షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో యాంకర్ అనసూయ...ఫాన్స్ కి సందడే సందడి

ఈ మధ్య కాలంలో యాడ్స్ లో బుల్లితెర సెలబ్రిటీస్ సందడి చేస్తున్నారు. అలాగే షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళు హాజరవుతున్నారు. అలా అనసూయ ఇటీవలి కాలంలో షాప్ ఓపెనింగ్ సెలెబ్రేషన్స్ కి వెళ్లి రిబ్బన్ కట్ చేస్తోంది.  ఇక ఇలా ఎవరైనా సెలెబ్స్ వచ్చారు అంటే చాలు.. వాళ్ళను చూడడానికి ఫాన్స్ ఎగబడుతూ ఉంటారు. హీరోస్ వస్తే గనక అంత పెద్ద హంగామా ఉండదు కానీ హీరోయిన్స్ వస్తే ఆ క్రేజ్ వేరే..అలాంటి కిక్ ఇచ్చే బుల్లితెర సెలెబ్రెటీగా అనసూయ మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ డాన్స్ చేయడం, చేయించడం సరదాగా అలరించడం వంటివి చేస్తూ ఉంటుంది. ఆ వీడియోస్ ని, ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా అనసూయ శ్రీకాళహస్తిలో గ్రాండ్ గా బాలాజీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లి రిబ్బన్  కట్ చేసింది.  ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అనసూయని చూసేందుకు జనం భారీఎత్తున తరలివచ్చారు.  స్కై బ్లూ కలర్ శారీలో అనసూయ గోర్జియస్ లుక్ లో అదిరిపోయింది. అంత రద్దీలో కూడా తన మీద అభిమానంతో వచ్చిన ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇచ్చింది. మరో ట్విస్ట్ ఏమిటి అంటే  లాస్ట్ లో చిన్న డాన్స్ స్టెప్స్ కూడా వేసి ఖుషి చేసింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి యాక్టర్ గా మారింది అలాగే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ, బుల్లితెర మీద షోస్ కి హోస్ట్ చేస్తూ, సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటూ దూసుకుపోతోంది.

లినెన్ షర్ట్ యాడ్ లో మెరిసిన జబర్దస్త్ కమెడియన్, ఫేమస్ యాంకర్

యాడ్స్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ ఐనట్టుగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్లనే ఎక్కువగా యాడ్స్ కి ప్రిఫర్ చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు బుల్లితెర మీద పాపులర్ ఐనా,  అవుతున్న వాళ్ళతో కూడా యాడ్స్ అనేవి చేయడం స్టార్ట్ అయ్యింది.  ఇప్పుడు అలాంటి ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లితెర మీద యాంకర్ గా ఫేమస్ ఐన రవి, జబర్దస్త్ కమెడియన్ గా క్లిక్ ఐన రాకింగ్ రాకేష్, అలాగే మరో నటుడు, ఇంకొంత మంది లేడీస్ తో కలిసి "యువర్ ఫాబ్రిక్ ఫియాన్సీ..లూయిస్ పార్క్" అంటూ లైనెన్ షర్ట్స్ యాడ్ లో వీళ్ళు కనిపించారు. ఇక యాంకర్ రవి గురించి అలాగే జబర్దస్త్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రాంకి యాంకర్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు రవి.  2017 లో "ఇది నా ప్రేమకథ" అనే సినిమాలో హీరోగా చేసాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత హీరోగా ట్రయల్స్ వేయడం మానేసాడు..కొన్ని  మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసాడు. బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేదు కానీ స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ గా ఫుల్ సక్సెస్ అయ్యాడు. సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5  కంటెస్టెంట్ గా చేసాడు.  ఇక రాకింగ్ రాకేష్ బుల్లితెర మీద  అంచలంచెలుగా ఎదుగుతూ  కమెడియన్ నుంచి టీం లీడర్ స్థాయికి వచ్చాడు. జోర్దార్ సుజాతతో ప్రేమలో పడి త్వరలో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. వీళ్ళిద్దరూ రీసెంట్ గా దుబాయ్ వెళ్లొచ్చారు..న్యూ ఇయర్లో బెజవాడ దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ జంట మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు రాకేష్ ఈ యాడ్ లో నటించాడు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసుకున్నాడు..అలాగే  "కొత్త సంవత్సరంలో ఓసారి.. కొత్త యాడ్ తో మీ ముందుకు" అని కాప్షన్ పెట్టుకున్నాడు. అలా రాకేష్ కొత్త కొత్త అవకాశాలను అందుకుంటున్నాడు.

లాస్య సీమంతం వేడుకలు.. హాజరైన అభిజిత్ వాళ్ళ అమ్మ

లాస్య మంజునాథ్ అంటే బుల్లితెర మీద తెలియని వారు లేరు. ఎందుకంటే ఒకప్పుడు  లాస్య-రవి జోడీగా "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రాం చేసి బెస్ట్ యాంకర్స్ గా ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అంతే కాదు లాస్య అంటే చీమ-ఏనుగు జోక్స్ నే ప్రస్తావిస్తారు చాలా మంది. ఆ జోక్స్ తో ఆమె చాలా పాపులర్ అయ్యింది. అలాంటి లాస్య తర్వాత కొంత కాలం బుల్లితెరకు దూరమయ్యింది. ఆ తర్వాత మంజునాథ్ ని వివాహం చేసుకుని స్క్రీన్ మీదకు మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తన భర్తతో పాటు అన్ని రకాల షోస్ లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కూడా. ఆల్రెడీ లాస్యకి దక్ష అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ముద్దుగా జున్ను అని పిలుచుకుంటుంది. తనకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.   ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఆమె  సెకండ్ పెగ్నన్సీని ఎంజాయ్ చేస్తోంది. న్యూ ఇయర్ లో మరో బేబీకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా తన బేబీ బంప్ తో భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులతో ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ 2023లో వాళ్ళ లైఫ్ లో మరో బిడ్డ రాబోతోంది అని ఈ జంట చెప్పారు. రీసెంట్ గా ఈమెకు సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో లాస్య చూడముచ్చటగా కనిపించింది. ఈ వేడుకకు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎంట్రీ ఇచ్చింది.. అక్కడి వేడుకను వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నాకు ఎంతో ఇష్టమైన మనిషికి సీమంతం.. యు ఆర్ ది బెస్ట్ అక్క " అనే అర్థంలో ఒక కాప్షన్ పెట్టింది. లాస్య యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ - 4 లో పార్టిసిపేట్ చేసాక ఆమె ఫుల్ పాపులర్ అయ్యింది. ఇక ఈ సీమంతం వేడుకకు అభిజిత్ వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. గీతూకి ఆమె అంటే చాలా ఇష్టం అట.. ఆమెతో కలిసి వీడియో తీసి దాన్ని తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. "నాలో నీకు ఏం నచ్చిందో తెలీదు కానీ నాకు మాత్రం నీ బిగ్ బాస్ రివ్యూస్ అంటే బాగా ఇష్టం" అని చెప్పారు అభి వాళ్ళ మదర్... ఇలా గీతూ ఆ వేడుకను ఫుల్ ఎంజాయ్ చేసింది. 

అబ్బాయిల జీవితాలతో ఆడుకోవడం అలవాటు!

'మిస్టర్ అండ్ మిస్సెస్' రియాలిటీ షో ప్రతీ వారం మంచి ఎంటర్టైన్మెంట్‌ని అందిస్తూ బుల్లితెర మీద దూసుకుపోతోంది. ఇందులో పార్టిసిపేట్ చేసే కపుల్స్‌కి మంచి మంచి సెగ్మెంట్స్‌తో పోటీలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తోంది హోస్ట్ శ్రీముఖి. లాస్ట్ వీక్ ఎపిసోడ్ కూడా అలాగే నవ్వు తెప్పించింది. ఇందులో పార్టిసిపేట్ చేసే పెయిర్స్‌తో లవ్ గేమ్స్ ఆడించింది.  ఇక ఈ ఎపిసోడ్‌లో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ రితేష్ వేసుకున్న డ్రెస్ మీద ఫన్నీ కామెంట్స్ చేసింది శ్రీముఖి. రాకేష్‌ని చూసి "ఏమిటి మహేష్ బాబు ఇక్కడా.." అని మోసేసింది. రాకింగ్ రాకేష్ కూడా మహేష్ బాబు డైలాగ్ ఒకటి చెప్పేసాడు. అతను మెడలో వేసుకున్న స్కార్ఫ్ చూసి "ఏమిటి చలి పెడుతోందా మీకు" అని దాన్ని సరిచేసింది.  "వాళ్ళ స్టైల్స్ ముందు మా ఆయన స్టైల్ చూడండి" అని శ్రీవాణి తన భర్త విక్రమ్ ని చూపించింది. ఆ తర్వాత జడ్జెస్ స్నేహ, శివబాలాజీని పిలిచింది. థీమ్ లవ్ గేమ్ కాబట్టి "మీరు కూడా ఒక ఆట బాగా ఆడతారని విన్నాను" అని శివబాలాజీని అడిగేసరికి "ఏ ఆట" అని సీరియస్ ఫేస్‌తో రివర్స్‌లో అడిగాడు.. "ఈవెనింగ్ టైమ్స్, వీకెండ్స్ లో" అని శ్రీముఖి చెప్పింది. "అదా స్పిరిట్ గేమ్" అని ఆన్సర్ ఇచ్చాడు శివ బాలాజీ. ఆ కౌంటర్ కి అందరూ నవ్వేశారు.  "అదేనండి వాలీబాల్" అని శ్రీముఖి మళ్ళీ చెప్పేసరికి, "ఓ వాలీబాలా.. ఆ గేమ్ నేను బాగా ఆడతాను" అని చెప్పి "ఇంతకు మీరేం ఆడతారండి" అని శ్రీముఖిని రివర్స్‌లో అడిగేసరికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. "నేనా.. అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటాను" అని ఆన్సర్ చెప్పి అందరినీ నవ్వించింది. 

సౌందర్య ప్రయత్నం ఫలిస్తుందా..!

కార్తీక్ దేవుడి గదిలో పూజ చేసి దీప గురించి మొక్కుకుంటాడు. దీప నిద్ర లేవడంతోనే నీరసంగా ఉంటుంది. "నాకేంటి ఈ రోజు ఇలా ఉంది" అని బాధపడుతుంది. ఇంతలో దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. దీపకి హారతి ఇస్తాడు. "డాక్టర్ బాబు.. మీరు పూజ చేసారా?" అని దీప అంటుంది. దానికి కార్తీక్ " నీకోసమే చేశాను" అని అంటాడు. మరోవైపు చారుశీలను కలవడానికి సౌందర్య హాస్పిటల్ కి వస్తుంది. "శౌర్య కోసం రాసిన మందుల చీటి పట్టుకొని వచ్చి, ఇది ఎవరు రాసారు" అని చారుశీలని అడుగుతుంది సౌందర్య.  "కార్తిక్ రాశాడని డౌట్ వచ్చినట్టుంది ఆంటికి" అని మనసులో అనుకుంటుంది చారుశీల. "ఇది నా కొడుకు హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది" అని సౌందర్య అంటుంది. దానికి చారుశీల కంగారుపడి "లేదు ఆంటి.. నేనే రాశాను" అని చెప్తుంది.  ఆ తర్వాత హాస్పిటల్ నుండి సౌందర్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న ఆనందరావుని కలుస్తుంది. అతనితో మాట్లాడుతూ "కార్తీక్, దీప కన్పించాలని దేవుడిని మొక్కుకుందాం" అని చెప్తుంది.  ఆ తర్వాత కార్తిక్, దీపలని వెతకాడానికి వెళ్తుంది సౌందర్య.  అలా బయటకు వెళ్లే  టైంకి అనుమానం వచ్చి, ఇంద్రున్ని పిలుస్తుంది. "ఇంద్రుడు.. నా కొడుకు, కోడలు ఎక్కడున్నారో, నీకు తెలుసు కదా? నీ భార్య మీద ఒట్టేసి చెప్పు" అని నిలదీస్తుంది సౌందర్య. దానికి ఇంద్రుడు తన భార్య మీద ఒట్టేసి "నిజంగానే నాకేం తెలియదు. ఎప్పుడు వాళ్ళని చూసింది లేదు" అని చెప్తాడు. అది విని నమ్మేస్తుంది. ఆ తర్వాత సౌందర్య బయటకు వచ్చేస్తుంది. మరో వైపు కార్తీక్ నిద్ర నుండి లేచి దీప దగ్గరికి వస్తాడు. "నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావ్?" అని దీపని కోపగించుకుంటాడు. దానికి దీప మాట్లాడుతూ "నా జబ్బు కంటే, మీరు చేసే చేష్టలు చూస్తుంటేనే భయమేస్తుంది. ప్రతిసారి మీరు నాకు జబ్బుని గుర్తు చేస్తున్నారు" అని  అంటుంది.  ఆ తర్వాత సౌందర్య వెతుక్కుంటూ.. దీప, కార్తీక్ లు ఉన్న ఇంటికే వస్తుంది. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఏం జరుగుతుందో? తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.  

రిషిపై ఉన్న ప్రేమను వసుధార త్యాగం చెయ్యనుందా..!

రాజీవ్ మాటలు అన్నీ ఆలోచించుకుంటూ.. తనలో తానే ఊహించుకుంటుంది వసుధార. రిషీతో పెళ్ళి అయ్యినట్లు, జగతి మేడం పంపిన మంగళసూత్రం మెడలో వేసుకుంటుంది వసుధార. ఒకవైపు రాజీవ్, వసుధారల పెళ్ళి ఆపడానికి.. జగతి మేడం, మహేంద్ర, రిషి అందరూ కలిసి వసుధార ఇంటికి బయల్దేరతారు. మరోవైపు వసుధార వాళ్ళ ఇంట్లో ఉన్న రాజీవ్.. సునందకి కాల్ చేసి మాట్లాడుతుంటాడు. "వసుధారతో నా పెళ్ళి జరుగుతుంది. మీరు నాకు గిఫ్ట్ ఏం పంపించారా?" అని సునందతో అంటాడు రాజీవ్. "అలాగే పంపిస్తాను" అని సునంద అంటుంది.  ఆ తర్వాత వసుధార ఇంటికి వస్తాడు రిషి. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్నవాళ్ళతో మాట్లాడకుండా, రిషి డైరెక్ట్ గా వసుధార ఉన్న గదిలోకి వెళ్తాడు. "రా.. వసుధార మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం" అని వసుధార చెయ్యి పట్టుకొని అడుగుతాడు. దానికి వసుధార మౌనంగా కదలకుండా అక్కడే ఉండిపోతుంది. మరోవైపు రిషిని అడ్డుకుంటాడు వసుధార తండ్రి చక్రపాణి. అలాగే రిషీతో అక్కడే ఉన్న రాజీవ్ గొడవపడతాడు. రాజీవ్ మాట్లాడుతూ "రిషి సర్.. ఇక్కడ నాకు వసుధారకి పెళ్లి జరుగుతుంది. పిలవని పేరంటానికి వచ్చినవాళ్ళు తిరిగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నువ్వు వసుధారని రమ్మని పిలిచినా  కూడా తను రావట్లేదంటే.. నీతో రావడం తనకు ఇష్టం లేదనే కదా" అని అంటాడు. ఆ తర్వాత కాసేపు రాజీవ్, రిషి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో మహేంద్ర, జగతి మేడం అక్కడి వస్తారు. "వసు.. రా వెళదాం" అని రిషి అంటాడు. దానికి వసుధార రాజీవ్ అన్న మాటలనే గుర్తు చేసుకుంటుంది. "నా చెయ్యి వదలండి సర్" అని అంటుంది. అలా అనగానే రిషి షాక్ అవుతాడు. ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తాడు. "ఇక్కడి నుండి వెళ్ళండి సర్. ఇది మా కుటుంబానికి సంబంధించిన  విషయం" అని రిషీతో అంటుంది వసుధార. దానికి రిషి మాట్లాడుతూ "అంటే.. నాకేం సంబంధం లేదా?" అని అడుగుతాడు. వసుధార మాట్లాడుతూ "సర్.. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని ప్రాధేయపడుతుంది. "నువ్వు నిజంగానే నన్ను వెళ్ళమంటున్నావా?" అని బాధతో అంటాడు రిషి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇకముందు ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఫ్రెండ్ షిప్ అంటే మాదే అంటున్న శ్రీహాన్-రేవంత్!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రతీవారం లాగే ఈ వారం సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షోకి సీజన్ 6 విన్నర్ అండ్ రన్నర్ గా నిలిచినా  సింగర్ రేవంత్ - శ్రీహాన్ ఇద్దరూ వచ్చారు. "ఫ్రెండ్ షిప్ అంటే రేవంత్..ఒక్కసారి నమ్మాడు అంటే జాన్ ఇస్తాడు" అని శ్రీహాన్ రేవంత్ గురించి చెప్తే " మన ముందు మనల్ని తిట్టి వెనక మన గురించి ఆలోచించేవాడు నిజమైన ఫ్రెండ్ అదే శ్రీహాన్ " అని రేవంత్  చెప్పాడు.  తర్వాత  ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెట్టిన ఫ్రెండ్ షిప్ పోజ్ పెట్టారు వీళ్ళు. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోకి ఫేమస్ యాక్టర్ అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన "బటర్ ఫ్లై" మూవీ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. "వాళ్ళు వస్తే ఎంటర్టైన్ ఫిక్సు...వస్తున్నారు టాప్ 10 బిగ్ బాస్ సీజన్ 6 " అని చెప్పి శ్రీముఖి వాళ్ళను స్టేజి మీదకు ఇన్వైట్ చేసింది. "ఆదిరెడ్డి డాన్స్ కి అన్ని ఊళ్ళో ఫాన్స్ ఉన్నారు" అని చెప్పారు.  అలాగే బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ అంతా ముగ్గు వేస్తున్నప్పుడు "అనుపమ చెల్లె ఇంతకు నీ పెళ్ళెప్పుడు" అని ఫైమా అడిగేసరికి అనుపమ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుంటే మళ్ళీ ఫైమానే మాట్లాడుతూ " పెళ్ళీడొచ్చినప్పుడు అని ఆన్సర్ చెప్పాలి కానీ అలా మెలికలు తిరగకూడదు" అని చెప్పి అందరినీ నవ్వించింది.

అతని మూడో గర్ల్ ఎవరో తెలుసా...సీక్రెట్ బయట పెట్టిన శ్రీముఖి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మొదలైన బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో బుల్లితెర మీద ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. రాబోయే వారం ఎపిసోడ్ ప్రాపర్టీ రౌండ్. ఇందులో ఇచ్చిన ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని జోడీస్ డాన్స్ చేశారు.  ఇక ఇందులో ఆర్జే చైతూ-ఆర్జే కాజల్ జోడి  స్కూల్ యూనిఫార్మ్ లో వచ్చి క్లాస్ రూమ్, బెంచెస్ ని యూజ్ చేసుకుని డాన్స్ చేశారు. విక్రమార్కుడు మూవీలో జింతాత సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన జడ్జి రాధ "క్యూట్..స్మార్ట్..దుమ్ము బాబోయ్..దుమ్ము" అని కంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత శ్రీముఖి వీళ్లకు ఒక టాస్క్ ఇచ్చింది. చైతూకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో రాయమని అడిగేసరికి చైతు ఇద్దరు అని, కాజల్ ముగ్గురు అని రాశారు. ఇదేంటని శ్రీముఖి అడిగేసరికి "ఆ మూడో వ్యక్తి నాతో నాలుగు నెలల నుంచి మాట్లాడ్డం లేదు " అని అన్నాడు చైతు. "అసలు నిజం చెప్పమంటావా" అని కాజల్ అనేసరికి "వద్దులే...ఎందుకు.." అని శ్రీముఖి ఆ సీక్రెట్ ని చెప్పనివ్వకుండా ఆపేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో వస్తున్న ఈ షో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం అవుతోంది. మరి ఆ సీక్రెట్ ఏమిటి అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి..

పీచ్ కలర్ శారీలో యాంకర్ శ్యామల గ్లామర్ ట్రీట్!

బుల్లితెర మీద స్టైలిష్ యాంకర్ గా శ్యామలకి ఎంతో పాపులారిటీ ఉంది. ఈ క్రేజ్ ద్వారానే ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి నుంచి షోస్ ని, ఈవెంట్స్ ని హోస్ట్ చేస్తూ ఉంది శ్యామల. అవకాశం వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా  నటిస్తూ ఉంటుంది. శ్యామల యాంకర్ గా మంచి మార్క్స్ కొట్టేసింది కానీ యాక్టర్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రతీది తన ఫాన్స్ తో, నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. బొద్దుగా ఉన్న శ్యామల కాస్తా బక్కచిక్కి కనిపించింది.  ఇప్పుడు ఈమె పీచ్ కలర్ శారీలో ఉన్న ఒక ఫోటో షూట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈమె పిక్స్ చూసాక నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. " లూజ్ హెయిర్ లో చాలా బాగున్నారు. పెళ్ళైనా మీ అందం మాత్రం తగ్గలేదు ఇంకా పెరుగుతూనే ఉంది..ఇంత హాట్ గా ఉంటే ఎలా మేడం" అని అంటున్నారు. శ్యామల సీరియల్ యాక్టర్ నరసింహని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలుసు..నరసింహ కార్తీకదీపంలో, అలాగే వెబ్ సిరీస్ ఎక్సపోజ్డ్ లో నటిస్తున్నాడు..క్రిస్మస్ కి శాంటాలా మారిన శ్యామల..ఇప్పుడు కొత్త ఏడాదిలో అచ్చమైన తెలుగమ్మాయి గెటప్ లో కనిపిస్తూ  మైమరిపిస్తోంది.

బెడ్ పై హాట్ పెర్ఫార్మెన్స్..వీడియో తీసి తన భర్తకు పంపిస్తానన్న జడ్జి రాధ!

బిగ్ బాస్ ఓల్డ్ సీజన్స్ లోని కంటెస్టెంట్స్ అంతా కూడా బీబీ జోడిలో హాట్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొడుతున్నారు. అఖిల్- తేజస్వి చేసిన హాట్ డాన్స్ స్టెప్స్ అందరికీ హీటు పుట్టించాయి. వీళ్ళ డాన్స్ చూసిన రాధ షాకింగ్ కామెంట్స్ చేసింది. వీళ్ళు వైట్ కలర్ డ్రెస్సెస్ లో వచ్చి "లైగర్" మూవీలో మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఐన "ఆఫత్" సాంగ్ కి డాన్స్ చేశారు. బెడ్ మీద పడుకుని చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ కి జడ్జెస్ కామెంట్స్ చేశారు " లిటరల్లీ స్టార్టెడ్ స్వెట్ " అంది సదా..ఆ స్టెప్స్ కి రాధకి చెమట్లు పట్టేసరికి పేపర్ తో విసురుకుంటూ "ఆ పోర్షన్ లో వేసిన స్టెప్స్ ని రికార్డు చేసి మా ఆయనకు పంపిస్తా..మీ పెర్ఫార్మెన్స్ కూడా" అని రాధా హాట్ లుక్స్ తో షాకింగ్ కామెంట్స్ చేసింది.  ఇక ఆ కామెంట్స్ కి అఖిల్, తేజస్వి ఫుల్ ఖుషి ఇపోయారు. ఈ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. బీబీ జోడీస్ గా అర్జున్ కళ్యాణ్-వాసంతి, అఖిల్-తేజస్వి మాదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనాయ సుల్తానా, ఆర్జే చైతు-ఆర్జే కాజల్, అవినాష్-ఆరియానా, మెహబూబ్-అష్షు ఇందులో పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇక వచ్చే వారం ఈ జోడీస్ మధ్యన మార్క్స్ విషయంలో హోరాహోరీ మాటల యుద్ధం జరగబోతోంది అని తెలుస్తోంది. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. మరి ఎవరికీ ఎన్ని మర్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాలి.

ఈ ఏడాది ఇలా మొదలవుతుందని అనుకోలేదు...ఇదే చివరి సారి కావాలి...

పునర్నవి భూపాళం అంటే తెలియని వారు లేరు. బిగ్ బాస్ తో ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. కొంత మంది సెలెబ్రిటీస్ గుడ్ న్యూస్ చెప్తూ ఉంటే కొత్త సంవత్సరంలో బాడ్ న్యూస్ చెప్పింది పున్ను. దీంతో ఆమె ఫాన్స్ చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం పునర్నవి లంగ్స్ కి సంబంధించి వ్యాధితో బాధపడుతున్నట్లుగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఫొటోస్ పెట్టింది. “నా న్యూ ఇయర్ చెస్ట్ పెయిన్ తో మొదలైంది. నేను ఇలా అనారోగ్యానికి గురి కావడం అనేది ఇదే చివరి సారి కావాలని కోరుకుంటున్న"  అని పోస్ట్ పెట్టింది. పునర్నవి బాధను చూసి తట్టుకోలేని నెటిజన్స్ త్వరగా కోలుకోవాలని మెసేజెస్ పెడుతున్నారు. ఈమె "ఉయ్యాలజంపాల" మూవీతో డెబ్యూ చేసినా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మాత్రం ఈమె పేరు బాగా మోత మోగింది. అందులోనూ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన లవ్ ట్రాక్ట్ వేసిన డ్యూయెట్ డాన్స్ తో ఆడియన్స్ ని బాగా అట్ట్రాక్ట్ చేసింది. వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశారు.   ప్రస్తుతం ఈమె లండన్ లో సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది. "కమిట్మెంట్" అనే వెబ్ సిరీస్ లో ఈమె నటించింది. పునర్నవి తన విషయాలన్నీ కూడా ఇన్స్టా లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా నెటిజన్స్, ఫాన్స్ తో లైవ్ చాట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఆమె తెర మీద ఎక్కడా కనిపించడం లేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే పునర్నవికి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. ఈమె ఆరోగ్యం మెరుగుపడి మంచి ఛాన్సెస్ రావాలని మనం కూడా కోరుకుందాం.

అతనితోనే శ్రీముఖి పెళ్లట!

బుల్లితెర మీద ఎంతో మంది యాంకర్లు వారి వారి పంధాలో దూసుకెళుతున్నారు. కొంతమంది అందంతో, కొంతమంది పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్లకే కాదు యాంకర్లకు కూడా స్టార్ రేంజ్ ఉంది. అలా మిస్సైల్ లా దూసుకెళుతోంది  హాట్, క్యూట్, స్మార్ట్ స్టార్ యాంకర్ శ్రీముఖి.  బుల్లితెరలో అన్ని షోస్ లో ఈమె కనిపిస్తోంది. మరో వైపు మూవీస్ లో ఛాన్సెస్ వస్తుంటే అందులో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్ గా కూడా ఉంటుంది ఈ అమ్మడు.  అలాంటి శ్రీముఖికి సంబంధించిన విషయం ఒకటి నెట్టింట్లో ఫుల్ వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన "భోళా శంకర్" లో శ్రీముఖి యాక్ట్ చేసింది. కెరీర్ విషయంలో ఫుల్ బిజీగా ఉన్న ఈమె పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే స్టార్ యాంకర్ త్వరలో ఒక ఫేమస్ బిజినెస్ పర్సన్ ని పెళ్లి చేసుకోబోతోంది. కొంతకాలంగా అతనితో ఈ బుల్లితెర రాములమ్మ లవ్ లో ఉందట.  ఇక వీళ్ళ పెళ్ళికి టు ఫామిలీస్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని పచ్చ జెండా కూడా  ఊపారట. ఐతే ఈ పెళ్ళికి సంబంధించిన ఒక ఆఫీషియల్ ప్రకటన మాత్రమే రావాల్సి ఉందట. ఇది వరకు కూడా ఇలాంటి ఎన్నో రూమర్స్ శ్రీముఖి మీద వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈమె పెళ్లి వార్త చాలా గట్టిగానే వినిపిస్తోంది. మరి శ్రీముఖి తన పెళ్ళికి సంబంధించిన ఈ విషయాల మీద, తనకు కాబోయే వాడి మీద వస్తున్న వార్తలపై ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

జీ తెలుగులో 9 నుంచి కొత్త సీరియల్ 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి'

బుల్లితెర మీద న్యూ ఇయర్ లో అలరించడానికి కొత్త కొత్త సీరియల్స్ రెడీ అవుతున్నాయి. జీ తెలుగులో కొత్తగా ఒక డైలీ సీరియల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆ సీరియల్ పేరు 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి'..ఇందులో హీరో హీరోయిన్స్ గా మహి గౌతమి- రాఘవేంద్ర కనిపించనున్నారు. ఈ సీరియల్ జనవరి 9 నుంచి మధ్యాహ్నం 2 . 30 కి ప్రసారం కాబోతోంది. ఆ దైవ నిర్ణయానికి, మానవ సంకల్పానికి మధ్య జరిగే ఒక యుద్ధం..చివరికి ఇందులో ఎవరు గెలుస్తున్నారు ? అనే థీమ్ తో ఈ కొత్త సీరియల్ "చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి" ఆడియన్స్ మనసును దోచుకోవడానికి సిద్దమయ్యింది.  ఈ సీరియల్ కథ మొత్తం భాగ్యలక్ష్మి అనే అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతుంది. స్వార్థం లేని ఒక అమ్మాయి. ఇతరులకు సాయపడుతూ ఉండే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవాళ్లను సంతోషంగా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. మరో వైపు మిత్ర నందన్ ఒక మంచి బిజినెస్ మాన్..అతను ఎలాంటి పరిస్థితినైనా యిట్టె సాల్వ్ చేసుకునే ఒక తెలివైన వ్యక్తి. తన డెస్టినీని తాను మార్చేసుకోగలననే ధీమాతో ఉంటాడు.  కానీ అతనికి తల్లి అంటే ఇష్టం.. ఆమె మాటకు ఎప్పుడూ నో అని చెప్పనే చెప్పాడు. అనుకోని పరిస్థితుల్లో భాగ్యలక్ష్మి, మిత్ర పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పటినుంచి తన జీవితం మొత్తం మారిపోయిందని బాధపడుతూ ఉంటుంది. కానీ కొంతకాలానికి మిత్రాను అర్ధం చేసుకుంటుంది. అప్పుడు అతను ఆమెకు ప్రేమను పంచుతాడా ? మిత్ర జీవితంలో ఎదురయ్యే సంఘటనలను భాగ్యలక్ష్మి ఎలా ఫేస్ చేస్తుంది..తన బంధాన్ని ఎలా నిలుపుకుంటుంది, కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది అనేదే మిగిలిన కథాంశం. మహి గౌతమి "నీవల్లే నీవల్లే" అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమై  "రంగుల రాట్నం" "అగ్నిపరీక్ష" సీరియల్ లో నటించి మెప్పించింది. ఇక ఈమె ఆర్జేగా, యాంకర్ గా కూడా చేసింది. ఇక ఈమె అసలు పేరు మహాలక్ష్మి. మరి ఈ సీరియల్ లో తన నటన ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.

చాన్నాళ్లకు స్టేజి మీద శ్రీదేవి...పాట పాడి ఆమెను ఫిదా చేసిన ఆది

త్వరలో సంక్రాంతి పండగ రాబోతోంది. ఇక ఇప్పుడు బుల్లితెర వీటికి సంబంధించిన షోస్ ని రెడీ చేసి ఆడియన్స్ ని అలరించడానికి  సిద్దమయ్యింది. ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఈవెంట్ "మంచి రోజులు వచ్చాయ్...పండగో ఎంజాయ్" అనే టైటిల్ తో  ఎంటర్టైన్ చేయబోతోంది.  దీనికి సంబంధించిన ఒక  ప్రోమో రీసెంట్ గా  రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో రీల్ కపుల్స్, రియల్ కపుల్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు.. హైపర్ ఆది , ఇమ్మానుయేల్, మానస్, అంబటి అర్జున్, నటి సుధా, వర్ష, కృష్ణ భగవాన్, అన్నపూర్ణ, రాగిణి, పటాస్ ప్రవీణ్, ఆటో  రాంప్రసాద్, నిరుపమ్, మంజుల, విష్ణుప్రియ.. ఇలా అందరూ కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. ఇక కృష్ణ భగవాన్ వచ్చి " ఇంతకు ఎలా చేస్తారు" అని అడిగేసరికి " ఓ ...ఆటలు, పాటలు , డాన్సులు అన్ని ఇరగ్గొట్టేస్తాం" అని ఆది ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ఒక అద్దిరిపోయే స్పెషల్ ట్విస్ట్ ని కూడా చూపించారు. మంజుల కూతురు శ్రీదేవి ఈ షోలో కనిపించడమే ఆ ట్విస్ట్. ఈమె ప్రభాస్ తో "ఈశ్వర్" మూవీలో నటించి హీరోయిన్ గా మారారు. ఆ తర్వాత హీరో తరుణ్ తో "నిన్నే ఇష్టపడ్డాను" మూవీ చేసింది కానీ పెద్దగా ఆడలేదు. తర్వాత ఆమె సైడ్ క్యారెక్టర్స్ లో నటించి తర్వాత ఫేడ్ అవుట్ ఐపోయింది. కొంత కాలానికి అంటే  2011 లో రవితేజతో కలిసి "వీర" మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసి రాలేదు. ఇక ఫైనల్ గా రాహుల్ అనే అతన్ని పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ ఐపోయింది. ఇప్పుడు ఆమెకు రూపిక అనే పాప ఉంది. ఈమె ఈ ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చి స్టేజి మొత్తాన్నిషేక్ చేసింది. ఇక ఆది ఎప్పటిలానే శ్రీదేవిని ఫుల్ గా మోసేసాడు. "నువ్వు శ్రీదేవైతే ..నేనే చిరంజీవంట" అనే పాట పాడి ఆమెను ఫిదా చేసేసాడు.  ఈ కార్యక్రమం సంక్రాంతి పండగ రోజు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.

ఆర్జీవిని ఇమిటేట్ చేసి ఇనాయని పటాయించిన అవినాష్..

బీబీ జోడి లేటెస్ట్ ప్రోమో కలర్ ఫుల్ గా రిలీజ్ ఐపోయింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో "ప్రాపర్టీస్ రౌండ్" ఇచ్చిన ప్రాపర్టీని యూజ్ చేసుకుంటూ కంటెస్టెంట్స్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రోమో చూస్తే అవినాష్ ఆర్జీవీ అవతారం ఎత్తాడు. అచ్చంగా ఆయన వాయిస్ నే ఇమిటేట్ చేస్తూ  "ఈ డంబుల్ వాడుతూ అమ్మాయితో జిమ్ చేయాలనిపిస్తోంది" అని చెప్పేసరికి శ్రీముఖి వెంటనే "ఇనాయ ఆజా" అని ఆమెను పిలిచింది. "ఇనాయని చూసి అవినాష్ కళ్ళు మూసుకునేసరికి నన్ను చూసి మాటలు రావడం లేదనుకుంటా" అని కౌంటర్ వేసింది. ఇక ఆ కౌంటర్ కి రివర్స్ కౌంటర్ వేసి "ఏమన్నా చేయాలనిపిస్తోంది" అన్నాడు అవినాష్. దాంతో స్టేజి మొత్తం కేకలు పెట్టింది. ఇక అవినాష్ ఇనాయ చేతికి డంబుల్ ఇచ్చి ఆమెతో ఎక్సరసైజ్ చేయించాడు. దాంతో "అదేంటి నాతో చేయిస్తున్నావ్ ఆరియానా కదా చేయాల్సింది" అంది ఇనాయ. దీంతో అందరూ నవ్వేశారు.  తర్వాత జోడీస్ అన్నీ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ తో ఎంటర్టైన్ చేశాయి. ఇక భానుశ్రీని అవినాష్ సరిగా డాన్స్ స్టెప్ ని ఇమిటేట్ చేయకపోయేసరికి లాగి పెట్టి చెంప మీద ఒక్కటిచ్చింది. ఫైనల్ గా అఖిల్-తేజస్వి జోడి అలాగే, అవినాష్-ఆరియానా జోడి వేసిన డాన్స్ తో స్టేజి మొత్తం వేడెక్కిపోయింది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కి మిగతా జోడీస్ చాలా తక్కువ మార్క్స్ ఇచ్చేసరికి వాళ్ళ మధ్య పెద్ద డిబేట్ జరిగింది. ఇంతలో అవినాష్ " మా డాన్స్ లో ఎక్కడ సింక్ మిస్ అయ్యిందో చెప్పాలి...అలా గుర్తు లేకుండా మర్క్స్ ఎలా ఇస్తారు" అని జడ్జిగా ఉన్న రాధను అడిగేసరికి అవినాష్ అడిగింది కరెక్టే..సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మార్క్స్ వేసే వారి మీదే ఉంది అని చెప్పారు.

పుట్టినరోజు వేడుకల్లో టైట్ హగ్ తో సిరి-శ్రీహాన్

యూట్యూబర్స్ సిరి హన్మంత్, శ్రీహాన్ బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ అయ్యాడు శ్రీహాన్. ఇక అతనికి బిగ్ బాస్ 40 లక్షల సూట్ కేసు ఇచ్చి పంపించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ ఇద్దరి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీహాన్ తన స్నేహితురాలు సిరి హన్మంత్ పుట్టిన రోజు వేడుకల్ని చాలా  గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోల్ని, వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ లో  పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూస్తే గనక  సిరి-శ్రీహాన్ గట్టిగా హగ్ చేసుకుని కనిపించారు. ఇలా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.  " నా సక్సెస్ వెనక ఉన్న అందానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని ఒక టాగ్ లైన్ పెట్టాడు శ్రీహాన్.  వీళ్ళిద్దరూ చాలా ఏళ్ళ నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. సిరి తన మేనమామ కొడుకు చైతుని  దత్తత తీసుకుంది..అలా ఆ పిల్లాడిని వీళ్ళిద్దరూ కలిసి పెంచుకుంటున్నారు.  శ్రీహాన్‌ని ఆ పిల్లాడు డాడీ డాడీ అంటూ పిలుస్తూ ఉంటాడు. తన  పేరుని తన  వీపు మీద పచ్చబొట్టుగా  పొడిపించుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి శ్రీహాన్ ని సర్ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రొడ్యూసర్ గా  తెరకెక్కుతున్న ఒక వెబ్ సిరీస్ లో వీళ్ళు నటిస్తున్నారు. సుజీత్ రాజ్ డైరెక్షన్ లో ఈ సిరీస్ రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తామని శేఖర్ మాస్టర్ చెప్పారు. బిగ్ బాస్ లో తాను నటుడిని కావాలని కల గన్నాడు..హౌస్ నుంచి బయటకు వచ్చాక తన కోరిక ఇలా తీరింది. ఇప్పుడు శ్రీహాన్ టైం స్టార్ట్ అయ్యింది. నటుడిగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

బిగ్ బాస్ న్యూ స్ట్రాటజీ.. బీబీ జోడి తర్వాత ఓటిటి సీజన్‌!

బిగ్ బాస్ షో 2017లో మొదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరసగా సీజన్స్ ని తీసుకొచ్చారు మేకర్స్. బిగ్ బాస్ సీజన్ 6 పూర్తయ్యాక బీబీ జోడి పేరుతో ఒక షో స్టార్ట్ చేశారు.  ఇక ఇప్పుడు మరో స్ట్రాటజీ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఓటిటిలో సీజన్ 2, అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆడియన్స్ దృష్టి బిగ్ బాస్ మీద నుంచి పక్కకు పోకుండా ఉండడం కోసం కొత్త స్కెచ్ వేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఫేమస్ హీరోలు, బుల్లితెర పాపులర్ యాక్టర్స్, సింగర్స్ ని అప్రోచ్ అవుతోంది బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్ జోడి డాన్స్ షో మార్చిలో పూర్తి కాగానే ఏప్రిల్‌లో ఓటిటి నాన్-స్టాప్ సీజన్‌ని స్టార్ట్ చేయడం కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఐతే ఓటిటి సీజన్ 2ని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేసి జూన్ మొదటి వారంలోకి పూర్తయ్యేలా చూస్తోంది.  అలాగే బుల్లితెర మీద సీజన్ 7ని సెప్టెంబర్‌లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సీజన్‌కి హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా ఎవరైనా రావొచ్చు అనే న్యూస్ వైరల్ అవుతోంది. బీబీ జోడి మాత్రం ప్రతీ వారం మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ బిగ్ బాస్ సీజన్, ఓటిటి వెర్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హోస్ట్ ఎవరో తెలియాలంటే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. 

బిగ్ బాస్ అప్పుడు జెన్యూన్.. ఇప్పుడు స్క్రిప్టెడ్.. సమీర్ కామెంట్స్!

'బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎంత చక్కగా ఉందో సీజన్ 6 అంత చెత్తగా వుంది. ఈ సీజన్ చూసిన ఆడియన్స్ కి దీని మీద అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. హోస్టింగ్ లో పస లేదు. కంటెంట్ లేదు. సీజన్ 1 కంటెంట్ ని సీజన్ 6 కంటెంట్ ని పక్క పక్కన పెట్టి చూస్తే అర్ధమవుతుంది.'.. ఈ మాటలన్నీ అన్నది మరెవరో కాదు బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ సమీర్. రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. "అసలు ఏమిటి ఈ బిగ్ బాస్ షో.. ఏమిటి ఆ గోల.. అలాంటి షోని ఎందుకు చూస్తారో కూడా తెలియదు? ఏంటో వాళ్లలో వాళ్ళే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అసలు ఏమిటి ఈ న్యూసెన్స్?" అని యాంకర్ షాకింగ్ కామెంట్స్ చేసేసరికి.. సమీర్ నవ్వి " మా సీజన్ లో అలా లేదు. కానీ ఇప్పుడు అంతా స్క్రిప్టెడ్ ఐపోయినట్టు కనిపిస్తోంది." అన్నారు. "ఐతే మా సీజన్ 1 బిగ్ బాస్ సెట్ పూణే పక్కన ఉన్న లోనావాలా కొండల్లో, అడవుల్లో వేశారు మా సెట్. సీజన్ 2 నుంచి హైదరాబాద్ కృష్ణనగర్ లోనే సెట్ వేస్తున్నారు. మా సెట్ అడవిలో ఉండేది కాబట్టి అప్పుడు ఒక పిచ్చుక వచ్చి తిరిగినా కూడా అందరం బయటికి వచ్చి చూసేవాళ్ళం. ఆ టైములో బిగ్ బాస్ హౌస్ లో  మా పనులు మేమే చేసుకునేవాళ్లం. మా సీజన్ లో సంపూర్ణేష్ బాబు..ఇక్కడి వాతావరణం సరిపడక ఏడ్చేసి గోల చేసాడు. సంపూర్ణేష్ బాబు పల్లెటూరు నుంచి వచ్చిన అతను. ఏదైనా మూవీ షూటింగ్ ఉన్నప్పుడు అది అయిపోగానే మళ్లీ ఇంటికి వెళ్లిపోతాడు తప్ప హైదరాబాద్ లో ఉండనే ఉండదు.. పల్లెటూరు వాతావరణం అంటేనే సంపూర్ణేష్‌కి ఇష్టం. అలాంటి అతన్ని తీసుకొచ్చి.. బిగ్ బాస్ లాంటి ఒక హైఫై గదిలో బంధించేసరికి తట్టుకోలేకపోయాడు. ఒకవారం తట్టుకున్నాడు కానీ.. వారం అయిన తరువాత అతని మైండ్ డిస్ట్రబ్ అయ్యింది. అందుకే వింత వింతగా ప్రవర్తించి.. నన్ను ఇక్కడ నుంచి పంపించకపోతే..తలుపు  పగలగొట్టుకుని వెళ్లిపోతా అని ఏడ్చాడు." అని తెలిపారు. "కానీ అగ్రిమెంట్ ప్రకారం వాళ్లు పంపించినప్పుడే బయటికెళ్ళాలి. మనకు మనం బయటికి వెళ్ళాలి అంటే రూ. 25 లక్షలు కట్టి రావాలి. అయినా సంపూ కూడా ఆ డబ్బు  కట్టడానికి రెడీ అయ్యాడు కానీ ఆ టైములో  డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. తిండి తినేవాడు కాదు.. నిద్ర పోయేవాడు కాదు. దీంతో మా సీజన్ హోస్ట్ తారక్.. బిగ్ బాస్ వాళ్లతో మాట్లాడి అతన్ని అలా ఉంచొద్దు.. బయటకు పంపేద్దాం.. రూ.25 లక్షలు కట్టమనడం పద్ధతి కాదని మాట్లాడి సంపూని బయటకు పంపించాడు. అంతే తప్ప అది స్క్రిప్టెడ్ కాదు.. రియల్" అంటూ చెప్పుకొచ్చారు సమీర్.

నాతో అడ్జెస్ట్ అవడం కష్టం.. రెండో పెళ్లిపై స్పందించిన ప్రగతి!

నటి ప్రగతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులు అందరికీ తెలుసు. మూవీస్ లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చే ఆమె, తన వర్కవుట్స్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా షేర్ చేస్తుంటారు. ఐతే ఈమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. "రెండో పెళ్లిపై మీరేమనుకుంటున్నారు? మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా, ఇవ్వాళ రేపు ఇది కామన్ కదా" అని యాంకర్ అడిగేసరికి.. ప్రగతి స్పందించారు.  "పెళ్లి అనేదానికన్నా కంపానియన్ అనేది ఇంపార్టెంట్. నాకు కూడా కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా నా మెచ్యూరిటీ లెవెల్‌కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా.. రాసి పెట్టి ఉంటే అది కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. అయినా నాతో అడ్జస్ట్ అవడం చాలా కష్టం. ఎందుకంటే.. కొన్ని విషయాల్లో నేను  చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. 20లలో ఉంటే నేను అడ్జెస్ట్ అయ్యేదాన్నేమో కానీ ఇప్పుడు కష్టం.. మా అబ్బాయి బెంగుళూరులో జాబ్ చేసుకుంటున్నాడు.. కూతురు యూఎస్ కి వెళ్ళింది..వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఒక ప్రౌడ్ మదర్ అని గర్వంగా చెప్పుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు.