పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు.. శ్రీహాన్‌పై చిన్మయి అసహనం

సింగర్ చిన్మయి అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. ఈవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఎక్కడ ఏ చిన్న విషయం తప్పుగా అనిపించినా నిప్పులు చెరగడం ఈమె నైజం. తప్పు చేసిన వారెవరైనా చిన్నా, పెద్దా అని కూడా చూడరు.. వారిని విమర్శించడానికి, కడిగిపారేయడానికి ఆమె ఎంతమాత్రమూ వెనుకాడరు. ఎక్కడో ఏదో జరిగింది నాకు సంబంధం లేదులే అని ఎంతమాత్రమూ అనుకోరు. అలాంటి సింగర్ చిన్మయి రీసెంట్‌గా ఒక ఇష్యూ మీద గొంతు విప్పారు.  బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోను ఆమె తప్పుబట్టారు. అసలు ఈ వీడియోలో ఏముందో చూస్తే.. సిరితో కలిసి తను పెంచుకుంటున్న బాబుకు భయం చెప్పడం కోసం శ్రీహాన్ తనని తాను బెల్టుతో కొట్టుకుంటూ ఉన్నాడు. మాములుగా ఐతే అందరి ఇళ్లల్లో మాట వింటావా లేదా అని పిల్లల్ని పెద్దవాళ్ళు భయపెడతారు, వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తారు. అందుకు భిన్నంగా శ్రీహాన్ తనని తాను సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ.. పిల్లాడికి భయం చెప్తున్నాడు.  ఇక సింగర్  ఈ వీడియో మీద రెస్పాండ్ అయ్యారు. మన సొసైటీలో  పిల్లలు మాట వినినప్పుడు పెద్దవాళ్ళు ఇలాగే తమని తాము తిట్టుకుని, కొట్టుకుని, గాయాలు చేసుకుని బెదిరిస్తూ ఉంటారు. బాల్యం నుంచే పిల్లలకు ఇలాంటి అస్సలు నేర్పించకూడదు. ఫ్యూచర్ జెనెరేషన్స్ లో ఇలాంటి బెదిరింపులతో భయపెట్టే కల్చర్ అస్సలు ఉండకూడదు. పిల్లల మనసులపై ఇలాంటి ఘటనలు చెరగని ముద్ర వేస్తాయి అని అన్నారు.  ఇక  చిన్మయి హీరోయిన్ సమంతకు కొంతకాలం క్రితం వరకు  డబ్బింగ్ చెప్పారు. ఐతే ఆమె ముక్కుసూటితనమే ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అవకాశాల్ని తగ్గించేస్తోంది. దాని కారణంగా ఆమెకు చాలా తక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి.

సుశృత్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసిన శ్రీముఖి

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అల్లరి చేస్తుంది. ఆటలు ఆడిస్తుంది. హోస్టింగ్ ని మంచి జోష్ తో చేస్తుంది. ఆడియన్స్ ని ఎక్కడా బోర్ కొట్టించకుండా కామెడీ కంటెంట్ తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అని చూడదు ఎవరితోనైనా కామెడీ చేస్తుంది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత బాగా చేస్తుంది.  ప్రెజంట్ జనరేషన్ లో బుల్లితెర మీద వన్ అండ్ ఓన్లీ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది యాంకర్  శ్రీముఖి. అలాంటి శ్రీముఖి ఇప్పుడు తన తమ్ముడు సుశృత్ బర్త్ డే వేడుకను చాలా గ్రాండ్ గా చేసింది. "అందరికంటే నాకు నువ్వుంటేనే ఇష్టం...హ్యాపీ బర్త్ డే .. ఐ లవ్ యు సుశృత్" అంటూ తన తమ్ముడికి ముద్దుపెడుతూ ఉన్న  బర్త్ డే ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక శ్రీముఖి ఫాన్స్, నెటిజన్స్, బుల్లితెర నటీనటులు అంతా సుశృత్ కి విషెస్ చెప్పారు. సింగర్, యాక్టర్ సాయికిరణ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ "హ్యాపీ బర్త్ డే" అని కామెంట్ చేశారు.  సింగర్ సిద్ శ్రీరామ్ "హ్యాపీ బర్త్ డే రా బామ్మర్ది" అని విష్ చేసాడు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది. "నేను శైలజ, జులాయి" వంటి మూవీస్ లో శ్రీముఖి నటించింది. సిల్వర్ స్క్రీన్ మీద కంటే స్మాల్ స్క్రీన్ మీద ఆమె పేరు మోత మోగిపోతూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె మీద వచ్చినపెళ్లి రూమర్స్ ని ఖండించింది శ్రీముఖి..

రాధను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిన చైతూ-కాజల్!

'బిబి జోడి' షో ప్రతీ శనివారం, ఆదివారం శ్రీముఖి యాంకర్ గా స్టార్ మాలో ప్రసారం అవుతోంది. అయితే ఇందులో జడ్జ్ లుగా తరుణ్ మాస్టర్, సదా, రాధ చేస్తున్నారు.‌ కాగా జోడిలుగా అఖిల్- తేజస్విని, సూర్య- ఫైమా, వసంతి- అర్జున్, చైతూ- కాజల్ ఉన్నారు. అయితే ఈ షోలో శనివారం ఎపిసోడ్‌లో ప్రాపర్టీ రౌండ్ జరిగింది. ఇందులో బెడ్ ప్రాపర్టీ తీసుకొ‌ని అఖిల్-తేజస్విని జోడి హాట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన చైతూ- కాజల్ స్కూల్ బెంచ్ ప్రాపర్టీ తీసుకొని, స్కూల్ లైఫ్ లో అల్లరి చేసే పిల్లలుగా తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అలరించారు. వీరి పర్ఫామెన్స్ చూసి జడ్జ్ గా చేస్తున్న రాధ తన జడ్జ్ మెంట్ చెప్తూ స్కూల్ లైఫ్ లో తన అనుభావాలను పంచుకుంది. రాధ మాట్లాడుతూ "నా 4th క్లాస్ లో లైనా అనే అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్. మేము ఇద్దరం సెకండ్ బెంచ్ లో ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఒక రోజు లైనా ప్లేస్ లో వేరే ఒక అమ్మాయి శశికళ అని కూర్చుంది. ఆ రోజు మాకు ఒక టెస్ట్ ఉంది. నేను క్లాస్ కు వెళ్లి చూసి బయటకు వచ్చేశాను. అది చూసి మేడమ్ నన్ను పిలిచి 'ఏ ఎందుకు రాయలేదు టెస్ట్' అని అడిగింది. అక్కడ లైనా ఉండాలి. తను లేదు. నాకు నచ్చలేదు మేడమ్. అందుకే రాయలేదు టెస్ట్" అని చెప్పాను. "అప్పటి నుండి ఇప్పటి వరకు నేను లైనాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆమె మా ఊళ్ళోనే, మా ఇంటి పక్కనే ఉంది. నేను మా ఊరికి వెళ్ళాలి. లైనాతో మాట్లాడాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి" అని అనుకుంటున్నాను అని రాధ చెప్పుకొచ్చింది.

సస్పెండ్ అయిన మురారి.. సంతోషంలో కృష్ణ, బాధలో ముకుంద!

స్టార్ మాలో ప్రేక్షకులను అలరిస్తోన్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఇది ఇప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్-48 లో కమిషనర్ దగ్గరకి వెళ్తాడు మురారి. ఆ తర్వాత తన మీద వచ్చిన ఎలిగేషన్ గురించి మాట్లాడి బయటకు వచ్చేసి ఒక దగ్గర ఆలోచిస్తూ కూర్చుంటాడు. అదే సమయానికి ఇంట్లో వాళ్ళంతా మురారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతసేపటికి మురారి రాకపోయేసరికి.. మురారి వాళ్ళ పెద్దమ్మ భవాని కాల్ చేస్తుంది. "ఏంటి మురారి.. ఇంత జరిగినా ఈ పెద్దమ్మతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నిన్ను సస్పెండ్ చేశారని నాతో ఎందుకు చెప్పలేదు" అని  భవాని అంటుంది. "నువ్వు నాతో మాట్లాడుతున్నావా పెద్దమ్మ.. నా మీద కోపం తగ్గిందా" అని మురారి అంటాడు. దానికి భవాని "నీ మీద కోపమేంటి మురారి.. నీ మీద కాదు‌. ఆ పిల్ల మీద. నువ్వు అన్నావే అలక అని.. అదే అంతే"  అని అంటుంది. "మరి ఇన్ని రోజులు పరాయి వాడిగా చూశావ్" అని మురారి అనగా, "నువ్వేగా మమ్మల్ని పరాయి వాళ్ళని చేసావ్" అని భవాని అంటుంది. "పోనీలే పెద్దమ్మ.. నువ్వు మారిపోయావ్. అది చాలు. ఐ లవ్ యూ పెద్దమ్మ" అని మురారి అంటాడు. "అది సరే.. ఇలా జరిగిందేంటి.‌ ఇంత సిన్సియర్ ఆఫీసర్ ని, అలా ఎలా సస్పెండ్ చేస్తారు. చెప్పు ఎవరితో ఫోన్ చేయించాలి? డీజీపితోనా..ఎవరితో?" అని భవాని అడుగుతుంది. "అదేం లేదు పెద్దమ్మ" అని అంటాడు మురారి. ఒక వైపు భవాని, మురారి కేస్ గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే మరో వైపు కృష్ణ తీరిగ్గా కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. ఇక ఫోన్ లో భవాని మాట్లాడుతూ "ఇక్కడ ముకుంద.. నీ గురించి ఆలోచిస్తుంది.. నీ భార్య ఏమో ఏమీ పట్టనట్టు అన్నం తింటుంది. తినేవాళ్ళని లేపకూడదనే సంస్కారం నాకుంది కాబట్టి సరిపోయింది లేకుంటే.. సరేలే.. అది అంతా వదిలెయ్ మురారి. నువ్వు త్వరగా ఇంటికి వచ్చెయ్" అని భవాని అంటుంది. "సరే పెద్దమ్మ.." అని కాల్ కట్ చేసి వస్తాడు మురారి.  "ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? కడుపు నిండిందా? నా బాధ నీకు సంతోషన్నాన్నిస్తుంది కదా. అందుకే నువ్వు ఇక్కడ కడుపు నిండా, తృప్తిగా తిన్నావ్ కదా. నాకిష్టమైన నా జాబ్ పోతే కూడా నీకు ఏమీ అనిపించలేదా?" అని మురారి అంటాడు. "కదా.‌. మనకి ఇష్టమైంది దూరమైతే భరించలేనంత బాధగా ఉంది కదా.. నీకు ఈ జాబ్ పోతే ఆస్తి ఉంది. కానీ నాకు ఎవరూ లేరు. నాకంటూ ఉంది ఒక్క మా నాన్న మాత్రమే. ఆయన్ని నువ్వు చంపేశావ్. నాకు పూడ్చలేని వెలితి. అలా చేసింది ఎవరూ? నువ్వు. నాన్న లేకుండా ఎలా బ్రతుకుతున్నానో తెలియదు. శూన్యమనిపిస్తుంది. మీకోసం ఇంత కుటుంబం ఉంది. బాగా సంతోషంగా ఉందా, కడుపు నిండిందా అని అన్నావ్ కదా.. ఉంది. కచ్చితంగా ఉంది. దేవుడు ఉన్నాడు. పైనుండి అన్నీ చూస్తున్నాడు. మా నాన్న ప్రాణం తీసినందుకు తగిన శాస్తే చేసాడు. నేను ఇలాగే అంటాను" అని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మురారి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న మురారిని ఓదార్చడానికి ముకుంద వస్తుంది. "నీకు ఈ ఉద్యోగం ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఎవరు ఓదార్చినా ఆ బాధ తీరదు. కానీ నువ్వు వస్తే ఓదార్చాలని ఎదురుచూస్తున్నాను. నీకు నేనున్నాను" అని మురారిని ఓదార్చుతుంది. అప్పుడే బయటకు వస్తుంది కృష్ణ. వాళ్ళిద్దరిని అలా చూసిన కృష్ణ ఏం చేస్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

రాజీవ్ నిజస్వరూపం తెలుసుకున్న చక్రపాణి.. వసుధార కోసం రిషి కన్నీళ్ళు!

'గుప్పెడంత మనసు' ఇప్పుడు స్టార్ మాలో అతి ఎక్కువ వీక్షకాదరణ పొందుతూ వస్తున్న ధారావాహిక. శనివారం రోజు జరిగిన ఎపిసోడ్-654 లో రాజీవ్ హాస్పిటల్ లో ఉన్న వసుధార తల్లితండ్రుల దగ్గరికి వస్తాడు. "మామయ్య గారు.. కళ్లు తెరవండి.. నేను వచ్చేశాను. మీరు ఎంత కాలం నన్ను నమ్ముతారో.. అంతవరకు మీకు నటించే అల్లుడిగా ఉంటాను. మీతో ఏం ప్రాబ్లం లేదు మామయ్య గారు. అత్తయ్య గారితోనే ప్రాబ్లం. అత్తయ్యగారు మీరు లేస్తే పొడిచింది నేనే అని మామయ్య గారితో చెప్తారు. మీరు బ్రతికి నన్ను జైలుకు పంపిస్తారా? చచ్చిపోయి నాకు పెళ్లి చేస్తారా? మీరు చనిపోండి" అంటూ ఆక్సీజన్ మాస్క్ తీసేస్తాడు రాజీవ్. అలా చేస్తున్నప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడతాడు. "మీ కోరిక ఏంటో చెప్పండి అత్తయ్య.. వసుధారకి నాకు పాప పుడితే.. మీ పేరే పెట్టుకుంటాను. మీ కూతురిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను" అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాజీవ్. ఇదంతా జరిగేటప్పడు చక్రపాణి చూస్తాడు. రాజీవ్ మాటలను వింటాడు. వసుధార తల్లి బెడ్ పైన శ్వాస అందక తల్లడిల్లుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రిషి చూసి, ఆక్సీజన్ మాస్క్ పెట్టి డాక్టర్ ని పిలుస్తాడు. "డాక్టర్ .. ఎంత ఖర్చు అయిన నేను పెట్టుకుంటాను. వీళ్ళకి నేను ఉన్నాను" చెప్తాడు. ఆ తర్వాత రాజీవ్ వచ్చి రిషిని చూస్తాడు. "ఇక్కడికి నువ్వెందుకు వచ్చావ్" అని రాజీవ్ అనగా.. "వీళ్ళు వసుధార తల్లి తండ్రులు" అని రిషి అంటాడు. అప్పుడు రాజీవ్ "నీకు వసుధార తల్లిదండ్రులు మాత్రమే. కానీ నాకు అత్తయ్య మామయ్యలు" అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరికి వాగ్వాదం జరుగుతుంది. "ఇతని వల్లే, వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు" అని డాక్టర్ తో రాజీవ్ చెప్పి, రిషిని బయటకు పంపించేలా చేస్తాడు. ఆ తర్వాత రిషి గురించి జగతి, మహేంద్ర లు మాట్లాడుకుంటారు. "వసుధారకి అసలేం జరిగింది. తను ఎందుకిలా చేస్తుంది. రిషి ఇంత గోరాన్ని తట్టుకోలేడు. చాలా సున్నిత మనసు గలవాడు" అని మహేంద్ర అనగా, "లేదు.. రిషి తట్టుకొని గెలుస్తాడు మహేంద్ర" అని ఏడుస్తుంది జగతి. కాగా రిషి ఒంటరిగా దూరంగా వెళ్లి వసుధారని తల్చుకొని ఎమోషనల్ అవుతాడు. "వసుధార.. నా జీవితంలోకి రావడం వెళ్లడం నీ ఇష్టమేనా.. నన్ను మోసం చేసావా.. 'రిషిధార' నుండి నన్ను వేరు చేసావా" అని గట్టిగ అరుస్తాడు. ఆ తరువాత జగతి, మహేంద్ర ఇంటికి వచ్చి రిషి గురించి అడుగుతారు. అప్పుడే దేవయాని ఇంటికొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కార్తీక్ మన హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్దాం!

'కార్తీక దీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్-1556 లో శౌర్య, హిమలు హేమచంద్రకి కనపిస్తారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొని వెళ్తాడు.    తరువాత చారుశీల దగ్గరికి కోపంతో వస్తాడు కార్తీక్. "నువ్వు ఎంత మోసం చేసావ్. నువ్వు మోనిత పంపిన కీలుబొమ్మవి. మా విషయాలు అన్ని కూడా మోనితకి చేరవేశావు" అని అంటుంది. చారుశీల మాట్లాడుతూ "నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా, బాగానే చూసుకున్నా కదా" అని చారుశీల చెప్తుంది. "ఇంకా నమ్మించాలని చూడకు" అని అంటాడు. అంతలోపే చారుశీలను పిలుస్తుంది మోనిత. అది విన్న కార్తిక్ "ఓహో మోనిత ఇక్కడే ఉందా.. దానితోనే తేల్చుకుంటా" అని మోనిత దగ్గరికి వెళ్తాడు. కోపంగా వెళ్ళిన కార్తిక్ ని పట్టించుకోకుండా "ఈ బట్టలన్నీ కూడా మన పెళ్లికి, ఇంకా ఇవేమో హనీమూన్ కి. మనం హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్దాం. ఇదిగో టికెట్స్" అని చూపిస్తుంది. దాంతో కార్తీక్ కోపంతో మోనిత మీదకి చెయ్యి లేపుతాడు. అప్పుడే దీప కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే వచ్చిన దీపని చూసి మోనిత "చూడు దీప.. కార్తీక్ నా వాడు. నువ్వు పోయాక మా పెళ్లి. ఇదిగో హనీ మూన్ టికెట్స్. నువ్వు ఇంకో వారం బ్రతుకుతావు. ఆ తర్వాత ఖేల్ ఖతం.. దుకాణం బంద్" అని అంటుంది. ఆ తర్వాత దీప మోనితల మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. దీప కార్తీక్ లు అక్కడి నుండి వెళ్తారు. ఆ తరువాత మోనిత హ్యాపీగా కార్తీక్ గురించి కలలు కంటుంది. అప్పుడే చారుశీల వస్తుంది. మోనిత మాట్లాడుతూ "దీప వెళ్ళాక కార్తీక్ నా సొంతం" అని అంటుంది. "కార్తీక్ నీ దగ్గరికి రావడానికి.. నీ మీద ఏమైనా మంచి అభిప్రాయం ఉందా" అని చారుశీల అడుగుతుంది. మోనిత మాట్లాడుతూ "కార్తీక్ ని.. నా సొంతం చేసుకోవడానికి జైలులో అద్భుతమైన పథకాలు రచించాను. అది తర్వాత చెప్తాలే గాని.. కార్తీక్, దీపలు ఏమంటున్నారు. అది చెప్పు" అని అడుగుతుంది. "ఏమంటారు.. నీకు మోనితకి తేడా లేదని, నిన్ను నన్ను కలిపేశారు. ఇంప్రెషన్ మొత్తం పోయింది" అని అంటుంది చారుశీల. "నీ మీద ఇంప్రెషన్ ఎలా ఉంటే ఏంటీ.. నువ్వు ఏమైనా కార్తీక్ ని ట్రై చేస్తున్నావా" అని అడుగుతుంది. "అదేం లేదు" అని చారుశీల అంటుంది. "అయితే సరే మరి" అని ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్తుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

నేను మీతో కలిసి ఉంటాను.. దీపకు మోనిత ప్రపోజల్.!

'కార్తీకదీపం' సీరియల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-1555 లో మోనిత గురించి ఆలోచిస్తూ.. దీప పరధ్యానంతో వంట చేస్తూ ఉంటుంది. కార్తీక్ వస్తాడు. దీప పరధ్యానం చూసి అడుగుతుంటాడు. కార్తీక్ మాట్లాడుతూ "ఏంటీ దీప.. మోనిత గురించి ఆలోచిస్తున్నావా? దాని గురించి ఎందుకు పట్టించుకుంటావ్. దాని సంగతి నేను చూసుకుంటా.. నువ్వేం ఆలోచించకు" అని చెప్తాడు. కార్తిక్ ఎంత చెప్పినా  దీప మౌనంగా ఉండిపోతుంది. "అసలా మోనిత మన దగ్గరికి రాలేదనుకో, మోనిత మన దగ్గరికి రాకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్. మోనిత ని కలవడానికి కార్తీక్ వస్తాడు. "మోనిత.. నీతో మాట్లాడాలి" అని కార్తిక్ అంటాడు. "మాట్లాడు కార్తీక్..ఒక్కసారి నా చెయ్యి పట్టుకో, అంతులేని సంతోషాన్ని అందిస్తాను" అని మోనిత అంటుంది. "మా జోలికి రావొద్దు" అని కోపంగా చెప్తాడు కార్తిక్. "ఇకనుండి మా దగ్గరికి రావొద్దు.. మమ్మల్ని వదిలెయ్" అని కార్తిక్ ఎంత చెప్పినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుంది మోనిత. ఆ తర్వాత దీప దగ్గరికి మోనిత వస్తుంది. "డాక్టర్ బాబు గురించి ఎదురుచూస్తున్నావా" అని అడుగుతుంది. "నీకు ఎందుకే" అని దీప కోప్పడుతుంది.  "నీ గురించి మాట్లాడటానికే, కార్తీక్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రశాంతంగా ఉంచాలని అడిగాడు. నేను ఒప్పుకోకపోయేసరికి, కోపంగా అక్కడి నుండి వచ్చాడు. నా కోరికకు నువ్వు అయినా ఓకే చెప్తావా?  నా కోరిక సింపుల్. నేను మీతో కలిసి ఉంటాను. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యను" అని మోనిత అడుగుతుంది. అలా అనగానే "చెప్పు తెగుద్ది" అని దీప అంటుంది.  మోనిత మాట్లాడుతూ "మీ పెళ్లి అయినప్పటి నుండి మీరు సంతోషంగా ఉన్నారు. ఇక కార్తీక్ ని నాకు అప్పగించు. పోయేలోపు ఈ ప్రపోజల్ తో నువ్వే నా దగ్గరికి వస్తావ్ చూడు" అని మోనిత అంటుంది. ఆ తర్వాత "మళ్ళీ కలుద్దాం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మోనిత. ఒకవైపు హిమ, శౌర్యలు వాళ్ళ అమ్మ నాన్నలను వెతుకుతుంటారు. అలా వెతుకుతున్నప్పుడు హేమచంద్ర ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

కృష్ణ కారణంగా సస్పెండ్ అయిన మురారి!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తోంది. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-47 లో‌ అలసిపోయి పడుకున్న కృష్ణని ఓదార్చడానికి మురారి వాళ్ళ అమ్మ జ్యూస్ తీసుకొని వస్తుంది. ఆమె మాట్లాడుతూ "కృష్ణ.. ఈ పనులన్నీ నీకు కొత్త కదా.. ఈ ఇల్లు జైలు కాదు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇల్లు. అందుకే ఇన్ని నియమాలు. అందరూ వీటిని పాటిస్తారు కాబట్టి ఎవరికీ ఏం ఇబ్బంది ఉండదు. నీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మ.. మొహమాటపడకు" అని చెప్పేసి వెళ్తుంది. ఆ తర్వాత మురారి వాళ్ళ ఇంటికి ఒక కానిస్టేబుల్ వస్తాడు. "కమీషనర్ ఈ లెటర్ మురారి సర్ కి ఇవ్వమన్నారు" అని వాళ్ళ అమ్మకి తీసుకొచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అది తీసుకెళ్ళి మురారికి ఇస్తుంది. ఆ లెటర్ లో శివన్న అనే వ్యక్తి.. ఇంక ఆ ఊరి పెద్దలు కొందరు కలిసి కంప్లేంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఊరి అమ్మాయిని బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు. అది తప్పు అని నిరూపించుకున్న తర్వాతనే మళ్ళీ విధుల్లోకి రావాలని అందులో ఉంటుంది.వెంటనే మురారి కమీషనర్ దగ్గరికి వెళ్తాడు. మురారి హడావిడిగా వెళ్లడం చూసిన ముకుంద.. ఏమై ఉంటుందా అని ఆ లెటర్ చదువుతుంది. అది చదివాక మురారి సస్పెండ్ అయిన విషయం తెలుస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్తుంది. అందరికి కృష్ణ వల్లనే సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. ఆ తర్వాత కృష్ణని పిలిచి భవాని అడుగుతుంది. "శివన్న ఎవరు? నీ వల్ల నా కొడుకు సస్పెండ్ అయ్యాడు. కొత్త కోడలు అత్తగారింటికి వచ్చినప్పుడు ‌చీరా.. సారె తీసుకొస్తారు. ఈ మహాతల్లేమో అరిష్టాలని, అప్రతిష్టలని తీసుకొచ్చింది" అని కోప్పడుతుంది భవాని. ఎన్ని మాటలు అన్నా కూడా కృష్ట మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత ‌తన గదిలోకెళ్ళి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది. 

వసుధార మొండితనం.. రిషి భావోద్వేగం.!

 రోజు రోజుకి వీక్షకాదరణ పొందుతూ వస్తున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. శుక్రవారం ఎపిసోడ్-653 లో.. పోలీస్ స్టేషన్ లో ఉన్న వసుధారని కలుస్తాడు రిషి.‌  "అసలేం జరిగిందో చెప్పు వసుధార" అని బ్రతిమాలుకుంటాడు రిషి. అయితే వసుధార ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. మధ్యలో రాజీవ్ కల్పించుకొని రిషితో గొడవకు దిగుతాడు. రాజీవ్ మాట్లాడుతూ "చెప్తే వినబడటం లేదా రిషి సర్. వసుధార నా భార్య అని చెప్పాను కదా" అని అంటాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.  ఆ మాట విని రిషి ఎమోషనల్ అవుతాడు. "ఏంటి వసుధార.. నువ్వు తాళి కట్టించుకున్నావా?" అని అడుగుతాడు. కానీ వసుధార ఎలాంటి సమాధానం చెప్పదు. దాంతో రిషి బాధతో ఏడుస్తుంటాడు. ఎమోషనల్ అవుతున్న రిషిని బయటికి తీసుకెళ్తాడు మహేంద్ర. ఆ తర్వాత వసుధార దగ్గరికెళుతోంది జగతి. "వసుధార.. ఆ తాళి ఏంటి? " అని అడుగుతుంది. "నాకు పెళ్లి అయింది. అందుకే నా మెడలో తాళి ఉంది. అంతకు మించి నన్నేం అడుగకండి" అని వసుధార చెప్తుంది. దాంతో ఏం చేయలేక అక్కడి  నుండి‌ వెళ్ళిపోతుంది జగతి. అలా అందరూ వెళ్ళిపోయాక "మీరు బాగుండాలి. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అని వసుధార ఒక్కతే తనలో తాను బాధపడుతుంది. ఆ తర్వాత దేవయానికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు రాజీవ్. వసుధారకి బెయిల్ ఇప్పించమని అడుగుతాడు. " సరే.. కానీ నేను ఒకసారి వసుధారని కలవాలి" అని అడుగుతుంది. "సరే మేడం" అని రాజీవ్ చెప్తాడు. దేవయాని పోలీస్ స్టేషన్ లో ఉన్న వసుధార దగ్గరికి వచ్చి తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. "ఎక్కడ ఉండే దానివి. ఎక్కడికో వెళ్లి ఇప్పుడు కింద పడ్డావ్. ఇలా స్టేషన్ లో ఊసలు లెక్కపెడ్తున్నావ్. ఎన్ని మాటలు అన్నావ్. అలాంటి నువ్వే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా?" అంటూ దేవయాని వ్యంగ్యంగా అడుగుతుంది. దానికి బదులుగా వసుధార మాట్లాడుతూ "ప్రయాణం బాగా సాగిందా మేడం. చాలా దూరం నుండి వచ్చారు కదా. అలసిపోయినట్టున్నారు. నాకు ఇప్పుడేదో కష్టం వచ్చిందని నన్ను మీరు అనాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని రోజులే" అని అంటుంది. "మళ్ళీ రిషి నీ లైఫ్ లోకి వస్తాడని ఎలా అనుకుంటున్నావ్. మళ్ళీ మా ఇంట్లోకి అడుగుపెడతాననే అనుకుంటున్నావా.. అది జరుగదు" అని దేవయాని అంటుంది. "నాకు పొగరు అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నాది పొగరు కాదు.‌ ఆత్మవిశ్వాసం" అని వసుధార సమాధానమిస్తుంది. ఆ తర్వాత దేవయాని వెళ్ళిపోతుంటే వసుధార చిటికె వేసి పిలుస్తుంది. "మళ్ళీ కలుద్దాం మేడం" అని అంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

'జిల్' లో గోపిచంద్ హెయిర్ స్టైల్ ని సెట్ చేసిన ప్రభాస్!

ఆహా వేదికగా మొదలైన 'అన్ స్టాపబుల్' సీజన్‌-2 ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌ లు పూర్తి చేసుకుంది. అయితే 'ఆహా' ఇంతకుముందు  ప్రభాస్ తో జరిగిన ఇంటర్వ్యూని రెండు భాగాలుగా చేసి విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండవ భాగం 'ఆహా' లో స్ట్రీమ్ అవుతోంది. గోపిచంద్, ప్రభాస్ మంచి స్నేహితులని ఈ ఎపిసోడ్ తో దాదాపు అందరికి తెలిసిపోతుంది. అలా ఉంది ఇద్దరి మధ్య ఆ బాండింగ్. అయితే బాలకృష్ణ చమత్కారం ఈ ఎపిసోడ్ కి అదనపు హంగులను జోడించి ఆసక్తిని రేపుతోంది.  గోపిచంద్ వచ్చాక బాలకృష్ణ గారు ఇంటర్వ్యూ మొదలుపెట్టారు."నువ్వు ప్రభాస్ లాగా నవ్వుతుంటావా? మాట్లాడుతుంటావా? " అని గోపిచంద్ ని బాలకృష్ణ గారు అడిగారు. "లేదు సర్.‌. మాట్లాడుతుంటా" అని గోపిచంద్ సమాధానిమిచ్చాడు.  ఆ తర్వాత "నీ సినిమాలన్నింట్లో స్టైలిష్ గా ఉండే సినిమా 'జిల్'. అది నాకు చాలా నచ్చింది. రెండు మూడు సార్లు చూసాను" అని బాలకృష్ణ గారు చెప్పాడు. "అవును సర్.." అని గోపిచంద్ చెప్పాడు. ఆ సినిమాకి ప్రభాస్ కో- ప్రొడ్యూసర్ గా చేశాడు కదా? ఎలా సెట్ అయింది" అని బాలకృష్ణ గారు అడిగారు. " అవును.. వంశీ ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అని అంటున్నాడు. అప్పుడు రాధాకృష్ణ ఒక కథ తీసుకొచ్చాడు. అది వంశీ విని ఇది విను గోపి అని నాకు చెప్పాడు. ప్రభాస్ కూడా విని, బాగుందన్నాడు. అలా ఒకే అయింది. అందులో ఆ లుక్ .. ఆ హెయిర్ స్టైల్ దగ్గరుండి చేపించింది మాత్రం ప్రభాస్" అని చెప్పుకొచ్చాడు గోపిచంద్. " ఫస్ట్ ఆ హెయిర్ స్టైలిష్ కి 'కొంచెం అలా సైడ్ కి కత్తిరించు' అని చెప్పాడు గోపి. కానీ నేను వెళ్ళి,  వాడు అలానే అంటాడు కానీ కొంచెం ట్రెండీ లుక్ చెయ్ అని చెప్పాను" అని ప్రభాస్ చెప్పాడు. "మొదటి సినిమా మోసం చేసింది కదా? మరి ఏ ధైర్యంతో ఇక్కడి దాకా వచ్చావ్" అని గోపిచంద్ ని బాలకృష్ణ గారు అడిగారు. "ఫస్ట్ మూవీ ప్లాప్.. ఆ తర్వాత ఒక ఆరు నెలల వరకు ఖాళీగా ఉన్నాను. ఎటు వెళ్ళాలో తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. ఆ తర్వాత తేజ గారు నాకు 'జయం ' మూవీలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా టైంలోనే నేను, ప్రభాస్ మంచి స్నేహితులం అయ్యాం. మొదట చేసిన మూడు సినిమాలు విలన్ రోల్స్. కానీ అవే బేస్. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను" అని చెప్పాడు గోపీచంద్.  ఆ తర్వాత కృష్ణంరాజు గురించి కాసేపు మాట్లాడారు బాలకృష్ణ. ఇంకా బాహుబలి సినిమాలోని పాటతో 'కృష్ణంరాజు'  గెటప్ లతో ఒక 'AV' చూపించారు. దానికి షోలో ఫుల్ గా ఈలలు. 'అన్ స్టాపబుల్' స్టేజ్ మారు మ్రోగింది. ఆ తర్వాత బాలకృష్ణ కొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ ముగించారు. 

భవాని పంతంతో కృష్ణకి కష్టం.. ఫలించని ముకుంద ఆశ!

మంచి స్టోరీతో ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న 'స్టార్ మా' టీవి సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. గురువారం జరిగిన ఎపిసోడ్- 46 లో కృష్ణ ఇంటిలోకి వస్తుంటే భవాని తనని ఆపి తిడుతుంది. "ఎక్కడికెళ్ళావ్ మమ్మల్ని అడిగి వెళ్లాలని తెలియదా?" అని భవాని కోప్పడుతుంది. దానికి బదులు చెప్తూ "నాకు బాధ ఉంది. కష్టం ఉంది" అని కృష్ణ చెప్తుంది. "నీకొచ్చిన బాధేంటి? కష్టమేంటి? " అని అడుగుతుంది భవాని. "నాకు నాన్న లేరు..అది కష్టం. నాన్న ఒంటరిగా పోయారు..అది బాధ. నాన్నకి పిండ ప్రధానం చేసి వచ్చాను" అని చెప్తుంది కృష్ణ. "ఏంటి పిండప్రధానం చేసి వచ్చావా? పెళ్ళి జరిగి నెల కూడా కాలేదు. అలా ఎలా చేస్తావ్" అని కోప్పడుతుంది భవాని. ఆ తర్వాత మురారి పంతులుని తీసుకొస్తాడు. అతను దోష పరిహారం చేస్తే సరిపోతుందని, ఇల్లు శుద్ది చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే పంతులు చెప్పినట్టుగా అందరం చేద్దాం అని అనుకుంటారంతా.. కానీ కృష్ణ "నేను ఒక్కదాన్నే చేస్తాను" అని చెప్తుంది. దానికి భవాని " సరే నువ్వు ఒక్కదానివే చెయ్. ఎందుకంటే నీవల్లే కదా.. ఈ అరిష్టం" అని అంటుంది. ఆ తర్వాత కృష్ణ ఒక్కతే ఇల్లు శుభ్రపరచి, బోనం వండుతుంది. దేవుడి ప్రతిమలను శుభ్రపరిచి పూలతో అలంకరించి, నైవేద్యం పెడుతుంది. అలా మొత్తం పని కృష్ణ ఒక్కతే చెయ్యడం వల్ల అలసిపోతుంది. కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో అందరూ అలానే చూస్తుండిపోతారు. మురారి వచ్చి కృష్ణని తన చేతులతో ఎత్తుకొని, తన రూంలోకి తీసుకెళ్తాడు.  అయితే  మురారి, కృష్ణ మీద చూపిన ప్రేమను తన మీద చూపిస్తాడనే ఆశతో..తను కూడా కళ్ళు తిరిగినట్టు నటించి కిందపడిపోతుంది ముకుంద. అయితే మురారి తనని ముట్టుకోకుండా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి ముకుందని తీసుకెళ్ళమంటాడు. అలా అందరూ కలిసి ముకుందని తన రూంలోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత ముకుంద దగ్గరికి వస్తాడు మురారి. "ఇప్పుడు ఎలా ఉంది. టేక్ కేర్" అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.  

మోనిత రీఎంట్రీతో షాక్ అయిన దీప!

'కార్తిక దీపం' సీరియల్ ఎపిసోడ్ - 1554 లో చాలా ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. గురువారం జరిగిన ఈ ఎపిసోడ్ లో మొదటగా కార్తిక్ బాధపడుతూ ఉంటాడు. దీప ఆరోగ్యం బాగోలేదని, ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. అలా కార్తిక్ బాధపడటం చూసి హేమచంద్ర ఓదార్చుతాడు. "నేను నా చేత్తో ఎంతో మంది ప్రాణాలని కాపాడాను. కానీ నా భార్య ప్రాణాలు కాపాడలేకపోతున్నాను" అని  కార్తిక్ అంటాడు. "ఇన్ని ప్రయత్నాలు చేసిన తగ్గట్లేదంటే.. ఏదో ఒక‌ కారణం ఉంటుంది" అని హేమచంద్ర అంటాడు. ఆ తర్వాత హిమ, శౌర్య ‌ఇద్దరు కలసి వాళ్ళ అమ్మనాన్నలైన కార్తిక్, దీపలను వెతకడానికి బయటకు వెళ్తారు. అలా వెతికి హిమకి ఒక ప్లేస్ చూపిస్తుంది శౌర్య. "నాకు ఇక్కడే అమ్మ నాన్న కన్పించారు" అని శౌర్య  చెప్తుంది.  దానికి హిమ కోపంగా "ఎందుకే అబద్ధాలు చెప్తున్నావ్"  అని అంటుంది. అలా కాసేపు ఇద్దరు గొడవపడతారు. అలా గొడవపడి తిరిగి ఇంటికి వెళ్తారు. కార్తీక్, దీపలు ఇంటికి వెళ్లేసరికి మోనిత కుర్చీలో కూర్చొని టీ తాగుతూ ఉంటుంది.  "కార్తిక్.. నీ మాటలు విని ఎన్ని రోజులు అవుతుంది. మీ పనిమనిషి చాలా మంచిది. నేను నీ మనిషిని అని చెప్పగానే, నన్ను కూర్చొబెట్టి మంచి టీ ఇచ్చింది" అని మోనిత చెప్తుంది. కార్తిక్, దీపలు షాక్ అవుతారు. "మిమ్మల్ని చూడక ఎన్ని రోజులు అయింది . జైలు నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఎలా ఉన్నావ్ అక్క" అని మోనిత అంటుంది. "ఎవరే నీకు అక్క.. ఇక్కడ నుండి వెళ్ళు అని" కోప్పడుతుంది. దానికి మోనిత "అయ్యో అక్క కూల్ డౌన్.‌ ఎందుకు అలా అరుస్తున్నావ్. అలా అరిస్తే ఆయుష్షు తగ్గుతుంది. అసలే ఎక్కువ రోజులు బ్రతకవంట కదా.. పాపం" అని జాలి చూపిస్తుంది. ఇదంతా విని కార్తిక్, దీప ఇద్దరు ఆశ్చర్యపోతారు. "ఇదంతా నీకెలా తెలుసు?" అని మోనితని అడుగుతాడు కార్తిక్. "నేను ఎక్కడున్నా అన్ని విషయాలు తెలుస్తాయి. చారుశీల అంతా చెప్పింది" అని మోనిత అంటుంది. "చారుశీల నీకెలా తెలుసు?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తిక్. "చారుశీల నా మనిషి. నేను పంపిన మనిషి. నిన్ను చూసుకోమని.. మీ బాగోగులు దగ్గరుండి చూడమని, నేను పంపిన మనిషి" అని అంటుంది మోనిత. ఇది విని ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత దీప, మోనిత మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరికి మోనితని మెడ పట్టుకు బయటకు తోసేస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

అమ్మని పొడిచిన నేరంపై పోలీస్ స్టేషన్ కు వసుధార..!

'గుప్పెడంత మనసు' సీరియల్.. ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షిస్తోన్న 'స్టార్ మా' టీవి సీరియల్. ఇది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. గురువారం ఎపిసోడ్- 652 లో ఏం జరిగిందంటే.. వసుధార, రాజీవ్ ల తోపులాటలో పక్కనే ఉన్న వసుధార తల్లి కడుపులో ఇనుప రాడ్ దిగిపోతుంది. అది పొడిచింది రాజీవ్. కానీ సైలెంట్ గా తన చేతులు తీసేసి వసుధార చేతులు ఆ రాడ్ మీద ఉండేలా చేసి వసుధారనే పొడిచిందని అరుస్తుంటాడు రాజీవ్. ఓ వైపు వసుధార వాళ్ళ అమ్మ పడిపోతుంది. మరో వైపు వసుధార వాళ్ళ నాన్న గాయాలతో పడి ఉంటాడు. దీన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటాడు రాజీవ్. మరో వైపు రిషి, జగతి, మహేంద్ర అందరూ కలిసి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటారు. " అసలేంటి మేడమ్.. వసుధార ఎందుకలా మాట్లాడింది. తనే మాట్లాడిందా? ఎవరైనా మాట్లాడించారా?" అని జగతితో అంటాడు రిషి. "మనల్ని ఎందుకు వెళ్ళమంటుంది వసుధార. దీని వెనుక ఏదో జరుగుతుంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి" అని రిషీతో జగతి అంటుంది. ఆ తర్వాత వసుధార పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అప్పుడు వసుధారకి కాల్ చేస్తాడు రిషి. అక్కడే ఉన్న రాజీవ్ "ఫోన్ చేస్తోంది అతనే సర్.. అతనే మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాడు" అని ఇన్స్పెక్టర్ కి చెప్తాడు.  వెంటనే ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి "వసుధార పోలీస్ స్టేషన్ లో ఉంది. వాళ్ళ అమ్మ నాన్న లను చంపే ప్రయత్నం చేసినందుకు గాను మేం తనని అరెస్ట్ చేశాం. వాళ్ళ అమ్మ చావు బతుకుల మధ్యలో ఉంది" అని చెప్తాడు. అది విని వెంటనే పోలీస్ స్టేషన్ కి వస్తాడు రిషి. వసుధారని లాకప్ లో చూసి "వసుధార.. నీకేం భయం లేదు. నీకు నేను ఉన్నాను" అని అంటాడు. దానికి వసుధార మాట్లాడుతూ "సర్ ఇక్కడి నుండి వెళ్ళండి. మన మధ్యలో ప్రస్తుతం ఏ బంధం లేదని అనుకొని వెళ్ళండి" అని అంటుంది. అలా తను అనేసరికి రిషి "ఏ బంధం లేదా" ఎమోషనల్  అవుతాడు. ఆ తర్వాత వసుధార మెడలో ఉన్న తాళి కనిపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు.  "వసుధార.. ఆ తాళి ఏంటీ" అని జగతి మేడం అడుగుతుంది. దానికి  వసుధార మాట్లాడుతూ "దయచేసి ఇప్పుడేం అడుగకండి" అని అంటుంది ఆ తర్వాత రిషిని అడుగుతుంది.  "నేను ఆ తాళి కట్టలేదు. దానికి నాకు ఏం  సంబంధం లేదు" అని చెప్తాడు. "వసుధార ఏంటి ఆ తాళి. నాకు తెలియాలి" అని రిషి అడుగుతాడు. "దయచేసి ఇప్పుడు నన్నేం అడుగొద్దు సర్. వెళ్ళిపోండి" అని వసుధార అంటుంది. ఇంతకి రిషికి అసలు నిజం వసుధార చెప్తుందా? లేదా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

అనుపమ పరమేశ్వరన్‌తో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్‌ని లీక్ చేసిన సుమ!

యాంకర్ సుమ నిన్న మొన్నటి వరకు 'క్యాష్' షోతో ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ ప్రోగ్రాంకి కొంచెం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు 'సుమ అడ్డా' పేరుతో కొత్త ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ చేసింది. ఈ షో 7వ తేదీ నుంచి ప్రతీ శనివారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం కాబోతోంది. సుమ ఎనెర్జీ గురించి, వేసే పంచెస్ గురించి, స్పాంటేనిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు శనివారం పూట 'క్యాష్' షో వచ్చేది. ఇప్పుడు దీని ప్లేస్‌లో ఈ కొత్త షో ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.  మరి కొద్ది రోజుల్లో రాబోతున్న సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ కాబోతున్న 'కళ్యాణం కమనీయం' మూవీ టీమ్ ఈ షోలో సందడి చేశారు. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ప్రియా భవాని శంకర్‌తో పాటు డైరెక్టర్ అనిల్‌కుమార్ ఆళ్ల కూడా వచ్చారు. ఈ ప్రోమో చాలా ఎంటర్టైన్ చేసింది. ఫైనల్‌గా సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్‌ని సుమ లీక్ చేసేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో చేసిన చాట్ మొత్తాన్ని చదివి వినిపించింది. అలాగే సన్నీ లియోన్‌కి మెసేజెస్ పెట్టి డిలీట్ చేసినవి ఎన్నో కూడా లెక్కబెట్టి చెప్పింది. ఇక ఈ షోకి వచ్చిన స్టూడెంట్స్‌ని "లవ్ మ్యారేజ్ గొప్పదా? అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదా?" అని అడిగింది. వాళ్ళ ఆన్సర్స్‌కి చాక్లెట్స్ కూడా ఇచ్చింది. ఎవరికి నచ్చిన ఆన్సర్స్ వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళతో ఫన్నీ గేమ్స్ కూడా ఆడించింది సుమ. 

డబ్బు దొంగతనం చేసి పారిపోయిన విజే సన్నీ.. సీసీటీవీ కెమెరాకు దొరికేశాడు!

బిగ్ బాస్ సీజన్ 5 సన్నీ దొంగగా మారాడు. సీసీ టీవీ ఫుటేజ్‌లో సన్నీ క్యాష్ బ్యాగ్ తీసుకుని పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్నీ స్టార్టింగ్‌లో వీడియో జాకీగా కొన్ని చానెల్స్ లో పని చేసాడు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఆఫర్ వచ్చింది. దాని వలన మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇటీవల సన్నీ ‘సకలగుణాభిరామ’ అనే మూవీలో లీడ్ రోల్ చేసాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఏం జరిగిందో ఏమో కానీ సన్నీ రీసెంట్‌గా అనుమానాస్పద రీతిలో ఒక కారులో వచ్చి పరిగెత్తుకుంటూ ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి అంతే స్పీడ్‌తో ఒక బ్యాగ్‌తో రివర్స్‌లో పరిగెత్తుకుని వచ్చాడు. ఐతే బ్యాగ్‌ని కారులో పెట్టబోయేసరికి సన్నీ కాలు స్లిప్ అయ్యింది. దాంతో చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడి అందులో ఉన్న డబ్బు కట్టలు బయట పడ్డాయి. వాటిని మళ్ళీ బ్యాగ్‌లో పెట్టేసుకుని తనను ఎవరూ చూడడం లేదు కదా అని అనుకుని బ్యాగ్‌ని కార్ బ్యాక్ సీట్‌లో వేసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఇంతకూ విషయం ఏమిటి అనేది ఇంకా తెలియలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏదైనా సినిమాకి సంబంధించిన ఒక రోల్‌లో నటించడం కోసం ఇదంతా ప్లాన్ చేశారా? లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అనేది ఇంకా తెలియదు.. లేదా తాను హీరోగా నటించిన "అన్ స్టాపబుల్" మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా… ఇలా వెరైటీగా మూవీ ప్రమోషన్ చేశాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.

సుమన్ భార్యది ఇండస్ట్రీలో చాలా పెద్ద కుటుంబం

టాలీవుడ్ లో 1980 ల కాలంలో ఒక వెలుగు వెలిగిన నటుడు సుమన్. అప్పటికి ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ హవా కొనసాగుతోంది. ఆ టైంలో వీళ్ళందరికీ గట్టి పోటీనిచ్చాడు సుమన్. అలాంటి సుమన్ భార్య ఎవరో తెలుసా.. ఇండస్ట్రీలో ఆమెది ఎంత పెద్ద కుటుంబమో తెలుసా ? "అసలు మీ మాతృ బాషా తుళు కదా..మరి ఈ సంబంధం మీకు ఎలా వచ్చింది" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సుమన్ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు " నేను పుట్టిపెరిగింది అంతా చెన్నైలోనే. అమ్మ కాలేజీలో ప్రిన్సిపాల్, నాన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్. రైటర్ నరసరాజు కూతురు కవిత నాతో మూవీ తీయడానికి డేట్స్ కోసం వస్తున్నారని మా అమ్మ చెప్పారు. మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ళ ఇల్లు. అలా అప్పటికి   డైరెక్టర్ డేట్స్ అంటూ నా డేట్స్ అంటూ ఒక ఏడాది గడిచిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఇలా కంటిన్యూ అవుతోంది..మరో వైపు కవిత గారి అమ్మాయి శిరీషతో పెళ్లి ప్రొపోజల్ ని వాళ్ళు తీసుకొచ్చారు. నాతో సినిమా అన్నారు కానీ ఫైనల్ గా మా  పెళ్లే సినిమాలా ఐపోయింది. మొదట్లో పెళ్లి ఆలోచన లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్లి నరసరాజు గారి సలహాలు తీసుకునేవాడిని. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్స్ రామారావు గారికి, కృష్ణ గారికి,  నాగేశ్వరావు గారికి, కృష్ణంరాజు గారికి ఆయన స్టోరీస్ ఇచ్చారు. రామారావు గారితో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. క్లైమాక్స్ బాగున్నప్పుడు మూవీ హిట్ అవుతుందంటూ ఎన్నో టిప్స్ ఇచ్చేవారాయన. 1994 లో అలా శిరీషను పెళ్లి చేసుకున్నా..అప్పటికి బావబామ్మరిది సినిమా అవుతోంది. ఆ సమయంలో నాకు చాలా ప్రొపోజల్స్ కూడా వచ్చాయి.  పెళ్లి తర్వాత ఈ మూవీకి ఉత్తమ నటుడు అవార్డు కూడా తెచ్చిపెట్టింది. శిరీష సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాబట్టే మా డేట్స్, అవుట్ డోర్ షూటింగ్స్ వంటి వాటి గురించి బాగా తెలుసు. కాబట్టి అడ్జస్ట్ అయ్యేది. ఆర్టిస్ట్ ని అర్ధం చేసుకోవాలంటే సినిమావాళ్లయితేనే అర్ధం చేసుకుంటారు. బయట వాళ్లకు ఇవేమి తెలియవు కదా. డేట్స్, టైమింగ్స్, ఫిక్స్డ్ టైంలో షూటింగ్స్ ఉండవు.. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను షూటింగ్స్ లో ఉన్నప్పుడు అనవసరంగా నాకు ఫోన్స్ అవీ చేసి విసిగించదు శిరీష. ఫామిలీ లైఫ్ కరెక్ట్ గా ఉండాలి అంటే డబ్బు కన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఇవి ఉంటే చాలు. " అని చెప్పారు సుమన్.

దుబాయ్ లో సుజాత పుట్టినరోజు వేడుకలు...సందడి చేసిన రాకేష్

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ భామ, జోర్దార్ సుజాత ఇద్దరూ  చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. దేశవిదేశాల చుట్టేసి వస్తున్నారు. రాకింగ్  రాకేష్ జబర్దస్త్ లో మంచి స్కిట్స్ వేస్తూ తనని తాను నిరూపించుకుని టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఎప్పుడైతే సుజాతకి, రాకేష్ కి మధ్య లవ్ ఎఫైర్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఒక టీమ్ కి స్కిట్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడికెళ్లినా సుజాత పక్కన లేకుండా రాకేష్ మాత్రం  ఎక్కడికీ వెళ్లడం లేదు.  ఇప్పుడు సుజాత బర్త్ డే సెలెబ్రేషన్స్ ని దుబాయ్ లో గ్రాండ్ గా  చేసుకున్నారు ఇద్దరూ. రాకేష్ తెగ సందడి చేసాడు. కొత్త ఏడాది ఇద్దరికీ బాగా కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. రాకేష్ యాడ్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఇద్దరూ కలిసి దుబాయ్ ట్రిప్ వేసి వచ్చారు.  ఇక ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్లి బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఆ ఫొటోస్ ని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సెలెబ్రేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నట్టు కనిపిస్తోంది. రాకింగ్ రాకెష్ ఫాన్స్ అంత సుజాతకు బర్త్డే విషెస్ చెప్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన బిగ్ బాస్-6 కంటెస్టెంట్స్ డ్యాన్స్!

బిగ్ బాస్ సీజన్-6  అయిపోయిన నాటి నుండి, అందులోని కంటెస్టెంట్స్ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన వాళ్ళు.. బయటకొచ్చాక మంచి పేరుని తెచ్చుకొంటారు. కాగా ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏదో ఒక షోలో సందడి చేస్తూ వస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ రీసెంట్ గా మొదలైన 'బిబి జోడి' లో పాల్గొంటున్నారు. మరికొందరు సినిమాలలో అవకాశం రావడంతో షూటింగ్‌ లో బిజీ అయిపోయారు. ప్రతి సంవత్సరం 'స్టార్ మా టీవీ' సంక్రాంతి పండుగకి ఒక ఈవెంట్ ని ప్లాన్ చేస్తుంది. అయితే ఈ సారి భారీగానే ప్లాన్ చేశారని, దానికి సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్,  సీరియల్ యాక్టర్స్.. ఇంకా కొంతమంది కమేడియన్స్ కన్పిస్తారని టాక్ నడుస్తోంది. సంక్రాంతి వేడుకకి గీతు, ఫైమా, ఆదిరెడ్డి, రేవంత్ పాల్గొంటున్నట్టు ఒక పాటకి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ వీడియోను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆదిరెడ్డి, గీతు రాయల్, ఫైమా 'పల్సర్ బైక్' సాంగ్ కి మంచి మాస్ స్టెప్స్ వేస్తూ ఆ వీడియోను చేశారు. అయితే నెటిజన్లు ఆ వీడియోను చూసి "మేము కూడా ఎదురుచూస్తున్నాం" అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో  ఈ సంక్రాతి ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యేలా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

రాజీవ్ పంతం గెలుస్తుందా.. లేక వసుధార ప్రేమ నిలుస్తుందా!

'గుప్పెడంత మనసు' ఇప్పుడు మాటీవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో రిషిని బయటకు వెళ్ళమని చెప్తుంది. అయితే గత రెండు రోజులుగా వసుధార పెళ్ళి చుట్టూ కథ నడుస్తోంది. ఒకవైపు రిషి తన ప్రేమను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరో వైపు వసుధారని పెళ్ళిచేసుకోవాలని రాజీవ్ చూస్తున్నాడు. వసుధార తండ్రి చక్రపాణి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతూ వస్తోంది. బుధవారం జరిగిన ఎపిసోడ్ లో రిషి మాట్లాడుతూ "వసుధార.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా చెప్పు" అని అడుగుతాడు. దానికి వసుధార "ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సర్. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి" అని అంటుంది. దాంతో రిషి ఎమోషనల్ గా అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాగా అక్కడే ఉన్న జగతి మేడం, వసుధారని తిడుతుంది. "ఏమైంది వసుధార.. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పెళ్లి ఏంటి? రిషీతో నీ పెళ్లి గురించి మాట్లాడటానికే కదా మమ్మల్ని పిలిచావు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావ్?" అని జగతి మేడం అడుగుతుంది. "మేడం.. మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళండి" అని  అంటుంది వసుధార. అలా వసుధార  మాట్లాడిన మాటలకు మహేంద్రకు కోపం వస్తుంది. "మీ శిష్యురాలు.. ది గ్రేట్ వసుధార.. యూత్ ఐకాన్.. యూనివర్సిటీ టాపర్.. నీకు మంచి గురుదక్షిణే ఇచ్చింది.మనం ఇక్కడి నుండి వెళ్లకుంటే మనల్ని మెడ పట్టుకొని గెంటేలా ఉంది. పద వెళ్దాం" అని జగతితో అంటాడు మహేంద్ర. అలా అనగానే జగతి, మహేంద్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసుధార పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. సరిగ్గా రాజీవ్ తాళి కడుతున్న సమయానికి తన మెడలోని తాళిని బయటికి తీస్తుంది వసుధార. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత రాజీవ్ బలవంతంగా వసుధార మెడలోని తాళిని తీయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తోపులాటలో వసుధార తండ్రి చక్రపాణి కిందపడిపోతాడు. దాంతో అతడి తలకు తీవ్రగాయమవుతుంది. అయిన సరే రాజీవ్ పట్టించుకోకుండా వసుధారని బలవంతం చేస్తాడు. దీంతో తనని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది వసుధార. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే వసుధారని రాజీవ్ బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..!