలు కురిపించారు. పెళ్లి కాకుండా సుజాత రాకేష్ ఇంట్లో సభ్యురాలయ్యింది. జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ చిన్న పిల్లలతో  స్కిట్స్ చేయిస్తూ  ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న  సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు.  

ఆవిడ ప్రమోట్ చేస్తే పాన్ ఇండియా మూవీ అవుతుంది!

"క్యాష్ వేర్ ఈజ్ ది పార్టీ" అంటూ రీసెంట్ గా ప్రసారమైన షోలో బుల్లితెర నటీనటులంతా కూడా సుమకి సన్మానం చేసారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఆడియన్స్ ని తన యాంకరింగ్ తో అలరిస్తున్నందుకు ఆమెను అందరూ కలిసి ఘనంగా సత్కరించుకున్నారు. "ప్రొడ్యూసర్ లు హీరోల డేట్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తారు..సినిమా స్టార్ట్ అవకముందే ఆ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ కోసం మీ దగ్గర డేట్స్ తీసుకుంటున్నారు మేడం ఇప్పుడు..మీరు హీరోలకు ఎంత సెంటిమెంట్ అంటే మీ చేత్తోనే ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది అన్నంతగా ఇండస్ట్రీ మీ మీద బేస్ ఐపోయింది" అని రాంప్రసాద్ చెప్పేసరికి "నువ్వు ఇంత మాట్లాడాక వాళ్లంతా నన్ను పిలవరేమో" అని భయమేస్తోంది అని కౌంటర్ వేసింది సుమ.  తర్వాత ఆది వచ్చి "బేసిక్ గా ఒక సినిమా జనాలకు నచ్చాలంటే అందులో కంటెంట్ ఉండాలి...కానీ ముందు ఆ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే సుమ గారి యాంకరింగ్ ఉండాలి..ఒక చిన్న సినిమా ఆవిడ ప్రమోట్ చేస్తే అది పెద్ద సినిమా అవుతుంది..అదే ఒక పెద్ద సినిమాను ఆవిడే ప్రమోట్ అది పాన్ ఇండియా సినిమా అవుతుంది..సుమ గారు అంటే యాంకరింగ్..యాంకరింగ్ అంటే సుమ గారు..ఆవిడ తర్వాతే ఎవరైనా"  అని చెప్పాడు.ఇక  నటి యమున మాట్లాడుతూ " ఒకప్పుడు ఆర్టిస్ట్ నటన కంటే యాంకరింగ్ ని బాగా తక్కువగా చూసేవారు. కానీ అసలు విషయం చెప్పాలంటే యాంకరింగ్ కి మీరు వచ్చాకే స్టార్ ఇమేజ్ వచ్చింది...మీకు స్క్రిప్ట్ తో పని లేదు. స్పాంటేనిటీ మీలో ఉన్న ప్లస్ పాయింట్" అని చెప్పింది. ఆ  తర్వాత నటీనటులంతా కూడా  సుమ గురించి వాళ్ళ మాటలు  చెప్పారు.  

రిషి, వసుధారల ప్రేమకు అడ్డుగోడగా నిలిచిన చక్రపాణి.

అత్యంత టిఆర్పీతో దూసుకుపోతున్న బుల్లితెర ధారావాహిక 'గుప్పెడంత మనసు'. రోజుకో ట్విస్ట్ తో ఒక్క మహిళలనే కాకుండా కంప్లీట్ ఫ్యామిలీకీ నచ్చే విధంగా ఈ సీరియల్ నడుస్తోంది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో వసుధారని, ఆమె తండ్రి చక్రపాణి బెదిరించి రూమ్ లో బంధించాడు. అలా బంధించిన తర్వాత జగతి మేడం, చక్రపాణికి  ఫోన్ చేసింది. ఆ తర్వాత చక్రపాణి మాట్లాడుతూ "నీ వల్లే నాకూతురు పెళ్లిపీటల మీద నుండి వెళ్లిపోయింది. ఇక నా కూతురు, నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే మేం అందరం చావాల్సి ఉంటుంది" అని ఫోన్ కట్ చేసాడు. అయితే అక్కడే ఉన్న తన భార్యతో "వసుధారని కనుక నువ్వు విడిపిస్తే.. నేను ఈ విషం తాగి చస్తాను" అని బెదిరించాడు. ఆ తర్వాత చక్రపాణి వెళ్ళిపోతాడు. వసుధార రూమ్ లోనే ఏడుస్తుంటుంది.     జగతి మరో వైపు ఫోన్ లో చక్రపాణి మాట్లాడిన మాటలు అన్ని ఆలోచిస్తూ ఉంటుంది. "రిషి, వసుధారకి పెళ్లి చెయ్యాలి. ఇంట్లో ఎవరికి తెలియకుండా వసుధార వాళ్ళింటికి  వెళ్దాం. ఆ విషయం రిషీకి తెలిస్తే బాధపడుతాడు. రిషీకి, ఇంట్లోవాళ్ళకి తెలియకుండా మనం వెళ్ళాలి" అని మహేంద్రతో మాట్లాడుతుంది జగతి. అలా అని బయల్దేరి వెళ్తారు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలు వింటుంది సునంద. ఆ తర్వాత రాజీవ్ కి సునంద కాల్ చేసింది. "రిషి, వసుధారలను కలిపేందుకు మహేంద్ర, జగతి వస్తున్నారు. నువు ఏం ప్లాన్  చేస్తావో చెయ్" అని రాజీవ్ తో మాట్లాడుతుంది. రాజీవ్ మాట్లాడుతూ "రిషి సార్ ని ఎలా రెచ్చగొట్టాలో నాకు తెలుసు మేడం" అని నవ్వుతుంటాడు. వసుధారకి రిషి కాల్ చేస్తాడు. కానీ వసుధార కాకుండా చక్రపాణి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రిషి మాట్లాడుతూ "వసుధార ఎలా  ఉన్నావ్. మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని ఏదో ఏదో అంటున్నాడు. నువ్వు ఏం భయపడకు. నేను వస్తున్నాను. మనల్ని ఎవరు విడదీయలేరు" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న చక్రపాణి.. వసుధారతో, రాజీవ్ కి పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. పెళ్లికి కావాలసినవి అన్నీ తీసుకొని వచ్చాడు. ఆ వస్తువులన్నీ చూసి తన భార్య "ఇవ్వన్ని ఏంటి అండి" అని అడుగుతుంది. "ఏంటంటావేంటే.. నా అల్లుడు రాజీవ్ కి, నా చిన్నకూతురు వసుధారకి పెళ్లి" అని అంటాడు. అక్కడే ఉన్న వసుధార షాక్ అవుతుంది. అప్పుడే రాజీవ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.

అతను డౌన్ టు ఎర్త్ కాబట్టే అంత పేరు తెచ్చుకున్నాడు!

టాలీవుడ్ లో సీనియర్ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఆమె ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ తో కలిసి నటించారు కూడా.  ఇప్పుడు సుధ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. " తారక్ చాలా గొప్ప నటుడు. ఆయన స్టేటస్ ప్రకారం "వారు" అని నేను అనాలి కానీ అలాంటి అల్లరి పిల్లోడిని నేను వాడు అని అంటాను ఎందుకు అంటే తారక్  నా కొడుకు లాంటి వాడు. నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు వాళ్ళు. ఒకప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఇప్పుడు అల్లరి తగ్గిపోయి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాడు. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఎంత గొప్పవాడో చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అన్నపూర్ణ స్టూడియోస్ లో బాద్ షా మూవీ షూటింగ్ లో నేను తారక్ తో కలిసి డాన్స్ చేసే సీన్ చేయాలి. మొదటి టేక్ బానే వచ్చిన ఎందుకో నేనే ఒన్స్ మరి చేద్దాం అని అడిగాను. బాగా చేశారమ్మా మీరు మళ్ళీ ఎందుకు అన్నాడు.  ఐనా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని చెప్పి స్టెప్ వేయబోయేంతలో కాలు స్కిడ్ అయ్యింది బెణికిపోయింది. అది చూసిన తారక్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేసి కూర్చోబెట్టాడు. అంత పాన్ ఇండియా స్టార్ కి అలా చేయాల్సిన అవసరం లేదు కదా. చాలా మంది చూసీ చూడనట్లు వెళ్లి పోతూ ఉంటారు. కానీ తారక్ అలాంటి వ్యక్తి కాదు. ఆ దేవుడు ఆయన్ని చల్లగా చూడాలి" అని చెప్పింది సుధ.

సోషల్ మీడియా స్టార్ నయనిపావని ఇంట్లో విషాదం!

సోషల్ మీడియా స్టార్ గా ఢీ షో టీంలీడర్ గా నయనిపావని ఆడియన్స్ కి బాగా పరిచయమే. కొన్ని వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. ఇన్ఫ్లుఎన్సర్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నయని పావని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన నాన్న చనిపోయారని చెబుతూ ఆ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆడియన్స్ తో షేర్ చేసుకుంది.   ‘ఒక్క జన్మలో 100 జన్మలకు సరిపడా ప్రేమనందించావ్ కానీ సరిపోలేదు.. నాకు ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇదొక పెద్ద గాయం నాకు. ఇది నయం కానీ నొప్పి.  నిన్ను చూడలేను అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఆ నవ్వు ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు ? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు ? ఇంత  ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు ? నువ్వు ఏమైనా చెయ్యి..ఎందుకంటే నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు ? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళతావనుకున్నా కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్.  2023లోకి నేను అసలు అడుగు పెట్టలేకపోతున్నాను’అని పావని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమెను ఓదారుస్తూ శ్వేతనాయుడు, మెహబూబ్, నిఖిల్ "స్టే స్ట్రాంగ్" అని కామెంట్స్ పెట్టారు. నయనిపవని షార్ట్ ఫిలిమ్స్ నటించినా రానంత పేరు మాత్రం ఢీ షోలో టీం లీడర్ చేసాక బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫుల్ గా రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి కొత్త జంట...ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అమరదీప్!

బిగ్ బాస్ నిన్న గాక మొన్న సీజన్ పూర్తయ్యిందో లేదో ఇప్పుడు రాబోయే సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట మొదలైనట్టు కనిపిస్తోంది. అంతేకాదు కొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  ఐతే ఇప్పుడు బుల్లితెర నటులు అమరదీప్-తేజస్విని గౌడా ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. "జానకి కలగనలేదు" సీరియల్ తో రామా పాత్రలో అమరదీప్ ఫేమస్ అయ్యాడు. అలాగే "కేరాఫ్ అనసూయ" సీరియల్ లో శివాని పాత్రలో తేజస్విని ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే విషయం గురించి రీసెంట్ గా అమరదీప్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. బిగ్ బాస్ లోకి అవకాశం వస్తే వెళతారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు "ఊ చూద్దాం" అని తలూపాడు. ఐతే ప్రస్తుతం ఇద్దరికీ పెళ్లయ్యింది కాబట్టి జంటగా వెళ్తారనే టాక్ కూడా వినిపిస్తోంది అనేసరికి "అది కష్టం. తేజూకు జీ-తమిళ్ సీరియల్ ఉంది. కాబట్టి దాన్ని వదిలేసి రాలేదు. ఇక్కడి డేట్స్, అక్కడి డేట్స్ మ్యానేజ్ చేయడానికే కష్టమైపోతోంది. ఒకవేళ అక్కడ పర్మిషన్ ఇస్తే వెళ్తారు అని మళ్ళీ అడిగేసరికి "ఒక ఎపిసోడ్ షూటింగ్ కే మేము ఒక్క రోజు లేకపోతేనే మాకు బ్యాటింగ్ ఉంటుంది. ఇక రెండు సీరియల్స్ అంటే చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది." అని చెప్పాడు అమరదీప్.  

వాళ్ళ ఊరి జాతరలో ఫుల్ ఎంజాయ్ చేసిన అవినాష్ ఫ్యామిలీ!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమెడియన్ ముక్కు అవినాష్. తన కామెడీతో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అలా అవినాష్ ఇప్పుడు ఒక హోదా దక్కించుకున్నాడు. మూవీస్ లో, బుల్లితెర షోస్ లో నటిస్తూ ఫుల్ బిజీగా మారాడు. శ్రీముఖితో కలిసి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.  ఇప్పుడు అవినాష్ తన ఊరు జగిత్యాలకు తన భార్య అనూజాతో కలిసి వెళ్ళాడు. ప్రతీ డిసెంబర్ లో జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేటకు వస్తానని చెప్పాడు అవినాష్. అక్కడ 'దొంగ మల్లన్న' స్వామి వారికి బోనాలు సమర్పించారు ఇద్దరు. ఇక్కడ వెలసిన దొంగ మల్లన్న స్వామి చాలా పవర్ ఫుల్ అని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నాడు. అసలు దొంగ మల్లన్న స్వామికి ఆ పేరెందుకు వచ్చిందని వాళ్ళ బ్రదర్ ని అడిగేసరికి అప్పట్లో కొంత మంది ఆవుల్ని దొంగిలించుకుని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో కొందరు చూసేసరికి వాళ్లకు ఎక్కడ దొరికిపోతామేమోననే భయంతో మల్లికార్జున స్వామి వారి విగ్రహం దగ్గరకు వెళ్లి తమను గుర్తుపట్టకుండా ఆవుల రంగులోకి మార్చితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. వాళ్ళ కోరికను స్వామి వారు తీర్చడంతో ఆ దొంగలు స్వామికి రాత్రికి రాత్రే గుడి కట్టేశారని చెప్పాడు. అలా అప్పటినుంచి దొంగ మల్లన్న స్వామిగా ఇక్కడ భక్తుల పూజలందుకుంటున్నాడట. ఇక ఫ్రెష్ గా తీసిన తాటి కల్లు తాగి పండగను ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంజాయ్ చేసాడు అవినాష్. ఈ వీడియోని  తన యూట్యూబ్ లో పోస్ట్ చేసాడు.

వంటలక్కని బ్రతికించే ప్రయత్నంలో డాక్టర్ బాబు!

కార్తీక దీపం సీరియల్ డిసెంబర్ 31 నాటికి 1549 ఎపిసోడ్ కి చేరుకుంది. కాగా ఈ ఎపిసోడ్ లో కార్తీక్, దీప ఇద్దరిని వెతుక్కుంటూ హేమచంద్ర ఇంటికి వచ్చింది సౌందర్య. అక్కడ వాళ్ళిద్దరి గురించి అడుగుతుంది. అక్కడే ఉన్న దీప, కార్తీక్ లు చాటు నుండి తన కంటపడకుండా సౌందర్యని చూస్తారు. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోయాక దీప, కార్తిక్ ఇద్దరు మాట్లాడుకుంటారు. "దీప.. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు" అని కార్తీక్ అన్నాడు. "లేదు డాక్టర్ బాబు నేను వెళ్ళను. ఎలాగూ చనిపోతున్నాను. నేను వాళ్ళకింక కనిపించను. మీరు, చారుశీల.. నాకున్న జబ్బు గురించి, ఎక్కువ రోజులు బ్రతకనని మాట్లాడుకోవడం. నేను విన్నాను. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి" అని దీప ఏమోషనల్  అయింది. "సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలియదు గాని.. నేను డాక్టర్ గా నిన్ను ఎలా కాపాడుకోవాలో, అలా కాపాడుకుంటాను. నా నుండి నిన్ను ఎవరు వేరు చేయలేరు" అని డాక్టర్ బాబు అన్నాడు. " మీరు అలా మాట్లాడితే నా గుండె ఆగిపోతుంది. నేను అత్తయ్య గారి దగ్గరకి వెళ్లి ఇదంతా చెప్తాను. మీరు నేను చనిపోయాక, అత్తయ్య దగ్గరికి వెళ్తానని నాకు మాట ఇవ్వండి. అప్పుడేమో నా ప్రేమ గుర్తించక బాధపెట్టారు. ఇప్పడేమో ప్రేమ ఎక్కువ చూపించి బాధపెడుతున్నారు" అని దీప ఏడుస్తుంది. కార్తీక్ మాట్లాడుతూ "ఎప్పుడు చనిపోతానని భాదపడుతున్నావు. కానీ నేను ఆ చావు రాకుండా కాపాడుకుంటానని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు" అని కార్తీక్ బాధపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆనందరావు, తన మనవరాళ్లు అయిన హిమ, శౌర్యలతో భోజనం చేస్తుండగా.. హిమ డల్ గా కన్పించడంతో "ఏంటమ్మా అలా ఉన్నావ్" అని అడిగాడు ఆనందరావు. దానికి హిమ మాట్లాడుతూ "అమ్మ నాన్నలు బ్రతికే ఉన్నారని శౌర్య ఇప్పుడు చెప్తుంది. నేనేమో అమ్మ నాన్నలను చూసానని చెప్తే.. మీరు ఎవరు పట్టించుకోవడం లేదు. వారి గురించి ఆలోచించకుండా మనం అందరం ఇలా భోజనం చెయ్యడం నాకు నచ్చట్లేదు" అని అంది. దానికి సమాధానంగా శౌర్య మాట్లాడుతూ "అదేం లేదు.. మా బాబాయ్ పిన్ని వాళ్ళతో కలిసి భోజనం చేయడం. నీకు ఇష్టం లేదు. అందుకే ఇలా గొడవ చేస్తున్నావు. నీవన్నీ నాటకాలు" అని అంది. ఆనందరావు మాట్లాడుతూ "ఏంటమ్మా.. అలా మాట్లాడుతున్నావ్" అని అడిగాడు. "లేదు తాతయ్య.. బాధతో మాట్లాడాను" అని హిమ అంటుంది.  ఆ తర్వాత చారుశీల ఒంటరిగా కార్తీక్ గురించి ఆలోచిస్తూ "అసలు మోనితకి, కార్తీక్ అంటే ఎందుకు అంత ఇష్టం. పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి కార్తీక్ వెనక ఉన్న ఆస్తి కోసమా అంటే.. కాదు తనకు చాలానే ఉంది. కార్తీక్ అంటే పిచ్చి. కాబట్టే  ఇన్ని రోజులు కార్తీక్.. కార్తీక్ అంటూ వెంటబడింది. అసలు కార్తీక్ కి ఆస్తి ఎంత ఉంది. తనని నా సొంతం చేసుకుంటే ఆస్తి అంత నాకే. దీప చనిపోయాక నాకు అడ్డెవరూ ఉండరు. ఈ లోపు దీపకు దగ్గర కావాలి" అని మనసులో అనుకుంటుంది. దీప పూజ చేసుకుంటూ "దేవుడా.. ఎలాగైనా డాక్టర్ బాబుని, అత్తయ్య గారి దగ్గరికి వెళ్లేలా చెయ్" అంటూ మొక్కుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తర్వాతి ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.

ఆహాలో బాలయ్య సరే.. పవన్, ప్రభాస్ లలో ఎవరిది పై చేయి అవుతుంది?

ప్రస్తుతం ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. పలు భారీ విదేశీ సంస్థలు మన దేశంలోకి ముఖ్యంగా తెలుగులోకి ప్రవేశించి తమ సత్తా చాటుతున్నాయి. ఇలాంటి సందర్భంలో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆహా అనే ఓటిటీ ఛానల్ పెట్టడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన తెలివైన వాడే కావచ్చు... ఆర్థికంగా బలవంతుడే కావచ్చు. కానీ ఆయన ఏకంగా విదేశీ భారీ పెట్టుబడి పెట్టే వారి ముందు ఏమాత్రం నిలబడగలరు? అని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఒక్కసారిగా నందమూరి నట‌సింహం బాలకృష్ణను అన్ స్టాపబుల్‌ విత్ ఎన్బీకే కార్యక్రమానికి ఒప్పించడంతో ఆహా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అచ్చమైన తెలుగు ఓటిటీ ఛానల్ గా దీనికి మంచి ఆద‌ర‌ణ  లభిస్తోంది. అది రోజు రోజుకు పెరుగుతోంది.  బాలయ్య తొలిసారి ఆహా కోసం హోస్ట్ అవ‌తారం ఎత్తారు. అన్ స్టాపబుల్‌ మొదటి సీజన్లో మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వచ్చారు.  చివరి ఎపిసోడ్ కు మహేష్ బాబు రావడంతో ఎండ్ ఇచ్చారు. దాంతో ఆహా తెలుగు వారిలో బాగా పాపులర్ అయింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ని కాస్త గ్యాప్ లో ప్రారంభించిన అల్లు అరవింద్.. బాలయ్య కున్న పేరు పరిచయాలతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లను పిలిపించి మొదటి ఎపిసోడ్ ను వావ్ అనిపించారు. అది కూడా ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఇక తాజాగా సీజన్ 1 కంటే సీజన్ 2 ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య స్టార్స్ తో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఈ టాక్ షోకి ముందు బాలయ్య అంటే సీరియస్ గా ఉంటాడు.. సరదాగా మాట్లాడడు.. ఆయన సరిగా మాట్లాడటం కష్టమనే కామెంట్ మొదట్లో వినిపించాయి. అయితే అన్ స్టాప‌బుల్‌ షోలో బాలయ్య అతిధులుగా పాల్గొన్న వారితో సరదాగా మాట్లాడుతూ, పంచులు వేస్తూ, నవ్వులు పూయిస్తూ వారి నుంచి తనదైన శైలిలో సమాధానాలు రాబడుతున్న  తీరు చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. దాంతో ఈ షోని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  ఇక ఈ షోలో తాజాగా ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 30వ తేదీనే మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అయిపోయింది. ఇక రెండో పార్ట్‌ జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. అదే సమయంలో బాలయ్య షో కి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ స్టార్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగు మార్కెట్ పై మాత్రమే దృష్టి సారించిన స్టార్. అయితే క్రేజ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇద్దరిదీ సరి సమానమే. ఎందుకంటే ప్రభాస్ కు దేశ విదేశాల్లో గుర్తింపు ఉంటే పవన్ కి అంతే ఇమేజ్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇలాంటి సమయంలో ప్రభాస్ తో బాలయ్య చేసిన అన్‌స్టాపబుల్ షో తో పోలిస్తే పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. ప్రభాస్ కు సంబంధించిన ఎపిసోడ్ లో బాలయ్య అతని వ్యక్తిగత జీవితం, వివాహం, తన పెద్దనాన్న కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం, ఇతర వ్యక్తిగత విషయాల‌ను, వృత్తిప‌ర‌మైన విష‌యాల‌ను అడిగారు. కానీ అదే పవన్ కళ్యాణ్ విషయాన్ని వస్తే అది పూర్తిగా విభిన్నం. ఇందులో ఆయన పవన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలైన మూడు పెళ్లిళ్లు, సినిమాలు, చిరంజీవి- నాగబాబులతో ఉన్న విభేదాలతో పాటు రాజకీయ ప్రశ్నలు కూడా అడిగి తనదైన శైలిలో సమాధానాలు రాబట్టారు. దాంతో ఈ రెండు ఎపిసోడ్లలో ఏది పెద్ద హిట్ అవుతుంది? ఏది ఎక్కువగా రేటింగ్స్ సాధిస్తోంది? ఏది టాప్ లో ట్రెండ్ కాబోతోంది? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రభాస్ తన పెళ్లి, వ్యక్తిగత విషయాలతో హీట్ పుట్టిస్తుంటే మరోవైపు పవన్ వీటికి తోడు రాజకీయాలను కూడా మాట్లాడి రచ్చ రచ్చ చేయనున్నారు. మొత్తానికి  ఈ రెండు షోలలో ఏది టాప్ లో నిలుస్తుందో కాలమే తేల్చిచెప్పాలి.

అమ్మాయిలకు ఇన్ని ఉంటాయని నాకు తెలీదు!

కమెడియన్ పంచ్ ప్రసాద్ జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. వెరైటీ డైలాగ్స్ తో ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. తరువాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ అందరినీ నవ్వించే ప్రసాద్ కొంత కాలం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి కొంత ట్రీట్మెంట్ అదీ చేయించుకుని సెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు తన వైఫ్ సునీతతో కలిసి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ షాపింగ్ లో ఎంజాయ్ చేసాడు. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు.  "సో మీకెప్పుడూ చెప్పేదే.. లేడీస్ షాపింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మనం ఉంటే బలైపోతాం . కాబట్టి నా వైఫ్ సునీత ఈ గోల్డ్ జ్యువెలరీ గురించి మొత్తం తానే హ్యాండిల్ చేస్తుంది.. ఇక్కడ కూర్చుని చూస్తుంటే అమ్మాయిలకు ఇన్ని ఉన్నాయా.. అబ్బాయిలకు ఏం లేవా ఒక్క చెయిన్ మాత్రమే ఉంటుందా అని ఫీల్ అవుతున్నాను.. అందుకే నేను బాధపడుతూ బయటికి వెళ్ళిపోతున్నాను" అని తన కూతురు తన్వితో కాసేపు వెంట్రిలాక్విజమ్ చేసి ఎంటర్టైన్ చేసాడు పంచ్ ప్రసాద్.  ఇక సునీత ఏ డ్రెస్ కి ఎలాంటి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందో చూపించింది. ఇక పంచ్ ప్రసాద్ అంత సేపు కూర్చునికూర్చుని అప్పటికే నాలుగు టీలు వేసేశాడని, ఇంకెంత సేపు షాపింగ్ అన్నట్టుగా ముఖం పెట్టాడు అని చెప్పి ప్రసాద్ ఫేస్ ని చూపించింది సునీత. ఆ ఫేస్ చూస్తే గనక  ఆడియన్సు నవ్వకుండా ఉండరు. ఇక ఫైనల్ గా "ఎంత నరకం చూపించారో వీళ్లంతా" ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్ తో అని వీడియోని ఎండ్ చేసాడు.

అలా సిగ్గుపడితే ఎలా.. రాజమౌళి ఇదే నేర్పించాడా?

ఆహా వేదికగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ లో.. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్‌ కి ప్రభాస్ వచ్చాడు. నిన్న మొన్నటి దాకా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడటం..దాని వల్ల ఆహా యాప్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడమనేది అందరికి తెలిసిన విషయమే. అయితే నిన్న మళ్ళీ మొదలైన ఈ స్పెషల్ ఎపిసోడ్.. ఆహాలో ఇప్పటివరకు జరిగిన వాటిలోఎక్కువ మంది వీక్షకులు చూసిన ఎపిసోడ్ గా నిలిచింది. ఆ తర్వాత బాలకృష్ణ, ప్రభాస్ కి కొన్ని సినిమా డైలాగ్స్ వినిపించి అవి ఏ సినిమాలోనివో చెప్పమన్నాడు. ఆ తర్వాత ఆ సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. "రాజమౌళితో ఛత్రపతి నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి?" అని బాలకృష్ణ అడిగాడు. "సినిమా నాలుగు రోజులకే.. ఆయన మంచి మనిషి అని తెలిసింది. ఆ తర్వాత ప్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత ఏ షాట్ అయిన రెండు, మూడు టేక్సే.. ఛత్రపతి క్లైమాక్స్ షాట్ లో వర్షం, గుంపులుగా జనాలు ఉండేసరికి నాకు సిగ్గేసింది.ఇక నేను డైలాగ్ గట్టిగా చెప్పలేనని చెప్పాను. రాజమౌళి పిలిచి.. 'సరే ఎలా అయినా చెప్పు' అని అన్నాడు. ఆ తర్వాత డైలాగ్ చెప్పాను. 'టేక్ ఓకే' అని అన్నాడు. ఇక అప్పటినుండి జనాలుగా గుంపులుగా ఉన్నప్పుడు సైలెంట్ గానే డైలాగ్స్ చెప్తుంటాను.  " విశ్వనాథ్ గారితో సినిమా ఏంటి ఆ సినిమా? ఏం జరిగింది" అని బాలకృష్ణ అడిగారు. "అది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా. ఆరు నెలలు కష్టపడి సీన్స్ కొన్ని చేశాం. కానీ అవి అంతగా సెట్ కాలేదు. మళ్ళీ దిల్ రాజు పిలిచి 'పర్వాలేదు..మళ్ళీ తీద్దాం. మంచి సినిమానే చేద్దాం' అని చెప్పి ఫ్రీడం ఇచ్చాడు. విశ్వనాథ్ గారితో చేసిన ఒక సీన్ లో జనాలు ఎక్కువగా ఉండటం వల్ల నేను సైలెంట్ గా డైలాగ్స్ చెప్పాను. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి పిలిచి 'ఇలా అయితే ఎలా.. ఓపెన్ గా చెప్పాలి డైలాగ్స్. అలా సిగ్గుపడితే ఎలా.. రాజమళి ఇదే నేర్పించాడా' అని అన్నారు. ఆ తర్వాత నేను " సర్.. సర్" అనే సరికి కూల్ అయ్యారు. "ఆ తర్వాత చేసిన సినిమాల డైరెక్టర్లు అందరు.. 'రాజమౌళి వల్లే.. డైలాగ్స్ అన్నీ ఇలా సైలెంట్ గా చెప్తున్నావ్ నువ్వు అని తిడుతుంటారు" అని ఫ్రభాస్ చెప్పాడు.

అప్పుడేదో కోపం వచ్చి ఆమె మీద మాటలు జారాయి!

బండ్ల గణేష్ అంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్..సినిమా ఈవెంట్స్ లో ఆయన ఇచ్చే స్పీచ్ లు ఒక రేంజ్ లో ఉంటాయి. కొంత కాలం క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మంత్రి రోజా మీద ఆయన కొన్ని ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు.  "రోజా గారిది కేసు కంప్లీట్ అయ్యిందా" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ మాట్లాడుతూ " ఏం కేసు అండి అది..ఆమె నా మీద కేసు పెడతాను అన్నారు కానీ పెట్టలేదు..ఏదో ఆ రోజు అలా ఐపోయింది..వదిలేయండి.. ఐనా మనం గర్వపడాలి ఆమెను చూసి..ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్ట్.. ఒక అమ్మాయి సినిమాలు తీసింది, కష్టపడింది, కాళ్ళు, చేతులు  విరగ్గొట్టుకుంది..జబర్దస్త్ లో ప్రోగ్రామ్స్ చేసింది.. ఓడిపోయి గెలిచి మంత్రి అయ్యింది..అలాంటి రోజాను చూసి మనం గర్వపడాలి. ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి..ఇప్పుడు  మంత్రిగా చింపి చాటేస్తోంది..మంచికి మంచి చెప్పుకోవాలి. గొడవైనప్పుడు అయ్యింది.  తర్వాత ఎన్నో సార్లు కలిసాం, ఎన్నో ఫొటోస్ దిగాం , ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. రోజు నా సోదరి..రోజా వాళ్ళ బ్రదర్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్..అప్పుడేదో నాకు కోపం వచ్చింది. ఆ టైములో అలా కొన్ని మాటలు జారాయి..తప్పు జరిగిపోయింది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చూస్తుంటా. తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ రోజాలా ఐన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా..లేరు కదా అందుకే రోజాని చూసి మనమంతా గర్వపడాలి" అన్నారు.